IND VS ENG 1st ODI: తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ద్వారా టీమిండియా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లైంది. ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకడంతో పాటు దాయాది పాక్‌కు కూడా షాకిచ్చింది. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించిన రోహిత్ సేన 3 రేటింగ్ పాయింట్లను (108) సాధించి టాప్-3లోకి చేరి, పాక్‌ను నాలుగో స్థానానికి (106) నెట్టింది.
ఈ జాబితాలో న్యూజిలాండ్ (126) టాప్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ (122) రెండు, ఆసీస్ (101), సౌతాఫ్రికా (99) ఐదు ,ఆరు స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ (96), శ్రీలంక (92), వెస్టిండీస్ (71), ఆఫ్ఘనిస్తాన్ (69), ఐర్లాండ్ (54) జట్లు వరుసగా 7 నుంచి 11 స్థానాల్లో నిలిచాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ 3లోకి చేరడంతో మూడు ఫార్మాట్లలో టాప్-3లో ఉన్న ఏకైక జట్టుగా నిలిచింది.
ICC Rankings All formats
— 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭 𝐒𝐩𝐚𝐫𝐭𝐚𝐧 (@clownslayer_V) July 13, 2022
Tests:
1. Australia 🇦🇺
2. India 🇮🇳
3. South Africa 🇿🇦
ODI:
1. New Zealand 🇳🇿
2. England 🏴
3. India 🇮🇳
T20I:
1. India 🇮🇳
2. England 🏴
* India is the only team to be in the top 3 in all formats ranking.#Cricket | #CricketTwitter
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఘన విజయం సాధించడంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో వెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. బుమ్రా (6/19), మహ్మద్ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 25.2 ఓవర్లలో 110 పరుగులకే చాపచుట్టేసింది. జోస్ బట్లర్ (32 బంతుల్లో 30; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా టాప్–6లో నలుగురు బ్యాటర్లు ‘డకౌట్’ అయ్యారు.
మొత్తంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం. అనంతరం రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శిఖర్ ధవన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగి ఆడటంతో భారత్ 18.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
చదవండి: రో'హిట్' ధాటికి చిన్నారి విలవిల.. ఆందోళన వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment