West Indies
-
రికార్డు సృష్టించిన టీమిండియా
-
భారత మహిళల ‘రికార్డు’ విజయం
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు ప్రదర్శనతో వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌లో, ఆపై బౌలింగ్‌లో చెలరేగిన భారత్ 60 పరుగుల తేడాతో విండీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (47 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ రిచా ఘోష్ (21 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (22 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. చినెల్ హెన్రీ (16 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాధ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం వడోదరలో తొలి వన్డే జరుగుతుంది. మెరుపు బ్యాటింగ్... తొలి ఓవర్లోనే ఉమా ఛెత్రి (0) అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. అయితే ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి విండీస్ బౌలర్లపై చెలరేగారు. హెన్రీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన స్మృతి... డాటిన్ వేసిన తర్వాతి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. కరిష్మా ఓవర్లో జెమీమా 3 ఫోర్లు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. 27 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్‌కు జెమీమాతో 98 పరుగులు (55 బంతుల్లో), మూడో వికెట్‌కు రాఘ్వీతో 44 పరుగులు (27 బంతుల్లో) జోడించిన తర్వాత స్మృతి వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత వచి్చన రిచా విరుచుకుపడింది. తన తొలి మూడు బంతులనే 6, 4, 4గా మలచిన ఆమె హేలీ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదింది. అలీన్ బౌలింగ్‌లో మరో భారీ సిక్స్‌తో 18 బంతుల్లో రిచా రికార్డు హాఫ్ సెంచరీని అందుకుంది. ఛేదనలో విండీస్ బ్యాటర్లంతా తడబడ్డారు. అసాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. హెన్రీ కొద్దిగా పోరాడటం మినహా మిగతా వారంతా విఫలం కావడంతో విజయానికి జట్టు చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) హెన్రీ (బి) డాటిన్ 77; ఉమా ఛెత్రి (సి) జోసెఫ్ (బి) హెన్రీ 0; జెమీమా (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 39; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 31; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) అలీన్ 54; సజన (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–1, 2–99, 3–143, 4–213. బౌలింగ్: చినెల్ హెన్రీ 2–0–14–1, డాటిన్ 4–0–54–1, హేలీ మాథ్యూస్ 4–0–34–0, కరిష్మా 3–0–44–0, అలీన్ 4–0–45–1, ఫ్లెచర్ 3–0–24–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సజన (బి) రాధ 22; ఖియానా జోసెఫ్ (సి) టిటాస్ సాధు (బి) సజన 11; డాటిన్ (సి) రాధ (బి) టిటాస్ సాధు 25; క్యాంప్‌బెల్ (సి) స్మృతి (బి) దీప్తి 17; చినెల్ హెన్రీ (సి) రాఘ్వీ (బి) రేణుక 43; క్రాఫ్టన్ (రనౌట్) 9; అలీన్ (బి) రాధ 6; షబిక (సి) సజన (బి) రాధ 3; జైదా (సి) రిచా (బి) రాధ 7; ఫ్లెచర్ (నాటౌట్) 5; కరిష్మా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–20, 2–57, 3–62, 4–96, 5–129, 6–136, 7–137, 8–142, 9–147. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–16–1, సజీవన్ సజన 2–0–16–1, సైమా ఠాకూర్ 4–0–33–0, టిటాస్ సాధు 3–0–31–1, రాధ యాదవ్ 4–0–29–4, దీప్తి శర్మ 4–0–31–1. 217/4 అంతర్జాతీయ టి20ల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇదే ఏడాది యూఏఈపై సాధించిన 201/5 స్కోరును భారత్ అధిగమించింది. 18 హాఫ్ సెంచరీకి రిచా తీసుకున్న బంతులు. సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ పేరిట వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును రిచా సమం చేసింది. 30 స్మృతి మంధాన అర్ధ సెంచరీల సంఖ్య. సుజీ బేట్స్ (29)ను అధిగమించి అగ్ర స్థానానికి చేరింది.763 ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో స్మృతి చేసిన పరుగులు. క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చమరి అటపట్టు (720) రికార్డును స్మృతి సవరించింది. -
విండీస్‌ను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లాదేశ్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 18) ఉదయం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్ హొస్సేన్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షమీమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. మెహిది హసన్ మిరాజ్ (26), జాకిర్ అలీ (21), మెహిది హసన్ (11), సౌమ్య సర్కార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో మోటీ 2, అకీల్ హొసేన్, రోస్టన్ ఛేజ్, అల్జరీ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు.130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 18.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ 3, మెహిది హసన్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొసేన్ తలో 2, హసన్ మహమూద్ ఓ వికెట్ తీసి విండీస్‌ను దెబ్బకొట్టారు. బంగ్లా బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని ఔరా అనిపించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (32), అకీల్ హొసేన్ (31), జాన్సన్ ఛార్లెస్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్‌కు వెస్టిండీస్‌పై ఆరేళ్ల తర్వాత తొలి సిరీస్ విజయం ఇది. బంగ్లాదేశ్ చివరిసారి 2018లో వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది. బంగ్లాదేశ్.. వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై చిత్తు చేయడం విశేషం. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 19న జరుగనుంది. -
హేలీ మాథ్యూస్ మెరుపులు
ముంబై: వెస్టిండీస్‌తో గత టి20 మ్యాచ్ ప్రదర్శనను భారత మహిళలు పునరావృతం చేయలేకపోయారు. సమష్టి వైఫల్యంతో రెండో టి20 మ్యాచ్‌ను పర్యాటక జట్టుకు అప్పగించారు.మంగళవారం జరిగిన ఈ పోరులో విండీస్ మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమం కాగా, చివరి టి20 రేపు జరుగుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా... వెస్టిండీస్ 15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన (41 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, వికెట్ కీపర్ రిచా ఘోష్ (17 బంతుల్లో 32; 6 ఫోర్లు) దూకుడుగా ఆడింది. స్మృతి ఇచ్చిన మూడు సునాయాస క్యాచ్‌లను (30, 40, 40 పరుగుల వద్ద) విండీస్ ఫీల్డర్లు వదిలేయడం కూడా ఆమెకు కలిసొచ్చింది. 37 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో వెస్టిండీస్ కెపె్టన్ హేలీ మాథ్యూస్ (47 బంతుల్లో 85 నాటౌట్; 17 ఫోర్లు), ఖియానా జోసెఫ్ (22 బంతుల్లో 38; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 40 బంతుల్లోనే 66 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఖియానా వెనుదిరిగినా...మాథ్యూస్, షిమైన్ క్యాంప్‌బెల్ (26 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 55 బంతుల్లోనే 94 పరుగులు జత చేయడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే విండీస్ విజయం ఖాయమైంది. మోకాలికి స్వల్ప గాయంతో బాధపడుతున్న కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండో టి20కి దూరం కావడంతో స్మృతి సారథిగా వ్యవహరించింది. ఆమె స్థానంలో ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల రాఘ్వీ బిస్త్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) ఫ్లెచర్ (బి) మాథ్యూస్ 62; ఉమా ఛెత్రి (బి) డాటిన్ 4; జెమీమా (ఎల్బీ) (బి) మాథ్యూస్ 13; రాఘ్వీ (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 5; దీప్తి శర్మ (రనౌట్) 17; రిచా (సి) క్యాంప్‌బెల్ (బి) డాటిన్ 32; సజన (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 2; రాధ (సి) డాటిన్ (బి) హెన్రీ 7; సైమా (సి) డాటిన్ (బి) హెన్రీ 6; టిటాస్ (నాటౌట్) 1; రేణుక (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–35, 3–48, 4–104, 5–108, 6–113, 7–144, 8–149, 9–155. బౌలింగ్: చినెల్ హెన్రీ 4–0–37–2, డాటిన్ 4–0–14–2, హేలీ మాథ్యూస్ 4–0–36–2, కరిష్మా 3–0–19–0, ఫ్లెచర్ 3–0–28–2, అష్మిని 2–0–25–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (నాటౌట్) 85; ఖియానా జోసెఫ్ (సి) రిచా (బి) సైమా 38; క్యాంప్‌బెల్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 160. వికెట్ల పతనం: 1–66. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–29–0, టిటాస్ సాధు 2–0–32–0, దీప్తి శర్మ 3–0–26–0, సైమా ఠాకూర్ 3–0–28–1, రాధ యాదవ్ 2–0–27–0, సజీవన్ సజన 2.4–0–17–0. -
వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్..
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా ఆ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఎంపికయ్యాడు. మంగళవారం సెయింట్ విన్సెంట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెస్టిండీస్ (CWI) క్రికెట్ మైల్స్ డైరెక్టర్ బాస్కోంబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం విండీస్ వైట్ బాల్ హెడ్ కోచ్‌గా సామీ.. ఏప్రిల్ 1, 2025 నుంచి టెస్టు జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ప్రస్తుత హెడ్ కోచ్ ఆండ్రీ కోలీ స్ధానాన్ని సామీ భర్తీ చేయనున్నాడు. ఆండ్రీ కోలీ కాంట్రాక్ట్ వచ్చే ఏడాది మార్చితో ముగయనుంది.కాగా సామీ సారథ్యంలోనే రెండు టీ20 వరల్డ్‌కప్(2012, 2016)లను వెస్టిండీస్ క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. కాగా వన్డే ప్రపంచకప్-2023కు ఆర్హత సాధించికపోవడంతో వెస్టిండీస్ క్రికెట్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో విండీస్ క్రికెట్ బోర్డు సామీని తమ జట్టు వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా నియమించింది. విండీస్ వైట్‌బాల్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తమ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడి నేతృత్వంలో విండీస్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
WI Vs BAN: వెస్టిండీస్‌పై చారిత్రక విజయం సాధించిన బంగ్లాదేశ్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. కింగ్స్టౌన్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 16) జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ గడ్డపై టీ20ల్లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం. తద్వారా ఈ మ్యాచ్‌కు చారిత్రక గుర్తింపు దక్కింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (43), జాకెర్ అలీ (27), మెహిది హసన్ (26 నాటౌట్), షమీమ్ హొసేన్ (27) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, ఓబెద్ మెక్కాయ్ తలో రెండు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 19.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. మెహిది హసన్ 4 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టాడు. హసన్ మహహూద్, తస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ హసన్, రిషద్ హొసేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రోవ్‌మన్ పావెల్ (60) విండీస్‌ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోవ్‌మన్ పావెల్‌తో పాటు రొమారియో షెపర్డ్ (22), జాన్సన్ ఛార్లెస్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ లిట్టన్ దాస్ ఐదుగురు విండీస్ బ్యాటర్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 17న జరుగనుంది.కాగా, టీ20 సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. -
మెరిసిన జెమీమా, స్మృతి
నవీ ముంబై: భారత మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేయగా, బౌలింగ్‌లో టిటాస్ సాధు (3/37), దీప్తి శర్మ (2/21), రాధా యాదవ్ (2/28) కరీబియన్ జట్టును దెబ్బతీశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉమా ఛెత్రి (26 బంతుల్లో 24; 4 ఫోర్లు), రిచా ఘోష్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కరిష్మా రమ్హార్యాక్ 2, డియాండ్ర డాటిన్ 1 వికెట్ తీశారు. అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్ కియానా జోసెఫ్ (33 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (28 బంతుల్లో 52; 4 ఫోరు, 3 సిక్స్‌లు) రాణించారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇదే వేదికపై రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (సి) కియానా (బి) కరిష్మా 54; ఉమా ఛెత్రి (బి) కరిష్మా 24; జెమీమా రోడ్రిగ్స్ (రనౌట్) 73; రిచా ఘోష్ (సి) మంగ్రూ (బి) డియాండ్ర 20; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 13; సజన (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–50, 2–131, 3–155, 4–190. బౌలింగ్: చినెలీ హెన్రీ 2–0–17–0, జైదా జేమ్స్ 1–0–13–0, హేలీ 3–0–38–0, కరిష్మా 4–0–18–2, అఫీ ఫ్లెచర్ 3–0–39–0, డియాండ్ర 4–0–37–1, షమిలియా 1–0–11–0, కియానా జోసెఫ్ 2–0–22–0. వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సబ్–మిన్నుమణి (బి) టిటాస్ 1; కియానా (సి) సైమా (బి) టిటాస్ 49; షెమైన్ (బి) దీప్తి శర్మ 13; డియాండ్ర (సి) రాధ (బి) టిటాస్ 52; చినెలీ హెన్రీ (సి) సబ్–మిన్నుమణి (బి) రాధ 7; షబిక (నాటౌట్) 15; అఫీ ఫ్లెచర్ (బి) దీప్తి శర్మ 0; జైదా (సి) ఉమా ఛెత్రి (బి) రాధ 5; మంగ్రూ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–2, 2–36, 3–80, 4–108, 5–126, 6–127, 7–140. బౌలింగ్: రేణుక 4–0– 25–0, టిటాస్ సాధు 4–0–37–3, దీప్తిశర్మ 4–0– 21–2, సైమా 4–0–35–0, రాధ 4–0–28–2.3622 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా స్మృతి మంధాన గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు హర్మన్‌ప్రీత్ (3589 పరుగులు) పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది. 117 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ డియాండ్రా డాటిన్ (117) ఘనత సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ (114) పేరిట ఉన్న రికార్డును డియాండ్రా బద్దలు కొట్టింది. -
విండీస్ పేసర్‌కు షాకిచ్చిన ఐసీసీ
వెస్టిండీస్ పేసర్ అల్జరీ జోసఫ్‌కు ఐసీసీ షాకిచ్చింది. డిసెంబర్ 8న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌కు ముందు ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు గానూ జోసఫ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అదనంగా జోసఫ్ యొక్క క్రమశిక్షణా రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్ జోడించబడింది. ఐసీసీ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు జోసఫ్ స్పైక్‌లతో పిచ్‌పై అడుగు పెట్టకుండా ఉండమని ఫోర్త్ అంపైర్ సూచించాడు. అయితే ఇది పట్టించుకోని జోసఫ్ స్పైక్‌లతో పిచ్‌పై అడుగుపెట్టడంతో పాటు అంపైర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ చర్య ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ని ఉల్లంఘణ కిందకు వస్తుంది. జోసఫ్ తన నేరాన్ని అంగీకరించినట్లు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో తెలిపాడు. జోసఫ్ గత 24 నెలల వ్యవధిలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ఇది రెండో సారి.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (113) మెరుపు శతకం బాది విండీస్‌ను గెలిపించాడు. ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇవాళ (డిసెంబర్ 10) జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 5 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోయి 34 పరుగులు చేసింది. తంజిద్ హసన్(30), లిటన్ దాస్ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
WI Vs BAN: రూథర్ ఫర్డ్ విధ్వంసం.. బంగ్లాను చిత్తు చేసిన వెస్టిండీస్
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో చేధించింది. కరేబియన్ బ్యాటర్లలో షర్ఫెన్ రూథర్‌ఫర్డ్(113) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ షాయ్ హోప్(86) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో టాంజిమ్ హసన్, నహిద్ రానా, రిహద్ హోస్సేన్, మెహది హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. టాంజిద్ హసన్(60), మహ్మదుల్లా(50), జకీర్ అలీ(48) రాణించారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోషఫ్ రెండు, సీల్స్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS: ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు షాక్ ఇవ్వనున్న ఐసీసీ!? -
విండీస్ ఆటగాళ్లకు జరిమానా
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వెస్టిండీస్ ఆటగాళ్లు జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్లకు జరిమానా పడింది. సీల్స్ వికెట్ తీసిన ఆనందంలో బంగ్లా ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించినందుకు గాను అతని మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు. అలాగే అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా లభించింది.ఆల్‌రౌండర్ కెవిన్ సింక్లెయిర్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా వచ్చి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. సింక్లెయిర్, సీల్స్ అంపైర్లు ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సీల్స్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15.5 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి టెస్ట్‌లో నెగ్గగా.. బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమంగా ముగిసింది. -
ఐదేసిన రాణా.. ఆధిక్యంలో బంగ్లాదేశ్
జమైకా వేదికగా వెస్టిండీస్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్ ఆధిక్యం సాధించినట్లు కనిపించింది. అనంతరం బంగ్లా బౌలర్లు రెచ్చిపోవడం.. బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించడంతో మ్యాచ్‌పై వెస్టిండీస్ పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 211 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ (0), షద్మాన్ ఇస్లాం (46), షహదత్ హొసేన్ దీపు (28), మెహిది హసన్ మిరాజ్ (42), లిటన్ దాస్ (25) ఔట్ కాగా.. జాకెర్ అలీ (29), తైజుల్ ఇస్లాం (9) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 2, అల్జరీ జోసఫ్, జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. నహిద్ రాణా (5/61) దెబ్బకు విండీస్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. హసన్ మహమూద్ 2, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కీసీ కార్తీ (40), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (39), మికైల్ లూయిస్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ అద్భుతమైన స్పెల్‌తో (15.5-10-5-4) బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు. షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో షద్మాన్ ఇస్లాం (64) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెహిది హసన్ (36), షహాదత్ హొసేన్ (22), తైజుల్ ఇస్లాం (16) రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో గెలుపొందింది. -
విండీస్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మెహిది హసన్
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 2) ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు బంగ్లా కెప్టెన్‌గా మెహిది హసన్ మిరాజ్ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టును గాయాల సమస్య వేధిస్తుంది.సీనియర్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీం, తౌహిద్ హ్రిదోయ్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఈ సిరీస్‌కు ముస్తాఫిజుర్ రహ్మాన్, జకీర్ హసన్‌ను ఎంపిక చేయలేదు. ముస్తాఫిజుర్ తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటంతో స్వదేశానికి వెళ్లనున్నాడు. ఫామ్ లేమి కారణంగా జకీర్ హసన్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్‌కీపర్ బ్యాటర్ లిటన్ దాస్, పర్వేజ్ హొసేన్ ఎమోన్, అఫీఫ్ హొసేన్ ధృబో, హసన్ మహమూద్, తంజిమ్ హసన్ సకీబ్ చోటు దక్కించుకున్నారు. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ డిసెంబర్ 8, 10, 12 తేదీల్లో సెయింట్స్ కిట్స్ వేదికగా జరుగనుంది.విండీస్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), లిటన్ కుమార్ దాస్ (వికెట్‌కీపర్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహముదుల్లా, జాకర్ అలీ అనిక్, అఫీఫ్ హొస్సేన్ ధృబో, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, షొరీఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకిబ్, నహిద్ రాణా -
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ అద్భుతం.. గడిచిన 46 ఏళ్లలో..!
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ జేడన్ సీల్స్ అద్భుతం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. గడిచిన 46 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యంత పొదుపైన స్పెల్‌గా రికార్డులు చెబుతున్నాయి. JAYDEN SEALES BOWLED THE MOST ECONOMICAL SPELL IN TEST CRICKET IN LAST 46 YEARS:15.5-10-5-4. 🤯pic.twitter.com/CYoA6ljM6Y— Mufaddal Vohra (@mufaddal_vohra) December 2, 2024ఈ ఇన్నింగ్స్‌లో సీల్స్ ఎకానమీ రేట్ 0.31గా ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అత్యుత్తమ ఎకానమీ రేట్గా రికార్డుల్లోకెక్కింది. ఈ రికార్డును సాధించే క్రమంలో సీల్స్ దిగ్గజ బౌలర్ జిమ్ లేకర్ రికార్డును అధిగమించాడు. 1957లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లేకర్ ఓవర్‌కు సగటున 0.37 పరగులిచ్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ సగటు భారత దిగ్గజ బౌలర్ బాపు నాదకర్ణి పేరిట ఉంది. నాదకర్ణి 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓవర్‌కు సగటున 0.15 పరుగులిచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో నాదకర్ణి 32 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇందులో 27 మెయిడిన్లు ఉన్నాయి.ఆల్‌టైమ్ రికార్డుటెస్ట్ క్రికెట్లో సీల్స్ అత్యంత పొదుపైన నాలుగు వికెట్ల (15.5-10-5-4) ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాక్‌కు చెందిన పర్వేజ్ సజ్జద్ పేరిట ఉండేది. 1965లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సజ్జద్ 12 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో సజ్జద్ సగటు 0.41 కాగా.. బంగ్లాతో మ్యాచ్‌లో సీల్స్ సగటు 0.31గా ఉంది.ఉమేశ్ యాదవ్ రికార్డు బద్దలు కొట్టిన సీల్స్1978 నుంచి టెస్ట్‌ల్లో అత్యంత పొదుపైన సగటు భారత పేసర్ ఉమేశ్ యాదవ్ పేరిట ఉండేది. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ 0.42 సగటున బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో 21 ఓవర్లు వేసిన ఉమేశ్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో 16 మెయిడిన్లు ఉన్నాయి. తాజాగా ఉమేశ్ రికార్డును సీల్స్ బద్దలు కొట్టాడు.కుప్పకూలిన బంగ్లాదేశ్జమైకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ పట్టు సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 71.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ 4, షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా తరఫున షద్మాన్ ఇస్లాం (64), మెహిది హసన్ మిరాజ్ (36), షహాదత్ హొసేన్ దీపు (22), తైజుల్ ఇస్లాం (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. మికైల్ లూయిస్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (33), కీసీ కార్తీ (19) క్రీజ్‌లో ఉన్నారు. లూయిస్ వికెట్ నహిద్ రాణాకు దక్కింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో నెగ్గింది. -
WI Vs BAN: విండీస్‌తో తొలి టెస్ట్.. ఓటమి దిశగా బంగ్లాదేశ్
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే మరో 225 పరుగుల చేయాలి. చేతిలో మరో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. చివరి రోజు ఆట మిగిలి ఉంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (115) అజేయ శతకంతో కదం తొక్కగా.. మికైల్ లూయిస్ (97), అలిక్ అథనాజ్ (90) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 3, తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ తలో 2, తైజుల్ ఇస్లాం ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మొమినుల్ హక్ (50), జాకెర్ అలీ (53) అర్ద సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ తలో 2, కీమర్ రోచ్, షమార్ జోసఫ్ చెరో వికెట్ పడగొట్టారు.181 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ (6/64) విండీస్‌ను దెబ్బకొట్టాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని వెస్టిండీస్ బంగ్లాదేశ్ ముందు 334 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఛేదనలో (నాలుగో రోజు ఆట ముగిసే) బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. జాకెర్ అలీ (15), హసన్ మహమూద్ (0) క్రీజ్‌లో ఉన్నారు. కీమర్ రోచ్, జేడెన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బతీశారు. షమార్ జోసఫ్‌కు ఓ వికెట్ దక్కింది.కాగా, రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది. -
WI Vs BAN: విండీస్‌తో తొలి టెస్ట్.. వెనుకంజలో బంగ్లాదేశ్
విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ వెనుకంజలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హక్ (50), జాకెర్ అలీ (53) అర్ద సెంచరీలతో రాణించగా.. మహ్మదుల్ హసన్ జాయ్ 5, జాకిర్ హసన్ 15, షహాదత్ హొసేన్ 18, లిటన్ దాస్ 40, మెహిది హసన్ మిరాజ్ 23, తైజుల్ ఇస్లాం 25, హసన్ మహమూద్ 8 పరుగులు చేశారు. తస్కిన్ అహ్మద్ 11, షొరీఫుల్ ఇస్లాం 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్టిన్ గ్రీవ్స్, జేడన్ సీల్స్ తలో రెండు వికెట్లు.. కీమర్ రోచ్, షమార్ జోసఫ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ అజేయ శతకంతో (115) కదంతొక్కగా.. ఓపెనర్ మికైల్ లూయిస్ మూడు పరుగుల తేడాతో.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అలిక్ అథనాజ్ 10 పరుగుల తేడాతో సెంచరీలను చేజార్చుకున్నారు. ఆఖర్లో కీమర్ రోచ్ బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. రోచ్ 144 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేశాడు.విండీస్ ఇన్నింగ్స్‌లో కవెమ్ హాడ్జ్ (25), జాషువ డసిల్వ (14), జడెన్ సీల్స్ (18), షమార్ జోసఫ్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ బ్రాత్‌వైట్ (4), అల్జరీ జోసఫ్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. కీసి కార్తీ డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మీరాజ్ తలో రెండు.. తైజుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది. -
గ్రీవ్స్ అజేయ సెంచరీ.. విండీస్ భారీ స్కోర్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ అజేయ శతకంతో (115) కదంతొక్కాడు. ఓపెనర్ మికైల్ లూయిస్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అలిక్ అథనాజ్ కూడా 10 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆఖర్లో కీమర్ రోచ్ బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. రోచ్ 144 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో కవెమ్ హాడ్జ్ (25), జాషువ డసిల్వ (14), జడెన్ సీల్స్ (18), షమార్ జోసఫ్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ బ్రాత్‌వైట్ (4), అల్జరీ జోసఫ్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరమితం కాగా.. కీసి కార్తీ డకౌటయ్యాడు. 144.1 ఓవర్లలో విండీస్ 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మీరాజ్ తలో రెండు.. తైజుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ (5), జకీర్ హసన్ (15) ఔట్ కాగా.. మొమినుల్ హాక్ (7), షాహదత్ హొసేన్ దీపు (10) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్, అల్జరీ జోసఫ్‌కు తలో వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది. -
ఇంగ్లండ్, విండీస్‌ల ఆఖరి టి20 రద్దు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను నెగ్గింది. ఈ సిరీస్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ దూరం
బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. ఈ జట్టుకు క్రైగ్ బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్నాడు. బ్రాత్‌వైట్ డిప్యూటీగా జాషువ డి సిల్వా ఎంపికయ్యాడు.అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. గత కొంతకాలంగా హోల్డర్ భుజం గాయంతో బాధపడుతున్నాడు. బంగ్లా సిరీస్ సమయానికి కోలుకుంటాడని అంతా భావించారు. కానీ అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో సెలక్టర్లు జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు విండీస్ దేశీవాళీ టోర్నీ యునైటెడ్ సూపర్50 కప్‌లో మూడు సెంచరీలు సాధించిన జస్టిన్ గ్రీవ్స్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. అదేవిధంగా స్పిన్నర్ కెవిన్ సింక్లైర్ కూడా జట్టులోకి వచ్చాడు. నవంబర్ 22 నుంచి ఆంటిగ్వా వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. విండీస్ ప్రస్తుతం స్వదేంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది.బంగ్లాతో టెస్టులకు విండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, మికిల్ లూయిస్, అండర్సన్ ఫిలిప్, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, జోమెల్, జోమెల్ వారికన్ చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
వచ్చే నెలలో విండీస్‌తో భారత మహిళల జట్టు సిరీస్
ముంబై: వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 3 టి20లు ఆడనుంది. దాంతో పాటు జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం బీసీసీఐ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 15 నుంచి వెస్టిండీస్ మహిళల జట్టు భారత్‌లో పర్యటించనుండగా... నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వరుసగా మూడు టి20లు (15న, 17న, 19న) ఆడనుంది. ఆ తర్వాత వడోదరలో డిసెంబర్ 22, 24, 27వ తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది.అనంతరం వచ్చే ఏడాది జనవరి 10, 12, 15న రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుండగా... ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్‌లు జరగనున్నాయి. -
ఇంగ్లండ్ బౌలర్‌కు జరిమానా
ఇంగ్లండ్ స్టార్ పేసర్ రీస్ టాప్లేకు జరిమానా పడింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా టాప్లే అసహనంతో కుర్చీని విరుగగొట్టాడు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘణ కింద టాప్లే మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే టాప్లే ఓ డీమెరిట్ పాయింట్ కూడా పొందాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా టాప్లే గాయపడ్డాడు (మోకాలి గాయం). ఆ మ్యాచ్‌లో 2.4 ఓవర్లు వేసిన టాప్లే, ఆతర్వాత గాయం కారణంగా తన కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. గాయం అనంతరం టాప్లే అర్దంతరంగా మైదానాన్ని వీడాడు. మైదానాన్ని వీడే క్రమంలో టాప్లే అసహసనంతో హ్యాండ్రెయిల్పై కుర్చీతో బలంగా కొట్టాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన ఐసీసీ.. కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కింద జరిమానా విధించింది. గాయం కారణంగా టాప్లే రెండో టీ20లో కూడా ఆడలేదు. అతను మూడో టీ20 ఆడటం కూడా అనుమానమే అని తెలుస్తుంది.టాప్లే గాయపడిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ మెరుపు సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.అనంతరం జరిగిన రెండో టీ20లో కూడా ఇంగ్లండే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ మెరుపుల కారణంగా ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. బట్లర్ వీర ఉతుకుడు ఉతకడంతో ఇంగ్లండ్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నవంబర్ 14న సెయింట్ లూసియా వేదికగా జరుగనుంది. -
WI vs ENG 2nd T20: స్పిన్నర్ యార్కర్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?
క్రికెట్లో సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు యార్కర్లు వేయడం మనం చూస్తుంటాం. అదే ఓ స్పిన్నర్ యార్కర్ వేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య తాజాగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అద్భుతమైన యార్కర్‌ను సంధించాడు. స్పిన్నర్ నుంచి అనూహ్యంగా యార్కర్ లెంగ్త్ బాల్ రావడంతో బ్యాటర్ చేసేదేమీ లేక నిశ్చేష్టుడిగా మిగిలిపోయాడు.AN OFF SPINNER WITH A YORKER. 🤯- Dan Mousley bamboozled Rovman Powell. 🔥 pic.twitter.com/UnFQHjOsmG— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ 40 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి జోరు మీదున్నాడు. ఈ దశలో ఇంగ్లండ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ డాన్ మౌస్లీ కళ్లు చెదిరే యార్కర్‌తో రోవ్‌మన్ పావెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మౌస్లీ సంధించిన యార్కర్ లెంగ్త్ బంతికి రోవ్‌మన్ దగ్గర సమాధానం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.కాగా, వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రోవ్‌మన్ పావెల్ (43) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. రొమారియో షెపర్డ్ (22), నికోలస్ పూరన్ (14), రోస్టన్ ఛేజ్ (13), మాథ్యూ ఫోర్డ్ (13 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మౌస్లీ, లివింగ్‌స్టోన్, సకీబ్ మహమూద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. జోస్ బట్లర్ (45 బంతుల్లో 83; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 14.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. బట్లర్‌కు జతగా విల్ జాక్స్ (29 బంతుల్లో 38), లివింగ్‌స్టోన్ (11 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ సాల్ట్ డకౌట్ కాగా.. జేకబ్ బేతెల్ 3 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో వెళ్లింది. -
WI VS ENG 1st T20: ఫిల్ సాల్ట్ సరికొత్త చరిత్ర
ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సాల్ట్ వెస్టిండీస్‌పై మూడు సెంచరీలు చేశాడు. సాల్ట్ తన టీ20 కెరీర్లో చేసిన మూడు సెంచరీలు విండీస్‌పై చేసినవే కావడం విశేషం. సాల్ట్ తర్వాత ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ఎవిన్ లెవిస్ (భారత్‌పై 2), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (భారత్‌పై 2), ముహమ్మద్ వసీం (ఐర్లాండ్‌పై 2), లెస్లీ డన్బర్లకు (బల్గేరియాపై 2) దక్కుతుంది.బాబర్ ఆజమ్ రికార్డును సమం చేసిన సాల్ట్తాజాగా విండీస్‌పై చేసిన సెంచరీతో సాల్ట్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. సాల్ట్ 34 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేసి మ్యాక్స్‌వెల్ (5 సెంచరీలు), రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4), ఎస్ డవిజి (3) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. టీ20ల్లో సాల్ట్, డవిజి సహా ముహమ్మద్ వసీం, కొలిన్ మున్రో, బాబర్ ఆజమ్‌లు తలో మూడు సెంచరీలు చేశారు. కాగా, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ మెరుపు సెంచరీతో (54 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ (38), రొమారియో షెపర్డ్ (35 నాటౌట్), గుడకేశ్ మోటీ (33), ఆండ్రీ రసెల్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్ నాలుగు, ఆదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సాల్ట్ సుడిగాలి శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. సాల్ట్‌తో పాటు జాకబ్ బేతెల్ (58 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 17 పరుగులు చేయగా.. జోస్ బట్లర్ గోల్డన్ డకౌటయ్యాడు. మోటీ, షెపర్డ్‌కు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
సాల్ట్ విధ్వంసకర సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. బార్బోడస్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30), రొమారియో షెపర్డ్(35), మోటీ(33) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షకీబ్ మహ్మద్ 4 వికెట్లతో పడగొట్టగా, అదిల్ రషీద్ 3, ఓవర్టన్, లివింగ్ స్టోన్ తలా వికెట్ సాధించారు.సాల్ట్ విధ్వంసకర సెంచరీ..అనంతం 183 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంగ్లండ్ ఊదిపడేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 54 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాట జాకబ్ బెతల్(58) హాఫ్ సెంచరీతో మెరిశాడు. విండీస్ బౌలర్లలో మోటీ, షెపర్డ్ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 10న ఇదే బార్బోడస్‌లో జరగనుంది.చదవండి: ద్రవిడ్ చిన్న కొడుకు వచ్చేస్తున్నాడు.. ఆ టోర్నమెంట్‌కు ఎంపిక -
విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్.. తొలి వన్డేలో విండీస్ విజయం
ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 45.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గుడకేశ్ మోటీ (4/41) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సామ్ కర్రన్ 37, జాకబ్ బేతెల్ 27, జోర్డన్ కాక్స్ 17, ఫిలిప్ సాల్ట్ 18, విల్ జాక్స్ 19, ఆదిల్ రషీద్ 15, డాన్ మౌస్లీ 8, జేమీ ఓవర్టన్ 0, జోఫ్రా ఆర్చర్ 7 పరుగులు చేశారు.అనంతరం వెస్టిండీస్ స్వల్ప లక్ష్య ఛేదనకు దిగగా వర్షం పలు మార్లు అంతరాయం కలిగించింది. విండీస్ స్కోర్ 157/2 (25.5 ఓవర్లు) వద్ద నుండగా మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన విండీస్‌ను విజేతగా ప్రకటించారు.విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ ఎవిన్ లెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడా పెడా బౌండరీలు, సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు. 69 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో బ్రాండన్ కింగ్ 30, కీసీ కార్టీ 19, షాయ్ హోప్ 6 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, మూడు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి విండీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆంటిగ్వా వేదికగా నవంబర్ 2న జరుగనుంది.చదవండి: IPL 2025: ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..! -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడి రీ ఎంట్రీ
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (అక్టోబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా షాయ్ హోప్ వ్యవహరించనున్నాడు. విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్ చాలాకాలం తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. హెట్‌మైర్ 2023 డిసెంబర్లో ఇంగ్లండ్‌పైనే తన చివరి వన్డే ఆడాడు. 2019 డిసెంబర్ నుంచి హెట్‌మైర్ వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అలిక్ అథనాజ్ స్థానంలో హెట్‌మైర్ జట్టులోకి వచ్చాడు. విండీస్ ఇటీవలే శ్రీలంకలో పర్యటించి టీ20, వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించిన జట్టునే యధాతథంగా (ఒక్క మార్పు) కొనసాగించారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం విండీస్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును కూడా నిన్ననే ప్రకటించారు.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు..షాయ్ హోప్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్, జ్యువెల్ ఆండ్రూ, షిమ్రోన్ హెట్‌మైర్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటి, జేడెన్ సీల్స్, రోమారియో షెఫర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్విండీస్తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు..లియామ్ లివింగ్‌స్టోన్ (కెప్టెన్), విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, డాన్ మౌస్లీ, జాకబ్ బేతెల్, సామ్ కర్రన్, ఫిలిప్ సాల్ట్, మైఖేల్ కైల్ పెప్పర్, జాఫర్ చొహాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, రీస్ టాప్లే, జాన్ టర్నర్షెడ్యూల్అక్టోబర్ 31- తొలి వన్డే (ఆంటిగ్వా)నవంబర్ 2- రెండో వన్డే (ఆంటిగ్వా)నవంబర్ 6- మూడో వన్డే (బార్బడోస్)నవంబర్ 9- తొలి టీ20 (బార్బడోస్)నవంబర్ 10- రెండో టీ20 (బార్బడోస్)నవంబర్ 14- మూడో టీ20 (సెయింట్ లూసియా)నవంబర్ 16- నాలుగో టీ20 (సెయింట్ లూసియా)నవంబర్ 17- ఐదో టీ20 (సెయింట్ లూసియా)