WPL 2024
-
నేడు డబ్ల్యూపీఎల్ మినీ వేలం
బెంగళూరు: ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో ప్లేయర్లపై కనకవర్షం కురవగా... ఇప్పుడు మహిళల వంతు వచ్చిoది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బెంగళూరు వేదికగా డబ్ల్యూపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఐదు ఫ్రాంచైజీలలో కలిపి మొత్తం 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉండగా... గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అందరికంటే తక్కువగా రూ.2.5 కోట్లు ఉన్నాయి. విదేశీ ప్లేయర్లలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డాటిన్, ఇంగ్లండ్ కెపె్టన్ హీథర్ నైట్ రూ.50 లక్షల కనీస ధరతో వేలానికి రానున్నారు. భారత ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొననుంది. ఢిల్లీకి చెందిన లెఫ్టార్మ్ అన్షు నాగర్ 13 ఏళ్ల వయసులోనే వేలం బరిలో నిలిచింది. -
డబ్ల్యూపీఎల్ మినీ వేలానికి 120 మంది ప్లేయర్లు
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. ఈ నెల 15న జరగనున్న డబ్ల్యూపీఎల్ వేలంలో అందుబాటులో ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. గుజరాత్ నలుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా... యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోనుంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. భారత ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా రూ. 30 లక్షల కనీస ధరతో వేలానికి రానుండగా... విదేశీ ప్లేయర్లలో డాటిన్ (వెస్టిండీస్), హీథర్ నైట్ (ఇంగ్లండ్)పై అదరి దృష్టి నిలవనుంది. వీరిద్దరూ రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొంటున్నారు. -
WPL 2025: రిటైన్ చేసుకున్న భారత్ ప్లేయర్లు వీరే
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలానికి ముందు ఐదు జట్లు కూడా తమ ప్రధాన ప్లేయర్లను అట్టి పెట్టుకున్నాయి. భారత స్టార్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లతో పాటు మెగ్ లానింగ్, మరిజాన్ కాప్, అమెలియా కెర్, అనాబెల్ సదర్లాండ్లను కూడా ఆయా టీమ్‌లు అట్టి పెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ వేలం డిసెంబర్ నెల మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ప్లేయర్లను తీసుకోవడం కోసం లీగ్ టీమ్‌లకు గత సీజన్లో గరిష్టంగా రూ.13 కోట్ల 50 లక్షల పరిధి విధించగా... ఇప్పుడు మరో కోటిన్నర పెంచి దానిని రూ. 15 కోట్లు చేశారు. ఒక్కో టీమ్‌లో 18 మంది చొప్పున మొత్తం 90 మందికి డబ్ల్యూపీఎల్‌లో అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం 71 మందిని టీమ్‌లు రీటెయిన్ చేసుకున్నాయి. దాంతో 19 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. టీమ్‌లు వదిలేసుకున్న ఆటగాళ్లలో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా, తహుహు, క్యాథరీన్ బ్రైస్, వేద కృష్ణమూర్తి, హీతర్ నైట్, ఇసీ వాంగ్, హైదరాబాద్ ప్లేయర్ చొప్పదండి యషశ్రీ ఉన్నారు. రీటెయిన్ చేసుకున్న భారత ప్లేయర్ల వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా, షఫాలీ, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి (హైదరాబాద్), శిఖా పాండే, తానియా భాటియా, మిన్ను మణి, స్నేహ దీప్తి (ఆంధ్రప్రదేశ్), టిటాస్ సాధు. గుజరాత్ జెయింట్స్: హేమలత, తనూజ, షబ్నమ్ షకీల్ (ఆంధ్రప్రదేశ్), ప్రియా మిశ్రా, త్రిష పూజిత, మన్నత్, మేఘనా సింగ్. ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్, అమన్‌దీప్, అమన్‌జోత్, జింతిమణి, కీర్తన, పూజ వస్త్రకర్, సజన, సైకా ఇషాఖ్, యస్తిక భాటియా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, రిచా ఘోష్, సబ్బినేని మేఘన (ఆంధ్రప్రదేశ్), శ్రేయాంక పాటిల్, ఆశ శోభన, రేణుకా సింగ్, ఏక్తా బిస్త్, కనిక. యూపీ వారియర్స్: కిరణ్ నవ్‌గిరే, శ్వేత సెహ్రావత్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్), గౌహర్ సుల్తానా (హైదరాబాద్), ఉమా ఛెత్రి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ ఖెమ్నార్, వృంద దినేశ్. -
14 మందిని రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. కెప్టెన్‌గా మళ్లీ..!
మహిళల ఐపీఎల్ 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) తమ రిటెన్షన్ జాబితాలను ఇవాళ (నవంబర్ 7) ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ సైతం తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ 14 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుని ఆరుగురిని వేలానికి వదిలేసింది. వేలానికి వదిలేసిన వారిలో ఒక ఓవర్సీస్ ప్లేయర్ ఉన్నారు. ఓ జట్టుకు ఆరుగురు ఓవర్సీస్ ప్లేయర్ల రూల్ నేపథ్యంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నదినే డి క్లెర్క్‌కు వేలానికి వదిలేసింది. డి క్లెర్క్ స్థానంలో ఆర్సీబీ గత నెలలో ఇంగ్లండ్ అటాకింగ్ బ్యాటర్ డ్యానీ వాట్‌ను యూపీ వారియర్జ్ నుంచి ట్రేడింగ్ చేసుకుంది. ముంబై యాజమాన్యం వాట్‌ను 30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ విడుదల చేసిన మరో ఐదుగురు ప్లేయర్లు (దిషా కసత్, ఇంద్రాణి రాయ్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్) భారతీయ ప్లేయర్లే కావడం విశేషం.ఓవరాల్‌గా చూస్తే ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ టీమ్‌ను దాదాపుగా కొనసాగించిందనే చెప్పాలి. ఆర్సీబీ మరో సీజన్‌కు స్మృతి మంధననే కెప్టెన్‌గా కొనసాగించింది. గత సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఎల్లిస్ పెర్రీ, సోఫీ డివైన్, సోఫీ మోలినెక్స్ వచ్చే సీజన్లో కూడా కొనసాగనున్నారు. వీరితో పాటు దేశీయ స్టార్లు రిచా ఘోష్, రేణుక సింగ్ ఠాకూర్ ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. రిటెన్షన్ల ప్రక్రియ అనంతరం ఆర్సీబీ పర్స్‌లో ఇంకా రూ. 3.25 కోట్ల బ్యాలెన్స్ మిగిలి ఉంది. ఈ మొత్తంతో ఆర్సీబీ మరో నలుగురు లోకల్ ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. పేస్ బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్, ఎల్లిస్ పెర్రీ మాత్రమే ఉండటంతో ఈసారి వేలంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ లోకల్ పేసర్లపై గురి పెట్టవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. కాగా, తొలి సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ గత సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్ -
మహిళల ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా ఇదే..!
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) తమ రిటెన్షన్ జాబితాలను ఇవాళ (నవంబర్ 7) విడుదల చేశాయి. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది.ఏ ఫ్రాంచైజీ ఎవరిని రీటైన్ చేసుకుంది, ఎవరిని వేలానికి విడిచిపెట్టింది..?ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగెజ్, తానియా భాటియా, అలైస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, మారిజన్ కాప్, రాధా యాదవ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, జెస్ జొనాస్సెన్, టైటాస్ సాధు, మిన్నూ మణి, స్నేహ దీప్తిఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వీళ్లే..లారా హ్యారిస్, అశ్వని కుమారి, పూనమ్ యాదవ్, అపర్ణ మొండల్ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..హార్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సంజనా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, అమన్‌జోత్ కౌర్, అమన్‌దీప్ కౌర్, కీర్తనముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్, ఇసబెల్ వాంగ్ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్యూపీ వారియర్జ్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..అలైసా హీలీ (కెప్టెన్), కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, చమారీ ఆటపట్టు, గ్రేస్ హ్యారిస్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్‌గ్రాత్, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అంజలి సర్వని, గౌహెర్ సుల్తానా, పూనమ్ ఖెమ్నార్, ఉమా ఛెత్రీ, వ్రింద దినేశ్యూపీ వారియర్జ్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..లారెన్ బెల్, పర్షవీ చోప్రా, లక్ష్మీ యాదవ్, ఎస్ యషశ్రీగుజరాత్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..బెత్ మూనీ (కెప్టెన్), ఆష్లే గార్డ్నర్, లారా వోల్వార్డ్ట్, దయాలన్ హేమలత, తనూజా కన్వర్, షబ్నిమ్ షకీల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, మేఘన సింగ్గుజరాత్ జెయింట్స్ వదిలేసిన ప్లేయర్స్ జాబితా ఇదే..స్నేహ్ రాణా, కేథరీన్ బ్రైస్, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, తరన్నుమ్ పఠాన్, లియా తహుహుఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది..గుజరాత్- 4.4 కోట్లుయూపీ వారియర్జ్- 3.9 కోట్లుఆర్సీబీ- 3.25 కోట్లుముంబై ఇండియన్స్- 2.65 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్- 2.5 కోట్లుఏ ఫ్రాంచైజీ ఇంకా ఎంత మందిని కొనగోలు చేయొచ్చంటే..?ఆర్సీబీ- 4ముంబై ఇండియన్స్- 4ఢిల్లీ క్యాపిటల్స్- 4యూపీ వారియర్జ్- 3గుజరాత్ జెయింట్స్- 4 -
డబ్ల్యూపీఎల్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..!
క్రికెట్ గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలను చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్చికం అనే మాట చిన్నబోతుంది. అంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఈ గణాంకాలు.వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్).. తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 17న జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ సైతం తడబడినా మరో మూడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరగలిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయరైన (టీ20 ఫార్మాట్లో భారత కెప్టెన్) స్మృతి మంధన నేతృత్వంలో ఆర్సీబీ తొలి సారి టైటిల్ కైవసం చేసుకుంది.ఐపీఎల్ 2024 ఫైనల్లోనూ అలాగే..నిన్న జరిగిన పురుషుల ఐపీఎల్ ఫైనల్లోనూ కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్లు ఇలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) పాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహిళల ఐపీఎల్‌లోనూ ఇలాగే ఆసీస్ కెప్టెన్ (మెగ్ లాన్నింగ్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ ఫైనల్లో కమిన్స్ ప్రత్యర్ది భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్డెన్ (ఢిల్లీ కెప్టెన్) ప్రత్యర్ది భారత ప్లేయరే (మంధన).2024 WPL Final:- Aussie Captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian captain's team won by 8 wickets.IPL 2024 Final:- Aussie captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian… pic.twitter.com/jH07ZzmAEO— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024ఐపీఎల్ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ టాస్ గెలిచిన ఢిల్లీ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్లో భారత ప్లేయర్ అయిన శ్రేయస్.. ఆసీస్ కెప్టెన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీని భారత ప్లేయర్ సారథ్యంలోని ఆర్సీబీ అదే 8 వికెట్ల తేడాతోనే ఓడగొట్టింది. ఇన్ని విషయాల్లో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్, ఐపీఎల్‌కు పోలికలు ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న కేరళ స్పిన్నర్ ఆశా శోభన కల ఎట్టకేలకు నేరవేరింది. సోమవారం సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో ఆశా శోభనా టీమిండియా తరపున అరంగేట్రం చేసింది. భారత బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా ఆశా శోభన 33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆశా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ ఆశా శోభన?ఆశా శోభన దేశీవాళీ క్రికెట్లో కేరళ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌ను ఆదర్శంగా తీసుకుని ఆశా శోభన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 13 ఏళ్ల వయస్సులోనే ఆశా క్రికెట్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత కేరళ జట్టు తరపున అద్బుతంగా రాణించడంతో భారత-ఏ జట్టులో ఆమెకు చోటు దక్కింది. కానీ సీనియర్ జట్టులో మాత్రం చోటు దక్కించుకలేకపోయింది. అయితే డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ఆమెను సొంతం చేసుకుంది. తొలి సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆశా.. డబ్ల్యూపీఎల్-2024 సీజన్లో మాత్రం దుమ్ములేపింది. 10 మ్యాచ్‌ల్లో 7.11 ఏకానమితో 12 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఈ క్రమంలో భారత సెలక్టర్లు నుంచి ఆశాకు పిలుపు వచ్చింది. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
#RCB: ఇదేందయ్యా.. ఆ పందొమ్మిది పేర్లు పచ్చబొట్టుగా!
అభిమానులందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు వేరు అని మరోసారి నిరూపించాడు ఓ యువకుడు. మాట నిలబెట్టుకుంటూ ఏకంగా పందొమ్మిది పేర్లను చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఇంతకీ ఆ పేర్లు ఎవరివంటే?!.. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ‘ఈసారి కప్ మనకే’ అని ఆశలు పెట్టుకోవడం.. ఆఖరి దాకా ఎదురుచూసి ఉసూరుమనడం.. పదహారేళ్లుగా ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అలవాటైపోయింది. మధ్యలో మూడుసార్లు ఫైనల్ వరకు చేరినా ఆఖరి మెట్టుపై బోల్తా పడటంతో నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు. విరాట్ కోహ్లి వంటి స్టార్, రన్మెషీన్లో జట్టులో ఉన్నా ఆర్సీబీ టైటిల్ గండం దాటకపోవడంతో ఒకరకంగా పూర్తి నిరాశలో కూరుకుపోయారు. అలాంటి అభిమానులకు కొత్త ఊపిరిలూదుతూ మహిళా జట్టు తొలిసారి ఆర్సీబీకి ట్రోఫీ అందించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్-2024లో చాంపియన్‌గా అవతరించి బెంగళూరు ఫ్రాంఛైజీకి మొదటి టైటిల్ అందించింది. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ వుమెన్ టీమ్ ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో ఓ అభిమాని టైటిల్ సాధించిన ఆ జట్టులోని ప్లేయర్ల అందరి పేర్లు పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇందులో తాజా ఎడిషన్‌కు దూరమైన హీథర్ నైట్ పేరు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు.. ‘‘మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్ చేరినా మెన్స్ టీమ్ టైటిల్ సాధించలేకపోయింది. అయితే, పదహారేళ్ల మా కలను ఆర్సీబీ మహిళా జట్టు నెరవేర్చింది. ఒకవేళ WPL 2024 గెలిస్తే వాళ్ల పేర్లను టాటూ వేయించుకుంటానని నేను ప్రామిస్ చేశా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నా’’ అంటూ మనోజ్ నాయక్ అనే ట్విటర్ యూజర్ అకౌంట్లో ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఇందులో ఆర్సీబీ జెర్సీ వేసుకున్న వ్యక్తి.. స్మృతి మంధాన సహా జట్టులోని మొత్తం పందొమ్మిది పేర్లను పచ్చబొట్టు వేయించుకున్నాడు. మరి వాళ్ల పేర్లు ఏమిటంటే.. స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, దిశా కసత్, శ్రేయాంక పాటిల్, ఇంద్రాణి రాయ్, ఆశా శోభన, ఏక్తా బిస్త్, సబ్బినేని మేఘన, జార్జియా వరేహం, శుభా సతీశ్, కేట్ క్రాస్, నదినె డి క్లర్క్, సోఫీ మొలినెక్స్, సిమ్రన్ బహదూర్, శ్రద్ధా పొఖార్కర్, హీథర్ నైట్(తాజా ఎడిషన్‌కు దూరం). ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన బెంగళూరు.. తర్వాత పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. కానీ మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఎదుర్కొన్న ఫాఫ్ డుప్లెసిస్ బృందం మళ్లీ ఓటమిని చవిచూసింది. తదుపరి మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్‌గన్’ Frm loosing 3 IPL finals n never giving up and wining an @wplt20 🏆. @RCBTweets women's have given us everything what we dreamed for the past 16yrs😭. Had promised myself to get inked of all the RCB players name if they win this wpl 2024. And today I kept my promise.#RCBFAN pic.twitter.com/SpDaVk9wOT — Manoj nayak (@Nmanoj183) March 30, 2024 -
వివాదంలో భారత ఆల్‌రౌండర్.. ప్రధాని మోదీకి క్షమాపణలు
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకు అపార గౌరవం ఉందని భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ తెలిపింది. బీజేపీ నేతలను ఉద్దేశించి తన అకౌంట్ నుంచి అభ్యంతరకర పోస్టు ఎలా వెళ్లిందో తెలియదని.. అప్పుడు తన ఫోన్ తన ఆధీనంలో లేదని స్పష్టం చేసింది. ఏదేమైనా తెలియకుండానే చాలా మంది హృదయాలను గాయపరిచానని.. ఇందుకు చింతిస్తున్నట్లు పూజా పేర్కొంది. ప్రధాని మోదీకి క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా టీమిండియా ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ ఇన్‌స్టా స్టోరీలో ‘వసూలీ టైటాన్స్’ పేరిట ప్రధాని మోదీతో పాటు బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రుల మార్ఫింగ్ ఫొటో ప్రత్యక్షమైంది. శుక్రవారం నాటి పోస్టు నెట్టింట వైరల్‌కాగా వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఈ విషయంపై స్పందించిన పూజా వస్త్రాకర్.. ‘‘నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అత్యంత అభ్యంతరకరమైన ఫొటో పోస్ట్ అయినట్లు నా దృష్టికి వచ్చింది. నిజానికి ఆ సమయంలో ఫోన్ నా దగ్గర లేదు. ప్రధాన మంత్రి పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. తెలిసో తెలియకో నా వల్ల కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నాను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల పూజా వస్త్రాకర్ టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్. భారత్ తరఫున 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆమె.. ఇప్పటి వరకు నాలుగు టెస్టులు, 30 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో 14, వన్డేల్లో 23, టీ20లలో 40 వికెట్లు తీసింది. వన్డేల్లో నాలుగు అర్ధ శతకాలు కూడా సాధించింది. టెస్టుల్లో 47, టీ20లలో 37* పూజా అత్యధిక స్కోర్లు. ఇక ఇటీవల ముగిసిన వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన పూజా వస్త్రాకర్ నిరాశపరిచింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి ఈ రైటార్మ్ పేసర్ కేవలం ఐదు వికెట్లు తీసింది. చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు? -
RCB: అభిమానులకు క్షమాపణ చెప్పిన ఆర్సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమ అభిమానులకు క్షమాపణ చెప్పింది. ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. కాగా ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ఈవెంట్ నిర్వహించింది. విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ స్టార్లు, వుమెన్ ప్రీమియర్ లీగ్-2024లో చాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ మహిళా జట్టు.. ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఆర్సీబీ తమ పేరు, లోగో మార్పులతో పాటు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది. అయితే, ఈ ఈవెంట్‌ను ఆర్సీబీ వెబ్సైట్, యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించాలంటే రూ. 99 చెల్లించాలని నిబంధన విధించింది. అయినప్పటికీ చాలా మంది అభిమానులు డబ్బు చెల్లించి ఈవెంట్‌ను చూసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఫ్రీగా స్ట్రీమింగ్ కానీ.. ప్రసారంలో ఇబ్బందులు తలెత్తడంతో తమ అధికారిక యూట్యూబ్ చానెల్లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో డబ్బు చెల్లించిన వాళ్లు.. ‘‘ఇదేం పద్ధతి’’ అంటూ ఆర్సీబీ తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో క్షమాపణ కోరుతూ ఆర్సీబీ ప్రకటన విడుదల చేసింది. మీ డబ్బులు రీఫండ్ చేస్తాం ‘‘ప్రియమైన ఆర్సీబీ అభిమానులారా.. పెద్ద ఎత్తున ఈ ఈవెంట్‌కు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా అంతరాయం కలిగింది. అందుకే మీ డబ్బులు రీఫండ్ చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టేశాం. రానున్న ఏడు రోజుల్లో మీ డబ్బు మీ అకౌంట్లకు చేరుతుంది. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు. తదుపరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని ఆర్సీబీ గురువారం తెలిపింది. కాగా ఈరోజు(మార్చి 22)న ఐపీఎల్-2024 ఎడిషన్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్‌గైక్వాడ్ సారథ్యంలో చెన్నై.. ఫాఫ్ డుప్లెసిస్ బృందంతో తలపడనుంది. చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ -
IPL 2024: ఐపీఎల్ టైటిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విరాట్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 19) జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అన్‌బాక్స్ ఈవెంట్లో ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మహిళల ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంపై స్పందిస్తూ.. ఈ ఏడాది ఆర్సీబీ టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. మహిళల ఆర్సీబీ జట్టు టైటిల్ గెలిచినప్పుడు తామందరం మ్యాచ్ చూస్తున్నామని.. ఆ సమయంలో ఆర్సీబీ అభిమానుల స్వచ్ఛమైన ప్రేమను ఫీలయ్యామని అన్నాడు. ఆర్సీబీ టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగిందని తెలిపాడు. ఇన్నేళ్ల పాటు అభిమానులు మాపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే డబుల్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. THE RCB TEAM IS READY FOR IPL 2024...!!!!! 🔥 pic.twitter.com/aRCU4671at — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 16 ఏళ్లలో తాను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా టైటిల్ గెలవాలనే దృడ సంకల్పంతోనే వచ్చానని.. అందు కోసం ప్రతిసారి శాయశక్తుల కృషి చేశానని పేర్కొన్నాడు. ఐపీఎల్ టైటిల్ తొలిసారి గెలిచిన ఆర్సీబీ జట్టులో ఉండాలన్నది తన కోరిక అని.. అభిమానులు, ఫ్రాంచైజీకి సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని, టైటిల్ గెలిచి వీరి రుణాన్ని తీర్చుకుంటానని తెలిపాడు. కాగా, అన్‌బాక్స్ ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ ఛాంపియన్స్ ఆర్సీబీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన పురుషుల ఆర్సీబీ బృందంలో విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా విరాట్.. సహచరులతో కలిసి చప్పలు కొడుతూ ఛాంపియన్స్‌ను మైదానంలోకి ఆహ్వానించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా విరాట్ చాలా హుషారుగా కనిపించాడు. మహిళా క్రికెటర్లతో కలిసి ఫోటోలను పోజులిచ్చాడు. చిన్నస్వామి స్టేడియం మొత్తం విరాట్ నామస్మరణతో మార్మోగిపోయింది. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
IPL 2024: మహిళా ఛాంపియన్లకు "గార్డ్ ఆఫ్ హానర్" ఇచ్చిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో అన్‌బాక్స్ పేరిట ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా ఆర్సీబీ టీమ్.. మహిళా ఐపీఎల్ ఛాంపియన్లను (ఆర్సీబీ) గౌరవించుకుంది. ఆర్సీబీ బృందం తమ మహిళా జట్టుకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది. ఆర్సీబీ పురుష జట్టు సభ్యులు ఇరు వైపులా నిలబడి తమ మహిళా బృందాన్ని చప్పట్లతో సాదరంగా మైదానంలోకి ఆహ్వానించారు. RCB Team Giving Guard of honour to Women's team at Chinnaswamy stadium. - MOMENT OF THE DAY...!!!! ⭐ pic.twitter.com/JxqKUniGgW — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 Great Gesture by RCB Team...!!!!! 👏❤️ - They giving guard of honour to RCB Women's team at Chinnaswamy stadium. pic.twitter.com/2AGVcZjVqB — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 RCB Team giving Guard of honour to RCB Women's team at Chinnaswamy stadium. - This is Beautiful gesture by RCB Team...!!!!! ❤️ pic.twitter.com/PseXxeAOdC — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 మహిళా ఆర్సీబీ జట్టు కెప్టెన్ స్మృతి మంధన ముందు నడుస్తుండగా జట్టు సభ్యులు ఆమెను ఫాలో అయ్యారు. గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్న అనంతరం ఆర్సీబీ మహిళా జట్టు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగింది. అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా మెన్స్ ఆర్సీబీ టీమ్ కీలక సభ్యులు విరాట్ కోహ్లి, ఫాఫ్ డెప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మహిళల ఆర్సీబీ జట్టు సభ్యులను అభినందించారు. ఫోటోలకు పోజులిచ్చారు. Asha Sobhana clicked selfie with Virat Kohli at Chinnaswamy. - A beautiful picture! pic.twitter.com/S13eiyId4M — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 THE CRAZE OF VIRAT KOHLI AND RCB IS REALLY HUGE...!!!!! 🙌 ❤️ pic.twitter.com/Bx79AczHAQ — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 విరాట్ కోహ్లి కొందరు మహిళా జట్టు సభ్యులతో కలిసి సెల్ఫీలు దిగారు. చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లిని చూసేందుకు భారీ సంఖ్యలు అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. కోహ్లి నామస్మరణతో స్టేడియం మార్మోగిపోయింది. Smriti Mandhana and her team taking lap of honour to crowds at Chinnaswamy stadium. - This is beautiful...!!!! 🏆 pic.twitter.com/ga7aqXAuNm — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 THE INCREDIBLE ATMOSPHERE AT CHINNASWAMY. - RCB FANS ARE CRAZY...!!!!! 🔥 pic.twitter.com/2UkP8N0RDe — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 కాగా, కొద్ది రోజుల కిందట జరిగిన మహిళల ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ఆర్సీబీ టీమ్ తొలిసారి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇదే తొలి టైటిల్. పురుషుల జట్టు మూడుసార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మహిళల టీమ్ ఇచ్చిన జోష్‌తో ఆర్సీబీ మెన్స్ టీమ్ కూడా ఆసారి ఎలాగైనా టైటిల్ సాధిస్తామని ధీమాగా ఉంది. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈసారి టైటిల్ సాధించేందుకు ఆర్సీబీ మెన్స్ టీమ్ కఠోరంగా శ్రమిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
WPL 2024: ఆర్సీబీ క్వీన్.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
WPL 2024: ఫైనల్లో 4 వికెట్లు.. ఆర్సీబీ క్వీన్! ఎవరీ శ్రేయాంక?
రాయల్ ఛాలెజంజర్స్ బెంగళూరు నిరీక్షణకు తెరపడింది. గత 16 ఏళ్లగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫిని ఎట్టకేలకు ఆర్సీబీ ముద్దాడింది. అయితే ఆర్సీబీ అబ్బాయిలకు సాధ్యం కాని టైటిల్‌ను.. అమ్మాయిలు అందుకుని చూపించారు. డబ్ల్యూపీఎల్-2024 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ తొలి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడడంలో ఆ జట్టు యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌ది కీలక పాత్ర. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. అంతకుముందు సెమీఫైనల్లో రెండు కీలక వికెట్లు ఆమె పడగొట్టింది. ఓ వైపు కాలి గాయంతో బాధపడుతూనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచి తన జట్టుకు టైటిల్‌ను అందించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన పాటిల్ 13 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకుంది. కాగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన పాటిల్‌ను ఆర్సీబీ మేనెజ్మెంట్ రెండు మ్యాచ్‌లకు పక్కన పెట్టేసింది. ఆ తర్వాత మళ్లీ తుది జట్టులోకి వచ్చిన శ్రేయాంక దెబ్బతిన్న సింహంలా చెలరేగిపోయింది. ఈ క్రమంలో ఎవరీ శ్రేయాంక పాటిల్‌ను నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు. ఎవరీ శ్రేయాంక పాటిల్.. 21 ఏళ్ల శ్రేయాంక పాటిల్ బెంగళూరులో జన్మించింది. శ్రేయాంక దేశీవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుంది. అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణించడంతో ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి శ్రేయాంక అడుగుపెట్టింది. ఇప్పటివరకు భారత్ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడిన ఈ కర్ణాటక క్రికెటర్.. వరుసగా 4, 8 వికెట్లు పడగొట్టింది. కాగా డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. కాగా పాటిల్ మహిళల కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ భాగమైంది. ఈ లీగ్‌లో గయానా ఆమెజాన్ వారియర్స్‌కు శ్రేయాంక ప్రాతినిథ్యం వహిస్తుంది. చదవండి: T20 WC: టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్! Shreyanka Patil with her Purple Cap award. - The hero of the team! 💜 pic.twitter.com/ATA6DMiYqT — Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024 Ellyse Perry " Pretty bonkers to be honest. It's another level for us.Shreyanka Patil is such a young player and she has got the world at her feet, they are awesome.Shreyanka and Sophie devine will be owning the stage and they are the goat dangers 😄 "pic.twitter.com/ukWj0D4g9P — Sujeet Suman (@sujeetsuman1991) March 18, 2024 -
ఫైనల్లో ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కెప్టెన్! వీడియో వైరల్
డబ్ల్యూపీఎల్ ట్రోఫీని తొలిసారి ముద్దాడాలని కలలలు గన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. దీంతో వరుసగా రెండో సారి టైటిల్‌కు అడుగు దూరంలో ఢిల్లీ నిలిచిపోయింది. గతేడాది కూడా ఢిల్లీ తుది పోరులోనే ఓటమి పాలైంది. ఇప్పుడు మరోసారి టైటిల్ చేజారడంతో ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ కన్నీటిపర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీరును ఆమె ఆపుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది లానింగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఫైనల్లో ఓడినప్పటికీ లీగ్ మొత్తం బాగా ఆడారు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం ఆమెకు సపోర్ట్‌గా నిలిచింది. ఎప్పుడూ నీవు మా రానివే అంటూ లానింగ్ ఫోటోను ఢిల్లీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Meg Lanning 💔 Chin up, champ 🐐 📸 - JioCinema#WPLFinal #WPL2024 pic.twitter.com/FzvlbN2nVe — shreya (@shreyab27) March 17, 2024 -
ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్
డబ్ల్యూపీఎల్-2024 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది. ఐపీఎల్లో గత 16 ఏళ్లగా ఆర్సీబీ పురుషుల జట్టు నిరాశపరుస్తుండగా.. మహిళల జట్టు మాత్రం కేవలం రెండో సీజన్లోనే టైటిల్ సాధించి సత్తాచాటింది. ఇక 16 ఏళ్ల తర్వాత ఆర్సీబీకి డబ్ల్యూపీఎల్ రూపంలో తొలి టైటిల్ రావడంతో బెంగళూరు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలిపోయారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్లు ఆర్సీబీ మహిళల జట్టును అభినందించారు. బాయ్ ఫ్రెండ్‌తో స్మృతి.. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బాయ్ ఫ్రెండ్ స్మృతి పలాష్ ముచ్చల్ సందడి చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ పలాష్ కన్పించాడు. అదే విధంగా విజయనంతరం స్మృతి పలాష్ ముచ్చల్‌తో కలిసి ట్రోఫీతో ఫోటలోకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 2023లో చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణం గెలిచినప్పుడు కూడా పలాష్ స్మృతితో పోజులిచ్చింది. ఇక గత కాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. బాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గాపేరు గాంచిన పలాస్‌కు.. ఓ ఈవెంట్లో మంధానతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. -
స్మృతి మంధానకు వీడియో కాల్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్
'ఈ సాల్ కప్ నమదే'.. ప్రతీ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆర్సీబీ అభిమానుల నుంచే వినిపించే మాట. కానీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఆఖరికి ఊరించి ఊసురుమన్పించడం ఆర్సీబీకి పరిపాటిగా మారిపోయింది. తమ ఆరాద్య జట్టు ఒక్కసారి ట్రోఫీని ముద్దాడితే చూడాలని పరితపించారు. అయితే ఎట్టకేలకు అభిమానుల కల నేరవేరింది. 16 ఏళ్లుగా ఐపీఎల్లో పురుషుల ఫ్రాంఛైజీకి సాధ్యం కాని టైటిల్‌ను డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లోనే అమ్మాయిల జట్టు సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆర్సీబీ పురుషుల జట్టు ఆటగాళ్లు సైతం సంబరాల్లో మునిగితేలిపోయారు. తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆర్సీబీ మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సోషల్ మీడియా వేదికగా తమ మహిళల జట్టును అభినందించాడు. సూపర్ ఉమెన్ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అదేవిధంగా టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వీడియో కాల్ కూడా చేశాడు. మంధానతో పాటు మిగితా ప్లేయర్స్‌తో విరాట్ కాసేపు సంభాషించాడు. విరాట్‌ను చూడగానే ఆర్సీబీ ప్లేయర్లు ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 2008 తొలి సీజన్ నుంచి ఆర్సీబీకి విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: WPL 2024: డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా? #RCBUnbox Virat Kohli was literally dancing on the video call. This Trophy matters sooo much to him#ViratKohli𓃵 pic.twitter.com/uFbIxF037d — SAMAR♡︎ (@119_bholi) March 18, 2024 -
డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కల ఎట్టకేలకు నేరవేరింది. గత 16 ఏళ్లగా ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ బౌలర్ల జోరుకు 113 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో అదరగొట్టగా.. మోలినెక్స్ 3, ఆశ శోభన 2 రెండో వికెట్లు పడగొట్టారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఫ్రైజ్ మనీ ఎంత? ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కింది? ఇటువంటి విషయాలపై ఓ లూక్కేద్దం. విజేతకు ఎంతంటే? డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీకి రూ.6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్ కు రూ.3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఆరెంజ్ క్యాప్ విజేత పెర్రీ.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 347 పరుగులు చేసింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ శ్రేయంక అదేవిధంగా అత్యధిక ఈ ఏడాది సీజన్లో వికెట్లు తీసిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయంక పాటిల్ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రేయంక.. 13 వికెట్లు పడగొట్టింది. మిగితా అవార్డులు దక్కించుకున్న వారు వీరే.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్-దీప్తి శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ - శ్రేయాంక పాటిల్ (బెంగళూరు) మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ - దీప్తి శర్మ (యూపీ) బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ - సజన సజీవన్ (ముంబై) ఫెయిర్ ప్లే టీమ్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు A special moment to celebrate @imVkohli @mandhana_smriti pic.twitter.com/NkEI6iDIjq — CricTracker (@Cricketracker) March 17, 2024 -
కల నెరవేరింది.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్‌గా ఆర్సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతోంది. మూడుసార్లు ఫైనల్లోకి వచ్చినా... మూడుసార్లూ తుదిపోరులో ఓడిపోయి టైటిల్‌ను అందుకోలేకపోయింది. ఇదే ఆర్సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అడుగు పెట్టింది. తొలి సీజన్లో నాలుగో స్థానంతో నిరాశపరిచింది. అయితే ఏడాది తిరిగేలోపు బెంగళూరు మహిళల జట్టు అద్భుతం చేసింది. ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్‌ను డబ్ల్యూపీఎల్‌లో మెరిపించే ఆటతీరుతో బెంగళూరు టైటిల్‌ను సొంతం చేసుకుంది. తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపీఎల్ టైటిల్ దక్కడంతో ఐపీఎల్ ఆర్సీబీ స్టార్స్ విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాజీ సభ్యులు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, మాజీ యాజమాని విజయ్ మాల్యా తదితరులు అభినందనలు తెలిపారు. న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్యూపీఎల్) రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను మొదట స్పిన్‌తో కట్టడి చేసి... ఆ తర్వాత జాగ్రత్తగా లక్ష్యాన్ని ఛేదించేసి 8 వికెట్లతో బెంగళూరు గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లలో షఫాలీ వర్మ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేయగా... కెప్టెన్ మెగ్ లానింగ్ (23 బంతుల్లో 23; 3 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడింది. తర్వాత ఇంకెవరూ 12 పరుగులకు మించి చేయలేకపోయారు. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (3.3–0–12–4), సోఫీ మోలినెక్స్ (3/20), ఆశ శోభన (2/14) ఢిల్లీని దెబ్బ కొట్టారు. అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 31; 3 ఫోర్లు), సోఫీ డివైన్ (27 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎలీస్ పెరీ (37 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ పురస్కారం సోఫీ మోలినెక్స్కు దక్కింది. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది. గత సీజన్ మాదిరిగానే ఈసారీ ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, ఆ తర్వాత ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకోవడం గమనార్హం. ధనాధన్... ఫటాఫట్! ఢిల్లీ ఓపెనర్లు షఫాలీ వర్మ, మెగ్‌లానింగ్ ఆరంభంలో ధాటిగా చెలరేగిపోయారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో షఫాలీ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. కెపె్టన్ లానింగ్ ఫోర్లతో వేగాన్ని పెంచింది. 6 ఓవర్లలో ఢిల్లీ 61/0 స్కోరు చేసింది. బ్యాటింగ్ పవర్‌ప్లే తర్వాత బౌలింగ్ పవర్‌ప్లే మొదలైనట్లుగా ఢిల్లీ వికెట్లు ఫటాఫట్ కూలాయి. 8వ ఓవర్ వేసిన స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ 4 బంతుల్లో 3 వికెట్లు తీసింది. షఫాలీ, కీలకమైన వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (0), క్యాప్సీ (0) వికెట్లను సోఫీ పడగొట్టింది. 64 పరుగుల వద్దే ఈ మూడు వికెట్లు పడ్డాయి. 11వ ఓవర్ నుంచి శ్రేయాంక, ఆశ శోభన తిప్పేయడంతో లానింగ్, మరిజన్ కాప్ (8), జెస్ జొనాసెన్ (3), మిన్ను రాణి (5) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. రాధా యాదవ్ (12; 2 ఫోర్లు) బౌండరీలతో జట్టు స్కోరు 100 దాటాక... మోలినెక్స్ డైరెక్ట్ త్రోకు రాధ రనౌటైంది.19వ ఓవర్ వేసిన శ్రేయాంక రెండో బంతికి అరుంధతి రెడ్డిని (10), మూడో బంతికి తానియా (0)ను అవుట్ చేయడంతో క్యాపిటల్స్ ఆలౌటైంది. పవర్‌ప్లే తర్వాత ఢిల్లీకి ఏకంగా 47 బంతుల పాటు బౌండరీ గగనమైంది. రాణించిన పెరీ, సోఫీ డివైన్ లక్ష్యం చిన్నదే అయినా... టైటిల్ పోరులో బెంగళూరు ఓపెనర్లు సోఫీ డివైన్, స్మృతి మంధాన అనవసర షాట్లకు వెళ్లకుండా జాగ్రత్తగా పరుగుల్ని రాబట్టారు. దీంతో 6 ఓవర్లలో బెంగళూరు 25/0 స్కోరే చేసింది. అడపాదడపా బౌండరీలతో వేగం పెంచిన సోఫీ డివైన్ జట్టు స్కోరు 49 పరుగుల వద్ద శిఖా పాండే బౌలింగ్‌లో అవుటైంది. కెప్టెన్ స్మృతికి పెరీ జతవ్వగా ఈ జోడీ కూడా నింపాదిగానే పరుగుల్ని చక్కబెట్టింది. స్వభావానికి విరుద్ధంగా నెమ్మదిగా ఆడిన స్మృతికి మిన్ను మణి చెక్ పెట్టింది. అయితే అప్పటికే బెంగళూరు 82/2 స్కోరుకు చేరింది. మిగతా పరుగుల్ని పెరీ, రిచా ఘోష్ (17 నాటౌట్, 2 ఫోర్లు) పూర్తిచేయడంతో బెంగళూరు 3 బంతులు మిగిలుండగానే ట్రోఫీ గెలిచింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రేయాంక 23; షఫాలీ వర్మ (సి) వేర్హమ్ (బి) సోఫీ మోలినెక్స్ 44; జెమీమా (బి) సోఫీ మోలినెక్స్ 0; క్యాప్సీ (బి) సోఫీ మోలినెక్స్ 0; మరిజన్ కాప్ (సి) సోఫీ డివైన్ (బి) ఆశ 8; జెస్ జొనాసెన్ (సి) స్మృతి (బి) ఆశ 3; రాధా యాదవ్ (రనౌట్) 12; మిన్ను మణి (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రేయాంక 5; అరుంధతి (బి) శ్రేయాంక 10, శిఖా పాండే (నాటౌట్) 5; తానియా భాటియా (సి) రిచా ఘోష్ (బి) శ్రేయాంక 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–64, 2–64, 3–64, 4–74, 5–80, 6–81, 7–87, 8–101, 9–113, 10–113. బౌలింగ్: రేణుక సింగ్ 2–0–28–0, సోఫీ మోలినెక్స్ 4–0–20–3, ఎలీస్ పెరీ 2–0–14–0, సోఫీ డివైన్ 1–0–9–0, వేర్హమ్ 3–0–16–0, శ్రేయాంక పాటిల్ 3.3–0–12–4, ఆశ శోభన 3–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) అరుంధతి (బి) మిన్ను మణి 31; సోఫీ డివైన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శిఖా పాండే 32; ఎలీస్ పెరీ (నాటౌట్) 35; రిచా ఘోష్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (19.3 ఓవర్లలో 2 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–49, 2–82. బౌలింగ్: మరిజన్ కాప్ 4–0–20–0, క్యాప్సీ 3–0–13–0, శిఖా పాండే 4–0–11–1, రాధ 1–0–18–0, అరుంధతి 3.3–0–26–0, జొనాసెన్ 2–0–15–0, మిన్ను మణి 2–0–12–1. -
WPL2024 విజేత బెంగళూరు
WPL2024లో బెంగళూరు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీపై 8 దికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. లీగ్ క్రికెట్లో అత్యధిక ప్రజాధరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తాజా (2024) డబ్ల్యూపీఎల్ (మహిళల ఐపీఎల్) ఎడిషన్‌లో ఫైనల్లో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు వరకు నాలుగు సార్లు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. నాలుగు సందర్భాల్లో ఛేజింగ్ చేసి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. స్కోర్లు ఢిల్లీ 113 ఆలౌట్, బెంగళూరు 115/2 -
WPL 2024: ఆర్సీబీ చరిత్ర తిరగరాసేనా..?
లీగ్ క్రికెట్లో అత్యధిక ప్రజాధరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తాజా (2024) డబ్ల్యూపీఎల్ (మహిళల ఐపీఎల్) ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న తుది సమరంలో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ఆర్సీబీ బౌలర్లు రెచ్చిపోవడంతో 113 పరుగులకే కుప్పకూలింది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో స్వల్ప స్కోర్‌కే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక్ పాటిల్ 4, సోఫీ మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ (44) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆర్సీబీ చరిత్ర తిరగరాసేనా..? ఆర్సీబీ ఐదోసారి ((2009, 2011, 2016 ) ఐపీఎల్, 2011 ఛాంపియన్స్ ట్రోఫీ) ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు నాలుగు సార్లు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. నాలుగు సందర్భాల్లో ఛేజింగ్ చేసి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. తాజాగా జరుగుతున్న ఫైనల్లో కూడా ఆర్సీబీ ఛేజింగే చేస్తుండటంతో ఈసారైనా టైటిల్ గెలుస్తుందా అని ఆ జట్టు అభిమానులు చర్చించుకుంటున్నారు. తాజా పరిస్థితులను (113 పరుగులకే ఆలౌటైన ఢిల్లీ) బట్టి చూస్తే.. ఆర్సీబీ చరిత్ర తిరగరాసి తొలి టైటిల్ గెలిచేలా కనిపిస్తుంది. -
WPL 2024 Final Updates: ఛాంపియన్స్‌గా ఆర్సీబీ..
►డబ్ల్యూపీఎల్-2024 ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 114 పరుగుల లక్ష్య ఛేదన.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 114 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్‌లో సోఫీ డివైన్ (32) ఔటైంది. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 53/1గా ఉంది. స్మృతి మంధన (20), ఎల్లిస్ పెర్రీ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది. 114 పరుగుల స్వల్ప లక్ష్యం.. ఆచితూచి ఆడుతున్న ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసే సమయానికి ఈ జట్టు వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. స్మృతి మంధన 12, సోఫీ డివైన్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆర్సీబీతో ఫైనల్.. 113 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో స్వల్ప స్కోర్‌కే చేతులెత్తేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక్ పాటిల్ 4, సోఫీ మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ (44) టాప్ స్కోరర్‌గా నిలిచింది. పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ 6 ఓవర్లలో 61 పరుగులు చేసి వికెట్లు కోల్పోని ఢిల్లీ క్యాపిటల్స్.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలింది. సోఫీ మోలినెక్స్ (3-0-14-3), శ్రేయాంక పాటిల్ (3-0-10-2), ఆశా శోభన (2-0-9-2) ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఢిల్లీ ఇన్నింగ్స్ కుప్పకూలే దిశగా సాగుతుంది. 15 ఓవర్లలో ఆ జట్టు స్కోర్ 90/7గా ఉంది. అరుంధతి రెడ్డి (2), రాధా యాదవ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. మాయ చేసిన సోఫీ మోలినెక్స్..ఒకే ఓవర్లో 3 వికెట్లు ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ మాయ చేసింది. ఈ ఓవర్లో ఆమె ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ నడ్డి విరిచింది. ఆ ఓవర్ల అనంతరం 61/0గా ఉన్న ఢిల్లీ స్కోర్ సోఫీ దెబ్బకు ఒక్క సారిగా పడిపోయింది. తొలి బంతికి షఫాలీ వర్మను (44) ఔట్ చేసిన సోఫీ.. మూడో బంతికి రోడ్రిగెజ్‌ను (0), నాలుగో బంతికి అలైస్ క్యాప్సీ (0) పెవిలియన్‌కు పంపింది. 9 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 69/3గా ఉంది. లాన్నింగ్ (20), మారిజన్ కాప్ (3) క్రీజ్‌లో ఉన్నారు. విధ్వంసం సృష్టిస్తున్న షఫాలీ వర్మ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. షఫాలీ కేవలం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి అజేయంగా ఉంది. షఫాలీకి మెగ్ లాన్నింగ్ (15 బంతుల్లో 17; 3 ఫోర్లు) సహకరిస్తుంది. 6 ఓవర్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ 61/0గా ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరిన ఢిల్లీ ఈ సారి టైటిల్‌పై ధీమాగా ఉండగా.. తొలి టైటిల్ కోసం ఆర్సీబీ ఉవ్విళ్లూరుతుంది. తుది జట్లు.. ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లాన్నింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్‌కీపర్), శిఖా పాండే, మిన్ను మణి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్హామ్, శ్రేయంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖర్కర్, రేణుక సింగ్ -
టాప్‌లో ముంబై, ఢిల్లీ.. మూడో స్థానంలో నైట్‌రైడర్స్..!
ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రికెట్ లీగ్‌ల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీల హవా కొనసాగుతుంది. విశ్వవ్యాప్తంగా ఎనిమిది దేశాల్లో జరిగే వివిధ లీగ్‌ల్లో ముంబై, ఢిల్లీ నగరాల ప్రాంచైజీలే అధికంగా ఉన్నాయి. ముంబై, ఢిల్లీ నగరాధారిత ఫ్రాంచైజీలకు దేశవ్యాప్తంగా ఐదు జట్లు ఉండగా.. కోల్‌కతా నగరాధారిత ఫ్రాంచైజీకి నాలుగు.. చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలకు మూడు.. హైదరాబాద్, లక్నో, పంజాబ్ నగరాల ఆధారిత ఫ్రాంచైజీలకు తలో రెండ్రెండు జట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్.. భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ భారత్‌లోనే జరిగే మహిళల ఐపీఎల్లో (డబ్ల్యూపీఎల్) ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ యూఎస్ఏ వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఢిల్లీ క్యాపిటల్స్.. భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారత్‌లోనే జరిగే మహిళల ఐపీఎల్లో (డబ్ల్యూపీఎల్) ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్స్ టీమ్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ యూఎస్ఏ వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో సియాటిల్ ఆర్కాస్ కోల్‌కతా నైట్‌రైడర్స్.. భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ యూఎస్ఏ వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో లాస్ ఎంజెలెస్ నైట్‌రైడర్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్.. భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ యూఎస్ఏ వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్.. భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ లక్నో సూపర్ జెయింట్స్.. భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్.. భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ -
RCB: 2844 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత..!
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 17) జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. టేబుల్ టాపర్‌గా నిలిచి ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది. Literally every RCB fan. #DCvRCB pic.twitter.com/y8l9eUAR3K — Yolo247 (@Yolo247Official) March 17, 2024 డబ్ల్యూపీఎల్‌లో ఫైనల్‌కు చేరడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా రెండోసారి కాగా.. ఆర్సీబీ తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్రం సీజన్లో (2023) కేవలం రెండే విజయాలతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆర్సీబీ.. ప్రస్తుత సీజన్లో గ్రూప్ దశలో నాలుగు విజయాలు, కీలకమైన ఎలిమినేటర్‌లో ముంబైపై విజయంతో మొత్తంగా ఐదు విజయాలు సాధించి ఫైనల్‌కు చేరింది. ఐపీఎల్ (2009, 2011, 2016), డబ్ల్యూపీఎల్ (2024), ఛాంపియన్స్ టీ20 లీగ్‌లతో (2011) కలిపి ఐదోసారి ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ.. 2844 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఫైనల్‌కు చేరింది. ఆర్సీబీ చివరిసారిగా 2016 ఐపీఎల్ ఎడిషన్‌లో ఫైనల్స్ ఆడింది. నాటి ఫైనల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఆర్సీబీ మరోసారి ఫైనల్‌కు చేరింది. మరి ఈ సారి ఫైనల్లోనైనా ఆర్సీబీ విజయం సాధించి తమ టైటిల్ దాహానికి చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి. -
అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్‌లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్లో ఉంది. డబ్ల్యూపీఎల్‌లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరి తమ తొలి టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది. -
కొత్త విజేత ఎవరో!
న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్... ఈ రోజేమో డబ్ల్యూపీఎల్ ఫైనల్... ముందున్న క్రికెట్ పండగకు నేడు జరిగే టైటిల్ పోరు ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఈ సీజన్లో అతివల మ్యాచ్‌లు ఆషామాషీగా సాగలేదు. కాబట్టి ఫైనల్ కూడా హోరాహోరీ ఖాయం. పైగా గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారీ అలా వెళ్లడానికి సిద్ధంగా లేదు. అలాగని వరుస విజయాలతో డిఫెండింగ్ చాంపియన్‌ను చిత్తు చేసిన బెంగళూరును తక్కువ అంచనా వేయలేం. ఏదేమైనా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) క్లైమాక్స్‌లో కొత్త విజేత కోసం గట్టి పోరు తప్పదు! ఈ సీజన్లో కొన్ని ఉత్కంఠభరిత మ్యాచ్‌లైతే రెగ్యులర్ ఐపీఎల్ (పురుషుల టోర్నీ)ను తలపించేలా భారత క్రికెట్ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించాయి. ఈ నేపథ్యంలో మెరుపులు మెరిపించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. ఉత్సాహంతో బెంగళూరు డిఫెండింగ్ చాంపియన్ ముంబైని వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడించిన బెంగళూరు ఈ ఒక్క మ్యాచ్‌లో ఫైనలిస్టును ఓడిస్తే ఎంచక్కా టైటిల్ ఎగరేసుకుపోతుంది. కానీ టాపార్డర్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టు ను గట్టెక్కించింది ఎలీస్ పెరీనే! బ్యాట్‌తో, బంతితో రాణిస్తున్న ఆమెకు కెప్టెన్ స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్‌ల నుంచి సహకారం లభిస్తే బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుంది. లేదంటే బౌలర్లపైనే భారం పడుతుంది. ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్‌లు ఆశించిన మేర రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా... గతేడాది ముంబై జోరుతో రన్నరప్‌గా సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఈ టోర్నీలో ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్‌కు దూసుకొ చ్చిన మెగ్ లానింగ్ సేన ఈ సారి భారీ స్కోర్లతో తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించింది. తాజా ఫైనల్ ప్రత్యర్థి బెంగళూరుతో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లు చేసే గెలిచింది. లానింగ్, షఫాలీ, జెమీమా, క్యాప్సీ అంతా సూపర్‌ఫామ్‌లో ఉండటం వారి బ్యాటింగ్ లైనప్‌ను దుర్భేద్యంగా మార్చింది. బౌలింగ్‌లో మరిజన్, శిఖా పాండే, జెస్ జొనాసెన్‌లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. పిచ్–వాతావరణం అరుణ్ జైట్లీ స్టేడియంలో గత మూడు మ్యాచ్‌లనూ బౌలర్లే శాసించారు. బౌలర్లకు కలిసొచ్చే వికెట్‌పై మెరుపుల కోసం బ్యాటర్లు శక్తికి మించి శ్రమించాలి. వేసవి మొదలవుతున్న వేళ వర్ష సూచనైతే లేదు. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెపె్టన్), షఫాలీ వర్మ, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్ కప్, జెస్ జొనాసెన్, అరుంధతి, రాధా యాదవ్, మిన్నుమణి, తానియా, శిఖాపాండే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెరీ, దిశా కాసత్, రిచా ఘోష్, సోఫీ మోలినెక్స్, వేర్హమ్, శ్రేయాంక, ఆశ శోభన, శ్రద్ధ, రేణుకా సింగ్. - రా.గం.7.30 నుంచి ‘స్పోర్ట్స్–18’లో ప్రత్యక్ష ప్రసారం -
WPL 2024: తుది పోరుకు సర్వం సిద్దం.. చరిత్ర సృష్టించేదెవరు?
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 తుది సమరానికి సమయం అసన్నమైంది. ఆదివారం(మార్చి17) ఢిల్లీ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇరు జట్లు కూడా ఎలాగైనా గెలిచి తొలిసారి టైటిల్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఢిల్లీకి ఇది రెండో ఫైనల్ కాగా.. ఆర్సీబీ మాత్రం తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబాలలపై ఓ లూక్కేద్దం. ఢిల్లీ క్యాపిటల్స్.. గతేడాది అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఈ ఏడాది సీజన్లో సైతం అదే జోరుతో తుది పోరుకు అర్హత సాధించింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. మిగితా రెండు మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఢిల్లీ జట్టు ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్, క్యాప్సీ వంటి వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. షెఫాలీ, లానింగ్ ఇద్దరూ తమ జట్టుకు ప్రతీ మ్యాచ్‌లోనూ తొలి వికెట్‌కు అద్బుతమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. ఆ తర్వాత మిడిలార్డర్లో రోడ్రిగ్స్ కీలక ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతోంది. వీరితో పాటు క్యాప్సీ కూడా మెరుగ్గా రాణిస్తోంది. వీరు నలుగురు చెలరేగితే ఆర్సీబీకి కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. కాప్ పవర్‌ప్లేలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్లను దెబ్బతీస్తోంది. జోనాస్సెన్ సైతం తన స్పిన్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పులు పెడుతోంది. వీరిద్దికి తోడు రాధా యాదవ్ తనదైన రోజున బ్యాటర్లకు చుక్కలు చూపించగలదు. ఆర్సీబీ.. ఈ ఏడాది సీజన్లో ఆరంభంలో ఆర్సీబీ జట్టు కాస్త తడబడిన తర్వాత మాత్రం అద్బుతంగా పుంజుకుంది. వరుసగా ముంబై వంటి పటిష్ట జట్టును మట్టికరిపించి ఫైనల్లో ఆర్సీబీ అడుగుపెట్టింది. ఆర్సీబీ ఆల్‌రౌండర్ పెర్రీ సూపర్ ఫామ్‌లో ఉంది. బ్యాట్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొడుతోంది. ఆర్సీబీ ఫైనల్ చేరడంలో పెర్రీది కీలక పాత్ర. ఎలిమినిటర్లో ముంబైపై 66 పరుగులతో పాటు ఓ కీలక వికెట్ పడగొట్టింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెపైనే ఆర్సీబీ ఆశలు పెట్టుకుంది. టోర్నీ ఆరంభంలో అదరగొట్టిన కెప్టెన్ స్మృతి మంధాన.. తర్వాత మ్యాచ్‌ల్లో మాత్రం తేలిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సైతం మంధాన విఫలమైంది. కనీసం ఫైనల్లొనైనా మంధాన చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. బౌలింగ్‌లో అయితే శ్రేయంక పాటిల్, ఆశ వంటి భారత బౌలర్లు ఉన్నారు. ఏదమైనప్పటికి ఢిల్లీని ఢీకొట్టాలంటే ఆర్సీబీ అన్ని విభాగాల్లో అద్బుతంగా రాణించాలి. -
WPL 2024: భళా బెంగళూరు.. ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ
న్యూఢిల్లీ: గెలుపు వాకిట ముంబై ఇండియన్స్ బోల్తా పడింది. ఉన్నపళంగా ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. తద్వారా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో స్మృతి మంధాన నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఎలిమినేట్ అయ్యింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో బెంగళూరు తలపడుతుంది. మలుపు తిప్పిన శ్రేయాంక... శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 17వ ఓవర్ ముగిసేవరకు గెలిచే స్థితిలోనే ఉంది. 18 బంతుల్లో 20 పరుగులు సులువైన సమీకరణం కాగా... 18వ ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్ 4 పరుగులిచ్చి కీలకమైన హర్మన్‌ప్రీత్ వికెట్‌ను పడగొట్టింది. దాంతో ముంబై విజయసమీకరణం 12 బంతుల్లో 16 పరుగులుగా మారింది. 19వ ఓవర్ వేసిన సోఫీ మోలినెక్స్ నాలుగే పరుగులిచ్చి సజన (1) వికెట్‌ను తీసింది. ఇక చివర్లో 6 బంతుల్లో 12 పరుగులు చేయడం కూడా ముంబై జట్టుకు కష్టం కాదు. కానీ లెగ్ స్పిన్నర్ ఆశ శోభన మాయాజాలం చేసింది. తొలి 3 బంతులకు 4 పరుగులే ఇచ్చింది. ఆశ వేసిన నాలుగో బంతికి పూజ వస్త్రకర్ ముందుకొచ్చి ఆడి (4) స్టంపౌట్ అయ్యింది. దాంతో ముంబై నెగ్గాలంటే 2 బంతుల్లో 8 పరుగులు చేయాలి. కొత్త బ్యాటర్ అమన్‌జ్యోత్ ఐదో బంతికి ఒక పరుగు తీసింది. చివరి బంతికి ముంబై 7 పరుగులు చేయాలి. క్రీజులో అమెలియా కెర్ ఉంది. సిక్స్ కొడితే స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’కు దారి తీస్తుందా అని ఉత్కంఠ కలిగింది. కానీ ఆశ వేసిన ఆఖరి బంతికి అమెలియా ఒక్క పరుగు మాత్రమే తీయగలిగింది. దాంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో బెంగళూరు 5 పరుగులతో గెలిచి తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదుకున్న పెరీ... అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి (10), సోఫీ డివైన్ (10), దిశ (0), హిట్లర్లు రిచా ఘోష్ (14), సోఫీ మోలినెక్స్ (11) అంతా నిరాశపరిచారు. 15 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 84/5! కనీసం వంద కూడా చేయలేదు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎలీస్ పెరీ (50 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించింది. హేలీ మాథ్యూస్, నటాలీ సీవర్ బ్రంట్, సైకా ఇషాక్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (30 బంతుల్లో 33; 4 ఫోర్) టాప్ స్కోరర్ కాగా.. అమెలియా కెర్ (25 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు), నటాలీ సీవర్ బ్రంట్ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారంతే! శ్రేయాంక (4–0–16–2) జట్టుకు అవసరమైన స్పెల్ వేయగా, పెరీ, సోఫీ, వేర్హమ్, ఆశ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) ఇస్మాయిల్ (బి) సీవర్ 10; సోఫీ డివైన్ (బి) హేలీ 10; పెరీ (సి) సీవర్ (బి) సైకా 66; దిశ (సి) పూజ (బి) సైకా 0; రిచా ఘోష్ (సి) సీవర్ (బి) హేలీ 14; సోఫీ మోలినెక్స్ (బి) సీవర్ 11; వేర్హమ్ (నాటౌట్) 18; శ్రేయాంక (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–23, 4–49, 5–84, 6–126. బౌలింగ్: షబ్నిమ్ 4–1–30–0, హేలీ మాథ్యూస్ 4–0–18–2, నటాలీ సీవర్ బ్రంట్ 4–0–18–2, సైకా ఇషాక్ 3–0–27–2, పూజ వస్త్రకర్ 3–0–21–0, అమెలియా కెర్ 2–0–18–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) పెరీ 19; హేలీ (సి) వేర్హమ్ (బి) శ్రేయాంక 15; నటాలీ సీవర్ (బి) వేర్హమ్ 23; హర్మన్‌ప్రీత్ (సి) డివైన్ (బి) శ్రేయాంక 33; అమెలియా కెర్ (నాటౌట్) 27; సజన (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సోఫీ మోలినెక్స్ 1; పూజ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ఆశ శోభన 4; అమన్‌జోత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–27, 2–50, 3–68, 4–120, 5–123, 6–128. బౌలింగ్: రేణుక 1–0–6–0, శ్రేయాంక పాటిల్ 4–0–16–2, సోఫీ డివైన్ 1–0–9–0, ఎలీస్ పెరీ 4–0–29–1, సోఫీ మోలినెక్స్ 4–0–16–1, వేర్హమ్ 4–0–37–1, ఆశ శోభన 2–0–13–1. -
WPL 2024: ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అమీతుమీకి అర్హత సాధించేందుకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై టైటిల్ నిలబెట్టుకునే పనిలో ఉండగా, గత సీజన్లో నిరాశపరిచిన బెంగళూరు కొత్తగా ఫైనల్ చేరేందుకు తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన బృందం గెలిస్తే గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ముంబై గెలిస్తే మాత్రం 2023 సీజన్ ఫైనల్ పునరావృతం అవుతుంది. ఇక ఈ సీజన్ విషయానికొస్తే బెంగళూరు మెరుగుపడింది. లీగ్ ఆరంభ దశలో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్లపై వరుస విజయాలతో టచ్‌లోకి వచ్చింది. అయితే గత ఫైనలిస్టులతో తలపడిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనప్పటికీ అడపాదడపా విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని పదిలపర్చుకుంది. దీంతో పాటు ఆఖరి మ్యాచ్‌లో ముంబైలాంటి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆర్సీబీ స్టార్ ఎలీస్ పెరీ ఆల్‌రౌండ్ షో ముంబైని ముంచేసింది. కీలకమైన పోరులో ఓపెనర్లు స్మృతి, సోఫీలు విఫలమైనా బ్యాట్‌తోనూ పెరీ జట్టును నడిపించింది. హిట్టింగ్తో రిచా ఘోష్ జట్టులో కీలకపాత్ర పోషిస్తోంది. సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్‌లు కూడా ధాటిగా ఆడితే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్‌ను మినహాయించి ఓవరాల్‌గా చూసుకుంటే ముంబై డిఫెండింగ్ చాంపియన్ పాత్రకు న్యాయం చేసేలా ఆడింది. హేలీ మాథ్యూస్, సజన, నటాలీ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, అమెలియా కెర్‌లతో కూడిన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలో స్పీడ్‌స్టర్ షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, అమెలియాలు రాణిస్తే బెంగళూరును ఓడించడం ఏమంత కష్టం కానేకాదు. ఐదు జట్లు పోటీపడ్డ డబ్ల్యూపీఎల్‌లో లీగ్ దశలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. -
ప్లే ఆఫ్స్‌కు బెంగళూరు
న్యూఢిల్లీ: ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లో స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ జట్టు అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఏడు వికెట్లతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన బెంగళూరు చివరిదైన మూడో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ముందుగా ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్‌కాగా... బెంగళూరు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఆ్రస్టేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెరీ అద్భుత ఆటతీరుతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా బంతితో మెరిసిన పెరీ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాట్‌తో అదరగొట్టి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 40 పరుగులు సాధించింది. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే 12 పాయింట్లతో లీగ్ టాపర్‌గా నిలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత పొందుతుంది. ఫైనల్లో స్థానం కోసం ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓడిపోతే... ఢిల్లీ, ముంబై రెండు జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. ముంబైతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (23 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సజన (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) 43 పరుగులు జోడించి ముంబైకు శుభారంభం ఇచ్చారు. అయితే ఆరో ఓవర్ చివరి బంతికి సోఫీ డివైన్ బౌలింగ్‌లో హేలీ అవుటవ్వడంతో ముంబై పతనం మొదలైంది. అనంతరం పెరీ తన పేస్ బౌలింగ్‌తో సజన, హర్మన్‌ప్రీత్ (0), అమెలియా కెర్ (2), అమన్‌జ్యోత్ (4), పూజ వస్త్రకర్ (6), నటాలీ సీవర్ బ్రంట్ (10)లను అవుట్ చేసింది. దాంతో ఒకదశలో 43/0తో ఉన్న ముంబై 82/7తో కష్టాల్లో పడింది. చివర్లో ప్రియాంక బాలా (19 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో ముంబై స్కోరు 100 దాటింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. స్మతి (11; 2 ఫోర్లు), సోఫీ మోలినెక్స్ (9; 2 ఫోర్లు), సోఫీ డివైన్ (4) తక్కు వ స్కోరుకే వెనుదిరిగారు. అయితే రిచా ఘోష్ (28 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పెరీ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించి బెంగళూరును విజయతీరాలకు చేర్చారు. -
WPL 2024:చరిత్ర సృష్టించిన ఎలీస్ పెర్రీ.. తొలి క్రికెటర్‌గా రికార్డు
డబ్ల్యూపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండర్, ఆసీస్ స్టార్ ఎలీస్ పెర్రీ నిప్పులు చేరిగింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా పెర్రీ 6 వికెట్లతో చెలరేగింది. ప్రత్యర్ధి బ్యాట్లను తన బౌలింగ్‌తో ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ ముప్పుతిప్పలు పెట్టింది. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టింది. పెర్రీ సాధించిన 6 వికెట్లు కూడా బౌల్డ్‌లు, ఎల్బీ రూపంలో వచ్చినివే కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన పెర్రీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్ మరిజన్నె కాప్(5-15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కాప్ రికార్డును పెర్రీ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పెర్రీ చెలరేగడంతో ముంబై కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ముంబై బ్యాటర్లలో సజన(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. పెర్రీతో పాటు శ్రేయంకా పాటిల్, శోభన, డివైన్ తలా వికెట్ సాధించారు. చదవండి: IPL 2024: బాల్ బాయ్‌కు సారీ చెప్పిన రింకూ సింగ్.. అసలేం జరిగిందంటే..? -
ఆర్సీబీకి శుభవార్త
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదివరకే రెండు ప్లేఆఫ్స్ బెర్త్‌లు ఖరారైపోయాయి. ఇక మిగిలింది ఓ బెర్త్. ఈ బెర్త్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో మహాద్భతం జరిగితే తప్ప ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరదు. ఇవాళ (మార్చి 12) ముంబై ఇండయన్స్తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే భారీ తేడాతో ఓడితే మాత్రం సమీకరణలు మారిపోతాయి. ఇవాల్టి మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ తర్వాత యూపీ వారియర్జ్‌కు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్ ఉందని అనుకోవడానికి వీల్లేదు. గుజరాత్ జెయింట్స్ తమ చివరాఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కనీసం 57 పరుగుల తేడాతో ఓడిస్తే ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ బరిలో ఉంటుంది. ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే.. ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌నూ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే మాత్రం యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. గుజరాత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 57 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించి, ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే గుజరాత్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే మూడో జట్టు మార్చి 15న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. తదుపరి జరుగబోయే రెండు గ్రూప్ మ్యాచ్‌ల ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు నిర్దారించబడతాయి. ప్రస్తుతానికి రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్‌లో ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నా ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే జట్టుతో మార్చి 17న జరిగే అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనుంది. -
WPL 2024: గుజరాత్‌ను గెలిపించిన వైజాగ్ అమ్మాయి
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎడిషన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్ జెయింట్స్‌కు విశాఖ బౌలర్ షబ్నమ్ షకీల్ బ్రేక్ ఇచ్చింది. యూపీ వారియర్జ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో షబ్నమ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో (4-0-11-3) ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్ 8 పరుగుల తేడాతో వారియర్జ్‌ను ఓడించి సీజన్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. షబ్నమ్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో వారియర్జ్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. షబ్నమ్ దెబ్బకు వారియర్జ్ 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. దీప్తి శర్మ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మెరుపు అర్ధ సెంచరీతో (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగినా వారియర్జ్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా వారియర్జ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లారా వాల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. వారియర్జ్ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. లక్ష ఛేదనలో షబ్నమ్ దెబ్బకు ఆదిలోనే తడబడిన వారియర్జ్ దీప్తి శర్మ రాణించినా ఓటమిపాలైంది. వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. దీప్తితో పాటు పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా వారియర్జ్‌కు గెలిపించలేకపోయారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా దీప్తి 2 సిక్సర్లు సహా 17 పరుగులు సాధించినప్పటికీ వారియర్జ్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే అవుతుంది. ఢిల్లీ, ముంబై ఇండియన్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. ఆర్సీబీ మరో బెర్త్ రేసులో ముందుంజలో ఉంది. సత్తా చాటిన విశాఖ అమ్మాయి.. యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన షబ్నమ్ స్వస్థలం విశాఖపట్నం. 16 ఏళ్ల షబ్నమ్ డబ్ల్యూపీఎల్ బరిలోకి దిగిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. వేలంలో ఆమెను గుజరాత్ టీమ్ రూ. 10 లక్షలకు తీసుకుంది. తన తొలి మ్యాచ్‌లో వికెట్ దక్కకపోయినా చక్కటి బంతులతో ఆమె ఆకట్టుకుంది. ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ నాట్ సివర్ బ్రంట్‌ను తొలి వికెట్‌గా అవుట్ చేసిన షబ్నమ్... ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. గత ఏడాదే అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో షబ్నమ్ సభ్యురాలిగా ఉంది. -
WPL 2024: సూపర్ షబ్నమ్...
న్యూఢిల్లీ: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ దీప్తి శర్మ (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగినా... యూపీ వారియర్స్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 8 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెపె్టన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లౌరా వోల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షబ్నమ్ షకీల్ (3/11) కీలక వికెట్లతో ఆరంభంలోనే యూపీని దెబ్బ తీసింది. దాంతో స్కోరు 35/5 వద్ద నిలిచింది. అయితే దీప్తి, పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 78 బంతుల్లో అభేద్యంగా 109 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా, దీప్తి 2 సిక్సర్లతో సహా మొత్తం 17 పరుగులే వచ్చాయి. పట్టికలో మూడో స్థానం కోసం ఇంకా పోటీ మిగిలే ఉంది. యూపీ, బెంగళూరుకు చెరో 6 పాయింట్లు ఉండగా, యూపీ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోకున్నా బెంగళూరుకే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లున్న గుజరాత్ చివరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు భారీ రన్‌రేట్ సాధించాలి. -
రెచ్చిపోయిన గుజరాత్ కెప్టెన్.. చివరి 12 బంతుల్లో 7 బౌండరీలు
మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 11) గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు లారా వాల్వార్డ్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (42 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దయాలన్ హేమలత 0, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 4, ఆష్లే గార్డ్నర్ 15, భారతి ఫుల్మలి 1, కేథరీన్ బ్రైస్ 11, తనుజా కన్వర్ 1, షబ్నమ్ 0 పరుగులకు ఔటయ్యారు. వారియర్జ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 3 వికెట్లతో విజృంభించగా.. దీప్తి శర్మ 2, రాజేశ్వరీ గైక్వాడ్, చమారీ ఆటపట్టు తలో వికెట్ పడగొట్టారు. పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడిన మూనీ.. గుజరాత్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మూనీ తొలుత ఆచితూచి ఆడినప్పటికీ.. ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి 12 బంతుల్ని ఎదుర్కొన్న మూనీ.. ఏకంగా 7 ఫోర్లతో విరుచుకుపడింది. 19వ ఓవర్లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు రాబట్టిన మూనీ.. చివరి ఓవర్లో ఏకంగా ఐదు బౌండరీలు బాది 21 పరుగులు పిండుకుంది. మూనీ ఆఖరి రెండు ఓవర్లలో జూలు విదల్చడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఢిల్లీ, ముంబై జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీ, యూపీ వారియర్జ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. -
'రిచా' ది వారియర్.. లేడీ ధోని! వీడియో వైరల్
డబ్ల్యూపీఎల్-2024లో భాగంగా ఆదివారం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగుతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ విరోచిత పోరాటం మాత్రం అందరని అకట్టుకుంది. ఆఖరివరకు రిచా అద్భుతంగా పోరాడనప్పటికి తన జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయింది. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే కెప్టెన్ స్మృతి మంధాన (5) పెవిలియన్‌కు చేరింది. సోఫీ మోలినెక్స్ (30), ఎలీస్ పెరీ (49) బెంగళూరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే ఇద్దరూ ఓవర్ వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిచా ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. బౌండరీల వర్షం కురిపిస్తూ బౌలర్లపై ఒత్తడి పెంచింది. సోఫీ డివైన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఆ తర్వాత డివైన్ ఔటైనప్పటికీ రిచా జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఆర్సీబీ విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 40 పరుగులు అవసరమయ్యాయి. 18వ ఓవర్లో రిచా ఘోష్, జార్జియా (12) చెరో బౌండరీ సాధించడంతో 12 పరుగులు వచ్చాయి. అయితే 19వ ఓవర్లో జార్జియాను షికా పాండే ఔట్ చేయడంతో బెంగళూరు విజయ సమీకరణం 6 బంతుల్లో 17 పరుగులుగా మారింది. చివరి ఓవర్లో జొనాస్సెన్ వేసిన తొలి బంతిని రిచా ఘోష్ సిక్సర్‌గా మలిచింది. రెండో బంతికి పరుగేమి లభించలేదు. మూడో బంతికి దిశా రనౌటైంది. నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన రిచా.. ఐదో బంతిని స్టాండ్స్‌కు తరలించింది. దీంతో ఆఖరి బంతికి ఆర్సీబీ విజయానికి కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అయితే స్ట్రైక్‌లో రిచా ఉండడంతో ఆర్సీబీ విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆఖరి బంతికి రిచా రనౌట్ కావడంతో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఇది చూసిన కోట్ల మంది ఆర్సీబీ ఆభిమానుల గుండె బద్దలైంది. కన్నీరు పెట్టుకున్న రిచా.. ఇక ఆఖరి వరకు పోరాడి జట్టును గెలిపించలేకపోయిన రిచా కన్నీరు పెట్టుకుంది. మైదానంలోనే కన్నీటి పర్యంతం అయింది. ఢిల్లీ క్రికెటర్లు షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ ఆమె వద్దకు వెళ్లి ఓదర్చారు. ఢిల్లీ సారథి మెగ్ లానింగ్ సైతం రిచాను హగ్ చేసుకుని ఓదార్చింది. ఇక అద్బుతమైన పోరాట పటిమ చూపిన రిచాపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. లేడి ధోని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం రిచాకు సపోర్ట్‌గా నిలిచాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రిచా ఘోష్ ఫొటోతో 'యూ ఆర్ ఏ స్టార్' అంటూ సూర్య రాసుకొచ్చాడు. A nail-biting finish to #DCvRCB🔥#DelhiCapitals seal a narrow win ✌#TATAWPL #TATAWPLonJioCinema #TATAWPLonSports18#JioCinemaSports #CheerTheW pic.twitter.com/qbCSX4KF4B — JioCinema (@JioCinema) March 10, 2024 Another Classic in #TATAWPL @DelhiCapitals win the match by 1 RUN! They jump to the top of points table 🔝 Scoreboard 💻 📱 https://t.co/b7pHKEKqiN#DCvRCB pic.twitter.com/znJ27EhXS6 — Women's Premier League (WPL) (@wplt20) March 10, 2024 -
WPL 2024: ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాదీ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ఆదివారం ఆఖరి బంతిదాకా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై గెలుపొందింది. ఈ సీజన్లో ఢిల్లీకిది ఐదో విజయం. మొదట ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు మెగ్ లానింగ్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), షఫాలీ వర్మ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) 54 పరుగులతో శుభారంభమిచ్చారు. తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించారు. మూడో వికెట్‌కు ఇద్దరు కలిసి 61 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. జెమీమా 26 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. స్పిన్నర్ శ్రేయాంక 4 వికెట్లు తీసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (5) విఫలమైనా... టాపార్డర్‌లో సోఫీ మోలినెక్స్ (30 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఎలీస్ పెరీ (32 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరును నడిపించారు. ఓవర్ వ్యవధిలో ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ దశలో రిచా ఘోష్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ డివైన్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మ్యాచ్‌పై ఆశలు రేపారు. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా, రిచా రెండు భారీ సిక్స్‌లు బాదింది. ఒక బంతి 2 పరుగుల విజయ సమీకరణం వద్ద రిచా రనౌట్ కావడంతో పరుగు తేడాతో ఢిల్లీ గట్టెక్కింది. నేడు గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. 10 పాయింట్లతో ముంబై ఇండియన్స్, ఢిల్లీ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరగా... ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న యూపీ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలి. -
మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 10) ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి 181 పరుగుల భారీ స్కోర్ (5 వికెట్ల నష్టానికి) చేసింది. జెమీమా రోడ్రిగెజ్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు మెగ్ లాన్నింగ్ (29), షఫాలీ వర్మ (23) సైతం ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మారిజన్ కప్ 12, జొనాస్సెన్ 1, రాధా యాదవ్ ఒక పరుగు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. అషా శోభన ఓ వికెట్ దక్కించుకుంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. స్మృతి మంధన (5) ఔట్ కాగా.. సోఫీ ఎక్లెస్‌స్టోన్ (8), ఎల్లిస్ పెర్రీ (36) క్రీజ్‌లో ఉన్నారు. మంధన వికెట్ క్యాప్సీకి దక్కింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో మూడో ప్లేస్‌లో నిలిచింది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఏడాది కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. యూపీ వారియర్జ్ (6 పాయింట్లు) నాలుగో స్థానంలో, గుజరాత్ జెయింట్స్ (2 పాయింట్లు) చివరి స్థానంలో ఉన్నాయి. -
హర్మన్ ధనాధన్.. ఫ్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్
న్యూఢిల్లీ: భారీ స్కోర్ల మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 95 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసం ముంబై ఇండియన్స్‌ను గెలిపించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. ముందుగా గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దయాళన్ హేమలత (40 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ బెత్ మూనీ (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 10.2 ఓవర్లలోనే 121 పరుగులు జోడించారు. మూనీ 27 బంతుల్లో, హేమలత 28 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఒక దశలో ఓవర్‌కు పది పరుగుల పైచిలుకు దూసుకెళ్లిన రన్‌రేట్... తర్వాత ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున కోల్పోవడంతో నెమ్మదించింది. సైకా ఇషాక్ 2 వికెట్లు తీసింది. అనంతరం ముంబై 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు యస్తిక భాటియా (36 బంతుల్లో 49; 8 ఫోర్లు, 1 సిక్స్), హేలీ మాథ్యూస్ (18; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 50 పరుగులతో శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరితో పాటు నట్ సీవర్ బ్రంట్ (2) వికెట్‌నూ వంద పరుగుల్లోపే కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. 15.4 ఓవర్లలో ముంబై స్కోరు 121/3. విజయానికి 26 బంతుల్లో 70 పరుగులు కావాలి. ఈ దశలో హర్మన్‌ప్రీత్ (వ్యక్తిగత స్కోరు 29 బంతుల్లో 40) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను బౌండరీ వద్ద లిచ్‌ఫీల్డ్ జారవిడిచింది. దీనిని సద్వినియోగం చేసుకున్న హర్మన్ ఆ తర్వాత విధ్వంసకరంగా ఆడింది. చేయాల్సిన 70 పరుగుల్లో ఆమె ఒక్కతే 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు (19 బంతుల్లో) సాధించడంతో ముంబై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. -
ఢిల్లీని ఓడించిన దీప్తి
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఉర్రూతలూగించిన మ్యాచ్ జరిగింది. గెలుపు దిశగా పయనిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను దీప్తిశర్మ (4/19) అద్భుత బౌలింగ్‌తో ఓడించింది. ఢిల్లీ లక్ష్యం 138 పరుగులు కాగా... ఒక దశలో 18 ఓవర్లలో 124/4 స్కోరు వద్ద విజయానికి 12 బంతుల్లో 15 పరుగుల దూరంలో ఉంది. అయితే 11 బంతుల్లో 6 వికెట్లను కోల్పోయిన ఢిల్లీ గెలుపు వాకిట బొక్కబోర్లా పడింది. యూపీ వారియర్స్ ఆఖరి దాకా పోరాడి పరుగు తేడాతో గెలిచింది. 19వ ఓవర్ వేసిన దీప్తి 3 వికెట్లు తీసి 5 పరుగులే ఇవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆమె శ్రమను నీరుగార్చకుండా చివరి ఓవర్లో బౌలింగ్‌కు దిగిన గ్రేస్ హారిస్ (2/8) ఐదు బంతులేసి రెండు వికెట్లు తీసింది. దీంతో పాటు మరో రనౌట్ కూడా చేసిన యూపీ విజయాన్నందుకుంది. ఉత్కంఠ రేపిన ఈ పోరు అందర్ని మునివేళ్లపై నిలబెట్టింది. మొదట యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. దీప్తిశర్మ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో మళ్లీ ఒంటరి పోరాటం చేసింది. క్యాపిటల్స్ బౌలర్లు రాధా యాదవ్, టైటస్ సాధు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్, కెపె్టన్ మెగ్ లానింగ్ (46 బంతుల్లో 60; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, తర్వాత వచ్చిన వారు చెత్తషాట్లతో ఓటమిని మూల్యంగా చెల్లించారు. జెమీమా (17), షఫాలీ (15), అలైస్ క్యాప్సీ (15) రెండంకెల స్కోర్లు చేశారంతే! ఎవరూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేదు. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
గుజరాత్ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ
మహిళల ఐపీఎల్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఆ జట్టు బ్యాటర్ హర్లీన్ డియోల్ మిగితా డబ్యూపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైంది. హర్లీన్ స్థానాన్ని మరో టీమిండియా బ్యాటర్ భారతి ఫుల్మలితో భర్తీ చేస్తున్నట్లు గుజరాత్ మేనేజ్మెంట్ ప్రకటించింది. గాయంతో బాధపడుతూనే ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన హర్లీన్.. వరుసగా 8, 22, 18 స్కోర్లు చేసింది. టీమిండియా తరఫున 10 వన్డేలు, 24 టీ20లు ఆడిన ఈ చంఢీఘడ్ అమ్మాయి.. రెండు ఫార్మాట్లలో కలిపి 3 అర్దసెంచరీల సాయంతో 458 పరుగులు చేసింది. హర్లీన్ స్థానంలో ఎంపికైన భారతి టీమిండియా తరఫున 2 టీ20లు ఆడి 23 పరుగులు చేసింది. దేశవాలీ టోర్నీల్లో విదర్భకు ఆడే భారతి.. మహిళల టీ20 లీగ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత డబ్యూపీఎల్ సీజన్లో గుజరాత్ జెయింట్స్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది. ముంబై, ఆర్సీబీ, యూపీ, ఢిల్లీ జట్ల చేతిలో ఓడిన ఈ జట్టు మార్చి 6న మరోసారి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. గుజరాత్ రేపు జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. -
ముంబై ఘనవిజయం
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ఈ పోరులో ముంబై 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు యస్తిక భాటియా (9), హేలీ మాథ్యూస్ (4) నిరాశ పరిచినప్పటికీ తర్వాత వచ్చిన టాపార్డర్ బ్యాటర్ నటాలీ సీవర్ బ్రంట్ (31 బంతుల్లో 45; 8 ఫోర్లు) ధాటిగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టింది. అనంతరం అమెలియా కెర్ (23 బంతుల్లో 39; 6 ఫోర్లు), సజీవన్ సజన (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) స్కోరు వేగాన్ని పెంచారు. చమరి ఆటపట్టు 2 వికెట్లు తీసింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలింగ్‌కు యూపీ ఏ దశలోనూ ఎదురునిలువలేకపోయింది. ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లను 15 పరుగుల స్కోరు వద్దే కోల్పోయింది. కెప్టెన్ అలీసా హీలీ (3), కిరణ్ నవ్‌గిరే (7), చమరి ఆటపట్టు (3) నిరాశపరిచారు. క్రీజులోకి వచ్చిన 11 మందిలో గ్రేస్ హారిస్ (15), శ్వేత సెహ్రావత్ (17) మినహా ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో దీప్తి శర్మ (36 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసిన ఒంటరి పోరాటం సరిపోలేదు. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ (3/27) యూపీని దెబ్బ తీయగా, నాట్ సీవర్ 2 వికెట్లు పడగొట్టింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. -
గుజరాత్ బోణీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో ఎట్టకేలకు గుజరాత్ జెయింట్స్ జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన గుజరాత్ ఐదో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 19 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు సాధించింది. ఓపెనర్లు లౌరా వొల్వార్ట్ (45 బంతుల్లో 76; 13 ఫోర్లు), కెప్టెన్ బెత్ మూనీ (51 బంతుల్లో 86 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 13 ఓవర్లలో 140 పరుగులు జోడించారు. లౌరా అవుటయ్యాక వచ్చిన ఫోబీ లిచ్‌ఫీల్డ్ (18; 1 ఫోర్), యాష్లీ గార్డ్నర్ (0), హేమలత (1), వేద కృష్ణమూర్తి (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన (24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎలీస్ పెరీ (24; 3 ఫోర్లు), సోఫీ డివైన్ (23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రిచా ఘోష్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), జార్జియా వేర్హమ్ (48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
ఆర్సీబీతో మ్యాచ్.. విధ్వంసం సృష్టించిన గుజరాత్ ఓపెనర్లు
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (మార్చి 6) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఓపెనింగ్ బ్యాటర్లు లారా వొల్వార్డ్ట్, బెత్ మూనీ శివాలెత్తిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. లారా, మూనీ రెచ్చిపోవడంతో భారీ స్కోర్ చేసింది. లారా 45 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేయగా.. మూనీ 51 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లారా, మూనీ మినహా గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 18, ఆష్లే గార్డ్నర్ 0, దయాలన్ హేమలత 1, వేద కృష్ణమూర్తి ఒక పరుగు చేశారు. ఆర్సీబీ బౌలర్ సోఫీ మోలినెక్స్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. మోలినెక్స్ ఆఖరి ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసింది. ఒకరు రనౌటయ్యారు. 18వ ఓవర్ వరకు (187/1) అతి భారీ స్కోర్ దిశగా సాగుతున్నట్లు కనిపించిన గుజరాత్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి చివరి 2 ఓవర్లలో కేవలం 12 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, జార్జియా వేర్హమ్ తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు బ్యాటర్లు రనౌట్లయ్యారు. -
క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా) సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ మూడో ఓవర్లో షబ్నిమ్ మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించింది. ఈ ఓవర్ రెండో బంతిని షబ్నిమ్ 132.1 కిమీ వేగంతో సంధించింది. మహిళల క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లోనైనా ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. షబ్నిమ్ రికార్డును ఆమెనే బ్రేక్ చేసుకుంది. Mumbai Indians fast bowler Shabnim Ismail bowled the Fastest Delivery by a Women's Cricket - 132.1 KMPH 👏 #MIvDC #WPL2024 #DCvMI pic.twitter.com/srOZimZ0HQ — Richard Kettleborough (@RichKettle07) March 5, 2024 2016లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షబ్నిమ్ 128 కిమీ వేగంతో బంతిని సంధించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు మహిళల క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీగా ఉండింది. 2022 వన్డే వరల్డ్‌కప్‌లో షబ్నిమ్ రెండు సార్లు 127 కిమీ వేగంతో బంతులను సంధించింది. తాజాగా తన పేరిట ఉండిన రికార్డును షబ్నిమ్ తనే బ్రేక్ చేసుకుంది. మహిళల క్రికెట్లో 130 కిమీలకు పైగా వేగంతో నమోదైన బంతి ఇదే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, షబ్నిమ్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై 168 పరుగులకే పరిమితమై 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో షబ్నిమ్ 4 ఓవర్లలో 46 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టింది. -
ఢిల్లీ ధమాకా...
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై మొదలైన రెండో అంచె పోటీలో ఢిల్లీ గర్జించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ ఓడించింది. ఈ గెలుపుతో ఢిల్లీ 8 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీస్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 27 బంతుల్లోనే ఆమె అర్ధ శతకాన్ని పూర్తిచేసింది. ఓపెనర్, కెపె్టన్ మెగ్ లానింగ్ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడింది. లానింగ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో కాసేపే ఉన్నా మెరిపించింది. దీంతో ఢిల్లీ పవర్‌ప్లేలో 56/1 స్కోరు చేసింది. డెత్ ఓవర్లలో జెమీమా చెలరేగడంతో భారీస్కోరు సాధ్యమైంది. ముంబై బౌలర్లు షబ్నిమ్, సైకా ఇషాక్ చెరో వికెట్ తీశారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఓడిపోయింది. ఢిల్లీ బౌలర్లు జెస్ జొనాసెన్ (3/21), మరిజాన్ కాప్ (2/37), శిఖా పాండే (1/27), టిటాస్ సాధు (1/23) ముంబైను కట్టడి చేశారు. ఒకదశలో ముంబై 68/5 స్కోరు వద్ద సగం వికెట్లను కోల్పోయింది. టాపార్డర్‌లో హేలీ మాథ్యూస్ (17 బంతుల్లో 29; 6 ఫోర్లు) మినహా ఆ తర్వాత వరుసగా యస్తిక భాటియా (6), నట్ సీవర్ (5), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (6) నిరాశపరిచారు. లోయర్ ఆర్డర్లో అమన్‌జోత్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. -
రెచ్చిపోయిన రోడ్రిగెజ్.. విరుచుకుపడిన లాన్నింగ్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్లు షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు షాట్లతో విరుచుకుపడగా.. ఆతర్వాత బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగెజ్ (33 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ ఆవలికి తరలించింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అలైస్ క్యాప్సీ (20 బంతుల్లో 19; 3 ఫోర్లు), మారిజన్ కప్ (12 బంతుల్లో 11; ఫోర్) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. జెస్ జొనాస్సెన్ 5 బంతుల్లో 4 పరుగులతో అజేయంగా నిలిచింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, పూజా వస్త్రాకర్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. -
భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది!
మహిళల ప్రీమియర్ లీగ్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించింది. బెంగళూరు వేదికగా యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ముఖ్యంగా ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన(50 బంతుల్లో 80, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎల్లీస్ పెర్రీ(37 బంతుల్లో 58) యూపీ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. డబ్ల్యూపీఎల్ హిస్టరీలోనే ఆర్సీబీకి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. కారు అద్దం పగలగొట్టిన పెర్రీ.. కాగా ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్ ఎల్లీస్ పెర్రీ కొట్టిన ఓ సిక్సర్ దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతిని పెర్రీ లాంగ్-ఆన్ మీదుగా సిక్సర్‌గా మలిచింది. ఈ క్రమంలో బంతి నేరుగా వెళ్లి డిస్ప్లే బాక్స్‌లో ఉన్న కారు అద్దానికి తగిలింది. దీంతో అద్దం పూర్తిగా పగిలిపోయింది. ఇది చూసిన అందరూ ఒక్క షాక్‌కు గురయ్యారు. పెర్రీ సైతం తలపై చేతులు వేసుకుని అయ్యో అన్నట్లు రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా డబ్ల్యూపీఎల్ ప్రస్తుత సీజన్ పూర్తయిన తరువాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా ఈ కారును అందిస్తారు. చదవండి: PSL 2024: ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్ 𝘽𝙧𝙚𝙖𝙠𝙞𝙣𝙜 𝙍𝙚𝙘𝙤𝙧𝙙𝙨 + 𝙂𝙡𝙖𝙨𝙨𝙚𝙨 😉 Ellyse Perry's powerful shot shattered the window of display car 😅#TATAWPL #UPWvRCB #TATAWPLonJioCinema #TATAWPLonSports18 #HarZubaanParNaamTera#JioCinemaSports #CheerTheW pic.twitter.com/RrQChEzQCo — JioCinema (@JioCinema) March 4, 2024 -
WPL 2024: సూపర్ స్మృతి...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో తొలి అంచెపోటీలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది. ఈ లీగ్‌లో ఆర్సీబీకిది మూడో విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో ఒపెనింగ్ వికెట్‌కు చకచకా 51 పరుగులు జతచేసిన స్మృతి ఆ తర్వాత పెరీ అండతో దూకుడు పెంచింది. ఇద్దరు ధనాధన్ ఆటతీరు కనబరచడంతో యూపీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్‌కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జతచేశారు. మంధాన 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 146 పరుగుల వద్ద స్మృతి ని్రష్కమించగా, 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన పెరీ ఆఖరి ఓవర్లో అవుటైంది. రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించింది. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగలిగింది. కెపె్టన్, ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పవర్‌ప్లేలో దంచేసింది. మరో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (18) సహా చమరి ఆటపట్టు (8), గ్రేస్ హారిస్ (5), శ్వేత సెహ్రావత్ (1) స్వల్ప వ్యవధిలో ని్రష్కమించడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. దీప్తి శర్మ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పూనమ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడారు. నేటి నుంచి ఢిల్లీ వేదికపై రెండో అంచె పోటీలు జరుగుతాయి. మంగళవారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
మెరుపులు మెరిపించిన మంధన.. ఆర్సీబీ భారీ స్కోర్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధన మెరుపులు మెరిపించింది. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనకు ఎల్లిస్ పెర్రీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సబ్బినేని మేఘన (28), రిచా ఘోష్ (21 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించారు. వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, అంజలి శర్వాణి, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ పడగొట్టారు. Mandhana's magic in Chinnaswamy!#WPL2024 pic.twitter.com/rMncZXmSzx — OneCricket (@OneCricketApp) March 4, 2024 అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్.. రేణుక సింగ్ వేసిన తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయింది. అయితే ఆతర్వాత రెండు ఓవర్లలో మాత్రం వారియర్జ్ ఓపెనర్లు అలైసా హీలీ (13), కిరణ్ నవ్‌గిరే (17) రెచ్చిపోయారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో వారియర్జ్ 3 ఓవర్లలో 40 పరుగులు చేసింది. తొలి ఓవర్ మొయిడిన్‌గా మలిచిన రేణుకా సింగ్, ఆతర్వాతి ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకుంది. కారు అద్దాలు పగలగొట్టిన పెర్రీ.. ELLYSE PERRY HAS BROKE THE GLASS OF THE CAR...!!! 🤯 - The reaction of Perry was priceless!! pic.twitter.com/zaxiQLLN1r — Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2024 -
ఢిల్లీ ‘హ్యాట్రిక్’...
బెంగళూరు: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ఢిల్లీ 25 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిన తర్వాత క్యాపిటల్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే గుజరాత్ పరిస్థితి మాత్రం మరింత దిగజారింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమ్ ఒక్క గెలుపు కూడా లేకుండా వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 చేయగా.... జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. షఫాలీ వర్మ (13), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలం కావడంతో లానింగ్ ముందుండి నడిపించింది. అలైస్ క్యాప్సీ (17 బంతుల్లో 27; 5 ఫోర్లు)తో రెండో వికెట్‌కు లానింగ్ 26 బంతుల్లో 38 పరుగులు జోడించగా... చివర్లో అనాబెల్ సదర్లాండ్ (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని కీలక పరుగులు జత చేసింది. గుజరాత్ పేలవ ఫీల్డింగ్, క్యాచ్‌లు వదిలేయడం కలిసొచ్చినా ఢిల్లీ వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. ఒకదశలో 105/2తో మెరుగైన స్థితిలో నిలిచిన జట్టు ఆ తర్వాత వేగంగా వికెట్లు కోల్పోయింది. చివరి 5 ఓవర్లలో ఢిల్లీ 33 పరుగులు చేసింది. జెయింట్స్ పేసర్ మేఘనా సింగ్ (4/37) కీలక వికెట్లు తీయగా... గార్డ్నర్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ తడపడింది. సున్నా స్కోరు వద్దే వాల్వార్ట్ (0) వెనుదిరగ్గా... బెత్ మూనీ (12), లిచ్‌ఫీల్డ్ (15), వేద కృష్ణమూర్తి (12) ప్రభావం చూపలేకపోయారు. అయితే యాష్లీ గార్డ్నర్ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే పోరాడగలిగింది. అయితే 35 బంతుల్లో 59 పరుగులు చేయాల్సిన స్థితిలో జెస్ జొనాసెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గార్డ్నర్ స్టంపౌట్ కావడంతో గుజరాత్ ఆశలు కోల్పోయింది. ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్ లాంఛనమే అయింది. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జెస్ జొనాసెన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అరుంధతి రెడ్డి, శిఖా పాండే చెరో వికెట్ తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో యూపీ వారియర్స్ తలపడుతుంది. లీగ్ దశలో తొలి అర్ధ భాగం మ్యాచ్‌లు (11) నేటితో బెంగళూరులో ముగియనున్నాయి. మంగళవారం నుంచి తర్వాతి 11 మ్యాచ్‌లకు ఢిల్లీ వేదిక కానుంది. తొలి కన్కషన్ సబ్‌స్టిట్యూట్ ఆదివారం మ్యాచ్‌లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌లో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన తొలి ప్లేయర్‌గా గుజరాత్ జెయింట్స్‌కు చెందిన సయాలీ సద్గరే గుర్తింపు తెచ్చుకుంది. జెయింట్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఢిల్లీ బ్యాటర్ జొనాసెన్ షాట్ కొట్టగా డీప్ మిడ్ వికెట్ వద్ద క్యాచ్‌ను అందుకునే క్రమంలో హేమలత పట్టు తప్పింది. క్యాచ్ చేజారగా... బంతి ఆమె నుదుటికి బలంగా తాకింది. దాంతో కన్‌కషన్‌తో హేమలత మైదానం వీడింది. గుజరాత్ తరఫున పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సయాలీ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. -
ముంబై ఇండియన్స్ జోరు
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ దూకుడు ముందు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలవలేకపోయింది. ఫలితంగా స్మృతి సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టోర్నీలో మూడో మ్యాచ్ నెగ్గిన ముంబై ఈ మూడింటినీ ఛేదనలోనే గెలుచుకోవడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితం కాగా...ముంబై 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి మరో 29 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. అనారోగ్యంనుంచి కోలుకోని కారణంగా ముంబై కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్‌లో కూడా ఆడలేదు. బెంగళూరు ఇన్నింగ్స్ తొలి 6 ఓవర్లు ముగిసే సరికే ఓపెనర్లు స్మృతి మంధాన (9), ఎస్.మేఘన (11), సోఫీ డివైన్ (9) వెనుదిరిగారు. రిచా ఘోష్ (7), సోఫీ మోలినెక్స్ (12) కూడా విఫలం కావడంతో స్కోరు 71/5 వద్ద నిలిచింది. ఈ దశలో ఎలైస్ పెరీ (38 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) జట్టును ఆదుకుంది. పెరీ, జార్జ్ వేర్హామ్ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఆరో వికెట్‌కు 40 బంతుల్లో 52 పరుగులు జోడించడంతో ఆర్సీబీ కాస్త గౌరవప్రదమైన స్కోరుకు చేరుకుంది. ఒక్క సిక్సర్ కూడా లేకుండా బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. ముంబై బౌలర్లలో పూజ వస్త్రకర్, నాట్ సివర్ బ్రంట్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప ఛేదనను ముంబై దూకుడుగా మొదలు పెట్టింది. యస్తిక భాటియా (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హేలీ మాథ్యూస్ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 23 బంతుల్లో 45 పరుగులు జోడించి శుభారంభం అందించారు. మూడో స్థానంలో వచ్చిన తాత్కాలిక కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (25 బంతుల్లో 27; 4 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమేలియా కెర్ (24 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు) ధాటైన ఆట ముంబై పనిని సులువు చేసింది. పూజ వస్త్రకర్ (8 నాటౌట్)తో కలిసి కెర్ వేగంగా మ్యాచ్‌ను ముగించింది. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. -
మళ్లీ ఓడిన గుజరాత్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో గుజరాత్ జెయింట్స్ జట్టుకు ‘హ్యాట్రిక్’ ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి తమ ఖాతాలో రెండో విజయం నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు సాధించింది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), యాష్లే గార్డ్నర్ (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో గుజరాత్ స్కోరు 100 దాటింది. అంతకుముందు లారా వొల్వార్ట్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు), కెప్టెన్ బెత్ మూనీ (16 బంతుల్లో 16; 2 ఫోర్లు), హర్లీన్ డియోల్ (24 బంతుల్లో 18; 1 ఫోర్) వేగంగా ఆడటంలో విఫలమయ్యారు. యూపీ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం యూపీ వారియర్స్ 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (33 బంతుల్లో 60 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి యూపీ విజయంలో కీలకపాత్ర పోషించింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
స్మృతి మెరుపులు వృథా
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని ఆశించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు నిరాశ ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ప్లేయర్లు మరిజాన్ కాప్, జెస్ జొనాసెన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ లీగ్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన బెంగళూరుకు ఇదే మొదటి పరాజయం కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్ల భరతం పట్టిన స్మృతి 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్‌కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) జత చేసింది. మరిజాన్ కాప్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి గురి తప్పిన స్మృతి క్లీన్ బౌల్డ్ అయింది. అప్పటికి బెంగళూరు స్కోరు 112. స్మృతి అవుటయ్యాక వచ్చిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు విజయతీరానికి చేరలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కాప్ (2/35), జెస్ జొనాసెన్ (3/21), అరుంధతి రెడ్డి (2/38) రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (17 బంతుల్లో 11; 2 ఫోర్లు) విఫలమైనా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అలైస్ క్యాప్సీ (33 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. రెండో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక మరిజాన్ కాప్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), జెస్ జొనాసెన్ (16 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి ఢిల్లీకి భారీ స్కోరును అందించారు. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. -
చెలరేగిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు
మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అలైస్ క్యాప్సీ (33 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మారిజన్ కప్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్ జొనాస్సెన్ (16 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అరుంధతి రెడ్డి (4 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగిపోయారు. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (11), జెమీమా రోడ్రిగెజ్ (0) నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ డివైన్, డి క్లెర్క్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్ ఓ వికెట్ దక్కించుకుంది. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభన (2-0-30-0), మోలినెక్స్ (3-0-23-0), వేర్హమ్ (1-0-13-0) దారాళంగా పరుగులు సమర్పించకోగా.. రేణుకా సింగ్ (4-0-28-0) వికెట్లు తీయలేకపోయినా పర్వాలేదనిపించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగని ఆర్సీబీ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కెప్టెన్ స్మృతి మంధన 11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 20 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 2 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 20/0గా ఉంది. -
WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత
క్రికెట్ ఫీల్డ్‌లోని ఒక్కొక్క రంగంలో నెమ్మదిగా మహిళా కేతనం ఎగురుతోంది. గతంలో మొదటి మహిళా క్రికెట్ అంపైర్ వృందా రతి, మొదటి ఐసీసీ మహిళా మ్యాచ్ రిఫరీగా జి.ఎస్.లక్ష్మి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దేశంలోనే మొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా జసింత కల్యాణ్ ఘనత సాధించింది. బెంగళూరులో జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్ క్యూరేటర్‌గా జసింత తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఆమె పరిచయం. క్రికెట్ అంటే సచిన్, ద్రవిడ్, గంగూలి అనేవారు ఒకప్పుడు. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన అంటున్నారు ఇప్పుడు. క్రికెట్ కామెంటేటర్స్ అంటే హర్ష భోగ్లే, సునీల్ గవాస్కర్ అనేవారు మొన్న. ఫిమేల్ క్రికెట్ యాంకర్స్‌గా మందిరా బేడీ, సంజనా గణేశన్ పేరు గడించారు ఇవాళ. మహిళా అంపైర్లు ఇదివరకే రంగంలోకి వచ్చారు. వారి వరుసలో చేరింది జసింత కల్యాణ్. ఈమె భారతదేశంలో తొలి మహిళా పిచ్ క్యూరేటర్. 1980ల నుంచి మనదేశంలో పిచ్ క్యూరేటర్లు 1980 వరకూ లేరు. స్టేడియంలో గడ్డి పెంచే మాలీలే పిచ్‌ను కూడా తయారు చేసేవారు, తెలిసినంతలో చూసుకునేవారు. కాని వాన పడితే పిచ్‌ను తడవడానికి వదిలేయడం, స్టంప్స్ వదిలేసి పోవడం జరిగేది. దానివల్ల మ్యాచ్ కొనసాగే సమయంలో పిచ్ అనూహ్యంగా మారేది. అలా కాకుండా స్టేడియంలోని మట్టిని బట్టి, రుతువులను బట్టి, ఆట సమయానికి పిచ్‌ను శాస్త్రీయంగా తయారు చేసేందుకు ‘పిచ్ క్యూరేటర్లు’ రంగం మీదకు వచ్చారు. వీరు పిచ్‌ను తీర్చిదిద్దుతారు. రకరకాల వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడి పిచ్‌ను ఎప్పుడూ ఆటకు వీలుగా ఉంచుతారు. అయితే ఈ నలభై ఏళ్ల నుంచి కూడా పురుషులే పిచ్ క్యూరేటర్లుగా ఉన్నారు. ఒక స్టేడియంలోని పిచ్‌లను స్త్రీలకు అప్పజెప్పడం ఎప్పుడూ లేదు. మొదటిసారి అలా బాధ్యత తీసుకున్న మహిళ జసింత కల్యాణ్. బెంగళూరులో జసింత బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న డబ్ల్యూపీఎల్ కోసం పిచ్‌ను తయారు చేసే బాధ్యతను అందుకున్నారు జసింత కల్యాణ్. బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరొబెలె అనే ఊరిలో జన్మించిన జసింత తండ్రి వరి రైతు. చిన్నప్పుడు ఆర్థిక కష్టాలు పడిన జసింత బెంగళూరు చేరుకుని ‘కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్’లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్‌గా ప్రమోట్ అయ్యింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆమె ఆఫీసు ఉన్నా మ్యాచ్‌లు చూసేది కాదు. సిక్సర్లు, ఫోర్లు వినిపిస్తే తప్ప. అయితే ఆమెకు స్టేడియంలోని పచ్చగడ్డి అంటే ఇష్టం. అది గమనించిన అసోసియేషన్ సెక్రటరీ బ్రిజేష్ 2014లో స్టేడియంలో పని చేసే మాలీలపై అజమాయిషీని అప్పజెప్పాడు. ఆ తర్వాత ఆ స్టేడియంకు చెందిన పిచ్ క్యూరేటర్ ప్రశాంత్ రావు ఆమెకు పిచ్‌లు తయారు చేయడంలో మెళకువలు నేర్పాడు. దాంతో ఆమె పూర్తిగా అనుభవం గడించింది. ఆ అనుభవం నేడు ఆమెను మన దేశ తొలి మహిళా పిచ్ క్యూరేటర్‌గా నిలిపింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్‌లను ఆమె అజమాయిషీ చేస్తోంది. క్యూరేటర్‌గా జసింత నియామకం గురించి తెలిశాక క్రికెట్ రంగం నుంచి, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుంటే బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతూ పోస్ట్ చేశారు. తన పనితీరుకు మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తారు. -
ముంబైకి వారియర్స్ చెక్!
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను యూపీ వారియర్స్ నిలువరించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చేసింది. దీంతో 7 వికెట్లతో గెలిచిన వారియర్స్ ఈ సీజన్లో బోణీకొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (47 బంతుల్లో 55; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించింది. మరో ఓపెనర్ యస్తిక భాటియా (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించింది. కెపె్టన్ నట్సీవర్ బ్రంట్ (19; 2 ఫోర్లు), అమెలియా కెర్ (23; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయారు. అనంతరం యూపీ వారియర్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు కిరణ్ నవ్‌గిరే, కెపె్టన్ అలిసా హీలీ (29 బంతుల్లో 33; 5 ఫోర్లు) చెలరేగారు. ఇద్దరు తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 94 పరుగులు జోడించి గెలిచేందుకు అవసరమైన పునాదిని మెరుపు వేగంతో వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో కిరణ్‌తో పాటు తాహ్లియా మెక్‌గ్రాత్ (1), కెపె్టన్ హీలీ నిష్క్రమించారు. కానీ తర్వాత వచ్చిన గ్రేస్ హారిస్ (17 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), దీప్తిశర్మ (20 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు. -
అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్ అందుకున్న ఆర్సీబీ ప్లేయర్
మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 27) మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆర్సీబీ ప్లేయర్, టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి "Will You Marry Me Shreyanka" (నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయాంక) అని రాసి ఉన్న ప్లకార్డ్‌ను ప్రదర్శించాడు. ఆ ప్లకార్డ్‌పై హార్ట్ సింబల్‌తో పాటు అతని పేరు కన్నడలో రాసి ఉంది. ఈ సీన్ లైవ్‌లోకి రాగానే డగౌట్లో ఉన్న ఆర్సీబీ ప్లేయర్లు నవ్వుకున్నారు. క్రీడా ప్రాంగణాల్లో ఇలా జరగడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో క్రీడాకారులు ఇలాంటి ప్రపోజల్స్ అందుకున్నారు. గతంలో మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ అందుకున్న పెళ్లి ప్రపోజల్ బాగా హైలైట్ అయ్యింది. Marriage proposal for Shreyanka Patil and RCB’s players laughing in the dressing room. pic.twitter.com/yoY4e5zfxK — CricketMAN2 (@ImTanujSingh) February 27, 2024 బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల శ్రేయాంక (రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్) ఆర్సీబీతో పాటు కర్ణాటక, టీమిండియా, గయానా అమెజాన్ వారియర్స్‌కు (కరీబియన్ ప్రీమియర్ లీగ్) ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ అమ్మాయి టీమిండియా తరఫున 2 వన్డేలు (4 వికెట్లు), 6 టీ20లు (8 వికెట్లు) ఆడింది. కాగా, గుజరాత్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేయగా.. ఆర్సీబీ కేవలం 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రేణుకా సింగ్ (4-0-14-2), మోలినెక్స్ (4-0-25-3), స్మృతి మంధన (43), సబ్బినేని మేఘన (36 నాటౌట్), ఎల్లిస్ పెర్రీ (23 నాటౌట్) ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. -
బెంగళూరు ధనాధన్...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ధనాధన్ ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. 7.3 ఓవర్లు మిగిలుండగానే స్మృతి మంధాన బృందం లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసింది. ఓపెనర్ హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (2/14) స్వింగ్ బౌలింగ్‌కు మేటి బ్యాటర్లు బెత్ మూనీ (8), లిచ్‌ఫీల్డ్ (5) తలవంచారు. వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7)లు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ (3/25) గుజరాత్‌ను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఆర్సీబీ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని బెంగళూరు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగింది. సహచర ఓపెనర్ సోఫీ డివైన్ (6) ఆరంభంలోనే నిష్క్రమించినా... వన్‌డౌన్ బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (28 బంతుల్లో 36 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి చకాచకా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తనూజ (1/20) స్మృతి వేగానికి కళ్లెం వేసింది. అయితే మేఘన, ఎలీస్ పెరీ (14 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) మరో వికెట్ పడకుండా తమ కెపె్టన్లాగే ధనాధన్ ఆటతీరును కొనసాగించారు. దాంతో 13వ ఓవర్ పూర్తికాకముందే బెంగళూరు విజయతీరాలకు చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అరుంధతికి జరిమానా
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అరుంధతి రెడ్డి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. సోమవారం యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్ బ్యాటర్ పూనమ్ వికెట్ తీసిన సంబరంలో అరంధతి అతిగా స్పందించింది. ఆ బ్యాటర్‌ను గేలి చేసేలా అనుచితంగా ప్రవర్తించింది. దీనిపై సమీక్షించిన మ్యాచ్ రిఫరీ వర్ష నాగ్రే డబ్ల్యూపీఎల్ నియమావళి ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాగా విధించింది. ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి లీగ్‌లో బోణీ కొట్టింది. -
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. తేలిపోయిన గుజరాత్ బ్యాటర్లు
మహిళల ఐపీఎల్ (WPL) 2024 ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గుజరాత్ జెయింట్స్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. ఆర్సీబీ బౌలర్లు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ (4-0-14-2), సోఫీ మోలినెక్స్ (4-0-25-3), జార్జియా వేర్హమ్ (3-0-20-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీశారు. వికెట్లు తీయలేకపోయినా సోఫీ డివైన్ (4-0-12-0), ఆశా శోభన (3-0-13-0) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో దయాలన్ హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), స్నేహ్ రాణా (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బెత్ మూనీ (8), లిచ్‌ఫీల్డ్ (5), వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7), కేథరీన్ బ్రైస్ (3) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లుకు ఇది రెండో మ్యాచ్. తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ.. యూపీ వారియర్జ్‌ను ఓడించి బోణీ కొట్టగా.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన గుజరాత్ బోణీ విజయం కోసం ఎదురు చూస్తుంది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ, ఆర్సీబీ, గుజరాత్, యూపీ వరస స్థానాల్లో ఉన్నాయి. -
ముంబై ఇండియన్స్‌కు రెండో విజయం
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్–2)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ముంబై 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. మొదట గుజరాత్ మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. తనూజ (21 బంతుల్లో 28; 4 ఫోర్లు), కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు), క్యాథ్రిన్ బ్రిస్ (24 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ముంబై బౌలర్లు అమెలియా కెర్ (4/17), షబ్నమ్ (3/18) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు యస్తిక భాటియా (7), హేలీ మాథ్యూస్ (7) నిరాశపరచగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించింది. హర్మన్, అమెలియా కెర్ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. గుజరాత్ బౌలర్లలో తనూజ 2, బ్రిస్, లి తహుహు చెరో వికెట్ తీశారు. నేడు జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
ముంబై బౌలర్ల విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైన గుజరాత్
మహిళల ఐపీఎల్ (WPL) 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 25) ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ముంబై బౌలర్లు అమేలియా కెర్ (4-0-17-4), షబ్నిమ్ ఇస్మాయిల్ (4-0-18-3) అద్భుత ప్రదర్శనలతో గుజరాత్ పతనాన్ని శాశించారు. నాట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. అమేలియా కెర్ ఆఖర్ ఓవర్లో 2 వికెట్లు తీసి గుజరాత్‌ను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేసింది. తనుజా కన్వర్ (28) ఆఖర్లో బ్యాట్ ఝులిపించకపోయుంటే గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో కేథరీన్ బ్రైస్ (25 నాటౌట్), కెప్టెన్ బెత్ మూనీ ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. వేద కృష్ణమూర్తి (0), హర్లీన్ డియోల్ (8), లిచ్‌ఫీల్డ్ (7), దయాలన్ హేమలత (3), ఆష్లే గార్డ్నర్ (15), స్నేహ్ రాణా (0), లియా తహుహు (0) విఫలమయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో గుజరాత్‌కు ఇది తొలి మ్యాచ్ కాగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధించి, ఖాతా తెరిచింది. -
బెంగళూరును గెలిపించిన శోభన
బెంగళూరు: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా శోభన ఆశ (5/22) నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయం దిశగా వెళుతున్న యూపీ వారియర్స్‌ను శోభన తన అద్భుత బౌలింగ్‌తో బ్రేక్ వేసింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో యూపీని ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రిచా ఘోష్ (37 బంతుల్లో 62; 12 ఫోర్లు), సబ్బినేని మేఘన (44 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. కెపె్టన్ స్మృతి మంధాన (13), సోఫీ డివైన్ (1), ఎలైస్ పెరీ (8) విఫలమయ్యారు. యూపీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు 42 పరుగులే చేయగలిగింది. అనంతరం యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్వేత సెహ్రావత్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో 16 ఓవర్లు ముగిసే సరికి యూపీ స్కోరు 126/3. గెలుపు కోసం 24 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితి. అయితే శోభన జోరుకు 17వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి జట్టు తడబాటుకు గురైంది. తర్వాతి 2 ఓవర్లలో 19 పరుగులు రాబట్టి గెలుపుపై యూపీ ఆశలు పెంచుకుంది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, తొలి 5 బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ తరహాలోనే ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం కాగా...దీప్తి శర్మ 2 పరుగులే తీయగలిగింది. -
మంధాన క్రేజ్.. తెలుగమ్మాయి ఫిఫ్టీ.. రిచా ధనాధన్ ఇన్నింగ్స్
WPL 2024- RCBW Vs UPW: మహిళల ప్రీమియర్ లీగ్-2024 ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో తలపడుతోంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్ సోఫీ డివైన్(1) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన.. వన్‌డౌన్ బ్యాటర్, తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. Captain Smriti Mandhana on fire. 🔥pic.twitter.com/vfvhMozwsk — Mufaddal Vohra (@mufaddal_vohra) February 24, 2024 ఈ నేపథ్యంలో రెండో ఓవర్ మూడు, నాలుగో బంతుల్లో వరుసగా సిక్సర్, ఫోర్‌తో చెలరేగింది. కానీ.. మంధాన మెరుపులు కాసేపటికే మాయమయ్యాయి. ఆరో ఓవర్ తొలి బంతికే మెగ్రాత్ బౌలింగ్‌లో వ్రిందా దినేశ్‌కు క్యాచ్ ఇచ్చి స్మృతి మంధాన 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించింది. ఆమె తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఎలిస్ పెర్రీ(8) కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరింది. ఈ క్రమంలో సబ్బినేని మేఘన, వికెట్ కీపర్ రిచా ఘోష్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మేఘన 44 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. Brilliant half-century for Sabbhineni Meghana in front of a massive crowd! Can she power @RCBTweets to a match-winning total? Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/geoj3JWH61 — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024 Richa Gosh reaches her maiden FIFTY for #RCB 💪🔥 Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/9QtU8s27Hk — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024 ఇలా మేఘన జట్టుకు అవసరమైన సమయంలో అర్ధ శతకం బాదితే.. రిచా ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. 37 బంతుల్లోనే 12 ఫోర్ల సాయంతో 62 రన్స్ చేసింది. మిగతా వాళ్లలో జార్జియా వరేహం డకౌట్ కాగా.. సోఫీ మొలినెక్స్ 9, శ్రెయాంక పాటిల్ 8 పరుగులతో అజేయంగా నిలిచారు. స్మృతి రాగానే హోరెత్తిన చిన్నస్వామి స్టేడియం ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ మహిళా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. యూపీ వారియర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్ హ్యారిస్, తహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. టాస్ సమయంలో స్మృతి మంధాన రాగానే చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. అదే విధంగా ఆమె బ్యాట్ ఝులించినప్పుడు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. Smriti Mandhana was impressed with Home Crowd 😂❤️ ❤️#RCB pic.twitter.com/4vbwccmhDG — RCB Xtra. (@Rcb_Xtra) February 24, 2024 -
తండ్రి రిక్షా డ్రైవర్.. కూతురేమో మ్యాచ్ ఫినిషర్! ఎవరీ సజనా?
మహిళల ప్రీమియర్ లీగ్-2024 సీజన్ తొలి మ్యాచే అభిమానులకు అసలైన టీ20 క్రికెట్ మజాను అందించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించిన ఈ మ్యాచ్‌లో సజీవన్ సజన ఆఖరి బంతికి సిక్స్ కొట్టి ముంబైను గెలిపించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 160 పరుగుల చేసింది. ఈ క్రమంలో ముంబై విజయానికి ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో ఢిల్లీ కెప్టెన్ లానింగ్ చివరి ఓవర్ వేసే బాధ్యతను ఆఫ్ స్పిన్నర్ క్యాప్సీకి అప్పగించింది. చివరి ఓవర్ వేసిన క్యాప్సీ తొలి బంతికే పూజావస్త్రాకర్‌ను పెవిలియన్‌కు పంపంది. దీంతో ముంబై విజయసమీకరణం చివరి 5 బంతుల్లో 12 పరుగులగా మారింది. ఈ క్రమంలో రెండు బంతికి రెండు పరుగులు రాగా.. మూడో బంతికి అమన్‌జోత్ కౌర్ సింగిల్ తీసి హార్మన్ ప్రీత్ కౌర్‌కు స్ట్రైక్ ఇచ్చంది. నాలుగో బంతిని హర్మన్ ఫోర్ కొట్టి లక్ష్యాన్ని 5 పరుగులకు తగ్గించింది. అయితే అనుహ్యంగా ఐదో బంతికి కౌర్ ఔటైంది. దీంతో ఆఖరి బంతికి ముంబై విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సజీవన్ సజన సిక్స్ కొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. దీంతో ఎవరీ సజీవన్ సజన అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ సజనా? 28 ఏళ్ల సజీవన్ సజన కేరళ వాయనాడ్‌లోని మనంతవాడి అనే కుగ్రామంలో జన్మించింది. కురిచియా అనే గిరిజన తెగకు చెందిన సజనకు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ. ఆమె తండ్రి ఒక రిక్షా డ్రైవర్. సజన ఈ స్ధాయికి ఎదగడంలో తన తండ్రిది కీలక పాత్ర. ఓ వైపు తను శ్రమిస్తూనే తన కూమర్తె క్రికెట్ వైపు అడుగులు వేయడంలో దోహదపడ్డాడు. ఇక సజనా దేశీవాళీ క్రికెట్లో కేరళ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. అదే విధంగా సౌత్ జోన్, ఇండియా-ఏ జట్ల తరపున కూడా ఆమె ఆడింది. కాగా డబ్ల్యూపీఎల్ తొట్టతొలి వేలంలో పాల్గోన్న సజనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. కానీ డబ్ల్యూపీఎల్-2024 వేలంలో ముంబై ఇండియన్స్ రూపంలో ఆమెను అదృష్టం వరించింది. రూ. 10 లక్ష్లల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన సజనను రూ.15 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. మరోవైపు కురిచియా తెగ నుంచి డబ్ల్యూపీఎల్‌లో భాగమైన రెండో క్రికెటర్‌గా సజన నిలిచింది. సజన కంటే ముందు అదే తెగకు చెందిన మిన్ను మణి డబ్ల్యూపీఎల్-2023లో భాగమైంది. 𝙐𝙉𝘽𝙀𝙇𝙄𝙀𝙑𝘼𝘽𝙇𝙀! 5 off 1 needed and S Sajana seals the game with a MAXIMUM very first ball🤯💥 A final-over thriller in the very first game of #TATAWPL Season 1 🤩🔥 Scorecard 💻📱 https://t.co/GYk8lnVpA8#TATAWPL | #MIvDC pic.twitter.com/Lb6WUzeya0 — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 -
హైదరాబాదీ వెటరన్ స్పిన్నర్ రీ ఎంట్రీ.. 10 ఏళ్ల తర్వాత
అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఒక ప్లేయర్‌ను క్రీడా ప్రపంచం, అభిమానులు గుర్తుంచుకోవడం దాదాపు అసాధ్యం... ఇక మహిళా క్రికెటర్లకు మన వద్ద దక్కే గుర్తింపును బట్టి చూస్తే ఇంకా కష్టం... స్వయంగా ఆ ప్లేయరే ఆటను మరచిపోయి ఇక తన పని ముగిసినట్లే భావించి అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు... కానీ 10 సంవత్సరాల విరామం తర్వాత కూడా ఒక పెద్ద టోర్నీలో మళ్లీ తెరపైకి రావచ్చని ఒక ప్లేయర్ నిరూపించింది. ఆమె పేరే గౌహర్ సుల్తానా. హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్. 2014లో భారత్‌కు ఆఖరిసారిగా ప్రాతినిధ్యం వహించిన గౌహర్ ఇప్పుడు 2024 డబ్ల్యూపీఎల్‌లో మళ్లీ కనిపించబోతోంది. వేలంలో యూపీ వారియర్స్ జట్టు సొంతం చేసుకున్న గౌహర్ 36 ఏళ్ల వయసులో తనలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని నిరూపించేందుకు సిద్ధమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తాజా సీజన్లో ఆడుతున్న వారిలో 2010కు ముందు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ప్లేయర్లు ఇద్దరే ఉన్నారు. 2009లో హర్మన్‌ప్రీత్ కౌర్ తన తొలి మ్యాచ్ ఆడితే అంతకుముందు ఏడాదే 2008లో గౌహర్ సుల్తానా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2008 నుంచి 2014 మధ్యలో గౌహర్ భారత్ తరఫున 50 వన్డేలు, 37 టి20లు ఆడి మొత్తం 95 వికెట్లు పడగొట్టింది. చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఆరేళ్ల కాలంలో వన్డేల్లో భారత బెస్ట్ బౌలర్‌గా (66 వికెట్లు) కొనసాగింది. రెండు వన్డే ప్రపంచకప్‌లలో ఆడింది కూడా. తన చివరి 2 వన్డేల్లో నాలుగేసి వికెట్లు చొప్పున తీసినా అనూహ్యంగా ఆమెపై సెలక్టర్లు వేటు వేశారు. అప్పుడు గౌహర్ వయసు 26 ఏళ్లు. కారణాలేమిటో తెలియకపోయినా మళ్లీ భార త జట్టు కోసం ఆమె పేరును పరిశీలించనేలేదు. సైకాలజిస్ట్ సహాయంతో... ‘సాధారణంగా భారత్‌లో మహిళా ప్లేయర్లకు 26–27 ఏళ్లు వస్తే వారిని ఇక వారి వయసు అయిపోయిందని, ఆటకు పనికి రారని భావిస్తారు. ఇక 30 తర్వాత అయితే బరువు పెరుగుతుంది. ఎవరూ పట్టించుకోరు. కానీ నా ఫిట్నెస్ విషయంలో రాజీ పడరాదని భావించాను. అందుకే చాలా కష్టపడ్డాను’ అని గౌహర్ చెప్పింది. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత ఆమె ఆగిపోలేదు. గత పదేళ్లలో దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్, పుదుచ్చేరి, బెంగాల్, రైల్వేస్ జట్లకు ఆడుతూ వచ్చింది. అయితే కొత్త అమ్మాయిలతో పోలిస్తే తాను బాగా ఆడలేక వెనుకబడిపోతున్నానని భావించి తనపై తనకే అనుమానం వేసింది. ఇది మానసికంగా ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. ఇలాంటి స్థితిలో మాజీ క్రికెటర్, భారత అండర్–19 జట్టు కోచ్ నూషీన్ అల్ ఖదీర్ తగిన రీతిలో అండగా నిలిచింది. భారత జట్టులో గౌహర్తో కలిసి ఆడిన నూషీన్... సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించడంతో పరిస్థితి మెరుగైంది. పట్టుదలగా నిలిచి... గౌహర్ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రోజులతో పోలిస్తే మహిళా క్రికెట్ ఎంతో మారింది. వేగంలో, వ్యూహాల్లో, ఆదరణలో అంతా మారిపోయింది. అయితే చికిత్స తర్వాత దేశవాళీ క్రికెట్లో నిలకడగా బౌలింగ్ చేస్తుండటంతో గౌహర్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గత రెండేళ్లలో వరుసగా వికెట్లు పడగొట్టడంలో కూడా సఫలమైంది. దాంతో 2023 డబ్ల్యూపీఎల్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకుంది. కానీ సహజంగానే ఈతరం అమ్మాయిల గురించి ఆలోచించే ఫ్రాంచైజీలు ఆమెను పట్టించుకోలేదు. ఈసారి కూడా సందేహంగానే అనిపించింది. కానీ ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. 36 ఏళ్ల వయసులో తాను పోటీ క్రికెట్ ఆడగలనని నమ్మకం వల్లే ఈ పునరాగమనం సాధ్యమైంది. 30 ఏళ్లు దాటిన తర్వాత ఒక సీనియర్ ప్లేయర్ ఎన్నో ప్రతికూలతలను దాటి దేశవాళీ క్రికెట్‌ను నమ్ముకొని ముందుకు సాగడం అసాధారణం. గత పదేళ్లు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు గౌహర్ వేసే ప్రతీ బంతిపై అందరి దృష్టీ ఉంటుంది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె అదృష్టం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. - సాక్షి క్రీడా విభాగం -
ముంబై ఇండియన్స్ శుభారంభం
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌ను డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయంతో మొదలు పెట్టింది. గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలైస్ క్యాప్సీ (53 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగగా... జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్మెగ్ లానింగ్ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సివర్ బ్రంట్, అమేలియా కెర్ చెరో 2 వికెట్లు పడగొట్టగా... తొలిసారి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడిన దక్షిణాఫ్రికా పేసర్ షబ్నమ్ ఇస్మాయిల్ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. యస్తిక భాటియా (45 బంతుల్లో 57; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్హర్మన్ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. ఆఖరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి. 4 బంతుల్లో 7 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి హర్మన్ అవుటైనా...చివరి బంతి ముంబై విజయానికి 5 పరుగులు అవసరంకాగా.. సజన సిక్సర్‌గా మలిచి ముంబైను గెలిపించింది. క్యాప్సీ అర్ధసెంచరీ... షఫాలీ వర్మ (1) ఆరంభంలోనే వెనుదిరగ్గా... లానింగ్, జెమీమాలతో రెండు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి క్యాప్సీ జట్టును ఆదుకుంది. 10 ఓవర్లలో జట్టు 65 పరుగులు చేయగా లానింగ్‌ను బ్రంట్ అవుట్ చేయడంతో 64 పరుగుల (51 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం హేలీ మాథ్యూస్ ఓవర్లలో 2 సిక్స్‌లు, ఫోర్ బాదిన క్యాప్సీ 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. క్యాప్సీతో పాటు క్రీజ్‌లో ఉన్నంత సేపు జెమీమా దూకుడుగా ఆడటంతో మూడో వికెట్‌కు 40 బంతుల్లోనే 74 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా...కెర్ వేసిన చివరి ఓవర్లో 3 ఫోర్లు కొట్టి మరిజాన్ కాప్ (16 నాటౌట్) కీలక పరుగులు జోడించింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో రెండో బంతికే హేలీ మాథ్యూస్ (0) అవుట్ కాగా, అయితే కాప్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో సివర్ బ్రంట్ (19) ధాటిని ప్రదర్శించింది. మరో ఎండ్‌లో యస్తిక చక్కటి ఇన్నింగ్స్‌కు హర్మన్ అండగా నిలిచింది. శిఖా పాండే ఓవర్లో యస్తిక కొట్టిన 2 ఫోర్లు, 2 సిక్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. రాధ బౌలింగ్‌తో భారీ సిక్స్‌తో 35 బంతుల్లో యస్తిక హాఫ్ సెంచరీని అందుకుంది. యస్తిక, హర్మన్ రెండో వికెట్‌కు 56 పరుగులు జత చేసిన తర్వాత అరుంధతి ఈ జోడీని విడదీసింది. అయితే హర్మన్, అమేలియా కెర్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు) దూకుడైన భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. చివర్లో కొంత ఉత్కంఠ ఎదురైనా...ముంబై గెలుపు తీరం చేరింది. ఆటా మాటా... తొలి మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ స్టార్ల ప్రదర్శనతో డబ్ల్యూపీఎల్ అట్టహాసంగా మొదలైంది. కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా వేర్వేరు పాటలకు డ్యాన్స్‌లు చేసి అలరించారు. అనంతరం షారుఖ్ ఖాన్ ఐదుగురు కెపె్టన్లను పరిచయం చేయగా... వారంతా ప్రత్యేక రథాల్లో వేదిక వద్దకు వచ్చి ట్రోఫీని ఆవిష్కరించారు. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహిళల ఐపీఎల్.. సందడి చేసిన షారుక్ ఖాన్
మహిళల ఐపీఎల్ (WPL) 2024 సీజన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 23) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుక్ ఖాన్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్ర, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్ సందడి చేశారు. SOUND ON 😍 𝙎𝙝𝙖𝙝 𝙍𝙪𝙠𝙝 𝙆𝙝𝙖𝙣 👑 showcases his aura at the #TATAWPL Opening Ceremony 🤩🤩@iamsrk pic.twitter.com/WLjSmCxVXL — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 వీరిలో షారుక్ ఖాన్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. షారుక్ ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్లతో కలియదిరుగుతూ వారితో స్పెప్పులు వేయించి ఫోటోలకు పోజులిచ్చాడు. Bengaluru erupts with joy to welcome Shahid Kapoor to the #TATAWPL Opening Ceremony 😃🙌@shahidkapoor pic.twitter.com/C2LckHvV2D — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 మిగతా హీరోలు ఒక్కో ఫ్రాంచైజీ తరఫున ఆడి, పాడారు. కార్తీక్ ఆర్యన్ గుజరాత్ జెయింట్స్‌ను, సిద్ధార్థ్ మల్హోత్రా ఢిల్లీ క్యాపిటల్స్‌ను, టైగర్ ష్రాఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును, వరుణ్ ధావన్ యూపీ వారియర్స్‌ను, షాహిద్ కపూర్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను రిప్రజెంట్ చేశాడు. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలైస్ క్యాప్సీ (ఇంగ్లండ్) 75 పరుగులు చేసి క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 31, షఫాలీ వర్మ 1, జెమీమా రోడ్రిగెజ్ 42, మారిజన్ కప్ 16 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ర్, నాట్ సీవర్ బ్రంట్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. షబ్నిమ్ ఇస్మాయిల్ ఓ వికెట్ దక్కించుకుంది. -
మహిళల లీగ్‌కు వేళాయె.. తొలి మ్యాచ్‌లో ముంబై వర్సెస్ ఢిల్లీ
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. గత ఏడాది తొలి సీజన్లో అభిమానులను ఆకట్టుకొని పలువురు యువ క్రికెటర్లను వెలుగులోకి తెచ్చిన ఈ లీగ్ మరోసారి అదే స్థాయిలో ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ లో గత సీజన్ విజేత ముంబై ఇండియన్స్‌తో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. మిగతా మూడు జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియల్స్, గుజరాత్ జెయింట్స్ కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మార్చి 17న ఢిల్లీ వేదికగా ఫైనల్ జరుగుతుంది. తాజా సీజన్ విశేషాలు.... ♦ గత సీజన్లో ఒక్క ముంబైలోనే అన్ని మ్యాచ్ లు జరిగాయి. ఈసారి బెంగళూరు, ఢిల్లీలను వేదికలుగా ఎంపిక చేశారు. ♦ తొలి సీజన్‌లాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో తలపడతాయి. ♦ గత ఏడాది ఐదు టీమ్‌లకు కెపె్టన్లుగా వ్యవహరించిన వారే ఈసారి సారథులుగా ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన మెగ్ లానింగ్ (ఢిల్లీ), అలీసా హీలీ (యూపీ), బెత్ మూనీ (గుజరాత్) ఆ్రస్టేలియన్లే కాగా...హర్మన్‌ప్రీత్ (ముంబై), స్మృతి మంధాన (బెంగళూరు) భారత స్టార్లు. భారత్ మినహా ఆసీస్ నుంచే గరిష్టంగా 13 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ♦ 2023 సీజన్లో సత్తా చాటిన సైకా ఇషాక్, శ్రేయాంక పాటిల్ ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యారు. గత ఏడాది వీరిని కనీస ధర రూ.10 లక్షలకు తీసుకోగా... రెండు సీజన్ల మధ్య భారత జట్టుకు ఆడటంతో బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరిద్దరికి రూ. 30 లక్షల చొప్పున లభిస్తాయి. ♦ ఈ సీజన్ వేలంలో కాశ్వీ గౌతమ్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ టీమ్ ఎంచుకుంది. అయితే గాయం కారణంగా ఆమె ఈ సీజన్ నుంచి అనూహ్యంగా తప్పుకోవడం గమనార్హం. ♦ హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి 8 మంది ఈసారి డబ్ల్యూపీఎల్‌లో బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ ప్లేయర్లు అరుంధతి రెడ్డి (ఢిల్లీ), త్రిష పూజిత (గుజరాత్), యషశ్రీ, గౌహర్ సుల్తానా (యూపీ) జట్లకు... ఆంధ్ర క్రికెటర్లు స్నేహ దీప్తి (ఢిల్లీ), సబ్బినేని మేఘన (బెంగళూరు), షబ్నమ్ (గుజరాత్), అంజలి శర్వాణి (యూపీ) టీమ్‌ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. -
కోహ్లికి షాకిచ్చిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్..!
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వాట్.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి షాకిచ్చింది. కోహ్లి గతంలో గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోహ్లి బ్యాట్‌పై భారీ అంచనాలు ఉండినప్పటికీ.. దాన్ని కేవలం రెండు సార్లు మాత్రమే వినియోగించానని పేర్కొంది. మహిళల ఐపీఎల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన వాట్ కోహ్లి గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. మహిళల ఐపీఎల్లో యూపీ వారియర్జ్‌కు ఆడుతున్న ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్.. గతంలో కోహ్లిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. 2014లో ఆమె బహిరంగంగానే కోహ్లికి మ్యారేజ్ ప్రపోజల్ పంపింది. నాటి ట్విటర్లో ఆమె.. కోహ్లి మ్యారీ మీ అంటూ పోస్ట్ చేసింది. ద క్వింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్ మరిన్ని ముచ్చట్లను కూడా షేర్ చేసుకుంది. తన ఫేవరెట్ పిచ్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియమని.. ఫేవరెట్ అపోజిషన్ భారత్ అని.. ఫేవరెట్ ఫుడ్ బటర్ చికెన్, మసాలా ఛాయ్ అని పేర్కొంది. కాగా, డానీ వాట్ ఇంగ్లండ్ తరఫున 2 టెస్ట్‌లు, 105 వన్డేలు, 151 టీ20లు ఆడి 4600కు పైగా పరుగులు చేసి 73 వికెట్లు పడగొట్టింది. ఈమె ఖాతాలో 4 సెంచరీలు, 19 అర్దసెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల కిందట (ఫిబ్రవరి 15న) విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఈ బిడ్డకు విరుష్క దంపతులు అకాయ్ అని నామకరణం చేశారు. అకాయ్‌కు ముందు కోహ్లి దంపతులకు కుమార్తె పుట్టింది. ఆమెకు వామిక అని నామకరణం చేశారు. మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్ రేపటి నుంచి (ఫిబ్రవరి 23) ప్రారంభంకానుంది. -
మరో మూడు రోజుల్లో టోర్నీ షురూ.. ఆర్సీబీకి ఊహించని షాక్
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 23న బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ లీగ్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు గుజరాత్ జెయింట్స్ జట్లకు ఊహించని షాక్‌లు తగిలాయి. ఆర్సీబీ ఆల్ రౌండర్ కనిక అహుజా, గుజరాత్ జెయింట్స్ పేసర్ కాశ్వీ గౌతమ్‌లు డబ్ల్యూపీఎల్-2024 సీజన్ నుంచి తప్పుకున్నారు. గాయాల కారణంగా వీరిద్దరూ ఈ ఏడాది సీజన్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో కనిక స్ధానాన్ని లెఫ్టార్మ్ పేసర్ శ్రద్ధా పోఖర్కర్‌తో ఆర్సీబీ భర్తీ చేసింది. శ్రద్ధాకు దేశీవాళీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. ఆమె రూ. 10 లక్షల కనీస ధరతో ఆర్సీబీలో చేరనుంది. మరోవైపు కాశ్వీ గౌతమ్ స్ధానాన్ని సయాలీ సతగరెతో గుజరాత్ జెయింట్స్ భర్తీ చేసింది. సయాలీతో రూ.10 లక్షల కనీస ధరకు గుజరాత్ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా డబ్ల్యూపీఎల్-2024 వేలంలో కాశ్వీని రూ.2 కోట్ల భారీ ధరకు గుజరాత్ సొంతం చేసుకుంది.