ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ సత్తాచాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జైశ్వాల్ రెండో స్ధానానికి చేరుకున్నాడు. యశస్వి జైశ్వాల్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం.
కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు జైశ్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్ధానంలో ఉన్నాడు. అయితే పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
297 బంతుల్లో 161 పరుగులు చేసిన జైశ్వాల్.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే యశస్వీ రెండు స్ధానాలు ఎగబాకి సెకెండ్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతడి ఖాతాలో 825 పాయింట్లు ఉన్నాయి.
మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 9 స్ధానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి కూడా ఆజేయ శతకంతో మెరిశాడు. ఇక టాప్ ర్యాంక్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(903) పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.
టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10 బ్యాటర్లు వీరే..
1.జో రూట్- 903 పాయింట్లు
2. యశస్వి జైస్వాల్ 825
3.కేన్ విలియమ్సన్ 804
4. హ్యారీ బ్రూక్ 778
5. డారిల్ మిచెల్ 743
6. రిషబ్ పంత్ 736
7. స్టీవెన్ స్మిత్ 726
8. సౌద్ షకీల్ 724
9. కమిందు మెండిస్ 716
10. ట్రావిస్ హెడ్ 713
Comments
Please login to add a commentAdd a comment