ICC Women's ODI Batting Rankings: Meg Lanning Jumps to No 2 Spot - Sakshi
Sakshi News home page

ICC Womens ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ము లేపిన ఆస్ట్రేలియా..

Published Tue, Mar 8 2022 5:34 PM | Last Updated on Tue, Mar 8 2022 7:28 PM

Meg Lanning jumps to no 2 spot in ICC Womens ODI Batters Rankings - Sakshi

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్(727) రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. ఇక ఆగ్రస్ధానంలో ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలిస్సా హీలీ(742) రేటింగ్‌తో కొనసాగుతోంది. అగ్రస్థానానికి కేవలం 15 రేటింగ్ పాయింట్ల దూరంలో లానింగ్ నిలిచింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లానింగ్‌ అ‍ద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్‌లో లానింగ్‌ 110 బంతుల్లో 86 పరుగులు చేసింది. ఇక మరో ఆసీస్‌ క్రికెటర్‌ రిచెల్‌ హేయన్స్‌ ఆరు స్ధానాలు ఎగబాకి ఏడో స్ధానానికి చేరుకుంది. ఆదే విధంగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ హైలీ మాథ్యూస్‌ ఏకంగా 12 స్ధానాలు ఎగబాకి 20వ స్ధానానికి చేరుకుంది.

ఇక భారత సారథి మిథాలీ ఒక స్థానం దిగజారి నాలుగో స్ధానంకు చేరుకోగా, ఓపెనర్‌ మంధాన 10వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన పూజా వస్త్రాకర్‌, స్నేహ్‌ రాణా తమ కెరీర్‌లో అత్యత్తుమ స్ధానాలకు చేరుకున్నారు. ఇక బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ జానెసన్‌ తొలి స్దానంలో ఉండగా, ఇంగ్లండ్‌ బౌలర్‌ సోఫియా ఎకిలిస్టన్‌ రెండో స్ధానానికి చేరుకుంది. కాగా భారత్‌ నుంచి జూలన్‌ గో స్వామి తప్ప మిగితా బౌలర్లు ఎవరూ టాప్‌10లో చోటు దక్కలేదు. జూలన్‌ గో స్వామి బౌలర్ల విభాగంలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.

చదవండి: IPL 2022: పాపం రైనా.. మరోసారి బిగ్‌ షాక్‌... కనీసం ఆ అవకాశం కూడా లేదుగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement