NZ Vs WI, 1st ODI: West Indies Beats New Zealand By 5 Wickets - Sakshi
Sakshi News home page

WI VS NZ 1st ODI: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్

Published Thu, Aug 18 2022 8:11 AM | Last Updated on Thu, Aug 18 2022 9:53 AM

West Indies Hammer Black Caps By 5 Wickets In First ODI - Sakshi

స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన విండీస్‌ జట్టు.. వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లంది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన విండీస్‌.. పేస్‌ బౌలర్లు రెచ్చిపోవడంతో ప్రత్యర్ధిని 190 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం ఛేదనలో బ్రూక్స్‌ (91 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో మరో 11 ఓవర్లు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

కివీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ చేసిన 34 పరుగులకే అత్యధికం కాగా, విండీస్‌ పేసర్లు ఆకీల్‌ హొసేన్‌, అల్జరీ జెసఫ్‌ తలో 3 వికెట్లు, జేసన్‌ హోల్డర్‌ 2 వికెట్లు పడగొట్టాడు. విండీస్‌ కోల్పోయిన 5 వికెట్లను ట్రెంట్‌ బౌల్ట్‌ (2/49), టిమ్‌ సౌథీ (2/39), మిచెల్‌ సాంట్నర్‌ (1/25) పంచుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు (ఆగస్ట్‌ 19) ఇదే వేదికగా జరుగనుంది.  
చదవండి: న్యూజిలాండ్‌తో తొలి వన్డే‍.. ఆరేళ్ల తర్వాత విండీస్‌ ఆటగాడు రీ ఎంట్రీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement