IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. | Virat Kohli becomes first Indian to 13000 T20 runs | Sakshi
Sakshi News home page

IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

Apr 7 2025 8:20 PM | Updated on Apr 7 2025 8:34 PM

Virat Kohli becomes first Indian to 13000 T20 runs

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 13,000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. ఐపీఎల్‌-2025లో వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

386 ఇన్నింగ్స్‌లలో కోహ్లి ఈ రేర్ ఫీట్‌ను నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఐదో క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి కంటే ముందు క్రిస్‌ గేల్‌ (455 ఇన్నింగ్స్‌ల్లో 14562 పరుగులు), అలెక్స్‌ హేల్స్‌ (490 ఇన్నింగ్స్‌ల్లో 13610), షోయబ్‌ మాలిక్‌ (514 ఇన్నింగ్స్‌ల్లో 13557), కీరన్‌ పోలార్డ్‌ (617 ఇన్నింగ్స్‌ల్లో 13537) ఉన్నారు. అయితే ఇన్నింగ్స్‌ల ప‌రంగా ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెట‌ర్ మాత్రం కోహ్లినే కావ‌డం గ‌మ‌నార్హం.

కాగా ఐపీఎల్‌-2025లో విరాట్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 60 ప‌రుగుల‌తో కోహ్లి త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అంత‌కుముందు కేకేఆర్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో కూడా విరాట్‌(59) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు.

తుది జ‌ట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రా
చ‌ద‌వండి: కోహ్లి, రోహిత్ కాదు.. వారితోనే ఆడాల‌ని ఉంది: ఎంఎస్ ధోని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement