Meg Lanning
-
డబ్ల్యూపీఎల్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..!
క్రికెట్ గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలను చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్చికం అనే మాట చిన్నబోతుంది. అంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఈ గణాంకాలు.వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్).. తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 17న జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ సైతం తడబడినా మరో మూడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరగలిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయరైన (టీ20 ఫార్మాట్లో భారత కెప్టెన్) స్మృతి మంధన నేతృత్వంలో ఆర్సీబీ తొలి సారి టైటిల్ కైవసం చేసుకుంది.ఐపీఎల్ 2024 ఫైనల్లోనూ అలాగే..నిన్న జరిగిన పురుషుల ఐపీఎల్ ఫైనల్లోనూ కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్లు ఇలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) పాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహిళల ఐపీఎల్‌లోనూ ఇలాగే ఆసీస్ కెప్టెన్ (మెగ్ లాన్నింగ్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ ఫైనల్లో కమిన్స్ ప్రత్యర్ది భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్డెన్ (ఢిల్లీ కెప్టెన్) ప్రత్యర్ది భారత ప్లేయరే (మంధన).2024 WPL Final:- Aussie Captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian captain's team won by 8 wickets.IPL 2024 Final:- Aussie captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian… pic.twitter.com/jH07ZzmAEO— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024ఐపీఎల్ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ టాస్ గెలిచిన ఢిల్లీ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్లో భారత ప్లేయర్ అయిన శ్రేయస్.. ఆసీస్ కెప్టెన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీని భారత ప్లేయర్ సారథ్యంలోని ఆర్సీబీ అదే 8 వికెట్ల తేడాతోనే ఓడగొట్టింది. ఇన్ని విషయాల్లో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్, ఐపీఎల్‌కు పోలికలు ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఫైనల్లో ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కెప్టెన్! వీడియో వైరల్
డబ్ల్యూపీఎల్ ట్రోఫీని తొలిసారి ముద్దాడాలని కలలలు గన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. దీంతో వరుసగా రెండో సారి టైటిల్‌కు అడుగు దూరంలో ఢిల్లీ నిలిచిపోయింది. గతేడాది కూడా ఢిల్లీ తుది పోరులోనే ఓటమి పాలైంది. ఇప్పుడు మరోసారి టైటిల్ చేజారడంతో ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ కన్నీటిపర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీరును ఆమె ఆపుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది లానింగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఫైనల్లో ఓడినప్పటికీ లీగ్ మొత్తం బాగా ఆడారు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం ఆమెకు సపోర్ట్‌గా నిలిచింది. ఎప్పుడూ నీవు మా రానివే అంటూ లానింగ్ ఫోటోను ఢిల్లీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Meg Lanning 💔 Chin up, champ 🐐 📸 - JioCinema#WPLFinal #WPL2024 pic.twitter.com/FzvlbN2nVe — shreya (@shreyab27) March 17, 2024 -
రెచ్చిపోయిన రోడ్రిగెజ్.. విరుచుకుపడిన లాన్నింగ్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్లు షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు షాట్లతో విరుచుకుపడగా.. ఆతర్వాత బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగెజ్ (33 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ ఆవలికి తరలించింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అలైస్ క్యాప్సీ (20 బంతుల్లో 19; 3 ఫోర్లు), మారిజన్ కప్ (12 బంతుల్లో 11; ఫోర్) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. జెస్ జొనాస్సెన్ 5 బంతుల్లో 4 పరుగులతో అజేయంగా నిలిచింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, పూజా వస్త్రాకర్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. -
మెగ్ లానింగ్ గుడ్‌బై
మెల్బోర్న్: మహిళల క్రికెట్‌కే మకుటం లేని మహారాణి మెగ్ లానింగ్. ఆటతో, సారథ్య నైపుణ్యంతో ఆ్రస్టేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ విజయవంతమైన సారథి, 13 ఏళ్ల ఫలప్రదమైన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఆ్రస్టేలియా అమ్మాయిల క్రికెట్లో ఎవర్గ్రీన్ ‘మెగాస్టార్’గా కెపె్టన్ లానింగ్‌కు పెట్టింది పేరు. 31 ఏళ్ల వన్నె తగ్గని ఈ క్రికెటర్ తన ప్రతిభా పాటవాలతో ఏకంగా ఏడు ప్రపంచకప్‌లలో భాగమైంది. ఇందులో ఐదు టైటిల్స్ ఆమె కెప్టెన్సీలోనే వచ్చాయి. గతేడాది లానింగ్ సారథ్యంలో ఆసీస్ మహిళల జట్టు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన టి20 ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలిపాక మళ్లీ ఆమె బరిలోకి దిగలేదు. ఆరోగ్య సమస్యలతో ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటలనకు దూరంగా ఉంది. ఇలా అరంగేట్రం: జన్మతః సింగపూర్ అమ్మాయి అయిన మెగ్... న్యూజిలాండ్‌తో 2010లో జరిగిన టి20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కెరీర్ లో ఆఖరి మ్యాచ్ కూడా ఈ ఫార్మాట్లోనే ఆడింది. అలా సంచలనం: పిన్న వయసు (21 ఏళ్లు)లోనే కెప్టెన్ అయిన ‘ఆసీస్ యంగెస్ట్ క్రికెటర్’. ఒకే ఒక్క వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు (1232) చేసిన కెపె్టన్‌గా ఘనత. టి20ల్లో అత్యధికంగా వంద మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన తొలి కెపె్టన్‌గానూ రికార్డు. మెగ్ లానింగ్ మొత్తం 179 మ్యాచ్‌ల్లో కెపె్టన్‌గా వ్యవహరించగా, ఆమె కెప్టెన్సీలో ఆసీస్ జట్టు 146 మ్యాచ్‌ల్లో గెలిచింది. ‘కప్’ల కహాని: రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (2013, 2022), ఐదు టి20 ప్రపంచకప్ (2012, 2014, 2018, 2020, 2023)లలో విజయవంతమైన కెపె్టన్‌గా, బ్యాటర్‌గా నిరూపించుకుంది. లానింగ్ సారథ్యంలో ఆసీస్ 2022 వన్డే వరల్డ్‌కప్‌లో, 2014, 2018, 2020, 2023 టి20 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచింది. బ్యాటింగ్‌లో సునామీ: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో కేవలం 45 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ సాధించిన ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు. కెరీర్ ప్రొఫైల్: ఆరు టెస్టులు ఆడి 345 పరుగులు, 103 వన్డేల్లో 4602 పరుగులు సాధించింది. ఇందు లో 15 సెంచరీలు, 21 ఫిఫ్టీలున్నాయి. 132 టి20ల్లో 3405 పరుగులు చేసింది. 2 శతకాలు, 15 అర్ధసెంచరీలున్నాయి. ఓవరాల్‌గా 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కలిపి లానింగ్ 8,352 పరుగులు చేసింది. -
ఆస్ట్రేలియా కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సారధి మెగ్ లాన్నింగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని లాన్నింగ్ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని పేర్కొంది. 31 ఏళ్ల లాన్నింగ్ ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లాన్నింగ్ తన 13 ఏళ్ల కెరీర్లో 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించి, 182 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించింది. ఫుల్‌టైమ్ బ్యాటర్, పార్ట్ టైమ్ బౌలర్ అయిన లాన్నింగ్ తన కెరీర్లో 17 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు, 5 వికెట్లు పడగొట్టింది. లాన్నింగ్ తన కెరీర్లో ఏడు వరల్డ్‌కప్ టైటిళ్లలో భాగమైంది. లాన్నింగ్ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించింది. -
డబ్ల్యూపీఎల్: అవార్డులు ఎవరికి? విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే! పీఎస్ఎల్ విజేత కంటే..
Womens Premier League 2023: మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్ర చాంపియన్‌గా రికార్డులకెక్కింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి హర్మన్ సేన ఈ మేరకు చరిత్ర సృష్టించింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ముద్దాడి సంబరాల్లో మునిగిపోయింది. మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రవేశపెట్టిన డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌ను మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. ఇక ఈ విజయంతో చాంపియన్ ముంబై, వివిధ విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లు గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?! డబ్ల్యూపీఎల్-2023 అవార్డులు, ప్రైజ్‌మనీ ►విజేత- ముంబై ఇండియన్స్ వుమెన్- గోల్డెన్ ట్రోఫీ- రూ. 6 కోట్లు ►రన్నరప్- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- రూ. 3 కోట్లు ►మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- రూ. 5 లక్షలు ►ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు)- మెగ్ లానింగ్(ఢిల్లీ క్యాపిటల్స్)- 9 ఇన్నింగ్స్‌లో 345 పరుగులు- రూ. 5 లక్షలు ►పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు)- హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- 16 వికెట్లు ►ఫెయిర్ ప్లే అవార్డు- ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ►క్యాచ్ ఆఫ్ ది సీజన్: హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబై)- యూపీ వారియర్జ్ దేవికా వైద్య క్యాచ్- రూ. 5 లక్షలు ►సఫారీ పవర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్- సోఫీ డివైన్ (ఆర్సీబీ)- 8 ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు- రూ. 5 లక్షలు ►ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యస్తికా భాటియా(ముంబై)- రూ. 5 లక్షలు. పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత కంటే మహిళా ప్రీమియర్ లీగ్ విజేతకు అందిన మొత్తం పీఎస్ఎల్ చాంపియన్ లాహోర్ కలందర్స్ గెల్చుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది పీఎస్ఎల్ విన్నర్‌గా అవతరించిన లాహోర్ రూ. 3.4 కోట్లు ప్రైజ్‌మనీ అందుకోగా.. రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ సుమారు 1.37 కోట్ల రూపాయలు గెలుచుకుంది. The young promising wicketkeeper-batter shined bright in a victorious season for @mipaltan 👏👏@YastikaBhatia becomes the emerging player of the season 👌#TATAWPL pic.twitter.com/hO8qMDUkty — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు IPL 2023: ఐపీఎల్ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్ బాస్‌వే..! Raw emotions 🎥 A moment to savor for @mipaltan 👌 👌 #TATAWPL | #Final | #DCvMI pic.twitter.com/wdf7t07NMJ — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా! పాపం ముంబై!
WPL 2023- Delhi Capitals In Finals- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించగా... ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై గెలిచింది. పాపం ముంబై.. మరో మ్యాచ్‌లో ఢిల్లీ, ముంబై 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ (1.856) ‘టాపర్’గా నిలిచి ఫైనల్ చేరింది. మరో ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే ఏకైక ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై తలపడుతుంది. ఢిల్లీతో మ్యాచ్‌లో తొలుత యూపీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. తాలియా (58 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసింది. ఢిల్లీ బౌలర్లలో అలైస్ క్యాప్సీ (3/26) ఆకట్టుకుంది. ఢిల్లీ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్యాప్సీ క్యాప్సీ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), మరిజాన్ కాప్ (34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), లానింగ్ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలకడగా ఆడి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై తో మ్యాచ్‌లో తొలుత బెంగళూరు 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమె లియా కెర్ (3/22) రాణించింది. ముంబై 16.3 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. అమెలియా కెర్ (31 నాటౌట్; 4 ఫోర్లు), యస్తిక (30; 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. చదవండి: Ind Vs Aus 3rd ODI: అతడికి విశ్రాంతి? సుందర్, ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్! SA Vs WI: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు The first-ever team to make it to the 𝗙𝗜𝗡𝗔𝗟 of #TATAWPL 🙌 The @DelhiCapitals are ready to roar 🔥🔥 pic.twitter.com/LZclWYNH8J — Women's Premier League (WPL) (@wplt20) March 22, 2023 -
లీగ్‌లో ఆఖరి మ్యాచ్.. ఢిల్లీతో యూపీ వారియర్జ్...
మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో యూపీ కీలక ప్లేయర్ గ్రేస్ హ్యారిస్‌తో పాటు ఓపెనర్ దేవికా వైద్య, స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌కు విశ్రాంతినిచ్చింది. వాళ్ల స్థానంలో యషశ్రీ, షబ్నం ఇస్మాయిల్ తుది జట్టులోకి వచ్చారు. ఢిల్లీ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఇక ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్. యూపీ వారియర్స్: అలిసా హేలీ (కెప్టెన్), శ్వేతా షెరావత్, కిరణ్ నవగిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్, సిమ్రాన్ షేక్, పర్షవీ చోప్రా, అంజలీ సర్వానీ, సొప్పదండి యషశ్రీ, షబ్నం ఇస్మాయిల్. 🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to field first against @UPWarriorz Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/gPYlYR1w8k — Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023 -
ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ 136 పరుగులకు ఆలౌట్ అయింది. మారిజన్నే కాప్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అరుంధతీ రెడ్డి 25 పరుగులు, ఎలిస్ క్యాప్సీ 22 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో తనూజా కన్వర్ రెండు వికెట్లు తీయగా.. అష్లే గార్డనర్, కిమ్ గార్త్, హర్లిన్ డియోల్, స్నేహ్రాణా తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డాట్ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), అష్లే గార్డనర్(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్ డియోల్ 31 పరుగులు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లారా, అష్లే గార్డనర్లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జొనాసెన్ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్ చెరొక వికెట్ తీశారు. -
సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్ 148
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డాట్ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), అష్లే గార్డనర్(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్ డియోల్ 31 పరుగులు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లారా, అష్లే గార్డనర్లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జొనాసెన్ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్ చెరొక వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డంక్లీ (4) ఔట్ అయింది. మరిజానే కాప్ వేసిన ఆఖరి బంతికి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కుదురుకున్న హర్లీన్ డియోల్ (31) ను జొనాసెన్ రెండో వికెట్‌గా వెనక్కి పంపింది. దాంతో, గుజరాత్ జట్టు 53 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత.. ఓపెనర్ లారా వోల్వార్డట్, అష్లే గార్డ్నర్ గుజరాత్‌ను ఆదుకున్నారు. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఆమె కీలక మ్యాచ్‌లో రాణించింది. డబ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది. -
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో గుజరాత్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ బౌలింగ్ ఏంచుకుంది. ఈ టోర్నమెంట్లో నాలుగు విజయాలతో రెండో స్థానంలో ఉన్న పటిష్టమైన ఢిల్లీని గుజరాత్ నిలువరిస్తుందా? అనేది ఆసక్తికరం. గుజరాత్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైన. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ పోటీలో నిలవాలని స్నేహ్ రానా సేన భావిస్తోంది. షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జొనాసెన్, కాప్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కూడా కాప్,శిఖా పాండే, రాధా యాదవ్‌లతో బాగానే ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ తమ ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది.హర్లిన్ డియోల్, అష్లీ గార్డనర్, సోఫియా డంక్లీలు రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో మాత్రం కిమ్ గార్త్, తనూజా కన్వర్లతో పటిష్టంగా ఉంది. కెప్టెన్‌గా స్నేహ్రాణా రాణిస్తున్నప్పటికి ఆటలో మాత్రం నిలకడ చూపలేకపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్ గుజరాత్ జెయింట్స్ జట్టు : లారా వోల్వార్డ్త్, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, దయలాన్ హేమలత, అశ్విని కుమారి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, మన్సీ జోషి 🚨 Toss Update 🚨@DelhiCapitals have elected to bowl against @GujaratGiants. Follow the match 👉 https://t.co/fWIECCa2QJ #TATAWPL | #DCvGG pic.twitter.com/NyMHidy8Aa — Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023 -
WPL 2023: మారని ఆర్సీబీ ఆటతీరు.. వరుసగా ఐదో ఓటమి
మారని ఆర్సీబీ ఆటతీరు.. వరుసగా ఐదో ఓటమి వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ వుమెన్ కథ మారడం లేదు. లీగ్‌లో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. అలైస్ క్యాప్సీ(38 పరుగులు), కాప్(32 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ 32 పరుగులు, జెస్ జొనాసెన్ 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభనా రెండు వికెట్లు తీయగా.. ప్రీతిబోస్, మేఘన్ స్కాట్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్ 37 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నొరిస్ ఒక వికెట్ పడగొట్టింది. నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడగా ఆడుతున్న జెమీమా రోడ్రిగ్స్(32) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కాప్ 16, జొనాసెన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు కావాలి. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 90/3 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ 18, కాప్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు కెప్టె్న్ మెగ్ లానింగ్ 15 పరుగులు చేసి ఆశా శోభనా బౌలింగ్‌లో హెథర్నైట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ అలైస్ క్యాప్సీ(38) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులుగా ఉంది. మెగ్ లానింగ్ 3 పరుగులతో క్రీజులో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 151 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్ 37 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నొరిస్ ఒక వికెట్ పడగొట్టింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్.. ప్రస్తతం ఢిల్లీ 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 62/2 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 23, హెథర్ నైట్ 11 పరుగులతో ఆడుతున్నారు. 8 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 38/1 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతుంది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. క్రీజులో ఎలిస్ పెర్రీ 10, సోఫీ డివైన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు స్మృతి మంధాన 8 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. స్మృతి మంధాన ఔట్.. తొలి వికెట్ డౌన్ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వైఫల్యం కొనసాగుతుంది. ఢిల్లీ వుమెన్‌తో మ్యాచ్‌లో 8 పరుగులు మాత్రమే చేసిన మంధాన శిఖా పాండే బౌలింగ్‌లో రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇవాళ ఆర్సీబీ వుమెన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఏంచుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వరుసగా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉంది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి.. ఒక్క ఓటమితో ఆరు పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీని ఆర్సీబీ వుమెన్స్ ఎంత మేరకు నిలువరిస్తుందనేది చూడాలి. ఇక తొలి రౌండ్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ): స్మృతి మంధన(కెప్టెన్), సోఫీ డివైన్, హీథర్ నైట్, దిషా కసత్, ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోబన, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ): షఫాలీ వర్మ, మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), మరిజాన్ కప్, జెమీమా రోడ్రిగెస్, అలైస్ క్యాప్సీ, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా (వికెట్‌కీపర్), అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే, తారా నోరిస్ -
హ్యాట్రిక్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ వుమెన్
హ్యాట్రిక్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ వుమెన్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వుమెన్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. యస్తికా బాటియా 41, హేలీ మాథ్యూస్ 32 పరుగులతో రాణించారు. ఇక నట్‌సివర్ బ్రంట్ 23 నాటౌట్, హర్మన్ 11 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 105 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. జెమీమా రోడ్రిగ్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో సైకా ఇషాకీ, ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలో మూడు వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది. తొలి వికెట్ డౌన్.. విజయం దిశగా ముంబై ఇండియన్స్ 106 పరుగుల స్వల్ప చేధనలో భాగంగా ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులతో దాటిగా ఆడుతున్న యస్తికా బాటియా తారా నోరిస్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. ప్రస్తుతం ముంబై వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ 22 పరుగులతో ఆడుతుంది. దూకుడు ప్రదర్శిస్తున్న ముంబై.. 4 ఓవర్లలో 33/0 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ దూకుడు ప్రదర్శిస్తుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. యస్తికా బాటియా 14, హేలీ మాథ్యూస్ 17 పరుగులతో ఆడుతున్నారు. 105 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 105 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. జెమీమా రోడ్రిగ్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో సైకా ఇషాకీ, ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలో మూడు వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది. కుప్పకూలిన ఢిల్లీ ఇన్నింగ్స్.. 85 పరుగులకే ఏడు వికెట్లు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. 87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. 4 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 18/1 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 10 పరుగులు, కాప్సీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. షఫాలీ వర్మ క్లీన్‌బౌల్డ్.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 2 పరుగులు చేసిన షఫాలీ వర్మ సయికా ఇషాకీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగింది. 2 ఓవర్లలో జట్టు స్కోరు వికెట్ నష్టానికి 8 పరుగులుగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వుమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఇరుజట్లు తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఇరుజట్ల మధ్య టఫ్‌ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజాన్ కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా(వికెట్ కీపర్), మిన్ను మణి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్ ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI): హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్ -
లానింగ్, జొనసెన్ చెలరేగగా...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్ మరోసారి భారీ స్కోరుతో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల స్కోరు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 70; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెస్ జొనసెన్ (20 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. సహచరులు తడబడినా... తాహ్లియా మెక్‌గ్రాత్ (50 బంతుల్లో 90 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అసాధారణ పోరాటం చేసి అజేయంగా నిలిచింది. లానింగ్ అర్ధ సెంచరీ తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు లానింగ్, షఫాలీ ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. షబ్నిమ్ ఐదో ఓవర్లో లానింగ్ ఒక సిక్స్, రెండు బౌండరీలతో 16 పరుగులు పిండుకుంది. రాజేశ్వరి వేసిన ఆరో ఓవర్లో షఫాలీ ఫోర్ కొడితే లానింగ్ మూడు బౌండరీలతో రెచ్చిపోయింది. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు 62/0. మరుసటి ఓవర్లోనే షఫాలీ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఆటను తాహ్లియా ముగించగా, మెగ్ లానింగ్ మాత్రం తన ధాటిని కొనసాగించి 32 బంతుల్లో (7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించింది. తర్వాత కాసేపు వాన ఆటంకపరిచింది. ఆట తిరిగి మొదలయ్యాక 11వ ఓవర్లో ఢిల్లీ స్కోరు 100 దాటింది. స్వల్ప వ్యవధిలో మరిజన్ (16; 2 ఫోర్లు), లానింగ్ నిష్క్రమించారు. తర్వాత వచ్చిన జెమిమా (22 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), క్యాప్సీ (10 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఢిల్లీ వేగాన్ని కొనసాగించారు. ఆఖర్లో జొనసెన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. దీంతో ఆఖరి 4 ఓవర్లలో ఢిల్లీ 58 పరుగులు సాధించడంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 200 మార్క్ దాటింది. మెక్‌గ్రాత్ ఒంటరి పోరాటం కొండంత లక్ష్యం ముందుంటే యూపీ వారియర్స్ టాపార్డర్ నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకుంది. కెప్టెన్ అలీసా హీలీ (17 బంతుల్లో 24; 5 ఫోర్లు), శ్వేత (1), కిరణ్ నవ్‌గిరే (2) ‘పవర్ ప్లే’లోనే పెవిలియన్కెళ్లారు. తర్వాత వచ్చిన వారిలో తాహ్లియా ఒంటరిపోరాటం చేసింది. దీప్తి శర్మ (12), దేవిక వైద్య (21 బంతుల్లో 23; 2 ఫోర్లు)లు దూకుడుగా ఆడబోయి వెనుదిరిగారు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన జొనసెన్ స్పిన్ బౌలింగ్‌తో యూపీని చావుదెబ్బ తీసింది. మెక్‌గ్రాత్ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మెక్‌గ్రాత్... ఆఖరి ఓవర్లలో ఆమె ఫోర్లు, సిక్సర్లు బాదడంతో యూపీ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) రాజేశ్వరి 70; షఫాలీ (సి) నవ్‌గిరే (బి) తాహ్లియా 17; మరిజన్ (సి) దీప్తిశర్మ (బి) ఎకిల్‌స్టోన్ 16; జెమిమా నాటౌట్ 34; క్యాప్సీ (సి) ఎకిల్‌స్టోన్ (బి) షబ్నిమ్ 21; జొనసెన్ నాటౌట్ 42; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–67, 2–96, 3–112, 4–144. బౌలింగ్: షబ్నమ్ 4–0–29–1, అంజలీ 3–0–31–0, రాజేశ్వరి గైక్వాడ్ 2–0–31–1, తాహ్లియా మెక్‌గ్రాత్ 3–0–37–1, దీప్తిశర్మ 4–0–40–0, సోఫీ ఎకిల్‌స్టోన్ 4–0–41–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి) జెమిమా (బి) జొనసెన్ 24; శ్వేత (సి) తానియా (బి) మరిజన్ 1; కిరణ్ నవ్‌గిరే (సి) క్యాప్సీ (బి) జొనసెన్ 0; తాహ్లియా మెక్‌గ్రాత్ నాటౌట్ 90; దీప్తిశర్మ (సి) రాధ (బి) శిఖా 12; దేవిక (సి) రాధ (బి) జొనసెన్ 23; సిమ్రన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–29, 2–31, 3–31, 4–71, 5–120. బౌలింగ్: మరిజన్ 4–1–29–1, శిఖాపాండే 4–0–18–1, జెస్ జొనసెన్ 4–0–43–3, నోరిస్ 2–0–25–0, క్యాప్సీ 4–0–25–0, రాధ 1–0–11–0, అరుంధతి 1–0–14–0. డబ్ల్యూపీఎల్‌లో నేడు గుజరాత్ జెయింట్స్ Vs బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
తాహిలా మెక్‌గ్రాత్ పోరాటం వృథా.. యూపీ వారియర్జ్ ఓటమి
తాహిలా మెక్‌గ్రాత్ పోరాటం వృథా.. యూపీ వారియర్జ్ ఓటమి వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 42 పరుగులతో విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. తాహిలా మెక్‌గ్రాత్ (50 బంతుల్లో 90 పరుగులు నాటౌట్, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటం వృథా అయినా ఆకట్టుకుంది. ఆమె మినహా మిగతావారు విఫలమయ్యారు. జెస్ జొనాన్సెన్ మూడు వికెట్లు తీసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించారు. 16 ఓవర్లలో యూపీ వారియర్జ్ 113/4 16 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్జ్ నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్ 47 పరుగులు, వైద్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 24 బంతుల్లో 99 పరుగులు కావాలి. 12 ఓవర్లలో యూపీ వారియర్జ్ 84/4 12 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్జ్ నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్ 34 పరుగులు, వైద్య 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 12 పరుగులు చేసిన దీప్తి శర్మ రాధా యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగింది. 8 ఓవర్లలో యూపీ వారియర్జ్ స్కోరు 51/3 8 ఓవర్ల ఆట ముగిసేసరికి యూపీ వారియర్జ్ మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. తాహిలా మెక్‌గ్రాత్ 11, దీప్తి శర్మ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 72 బంతుల్లో 161 పరుగులు కావాలి. ► 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్జ్ కష్టాల్లో పడింది. క్యాప్స్ బౌలింగ్‌లో సెహ్రావత్(1 పరుగు) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్జ్ 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ధాటిగా ఆడుతున్న కెప్టెన్ అలిసా హేలీ(24 పరుగులు) జాన్సెన్ బౌలింగ్‌లో రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత గతమ్యాచ్ హీరో కిరణ్ నావగిరే 2 పరుగులు చేసి జాన్సెన్ బౌలింగ్‌లోనే వెనుదిరిగింది. ప్రస్తుతం యూపీ వారియర్జ్ రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ టార్గెట్ 212 వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్.. యూపీ వారియర్జ్ ముంగిట 212 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎస్సెల్స్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు. భారీ స్కోరుగా దిశగా ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 14 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిది. అలిస్ క్యాప్సీ 21, జెమీమా రోడ్రిగ్స్ 10 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 16 పరుగులు చేసిన కాప్ వెనుదిరగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 55 పరుగులతో ఆడుతుంది. 9 ఓవర్లలో 87/1 9 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 53 పరుగులు, కాప్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఒపెనర్ షఫాలీ వర్మ 17 పరుగుల వద్ద మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. 3 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 18/0 మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 15, షఫాలీ వర్మ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న యూపీ వారియర్జ్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయాలు సాధించిన ఇరుజట్లు తొలిసారి తలపడనున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ బౌలింగ్ ఏంచుకుంది. అయితే మ్యాచ్‌లో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీని ఓడించడం యూపీ వారియర్జ్‌కు సవాలే. అయితే యూపీ వారియర్జ్ కూడా బలంగానే కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్(ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజానే కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా(వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్ యూపీ వారియర్జ్ (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ(వికెట్ కీపర్, కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్ -
షఫాలీ, లానింగ్ ధనాధన్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో పరుగుల హోరెత్తుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 200 పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. ఢిలీక్యాపిటల్స్ ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) చెలరేగారు. బౌలింగ్‌లో తారా నోరిస్ (5/29) నిప్పులు చెరగడంతో ఢిల్లీ 60 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై జయభేరి మోగించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 223 పరుగుల భారీస్కోరు చేసింది. మహిళల టి20 క్రికెట్లో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు లానింగ్, షఫాలీ తొలి వికెట్‌కు 162 పరుగులు జోడించారు. షఫాలీ 31 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్‌లు)... లానింగ్ 30 బంతుల్లో (10 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆఖర్లో మరిజన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేయగలిగింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (23 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎలీస్ పెర్రీ (19 బంతుల్లో 31; 5 ఫోర్లు), హీథెర్‌నైట్ (21 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారు. తారా నోరిస్ 5, అలైస్ క్యాప్సీ 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) హీథెర్‌నైట్ 72; షఫాలీ (సి) రిచా (బి) హీథెర్‌నైట్ 84; మరిజన్ కాప్ (నాటౌట్) 39; జెమీమా (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–162, 2–163. బౌలింగ్: రేణుక సింగ్ 3–0–24–0, మేగన్ 4–0–45–0, ప్రీతి 4–0– 35–0, పెర్రీ 3–0–29–0, సోఫీ డివైన్ 1–0–20–0, శోభన 2–0–29–0, హీథెర్‌నైట్ 3–0–40–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) శిఖా (బి) క్యాప్సీ 35; సోఫీ డివైన్ (సి) షఫాలీ (బి) క్యాప్సీ 14; పెర్రీ (బి) నోరిస్ 31; దిశ (సి) క్యాప్సీ (బి) నోరిస్ 9; రిచా (సి) రాధ (బి) నోరిస్ 2; హీథెర్‌నైట్ (సి) లానింగ్ (బి) నోరిస్ 34; కనిక (సి) షఫాలీ (బి) నోరిస్ 0; శోభన (సి) రాధ (బి) శిఖా 2; మేగన్ (నాటౌట్) 30; ప్రీతి బోస్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–41, 2–56, 3–89, 4–90, 5–93, 6–93, 7–96, 8–150. బౌలింగ్: శిఖా పాండే 4–0–35–1, మరిజన్ కాప్ 4–0–36–0, జొనసెన్ 4–0–28–0, అలైస్ క్యాప్సీ 2–0–10–2, రాధ యాదవ్ 2–0–24–0, తారా నోరిస్ 4–0–29–5. -
ముంబై ఇండియన్స్ రికార్డు బద్దలు కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్ విధ్వంసానికి, పరుగుల ప్రవాహానికి వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) మెరుపు హాఫ్‌సెంచరీలతో విరుచుకుపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. షఫాలీ, లాన్నింగ్‌లను హీథర్ నైట్ ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపడంతో స్కోర్ కాస్త మందగించింది. ఒకవేళ వీరిద్దరూ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ఆఖర్లో మారిజాన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) కూడా చెలరేగి ఆడారు. డీసీ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ మినహాయించి ప్రతి ఓవర్లో కనీసం ఓ బౌండరీ నమోదైందంటే డీసీ బ్యాటర్ల విధ్వంసం ఏ రేంజ్ సాగిందో ఇట్టే అర్ధమవుతుంది. ఈ మ్యాచ్‌లో డీసీ 223 పరుగులు చేయడంతో గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నెలకొల్పిన 207 పరుగుల టీమ్ టోటల్ రికార్డు బద్దలైంది. ముంబై సాధించిన స్కోర్ కంటే డీసీ జట్టు 16 పరుగులు అధికంగా సాధించింది. డీసీ ఓపెనర్లు, ముఖ్యంగా షఫాలీ వర్మ వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించి, ఐపీఎల్‌కు డబ్ల్యూపీఎల్ ఏమాత్రం తీసిపోదని చెప్పకనే చెప్పింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ సైతం డీసీ తరహాలోనే రెచ్చిపోవడంతో మ్యాచ్‌లో విధ్వంసకర వాతావరణం కొనసాగింది. 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. కాగా, డబ్ల్యూపీఎల్-2023 తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. -
WPL 2023: మహిళా ప్రీమియర్ లీగ్ 5 జట్లు, కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు వీరే!
Women's Premier League 2023 All 5 WPL Squads: భారత క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య శనివారం (మార్చి 4) నుంచి మహిళా క్రికెటర్ల పోటీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్-2023కి సంబంధించిన జట్ల పూర్తి వివరాలు మీకోసం.. మహిళా ప్రీమియర్ లీగ్-2023 జట్లు, కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు 1.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- స్మృతి మంధాన- బెన్ సాయెర్ 2. ఢిల్లీ క్యాపిటల్స్- మెగ్ లానింగ్- జొనాథన్ బాటీ 3. యూపీ వారియర్స్- అలిసా హేలీ- జాన్ లూయీస్ 4. గుజరాత్ జెయింట్స్- బెత్ మూనీ- రేచల్ హెయిన్స్ 5. ముంబై ఇండియన్స్- హర్మన్‌ప్రీత్ కౌర్- చార్లెట్ ఎడ్వర్డ్స్ 5 జట్ల సభ్యులు వీరే! 1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్ 2. ఢిల్లీ క్యాపిటల్స్ మెగ్ లానింగ్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే క్యాప్, టైటాస్ సాధు, అలిస్ కాప్సీ, తారా నోరిస్, లారా హ్యారిస్, జేసియా అక్తర్, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, జెస్ జొనాస్సెన్, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్. 3. యూపీ వారియర్స్ అలిసా హేలీ (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), సోఫియా ఎక్లిస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవితా చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, సిమ్రన్ షేక్. 4. గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ (కెప్టెన్), ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్లె సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సబ్బినేని మేఘన, జార్జియా వేర్హామ్, మాన్సీ జోషి, డి. హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, స్నేహ రాణా (వైస్ కెప్టెన్), సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరునికా సిసోడియా, షబ్నం మహ్మద్. 5. ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం.. -
ఢిల్లీ సారథిగా ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీ గెలిచిన కెప్టెన్
WPL 2023- Delhi Capitals Squad- Captain: ఢిల్లీ క్యాపిటల్స్ తమ మహిళా జట్టు కెప్టెన్ పేరును ప్రకటించింది. ఆస్ట్రేలియాకు ఐదుసార్లు ప్రపంచకప్ అందించిన మెగ్ లానింగ్‌ను సారథిగా నియమించినట్లు తెలిపింది. ఆమెకు డిప్యూటీగా టీమిండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను ఎంపిక చేసినట్లు గురువారం వెల్లడించింది. కాగా మార్చి 4 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)-2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్సీబీ స్మృతి మంధాన, ముంబై ఇండియన్స్ హర్మన్‌ప్రీత్‌కౌర్, గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ, యూపీ వారియర్జ్ అలిసా హేలీలను సారథులుగా నియమించినట్లు ప్రకటించాయి. ఆరోజే తొలి మ్యాచ్ ఎట్టకేలకు ఢిల్లీ సైతం తమ కెప్టెన్ పేరును తాజాగా రివీల్ చేసింది. కాగా ఆస్ట్రేలియాకు చెందిన 30 ఏళ్ల మెల్ లానింగ్ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఆసీస్‌కు ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత ఆమెది. 2014, 2018, 2020, 2023 టీ20 ప్రపంచకప్, 2022 వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌తో డబ్ల్యూపీఎల్ ప్రయాణం ఆరంభించనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఢిల్లీ కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా నియమితులు కావడం పట్ల మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఫిబ్రవరి 13న జరిగిన వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌ను రూ.1.1కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, రోడ్రిగ్స్‌కు మాత్రం భారీ మొత్తంలో 2.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే క్యాప్, టైటాస్ సాధు, అలిస్ కాప్సీ, తారా నోరిస్, లారా హ్యారిస్, జేసియా అక్తర్, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, జెస్ జొనాస్సెన్, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్. చదవండి: IND Vs AUS: స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ BGT 2023: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు! ముందుందిలే.. -
T20 WC: ఆ సిరీస్ గురించి ఇక్కడెందుకు? అయినా; టీమిండియా పటిష్ట జట్టు..
ICC Womens T20 World Cup 2023 - AusW vs IndW: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భారత జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారా అంటూ ఓ విలేకరి ఆమెను ప్రశ్నించారు. భారత్‌లో టీమిండియా- ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీని వరల్డ్‌కప్ మ్యాచ్‌తో ముడిపెట్టి ప్రశ్నలు సంధించారు. ఆ సిరీస్ గురించి ఇక్కడెందుకు? అయినా.. భారత్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోబోతున్నారా అని అడిగారు. ఇందుకు బదులుగా.. ‘‘ఓహ్.. ఆ సిరీస్ గురించి ఇక్కడ మాట్లాడకూడదు. మా జట్టు అక్కడ అత్యుత్తమ రాణించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. పూర్తిస్థాయిలో సన్నద్ధమై వందకు వంద శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాళ్లకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. రెండు టెస్టులు ముగిశాయి. అయితే, వాళ్లు మెరుగ్గానే ఆడారు. మిగిలిన వాటిలో మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది’’ అని మెగ్ లానింగ్ పేర్కొంది. ప్రతీకారం తీర్చుకునేందుకు! కాగా సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. గతంలో రెండుసార్లు(ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్)లో ఫైనల్ పోరులో భారత మహిళా జట్టు ఆసీస్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఈసారి సమిష్టిగా రాణించి కంగారూల ఫైనల్ అవకాశాలు గల్లంతు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ఈ మేర ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె పైవిధంగా స్పందించింది. టీమిండియా పటిష్ట జట్టు ఇక సెమీ ఫైనల్ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియా పటిష్ట జట్టు. రెండు జట్లు పరస్పరం ఎన్నోసార్లు పోటీపడ్డాయి. వాళ్ల జట్టులో వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు, ఒంటిచేత్తో మ్యాచ్ మలుపు తిప్పగల ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఉత్తమ జట్టుతో పోటీ పడేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అత్యుత్తమంగా రాణించి విజయం సాధించాలని కోరుకుంటున్నాం’’ అని మెగ్ లానింగ్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 మొదటి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్. రేణుక. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. చదవండి: Virat Kohli: కోహ్లిపై ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే.. ఫ్యాన్స్ ఫైర్ Ind Vs Aus: పాపం గిల్ ఎందుకు ఎదురుచూడాలి? మరి సంజూ మాటేమిటి? -
ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్‌కప్ మనదే..
మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్‌కు చేరింది. సోమవారం రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మెరుగైన రన్‌రేట్, పాయింట్ల ఆధారంగా సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌కు అసలైన పరీక్ష సెమీఫైనల్లో ఎదురుకానుంది. సెమీస్‌లో మహిళల క్రికెట్లో ప్రపంచనెంబర్‌వన్‌గా ఉన్న బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. లీగ్ పోటీల్లో ఒక మ్యాచ్ ఓడినా ఇంకో మ్యాచ్ గెలిచేందుకు అవకాశముంటుంది. కానీ నాకౌట్ స్టేజీ అలా కాదు. మ్యాచ్ గెలిస్తే ముందుకు.. ఓడిపోతే ఇంటికి. అందునా ఆస్ట్రేలియా మహిళల జట్టును ఓడించాలంటే టీమిండియా వుమెన్స్ శక్తికి మించి రాణించాల్సిందే. ఒకప్పుడు ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ ఎంత ఆధిపత్యం చెలాయించిందో అందరికి తెలిసిందే. వారిని మించి డామినేట్ చేస్తుంది ఆస్ట్రేలియా మహిళల జట్టు. ఈ మధ్య కాలంలో మహిళల క్రికెట్లో ఒక మెగా టోర్నీ ఫైనల్ ఆస్ట్రేలియా జట్టు లేకుండా ముగియదు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు ఎంత బలంగా ఉందనేది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు అందుకొని టాపర్‌గా నిలిచింది. ఆ జట్టులో ఒకటో నెంబర్ నుంచి తొమ్మిదో నెంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారు. హేలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్, తాహిలా మెక్‌గ్రాత్ ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉన్నారు. మరి అలాంటి పటిష్టమైన ఆసీస్‌ను సెమీస్‌లో భారత్ నిలువరించగలిగితే ఈసారి కప్ కొట్టడం ఖాయం అని పలువురు జోస్యం చెబుతున్నారు. అనుకుంటే ఆస్ట్రేలియాను మట్టికరిపించడం అంత కష్టమేమి కాదు. కానీ ముందు వారిని ఓడించగలమా అనే డౌట్ పక్కనబెట్టి సమిష్టి ప్రదర్శన చేస్తే కచ్చితంగా మ్యాచ్ మనదే అవుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన మూడుసార్లు ఔట్ నుంచి తప్పించుకునే అవకాశం వచ్చినప్పటికి తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమెను ఎందుకు టీమిండియా సూపర్‌స్టార్ అంటారో.. ఎందుకంత క్రేజ్ అనేది ఈ పాటికే అర్థమై ఉండాలి. అండర్-19 టి20 వరల్డ్‌కప్‌లో తన కెప్టెన్సీతో పాటు బ్యాటర్‌గానూ రాణించి జట్టును విజేతగా నిలిపిన షఫాలీ వర్మ గాడిన పడాల్సి ఉంది. జేమిమా రోడ్రిగ్స్ తొలి మ్యాచ్ మినహా మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. రిచా ఘోష్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ఆల్‌రౌండర్స్ పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తమ ప్రతిభను చూపెట్టాల్సిన అవసరం ఉంది. వీరంతా ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శన చేస్తే భారత్ గెలవడం ఈజీయే. ఎలాగూ బౌలింగ్‌లో రేణుకా సింగ్, శిఖా పాండేలు మంచి ప్రదర్శన ఇస్తుండగా.. స్పిన్నర్‌గా దీప్తి శర్మ ఆకట్టుకుంటుంది. మరి పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొని టీమిండియా వుమెన్స్ నిలబడతారా.. లేక ఒత్తిడికి లోనై పాత పాటే పాడుతారా అనేది ఫిబ్రవరి 23న తెలియనుంది. India are through to the semi-finals 🥳 They win by DLS method against Ireland in Gqeberha to finish the Group stage with six points 👊#INDvIRE | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/6SOSiUMO9L — T20 World Cup (@T20WorldCup) February 20, 2023 చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' -
ఆస్ట్రేలియా కెప్టెన్ అనూహ్య నిర్ణయం.. గౌరవించిన సీఏ
ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోనుంది. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మెగ్ లానింగ్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపింది. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా తరపున బిజీ క్రికెట్ ఆడాను. కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు మానసికంగా అలసిపోయిన నాకు విశ్రాంతి కావాలనిపిస్తుంది. అందుకే ఈ లాంగ్ బ్రేక్. త్వరలో మళ్లీ జట్టులోకి వస్తా అంటూ 30 ఏళ్ల లానింగ్ పేర్కొంది. ''వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్న మెగ్ లానింగ్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం.. మా క్రికెట్లో బ్రేక్ అనే పదానికి మెగ్ లానింగ్ అర్హురాలు'' అంటూ ట్విటర్లో పేర్కొంటూ ఆమెకు మద్దతిచ్చింది. ఇటీవలే నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆసీస్ మహిళల జట్టు స్వర్ణం పతకం ఎగురేసుకుపోయిన సంగతి తెలిసింది. టీమిండియా మహిళలతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా వుమెన్స్ విజయం సాధించిన స్వర్ణం కొల్లగొట్టగా.. భారత్ రజతం కైసవం చేసుకుంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో మెగ్ లానింగ్ తనదైన ముద్ర వేసింది. లానింగ్ ఖాతాలో రెండు మహిళల వన్డే ప్రపంచకప్‌లతో పాటు.. నాలుగు టి20 ప్రపంచకప్‌లు ఉండడం విశేషం. ఇందులో మూడు టి20 ప్రపంచకప్‌లు(2014, 2018, 2020)లానింగ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా గెలవడం విశేషం. మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డులు.. ►వన్డేల్లో అత్యధిక సెంచరీలు మెగ్ లానింగ్ పేరిటే ఉన్నాయి. వన్డేల్లో లానింగ్ 15 సెంచరీలు సాధించింది. ►టి20ల్లో ఆస్ట్రేలియా మహిళల తరపున 2వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా రికార్డు. ►మిథాలీ రాజ్(భారత్), చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్) తర్వాత 150 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మూడో క్రీడాకారిణిగా రికార్డు ►ఓవరాల్‌గా మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా మహిళల జట్టు తరపున 6 టెస్టుల్లో 93 పరుగులు, 100 వన్డేల్లో 4463 పరుగులు, 115 టి20ల్లో 3007 పరుగులు సాధించింది. If anyone deserves a break, it's Meg Lanning. pic.twitter.com/BC8fKTwSDw — Cricket Australia (@CricketAus) August 10, 2022 చదవండి: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్.. మళ్లీ నెంబర్ 1 స్థానానికి! -
భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..!
భారత మహిళా క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. మహిళల ప్రపంచకప్-2022 అత్యుత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు. కాగా మహిళల ప్రపంచకప్-2022లో భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఐసీసీ ప్రకటించిన అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ జట్టులో నలుగురు ఆసీస్ క్రికెటర్లకు చోటు దక్కడం గమనార్హం. ఇక ఈ మెగా టోర్నమెంట్లో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్ మూనీకు చోటు దక్కింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా)లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), నాలుగో ప్లేస్‌కు రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా),ఐదో ప్లేస్‌కు నాట్ స్కివర్ (ఇంగ్లండ్), ఆ తరువాత వరుసగా బెత్ మూనీ (ఆస్ట్రేలియా),హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్), ఎంచుకుంది. ఐసీసీ అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టు: అలిస్సా హీలీ (వికెట్ కీపర్) (ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్) చార్లీ డీన్ (ఇంగ్లండ్) -
ఎదురులేని ఆస్ట్రేలియా
వెల్లింగ్టన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా జట్టు మహిళల క్రికెట్ వన్డే వరల్డ్‌కప్‌లో ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్ జట్టుతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా 157 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా సెమీఫైనల్లోనూ గెలిచి ఈ టోర్నీలో వరుసగా ఎనిమిదో విజయం నమోదు చేసుకోవడం విశేషం. వర్షం అంతరాయం కలిగించడంతో 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 45 ఓవర్లలో 3 వికెట్లకు 305 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అలీసా హీలీ (129; 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా... రాచెల్ హేన్స్ (100 బంతుల్లో 85; 9 ఫోర్లు) ఆకట్టుకుంది. వీరిద్దరు తొలి వికెట్‌కు 216 పరుగులు జోడించారు. చివర్లో బెత్ మూనీ (43 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఆసీస్ స్కోరు 300 దాటింది. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా ఆడుతుంది. -
World Cup 2022: ఎదురులేని ఆసీస్.. బంగ్లాను చిత్తు చేసి.. ఏడింటికి ఏడు గెలిచి
ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. మెగా ఈవెంట్లో ఆడిన ఏడింటికి ఏడు మ్యాచ్‌లు గెలిచి తిరుగులేని జట్టుగా అవతరించింది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించి అజేయ రికార్డును పదిలం చేసుకుంది. తద్వారా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో మెగ్ లానింగ్ బృందం నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్ కుదించిన నేపథ్యంలో 5 వికెట్ల తేడాతో గెలుపొంది బంగ్లాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా మహిళా జట్టు నిర్ణీత 43 ఓవర్ల(వరణుడి ఆటంకం)లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్ షర్మిన్ అక్తర్(24), లతా మొండల్(33) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆదిలో తడబాటు.. అయితే.. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలీసా హేలీ, రేచల్ హేన్స్ వరుసగా 15, 7 పరుగులకే నిష్క్రమించారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్ బ్యాటర్, కెప్టెన్ మెగ్ లానింగ్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో గట్టి షాక్ తగిలింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెత్ మూనీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. మూనీ అజేయ అర్ధ శతకంతో ఆసీస్ 32.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. బెత్ మూనీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు: బంగ్లాదేశ్- 135/6 (43) ఆస్ట్రేలియా 136/5 (32.1) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc)