ఇంగ్లండ్ స్టార్ పేసర్ రీస్ టాప్లేకు జరిమానా పడింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా టాప్లే అసహనంతో కుర్చీని విరుగగొట్టాడు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘణ కింద టాప్లే మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే టాప్లే ఓ డీమెరిట్ పాయింట్ కూడా పొందాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా టాప్లే గాయపడ్డాడు (మోకాలి గాయం). ఆ మ్యాచ్‌లో 2.4 ఓవర్లు వేసిన టాప్లే, ఆతర్వాత గాయం కారణంగా తన కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. గాయం అనంతరం టాప్లే అర్దంతరంగా మైదానాన్ని వీడాడు. మైదానాన్ని వీడే క్రమంలో టాప్లే అసహసనంతో హ్యాండ్‌రెయిల్‌పై కుర్చీతో బలంగా కొట్టాడు.
ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన ఐసీసీ.. కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కింద జరిమానా విధించింది. గాయం కారణంగా టాప్లే రెండో టీ20లో కూడా ఆడలేదు. అతను మూడో టీ20 ఆడటం కూడా అనుమానమే అని తెలుస్తుంది.
టాప్లే గాయపడిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ మెరుపు సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
అనంతరం జరిగిన రెండో టీ20లో కూడా ఇంగ్లండే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ మెరుపుల కారణంగా ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. బట్లర్ వీర ఉతుకుడు ఉతకడంతో ఇంగ్లండ్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నవంబర్ 14న సెయింట్ లూసియా వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment