అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహిళల ఐపీఎల్‌.. సందడి చేసిన షారుక్‌ ఖాన్‌ | WPL 2024: Delhi Capitals Set 172 Runs Target For Mumbai Indians | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహిళల ఐపీఎల్‌.. సందడి చేసిన షారుక్‌ ఖాన్‌

Published Fri, Feb 23 2024 9:35 PM | Last Updated on Sat, Feb 24 2024 9:35 AM

WPL 2024: Delhi Capitals Set 172 Runs Target For Mumbai Indians - Sakshi

మహిళల ఐపీఎల్‌ (WPL) 2024 సీజన్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 23) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లీగ్‌ ఆరంభ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ షారుక్‌ ఖాన్‌, కార్తీక్‌ ఆర్యన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర, షాహిద్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, టైగర్‌ ష్రాఫ్‌ సందడి చేశారు.

వీరిలో షారుక్‌ ఖాన్‌ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. షారుక్‌ ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్లతో కలియదిరుగుతూ వారితో స్పెప్పులు వేయించి ఫోటోలకు పోజులిచ్చాడు. 

మిగతా హీరోలు ఒక్కో ఫ్రాంచైజీ తరఫున ఆడి, పాడారు. కార్తీక్‌ ఆర్యన్ గుజరాత్‌ జెయింట్స్‌ను, సిద్ధార్థ్‌ మల్హోత్రా ఢిల్లీ క్యాపిటల్స్‌ను, టైగర్‌ ష్రాఫ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును, వరుణ్‌ ధావన్‌ యూపీ వారియర్స్‌ను,  షాహిద్‌ కపూర్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను రిప్రజెంట్ చేశాడు. 

ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలైస్‌ క్యాప్సీ (ఇంగ్లండ్‌) 75 పరుగులు చేసి క్యాపిటల్స్‌ భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడింది. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మెగ్‌ లాన్నింగ్‌ 31, షఫాలీ వర్మ 1, జెమీమా రోడ్రిగెజ్‌ 42, మారిజన్‌ కప్‌ 16 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ర్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ ఓ వికెట్‌ దక్కించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement