first ODI
-
IND Vs ENG: శుబ్‌మన్, శ్రేయస్ సత్తా చాటగా...
స్వదేశంలో జరుగుతున్న పోరులో ఇంగ్లండ్‌పై భారత్ సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతోంది. టి20 సిరీస్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు వన్డేల్లో గెలుపుతో బోణీ చేసింది. బౌలింగ్‌లో జడేజా, రాణా రాణించడంతో ముందుగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన జట్టు...ఆపై గిల్, శ్రేయస్, అక్షర్ బ్యాటింగ్‌తో 11.2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరింది. పేలవ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ మరోసారి పరాజయానికే పరిమితమైంది. నాగ్‌పూర్: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (96 బంతుల్లో 87; 14 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (47 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. రెండో వన్డే ఆదివారం కటక్‌లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... ఓపెనర్లు సాల్ట్, బెన్ డకెట్ (29 బంతుల్లో 32; 6 ఫోర్లు) ఇంగ్లండ్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. ఓపెనర్లను నిలువరించడంలో భారత బౌలర్లు విఫలమవుతున్న స్థితిలో ఇంగ్లండ్ స్వయంకృతం ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. లేని మూడో పరుగు కోసం ప్రయత్నించిన సాల్ట్‌ను చక్కటి ఫీల్డింగ్‌తో శ్రేయస్ రనౌట్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రెండు పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ఆడిన జో రూట్ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో బట్లర్, బెతెల్ కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడారు. 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే బట్లర్ నిష్క్రమించాడు. బెతెల్‌తో కలిసి ఐదో వికెట్‌కు అతను 14.3 ఓవర్లలో 59 పరుగులు జత చేశాడు. 62 బంతుల్లో బెతెల్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకోగా...తర్వాతి బ్యాటర్లెవరూ నిలవలేకపోవడంతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఆట ముగిసింది. రాణించిన అక్షర్... ఛేదనలో ఆరంభంలో భారత్ తడబడింది. 19 పరుగుల వద్దే యశస్వి జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2) వెనుదిరిగారు. అయితే గిల్, శ్రేయస్ భాగస్వామ్యంలో జట్టు దూసుకుపోయింది. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. ఆర్చర్ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదిన అతను, కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. ఈ జోరులో 30 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 94 పరుగులు (10.4 ఓవర్లలో) జోడించిన తర్వాత శ్రేయస్ వెనుదిరిగాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ కూడా గిల్‌కు తగిన విధంగా సహకరించడంతో జట్టు లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో గిల్ 60 బంతుల్లో, అక్షర్ 46 బంతుల్లోనే హాఫ్ సెంచరీలను అందుకున్నారు. నాలుగో వికెట్‌కు 17.5 ఓవర్లలో 108 పరుగులు జత చేసిన అనంతరం అక్షర్ అవుటయ్యాడు. ఈ దశలో భారత్ విజయానికి 28 పరుగులు, గిల్ సెంచరీకి 19 పరుగులు అవసరమయ్యాయి. అయితే గిల్ సెంచరీ చేజార్చుకోగా, రాహుల్ (2) కూడా నిలబడలేదు. కానీ పాండ్యా (9 నాటౌట్), జడేజా (12 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు.26 పరుగులు సమర్పించుకున్నా... కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రాణా బౌలింగ్ ఆరంభంలో తడబడ్డాడు. ముఖ్యంగా అతని మూడో ఓవర్లో సాల్ట్ 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో సాల్ట్ వరుసగా 6, 4, 6, 4, 0, 6 బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే తన నాలుగో ఓవర్లో అతను సత్తా చాటి పరిస్థితిని మార్చాడు. మూడో బంతికి డకెట్‌ను అవుట్ చేసిన రాణా చివరి బంతికి బ్రూక్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత కీలకమైన లివింగ్‌స్టోన్ వికెట్ కూడా రాణా ఖాతాలోనే చేరింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (రనౌట్) 43; డకెట్ (సి) జైస్వాల్ (బి) రాణా 32; రూట్ (ఎల్బీ) (బి) జడేజా 19; బ్రూక్ (సి) రాహుల్ (బి) రాణా 0; బట్లర్ (సి) పాండ్యా (బి) అక్షర్ 52; బెతెల్ (ఎల్బీ) (బి) జడేజా 51; లివింగ్‌స్టోన్ (సి) రాహుల్ (బి) రాణా 5; కార్స్ (బి) షమీ 10; రషీద్ (బి) జడేజా 8; ఆర్చర్ (నాటౌట్) 21; మహమూద్ (స్టంప్డ్) రాహుల్ (బి) కుల్దీప్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (47.4 ఓవర్లలో ఆలౌట్) 248. వికెట్ల పతనం: 1–75, 2–77, 3–77, 4–111, 5–170, 6–183, 7–206, 8–220, 9–241, 10–248. బౌలింగ్: షమీ 8–1–38–1, రాణా 7–1–53–3, అక్షర్ 7–0–38–1, పాండ్యా 7–1–37–0, కుల్దీప్ 9.4–0–53–1, జడేజా 9–1–26–3. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) సాల్ట్ (బి) ఆర్చర్ 15; రోహిత్ శర్మ (సి) లివింగ్‌స్టోన్ (బి) మహమూద్ 2; గిల్ (సి) బట్లర్ (బి) మహమూద్ 86; శ్రేయస్ (ఎల్బీ) (బి) బెతెల్ 59; అక్షర్ (బి) రషీద్ 52; రాహుల్ (సి) అండ్ (బి) రషీద్ 2; పాండ్యా (నాటౌట్) 9; జడేజా (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (38.4 ఓవర్లలో 6 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–113, 4–221, 5–225, 6–235. బౌలింగ్: ఆర్చర్ 7–1–39–1, మహమూద్ 6.4–0–47–2, కార్స్ 5–0–52–0, రషీద్ 10–1–49–2, బెతెల్ 3–0–18–1, లివింగ్‌స్టోన్ 5–0–28–0, రూట్ 2–0–10–0. సినిమా చూస్తుండగా... ‘నేను ఈ మ్యాచ్ ఆడతానని అనుకోలేదు. కాస్త ఎక్కువ సేపు మెలకువతో ఉండవచ్చు అనుకొని రాత్రి సినిమా చూస్తూ కూర్చున్నాను. అయితే కోహ్లి మోకాలికి గాయం అయిందని నువ్వు ఆడాల్సి ఉంటుందని కెప్టెన్ రోహిత్నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే సినిమాను సగంలోనే ఆపేసి వెంటనే వెళ్లి పడుకున్నాను’ –శ్రేయస్ అయ్యర్ జైస్వాల్‌ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ ముందే సిద్ధమైందని శ్రేయస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. గత కొంత కాలంగా వన్డేల్లో ఘనమైన రికార్డు ఉన్నా సరే... శ్రేయస్‌కు తుది జట్టులో చోటు లేకపోవడం ఆశ్చర్యకరం.గాయంతో దూరమైన కోహ్లి టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లి లేకుండానే భారత జట్టు తొలి వన్డేలో బరిలోకి దిగింది. కుడి మోకాలికి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బుధవారం ప్రాక్టీస్ సమయంలోనే అతనికి ఈ గాయమైందని టాస్ సమయంలో కెప్టెన్ రోహిత్ వెల్లడించాడు. అయితే మ్యాచ్ ముందు రోజు టీమ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని చెప్పలేదు. గురువారం జట్టు సభ్యులందరితో కలిసి మైదానానికి వచ్చిన కోహ్లి స్వల్పంగా డ్రిల్స్‌లో పాల్గొన్నాడు. అయితే ఈ సమయంలో అతను కాలికి ప్లాస్టర్‌తో కనిపించాడు. యశస్వి జైస్వాల్, రాణా అరంగేట్రం పేస్ బౌలర్ హర్షిత్ రాణా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్లోకి అడుగు పెట్టారు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 257, 258వ ఆటగాళ్లుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. భారత్ తరఫున ఇప్పటికే 19 టెస్టులు, 23 టి20లు ఆడిన 23 ఏళ్ల ముంబై ఆటగాడు జైస్వాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా... ఢిల్లీకి చెందిన రాణా ఆ్రస్టేలియా గడ్డపై తొలి రెండు టెస్టులు ఆడాడు. ఆపై ఇంగ్లండ్‌తో గత శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లోకి అడుగు పెట్టాడు. -
‘చాంపియన్స్’కు సన్నాహం
టి20 సిరీస్‌లో ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. సరిగ్గా ఆరు నెలల విరామం తర్వాత వన్డేల్లో బరిలోకి దిగుతున్న టీమిండియా రాబోయే చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను వాడుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఒకరిద్దరు మినహా దాదాపు టి20 టీమ్‌తోనే వన్డే సిరీస్ కూడా ఆడనున్న బట్లర్ బృందం ఈ ఫార్మాట్లోనైనా రాణించి పరువు నిలబెట్టుకోవాలని కోరుకుంటోంది. తుది జట్టు ఎంపిక, వ్యూహాల విషయంలో ఈ మూడు మ్యాచ్‌లో రోహిత్ బృందానికి కీలకం కానున్నాయి. నాగ్‌పూర్: వన్డే వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన అనంతరం 6 మ్యాచ్‌లే ఆడిన భారత జట్టుదక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి, ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓడింది. మన ఆటగాళ్లు ఈ ఫార్మాట్లో గత ఏడాది ఆగస్టు తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు కొంత విరామం తర్వాత భారత్‌లోనే మన జట్టు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. జమ్తాలోని విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) మైదానంలో నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగు తుంది. ఇటీవల టెస్టుల్లో ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొ న్న కెపె్టన్ రోహిత్, కోహ్లి తమదైన శైలిలో చెలరేగేందుకు వన్డేలే సరైన వేదిక. టి20 ఫామ్‌ను కొనసాగిస్తూ ఇక్కడా జట్టు సిరీస్‌ను గెలుచుకుంటుందా అనేది ఆసక్తికరం. షమీ, కుల్దీప్ ఫామ్ కీలకం... టెస్టు, టి20 ఫార్మాట్లతో పోలిస్తే భారత వన్డే జట్టు కూర్పు చాలా కాలంగా గందరగోళం లేకుండా దాదాపు ఒకేలా ఉంది. ముఖ్యంగా టాప్–6 విషయంలో సందేహాలు లేవు. వరల్డ్ కప్ తరహాలోనే రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యాలు వరుసగా ఆయా స్థానాల్లో ఆడతారు. వీరంతా కుడిచేతి వాటం బ్యాటర్లే. అయితే ఇప్పుడు కొత్త ప్రణాళికల్లో భాగంగా వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో వైవిధ్యం కోసం పంత్‌ను తీసుకుంటారా అనేది చూడాలి. నాగ్‌పూర్ పిచ్‌ను బట్టి చూస్తే ముగ్గురు స్పిన్నర్లు ఆడవచ్చు. గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న కుల్దీప్ ఆడటం ఖాయం. అతనికి తోడు జట్టుకు నాలుగు స్పిన్ ప్రత్యామ్నాయాలు జడేజా, అక్షర్, సుందర్, వరుణ్ చక్రవర్తి రూపంలో అందుబాటులో ఉన్నాయి. పేసర్లుగా షమీ, అర్ష్ దీప్ పై బాధ్యత ఉంది. తాజాగా ఇంగ్లండ్‌పై 2 టి20లు ఆడిన షమీకి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇదే తొలి వన్డే కానుంది. బుమ్రా గైర్హాజరీలో షమీపై అదనపు బాధ్యత కూడా ఉంది. రూట్, బట్లర్ మినహా... టి20ల్లో చిత్తయిన ఇంగ్లండ్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. కొంత కాలం క్రితం వరకు భీకరమైన లైనప్‌తో ఈ ఫార్మాట్‌ను శాసించిన ఆ జట్టు వరుస వైఫల్యాలతో తడబడుతోంది. వరల్డ్ కప్ తర్వాత టీమ్‌లో స్థానం కోల్పోయిన సీనియర్ జో రూట్‌ను మళ్లీ ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు. అతనితో పాటు కెప్టెన్ బట్లర్‌కు మాత్రం భారత్‌లో చెప్పుకోదగ్గ అనుభవం ఉంది. ఎక్కువ మంది టి20 స్పెషలిస్ట్‌లే ఉన్న జట్టు వన్డేల్లో ఏమాత్రం రాణించగలదనేది చూడాలి. మ్యాచ్‌కు ముందు రోజే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. తుది జట్ల వివరాలు: భారత్ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, సుందర్, కుల్దీప్, అర్ష్ దీప్, షమీ.ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), డకెట్, సాల్ట్, రూట్, బ్రూక్, లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, సాఖిబ్.107 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 107 వన్డేలు జరిగాయి. 58 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 44 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది. 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. 3 మ్యాచ్‌లు రద్దయ్యాయి.52 స్వదేశంలో ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన వన్డేలు. 34 మ్యాచ్‌ల్లో టీమిండియా, 17 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. 1 మ్యాచ్ ‘టై’ అయింది.6 వీసీఏ స్టేడియంలో భారత్ ఆడిన వన్డేలు. ఇక్కడ 4 వన్డేల్లో నెగ్గిన టీమిండియా, 2 వన్డేల్లో ఓడిపోయింది. 2019 తర్వాత వీసీఏ స్టేడియంలో భారత్ వన్డే ఆడనుంది.పిచ్, వాతావరణంచక్కటి బ్యాటింగ్ వికెట్. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. వర్షసూచన ఏమాత్రం లేదు. -
భారత్ జోరుకు ఎదురుందా!
వడోదర: కరీబియన్ జట్టుపై వరుసగా మరో సిరీస్ నెగ్గేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే జరుగుతుంది. ముంబైలో జరిగిన టి20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెపె్టన్, కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ లేకపోయినా స్మృతి మంధాన నేతృత్వంలో జట్టు విజేతగా నిలిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా మారడం జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే మోకాలు గాయంతో సతమతమవుతున్న హర్మన్ ప్రీత్ ఫిట్నెస్ జట్టును కాస్త కలవరపెడుతోంది. 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో మిడిలార్డర్ పాత్ర చాలా కీలకం. కాబట్టి ఆమె అందుబాటులోకి వస్తే జట్టుకు లాభిస్తుంది. 2017లో ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత మహిళల జట్టు 4–1తో వెస్టిండీస్‌ను కంగుతినిపించింది. అయితే అప్పటికీ ఇప్పటికి చాలా మారింది. ప్రస్తుత జట్ల బలాబలాల విషయానికొస్తే... సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో భారత్ జట్టు గర్జించింది. వన్డే ఫార్మాట్లోనూ ఇదే జోరు కనబరిచేందుకు తహతహలాడుతోంది. స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి వరుస మూడు మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీలతో అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ నిలకడగా రాణిస్తుండగా, హిట్టర్ రిచా ఘోష్ ఆఖరి టి20లో మెరుపు ఫిఫ్టీతో విండీస్ బౌలర్ల భరతం పట్టింది. ఈ త్రయం ఫామ్ ఇలాగే కొనసాగితే భారత్‌కు ఏ బెంగా ఉండదు. మిడిలార్డర్లో తేజల్ హసబి్నస్, హర్లిన్ డియోల్ జట్టును నడిపించగలరు. బౌలింగ్‌లో దీప్తిశర్మ, రేణుక సింగ్, సైమా ఠాకూర్లు ప్రభావం చూపిస్తున్నారు. యువ పేసర్ టైటస్ సాధు ఫీల్డింగ్‌లో కనిపించే చురుకుదనం ప్రత్యర్థి పరుగుల్ని నిరోధిస్తోంది. మరోవైపు ప్రత్యర్థి వెస్టిండీస్ దెబ్బతిన్న పులిలా ఉంది. టి20ల్లో కోల్పోయిన సిరీస్‌ను వన్డేల్లో రాబట్టుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. కెపె్టన్ హేలీ మాథ్యూస్ వెటరన్ బ్యాటర్స్ డియాండ్రా డాటిన్, షెమైన్ క్యాంప్‌బెల్ నిలకడగా ఆడితే భారత్‌కు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో హెన్రీ, ఫ్లెచర్, కరిష్మా రమ్హారక్, జైదా జేమ్స్ ప్రభావం చూపగలరు. తుది జట్లు (అంచనా) భారత్ మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ఉమా ఛెత్రి, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, హర్లిన్ డియోల్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, రేణుక, సైమా ఠాకూర్, మిన్ను మణి. వెస్టిండీస్ మహిళల జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), క్వియానా జోసెఫ్, డియాండ్రా, షెమైన్ క్యాంప్‌బెల్, నెరిసా క్రాఫ్టన్, హెన్రీ, ఆలియా అలిన్, అఫీ ఫ్లెచర్, షబిక, జైదా జేమ్స్, కరిష్మా. -
Ind Vs Aus ODI: ఈసారైనా...!.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌లు నెగ్గిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియాలో మాత్రం ఇప్పటి వరకు నిరాశే మిగిలింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడేందుకు ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో అందని ద్రాక్షగా ఉన్న ఆ్రస్టేలియాలో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు భారత జట్టుకు మరో అవకాశం లభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య ఈరోజు తొలి వన్డే జరగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ సన్నాహాలు ఈ సిరీస్ నుంచే భారత్ మొదలుపెట్టనుంది. బ్రిస్బేన్: ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా తొలి వన్డే జరగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ సిరీస్ టీమిండియాకు కీలకం కానుండగా... మరోవైపు సొంతగడ్డపై ఆసీస్ జట్టు ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది. భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్, దీప్తి శర్మలతో జట్టు బలంగానే ఉన్నా... వీరంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య 16 వన్డేలు జరగగా... అందులో భారత జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. 2021లో చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన మన జట్టు 1–2తో సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే భారత జట్టు శక్తికి మించి పోరాడాల్సిన అవసరముంది. 2025లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో... దానికి ముందు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ ఆడుతున్నామరోవైపు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో తహిలా మెక్‌గ్రాత్ జట్టుకు సారథ్యం వహించనుంది. ‘భారత జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వారిపై పైచేయి సాధించడం అంత సులువు కాదు. స్వదేశంలో ఆడుతుండటంతో మాపై అంచనాలు ఎక్కువ ఉంటాయి. నేను పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ ఆడుతున్నా. ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తా’ అని తహిలా పేర్కొంది.రాధ యాదవ్‌పై భారీ అంచనాలుఇటీవల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చడంతో హర్మన్‌ను కెప్టెన్‌గా తప్పించాలనే వాదనలు ఎక్కువైనా... మేనేజ్మెంట్ ఆమె సారథ్యంపై నమ్మకముంచింది. మరి స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో హర్మన్ తన సత్తా చాటాల్సిన అవసరముంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న రాధ యాదవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, దీప్తి శర్మ కీలకం కానున్నారు. ఆసీస్ జట్టులో స్టార్లకు కొదవలేకపోగా... మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆటకు పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు.షఫాలీ వర్మ చాలా ముఖ్యమైన ప్లేయర్. జాతీయ జట్టు తరఫున షఫాలీ ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడింది. తిరిగి పుంజుకొని జట్టులోకి వస్తుందని నమ్మకముంది. ప్రత్యర్థి ఎవరైనా విజయం సాధించాలనే తపనతోనే మైదానంలో అడుగు పెడతాం. వన్డేల్లో మా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. దాన్నే ఇక్కడ కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం.ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టు కూర్పుపై కసరత్తు చేస్తాం. స్వదేశంలో న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం సాధించాం. ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటి కోసం సిద్ధంగా ఉన్నాం. – హర్మన్‌ప్రీత్ కౌర్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ 10 భారత్, ఆ్రస్టేలియా మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 53 వన్డేలు జరిగాయి. ఇందులో భారత జట్టు 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.9 భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు జరిగాయి. తొమ్మిది సిరీస్‌లలోనూ ఆ్రస్టేలియానే గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు నాలుగు వన్డే సిరీస్‌లు ఆడి నాలుగింటిలోనూ ఓటమి పాలైంది. -
9 ఏళ్ల తర్వాత...
బులవాయో: పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిలో 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాకిస్తాన్‌పై తొమ్మిదేళ్ల తర్వాత వన్డే మ్యచ్‌లో జింబాబ్వే విజయాన్ని అందుకుంది. చివరిసారి జింబాబ్వే 2015లో పాక్‌ను ఓడించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (39 పరుగులు; 7 పరుగులకు 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి జింబాబ్వే గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఎన్‌గరావా ((52 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సికందర్ రజా (56 బంతుల్లో 39; 6 ఫోర్లు), మరుమని (29; 2 ఫోర్లు, 1 సిక్స్), సీన్ విలియమ్స్ (23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ ఆఘా (3/42), ఫైజల్ అక్రమ్ (3/24) ఆకట్టుకున్నారు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 21 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. అప్పటికి ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం విజయసమీకరణానికి పాక్ 80 పరుగులు వెనుకబడి ఉంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సీన్ విలియమ్స్, సికందర్ రజా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. -
హర్మన్‌ప్రీత్‌కు పరీక్ష!
అహ్మదాబాద్: ఇటీవల మహిళల టి20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు మరో పరీక్షకు సిద్ధమైంది. తాజా టి20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తలపడనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ ట్రోఫీ కోసం చకోర పక్షిలా చూస్తున్న భారత మహిళల జట్టుకు తాజా టి20 ప్రపంచకప్‌లో చుక్కెదురైంది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడటం ఖాయమే అని అంతా భావించినా... సెలక్షన్ కమిటీ మాత్రం హర్మన్‌పై నమ్మకముంచింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు హర్మన్‌కే పగ్గాలు అప్పగించింది. మరి అందరికంటే అనుభవజు్ఞరాలైన హర్మన్‌ప్రీత్ జట్టును ఎలా నడిపిస్తుందో చూడాలి. 12వ తరగతి పరీక్షల కారణంగా రిచా ఘోష్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోగా.. ఆశ శోభన గాయంతో జట్టుకు దూరమైంది. దీంతో నలుగురు యువ ఆటగాళ్లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ‘ఎ’ జట్టు ప్లేయర్లు తేజల్, సయాలీ, ప్రియా మిశ్రాతో పాటు డబ్ల్యూపీఎల్‌లో రాణించిన సైమా ఠాకూర్ మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. టి20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన 35 ఏళ్ల హర్మన్‌పై ఒత్తిడి అధికంగా ఉండగా... స్మృతి మంధాన, షఫాలీ వర్మ మెరుగైన ఆరంభాలు ఇవ్వాల్సిన అవసరముంది. మిడిలార్డర్లో హర్మన్‌తో పాటు జెమీమా, హేమలత, దీప్తి కీలకం కానున్నారు. మరోవైపు సోఫీ డివైన్ సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచి ఉత్సాహంగా ఉన్న న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 20 భారత్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 20 వన్డేలు జరిగాయి. 10 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. 9 తొమ్మిది సంవత్సరాల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. చివరిసారి 2015లో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు 3–2తో సొంతం చేసుకుంది.54 ఓవరాల్‌గా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 54 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. 20 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా... 33 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
శ్రీలంక 230... భారత్ 230
కొలంబో: శ్రీలంక చేసిన స్కోరు 230/8. ఇదేమంత పెద్ద లక్ష్యమేం కాదు... సులువైందే కానీ కష్టం, అసాధ్యం కానేకాదు. కానీ పిచ్ స్పిన్‌కు దాసోహమైంది. ఇది ఆతిథ్య బౌలర్లకు కలిసొచ్చింది. టి20 సిరీస్‌లో తేలిపోయిన లంకేయులు... తొలి వన్డేలో మాత్రం పట్టు సడలించకుండా పోరాడారు. ఫలితం ‘టై’ అయినప్పటికీ రోహిత్, కోహ్లిలు ఉన్న పటిష్ట జట్టును శ్రీలంక సమష్టిగా నిలువరించింది. దీంతో భారత్ 11 బంతులున్నా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. మొదట శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దునిత్ వెలలగే (65 బంతుల్లో 67 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), పతున్ నిసాంక (75 బంతుల్లో 56; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగుల వద్ద ఆలౌటైంది. కెపె్టన్, ఓపెనర్ రోహిత్ శర్మ (47 బంతుల్లో 58; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే అదరగొట్టాడు. అక్షర్ పటేల్ (57 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 31; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఆదుకున్న వెలలగే ఆరంభంలోనే ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (1)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత మరో ఓపెనర్ నిసాంక, కుశాల్ మెండిస్ (14) కుదురుగా ఆడటంతో రెండో వికెట్‌కు 39 పరుగులు జతయ్యాయి. తర్వాత స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. కుశాల్, సమరవిక్రమ (8) వికెట్లను పారేసుకోవడంతో 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత కెప్టెన్ అసలంక (14), నిసాంక వికెట్లను కాపాడుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. 91 పరుగుల వద్ద అసలంక, 67 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాక నిసాంక కూడా అవుటవడంతో లంక జట్టు 101 పరుగుల వద్ద సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో లియనాగే (26 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), దునిత్ వెలలగే వికెట్ల పతనానికి కాసేపు బ్రేక్ వేయడంతో ఆరో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం జతయ్యింది. మరింత బలపడకముందే ఈ జోడీని అక్షర్ విడగొట్టాడు. హసరంగ (24; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ధనంజయ (17)లతో కలిసి దునిత్ జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకెళ్లాడు. రాణించిన రోహిత్ సులువైన లక్ష్యానికి సరైన శుభారంభాన్ని ఓపెనర్లు రోహిత్, శుబ్‌మన్ గిల్ (16) ఇచ్చారు. కెపె్టన్ రోహిత్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగాడు. 5.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. పదో ఓవర్ పూర్తయ్యేసరికి భారత్ 71/0 స్కోరు చేసింది. తర్వాత 11వ ఓవర్ నుంచి లంక బౌలర్ల ప్రతాపం మొదలైంది. పరుగుల రాక గగనమైంది. ఈ ఐదు ఓవర్లలో కేవలం 15 పరుగులే చేసిన భారత్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. తదనంతరం సుందర్ (5) అవుటయ్యాడు. 12 పరుగుల వ్యవధిలోనే ఈ మూడు వికెట్లు కూలడంతో భారత్ 87/3 స్కోరు చేసింది. ఈ దశలో కోహ్లి (24; 2 ఫోర్లు), అయ్యర్ (23; 4 ఫోర్లు) నింపాదిగా ఆడి జట్టు స్కోరును వంద దాటించారు. నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాక కోహ్లిని హసరంగా ఎల్బీగా పంపగా, కాసేపటికే, బుల్లెట్‌లాంటి బంతితో ఫెర్నాండో అయ్యర్‌ను బౌల్డ్ చేయడంతో 132/5 స్కోరు వద్ద భారత్ కష్టాల్లో పడింది. తర్వాత రాహుల్, అక్షర్ మెరుగ్గా ఆడినా, దూబే (25; 1 ఫోర్, 2 సిక్స్‌లు) సిక్స్‌లు, ఫోర్‌తో గెలుపు మెట్టుపై నిలబెట్టినా... కెప్టెన్ అసలంక వేసిన 48వ ఓవర్లో దూబే, అర్‡్షదీప్ అవుటవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.2 భారత్, శ్రీలంక జట్ల మధ్య ‘టై’ అయిన మ్యాచ్‌లు. ఈ రెండు జట్ల మధ్య 2012లో హోబర్ట్ వేదికగా జరిగిన ముక్కోణపు టోర్నీ మ్యాచ్ తొలిసారి ‘టై’గా ముగిసింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 169 వన్డేల్లో తలపడ్డాయి. 99 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 57 మ్యాచ్‌ల్లో లంక గెలిచింది. 11 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సూపర్ ఓవర్ ఉండదా? ఐసీసీ నిబంధనల ప్రకారం ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో సూపర్ ఓవర్‌కు అవకాశం లేదు. రెండు కంటే ఎక్కువ జట్లు అనగా, ఆసియా కప్, ముక్కోణపు సిరీస్, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఫలితం కోసం ‘సూపర్ ఓవర్’ను అనుమతిస్తారు.స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 56; అవిష్క (సి) అర్‡్షదీప్ (బి) సిరాజ్ 1; కుశాల్ మెండిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దూబే 14; సమరవిక్రమ (సి) గిల్ (బి) అక్షర్ 8; అసలంక (సి) రోహిత్ (బి) కుల్దీప్ 14; జనిత్ (సి) రోహిత్ (బి) అక్షర్ 20; వెలలగే (నాటౌట్) 67; హసరంగ (సి) అక్షర్ (బి) అర్‡్షదీప్ 24; ధనంజయ (సి) సుందర్ (బి) అర్‡్షదీప్ 17; షిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–7, 2–46, 3–60, 4–91, 5–101, 6–142, 7–178, 8–224. బౌలింగ్: సిరాజ్ 8–2–36–1, అర్‡్షదీప్ 8–0–47–2, అక్షర్ 10–0–33–2, దూబే 4–0–19–1, కుల్దీప్ 10–0–33–1, సుందర్ 9–1–46–1, గిల్ 1–0–14–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 58; గిల్ (సి) కుశాల్ మెండిస్ (బి) వెలలగే 16; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) హసరంగ 24; సుందర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ధనంజయ 5; అయ్యర్ (బి) అసిత ఫెర్నాండో 23; రాహుల్ (సి) వెలలగే (బి) హసరంగ 31; అక్షర్ (సి) కుశాల్ మెండిస్ (బి) అసలంక 33; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 25; కుల్దీప్ (బి) హసరంగ 2; సిరాజ్ (నాటౌట్) 5; అర్‡్షదీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 230. వికెట్ల పతనం: 1–75, 2–80, 3–87, 4–130, 5–132, 6–189, 7–197, 8–211, 9–230, 10–230. బౌలింగ్: అసిత ఫెర్నాండో 6–1–34–1, షిరాజ్ 4–0–25–0, వెలలగే 9–1–39–2, ధనంజయ 10–0–40–1, హసరంగ 10–0–58–3, అసలంక 8.5–0–30–3. -
ఇక వన్డే సమరం
కొలంబో: ఓ పరిమిత ఓవర్ల సమరాన్ని వైట్‌వాష్ చేసిన భారత జట్టు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మరో ఫార్మాట్‌నూ క్లీన్‌స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. ఆతిథ్య శ్రీలంకతో శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభమవుతోంది. పొట్టి ఫార్మాట్లో సూర్యకుమార్, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కాంబినేషన్ విజయవంతమైంది. ఇప్పుడు రోహిత్–గంభీర్ల వంతు వచ్చి0ది. తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయడం ద్వారా సిరీస్‌పై పట్టుసాధించాలని టీమిండియా భావిస్తోంది. టి20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్, కోహ్లి ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. వీరిద్దరి రాకతో పెరిగిన బ్యాటింగ్ బలం భారత జైత్రయాత్రకు కచ్చితంగా దోహదం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు సొంతగడ్డపై మూడు టి20ల్లో ఓడిన శ్రీలంక జట్టు కనీసం వన్డే ఫార్మాట్లోనైనా పుంజుకోవాలని ఆశిస్తోంది. మారిన ఫార్మాట్లో ఓటమి రాతను మార్చుకోవాలని గంపెడాశలతో బరిలోకి దిగుతోంది. రోహిత్, కోహ్లి చేరడంతో... భారత టాప్స్టార్లు రోహిత్ శర్మ, కోహ్లిలు లేని భారత జట్టు టి20 ఫార్మాట్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి పోరు అయితే హైలైట్! ఓటమి కోరల్లోంచి సూపర్ విజయం దాకా సూర్యకుమార్ సేన పోరాటం ఆకట్టుకుంది. అలాంటి జట్టుకు ఇప్పుడు రోహిత్, కోహ్లిలు కలవడంతో బ్యాటింగ్ దుర్బేధ్యంగా మారింది. దీంతో 20 ఓవర్లకే ఆపసోపాలు పడిన లంక బౌలర్లకు వన్డేల్లో మరింత కష్టాలు తప్పవేమో! హార్దిక్, సూర్య వన్డే జట్టులో లేకపోవడంతో హిట్టర్లు దూబే, పరాగ్‌కు లక్కీ చాన్స్ కానుంది. మూడు వన్డేల్లో వీరిలో ఎవరికి ఎక్కువ అవకాశాలొస్తాయో చూడాలి. భారత్ ఇద్దరు స్పిన్నర్లు అక్షర్, కుల్దీప్లతో పాటు ముగ్గురు పేసర్ల తో బరిలోకి దిగాలనుకుంటే ఖలీల్ అహ్మద్ లేదంటే హర్షిత్ రాణాల్లో ఒకరు సిరాజ్, అర్ష్‌దీప్‌లతో బంతిని పంచుకుంటారు. అయ్యో... కష్టాల లంక! టి20 ఫార్మాట్లో చేతులెత్తేసిన శ్రీలంక ఇప్పుడు వన్డేల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత సిరీస్ ఫలితాన్ని పక్కనబెట్టి కొత్త ఫార్మాట్‌ను తాజాగా ఆరంభించాలనుకుంటుంది. ఓపెనర్లు నిసాంక, కుశాల్ మెండీస్ ఫామ్‌లో ఉన్నప్పటికీ... తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చేవారిలో కెప్టెన్ చరిత్ అసలంక సహా ఎవరికి నిలకడే లేదు. ఇదే లంక బ్యాటింగ్ దళానికి శాపంగా మారింది. ఇప్పుడున్న కష్టాలు చాలవన్నట్లు వన్డేలకు ముందు గాయాల బెడద లంకను పీడిస్తోంది. 50 ఓవర్ల మ్యాచ్‌లకు కీలకమైన పేసర్లు పతిరణ, మదుషంక గాయాల కారణంగా దూరమయ్యారు. ఆఖరి టి20లో క్యాచ్ కోసం డైవ్ చేసిన పతిరణ కుడి మోచేతికి గాయమైంది. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో మదుషంక ఎడమకాలి తొడ కండరాలు పట్టేయడంతో ఇద్దరు మొత్తం వన్డే సిరీస్‌కే అందుబాటులో లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను ఎదుర్కోవడమంటే ఏటికి ఎదురీదడమే తప్ప ఏమాత్రం సులువు కానేకాదు. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. భారీస్కోరు ఆశించొచ్చు. అలాగే స్పిన్నర్లకు తిప్పేసే చాన్స్ ఉంది. కానీ మ్యాచ్‌కు శుక్రవారం వానముప్పు ఉంది. రోజంతా భారీవర్షం కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్/పంత్, దూబే/ పరాగ్, కుల్దీప్, అక్షర్, సిరాజ్, అర్‡్షదీప్, హర్షిత్. శ్రీలంక: అసలంక (కెప్టెన్ ), నిసాంక, కుశాల్ మెండీస్, సమరవిక్రమ, కమిండు, జనిత్, కురణరత్నే, హసరంగ, తీక్షణ, షిరాజ్/ఇషాన్ మలింగ, ఫెర్నాండో. -
పరాజయంతో ప్రారంభం
ముంబై: ఈసారైనా ఆ్రస్టేలియాపై వన్డే సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత మహిళల జట్టుకు శుభారంభం లభించలేదు. వరల్డ్ చాంపియన్ ఆ్రస్టేలియా జట్టుతో గురువారం వాంఖెడె స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్ నాయకత్వంలోని భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (77 బంతుల్లో 82; 7 ఫోర్లు), పూజ వస్త్రకర్ (46 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... ఓపెనర్ యస్తిక భాటియా (64 బంతుల్లో 49; 7 ఫోర్లు) రాణించింది. అస్వస్థత కారణంగా భారత వైస్ కెపె్టన్, ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అనంతరం ఆ్రస్టేలియా జట్టు 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ అలీసా హీలీ (0) ఖాతా తెరవకుండానే అవుటైనా... ఫోబి లిచ్‌ఫీల్డ్ (89 బంతుల్లో 78; 8 ఫోర్లు, 1 సిక్స్), ఎలీసా పెరీ (72 బంతుల్లో 75; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక తాలియా మెక్‌గ్రాత్ (55 బంతుల్లో 68 నాటౌట్; 11 ఫోర్లు), బెత్ మూనీ (47 బంతుల్లో 42; 4 ఫోర్లు) దూకుడుగా ఆడి ఆసీస్ విజయాన్ని ఖరారు చేశారు. భారత బౌలర్లలో రేణుక, పూజ, స్నేహ్ రాణా, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు. రెండో వన్డే శనివారం ఇదే వేదికపై జరుగుతుంది. -
IND VS SA 1st ODI: అరంగేట్రంలోనే అదరగొట్టిన సాయి సుదర్శన్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తమిళనాడు యువ ఆటగాడు సాయి సుదర్శన్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సుదర్శన్.. 43 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీతో రాణించిన సాయి.. రాబిన్ ఉతప్ప (2006లో ఇంగ్లండ్‌పై 86 పరుగులు), కేఎల్ రాహుల్ (2016లో జింబాబ్వేపై 100 నాటౌట్), ఫయాజ్ ఫజల్ (2016లో జింబాబ్వేపై 55 నాటౌట్) తర్వాత అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో భారత ఓపెనర్‌గా.. వన్డే డెబ్యూలో 50 ప్లస్ స్కోర్ సాధించిన 17వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 22 ఏళ్ల సాయి సుదర్శన్ 2022 సీజన్‌తో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించాడు. రెండు సీజన్లలో 13 మ్యాచ్‌లు ఆడిన సాయి.. 4 అర్దసెంచరీల సాయంతో 46.09 సగటున 507 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అర్ష్‌దీప్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్ 19న జరుగనుంది. -
ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాలేదు.. కేఎల్ రాహుల్ సాధించాడు..!
సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఇవాళ (డిసెంబర్ 17) జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించడం ద్వారా సౌతాఫ్రికాలో పింక్ వన్డే (సౌతాఫ్రికా ఆటగాళ్లు పింక్ కలర్ జెర్సీలతో ఆడే మ్యాచ్‌లు) గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఏ భారత కెప్టెన్ సౌతాఫ్రికాలో పింక్ వన్డే గెలవలేదు. అసలేంటీ పింక్ వన్డే.. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన, ఫండ్ రైజింగ్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఏ) ప్రతి ఏటా వన్డే క్రికెట్ మ్యాచ్‌లను పింక్ కలర్ జెర్సీల్లో ప్లాన్ చేస్తుంది. ఈ మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా పింక్ కలర్ జెర్సీలు ధరిస్తారు. సౌతాఫ్రికా ఆటగాళ్లు పింక్ కలర్ జెర్సీలు ధరించి ఆడే మ్యాచ్‌ను పింక్డే వన్డే అని పిలుస్తుంటారు. ఈ మ్యాచ్ ద్వారా లభించే మొత్తంలో కొంత భాగాన్ని సీఏ రొమ్ము క్యాన్సర్ బాధితుల కోసం ఖర్చు చేస్తుంది. పింక్ వన్డే తొలిసారి 2013లో జరిగింది. నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 34 పరుగుల తేడాతో మట్టికరిపించింది. నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 12 పింక్ వన్డేలు జరగగా.. సౌతాఫ్రికా 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2015లో వెస్టిండీస్‌తో జరిగిన పింక్ వన్డేలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో) నమోదు చేశాడు. పింక్ వన్డేల్లో పాకిస్తాన్ (2019), ఇంగ్లండ్ (2020), భారత్ (2023) మాత్రమే సౌతాఫ్రికాను ఓడించాయి. మ్యాచ్ విషయానికొస్తే.. అర్ష్‌దీప్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్ 19న జరుగనుంది. -
116 పరుగులకు ఆలౌట్.. సౌతాఫ్రికా చెత్త రికార్డులు
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో చిత్తుగా ఓడటం ద్వారా సౌతాఫ్రికా రెండు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. సొంతగడ్డపై అత్యల్ప స్కోర్.. ఈ మ్యాచ్‌లో కేవలం 116 పరుగులకే కుప్పకూలడం ద్వారా సౌతాఫ్రికా సొంతగడ్డపై ఏ దేశంపై అయినా వన్డేల్లో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. దీనికి ముందు 2018లో సెంచూరియన్‌లో చేసిన 119 పరుగులు ఆ జట్టుకు హోం గ్రౌండ్లో అత్యల్ప స్కోర్‌గా ఉండింది. బంతుల పరంగా రెండో అతి పెద్ద ఓటమి.. సౌతాఫ్రికా నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్.. మరో 200 బంతులు మిగిలుండగానే ఛేదించింది. బంతుల పరంగా సౌతాఫ్రికాకు ఇది రెండో అతి పెద్ద ఓటమిగా నిలిచింది. 2008లో నాటింగ్హమ్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమి బంతుల పరంగా సౌతాఫ్రికాకు అతి భారీ ఓటమిగా రికార్డైంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మరో 215 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ విషయానికొస్తే.. అర్ష్‌దీప్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రుతురాజ్ (5) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్ 19న జరుగనుంది. -
IND VS SA 1st ODI: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్
టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జొహనెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల ఘనతతో (10-0-37-5) విజృంభించిన ఈ పంజాబీ యువ పేసర్.. వన్డేల్లో దక్షిణాఫ్రికాపై ఆ దేశంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అర్ష్‌దీప్‌కు ముందు సౌతాఫ్రికాపై పలువురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం. 1999లో సునీల్ జోషి (5/6), 2018లో చహల్ (5/22), 2023లో రవీంద్ర జడేజా (5/33) సౌతాఫ్రికాపై ఐదు వికెట్ల ఘనత సాధించారు. వీరిలోనూ చహల్ ఒక్కడే సౌతాఫ్రికాపై ఆ దేశంలో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అర్ష్‌దీప్‌తో పాటు మరో పేసర్ ఆవేశ్ ఖాన్ (8-3-27-4) కూడా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత పేస్ విభాగం గతంలో ఎన్నడూ లేని విధంగా 9 వికెట్లు పడగొట్టింది. 1993 మొహాలీలో, 2013 సెంచూరియన్‌లో జరిగిన వన్డేల్లో టీమిండియా పేసర్లు 8 వికెట్లు పడగొట్టగా.. తాజాగా అర్ష్‌దీప్, ఆవేశ్ ఖాన్ ఆ రికార్డులను అధిగమించి, నయా రికార్డు నెలకొల్పారు. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రుతురాజ్ (5) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్‌ను గెలిపించారు. టీమిండియా కేవలం 16.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
IND VS SA 1st ODI: సౌతాఫ్రికాపై టీమిండియా పేసర్ల చరిత్ర
దక్షిణాఫ్రికాపై టీమిండియా పేసర్లు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత పేసర్లు ఓ మ్యాచ్‌లో (వన్డే) అత్యధికంగా 9 వికెట్లు పడగొట్టారు. 1993 మొహాలీలో, 2013 సెంచూరియన్‌లో జరిగిన వన్డేల్లో టీమిండియా పేస్ గన్స్ 8 వికెట్లు పడగొట్టగా.. తాజాగా భారత పేస్ ద్వయం అర్ష్‌దీప్ సింగ్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) ఆ రికార్డులను అధిగమించి, నయా రికార్డు నెలకొల్పింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ఈ రికార్డు నెలకొల్పారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత పేస్ ద్వయం అర్ష్‌దీప్, ఆవేశ్ ఖాన్ నిప్పులు చెరగడంతో 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్‌కు ఓ వికెట్ దక్కింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జి (28), ఫెహ్లుక్వాయో (33), మార్క్రమ్ (12), తబ్రేజ్ షంషి (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన భారత్.. ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 9 ఓవర్ల తర్వాత భారత్ రుతురాజ్ (5) వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే మరో 62 పరుగులు చేయాలి. రుతురాజ్ వికెట్ ముల్దర్‌కు దక్కింది. -
WI VS ENG 1st ODI: శతక్కొట్టిన హోప్.. విండీస్ రికార్డు విజయం
వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తమ రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ 326 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. వన్డే క్రికెట్లో విండీస్ అత్యుత్తమ లక్ష్యఛేదన రికార్డు 328 పరుగులుగా ఉంది. 2019లో ఐర్లాండ్‌పై విండీస్ ఈ ఫీట్‌ను (47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయిన విండీస్‌కు తదనంతరం దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రాణించిన బ్రూక్.. మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్‌తో (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును దాటగలిగింది. బ్రూక్‌తో పాటు ఫిలిప్ సాల్ట్ (45), జాక్ క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్ (3) నిరాశపరిచాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, గుడకేశ్ మోటీ, ఒషేన్ థామస్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, యానిక్ కారియా చెరో వికెట్ దక్కించుకున్నారు. శతక్కొట్టిన హోప్.. 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. షాయ్ హోప్ శతక్కొట్టడంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) 48.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హోప్‌తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49) రాణించగా.. బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్‌మైర్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్, లివింగ్‌స్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్లు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్‌తో పాటు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
తొలి వన్డే భారత్‌దే
మొహాలీ: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించినా చివరకు ఎలాంటి ఉత్కంఠకు అవకాశం ఇవ్వకుండా ప్రశాంతంగా టీమిండియా ఆట ముగించింది. శుక్రవారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ గెలుపుతో భారత్ ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ప్రస్తుతం భారత్ మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టి20) టాప్ ర్యాంక్‌లో ఉండటం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా సరిగ్గా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ (53 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... ఇన్‌గ్లిస్ (45 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మిత్ (60 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్), లబుõÙన్ (49 బంతుల్లో 39; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రెండో వికెట్‌కు వార్నర్, స్మిత్ 17.4 ఓవర్లలో 94 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (5/51) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో 5 వికెట్లకు 281 పరుగులు సాధించింది. భారత్ తరఫున నలుగురు బ్యాటర్లు శుబ్‌మన్ గిల్ (63 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 71; 10 ఫోర్లు), కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఓపెనర్లు రుతురాజ్, గిల్ 21.4 ఓవర్లలో తొలి వికెట్‌కు 142 పరుగులు జత చేశారు. అయితే 9 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోగా, ఇషాన్ (18) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో రాహుల్, సూర్య ఐదో వికెట్‌కు 14.1 ఓవర్లలో 80 పరుగులు జత చేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. విజయానికి 12 పరుగుల దూరంలో సూర్య వెనుదిరిగినా... రాహుల్ చివరి వరకు నిలిచాడు. అబాట్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగా జట్టు విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో భారత మేనేజ్మెంట్ పేసర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చింది. నియంత్రణతో కూడిన బౌలింగ్ ప్రదర్శనతో అశ్విన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా... అర్ధ సెంచరీతో సూర్య ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూలాంశం. ఆదివారం ఇండోర్‌లో రెండో వన్డే జరుగుతుంది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మిచెల్ మార్‡్ష (సి) గిల్ (బి) షమీ 4; వార్నర్ (సి) గిల్ (బి) జడేజా 52; స్మిత్ (బి) షమీ 41; లబుõÙన్ (స్టంప్డ్) రాహుల్ (బి) అశి్వన్ 39; గ్రీన్ (రనౌట్) 31; ఇన్‌గ్లిస్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 45; స్టొయినిస్ (బి) షమీ 29; షార్ట్ (సి) సూర్య (బి) షమీ 2; కమిన్స్ (నాటౌట్) 21; అబాట్ (బి) షమీ 2; జంపా (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 276. వికెట్ల పతనం: 1–4, 2–98, 3–112, 4–157, 5–186, 6–248, 7–250, 8–254, 9–256, 10–276. బౌలింగ్: షమీ 10–1–51–5, బుమ్రా 10–2–43–1, శార్దుల్ ఠాకూర్ 10–0–78–0, అశ్విన్ 10–0–47–1, రవీంద్ర జడేజా 10–0–51–1. భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీ) (బి) జంపా 71; గిల్ (బి) జంపా 74; శ్రేయస్ అయ్యర్ (రనౌట్) 3; కేఎల్ రాహుల్ (నాటౌట్) 58; ఇషాన్ కిషన్ (సి) ఇన్‌గ్లిస్ (బి) కమిన్స్ 18; సూర్యకుమార్ (సి) మార్‡్ష (బి) అబాట్ 50; జడేజా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (48.4 ఓవర్లలో 5 వికెట్లకు) 281. వికెట్ల పతనం: 1–142, 2–148, 3–151, 4–185, 5–265. బౌలింగ్: కమిన్స్ 10–0–44–1, స్టొయినిస్ 5–0–40–0, అబాట్ 9.4–1–56–1, గ్రీన్ 6–0–44–0, షార్ట్ 8–0–39–0, జంపా 10–0–57–2. -
చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసిన శ్రేయస్ అయ్యర్.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై భారత క్రికెట్ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో అయ్యర్ సునాయాసమైన క్యాచ్‌ను జారవిడచడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ ఆఖరి బంతికి డేవిడ్ వార్నర్ అందించిన లడ్డూ లాంటి క్యాచ్‌ను అయ్యర్ నేలపాలు చేశాడు. Ohhh 😯😯😯 Catch dropped by Shreyas Iyer !!!#INDvAUS pic.twitter.com/pbzX3HpOM6 — Harsh Parmar (@HarshPa56785834) September 22, 2023 శార్దూల్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని డ్రైవ్ చేయబోయిన వార్నర్ బంతిని గాల్లోకి లేపాడు. ఆ సమయంలో మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ చేతుల్లోకి క్యాచ్ వెళ్లింది. అయితే దాన్ని ఒడిసిపట్టుకోవడంతో అయ్యర్ విఫలమయ్యాడు. గల్లీ క్రికెటర్లు సైతం సునాయాసంగా అందుకోగలిగిన క్యాచ్‌ను పట్టుకోవడంలో విఫలం కావడంతో అయ్యర్‌పై భారత క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. Shreyash Iyer drops a lolly catch of David warner😭 pic.twitter.com/qvaFYiWoSC — Pulkit🇮🇳 (@pulkit5Dx) September 22, 2023 సునాయాసమైన క్యాచ్‌ను జారవిడిచినందుకు వారు అయ్యర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం అయ్యర్ క్యాచ్ డ్రాప్‌పై స్పందించాడు. ఇలా క్యాచ్‌లు జారవిడుచుకుంటూ పోతే, ఈసారి మనం వరల్డ్‌కప్ సాధించినట్లే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా, అయ్యర్ క్యాచ్ డ్రాప్ చేసే సమయానికి 14 పరుగుల వద్ద ఉన్న వార్నర్, ఆతర్వాత గేర్ మార్చి బౌండరీలు, సిక్సర్లు బాది అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం అతను రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి 52 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ 45 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (4), వార్నర్, స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబూషేన్ (39), కెమరూన్ గ్రీన్ (31) ఔట్ కాగా.. ఇంగ్లిస్ (36), స్టోయినిస్ (21) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 2, అశ్విన్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. గ్రీన్ రనౌటయ్యాడు. -
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
Australia tour of India, 2023- India vs Australia, 1st ODI: భారత్ ఘన విజయం మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 277 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. కేఎల్ రాహుల్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లక్ష్యం దిశగా భారత్ టీమిండియా లక్ష్యం దిశగా సాగుతుంది. 45 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 253/4గా ఉంది. మరో 24 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. కేఎల్ రాహుల్ (44), సూర్యకుమార్ యాదవ్ (40) క్రీజ్‌లో ఉన్నారు. లక్ష్యానికి 54 పరుగుల దూరంలో ఉన్న భారత్ 40 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 223/4గా ఉంది. భారత్ లక్ష్యానికి మరో 54 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ (25), కేఎల్ రాహుల్ (29) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. ఇషాన్ ఔట్ 185 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (18) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా 92 పరుగుల దూరంలో ఉంది. మరో 17.3 ఓవర్లు మిగిలి ఉన్నాయి. రాహుల్ (16), సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. 25.3: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఆడం జంపా బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ బౌల్డ్(74). స్కోరు: 155/3 (25.5). రాహుల్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ రనౌట్ 148 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి శ్రేయస్ అయ్యర్ (3) రనౌటయ్యాడు. 23.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 148/2గా ఉంది. గిల్ (72), రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 142 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్‌లో రుతురాజ్ (71) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 147/1. గిల్ (71), శ్రేయస్ అయ్యర్ (3) క్రీజ్‌లో ఉన్నారు. కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వన్డే కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో రుతు ఈ మైలురాయిని చేరుకున్నాడు. 17.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 112/0. గిల్ (59), రుతురాజ్ (51) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ మాథ్యూ షార్ట్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్ కొట్టి శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో గిల్ ఈ మార్కును చేరుకున్నాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/0. గిల్ (53), రుతురాజ్ (40) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/0 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆచితూచి ఆడుతుంది. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 43/0గా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ (17), శుభ్‌మన్ గిల్ (25) క్రీజ్‌లో ఉన్నారు. ఐదేసిన షమీ.. ఆసీస్ 276 ఆలౌట్ టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమీ (5/51) ఐదు వికెట్లతో రెచ్చిపోవడంతో తొలి వన్డేలో ఆసీస్ 276 పరుగులకు ఆలౌటైంది. షమీకి ఇవి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (4), వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబూషేన్ (39), కెమరూన్ గ్రీన్ (31), ఇంగ్లిస్ (45), స్టోయినిస్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో కమిన్స్ (21 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజాలకు తలో వికెట్ దక్కాయి. ఐదేసిన షమీ ఈ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ (0) క్లీన్ బౌల్డయ్యాడు. షమీకి నాలుగో వికెట్ ఈ మ్యాచ్‌లో షమీ నాలుగో వికెట్ తీసుకున్నాడు. షమీ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో షార్ట్ (2) పెవిలియన్‌కు చేరాడు. 48.2 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 254/8. ఆసీస్ ఏడో వికెట్ డౌన్ 250 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఇంగ్లిస్ (45) ఔటయ్యాడు. షార్ట్ (1), కమిన్స్ క్రీజ్‌లో ఉన్నారు. మరో వికెట్ తీసిన షమీ.. డేంజరెస్ స్టోయినిస్ క్లీన్ బౌల్డ్ షమీ ఈ మ్యాచ్‌లో తన మూడో వికెట్‌ను పడగొట్టాడు. స్టోయినిస్‌ను (29) షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 46.4 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 248/6. ఇంగ్లిస్ (44), షార్ట్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. గ్రీన్ రనౌట్ 186 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. గ్రీన్ (31) రనౌటయ్యాడు. బుమ్రా,సూర్యకుమార్ యాదవ్‌లు కలిసి గ్రీన్‌ను ఔట్ చేశారు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 187/5. ఇంగ్లిస్ (14), స్టోయినిస్ క్రీజ్‌లో ఉన్నారు. వర్షం ముప్పు.. ఆటకు విరామం వర్షం కురిసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆకాశం మేఘావృతం కావడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్.. అశ్విన్‌కు వికెట్ 157 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన స్టంపింగ్ చేసి లబూషేన్ (39)ను ఔట్ చేశాడు. 32.4 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 157/4. గ్రీన్ (15), ఇంగ్లిస్ క్రీజ్‌లో ఉన్నారు. Mitchell Marsh ✅ Steven Smith ✅ Mohammed Shami is on fire against the Aussies! 🔥#INDvsAUS #CricketTwitter #SteveSmith pic.twitter.com/bsw6hwJuCe — OneCricket (@OneCricketApp) September 22, 2023 స్టీవ్ స్మిత్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ మహ్మద్ షమీ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ (60 బంతుల్లో 41; 3 ఫోర్లు, సిక్స్) క్లీన్ బౌల్డయ్యాడు. 22 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 114/3. లబూషేన్ (11), కెమరూన్ గ్రీన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 🫣🫣🫣 pic.twitter.com/mW4EH4c7O3 — Sitaraman (@Sitaraman112971) September 22, 2023 రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. వార్నర్ (52) ఔట్ 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వార్నర్ ఔటయ్యాడు. జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. వార్నర్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 20 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 107/2. స్టీవ్ స్మిత్ (39), లబూషేన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ ఎంతంటే..? 15 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 78/1గా ఉంది. వార్నర్ (48), స్టీవ్ స్మిత్ (21) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్ ధాటిగా ఆడుతున్నాడు. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోరు 42/1 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 42/1గా ఉంది. డేవిడ్ వార్నర్ (17), స్టీవ్ స్మిత్ (17) క్రీజ్‌లో ఉన్నారు. The sensational Shami for India! pic.twitter.com/2TzPgB7UjW — Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2023 తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ 0.4: మిచెల్ మార్ష్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి మార్ష్(4) అవుటయ్యాడు. స్మిత్, వార్నర్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 4-1 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా టాస్ గెలిచి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా. -
‘అసలు’కు ముందు ఆఖరి సమరం.. నేడు భారత్, ఆసీస్ తొలి వన్డే!
మొహాలి: ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌కు మరో 16 రోజుల సమయం ఉంది. కానీ దానికి ముందు తమ బలం తేల్చుకునేందుకు ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌తో సన్నద్ధమయ్యాయి. భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు వన్డేల పోరులో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ గెలిచిన ఉత్సాహంలో టీమిండియా బరిలోకి దిగుతుండగా, ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై ఆసీస్ సిరీస్ ఓడింది. భారత టాప్ ప్లేయర్లు ఈ సిరీస్ తొలి రెండు వన్డేల నుంచి విశ్రాంతి తీసుకోగా... మరోవైపు విశ్రాంతి తర్వాత కంగారూ జట్టు ప్రధాన ఆటగాళ్లు ఇప్పుడు బరిలోకి దిగుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో సిరీస్ ఆసక్తకరంగా సాగే అవకాశం ఉంది. ఆ ముగ్గురే కీలకం... భారత జట్టుకు సంబంధించి ఈ సిరీస్‌లో ముగ్గురి ఆటపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అక్షర్ పటేల్ గాయం నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టులో చోటు ఆశిస్తున్న అశి్వన్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. ఏడాదిన్నర తర్వాత అతను వన్డే టీమ్‌లోకి వచ్చాడు. పేరుకే గాయం నుంచి కోలుకున్నా శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్‌లో పూర్తి ఫిట్‌గా లేక మళ్లీ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను వరల్డ్‌కప్ టీమ్‌లో కొనసాగగలడా అనేందుకు ఈ సిరీసే సమాధానమిస్తుంది. ఆటతో పాటు ఫిట్నెస్ను కూడా శ్రేయస్ నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్ ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆసీస్ జట్టు కొన్నాళ్ల క్రితం భారత్‌లో పర్యటించినప్పుడు మూడు వన్డేల్లోనూ సూర్య మొదటి బంతికే అవుటయ్యాడు. ఇలాంటి స్థితిలో ఈ ముగ్గురు తమదైన రీతిలో సత్తా చాటాల్సి ఉంది. ఇతర ఆటగాళ్లలో గిల్, రాహుల్, ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉండగా, జడేజా బ్యాటింగ్ ఇంకా బలహీనంగానే ఉంది. ఆసియా ఫైనల్లో చెలరేగిన సిరాజ్ అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నాడు. అశ్విన్‌తో పోటీ పడుతున్న వాషింగ్టన్ సుందర్ బలమైన ప్రత్యర్థిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరం. కమిన్స్, స్మిత్ సిద్ధం... ఆ్రస్టేలియా జట్టు వన్డే కెపె్టన్‌గా ఎంపికై దాదాపు ఏడాది అవుతున్నా వేర్వేరు కారణాలతో కమిన్స్ రెండు మ్యాచ్‌లలోనే నాయకత్వం వహించాడు. గాయంతో ఇటీవలి దక్షిణాఫ్రికా టూర్‌కూ అతను దూరమయ్యాడు. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌లో మళ్లీ ఫామ్‌ను అందుకునేందుకు కమిన్స్ బరిలోకి దిగుతున్నాడు. అతనిలాగే స్టీవ్ స్మిత్ కూడా కొంత విరామం తర్వాత వచ్చాడు. భారత గడ్డపై చక్కటి రికార్డు ఉన్న స్మిత్ కెప్టెన్సీ లోనే ఆ జట్టు ఇక్కడ సిరీస్ కూడా గెలుచుకుంది. వార్నర్, మిచెల్ మార్ష్, లబుషేన్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. మిడిలార్డర్లో క్యారీ, గ్రీన్, స్టొయినిస్‌లాంటి ఆటగాళ్లు జట్టుకు పెద్ద బలం. మ్యాక్స్‌వెల్, స్టార్క్ ఈ మ్యాచ్ బరిలోకి దిగడం లేదు. భారత సంతతికి చెందిన స్పిన్నర్ తన్వీర్ సంఘాకు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. అనూహ్యంగా హెడ్ గాయపడటంతో టీమ్ ప్రణాళికల్లో కొంత మార్పు జరిగినా ఆ లోటు కనిపించకుండా ఆడగల సమర్థులు టీమ్‌లో ఉండటం ఆసీస్‌కు సానుకూలాంశం. 4 భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు ఓడిపోయింది. 67 స్వదేశంలో ఆ్రస్టేలియా జట్టుతో ఇప్పటి వరకు భారత్ 67 మ్యాచ్‌లు ఆడింది. 30 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. 32 మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా విజయం సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. పిచ్, వాతావరణం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. అయితే ఇక్కడ నాలుగేళ్లుగా వన్డే జరగలేదు. కానీ ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. -
వరుణుడి ఖాతాలో మరో మ్యాచ్
గత రెండు, మూడు వారాల్లో చాలావరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు వర్షాల కారణంగా రద్దైన విషయం విధితమే. వర్షకాలంలో ఇది సాధారణమైన విషయమే అయినప్పటికీ.. పలు కీలక మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. తాజాగా మరో మ్యాచ్ కూడా వరుణుడి ఖాతాలోకి చేరింది. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు, ప్రారంభమయ్యాక 5వ ఓవర్లో వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడిన న్యూజిలాండ్ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. 5వ ఓవర్ తర్వాత మ్యాచ్ మరో 28 ఓవర్ల పాటు సజావుగా సాగింది. ఇన్నింగ్స్ 34వ ఓవర్ జరుగుతున్న సమయంలో వర్షం మళ్లీ మొదలై ఆటకు ఆటంకం కలిగించింది. అప్పటికి న్యూజిలాండ్ స్కోర్ 33.4 ఓవర్లలో 136/5గా ఉంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టామ్ బ్లండెల్ (8), కోల్ మెక్కొంచీ (8) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (58), హెన్రీ నికోల్స్ (44) రాణించగా.. ఫిన్ అలెన్ (9), చాడ్ బోవ్స్ (1), రచిన్ రవీంద్ర (0) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నసుమ్ అహ్మద్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా సెప్టెంబర్ 23న జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం బంగ్లా, న్యూజిలాండ్ జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు చేరుకుంటాయి. వర్షం కారణంగా నిన్న, ఇవాళ రద్దైన మ్యాచ్‌లు.. ఇంగ్లండ్ వర్సెస్ ఐర్లాండ్ తొలి వన్డే ఏషియాన్ గేమ్స్ 2023 మహిళల క్రికెట్లో భారత్, పాక్ మ్యాచ్‌లు బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే -
ఆసీస్‌తో తొలి వన్డే.. టీమిండియాను ఊరిస్తున్న అరుదైన రికార్డు
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా ఆసీస్‌తో రేపు (సెప్టెంబర్ 22) జరుగబోయే తొలి వన్డేకు ముందు టీమిండియాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. రేపటి మ్యాచ్‌లో భారత్.. ఆసీస్‌ను ఓడిస్తే, వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకడంతో పాటు ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండో జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుతుంది. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్.. రేపటి మ్యాచ్‌లో గెలిస్తే అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా అరుదైన గుర్తింపు దక్కించుకుంటుంది. గతంలో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన ఏకైక జట్టుగా దక్షిణాఫ్రికా పేరిట రికార్డు ఉంది. సఫారీ టీమ్ 2014లో హషీమ్ ఆమ్లా నేతృత్వంలో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలిచింది. అప్పట్లో దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్, జాక్ కల్లిస్, గ్రేమ్ స్మిత్, మోర్నీ మోర్కెల్, మఖాయ ఎన్తిని, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి హేమాహేమీలు ఉండేవారు. సౌతాఫ్రికా తర్వాత ఆ ఘనతను భారత్ సాధించిందని ఈ ఏడాది ఆరంభంలో ప్రచారం జరిగినప్పటికీ.. అది ఐసీసీ వెబ్సైట్లో సాంకేతిక లోపం కారణంగానే జరిగిందని తేలడంతో టీమిండియా అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే ఆ అవకాశం భారత్‌కు మళ్లీ ఇప్పుడు వచ్చింది. రేపటి మ్యాచ్‌లో గెలిస్తే సౌతాఫ్రికా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కుతుంది. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు.. రేపటి మ్యాచ్‌లో పటిష్టమైన ఆసీస్‌ను ఎలాగైనా మట్టికరిపించాలని ఉవ్విళ్లూరుతుంది. ఆసీస్ స్టార్ ఆటగాళ్ల గాయాల బెడద ఈ విషయంలో భారత్‌కు తోడ్పడేలా ఉంది. ఆసీస్ కీలక ప్లేయర్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయాల కారణంగా రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆసీస్‌ను దెబ్బకొట్టేందుకు భారత్‌కు ఇదే సరైన సమయం. మరోవైపు భారత్ సైతం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతుంది. వరల్డ్‌కప్‌కు ముందు ఎక్కువగా ఎక్స్పోజ్ కాకూడదనే ఉద్దేశంతో భారత సెలక్టర్లు రోహిత్, కోహ్లి సహా పలువురు స్టార్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. వీరంతా మూడో వన్డేలో జట్టుతో కలుస్తారు. టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు
మొహాలీ వేదికగా టీమిండియాతో రేపు (సెప్టెంబర్ 22) జరుగబోయే తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయాల కారణంగా తొలి వన్డేకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కొద్దిసేపటి కిందట నిర్ధారించారు. గజ్జల్లో నొప్పి కారణంగా స్టార్క్.. చీలిమండ గాయం కారణంగా మ్యాక్సీ తొలి మ్యాచ్‌కు దూరంగా ఉంటారని స్టార్క్ తెలిపారు. మరోవైపు సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లు భారత్‌తో తొలి వన్డేకు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ పూర్తి ఫిట్‌నెస్ట్ సాధించి, బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. స్టార్క్, మ్యాక్స్‌వెల్ మినహా తొలి వన్డేలో ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియాల మధ్య సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి వన్డే మొహాలీలో, రెండో వన్డే ఇండోర్‌లో, మూడో వన్డే రాజ్‌కోట్‌లో జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ అయిపోయిన వెంటనే వరల్డ్‌కప్ సన్నాహక మ్యాచ్‌లు మొదలవుతాయి. అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌కప్ మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో 2023 వరల్డ్‌కప్ మొదలవుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మెగా టోర్నీలో భారత్.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో, అక్టోబర్ 14న పాకిస్తాన్లను ఢీకొంటుంది. చిరకాల ప్రత్యర్ధితో మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. తుది జట్టులో రుతురాజ్..?
వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కోసం రెండు వేర్వేరు జట్లను భారత సెలెక్టర్లు నిన్న (సెప్టెంబర్ 18) ప్రకటించిన విషయం తెలిసిందే. సిరీస్‌లోని తొలి రెండు వన్డేలకు ఓ జట్టును, చివరి మ్యాచ్ కోసం మరో జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. తొలి రెండు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వడంతో ఈ మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడు. ఈ మ్యాచ్‌లకు రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. రోహిత్, కోహ్లి, హార్దిక్, కుల్దీప్ యాదవ్‌లు తిరిగి మూడో వన్డేకు జట్టులో చేరతారు. అందరూ ఊహించిన విధంగానే సెలెక్టర్లు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు పిలుపునిచ్చారు. ఊహించని విధంగా తొలి రెండు వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. గైక్వాడ్ ఆసియా క్రీడల్లో టీమిండియాకు నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో సిరీస్‌కు జట్టు ప్రకటన నేపథ్యంలో సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరిగే తొలి వన్డేలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటినుంచే మొదలయ్యాయి. తొలి వన్డేలో రుతురాజ్ తుది జట్టులో ఉంటాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. వరల్డ్‌కప్‌కు స్టాండ్‌బైగా ఎంపిక చేసే ఉద్దేశంతోనే రుతురాజ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే ఆసీస్‌తో తొలి వన్డేలో గిల్‌తో పాటు రుతురాజ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో ప్లేస్‌లో కేఎల్ రాహుల్, ఆరో స్థానంలో తిలక్ వర్మ, ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, ఎనిమిదిలో అశ్విన్, స్పెషలిస్ట్ పేసర్లుగా షమీ, బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసీస్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టు (అంచనా): గిల్, రుతురాజ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, షమీ, బుమ్రా, సిరాజ్ -
IND Vs WI: తీరు మారని వెస్టిండీస్.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని వెస్టిండీస్ నిరూపించింది. ‘అంచనాలకు తగినట్లుగా’ సాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కూడా కనబర్చలేక టీమ్ కుప్పకూలింది. టి20 మ్యాచ్‌కు మించి ఆడటం తమ వల్ల కాదన్నట్లుగా 23 ఓవర్లకే ఇన్నింగ్స్ ముగించింది. మొదటి మూడు వికెట్లు తీసి పేసర్లు శుభారంభం చేస్తే తర్వాతి 7 వికెట్లతో స్పిన్నర్లు కుల్దీప్, జడేజా పండుగ చేసుకున్నారు. అయితే టీమిండియాకు విజయం సులువుగా దక్కలేదు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదు వికెట్లు కోల్పోయి చివరకు గెలుపు సొంతం చేసుకుంది. రోహిత్, కోహ్లి తమ స్థానాల్లో ఆడకుండా ఇతర బ్యాటర్లను ముందుగా పంపగా... అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను అలవోకగా గెలుచుకున్న భారత జట్టు వన్డేల్లోనూ తమ స్థాయిని ప్రదర్శించింది. గురువారం ఏకపక్షంగా సాగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ షై హోప్ (45 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ 6 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం ఇదే మైదానంలో జరుగుతుంది. టపటపా... వన్డేల్లో తమ జట్టు బలహీనతను మరోసారి ప్రదర్శిస్తూ వెస్టిండీస్ కుప్పకూలింది. కెపె్టన్ హోప్ కొంత పోరాడగలిగినా... మిగతావారంతా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. హార్దిక్ తన రెండో ఓవర్లోనే కైల్ మేయర్స్ (2)ను అవుట్ చేసి భారత్‌కు సరైన ఆరంభం అందించాడు. హార్దిక్ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్... శార్దుల్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి అలిక్ అతనజ్ (18 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసినా అది ఎక్కువ సేపు సాగలేదు. జడేజా చక్కటి క్యాచ్‌తో అతను వెనుదిరిగాడు. ముకేశ్‌కు ఇది తొలి వికెట్ కావడం విశేషం. మరో మూడో బంతులకే బ్రెండన్ కింగ్ (17)ను శార్దుల్ అవుట్ చేయడంతో స్కోరు 45/3కి చేరింది. ఈ దశలో హోప్ కొన్ని చక్కటి షాట్లతో కాస్త పట్టుదల కనబర్చాడు. అయితే మరో ఎండ్‌లో 8 పరుగుల వ్యవధిలో హెట్‌మైర్ (11), రావ్మన్ పావెల్ (4), షెఫర్డ్ (0) వెనుదిరగడంతో విండీస్ కోలుకోలేకపోయింది. తర్వాతి నాలుగు వికెట్లూ కుల్దీప్ ఖాతాలోకే వెళ్లాయి. తన తొలి, రెండో ఓవర్లో ఒక్కో వికెట్ తీసిన అతను మూడో ఓవర్లో మరో రెండు వికెట్లతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. వెస్టిండీస్ తరఫున 1972–79 మధ్య 12 టెస్టులు ఆడి 29 వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ రఫీక్ జుమాదిన్ గురువారం మరణించడంతో సంతాప సూచకంగా విండీస్ ఆటగాళ్లు భుజానికి నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. తడబడినా... ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ అలవోకగా సాగలేదు. రోహిత్ శర్మ కాకుండా కిషన్, గిల్ (7) ఓపెనర్లుగా బరిలోకి దిగారు. గిల్ విఫలం కాగా, మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (19) కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ప్రమోట్ అయిన హార్దిక్ పాండ్యా (5) రనౌట్ కాగా, మరో ఎండ్‌లో ఇషాన్ మాత్రం నిలకడగా ఆడుతూ 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే ఇషాన్‌తో పాటు శార్దుల్ (1) వెనుదిరగడంతో రోహిత్ (12 నాటౌట్) క్రీజ్‌లోకి రాక తప్పలేదు. ఆపై మరో వికెట్ పడకుండా జడేజా (16 నాటౌట్)తో రోహిత్ మ్యాచ్‌ను ముగించడంతో కోహ్లి బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేకపోయింది. ముకేశ్@ 251 వెస్టిండీస్‌తో రెండో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన పేస్ బౌలర్ ముకేశ్ కుమార్‌కు ఇదే టూర్లో వన్డే అవకాశం కూడా దక్కింది. గురువారం మ్యాచ్‌తో అతను వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 251వ ఆటగాడిగా ముకేశ్ నిలిచాడు. 2విండీస్‌కు భారత్‌పై వన్డేల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. 2018లో 104 పరుగులకు ఆలౌటైంది. ఆలౌట్ అయిన సందర్భాల్లో ఎదుర్కొన్న బంతులపరంగా కూడా విండీస్‌కు ఇది రెండో చెత్త ప్రదర్శన. 2011లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 22 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (బి) శార్దుల్ 17; మేయర్స్ (సి) రోహిత్ (బి) హార్దిక్ 2; అతనజ్ (సి) జడేజా (బి) ముకేశ్ 22; హోప్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 43; హెట్‌మైర్ (బి) జడేజా 11; పావెల్ (సి) గిల్ (బి) జడేజా 4; షెఫర్డ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; డ్రేక్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 3; కారియా (ఎల్బీ) (బి) కుల్దీప్ 3; మోతీ (నాటౌట్) 0; సీల్స్ (సి) హార్దిక్ (బి) కుల్దీప్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (23 ఓవర్లలో ఆలౌట్) 114. వికెట్ల పతనం: 1–7, 2–45, 3–45, 4–88, 5–96, 6–96, 7–99, 8–107, 9–114, 10–114. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 3–0–17–1, ముకేశ్ 5–1–22–1, శార్దుల్ 3–1–14–1, జడేజా 6–0–37–3, ఉమ్రాన్ 3–0–17–0, కుల్దీప్ యాదవ్ 3–2–6–4. భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) పావెల్ (బి) మోతీ 52; గిల్ (సి) కింగ్ (బి) సీల్స్ 7; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) మోతీ 19; హార్దిక్ (రనౌట్) 5; జడేజా (నాటౌట్) 16; శార్దుల్ (సి) అతనజ్ (బి) కారియా 1; రోహిత్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (22.5 ఓవర్లలో 5 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1–18, 2–54, 3–70, 4–94, 5–97. బౌలింగ్: డ్రేక్స్ 4–0– 19–0, సీల్స్ 4–0–21–1, మేయర్స్ 1–0– 6–0, షెఫర్డ్ 1–0–2–0, మోతీ 6.5–0– 26–2, కారియా 5–0–35–1, అతనజ్ 1–0–7–0. -
టీమిండియాకు ఊహించని షాక్.. స్వదేశానికి పయనమైన స్టార్ ప్లేయర్
బార్బడోస్ వేదికగా విండీస్‌తో ఇవాళ (జులై 27) జరుగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. వర్క్ లోడ్ కారణంగా సిరాజ్‌కు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తుంది. వన్డే, టీ20 జట్లలో లేని టీమిండియా సభ్యులతో పాటు సిరాజ్ స్వదేశానికి పయనమయ్యాడని సమాచారం. ఆసియా కప్, వరల్డ్‌కప్‌లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. విండీస్‌తో రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన సిరాజ్.. గత కొంత కాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. సీనియర్లు బుమ్రా, షమీ గైర్హాజరీలో ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో బిజీగా మారాడు. బిజీగా మారడమే కాకుండా భారత పేస్ విభాగాన్ని విజయవంతంగా ముందుండి నడిపించాడు. త్వరలో టీమిండియా మెగా ఈవెంట్లలో పాల్గొననున్న నేపథ్యంలో సిరాజ్ గాయాల బారిన పడకుండా ఉండేందుకు బీసీసీఐ అతన్ని విండీస్ పర్యటన నుంచి అర్థాంతరంగా స్వదేశానికి పిలిపించింది. సిరాజ్‌కు రీప్లేస్మెంట్ ఎవరనే దానిపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి క్లూ ఇవ్వలేదు. అందుబాటులో ఉన్న బౌలర్లతోనే నెట్టుకురావలన్నది బీసీసీఐ ఆలోచనగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే, విండీస్ ఇవాళ జరుగనున్న తొలి వన్డేలో సిరాజ్ గైర్హాజరీలో ఉమ్రాన్ మాలిక్ టీమిండియా పేస్ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న పేసర్లలో ఉమ్రానే ఎక్కువ వన్డేలు (8) ఆడాడు. తొలి వన్డే కోసం ఎంపిక చేసే తుది జట్టులో స్పెషలిస్ట్ పేసర్లుగా ఉమ్రాన్, ఉనద్కత్‌లకు అవకాశం దక్కవచ్చు. పార్ట్ టైమ్ పేసర్లుగా ఆల్‌రౌండర్లు హార్ధిక్, శార్దూల్ ఠాకూర్లు తుది జట్టులో ఉండవచ్చు. -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్
స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఆఫ్ఘనిస్తాన్ భారీ షాకిచ్చింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘన్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయల నడుమ 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 83/2 (21.4 ఓవర్లు) స్కోర్ వద్ద ఉండగా వర్షం మరోసారి పలకరించింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఎంపైర్లు ఆఫ్ఘనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. సత్తా చాటిన ఆఫ్ఘన్ బౌలర్లు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హాక్ ఫారూఖీ (3/24), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/23), రషీద్ ఖాన్ (2/21), మహ్మద్ నబీ (1/25), అజ్మతుల్లా (1/39) బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్ హ్రిదోయ్ (51) అర్ధసెంచరీతో రాణించగా.. తమీమ్ ఇక్బాల్ (13), లిటన్ దాస్ (26), షాంటో (12), షకీబ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. అలసట లేకుండా గెలుపొందిన ఆఫ్ఘనిస్తాన్.. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. వరుణుడి పుణ్యమా అని అలసట లేకుండా గెలుపొందింది. 21.4 ఓవర్ల వద్ద (83/2) మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆఫ్ఘనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఇబ్రహీం జద్రాన్ (41 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికగా జులై 8న జరుగనుంది. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్ 546 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. -
పసికూనపై విండీస్ ప్రతాపం.. శతక్కొట్టిన కింగ్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం యూఏఈలో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు షార్జా వేదికగా నిన్న (జూన్ 4) జరిగిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి, సిరీస్‌కు శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. విండీస్ 35.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్రాండన్ కింగ్ సూపర్ శతకం (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి విండీస్‌ను గెలిపించాడు. అతనికి షామార్ బ్రూక్స్ (58 బంతుల్లో 44; 5 ఫోర్లు) జత కలిశాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో అలీ నసీర్ (58), అరవింద్ (40) రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 3, డొమినిక్ డ్రేక్స్, ఓడియన్ స్మిత్, కారియా తలో 2 వికెట్లు, రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్ 6న షార్జాలోనే జరుగనుంది. చదవండి: గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం అలా.. చివరికి పరువు పాయే..! -
ఆఫ్ఘనిస్తాన్ సంచలనం.. తమ కంటే మెరుగైన జట్టుపై ఘన విజయం
SL VS AFG 1st ODI: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోటలో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. రషీద్ ఖాన్ లాంటి స్టార్ స్పిన్నర్ లేకపోయినా ఆఫ్ఘన్లు.. లంకేయులకు భారీ షాకిచ్చారు. యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, తమ కంటే పటిష్టమైన లంకేయులను 6 వికెట్ల తేడాతో మట్టికరించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (38), దుషన్ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మలిక్ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆది నుంచే అద్భుతంగా ఆడి, మరో 19 బంతులుండగానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (14) విఫలమైనా.. ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా రెండో వికెట్‌కు 146 పరుగులు జోడించి, ఆఫ్ఘనిస్తాన్ విజయాన్ని ఖరారు చేశారు. ఆఖర్లో కెప్టెన్ హస్మతుల్లా షాహిది (38), మహ్మద్ నబీ (27 నాటౌట్) బాధ్యతగా ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు. ఐపీఎల్-2023లో సీఎస్కే తరఫున ఇరగదీసిన పేసర్ మతీష పతిరణ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టిన పతిరణ.. 8.5 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ మాత్రమే పడగొట్టాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, లహీరు కుమార ఓ వికెట్ దక్కించుకున్నారు. పతిరణతో పాటు అరంగేట్రం చేసిన స్పిన్నర్ దుషన్ హేమంత (9-0-50-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 46.5 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి విజయం సాధించింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్ 7న జరుగనున్నాయి. చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..! -
SL VS AFG 1st ODI: రాణించిన అసలంక, డిసిల్వ
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 2) తొలి వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (38), దుషన్ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మలిక్ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఐపీఎల్-2023లో సీఎస్కే తరఫున సత్తా చాటిన మతీష పతిరణ.. ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. పతిరణతో పాటు లెగ్ బ్రేక్ బౌలర్ దుషన్ హేమంత కూడా ఈ మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేశాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్, ఐపీఎల్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్ను సమస్య కారణంగా లంకతో సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉండగా.. ఐపీఎల్ సహచర ఆటగాడు (గుజరాత్ టైటాన్స్) నూర్ అహ్మద్ నేటి మ్యాచ్ బరిలో నిలిచాడు. ఐపీఎల్ సెంటర్ పాయింట్ అయిన మరో ఆఫ్ఘన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో పాల్గొంటున్నాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్ 7న జరుగనున్నాయి. -
కివీస్ చేతిలో ఓటమి.. వరల్డ్‌కప్ రేసు నుంచి శ్రీలంక ఔట్..!
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 198 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. పరుగుల పరంగా శ్రీలంకపై కివీస్‌కు ఇది అతి పెద్ద విజయం. ఈ గెలుపుతో న్యూజిలాండ్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై కావాలన్న శ్రీలంక ఆశలు ఆవిరయ్యాయి. శ్రీలంకతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేస్తే ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ న్యూజిలాండ్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా న్యూజిలాండ్ ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో ఫలితం రాకపోగా.. 15 గెలిచి, ఐదింటిలో ఓడింది. దీంతో ఆ జట్టు ఖాతాలోకి 160 పాయింట్లు చేరాయి. New Zealand have topped the @MRFWorldwide ICC Men’s @cricketworldcup Super League table 💥#NZvSL report 👇https://t.co/PyjYWvuA3G — ICC (@ICC) March 25, 2023 న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లండ్ (155), ఇండియా (139), బంగ్లాదేశ్ (130), పాకిస్తాన్ (130), ఆస్ట్రేలియా (120), ఆఫ్ఘనిస్తాన్ (112) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్‌కప్-2023కు ఈ 7 జట్లు నేరుగా క్వాలిఫై కాగా.. మిగిలిన మరో స్థానం కోసం శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌లు పోటీపడుతున్నాయి. సీజన్ ముగిసే సమయానికి 8వ స్థానంలో ఉండే జట్టు నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. తొలి వన్డేలో కివీస్ చేతిలో భారీ పరాజయం చవిచూసిన నేపథ్యంలో శ్రీలంక 10వ స్థానానికి పడిపోయి వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఒకవేళ లంకేయులు కివీస్‌పై రెండు, మూడు వన్డేల్లో గెలిచినా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ ఛాన్సస్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం స్టాండింగ్స్‌లో ఉన్న 9వ స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. త్వరలో నెదర్లాండ్స్‌తో జరుగబోయే రెండు వన్డేల్లో విజయం సాధిస్తే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం శ్రీలంకతో పాటు 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్, 11వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ కూడా వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా కోల్పోయాయి. ఒకవేళ సౌతాఫ్రికా వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై అయితే వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు జింబాబ్వే, నెదర్లాండ్స్ తదితర జట్లతో కలిసి క్వాలిఫయర్ పోటీల్లో తలపడాల్సి ఉంటుంది. ఈ పోటీలు జూన్ 8న మొదలవుతాయి. -
నిప్పులు చెరిగిన షిప్లే.. వణికిపోయిన లంకేయులు
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (మార్చి 25) జరిగిన తొలి వన్డేలో ఆతిధ్య న్యూజిలాండ్ 198 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ యువ పేసర్ హెన్రీ షిప్లే నిప్పులు చెరిగాడు. 7 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా 275 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. షిప్లే ధాటికి లంక ఆటగాళ్లు వణికిపోయారు. ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టాడు. A maiden international five-wicket bag for Henry Shipley! Watch play LIVE on @sparknzsport or TVNZ Duke LIVE scoring https://t.co/nudAdDPipf #CricketNation #NZvSL pic.twitter.com/VJv6zEepHG — BLACKCAPS (@BLACKCAPS) March 25, 2023 మెరుపు వేగంతో షిప్లే సంధించిన బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొనేందుకు లంక ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. షిప్లే నిస్సంకను క్లీన్‌బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. షిప్లేకు జతగా డారిల్ మిచెల్ (2/12), బ్లెయిర్ టిక్నర్ (2/20) కూడా రాణించడంతో 20 ఓవర్లలోపే లంకేయుల ఖేల్ ఖతమైంది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. What a ball Mr Shipley 👏 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport#SparkSport #NZvSL pic.twitter.com/zHv8yZvr4M — Spark Sport (@sparknzsport) March 25, 2023 అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 49.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. ఫిన్ అలెన్ (51) హాఫ్ సెంచరీతో రాణించగా.. డారిల్ మిచెల్ (47), గ్లెన్ ఫిలిప్స్ (39), రచిన్ రవీంద్ర (49) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో చమిక కరుణరత్నే 4 వికెట్లు పడగొట్టగా.. రజిత, లహీరు కుమార తలో 2 వికెట్లు, మధుశంక, షనక చెరో వికెట్ దక్కించుకున్నారు. A special moment at @edenparknz. A Moment of Acknowledgment at the 14.2 over mark to honour all those affected by Cyclone Gabriel and the floods - along with those helping with the recovery. Text DONATE to 540 to donate to the @NZRedCross Disaster Relief Fund. #CricketNation pic.twitter.com/QfSepLT1ma — BLACKCAPS (@BLACKCAPS) March 25, 2023 ఈ మ్యాచ్ ద్వారా లభించే మొత్తాన్ని కివీస్ క్రికెటర్లు ఇటీవల విధ్వంసం సృష్టించిన గాబ్రియెల్ సైక్లోన్ బాధితులకు అందజేయనున్నారు. తుఫాను బాధితులకు సంఘీభావంగా ఆటగాళ్లు, స్టేడియంలోని ప్రేక్షకులు 14.2 ఓవర్ తర్వాత లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా కివీస్ ఆటగాడు బ్లెయిర్ టిక్నర్ కంటతడి పెట్టుకోవడం అందరిని కలచివేసింది. -
ఐపీఎల్ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు టూ టైమ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను సమస్య కారణంగా ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లీగ్ మొత్తానికే దూరం కాగా.. తాజాగా స్టార్ బౌలర్, న్యూజిలాండ్ ఆటగాడు లోకీ ఫెర్గూసన్ గాయం (హ్యామ్‌స్ట్రింగ్) బారిన పడ్డాడు. స్వదేశంలో శ్రీలంకతో జరగాల్సిన వన్డే సిరీస్‌కు ముందు ఫెర్గూసన్ గాయం వార్త వెలుగు చూసింది. దీంతో అతను మార్చి 25న జరిగాల్సిన తొలి వన్డే బరి నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో కివీస్ క్రికెట్ బోర్డు ఎవరినీ ఎంపిక చేయలేదు. శ్రీలంకతో తొలి వన్డేకు మాత్రం ఫెర్గూసన్ దూరంగా ఉంటాడని కివీస్ యాజమాన్యం ప్రకటించింది. అయితే, ఫెర్గూసన్ గాయం తీవ్రతపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కానీ కేకేఆర్ యాజమాన్యం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ ఫెర్గూసన్ గాయం బారిన పడకుండి ఉంటే, తొలి వన్డే తర్వాత ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు పయనమవ్వాల్సి ఉండింది. ఫెర్గూసన్ గాయంపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో కేకేఆర్ యాజమాన్యం కలవర పడుతుంది. ఇప్పటికే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సేవలు కోల్పోయిన ఆ జట్టు, ఫెర్గూసన్ సేవలను కూడా కోల్పోతే భారీ మూల్యం తప్పదని భావిస్తుంది. ఫెర్గూసన్ కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా పేస్ బౌలింగ్ భారమంతా టిమ్ సౌథీపై పడుతుంది. ఐపీఎల్ 2023 ప్రారంభానికి మరో 8 రోజులు మాత్రమే ఉన్నా కేకేఆర్ ఇప్పటికీ తమ నూతన కెప్టెన్ పేరును (శ్రేయస్ రీప్లేస్మెంట్) ప్రకటించలేదు. కాగా, ఫెర్గూసన్ గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2023 వేలంలో కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. కేకేఆర్ ఏప్రిల్ 2న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. -
కేఎల్ రాహుల్ కేక.. ఐదో స్థానంలో అతన్ని మించినోడు లేడు..!
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (మార్చి 17) జరిగిన తొలి వన్డేలో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ (91 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సాధించి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్.. ఓ ఆసక్తికర రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2020 నుంచి వన్డేల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక హాఫ్ సెంచరీలు (8), అత్యధిక సగటు (60.50), అత్యధిక స్ట్రయిక్ రేట్ కలిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. Since the start of 2020, KL Rahul averages 60.50 in ODIs at No.5. Among the five players listed below, his strike rate (99.86) is the second highest. #KLRahul #IndianCricket #ODICricket pic.twitter.com/Ngh3QmonV6 — Wisden India (@WisdenIndia) March 18, 2023 2020-23 మధ్యకాలంలో రాహుల్ ఐదో స్థానంలో బరిలోకి దిగి 8 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు సాధించగా.. శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక 7 హాఫ్ సెంచరీలు స్కోర్ చేశాడు. వీరి తర్వాత స్కాట్లాండ్ ప్లేయర్ జార్జ్ మున్సే 5, సఫారీ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 4, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 3 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. గతకొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్.. నిన్న ఆసీస్‌తో జరిగిన వన్డేలో సత్తా చాటడం ద్వారా విమర్శకుల నోళ్లు మూయించాడు. నిజానికి టెస్ట్‌ల్లో తప్పిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహుల్ ప్రదర్శన మరీ అంత తీసికట్టుగా లేదు. గత 9 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ చేయని రాహుల్.. వన్డే, టీ20ల్లో ఓ మ్యాచ్ తప్పించి మరో మ్యాచ్‌లో రాణిస్తూనే ఉన్నాడు. అయితే మూడంకెల స్కోర్ సాధించడంలో మాత్రం విఫలమయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో గత 10 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ఒక్క సారి కూడా సెంచరీ మార్కును క్రాస్ చేయలేదు. రాహుల్ తన చివరి సెంచరీని (టెస్ట్‌ల్లో) దక్షిణాఫ్రికాపై డిసెంబర్ 26, 2021న సాధించాడు. వన్డేల్లో అయితే మార్చి 26, 2021న ఇంగ్లండ్‌పై తన చివరి శతకాన్ని నమోదు చేశాడు. టీ20ల విషయానికొస్తే.. జులై 3, 2018న ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీని అతనికి ఆఖరిది. కెరీర్లో ఇప్పటివరకు 47 టెస్ట్‌లు, 52 వన్డేలు, 72 టీ20లు ఆడిన కేఎల్ రాహుల్.. 7 టెస్ట్ శతకాలు, 5 వన్డే శతకాలు, 2 టీ20 శతకాలు సాధించాడు. రాహుల్ ఐపీఎల్లో సైతం 4 సెంచరీ చేశాడు. -
India vs Australia 1st ODI: రాహుల్, జడేజా గెలిపించగా...
తొలి వన్డేలో భారత్ విజయలక్ష్యం 189 పరుగులే...దీనిని చూస్తే ఛేదన చాలా సులువనిపించింది. కానీ ఒక దశలో స్కోరు 16/3 కాగా, ఆపై 39/4కు మారింది...ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై భారత బ్యాటర్లు శ్రమించాల్సి వచ్చింది. చివరకు రాహుల్, జడేజా శతక భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ఎనిమిది నెలల తర్వాత ఆడిన తొలి వన్డేలో జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శన నమోదు చేయగా, టెస్టుల్లో బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ వన్డేల్లో తానేంటో చూపించాడు. అంతకు ముందు భారత బౌలర్లు ఆసీస్‌ను కట్టి పడేశారు. మిచెల్ మార్‡్ష మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన జట్టు భారీ స్కోరు చేసేందుకు సరిపోలేదు. ముంబై: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్‡్ష (65 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం భారత్ 39.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (69 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు) ఆరో వికెట్‌కు అభేద్యంగా 108 పరుగులు జత చేశారు. 2 వికెట్లు, 1 కీలక క్యాచ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించిన జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా... ఈ నెల 19న వైజాగ్‌లో రెండో వన్డే జరుగుతుంది. మార్‡్ష మినహా... తన తొలి ఓవర్లోనే ట్రవిస్ హెడ్ (5)ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం లభించలేదు. అయితే మార్‡్ష దూకుడుగా ఆడి జట్టును నడిపించాడు. సిరాజ్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన మార్‡్ష, సిరాజ్ మరో ఓవర్లోనే రెండు ఫోర్లు బాదాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 59 పరుగులకు చేరింది. మార్‡్షకు సహకరించిన స్టీవ్ స్మిత్ (22)ను కీపర్ రాహుల్ చక్కటి క్యాచ్‌తో వెనక్కి పంపడంతో 72 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మార్‡్ష 51 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి అతను తన జోరును కొనసాగించాడు. అయితే జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మార్‡్ష షార్ట్ థర్డ్‌మాన్ వద్ద సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. మార్‡్ష, లబుషేన్ (15) మూడో వికెట్‌కు 52 పరుగులు జత చేశారు. అంతే...ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. 20వ ఓవర్లో 129/2తో మెరుగైన స్థితిలో నిలిచిన ఆ జట్టు 36వ ఓవర్ కూడా ముగియక ముందే ముగిసింది. 59 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 8 వికెట్లు కోల్పోయింది. తన చివరి 14 బంతుల్లో షమీ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టగా...సిరాజ్ తన చివరి 10 బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వకుండా 2 వికెట్లు తీశాడు. శతక భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఆరంభంలో భారత్ తడబడింది. ఇషాన్ కిషన్ (3) తనకు లభించిన అరుదైన అవకాశాన్ని వృథా చేసుకోగా... స్టార్క్ వరుస బంతుల్లో కోహ్లి (4), సూర్యకుమార్ (0)లను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. వ్యక్తిగత స్కోర్ల 2, 7 వద్ద ఇన్‌గ్లిస్, స్మిత్ క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన శుబ్‌మన్ గిల్ (20) దానిని ఉపయోగించుకోలేకపోయాడు. ఈ దశలో రాహుల్, హార్దిక్ పాండ్యా (25) కలిసి జట్టును ఆదుకున్నారు. అయితే స్టొయినిస్ బౌన్సర్‌తో పాండ్యాను అవుట్ చేయడంతో 44 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. విజయానికి మరో 106 పరుగులు చేయాల్సిన ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాదే పైచేయిగా మారినట్లు అనిపించింది. కానీ రాహుల్, జడేజా జోడి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ వీరిద్దరు పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 73 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) సిరాజ్ 5; మార్‡్ష (సి) సిరాజ్ (బి) జడేజా 81; స్మిత్ (సి) రాహుల్ (బి) పాండ్యా 22; లబుషేన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 15; ఇన్‌గ్లిస్ (బి) షమీ 26; గ్రీన్ (బి) షమీ 12; మ్యాక్స్‌వెల్ (సి) పాండ్యా (బి) జడేజా 8; స్టొయినిస్ (సి) గిల్ (బి) షమీ 5; అబాట్ (సి) గిల్ (బి) సిరాజ్ 0; స్టార్క్ (నాటౌట్) 4; జంపా (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (35.4 ఓవర్లలో ఆలౌట్) 188. వికెట్ల పతనం: 1–5, 2–77, 3–129, 4–139, 5–169, 6–174, 7–184, 8–184, 9–188, 10–188. బౌలింగ్: షమీ 6–2–17–3, సిరాజ్ 5.4–1–29–3, పాండ్యా 5–0–29–1, శార్దుల్ 2–0–12–0, జడేజా 9–0–46–2, కుల్దీప్ 8–1–48–1. భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) స్టొయినిస్ 3; గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 20; కోహ్లి (ఎల్బీ) (బి) స్టార్క్ 4; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; రాహుల్ (నాటౌట్) 75; పాండ్యా (సి) గ్రీన్ (బి) స్టొయినిస్ 25; జడేజా (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (39.5 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–5, 2–16, 3–16, 4–39, 5–83. బౌలింగ్: స్టార్క్ 9.5–0– 49–3, స్టొయినిస్ 7–1–27–2, అబాట్ 9–0–31–0, గ్రీన్ 6–0–35–0, జంపా 6–0–37–0, మ్యాక్స్‌వెల్ 2–0–7–0. -
మలాన్ వీరోచిత శతకం.. పసికూనపై అతికష్టం మీద గెలిచిన ఇంగ్లండ్
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను.. డేవిడ్ మలాన్ (145 బంతుల్లో 114 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడి గెలిపించాడు. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్.. 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి ఖరారు అనుకున్న దశలో మలాన్ తన అనుభవాన్ని అంతా రంగరించి, టెయిలెండర్ల సాకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ (29 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్)ను సమన్వయం చేసుకుంటూ మలాన్ పోరాడిన తీరు అమోఘం. మలాన్- రషీద్ జోడీ ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, మరో 8 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మలాన్, రషీద్ మినహా జేసన్ రాయ్ (4), ఫిలిప్ సాల్ట్ (12), జేమ్స్ విన్స్ (6), జోస్ బట్లర్ (9), క్రిస్ వోక్స్ (7), మొయిన్ అలీ (14), విఫలం కాగా.. విల్ జాక్స్ (26) కాస్త పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహదీ హసన్ మిరాజ్ 2, షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్‌గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 47.2 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (23), షాంటో (58), మహ్మదుల్లా (31) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, మార్క్ వుడ్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, విల్ జాక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 3న ఇదే వేదికపై జరుగుతుంది. -
ఎలా ఔటయ్యాడో చూడు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు.. గిల్ తండ్రి అసంతృప్తి
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 18) జరిగిన వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో (149 బంతుల్లో 209; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు గిల్ శ్రీలంకపై మూడో వన్డేలో సెంచరీ సాధించిన అనంతరం అతని తండ్రి లఖ్విందర్ గిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. గిల్ సహచరుడు, పంజాబ్ ఆటగాడు గురుకీరత్ సింగ్ మాన్ కథనం మేరకు.. శ్రీలంకపై గిల్ సెంచరీ సాధించాక ఔటైన విధానంపై లఖ్విందర్ అసంతృప్తి వ్యక్తం చేశాడట. లఖ్విందర్ గురుకీరత్‌తో మాట్లాడుతూ.. మంచి ఆరంభం లభించాక సెంచరీ చేశాడు, ఓకే.. డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా, ఎలా ఔటయ్యాడో చూడు.. ఇలాంటి అవకాశాలు ప్రతిసారి రావు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు అని అన్నాడట. This is what dreams are made of 💙🇮🇳🇮🇳 pic.twitter.com/rD3n4aHvfz — Shubman Gill (@ShubmanGill) January 19, 2023 లఖ్విందర్ చేసిన ఈ వ్యాఖ్యలు గిల్ కివీస్‌పై డబుల్ సెంచరీ చేశాక సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. తండ్రి మందలింపును ఛాలెంజ్‌గా తీసుకుని గిల్ డబుల్ సెంచరీ కొట్టాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి తండ్రి గైడెన్స్‌లో పెరిగే క్రికెటర్లు అద్భుతాలు సృష్టిస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ICYMI - 𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙆𝙉𝙊𝘾𝙆! 💪 💪 That celebration says it ALL 👌 👌 Follow the match 👉 https://t.co/IQq47h2W47 #TeamIndia | #INDvNZ | @ShubmanGill pic.twitter.com/OSwcj0t1sd — BCCI (@BCCI) January 18, 2023 కాగా, 2021 ఆస్ట్రేలియా పర్యటనలో (గబ్బా టెస్ట్‌లో) గిల్ 91 పరుగుల వద్ద ఔటయ్యాక కూడా లఖ్విందర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడట. గిల్‌పై చిన్నప్పటి నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకున్న లఖ్విందర్.. గిల్ అనవసర షాట్లు ఆడి వికెట్ సమర్పించుకుంటే అస్సలు ఒప్పుకునే వాడు కాదట. వన్డేల్లో జింబాబ్వేపై తన తొలి సెంచరీ చేసిన సందర్భంగా గిల్.. ఈ విషయాలు స్వయంగా వెల్లడించాడు. అంతకుమందు మ్యాచ్‌లో 33 పరుగుల వద్ద ఔటైనప్పుడు తన తండ్రి కొట్టినంత పని చేశాడు.. అందుకే ఈ సెంచరీ నా తండ్రికి అంకితం అంటూ తొలి వన్డే సెంచరీ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా గిల్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో టీమిండియా అతికష్టం మీద 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. మైఖేల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంకర శతకంతో గడగడలాడించినప్పటికీ, ఆఖరి ఓవర్లో అతను ఔట్ కావడంతో టీమిండియా విజయం సాధించగలిగింది. -
IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్
ఎవరన్నారు వన్డేలకు కాలం చెల్లిందని... ఎవరన్నారు 100 ఓవర్లు చూడటమంటే బోరింగ్, సమయం వృథా అని... హైదరాబాద్ స్టేడియంలో బుధవారం మ్యాచ్ చూసిన తర్వాత అలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే... భారీగా పరుగులు, సిక్సర్ల వరద, రికార్డులు, ఉత్కంఠ, ఉద్వేగం... ఒక్కటేమిటి అన్ని భావాలు ఉప్పల్ మైదానంలో కనిపించాయి. అతి సునాయాస విజయం అనుకున్నది కాస్తా ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. శుబ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీ సాధించి అరుదైన ఆటగాళ్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకొని తొలి సగం ఆటలో హైలైట్‌గా నిలిచాడు. అయితే భారత్ భారీ స్కోరు చేయగానే గెలుపు ఖాయం కాలేదు. 21.2 ఓవర్లలో ఏకంగా 219 పరుగులు చేయాల్సిన సుదూర లక్ష్యం ముందుండగా... న్యూజిలాండ్ టి20 తరహాలో మెరుపు షాట్లతో పోరాడింది. మైకేల్ బ్రేస్‌వెల్ వీర బాదుడుకు భారత శిబిరంలో అలజడి రేగింది. ఒకదశలో టీమిండియా ఓటమి దిశగా కూడా వెళుతున్నట్లు అనిపించింది. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా... రెండో బంతికి ఆఖరి వికెట్ తీసి భారత్ ఊపిరి పీల్చుకుంది. మొత్తంగా అభిమానులకు ఫుల్ వినోదం అందింది. సాక్షి, హైదరాబాద్: హోరాహోరీ సమరంలో పైచేయి సాధించిన భారత్ వన్డే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బుధవారం చివరి ఓవర్ వరకు ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల స్వల్ప తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. మైకేల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా, మిచెల్ సాన్‌ట్నర్ (45 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 17 ఓవర్లలోనే 162 పరుగులు జోడించడం విశేషం. సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడిన పేసర్ మొహమ్మద్ సిరాజ్ 4 కీలక వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లోని రెండో వన్డే ఈనెల 21న రాయ్‌పూర్‌లో జరుగుతుంది. కోహ్లి విఫలం... భారత్‌కు రోహిత్ శర్మ (38 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిల్ మరోసారి శుభారంభం అందించారు. వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు సాధించడంతో తొలి 10 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. అయితే తక్కువ వ్యవధిలో రోహిత్, కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5)లను అవుట్ చేసి న్యూజిలాండ్ ఆధిక్యం ప్రదర్శించింది. మరోవైపు గిల్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (38 బంతుల్లో 28; 3 ఫోర్లు) తగిన సహకారం అందించారు. గిల్ నాలుగో వికెట్‌కు సూర్యతో 65 పరుగులు, ఐదో వికెట్‌కు హార్దిక్‌తో 74 పరుగులు జోడించాడు. కవర్స్‌లో సులువైన క్యాచ్ ఇచ్చి సూర్య వెనుదిరగ్గా... వివాదాస్పద రీతిలో హార్దిక్ అవుటయ్యాడు. బంతి హార్దిక్ బ్యాట్‌ను తాకకుండానే కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లుగా, కీపర్ చేతులతోనే బెయిల్స్ కదిలినట్లుగా టీవీ రీప్లేలో కనిపించింది. అయితే దీనిపై స్పష్టత లేకపోగా, హార్దిక్‌ను అంపైర్ బౌల్డ్‌గా ప్రకటించాడు. 40 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 251 పరుగులకు చేరింది. అయితే కివీస్ బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. ఒక దశలో 40–47 ఓవర్ల మధ్య ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే వచ్చాయి. అయితే చివర్లో గిల్ సునామీ బ్యాటింగ్ ఒక్కసారిగా ఆటను మార్చేసింది. చివరి 10 ఓవర్లలో భారత్ 98 పరుగులు సాధించింది. ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే... గిల్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. 45 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన కీపర్ లాథమ్, అదే బంతికి స్టంపింగ్ చేసే సునాయాస అవకాశాన్ని కూడా చేజార్చాడు. ఆ తర్వాత షిప్లీ తన బౌలింగ్‌లోనే రిటర్న్ క్యాచ్ వదిలేసినప్పుడు గిల్ స్కోరు 122 పరుగులు. మెరుపు భాగస్వామ్యం.... భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మొదటి నుంచీ తడబడింది. ఏ దశలోనూ టీమ్ గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించలేదు. ఆరంభంలోనే ఒకదశలో వరుసగా 23 బంతుల పాటు కివీస్ పరుగు తీయలేకపోయింది. ఫిన్ అలెన్ (39 బంతుల్లో 40; 7 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం స్వేచ్ఛగా ఆడుతూ హార్దిక్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, సిక్స్ కొట్టడం విశేషం. అనంతరం మిడిలార్డర్లో 19 పరుగుల వ్యవధిలో జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. అనుభవజ్ఞుడైన కెప్టెన్ టామ్ లాథమ్ (24) కూడా ప్రభావం చూపలేకపోయాడు. స్కోరు 131/6కు చేరడంతో కివీస్ కుప్పకూలేందుకు ఎంతో సమయం లేదనిపించింది. అయితే ఈ దశలో బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్ భారత బౌలర్లను ఆడుకున్నారు. కొరకరాని కొయ్యలుగా మారిపోయిన వీరిద్దరు చక్కటి షాట్లతో, సమన్వయంతో దూసుకుపోయారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. సాన్‌ట్నర్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, 57 బంతుల్లోనే బ్రేస్‌వెల్ శతకం అందుకున్నాడు.ఎట్టకేలకు 17 ఓవర్ల భాగస్వామ్యం తర్వాత సాన్ట్నర్ను సిరాజ్ అవుట్ చేయడంతో భారత్ ఊరట చెందింది. అయితే మరో ఎండ్‌లో పోరాటం కొనసాగించిన బ్రేస్‌వెల్ విజయానికి చేరువగా తీసుకు రాగలిగాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మిచెల్ (బి) టక్నర్ 34; గిల్ (సి) ఫిలిప్స్ (బి) షిప్లీ 208; కోహ్లి (బి) సాన్‌ట్నర్ 8; ఇషాన్ కిషన్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 5; సూర్యకుమార్ (సి) సాన్‌ట్నర్ (బి) మిచెల్ 31; హార్దిక్ (బి) మిచెల్ 28; సుందర్ (ఎల్బీ) (బి) షిప్లీ 12; శార్దుల్ (రనౌట్) 3; కుల్దీప్ (నాటౌట్) 5; షమీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 349. వికెట్ల పతనం: 1–60; 2–88; 3–110; 4–175; 5–249; 6–292; 7–302; 8–345. బౌలింగ్: షిప్లీ 9–0–74–2, ఫెర్గూసన్ 10–0–77–1, టిక్నర్ 10–0–69–1, సాన్‌ట్నర్ 10–0–56–1, బ్రేస్‌వెల్ 6–0–43–0, మిచెల్ 5–0–30–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (సి) (సబ్) షహబాజ్ (బి) శార్దుల్ 40; కాన్వే (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 10; నికోల్స్ (బి) కుల్దీప్ 18; మిచెల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 9; లాథమ్ (సి) సుందర్ (బి) సిరాజ్ 24; ఫిలిప్స్ (బి) షమీ 11; బ్రేస్‌వెల్ (ఎల్బీ) (బి) శార్దుల్ 140; సాన్‌ట్నర్ (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 57; షిప్లీ (బి) సిరాజ్ 0; ఫెర్గూసన్ (సి) గిల్ (బి) హార్దిక్ 8; టిక్నర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 337 వికెట్ల పతనం: 1–28, 2–70, 3–78, 4–89, 5–110, 6–131, 7–293, 8–294, 9–328, 10–337. బౌలింగ్: షమీ 10–1–69–1, సిరాజ్ 10–2–46–4, హార్దిక్ 7–0–70–1, కుల్దీప్ 8–1–43–2, శార్దుల్ 7.2–0–54–2, సుందర్ 7–0–50–0. –సాక్షి క్రీడా ప్రతినిధి -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన బ్రేస్‌వెల్..
3 వన్డే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఓ దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుండగా, మైఖేల్ బ్రేస్‌వెల్ (60 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో టీమిండియాను గడగడలాడిస్తున్నాడు. అతనికి జతగా మరో ఎండ్‌లో మిచెల్ సాంట్నర్ (40 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) కూడా చెలరేగుతుండటంతో టీమిండియా డిఫెన్స్‌లో పడింది. 44 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే 36 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 4 వికెట్లు ఉన్నాయి. 57 బంతుల్లో శతకం పూర్తి చేసిన బ్రేస్‌వెల్.. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో మూడో ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, తలో వికెట్ దక్కించుకున్నారు. -
డబుల్ సెంచరీ కొట్టాలంటే మనోళ్లే.. పదిలో ఏడు మనవే.. మరో విశేషమేమిటంటే..?
వన్డే క్రికెట్లో సెంచరీ సాధించాలంటే ముక్కీ మూలిగి, 150, 200 బంతులను ఎదుర్కొని, ఆఖరి ఓవర్లలో ఆ మార్కును దాటే రోజులు పోయాయి. టీ20 క్రికెట్ పుణ్యమా అని వన్డే క్రికెట్లోనూ వేగం పెరగడంతో ఆటగాళ్లు తృణప్రాయంగా సెంచరీలు బాదేస్తున్నారు. ఒకప్పుడు సెంచరీ సాధించాలంటే ఓపెనర్లు లేదా వన్‌డౌన్, టూ డౌన్లలో వచ్చే ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమయ్యేది. అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరు, ఏడు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు కూడా అలవోకగా సెంచరీలు కొట్టేస్తున్నారు. ఓపెనింగ్ వచ్చే ఆటగాళ్లైతే బఠానీలు నమిలినంత ఈజీగా డబుల్ సెంచరీలు బాదేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ శుభ్‌మన్ గిల్. ఈ భారత యువ ఓపెనర్ ఇవాళ (జనవరి 18) న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. ఇంతకు కొద్ది రోజుల ముందే (డిసెంబర్ 10, 2022) మరో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌పై 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు వన్డేల్లో 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా, అందులో భారత ఆటగాళ్లు సాధించినవి ఏడు ఉండటం విశేషం. మరో విశేషమేమిటంటే ఈ పది డబుల్ సెంచరీలు కూడా ఓపెనర్లు సాధించినవే కావడం. వన్డేల్లో తొట్ట తొలి డబుల్ సెంచరీ సాధించింది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో సౌతాఫ్రికాపై సచిన్ 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆతర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (2011లో వెస్టిండీస్‌పై 219), రోహిత్ శర్మ (2013లో ఆసీస్‌పై 209), రోహిత్ శర్మ (2014లో శ్రీలంకపై 264), క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై 215), మార్టిన్ గప్తిల్ (2015లో వెస్టిండీస్‌పై 237*), రోహిత్ శర్మ (2017లో శ్రీలంకపై 208*), ఫకర్ జమాన్ (2018లో జింబాబ్వేపై 210*), ఇషాన్ కిషన్ (2022లో బంగ్లాదేశ్‌పై 210), శుభ్‌మన్ గిల్ (2023లో న్యూజిలాండ్‌పై 208) డబుల్ సెంచరీలు సాధించారు. మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ 1997లోనే డెన్మార్క్‌పై 229* పరుగులు సాధించింది. ఆ తర్వాత 2018లో న్యూజిలాండ్‌కు చెందిన అమెలియా కెర్ ఐర్లాండ్‌పై 232* పరుగులు సాధించింది. ఓవరాల్‌గా చూస్తే.. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించింది బెలిండా క్లార్క్ కాగా, అత్యధిక డబుల్ సెంచరీలు సాధించింది రోహిత్ శర్మ (3). ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఇషాన్ కిషన్ (126) పేరిట ఉండగా, అత్యంత పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ఘనత శుభ్‌మన్ గిల్ (23 ఏళ్ల 132 రోజులు) పేరిట నమోదై ఉంది. -
డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 145 బంతులను ఎదుర్కొన్న గిల్.. 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి ఈ ఫీట్ (డబుల్ సెంచరీ) సాధించిన గిల్ హ్యాట్రిక్ సిక్సర్లతో 200 మార్క్‌ను చేరుకున్నాడు. డబుల్ సెంచరీ సాధించే క్రమంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే.. అత్యంత పిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉండేది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అత్యధిక స్కోర్ రికార్డు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (2009లో ఆసీస్‌పై 175 పరుగులు) పేరిట ఉండేది. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరర్ (గిల్, 208), రెండో అత్యధిక స్కోరర్ (రోహిత్, 34) మధ్య రన్స్ గ్యాప్ రికార్డు. ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 264 పరుగులు చేసిన మ్యాచ్‌లో రెండో అత్యధిక స్కోరర్‌గా విరాట్ కోహ్లి (66) ఉన్నాడు. వీరిద్దరి మధ్య 198 పరుగుల తేడా ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గిల్, రోహిత్‌ల మధ్య 174 పరుగుల తేడాతో ఉంది. రన్స్ గ్యాప్ రికార్డ్స్ జాబితాలో గిల్ది మూడో స్థానం. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో ఈ రికార్డు సచిన్ (186 నాటౌట్) పేరిట ఉండేది. వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్ సెంచరీతో పాటు హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఘనత. అతి తక్కువ వన్డేల్లో (19) 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ (17) తర్వాతి స్థానం. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు. ఈ రికార్డు పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18) పేరిట ఉంది. భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు. -
హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన గిల్.. టీమిండియా భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిల్.. వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గిల్ విధ్వంసం ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, తలో వికెట్ సాధించారు. -
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సెంచరీతో రికార్డుల్లోకెక్కిన శుభ్‌మన్ గిల్
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుస శతకాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల (జనవరి 15) శ్రీలంకపై మూడో వన్డేలో (97 బంతుల్లో 116; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించిన గిల్.. ఇవాళ (జనవరి 18) న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనూ శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో 87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన గిల్.. వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించడంతో పాటు అతి తక్కువ వన్డేల్లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ధవన్.. 17 వన్డేల్లో 3 సెంచరీలు పూర్తి చేయగా.. గిల్.. 19 వన్డేల్లో ఈ మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డుతో పాటు గిల్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18 వన్డేలు) అగ్రస్థానంలో ఉండగా.. గిల్, మరో పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్‌తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో గిల్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 210/4గా ఉంది. గిల్ (94 బంతుల్లో 111; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (22 బంతుల్లో 11; ఫోర్) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) నిరుత్సాహపరిచారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, డారిల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టారు. -
IND VS NZ 1st ODI: ఊరించి ఉసూరుమనిపించిన కోహ్లి.. క్లీన్ బౌల్డ్
గత 4 వన్డేల్లో 3 సెంచరీలు బాది భీభత్సమైన ఫామ్‌లో ఉండిన టీమిండియా మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. కోహ్లి.. ఈ మ్యాచ్‌లోనూ భీకర ఫామ్‌ను కొనసాగించి మరో సెంచరీ (75వ అంతర్జాతీయ శతకం) చేస్తాడని ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకోగా, ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. Bowled! Santner beats Kohli to silence the stadium #INDvNZ pic.twitter.com/T9rB2o1p0P — Ritwik Ghosh (@gritwik98) January 18, 2023 ఈ ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. బౌండరీ సాయంతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటి దాకా సందడి సందడిగా ఉండిన ఉప్పల్ మైదానంలో కోహ్లి ఔట్ అయిన వెంటనే నిశబ్దం ఆవహించింది. కోహ్లి.. తన 47వ వన్డే శతకాన్ని తమ వద్ద చేస్తాడని గంపెడాశలు పెట్టుకున్న హైదరాబాద్ వాసులు.. కోహ్లి తక్కువ స్కోర్‌కు ఔట్ కావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. కోహ్లి ఔటైన కొద్ది సేపటికే ఇషాన్ కిషన్ కూడా ఔట్ కావడంతో టీమిండియా 19.4 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. -
కొనసాగుతున్న రోహిత్ వైఫల్యాల పరంపర.. శుభారంభం లభించినా..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతూ ఉంది. తాజాగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 38 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ మనమొక విషయం గమనిస్తే.. ఇటీవలి కాలంలో హిట్‌మ్యాన్ బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ మంచి ఆరంభాలే లభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. గతవారం శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ ఇదే తంతు సాగింది. లంకపై తొలి వన్డేలో 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసిన హిట్‌మ్యాన్, ఈ మ్యాచ్‌లో తప్పక సెంచరీ సాధిస్తాడని అంతా ఊహించినప్పటికీ ఆ మార్కును అందుకునేందుకు 17 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఆతర్వాత రెండో వన్డేలో 21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 17 పరుగులు చేసి నిరాశపరిచిన రోహిత్.. మూడో వన్డేలో (49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు) లభించిన శుభారంభాన్ని సైతం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అంతకుముందు బంగ్లాదేశ్ టూర్లో సైతం రోహిత్ ఇదే తరహా ప్రదర్శనను కనబర్చాడు. బంగ్లాతో తొలి వన్డేలో 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో 27 పరుగులు చేసిన అతను.. రెండో వన్డేలో గాయపడినప్పటికీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి (28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 51 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో జట్టును గట్టెక్కించడంలో విఫలమయ్యాడు. ఇక అంతకుముందు టీ20 వరల్డ్‌కప్-2022లోనూ రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఆ మెగా టోర్నీలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ (39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53) మినహాయించి టోర్నీ మొత్తం ఉసూరుమనిపించాడు. పాక్‌పై 4(7), సౌతాఫ్రికాపై 14 (17), బంగ్లాదేశ్‌పై 2 (8), జింబాబ్వేపై 15 (13), సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 27 (28).. ఇలా ఆ టోర్నీలో ప్రతి మ్యాచ్‌లో తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. 2021 సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌పై చివరిసారి సెంచరీ సాధించిన హిట్‌మ్యాన్.. దాదాపు ఏడాదిన్నరగా ఆ మార్కును అందుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఆరంభాలు లభించినప్పటికీ వాటిని మూడంకెల స్కోర్‌గా మలచడంలో విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. 21 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. హిట్‌మ్యాన్‌తో పాటు విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) నిరాశపర్చగా.. శుభ్‌మన్ గిల్ (64 నాటౌట్) అర్ధసెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా సూర్యకుమార్ (6) బ్యాటింగ్ చేస్తున్నాడు. -
IND VS NZ 1st ODI: కోహ్లికి డిమోషన్.. కింగ్ స్థానంలో గిల్..?
హైదరాబాద్ వేదకగా న్యూజిలాండ్‌తో రేపు (జనవరి 18) జరుగబోయే తొలి వన్డేలో టీమిండియా ప్రయోగాల బాట పట్టనుందా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తుది జట్టులో యువకులకు సముచిత స్థానం దక్కాలంటే, సీనియర్లు కొన్ని త్యాగాలు చేయక తప్పదని టీమిండియా మాజీ ప్లేయర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సైతం తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇదే విషయాన్ని పలు విశ్లేషకులు కూడా ప్రస్తావిస్తున్నారు. త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో యువకులకు వీలైనన్ని అవకాశాలు కల్పించాలంటే సీనియర్లు తమ బ్యాటింగ్ స్థానాలను మార్చుకోక తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలా లేక తన చివరి వన్డేలో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలా అని జట్టు మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతుంది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్‌కు జతగా ఇషాన్ కిషన్‌ను బరిలోకి దించేందుకు మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కావడంతో ఈ జోడీకే యాజమాన్యం ఓటు వేసినట్లు సమాచారం. మరోవైపు సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్‌కు కూడా అన్యాయం జరగకుండా, కోహ్లిని బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కు పంపి వన్ డౌన్లో గిల్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే కోహ్లి నాలుగో స్థానంలో, సూర్యకుమార్ ఐదులో, హార్ధిక్ ఆరో స్థానంలో, ఏడో ప్లేస్‌లో సుందర్, ఆతర్వాత బౌలర్లు బరిలోకి దిగాల్సి ఉంటుంది. -
హెచ్‌సీఏలో మరోసారి బయటపడ్డ విభేదాలు.. అజహర్‌పై తీవ్రస్థాయి ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో (హెచ్‌సీఏ) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్‌పై జనరల్ సెక్రెటరీ విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు (జనవరి 18) వన్డే మ్యాచ్ జరుగనుండగా.. జనరల్ సెక్రెటరీని అయిన నన్ను సంప్రదించకుండా అజహర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆనంద్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జనరల్ సెక్రెటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉంటాయని, అయినా అజహర్ తనను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. దళితుడినని అజహర్ తనను చిన్న చూపు చూస్తున్నాడని, బెదిరించి చెక్కులపై సైన్ చేయించుకుంటున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హెచ్‌సీఏలో నియంతలా వ్యవహరిస్తున్న అజహర్.. రేపు జరిగే వన్డే మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టించాడని, ఆన్లైన్ టికెట్ల అమ్మకాల్లో గోల్మాల్ చేశాడని ఆరోపించాడు. తనతో పాటు తన ప్యానెల్ మొత్తాన్ని అజహర్ పక్కకు పెట్టాడని, ఎవరి ప్రమేయం లేకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని అన్నాడు. -
IND VS NZ 1st ODI: అనూహ్య పరిణామం.. తుది జట్టులో సూర్యకుమార్..!
స్వదేశంలో న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (జనవరి 18) ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తొలి వన్డేకు కొద్ది గంటల ముందు స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టు నుంచి వైదొలగడంతో (వన్డే సిరీస్ మొత్తానికి) అప్పటివరకు తుది జట్టులో ప్లేస్ గ్యారెంటీ లేని సూర్యకుమార్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. బీసీసీఐ.. శ్రేయస్ స్థానాన్ని రజత్ పాటిదార్‌తో భర్తీ చేసినప్పటికీ, అతన్ని తుది జట్టుకు ఎంపిక చేయడం దాదాపుగా అసాధ్యమేనని తెలుస్తోంది. దీంతో స్కై ఐదో స్థానంలో బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సూర్యకుమార్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నప్పటికీ, వన్డేల్లో సీనియర్ల హవాతో అతనికి తుది జట్టులో చోటు లభించడం లేదు. ఇటీవల లంకతో జరిగిన మూడో టీ20లో స్కై విధ్వంసకర శతకం బాదినప్పటికీ.. అదే జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో స్థానం లభించలేదు. కివీస్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో సూర్యకు స్థానం లభించినప్పటికీ.. అతనికి బలమైన పోటీదారుగా శ్రేయస్ ఉండి ఉండటంతో స్కై ఆశలు వదులుకున్నాడు. అయితే అనూహ్యంగా శ్రేయస్ గాయపడటంతో సూర్యకు వన్డే సిరీస్ మొత్తం ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ విషయాన్ని పక్కకు పెడితే.. కివీస్‌తో తొలి వన్డే బరిలో దిగబోయే భారత తుది జట్టు (అంచనా) ఎలా ఉండబోతుందంటే.. కేఎల్ రాహుల్ పెళ్లి నిమిత్తం సెలవులో ఉండటంతో వికెట్‌కీపర్ కోటాలో ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖరారైంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ కోసం పరుగుల యంత్రం విరాట్ కోహ్లి తన వన్‌డౌన్ స్థానాన్ని త్యాగం చేయవచ్చు. గిల్ వన్‌డౌన్‌లో వస్తే కోహ్లి నాలుగో స్థానంలో, సూర్యకుమార్ ఐదో ప్లేస్‌లో, ఆతర్వాత హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో ఉండవచ్చు. ఒకవేళ టీమిండియా అదనపు స్పిన్నర్‌ను బరిలోకి దించాలని భావిస్తే ఉమ్రాన్ మాలిక్ ప్లేస్‌లో చహల్ తుది జట్టులోకి రావచ్చు. హైదరాబాద్ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
సెంచరీ, డబుల్ సెంచరీ చేసినా టీమిండియాలో చోటుకు దిక్కు లేదు.. ఏంటీ పరిస్థితి..?
IND VS SL 1st ODI: భారత్-శ్రీలంక జట్ల మధ్య గౌహతి వేదికగా ఇవాళ (జనవరి 10) తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70), విరాట్ కోహ్లి (79 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 41 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కోహ్లికి జతగా హార్ధిక్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39)లకు కూడా మంచి ఆరంభమే లభించినప్పటికీ.. అనవసర షాట్లకు ప్రయత్నించి ఔటయ్యారు. లంక బౌలర్లలో మధుశంక, దసున్ షనక, ధనంజయ డిసిల్వలకు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పు పలు వివాదాలకు తెరలేపింది. పలువురు ఆటగాళ్లు తమ చివరి మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించినా.. తుది జట్టులో చోటు సంపాదించలేకపోయారు. ఈ విషయమే ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత మ్యాచ్‌లో (లంకతో మూడో టీ20) విధ్వంసకర శతకం సాధించిన సూర్యకుమార్, తానాడిన చివరి వన్డేలో (బంగ్లాతో మూడో వన్డే) ఏకంగా డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్, బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ (8 వికెట్లు, 40 పరుగులు) లంకతో జరుగుతున్న తొలి వన్డేలో చోటు దక్కించుకోలేకపోయారు. ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నా, జట్టు సమతూకం పేరుతో వారిని పక్కకు పెట్టడం ఎంత మాత్రం సమజసం కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పెద్దగా ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ కోసం సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టు నుంచి తప్పించడం విఢ్డూరంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మంచి ఫామ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్‌ను కాదని చహల్‌ను ఆడించడం ఏంటని మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తున్నారు. ఇషాన్ కిషన్ విషయంలో జట్టు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు దారుణమని అంటున్నారు. ఆటగాళ్లు రాణిస్తున్నా ఏదో ఒక కారణం చెప్పి పక్కన పెడితే మిగతా ఆటగాళ్లలో కూడా అభద్రతా భావం పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. -
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి
గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో శతకం దిశగా దూసుకుపోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (92) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ మార్కును అందుకునేందుకు 257 మ్యాచ్‌లు అవసరం కాగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఈ ఫీట్ సాధించేందుకు ఏకంగా 310 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. మరోవైపు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌కు 12500 పరుగులు చేసేందుకు 328 మ్యాచ్‌లు తీసుకున్నాడు. కోహ్లి వన్డేల్లో 57.88 సగటున ఈ పరుగులు స్కోర్ చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70), విరాట్ కోహ్లి (92 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 45 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39), హార్ధిక్ పాండ్యా (14) ఔట్ కాగా.. కోహ్లి జతగా అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నాడు. -
క్యాచ్‌కు కనీస ప్రయత్నం చేయని సుందర్.. బండ బూతులతో విరుచుకుపడిన కెప్టెన్
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా వికెట్ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టీమిండియా నిర్ధేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్.. మెహిది హసన్ (38 నాటౌట్), ముస్తాఫిజుర్ (10 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. మెహిది హసన్, ముస్తాఫిజుర్ చివరి వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, టీమిండియా చేతుల్లో నుంచి గెలుపును లాగేసుకున్నారు. We lost here..#KLRahul #INDvsBANpic.twitter.com/Qfr5Os4PbM — Tanay Vasu (@tanayvasu) December 4, 2022 ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్లు చేసిన ఘోర తప్పిదాలు బంగ్లాదేశ్ పాలిట వరాల్లా మారాయి. అంతవరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు సైతం ఫీల్డర్ల చెత్త ప్రదర్శనతో ఒక్కసారిగా ఢీలా పడిపోయి, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బంగ్లా విజయానికి 51 పరుగులు అవసరం కాగా.. టీమిండియా బౌలర్లు తమ విజయానికి అవసరమైన ఒక్క వికెట్‌ను పడగొట్టలేకపోయారు. భారత ఫీల్డర్లు.. లేని పరుగులు ఇచ్చి, బౌండరీ వెళ్లేందుకు బంతికి దారి చూపి బంగ్లాదేశ్ విజయానికి దోహదపడ్డారు. pic.twitter.com/ZJTDLWahM3 — Rahul Chauhan (@ImRahulCSK11) December 4, 2022 కీలక సమయంలో (42.3వ ఓవర్లో, అప్పటికి బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 32 పరుగులు (155/9) అవసరం ఉండింది) కేఎల్ రాహుల్.. మెహిది హసన్ క్యాచ్ జారవిడిచి టీమిండియా ఓటమికి ప్రధాన కారణం కాగా, ఆతర్వాతి బంతికి క్యాచ్‌ను పట్టుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయని సుందర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటికే పలు బౌండరీలు వదిలేసిన సుందర్‌పై కోపంగా ఉన్న రోహిత్.. క్యాచ్‌కు కనీస ప్రయత్నం కూడా చేయకపోవడంతో సహనం కోల్పోయి, బండ బూతులతో విరుచుకుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా.. రాహుల్, సుందర్ ఇచ్చిన లైఫ్‌ల తర్వాత చెలరేగిపోయిన మెహిది హసన్.. ముస్తాఫిజుర్ సహకారంతో ఫోర్లు, సిక్సర్లు బాది బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. -
కొంపముంచిన కేఎల్ రాహుల్.. టీమిండియా ఓటమికి ప్రధాన కారణమయ్యాడు
3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 4) జరిగిన తొలి వన్డేలో టీమిండియా వికెట్ తేడాతో ఓటమిపాలైంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో.. బంగ్లా బ్యాటర్ మెహిది హసన్ (38 నాటౌట్), టెయిలెండర్ ముస్తాఫిజుర్ (10 నాటౌట్) సహకారంతో బంగ్లాదేశ్‌కు చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెహిది, ముస్తాఫిజుర్ చివరి వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, టీమిండియా విజయావకాశాలపై నీళ్లు చాల్లారు. 136 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్‌ను భారత ఫీల్డర్లు తమకు మాత్రమే సాధ్యమైన చెత్త ప్రదర్శనతో గెలిపించారు. లేని పరుగులు ఇచ్చి, బౌండరీ వెళ్లేందుకు బంతికి దారి చూపి బంగ్లాదేశ్ విజయానికి దోహదపడ్డారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ కీలక సమయంలో మెహిది హసన్ క్యాచ్ జారవిడిచి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. We lost here..#KLRahul #INDvsBANpic.twitter.com/Qfr5Os4PbM — Tanay Vasu (@tanayvasu) December 4, 2022 42.3వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేవగా, సునాయాసంగా అందుకోవాల్సిన క్యాచ్‌ను రాహుల్ జారవిడిచాడు. అప్పటికి బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 32 పరుగులు (155/9) అవసరం ఉండింది. ఈ క్యాచ్‌ను రాహుల్ పట్టుకున్నట్లయితే టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించి ఉండేది. రాహుల్ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగిపోయిన మెహిది హసన్.. ముస్తాఫిజుర్ సహకారంతో ఫోర్లు, సిక్సర్లు బాది ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. టీమిండియా బౌలర్లు సిరాజ్ (3/32), కుల్దీప్ సేన్ (2/37), సుందర్ (2/17), శార్ధూల్ ఠాకూర్ (1/15), దీపక్ చాహర్ (1/32) దెబ్బకు 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ.. మెహిది హసన్, ముస్తాఫిజుర్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి తమ జట్టుకు చారిత్రక విజయాన్ని (46 ఓవర్లలో 187/9) అందించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా డిసెంబర్ 7న జరుగనుంది. -
టీమిండియాకు భారీ షాక్.. ఉత్కంఠ సమరంలో బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాభవం
టీమిండియాకు పసికూన బంగ్లాదేశ్ భారీ షాకిచ్చింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 4) జరిగిన తొలి వన్డేలో బంగ్లా పులులు టీమిండియాపై వికెట్ తేడాతో విజయం సాధించి, సంచలనం సృష్టించారు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో.. బంగ్లా బ్యాటర్ మెహిది హసన్ (38 నాటౌట్), టెయిలెండర్ ముస్తాఫిజుర్ (10 నాటౌట్) సహకారంతో బంగ్లాదేశ్‌కు చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. మెహిది, ముస్తాఫిజుర్ చివరి వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, టీమిండియా విజయావకాశాలపై నీళ్లు చాల్లారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల చెత్త ప్రదర్శన ఓటమికి ప్రధాన కారణమైంది. 136 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్‌ను భారత ఫీల్డర్లు దగ్గరుండి మరీ గెలిపించారు. 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. టీమిండియా నిర్ధేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. టీమిండియా బౌలర్లు సిరాజ్ (3/32), కుల్దీప్ సేన్ (2/37), సుందర్ (2/17), శార్ధూల్ ఠాకూర్ (1/15), దీపక్ చాహర్ (1/32) దెబ్బకు 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ.. మెహిది హసన్, ముస్తాఫిజుర్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి తమ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా డిసెంబర్ 7న జరుగనుంది. -
ఫ్లయింగ్ కింగ్ 'కోహ్లి'.. కళ్లు చెదిరే క్యాచ్‌తో అబ్బురపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్
Virat Kohli: పరుగుల యంత్రం, బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి.. ఫీల్డింగ్‌లోనూ కింగ్ అనిపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 4) జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఓ అద్భుతమైన క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ 23వ ఓవర్ 3వ బంతికి కళ్లు చెదిరే ఫ్లయింగ్ క్యాచ్ అందుకున్న కోహ్లి.. అప్పటికే సెట్ అయిన కీలక ప్లేయర్ షకీబ్ అల్ హసన్ (29)ను పెవిలియన్‌కు సాగనంపాడు. విరాట్ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కింగేనని అభిమానులు అభినందిస్తున్నారు. Brilliant by #ViratKohli 🦅#INDvsBAN #BANvIND #CricketTwitter pic.twitter.com/LLfKEBUfq5 — Rohit Yadav (@rohityadav1098) December 4, 2022 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. అనంతరం 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. టీమిండియా బౌలర్ల ధాటికి 38.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసి ఓటమి దిశగా పయనిస్తుంది. బంగ్లా గెలవాలంటే 70 బంతుల్లో మరో 53 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో కొత్త బ్యాటర్లు మెహిది హసన్ (0), ఎబాదత్ హొస్సేన్ (0) ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్న రోహిత్.. వన్డే వరల్డ్‌కప్ వరకైనా ఉంటాడా..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతుండటం భారత క్రికెట్ అభిమానులకు చెడ్డ చిరాకు తెప్పిస్తుంది. పేరుకు కెప్టెన్ కానీ.. ఈ బాధ్యతలు చేపట్టాక అతని వైఫల్యాల రేటు మరింత పెరిగింది. ఈ ఫార్మాట్, ఆ ఫార్మాట్ అని తేడా లేకుండా అన్నింటిలోనూ హిట్‌మ్యాన్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది అతని ట్రాక్ రికార్డు చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. ఈ ఏడాది 3 టెస్ట్ ఇన్నింగ్స్‌లు (శ్రీలంక) ఆడిన హిట్‌మ్యాన్.. 30 సగటున కేవలం 90 పరుగులు (29, 15, 46) మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు. వన్డేల విషయానికొస్తే.. ఈ ఏడాది (ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డే కలుపుకుని) ఇప్పటివరకు 8 వన్డేలు ఆడిన రోహిత్.. 32 సగటున 235 పరుగులు (27, 17, 0, 76, 13, 5, 60, 37) చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది పొట్టి క్రికెట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్.. ఈ ఫార్మాట్లో మరింత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌తో కలుపుకుని ఈ ఏడాది మొత్తం 29 మ్యాచ్‌లు ఆడిన అతను.. 134 స్ట్రయిక్ రేట్‌తో 656 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ మినహాయించి అన్ని మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనూ తన వైఫల్యాల పరంపరను కొనసాగించిన టీమిండియా కెప్టెన్.. ఈ మ్యాచ్‌లో 31 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో హిట్‌మ్యాన్ దారణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్సీ కథ దేవుడెరుగు, వన్డే వరల్డ్‌కప్ వరకు కనీసం జట్టులోనైనా కొనసాగుతాడా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు అన్న పేరుతో ఇప్పటికే టీ20ల్లో హిట్‌మ్యాన్ స్థానానికి ఎసరుపెట్టిన బీసీసీఐ.. ఇదే ఫామ్ కొనసాగిస్తే వన్డేలు, టెస్ట్‌ల నంచి కూడా తప్పించి ఇంట్లో కూర్చోబెడుతుందని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. అయితే, కెప్టెన్సీ విషయంలో, జట్టులో స్థానం విషయంలో రోహిత్ అభిమానులు మాత్రం అతనికి అండగా ఉన్నారు. అతను ఎంత చెత్త ఫామ్‌లో ఉన్నా అతనికి మద్దతు కొనసాగిస్తున్నారు. త్వరలో హిట్‌మ్యాన్ కూడా కోహ్లి లాగే పుంజుకుంటాడని, రోహిత్ ఫామ్‌లోకి వస్తే అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 4) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం చెందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. -
టీమిండియాను తిప్పేసిన షకీబ్.. దెబ్బకొట్టిన ఎబాదత్
3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 4) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం చెందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు పడగొట్టాడు. తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన షకీబ్.. 2 మెయిడిన్లు వేసి కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కెరీర్లో 2వ వన్డే ఆడుతున్న పేసర్ ఎబాదత్ హొస్సేన్ 8.2 ఓవర్లు వేసి శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌లను పెవిలియన్‌కు పంపాడు. శిఖర్ ధవన్ వికెట్ హసన్ మిరాజ్‌కు దక్కింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహముద్ సైతం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 7 ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హసన్ మహముద్ 7 ఓవర్లలో మెయిడిన్ వేసి 40 పరుగులు సమర్పించుకున్నాడు. -
IND Vs BAN 1st ODI: పంత్‌కు మరో అవకాశం, టీమిండియాకు ఆప్షన్ లేదు..!
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఢాకాలోకి షేర్ ఏ బంగ్లా స్టేడియం వేదికగా రేపు (డిసెంబర్ 4) ఉదయం 11:30 గంటలకు తొలి వన్డే జరుగనుంది. న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న టీమిండియా సీనియర్లు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనుండటంతో తుది జట్టు ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా రేపటి వన్డేలో పంత్ ఆడబోతున్నాడా లేదా అన్న అంశంపై టీమిండియా అభిమానుల మధ్య భారీ డిస్కషన్ నడుస్తుంది. మరోవైపు సీనియర్లను కాదని జూనియర్లలో ఎవరికైనా ఛాన్స్ దొరుకుందా అన్న చర్చ సైతం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో రేపటి వన్డేలో భారత తుది జట్టు కూర్పుపై విశ్లేషకులు తమ అంచనాలను వెల్లడించారు. విశ్లేషకుల అంచనా మేరకు.. సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్‌లు చాలా తక్కువనే చెప్పాలి. రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ సేన్ అవకాశం కోసం వెయిట్ చేయక తప్పదని కచ్చితంగా తెలుస్తోంది. న్యూజిలాండ్ టూర్లో దారుణంగా విఫలమైన శార్దూల్ ఠాకూర్ సైతం అవకాశం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. పోతే మిగిలింది ఇషాన్ కిషన్. జట్టులో రిషబ్ పంత్ ఉండగా, ఇషాన్‌ను తుది జట్టులో ఆడించే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ బరిలోకి దిగడం ఖాయం కాగా, వన్ డౌన్లో కోహ్లి, నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్, ఐదో ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్, ఆరో స్థానంలో రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ల కోటాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, పేసర్లుగా మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ బరిలోకి దిగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్. -
టీమిండియా చెత్త రికార్డు.. చరిత్రలో తొలిసారి ఇలా..!
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 25) జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న టీమిండియా.. ఓ చెత్త రికార్డును సైతం ఖాతాలో వేసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ గడ్డపై వరుసగా 4 వన్డే మ్యాచ్‌ల్లో ఓడి అభాసుపాలైంది. 2020లో జరిగిన సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన భారత జట్టు.. తాజా పరాజాయంతో కివీస్ గడ్డపై వరుసగా నాలుగో పరాజయాన్ని నమోదు చేసింది. గత పర్యటనలో తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో, రెండో వన్డేలో 22 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిన భారత్.. 2022 పర్యటనలో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో చెత్త రికార్డు (25 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిస్తే.. టీమిండియా 14 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది) కలిగిన భారత్.. తాజా పరాజయంతో మరో అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్స్‌లో మాత్రం టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 106 మ్యాచ్‌లు జరగ్గా టీమిండియా 55, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్‌మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేయగా, 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ మరో 17 బంతులు మిగిలుండగానే ఆడుతూపాడుతూ విజయం సాధించింది. టామ్ లాథమ్ (104 బంతుల్లో 145; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) భారీ అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. -
మరీ ఇంత దారుణమా.. టీమిండియా బౌలర్లపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్
టీమిండియా చేతిలో 0-1 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (నవంబర్ 25) జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్‌మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేయగా, 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ మరో 17 బంతులు మిగిలుండగానే ఆడుతూపాడుతూ విజయం సాధించింది. టామ్ లాథమ్ (104 బంతుల్లో 145; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) భారీ అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేక దారుణంగా విఫలమైన టీమిండియా బౌలర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత పేలవమైన బౌలింగా అని మండిపడుతున్నారు. భారత బౌలర్ల ప్రదర్శన నానాటికీ మరీ తీసికట్టుగా మారుతుందని ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా.. కీలక దశలో ఒకే ఓవర్లో 25 పరుగులు సమర్పించుకుని, జట్టు ఓటమికి ప్రధాన కారణమైన శార్దూల్ ఠాకూర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. శార్దూల్‌ను బౌలర్ అనే వాడిని గూబ గుయ్ అనేలా వాయించాలని సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 8.1 ఓవర్లు వేసి 68 పరుగులు సమర్పించుకున్న అర్షదీప్‌ను సైతం ఏకి పారేస్తున్నారు. మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంట్రా బాబూ అని తలలుపట్టుకుంటున్నారు. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ అని గొప్పలు చెప్పుకున్న ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించినా, ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో మండిపడుతున్నారు. ఎన్ని మ్యాచ్‌లు అవకాశం ఇచ్చినా చహల్ తీరు మారడం లేదని, ఇతన్ని కూడా పక్కకు పెడితే బుద్ధి వస్తుందని అంటున్నారు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ (4.2 ఎకానమీ)ను మినహాయించి భారత బౌలర్లందరిపై ఓ రేంజ్లో దుమ్మెత్తిపోస్తున్నారు. -
IND VS NZ 1st ODI: టీమిండియా కొంపముంచిన శార్దూల్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విజయం దిశగా సాగుతున్న టీమిండియాను శార్దూల్ ఠాకూర్ భ్రష్టు పట్టించాడు. ఒకే ఓవర్లో 25 పరుగులు (4 ఫోర్లు, సిక్స్, 2 వైడ్లు) సమర్పించుకుని టీమిండియా కొంపముంచాడు. అప్పటి దాకా న్యూజిలాండ్ గెలుపుకు 66 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉండగా.. శార్దూల్ దెబ్బకు సమీకరణలు (60 బంతుల్లో 66) ఒక్కసారిగా మారిపోయాయి. మ్యాచ్ కివీస్‌పైపు తిరిగింది. ఇన్నింగ్స్ 40వ ఓవర్ వేసిన శార్దూల్‌ను టామ్ లాథమ్ ఆటాడుకున్నాడు. ఆ ఓవర్‌కు ముందు 70 బంతుల్లో 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్న టామ్.. 40వ ఓవర్ ఆఖరి బంతికి సింగల్ తీసి కెరీర్లో 7వ సెంచరీ (76 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. శార్దూల్ ఒకే ఓవర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో.. న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. ఒక్క ఓవర్‌తో మ్యాచ్ మొత్తాన్ని చెడగొట్టిన శార్దూల్‌ను టీమిండియా అభిమానులు ఆడుకుంటున్నారు. ఈ మాత్రం సంబరానికి ఈయనని ఆడించడం ఎందుకని మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. బ్యాటింగ్‌లో కూడా చేసిందేమీ లేదు.. ఇలాంటి వాళ్లను ఆల్‌రౌండర్‌గా ఎలా పరిగణిస్తారని సెలక్టర్లపై ధ్వజమెత్తుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్‌మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. -
నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్.. విలవిలలాడిన కివీస్ బ్యాటర్స్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 25) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్‌మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. అనంతరం 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆచితూచి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. 8వ ఓవర్లో శార్ధూల్ ఠాకూర్.. ఫిన్ అలెన్‌ను (22) బోల్తా కొట్టించడంతో న్యూజిలాండ్ తొలి వికెట్ (35 పరుగుల వద్ద) కోల్పోయింది. ఈ మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. లేట్‌గా బంతిని అందుకున్నాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌల్ చేసిన ఉమ్రాన్.. తొలి బంతి నుంచే నిప్పులు చెరుగుతూ ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ప్రతి బంతిని దాదాపుగా 150కిమీ వేగంతో సంధించిన ఉమ్రాన్.. తన స్పెల్ మూడో ఓవర్లో (ఇన్నింగ్స్ 16వ ఓవర్) తొలి వికెట్ పడగొట్టాడు. డేంజరెస్ డెవాన్ కాన్వేను (24) ఉమ్రాన్ బోల్తా కొట్టించాడు. ఆపై తన 5వ ఓవర్లో ఉమ్రాన్ మరో వికెట్ తీశాడు. జట్టు స్కోర్ 88 పరుగుల వద్ద (19.5 ఓవర్లు) ఉండగా డారిల్ మిచెల్ (11)ను పెవిలియన్‌కు సాగనంపాడు. 20 ఓవర్లు ముగిసే సమయానికి.. తన స్పెల్‌లో 5 ఓవర్లు పూర్తి చేసిన ఉమ్రాన్ 19 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ పేస్‌కు తట్టుకోలేక కివీస్ బ్యాటర్లు బెంబేలెత్తిపోతుండగా.. టీమిండియా ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. ఇక ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆగదంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. -
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. మరోసారి సూర్య భాయ్ విధ్వంసం ఖాయమేనా..?
IND VS NZ 1st ODI: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా రేపు (నవంబర్ 25) తొలి వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. వరుణుడు కటాక్షిస్తే.. ఈ మ్యాచ్ 50 ఓవర్ల పాటు సాగే అవకాశం ఉంది. అయితే, వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పలు మార్లు వర్షం అంతరాయం తప్పిదని పేర్కొని ఉంది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడకూడదని దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుని జోరుమీదున్న టీమిండియా.. వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. ధవన్ కెప్టెన్సీలో యువ భారత జట్టు.. కేన్ మామ టీమ్‌ను మట్టికరిపించాలని ఉరకలేస్తుంది. రేపు జరుగబోయే తొలి వన్డేలో అందరీ కళ్లు సూర్యకుమార్ యాదవ్‌పైనే ఉంటాయి. రెండో టీ20లో సుడిగాలి శతకం బాది ఊపు మీద ఉన్న స్కై.. వన్డే సిరీస్‌లో ఎలా చెలరేగి పోతాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డేల్లో ఇప్పటివరకు సెంచరీ చేయని స్కై.. రేపటి మ్యాచ్‌లో బోణీ చేయడం ఖాయమని అతని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 13 వన్డేలు ఆడిన అతను.. 34 సగటున, 98.84 స్ట్రయిక్ రేట్‌తో 340 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలు చూసిన సూర్య అభిమానులు.. తమ ఆరాధ్య క్రికెట్ స్థాయికి ఈ గణాంకాలు కరెక్ట్ కాదని, రేపటి మ్యాచ్‌లో సెంచరీ చేసి లెక్కలను సరి చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని అంచనాల నడుమ రేపటి మ్యాచ్‌లో సూర్య భాయ్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. -
India vs South Africa: సంజూ పోరాటం వృదా.. తొలి వన్డేలో భారత్ ఓటమి
లక్నో: స్టార్లు లేని భారత జట్టు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 పరుగుల తేడాతో సఫారీ టీమ్ చేతిలో పరాజయం చవిచూసింది. ఆఖరి ఓవర్లో 31 పరుగులు కావాల్సివుండగా, సామ్సన్ వరుసగా 6, 4, 4 బాది ఆశలు పెంచాడు. కానీ తర్వాత 0, 4, 1 రావడంతో ఓటమి తప్పలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. మొదట దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (65 బంతుల్లో 74నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (63 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 17.4 ఓవర్లలో అభేద్యంగా 139 పరుగులు జోడించారు. శార్దుల్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 40 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసి ఓడింది. సంజు సామ్సన్ (63 బంతుల్లో 86 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 50; 8 ఫోర్లు) మెరిపించారు. ఇన్‌గిడి 3, రబడ 2 వికెట్లు పడగొట్టారు. చెలరేగిన మిల్లర్, క్లాసెన్ టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన సఫారీ ఓపెనర్లు డికాక్ (54 బంతుల్లో 48; 5 ఫోర్లు), జేన్‌మన్ మలాన్ (42 బంతుల్లో 22; 3 ఫోర్లు) మంచి ఆరంభాన్నే ఇచ్చారు. 12 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 49 పరుగులు చేసిన దక్షిణాఫ్రికాను శార్దుల్ ఠాకూర్ తొలి దెబ్బ తీశాడు. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి మలాన్ నిష్క్రమించగా, తర్వాత వచ్చిన బవుమా (8), మార్క్రమ్లను భారత బౌలర్లు క్రీజులో నిలువనీయలేదు. కెప్టెన్ బవుమాను శార్దుల్, మార్క్రమ్ (0) స్పిన్నర్ కుల్దీప్ బౌల్డ్ చేశారు. 71 పరుగుల వద్ద మూడో వికెట్ కూలింది. అడపాదడపా బౌండరీలు కొడుతూ నింపాదిగా ఆడుతున్న డికాక్ జట్టు స్కోరు 100 దాటాక రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత క్లాసెన్‌కు మిల్లర్ జతయ్యాడు. ఇద్దరు మొదట కుదురుగా ఆడారు. తర్వాత పరుగుల వేగం పెంచారు. ఆఖరి 10 ఓవర్లలో ధాటిగా ఆడారు. ఈ క్రమంలో ముందుగా మిల్లర్ 50 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్), రెండు బంతుల వ్యవధిలో క్లాసెన్ 52 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. దీంతో జట్టు స్కోరు 200 పరుగుల మైలురాయి దాటింది. ఇవన్నీ అవేశ్ ఖాన్ వేసిన 36వ ఓవర్లోనే జరిగాయి. ఆ ఓవర్లో 12 పరుగులు సమర్పించుకున్న అతని తదుపరి ఓవర్లో (38) మిల్లర్ 4, 6 బాదేయడంతో 16 పరుగులు వచ్చాయి. ఆఖరి 10 ఓవర్లలో ఈ జోడీ 85 పరుగులు జతచేసింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు మిల్లర్, క్లాసెన్ 139 పరుగులు జోడించారు. డెత్ ఓవర్లలో మిల్లర్ క్యాచ్‌ను గైక్వాడ్, క్లాసెన్ క్యాచ్‌ను సిరాజ్ నేలపాలు చేయడం కూడా స్కోరు పెరిగేందుకు దోహదం చేసింది. మెరిపించిన శ్రేయస్, సామ్సన్ భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత టాపార్డర్ నిరాశపరిచింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (3), శిఖర్ ధావన్ (4) సహా వన్‌డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (42 బంతుల్లో 19; 1 ఫోర్) వికెట్లను కోల్పోయింది. ఐపీఎల్లో దంచేసే గైక్వాడ్, ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 20; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడటంతో టి20ల మైకంలో ఉన్న భారత ప్రేక్షకుల్ని వన్డే మ్యాచ్ చాలాసేపు బోర్ కొట్టించింది. 3, 4, 5 ఓవర్ల (మెయిడిన్)లో ఒక్క పరుగు రాలేదు. 18వ ఓవర్లో టీమిండియా స్కోరు 50 పరుగులు చేరిందంటే బ్యాటింగ్ ఎంత చప్పగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 51 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయిన దశలో శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్ కాసేపు క్రికెట్ మజాను అందించారు. షమ్సీ వేసిన 19వ ఓవర్లో అయ్యర్ 4, సామ్సన్ సిక్సర్ బాదడంతో తొలిసారిగా ఒక ఓవర్లో 15 పరుగులొచ్చాయి. ముఖ్యంగా అయ్యర్ బౌండరీలతో అదరగొట్టాడు. షమ్సీ 21వ ఓవర్లో ‘హ్యాట్రిక్’ ఫోర్లు కొట్టాడు. ఇన్‌గిడి బౌలింగ్‌కు దిగితే అతనికి తన బ్యాటింగ్ సత్తా చూపించాడు. దీంతో 22.3 ఓవర్లో భారత్ 100 చేరింది. అదే జోరుతో శ్రేయస్ 33 బంతుల్లో (8 ఫోర్లు) మెరుపు వేగంతో అర్ధసెంచరీ సాధించాడు. కానీ అదే స్కోరు వద్దే ఇన్‌గిడి అతన్ని బోల్తా కొట్టించాడు. తర్వాత శార్దుల్ ఠాకూర్ వచ్చాక సంజూ వేగం పెంచాడు. 31.1 ఓవర్లో జట్టు స్కోరు 150కి చేరింది. ఇంకా భారత్ విజయానికి 8.5 ఓవర్లలోనే 100 పరుగులు కావాలి. టి20లకు కూడా కష్టమయ్యే చేజింగ్ వన్డేల్లో అసాధ్యం! సామ్సన్, శార్దుల్ (31 బంతుల్లో 33; 5 ఫోర్లు)ధాటిగా ఆడినా కొండంత రన్‌రేట్ కరగలేదు. 49 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్సర్లు) సంజూ అర్ధసెంచరీ సాధించాడు. శార్దుల్ అవుటయ్యా క స్వల్ప వ్యవధిలో కుల్దీప్ (0), అవేశ్ (3) వికెట్లను కోల్పోయింది. దీంతో ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మలాన్ (సి) అయ్యర్ (బి) శార్దుల్ 22; డికాక్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 48; బవుమా (బి) శార్దుల్ 8; మార్క్రమ్ (బి) కుల్దీప్ 0; క్లాసెన్ నాటౌట్ 74; మిల్లర్ నాటౌట్ 75; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (40 ఓవర్లలో 4 వికెట్లకు) 249. వికెట్ల పతనం: 1–49, 2–70, 3–71, 4–110. బౌలింగ్: సిరాజ్ 8–0–49–0, అవేశ్ 8–0–51–0, శార్దుల్ 8–1–35–2, రవి బిష్ణోయ్ 8–0–69–1, కుల్దీప్ 8–0–39–1. భారత్ ఇన్నింగ్స్: ధావన్ (బి) పార్నెల్ 4; గిల్ (బి) రబడ 3; రుతురాజ్ (స్టంప్డ్) డికాక్ (బి) షమ్సీ 19; ఇషాన్ కిషన్ (సి) మలాన్ (బి) కేశవ్ 20; అయ్యర్ (సి) రబడ (బి) ఇన్‌గిడి 50; సామ్సన్ నాటౌట్ 86; శార్దుల్ (సి) కేశవ్ (బి) ఇన్‌గిడి 33; కుల్దీప్ (సి) బవుమా (బి) ఇన్‌గిడి 0; అవేశ్ (సి) బవుమా (బి) రబడ 3; బిష్ణోయ్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (40 ఓవర్లలో 8 వికెట్లకు) వికెట్ల పతనం: 1–8, 2–8, 3–48, 4–51, 5–118, 6–211, 7–211, 8–215. బౌలింగ్: రబడ 8–2–36–2, పార్నెల్ 8–1–38–1, కేశవ్ 8–1–23–1, ఇన్‌గిడి 8–0–52–3, షమ్సీ 8–0–89–1. -
జులన్‌కు ఘనమైన వీడ్కోలే లక్ష్యంగా...
హోవ్: పొట్టి ఫార్మాట్లో నిరాశపరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉంది. టి20ల్లో పేలవమైన ఆటతీరుతో హర్మన్‌ప్రీత్ జట్టు 1–2తో ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను అప్పగించింది. కానీ ఇప్పుడు దిగ్గజ బౌలర్ జులన్ గోస్వామికి ఇది ఆఖరి సిరీస్ కావడంతో సిరీస్ గెలిచి తమ సహచర క్రీడాకారిణికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అమ్మాయిలంతా బాధ్యత కనబరిస్తే గత వైఫల్యాల్ని అధిగమించవచ్చు. ముందుగా ఆదివారం జరిగే తొలి వన్డేలో శుభారంభం చేస్తే సిరీస్‌పై పట్టుసాధించవచ్చని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. టాపార్డర్‌లో స్మృతి, షఫాలీ సహా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డితే మిగతా వారికి పని సులువవుతుంది. మరోవైపు ఆతిథ్య జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ హీథెర్‌నైట్ గాయంతో దూరమవడం ఇబ్బందికరం. అయితే ఇంగ్లండ్ మంచి ఆల్‌రౌండ్ జట్టు. పైగా టి20 సిరీస్ గెలిచిన ఊపు మీదుంది. ఇదే జోరుతో సొంతగడ్డపై వరుసగా మరో సిరీస్‌పై కన్నేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లే, డానీ వ్యాట్, మూడోస్థానంలో అలైస్ కాప్సీ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసివస్తోంది. బౌలింగ్‌లోనూ సోఫీ ఎకిల్‌స్టోన్, ఫ్రెయా డెవిస్ భారత బ్యాటర్లపై ప్రభావం చూపగలరు. -
క్యారీ, గ్రీన్ల అద్భుత పోరాటం.. ఆసక్తికర పోరులో కివీస్‌ను ఓడించిన ఆసీస్
3 వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ కెయిన్స్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 6) తొలి వన్డే ఆడింది. చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అలెక్స్ క్యారీ (99 బంతుల్లో 85; 8 ఫోర్లు, సిక్స్), కెమరూన్ గ్రీన్ (92 బంతుల్లో 89 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్)లు అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ముఖ్యంగా గ్రీన్ చివరి నిమిషం వరకు క్రీజ్‌లో ఉండి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఆసీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (68 బంతుల్లో 46; 4 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ విలియమ్సన్ (71 బంతుల్లో 45; 3 ఫోర్లు, సిక్స్), వికెట్‌కీపర్ టామ్ లాథమ్ (57 బంతుల్లో 43; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 4, హేజిల్‌వుడ్ 3, స్టార్క్, జంపా తలో వికెట్ పడగొట్టారు. Wow, that was some contest! Cameron Green (89no), Alex Carey (85) and Glenn Maxwell (4-52) impress in the Chappell-Hadlee series opener in Cairns #AUSvNZ pic.twitter.com/rxXnwpeb7Y— Cricket Australia (@CricketAus) September 6, 2022 అనంతరం 233 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అలెక్స్ క్యారీ, కెమరూన్ గ్రీన్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్‌ను గెలిపించారు. గ్రీన్ తొమ్మిదో వికెట్‌కు ఆడమ్ జంపాతో (13 నాటౌట్) కలిసి 26 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ట్రెంట్ బౌల్ట్ (4/40), మ్యాట్ హెన్రీ (2/50)లు ఆసీస్‌ను వణికించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా సెప్టెంబర్ 8న జరుగనుంది. చదవండి: రైనా రిటైర్మెంట్పై స్పందించిన చెన్నై యాజమాన్యం -
India vs Zimbabwe 1st ODI: శుభారంభం ఓపెనర్లతోనే...
వరుస పర్యటనలో, వరుస సిరీస్ వేటలో భారత్ శుభారంభం చేసింది. చాలా కాలం తర్వాత పునరాగమనం చేసిన దీపక్ చహర్ (3/27) బౌలింగ్‌లో జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్‌ను బెంబేలెత్తిస్తే... విజయవంతమైన గిల్–ధావన్ ఓపెనింగ్ జోడి మరొకరికి చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. హరారే: ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ అజేయ అర్ధసెంచరీల కంటే కూడా దీపక్ చహర్ స్పెల్ (7–0–27–3) ఈ మ్యాచ్‌లో హైలైట్. ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన చహర్ పిచ్ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొని వైవిధ్యమైన బంతులతో టాపార్డర్‌లో ఏ ఒక్కరిని పట్టుమని 10 పరుగులైనా చేయనివ్వలేదు. ఛేదన సులువయ్యేందుకు అతని స్పెల్ కారణమైంది. ఇదే పిచ్‌పై రెండు వారాల క్రితం వరుస మ్యాచ్‌ల్లో 290, 303 పరుగులు నమోదయ్యాయి. సులువుగా ఛేదించడం కూడా జరిగింది. అలాంటి పిచ్‌పై చహర్ బౌలింగ్ అసాధారణమనే చెప్పాలి. దీంతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రెగిస్ చకాబ్వా (51 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచర్డ్ ఎన్గరవా (42 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), ఇవాన్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మన బౌలింగ్‌కు కాస్త ఎదురు నిలిచారు. స్పిన్నర్ అక్షర్ పటేల్, సీమర్లు దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ తలా 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 30.5 ఓవర్లలో అసలు వికెట్టే కోల్పోకుండా 192 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (72 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), ధావన్ (113 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించేశారు. చహర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభించింది. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. చహర్ దెబ్బకు ‘టాప్’టపా వికెట్లు కొత్త బంతితో దీపక్ చహర్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఇన్నోసెంట్ కైయా (4)ను కీపర్ క్యాచ్‌తో పంపాడు. తన మరుసటి ఓవర్ తొలి బంతికి మరుమని (8)ని కూడా కీపర్ క్యాచ్‌తోనే పెవిలియన్ చేర్చాడు. వెస్లీ మదెవెర్ (5)ను ఎల్బీగా ఔట్ చేశాడు. అంతకుముందు ఓవర్లో సిరాజ్... సియాన్ విలియమ్స్ (1) వికెట్ తీశాడు. జింబాబ్వే 31 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. మిడిలార్డర్ సంగతి ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ చూసుకోవడంతో ఒక దశలో జింబాబ్వే 110/8 స్కోరుతో ఆలౌట్‌కు దగ్గరైంది. బ్రాడ్ ఇవాన్స్, రిచర్డ్ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇద్దరే పూర్తి చేశారు టాపార్డర్‌లో ఓపెనింగ్‌ను ఇష్టపడే కెప్టెన్ రాహుల్ తను కాదని విజయవంతమైన ధావన్–గిల్ జోడితోనే ఓపెన్ చేయించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శిఖర్–శుబ్‌మన్ జోడీ ఈ రెండు నెలల్లో మూడో శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. విండీస్ గడ్డపై కనబరిచిన జోరునే జింబాబ్వేపై కూడా కొనసాగించారు. మైదానంలో బౌండరీలు, భారత్‌కు పరుగులు వస్తున్నాయి కానీ పాపం ఆతిథ్య బౌలర్లకే వికెట్ గగనమైంది. ఏకంగా ఎనిమిది మంది బౌలర్లతో వేయించిన ప్రయత్నం కూడా ఫలితాన్నివ్వలేదు. ముందుగా ధావన్ (76 బంతుల్లో 5ఫోర్లతో) ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 20వ ఓవర్లో 100 పరుగులు దాటింది. శుబ్‌మన్ కూడా (51 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లక్ష్యాన్ని చేరేందుకు 30.5 ఓవర్లే సరిపోయాయి. దాదాపు 20 ఓవర్ల ముందే ఇద్దరే బ్యాటర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: కైయా (సి) సామ్సన్ (బి) చహర్ 4; మరుమని (సి) సామ్సన్ (బి) చహర్ 8; వెస్లీ (ఎల్బీ) (బి) చహర్ 5; సియాన్ విలియమ్స్ (సి) ధావన్ (బి) సిరాజ్ 1; సికందర్ రజా (సి) ధావన్ (బి) ప్రసిధ్ 12; చకాబ్వా (బి) అక్షర్ 35; రియాన్ బర్ల్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 11; ల్యూక్ జాంగ్వే (ఎల్బీ) (బి) అక్షర్ 13; ఇవాన్స్ నాటౌట్ 33; రిచర్డ్ (బి) ప్రసిధ్ 34; విక్టర్ (సి) గిల్ (బి) అక్షర్ 8; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (40.3 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–26, 3–31, 4–31, 5–66, 6–83, 7–107, 8–110, 9–180, 10–189. బౌలింగ్: దీపక్ చహర్ 7–0–27–3, సిరాజ్ 8–2–36–1, కుల్దీప్ 10–1–36–0, ప్రసిధ్ 8–0–50–3, అక్షర్ 7.3–2–24–3. భారత్ ఇన్నింగ్స్: ధావన్ నాటౌట్ 81; శుబ్‌మన్ గిల్ నాటౌట్ 82; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 192. బౌలింగ్: రిచర్డ్ ఎన్గరవా 7–0–40–0, విక్టర్ 4–0–17–0, ఇవాన్స్ 3.5–0–28–0, సియాన్ 5–0–28–0, సికందర్ రజా 6–0–32–0, ల్యూక్ జాంగ్వే 2–0–11–0, వెస్లీ 2–0–16–0, రియాన్ బర్ల్ 1–0–12–0. -
రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన విండీస్ జట్టు.. వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన విండీస్.. పేస్ బౌలర్లు రెచ్చిపోవడంతో ప్రత్యర్ధిని 190 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం ఛేదనలో బ్రూక్స్ (91 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) రాణించడంతో మరో 11 ఓవర్లు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ చేసిన 34 పరుగులకే అత్యధికం కాగా, విండీస్ పేసర్లు ఆకీల్ హొసేన్, అల్జరీ జెసఫ్ తలో 3 వికెట్లు, జేసన్ హోల్డర్ 2 వికెట్లు పడగొట్టాడు. విండీస్ కోల్పోయిన 5 వికెట్లను ట్రెంట్ బౌల్ట్ (2/49), టిమ్ సౌథీ (2/39), మిచెల్ సాంట్నర్ (1/25) పంచుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు (ఆగస్ట్ 19) ఇదే వేదికగా జరుగనుంది. చదవండి: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. ఆరేళ్ల తర్వాత విండీస్ ఆటగాడు రీ ఎంట్రీ! -
IND VS ZIM: జింబాబ్వేకు బీసీసీఐ ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’... మరో సిరీస్ వేటలో టీమిండియా!
India Tour Of Zimbabwe- హరారే: ఈ మధ్య విదేశానికెళ్లిన చోటల్లా విభిన్న కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఫలితాల్లో మాత్రం నిలకడగా సిరీస్ విజయాలను సాధిస్తోంది. ఇప్పుడు కూడా మరో ప్రయత్నం మరో సారథితో చేస్తోంది. జింబాబ్వే పర్యటనలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత్ నేడు తొలి వన్డే ఆడనుంది. ఈ పర్యటన జింబాబ్వేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’. కేవలం ఈ మూడు వన్డేల సిరీస్‌తో వచ్చే రాబడితోనే జింబాబ్వే బోర్డు సగం ఏడాదికి సరిపడా ఖర్చుల్ని వెళ్లదీసుకుంటుందంట! ఈ నేపథ్యంలో ఇక్కడ సిరీస్ ఆసక్తికరమనే కంటే కూడా... ఆతిథ్య బోర్డుకు ఆర్థిక పుష్టికరమని చెప్పాలి. అందరి కళ్లు రాహుల్, చహర్లపైనే... ఇక సిరీస్ విషయానికొస్తే జట్టు కంటే కూడా... కొత్త కెప్టెన్ రాహుల్‌కు అగ్ని పరీక్షలాంటిది. ఎందుకంటే టీమిండియా ఇటీవల ఏ దేశమేగినా... ఎందుకాలిడినా గెలుస్తూనే వస్తోంది. ఎటొచ్చి ‘స్పోర్ట్స్ హెర్నియా’ సర్జరీతో రెండు నెలలుగా ఆటకు దూరమైన రాహుల్ ఫిట్‌నెస్‌కే ఇది టెస్ట్! ఇక్కడ ఈ టాపార్డర్ బ్యాటర్ త్రిపాత్రాభినయం చేయాల్సి వస్తుంది. 100 ఓవర్ల పాటు మైదానంలో ఫిట్నెస్ నిరూపించుకోవాలి. సారథిగా జట్టును నడిపించాలి. టాపార్డర్‌లో బ్యాట్‌తో సత్తా చాటాలి. అలాగే మరో ఆటగాడు కూడా సవాలుకు సిద్ధమయ్యాడు. గాయంతో ఫిబ్రవరి నుంచి అసలు మైదానంలోకే దిగని దీపక్ చహర్ సుమారు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ల కోసం అతన్ని పరిశీలించాలంటే అందుబాటులో ఉన్న ఈ కొద్ది మ్యాచ్‌ల్లోనే ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవాలి. ధావన్, గిల్, సామ్సన్ అంతా ఫామ్‌లోనే ఉన్నారు. బౌలింగ్‌లోనూ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్లతో భారత జట్టే బలంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్‌ను... అక్షర్ పటేల్, సంజూ సామ్సన్ తమ టి20 కెరీర్‌ను జింబాబ్వేలోనే ప్రారంభించారు. జోరు మీదుంది కానీ... ఈ నెలలోనే తమ దేశానికి వచ్చిన బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన జింబాబ్వే జోరుమీదుంది కానీ... భారత్‌లాంటి అసాధారణ ప్రత్యర్థితో ఎలా ఆడుతుందనేదే అసక్తికరం. ఏ రకంగా చూసినా కూడా టీమిండియాకు దీటైన ప్రత్యర్థి కాదు. కానీ సొంతగడ్డపై ఉన్న అనుకూలతలతో, ఇటీవలి విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో గట్టి పోటీ ఇచ్చేందుకు జింబాబ్వే తహతహలాడుతోంది. కెప్టెన్, వికెట్ కీపర్ రెగిస్ చకాబ్వా, సికందర్ రజా, ఇన్నోసెంట్ కయా చక్కని ఫామ్‌లో ఉన్నారు. అయితే బౌలింగ్ మాత్రం పేలవమనే చెప్పాలి. టీమిండియాలాంటి టాప్ ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే బౌలింగ్ విభాగం కూడా మెరగవ్వాలి. చదవండి: Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..! WI VS NZ 1st ODI: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ IRE VS AFG 5th T20: ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం -
టీమిండియా డ్రెస్సింగ్ రూంలో అనుకోని అతిధి.. ఏం చేశాడో చూడండి..!
విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ అనంతరం గెలుపు సంబురాల్లో ఉన్న టీమిండియా సభ్యులను పలకరించేందుకు ఓ అనుకోని అతిధి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యక్షమయ్యాడు. మ్యాచ్‌కు వేదిక అయిన ట్రినిడాడ్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాకు స్వస్థలం కావడంతో అతను మ్యాచ్‌ను వీక్షించేందుకు మైదానానికి వచ్చాడు. ఈక్రమంలో స్టాండ్స్‌లో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కలిసిన లారా.. అనంతరం భారత జట్టు సభ్యులను విష్ చేసేందుకు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. Look who came visiting the #TeamIndia dressing room 👏 👏The legendary Brian Charles Lara! 👍 👍#WIvIND | @BrianLara pic.twitter.com/ogjJkJ2m4q— BCCI (@BCCI) July 23, 2022 డ్రెస్సింగ్ రూమ్‌లో లారా కనిపించడంతో టీమిండియా సభ్యులు చహల్, కెప్టెన్ ధవన్, శ్రేయస్ అయ్యర్లు అతనితో మాట కలిపేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఈ ముగ్గురితో కాసేపు ముచ్చట్లు పెట్టిన లారా అనంతరం అక్కడి నుంచి బయల్దేరాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. అంతకుముందు లారా కోచ్ ద్రవిడ్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా బీసీసీఐ ట్వీటర్లో షేర్ చేసింది. 'టూ లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్' అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్ జోడించింది. ఇదిలా ఉంటే, బ్రియాన్ లారా ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. Two Legends, One Frame! 🙌 🙌#TeamIndia | #WIvIND pic.twitter.com/CdCUj6Y2Rp— BCCI (@BCCI) July 23, 2022 చదవండి: రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన శ్రేయస్ అయ్యర్ -
కెప్టెన్లను మార్చడంలోనూ రికార్డే.. ప్రపంచ రికార్డును సమం చేసిన భారత్
విజయాలు, పరాజయాలు, వ్యక్తిగత రికార్డులు పక్కన పెడితే మరో విషయంలోనూ భారత క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డులను బద్దలుకొడుతుంది. నిన్న (జులై 22) విండీస్‌తో జరిగిన తొలి వన్డేతో ఓ ఏడాదిలో అత్యధిక మంది కెప్టెన్లను మార్చిన జట్టుగా టీమిండియా రికార్డుల్లోకెక్కింది. ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ మంది కెప్టెన్లను మార్చిన దేశంగా శ్రీలంక పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. 2017లో శ్రీలంక ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చగా.. తాజాగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా ఆ రికార్డును సమం చేసింది. విండీస్‌తో వన్డేకు శిఖర్ ధవన్ కెప్టెన్‌గా వ్యవహరించడంతో ఈ ఏడాది భారత జట్టు కెప్టెన్ల సంఖ్య ఏడుకు చేరింది. 1959లో కూడా భారత జట్టుకు ఇంచుమించు ఇలాగే కెప్టెన్లను మార్చింది. ఆ ఏడాది వినూ మన్కడ్, హేమూ అధికారి, దత్తా గైక్వాడ్, పంకజ్ రాయ్, గులాబ్ రాయ్ రాంచన్ లు టీమిండియా సారధులుగా వ్యవహరించారు. ఈ ఏడాది టీమిండియా కెప్టెన్లు వీరే.. విరాట్ కోహ్లి (సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్) కేఎల్ రాహుల్ (సౌతాఫ్రికాతో వన్డేలు) రోహిత్ శర్మ (సౌతాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్‌లు) రిషభ్ పంత్ (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్) హార్ధిక్ పాండ్యా (ఐర్లాండ్‌లో టీ20 సిరీస్) జస్ప్రీత్ బుమ్రా (ఇంగ్లండ్ తో రీషెడ్యూల్ 5వ టెస్ట్) శిఖర్ ధవన్ (వెస్టిండీస్‌తో వన్డే సిరీస్) ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక మంది కెప్టెన్లను మార్చిన జట్లు.. భారత్ - 2022 - ఏడుగురు కెప్టెన్లు శ్రీలంక - 2017 - ఏడుగురు కెప్టెన్లు జింబాబ్వే - 2001 - ఆరుగురు కెప్టెన్లు ఇంగ్లండ్ - 2011 - ఆరుగురు కెప్టెన్లు ఆస్ట్రేలియా - 2021 - ఆరుగురు కెప్టెన్లు చదవండి: రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన శ్రేయస్ అయ్యర్ -
రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన శ్రేయస్ అయ్యర్
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 54 పరుగులు చేసి కెరీర్లో 10వ అర్ధశతకాన్ని నమోదు చేసిన అయ్యర్.. వన్డేల్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో అతను స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేసి భారత మాజీ ఓపెనర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతో సమంగా నిలిచాడు. శ్రేయస్, సిద్దూలు 25 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మార్కును చేరుకోగా.. రాహుల్‌కు ఈ మైలురాయిని చేరుకునేందుకు 27 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్లు సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 24 ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మార్కును చేరుకున్నారు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేయగా.. ఛేదనలో విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శిఖర్ ధవన్ (97) మూడు పరుగుల తేడాతో శతకం చేజార్చుకోగా, శుభ్‌మన్ గిల్ (64), శ్రేయస్ (54) అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బ్యాటర్లలో కైల్ మేయర్స్ (75), బ్రాండన్ కింగ్ (54) హాఫ్ సెంచరీలు నమోదు చేయగా ఆఖర్లో అకీల్ హొసేన్ (32 నాటౌట్), రొమారియో షెపర్డ్ (39 నాటౌట్) విండీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. చదవండి: టీమిండియాతో వన్డే సిరీస్.. వెస్టిండీస్‌కు బిగ్ షాక్..! Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, పాక్‌ను వెనక్కునెట్టిన టీమిండియా
IND VS ENG 1st ODI: తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ద్వారా టీమిండియా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లైంది. ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకడంతో పాటు దాయాది పాక్‌కు కూడా షాకిచ్చింది. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించిన రోహిత్ సేన 3 రేటింగ్ పాయింట్లను (108) సాధించి టాప్-3లోకి చేరి, పాక్‌ను నాలుగో స్థానానికి (106) నెట్టింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (126) టాప్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ (122) రెండు, ఆసీస్ (101), సౌతాఫ్రికా (99) ఐదు ,ఆరు స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ (96), శ్రీలంక (92), వెస్టిండీస్ (71), ఆఫ్ఘనిస్తాన్ (69), ఐర్లాండ్ (54) జట్లు వరుసగా 7 నుంచి 11 స్థానాల్లో నిలిచాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ 3లోకి చేరడంతో మూడు ఫార్మాట్లలో టాప్-3లో ఉన్న ఏకైక జట్టుగా నిలిచింది. ICC Rankings All formats Tests: 1. Australia 🇦🇺 2. India 🇮🇳 3. South Africa 🇿🇦 ODI: 1. New Zealand 🇳🇿 2. England 🏴 3. India 🇮🇳 T20I: 1. India 🇮🇳 2. England 🏴 * India is the only team to be in the top 3 in all formats ranking.#Cricket | #CricketTwitter — 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭 𝐒𝐩𝐚𝐫𝐭𝐚𝐧 (@clownslayer_V) July 13, 2022 ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఘన విజయం సాధించడంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో వెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. బుమ్రా (6/19), మహ్మద్ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 25.2 ఓవర్లలో 110 పరుగులకే చాపచుట్టేసింది. జోస్ బట్లర్ (32 బంతుల్లో 30; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా టాప్–6లో నలుగురు బ్యాటర్లు ‘డకౌట్’ అయ్యారు. మొత్తంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం. అనంతరం రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శిఖర్ ధవన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగి ఆడటంతో భారత్ 18.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: రో'హిట్' ధాటికి చిన్నారి విలవిల.. ఆందోళన వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ -
రో'హిట్' ధాటికి చిన్నారి విలవిల.. ఆందోళన వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్
Rohit Sharma: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు తండ్రితో పాటు స్టేడియంకు వచ్చిన ఓ చిన్నారి రోహిత్ శర్మ సిక్సర్ కొట్టిన బంతి తగిలి నొప్పితో విలవిలలాడింది. భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో డేవిడ్ విల్లే వేసిన ఓ బంతిని టీమిండియా కెప్టెన్ రోహిత్ పుల్ షాట్ ఆడి భారీ సిక్సర్‌గా మలచగా.. రో'హిట్' చేసిన ఆ బంతి స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ చిన్నారికి బలంగా తాకింది. దీంతో ఆ పాప నొప్పితో విలవిలలాడింది. pic.twitter.com/NJZ9gBcG9i — Guess Karo (@KuchNahiUkhada) July 12, 2022 ఈ విషయాన్ని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ తన సహచరులతో చెప్పగా వారు హిట్ మ్యాన్‌కు జరిగింది వివరించారు. విషయం తెలిసిన రోహిత్ చిన్నారి గురించి ఆరా తీసే క్రమంలో ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ మధ్యలో ఇంగ్లండ్ ఫిజియోలు చిన్నారికి ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంది. ఈ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వివరాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శిఖర్ ధవన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు)లు చెలరేగడంతో ఇంగ్లండ్ నిర్ధేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బుమ్రా (6/19), మహ్మద్ షమీ (3/31) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 110 పరుగులకే చాపచుట్టేసింది. చదవండి: బుమ్రా బౌలింగ్.. రోహిత్ బ్యాటింగ్; టీమిండియా ఘన విజయం -
అరుదైన రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్-గబ్బర్ జోడీ
Rohit-Dhawan: పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల్లో ఒకటిగా పరిగణించబడే రోహిత్ శర్మ-శిఖర్ ధవన్లు వన్డేల్లో ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఈ ద్వయం ఇవాళ (జులై 12) ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి వన్డేలో మరో ఆరు పరుగులు జోడిస్తే ఫిఫ్టి ఓవర్స్ ఫార్మాట్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో జోడీగా రికార్డుల్లోకెక్కనుంది. హిట్‌మ్యాన్-గబ్బర్ జోడీ ఇప్పటివరకు 111 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 4994 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసింది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడీ అగ్రస్థానంలో ఉంది. సచిన్-గంగూలీ ద్వయం 136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు జోడించింది. వీరి తర్వాత స్థానాల్లో ఆసీస్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్‌క్రిస్ట్ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472), విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ (102 ఇన్నింగ్స్‌ల్లో 5150) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో చేజిక్కించుకున్న భారత్.. ఇవాళ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధవన్లు టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయనున్నారు. ఇటీవలి కాలంలో ధవన్‌కు సరైన అవకాశాలు లేకపోవడంతో చాలాకాలం తర్వాత ఈ జోడీ కలిసి బరిలోకి దిగనుంది. చదవండి: Ind Vs Eng: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్! -
ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న బట్లర్.. మరో సిరీస్ లక్ష్యంగా హిట్‌మ్యాన్
లండన్: ఇంగ్లండ్ గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో పంజా విసురుతున్న భారత్ ఇప్పుడు వన్డేలపై కన్నేసింది. ఈ సిరీస్‌ను కూడా టి20 తరహా దూకుడుతో చేజిక్కించుకోవాలని రోహిత్ శర్మ బృందం భావిస్తోంది. మరోవైపు టి20 చివరి మ్యాచ్‌లో నెగ్గిన ఊపులో ఉన్న ఇంగ్లండ్ ఈ వన్డే సిరీస్‌ను కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ హోరాహోరీగా జరగడం ఖాయం. మంగళవారం జరిగే తొలి వన్డేలో రెండు జట్ల లక్ష్యం శుభారంభమే! తద్వారా సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి. మోర్గాన్ తర్వాత జట్టుకు నాయకుడైన జోస్ బట్లర్ తన తొలి సిరీస్‌ను ప్రత్యర్థికి అప్పగించాడు. కానీ వన్డే సిరీస్‌లో బెన్ స్టోక్స్, రూట్లాంటి అనుభవజ్ఞులు అందుబాటులోకి రావడంతో సిరీస్‌ను సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ధావన్‌తో ఓపెనింగ్! తదుపరి వెస్టిండీస్ పోరుకు సారథి అయిన శిఖర్ ధావన్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. కోహ్లి ఫామ్‌పై తనకు ఎలాంటి బెంగ లేదని రోహిత్ తెలిపాడు. అయితే ఆఖరి టి20 సందర్భంగా కోహ్లికి గజ్జల్లో గాయం కావడంతో అతను తొలి వన్డేలో ఆడేది సందేహమే. చివరి టి20లో అద్భుత సెంచరీతో అలరించిన సూర్యకుమార్ యాదవ్‌కు వన్డే జట్టులో చాన్స్ దక్కొచ్చు. ఇదే జరిగితే శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెట్టే అవకాశాలున్నాయి. హిట్టర్లు రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ జడేజాలతో బ్యాటింగ్ ఆర్డర్‌కు ఢోకా లేదు. బౌలింగ్‌లో బుమ్రాకు అనుభవజ్ఞుడైన షమీ జతకలవడం, ప్రసిధ్ కృష్ణ రావడం పేస్ విభాగాన్ని పటిష్టం చేసింది. మరోవైపు చహల్, జడేజా స్పిన్‌తో మ్యాజిక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. బదులు తీర్చుకునే పనిలో ఇంగ్లండ్ టి20 సిరీస్ చేజార్చుకున్న బట్లర్ జట్టు వన్డే సిరీస్‌లో బదులు తీర్చుకోవాలని చూస్తోంది. టి20కి భిన్నమైన తాజా సిరీస్‌లో పరుగులు పారించే బెయిర్‌స్టో, రూట్, ఆల్‌రౌండ్ మెరుపులతో స్టోక్స్ అందుబాటులో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత మూడు మ్యాచ్‌ల్లోనూ మెరిపించలేకపోయిన బట్లర్ ఇక్కడ మిడిలార్డర్లో సత్తా చాటనున్నాడు. రెగ్యులర్ ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్‌స్టోలతో పాటు టాపార్డర్‌లో ఫిల్ సాల్ట్ కూడా కీలక బ్యాటర్‌గా మారాడు. మిడిలార్డర్లో లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ ఇద్దరూ ఫామ్‌లో ఉండగా... బౌలింగ్ దళం కాస్త మారింది. డేవిడ్ విల్లే, రీస్ టోప్లేలకు బ్రైడన్ కార్స్ జతయ్యాడు. ఆఖరి టి20లో గెలుపుతో క్లీన్‌స్వీప్‌ను తప్పించుకున్న ఇంగ్లండ్ ఇప్పుడు అదే ఉత్సాహంతో తొలి వన్డే నుంచే భారత్ ఓడించాలనే లక్ష్యంతో ఉంది. పిచ్, వాతావరణం ఇంగ్లండ్ పిచ్‌లన్నీ పేస్‌కు అనుకూలమైనవే! ‘ద ఓవల్’ మైదానం కూడా అంతే. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపొచ్చు. వర్షం ముప్పు లేదు. చిరుజల్లులు కురిసినా మ్యాచ్‌కు అవాంతరమైతే ఉండదు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, జడేజా, బుమ్రా, షమీ, ప్రసిధ్‌కృష్ణ, చహల్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, సాల్ట్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, విల్లే, కార్స్, రీస్ టోప్లే, సామ్ కరన్. -
విల్ యంగ్ అద్భుత శతకం.. తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం
మౌంట్ మాంగనుయ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. వన్ డౌన్ బ్యాటర్ విల్ యంగ్ (114 బంతుల్లో 103; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో సత్తా చాటడంతో కివీస్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. కైల్ జేమీసన్ (3/45), టిక్నర్ (4/50) ధాటికి 49.4 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటైంది. రిప్పన్ (67), సీలార్ (43) రాణించడంతో నెదర్లాండ్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం ఛేదనలో యంగ్ సూపర్ శతకానికి తోడు ఓపెనర్ హెన్రీ నికోల్స్ (57) రాణించడంతో కివీస్ 38.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఏప్రిల్ 2న హ్యామిల్టన్‌లో జరుగనుంది. ఇదిలా ఉంటే సిరీస్‌లో భాగంగా జరగాల్సిన ఏకైక టీ20 వర్షం కారణంగా పూర్తిగా రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్ -
IND Vs WI 1st ODI: మళ్లీ విఫలమైన కోహ్లి.. అయితేనేం సచిన్ రికార్డు బద్దలు
Virat Kohli Becomes Fastest Batter To Score 5000 ODI Runs At Home: ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజు తానేనని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి రుజువు చేసుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో వేగంగా(96 ఇన్నింగ్స్) 5000 పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2007లో సచిన్ ఇదే ప్రత్యర్ధిపై(విండీస్) స్వదేశంలో 5000 పరుగుల మైలరాయిని చేరుకున్నాడు. అయితే ఈ మైలురాయిని చేరుకునేందుకు సచిన్‌కు 121 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. ఇక ఓవరాల్‌గా చూస్తే.. వారి వారి స్వదేశాల్లో వన్డేల్లో 5000కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ నాలుగో స్థానానికి(60.25 సగటుతో 5002 పరుగులు) చేరాడు. సచిన్ భారత్‌లో 48.11 సగటున 6976 పరుగులు చేయగా, పాంటింగ్ 39.71 సగటుతో 5521 పరుగులు, కలిస్ 45.89 యావరేజ్‌తో 5186 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, విండీస్‌తో తొలి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ(2/29), మహ్మద్ సిరాజ్(1/26) చెలరేగడంతో 43.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం 177 పరగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. మధ్యలో కాస్త తడబడినా చివరకు 6 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించి, 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోని దూసుకుపోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి గెలుపుకు పునాది వేయగ, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. కోహ్లి(8), పంత్(11) మరోసారి నిరుత్సాహపరిచారు. విండీస్ బౌలర్లలో జోసఫ్ 2 వికెట్లు, అకీల్ హొసేన్‌కు ఓ వికెట్ దిక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా బుధవారం(ఫిబ్రవరి 9) జరగనుంది. చదవండి: అండర్ 19 వరల్డ్‌కప్ హీరో రాజ్ బవాకి యువరాజ్ సింగ్‌తో ఉన్న లింక్ ఏంటి..? -
IND VS WI 1st ODI: కోహ్లినా మజాకా.. పంత్‌ను కాదని మాజీ కెప్టెన్ సలహా కోరిన హిట్‌మ్యాన్
అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ బ్యాటింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చహల్ వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్ ఆఖరి బంతికి విండీస్ బ్యాటర్ షమ్రా బ్రూక్స్ వికెట్‌కీపర్ క్యాచ్ ఔట్ కోసం టీమిండియా ఆటగాళ్లు అపీల్ చేశారు. అయితే ఈ అపీల్‌ను అంతగా పట్టించుకోని ఫీల్డ్ అంపైర్ బ్రూక్స్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీనిపై రివ్యూకి వెళ్లేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత వికెట్‌కీపర్ పంత్‌ను సంప్రదించగా, అతను బంతి బ్యాట్‌కు తాకలేదని చెప్పాడు. ఇంతలో కోహ్లి వారి దగ్గరికి వచ్చి బంతి బ్యాట్‌కు కచ్చితంగా తాకిందని చెప్పడంతో రోహిత్ ఏమాత్రం ఆలోచించకుండా రివ్యూకి వెళ్లాడు. Kohli - 100% bat Rohit Reviews Decision overturned pic.twitter.com/ynMKaXCrfX — `` (@KohlifiedGal) February 6, 2022 అనంతరం రివ్యూలో బ్రూక్స్ ఔట్ అని తేలడం, ఆ తర్వాత విండీస్ 176 పరుగులకే ఆలౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. కాగా, రివ్యూ సందర్భంగా రోహిత్ అండ్ కో మధ్య మైదానంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కోహ్లినా మజాకా అని అతని ఫ్యాన్స్ గొప్పలకుపోతున్నారు. మరికొందరేమో రోహిత్‌కు కోహ్లిపై అపారమైన నమ్మకముందని, ఎంతైనా కోహ్లి 7 ఇయర్స్ ఇండస్ట్రీ అని, రోహిత్-కోహ్లి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవనడానికి ఇంతకుమించి సాక్ష్యమేముంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. 43.5 ఓవర్లలో 176 పరుగులకే విండీస్‌ను ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ(2/29), మహ్మద్ సిరాజ్(1/26)లు రెచ్చిపోవడంతో ప్రత్యర్ధి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. విండీస్ జట్టులో ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. చదవండి: Virat Kohli: డొక్కు కారు పంపి ఆర్సీబీ యాజమాన్యం అవమానించింది..! -
విండీస్‌తో తొలి వన్డే: చరిత్ర సృష్టించనున్న టీమిండియా.. రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
Rohit Sharma To Lead Team India In 1000th ODI: ఫిబ్రవరి 6న మోతేరా వేదికగా విండీస్‌తో జరిగే తొలి వన్డే ద్వారా భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించనుంది. క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని 1000వ వన్డే మైలరాయిని భారత్.. ఈ మ్యాచ్‌తో చేరుకోనుంది. ఇప్పటివరకు 999 వన్డేలు ఆడిన భారత్.. విండీస్‌తో మ్యాచ్ ద్వారా సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. 1971 జనవరి 5న ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో మొదలైన వన్డే క్రికెట్ ప్రస్థానంలో భారత్ 999 మ్యాచ్‌ల్లో 518 విజయాలు, 431 పరాజయాలతో 54. 54 విజయాల శాతాన్ని నమోదు చేసింది. INDIA WILL PLAYING 1000'th ODI MATCH ON 6 FEB AGAINST WEST INDIES ,🇮🇳 THE FIRST NATION TO PLAY 1000 ODI MATCHES https://t.co/a8YO5Z42SA— Professor 🕊️🇮🇳 (@kingfansays) January 29, 2022 అత్యధిక వన్డేలు ఆడిన దేశాల జాబితాలో భారత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(958), పాకిస్థాన్ (936), శ్రీలంక (870), వెస్టిండీస్ (834), న్యూజిలాండ్ (775), ఇంగ్లండ్ (761), సౌతాఫ్రికా (638), జింబాబ్వే (541), బంగ్లాదేశ్ (388) జట్లు వరుసగా ఉన్నాయి. ఇక గెలుపు శాతం విషయానికి వచ్చేసరికి.. 63.75 శాతం విజయాలతో ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (63.75), భారత్(54. 54) పాక్ (53.98), ఇంగ్లండ్ (53.07) దేశాలు వరుస స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు విండీస్‌తో తొలి వన్డేలో టీమిండియాకు సారధ్యం వహించడం ద్వారా రోహిత్ శర్మ సైతం అరుదైన గౌరవం దక్కించుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు ఆడే చారిత్రక మ్యాచ్‌కు నాయకత్వం వహించే సువర్ణ అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాడు. 1974లో హెడింగ్లే వేదికగా మొదలైన భారత వన్డే క్రికెట్ ప్రస్థానంలో తొలి వన్డేకు అజిత్ వాడేకర్, 300వ వన్డేకు సచిన్, 500వ వన్డేకు గంగూలీ, 700, 800, 900వ వన్డేలకు ధోని నాయకులుగా వ్యవహరించారు. చదవండి: అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం -
IND VS SA 1st ODI: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ..
Kohli Surpasses Sachin Tendulkar: రికార్డుల రారాజుగా పేరున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లి.. బోలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో మరో రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. వన్డే ఫార్మాట్లో విదేశాల్లో సచిన్ 5065 పరుగులు చేయగా, ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆ మార్కును దాటాడు. తద్వారా విదేశాల్లో(వన్డేల్లో) అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: స్థిరంగా రోహిత్.. దూసుకెళ్తున్న కోహ్లి -
Virat Kohli: ఏడేళ్ల తర్వాత తొలిసారి ఇలా.. అయినా అందరి చూపు అతనివైపే..!
పార్ల్: గత ఏడేళ్లుగా జట్టుకు ఎన్నో మరపురాని విజయాలనందించి.. ప్రపంచ క్రికెట్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలబెట్టిన విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటివరకు కెప్టెన్ హోదాలో ఫీల్డింగ్ సెట్ చేస్తూ, సహచరులకు సూచనలు ఇస్తూ కనిపించిన కోహ్లి.. ఇకపై మైదానంలో మరో కెప్టెన్ మాట వినాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో అందరి చూపు కోహ్లిపైనే ఉండనంది. కాగా, దక్షిణాఫ్రికాతో రేపు జరగనున్న తొలి వన్డేలో కోహ్లి మరిన్ని విషయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలువబోతున్నాడు. దిగ్గజ క్రికెటర్లైన సచిన్, ద్రవిడ్, గంగూలీల రికార్డులకు అతి చేరువలో ఉన్నాడు. రేపటి మ్యాచ్‌లో శతకం సాధిస్తే, క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్(100) తర్వాతి స్థానానికి చేరుకోనున్న కోహ్లి(71).. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని షేర్ చేసుకుంటాడు. ఈ ఫీట్ ద్వారా భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డేల్లో ఏబీ డివిలియర్స్(6) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం కోహ్లి సఫారీలపై 5 వన్డే శతకాలు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాపై వన్డేల్లో 1287 పరుగులు చేసిన కోహ్లి.. మరో 27 పరుగులు చేస్తే.. ద్రవిడ్(1309), గంగూలీ(1313)లను అధిగమిస్తాడు. ఈ జాబితాలో సచిన్ 2001 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ రికార్డులతో పాటు కోహ్లిని మరో రికార్డు కూడా ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో కోహ్లి(887) మరో 171 పరుగులు చేస్తే.. సఫారీ గడ్డపై సచిన్(1453), పాంటింగ్(1432) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు. అలాగే మరో 113 పరుగులు చేస్తే.. నాలుగు అంతకంటే ఎక్కువ దేశాల్లో 1000కిపైగా పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. భారత్‌లో 4994 పరుగులు చేసిన కోహ్లి, ఇంగ్లండ్‌లో 1316, ఆస్ట్రేలియాలో 1327 పరుగులు స్కోర్ చేశాడు. కాగా, కోహ్లి చివరిసారిగా అంతర్జాతీయ సెంచరీ సాధించి దక్షణాఫ్రికాతో తొలి వన్డే నాటికి 788 రోజులవుతోంది. చదవండి: కోహ్లి దిగిపోయాడు.. రోహిత్ వచ్చేస్తున్నాడు..!