Reece Topley
-
ఇంగ్లండ్ బౌలర్‌కు జరిమానా
ఇంగ్లండ్ స్టార్ పేసర్ రీస్ టాప్లేకు జరిమానా పడింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా టాప్లే అసహనంతో కుర్చీని విరుగగొట్టాడు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘణ కింద టాప్లే మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే టాప్లే ఓ డీమెరిట్ పాయింట్ కూడా పొందాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా టాప్లే గాయపడ్డాడు (మోకాలి గాయం). ఆ మ్యాచ్‌లో 2.4 ఓవర్లు వేసిన టాప్లే, ఆతర్వాత గాయం కారణంగా తన కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. గాయం అనంతరం టాప్లే అర్దంతరంగా మైదానాన్ని వీడాడు. మైదానాన్ని వీడే క్రమంలో టాప్లే అసహసనంతో హ్యాండ్రెయిల్పై కుర్చీతో బలంగా కొట్టాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన ఐసీసీ.. కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కింద జరిమానా విధించింది. గాయం కారణంగా టాప్లే రెండో టీ20లో కూడా ఆడలేదు. అతను మూడో టీ20 ఆడటం కూడా అనుమానమే అని తెలుస్తుంది.టాప్లే గాయపడిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ మెరుపు సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.అనంతరం జరిగిన రెండో టీ20లో కూడా ఇంగ్లండే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ మెరుపుల కారణంగా ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. బట్లర్ వీర ఉతుకుడు ఉతకడంతో ఇంగ్లండ్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నవంబర్ 14న సెయింట్ లూసియా వేదికగా జరుగనుంది. -
RCB Vs MI: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో)
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ రీస్ టాప్లీ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. టాప్లీ అద్బుత క్యాచ్‌తో మంచి ఊపు మీద ఉన్న రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో రెండో బంతిని రోహిత్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు స్వీప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న టాప్లీ ఎడమవైపు ఫుల్-లెంగ్త్ డైవ్ చేసి అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్‌ను అందుకున్నాడు. టాప్లీ క్యాచ్‌తో వాంఖడే స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. రోహిత్ కూడా ఒక్కసారిగా బిత్తరపోయాడు. చేసేదేమి లేక 38 పరుగులు చేసిన రోహిత్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్(34 బంతుల్లో 69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(52), రోహిత్ శర్మ(38) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో విల్ జాక్స్, విజయ్ కుమార్, ఆకాష్ దీప్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(61), కార్తీక్(53) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్పీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. WHAT A CATCH! Reece Topley takes a blinder to dismiss Rohit Sharma. Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvRCB pic.twitter.com/wBAiSbBCoW — IndianPremierLeague (@IPL) April 11, 2024 -
IPL 2024: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!?
ఐపీఎల్-2024కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశముంది. ఇప్పటికే ఇగ్లండ్ ఆల్‌రౌండర్ టామ్ కుర్రాన్ సేవలను కోల్పోయిన ఆర్సీబీని.. తాజాగా మరో ఇంగ్లీష్ పేసర్ గాయం ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. టాప్లీ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్లీ గాయపడ్డాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు అతడికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇవ్వలేదు. దీంతో పీఎస్ఎల్-2024కు దూరమయ్యాడు. అయితే అతడు ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో కూడా ఆడేది అనుమానమే మారింది. ఐపీఎల్-2023 వేలంలో అతడిని రూ. 1.90 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే తన అరంగేట్ర సీజన్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో ఆడిన టాప్లీ.. గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు ఈ ఏడాది సీజన్‌కు ముందు సైతం గాయపడ్డాడు. కాగా గాయాల బారిన పడటం అతడికి కొత్తేమి కాదు. గాయం కారణంగా అతడు టీ20 వరల్డ్‌కప్-2022 సైతం దూరమయ్యాడు. అనంతరం భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగమమయ్యాడు. అక్కడ గాయపడిన టాప్లీ.. టోర్నీలో ఆఖరి మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు. -
WC 2023: శ్రీలంకతో మ్యాచ్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్! తుది జట్లు ఇవే
ICC Cricket World Cup 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌కు షాక్.. అతడు దూరం క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. వేలికి గాయమైన కారణంగా స్టార్ పేసర్ రీస్ టోప్లే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు బట్లర్ పేర్కొన్నాడు. అట్కిన్సన్, హ్యారీ బ్రూక్‌లు కూడా లంకతో మ్యాచ్‌లో ఆడటం లేదని తెలిపాడు. వాళ్లిద్దరు అవుట్ ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు చమిక, హేమంత స్థానాల్లో ఏంజెలో మ్యాథ్యూస్, కుమార తుదిజట్టులోకి వచ్చినట్లు లంక సారథి కుశాల్ మెండిస్ తెలిపాడు. దసున్ షనక గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన తనకు ఆటగాళ్లంతా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నాడు. బెంగళూరు మ్యాచ్‌లో తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాల్సిందే! తుది జట్లు: శ్రీలంక కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహీష్ దీక్షానా, కసున్ రజిత, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. ఇంగ్లండ్ జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. స్టార్ పేసర్‌కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. ఎందుకంటే? -
ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్.. ఇక కష్టమే
వన్డే ప్రపంచకప్-2023లో వరుస అపజయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ రీస్ టోప్లీ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టోప్లీ చూపుడు వేలికి గాయమైంది. దీంతో అతడు ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అయితే ఫిజియో వద్ద చికిత్స తీసుకుని టోప్లీ తిరిగి మళ్లీ మైదానంలోకి వచ్చాడు. నొప్పితో బాధపడుతుంటానే 6 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓవరాల్‌గా 8.5 ఓవర్లు బౌలింగ్ చేసిన టోప్లీ 88 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ అనంతరం టోప్లీని స్కాన్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే స్కానింగ్‌లో ఎడమ చూపుడు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు దృవీకరించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్, సర్రే సీమర్ రీస్ టాప్లీ చేతి వేలికి గాయమైంది. దీంతో వన్డే ప్రపంచకప్ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. టోప్లీ రాబోయే 24 గంటల్లో తిరిగి యూకేకు రానున్నాడు అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్ధానంలో ఉంది. చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. తొలి భారత బౌలర్‌గా -
RCBకి ఊహించని షాక్.. ఈసారి కూడా కష్టమేనా?
-
గాయపడ్డ ఆర్సీబీ ఆటగాడి స్థానంలో సఫారీ ప్లేయర్
బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ రీస్ టాప్లే స్థానాన్ని మరో ఆటగాడితో భర్తీ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. టాప్లే స్థానంలో మరో పేసర్‌నే ఎంచుకుంది ఆర్సీబీ మేనేజ్మెంట్. టాప్లే ప్లేస్‌లో సఫారీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వేన్ పార్నెల్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. టాప్లే సీజన్ మొత్తానికే దూరం కావడంతో పార్నెల్ ఎంపిక అనివార్యమైంది. ఈ ఏడాది జరిగిన వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన పార్నెల్‌ను ఆర్సీబీ 75 లక్షలకు దక్కించుకున్నట్లు సమాచారం. పార్నెల్ మరో వారంలో జట్టుతో చేరతాడని ఆర్సీబీ బౌలింగ్ కోచ్ సంజయ్ బాంగర్ తెలిపాడు. కాగా, ఈ సీజన్లో ఇప్పటికే గాయాల కారణంగా ముగ్గురు ఆర్సీబీ ఆటగాళ్లు (జోష్ హేజిల్‌వుడ్, రజత్ పాటిదార్, విల్ జాక్స్) సీజన్ మొత్తానికే దూరం కాగా.. తాజాగా టాప్లే వారి సరసన చేరాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో 81 పరుగుల తేడాతో పరాజయంపాలైన ఆర్సీబీకి గాయాల బెడద పెద్ద తలనొప్పిగా మారింది. -
ఆర్సీబీకి ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! ఈ సారి కూడా కష్టమే
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా టాప్లీ భుజంకు గాయమైంది. ఈ క్రమంలో అతడు నొప్పితో మైదానంలో విలవిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అదించనప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడు ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో టాప్లే గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో డేవిడ్ విల్లీ తుది జట్టులోకి వచ్చాడు. ఇక గాయపడిన టాప్లే తన స్వదేశానికి వెళ్లనున్నట్లు ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా సృష్టం చేశాడు. అతడి స్థానంలో మరో విదేశీ ఆటగాడిని భర్తీ చేయనున్నట్లు బంగర్ తెలిపాడు. "టాప్లే తన స్వదేశానికి వెళ్లనున్నాడు. అతడు మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో ఆటగాడిని రిప్లేస్ చేయనున్నాం" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంగర్ పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లు జోష్ హేజిల్‌వుడ్, రజత్ పాటిదార్, విల్ జాక్స్ గాయం కారణంగా ఐపీఎల్-2023కు దూరమయ్యారు. కాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘోర పరాజయం పాలైంది. చదవండి: RCB: అర్థం కాని ఆర్సీబీ.. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు -
T20 World Cup 2022: ఇంగ్లండ్ జట్టులోకి ముంబై ఇండియన్స్ బౌలర్
టీ20 వరల్డ్‌కప్-2022 ప్రారంభానికి ముందు అన్ని జట్లను గాయాల సమస్య వేధిస్తుంది. ఇండియా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా.. ఇలా దాదాపు ప్రతి జట్టులో ఎవరో ఒకరు గాయాల బారిన పడుతూనే ఉన్నారు. దీంతో ఆయా జట్లు గాయపడిన వారిని రీప్లేస్ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా ఇంగ్లండ్ జట్టు.. గాయపడి జట్టుకు దూరమైన తమ ప్రధాన పేసర్ రీస్ టాప్లే స్థానాన్ని భర్తీ చేసింది. టాప్లేకు రీప్లేస్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ బౌలర్ టైమాల్ మిల్స్ జట్టులోకి తీసుకొచ్చింది. మిల్స్‌కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం (బీబీఎల్) ఉన్నందున అతన్ని తొలి ప్రాధాన్యత కింద ఎంపిక చేసింది. టైమల్ మిల్స్.. ప్రపంచకప్ కోసం ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. కాగా, పాకిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ చేసే సమయంలో టాప్లే గాయపడిన విషయం తెలిసిందే. స్కానింగ్‌లో టాప్లే కాలి మడమ చిట్లినట్లు తేలడంతో అతను జట్టుకు దూరమయ్యాడు. టాప్లే గాయం చాలా తీవ్రమైందని, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, అతనికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని ఈసీబీ తెలిపింది. వరల్డ్‌కప్‌కు ముందు ఆసీస్‌ను స్వదేశంలో 2-0 తేడాతో (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్) మట్టికరిపించి జోరుమీదున్న ఇంగ్లండ్.. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. -
T20 WC: సూపర్-12 ఆరంభ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్!
ICC Mens T20 World Cup 2022 Eng Vs AFG: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్.. అఫ్గనిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. సూపర్-12 దశలో భాగంగా పెర్త్ వేదికగా అక్టోబరు 22న ఇరు జట్లు పోటీ పడనున్నాయి. కాగా అసలైన పోరు కంటే ముందు ఇంగ్లండ్ సోమవారం పాకిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బట్లర్ బృందం గెలుపొందింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లే గాయపడినట్లు సమాచారం. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో టోప్లే ఎడమ మడిమ మెలిపడటంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌తో మ్యాచ్‌కు ముందు టోప్లే గాయానికి సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని.. త్వరలోనే కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా 28 ఏళ్ల రీస్ టోప్లే ఈ ఏడాది టీమిండియాతో టీ20(3/22), వన్డే సిరీస్(6/24) సందర్భంగా ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఒకవేళ టోప్లే గనుక కోలుకోనట్లయితే.. డేవిడ్ విల్లే తుది జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. రిజర్వు ప్లేయర్ టైమల్ మిల్స్ ప్రధాన జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను కూడా కొట్టిపడేయలేం. చదవండి: ఆసియా కప్-2023 పాక్‌లో జరిగితే టీమిండియా ఆడదు.. స్పష్టం చేసిన జై షా T20 WC 2022: యూఏఈ స్పిన్నర్ సంచలనం.. కార్తీక్ మెయప్పన్ సరికొత్త రికార్డు BCCI- Key Decisions: గంగూలీకి గుడ్‌బై! జై షా కొనసాగింపు.. బీసీసీఐ కీలక నిర్ణయాలివే! Keeping everything crossed for Toppers 🤞 More here: https://t.co/snXGG4CTt1#T20WorldCup pic.twitter.com/HjUodUxRzo — England Cricket (@englandcricket) October 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇంగ్లండ్ స్టార్ రీస్ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే
ఇంగ్లండ్ బౌలర్ రీస్ టాప్లీ.. టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో హీరో అయ్యాడు. తొలి వన్డేలో టీమిండియా స్పీడస్టర్ బుమ్రా బౌలింగ్‌లో మ్యాజిక్ చేసి జట్టును గెలిపిస్తే.. దాదాపు అదే రీతిలో బౌలింగ్ చేసిన టాప్లీ ఈసారి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఇంగ్లండ్ రెండో వన్డేలో గెలిచింది అంటే అదంతా టాప్లీ మాయే. ఆరు వికెట్లతో దుమ్మురేపిన టాప్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. టీమిండియాపై తన ప్రదర్శన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని రీస్ టాప్లీ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. బలహీన జట్టుపై వికెట్లు తీస్తే కిక్ ఉండదని.. పటిష్టమైన టీమిండియా లాంటి జట్టుపై మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చేయడం ఎంతో కిక్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. కీలక సమయంలో అద్బుత బౌలింగ్‌తో జట్టును గెలిపించడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. నిజానికి రీస్ టాప్లీ కథ ఐదేళ్ల క్రితం వేరుగా ఉంది. 21 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్ జట్టులో ఎంట్రీ ఇచ్చిన టాప్లీ నిలదొక్కుకోవడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. ఈ ఐదేళ్ల కాలంలో మానసికంగానూ.. శారీరకంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అవన్నీ ఎంతగానో బాధించాయి. ఒక దశలో ఇంగ్లండ్ జెర్సీని విసిరిపారేసిన సందర్భం కూడా వచ్చిందని టాప్లీ టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. టాప్లీ మాట్లాడుతూ.. ''21 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ జట్టులోకి అడుగుపెట్టాను. ఆరంభంలో వరుస అవకాశాలు వస్తుండడంతో నన్ను నేను నిరూపించుకుననే పనిలో పడ్డాను. కెరీర్ అంతా సాఫీగా సాగుతున్న దశలో గాయాలు వేధించాయి. అంతే ఇక కోలుకోలేకపోయా. ఒక దశలో రిటైర్మెంట్ అనే ఆలోచనకు వెళ్లిపోయా. నాలుగేళ్ల క్రితం నా పరిస్థితి మాటల్లో వర్ణించలేనిది. భరించలేని కడుపునొప్పి నన్ను కుంగదీస్తే.. ఇక వెన్నునొప్పి సమస్య గురించి చెప్పుకుంటే కన్నీళ్లే దిక్కు. ఈ రెండింటిని అధిగమించేందుకు రోజు పొద్దునే పొత్తి కడుపు హార్మోన్ ఇంజెక్ట్ చేసుకోవడం.. నెలకోసారి లండన్‌కు వెళ్లి వెన్ను నొప్పికి చికిత్స చేయించుకొని అనస్థీషియా తీసుకోవడం లాంటివి జరిగేవి. ఇక ఆ తర్వాత రోజు గంటపాటు జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాను. ఈలోగా కరోనా పేరుతో ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అప్పటికి వయసు 25 ఏళ్లు.. అవకాశాలు లేకపోవడంతో రిటైర్మెంట్కు సమయం వచ్చేసిందని భావించా. సెలక్టర్లు కూడా నావైపు చూడకపోవడం.. కరోనా ఇలా ఒకదాని వెంట మరొకటి వెంటవెంటనే జరిగిపోయాయి. అప్పుడే ఇంగ్లండ్ జెర్సీని తీసిపారేయాల్సి వచ్చింది. నాకు ఇష్టమైన మ్యూజిక్ క్లాసులు నేర్చుకున్నాను. ఆ తర్వాత యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి మైక్రో ఎకానమిక్స్ కోర్సులో సీటు సాధించి ఫస్ట్ లాక్డౌన్లో కాలం గడిపాను. మైక్రో ఎకానమిక్స్ కోర్సు తర్వాత నా మనసులో దైర్యం పెరిగింది. నాకు నేనుగా ఒక ఫిలాసఫీ పాఠాలు చెప్పడం నేర్చుకున్నా. అందుకే వదిలేసిన క్రికెట్‌ను మళ్లీ ఆడాలనిపించింది. ఈలోగా కరోనా తగ్గుముఖం పట్టడం.. నా ఆరోగ్యం కూడా బాగుపడడం ఇవన్నీ చూస్తే నాకు మంచి రోజులు వచ్చాయనిపించింది. తిరిగి బౌలింగ్ చేయడం ఆరంభించాను. ఎంతో మంది కోచ్‌లను కలిసి బౌలింగ్‌లో మరిన్ని మెళుకువలు నేర్చుకున్నాను. నువ్వు మనసు పెట్టి బౌలింగ్ చేస్తే ఒక యార్కర్ బాల్‌ను 110 శాతం పర్ఫెక్ట్గా చేయగలవు అంటూ దైర్యం చెప్పారు. వాళ్ల నుంచి ఏం నేర్చుకున్నానో ఇవాళ మ్యాచ్‌లో అదే ఆచరించా. ఈరోజు ఇంగ్లండ్‌కు కీలక సమయంలో విజయం సాధించేలా చేశాను'' అంటూ ముగించాడు. ఇక రీస్ టప్లీ 2015లో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఏడేళ్ల కాలంలో టాప్లీ 15 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: IND vs ENG 2nd ODI Highlights: ‘టాప్’లీ లేపేశాడు... -
Ind Vs Eng: అదే మా కొంప ముంచింది.. అందుకే ఓడిపోయాం: రోహిత్ శర్మ
India Vs England ODI Series 2022: 2nd ODI - Rohit Sharma Comments: ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో గెలిచి సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలపై ఆతిథ్య జట్టు నీళ్లు చల్లింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏకంగా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో మాంచెస్టర్ వేదికగా జరుగనున్న మూడో వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. మొన్న బుమ్రా.. ఇప్పుడు టాప్లీ.. కాగా మొదటి వన్డేలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను మట్టికరిపిస్తే.. లార్డ్స్‌లో ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ అదే తరహాలో రాణించాడు. కీలక బ్యాటర్ల వికెట్లు తీసి భారత్ జట్టు పతనాన్ని శాసించాడు. 9.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 24 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. That winning feeling 🙌 Toppers ends with SIX wickets 🔥 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/5e0auq4yc6 — England Cricket (@englandcricket) July 14, 2022 అందుకే ఓడిపోయాం ఇక ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తమ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారని, అయితే.. బ్యాటర్లే రాణించలేకపోయారని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘మా బౌలింగ్ ఆరంభంలో బాగానే ఉంది. అయితే, మొయిన్ అలీ, విల్లే మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేశారు. అయినంత మాత్రాన ఇంగ్లండ్ విధించిన లక్ష్యం మరీ ఛేదించలేనంత పెద్దదేం కాదు. నిజానికి ఈరోజు మా బ్యాటింగ్ బాగాలేదు’’ అని ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. అదే విధంగా.. ‘‘కొన్ని క్యాచ్‌లు కూడా జారవిడిచాం. ఏదేమైనా మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు.నిజానికి ఈ పిచ్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది అనుకున్నాం. కానీ అలా జరుగలేదు. టాపార్డర్‌లో ఒక్క బ్యాటర్ అయినా నిలకడగా ఆడలేకపోవడం దెబ్బతీసింది. మాంచెస్టర్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. పరిస్థితులకు తగ్గట్లుగా మెదులుతూ మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. All six of Topley's wickets 🙌 Full highlights: https://t.co/2n15D9KEmB 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/5yR9uez6OM — England Cricket (@englandcricket) July 14, 2022 ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో వన్డే: వేదిక: లార్డ్స్, లండన్ టాస్: ఇండియా- బౌలింగ్ ఇంగ్లండ్ స్కోరు: 246 (49) ఇండియా స్కోరు: 146 (38.5) విజేత: ఇంగ్లండ్.. 100 పరుగుల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రీస్ టాప్లీ(9.5 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 6 వికెట్లు) చదవండి: ICC ODI WC Super League: టాప్‌లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్.. ఏడో స్థానంలో రోహిత్ సేన! Heinrich Klaseen: క్లాసెన్ సుడిగాలి శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్