నాలుగో స్థానానికి ఎగబాకిన సిరాజ్‌.. టాప్‌-10లో కుల్దీప్‌ | ICC ODI Rankings 2023: Mohammed Siraj Climbs To 4th, Kuldeep Yadav To 10th Spot - Sakshi
Sakshi News home page

ICC ODI Rankings: నాలుగో స్థానానికి ఎగబాకిన సిరాజ్‌.. టాప్‌-10లో కుల్దీప్‌

Published Wed, Aug 30 2023 2:47 PM | Last Updated on Wed, Aug 30 2023 3:30 PM

ICC ODI Rankings: Siraj Climbs To 4th, Kuldeep Yadav To 10th Spot - Sakshi

ఐసీసీ తాజాగా (ఆగస్ట్‌ 30) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఎలాంటి చెప్పుకోదగ్గ మార్పులు చోటు చేసుకోలేదు. బ్యాటింగ్‌లో బాబర్‌ ఆజమ్‌ (877), బౌలింగ్‌లో జోష్‌ హాజిల్‌వుడ్‌ (705), ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్‌ అల్‌ హసన్‌ (371) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. 

నాలుగులో గిల్‌.. తొమ్మిదిలో విరాట్‌
బ్యాటింగ్‌ విభాగం టాప్‌-10లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌ (నాలుగో స్థానం), విరాట్‌ కోహ్లి (తొమ్మిదో ప్లేస్‌) తమ స్థానాలను పదిలంగా కాపాడుకోగా.. డస్సెన్‌, ఇమామ్‌ ఉల్‌ హాక్‌, ఫకర్‌ జమాన్‌, హ్యారీ టెక్టార్‌, డేవిడ్‌ వార్నర్‌, డికాక్‌, స్టీవ్‌ స్మిత్‌ 2, 3, 5, 6, 7, 8, 10 స్థానాల్లో ఉన్నారు.

నాలుగో స్థానంలో సిరాజ్‌.. 10 స్థానానికి ఎగబాకిన కుల్దీప్‌
బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. మహ్మద్‌ సిరాజ్‌ ఓ స్థానం మెరుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్‌ యాదవ్‌ టాప్‌-10లోకి (10వ స్థానం) చేరాడు. మిచెల్‌ స్టార్క్‌, ముజీబ్‌, రషీద్‌, మ్యాట్‌ హెన్రీ, బౌల్ట్‌, ఆడమ్‌ జంపా, షాహీన్‌ అఫ్రిది 2, 3, 5, 6, 7, 8, 9 స్థానాల్లో నిలిచారు.

హార్ధిక్‌ ఒక్కడే..
ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్‌-20లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. షకీబ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నబీ, సికందర్‌ రజా, రషీద్‌ ఖాన్‌, అస్సద్‌ వలా, జీషన్‌ మక్సూద్‌, సాంట్నర్‌, హసరంగ, మెహిది హసన్‌, క్రిస్‌ వోక్స్‌ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. భారత్‌ నుంచి హార్దిక్‌ పాండ్యా ఒక్కడే టాప్‌-20లో (12) ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement