T20 WC: సూపర్‌-12 ఆరంభ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్‌! | T20 WC 2022: England Reece Topley Ankle Injury Doubtful For Opener | Sakshi
Sakshi News home page

T20 WC 2022: సూపర్‌-12 ఆరంభ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

Published Tue, Oct 18 2022 3:48 PM | Last Updated on Tue, Oct 25 2022 5:08 PM

T20 WC 2022: England Reece Topley Ankle Injury Doubtful For Opener - Sakshi

పాక్‌తో ఇంగ్లండ్‌ వార్మప్‌ మ్యాచ్‌

ICC Mens T20 World Cup 2022 Eng Vs AFG: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌.. అఫ్గనిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. సూపర్‌-12 దశలో భాగంగా పెర్త్‌ వేదికగా అక్టోబరు 22న ఇరు జట్లు పోటీ పడనున్నాయి. కాగా అసలైన పోరు కంటే ముందు ఇంగ్లండ్‌ సోమవారం పాకిస్తాన్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బట్లర్‌ బృందం గెలుపొందింది. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ పేసర్‌ రీస్‌ టోప్లే గాయపడినట్లు సమాచారం. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో టోప్లే ఎడమ మడిమ మెలిపడటంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. 

ఈ నేపథ్యంలో అఫ్గన్‌తో మ్యాచ్‌కు ముందు టోప్లే గాయానికి సంబంధించి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అప్‌డేట్‌ ఇచ్చింది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని.. త్వరలోనే కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. 

కాగా 28 ఏళ్ల రీస్‌ టోప్లే ఈ ఏడాది టీమిండియాతో టీ20(3/22), వన్డే సిరీస్‌(6/24) సందర్భంగా ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఒకవేళ టోప్లే గనుక కోలుకోనట్లయితే.. డేవిడ్‌ విల్లే తుది జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. రిజర్వు ప్లేయర్‌ టైమల్‌ మిల్స్‌ ప్రధాన జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను కూడా కొట్టిపడేయలేం.

చదవండి: ఆసియా కప్‌-2023 పాక్‌లో జరిగితే టీమిండియా ఆడదు.. స్పష్టం చేసిన జై షా
T20 WC 2022: యూఏఈ స్పిన్నర్‌ సంచలనం.. కార్తీక్ మెయప్పన్‌ సరికొత్త రికార్డు
BCCI- Key Decisions: గంగూలీకి గుడ్‌బై! జై షా కొనసాగింపు.. బీసీసీఐ కీలక నిర్ణయాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement