
ఆర్సీబీ (PC: IPL/RCB)
ఐపీఎల్-2024కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశముంది. ఇప్పటికే ఇగ్లండ్ ఆల్‌రౌండర్ టామ్ కుర్రాన్ సేవలను కోల్పోయిన ఆర్సీబీని.. తాజాగా మరో ఇంగ్లీష్ పేసర్ గాయం ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
టాప్లీ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్లీ గాయపడ్డాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు అతడికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎన్‌ఓసీ ఇవ్వలేదు. దీంతో పీఎస్‌ఎల్-2024కు దూరమయ్యాడు. అయితే అతడు ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో కూడా ఆడేది అనుమానమే మారింది.
ఐపీఎల్-2023 వేలంలో అతడిని రూ. 1.90 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే తన అరంగేట్ర సీజన్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌లో ఆడిన టాప్లీ.. గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు ఈ ఏడాది సీజన్‌కు ముందు సైతం గాయపడ్డాడు.
కాగా గాయాల బారిన పడటం అతడికి కొత్తేమి కాదు. గాయం కారణంగా అతడు టీ20 వరల్డ్‌కప్-2022 సైతం దూరమయ్యాడు. అనంతరం భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగమమయ్యాడు. అక్కడ గాయపడిన టాప్లీ.. టోర్నీలో ఆఖరి మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు.