నాకంటూ ఓ ప్రణాళిక ఉంటుంది.. అది మర్చిపోతే ఎలా?!: కోహ్లి కౌంటర్‌ | Virat Kohli hits back at critics again year after Gavaskar row | Sakshi
Sakshi News home page

నాకంటూ ఓ ప్రణాళిక ఉంటుంది.. అది మర్చిపోతే ఎలా?!: కోహ్లి కౌంటర్‌

Published Mon, Apr 28 2025 5:35 PM | Last Updated on Mon, Apr 28 2025 6:34 PM

Virat Kohli hits back at critics again year after Gavaskar row

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 108.51 స్ట్రైక్ రేట్‌తో 51 ప‌రుగులు చేశాడు. 163 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో 26 ర‌న్స్‌కే 3 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ క‌ష్టాల్లో ప‌డింది.

ఈ స‌మ‌యంలో కోహ్లి ఆచితూచి ఆడుతూ కృనాల్ పాండ్యాతో క‌లిసి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. స్ట్రైక్ రేట్ త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ ఎంతో విలువైన‌ది. ఈ క్ర‌మంలో త‌న  స్ట్రైక్ రేట్‌పై విమ‌ర్శ‌ల చేస్తున్న‌వారికి కోహ్లి మ‌రోసారి కౌంట‌రిచ్చాడు.

టీ20 క్రికెట్‌లో దూకుడు ఒక్క‌టే ముఖ్యం కాదని, ప‌రిస్థితులకు త‌గ్గ‌ట్టు బ్యాటింగ్ చేయ‌డం అవ‌స‌ర‌మ‌ని కోహ్లి అన్నాడు. "టీ20, వ‌న్డే, టెస్టు.. ఫార్మాట్ ఏదైనా మ‌న‌కంటూ ఒక ప్ర‌ణాళిక ఉండాలి. స్కోర్ బోర్డులో ఎంత మొత్తం ఉంచాలి,?మ‌నం చేధించాల్సిన టార్గెట్ ఎంత‌?  పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి?  ఏ బౌల‌ర్‌ను ఎటాక్ చేయాలి? ఏ బౌల‌ర్‌ను ఎటాక్ చేయ‌కూడ‌దు? ఇవ‌న్నీ ఆలోచించి వ్యూహత్మ‌కంగా ముందుకు వెళ్లాలి. 

ముఖ్యంగా ఛేజింగ్‌లో ఎప్పుడూ  నాకంటూ ఓ ప్లానింగ్ ఉంటుంది. ఎక్కువ‌గా సింగిల్స్‌, డ‌బుల్స్‌పై దృష్టిపెడతాను. ఏదో విధంగా పరుగులు రాబట్టమే నా లక్ష్యం.  వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నిస్తాను. స్ట్రైక్స్ రొటేటింగ్, సింగిల్స్, డబుల్స్ తీయడమే నా గేమ్ ప్లాన్‌. 

అయితే టీ20 క్రికెట్‌లో భాగస్వామ్యం నెలకొల్పడం, గేమ్‌ను క్లోజ్‌గా తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో విమర్శకులు మర్చిపోతున్నారు అనుకుంటా. ఈ ఏడాది సీజన్‌లో ఏ బ్యాటర్ కూడా తొలి బంతి నుంచే బౌలర్‌ను ఎటాక్ చేయడం లేదు. పిచ్ పరిస్థితిని ఆర్ధం చేసుకోని, బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలంటే మనంటూ ప్రొఫిషనలిజం ఉండాలి. 

స్లో పిచ్‌లపై స్ట్రైక్ రోటేట్ చేయడం అంత తేలిక కాదు. దానికంటూ ప్రత్యేక స్కిల్స్ ఉండాలి. నేను పిచ్ కండీషన్స్‌, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడేందుకు ప్రయత్నిస్తాను. స్ట్రైక్ రోటేట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించేందుకు నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో విరాట్ పేర్కొన్నాడు.

కాగా గతేడాది సీజన్‌లో కోహ్లి స్ట్రైక్ రేట్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమ‌ర్శ‌లు చేశార‌. సింగిల్స్ తీస్తూ కోహ్లి చాలా నిదానమైన ఇన్నింగ్స్ ఆడాడని, ఆర్సీబీ ఇలాంటి ప్రదర్శను ఆశించట్లేదని గ‌వాస్క‌ర్ మండిప‌డ్డారు. అదేవిధంగా ఆర్సీబీ జట్టులో బిగ్ హిట్ట‌ర్లు ఉన్న‌ప్ప‌టికి కోహ్లి ఎట‌వంటి రిస్క్ తీసుకోకుండా స్లోగా ఆడాడ‌ని ఆయ‌న అన్నారు. 

ఆ త‌ర్వాత గ‌వాస్క‌ర్‌కు కోహ్లి కౌంట‌రిచ్చాడు. "చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్‌రేటు గురించి, స్పిన్‌లో సరిగా ఆడట్లేదని మాట్లాడుతున్నారు. జ‌ట్టుకు విజ‌యం అందించ‌డ‌మే నా ల‌క్ష్యం. మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్‌లో కూర్చొని మాట్లాడటం సరికాదు" అని కోహ్లి పేర్కొన్నాడు.

ఆ త‌ర్వాత గ‌వాస్క‌ర్ కూడా కోహ్లి వ్యాఖ్య‌ల‌కు బ‌దులిచ్చారు. కోహ్లి స్ట్రైక్ రేట్‌పైన మాత్ర‌మే కామెంటేట‌ర్‌లు మాట్లాడారు. అంతే త‌ప్ప ఆటగాళ్లను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయాల‌నే ఆలోచ‌న ఏ వ్యాఖ్య‌త‌కు లేదు. ఓపెనర్‌గా వచ్చి.. 14-15 ఓవర్ వరుకు క్రీజులో ఉండి, 118 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే పొగడ్తలు ఉండవు అని గ‌వాస్క‌ర్ రిప్లే ఇచ్చాడు. ఇప్పుడు మ‌రోసారి కోహ్లి వ్యాఖ్య‌లు చూస్తే గ‌వాస్క‌ర్‌కే కౌంటిరిచ్చిన‌ట్లు అన్పిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement