'ఈ సాల్ కప్ నమదే'.. ప్రతీ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆర్సీబీ అభిమానుల నుంచే వినిపించే మాట. కానీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఆఖరికి ఊరించి ఊసురుమన్పించడం ఆర్సీబీకి పరిపాటిగా మారిపోయింది. తమ ఆరాద్య జట్టు ఒక్కసారి ట్రోఫీని ముద్దాడితే చూడాలని పరితపించారు.
అయితే ఎట్టకేలకు అభిమానుల కల నేరవేరింది. 16 ఏళ్లుగా ఐపీఎల్‌లో పురుషుల ఫ్రాంఛైజీకి సాధ్యం కాని టైటిల్‌ను డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లోనే అమ్మాయిల జట్టు సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ఆర్సీబీ పురుషుల జట్టు ఆటగాళ్లు సైతం సంబరాల్లో మునిగితేలిపోయారు. తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆర్సీబీ మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సోషల్ మీడియా వేదికగా తమ మహిళల జట్టును అభినందించాడు.
సూపర్ ఉమెన్ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అదేవిధంగా టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వీడియో కాల్ కూడా చేశాడు. మంధానతో పాటు మిగితా ప్లేయర్స్‌తో విరాట్ కాసేపు సంభాషించాడు. విరాట్‌ను చూడగానే ఆర్సీబీ ప్లేయర్లు ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 2008 తొలి సీజన్ నుంచి ఆర్సీబీకి విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
చదవండి: WPL 2024: డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?
#RCBUnbox
— SAMAR♡︎ (@119_bholi) March 18, 2024
Virat Kohli was literally dancing on the video call. This Trophy matters sooo much to him#ViratKohli𓃵 pic.twitter.com/uFbIxF037d
Comments
Please login to add a commentAdd a comment