ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా.. అన్ని విభాగాల్లో టాప్‌లో మనమే..! | Team India Domination Continues In ICC Latest Rankings | Sakshi
Sakshi News home page

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా.. అన్ని విభాగాల్లో టాప్‌లో మనమే..!

Published Wed, Sep 20 2023 3:08 PM | Last Updated on Wed, Sep 20 2023 3:12 PM

Team India Domination Continues In ICC Latest Rankings - Sakshi

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా కొనసాగుతుంది. తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 51 రేటింగ్‌ పాయింట్లతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్‌ విభాగంలో యువ కెరటం శుభ్‌మన్‌ గిల్‌ టాప్‌ ర్యాంక్‌కు అతి చేరువయ్యాడు. ప్రస్తుతం టాప్‌ ప్లేస్‌లో ఉన్న బాబర్‌ ఆజమ్‌కు (857) గిల్‌కు (814) మధ్య తేడా కేవలం ​43 పాయింట్లు మాత్రమే. 

ఎల్లుండి నుంచి ఆసీస్‌తో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గిల్‌ ఒక్క కీలక ఇన్నింగ్స్‌ ఆడినా బాబర్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకుంటాడు. వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఇక్కడ కూడా టీమిండియా హవా కొనసాగుతుంది. ఆసియా కప్‌-2023 గెలిచి జోష్‌మీదున్న భారత్‌.. పాకిస్తాన్‌తో సరిసమానమైన రేటింగ్‌ పాయింట్లు (115) కలిగి రెండో స్థానంలో ఉంది. ఈనెల 22న ఆసీస్‌తో జరిగే తొలి వన్డేలో గెలిస్తే భారత్‌ అగ్రస్థానానికి ఎగబాకుతుంది. తద్వారా టెస్ట్‌, టీ20, వన్డే ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుంది. ఇప్పటికే భారత్‌ టెస్ట్‌, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 

పొట్టి ఫార్మాట్‌ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లో భారత్‌ నంబర్‌ వన్‌ జట్టుగా ఉండనే ఉంది. టీ20 నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా సూర్యకుమార్‌ తన హవాను కొనసాగిస్తుండగా.. టీ20 నంబర్‌ 2 ఆల్‌రౌండర్‌గా హార్ధిక్‌ సత్తా చాటాడు. 

టెస్ట్‌ ‌ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లో టీమ్‌ భారత్‌ గతకొంతకాలంగా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. టెస్ట్‌ల్లో చాలాకాలంగా నంబర్‌ వన్‌ జట్టుగా కొనసాగుతున్న భారత్‌.. వ్యక్తిగత ప్రదర్శనల్లోనూ సత్తా చాటుతూ అన్ని విభాగాల్లో  అగ్రస్థానాల్లో కొనసాగుతుంది. నంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా అశ్విన్‌, నంబర్‌ 3 బౌలర్‌గా జడేజా.. ఆల్‌రౌండర్ల విభాగంలో తొలి రెండు స్థానాల్లో జడేజా, అశ్విన్‌లు కొనసాగుతున్నారు. ఇలా టీమిండియా, టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దాదాపుగా అన్ని విభాగాల్లో టాప్‌ ప్లేస్‌ల్లో కొనసాగుతున్నారు. అతి త్వరలో భారత్‌ నంబర్‌ వన్‌ వన్డే జట్టుగా, గిల్‌ నంబర్‌ వన్‌ వన్డే బ్యాటర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement