ICC rankings
-
మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించిన రూట్.. నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. రూట్.. తన సహచరుడు హ్యారీ బ్రూక్‌ను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో బ్రూక్ నంబర్ వన్ స్థానంలో నిలువగా.. వారం తిరిగే లోపే రూట్ మళ్లీ అగ్రపీఠమెక్కాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 895 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్.. బ్రూక్ కంటే 19 రేటింగ్ పాయింట్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన మూడో టెస్ట్‌లో రూట్ 32, 54 (రెండు ఇన్నింగ్స్‌ల్లో) పరుగులు చేయగా.. బ్రూక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు (0,1). ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 423 పరుగుల తేడాతో ఓడినప్పటికీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా విలియమ్సన్ ర్యాంకింగ్ మెరుగుపడనప్పటికీ, గణనీయంగా రేటింగ్ పాయింట్లు పెంచుకున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కేన్ మూడో స్థానంలో ఉన్నాడు. కేన్‌కు రూట్‌కు మధ్య కేవలం 28 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?తాజా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో అద్భుత గణాంకాలు (4-1-13-2) నమోదు చేయడంతో అకీల్ టాప్ ప్లేస్‌కు చేరాడు. అకీల్ మూడు స్థానాలు ఎగబాకి చాలాకాలంగా టాప్ ప్లేస్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌కు కిందకు దించాడు. -
టాప్-3లోకి టీమిండియా వైస్ కెప్టెన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మంధన టాప్-3లోకి ప్రవేశించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరిన మంధన.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరింది.ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సిరీస్‌ల్లో ప్రదర్శనల ఆధారంగా మంధన ర్యాంక్‌లు మెరుగుపడ్డాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మంధన సూపర్ సెంచరీ (105) చేసింది. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో మెరుపు అర్ద సెంచరీ (54) సాధించింది.మరోవైపు వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బేమౌంట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరగా.. భారత బ్యాటర్ హర్లీన్ డియోల్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 64వ స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు, ఇంగ్లండ్ బ్యాటర్ నతాలీ సీవర్ బ్రంట్, ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు కోల్పోయి 13వ స్థానానికి పడిపోయింది.టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ స్థానం మెరుగపర్చుకుని 11వ స్థానానికి చేరగా.. భారత్‌కే చెందిన జెమీమా రోడ్రిగెజ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు బెత్ మూనీ, తహిళ మెక్‌గ్రాత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్‌కు చెందిన దీప్తి శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. -
సత్తాచాటిన జైశ్వాల్.. నెం1 ర్యాంక్‌కు ఒక్క అడుగు దూరంలో
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ సత్తాచాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జైశ్వాల్ రెండో స్ధానానికి చేరుకున్నాడు. యశస్వి జైశ్వాల్‌కు కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు జైశ్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్ధానంలో ఉన్నాడు. అయితే పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 297 బంతుల్లో 161 పరుగులు చేసిన జైశ్వాల్.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే యశస్వీ రెండు స్ధానాలు ఎగబాకి సెకెండ్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతడి ఖాతాలో 825 పాయింట్లు ఉన్నాయి.మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 9 స్ధానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి కూడా ఆజేయ శతకంతో మెరిశాడు. ఇక టాప్ ర్యాంక్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(903) పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10 బ్యాటర్లు వీరే..1.జో రూట్- 903 పాయింట్లు2. యశస్వి జైస్వాల్ 8253.కేన్ విలియమ్సన్ 8044. హ్యారీ బ్రూక్ 7785. డారిల్ మిచెల్ 7436. రిషబ్ పంత్ 7367. స్టీవెన్ స్మిత్ 7268. సౌద్ షకీల్ 7249. కమిందు మెండిస్ 71610. ట్రావిస్ హెడ్ 713 -
అగ్రస్థానాల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అఫ్రిది ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇరగదీశాడు. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అఫ్రిది 12.62 సగటున ఎనిమిది వికెట్లు తీశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిది మూడు స్థానాలు ఎగబాకగా.. టాప్ ప్లేస్‌లో ఉండిన కేశవ్ మహారాజ్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిదితో పాటు అతని సహచరుడు హరీస్ రౌఫ్ కూడా భారీగా లబ్ది పొందాడు. ఆసీస్‌పై సంచలన ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు) అనంతరం రౌఫ్ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్తానానికి ఎగబకాడు. అలాగే మరో పాక్ బౌలర్ నసీం షా కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. నసీం 14 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ (4), జస్ప్రీత్ బుమ్రా (6), మొహమ్మద్ సిరాజ్ (7) టాప్-10లో ఉన్నారు.బ్యాటింగ్ విషయానికొస్తే.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ 80 పరుగులు చేసి రెండు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షాహీన్ అఫ్రిది టాప్ ప్లేస్‌కు చేరడంతో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పాక్ ఆటగాళ్లే అగ్రస్థానాలను ఆక్రమించినట్లైంది. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 11 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి ఎగబాకాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 98 పరుగులు చేసిన బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 44వ స్థానానికి చేరాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. జింబాబ్వే సికందర్ రజా రెండో స్థానంలో, రషీద్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహిది హసన్ మీరాజ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా 14వ స్థానంలో ఉన్నాడు. -
దశాబ్దకాలం తర్వాత విరాట్ కోహ్లి చేదు అనుభవం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి దశాబ్దకాలం తర్వాత చేదు అనుభవం ఎదురైంది. 10 ఏళ్ల తర్వాత విరాట్ ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-20లో నుంచి బయటికి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన తర్వాత విరాట్ 8 స్థానాలు కోల్పోయి 22వ స్థానానికి పడిపోయాడు. టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ముంబై టెస్ట్‌లో తన ట్విన్ ఫిఫ్టీలకు రివార్డ్ పొందాడు. పంత్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు.న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. జో రూట్, కేన్ విలియమ్సన్ టాప్-2 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో.. ఉస్మాన్ ఖ్వాజా, సౌద్ షకీల్, మార్నస్ లబూషేన్, కమిందు మెండిస్ తలో రెండు స్థానాలు కోల్పోయి 8 నుంచి 11 స్థానాల్లో ఉన్నారు. లంక ఆటగాళ్లు దిముత్ కరుణరత్నే, ధనంజయ డిసిల్వ తలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 14, 15 స్థానాలకు ఎగబాకగా.. టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 26వ స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ముంబై టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై పది వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తర్వాత రవీంద్ర జడేజా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ, ఆసీస్ స్పీడ్‌స్టర్ హాజిల్‌వుడ్, టీమిండియా పేసు గుర్రం బుమ్రా టాప్-3 బౌలర్లుగా కొనసాగుతుండగా.. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ ఓ స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్.. ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. నాథన్ లయోన్, ప్రభాత్ జయసూర్య, నౌమన్ అలీ, మ్యాట్ హెన్రీ టాప్-10లో ఉన్నారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2 ఆల్రౌండర్లుగా కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
టాప్-10లోకి హర్మన్.. సెంచరీ చేసినా మంధనకు నిరాశే..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భారీగా లబ్ది పొందింది. గత వారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన హర్మన్.. మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరింది. న్యూజిలాండ్ సిరీస్ చివరి రెండు ఇన్నింగ్స్‌ల్లో హర్మన్ 83 పరుగులు చేసింది. ఇందులో సిరీస్ డిసైడర్‌లో చేసిన ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఈ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.సెంచరీ చేసినా మంధనకు నిరాశే..!తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధనకు ఎలాంటి లబ్ది చేకూరలేదు. న్యూజిలాండ్ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసినా మంధన ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆమె తన ర్యాంకింగ్ పాయింట్లను గణనీయంగా మెరుగుపర్చుకుంది. ఈ వారం ర్యాంకింగ్ పాయింట్స్‌లో మంధన 703 నుంచి 728 పాయింట్లకు ఎగబాకింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న మంధనకు మూడో ప్లేస్‌లో ఉన్న చమారీ ఆటపట్టుకు కేవలం ఐదు పాయింట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది.ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన నాట్ సీవర్ బ్రంట్ టాప్‌లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ రెండో స్థానంలో ఉంది. భారత ప్లేయర్లలో దీప్తి శర్మ 20వ స్థానంలో ఉండగా.. జెమీమా రోడ్రిగెజ్ 30వ స్థానంలో ఉంది.బౌలింగ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో ఆరు వికెట్లు తీసిన దీప్తి శర్మ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్‌లో తన హావా కొనసాగిస్తుంది. దీప్తికి సోఫీకి మధ్య 67 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ రేణుక సింగ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకగా.. మరో ఇద్దరు భారత బౌలర్లు ప్రియా మిశ్రా, సోయ్మా ఠాకోర్ టాప్-100లోకి ఎంటర్ అయ్యారు. -
అగ్రపీఠాన్ని అధిరోహించిన బుమ్రా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకే చెందిన రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ పలు పాయింట్లు కోల్పోయి 9, 15, 16 స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, లబూషేన్, డారిల్ మిచెల్ 2, 4, 5, 7, 8, 10 స్థానాల్లో ఉన్నారు.ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందిన బ్యాటర్లలో దినేశ్ చండీమల్ (20వ స్థానం), ఏంజెలో మాథ్యూస్ (23వ స్థానం), మొమినుల్ హక్ (42వ స్థానం), కుసాల్ మెండిస్ (43వ స్థానం), కేఎల్ రాహుల్ (49వ స్థానం), షద్మాన్ ఇస్లాం (79), మిచెల్ సాంట్నర్ (88) టాప్-100లో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్ నుంచి బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా 1, 2, 6 స్థానాల్లో ఉండగా.. హాజిల్‌వుడ్, కమిన్స్, రబాడ, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, కైల్ జేమీసన్, షాహీన్ అఫ్రిది టాప్-10లో ఉన్నారు. భారత పేసర్ ఆకాశ్‌దీప్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు మెరుగపర్చుకుని 76వ స్థానానికి చేరాడు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2గా కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ ఓ స్థానం కోల్పోయి ఏడో ప్లేస్‌కు పడిపోయాడు. చదవండి: శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్ -
మెరుగుపడిన యశస్వి, గిల్ ర్యాంక్‌లు.. తలో ఐదు స్థానాలు కోల్పోయిన రోహిత్, విరాట్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో సెంచరీలతో చెలరేగిన శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్ భారీగా ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 14, 72 స్థానాలకు చేరుకోగా.. పంత్ తన రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుని ఆరో స్థానాన్ని కాపాడుకున్నాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ విరాట్ కోహ్లి ఈ వారం ర్యాంకింగ్స్‌లో తలో ఐదు స్థానాలు కోల్పోయి 10, 12 స్థానాలకు దిగజారారు. జో రూట్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్, యశస్వి జైస్వాల్ టాప్-5 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసిన లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తొలిసారి టాప్-10లోకి వచ్చాడు. జయసూర్య ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరాడు. బంగ్లాతో తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా ఓ స్థానం మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. అశ్విన్, బుమ్రా మొదటి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. లంకతో టెస్ట్‌లో రాణించిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి చేరుకోగా.. అదే టెస్ట్‌లో రాణించిన కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 41వ ప్లేస్‌కు చేరాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2గా కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఆరో స్థానంలో నిలిచాడు.చదవండి: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి తలో స్థానం మెరుగుపర్చుకున్నారు. ఈ ముగ్గురు తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు, ఆరు, ఏడు స్థానాలకు ఎగబాకారు. గత కొంతకాలంగా భారత్ టెస్ట్ క్రికెట్ ఆడనప్పటికీ ఈ ముగ్గురి ర్యాంకింగ్స్ మెరుగుపడటం గమనార్హం. వీరితో పాటు టాప్-10లో ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, మార్నస్ లబూషేన్ కూడా తలో స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలకు చేరారు. జో రూట్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్ టాప్-4 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.లంక ఆటగాళ్ల హవాఈ వారం ర్యాంకింగ్స్‌లో శ్రీలంక ఆటగాళ్లు భారీగా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో సత్తా చాటిన ధనంజయ డిసిల్వ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి.. అదే టెస్ట్‌లో రాణించిన కమిందు మెండిస్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి ఎగబాకారు. తాజా ర్యాంకింగ్స్‌లో భారీ లబ్ది పొందిన లంక ఆటగాళ్లలో పథుమ్ నిసాంక ముందువరుసగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నిసాంక ఏకంగా 42 స్థానాలు మెరుగుపర్చుకుని 39వ స్థానానికి ఎగబాకాడు. ఇది మినహా టాప్-100 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ..!టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ లంక ఆటగాళ్లు భారీగా లబ్ది పొందారు. మిలన్ రత్నాయకే 26, విశ్వ ఫెర్నాండో 13, లహీరు కుమార 10 స్థానాలు మెరుగపర్చుకుని 85, 31, 32 స్థానాలకు ఎగబాకారు. ఈ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, జోష్ హాజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా టాప్-3లో కొనసాగుతున్నారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.జడ్డూ@1.. అశ్విన్@2టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. తాజా ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ 1, 2, 6 స్థానాలను నిలబెట్టుకున్నారు. లంక ఆటగాడు మిలన్ రత్నాయకే 22 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు. చదవండి: ’ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసినట్టే’ -
విజ్డెన్ అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు.. కోహ్లికి నో ప్లేస్
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా విజ్డెన్ ఎంపిక చేసిన అత్యుత్తమ టెస్ట్ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా విజ్డెన్ అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం విశేషం. ప్రస్తుత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.వికెట్‌కీపర్ కోటాలో పాక్ ఆటగాడు, ఐసీసీ పదో ర్యాంకర్ మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మతో (ఆరో ర్యాంక్) పాటు ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ (నాలుగో ర్యాంక్) ఎంపికయ్యాడు.Wisden picks Current Best Test XI based on ICC Rankings:1. Rohit Sharma.2. Steve Smith.3. Kane Williamson.4. Joe Root.5. Daryl Mitchell.6. Mohammad Rizwan.7. Ravindra Jadeja.8. Ravi Ashwin.9. Pat Cummins.10. Jasprit Bumrah.11. Josh Hazelwood. pic.twitter.com/xUSQPYjA09— Tanuj Singh (@ImTanujSingh) September 10, 2024వన్ డౌన్లో కేన్ విలియమ్సన్ (రెండో ర్యాంక్), నాలుగో స్థానంలో జో రూట్ (మొదటి ర్యాంక్), ఐదో ప్లేస్‌లో డారిల్ మిచెల్ (మూడో ర్యాంక్), వికెట్‌కీపర్‌గా మొహమ్మద్ రిజ్వాన్ (పదో ర్యాంక్), ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా (నంబర్ వన్ ఆల్‌రౌండర్), స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ (నంబర్ వన్ టెస్ట్ బౌలర్), పేసర్లుగా పాట్ కమిన్స్ (నాలుగో ర్యాంక్), జస్ప్రీత్ బుమ్రా (రెండో ర్యాంక్), జోష్ హాజిల్‌వుడ్ (రెండో ర్యాంక్) విజ్డెన్ అత్యుత్తమ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఓవరాల్‌గా చూస్తే విజ్డెన్ అత్యుత్తమ టెస్ట్ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు, ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఇద్దరు న్యూజిలాండ్ ప్లేయర్లు, ఇంగ్లండ్, పాక్‌ల నుంచి చెరొకరు చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు ఎంపిక కేవలం ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగానే జరిగింది. ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆటగాళ్లను విజ్డెన్ తమ అత్యుత్తమ జట్టుకు ఎంపిక చేసుకుంది. -
12వ స్థానానికి పడిపోయిన బాబర్ ఆజమ్.. టాప్-10లోనే టీమిండియా బ్యాటింగ్ త్రయం
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ 12వ స్థానానికి పడిపోయాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉండిన బాబర్ మూడు స్థానాలు కోల్పోయి చాలాకాలం తర్వాత టాప్-10 బయటికి వచ్చాడు. ఇదొక్కటి మినహా ఈ వారం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. లార్డ్స్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన జో రూట్ గణనీయంగా రేటింగ్ పాయింట్లు పెంచుకుని అగ్రపీఠాన్ని పదిలం చేసుకోగా.. లంకతో రెండో టెస్ట్‌లో పెద్దగా రాణించని హ్యారీ బ్రూక్ ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయాడు. టీమిండియా బ్యాటింగ్ త్రయం రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి 6, 7, 8 స్థానాలను కాపాడుకోగా.. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్ 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. ఈ వారం టాప్-10 అవతల మార్పుల విషయానికొస్తే.. తాజాగా పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో వీరోచిత శతకం బాదిన బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్థానానికి ఎగబాకగా.. లంక ఆటగాడు కమిందు మెండిస్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి చేరాడు. పాక్‌తో రెండో టెస్ట్‌లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసిన మెహిది హసన్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 75వ స్థానానికి చేరగా.. లంకతో టెస్ట్‌లో సెంచరీ చేసిన గస్ అట్కిన్సన్ ఏకంగా 80 స్థానాలు మెరుగుపర్చుకుని 96వ స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో రాణించిన అశిత ఫెర్నాండో 9 స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరుకోగా.. టాప్-10 మిగతా బౌలర్లంతా యధాతథంగా కొనసాగుతున్నారు. అశ్విన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. హాజిల్‌వుడ్, బుమ్రా రెండో స్థానంలో.. కమిన్స్, రబాడ స్థానంలో కొనసాగుతున్నారు. నాథన్ లయోన్ ఆరు, రవీంద్ర జడేజా ఏడు, కైల్ జేమీసన్ తొమ్మిది, మ్యాట్ హెన్రీ పది స్థానాల్లో నిలిచారు. లార్డ్స్ టెస్ట్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అట్కిన్సన్ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానానికి ఎగబాకగా.. బంగ్లాతో టెస్ట్‌లో ఆరు వికెట్లు తీసిన ఖుర్రమ్ షెహజాద్ 35 స్థానాలు మెరుగుపర్చుకుని 60వ స్థానానికి చేరాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న హిట్‌మ్యాన్.. ఓ ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. రోహిత్‌కు కెరీర్లో ఇదే అత్యుత్తమ వన్డే ర్యాంక్. శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ రెండు హాఫ్ సెంచరీలు సహా 157 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, రోహిత్ రెండో ర్యాంక్‌కు ఎగబాకడంతో ఆ స్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్ మూడో స్థానానికి పడిపోయాడు. లంకతో సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయకపోయనా విరాట్ కోహ్లి నాలుగో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ ఓ స్థానం మెరుగుపర్చుకుని విరాట్‌తో సమానంగా నాలుగో స్థానానికి చేరుకోగా.. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన లంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరగా.. డారిల్ మిచెల్, డేవిడ్ వార్నర్, డేవిడ్ మలాన్, వాన్ డెర్ డస్సెన్ 6, 7, 9, 10 స్థానాల్లో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మొహమ్మద్ నబీ, షాహీన్ అఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మహ్మద్ సిరాజ్ టాప్-10లో ఉన్నారు. వన్డే ఆల్‌రౌండర్ల విభాగంలో మొహమ్మద్ నబీ, షకీబ్ అల్ హసన్, సికందర్ రజా టాప్-3లో ఉన్నారు. -
ICC Rankings: మూడో స్థానానికి ఎగబాకిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన హిట్‌మ్యాన్ రేటంగ్ పాయింట్లు గణనీయంగా పెంచుకుని నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరాడు. క్రితం వారం ర్యాంకింగ్స్‌లో మూడో ప్లేస్‌లో ఉండిన విరాట్ కోహ్లి ఓ ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. టీమిండియా యంగ్ గన్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 824 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హ్యారీ టెక్టార్, డారిల్ మిచెల్, డేవిడ్ వార్నర్, డేవిడ్ మలాన్, నిస్సంక, డస్సెన్ టాప్ 10లో ఉన్నారు.ఐదు స్థానాలు ఎగబాకిన కుల్దీప్తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరగా.. కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, కుల్దీప్, మహ్మద్ సిరాజ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మహ్మద్ నబీ, బుమ్రా, షాహీన్ అఫ్రిది టాప్-10 జాబితాలో ఉన్నారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో మహ్మద్ నబీ టాప్‌లో ఉండగా.. షకీబ్ అల్ హసన్, సికందర్ రజా, అస్సద్ వలా, రషీద్ ఖాన్, గెర్హార్డ్ ఎరాస్మస్, మ్యాక్స్‌వెల్, సాంట్నర్, మెహిది హసన్, జీషన్ మక్సూద్ టాప్-10లో ఉన్నారు. -
టాప్ ర్యాంక్ కోల్పోయిన హార్దిక్.. ఏడో స్థానానికి ఎగబాకిన రుతురాజ్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ సత్తా చాటారు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సుడిగాలి శతకంతో ఇరగదీసిన అభిషేక్.. ఎంట్రీలోనే అదుర్స్ అనిపించుకోగా.. అదే మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో రాణించిన రుతు.. 13 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు. అభిషేక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లిస్ట్ అయిన తొలిసారే 75వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్ నుంచి టాప్-10 రుతురాజ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. గత వారమే అగ్రపీఠాన్ని కోల్పోయిన స్కై.. రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్ టీ20 బ్యాటర్‌గా ట్రవిస్ హెడ్ కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, జోస్ బట్లర్, రుతురాజ్, బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్, మార్క్రమ్ వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ఆదిల్ రషీద్, అన్రిచ్ నోర్జే, హసరంగ టాప్-3 బౌలర్లుగా కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, అకీల్ హొసేన్, ఆడమ్ జంపా, ఫజల్హక్ ఫారూఖీ, అక్షర్ పటేల్, తీక్షణ నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ మినహా టాప్-10లో ఎవరూ లేరు. కుల్దీప్ 11, బుమ్రా 14, భిష్ణోయ్ 16, అర్ష్‌దీప్ 19 స్థానాల్లో ఉన్నారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. గత వారం ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండిన హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి పడిపోయాడు. హసరంగ టాప్ ప్లేస్‌కు ఎగబాకాడు. భారత ఆటగాళ్లలో అక్షర్ పటేల్ 12వ స్థానంలో ఉన్నాడు.టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా టాప్-5లో ఉన్నాయి. -
మూడో స్థానానికి ఎగబాకిన హార్దిక్ పాండ్యా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారీ జంప్ కొట్టాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం హార్దిక్ ఖాతాలో 213 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో లంక కెప్టెన్ వనిందు హసరంగ మొదటి స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ రెండో స్థానంలో ఉన్నాడు. హసరంగ ఖాతాలో 222 రేటింగ్ పాయింట్లు ఉండగా.. నబీ ఖాతాలో 214 పాయింట్లు ఉన్నాయి. వరల్డ్‌కప్ ప్రదర్శనల ఆధారంగా తాజా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో చాలా మంది ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. హసరంగ ఒక స్థానాన్ని, నబీ రెండు స్థానాలను, మార్క్రమ్ రెండు స్థానాలను (8వ ర్యాంక్), మ్యాక్స్‌వెల్ మూడు స్థానాలను (15వ ర్యాంక్), రసెల్ ఆరు స్థానాలను (16వ ర్యాంక్) మెరుగుపర్చుకున్నారు. టాప్-20 భారత్ నుంచి హార్దిక్‌తో పాటు అక్షర్ పటేల్ ఉన్నారు. అక్షర్ 130 రేటింగ్ పాయింట్లతో 19వ స్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్ అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడు రోస్టన్ ఛేజ్. ఈ విండీస్ ఆల్‌రౌండర్ ఏకంగా 17 స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి చేరుకున్నాడు.టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే..ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. హాజిల్‌వుడ్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి.. ఆడమ్ జంపా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి.. అక్షర్ పటేల్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి ఎగబాకారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ వారం అందరి కంటే ఎక్కువ లబ్ది పొందింది బుమ్రా, కుల్దీప్ యాదవ్. బుమ్రా ఏకంగా 44 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్ 20 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి జంప్ కొట్టాడు. అలాగే కేశవ్ మహారాజ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 14 స్థానానికి ఎగబాకాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 17, రవి బిష్ణోయ్ 19 స్థానాల్లో ఉన్నారు. -
టీమిండియా వైస్ కెప్టెన్ అరుదైన ఘనత.. ఏకైక ఆసియా క్రికెటర్‌గా రికార్డు
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-5లో చోటు దక్కించుకున్న ఏకైక ఆసియా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మంధన మూడు (వన్డేల్లో), ఐదు (టీ20ల్లో) స్థానాల్లో నిలిచింది.రెండు రోజుల కిందట (జూన్ 16) సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో శతక్కొట్టడంతో (117) మంధన వన్డే ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. టీ20ల విషయానికొస్తే.. మంధన గత వారంలో ఉన్న ఐదో స్థానాన్ని పదిలంగా కాపాడుకుంది.ఆసియా జట్ల నుంచి వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆమె ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ మంధన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (11వ స్థానం), దీప్తి శర్మ (20) టాప్-20లో ఉన్నారు. టీ20ల్లో మంధన తర్వాత హర్మన్‌ప్రీత్ (13), షఫాలీ వర్మ (15), జెమీమా రోడ్రిగెజ్ (19) టాప్-20లో ఉన్నారు.ఇదిలా ఉంటే, మహిళల జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా వన్డేల్లో ఐదు, టీ20ల్లో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండు ఫార్మాట్లలో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. -
ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
ఐసీసీ మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. టీమిండియాను వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 టైటిల్ గెలిచిన కంగారూ జట్టు 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రన్నరప్ టీమిండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.ఇక ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయినా వన్డే, టీ20లలో మాత్రం టాప్ ర్యాంకు పదిలంగా ఉంది.పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ సేన ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-51. ఆస్ట్రేలియా- 124 రేటింగ్ పాయింట్లు2. ఇండియా- 120 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 105 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 103 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 96 రేటింగ్ పాయింట్లు.మెన్స్ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా -122 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 116 రేటింగ్ పాయింట్లు3. సౌతాఫ్రికా- 112 రేటింగ్ పాయింట్లు4. పాకిస్తాన్- 106 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 101 రేటింగ్ పాయింట్లుమెన్స్ టీమ్ టీ20 ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా- 264 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 257 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 252 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 250 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 250 రేటింగ్ పాయింట్లుచదవండి: -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన మార్క్ చాప్మన్, షాహీన్ అఫ్రిది
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌ను ఇవాళ (ఏప్రిల్ 23) విడుదల చేసింది. ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడు ఫార్మాట్లలో టాప్‌లో కొనసాగుతుంది.వ్యక్తిగత ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, షాహీన్ అఫ్రిది, ఐష్ సోధి, టిమ్ సీఫర్ట్ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. పాకిస్తాన్‌తో ఇటీవల జరిగిన టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాప్మన్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 33వ స్థానానికి ఎగబాకగా.. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (టీ20) 3 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అఫ్రిది రెండు స్థానాలు మెరుగపర్చుకుని 17వ స్థానానికి చేరుకున్నాడు. కివీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ 27వ స్థానం నుంచి 24కు.. సోధి 23 స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఎయిరీ తొలిసారి టాప్-50 బ్యాటర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తద్వారా నేపాల్ తరఫున టాప్-50లో చోటు దక్కించుకున్న నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్ కప్‌లో హాంగ్‌కాంగ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కారణంగా ఎయిరీ ర్యాంకింగ్స్‌లో మార్పు వచ్చింది.ఇవి కాకుండా తాజా ర్యాంకింగ్స్‌లో చెపుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్, వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్, టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతున్నారు. టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. అశ్విన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కేశవ్ మహారాజ్, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతున్నారు. -
దూసుకొస్తున్న జైస్వాల్.. కెరీర్ బెస్ట్ సాధించిన జురెల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టెస్ట్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసిన యశస్వి జైస్వాల్ (73, 37), శుభ్‌మన్ గిల్ (38, 52 నాటౌట్), దృవ్ జురెల్ (90, 39 నాటౌట్) ర్యాంకింగ్స్ భారీ జంప్ కొట్టి కెరీర్ అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. యశస్వి మూడు స్థానాలను మెరుగుపర్చుకుని టాప్ 10 దిశగా (12వ స్థానం) దూసుకువస్తుండగా.. గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జురెల్ 31 స్థానాలు మెరుగుపర్చుకుని 69 స్థానానికి ఎగబాకారు. ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి టాప్-10లో విరాట్ కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌కు దూరంగా ఉండటంతో అతని ర్యాంక్ ఏడు నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానాన్ని కోల్పోయి 13వ ప్లేస్‌కు పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజా ఒకటి, రెండు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా.. రబాడ, కమిన్స్, హాజిల్‌వుడ్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మరో భారత స్పిన్నర్ కుల్దీప్ రాంచీ టెస్ట్‌లో మెరుగైన ప్రదర్శన కారణంగా 10 స్థానాలు మెరుగపర్చుకుని కెరీర్ అత్యుత్తమ 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌తో నాలుగో టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 80వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ పెద్దగా మార్పులేమీ జరగలేదు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ జో రూట్ మాత్రం మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ప్లేస్‌కే చేరాడు. -
సత్తా చాటిన టీమిండియా ఓపెనర్లు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన యశస్వి ఒక్కసారిగా 14 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ ర్యాంక్‌కు దూసుకురాగా.. రాజ్‌కోట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపర్చుకుని 12వ స్థానానికి ఎగబాకాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి కేవలం విరాట్ కోహ్లికి మాత్రమే చోటు దక్కింది. విరాట్.. ఇటీవల భారత్ ఆడిన మూడు టెస్ట్‌లకు దూరంగా ఉన్నా తన ఏడో ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు స్థానాలు కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోగా.. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ నాలుగు నుంచి మూడుకు.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో వరుస సెంచరీలతో విజృంభించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకోగా.. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో ప్లేస్‌కు చేరగా.. భారత్‌తో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం సాధించిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రాజ్‌కోట్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇరగదీసిన టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ప్లేస్‌కు ఎగబాకగా..అదే రాజ్‌కోట్ టెస్ట్‌లో 500 వికెట్ల మైలురాయికి తాకిన రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు. ఈ విభాగంలో భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకోగా.. రబాడ, కమిన్స్, హాజిల్‌వుడ్ 3 నుంచి 5 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ప్లేయర్లు జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. -
ఐసీసీ అగ్రపీఠంపై కొత్త ఆటగాడు.. ఐదేళ్ల తర్వాత..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ స్థానంలో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా షకీబ్ వన్డేలకు దూరంగా ఉండటం.. ఈ మధ్యలో నబీ సత్తా చాటడంతో వీరిద్దరి ర్యాంక్‌లు తారుమారయ్యాయి. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డేలో సెంచరీతో పాటు వికెట్ తీయడంతో నబీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన లంక ఆటగాడు పథుమ్ నిస్సంక 10 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి చేరగా.. మూడో వన్డేలో 97 పరుగులతో అజేయంగా నిలిచిన నిస్సంక సహచరుడు అసలంక 5 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. కేశవ్ మహారాజ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, కుల్దీప్ నాలుగు, ఐదు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన కేన్ విలియమ్సన్ టాప్ ప్లేస్‌ను మరింత పదిలం చేసుకోగా.. భారత ఆటగాళ్లు విరాట్ ఏడులో, పంత్, రోహిత్ శర్మ 12, 13 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో బుమ్రా టాప్‌లో కొనసాగుతుండగా.. అశ్విన్ 3, రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచారు. సిరాజ్, షమీ 19, 20 స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్ ఆరో ప్లేస్‌లో నిలిచాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. -
చరిత్ర సృస్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ఎవరికీ సాధ్యంకాని రికార్డులు సొంతం
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సహచరుడు అశ్విన్‌ను మూడో స్థానానికి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకాడు. విశాఖ టెస్ట్‌లో సంచలన ప్రదర్శనల నేపథ్యంలో బుమ్రాకు టాప్ ర్యాంక్ దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బుమ్రా 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు ముందు బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానం దక్కించుకోవడం ద్వారా బుమ్రా పలు రికార్డులు నెలకొల్పాడు. భారత్ తరఫున టెస్ట్‌ల్లో టాప్ ర్యాంక్ దక్కించుకున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా (బుమ్రాకు ముందు భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ సింగ్ బేడీ టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానం దక్కించుకున్నారు) నిలిచాడు. అలాగే విరాట్ కోహ్లి తర్వాత అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌గా నిలిచిన రెండో ఆసియా ప్లేయర్‌గా, ఓవరాల్‌గా నాలుగో క్రికెటర్‌గా (హేడెన్, పాంటింగ్, కోహ్లి తర్వాత) రికార్డుల్లోకెక్కాడు. గతంలో బుమ్రా వేర్వేరు సందర్భాల్లో వన్డే, టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు బుమ్రా మరో భారీ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో టాప్ ర్యాంక్ సాధించిన తొలి బౌలర్‌గా, తొలి పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ వరుస ఇలా ఉంది. బుమ్రా రబాడ అశ్విన్ కమిన్స్ హాజిల్‌వుడ్ ప్రభాత్ జయసూర్య జేమ్స్ఆండర్సన్ నాథన్ లయోన్ రవి జడేజా ఓలీ రాబిన్సన్ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో భారత్ నుంచి విరాట్ కోహ్లి (ఏడో ర్యాంక్) ఒక్కడే టాప్ 10లో ఉన్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన కివీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్ రేటింగ్ పాయింట్స్‌ను మరింత పెంచుకుని అగ్రపీఠాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టాప్ టెన్ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ వరుస ఇలా ఉంది. కేన్ విలియమ్సన్ స్టీవ్ స్మిత్ జో రూట్ డారిల్ మిచెల్ బాబర్ ఆజమ్ ఉస్మాన్ ఖ్వాజా విరాట్ కోహ్లి హ్యారీ బ్రూక్ దిముత్ కరుణరత్నే మార్నస్ లబూషేన్ జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరి 117 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఐదో ప్లేస్‌కు ఎగబాకాడు. -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్, అక్షర్ పటేల్
ఐసీసీ తాజాగా (భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20 అనంతరం) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, బౌలింగ్‌లో అక్షర్ పటేల్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించిన యశస్వి.. ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఇదే సిరీస్‌లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో ఆడనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌ను కాపాడుకోగా.. ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరమైన రుతురాజ్ ఓ స్థానం కోల్పోయి తొమ్మిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో ఫిలప్ సాల్ట్, మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ ఎఫెక్ట్ సహచర బౌలర్ రవి భిష్ణోయ్పై పడింది. తాజా ర్యాంకింగ్స్‌లో బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఆరో ప్లేస్‌కు పడిపోయాడు. జింబాబ్వే సిరీస్‌లో రాణించిన లంక బౌలర్లు హసరంగ, తీక్షణ ఒకటి, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని సంయుక్తంగా మూడో స్థానానికి ఎగబాకారు. ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అకీల్ హొసేన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో ప్లేస్‌కు చేరాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న ముగిసిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
సత్తా చాటిన కోహ్లి, రోహిత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సత్తా చాటారు. చాలాకాలం తర్వాత ఈ ఇద్దరూ టాప్-10లోకి వచ్చారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 172 పరుగులతో రాణించిన కోహ్లి 775 రేటింగ్ పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకగా.. అదే దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించిన హిట్‌మ్యాన్ 748 రేటింగ్ పాయింట్లు సాధించి 14 నుంచి పదో స్థానానికి చేరాడు. Virat Kohli moves to number 6 in ICC Test batters ranking. - The GOAT is coming for the Top. 🐐 pic.twitter.com/m99Tii4eSW — Johns. (@CricCrazyJohns) January 9, 2024 తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-3 బ్యాటర్స్‌లో (కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్) ఎలాంటి మార్పు లేకపోగా.. ఆసీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో దారుణంగా విఫలమైన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండు స్థానాలు కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకగా.. అతని సహచరుడు ఉస్మాన్ ఖ్వాజా నాలుగు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. Rohit Sharma moves to number 10 in ICC Test batters ranking. - Hitman is back in the Top 10. ⭐ pic.twitter.com/T8evWfahYv — Johns. (@CricCrazyJohns) January 9, 2024 బౌలింగ్ విషయానికొస్తే.. కేప్‌టౌన్ టెస్ట్‌లో ఆరేసి ఇరగదీసిన టీమిండియా పేసర్లు సిరాజ్ (17), బుమ్రా (4) ర్యాంకింగ్స్‌ను భారీగా మెరుగుపర్చుకోగా.. సౌతాఫ్రికా సిరీస్‌లో సరైన అవకాశాలు రాని రవీంద్ర జడేజా ఓ స్థానం కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు. పాక్‌తో సిరీస్‌లో హ్యాట్రిక్ ఐదు వికెట్ల ప్రదర్శనలతో ఇరగదీసిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో స్థానానికి ఎగబాకగా.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. -
టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ.. రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికాపై గెలిచినా..!
కేప్‌టౌన్ టెస్ట్‌లో సౌతాఫ్రికాపై గెలిచి జోష్ మీదున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చాలాకాలం తర్వాత భారత జట్టు టెస్ట్‌ల్లో నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయింది. పాకిస్తాన్‌పై సిరీస్ విజయంతో (2-0) ఆస్ట్రేలియా భారత్‌ను కిందకు దించి ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. కేప్‌టౌన్ టెస్ట్‌లో భారత్ గెలుపొందినా.. సిరీస్ డ్రా (1-1) కావడంతో రోహిత్ సేన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికాపై గెలుపుతో అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానానికి చేరిన భారత్‌కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పరాభవాన్నిమరువకముందే ఆసీస్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టింది. అయితే టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానం ఆసీస్‌కు మూన్నాళ్ల ముచ్చటగానే మిగలవచ్చు. త్వరలో భారత్.. ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుండటంతో ర్యాంకింగ్స్‌లో మార్పులకు తప్పక ఆస్కారం ఉంటుంది. ఆసీస్, భారత్‌ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కూడా చాలా తక్కువగా (1) ఉండటంతో ర్యాంకింగ్స్ తారుమారు కావడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆసీస్ 118 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. భారత్ 117 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల తర్వాత మూడో స్థానంలో ఇంగ్లండ్ (115), నాలుగో ప్లేస్‌లో సౌతాఫ్రికా (106), ఐదో స్థానంలో న్యూజిలాండ్ (95), ఆరో స్థానంలో పాకిస్తాన్ (92), ఏడో స్థానంలో శ్రీలంక (79), ఎనిమిదో స్థానంలో వెస్టిండీస్ (77), తొమ్మిదో ప్లేస్‌లో బంగ్లాదేశ్ (51), పదో స్థానంలో జింబాబ్వే (32) జట్లు ఉన్నాయి. -
తొమ్మిదో స్థానానికి ఎగబాకిన విరాట్.. టాప్ 10లో ఒకే ఒక్కడు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాటర్ విరాటే కావడం విశేషం. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ప్రదర్శన (38, 76) ఆధారంగా విరాట్ నాలుగు స్థానాలు (761 రేటింగ్ పాయింట్లు) మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. ఇదే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ (101) సైతం భారీగా పాయింట్లు మెరుగుపర్చుకుని (508 పాయింట్లు) 51వ స్థానానికి చేరాడు. రాహుల్ తన శతక ప్రదర్శనతో ఏకంగా 11 స్థానాలు ఎగబాకాడు. మరోవైపు తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు స్థానాలు దిగజారి 14వ స్థానానికి పడిపోగా.. యాక్సిడెంట్ కారణంగా ఏడాదికాలంగా జట్టుకు దూరంగా ఉన్న రిషబ్ పంత్ 12వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లు పుజారా 35, రవీంద్ర జడేజా 38, శ్రేయస్ అయ్యర్ 42, అజింక్య రహానే 44, అక్షర్ పటేల్ 50, శుభ్‌మన్ గిల్ 55, యశస్వి జైస్వాల్ 69, అశ్విన్ 79, శార్దూల్ ఠాకూర్ 99వ స్థానాల్లో నిలిచారు. తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. జో రూట్, స్టీవ్ స్మిత్ ఆతర్వాతి స్థానాలను కాపాడుకున్నారు. మరో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరగా.. ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ నాలుగు స్థానాలు కోల్పోయి 10వ స్థానానికి పడిపోయాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో అశ్విన్ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. జడేజా, బుమ్రా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. షమీ రెండు స్థానాలు పడిపోయి 20వ స్థానానికి చేరగా.. సిరాజ్ 30, అక్షర్ పటేల్ 32 స్థానాల్లో నిలిచారు. భారత్‌తో తొలి టెస్ట్‌లో రెచ్చిపోయిన రబాడ రెండు స్థానాన్ని పదిలం చేసుకోగా.. పాకిస్తాన్‌తో రెండో టెస్ట్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో ఇరగదీసిన కమిన్స్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే టాప్ 10లో నిలిచాయి. -
మళ్లీ అగ్రపీఠంపై బాబర్.. టాప్ ర్యాంక్‌లు కోల్పోయిన గిల్, భిష్ణోయ్
ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లకు చేదు ఫలితాలు వచ్చాయి. గత వారం టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు చేరుకున్న రవి భిష్ణోయ్.. గత కొంతకాలంగా టాప్ వన్డే బ్యాటర్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్ తమ అగ్రస్థానాలను కోల్పోయారు. గిల్ (810), భిష్ణోయ్ ఈ మధ్యకాలంలో (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భిష్ణోయ్.. వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్) ఆయా ఫార్మాట్లలో ఆడకపోవడం వల్ల టాప్ ర్యాంక్‌లు కోల్పోయారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడని కోహ్లి (775) కూడా రేటింగ్ పాయింట్లు కోల్పోయినప్పటికీ, మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు. వన్డే ఫార్మాట్లో భారత ఆటగాళ్ల గైర్హాజరీలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (824) తిరిగి నంబర్ వన్ పీఠాన్ని అధిరోహించాడు. సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో పేట్రేగిపోయిన సూర్యకుమార్ యాదవ్ టీ20 నంబర్ వన్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకోగా.. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ హోదాలో కొనసాగుతున్నాడు. టీ20 టాప్ బౌలర్ విషయానికొస్తే.. విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రాణిస్తున్న ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్ ర్యాంక్‌కు చేరుకోగా.. రషీద్ ఖాన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భిష్ణోయ్ రెండు స్థానాలు దిగజారి మూడో ప్లేస్‌కు పడిపోయాడు. వన్డే బౌలర్ల విషయానికొస్తే.. కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హాజిల్‌వుడ్, సిరాజ్, జంపా, బుమ్రా టాప్-5లో నిలిచారు. కుల్దీప్ 8, షమీ 11, జడేజా 22 స్థానాల్లో ఉన్నారు. నంబర్ వన్ టెస్ట్ బౌలర్ విషయానికొస్తే.. అశ్విన్ తన టాప్ ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకోగా..జడేజా 4, షమీ 18, సిరాజ్ 29 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. -
అగ్రపీఠాన్ని మరింత సుస్థిరం చేసుకున్న సూర్యకుమార్
భారత టీ20 జట్టు తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్లో తన బ్యాటింగ్ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 12) జరిగిన రెండో టీ20లో మెరుపు అర్ధసెంచరీ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించిన స్కై.. 10 రేటింగ్ పాయింట్లు అదనంగా కూడగట్టుకుని, తన సమీప ప్రత్యర్ధులందరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం స్కై ఖాతాలో 865 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న మొహమ్మద్ రిజ్వాన్ ఖాతాలో 787 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం 78 పాయింట్లుగా ఉంది. టాప్ 10 ర్యాంకింగ్స్‌లో స్కై తర్వాత 700కు పైగా పాయింట్లు కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే ఉన్నాయి. రిజ్వాన్ 787, మార్క్రమ్ 758, బాబర్ ఆజమ్ 734 పాయింట్లు కలిగి ఉన్నారు. టాప్-10 ఉన్న మరో భారత ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (ఏడో ర్యాంక్) అనారోగ్యం కారణంగా సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడలేకపోవడంతో అతని ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. సూర్యకుమార్ ప్రస్తుత ఫామ్‌ను మరికొద్ది రోజుల పాటు కొనసాగించగలిగితే టీ20 వరల్డ్‌కప్ 2024లో టాప్ ర్యాంకింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడు. మరోవైపు సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడిన రింకూ సింగ్ ఏకంగా 46 స్థానాలు మెరుగుపర్చుకుని 59వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ప్లేస్‌కు చేరాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. పొట్టి ఫార్మాట్లో ఇటీవలే టాప్ ర్యాంక్ దక్కించుకున్న భారత అప్‌కమింగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్.. సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడే అవకాశం రాకపోవడంతో ఎలాంటి రేటింగ్ పాయింట్లు సాధించలేకపోయాడు. ప్రస్తుతానికి రవి తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నప్పటికీ.. ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రూపంలో అతనికి ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు బౌలర్లు సమానంగా 692 రేటింగ్ పాయింట్లు కలిగి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టాప్ 10లో రవి మినహా భారత్ నుంచి ఎవ్వరికీ ప్రాతినిథ్యం లభించకపోగా.. హసరంగ, ఆదిల్ రషీద్, తీక్షణ, సామ్ కర్రన్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్, అకీల్ హొసేన్, తబ్రేజ్ షంషి వరుసగా 3 నుంచి 10 స్థానాలో నిలిచారు. -
ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు శుభసూచకం.. ఈసారి ట్రోఫీ పక్కాగా మనదే..!
2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు వరుస శుభసూచకాలు ఎదురవుతున్నాయి. 2011 వరల్డ్‌కప్ లాగా ఈసారి కూడా మెగా టోర్నీ భారత్‌లోనే జరుగుతుండటం మొదటి శుభసూచకమైతే.. రెండోది టీమిండియా ఆటగాళ్ల అరివీర భయంకరమైన ఫామ్. ఈ రెంటితో పాటు భారత్‌కు తాజాగా మరో శుభసూచకం కూడా ఎదురైంది. అదేంటంటే.. ఈసారి భారత్ ప్రపంచ నంబర్ వన్ జట్టుగా బరిలోకి దిగనుండటం. ప్రపంచ నంబర్ వన్ జట్టైనంత మాత్రాన భారత్ వరల్డ్‌కప్ ఎలా గెలుస్తుందని చాలామందికి సందేహం కలగవచ్చు. అయితే ఇది చూడండి.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ వన్ వన్డే జట్టుగా ఆవతరించిన విషయం తెలిసిందే. వన్డేలతో పాటు భారత్ మూడు ఫార్మాట్లలోనూ టాప్ జట్టుగా కొనసాగుతుంది. ఆసీస్‌పై తొలి వన్డేలో విజయంతో భారత్ ఈ అరుదైన ఘనతను సాధించింది. వరల్డ్ నంబర్ వన్ జట్టు హోదాలోనే భారత్ ప్రపంచకప్ బరిలోకి కూడా దిగనుంది. చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. గత రెండు వన్డే వరల్డ్‌కప్‌ల్లో నంబర్ వన్ జట్లుగా బరిలోకి దిగిన జట్లే జగజ్జేతలుగా ఆవిర్భవించాయి. 2015 వరల్డ్‌కప్‌లో నంబర్ వన్ టీమ్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఐదోసారి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించగా.. 2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ కూడా నంబర్ వన్ వన్డే జట్టుగా బరిలోకి దిగి తమ తొలి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అంతకుముందు 2003, 2007 ఎడిషన్లలో కూడా ఆస్ట్రేలియా నంబర్ వన్ వన్డే జట్టుగా వరల్డ్‌కప్ బరిలోకి దిగి టైటిల్ చేజిక్కించుకుంది.ఈ లెక్కన ఈసారి నంబర్ వన్ వన్డే జట్టుగా రంగంలోకి దిగుతున్న భారత్.. వన్డే ప్రపంచకప్‌కు ముచ్చటగా మూడోసారి ముద్దాడటం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. -
ఆసీస్‌తో తొలి వన్డే.. టీమిండియాను ఊరిస్తున్న అరుదైన రికార్డు
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా ఆసీస్‌తో రేపు (సెప్టెంబర్ 22) జరుగబోయే తొలి వన్డేకు ముందు టీమిండియాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. రేపటి మ్యాచ్‌లో భారత్.. ఆసీస్‌ను ఓడిస్తే, వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకడంతో పాటు ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండో జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుతుంది. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్.. రేపటి మ్యాచ్‌లో గెలిస్తే అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా అరుదైన గుర్తింపు దక్కించుకుంటుంది. గతంలో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన ఏకైక జట్టుగా దక్షిణాఫ్రికా పేరిట రికార్డు ఉంది. సఫారీ టీమ్ 2014లో హషీమ్ ఆమ్లా నేతృత్వంలో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలిచింది. అప్పట్లో దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్, జాక్ కల్లిస్, గ్రేమ్ స్మిత్, మోర్నీ మోర్కెల్, మఖాయ ఎన్తిని, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి హేమాహేమీలు ఉండేవారు. సౌతాఫ్రికా తర్వాత ఆ ఘనతను భారత్ సాధించిందని ఈ ఏడాది ఆరంభంలో ప్రచారం జరిగినప్పటికీ.. అది ఐసీసీ వెబ్సైట్లో సాంకేతిక లోపం కారణంగానే జరిగిందని తేలడంతో టీమిండియా అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే ఆ అవకాశం భారత్‌కు మళ్లీ ఇప్పుడు వచ్చింది. రేపటి మ్యాచ్‌లో గెలిస్తే సౌతాఫ్రికా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కుతుంది. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు.. రేపటి మ్యాచ్‌లో పటిష్టమైన ఆసీస్‌ను ఎలాగైనా మట్టికరిపించాలని ఉవ్విళ్లూరుతుంది. ఆసీస్ స్టార్ ఆటగాళ్ల గాయాల బెడద ఈ విషయంలో భారత్‌కు తోడ్పడేలా ఉంది. ఆసీస్ కీలక ప్లేయర్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయాల కారణంగా రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆసీస్‌ను దెబ్బకొట్టేందుకు భారత్‌కు ఇదే సరైన సమయం. మరోవైపు భారత్ సైతం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతుంది. వరల్డ్‌కప్‌కు ముందు ఎక్కువగా ఎక్స్పోజ్ కాకూడదనే ఉద్దేశంతో భారత సెలక్టర్లు రోహిత్, కోహ్లి సహా పలువురు స్టార్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. వీరంతా మూడో వన్డేలో జట్టుతో కలుస్తారు. టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగం.. ‘మిస్ యు పప్పా’ అంటూ!
దుబాయ్: ఆసియా కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 694 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 9వ స్థానంలో ఉన్న ఈ హైదరాబాదీ ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. వన్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ టాప్‌గా నిలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో నంబర్‌వన్‌గా నిలిచిన అతను రెండు నెలల తర్వాత ఆసీస్ పేసర్ జోష్ హాజల్‌వుడ్‌కు ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఆసియా కప్ ఫైనల్లో 21 పరుగులకే 6 వికెట్లు తీసిన ప్రదర్శనతో ఇప్పుడు మళ్లీ శిఖరానికి చేరాడు. సిరాజ్ తీవ్ర భావోద్వేగం కెరీర్లో అత్యుత్తమ దశను చూస్తున్న సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశాడు. కొంత కాలం క్రితం చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ‘మిస్ యు పాపా’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. తనను తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్న ఫోటోను వారిద్దరు చూస్తున్న చిత్రానికి తాను గ్రౌండ్లో ఆడుతున్న ఫోటోను అతను జత చేశాడు. చదవండి: ‘నా అకౌంట్లో 80 వేలే ఉన్నాయి’.. భారత టెన్నిస్ స్టార్ ఆవేదన -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా.. అన్ని విభాగాల్లో టాప్‌లో మనమే..!
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా కొనసాగుతుంది. తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ 51 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్ విభాగంలో యువ కెరటం శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌కు అతి చేరువయ్యాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉన్న బాబర్ ఆజమ్‌కు (857) గిల్‌కు (814) మధ్య తేడా కేవలం 43 పాయింట్లు మాత్రమే. ఎల్లుండి నుంచి ఆసీస్‌తో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గిల్ ఒక్క కీలక ఇన్నింగ్స్ ఆడినా బాబర్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకుంటాడు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా టీమిండియా హవా కొనసాగుతుంది. ఆసియా కప్-2023 గెలిచి జోష్‌మీదున్న భారత్.. పాకిస్తాన్‌తో సరిసమానమైన రేటింగ్ పాయింట్లు (115) కలిగి రెండో స్థానంలో ఉంది. ఈనెల 22న ఆసీస్‌తో జరిగే తొలి వన్డేలో గెలిస్తే భారత్ అగ్రస్థానానికి ఎగబాకుతుంది. తద్వారా టెస్ట్, టీ20, వన్డే ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుంది. ఇప్పటికే భారత్ టెస్ట్, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో భారత్ నంబర్ వన్ జట్టుగా ఉండనే ఉంది. టీ20 నంబర్ వన్ బ్యాటర్‌గా సూర్యకుమార్ తన హవాను కొనసాగిస్తుండగా.. టీ20 నంబర్ 2 ఆల్‌రౌండర్‌గా హార్ధిక్ సత్తా చాటాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో టీమ్ భారత్ గతకొంతకాలంగా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. టెస్ట్‌ల్లో చాలాకాలంగా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతున్న భారత్.. వ్యక్తిగత ప్రదర్శనల్లోనూ సత్తా చాటుతూ అన్ని విభాగాల్లో అగ్రస్థానాల్లో కొనసాగుతుంది. నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా అశ్విన్, నంబర్ 3 బౌలర్‌గా జడేజా.. ఆల్‌రౌండర్ల విభాగంలో తొలి రెండు స్థానాల్లో జడేజా, అశ్విన్‌లు కొనసాగుతున్నారు. ఇలా టీమిండియా, టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దాదాపుగా అన్ని విభాగాల్లో టాప్ ప్లేస్ల్లో కొనసాగుతున్నారు. అతి త్వరలో భారత్ నంబర్ వన్ వన్డే జట్టుగా, గిల్ నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. -
దోబూచులాడుతున్న టాప్ ర్యాంకింగ్.. మళ్లీ నంబర్ వన్ స్థానానికి చేరిన పాక్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం మూడు జట్ల మధ్య దోబూచులాడుతుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ముందు టాప్ ప్లేస్ పాకిస్తాన్, భారత్, ఆస్ట్రేలియా జట్లతో మ్యూజికల్ ఛైర్స్ గేమ్ ఆడుతుంది. ఈ మూడు జట్లలో ఒక్కో జట్టు ఒక్కో రోజు అగ్రస్థానంలో ఉంటుంది. ఈ నెలలో ఏ జట్టు వరుసగా ఓ వారం పాటు టాప్ ప్లేస్‌లో లేదు. మూడు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం ఒకటి, అర ఉండటమే ఈ దోబూచులాటకు కారణం. సెప్టెంబర్ 14న అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాతో ఐదో వన్డేలో ఓటమిపాలు కావడంతో తమ అగ్రపీఠాన్ని పాక్‌కు చేజార్చుకుంది. పాక్.. ఆసియా కప్-2023లో సూపర్ ఫోర్ దశలోనే నిష్క్రమించినా తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇదే సమయంలో టీమిండియా ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నా.. సూపర్ ఫోర్ దశలో బంగ్లాదేశ్‌తో చేతిలో ఓడిపోవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత్, పాక్‌లకు సమానంగా 115 పాయింట్లు ఉన్నా పాక్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 113 పాయింట్లు కలిగి ఉంది. టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 22న ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. ఇదే గనక జరిగితే టీమిండియా ఒకేసారి మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగే జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది. భారత్ ప్రస్తుతం టెస్ట్, టీ20ల్లో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఆసీస్‌తో సిరీస్‌ను భారత్ గెలిస్తే అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో ఉన్న జట్టుగా ప్రపంచకప్ బరిలోకి దిగుతుంది. కాగా, ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్‌కప్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 14న భారత్.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. -
Asia Cup 2023: లంక చేతితో ఓటమి.. పాకిస్తాన్‌కు షాక్
ఆసియా కప్-2023లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన కీలక సూపర్-4 సమరంలో పాక్.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. కీలక ఆటగాళ్లంతా గాయపడినా, ఓ మోస్తరు స్కోర్ చేసి చివరి నిమిషం వరకు పోరాడినా, పాక్ లంకపై గెలువలేకపోయింది. ఈ ఓటమితో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించడమే కాకుండా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని కోల్పోయింది. ఇవాళ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పాక్ రెండు స్థానాలు దిగజారి మూడో ప్లేస్‌కు పడిపోగా.. సౌతాఫ్రికా చేతిలో మూడో వన్డేలో ఓడినప్పటికీ రెండో ప్లేస్‌లో ఉండిన ఆస్ట్రేలియా అగ్రస్థానానికి ఎగబాకింది. పాక్ మూడో స్థానానికి పడిపోవడంతో ఆ స్థానంలో ఉన్న భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. టాప్-3 స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా (118), భారత్ (116), పాకిస్తాన్ (115)ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కేవలం 3 పాయింట్లే ఉండటంతో అగ్రస్థానం ఈ మూడు జట్ల మధ్య దోబూచులాట ఆడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచి, సౌతాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా కోల్పోతే, వరల్డ్‌కప్‌లో భారత్ నంబర్ వన్ జట్టుగా బరిలోకి దిగుతుంది. వన్డేల్లో భారత్ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధిస్తే.. ఒకేసారి మూడు ఫార్మాట్లలో టాప్ ర్యాంకింగ్ సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది. భారత్ ఇప్పటికే టెస్ట్‌ల్లో, టీ20ల్లో నంబర్ వన్ జట్టుగా చలామణి అవుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై గెలవడంతో శ్రీలంక ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుని, సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. సూపర్-4 దశలో శ్రీలంక.. పాక్, బంగ్లాదేశ్‌లపై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడగా.. భారత్.. పాక్, శ్రీలంకను ఓడించి, ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 78/4గా ఉంది. తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13) ఔట్ కాగా.. షకీబ్ (34), తౌహిద్ హ్రిదోయ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
టాప్-10లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు.. నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు. ఏకంగా ముగ్గురు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్-2023లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 154 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌కు ఎగబాకగా.. ఇదే ఆసియా కప్‌లో పాక్‌పై సూపర్ సెంచరీతో ఇరగదీసిన కోహ్లి రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రోహిత్ సైతం రెండు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో ప్లేస్‌కు చేరుకున్నాడు. గడిచిన ఐదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2019 జనవరిలో చివరిసారి ముగ్గురు టీమిండియా బ్యాటర్లు టాప్-10లో ఉన్నారు. నాడు శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. తాజాగా ర్యాంకింగ్స్‌లో భారత్‌తో పాటు పాక్‌కు చెందిన ఆటగాళ్లు కూడా ముగ్గురు టాప్-10లో ఉండటం విశేషం. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇమామ్ ఉల్ హాక్ ఓ స్థానం దిగజారి ఐదులో.. అతని సహచరుడు ఫఖర్ జమాన్ మూడు స్థానాలు కోల్పోయి 10వ స్థానానికి పడిపోయాడు. బౌలింగ్ విషయానికొస్తే.. భారత టాప్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసియా కప్‌లో తన అద్భుత ప్రదర్శన (పాక్‌పై 5 వికెట్లు, శ్రీలంకపై 4 వికెట్లు) కారణంగా ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తన తొమ్మిదో స్థానాన్ని కాపాడుకున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ రాణిస్తున్న జోష్ హాజిల్‌వుడ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సహచరుడు మిచెల్ స్టార్క్, కివీస్ పేస్ గన్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో సంయుక్తంగా నిలిచారు. కాగా, టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియా-పాకిస్తాన్-భారత్‌ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుంది. ఆసీస్, పాక్‌లు చెరి 118 పాయింట్లతో 1,2 స్థానాల్లో కొనసాగుతుండగా.. 116 పాయింట్లతో టీమిండియా మూడో ప్లేస్‌లో నిలిచింది. మూడు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కేవలం 2 పాయింట్లే కావడంతో వచ్చే వారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో తప్పక మార్పులు జరగవచ్చు. -
వన్డేల్లో నెం1 జట్టుగా ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి
అంతర్జాతీయ వన్డేల్లో ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్ వన్‌గా జట్టుగా అవతరించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్ధానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికాతో 5 టీ20 సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో విజయం సాధించిన ఆసీస్.. పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. వన్డే ర్యాంకింగ్స్‌లో 121 రేటింగ్‌తో ఆసీస్ ఆగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్ 120 రేటింగ్‌తో రెండో స్ధానంలో ఉంది. ఇక భారత జట్టు 114 రేటింగ్‌తో మూడో ర్యాంక్‌లో ఉంది. కాగా ఆసియాకప్ సూపర్-4లో భాగంగా భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఆదివారం జరగనుండడంతో మళ్లీ ర్యాంక్‌లు తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. వార్నర్, లబుషేన్ సెంచరీలు ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై 123 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. డేవిడ్ వార్నర్(106), లబుషేన్(124) సెంచరీలతో చెలరేగగా.. హెడ్(64), జోష్ ఇంగ్లీష్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ షమ్సీ నాలుగు వికెట్లు సాధించగా.. రబాడ రెండు, మార్కో జానెసన్ వికెట్ పడగొట్టారు. 393 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 41.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లతో చెలరేగాడు. చదవండి: కోహ్లితో ఎక్కువ మాట్లాడకండి.. అతడిని ఎలా అయినా ఔట్ చేయాలి: అక్తర్ -
నాలుగో స్థానానికి ఎగబాకిన సిరాజ్.. టాప్-10లో కుల్దీప్
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 30) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఎలాంటి చెప్పుకోదగ్గ మార్పులు చోటు చేసుకోలేదు. బ్యాటింగ్‌లో బాబర్ ఆజమ్ (877), బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్ (705), ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ (371) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. నాలుగులో గిల్.. తొమ్మిదిలో విరాట్ బ్యాటింగ్ విభాగం టాప్-10లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (నాలుగో స్థానం), విరాట్ కోహ్లి (తొమ్మిదో ప్లేస్) తమ స్థానాలను పదిలంగా కాపాడుకోగా.. డస్సెన్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, హ్యారీ టెక్టార్, డేవిడ్ వార్నర్, డికాక్, స్టీవ్ స్మిత్ 2, 3, 5, 6, 7, 8, 10 స్థానాల్లో ఉన్నారు. నాలుగో స్థానంలో సిరాజ్.. 10 స్థానానికి ఎగబాకిన కుల్దీప్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. మహ్మద్ సిరాజ్ ఓ స్థానం మెరుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్ యాదవ్ టాప్-10లోకి (10వ స్థానం) చేరాడు. మిచెల్ స్టార్క్, ముజీబ్, రషీద్, మ్యాట్ హెన్రీ, బౌల్ట్, ఆడమ్ జంపా, షాహీన్ అఫ్రిది 2, 3, 5, 6, 7, 8, 9 స్థానాల్లో నిలిచారు. హార్ధిక్ ఒక్కడే.. ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్-20లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. షకీబ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నబీ, సికందర్ రజా, రషీద్ ఖాన్, అస్సద్ వలా, జీషన్ మక్సూద్, సాంట్నర్, హసరంగ, మెహిది హసన్, క్రిస్ వోక్స్ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్-20లో (12) ఉన్నాడు. -
టాప్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్.. నాలుగో స్థానానికి ఎగబాకిన గిల్
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 23) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఎలాంటి భారీ మార్పులు చోటు చేసుకోలేదు. వన్డే, టీ20, టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్ ప్లేస్‌లు యధాతథంగా కొనసాగుతున్నాయి. బ్యాటింగ్ విభాగం వన్డేల్లో బాబర్ ఆజమ్, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, టెస్ట్‌ల్లో కేన్ విలియమ్సన్.. బౌలింగ్ విభాగం వన్డేల్లో జోష్ హాజిల్‌వుడ్, టెస్ట్‌ల్లో రవిచంద్రన్ అశ్విన్, టీ20ల్లో రషీద్ ఖాన్.. ఆల్‌రౌండర్ల విభాగం వన్డేల్లో, టీ20ల్లో షకీబ్, టెస్ట్‌ల్లో రవీంద్ర జడేజా అగ్రపీఠాలపై తమ స్థానాలను పదిలంగా కాపాడుకున్నారు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ మూడు స్థానాలు ఎగబాకి మూడో ప్లేస్‌కు చేరుకోగా.. వన్డే బ్యాటింగ్ విభాగంలో ఇమామ్ ఉల్ హాక్, శుభ్‌మన్ గిల్ చెరో స్థానం మెరుగుపర్చుకుని 3,4 స్థానాలకు చేరుకున్నారు. భారీ జంప్ కొట్టిన రుతురాజ్.. ఐర్లాండ్‌తో రెండో టీ20లో హాఫ్‌సెంచరీతో రాణించిన టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 143 స్థానాలు మెరుగుపర్చుకుని 87వ స్థానానికి ఎగబాకాడు. ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్న బిష్ణోయ్, బుమ్రా ఐర్లాండ్‌తో తొలి రెండు టీ20ల్లో రెండ్రెండు వికెట్లు పడగట్టిన బిష్ణోయ్, బుమ్రా తాజా టీ20 ర్యాంకింగ్స్ తమ స్థానాలను ఓ మోస్తరుగా మెరుగుపర్చుకున్నారు. బిష్ణోయ్ 17 స్థానాలు మెరుగుపర్చుకుని 65వ ప్లేస్‌కు.. బుమ్రా 7 స్థానాలు మెరుపర్చుకుని 84వ ప్లేస్‌కు ఎగబాకారు. -
సత్తా చాటిన శుభ్‌మన్.. దుమ్మురేపిన తిలక్ వర్మ
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 9) విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. విండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించగా.. టీ20 సిరీస్‌లో ఇరగదీస్తున్న తిలక్ వర్మ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో ఓ హాఫ్‌సెంచరీ సాయంతో 126 పరుగులు చేసిన శుభ్‌మన్ 2 స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. 3 మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీల సాయంతో 184 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 9 స్థానాలు మెరుగుపర్చుకుని 36వ ప్లేస్‌కు చేరుకున్నాడు. టీ20ల విషయానికొస్తే.. విండీస్‌తో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో ఇరగదీసిన తిలక్ (39, 51, 49 నాటౌట్).. అరంగేట్రంలోనే 21 స్థానాలు మెరుగుపర్చుకుని 46వ స్థానానికి చేరాడు. టీ20 బౌలింగ్ విషయానికొస్తే.. విండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 36 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ ప్లేస్‌కు చేరుకున్నాడు. కుల్దీప్ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ ఫార్మాట్లో కుల్దీప్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకాడు. టీ20 బౌలర్ల విభాగంలో భారత బౌలర్లు అక్షర్ 7 స్థానాలు, హార్ధిక్ పాండ్యా ఓ స్థానం మెరుగపర్చుకుని 33, 37 స్థానాల్లో నిలిచారు. విండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ రాణించిన హార్ధిక్.. బ్యాటింగ్‌లో 10 స్థానాలు, ఆల్‌రౌండర్ల విభాగంలో 5 స్థానాలు మెరుగుపర్చుకుని 71, 11 స్థానాల్లో నిలిచాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు (8) పడగొట్టిన శార్దూల్ ఠాకూర్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 30వ ప్లేస్‌కు చేరుకున్నాడు. పై పేర్కొన్న మార్పులు మినహా వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పులు జరగలేదు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ఫకర్ జమాన్ టాప్-3లో ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ టాప్-3లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. వన్డేల్లో హాజిల్‌వుడ్, స్టార్క్, రషీద్ ఖాన్ టాప్-3లో ఉండగా.. టీ20ల్లో రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, హసరంగ టాప్‌లో ఉన్నారు. వన్డేల్లో భారత ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్‌తో పాటు విరాట్ కోహ్లి (9) టాప్-10లో ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో వన్డేల్లో మహ్మద్ సిరాజ్ (4), కుల్దీప్ (10) టాప్-10లో ఉండగా.. టీ20ల్లో భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేరు. టీ20ల్లో మెరుగైన ర్యాంకింగ్ కలిగిన భారత బౌలర్‌గా అర్షదీప్ (17) ఉన్నాడు. -
సత్తా చాటిన సికందర్ రజా, నికోలస్ పూరన్
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, విండీస్ వైట్‌బాల్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ సత్తా చాటారు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో అద్భుతమైన ప్రదర్శనల కారణంగా వీరు ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. పూరన్ 13 స్థానాలు జంప్ చేసి టాప్ 20లోకి (19వ స్పాట్) ప్రవేశిస్తే.. సికందర్ రజా 7 స్థానాలు మెరుగుపర్చుకుని 27వ ప్లేస్‌కు ఎగబాకాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బంతితోనూ సత్తా చాటిన సికందర్.. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు చేరాడు. బౌలింగ్‌లో 4 మ్యాచ్‌ల్లో 18 వికెట్లతో చెలరేగిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ 2 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకాడు. వీరితో పాటు క్వాలిఫయర్స్‌లో సత్తా చాటిన మరికొందరు బ్యాటర్లు కూడా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. 3 ఫిఫ్టిలతో రాణించిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 24 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ ర్యాంక్‌కు, జింబాబ్వే సీన్ విలియమ్స్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ ప్లేస్‌కు చేరుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో టాప్-10 స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. బ్యాటింగ్‌లో బాబర్ ఆజమ్, బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టాప్ 10లో ఉండగా.. బౌలింగ్‌లో సిరాజ్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. -
ICC Test Rankings: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. 39 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు సత్తా చాటారు. తొలి మూడు స్ధానాలను ఆసీస్ బ్యాటర్లే దక్కించుకోవడం విశేషం. లబుషేన్ తొలి ర్యాంకులో కొనసాగుతుండగా.. స్టీవ్ స్మిత్ రెండో ర్యాంకులో ఉన్నాడు. అయితే టీమిండియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అదరగొట్టిన ట్రావిస్ హెడ్ మూడు స్ధానాలు ఎగబాకి మూడో ర్యాంక్ చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడిన హెడ్ 174 బంతుల్లోనే 163 పరుగులు చేశాడు. అతడితో పాటు స్మిత్ కూడా సెంచరీతో చెలరేగాడు. కాగా 39 ఏళ్ల తర్వాత ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్ 3 ర్యాంకింగ్స్‌లో ఉండడం ఇదే తొలి సారి. 1984లో వెస్టిండీస్ ఆటగాళ్లు గోర్డాన్ గ్రీనిడ్జ్ (810), క్లైవ్ లాయిడ్ (787), లారీ గోమ్స్ (773) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడకపోయనప్పటికీ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టకున్నాడు. మరోవైపు రీ ఎంట్రీలో అదరగొట్టిన అజింక్య రహానే 37వ స్థానానికి చేరుకోగా, శార్దూల్ ఠాకూర్ బ్యాటర్లలో 94వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టాప్ 10లో భారత్ తరపున డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే ఉన్నాడు. పంత్ 10 స్ధానంలో కొనసాగుతుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుసగా 13వ స్థానాల్లో ఉన్నారు. చదవండి: IND vs WIL వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ! -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్
ఐర్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ టెక్టార్ చరిత్ర సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన దేశం తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు (722) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఘనత పాల్ స్టిర్లింగ్ పేరిట ఉండేది. 2021 జూన్‌లో స్టిర్లింగ్ 697 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ రేటింగ్ పాయింట్లే చాలాకాలం పాటు ఐర్లాండ్ తరఫున అత్యధికంగా కొనసాగాయి. మే 12న బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో (113 బంతుల్లో 140; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) శతక్కొట్టడం ద్వారా స్టిర్లింగ్ రికార్డును బద్దలుకొట్టిన టెక్టార్.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి (7వ ర్యాంక్) కూడా చేరాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా రస్సీ వాన్‌డెర్ డస్సెన్, పాక్ ఫఖర్ జమాన్, పాక్‌కే చెందిన ఇమామ్ ఉల్ హాక్, ఇండియా శుభ్‌మన్ గిల్, ఆసీస్ డేవిడ్ వార్నర్, ఐర్లాండ్ హ్యారీ టెక్టార్, టీమిండియా విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా డికాక్, టీమిండియా రోహిత్ శర్మ టాప్-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే ఫలితం తేలకపోగా.. హ్యారీ టెక్టార్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో, మూడో వన్డేలో ఐర్లాండ్ ఓటమిపాలైంది. ఐర్లాండ్.. జూన్, జులై నెలల్లో జింబాబ్వేలో జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, యుఎస్ఏ, యూఏఈ, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ 10 జట్లలోని రెండు జట్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. చదవండి: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
టీమిండియాను వెనక్కునెట్టిన పాక్
ODI Rankings: ఐసీసీ తాజాగా (మే 11) విడుదల చేసిన వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్.. టీమిండియాను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకగా, ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని కాపాడుకుంది. గడిచిన వారం రోజులుగా టాప్ త్రీ జట్ల మధ్య దోబూచులాట ఆడుతున్న అగ్రస్థానం.. వార్షిక అప్డేట్ తర్వాత ఆసీస్ ఖాతాలోకి చేరింది. ప్రస్తుతానికి ఆసీస్ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నప్పటికీ.. పాయింట్ల పరంగా చేస్తే, ఆ స్థానం శాశ్వతం కాదని తెలుస్తోంది. టాప్ త్రీలో ఉన్న ఆసీస్, పాక్, భారత్‌ల మధ్య వ్యత్యాసం కేవలం 3 పాయింట్లు మాత్రమే. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 118, పాక్ ఖాతాలో 116, భారత్ ఖాతాలో 115 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్, పాక్, భారత్‌ల తర్వాత న్యూజిలాండ్ (104), ఇంగ్లండ్ (101), సౌతాఫ్రికా (101), బంగ్లాదేశ్ (97), ఆఫ్ఘనిస్తాన్ (88), శ్రీలంక (80), వెస్టిండీస్ (72) వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. కాగా, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న పాక్.. గడిచిన వారం రోజుల వ్యవధిలో టాప్-3 ర్యాంక్‌ల్లో నిలువడం విశేషం. కివీస్‌తో ఆఖరి వన్డేకు ముందు టాప్ ర్యాంక్‌కు చేరిన పాక్.. 48 గంటల వ్యవధిలో మూడో స్థానానికి పడిపోయింది (ఆఖరి వన్డేలో కివీస్ చేతిలో ఓటమితో). తాజాగా వార్షిక అప్డేట్ తర్వాత విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో దాయాది దేశం రెండో స్థానానికి ఎగబాకింది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాక్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. వేదిక మార్పు విషయంలో పాక్ మినహా అన్ని జట్లు తలో మాట చెబుతున్నాయి. సగం మ్యాచ్‌లు (భారత్ ఆడే మ్యాచ్‌లు) యూఏఈలో, మిగతా మ్యాచ్‌లు తమ దేశంలో నిర్వహించేందుకు పాక్ అంగీకారం తెలుపగా.. తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు తాము యూఏఈలో అడుగుపెట్టేదే లేదని మొండికేస్తున్నాయి. టోర్నీ సమయానికి యూఏఈలో ఎండలు భీభత్సంగా ఉంటాయని ఆ జట్లు సాకుగా చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆసియా కప్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చదవండి: వన్డే ప్రపంచకప్.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితో అంటే? మరి పాక్‌తో -
రెండునాళ్ల ముచ్చట.. నంబర్ వన్ నుంచి మూడో స్థానానికి పడిపోయిన పాక్
ODI Rankings: ఐసీసీ తాజాగా (మే 8) విడుదల చేసిన వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నంబర్ వన్ స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. 48 గంటల కిందటే టాప్ ర్యాంక్‌కు చేరిన పాక్‌కు ఆ హోదా రెండునాళ్ల ముచ్చటగానే మిగిలింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఓటమిపాలైన పాక్.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశంతో పాటు టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకునే గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకుంది. పాక్ ఓటమితో ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌కు, టీమిండియా రెండో స్థానానికి ఎగబాకాయి. టీమిండియా, ఆస్ట్రేలియాకు సమానమైన రేటింగ్ పాయింట్లు (113) ఉండగా.. పాక్‌కు ఒక పాయింట్ (112) తక్కువగా ఉంది. ఈ జాబితాలో ఇంగ్లండ్ (111) నాలుగులో, న్యూజిలాండ్ (108), సౌతాఫ్రికా (101), బంగ్లాదేశ్ (95), శ్రీలంక (86), వెస్టిండీస్ (72), ఆఫ్ఘనిస్తాన్ (71) వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో పాక్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. విల్ యంగ్ (87), కెప్టెన్ టామ్ లాథమ్ (59) అర్ధశతకాలతో రాణించడంతో 49.3 ఓవర్లలో 299 పరుగులు చేసి ఆలౌటైంది. చాప్మన్ (43), హెన్రీ నికోల్స్ (23), మెక్‌కోంచి (26), రచిన్ రవీంద్ర (28) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, ఉసామా మిర్, షాదాబ్ ఖాన్ తలో 2 వికెట్లు, హరీస్ రౌఫ్, మహ్మద్ వసీం చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో ఇఫ్తికార్ అహ్మద్ (94 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికీ పాక్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. పాక్ 46.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఇఫ్తికార్‌కు అఘా సల్మాన్ (57) నుంచి కాసేపు తోడ్పాటు లభించింది. ఫకర్ జమాన్ (33) పర్వాలేదనిపించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, రచిన్ రవీంద్ర తలో 3 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించగా.. ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాక్ ఆధిక్యాన్ని 1-4కు తగ్గించింది. చదవండి: సాహో సాహా.. టెస్ట్ జట్టులో చోటు కన్ఫర్మ్.. రహానే లాగే..! -
టీ20ల్లోనూ మనోళ్లదే హవా.. వరల్డ్ ఛాంపియన్లు కూడా మన తర్వాతే..!
ఐసీసీ ఇవాళ (మే 2) విడుదల చేసిన వార్షిక టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా నడిచింది. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన భారత జట్టు.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరో రెండు పాయింట్లు పెంచుకుని (267) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. దీంతో జగజ్జేత, టీ20 వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ (259) కూడా భారత్ తర్వాతి స్థానానికే పరిమితమైంది. టీమిండియాకు ఇంగ్లండ్‌కు మధ్య 8 పాయింట్ల వ్యత్యాసం ఉంది. వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ (267), ఇంగ్లండ్ (259) తర్వాత న్యూజిలాండ్ (256), పాకిస్థాన్ (254), సౌతాఫ్రికా (253), ఆస్ట్రేలియా (248), వెస్టిండీస్ (238), శ్రీలంక (237), బంగ్లాదేశ్ (222), ఆఫ్ఘనిస్థాన్ (219) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. కాగా, వార్షిక ర్యాంకింగ్‌లకు ఇప్పటివరకు జరిగిన సిరీస్‌లతో పాటు 2020 మే- 2022 మే మధ్యలో జరిగిన సిరీస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 20-22 మధ్యలో పూర్తైన సిరీస్‌లకు 50 శాతం, ఆతర్వాత జరిగిన సిరీస్‌లకు 100 శాతం పాయింట్లు కేటాయిస్తారు. 2020 మే తర్వాత టీ20ల్లో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. రోహిత్ సేన ఈ మధ్యకాలంలో ఆడిన ఒకే ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో (శ్రీలంక చేతిలో) మాత్రమే ఓడింది. 2022లో సౌతాఫ్రికాతో జరిగిన ఓ సిరీస్ డ్రా కాగా.. మిగితా 13 సిరీస్‌ల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 5 నుంచి మూడో స్థానానికి చేరుకుంది. -
బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్‌ను కదిలించలేకపోయాడు
ICC T20 Rankings: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. గత ఏడాది నవంబర్ 2న సూర్య టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. బుధవారం (ఏప్రిల్ 26) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్య 906 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలోనే ఉన్నాడు. రిజ్వాన్ (811 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో, బాబర్ ఆజమ్ (756 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. చదవండి: Hardik Pandya: కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు, తీసేయండి..! బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్‌ను కదిలించలేకపోయాడు.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో (5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20) సూపర్ సెంచరీతో (58 బంతుల్లో 101) చెలరేగిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. బాబర్ శతక్కొట్టినా అతని ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. అతను ఇంకా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్ మహ్మద్ రిజ్వాన్ కూడా రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ అతని ర్యాంక్ కూడా మారలేదు. అతను రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. చదవండి: Rahane: ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా..! -
భారీ జంప్ కొట్టిన మార్క్రమ్.. కెరీర్ బెస్ట్ సాధించిన శుభ్‌మన్
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. ఇటీవలే నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో భారీ శతకం (175) బాదిన మార్క్రమ్.. ఏకంగా 13 స్థానాలు మెరుగుపర్చుకుని 41వ స్థానానికి ఎగబాకాడు. అలాగే ఆల్‌రౌండర్స్ విభాగంలో 16 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి చేరాడు. నెదర్లాండ్స్‌తో సిరీస్‌లో రెండో వన్డేలోనూ అర్ధసెంచరీతో (51 నాటౌట్) రాణించిన మార్క్రమ్.. దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సిరీస్ చేజిక్కించుకోవడంతో పాటు సఫారీ టీమ్ వన్డే వరల్డ్‌కప్-2023కు నేరుగా అర్హత సాధించడంలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. కెరీర్లో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 41వ స్థానానికి చేరిన మార్క్రమ్.. వన్డేలతో పాటు టీ20లు, టెస్ట్‌ల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఇక ఈ వారం ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్న ఆటగాళ్ల విషయానికొస్తే.. టీమిండియా యువకెరటం శుభ్‌మన్ గిల్ఓ స్థానం మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ నాలుగో ర్యాంక్ సాధించగా.. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ ప్లేయర్ మ్యాట్ హెన్రీ ఏకంగా 5 స్థానాలు జంప్ చేసి 10 నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. నెదార్లండ్స్తో సిరీస్‌లో ఓ ఫైఫర్‌తో పాటు 8 వికెట్లు పడగొట్టిన సఫారీ బౌలర్ సిసండ మగాలా ఏకంగా 35 స్థానాలు ఎగబాకి 165 ర్యాంక్‌కు చేరుకున్నాడు. బ్యాటర్ల విభాగంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్, ఇమామ్ ఉల్ హాక్, గిల్, వార్నర్, కోహ్లి, డికాక్, రోహిత్, స్టీవ్ స్మిత్, ఫకర్ జామన్ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ టాప్‌లో కొనసాగుతుండగా.. బౌల్డ్, సిరాజ్, స్టార్క్, మ్యాట్ హెన్రీ, రషీద్ ఖాన్, జంపా, షాహీన్ అఫ్రిది, ముజీబ్ రెహ్మాన్, షకీబ్ 2 నుంచి 10 ప్లేస్ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ టాప్‌లో కొనసాగుతుండగా.. నబీ, రషీద్ ఖాన్ టాప్-3లో ఉన్నారు. -
నెం1 ర్యాంక్‌ను కోల్పోయిన సిరాజ్.. టాప్ ర్యాంక్ ఎవరిదంటే?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో తన నెం1 ర్యాంక్‌ను కోల్పోయాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో.. సిరాజ్‌ను అధిగమించి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ నెం1 స్థానానికి చేరుకున్నాడు. కాగా విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కేవలం 3 ఓవర్లలోనే 37 పరుగులు సమర్పించుకున్న సిరాజ్.. రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో హాజిల్‌వుడ్ 713 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(708 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సిరాజ్(702) పాయింట్లతో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో కలిసి మూడో స్ధానంలో నిలిచాడు. కాగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో సిరాజ్ అద్భుతంగా రాణిస్తే.. మళ్లీ టాప్ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది. చదవండి: ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు.. నంబర్ 1 స్థానం కోసం కొత్త ఛాలెంజర్ -
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు.. నంబర్ 1 స్థానం కోసం కొత్త ఛాలెంజర్
ఐసీసీ తాజాగా (మార్చి 22) విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు ఏర్పడింది. నంబర్ వన్ స్థానం కోసం కొత్త ఛాలెంజర్ రేసులోకి వచ్చాడు. శ్రీలంకతో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సెంచరీ (121 నాటౌట్), డబుల్ సెంచరీ (215) బాదిన న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఏకంగా 4 స్థానాలు ఎగబాకి సెకెండ్ ప్లేస్‌కు చేరుకున్నాడు. A worthy contender has broken into the top five of @MRFWorldwide ICC Men’s Test Player Rankings for batters 📈 More 👇https://t.co/xXuUqaiAWy — ICC (@ICC) March 22, 2023 ఈ సిరీస్‌లో హ్యాట్రిక్ అర్ధసెంచరీలతో (50, 89, 51) రాణించిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే 2 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్-10లోకి (10వ ర్యాంక్) చేరాడు. విలియమ్సన్ ఒక్కసారిగా నాలుగు స్థానాలు ఎగబాకడంతో స్టీవ్ స్మిత్ (3వ ర్యాంక్), జో రూట్ (4), బాబర్ ఆజమ్ (5), ట్రవిస్ హెడ్ (6) తలో స్థానం కోల్పోయారు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ 9వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో 2 స్థానాలు కోల్పోయి 12వ స్థానానికి పడిపోగా.. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి 13వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక ఆటగాడు దినేశ్ చండీమాల్, ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ తలో 2 స్థానాలు మెరుగుపర్చుకుని 17, 18 స్థానాలకు ఎగబాకగా.. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 3 స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి చేరుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కివీస్ మిడిలార్డర్ ఆటగాడు హెన్రీ నికోల్స్ అత్యధికంగా 20 స్థానాలు మెరుగుపర్చుకుని 27వ స్థానానికి చేరుకున్నాడు. లంకతో రెండో టెస్ట్‌లో విలియమ్సన్తో పాటు డబుల్ సెంచరీ (200 నాటౌట్) చేయడంతో నికోల్స్ ఒక్కసారిగా 20 స్థానాలు ఎగబాకాడు. -
భారీ జంప్ కొట్టిన అక్షర్ పటేల్, పడిపోయిన కేఎల్ రాహుల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సత్తా చాటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన వీరు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ల విభాగంలో ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. ఇదే సిరీస్‌లో తొలి టెస్ట్‌లో సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంక్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హిట్‌మ్యాన్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. యాక్సిడెంట్ కారణంగా గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ రిషబ్ పంత్ 6వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఈ విభాగంలో లబూషేన్ టాప్‌లో కొనసాగుతుండగా.. స్టీవ్ స్మిత్, బాబర్ ఆజమ్ రెండు, మూడు స్థానాలను పదిలం చేసుకున్నారు. ఈ సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలతో(84, 74) చెలరేగిన అక్షర్ పటేల్.. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ విభాగంలో 61వ ప్లేస్‌కు చేరుకున్నాడు. కోహ్లి 16వ స్థానంలో, జడేజా 33వ స్థానంలో కొనసాగుతుండగా.. పుజారా ఓ స్థానం మెరుగుపర్చుకుని 25వ స్థానానికి, శ్రేయస్ అయ్యర్ 10 స్థానాలు కోల్పోయి 27కు, మయాంక్ అగర్వాల్ ఓ స్థానం కోల్పోయి 28కి, కేఎల్ రాహుల్ 7 స్థానాలు కోల్పోయి 58వ ప్లేస్‌కు పడిపోయారు. బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (866).. పాట్ కమిన్స్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరుకోగా.. అశ్విన్ (864) ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడనప్పటికీ బుమ్రా 5వ స్థానాన్ని కాపాడుకోగా.. జడేజా (763) 6 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా ఆటగాళ్లు ఆల్‌టైమ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబర్చారు. 460 రేటింగ్ పాయింట్లతో జడ్డూ భాయ్, 376 పాయింట్లతో అశ్విన్ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకోగా.. అక్షర్ పటేల్ 2 స్థానాలు మెరుపర్చుకుని 5వ స్థానానికి చేరాడు. -
దుమ్మురేపిన శుభ్‌మన్ గిల్.. సత్తా చాటిన హార్ధిక్ పాండ్యా
ఐసీసీ తాజాగా (ఫిబ్రవరి 8) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. న్యూజిలాండ్‌పై సిరీస్ విక్టరీ (2-1) సాధించడంతో భారత ఆటగాళ్ల ర్యాంక్‌లు అమాంతం పెరిగిపోయాయి. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఏకంగా 168 స్థానాలు ఎగబాకి 30 స్థానానికి చేరుకోగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్ధిక్ పాండ్యా అగ్రస్థానానికి అతి చేరువలో రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్‌తో సిరీస్‌లో పర్వాలేదనిపించిన అర్షదీప్ సింగ్ 8 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ టాప్ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారగా (14 నుంచి 15), కేఎల్ రాహుల్ 2 స్థానాలు దిగజారి 27కు, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 28 నుంచి 29 స్థానానికి చేరుకున్నాడు. టాప్ 30లో మొత్తంగా ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. సూర్యకుమార్ తర్వాత మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, డెవాన్ కాన్డే, డేవిడ్ మలాన్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్ గ్లెన్ ఫిలిప్స్, అలెక్స్ హేల్స్ టాప్-10లో ఉన్నారు. బౌలింగ్ కేటగిరి టాప్-30లో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. అర్షదీప్ 13, భువనేశ్వర్ కుమార్ 21, అశ్విన్ 29, అక్షర్ పటేల్ 30వ స్థానంలో నిలిచారు. రషీద్ తర్వాత వనిందు హసరంగ, ఆదిల్ రషీద్, జోష్ హేజిల్‌వుడ్, సామ్ కర్రన్, తబ్రేజ్ షంషి, ఆడమ్ జంపా, ముజీబుర్ రెహ్మాన్, అన్రిచ్ నోర్జే, మిచెల్ సాంట్నర్ టాప్-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్, హార్ధిక్ తర్వాత మహ్మద్ నబీ, హసరంగ, జెజె స్మిట్, సికందర్ రజా, డేవిడ్ వీస్, స్టొయినిస్, మొయిన్ అలీ, మ్యాక్స్‌వెల్ టాప్-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆల్‌టైమ్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించడానికి మరో 9 పాయింట్లు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం స్కై ఖాతాలో 906 పాయింట్లు, ఉండగా ఆల్‌టైమ్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు డేవిడ్ మలాన్ పేరిట ఉన్నాయి. మలాన్ 2020లో 915 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో హార్ధిక్ పాండ్యా అగ్రస్థానానికి చేరుకునేందుకు మరో 2 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నాడు. -
కోహ్లిని వెనక్కునెట్టిన గిల్.. హిట్‌మ్యాన్ ఏ స్థానంలో ఉన్నాడంటే..?
న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దుమ్మురేపింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ (114 రేటింగ్ పాయింట్లు).. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. అలాగే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ సత్తా చాటింది. న్యూజిలాండ్ సిరీస్ (2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు)తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) అద్భుతంగా రాణించిన భారత స్టార్ పేసర్, హైదరాబాద్ కా షాన్ మహ్మద్ సిరాజ్ మియా తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించగా.. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టారు. న్యూజిలాండ్ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 360 పరుగులు (209, 40 నాటౌట్, 112), అంతకుముందు శ్రీలంక సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 207 పరుగులు చేసిన (70, 21, 116) గిల్.. కివీస్‌తో సిరీస్‌లో అంతగా రాణించని రన్‌మెషీన్ విరాట్ కోహ్లిని వెనక్కునెట్టి, ఏకంగా 20 స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా, కివీస్‌తో ఆఖరి వన్డేలో శతకం బాదిన రోహిత్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 9వ స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో పాక్ సారధి బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్, డికాక్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
వన్డే ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన సిరాజ్.. ఏకంగా టాప్ ప్లేస్ కైవసం
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ (114 రేటింగ్ పాయింట్లు) టీమ్ ర్యాంకింగ్స్‌లో.. ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి ఎగబాకగా, బౌలింగ్ విభాగంలో భారత స్టార్ పేసర్, హైదరాబాద్ కా షాన్ మహ్మద్ సిరాజ్ మియా తొలిసారి వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. 🚨 There's a new World No.1 in town 🚨 India's pace sensation has climbed the summit of the @MRFWorldwide ICC Men's ODI Bowler Rankings 🔥 More 👇 — ICC (@ICC) January 25, 2023 న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్.. టీమిండియా తరఫున బుమ్రా తర్వాత వన్డేల్లో టాప్ ర్యాంక్ సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంక సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు, కివీస్‌తో సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. మొత్తం 729 రేటింగ్ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని అగ్రపీఠాన్ని అధిరోహించాడు. సిరాజ్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ (727) ఉన్నాడు. హేజిల్‌వుడ్‌కు సిరాజ్‌కు కేవలం 2 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. వీరిద్దరి తర్వాత ట్రెంట్ బౌల్ట్ (708), మిచెల్ స్టార్క్ (665), రషీద్ ఖాన్ (659) వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. కివీస్‌తో రెండో వన్డేలో అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మరో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సైతం తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. షమీ.. 11 స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. దాదాపు మూడేళ్ల తర్వాత గతేడాది (2022) ఫిబ్రవరిలో వన్డే ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్.. ఏడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా రాణించాడు. రీఎంట్రీ తర్వాత సిరాజ్ 21 వన్డేల్లో ఏకంగా 37 వికెట్లు నేలకూల్చాడు. ఈ ప్రదర్శన ఆధారంగా సిరాజ్‌కు 2022 ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో కూడా చోటు లభించింది. కొత్త బంతిలో ఇరు వైపుల స్వింగ్ చేయగల సామర్థ్యం కలిగిన సిరాజ్.. గతకొంత కాలంగా అన్ని విభాగాల్లో రాటుదేలాడు. కెరీర్ ఆరంభంలో పరుగులు ధారాళంగా సమర్పించుకుంటాడు, టాపార్డర్ బ్యాటర్ల వికెట్లు పడగొట్టలేడు అనే అపవాదు సిరాజ్‌పై ఉండేది. అయితే గత ఏడాది కాలంలో సిరాజ్ తన లోపాలను సరిచేసుకుని పేసు గుర్రం బుమ్రాను సైతం మరిపించేలా రాటుదేలాడు. ప్రస్తుతం సిరాజ్ కొత్త బంతిని అద్భుతంగా ఇరువైపులా స్వింగ్ చేయడంతో పాటు, ఆరంభ ఓవర్లు, మిడిల్ ఓవర్లలో అన్న తేడా లేకుండా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. గత 10 వన్డేల్లో సిరాజ్ ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక్క వికెట్ తీశాడు. అలాగే పవర్ ప్లేల్లో మెయిడిన్ ఓవర్లు సంధించడంలోనూ సిరాజ్ రికార్డులు నెలాకొల్పాడు. -
IND VS NZ 3rd ODI: నంబర్ వన్ జట్టుగా అవతరించిన టీమిండియా
న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలుపు అనంతరం.. స్వదేశంలో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో కివీస్‌ను ఒక్క మ్యాచ్ కూడా గెలవనీయకుండా ఊడ్చేసిన రోహిత్ సేన మరో అరుదైన గౌరవం కూడా దక్కించుకుంది. టీమిండియా.. తాజా ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు మూడో స్థానంలో ఉండిన టీమిండియా.. టాప్ ప్లేస్‌లో ఉండిన ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠానికి చేరుకుంది. The new No.1 team in the @MRFWorldwide ICC Men's ODI Team Rankings 🤩 More 👉 https://t.co/sye7IF4Y6f pic.twitter.com/hZq89ZPO31 — ICC (@ICC) January 24, 2023 3 వన్డేల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో, తాజాగా ముగిసిన ఆఖరి మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత్.. వన్డేల్లోనూ ఈ ఘనత సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్ ర్యాంక్‌కు చేరుకునేందుకు మరో 4 మ్యాచ్‌ల దూరంలో (4 టెస్ట్‌లు) ఉంది. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ✅ A dominant win in a series decider✅ A record win at home✅ Strong comeback after multiple setbacksIndia's journey to the top of the @MRFWorldwide ICC Men's ODI Team Rankings had a bit of everything 👀https://t.co/f9qr0P1xIb— ICC (@ICC) January 24, 2023 అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను ఓపెనర్ డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకం సైతం ఆదుకోలేకపోయింది. కాన్వే మినహా మిగతా వారెవ్వరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో కివీస్ లక్ష్యానికి 91 పరుగుల దూరంలో నిలిచిపోయింది (41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్). హెన్రీ నికోల్స్ (42), మిచెల్ సాంట్నర్ (34) ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. చహల్ 2, హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
టీమిండియా చేతిలో పరాజయం.. టాప్ ర్యాంక్ కోల్పోయిన న్యూజిలాండ్
IND VS NZ 2nd ODI: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే తర్వాత ఐసీసీ టీమ్ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా చేతిలో ఓటమి అనంతరం న్యూజిలాండ్ వన్డేల్లో తమ టాప్ ర్యాంక్ కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకోగా టీమిండియా నాలుగు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ ఖాతాల్లో సమానంగా 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కివీస్‌తో సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేస్తే సింగిల్‌గా టాప్ ర్యాంక్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే టీ20ల్లో టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత్.. వన్డేల్లో ఆ స్థానాన్ని చేరుకునేందుకు మరో మ్యాచ్ దూరంలో మాత్రమే ఉంది. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్ ర్యాంక్‌కు చేరుకునేందుకు మరో 5 మ్యాచ్‌ల దూరంలో (ఓ వన్డే, 4 టెస్ట్‌లు) మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే, రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (50 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 48వ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) భీకర ఫామ్‌ను కొనసాగించాడు. వేగంగా మ్యాచ్ ముగించే క్రమంలో విరాట్ కోహ్లి (9 బంతుల్లో 11; 2 ఫోర్లు) సాంట్నర్ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, మిచెల్ సాంట్నర్లకు తలో వికెట్ దక్కింది. నామమాత్రమైన మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 24న జరుగనుంది. -
ఆస్ట్రేలియాకు షాక్.. నంబర్ వన్ స్థానానికి టీమిండియా
గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ, వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇవాళ (జనవరి 17) ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను వెనక్కునెట్టి అగ్రస్థానానికి దూసుకొచ్చింది. గతేడాది శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై వరుస సిరీస్ విజయాలు సాధించిన భారత్.. 115 రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకుని అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది. సుదీర్ఘ ఫార్మాట్లో గతేడాది ఆస్ట్రేలియా సైతం అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ.. ఏడాది చివర్లో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయలేకపోవడం, మరోవైపు భారత్.. బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో ఇరు జట్ల స్థానాలు తారుమారయ్యాయి. ప్రస్తుతం ఆసీస్ (రెండో స్థానం) ఖాతాలో 111 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఇంగ్లండ్ ఖాతాలో 106 (మూడు), న్యూజిలాండ్ ఖాతాలో 100 (నాలుగు), సౌతాఫ్రికా ఖాతాలో 85 (ఐదు) రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 9 నుంచి భారత్-ఆసీస్ జట్ల మధ్య 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనున్న నేపథ్యంలో ర్యాంకింగ్స్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తును (ఇదివరకే ఆసీస్ ఫైనల్‌కు చేరుకుంది) ఖరారు చేసుకోవాలంటే, టీమిండియా ఆసీస్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో ఇదివరకే టాప్ ప్లేస్‌లో ఉన్న భారత్.. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంటే, ఈ ఫార్మాట్లోనూ టాప్కు చేరుకుంటుంది. ఇదే జరిగితే భారత్.. తొలిసారి మూడు ఫార్మాట్లలో టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ 110 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ (117), ఇంగ్లండ్ (113), ఆస్ట్రేలియా (112) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. -
ICC Women's T20I Rankings: అదరగొట్టిన జెమిమా రోడ్రిగ్స్.. టాప్10లోకి
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మహిళా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ దుమ్మురేపింది. బ్యాటర్ల ర్యాంకిగ్స్‌లో రోడ్రిగ్స్ తొలి సారి టాప్ 10లో చోటు దక్కించుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోడ్రిగ్స్.. నాలుగు స్ధానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం జరగుతోన్న ఆసియాకప్-2022లో రోడ్రిగ్స్ అదరగొడుతోంది. అక్టోబర్ 1న శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోడ్రిగ్స్ 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అదే విధంగా మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కూడా 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ రెండో ర్యాంకులో ఉంది. చదవండి: Womens Asia Cup 2022: ఆసియాకప్‌లో భారత్ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం -
నాలుగో ర్యాంక్‌లో టీమిండియా ఓపెనర్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. షఫాలీ వర్మ ఆరో స్థానానికి పడిపోగా... జెమీమా ఏడు స్థానాలు ఎగబాకి తొమ్మిది నెలల తర్వాత మళ్లీ పదో ర్యాంక్‌లో నిలిచింది. టాప్ ర్యాంక్‌లో ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆసీస్ కెప్టెన్ లానింగ్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ కొనసాగుతున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత పేస్ బౌలర్ రేణుక సింగ్ పది స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్‌ను అందుకుంది. -
నానాటికి దిగజారుతున్న కోహ్లి ర్యాంక్.. ఏడేళ్లలో తొలిసారి ఈ దుస్థితి..!
Virat Kohli: ఐసీసీ తాజాగా (జులై 27) విడుదల చేసిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరింత దిగజారాడు. గడిచిన ఏడేళ్లలో ఎన్నడూ లేనంత కింది ర్యాంక్‌కు రన్‌మెషీన్ పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 5వ స్థానానికి (744 రేటింగ్ పాయింట్లు) దిగజారిన కోహ్లి.. 2015 అక్టోబర్ తర్వాత టాప్-4 ర్యాంకింగ్స్‌లో నుంచి బయటికి వచ్చాడు. గత దశాబ్ద కాలం పాటు వన్డేల్లో మకుటం లేని మారాజుగా చలామణి అయిన కోహ్లి.. ఇటీవలి కాలంలో ఈ ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడకుండా ఈ దుస్థితి తెచ్చుకున్నాడు. రెస్ట్ పేరుతో ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా అతను డుమ్మా కొట్టాడు. కోహ్లి పరిస్థితి ఇలా ఉంటే, తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ స్థానాన్ని కోల్పోయి 6వ ప్లేస్‌కు పడిపోయాడు. మరోవైపు విండీస్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధవన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్లు తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. తొలి వన్డేలో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ధవన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 13వ ప్లేస్‌కు చేరుకోగా.. వరుస హాఫ్‌సెంచరీలు సాధించిన అయ్యర్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 54వ స్పాట్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, మరో పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్, సఫారీ ప్లేయర్లు డస్సెన్, డికాక్‌లు టాప్ 4గా నిలిచారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అతని కంటే కేవలం ఒక్క పాయింట్ వెనుక ఉండి రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్లో! -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, పాక్‌ను వెనక్కునెట్టిన టీమిండియా
IND VS ENG 1st ODI: తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ద్వారా టీమిండియా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లైంది. ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకడంతో పాటు దాయాది పాక్‌కు కూడా షాకిచ్చింది. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించిన రోహిత్ సేన 3 రేటింగ్ పాయింట్లను (108) సాధించి టాప్-3లోకి చేరి, పాక్‌ను నాలుగో స్థానానికి (106) నెట్టింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (126) టాప్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ (122) రెండు, ఆసీస్ (101), సౌతాఫ్రికా (99) ఐదు ,ఆరు స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ (96), శ్రీలంక (92), వెస్టిండీస్ (71), ఆఫ్ఘనిస్తాన్ (69), ఐర్లాండ్ (54) జట్లు వరుసగా 7 నుంచి 11 స్థానాల్లో నిలిచాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ 3లోకి చేరడంతో మూడు ఫార్మాట్లలో టాప్-3లో ఉన్న ఏకైక జట్టుగా నిలిచింది. ICC Rankings All formats Tests: 1. Australia 🇦🇺 2. India 🇮🇳 3. South Africa 🇿🇦 ODI: 1. New Zealand 🇳🇿 2. England 🏴 3. India 🇮🇳 T20I: 1. India 🇮🇳 2. England 🏴 * India is the only team to be in the top 3 in all formats ranking.#Cricket | #CricketTwitter — 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭 𝐒𝐩𝐚𝐫𝐭𝐚𝐧 (@clownslayer_V) July 13, 2022 ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఘన విజయం సాధించడంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో వెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. బుమ్రా (6/19), మహ్మద్ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 25.2 ఓవర్లలో 110 పరుగులకే చాపచుట్టేసింది. జోస్ బట్లర్ (32 బంతుల్లో 30; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా టాప్–6లో నలుగురు బ్యాటర్లు ‘డకౌట్’ అయ్యారు. మొత్తంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం. అనంతరం రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శిఖర్ ధవన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగి ఆడటంతో భారత్ 18.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: రో'హిట్' ధాటికి చిన్నారి విలవిల.. ఆందోళన వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ -
టాప్ 10లో టీమిండియా వైస్ కెప్టెన్.. మెరుగైన కెప్టెన్ ర్యాంక్
దుబాయ్: శ్రీలంక పర్యటనలో రాణించిన భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ర్యాంకుల్ని మెరుగుపర్చుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ ఓపెనర్ మంధాన తొమ్మిదో స్థానానికి ఎగబాకగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 13వ ర్యాంకులో నిలిచింది. 3–0తో లంకను క్లీన్‌స్వీప్ చేసిన ఈ సిరీస్‌లో హర్మన్ 59.50 సగటుతో 119 పరుగులు చేసింది. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసింది. ఓపెనర్ మంధాన 52 సగటుతో 104 పరుగులు చేసింది. వన్డే బౌలింగ్ విభాగంలో రాజేశ్వరి గైక్వాడ్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతోంది. లంకతో వన్డేలకు దూరంగా ఉన్న వెటరన్ సీమర్ జులన్ గోస్వామి నిలకడగా ఆరో ర్యాంకులో ఉంది. -
విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హవా కొనసాగుతూ ఉంది. తాజా ర్యాంకింగ్స్‌లోనూ ఆజమ్ తన అగ్రపీఠాన్ని (818 పాయింట్లు) పదిలంగా కాపాడుకున్నాడు. ఈ క్రమంలో బాబర్ ఆజమ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం నంబర్ 1 స్థానంలో ఉన్న బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. Another record for Babar Azam 👊 All the changes in this week's @MRFWorldwide men's rankings 👇 — ICC (@ICC) June 29, 2022 కోహ్లి 1013 రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగగా.. తాజాగా బాబర్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఏడాది కేవలం 2 టీ20లు మాత్రమే ఆడిన కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి పడిపోగా.. బాబర్ మాత్రం తన రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. బాబర్ తర్వాత రెండో ప్లేస్‌లో పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (794) కొనసాగుతున్నాడు. రిజ్వాన్‌కు బాబర్‌కు మధ్య 24 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఇక ఇతర స్థానాల విషయానికొస్తే.. ఈ జాబితా టాప్ 10లో టీమిండియా నుంచి ఇషాన్ కిషన్ (682) ఒక్కడికే స్థానం లభించింది. గత వారం ర్యాంకింగ్స్‌లో 6వ ప్లేస్‌లో ఉన్న ఇషాన్.. ఓ స్థానం కోల్పోయి సెవెన్త్ ప్లేస్‌కు పడిపోయాడు. ఈ ఒక్క మార్పు మినహా గత వారం ర్యాంకింగ్స్‌తో పోలిస్తే ఈ వారం పెద్దగా మార్పులు లేవు. మార్క్రమ్ (757), డేవిడ్ మలాన్ (728), ఆరోన్ ఫించ్ (716), డెవాన్ కాన్వే (703), పథుమ్ నిస్సంక (661), మార్టిన్ గప్తిల్ (658), డెస్సెన్ (658) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 17, రోహిత్ శర్మ 19 ర్యాంక్‌ల్లో కొనసాగుతుండగా.. ఐర్లాండ్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన దీపక్ హుడా ఏకంగా 414 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చదవండి: IND VS IRE 2nd T20: హార్దిక్ సేన ఖాతాలో చెత్త రికార్డు -
టాప్కు చేరిన రూట్.. పదో స్థానానికి పడిపోయిన కోహ్లి
దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సత్తా చాటాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రూట్ టెస్ట్‌ల్లో మరోసారి టాప్ ప్లేస్‌కు ఎగబాకాడు. కివీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన శతకంతో (115) పాటు రెండో టెస్ట్‌లో భారీ శతకాన్ని (176) నమోదు చేసిన రూట్ మొత్తం 897 రేటింగ్ పాయింట్లు సాధించి ఆసీస్ ఆటగాడు లబూషేన్ (892)ను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (845) మూడో స్థానంలో, పాక్ స్కిప్పర్ బాబర్ ఆజమ్ (815) నాలుగో ప్లేస్‌లో, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్ (798) ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (754), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (742) వరుసగా 8, 10 స్థానాలకు దిగజారారు. తాజా ర్యాంకింగ్స్‌లో రూట్ తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 🔹Joe Root reclaims No.1 spot 🥇 🔹Trent Boult bursts into top 10 🔥 Plenty of movement in the @MRFWorldwide ICC Test Player Rankings after the second #ENGvNZ match 👉 https://t.co/J6m5cEKRSA pic.twitter.com/CqV1mlBMmF — ICC (@ICC) June 15, 2022 ఈ సందర్భంగా ఐసీసీ రూట్‌ను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఏడాదిన్నర కాలంలో టెస్ట్‌ల్లో 10 సెంచరీలు చేసిన రూట్.. ప్రస్తుత తరంలో సుదీర్ఘ ఫార్మాట్లో తిరుగులేని ఆటగాడని కొనియాడింది. ఇక బౌలర్ల జాబితాలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (901), టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు తొలి రెండు స్థానాలను పదిలంగా కాపాడుకోగా.. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, పాక్ స్పీడ్‌గన్ షాహీన్ అఫ్రిది 3, 4 స్థానాలకు ఎగబాకారు. చదవండి: Ishan Kishan: టాప్-10లోకి తొలిసారి .. ఒకేసారి 68 స్థానాలు ఎగబాకి -
భారత్ ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఆసీస్; టి20ల్లో మనమే నెంబర్ వన్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం వార్షిక ర్యాంకింగ్స్ ప్రకటించింది. టి20ల్లో నెంబర్‌వన్‌గా టీమిండియా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా 270 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. 265 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో.. 261 పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. ఇక 253 పాయింట్లతో దక్షిణాఫ్రికా 4వ స్థానంలో.. 251పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో ఉన్నాయి. అయితే టెస్టుల్లో మాత్రం టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. వరుసగా ఐదేళ్ల పాటు టెస్టుల్లో టాప్ స్థానంలో కొనసాగిన భారత్‌కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఇటీవలే ఇంగ్లండ్‌ను 4-0తో, ఆ తర్వాత పాకిస్తాన్‌ను వారి గడ్డపైనే 1-0తో కమిన్స్ సేన ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా 128 పాయింట్లతో టీమిండియాను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. 119 పాయింట్లతో భారత్ రెండోస్థానంలో నిలవగా.. 111 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. కోహ్లి నేతృత్వంలో టీమిండియా టెస్టుల్లో ఐదేళ్ల పాటు అంటే 2017 నుంచి 2022 వరకు వరుసగా ప్రతీ ఏడాది ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానంలో నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. మేజర్ టోర్నీలు గెలవలేదనే అపవాదు ఉన్న కోహ్లికి టెస్టుల్లో మాత్రం మంచి రికార్డు ఉంది. టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక టెస్టు విజయాలు చూసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు అందుకున్నాడు. భారత్‌కు 60 టెస్టుల్లో కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన కోహ్లి 40 విజయాలు అందించాడు. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా స్వదేశంలో రికార్డు స్థాయిలో 11 సిరీస్ విజయాలు సాధించింది. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విక్టరీ అందుకొని కోహ్లి సేన చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 2021లో ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై సెంచురియన్ వేదికగా కెప్టెన్‌గా చారిత్రక విజయాన్ని అందుకున్న కోహ్లి.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టులు ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్ తర్వాత కోహ్లి కెప్టెన్‌గా తప్పుకోవడం.. రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగిపోయింది. ఆ తర్వాత స్వదేశంలోన్యూజిలాండ్, వెస్టిండీస్‌లతో టెస్టు సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. ఇక వన్డేల్లో న్యూజిలాండ్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా..ఇంగ్లండ్ 124 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. 107 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడోస్థానంలో ఉండగా.. భారత్ 105 పాయింట్లతో నాలుగోస్థానానికి పరిమితమైంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచింది. India stay on top of the ICC men's T20I team rankings 🇮🇳 South Africa, Australia, Bangladesh and Sri Lanka rise; New Zealand and Afghanistan fall in the annual points update 👀 📸: ESPNcricinfo#ICCRankings #Cricket #CricketTwitter pic.twitter.com/5RUlOURy5D — CricStats (@_CricStats_) May 4, 2022 -
టీమిండియా పరువు కాపాడిన కేఎల్ రాహుల్.. ఆ జాబితాలో ఒకే ఒక్కడు..!
దుబాయ్: ఐసీసీ బుధవారం (ఏప్రిల్ 13) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్ల హవా కొనసాగగా.. టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. పాక్ ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటగా.. భారత క్రికెటర్లు క్రితంతో పోలిస్తే తమతమ ర్యాంకులను దారుణంగా కోల్పోయి టాప్ 10లో కనిపించకుండాపోయారు. బ్యాటింగ్ విభాగంలో పాక్ కెప్టెన్ బాబార్ ఆజమ్ (818) అగ్రస్థానాన్ని, అదే జట్టు స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (794) మూడో స్థానాన్ని పదిలం చేసుకోగా, ఈ విభాగంలో టాప్ 10లో (పదో ర్యాంక్) ఉన్న ఏకైక భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ (646) టీమిండియా పరువు కాపాడాడు. Latest ICC T20I Batting Rankings sees Babar Azam still at number 1 #Cricket pic.twitter.com/nYknYuvpiv — Saj Sadiq (@SajSadiqCricket) April 13, 2022 ఈ జాబితాలో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్క్రమ్ (796) రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ (728), కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (703), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (692), సౌతాఫ్రికా నయా సెన్సేషన్ డస్సెన్ (669), న్యూజిలాండ్ వెటరన్ ఓపెనర్ గప్తిల్ (658), శ్రీలంక ప్లేయర్ పథుమ్ నిస్సంక (654) వరుసగా 4 నుంచి 9 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ 633 రేటింగ్ పాయింట్లతో 14వ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ 16, 19 స్థానాల్లో నిలిచారు. Plenty of movement in the latest @MRFWorldwide ICC Men's Player Rankings for T20Is 🔢 More 👇 — ICC (@ICC) April 13, 2022 బౌలింగ్, ఆల్‌రౌండర్ కేటగిరీల విషయానికొస్తే.. ఈ రెండు విభాగాల టాప్ 10 జాబితాల్లో టీమిండియా ఆటగాళ్లు కనుమరుగైపోయారు. బౌలింగ్ కేటగిరీలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంషీ 784 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. ఆదిల్ రషీద్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా, రషీద్ ఖాన్, వనిందు హసరంగ, ఎన్రిచ్ నోర్జే, ముజీబుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్, షాహీన్ అఫ్రిది టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా నుంచి భువనేశ్వర్ కుమార్ (586 పాయింట్లతో 18వ స్థానం) అత్యుత్తమ ర్యాంకింగ్ సాధించాడు. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విభాగపు టాప్ 10లోనూ టీమిండియా నుంచి ఒక్కరికీ చోటు దక్కలేదు. అఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షకీబుల్ హసన్, మొయిన్ అలీ, జేజే స్మిట్, లియామ్ లివింగ్‌స్టొన్, రోహన్ ముస్తపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జీషన్ మక్సూద్, ఎయిడెన్ మార్క్రమ్, దీపేంద్ర టాప్ 10లో ఉన్నారు. ఈ విభాగపు టాప్ 20లో కూడా టీమిండియా నుంచి ఒక్కరూ లేరు. చదవండి: సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. సుందర్ స్థానాన్ని భర్తీ చేయనున్న స్టార్ ఆల్‌రౌండర్ -
దూసుకుపోతున్న పాక్ ప్లేయర్లు.. టీమిండియా నుంచి ఆ ముగ్గురు..!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా కొనసాగింది. స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ జట్టు ఆటగాళ్లు బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హాక్, షాహీన్ అఫ్రిదిలు తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఆసీస్‌తో జరిగిన 3 వన్డేల్లో (103, 106, 89 నాటౌట్) 298 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హాక్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి (795 రేటింగ్ పాయింట్లు) చేరుకోగా, అదే సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌ల్లో ( 57, 114, 105) 276 పరుగులు చేసిన బాబర్ ఆజమ్.. భారీగా రేటింగ్ పాయింట్లు పెంచుకుని అగ్రస్థానంలో (891 పాయింట్లు) స్థిరపడ్డాడు. 🔸 Shaheen Afridi continues to climb 🔸 Imam-ul-Haq makes significant gains Pakistan players make major movements in the @MRFWorldwide ICC Men's Player Rankings for ODIs and Tests after #PAKvAUS series 📈 Details 👉 https://t.co/zoY06jyBJ3 pic.twitter.com/dxVyiF78oK — ICC (@ICC) April 6, 2022 ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టిన షాహీన్ అఫ్రిది బౌలింగ్ విభాగంలో ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో ప్లేస్‌కు (671 పాయింట్లు) చేరాడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (811), రోహిత్ శర్మ (791) తమ 2, 4 స్థానాలను పదిలం చేసుకోగా.. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (679) ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, న్యూజిలాండ్ మ్యాట్ హెన్రీ, బంగ్లా స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగనప్పటికీ, టీమిండియా పేసర్ బుమ్రా (830) ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు, పాక్ స్పీడ్ గన్ షాహీన్ అఫ్రిది (827) నాలుగో స్థానానికి ఎగబాకారు. ఈ జాబితాలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 901 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (850) రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. చదవండి: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ ఎవరంటే..? -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ఆటగాళ్లు హవా కొనసాగింది. టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ ఆటగాళ్లు అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్‌లో లబూషేన్ (892), స్టీవ్ స్మిత్ (845) తొలి రెండు స్థానాలను పదిలం చేసుకోగా, పాక్‌తో సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (757) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఖ్వాజా ఏకంగా 6 స్థానాలు ఎగబాకి 7వ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (754), విరాట్ కోహ్లి (742)లు తలో ర్యాంక్ కోల్పోయి 8, 10 స్థానాలకు పడిపోయారు. Major changes in the latest @MRFWorldwide ICC Men’s Player Rankings for Tests and ODIs 👀 More ➡️ https://t.co/MsmAFEH2gG pic.twitter.com/5Cr3GbWccp — ICC (@ICC) March 30, 2022 తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓ ర్యాంకును మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఈ జాబితా టాప్ 10లో పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్, టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్, సఫారీ స్పీడ్‌స్టర్ రబాడ, భారత పేసు గుర్రం బుమ్రా, పాక్ నయా సంచలనం షాహీన్ అఫ్రిది వరుసగా 1 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ కేటగిరీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (385), రవిచంద్రన్ అశ్విన్ (341)తొలి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. మరోవైపు ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో (బ్యాటింగ్ విభాగంలో) పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, కివీస్ ఆటగాడు రాస్ టేలర్ తొలి మూడు స్థానాలను నిలబెట్టుకోగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానం ఎగబాకి ఫోర్త్ ప్లేస్‌కు చేరాడు. ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో, పాక్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్‌లు చెరో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 6, 10 స్థానాలకు ఎగబాకారు. బౌలింగ్‌లో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా ఏకంగా 6 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి, బంగ్లా వెటరన్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్‌కు ఎగబాకగా, న్యూజిలాండ్ స్టార్ పేసర్ బౌల్ట్, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IPL 2022: జోరుమీదున్న కేకేఆర్‌ను ఆర్సీబీ నిలువరించేనా..? -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ము లేపిన ఆస్ట్రేలియా..
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్(727) రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. ఇక ఆగ్రస్ధానంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ(742) రేటింగ్‌తో కొనసాగుతోంది. అగ్రస్థానానికి కేవలం 15 రేటింగ్ పాయింట్ల దూరంలో లానింగ్ నిలిచింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లానింగ్ అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్‌లో లానింగ్ 110 బంతుల్లో 86 పరుగులు చేసింది. ఇక మరో ఆసీస్ క్రికెటర్ రిచెల్ హేయన్స్ ఆరు స్ధానాలు ఎగబాకి ఏడో స్ధానానికి చేరుకుంది. ఆదే విధంగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హైలీ మాథ్యూస్ ఏకంగా 12 స్ధానాలు ఎగబాకి 20వ స్ధానానికి చేరుకుంది. ఇక భారత సారథి మిథాలీ ఒక స్థానం దిగజారి నాలుగో స్ధానంకు చేరుకోగా, ఓపెనర్ మంధాన 10వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా తమ కెరీర్లో అత్యత్తుమ స్ధానాలకు చేరుకున్నారు. ఇక బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ జానెసన్ తొలి స్దానంలో ఉండగా, ఇంగ్లండ్ బౌలర్ సోఫియా ఎకిలిస్టన్ రెండో స్ధానానికి చేరుకుంది. కాగా భారత్ నుంచి జూలన్ గో స్వామి తప్ప మిగితా బౌలర్లు ఎవరూ టాప్10లో చోటు దక్కలేదు. జూలన్ గో స్వామి బౌలర్ల విభాగంలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: IPL 2022: పాపం రైనా.. మరోసారి బిగ్ షాక్... కనీసం ఆ అవకాశం కూడా లేదుగా! ↗️ Lanning, Haynes move up in batters list 💪 Ayabonga Khaka soars in bowling chart 🚀 Hayley Matthews makes all-round gains A lot of movements in the latest @MRFWorldwide ICC Women’s ODI Player Rankings update. 📝 https://t.co/MaJswVOBIS pic.twitter.com/ho8J1g652X — ICC (@ICC) March 8, 2022 -
అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్న కేఎల్ రాహుల్
KL Rahul Moves To Fourth In T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ఓ స్థానానికి మెరుగుపర్చుకుని నాలుగో ర్యాంకుకు ఎగబాకాడు. రాహుల్ ఖాతాలో ప్రస్తుతం 729 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. త్వరలో విండీస్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20లో రాణిస్తే.. టీ20 ర్యాంకింగ్స్ అగ్రపీఠం కేఎల్ రాహుల్ వశం కావడం ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ జాబితాలోని టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్ శర్మ(11), విరాట్ కోహి(10)లు.. తమతమ స్థానాలను నిలబెట్టుకోగా.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో, అదే దేశానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో టీమిండియా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 20వ ర్యాంకులో ఉండగా జస్ప్రీత్ బుమ్రా 26వ స్థానానికి పడిపోయాడు. Big gains for England's Moeen Ali in the latest update of the @MRFWorldwide ICC Men's T20I Player Rankings for all-rounders 💪More details 👉 https://t.co/s1pyiOGe63 pic.twitter.com/Q10xJcuEcI— ICC (@ICC) February 2, 2022 శ్రీలంక స్పిన్నర్ హసరంగ, సౌతాఫ్రికా బౌలర్ షంసీ, ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ వరుసగా ఒకటి నుంచి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ జాబితాలో అఫ్ఘాన్ ఆటగాడు మహ్మద్ నబీ, బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్‌లు తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. టాప్ 10 ఆల్రౌండర్లలో టీమిండియా ఆటగాళ్లు ఒక్కరు కూడా లేరు. చదవండి: చియాన్ విక్రమ్‌ను కలిసిన ధోని.. "మహాన్" కోసమే అంటున్న నెటిజన్లు -
ఎగబాకిన రాహుల్.. దిగజారిన కోహ్లి..!
ICC Test Rankings: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో అద్భుతమైన శతకం(123)తో అదరగొట్టి, టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సైతం సత్తా చాటాడు. ఈ వారపు ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్పాట్‌కు ఎగబాకాడు. ఇదే టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 11వ ప్లేస్‌కు, రెండు స్థానాలు మెరుగుపర్చుకున్న రహానే 25వ స్పాట్‌కు చేరుకోగా, టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి రెండు ర్యాంకులు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు. Latest ICC Test Rankings for Batting!#Cricket #ICCRankings pic.twitter.com/fl10mW6QV5 — InsideSport (@InsideSportIND) January 5, 2022 pic.twitter.com/L5F5cKWGER — Krikut Expert Rohit (@_rohitjangra_) January 5, 2022 ఈ జాబితాలో భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ 5వ స్పాట్‌ను నిలబెట్టుకోగా, ఆసీస్ ఆటగాడు లబూషేన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే.. ఈ జాబితాలో సైతం టీమిండియా బౌలర్లు తమ తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా టాప్-10(9వ స్థానం)లోకి చేరుకోగా, ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతతో పాటు ఎనిమిది వికెట్లతో సత్తా చాటిన షమీ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రెండో స్పాట్‌ను కాపాడుకోగా.. ఆసీస్ పేసర్ కమిన్స్ టాప్‌లో కొనసాగుతున్నాడు. చదవండి: Sourav Ganguly: గంగూలీ కుమార్తెకు కరోనా.. మరో ముగ్గురికి కూడా -
ICC Rankings: టాప్‌లో లబూషేన్.. దిగజారిన కోహ్లి ర్యాంక్
దుబాయ్: ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్ల హవా కొనసాగింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్ ఆటగాడు లబూషేన్(103, 51) 912 పాయింట్లతో.. ఇంగ్లండ్ సారధి జో రూట్(897)ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోగా, స్టీవ్ స్మిత్(884) మూడో స్థానంలో, డేవిడ్ వార్నర్(775) ఆరు, ట్రవిస్ హెడ్(728) పదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ 5వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, టెస్ట్ సారధి విరాట్ కోహ్లి ఓ స్థానాన్ని కోల్పోయి 7వ ప్లేస్‌లో ఉన్నాడు. 🔝 Labuschagne dethrones Root 💪 Starc makes significant gains Australia stars shine in the latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings. 👉 https://t.co/DNEarZ8zhm pic.twitter.com/W3Aoiy3ARP — ICC (@ICC) December 22, 2021 ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ ఆసీస్ ప్లేయర్ల హవానే నడించింది. యాషెస్ రెండో టెస్ట్‌లో 6 వికెట్లు సాధించి ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్.. దాదాపు ఏడాది తర్వాత తిరిగి టాప్-10లో చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు దూరమైనప్పటికీ ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆశ్విన్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో ఇంగ్లండ్ సారధి రూట్ కెరీర్(111 టెస్ట్‌ల తర్వాత)లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 🔹 Babar Azam surges to the 🔝 🔹 Mohammad Rizwan into the top three 🔥 Significant gains for Pakistan batters in the latest @MRFWorldwide ICC Men’s T20I Player Rankings 👉 https://t.co/hBFKXGWUp4 pic.twitter.com/qqUfYsFGkA — ICC (@ICC) December 22, 2021 మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్‌లు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించగా.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 729 పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. చదవండి: అభిమానులకు ‘గుడ్‌న్యూస్’... స్టేడియంలోకి అనుమతి.. అయితే! -
దిగజారిన పాక్ కెప్టెన్.. రెండో స్థానంలో అశ్విన్
Babar Azam: టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత వరుస వైఫల్యాల బాట పట్టిన పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజమ్.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. బంగ్లాదేశ్, విండీస్‌లతో జరిగిన సిరీస్‌ల్లో దారుణంగా విఫలమైన బాబర్.. రెండు ర్యాంకులు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. బాబర్.. బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 26 పరుగులు, విండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్(2 మ్యాచ్‌లు)లో 8 పరుగులు మాత్రమే చేయడంతో అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు. గత 5 మ్యాచ్‌ల్లో బాబార్ బ్యాటర్‌గా దారుణంగా విఫలమైనా పాక్ జట్టు మాత్రం ఐదింటిలోనూ గెలవడం విశేషం. వరుస వైఫల్యాలతో బాబర్ ర్యాంక్ పతనం కాగా.. ఇంగ్లండ్ డాషింగ్ ప్లేయర్ డేవిడ్ మలాన్ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. అతని తర్వాత రెండో ప్లేస్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ ఉన్నాడు. Australia’s batters and Pakistan’s pacers make significant gains in the latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings 📈 Details 👉 https://t.co/kkMymOpUSW pic.twitter.com/SeCzbldK5g — ICC (@ICC) December 15, 2021 ఇదిలా ఉంటే, ఈ వారం ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటర్ల విభాగంలో లబూషేన్ రెండో స్థానానికి ఎగబాకగా, డేవిడ్ వార్నర్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలర్ల విభాగానికి వస్తే.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా.. పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది మూడో ప్లేస్‌కు ఎగబాకాడు. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: రిటైర్మెంట్పై స్పందించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. -
బాబర్ అజమ్ నెంబర్‌వన్.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు
No Indian Batter Ranks In Top Five ICC Batting Rankings.. టి20 ప్రపంచకప్ 2021 ముగిసిన అనంతరం ఐసీసీ బుధవారం టి20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాటింగ్ విభాగంలో టాప్-5లో ఒక్క టీమిండియా బ్యాటర్ కూడా లేడు. ఇక బౌలింగ్, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ విభాగంలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. చదవండి: Ind Vs Nz 2021: ‘బ్యాటర్’గా విరాట్ కోహ్లి... టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే! బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 839 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలాన్ 805 పాయింట్లతో రెండో స్థానంలో.. ఎయిడెన్ మార్క్రమ్ 796 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డెవన్ కాన్వే 747 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. టి20 ప్రపంచకప్‌లో సూపర్ ప్రదర్శన కనబరిచిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 742 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరపున టి20 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కేఎల్ రాహుల్ ఒకస్థానం దిగజారి ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. టి20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌తో మెరిసిన వనిందు హసరంగ 797 పాయింట్లతో టాప్ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రెయిజ్ షంసీ 784 పాయింట్లతో రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా రెండు స్థానాలు ఎగబాకి 725 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్ విభాగంలో మహ్మద్ నబీ 265 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. షకీబ్ అల్ హసన్ (260 పాయింట్లు), లియామ్ లివింగ్‌స్టోన్(179 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. Massive gains for star performers of the #T20WorldCup 📈 More on all the changes in the @MRFWorldwide ICC Men's Player Rankings for T20Is 👉 https://t.co/DFstAKi06Y pic.twitter.com/QOsGIMYNUw — ICC (@ICC) November 17, 2021 -
టాప్-10లోకి బుమ్రా.. దూసుకొస్తున్న శార్దూల్
దుబాయ్: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-10లోకి ప్రవేశించాడు. ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత స్పెల్‌తో ఇంగ్లండ్ వెన్నువిరిచిన బుమ్రా.. 771 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ ప్యాట్ కమిన్స్(908) నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(831), న్యూజిలాండ్ టిమ్ సౌథీ(824) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ జాబితాలో ఇంగ్లండ్ సారధి జో రూట్(903) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కివీస్ కేన్ విలియమ్సన్(901), ఆసీస్ స్టీవ్ స్మిత్(891) రెండు, మూడు ర్యాంక్‌ల్లో నిలిచారు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో సూపర్ శతకంతో చెలరేగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(813).. తన రేటింగ్ పాయింట్లను భారీగా పెంచుకున్నప్పటికీ ఐదో స్థానానికే పరిమితయ్యాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(783) ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఓవల్ టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్.. రెండు విభాగాల్లో తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని టాప్-10 దిశగా దూసుకొస్తున్నాడు. బ్యాటింగ్‌లో 79, బౌలింగ్‌లో 49వ ర్యాంకుకు ఎగబాకాడు. చదవండి: సరికొత్త అవతారంలో ట్రంప్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికన్లు -
కోహ్లిని వెనక్కు నెట్టిన రోహిత్.. అగ్రస్థానానికి ఎగబాకిన రూట్
దుబాయ్: ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లిని అధిగమించి ఐదో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో నిలకడగా ఆడుతున్న రోహిత్.. 773 రేటింగ్ పాయింట్లు సాధించి కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌ను సొంతం చేసుకోగా, ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్ కోహ్లి 766 పాయింట్లకే పరిమితమై ఆరో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ సారధి జో రూట్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టీమిండియాతో మూడో టెస్ట్‌లో సూపర్ శతకం సాధించిన రూట్.. 916 పాయింట్లు తన ఖాతాలో వేసుకుని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(901)ను రెండో స్థానానికి నెట్టి దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరాడు. భారత్‌తో సిరీస్‌కు ముందు ఐదో స్థానంలో ఉన్న రూట్.. ప్రస్తుత సిరీస్‌లో మూడు అద్భుత శతకాల సాయంతో 507 పరుగులు సాధించి కోహ్లి, లబూషేన్(878), స్టీవ్ స్మిత్(891), విలియమ్సన్లను ఒక్కొక్కరిగా వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఇక ఈ జాబితా టాప్-10 లిస్ట్ నుంచి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఔట్ కాగా, పాక్ కెప్టెన్ బాబార్ ఆజమ్(749) ఏడో స్థానానికి ఎగబాకాడు. గతవారం ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న పంత్(695) ఏకంగా ఐదు స్థానాలు కోల్పోయి 12వ స్థానానికి దిగజారాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే.. గత వారం ర్యాంకింగ్స్‌లో దాదాపు ఎలాంటి మార్పులు జరగలేదు. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్(800) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 6వ ప్లేస్‌కు, పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది(783) 14 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్‌కు ఎగబాకగా, కమిన్స్(908), అశ్విన్(848), సౌథీ(824) వరుసగా మొదటి మూడు స్థానాల్లో కొనసాగతున్నారు. చదవండి: వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి.. -
10 వికెట్ల ప్రదర్శనతో 10 స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-10లోకి..
దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాక్ ఆటగాళ్లు దుమ్మురేపారు. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న అనంతరం విడుదలైన ఈ ర్యాంకింగ్స్‌లో పాక్ సంచలన పేసర్ షాహిన్ అఫ్రిది, రెండో టెస్ట్ సెంచరీ హీరో ఫవాద్ ఆలమ్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తమతమ స్థానాలను మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ ర్యాంకులను సాధించారు. విండీస్‌తో రెండో టెస్ట్‌లో పది వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షాహిన్ అఫ్రిది ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ స్థానానికి ఎగబాకగా, బాబర్ ఆజమ్ ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని 7వ స్థానానికి, ఫవాద్ ఆలమ్ 34 స్థానాలు మెరుగుపర్చుకుని 21వ ప్లేస్‌కు ఎగబాకారు. Shaheen Afridi launches up in the @MRFWorldwide ICC Men’s Test Bowling rankings after his stellar series in the West Indies 🚀 Full list: https://t.co/zWeR1wwvYA pic.twitter.com/jnAesHzo9v — ICC (@ICC) August 25, 2021 బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు టాప్-10లో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. కోహ్లి(776), రోహిత్(773) ఐదు, ఆరు స్థానాల్లో నిలువగా, పంత్(724) ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(893) రెండో స్థానాన్ని, ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(891) మూడో ప్లేస్‌ను పదిలం చేసుకున్నారు. Pakistan captain Babar Azam has climbed a spot on the @MRFWorldwide ICC Men’s Test Batting rankings ⬆️ Full list: https://t.co/17s2PmICbp pic.twitter.com/uFHHbpeRAE — ICC (@ICC) August 25, 2021 ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ కేటగిరీలో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 848 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వీరి తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ పేసర్ సౌథీ(824), ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(816), కివీస్ పేసర్ నీల్ వాగ్నర్(810), ఇంగ్లండ్ స్టార్ పేసర్ అండర్సన్(800) వరుసగా మూడు, నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. చదవండి: కోహ్లి, రూట్ కొట్టుకున్నంత పని చేశారట..! -
కోహ్లీ, రాహుల్ ర్యాంకులు పదిలం.. సెకెండ్ ప్లేస్‌కు దూసుకెళ్లిన లంక ప్లేయర్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(5వ ర్యాంక్), స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్(6వ ర్యాంక్)లు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. ఇక శ్రీలంక పర్యటనలో దుమ్మురేపిన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్(16వ ర్యాంక్), స్పిన్నర్ యుజువేంద్ర చహల్(21వ ర్యాంక్), దీపక్ చాహర్(34వ ర్యాంక్) మెరుగైన ర్యాంకులను సొంతం చేసుకోగా.. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా 720 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషీ 792 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆఫ్ఘన్ బౌలర రషీద్ ఖాన్ ఓ స్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్‌కు పడిపోయాడు. ఇక శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో నాలుగు వికెట్లతో చెలరేగిన భువీ.. వాషింగ్టన్ సుందర్(17వ ర్యాంక్)ను వెనక్కు నెట్టి 16వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భువీ.. సుందర్ కన్నా 3 పాయింట్లు ఎక్కువగా సాధించి 588 పాయింట్లతో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బాబర్ ఆజామ్, ఆరోన్ ఫించ్, డెవాన్ కాన్వే వరుసగా రెండు మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ, రాహుల్‌లు గత కొంతకాలంగా అంతర్జాతీయ టీ20లు ఆడనప్పటికీ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. రోహిత్ శర్మ ఓ స్థానం దిగజారి 14వ స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. ఈ లిస్ట్‌లో ఆఫ్ఘన్ ప్లేయర్ మహ్మద్ నబీ, బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
మిథాలీ రాజ్.. 16 ఏళ్లలో తొమ్మిదోసారి ‘టాప్’
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆమె.. తన 16 ఏళ్ల వన్డే కెరీర్లో తొమ్మిదోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. గతవారం ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ 30 పాయింట్లు కోల్పోవడంతో మిథాలీ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. పాక్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో 49, 21 పరుగులు మాత్రమే చేసిన స్టెఫానీ.. తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఐదో ప్లేస్‌లో నిలిచింది. 🔝 @M_Raj03 has regained her position as the No.1 batter on the @MRFWorldwide ICC Women's ODI Player Rankings. Full list: https://t.co/jxTLqOK1gm pic.twitter.com/oAHUTu4eRY — ICC (@ICC) July 20, 2021 కాగా, అంతకుముందు వారం పాక్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయమైన సెంచరీ సాధించడం ద్వారా స్టెఫానీ గతవారం టాప్ ర్యాంక్‌కు చేరింది. మరోవైపు స్టెఫానీ ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఈ జాబితాలో ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలైస్ పెర్రీ టాప్కు చేరుకుంది. ఇక బౌలింగ్ విభాగంలో కూడా స్టెఫానీ మూడు స్థానాలు దిగజారింది. మొత్తంగా స్టెఫానీ గతవారం జరిగిన పాక్ సిరీస్‌లో దారుణంగా విఫలం కావడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన పట్టును కోల్పోయింది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ మంధాన కెరీర్ అత్యుత్తమ మూడో ర్యాంక్‌కు చేరుకుంది. -
దుమ్మురేపిన విండీస్ ఆటగాళ్లు; బాబర్ అజమ్ నెంబర్ వన్
దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో విండీస్ ఆటగాళ్లు దుమ్మురేపారు. ముఖ్యంగా బౌలర్ ఫాబియెన్ అలెన్ బౌలర్ల జాబితా ర్యాంకింగ్స్ విభాగంలో తొలిసారి టాప్ 10లో అడుగుపెట్టాడు. ఆసీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో మూడు వికెట్లు తీసిన అలెన్ 16 స్థానాలు ఎగబాకి 622 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. ఇక ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ 22వ స్థానంలో, డ్వేన్ బ్రేవో ఏడు స్థానాలు ఎగబాకి 37వ స్థానంలో, ఒబేడ్ మెకోయ్ 15 స్థానాలు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రెయిజ్ షంషీ 821 పాయింట్లతో తొలి స్థానంలో, రషీద్ ఖాన్(719 పాయింట్లు) రెండో స్థానం, ఆదిల్ రషీద్( 695 పాయింట్లు) ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో షిమ్రన్ హెట్‌మైర్ 37 స్థానాలు ఎగబాకి 62వ స్థానంలో, లెండి సిమన్స్ ఆరు స్థానాలు ఎగబాకి 64వ స్థానంలో నిలిచారు. ఇక డేవిడ్ మలాన్ 888 పాయింట్లతో తొలి స్థానం, బాబర్ అజమ్(828 పాయింట్లు), ఆరోన్ ఫించ్(805 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండ్ విభాగంలో మహ్మద్ నబీ(285 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో చిత్తుగా ఓడిపోయినా బాబర్ అజమ్ మాత్రం చివరి వన్డేలో అద్భుత శతకంతో మెరిశాడు. ఓవరాల్‌గా 873 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 857 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ 737 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. మెహదీ హసన్ 708 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్ విభాగంలో షకీబ్ అల్ హసన్ తొలి స్థానంలో ఉన్నాడు. Fabian Allen breaks into the top 10 of the @MRFWorldwide ICC T20I Player Rankings for bowling 📈 He has jumped up 16 spots! Full rankings ➡️ https://t.co/H7CnAiw0YT pic.twitter.com/DxgQzoUs1Z — ICC (@ICC) July 14, 2021 -
వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన ఇంగ్లండ్ ప్లేయర్..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్.. కెరీర్ అత్యుత్తమ వన్డే ర్యాంకింగ్ సాధించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 6 వికెట్లు పడగొట్టిన వోక్స్(711 పాయింట్లు).. ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(737 పాయింట్లు) నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా, బంగ్లా బౌలర్ మెహదీ హసన్ (713) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (690 పాయింట్లు) ఒక స్థానాన్ని కోల్పోయి ఆరో ప్లేస్‌కు దిగజారాడు. 📈 @ChrisWoakes makes a charge in the latest @MRFWorldwide ICC Men’s ODI Bowling Rankings, with the @EnglandCricket quick jumping to No.3. Full rankings ➡️ https://t.co/tHR5rK3ru7 pic.twitter.com/LazEtSmQHB — ICC (@ICC) July 7, 2021 ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. శ్రీలంకతో సిరీస్‌లో 147 పరుగులతో అదరగొట్టిన ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్.. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానంలో, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒక స్థానం ఎగబాకి 25వ ప్లేస్‌లో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకోగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక స్థానం మెరుగుపర్చుకుని 9వ ప్లేస్‌కు చేరుకోగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, ఎయిడెన్ మర్క్రమ్లు.. 13, 19వ స్థానాలకు ఎగబాకారు. విండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఈ ఇద్దరు ఓపెనర్లు అదరగొట్టారు. దీంతో ప్రొటీస్.. ఆతిధ్య జట్టుపై 3-2తో గెలుపొందింది. ఈ జాబితాలో టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ సైతం ఒక స్థానం మెరుగుపరుచుకని 6వ ప్లేస్‌కు చేరుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలాన్, ఆసీస్ ఆరోన్ ఫించ్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు వరుసగా 1, 2, 3 స్థానాలను నిలబెట్టుకున్నారు. 🔺 After entering the top 10 last week, @windiescricket opener Evin Lewis moves up a spot on the @MRFWorldwide ICC Men's T20I Batting Rankings. pic.twitter.com/TugCjFugmb — ICC (@ICC) July 7, 2021 -
టాప్ లేపిన మిథాలీ.. మూడేళ్ల తర్వాత అగ్రపీఠం కైవసం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్, యువ ఓపెనర్ షెఫాలీ వర్మ దుమ్ము లేపారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మిథాలీ.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడేళ్ల తర్వత మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా చిచ్చర పిడుగు షెఫాలీ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. 701 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 💥 @M_Raj03 is the new No.1 💥In the latest @MRFWorldwide ICC Women's ODI Player Rankings for batting, the India skipper climbs to the 🔝 of the table.Full list: https://t.co/KjDYT8qgqn pic.twitter.com/2HIEC49U5i— ICC (@ICC) July 6, 2021 బౌలింగ్ విభాగంలో జూలన్ గోస్వామి(694 పాయింట్లు) 4వ స్థానంలో, పూనమ్ యూదవ్(617 పాయింట్లు) 9వ ర్యాంక్‌లో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్లు జెస్ జొనాస్సెన్ (808 పాయింట్లు), మేఘన్ షట్(762 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(331 పాయింట్లు) ఐదో ర్యాంకును దక్కించుకోగా.. మరిజన్నె కప్ (సౌతాఫ్రికా), ఎలిసా పెర్రి(ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక, టీ20 ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఇద్దరు భారత మహిళా బ్యాటర్లు టాప్ -10లో నిలిచారు. టీమిండియా చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ 776 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలువగా, మరో స్టార్ బ్యాటర స్మృతి మంధాన(693 పాయింట్లు) నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఈ ఫార్మాట్లోని బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లు దీప్తి శర్మ 5వ ర్యాంక్‌లో, రాధా యాదవ్ 6వ స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ.. 304 పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉంది. -
ICC Rankings: టాప్ ర్యాంక్ దిశగా టీమిండియా కెప్టెన్..
దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్థానాన్ని మెరుగుపరచుకుని నాలుగో ర్యాంక్‌కు ఎగబాకాడు. ప్రస్తుతం 814 రేటింగ్ పాయింట్లు కలిగిన కోహ్లీ.. ప్రపంచ టెస్ట్ ఛాంపియనిషిప్(డబ్ల్యూసీ) ఫైనల్, ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సిన నేపథ్యంలో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టి తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా, ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ మూడో ర్యాంకులో, ఇంగ్లాండ్ సారథి జో రూట్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. టీమిండియా డాషింగ్ ఆటగాళ్లు రిషబ్ పంత్ (797), రోహిత్ శర్మ (797) సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ (886) దారుణంగా విఫలం కావడంతో అతడి రేటింగ్ పాయింట్లలో కోత పడింది. దీంతో మ్యాచ్‌లు ఆడకపోయినా స్టీవ్ స్మిత్(891) మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఈ క్రమంలో గ్యారీ సోబర్స్ (189 టెస్టులు), వివ్ రిచర్డ్స్ (179 టెస్టులు) తర్వాత ఎక్కువ మ్యాచ్‌లకు(167) నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ జాబితాలో ప్యాట్ కమిన్స్ (908), రవిచంద్రన్ అశ్విన్ (850), టిమ్ సౌథీ (830) టాప్-3 బౌలర్లుగా కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ 307 రేటింగ్ పాయింట్లతో 64వ స్థానానికి దూసుకొచ్చాడు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు అశ్విన్ 2, జడేజా 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. చదవండి: WTC Final: చారిత్రక మ్యాచ్‌కు వరుణ గండం..? -
ICC RANKINGS: రెండో ర్యాంక్‌కు దూసుకొచ్చిన టీమిండియా ఆల్‌రౌండర్
దుబాయ్: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(386 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో అతను ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్(385 పాయింట్లు)ను వెనక్కి నెట్టాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్ జేసన్ హోల్డర్ 423 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆశ్విన్ నాలుగో స్థానంలో, బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ ఐదో స్థానంలో నిలిచారు. మరోవైపు టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్-10లో కొనసాగుతున్నారు. టీమిండియా సారధి విరాట్ కోహ్లీ 814 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుండగా, రిషబ్ పంత్(747), రోహిత్ శర్మ(747) వరుసగా 6, 7 ర్యాంకుల్లో నిలిచారు. ఈ జాబితాలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, జో రూట్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ.. మూడు స్థానాలు మెరుగుపరచుకుని 3వ ర్యాంక్‌లో, ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్(908) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సహా 7 వికెట్లు పడగొట్టిన సౌథీ..838 రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 850 పాయింట్లతో రెండులో, 816 పాయింట్లతో న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ నాలుగో స్థానంలో నిలిచారు. చదవండి: జడేజాకు ఇంగ్లీష్ రాదు, అందుకే 'ఆ' సమస్య.. -
‘మా జట్టే అన్ని ఫార్మాట్లలో నెం.1’
వరుస విజయాల పరంపరను కొనసాగిస్తోన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు పై మాజీ ఆల్‌రౌండర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న రోజుల్లో అన్ని క్రికెట్ ఫార్మాట్లలో పాకిస్థాన్ జట్టు నెం. 1 టీమ్ గా అవతారమెత్తబోతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆటతీరుతో త్వరలోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన స్ధానాన్ని మెరుగుపర్చుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సంవత్సరం పాకిస్థాన్ జట్టు బాబర్ అజామ్ నేతృత్వంలో టీం మంచి ఫామ్‌ను కొనసాగించడం మంచి శకునమని మాజీ ఆల్ రౌండర్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో, పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకుంది. దాంతోపాటుగా నాలుగు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని సిరీస్‌లో విజయకేతనం ఎగరవేశారు. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-1తో గెలిచారు. కాగా ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచులను గెలిచి టెస్ట్ సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు టెస్ట్ క్రికిట్‌లో ఐదవ స్థానంలో, వన్డేలో ఆరవ స్థానంలో, టీ20ల్లో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. చదవండి: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్: భారత ఆటగాళ్లకు దక్కని చోటు -
ICC Ranking For ODI Teams: న్యూజిలాండ్ నంబర్‌వన్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ టాప్ లేపింది. ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టిన కివీస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వార్షిక గణాంకాల ఆధారంగా న్యూజిలాండ్ టాప్కు చేరింది. 2018-19, 2019-20 సీజన్లలో ఐసీసీ సభ్య దేశాలు సాధించిన విజయాల్లో 50 శాతాన్ని పరిగణలోకి తీసుకోగా, 2020 మే నుంచి పూర్తిశాతాన్ని లెక్కించగా న్యూజిలాండ్ 121 రేటింగ్ పాయింట్లతో టాప్కు చేరింది. అదే సమయంలో అప్పటివరకూ అగ్రస్థానంలో కొనసాగిన ఇంగ్లండ్ నాల్గో స్థానానికి పడిపోయింది. ఇక విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా మూడో స్థానానికి దిగజారింది. ఈ క్రమంలోనే రెండో స్థానానికి ఆస్ట్రేలియా ఎగబాకగా, టీమిండియా మూడో స్థానానికి పరిమితమైంది. ఆసీస్ 118 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో, 115 రేటింగ్ పాయింట్లతో టీమిండియా మూడో స్థానంలో ఉన్నాయి. కాగా, ఇంగ్లండ్ కూడా 115 రేటింగ్ పాయింట్లతో ఉన్నా డెసిమల్ పాయింట్లతో నాల్గో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ నాల్గో స్థానానికి పడిపోవడానికి భారత్, ఆస్ట్రేలియాలపై వన్డే సిరీస్‌లను చేజార్చుకోవడమే. అదే సమయంలో ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌ను కోల్పోయింది. ఇవన్నీ ఇంగ్లండ్ వన్డే ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపాయి. -
స్మృతి, మిథాలీ ర్యాంక్‌లు యథాతథం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు స్మృతి మంధాన, మిథాలీ రాజ్ స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. 710 పాయింట్లతో స్మృతి ఏడో ర్యాంక్‌లో... 709 పాయింట్లతో మిథాలీ ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో జులన్ గోస్వామి ఐదో ర్యాంక్‌లో, పూనమ్ యాదవ్ ఎనిమిదో ర్యాంక్‌లో, శిఖా పాండే పదో ర్యాంక్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ ఐదో స్థానంలో ఉంది. -
టాప్ 5లోకి కోహ్లి..దిగజారిన కేఎల్ రాహుల్ ర్యాంకింగ్
దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు, మూడు టీ20ల్లో అజేయ అర్ధశతకాలతో(73, 77) అలరించిన ఆయన.. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఆరు నుంచి ఐదవ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు వరుస డకౌట్లతో నిరాశపరుస్తున్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానాన్ని కోల్పోయి మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారాడు. టాప్-10లో ఈ ఇద్దరు టీమిండియా బ్యాట్స్మెన్లు మినహా ఎవరికి చోటు దక్కలేదు. కాగా, ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, రెండవ స్థానంలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, మూడో స్థానంలో పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ జాబితాలో టీమిండియా నుంచి ఏ ఒక్క బౌలర్‌కు కూడా చోటు దక్కలేదు. ఈ జాబితాలో ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషీ రెండులో, మరో ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహమాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో సైతం టీమిండియా ఆటగాళ్ల ప్రాతినిధ్యం లేకపోగా, ఈ జాబితాలో ఆఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ అగ్రస్థానంలో, బంగ్లాదేశ్ షకీబుల్ హసన్ రెండులో, ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ మూడో స్థానంలో ఉన్నారు. -
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. దుమ్మురేపిన పంత్
దుబాయ్: ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. తాజాగా ప్రకటించిన బ్యాట్స్‌మన్ ర్యాంకుల్లో పంత్ 7వ స్థానానికి చేరుకున్నాడు. తన మెరుపు శతకంతో పంత్ ఏడు స్ధానాలు మెరుగుపర్చుకోవడం విశేషం. 747 రేటింగ్ పాయింట్లతో ఇదే స్థానంలో ఉన్న రోహిత్ శర్మ, హెన్రీ నికోల్స్‌లతో పంత్ సమంగా నిలిచాడు. ఐసీసీ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో ఒక భారత వికెట్ కీపర్ టాప్–10లో నిలవడం ఇదే మొదటిసారి కాగా... అత్యుత్తమ రేటింగ్ (747) కూడా ఇదే కావడం మరో విశేషం. ఈ జాబితాలో విలియమ్సన్ (919) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా...విరాట్ కోహ్లి (5వ) తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో పోరులో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన అతను 850 రేటింగ్ పాయింట్లతో 2017 ఆగస్టు తర్వాత మొదటిసారి రెండో ర్యాంక్‌ను అందుకోగలిగాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి బుమ్రా 10వ స్థానంలో నిలవగా, ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ (353 పాయింట్లు) నాలుగో స్థానాన్ని అందుకోవడం విశేషం. టి20ల్లో రెండో ర్యాంక్‌కు... ఐసీసీ టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు (268 రేటింగ్) రెండో స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో అప్పటి వరకు రెండో స్ధానంలో ఉన్న ఆస్ట్రేలియా (267)...మూడుకు పడిపోగా భారత్ ముందంజ వేసింది. ఇంగ్లండ్ (275) నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. టి20 బ్యాట్స్‌మన్ టాప్–10 ర్యాంకుల్లో భారత్ నుంచి రాహుల్ (2), కోహ్లి (6) ఉండగా...బౌలర్, ఆల్‌రౌండర్ జాబితాలో ఎవరికీ చోటు దక్కలేదు. -
అదే మాయ... అదే ఫలితం
భారత్ లెక్క తప్పలేదు... స్పిన్‌ను ఆడలేని ప్రత్యర్థి బలహీనతపై బలమైన దెబ్బ వేస్తూ జట్టు మరో టెస్టును తమ ఖాతాలో వేసుకుంది. మూడో టెస్టు రెండు రోజుల్లో ముగిస్తే, నాలుగో టెస్టు మూడు రోజుల వరకు వెళ్లింది. ఈ తేడా తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్... అశ్విన్, అక్షర్ పటేల్ బౌలింగ్‌ను కనీస స్థాయిలో కూడా ఎదుర్కోలేక ఆపసోపాలు పడిన ఇంగ్లండ్ ఎలాంటి పోరాటం లేకుండా ఆటను అప్పగించేసింది. ఇద్దరు స్పిన్నర్లు నీకో ఐదు నాకో ఐదు అంటూ వికెట్లు పంచుకోవడంతో కుప్పకూలిన రూట్ బృందం ఓటమిని ఆహ్వానించింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాకుండానే ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోకి దర్జాగా అడుగు పెట్టింది. పనిలో పనిగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరి బోనస్ కూడా పొందింది. అనూహ్యంగా తొలి టెస్టులో నెగ్గి సిరీస్‌లో గట్టి పోటీ ఇవ్వగలదని భావించిన రూట్ జట్టు చివరకు 1–3తో తలవంచింది. 2016లో ఇక్కడ ఆడిన సిరీస్‌తో పోలిస్తే ఒక విజయాన్ని అందుకున్నా... పేలవ బ్యాటింగ్ కారణంగా కీలక సమయాల్లో చేతులెత్తేసింది. స్వదేశంలో తమకు తిరుగులేదని కోహ్లి బృందం మరోసారి నిరూపించగా, కొందరు యువ ఆటగాళ్ల ప్రదర్శన సిరీస్‌ను చిరస్మరణీయంగా మార్చింది. అహ్మదాబాద్: టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ భారత జట్టు ఇంగ్లండ్‌పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన చివరి మ్యాచ్‌లో భారత్... ఇన్నింగ్స్, 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది. కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్ లారెన్స్ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు. అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (174 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’.... పంత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు లభించాయి. చెన్నైలో తొలి టెస్టులో ఓడిన తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్ చివరకు 3–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తాజా విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించి న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. జూన్ 18 నుంచి 22 వరకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 12 నుంచి అహ్మదాబాద్‌లోనే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది. సెంచరీ మిస్... ఓవర్‌నైట్ స్కోరు 294/7 స్కోరుతో ఆట కొనసాగిస్తూ మూడో రోజు మరో 20.4 ఓవర్లు ఆడగలిగిన భారత్ 71 పరుగులు జత చేసి చివరి 3 వికెట్లు చేజార్చుకుంది. ముఖ్యంగా సుందర్, అక్షర్ శతక భాగస్వామ్యం హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు అలవోకగా పరుగులు సాధించారు. బెస్ ఓవర్లో వరుస బంతుల్లో సుందర్ సిక్స్, ఫోర్ బాదగా, లీచ్ ఓవర్లో అక్షర్ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే ఎట్టకేలకు రనౌట్‌తో ఈ జోడీని ఇంగ్లండ్ విడగొట్టింది. రూట్ బౌలింగ్‌లో సుందర్ షాట్ మిడాన్ దిశగా ఆడగా... సింగిల్ కోసం ప్రయత్నించిన అక్షర్ సాధ్యంకాక వెనక్కి వచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ సమయంలో సరిగ్గా 96 పరుగుల వద్ద ఉన్న సుందర్ దురదృష్టవశాత్తూ సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు. స్టోక్స్ వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతికే ఇషాంత్ శర్మ (0) అవుట్ కాగా, నాలుగో బంతికి సిరాజ్ (0) బౌల్డ్ కావడంతో సుందర్ నిరాశగా నిలబడిపోయాడు. లారెన్స్ మినహా... ఎప్పటిలాగే ఇంగ్లండ్ జట్టు భారత స్పిన్ ద్వయాన్ని సరిగ్గా ఎదుర్కోలేక చేతులెత్తేసింది. నాలుగు ఓవర్ల వరకు ఎలాగోలా నిలబడిన జట్టు పతనం ఐదో ఓవర్‌తోనే మొదలైంది. అశ్విన్ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో క్రాలీ (5), బెయిర్‌స్టో (0)లను పెవిలియన్ పంపించాడు. కొద్ది సేపటికే సిబ్లీ (3)ని అవుట్ చేసి అక్షర్ తన వికెట్ల ఖాతా తెరవగా, తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసిన స్టోక్స్ (2) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. పోప్ (15), రూట్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా... అదీ ఎక్కువసేపు సాగలేదు. పంత్ అద్భుత స్టంపింగ్‌కు పోప్ వెనుదిరగ్గా, మరో రెండు బంతులకే అశ్విన్ బౌలింగ్‌లో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 65/6 స్కోరుతో దాదాపు ఓటమి ఖాయమైన దశలో ఒక్క లారెన్స్ మాత్రం కొంత పోరాడే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో ‘సున్నా’ వద్ద ఉన్న లారెన్స్ పట్టుదలగా ఆడి అర్ధ సెంచరీ సాధించగలిగాడు. మరో ఎండ్‌లో ఫోక్స్ (13), బెస్ (2)లను అక్షర్ అవుట్ చేసి ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కొద్ది సేపటికే లీచ్ (2)ను అవుట్ చేసిన అశ్విన్, అదే ఓవర్లో లారెన్స్‌ను బౌల్డ్ చేయడంతో టెస్టు సిరీస్ ముగిసింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 205; భారత్ తొలి ఇన్నింగ్స్: 365; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రహానే (బి) అశ్విన్ 5; సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 3; బెయిర్‌స్టో (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; రూట్ (ఎల్బీ) (బి) అశ్విన్ 30; స్టోక్స్ (సి) కోహ్లి (బి) అక్షర్ 2; పోప్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 15; లారెన్స్ (బి) అశ్విన్ 50; ఫోక్స్ (సి) రహానే (బి) అశ్విన్ 13; బెస్ (సి) పంత్ (బి) అక్షర్ 2; లీచ్ (సి) రహానే (బి) అశ్విన్ 2; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (54.5 ఓవర్లలో ఆలౌట్) 135. వికెట్ల పతనం: 1–10, 2–10, 3–20, 4–30, 5–65, 6–65, 7–109, 8–111, 9–134, 10–135. బౌలింగ్: సిరాజ్ 4–0–12–0, అక్షర్ 24–6–48–5, అశ్విన్ 22.5–4–47–5, సుందర్ 4–0–16–0. తొలి టెస్టు ఓడిన తర్వాత కోలుకొని తర్వాతి మ్యాచ్ గెలవడం అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది. ఆ మ్యాచ్‌లో టాస్ కీలకపాత్ర పోషించగా, మా బౌలర్లు విఫలమయ్యారు. అయితే రెండో టెస్టులో మా బ్యాటింగ్ ఏమిటో చూపించాం. మా రిజర్వ్ ఆటగాళ్లు కూడా చాలా బాగా ఆడుతుండటం టీమ్‌కు మేలు చేసే అంశం. జట్టు సంధి దశలో ఉన్నప్పుడు జట్టు ప్రమాణాలు పడిపోవు. పంత్, సుందర్ భాగస్వామ్యం ఇదే చూపించింది. సిరీస్ గెలవడం సంతోషకరమే అయినా మేం ఇంకా మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. ఏ అంతర్జాతీయ జట్టయినా పటిష్టంగానే ఉంటుంది. స్వదేశంలో అయినా వారిని ఓడించేందుకు శ్రమించాల్సిందే. మున్ముందు కూడా కొన్ని ఆటుపోట్లు తప్పకపోవచ్చు. కానీ వాటినీ సమర్థంగా ఎదుర్కొంటాం. గత ఆరేడేళ్లుగా టెస్టుల్లో అశ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రోహిత్ శర్మ చేసిన సెంచరీ ఈ సిరీస్‌లో గుర్తుంచుకోదగ్గ అంశం. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 150 అంటే 250 పరుగులు చేసినంత విలువ. న్యూజిలాండ్‌లో మేం ఆడిన సమయంలో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అనేది అసాధ్యంగా కనిపించింది. ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చింది. –కోహ్లి, భారత కెప్టెన్ ► అశ్విన్ నెగ్గిన ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ల సంఖ్య. హ్యాడ్లీ, ఇమ్రాన్ ఖాన్, వార్న్ కూడా 8 సాధించగా... మురళీధరన్ (11), కలిస్ (9) మాత్రమే ముందున్నారు. ► అశ్విన్ తన కెరీర్లో తీసిన వికెట్ల సంఖ్య. ఈ మ్యాచ్‌తో కర్ట్లీ ఆంబ్రోస్ (405–వెస్టిండీస్)ను దాటిన అశ్విన్ అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల ఓవరాల్ జాబితాలో 15వ స్థానానికి చేరాడు. ► సొంతగడ్డపై భారత్‌కిది వరుసగా 13వ టెస్టు సిరీస్ విజయం. చివరిసారి స్వదేశంలో 2012లో ఇంగ్లండ్ చేతిలో 1–2తో సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత మరో సిరీస్‌ను చేజార్చుకోలేదు. గత మూడు టెస్టులు మాకు ఎంతో పరీక్ష పెట్టాయి. భారత్ అన్ని రంగాల్లో మాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ అనుభవంతో మేమందరం ఒక్కొక్కరుగా పాఠాలు నేర్చుకొని మెరుగుపడాల్సి ఉంది. సిరీస్‌లో కొన్ని కీలక క్షణాలను భారత్ తమకు అనుకూలంగా మార్చుకోగలిగింది. అది మాకు సాధ్యం కాలేదు. ఓటమికి పంత్ ఇన్నింగ్స్ ఒక కారణం కావచ్చు కానీ... మేం ఏ దశలోనూ కనీస పరుగులు కూడా చేయలేకపోయాం. ఆటగాళ్లు కుప్పకూలిపోయే వరకు ఆగలేం కాబట్టి రొటేషన్ పాలసీ తప్పదు. ఐదు వికెట్ల ప్రదర్శనకంటే ఒక బ్యాట్స్‌మన్‌గా నేను చేసిన డబుల్ సెంచరీనే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది. –రూట్, ఇంగ్లండ్ కెప్టెన్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అశ్విన్ -
అశ్విన్ ఆల్‌రౌండర్ ర్యాంకు పైపైకి
దుబాయ్: భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకుల్లో ఐదో స్థానానికి ఎగబాకాడు. 336 పాయింట్లతో ర్యాంకింగ్‌లో పైపైకి చేరుకున్నాడు. రెండో టెస్టులో బంతితో ప్రత్యర్థిని తిప్పేసిన అశ్విన్ బ్యాటింగ్‌లోనూ సెంచరీ సాధించడంతో ర్యాంకు మెరుగైంది. అయితే అశ్విన్ బౌలర్ల జాబితాలో మాత్రం నిలకడగా ఏడో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. బుమ్రా 8వ స్థానంలో ఉన్నాడు. ఈ విభాగంలో కమిన్స్ (ఆసీస్)ది అగ్రస్థానం. ఇదిలా ఉండగా.. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ కోహ్లి ఐదో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 14వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. రిషభ్ పంత్ కెరీర్లోనే అత్యుత్తమ స్థాయికి చేరుకుని, 11వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 50 వ స్థానంలో ఉండగా, రెండో మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ 68వ స్థానానికి చేరుకున్నాడు. చదవండి: అశ్విన్ సెంచరీ.. హై క్లాస్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ R Ashwin is the new No.5 all-rounder in the latest @MRFWorldwide ICC Test Player Rankings 💪 Full list: https://t.co/OMjjVx5Mgf pic.twitter.com/HWEyIRqovo — ICC (@ICC) February 17, 2021 -
నంబర్ వన్‌గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్ వీడియో!
మెల్బోర్న్: భారత మహిళా క్రికెటర్, యువ సంచలనం షఫాలీ వర్మ కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. మహిళల టీ20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో పదహారేళ్ల షఫాలీ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రెండేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు. కాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ ఏలో టాపర్‌గా నిలిచిన భారత్... గ్రూప్ బీలో రెండో స్థానంలో ఉన్న మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీకొట్టనుంది. (జుట్టు కత్తిరించాల్సి వచ్చింది: క్రికెటర్ తండ్రి) ఇక ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం నుంచి అదరగొడుతున్న షఫాలీ... గురువారం ఇంగ్లండ్‌తో జరుగునున్న సెమీస్ మ్యాచ్‌కు ముందే నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు చేసిన.. ఈ యంగ్ బ్యాటర్ భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తర్వాత టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్కు చేరిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచారు. కాగా తాజా టీ20 వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచుల్లో 11 బౌండరీలు, 8 సిక్స్‌లతో మొత్తంగా 114 పరుగులు చేసి172.7 స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన షఫాలీ.. ఒక టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షఫాలీ ప్రత్యేక ఇంటర్వ్యూతో కూడిన వీడియోను షేర్ చేసింది. ‘‘ క్రికెట్ ఆడేందుకు చిన్నతనంలో అబ్బాయిగా నటించిన షఫాలీ వర్మ.. ఇప్పుడు పదహారేళ్ల వయస్సులో టీ20ల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగింది! తన స్ఫూర్తివంతమైన ప్రయాణం గురించి ప్రత్యేక ఇంటర్వ్యూ’’ అని ట్వీటర్లో పేర్కొంది. (సచిన్ స్ఫూర్తితో బ్యాట్ పట్టి... ఆయన రికార్డునే సవరించిన చిచ్చర పిడుగు) ఇక మహిళా టీ20 ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లేస్టోన్ టాప్‌లో నిలిచారు. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన సోఫీ.. మొత్తంగా 8 వికెట్లు తీశారు. కాగా భారత మహిళా బౌలర్లు దీప్తీ శర్మ, రాధా యాదవ్ ర్యాంకులు కోల్పోయి.. వరుసగా ఐదు, ఏడో స్థానాల్లో నిలిచారు. ఇక టోర్నమెంట్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరొందిన భారత లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ నాలుగు స్థానాలు ఎగబాకి.. ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. As a young girl, Shafali Verma pretended to be a boy just so she could play cricket. Now, the 16-year-old has risen to be the No.1 T20I batter in the world! She sat down with us for an exclusive chat about her inspiring journey 📽️ pic.twitter.com/40I8E60u4F — ICC (@ICC) March 4, 2020 -
కేఎల్ రాహుల్ 2.. విరాట్ కోహ్లి 10
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో విశేషంగా రాణించిన రాహుల్ 823 రేటింగ్ పాయింట్లతో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. న్యూజిలాండ్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ 56 యావరేజ్‌తో 224 పరుగులు చేశాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 9వ స్థానం నుంచి పదో స్థానానికి పడిపోయాడు. ఆ సిరీస్‌లో 105 పరుగులకే పరిమితమైన కోహ్లి.. 10వ స్థానానికి పరిమితమయ్యాడు. టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో వీరిద్దరే టాప్-10లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు. ఇక్కడ పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ 879 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్ 9వ స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో ఆఫ్గానిస్తాన్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు వరుసగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నాల్గో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో పాకిస్తాన్ తొలి స్థానంలో ఉండగా, ఆసీస్ రెండో స్థానంలో ఉంది. -
ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల క్రికెట్ వన్డే ర్యాంకుల్లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. సోమవారం ప్రకటించిన ర్యాంకుల జాబితాలో బ్యాటింగ్ విభాగంలో కోహ్లి, రోహిత్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలవగా, బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన టీమిండియా సారథి కోహ్లి 886 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 868 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ మూడో స్థానం దక్కించుకున్నాడు. శిఖర్ ధావన్ ఏడు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకోగా.. కేఎల్ రాహుల్ 21 స్థానాలు మెరుగుపర్చుకుని 50వ ర్యాంకు దక్కించుకున్నాడు. బౌలర్ల జాబితాలో నెం.1 ర్యాంక్‌ను బుమ్రా మరింత పటిష్టం చేసుకున్నాడు. ప్రస్తుతం 764 పాయింట్లతో బుమ్రా.. రెండోస్థానంలో ఉన్న ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) కంటే ఎంతో ముందంజలో నిలిచాడు. ముజీబుర్ రహ్మాన్ (అఫ్గానిస్థాన్), రబడ (సౌతాఫ్రికా), ప్యాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) టాప్–5లో నిలిచారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండు స్థానాలు ఎగబాకి 27వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగు ర్యాంకులు మెరుగుపర్చుకుని పదో స్థానం దక్కించుకున్నాడు. -
‘టాప్’తో ముగించిన కోహ్లి
దుబాయ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఈ ఏడాదిని టెస్టుల్లో ‘టాప్’ ర్యాంక్‌తో ముగించాడు. సోమవారం విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి 928 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్–822 పాయింట్లు) మూడో స్థానంలో... ఆస్ట్రేలియా తాజా సంచలనం లబ్‌షేన్ నాలుగో స్థానంలో నిలిచారు. చతేశ్వర్ పుజారా 791 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
ఇవేమి ర్యాంకింగ్స్.. అర్థం కావడం లేదు.
ఏ విషయంపై అయినా ఎలాంటి జంకు లేకుండా తన అభిప్రాయాలను నిక్కశ్చిగా వెల్లబుచ్చడంలో ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ముందు వరుసలో ఉంటాడు. దీంతో ఒక్కోసారి హీరో అయితే మరి కొన్ని సందర్బాల్లో జీరో లేక విలన్‌గా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు ఆటగాళ్లు, వారి ప్రదర్శన, మైదానాలు, క్రికెట్ నిబంధనలపై మాత్రమే విమర్శించే వాన్ తాజాగా ఐసీసీపై మండిపడ్డాడు. అదికూడా ఐసీసీ ర్యాంకింగ్స్ తీరును తీవ్రంగా తప్పుపట్టాడు. ప్రస్తుతం ఈ ఇంగ్లీష్ మాజీ సారథి చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వాన్ వ్యాఖ్యల్లో ద్వంద్వ అర్థాలు ప్రతిబింబిస్తున్నాయిన టీమిండియా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇంతకి అతడే ఏమన్నాడంటే.. ‘గత రెండేళ్లుగా టెస్టుల్లో న్యూజిలాండ్ అసాధారణంగా రాణిస్తూ వరుస సిరీస్ విజయాలను నమోదచేస్తోంది. కానీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. అధేవిధంగా ఇంగ్లండ్ గత కొంత కాలంగా టెస్టుల్లో తడబడుతోంది. యాషెస్ సిరీస్‌లో మినహా ఏ టెస్టు సిరీస్‌లోనూ గొప్ప ప్రదర్శన చేయలేదు. అయినా ఇంగ్లండ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం (ప్రస్తుతం నాలుగు)లో ఉంది. ఇక ఆస్ట్రేలియా భారత్‌తో జరిగిని సిరీస్ మినహా అన్ని టెస్టు సిరీస్‌ల్లోనూ చాంపియన్ ఆటను ప్రదర్శించింది. అయినా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ తర్వాతే ఆసీస్ ఉంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నిజాయితీ లోపించిందనే భావన నాకు ఉంది. అంతేకాకుండా నా దృష్టిల్లో ఐసీసీ ర్యాంకింగ్స్ అత్త చెత్త మరొకటి లేదు. అయితే టీమిండియా ఆగ్రస్థానంలో ఉండటంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే గంత కొంతకాలంగా టెస్టుల్లో అసలు సిసలు మజాను అందిస్తుంది టీమిండియానే. నా దృష్టిల్లో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ప్రస్తుతం టెస్టుల్లో మేటి జట్లుగా ఉన్నాయి. వార్నర్,స్మిత్, లబుషేన్‌లతో ఆసీస్ బ్యాటింగ్ దుర్బేద్యంగా మారింది. ఇక బౌలింగ్‌లో ప్రతీసిరీస్లోనూ పూర్థిస్థాయి ప్రదర్శన కనబరుస్తుంది. ఇక టీమిండియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస విజయాలతో జోరు మీదుంది. ప్రస్తుతం నా ఆసక్తి అంతా ఆసీస్-టీమిండియాల మధ్య జరగబోయే టెస్టు సిరీస్‌పైనే ఉంది. ఎందుకంటే గతంలో వార్నర్, స్మిత్, లబుషేన్‌లు లేని ఆసీస్‌పై భారత్ గెలిచింది. ఇప్పుడు వారి రాకతో ఆ జట్టు మరింత బలంగా మారింది. దీంతో ఆ సిరీస్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో అనేది వేచి చూడాలి’అని వాన్ పేర్కొన్నాడు. -
అవి చెత్త ర్యాంకులు: మాజీ కెప్టెన్
లండన్ : ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాకింగ్స్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు రెండు, నాలుగు స్థానాలు పొందడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తప్పుబట్టాడు. 'నేను నిజాయితీగా ఐసీసీ ర్యాంకులను తప్పుబడుతున్నా. నా దృష్టిలో అవొక చెత్త ర్యాంకింగ్స్ అనుకుంటున్నా' అంటూ వాన్ విమర్శించాడు. 'ప్రసుత్తం రెండో స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ గత రెండేళ్లలో ఎన్ని సిరీస్‌లు గెలిచిందో నాకు ఐడియా లేదు. కానీ ఈ ఏడాది వారి ప్రదర్శన చూసుకుంటే మాత్రం 2వస్థానం వారికి కరెక్టు కాదని నా అభిప్రాయం. ఇక 4 స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ప్రదర్శన ఏడాదిగా కాస్త మెరుగుపడింది. గత మూడు, నాలుగేళ్లుగా ఇంగ్లండ్ జట్టు టెస్టు క్రికెట్లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నించింది. విదేశాల్లో మా జట్టు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఈ ఏడాది ప్రదర్శన చేసుకుంటే అందులో స్వదేశంలో ఐర్లాండ్ జట్టుపై మాత్రమే సిరీస్ గెలుచుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్‌ను డ్రాతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకులు కాస్త గందరగోళంగా ఉన్నాయంటూ' వాన్ చెప్పుకొచ్చాడు. అయితే వాన్ ఆస్ట్రేలియాను మాత్రం పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రసుత్తం 5వ స్థానంలో కొనసాగుతున్న ఆసీస్ ఆ స్థానంలో ఉండడం కరెక్టు కాదని వాన్ అభిప్రాయపడ్డాడు. 'నా దృష్టిలో ప్రసుత్త టెస్టు క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియాలు మాత్రమే ఉత్తమ జట్లని, సరిగ్గా 12 నెలల క్రితం ఆసీస్‌ను వారి సొంత గడ్డపై ఓడించిన ఘనత టీమిండియా సొంతం చేసుకుందని' వాన్ పేర్కొన్నాడు. అయితే అప్పటి సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లైన వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్‌ను జట్టులో లేకపోవడంతో ఆసీస్ టీమిండియాకు సిరీస్ అప్పగించిందని గుర్తుచేశాడు. వచ్చే ఏడాది చివరిలో భారత్ ఆసీస్‌లో అడుగుపెట్టేసరికి ఆసీస్ జట్టు అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉంటుందనే తాను కోరుకుంటున్నట్లు వాన్ పేర్కొన్నాడు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన బౌలింగ్, బ్యాటింగ్ వనరులు కలిగిన టీమిండియాను ప్రతిఘటించగల శక్తి ఒక్క ఆసీస్‌కు మాత్రమే ఉందంటూ వాన్ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. (చదవండి : బుమ్రాకు ఫిట్నెస్ టెస్ట్ అవసరం లేదు) -
కోహ్లికి ‘టాప్’ ర్యాంక్
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం క్రికెట్లోనే కాదు ఇదివరకే సామాజిక మాధ్యమాల్లోనూ ఫాలోవర్ల పరంగా దూసుకెళ్లాడు. ఇప్పుడు ‘ఫోర్బ్స్ ఇండియా’ సెలబ్రిటీల జాబితాలోనూ ‘టాప్’ లేపాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఈ ‘రన్ మెషిన్’ తాజాగా భారత టాప్–100 సెలబ్రిటీల్లోనూ నంబర్‌వన్‌గా నిలిచాడు. మొత్తం రూ. 252.72 కోట్ల ఆర్జనతో అతనికి మొదటి స్థానం దక్కింది. అయితే బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ రూ. 293.25 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఫోర్బ్స్ జాబితా ర్యాంకుల్ని కేవలం ఆదాయంతోనే గణించరు. ఆ లెక్కన చూస్తే అక్షయ్ ‘టాప్’లేపేవాడు. కానీ ఫోర్బ్స్ లెక్కకు ఇతర కోణాలు ప్రాతిపదిక అవుతాయి. ఆదాయంతో పాటు, పేరు ప్రఖ్యాతులు, ప్రసార మాధ్యమాల్లోని క్రేజ్, సామాజిక సైట్లలో అనుసరిస్తున్న వారి సంఖ్య (ఫాలోవర్స్)లాంటి అంశాలను బట్టి ర్యాంకింగ్‌ను కేటాయిస్తారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ అంశాలను లెక్కలోకి తీసుకున్న ఫోర్బ్స్ మేగజైన్ తాజా సంపన్న సెలబ్రిటీల జాబితాలో కోహ్లికి అగ్రతాంబూలమిచి్చంది. టాప్–100లో క్రీడాకారుల సంఖ్య పెరిగింది. 21 మంది క్రీడాకారులకు చోటు దక్కింది. క్రికెటర్లు కాకుండా బ్యాడ్మింటన్ స్టార్స్ సింధు, సైనా, సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్), మేరీకోమ్ (బాక్సింగ్), బజరంగ్ (రెజ్లింగ్), అనిర్బన్ (గోల్ఫ్), బోపన్న (టెన్నిస్) కూడా ఈ జాబితాలో ఉన్నారు. -
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ : టాప్ ర్యాంక్‌లోనే కోహ్లి
దుబాయ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో భారత సారథి 928 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ (911) కంటే 17 రేటింగ్ పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో స్మిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 43, 16 పరుగులే చేయడం కోహ్లి ర్యాంకును పదిలం చేసింది. భారత ఆటగాళ్లలో పుజారా (791), రహానే (759)లిద్దరూ వరుసగా నాలుగు, ఆరో స్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల జాబితాలో పేసర్ బుమ్రా ఐదు నుంచి ఆరో స్థానానికి దిగజారాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియన్ సీమర్ కమిన్స్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా రెండో ర్యాంకులో ఉన్నాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో బుమ్రా
దుబాయ్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అత్యద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా తొమ్మిది స్థానాలు పురోగతి సాధించి తొలిసారి టాప్–10లోకి దూసుకొచ్చాడు. 774 రేటింగ్ పాయింట్లతో బుమ్రా ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. ఇప్పటివరకు బుమ్రా అత్యుత్తమ ర్యాంక్ 15గా ఉండేది. 908 రేటింగ్ పాయింట్లతో కమిన్స్ (ఆస్ట్రేలియా), రబడ (దక్షిణాఫ్రికా–851 పాయింట్లు), అండర్సన్ (ఇంగ్లండ్–814 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్‌కే చెందిన రవీంద్ర జడేజా పదో స్థానంలో నిలిచాడు. కోహ్లి ‘టాప్’లోనే... టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 910 ర్యాంకింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్టుకు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 904 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) మూడో ర్యాంక్‌లో, చతేశ్వర్ పుజారా (భారత్) నాలుగో ర్యాంక్‌లో ఉన్నారు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన అజింక్య రహానే 10 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరాడు. అజేయ సెంచరీతో యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను గెలిపించిన బెన్ స్టోక్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను అందుకున్నాడు. -
కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే
దుబాయ్: సంవత్సరం పాటు ఆటకు దూరమైనా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ మళ్లీ దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మిత్ రెండో స్థానానికి (913 రేటింగ్ పాయింట్లు) చేరుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 378 పరుగులు చేసిన స్మిత్... కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వెనక్కి తోసి కోహ్లి తర్వాతి స్థానంలో నిలిచాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (922) ఈ జాబితాలో నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు. యాషెస్‌లో స్మిత్‌కు మరో మూడు టెస్టులు మిగిలి ఉండగా, కోహ్లి విండీస్‌తో రెండు టెస్టులు ఆడనున్నాడు. ఇద్దరి మధ్య పాయింట్ల తేడా 9 మాత్రమే కావడంతో అగ్రస్థానానికి ఇప్పుడు హోరాహోరీ పోటీ తప్పదు. కోహ్లితో పాటు టాప్–10లో భారత్ నుంచి పుజారా (4వ స్థానంలో) ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా (5వ ర్యాంక్), అశ్విన్ (10వ ర్యాంక్) టాప్–10లో ఉండగా... ప్యాట్ కమిన్స్ (914 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన కరుణరత్నే (8వ ర్యాంక్) నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్–10లోకి అడుగు పెట్టగా...వరుసగా విఫలమవుతున్న జో రూట్ 6 నుంచి 9వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జేసన్ హోల్డర్ నంబర్‌వన్‌గా నిలిచాడు. -
ప్రపంచ కప్ గెలవాలి!
గువాహటి: వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలవాలన్న తన కోరిక నెరవేరిందని, ఇక వరల్డ్ కప్ గెలవాలన్నదే తన ఆశ అని భారత స్టార్ బ్యాటర్, ఐసీసీ నంబర్‌వన్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. ‘క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడే వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తాం. నేనూ అదే చేశాను. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ కావాలనే స్వల్ప లక్ష్యాలు ఎలాగూ ఉన్నాయి. అది ఇప్పుడు నెరవేరింది. ఇక మరింతగా కష్టపడి దీనిని నిలబెట్టుకోవడం ముఖ్యం. ఒక బ్యాటర్‌గా నంబర్‌వన్ స్థానానికి చేరుకోవడం సంతోషకరం. అయితే అది చిన్నదే. అసలు లక్ష్యం మాత్రం వరల్డ్ కప్ సాధించడమే’ అని స్మృతి చెప్పింది. మరోవైపు ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ను గెలుచుకునే సత్తా తమ జట్టుకు ఉందని ఆమె పేర్కొంది. ‘కొత్తవారితో ప్రయోగాలు చేయడంకంటే సిరీస్ గెలుచుకోవడమే మాకు అన్నింటికంటే ముఖ్యం. ఒక వేళ సిరీస్ గెలిస్తే సహజంగానే కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది’ అని ఆమె చెప్పింది. 2020 ఫిబ్రవరిలో జరిగే టి20 ప్రపంచ కప్ కోసం కోచ్ రామన్‌తో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్మృతి వెల్లడించింది. వైస్ కెప్టెన్‌గా చేసినందుకు తాజాగా కెప్టెన్సీ బాధ్యత కొత్తగా అనిపించడం లేదని తెలిపింది. -
మంధాన అదరహో
దుబాయ్ : భారత మహిళా క్రికెట్ అనగానే మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే కాదు.. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధానా కూడా అని అనుకొనే రోజులు వచ్చాయి. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై విశ్వరూపం ప్రదర్శించి.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సైతం మంధానా పరుగుల జోరు కొనసాగించింది. ప్రస్తుతం కళ్లు చెదిరే బ్యాటింగ్ తో ప్రత్యర్థిజట్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది ఈ మరాఠా మెరుపుతీగ. తన బ్యాటింగ్ మెరుపులతో తాజాగా ఐసీసీ ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన ఆగ్రస్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా బ్యాటర్ ఎలైసే పెర్రీ, మెగ్ లానింగ్‌లు తరువాతి స్థానాల్లో ఉన్నారు ఇక ఈ జాబితాలో సీనియర్ బ్యాటర్, వన్డే సారథి మిథాలీ రాజ్ ఐదో స్థానాన్ని కాపాడుకోగా.. దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లు టాప్ 20లో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ జాబితాలో జులాన్ గోస్వామి మూడో స్థానంలో కొనసాగుతుండగా.. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్‌లు వరుసగా ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో పాకిస్తాన్ బౌలర్ సనా మిర్ ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలిచిన మిథాలీ సేన టీమ్ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. టీమ్ జాబితాలో ఆసీస్ ఆగ్ర స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. -
కుల్దీప్ కెరీర్ బెస్ట్ ర్యాంక్
దుబాయ్: టీమిండియా ఎడమచేతి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో భాగంగా బౌలర్ల విభాగంలో కుల్దీప్ రెండో స్థానానికి ఎగబాకాడు. కుల్దీప్ 728 రేటింగ్ పాయింట్లతో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఫలితంగా తన కెరీర్ బెస్ట్ ర్యాంకను సాధించాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో కేవలం చివరి మ్యాచ్ మాత్రమే ఆడిన కుల్దీప్ 26 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఫలితంగా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇక మరో భారత స్పిన్నర్ కృనాల్ పాండ్యా 39 స్థానాలు మెరుగుపరుచుని 58 స్థానంలో నిలిచాడు. ఇది కృనాల్ కెరీర్ బెస్ట్ ర్యాంకుగా నమోదైంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(793 రేటింగ్ పాయింట్లు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ మూడు స్థానాలు ఎగబాకి 7వ స్థానంలో నిలవగా, శిఖర్ ధావన్ 11వ స్థానంలో ఉన్నాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు రెండు పాయింట్లు కోల్పోయినప్పటికీ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. తొలి స్థానంలో పాకిస్తాన్ ఉంది. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్మృతికి అగ్రస్థానం
దుబాయ్ : క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధాన అగ్రస్థానం కైవసం చేసుకుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న మంధాన ఇప్పటికే వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2018, వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2018ను సొంతం చేసుకుని ఒక క్యాలెండర్ ఇయర్లో రెండు ఐసీసీ అవార్డులను దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డును నెలకొల్పారు. నిలకడగా రాణిస్తున్న మంధాన తాజాగా ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంకును అందుకుంది. -
ఐసిసి ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో కెప్టెన్ కోహ్లీ
-
కెరీర్ ఉత్తమ ర్యాంక్‌కు రోహిత్
దుబాయ్: ఆసియా కప్‌లో అదరగొట్టిన భారత ఓపెనర్లు తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూకుడు కనబరిచారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించి కప్ అందించిన రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగు పరుచుకొని తన కెరీర్లో అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరాడు. ఈ టోర్నీలో 342 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి కెరీర్లో తొలిసారి అత్యుత్తమంగా మూడో స్థానానికి వచ్చాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. -
సిరీస్ పోయినా.. ర్యాంక్ పదిలమే
దుబాయ్: ఇంగ్లడ్‌పై టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్నప్పటికీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. కానీ పది పాయింట్లు కోల్పోయి 115 పాయింట్లతో టాప్ ప్లేస్లోనే ఉంది. టెస్టు సిరీస్‌లో ఓడిన నాలుగు మ్యాచ్‌లు స్వల్ప తేడాతోనే ఓడిపోవడంతో కోహ్లి సేన ఆగ్రస్థానాన్ని కాపాడుకుంది. టీమిండియాపై టెస్టు సిరీస్ రూపంలో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్ 105 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. సిరీస్‌కు ముందు 97 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు అంచనాలకు మించి ఆడటంతో న్యూజిలాండ్ జట్టును వెనక్కి నెట్టింది. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 106 పాయింట్లతో రెండో స్ధానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా(106), న్యూజిలాండ్(102), శ్రీలంక(97), పాకిస్తాన్(88)జట్లు ఉన్నాయి. ఇక ఆటగాళ్ల ర్యాంకింగ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పరుగుల వరద పారించిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి 930 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(929), కివీస్ సారథి విలియమ్సన్(847), బ్రిటీష్ టెస్టు కెప్టెన్ జోయ్ రూట్(835)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర పుజారా ఆరో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక ఐదో టెస్టులో మెరుపు శతకంతో ఆకట్టుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ టాప్ 20లోకి ప్రవేశించాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అసాధారణ రీతిలో బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తొలి నాలుగు టెస్టులకు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన రవీంద్ర జడేజా ఒక ర్యాంక్ చేజార్చుకొని నాలుగో స్థానానికి పడిపోయాడు. మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. -
కెరీర్ బెస్ట్ మూడో ర్యాంకులో రాహుల్
దుబాయ్: భారత బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ మూడో ర్యాంకుకు ఎగబాకాడు. భారత జట్టు కూడా రెండో స్థానానికి చేరుకుంది. ఐర్లాండ్‌పై అర్ధసెంచరీ (70), ఇంగ్లండ్‌పై అజేయ సెంచరీ (101 నాటౌట్)తో చెలరేగిన ఈ భారత ఆటగాడు ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో ఏకంగా 9 స్థానాల్ని మెరుగుపర్చుకుని టాప్–3లో నిలిచాడు. ఈ రెండు సిరీస్‌లను గెలుచుకున్న భారత్ మూడో ర్యాంకు నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకింది. నిర్ణాయక మూడో టి20 మ్యాచ్‌లో వీరోచిత సెంచరీతో టీమిండియాకు సిరీస్‌ను అందించిన ఓపెనర్ రోహిత్ శర్మ 13 నుంచి 11వ స్థానానికి చేరుకోగా, ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ (891) పొట్టి ఫార్మాట్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. -
అగ్రస్థానాన్ని కోల్పోయిన టీమిండియా
దుబాయ్: టెస్టుల్లో అగ్రస్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్న టీమిండియాకు వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నిరేశే ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ర్యాంకులు ప్రకటించగా.. వన్డేల్లో కోహ్లి సేన నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయింది. ఇంగ్లండ్ 125 పాయింట్లతో టాప్ ర్యాంకు సొంతం చేసుకుంది. కాగా, టీ20ల్లో భారత్ రెండు పాయింట్లు సాధించినా.. మూడో స్థానంలోనే కొనసాగుతోంది. వన్డే ర్యాంకుల విషయంలో 2015-16, 2016-17 సీజన్లను లెక్కలోకి తీసుకుని ఐసీసీ తాజా ర్యాంకులను వెల్లడించింది. ఒక పాయింట్ కోల్పోయిన భారత్ 122 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 8 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2013 జనవరి తర్వాత ఇంగ్లండ్ టాప్ ర్యాంకు దక్కించుకుకోవడం ఇదే తొలిసారి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ 1. ఇంగ్లండ్ 125 పాయింట్లు 2. భారత్ 122 '' 3. దక్షిణాఫ్రికా 113 '' 4. న్యూజిలాండ్ 112 '' 5. ఆస్ట్రేలియా 104 '' పాకిస్తాన్(102), బంగ్లాదేశ్ (93), శ్రీలంక(77), వెస్టిండీస్ (69), అఫ్గానిస్తాన్ (63) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ పొట్టి ఫార్మాట్ ర్యాంకుల్లో మాత్రం అంతగా మార్పుల్లేవు. టాప్-5 జట్లు అదే ర్యాంకులో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ 130 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (126), భారత్ (123), న్యూజిలాండ్ (116), ఇంగ్లండ్ (115), దక్షిణాఫ్రికా(114) టాప్ 5 స్థానాలు మళ్లీ నిలబెట్టుకున్నాయి. టీమిండియా రెండు పాయింట్లు సాధించినా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. దిగ్గజాల రిటైర్మెంట్తో శ్రీలంక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఎంతగా అంటే.. పసికూన అఫ్గానిస్తాన్ జట్టు శ్రీలంను వెనక్కునెట్టి 8వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ (10) చివరి స్థానంలో నిలిచింది. -
కోహ్లి... మరో ఘనత
దుబాయ్: భారత కెప్టెన్, బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లి మరో ఘనతకెక్కాడు. ఐసీసీ ర్యాంకుల్లో 900 రేటింగ్ పాయింట్లను దాటేశాడు. ఏకకాలంలో టెస్టు, వన్డే ఫార్మాట్లలో 900 రేటింగ్ పాయింట్లు సాధించి ఈ ఘనత పొందిన రెండో బ్యాట్స్‌మన్‌గా, తొలి భారత ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో భారత సారథి 909 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలో... టెస్టు బ్యాట్స్‌మన్‌గా 912 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గతంలో డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) మాత్రమే రెండు ఫార్మాట్లలో ఏకకాలంలో 900 రేటింగ్ పాయింట్లు సంపాదించాడు. మొత్తమ్మీద ఇప్పటివరకు వన్డేల్లో కేవలం ఐదుగురు క్రికెటర్లే అరుదైన ఈ ‘రేటింగ్’ క్లబ్లో ఉన్నారు. బ్యాటింగ్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్ (887) కూడా అందుకోలేకపోయిన రేటింగ్స్‌ను కోహ్లి చేరుకోవడం విశేషం. మరోవైపు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి నంబర్‌వన్ బౌలర్ అయ్యాడు. తాజా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అతను రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్; 787 పాయింట్లు)తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. పిన్న వయసులో (19 ఏళ్ల 153 రోజులు) నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డు నెలకొల్పాడు. -
టీమిండియా సిరీస్ గెలిస్తేనే..
కేప్‌టౌన్:దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో వన్డేల్లో నంబర్ స్థానాన్ని భారత్ ఆక్రమించింది. తాజా గెలుపుతో 121 రేటింగ్ పాయింట్లతో టీమిండియా ప్రథమ స్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికా 115 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. అయితే నంబర్ వన్ ర్యాంకును కాపాడుకోవాలంటే సఫారీలతో సిరీస్‌ను కచ్చితంగా గెలవాల్సి ఉంది. వన్డే సిరీస్‌ను భారత్ జట్టు 4-2తో ముగించిన పక్షంలో టాప్ ర్యాంక్ పదిలంగా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా సఫారీలు సిరీస్ సాధిస్తే మాత్రం భారత జట్టు రెండో ర్యాంక్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు టెస్టుల్లో కూడా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. -
కోహ్లి@900
దుబాయ్: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన రోజే విరాట్ కోహ్లి మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గురువారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతను తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు సాధించాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ (916 పాయింట్లు–1979లో) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. తాజా పాయింట్లతో అతను వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 947 పాయింట్లతో స్మిత్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. గత వారం 880 పాయింట్లతో ఉన్న కోహ్లి సెంచూరియన్ టెస్టులో 153 పరుగులు సాధించడంతో అతని ఖాతాలో మరో 20 పాయింట్లు చేరాయి. ఇంగ్లండ్‌పై 1979 (ఓవల్)లో తన 50వ టెస్టులో 221 పరుగులు సాధించినప్పుడు గావస్కర్ 916 పాయింట్లకు చేరుకున్నాడు. గతంలో భారత ఆటగాళ్లు సచిన్ (898), ద్రవిడ్ (892) ఈ మార్క్‌కు చేరువగా వచ్చినా దానిని అందుకోలేకపోయారు. ఓవరాల్‌గా 900 రేటింగ్ పాయింట్ల మైలురాయిని అందుకున్న 31వ బ్యాట్స్‌మన్ కోహ్లి. డాన్ బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో ఆల్‌టైమ్ టాప్‌గా నిలిచాడు. బ్యాటింగ్ టాప్–10లో భారత్ తరపున పుజారా (ఆరో స్థానం), బౌలర్ల జాబితాలో జడేజా (3), అశ్విన్ (5) కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 2, అశ్విన్ మూడో స్థానంలో ఉన్నారు. -
భువీ పైకి.. కోహ్లీ కిందకు.. రోహిత్ ఎక్కడో!
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ తన కెరీర్లో ఉత్తమ ర్యాంకు చేరుకున్నాడు. తన టెస్టు కెరీర్ ర్యాంకింగ్‌లో 8 స్థానాలు ఎగబాకి 22స్థానానికి చేరుకున్నాడు. తొలిటెస్టులో భువనేశ్వర్ కుమార్ ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టులో దారుణంగా విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాట్‌మెన్ పుజారాల ర్యాంకులు పడిపోయాయి. టెస్టు బ్యాట్‌మెన్ ర్యాంకింగ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్, స్మిత్ 947 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తొలి టెస్టులో విఫలమైనందున 13 పాయింట్లు కోల్పోయిన కోహ్లీ రెండో స్థానం నుంచి మూడోస్థానానికి వచ్చేశాడు. ఇంగ్లండ్‌కు చెందిన జోయ్ రూట్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 26 రావడంతో కోహ్లీ స్థానానికి ఎగబాకాడు. మురళీ విజయ్ ఐదు స్థానాలు కోల్సోయి 30స్థానానికి దిగజారగా.. శిఖర్ ధావన్ 33, రోహిత్ శర్మ 44 స్థానంలో ఉన్నారు. జట్లు ర్యాంకింగ్ విషయానికి వస్తే 124 భారత్ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. తరువాత దక్షిణాఫ్రికా 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 104 పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతోంది. -
టాప్ లేపిన రబడ.. యథాస్థానాల్లో జడేజా, అశ్విన్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా యువ సంచలనం కగిసో రబడ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ మంగళవారం తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్లో ఒక్క స్థానాన్ని మెరుగు పరుచుని టాప్ ర్యాంకు సాధించాడు. దీంతో ఇంగ్లండ్ స్టార పేసర్ జేమీ అండర్సన్ రెండో ర్యాంకుకు పడిపోయాడు. టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 3/34, 2/41 తో రాణించిన సఫారీ పేసర్ రబడ జట్టు విజయంలో తోడ్పడటంతో పాటు 5 పాయింట్లు మెరుగు పరుచుకుని 888 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి టెస్టులో 1/56 తో ఏమాత్రం ఆకట్టుకోని అండర్సన్ ఐదు పాయింట్లు కోల్పోయి 887 పాయింట్లకు పడిపోయాడు. దీంతో అగ్రస్థానాన్ని రబడకు కోల్పోయాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజల్‌వుడ్ ఐదో ర్యాంకులో ఉన్నాడు. యథాస్థానాల్లో జడేజా, అశ్విన్ ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు తమ ర్యాంకులను నిలుపుకున్నారు. 861 పాయింట్లతో జడేజా, 830 పాయింట్లతో అశ్విన్‌లు వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్ 1. కగిసో రబడ 888 పాయింట్లు 2. జేమీ అండర్సన్ 887 3. రవీంద్ర జడేజా 861 4. రవిచంద్రన్ అశ్విన్ 830 5. జోష్ హజల్‌వుడ్ 814 6. ఫిలాండర్ 806 7. రంగన హెరాత్ 799 8. నీల్ వాగ్నర్ 784 9. మిచెల్ స్టార్క్ 769 9. నాథన్ లయన్ 769 -
టాప్-2కు వచ్చేశాడు..
దుబాయ్:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో విశేషంగా రాణించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ర్యాంక్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. లంకేయులతో సిరీస్‌లో 610 పరుగులు సాధించిన కోహ్లి.. తాజాగా విడుదల చేసిన బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-2కు చేరాడు. ఈ సిరీస్‌కు ముందు ఆరో స్థానంలో ఉన్న కోహ్లి ఒకేసారి నాలుగు పాయింట్లను మెరుగుపరుచుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టుల్లో డబుల్ సెంచరీలతో మెరిసిన కోహ్లి 893 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అటు వన్డేల్లో, ఇటు టీ 20ల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న కోహ్లి.. టెస్టుల్లో నంబర్ వన్‌గా నిలవడానికి అడుగుదూరంలో ఉన్నాడు. ప్రస్తుతం టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 938 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక్కడ జో రూట్ 879 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, చతేశ్వర పుజారా 873 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచాడు. -
రెండో ర్యాంక్‌లో జడేజా, పుజారా
దుబాయ్: భారత బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. మంగళవారం విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో అతను రెండు స్థానాల్ని మెరుగుపర్చుకున్నాడు. స్మిత్ (941 పాయింట్లు) టాప్ ర్యాంకులో ఉండగా... పుజారా 888 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన కెప్టెన్ కోహ్లి మాత్రం నిలకడగా ఐదో ర్యాంకులోనే ఉన్నాడు. టాప్–10లో మరో భారత ఆటగాడు రాహుల్ తొమ్మిదో స్థానంలో ఉండగా... రహానే 15వ, ధావన్ 29వ ర్యాంకులకు పడిపోయారు. టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో జడేజా తిరిగి రెండో స్థానానికి చేరుకోగా... అశ్విన్ నాలుగో ర్యాంకులో నిలిచాడు. భువీ, ఇషాంత్‌లు ఒక్కో స్థానాన్ని మెరుగుపర్చుకొని వరుసగా 28, 30వ ర్యాంకుల్లో ఉన్నారు. స్మిత్ పాయింట్ల జోరు యాషెస్ టెస్టులో సెంచరీ చేసిన స్మిత్ (941) ఐదు రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకొన్నాడు. టెస్టు ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక పాయింట్లకు చేరిన ఐదో బ్యాట్స్‌మన్‌గా పీటర్ మే (941; ఇంగ్లండ్)తో సమంగా నిలిచాడు. ఇందులో బ్రాడ్‌మన్ (961; ఆసీస్)దే అగ్రస్థానం కాగా, హటన్ (945; ఇంగ్లండ్), హబ్స్ (942; ఇంగ్లండ్), పాంటింగ్ (942; ఆసీస్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
కెరీర్ అత్యధిక పాయింట్లతో..
దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు చతేశ్వర్ పుజారా రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. శ్రీలంకతో నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టెస్టులో 143 పరుగులతో రాణించిన పుజారా 22 పాయింట్లను తన ఖాతాలో వేసుకుని రెండో స్థానాన్ని సాధించాడు. తాజాగా విడుదల చేసిన బ్యాట్స్‌మెన ర్యాంకింగ్స్‌లో 888 రేటింగ్ పాయింట్లను పుజారా సాధించాడు. ఫలితంగా కెరీర్ అత్యధిక పాయింట్లను పుజారా నమోదు చేశాడు. ఇక్కడ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే 11 అత్యధిక పాయింట్లను పుజారా కల్గి ఉండటం విశేషం. అయితే అంతకుముందు పుజారా నంబర్ టూ ర్యాంకును రెండుసార్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకతో కొలంబోలో టెస్టు తరువాత రెండో ర్యాంకును సాధించిన పుజారా.. అంతకుముందు మార్చిలో ఆసీస్‌తో రాంచీలో జరిగిన టెస్టు మ్యాచ్ తరువాత కూడా రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, ప్రస్తుతం కోహ్లి 877 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. లంకేయులతో మ్యాచ్ తరువాత కోహ్లి 60 పాయింట్లను సాధించి టాప్-5లో నిలిచాడు. ఇక్కడ 941 రేటింగ్ పాయింట్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నంబర్ వన్ ర్యాంకును నిలుపుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో శతకంతో మెరిసిన స్మిత్ ఐదు పాయింట్లను సాధించాడు.మరొకవైపు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండో స్థానానికి ఎగబాకాడు. లంకతో రెండో టెస్టులో ఐదు వికెట్లు సాధించిన జడేజా రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. -
వార్నర్ ను వెనక్కునెట్టిన కోహ్లి!
దుబాయ్: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. శ్రీలంకతో తొలి టెస్టు అనంతరం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లి తన స్థానాన్ని మెరుగుపరుచుకుని టాప్-5కు చేరాడు. లంకేయులతో ఈడెన్ గార్డెన్ లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో కోహ్లి శతకం సాధించాడు. ఫలితంగా 807 రేటింగ్ పాయింట్లతో కోహ్లి ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలోనే ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను వెనక్కునెట్టాడు. ప్రస్తుతం కోహ్లి ఐదో స్థానంలో నిలవగా, వార్నర్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 936 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్(889 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానంలో, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(880) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు చతేశ్వర్ పుజారా(866 రేటింగ్ పాయింట్లు) నాల్గో స్థానాన్నినిలబెట్టుకోగా, కేఎల్ రాహుల్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా ఒక స్థానం దిగజారి మూడో స్థానంలో నిలవగా, అశ్విన్ నాల్గో స్థానాన్ని కాపాడుకున్నాడు. -
వచ్చి రాగానే ర్యాంక్ లాగేసుకున్నాడు
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ఈ మేరకు ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సఫారీలు ప్రథమ స్థానానికి చేరగా, టీమిండియా రెండో ర్యాంకు పరిమితమైంది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ను ఇంకా వన్డే మిగిలి ఉండగానే చేజిక్కించుకున్న సఫారీలు అగ్రస్థానాన్ని సైతం కైవసం చేసుకున్నారు. ఆస్ర్టేలియాపై 4-1తో సిరీస్ విజయం సాధించిన కోహ్లీసేన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వరుస విజయాలు సాధిస్తున్న సఫారీ జట్టు తిరిగి తొలి స్థానాన్ని చేజిక్కించుకుంది. ఇరు జట్లు 120 పాయింట్లతో ఉన్నప్పటికే దశాంశాలు తేడాతో సౌతాఫ్రికా తొలిస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా తిరిగి అగ్రస్థానాన్ని అందుకోవాలంటే ఈ నెల 22 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో తమ ఫామ్‌ను కొనసాగించాల్సిందే. ఇక బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్ విషయానికి వస్తే.. వచ్చిరాగానే అద్భుతమైన సెంచరీతో చెలరేగిన ఏబీ డెవిలియర్స్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు.కెప్టెన్‌తో పాటు ఓపెనర్ రోహిత్‌శర్మ మాత్రమే టాప్ టెన్‌లో ఉన్నాడు. గతంలో కంటే రెండు స్థానాలు కోల్పోయిన రోహిత్ శర్మ ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో.. టీమిండియా నుంచి టాప్ టెన్‌లో ఇద్దరు బౌలర్లకు చోటు దక్కింది. డెత్ ఓవర్స్ స్పెషలీస్ట్ జస్పీత్ బూమ్రాకు ఆరోస్థానం దక్కగా.. స్పిన్నర్ అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఈ విభాగంలో తొలి స్థానాన్ని పాకిస్తాన్‌కు చెందిన హసన్అలీ చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటికే 9 వికెట్లు తీసి మాంచి ఊపు మీద ఉన్న హసన్ అలీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి.. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు ఐదుగురు బౌలర్లు మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. -
టాప్–5లో రోహిత్ శర్మ... కోహ్లి టాప్ ర్యాంక్ పదిలం
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న సిరీస్‌లో అదరగొడుతోన్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ మెరుగైన స్థానానికి చేరాడు. సోమవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి 790 పాయింట్లతో ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. అతను 2016 ఫిబ్రవరిలో అత్యుత్తమంగా మూడో ర్యాంకులో నిలిచాడు. మరోవైపు భారత కెప్టెన్ కోహ్లి అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 865 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ 12 పాయింట్ల తేడాతో తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. రహానే నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 24వ స్థానానికి చేరుకున్నాడు. భారత బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కెరీర్లోనే ఉత్తమ ర్యాంకు 7కు చేరుకున్నాడు. -
కెప్టెన్ నెం.1.. వైస్ కెప్టెన్ నెం.5
సాక్షి, హైదరాబాద్: ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు సత్తా చాటారు. కోహ్లి తన నెం.1 ర్యాంకు నిలబెట్టుకోగా రోహిత్ నాలుగు స్థానాలు ఎగబాకి ఐదు ర్యాంకు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్ 59.20 సగటుతో 296 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలున్నాయి. భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లలో టాప్స్కోరు నిలవడం రోహిత్‌కు ఇది వరుసగా మూడో సారి. ఈ ప్రదర్శనతో రోహిత్ 794 పాయింట్ల సాధించి పాక్ ప్లేయర్ బాబర్ అజమ్(786) వెనక్కు నెట్టి ఐదో ర్యాంకు సాధించాడు. కెప్టెన్ కోహ్లి(877) పాయింట్లతో తన ర్యాంకు సుస్థిరం చేసుకోగా.. ఆసీస్ ఓపెనర్ డెవిడ్ వార్నర్(865), దక్షిణాఫ్రికా ప్లేయర్ డివిలియర్స్ (847) , ఇంగ్లండ్ జోరూట్(802) ముందు వరుసలో ఉన్నారు. ఇక బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి ఐదో స్థానంలో నిలవగా.. యువస్పిన్నర్ అక్సర్ పటేల్ మూడు స్థానాలు ఎగబాకి కెరీర్లో అత్యుత్తమ ఏడో ర్యాంకు సాధించాడు. ఆల్రౌండర్లలో టాప్-5 లో భారత ఆటగాళ్లలో ఎవరికి చోటుదక్కలేదు. ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో 7 వికెట్లతో విజయం సాధించి 4-1 సిరీస్‌తోపాటు వన్డేల్లో భారత్ నెం.1 ర్యాంకు పదిలం చేసుకున్న విషయం తెలిసిందే. -
కోహ్లీ నెం1.. ధోని నెం10..
-
కోహ్లీ నెం1.. ధోని నెం10..
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో ఘనవిజయంతో సిరీస్‌ను 5-0 తేడాతో సొంతం చేసుకున్న అనంతరం ఐసీసీ ర్యాంకుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకతో సిరీస్ క్లీన్‌స్వీప్ అనంతరం మూడు పాయింట్లు పెంచుకున్నా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. భారత్‌కు కూడా 117 పాయింట్లు ఉన్నా దశాంశాల్లో మెరుగ్గా ఉండటంతో ఆస్ట్రేలియా రెండోస్థానంలో ఉంది. రెండు పాయింట్లు కోల్పోయిన శ్రీలంక 86 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఇంక చివరి స్థానంలో ఐర్లాండ్ ఉంది. బ్యాట్మెన్ల విషయానికి వస్తే శ్రీలంక సిరీస్‌లో 330 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 887 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆష్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఎంఎస్ ధోని టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. 749 పాయింట్లతో పదోస్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌లో భారత యువ కెరటం జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 27స్థానాలు మెరగుపరుచుకొన్నాడు. 687 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హజల్ఉడ్ 732 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఇమ్రాన్ తాహిర్ రెండోస్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన స్టార్క్ మూడో స్థానంలో ఉన్నాడు. హార్ధిక్ పాండ్యా రెండు స్ధానాలు మెరుగు పరుచుకొని 61వ స్థానాకి చేరాడు. ఇంక ఆల్ రౌండర్ల జాబితాలో భారత్‌కు చెందిన ఏ ఒక్క ఆటగాడు స్థానం దక్కించకోలేదు. -
సచిన్ సరసన కోహ్లి
దుబాయ్: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో విశేషంగా రాణించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్ లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన రెండో భారత క్రికెటర్ గా నిలిచారు. తద్వారా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డును సమం చేశారు. శ్రీలంకతో వన్డే సిరీస్ తరువాత కోహ్లి 887 రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకున్నారు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 887 రేటింగ్ పాయింట్లను సాధించిన ఏకైక భారత క్రికెటర్. 1998 లో సచిన్ ఈ ఫీట్ ను సాధించారు. లంకేయులతో వన్డే సిరీస్ తరువాత కోహ్లి 14 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సిరీస్ కు ముందే వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లి.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కంటే 26 పాయింట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వార్నర్ 861పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. లంకేయులతో వన్డే సిరీస్ లో కోహ్లి రెండు వరుస సెంచరీలతో దుమ్మురేపారు. ఆ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రికీ పాంటింగ్ తో కలిసి రెండో స్థానంలో నిలిచారు. భారత బ్యాట్స్ మన్లలో రోహిత్ శర్మ తొమ్మిదో స్థానంలో ఉండగా, ఎంఎస్ ధోని పదో స్థానంలో ఉన్నారు. కాకపోతే మార్టిన్ గప్టిల్ తో కలిసి ధోని సంయుక్తంగా పదో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో బూమ్రా నాల్లో స్థానానికి ఎగబాకాడు. లంకతో సిరీస్ లో 15 వికెట్లతో రాణించిన బూమ్రా ఏకంగా 27 స్థానాలను ఏకబాకి నాల్గో స్థానంలో నిలవడం విశేషం. ఇక్కడ హజల్ వుడ్(ఆస్ట్రేలియా) తొలి స్థానంలో, ఇమ్రాన్ తాహీర్(సౌతాఫ్రికా) రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) ఉన్నాడు. -
జడేజా 'టాప్'లేపాడు..
దుబాయ్:గత కొంతకాలంగా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. మరో టాప్ ర్యాంకును సైతం కైవసం చేసుకున్నాడు. తాజా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ర్యాంకింగ్స్ లో భాగంగా ఆల్ రౌండర్ల విభాగంలో జడేజా టాప్ ప్లేస్ ను ఆక్రమించాడు. ఇక్కడ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ ను జడేజా వెనక్కునెట్టాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అజేయంగా 70 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు సాధించిన జడేజా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం 438 రేటింగ్ పాయింట్లతో జడేజా టాప్ ను సొంతం చేసుకున్నాడు. మరొక భారత ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 418 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్ రౌండర్ల విభాగంలో మొయిన్ అలీ(409 రేటింగ్ పాయింట్లు) నాల్గో స్థానంలో, బెన్ స్టోక్స్(360 రేటింగ్ పాయింట్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంచితే, టెస్టుల్లో భారత జట్టు తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కాగా, ఇంగ్లండ్ మూడో స్థానాన్ని ఆక్రమించగా, ఆసీస్ ర్యాంకు దిగజారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ను గెలిచిన ఇంగ్లండ్ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. కాగా, సిరీస్ ను కోల్పోయిన దక్షిణాఫ్రికా మాత్రం రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. -
టాప్10లో ఒకే ఒక్కడు..
లండన్: ఐసీసీ టాప్-10 ర్యాంకింగ్స్‌లో భారత్ తరపున స్థానాన్ని నిలబెట్టుకున్నఒకే ఒక్కడుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫికి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ మినహా ఏ ఒక్క భారత్ బ్యాట్స్‌మెన్ టాప్-10లో లేకపోవడం గమనార్హం. 874 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియన్ ఆటగాడు డెవిడ్ వార్నర్ (871) పాయింట్లతో రెండో స్దానంలో ఉన్నాడు. కోహ్లీ 852 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టాప్-20లో కొనసాగుతున్న భారత్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ 12వ స్థానం, మహేంద్ర సింగ్ధోని 13, శిఖర్ ధావన్ రెండు స్థానాలు దిగజారి 15వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఏ ఒక్క భారత్ ఆటగాడు టాప్-10లో లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసే అంశమే. సౌత్ ఆఫ్రికా బౌలర్ కాగిసో రబడా (724 పాయింట్లు)తో తొలిస్థానంలో ఉండగా, ఇమ్రాన్ తాహిర్(722), మిచెల్ స్టార్క్ (701)తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ బౌలర్లలో లెగ్‌స్పిన్నర్ అక్షర్‌పటేల్, న్యూజిలాండ్ బౌలర్ మ్యాథ్ హెన్రీతో 11వ స్థానాన్ని పంచుకున్నాడు. అమిత్ మిశ్రా 13వ, రవిచంద్రన్ అశ్విన్ 18వ స్థానాల్లో నిలిచారు. ఇక జట్ల పరంగా టాప్-5లో దక్షిణాఫ్రికా(122), ఆస్ట్రేలియా (118), భారత్ (117), న్యూజిలాండ్ (114), ఇంగ్లండ్(112)లు కొనసాగుతున్నాయి. అయితే బంగ్లదేశ్ తొలిసారి శ్రీలంక, పాకిస్థాన్, వెస్టీండిస్లను వెనక్కి నెట్టి ఆరో స్థానాన్ని నిలబెట్టుకుంది. -
జడేజా 'టాప్'లేపాడు
దుబాయ్:ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో విశేషంగా రాణించిన భారత్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్ లో తొలిసారి టాప్ స్థానంలో నిలిచాడు. ఇటీవల మరో భారత బౌలర్ రవి చంద్రన్ అశ్విన్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానం సాధించిన జడేజా.. తాజా బౌలర్ల ర్యాంకింగ్స్ లో సింగిల్ గా ప్రథమ స్థానంలో నిలిచాడు. రాంచీ టెస్టు అనంతరం అశ్విన్ కంటే 37 రేటింగ్ పాయింట్లను అధికంగా సంపాదించిన జడేజా తొలి స్థానాన్ని ఆక్రమించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న మూడో భారత బౌలర్ గా జడేజా గుర్తింపు పొందాడు. బిషన్ సింగ్ బేడీ, అశ్విన్ ల తరువాత భారత్ నుంచి అగ్రస్థానం దక్కించుకున్న మూడో బౌలర్ జడేజా. ప్రస్తుతం జడేజా 899 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో, అశ్విన్ 862 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో, జడేజా మూడో స్థానంలో ఉన్నారు. మరొకవైపు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్ లో భారత టాపార్డర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన పుజారా ఆరో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ సిరీస్ లో భారత నుంచి సెంచరీ సాధించిన ఆటగాడు పుజరా తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుని ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ను వెనక్కునెట్టాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్(941 రేటింగ్ పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా, పుజారా(861 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. మరొకవైపు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నాల్గో స్థానానికే పరిమితమయ్యాడు. గతవారం టెస్టు ర్యాంకింగ్స్ లో మూడో స్థానం నుంచి నాల్గో స్థానానికి పడిపోయిన కోహ్లి అదే స్థానంలో కొనసాగుతున్నాడు. -
అశ్విన్‌తో కలిసి అగ్రస్థానానికి
తొలిసారి టాప్‌ర్యాంకులో జడేజా దుబాయ్: భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా తన కెరీర్లో తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకుకు చేరుకున్నాడు. టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో సహచరుడు అశ్విన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచా డు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని నంబర్‌వన్ ర్యాంకుకు ఎగబాకాడు. 2008 ఏప్రిల్‌లో కూడా ఇద్దరు బౌలర్లు స్టెయిన్ (దక్షిణాఫ్రికా), మురళీధరన్ (శ్రీలంక) అగ్రస్థానాన్ని పంచుకున్నారు. ఇద్దరు స్పిన్నర్లు ఒకేసారి నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్ కోహ్లి ఒక స్థానాన్ని కోల్పోయి మూడో ర్యాంకుకు పడిపోయాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండో స్థానానికి చేరాడు. చతేశ్వర్ పుజారా ఐదు స్థానాల్ని మెరుగుపర్చుకొని ఆరో ర్యాంకుకు, రహానే రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 15వ ర్యాంకుకు ఎగబాకారు. ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ టాప్ ర్యాంకులో రికీ పాంటింగ్ రికార్డును అధిగమించాడు. పాంటింగ్ 76 మ్యాచ్‌ల పాటు అగ్రస్థానంలో ఉంటే స్మిత్ 77 మ్యాచ్‌ల పాటు టాప్ ర్యాంకులో నిలవడం విశేషం. ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హసన్... అశ్విన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరాడు. దీంతో అశ్విన్ రెండు, జడేజా మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు. -
మెరుగైన సాహా, రోహిత్, భువీ ర్యాంకులు
దుబాయ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా ఆడిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రోహిత్ శర్మ, పేసర్ భువనేశ్వర్‌ల ర్యాంకింగ్స్ మెరుగయ్యాయి. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్‌సలో సాహా 18 ర్యాంకులను మెరుగుపర్చుకుని 56వ స్థానానికి చేరాడు. ఇక రోహిత్ కూడా 14 స్థానాలను ఎగబాకి 38వ ర్యాంకులో ఉన్నాడు. పుజారా 15వ ర్యాంకులో ఉండగా.. మురళీ విజయ్ ఐదు స్థానాలు దిగజారి 21వ ర్యాంకుకు చేరాడు. స్టీవ్ స్మిత్ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ తొమ్మిది స్థానాలను మెరుగుపర్చుకుని 26వ ర్యాంకుకు చేరాడు. అశ్విన్ రెండు నుంచి మూడో ర్యాంకుకు చేరాడు. -
టీమిండియా ఎట్ సెకెండ్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు రెండో స్థానం సాధించింది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన వార్షిక సవరణ జాబితాలో భారత్ కు రెండో స్థానం దక్కగా, పాకిస్తాన్ మూడో స్థానంలో నిలిచింది. కాగా, దక్షిణాఫ్రికా మూడో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోగా, ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో 2012-13లో ఆయా జట్లు సాధించిన ఫలితాలను తొలగించగా, 2014-15 వార్షిక సంవత్సరంలో సాధించిన ఫలితాల ఆధారంగా టెస్టు ర్యాంకింగ్స్ ను ప్రకటించారు. దీంతో గతేడాది భారత్ సాధించిన విజయాలు జట్టు ర్యాంకింగ్స్ లో 50 శాతం ప్రభావం చూపాయి. టెస్టు రాంకింగ్స్ వివరాలు.. 1.ఆస్ట్రేలియా (118 రేటింగ్ పాయింట్లు) 2. భారత్(112 రేటింగ్ పాయింట్లు) 3. పాకిస్తాన్(111 రేటింగ్ పాయింట్లు) 4. ఇంగ్లండ్(105 రేటింగ్ పాయింట్లు) 5. న్యూజిలాండ్(98 రేటింగ్ పాయింట్లు) 6. దక్షిణాఫ్రికా(92 రేటింగ్ పాయింట్లు) 7.శ్రీలంక(88 రేటింగ్ పాయింట్లు) 8.వెస్టిండీస్( 65 రేటింగ్ పాయింట్లు) 9. బంగ్లాదేశ్(57 రేటింగ్ పాయింట్లు) 10. జింబాబ్వే(12 రేటింగ్ పాయింట్లు) -
అఫ్ఘాన్ మరో సంచలనం
జింబాబ్వేపై రెండోసారి సిరీస్ విజయం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశం షార్జా: అఫ్ఘానిస్తాన్ వన్డే జట్టు మరో సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి జింబాబ్వేపై సిరీస్ విజయం సాధించింది. ఫలితంగా తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లో స్థానం దక్కించుకుంది. బుధవారం జరిగిన చివరి వన్డేలో విజయం ద్వారా జింబాబ్వేతో సిరీస్‌ను అఫ్ఘాన్ జట్టు 3-2తో చేజిక్కించుకుంది. తొలుత జింబాబ్వే 49.5 ఓవర్లలో 248 పరుగులు చేసింది. మసకద్జ (111 బంతుల్లో 110; 9 ఫోర్లు; 4 సిక్సర్లు) సెంచరీ చేశాడు. హమ్జాకు మూడు వికెట్లు దక్కాయి. అఫ్ఘానిస్తాన్ 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు చేసి గెలిచింది. గుల్బదిన్ నబీ (68 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు; 6 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండు టి20ల సిరీస్ ప్రారంభమవుతుంది. -
టీమిండియా వన్డే ర్యాంకు పదిలం
దుబాయ్: ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా వన్డే ర్యాంకింగ్ లో మాత్రం ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. టీమిండియా 114 పాయింట్లతో తన రెండో స్థానాన్ని కాపాడుకోగా, దక్షిణాఫ్రికా 112 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 127 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం నుంచి నాలుగు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్న ఇంగ్లండ్, పాకిస్థాన్ లు వరుసగా ఆరు, ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ట్వంటీ 20ల్లో టీమిండియా ఆరో స్థానానికి పరిమితం కాగా, పాకిస్థాన్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచాయి. శ్రీలంక 126 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
ధావన్, రోహిత్ పైపైకి...
దుబాయ్: ప్రపంచకప్ లో రాణించిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్ లో పైకి ఎగబాకారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్ లో ధావన్ 6వ స్థానం దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), మిస్బా(పాకిస్థాన్)తో కలిసి సంయుక్తంగా 12వ ర్యాంక్ లో నిలిచాడు. విరాట్ కోహ్లి 4, కెప్టెన్ ధోని 8వ ర్యాంకుల్లో ఉన్నారు. సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డీవిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ తొలిసారిగా టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. భారత్ బౌలర్ ఉమేష్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్ దక్కించుకున్నాడు. వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా టీమ్ నంబన్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా సెకండ్ ర్యాంకులో కొనసాగుతోంది. -
అశ్విన్, షమీ ర్యాంక్‌లు మెరుగు
సిడ్నీ: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు అశ్విన్, మహ్మద్ షమీ స్థానాలు మెరుగుపడ్డారు. కాగా టీమిండియా కెప్టెన్ ధోనీ, యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ ర్యాంక్‌లు దిగజారాయి. తాజా జాబితాలో షమీ 14 స్థానాలు సంపాదించి 11 స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రపంచ కప్‌లో వీరిద్దరూ రాణించడంతో వీరి ర్యాంక్‌లు మెరుగయ్యాయి. బ్యాటింగ్ జాబితాలో కోహ్లీ ఓ స్థానం, ధోనీ రెండు స్థానాలు కోల్పోయి వరసగా 4, 10వ ర్యాంక్‌లకు దిగజారారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిల్లీర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సంగక్కర, ఆమ్లా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. -
విరాట్ కోహ్లి ర్యాంక్ 15
దుబాయ్: మెల్బోర్న్ టెస్టులో అద్భుతంగా రాణించిన భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లి... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో అతను 15వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. రహానే 15 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ ర్యాంక్‌లో నిలిచాడు. చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్‌లు వరుసగా 19, 20వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తొలిసారి 5వ స్థానంలో నిలిచి కెరీర్లో బెస్ట్ ర్యాంక్‌ను నమోదు చేశాడు. డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు చెరో 8 స్థానాలు మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు వరుసగా 36, 38వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో అశ్విన్ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. -
అశ్విన్‌కు నెంబర్‌వన్ ర్యాంక్
దుబాయ్: ఐసీసీ ర్యాంకింగ్స్ ఆలౌరౌండర్ల జాబితాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో అశ్విన్ (40, 46 నాటౌట్) బ్యాట్ రాణించడంతో ర్యాంక్ మెరుగుపడింది. తాజా జాబితాలో అశ్విన్ 372 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఫిలాండర్ (365)ను వెనక్కినెట్టి నెంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబల్, స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. -
వన్డేల్లో రెండో ర్యాంకులోనే కోహ్లి
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి వన్డేల్లో రెండో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి తన ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. భారత కెప్టెన్ ధోని, ఓపెనర్ శిఖర్ ధావన్‌లు వరుసగా ఆరు, పదో స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)ది అగ్రస్థానం. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఆరో ర్యాంకుకు ఎగబాకగా, అశ్విన్ 17వ ర్యాంకులోనే ఉన్నాడు. ఇందులో సయీద్ అజ్మల్ (పాకిస్థాన్) టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా ఐదో స్థానంలో ఉన్నాడు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 120 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతోంది. -
రెండో టి20లో లంక గెలుపు
దుబాయ్: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన శ్రీలంక... పాకిస్థాన్‌తో జరిగిన రెండో టి20లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్లకు 211 పరుగులు చేసింది. పెరీరా (59 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సంగక్కర (21 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దిల్షాన్ (33 బంతుల్లో 48; 8 ఫోర్లు), ప్రసన్న (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. ఓపెనర్‌గా వచ్చిన పెరీరా... దిల్షాన్‌తో కలిసి తొలి వికెట్‌కు 100, సంగక్కరతో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించాడు. అజ్మల్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 187 పరుగులు మాత్రమే చేసి ఓడింది. షార్జిల్ ఖాన్ (25 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. తన్వీర్ (26 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్సర్), ఆఫ్రిది (13 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఓ దశలో 83/3 స్కోరుతో ఉన్న పాక్ ఏడు బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 85/7తో నిలిచింది. చివర్లో తన్వీర్, అజ్మల్ (15 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్సర్) తొమ్మిదో వికెట్‌కు 63 పరుగులు జోడించినా ప్రయోజనం లేకపోయింది. టి20 క్రికెట్లో ఈ వికెట్‌కు ఇది రికార్డు భాగస్వామ్యం. సేననాయకే 3 వికెట్లు తీశాడు. పెరీరాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ఆఫ్రిదికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. భారత్ ర్యాంక్ 2 ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ (123) రెండో స్థానంలోనే కొనసాగుతోంది. శ్రీలంక (129) టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, దక్షిణాఫ్రికా (123) మూడో స్థానంలో, పాకిస్థాన్ (121) నాలుగో స్థానంలో ఉన్నాయి.