one day rankings
-
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా.. అన్ని విభాగాల్లో టాప్‌లో మనమే..!
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా కొనసాగుతుంది. తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ 51 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్ విభాగంలో యువ కెరటం శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌కు అతి చేరువయ్యాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉన్న బాబర్ ఆజమ్‌కు (857) గిల్‌కు (814) మధ్య తేడా కేవలం 43 పాయింట్లు మాత్రమే. ఎల్లుండి నుంచి ఆసీస్‌తో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గిల్ ఒక్క కీలక ఇన్నింగ్స్ ఆడినా బాబర్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకుంటాడు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా టీమిండియా హవా కొనసాగుతుంది. ఆసియా కప్-2023 గెలిచి జోష్‌మీదున్న భారత్.. పాకిస్తాన్‌తో సరిసమానమైన రేటింగ్ పాయింట్లు (115) కలిగి రెండో స్థానంలో ఉంది. ఈనెల 22న ఆసీస్‌తో జరిగే తొలి వన్డేలో గెలిస్తే భారత్ అగ్రస్థానానికి ఎగబాకుతుంది. తద్వారా టెస్ట్, టీ20, వన్డే ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుంది. ఇప్పటికే భారత్ టెస్ట్, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో భారత్ నంబర్ వన్ జట్టుగా ఉండనే ఉంది. టీ20 నంబర్ వన్ బ్యాటర్‌గా సూర్యకుమార్ తన హవాను కొనసాగిస్తుండగా.. టీ20 నంబర్ 2 ఆల్‌రౌండర్‌గా హార్ధిక్ సత్తా చాటాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో టీమ్ భారత్ గతకొంతకాలంగా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. టెస్ట్‌ల్లో చాలాకాలంగా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతున్న భారత్.. వ్యక్తిగత ప్రదర్శనల్లోనూ సత్తా చాటుతూ అన్ని విభాగాల్లో అగ్రస్థానాల్లో కొనసాగుతుంది. నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా అశ్విన్, నంబర్ 3 బౌలర్‌గా జడేజా.. ఆల్‌రౌండర్ల విభాగంలో తొలి రెండు స్థానాల్లో జడేజా, అశ్విన్‌లు కొనసాగుతున్నారు. ఇలా టీమిండియా, టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దాదాపుగా అన్ని విభాగాల్లో టాప్ ప్లేస్ల్లో కొనసాగుతున్నారు. అతి త్వరలో భారత్ నంబర్ వన్ వన్డే జట్టుగా, గిల్ నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. -
దోబూచులాడుతున్న టాప్ ర్యాంకింగ్.. మళ్లీ నంబర్ వన్ స్థానానికి చేరిన పాక్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం మూడు జట్ల మధ్య దోబూచులాడుతుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ముందు టాప్ ప్లేస్ పాకిస్తాన్, భారత్, ఆస్ట్రేలియా జట్లతో మ్యూజికల్ ఛైర్స్ గేమ్ ఆడుతుంది. ఈ మూడు జట్లలో ఒక్కో జట్టు ఒక్కో రోజు అగ్రస్థానంలో ఉంటుంది. ఈ నెలలో ఏ జట్టు వరుసగా ఓ వారం పాటు టాప్ ప్లేస్‌లో లేదు. మూడు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం ఒకటి, అర ఉండటమే ఈ దోబూచులాటకు కారణం. సెప్టెంబర్ 14న అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాతో ఐదో వన్డేలో ఓటమిపాలు కావడంతో తమ అగ్రపీఠాన్ని పాక్‌కు చేజార్చుకుంది. పాక్.. ఆసియా కప్-2023లో సూపర్ ఫోర్ దశలోనే నిష్క్రమించినా తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇదే సమయంలో టీమిండియా ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నా.. సూపర్ ఫోర్ దశలో బంగ్లాదేశ్‌తో చేతిలో ఓడిపోవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత్, పాక్‌లకు సమానంగా 115 పాయింట్లు ఉన్నా పాక్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 113 పాయింట్లు కలిగి ఉంది. టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 22న ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. ఇదే గనక జరిగితే టీమిండియా ఒకేసారి మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగే జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది. భారత్ ప్రస్తుతం టెస్ట్, టీ20ల్లో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఆసీస్‌తో సిరీస్‌ను భారత్ గెలిస్తే అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో ఉన్న జట్టుగా ప్రపంచకప్ బరిలోకి దిగుతుంది. కాగా, ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్‌కప్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 14న భారత్.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. -
Asia Cup 2023: లంక చేతితో ఓటమి.. పాకిస్తాన్‌కు షాక్
ఆసియా కప్-2023లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన కీలక సూపర్-4 సమరంలో పాక్.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. కీలక ఆటగాళ్లంతా గాయపడినా, ఓ మోస్తరు స్కోర్ చేసి చివరి నిమిషం వరకు పోరాడినా, పాక్ లంకపై గెలువలేకపోయింది. ఈ ఓటమితో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించడమే కాకుండా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని కోల్పోయింది. ఇవాళ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పాక్ రెండు స్థానాలు దిగజారి మూడో ప్లేస్‌కు పడిపోగా.. సౌతాఫ్రికా చేతిలో మూడో వన్డేలో ఓడినప్పటికీ రెండో ప్లేస్‌లో ఉండిన ఆస్ట్రేలియా అగ్రస్థానానికి ఎగబాకింది. పాక్ మూడో స్థానానికి పడిపోవడంతో ఆ స్థానంలో ఉన్న భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. టాప్-3 స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా (118), భారత్ (116), పాకిస్తాన్ (115)ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కేవలం 3 పాయింట్లే ఉండటంతో అగ్రస్థానం ఈ మూడు జట్ల మధ్య దోబూచులాట ఆడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచి, సౌతాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా కోల్పోతే, వరల్డ్‌కప్‌లో భారత్ నంబర్ వన్ జట్టుగా బరిలోకి దిగుతుంది. వన్డేల్లో భారత్ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధిస్తే.. ఒకేసారి మూడు ఫార్మాట్లలో టాప్ ర్యాంకింగ్ సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది. భారత్ ఇప్పటికే టెస్ట్‌ల్లో, టీ20ల్లో నంబర్ వన్ జట్టుగా చలామణి అవుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై గెలవడంతో శ్రీలంక ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుని, సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. సూపర్-4 దశలో శ్రీలంక.. పాక్, బంగ్లాదేశ్‌లపై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడగా.. భారత్.. పాక్, శ్రీలంకను ఓడించి, ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 78/4గా ఉంది. తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13) ఔట్ కాగా.. షకీబ్ (34), తౌహిద్ హ్రిదోయ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో గిల్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగేళ్ల తర్వాత టాప్–10లో ముగ్గురు భారత బ్యాటర్లకు చోటు దక్కింది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ 759 రేటింగ్ పాయింట్లతో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత స్టార్స్ విరాట్ కోహ్లి 715 పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌లో, కెప్టెన్ రోహిత్ శర్మ 707 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. 2019లో రోహిత్, కోహ్లి, శిఖర్ ధావన్ టాప్–10 ర్యాంకింగ్స్‌లో నిలిచారు. పాకిస్తాన్ కెపె్టన్ బాబర్ ఆజమ్ 863 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాక్ నుంచి కూడా ముగ్గురు టాప్–10లో ఉండటం విశేషం. ఇమామ్ ఉల్ హఖ్ 735 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో, ఫఖర్ జమాన్ 705 పాయింట్లతో పదో ర్యాంక్‌లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ ఏడో ర్యాంక్‌లో, మొహమ్మద్ సిరాజ్ తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా ఒక స్థానం మెరుగుపర్చుకొని ఆరో ర్యాంక్‌లో ఉన్నాడు. -
టాప్-10లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు.. నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు. ఏకంగా ముగ్గురు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్-2023లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 154 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌కు ఎగబాకగా.. ఇదే ఆసియా కప్‌లో పాక్‌పై సూపర్ సెంచరీతో ఇరగదీసిన కోహ్లి రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రోహిత్ సైతం రెండు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో ప్లేస్‌కు చేరుకున్నాడు. గడిచిన ఐదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2019 జనవరిలో చివరిసారి ముగ్గురు టీమిండియా బ్యాటర్లు టాప్-10లో ఉన్నారు. నాడు శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. తాజాగా ర్యాంకింగ్స్‌లో భారత్‌తో పాటు పాక్‌కు చెందిన ఆటగాళ్లు కూడా ముగ్గురు టాప్-10లో ఉండటం విశేషం. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇమామ్ ఉల్ హాక్ ఓ స్థానం దిగజారి ఐదులో.. అతని సహచరుడు ఫఖర్ జమాన్ మూడు స్థానాలు కోల్పోయి 10వ స్థానానికి పడిపోయాడు. బౌలింగ్ విషయానికొస్తే.. భారత టాప్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసియా కప్‌లో తన అద్భుత ప్రదర్శన (పాక్‌పై 5 వికెట్లు, శ్రీలంకపై 4 వికెట్లు) కారణంగా ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తన తొమ్మిదో స్థానాన్ని కాపాడుకున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ రాణిస్తున్న జోష్ హాజిల్‌వుడ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సహచరుడు మిచెల్ స్టార్క్, కివీస్ పేస్ గన్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో సంయుక్తంగా నిలిచారు. కాగా, టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియా-పాకిస్తాన్-భారత్‌ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుంది. ఆసీస్, పాక్‌లు చెరి 118 పాయింట్లతో 1,2 స్థానాల్లో కొనసాగుతుండగా.. 116 పాయింట్లతో టీమిండియా మూడో ప్లేస్‌లో నిలిచింది. మూడు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కేవలం 2 పాయింట్లే కావడంతో వచ్చే వారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో తప్పక మార్పులు జరగవచ్చు. -
నాలుగో స్థానానికి ఎగబాకిన సిరాజ్.. టాప్-10లో కుల్దీప్
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 30) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఎలాంటి చెప్పుకోదగ్గ మార్పులు చోటు చేసుకోలేదు. బ్యాటింగ్‌లో బాబర్ ఆజమ్ (877), బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్ (705), ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ (371) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. నాలుగులో గిల్.. తొమ్మిదిలో విరాట్ బ్యాటింగ్ విభాగం టాప్-10లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (నాలుగో స్థానం), విరాట్ కోహ్లి (తొమ్మిదో ప్లేస్) తమ స్థానాలను పదిలంగా కాపాడుకోగా.. డస్సెన్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, హ్యారీ టెక్టార్, డేవిడ్ వార్నర్, డికాక్, స్టీవ్ స్మిత్ 2, 3, 5, 6, 7, 8, 10 స్థానాల్లో ఉన్నారు. నాలుగో స్థానంలో సిరాజ్.. 10 స్థానానికి ఎగబాకిన కుల్దీప్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. మహ్మద్ సిరాజ్ ఓ స్థానం మెరుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్ యాదవ్ టాప్-10లోకి (10వ స్థానం) చేరాడు. మిచెల్ స్టార్క్, ముజీబ్, రషీద్, మ్యాట్ హెన్రీ, బౌల్ట్, ఆడమ్ జంపా, షాహీన్ అఫ్రిది 2, 3, 5, 6, 7, 8, 9 స్థానాల్లో నిలిచారు. హార్ధిక్ ఒక్కడే.. ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్-20లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. షకీబ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నబీ, సికందర్ రజా, రషీద్ ఖాన్, అస్సద్ వలా, జీషన్ మక్సూద్, సాంట్నర్, హసరంగ, మెహిది హసన్, క్రిస్ వోక్స్ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్-20లో (12) ఉన్నాడు. -
సత్తా చాటిన శుభ్‌మన్.. దుమ్మురేపిన తిలక్ వర్మ
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 9) విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. విండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించగా.. టీ20 సిరీస్‌లో ఇరగదీస్తున్న తిలక్ వర్మ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో ఓ హాఫ్‌సెంచరీ సాయంతో 126 పరుగులు చేసిన శుభ్‌మన్ 2 స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. 3 మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీల సాయంతో 184 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 9 స్థానాలు మెరుగుపర్చుకుని 36వ ప్లేస్‌కు చేరుకున్నాడు. టీ20ల విషయానికొస్తే.. విండీస్‌తో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో ఇరగదీసిన తిలక్ (39, 51, 49 నాటౌట్).. అరంగేట్రంలోనే 21 స్థానాలు మెరుగుపర్చుకుని 46వ స్థానానికి చేరాడు. టీ20 బౌలింగ్ విషయానికొస్తే.. విండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 36 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ ప్లేస్‌కు చేరుకున్నాడు. కుల్దీప్ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ ఫార్మాట్లో కుల్దీప్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకాడు. టీ20 బౌలర్ల విభాగంలో భారత బౌలర్లు అక్షర్ 7 స్థానాలు, హార్ధిక్ పాండ్యా ఓ స్థానం మెరుగపర్చుకుని 33, 37 స్థానాల్లో నిలిచారు. విండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ రాణించిన హార్ధిక్.. బ్యాటింగ్‌లో 10 స్థానాలు, ఆల్‌రౌండర్ల విభాగంలో 5 స్థానాలు మెరుగుపర్చుకుని 71, 11 స్థానాల్లో నిలిచాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు (8) పడగొట్టిన శార్దూల్ ఠాకూర్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 30వ ప్లేస్‌కు చేరుకున్నాడు. పై పేర్కొన్న మార్పులు మినహా వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పులు జరగలేదు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ఫకర్ జమాన్ టాప్-3లో ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ టాప్-3లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. వన్డేల్లో హాజిల్‌వుడ్, స్టార్క్, రషీద్ ఖాన్ టాప్-3లో ఉండగా.. టీ20ల్లో రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, హసరంగ టాప్‌లో ఉన్నారు. వన్డేల్లో భారత ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్‌తో పాటు విరాట్ కోహ్లి (9) టాప్-10లో ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో వన్డేల్లో మహ్మద్ సిరాజ్ (4), కుల్దీప్ (10) టాప్-10లో ఉండగా.. టీ20ల్లో భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేరు. టీ20ల్లో మెరుగైన ర్యాంకింగ్ కలిగిన భారత బౌలర్‌గా అర్షదీప్ (17) ఉన్నాడు. -
సత్తా చాటిన సికందర్ రజా, నికోలస్ పూరన్
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, విండీస్ వైట్‌బాల్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ సత్తా చాటారు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో అద్భుతమైన ప్రదర్శనల కారణంగా వీరు ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. పూరన్ 13 స్థానాలు జంప్ చేసి టాప్ 20లోకి (19వ స్పాట్) ప్రవేశిస్తే.. సికందర్ రజా 7 స్థానాలు మెరుగుపర్చుకుని 27వ ప్లేస్‌కు ఎగబాకాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బంతితోనూ సత్తా చాటిన సికందర్.. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు చేరాడు. బౌలింగ్‌లో 4 మ్యాచ్‌ల్లో 18 వికెట్లతో చెలరేగిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ 2 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకాడు. వీరితో పాటు క్వాలిఫయర్స్‌లో సత్తా చాటిన మరికొందరు బ్యాటర్లు కూడా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. 3 ఫిఫ్టిలతో రాణించిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 24 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ ర్యాంక్‌కు, జింబాబ్వే సీన్ విలియమ్స్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ ప్లేస్‌కు చేరుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో టాప్-10 స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. బ్యాటింగ్‌లో బాబర్ ఆజమ్, బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టాప్ 10లో ఉండగా.. బౌలింగ్‌లో సిరాజ్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, పాక్‌ను వెనక్కునెట్టిన టీమిండియా
IND VS ENG 1st ODI: తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ద్వారా టీమిండియా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లైంది. ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకడంతో పాటు దాయాది పాక్‌కు కూడా షాకిచ్చింది. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించిన రోహిత్ సేన 3 రేటింగ్ పాయింట్లను (108) సాధించి టాప్-3లోకి చేరి, పాక్‌ను నాలుగో స్థానానికి (106) నెట్టింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (126) టాప్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ (122) రెండు, ఆసీస్ (101), సౌతాఫ్రికా (99) ఐదు ,ఆరు స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ (96), శ్రీలంక (92), వెస్టిండీస్ (71), ఆఫ్ఘనిస్తాన్ (69), ఐర్లాండ్ (54) జట్లు వరుసగా 7 నుంచి 11 స్థానాల్లో నిలిచాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ 3లోకి చేరడంతో మూడు ఫార్మాట్లలో టాప్-3లో ఉన్న ఏకైక జట్టుగా నిలిచింది. ICC Rankings All formats Tests: 1. Australia 🇦🇺 2. India 🇮🇳 3. South Africa 🇿🇦 ODI: 1. New Zealand 🇳🇿 2. England 🏴 3. India 🇮🇳 T20I: 1. India 🇮🇳 2. England 🏴 * India is the only team to be in the top 3 in all formats ranking.#Cricket | #CricketTwitter — 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭 𝐒𝐩𝐚𝐫𝐭𝐚𝐧 (@clownslayer_V) July 13, 2022 ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఘన విజయం సాధించడంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో వెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. బుమ్రా (6/19), మహ్మద్ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 25.2 ఓవర్లలో 110 పరుగులకే చాపచుట్టేసింది. జోస్ బట్లర్ (32 బంతుల్లో 30; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా టాప్–6లో నలుగురు బ్యాటర్లు ‘డకౌట్’ అయ్యారు. మొత్తంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం. అనంతరం రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శిఖర్ ధవన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగి ఆడటంతో భారత్ 18.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: రో'హిట్' ధాటికి చిన్నారి విలవిల.. ఆందోళన వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ -
టాప్ 10లో టీమిండియా వైస్ కెప్టెన్.. మెరుగైన కెప్టెన్ ర్యాంక్
దుబాయ్: శ్రీలంక పర్యటనలో రాణించిన భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ర్యాంకుల్ని మెరుగుపర్చుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ ఓపెనర్ మంధాన తొమ్మిదో స్థానానికి ఎగబాకగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 13వ ర్యాంకులో నిలిచింది. 3–0తో లంకను క్లీన్‌స్వీప్ చేసిన ఈ సిరీస్‌లో హర్మన్ 59.50 సగటుతో 119 పరుగులు చేసింది. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసింది. ఓపెనర్ మంధాన 52 సగటుతో 104 పరుగులు చేసింది. వన్డే బౌలింగ్ విభాగంలో రాజేశ్వరి గైక్వాడ్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతోంది. లంకతో వన్డేలకు దూరంగా ఉన్న వెటరన్ సీమర్ జులన్ గోస్వామి నిలకడగా ఆరో ర్యాంకులో ఉంది. -
దూసుకుపోతున్న పాక్ ప్లేయర్లు.. టీమిండియా నుంచి ఆ ముగ్గురు..!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా కొనసాగింది. స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ జట్టు ఆటగాళ్లు బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హాక్, షాహీన్ అఫ్రిదిలు తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఆసీస్‌తో జరిగిన 3 వన్డేల్లో (103, 106, 89 నాటౌట్) 298 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హాక్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి (795 రేటింగ్ పాయింట్లు) చేరుకోగా, అదే సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌ల్లో ( 57, 114, 105) 276 పరుగులు చేసిన బాబర్ ఆజమ్.. భారీగా రేటింగ్ పాయింట్లు పెంచుకుని అగ్రస్థానంలో (891 పాయింట్లు) స్థిరపడ్డాడు. 🔸 Shaheen Afridi continues to climb 🔸 Imam-ul-Haq makes significant gains Pakistan players make major movements in the @MRFWorldwide ICC Men's Player Rankings for ODIs and Tests after #PAKvAUS series 📈 Details 👉 https://t.co/zoY06jyBJ3 pic.twitter.com/dxVyiF78oK — ICC (@ICC) April 6, 2022 ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టిన షాహీన్ అఫ్రిది బౌలింగ్ విభాగంలో ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో ప్లేస్‌కు (671 పాయింట్లు) చేరాడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (811), రోహిత్ శర్మ (791) తమ 2, 4 స్థానాలను పదిలం చేసుకోగా.. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (679) ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, న్యూజిలాండ్ మ్యాట్ హెన్రీ, బంగ్లా స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగనప్పటికీ, టీమిండియా పేసర్ బుమ్రా (830) ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు, పాక్ స్పీడ్ గన్ షాహీన్ అఫ్రిది (827) నాలుగో స్థానానికి ఎగబాకారు. ఈ జాబితాలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 901 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (850) రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. చదవండి: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ ఎవరంటే..? -
వన్డే ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ల హవా.. టాప్ 10లో టీమిండియా నుంచి ఇద్దరు
Alyssa Healy: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా కొనసాగుతుంది. బ్యాటింగ్ విభాగం టాప్ 10లో ఏకంగా నలుగురు ఆసీస్ బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. వరల్డ్ కప్ 2022 ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారీ సెంచరీ (170) సాధించిన ఆసీస్ స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (785 రేటింగ్ పాయింట్లు) నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకోగా, ఆసీస్‌కే చెందిన బెత్ మూనీ (748) 3వ స్థానంలో, కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (710), ఓపెనర్ రేచల్ హేన్స్‌లు 5, 6 స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నథాలి సీవర్ (750) రెండో స్థానానికి ఎగబాకగా, దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వొల్వార్డ్ నాలుగో స్థానానికి దిగజారింది. టీమిండియా నుంచి మిథాలీ రాజ్ (686) ఏడో స్థానాన్ని దక్కించుకోగా, స్టార్ బ్యాటర్ స్మ్రతి మంధాన (669) తొమ్మిదో ప్లేస్‌కు చేరుకుంది. కాగా, అలీసా హీలీ.. ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీల సాయంతో 509 పరుగులు చేసి, ఆసీస్ ఏడోసారి జగజ్జేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చదవండి: 'మెస్సీ.. పిల్లలపై కనికరం చూపించలేవా' -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ఆటగాళ్లు హవా కొనసాగింది. టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ ఆటగాళ్లు అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్‌లో లబూషేన్ (892), స్టీవ్ స్మిత్ (845) తొలి రెండు స్థానాలను పదిలం చేసుకోగా, పాక్‌తో సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (757) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఖ్వాజా ఏకంగా 6 స్థానాలు ఎగబాకి 7వ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (754), విరాట్ కోహ్లి (742)లు తలో ర్యాంక్ కోల్పోయి 8, 10 స్థానాలకు పడిపోయారు. Major changes in the latest @MRFWorldwide ICC Men’s Player Rankings for Tests and ODIs 👀 More ➡️ https://t.co/MsmAFEH2gG pic.twitter.com/5Cr3GbWccp — ICC (@ICC) March 30, 2022 తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓ ర్యాంకును మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఈ జాబితా టాప్ 10లో పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్, టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్, సఫారీ స్పీడ్‌స్టర్ రబాడ, భారత పేసు గుర్రం బుమ్రా, పాక్ నయా సంచలనం షాహీన్ అఫ్రిది వరుసగా 1 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ కేటగిరీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (385), రవిచంద్రన్ అశ్విన్ (341)తొలి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. మరోవైపు ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో (బ్యాటింగ్ విభాగంలో) పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, కివీస్ ఆటగాడు రాస్ టేలర్ తొలి మూడు స్థానాలను నిలబెట్టుకోగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానం ఎగబాకి ఫోర్త్ ప్లేస్‌కు చేరాడు. ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో, పాక్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్‌లు చెరో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 6, 10 స్థానాలకు ఎగబాకారు. బౌలింగ్‌లో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా ఏకంగా 6 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి, బంగ్లా వెటరన్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్‌కు ఎగబాకగా, న్యూజిలాండ్ స్టార్ పేసర్ బౌల్ట్, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IPL 2022: జోరుమీదున్న కేకేఆర్‌ను ఆర్సీబీ నిలువరించేనా..? -
వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన ఇంగ్లండ్ ప్లేయర్..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్.. కెరీర్ అత్యుత్తమ వన్డే ర్యాంకింగ్ సాధించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 6 వికెట్లు పడగొట్టిన వోక్స్(711 పాయింట్లు).. ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(737 పాయింట్లు) నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా, బంగ్లా బౌలర్ మెహదీ హసన్ (713) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (690 పాయింట్లు) ఒక స్థానాన్ని కోల్పోయి ఆరో ప్లేస్‌కు దిగజారాడు. 📈 @ChrisWoakes makes a charge in the latest @MRFWorldwide ICC Men’s ODI Bowling Rankings, with the @EnglandCricket quick jumping to No.3. Full rankings ➡️ https://t.co/tHR5rK3ru7 pic.twitter.com/LazEtSmQHB — ICC (@ICC) July 7, 2021 ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. శ్రీలంకతో సిరీస్‌లో 147 పరుగులతో అదరగొట్టిన ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్.. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానంలో, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒక స్థానం ఎగబాకి 25వ ప్లేస్‌లో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకోగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక స్థానం మెరుగుపర్చుకుని 9వ ప్లేస్‌కు చేరుకోగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, ఎయిడెన్ మర్క్రమ్లు.. 13, 19వ స్థానాలకు ఎగబాకారు. విండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఈ ఇద్దరు ఓపెనర్లు అదరగొట్టారు. దీంతో ప్రొటీస్.. ఆతిధ్య జట్టుపై 3-2తో గెలుపొందింది. ఈ జాబితాలో టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ సైతం ఒక స్థానం మెరుగుపరుచుకని 6వ ప్లేస్‌కు చేరుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలాన్, ఆసీస్ ఆరోన్ ఫించ్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు వరుసగా 1, 2, 3 స్థానాలను నిలబెట్టుకున్నారు. 🔺 After entering the top 10 last week, @windiescricket opener Evin Lewis moves up a spot on the @MRFWorldwide ICC Men's T20I Batting Rankings. pic.twitter.com/TugCjFugmb — ICC (@ICC) July 7, 2021 -
వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లి, బుమ్రా టాప్
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకులను విడుదల చేసింది. ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి, బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నెం-1గా, ఆల్ రౌండర్ల విభాగంలో భారత్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 895 పాయింట్లతో కోహ్లి మొదటిస్థానంలో ఉండగా.. 863 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనతో రోహిత్ రెండో స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలో 797 పాయింట్లతో బుమ్రా నెం.1 స్థానాన్ని దక్కించుకోగా నెం.2 ర్యాంకులో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు. ఆల్ రౌండర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ 319 పాయింట్లతో నెం.1 ర్యాంకులో నిలవగా, ఆఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ రెండవ స్థానంలో నిలిచాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత జట్టు.. తర్వాత ఆ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌లలో తలపడనుంది. ఈ సిరీస్ తర్వాత డిసెంబర్లో వెస్టిండీస్‌తో భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ-20సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్‌తో సిరీస్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. -
సిరీస్ గెలిచినా.. పాయింట్లు కోల్పోయారు!
దుబాయ్: వెస్టిండీస్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-1తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. చివరి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సిరీస్ భారత్ సొంతమైంది. అయితే విరాట్ సేన సిరీస్ ను గెలిచినప్పటికీ పాయింట్లను మాత్రం కోల్పోయింది. ఈ సిరీస్ తరువాత విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ మూడో స్థానం నిలబెట్టుకుంది. కాగా, రెండు పాయింట్లను నష్టపోయింది. విండీస్ తో వన్డే సిరీస్ కు ముందు 116 రేటింగ్ పాయింట్లతో బరిలోకి దిగిన భారత్ జట్టు.. సిరీస్ ముగిసిన తరువాత 114 పాయింట్లకు పడిపోయింది. విండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ జట్టు ఓటమి పాలుకావడం పాయింట్ల కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. అయితే తన స్థానాన్ని మాత్రం టీమిండియా తిరిగి నిలబెట్టుకుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 119 రేటింగ్ పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్ 113 పాయింట్లతో నాల్గో స్థానానికి పరిమితమైంది. -
వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ పైకి..
దుబాయ్:చాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా టైటిల్‌నే ఎగురేసుకుపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ వన్డే ర్యాంకింగ్స్ లో కూడా మరింత పైకి వచ్చింది. ఈ టోర్నీ అనంతంరం సోమవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. మరొకవైపు ఫైనల్లో ఓటమి పాలై రన్నరప్ గా సరిపెట్టుకున్న భారత్ జట్టు మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం 95 రేటింగ్ పాయింట్లను సాధించిన పాకిస్తాన్ ఆరో స్థానానికి ఎగబాకింది. ఎనిమిదో స్థానంలో చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమైన పాకిస్తాన్ ఆద్యంతం సంచలన విజయాలు నమోదు చేసి చివరకు టైటిల్ ను ఎగురేసుకుపోయింది. -
'టాప్'లేపిన కోహ్లి
దుబాయ్:అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లి 862 రేటింగ్ పాయింట్లలతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డే మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లి 22 పాయింట్లను సాధించాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ నంబర్ వన్ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ను వెనక్కునెట్టాడు. ప్రస్తుతం కోహ్లి తొలి స్థానాన్ని ఆక్రమించగా, రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(861) నిలిచాడు. ఇక డివిలియర్స్(841 పాయింట్లు) మూడో స్థానానికి దిగజారిపోయాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన డివిలియర్స్.. చాంపియన్స్ ట్రోఫీలో పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. దాంతో రేటింగ్ పాయింట్లను కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. మరొకవైపు జనవరి నెలలో నాలుగు రోజులు మాత్రమే టాప్ ర్యాంకును ఎంజాయ్ చేసిన కోహ్లి.. ఇప్పుడు ఎంతకాలం ఆ ర్యాంకులో కొనసాగుతాడో చూడాలి. కాగా, టాప్ -10లో మరో భారత బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ చోటు దక్కించుకున్నాడు. ఇక రోహిత్ శర్మ 13వ స్థానానికి పరిమితం కాగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక స్థానం దిగజారి 14వ స్ధానానికి పడిపోయాడు.ఇక బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లకు ఎవ్వరికీ టాప్-10లో చోటు దక్కలేదు. భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ రెండు స్థానాలు దిగజారి 20వ స్థానానికి పడిపోయాడు. -
టీమిండియా@ 3
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌ల్లో భారత్ మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో కోహ్లిసేన ఐదు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 117 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న భారత్ కంటే మెరుగ్గా దక్షిణాఫ్రికా (123 పాయింట్లు), ఆస్ట్రేలియా (118 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
కోహ్లి అండ్ గ్యాంగ్‌కు మూడో ర్యాంకు
దుబాయ్: ఆంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా మూడో ర్యాంకుకు ఎగబాకింది. తాజా వన్డే ర్యాంకింగ్స్ లో ఒక ర్యాంకు మెరుగుపరుచుకున్న కోహ్లి సేన మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరొకవైపు దక్షిణాఫ్రికా ప్రథమస్థానాన్నినిలబెట్టుకోగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. టీమిండియా 117 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానాన్ని సాధించగా, 123 పాయింట్లతో దక్షిణాఫ్రికా టాప్ లో నిలిచింది. కాగా, ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక్కడ ఆస్ట్రేలియా కంటే కోహ్లి సేనకు ఒక పాయింట్ మాత్రమే తక్కువ ఉండటం గమనార్హం. ఇక పాకిస్తాన్ 88 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలవగా, వెస్టిండీస్ 79 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక్కడ పాకిస్తాన్ 90 నుంచి 88 రేటింగ్ పాయింట్లకు పడిపోగా, వెస్టిండీస్ 83 రేటింగ్ పాయింట్ల నుంచి 79 పాయింట్లకు పడిపోయింది. -
విరాట్ 'మారలేదు'
దుబాయ్: టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డే ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలోనే కొనసాగుతున్నాడు. తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లి తన మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. మరొకవైపు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తిరిగి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో విశేషంగా రాణించిన ఏబీ తన రేటింగ్ పాయింట్లను మెరుగుపరుచుని టాప్ కు చేరుకున్నాడు. కివీస్ తో సిరీస్ లో 262 పరుగులు చేసిన ఏబీ.. 875 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండో స్థానానికి పడిపోయాడు. గత జనవరిలో ఏబీని వెనక్కునెట్టి నంబర్ వన్ ర్యాంకును తొలిసారి సొంతం చేసుకున్న వార్నర్.. ఎక్కువ కాలం ఆ స్థానంలో నిలవలేకపోయాడు. ప్రస్తుతం ఏబీ తరువాత స్థానాల్లో డేవిడ్ వార్నర్(871), కోహ్లి(852)లు కొనసాగుతున్నారు. ఇదిలా ఉంచితే భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని వన్డే ర్యాంకింగ్స్ లో కూడా ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. రోహిత్ 12స్థానంలో, ధోని 13వ స్థానంలో కొనసాగుతున్నారు. -
రెండో ర్యాంక్‌లో మిథాలీ
న్యూఢిల్లీ: మహిళల వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ఇద్దరు భారత బ్యాట్స్‌విమెన్ టాప్–10లో నిలిచారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ 733 పాయింట్లతో రెండో స్థానంలో, హర్మన్‌ప్రీత్ కౌర్ 574 పాయిం ట్లతో పదో స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్ లానింగ్ 804 పాయింట్లతో మొదటి ర్యాంకులో కొనసాగుతోంది. బౌలర్ల జాబి తాలో జులన్ గోస్వామి మూడో స్థానంలో ఉంది. భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిష్త్ ఎనిమిదో ర్యాంకుకు చేరింది. -
వన్డేల్లో టీమిండియాదే అగ్రస్థానం!
దుబాయ్: ఇంగ్లండ్ తో జరిగిన చివరి వన్డేలో టీం ఇండియా ఓటమి చవిచూసినా అగ్రస్థానాన్నిమాత్రం నిలబెట్టుకుంది. గత వారం నంబర్ ర్యాంక్ ను ఆస్ట్రేలియా-టీం ఇండియాలు సంయుక్తంగా కైవసం చేసుకున్నా ..ట్రై-సిరీస్ లో ఆసీస్ పేలవమైన ఆటను ప్రదర్శించడంతో ఆ స్థానాన్ని కోల్పోయింది. ట్రై సిరీస్ ఫైనల్లో ఆసీస్ ను మట్టికరిపించిన దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని తృటిలో చేజార్చుకుంది. భారత్-ఇంగ్లండ్ ల ఐదు వన్డేల సిరీస్, జింబాబ్వేలో జరిగిన ట్రై సిరీస్ లు ముగిసిన అనంతరం ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా- భారత్ లు 113 పాయింట్లతో అగ్రస్థానం కోసం పోటీ పడగా.. స్వల్ప పాటి తేడాలో దక్షిణాఫ్రికా నంబర్ వన్ ర్యాంక్ ను చేజార్చుకుంది. ధోనీ సేన 113.49 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, దక్షిణాఫ్రికా 112. 96 పాయింట్లు మాత్రమే సాధించి రెండో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం ఆసీస్ నాల్గో స్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక మూడో స్థానానికి ఎగబాకింది. -
నంబర్‌వన్ భారత్
వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానం దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మరో సారి ఒంటరిగా అగ్రస్థానానికి దూసుకొచ్చింది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 114 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో మూడో వన్డే నెగ్గిన తర్వాత భారత్, ఆస్ట్రేలియాతో సంయుక్తంగా నంబర్‌వన్‌గా ఉంది. అయితే జింబాబ్వే చేతిలో ఆసీస్ చిత్తవడంతో ధోని సేన ఒక్కటే అగ్రస్థానాన్ని పటిష్ట పరచుకుంది. తాజా ఓటమితో ఆస్ట్రేలియా (111 పాయింట్లు) నాలుగో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా (113), శ్రీలంక (111) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ వారంలో మరో ఐదు వన్డేలు జరగాల్సి ఉన్నందున ఈ ర్యాంకులు వెంటనే మారే అవకాశం ఉంది. టీమిండియా నంబర్‌వన్‌గా కొనసాగాలంటే ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు వన్డేలు కూడా గెలవడంతో పాటు దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియా కనీసం ఒక మ్యాచ్‌లో ఓడించాలి. -
వరల్డ్ కప్ పైనే.. ర్యాంకింగ్స్ పై కాదు!
మెల్ బోర్న్:వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా ఫస్ట్ ర్యాంక్ లో కొనసాగుతున్నా.. ఆ ర్యాంకింగ్స్ కు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తమ లక్ష్యం వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడంపైనే ఉందని, ర్యాంకులపై కాదన్నాడు. త్వరలో జరగబోయే వరల్డ్ కప్ ను గెలిస్తే అది అన్నింటికీ పరిష్కారం చూపుతుందన్నాడు.'వన్డే ర్యాంకింగ్ లో ఆస్ట్రేలియా తరువాత దక్షిణాఫ్రికా, టీమిండియాలు ఉన్నాయి. వచ్చే వారం దక్షిణాఫ్రికా-జింబాబ్వేల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా జట్టు వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నా.. వరల్డ్ కప్ ను కూడా గెలిచి నిరూపించుకోవాలన్నాడు. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఒక్క వరల్డ్ కప్ ను గెలుచుకోలేదన్న విషయాన్ని క్లార్క్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆస్టేలియా-న్యూజిలాండ్ లు సంయుక్తంగా నిర్వహించే వరల్డ్ కప్ పైనే దృష్టి సారించమన్నాడు. మరో ఆరు నెలల్లో ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుందని.. అప్పుడే నంబర్ వన్ ఎవరో తెలుస్తుందని క్లార్క్ తెలిపాడు.