రెచ్చిపోయిన రోడ్రిగెజ్‌.. విరుచుకుపడిన లాన్నింగ్‌  | WPL 2024: Jemimah Rodrigues And Meg Lanning Slams Blasting 50s, Delhi Capitals Score 192 For 4 Against Mumbai Indians | Sakshi
Sakshi News home page

WPL 2024: రెచ్చిపోయిన రోడ్రిగెజ్‌.. విరుచుకుపడిన లాన్నింగ్‌ 

Published Tue, Mar 5 2024 9:24 PM | Last Updated on Wed, Mar 6 2024 9:09 AM

WPL 2024: Jemimah Rodrigues And Meg Lanning Slams Blasting 50s, Delhi Capitals Score 192 For 4 Against Mumbai Indians - Sakshi

మహిళల ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ ​మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 

తొలుత ఓపెనర్లు షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మెగ్‌ లాన్నింగ్‌ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు షాట్లతో విరుచుకుపడగా.. ఆతర్వాత బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగెజ్‌ (33 బంతుల్లో 69 నాటౌట్‌; 8 ఫోర్లు, 3  సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ ఆవలికి తరలించింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అలైస్‌ క్యాప్సీ (20 బంతుల్లో 19; 3 ఫోర్లు), మారిజన్‌ కప్‌ (12 బంతుల్లో 11; ఫోర్‌) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. జెస్‌ జొనాస్సెన్‌ 5 బంతుల్లో 4 పరుగులతో అజేయంగా నిలిచింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, సైకా ఇషాఖీ, పూజా వస్త్రాకర్‌, హేలీ మాథ్యూస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement