England vs Afghanistan
-
‘గర్వం తలకెక్కింది.. అందుకే అందరు ఓడిపోవాలనే కోరుకున్నారు’
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్(Mark Butcher) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గర్వ తలకెక్కితే ఇలాంటి చేదు అనుభవాలే చూడాల్సి వస్తుందంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆటపై కాస్త దృష్టి పెట్టాలంటూ హితవు పలికాడు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI World Cup)లో పేలవ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ తీవ్రంగా నిరాశపరిచింది.సెమీస్ కూడా చేరకుండానేగ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ జట్ల చేతిలో ఓడి కనీసం సెమీస్ కూడా చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు మ్యాచ్‌లలో ఏమాత్రం కష్టపడినా ఇంగ్లండ్ గెలిచేదే. ముఖ్యంగా అఫ్గన్‌తో మ్యాచ్‌లో జో రూట్(120)కు ఒక్కరు సహకారం అందించినా బట్లర్ బృందం గట్టెక్కేదే. కానీ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.ఇక ఈ వన్డే టోర్నీకి ముందు భారత్‌లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-1తో ఓడింది. అదే విధంగా సిరీస్‌లో రోహిత్ సేన చేతిలో వన్డే 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఈ నేపథ్యంలో నాడు ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మాట్లాడుతూ.. వైట్‌వాష్ పరాజయాన్ని తాము లెక్కచేయమని.. చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే, అది జరగదని ఇప్పటికే తేలిపోయింది.గర్వం తలకెక్కిందిఈ నేపథ్యంలో మార్క్ బుచర్ విజ్డన్‌తో మాట్లాడుతూ.. బట్లర్ బృందం తీరుపై మండిపడ్డాడు. ఆటగాళ్ల గర్వం, నిర్లక్ష్య ధోరణి వల్లే... ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ జట్టు ఓడిపోవాలని కోరుకున్నారని.. ఇకనైనా దూకుడు స్వభావాన్ని విడిచిపెట్టాలని ఆటగాళ్లకు సూచించాడు. ‘‘చాలా మంది అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోవాలని ఎందుకు కోరుకున్నారో నాకు తెలుసు.ఇంగ్లండ్ జట్టుకు గర్వం తలకెక్కింది. వన్డే ఫార్మాట్ అంటే బొత్తిగా లెక్కలేదు. వన్డే వరల్డ్‌కప్(2019) గెలవడానికి ఎంత కష్టపడ్డారో మరచిపోయారు. గెలిచిన తర్వాత ఇకపై ఆడటం అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అహంభావం పెరిగిపోయింది. దాని ఫలితంగానే ఈ చేదు అనుభవాలు.ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ ఓడిపోవాలనే కోరుకున్నారుమైదానంలో ఉన్న అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ జట్ల అభిమానులే కాదు.. ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ ఓడిపోవాలని కోరుకుంది ఇందుకే. ప్రతిసారీ ఆటతో అలరిస్తామని చెబితే సరిపోదు. మ్యాచ్‌లు కూడా గెలవాలి’’ అంటూ మార్క్ బుచర్ బట్లర్ బృందానికి చురకలు అంటించాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి ఇప్పటి వరకు పదహారు వన్డేలు ఆడిన ఇంగ్లండ్ పన్నెండింట ఓడిపోవడం గమనార్హం. ఇక బ్రెండన్ మెకల్లమ్ వన్డే, టీ20 జట్ల హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్ చేతిలో క్లీన్‌స్వీప్, చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలోనే నిష్క్రమించడంతో విమర్శలు తారస్థాయికి చేరాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ జట్టుఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, సకీబ్ మహమూద్, టామ్ బాంటన్, గస్ అట్కిన్సన్.చదవండి: CT 2025: ఇక్కడ ఓడిపోయాం.. అక్కడ మాత్రం రాణిస్తాం: పాక్ కెప్టెన్ -
ఆసీస్‌నూ వదలకండి: అఫ్గన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్(Afghanistan vs England)తో మ్యాచ్‌లో హష్మతుల్లా బృందం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని.. ఇదే జోరులో ఆస్ట్రేలియాను కూడా ఓడించాలని ఆకాంక్షించాడు. అఫ్గన్ ఆటగాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని... దేశం మొత్తాన్ని గర్వించేలా చేశారని కొనియాడాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా అఫ్గనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-‘బి’లో ఉంది. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 107 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది అఫ్గనిస్తాన్. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం అద్బుత విజయంతో సెమీస్ రేసులోకి దూసుకువచ్చింది.ఇంగ్లండ్ నిష్క్రమించగా..లాహోర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో అనూహ్య రీతిలో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఎనిమిది పరుగుల తేడాతో బట్లర్ బృందాన్ని ఓడించింది. దీంతో ఇంగ్లండ్ ఈ ఐసీసీ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అఫ్గనిస్తాన్ తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టే గ్రూప్-బి నుంచి సెమీస్ చేరబోయే జట్లు ఖరారు కానున్నాయి.మీరేం బాధపడకండి సోదరా..!ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అఫ్గనిస్తాన్ జట్టును ఆకాశానికెత్తాడు. ‘‘మీకు శుభాకాంక్షలు. మీ విజయం పట్లనాకెంతో సంతోషంగా ఉంది. గుల్బదిన్(అఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్)ను కలిసినపుడు.. ‘మీరు ఇంగ్లండ్‌ను తప్పక ఓడించాలి’ అని అతడితో అన్నాను. అప్పుడు అతడు.. ‘మీరేం బాధపడకండి సోదర.. వాళ్లను మేము అస్సలు ఉపేక్షించం.. ఓడించి తీరతాం’ అన్నాడు.ఆ తర్వాత నేను.. ‘ఆస్ట్రేలియాను కూడా మీరు ఓడించాలి’ అని కోరాను. దుబాయ్‌లో ఉన్నపుడు నేను గుల్బదిన్తో ఈ మాటలు చెప్పాను. ఏం చేసైనా ఇంగ్లండ్‌పై గెలుపొందాలని అతడికి బలంగా చెప్పాను. ఈరోజు అఫ్గనిస్తాన్ ఆ పని చేసి చూపించింది. ఆటలో ఎలా ముందుకు దూసుకువెళ్లాలో చెబుతూ గొప్ప పరిణతి కనబరిచింది.పటిష్ట జట్టును ఓడించింది. ఈరోజు మీదే. అయితే, సెమీ ఫైనల్ చేరాలనే లక్ష్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఏం జరిగిందో గుర్తుంది కదా. ఈసారి అది పునరావృతం కాకూడదు. ఆసీస్‌నూ వదలకండినిజానికి మీరు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లతో కూడిన కఠినమైన గ్రూపులో ఉన్నారు. అయినా, సరే ఈరోజు అత్యద్భుతంగా ఆడారు. మాకు మజానిచ్చే మ్యాచ్ అందించినందుకు ధన్యవాదాలు’’ అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్‌ను ఓడించిన హష్మతుల్లా షాహిది బృందం.. ఈసారి కూడా వారిపై గెలుపొందింది. అయితే, నాటి టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ విజయానికి చేరువైన సమయంలో గ్లెన్ మాక్స్వెల్ భీకర ద్విశతకంతో అఫ్గన్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ఈ క్రమంలోనే అక్తర్ ఈసారి అఫ్గనిస్తాన్ మరింత జాగ్రత్తగా ఆడాలని సూచించాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్👉వేదిక: గడాఫీ స్టేడియం, లాహోర్👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గనిస్తాన్ స్కోరు: 325/7 (50)👉ఇంగ్లండ్ స్కోరు: 317 (49.5)👉ఫలితం: ఇంగ్లండ్‌పై ఎనిమిది పరుగుల తేడాతో అఫ్గన్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఇబ్రహీం జద్రాన్(146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 177 రన్స్).చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఇంగ్లండ్ ప్రయాణం ముగిసిపోయింది. అఫ్గనిస్తాన్(Afghanistan vs England)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో బట్లర్ బృందానికి చేదు అనుభవమే మిగిలింది. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో అఫ్గన్ గెలుపొంది ఇంగ్లండ్‌ను టోర్నమెంట్ నుంచి బయటకు పంపింది. తమదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడిస్తామని హష్మతుల్లా బృందం మరోసారి నిరూపించింది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) తీవ్ర నిరాశకు గురికాగా.. అఫ్గనిస్తాన్ సారథి హష్మతుల్లా పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ఇక ఓటమిపై స్పందించిన బట్లర్.. తామే చేజేతులా కీలక మ్యాచ్‌ను చేజార్చుకున్నామని విచారం వ్యక్తం చేశాడు. గెలిచే మ్యాచ్‌లోనూ ఓడిపోవడం కంటే బాధ మరొకటి ఉండదని అన్నాడు.రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు‘‘టోర్నమెంట్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం నిరాశను మిగిల్చింది. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో గెలిచేందుకు మాకు అన్ని అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈరోజు రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి పది ఓవర్లలో అంతా తారుమారైంది.క్రెడిట్ తనకేఏదేమైనా ఇబ్రహీం జద్రాన్ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాలి. ఇక దురదృష్టవశాత్తూ మార్క్ వుడ్ మోకాలికి గాయమైంది. అయినా సరే తను బౌలింగ్ చేయడం ప్రశంసనీయం. డెత్ ఓవర్లలో ఇలా కీలక బౌలర్ గాయపడటం తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఒకడిగా ఉన్నా నా నుంచి ఇలాంటి ప్రదర్శన ఎంతమాత్రం సరికాదు. అయినా ఈ ఉద్వేగ సమయంలో నేను ఎలాంటి నిర్ణయాలు(రిటైర్మెంట్) తీసుకోను’’ అని బట్లర్ పేర్కొన్నాడు.ఇబ్రహీం జద్రాన్ ప్రతిభావంతుడైన ఆటగాడుఇక అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. ‘‘ఇది సమిష్టి విజయం. ఈ గెలుపుతో మా దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. 2023లో ఇంగ్లండ్‌ను తొలిసారిగా మేము ఓడించాం. అప్పటి నుంచి రోజురోజుకు మరింతగా మా ఆటకు మెరుగులు దిద్దుకుని.. ఇప్పుడు మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాం.నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో మాదే పైచేయి కావడం ఆనందంగా ఉంది. ఇబ్రహీం జద్రాన్ ప్రతిభావంతుడైన ఆటగాడు. ఒత్తిడిలోనూ అతడు అద్బుతంగా ఆడాడు. నేను చూసిన వన్డే ఇన్నింగ్స్‌లో ఇదొక అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పగలను.అజ్మత్ కూడా బాగా ఆడాడు. జట్టులో నైపుణ్యాలు గల సీనియర్లతో పాటు జూనియర్లుకూడా ఉండటం మా అదృష్టం. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసు’’ అని తెలిపాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బి లో ఉన్న అఫ్గనిస్తాన్- ఇంగ్లండ్ మధ్య బుధవారం వన్డే మ్యాచ్ జరిగింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(177) భారీ శతకంతో దుమ్ములేపగా.. హష్మతుల్లా(40), అజ్మతుల్లా(41), మహ్మద్ నబీ(40) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గన్ 325 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 317 పరుగులకే పరిమితమైంది. జో రూట్ శతకం(120) సెంచరీ చేయగా.. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేదు దీంతో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు. ఇక ఈ ఓటమితో టోర్నీ నుంచి బట్లర్ బృందం నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ రేసులో ఫేవరెట్లుగా ఉండగా.. అఫ్గనిస్తాన్ తానూ పోటీలో ఉన్నానంటూ ముందుకు వచ్చింది.చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు -
అఫ్గాన్ ప్లేయర్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అఫ్గానిస్తాన్ సంచలనం సృష్టించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌ను 8 పరుగుల తేడాతో అఫ్గాన్ మట్టికర్పించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అఫ్గానిస్తాన్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. కాగా ఐసీసీ ఈవెంట్లలలో ఇంగ్లండ్‌ను అఫ్గానిస్తాన్ ఓడించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం.వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసిన అఫ్గానిస్తాన్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేసింది.ఈ మెగా టోర్నీలో తొలిసారి సెమీఫైన్ల్కు చేరేందుకు అఫ్గానిస్తాన్ అడుగుదూరంలో నిలిచింది. ఫిబ్రవరి 28న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో షాహిది బృందం తలపడనుంది.ఒమర్జాయ్ సరికొత్త చరిత్ర..కాగా అఫ్గాన్ చారిత్రత్మక విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో 41 పరుగులతో అదరగొట్టిన ఒమర్జాయ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలో ఒమర్జాయ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 40 ప్లస్ పరుగులతో పాటు 5 వికెట్ల తీసిన తొలి ఆటగాడిగా ఒమర్జాయ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేదు. అదేవిధంగా ఈ టోర్నమెంట్ చరిత్రలో రన్ ఛేజింగ్‌లో 5 వికెట్ల హాల్ సాధించిన ఐదో ప్లేయర్‌గా ఒమర్జాయ్ నిలిచాడు. ఈ జాబితాలో జాక్వెస్ కల్లిస్, మఖాయా ఏంటిని, జాకబ్ ఓరమ్, మెక్‌గ్రాత్ వంటి దిగ్గజాలు ఉన్నారు.జద్రాన్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 146 బంతులు ఎదుర్కొన్న జద్రాన్.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 177 పరుగులు చేశాడు. అతడితో పాటు నబీ(40), షాహిదీ(40), అజ్మతుల్లా ఓమర్జాయ్(41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. 326 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం! -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం లహోర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఐసీసీ ఈవెంట్లలో అఫ్గాన్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవడం ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లీష్ జట్టును మట్టికర్పించిన అఫ్గాన్స్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఖంగుతిన్పించారు.ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు సీనియర్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 326 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ సెంచరీతో మెరిశాడు. ఓ దశలో ఇంగ్లండ్‌ను ఈజీగా గెలిపించేలా కన్పించిన రూట్.. ఆఖరి ఓవర్లలో తన వికెట్‌ను అఫ్గాన్‌కు సమర్పించుకున్నాడు.దీంతో మ్యాచ్ అఫ్గాన్ సొంతమైంది. రూట్ 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేశాడు. రూట్‌కు ఇది 17వ వన్డే సెంచరీ. అయితే వన్డేల్లో అతడికి ఇది దాదాపు ఆరేళ్ల తర్వాత వచ్చిన శతకం కావడం గమనార్హం. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన రూట్..ఐసీసీ ఈవెంట్లలో 300 ప్లస్ పరుగుల చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. ఐసీసీ టోర్నమెంట్లలో మూడు వందలకు పైగా పరుగుల లక్ష్య చేధనలో రూట్ ఇప్పటివరకు మూడు సెంచరీలు సాధించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై, 2019 వన్డే ప్రపంచ కప్లోనాటింగ్హామ్లో పాకిస్థాన్‌పై శతకాలు నమోదు చేశాడు. ఈ రెండు సందర్బాలు ఇంగ్లండ్ టార్గెట్ మూడు వందలకు పైగానే ఉంది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది. వీరిద్దరూ చెరో రెండు సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్‌తో ఈ దిగ్గజ క్రికెటర్ల రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్, షేన్ వాట్సన్ రికార్డును రూట్ సమం చేశాడు. ఈ ముగ్గురు లెజండరీ క్రికెటర్లు తలా రెండు శతకాలు నమోదు చేశారు. ఇక ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో మార్చి1న కరాచీ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడుతోంది.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం! -
అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!
ఐసీసీ టోర్నమెంట్లలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరోసారి అఫ్గానిస్తాన్ చేతిలో పరాభావం ఎదురైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బుధవారం లహోర్ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 326 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది.ఓ దశలో సునాయసంగా గెలిచేలా కన్పించిన ఇంగ్లీష్ జట్టు.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సింది. దీంతో ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజీలోనే ఇంగ్లండ్ ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ పరాజయం పాలైంది.జో రూట్ సూపర్ సెంచరీ..ఇంగ్లండ్ బ్యాటర్లలో వెటరన్ ఆటగాడు జో రూట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. రూట్ 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేశాడు. ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడని అంతా భావించారు. కానీ 46 ఓవర్లో అనూహ్యంగా రూట్ ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా అఫ్గాన్ వైపు మలుపు తిరిగింది. రూట్‌తో పాటు బెన్ డకెట్ 38, కెప్టెన్ జోస్ బట్లర్ 38, జేమీ ఒవెర్టన్ 32, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లతో చెలరేగారు. అతడితో పాటు మహ్మద్ నబీ రెండు, , ఫజల్ హక్ ఫరూఖీ, రషీద్ ఖాన్, గుల్బదిన్ నాయబ్ తలా వికెట్ సాధించారు.జద్రాన్ రికార్డు సెంచరీ..ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ రికార్డు సెంచరీ (177)తో చెలరేగాడు. అతడితో పాటు నబీ(40), షాహిదీ(40), అజ్మతుల్లా ఓమర్జాయ్(41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు.కెప్టెన్సీకి జోస్ గుడ్‌బై..!కాగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పిస్తున్న బట్లర్.. కెప్టెన్సీలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. అతడు కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడు ఐసీసీ టోర్నీల్లో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. వన్డే వరల్డ్‌కప్ 2023, టీ20 ప్రపంచకప్-2024లో లీగ్ దశలో నిష్క్రమించిన ఇంగ్లండ్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.ఇంగ్లండ్ ఐసీసీ టోర్నీల్లోనూ కాకుండా ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ ఇదే తీరును కనబరుస్తుంది. ముఖ్యంగా అఫ్గానిస్తాన్ చేతిలో వరుసగా రెండు ఐసీసీ ఈవెంట్లలో ఇంగ్లండ్ ఓడిపోవడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కెప్టెన్ బట్లర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బట్లర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఫ్గాన్‌తో మ్యాచ్ అనంతరం బట్లర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. "నేను ఇప్పుడు ఎలాంటి భావోద్వేగ ప్రకటన చేయాలనుకోలేదు. కానీ నా కోసం, కొంతమంది మా అగ్రశ్రేణి ప్లేయర్ల కోసం నేను కొన్ని ఆంశాలను పరిగణలోకి తీసుకోవాలంటూ" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో బట్లర్ పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే కెప్టెన్సీకి జోస్ ది బాస్ గుడ్‌బై చెప్పనున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.చదవండి: పాకిస్తాన్ కోచ్‌గా వెళ్లేందుకు నేను సిద్దం: యువరాజ్ తండ్రి -
Champions Trophy 2025: ఆరేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన రూట్
అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ మరో సెంచరీ చేశాడు. రూట్.. వన్డేల్లో దాదాపు ఆరేళ్ల తర్వాత శతక్కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ సెంచరీతో మెరిశాడు. భారీ లక్ష్య ఛేదనలో రూట్ అద్భుతమైన శతకాన్ని సాధించాడు. ఈ మ్యాచ్‌లో రూట్ 98 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. రూట్‌కు వన్డేల్లో ఇది 17వ సెంచరీ. ఓవరాల్‌గా (టెస్ట్‌ల్లో, వన్డేల్లో కలిపి) 53వది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్.. విరాట్ కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 82 సెంచరీలు చేయగా.. రూట్ 53, రోహిత్ శర్మ 49, స్టీవ్ స్మిత్ 48, కేన్ విలియమ్సన్ 47 అంతర్జాతీయ సెంచరీలు చేశారు. రూట్ సెంచరీతో ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీల సంఖ్య 11కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఏ ఎడిషన్‌లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. రూట్ వన్డేల్లో చివరిగా 2019లో సెంచరీ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రూట్ సెంచరీతో మెరిసినా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పేలా లేదు. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 326 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతుంది. ప్రస్తుతం ఆ జట్టు 44 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 36 బంతుల్లో 58 పరుగులు చేయాలి. చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. రూట్ 107, జేమీ ఓవర్టన్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ సాల్ట్ 12, బెన్ డకెట్ 38, జేమీ స్మిత్ 9, హ్యారీ బ్రూక్ 38, జోస్ బట్లర్ 38, లివింగ్‌స్టోన్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఒమర్జాయ్, నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, గుల్బదిన్ నైబ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు. -
Champions Trophy 2025: బాబర్ ఆజమ్ రికార్డును సమం చేసిన బెన్ డకెట్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) 1000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 38 పరుగులు చేసి ఔటైన డకెట్.. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనత సాధించాడు. 21 ఇన్నింగ్స్‌ల్లో 6 అర్ద సెంచరీలు, 3 సెంచరీల సాయంతో 1000 పరుగులు పూర్తి చేసుకున్న డకెట్.. ఇంగ్లండ్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డును డకెట్.. కెవిన్ పీటర్సన్, జోనాథన్ ట్రాట్, డేవిడ్ మలాన్‌తో కలిసి షేర్ చేసుకున్నాడు. ఈ ముగ్గురు కూడా 21 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగుల మార్కును తాకారు.ఓవరాల్‌గా ఈ రికార్డును డకెట్.. వివ్ రిచర్డ్స్, క్వింటన్ డికాక్, బాబర్ ఆజమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్లతో కూడా షేర్ చేసుకున్నాడు. వీరు కూడా 21 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న రికార్డు పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ పేరిట ఉంది. జమాన్ కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఫకర్ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రికార్డు ఇమామ్ ఉల్ హాక్, శుభ్‌మన్ గిల్ పేరిట ఉంది. వీరిద్దరు 1000 పరుగులు పూర్తి చేసేందుకు 19 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.కెరీర్లో తొలి 1000 పరుగులు పూర్తి చేసేందుకు అత్యధిక సమయం తీసుకున్న బ్యాటర్‌గా డకెట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2016 అక్టోబర్‌లో తొలి వన్డే ఆడిన డకెట్.. 8 ఏళ్ల 143 రోజుల తర్వాత 1000 పరుగులు పూర్తి చేశాడు. డకెట్ తర్వాత 1000 పరుగులు పూర్తి చేసేందుకు సుదీర్ఘ సమయం తీసుకున్న ఆటగాడిగా టెంబా బవుమా నిలిచాడు. బవుమా 6 ఏళ్ల 174 రోజుల వ్యవధిలో తన తొలి 1000 వన్డే పరుగులు పూర్తి చేశాడు.జద్రాన్ రికార్డు సెంచరీ.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 27 ఓవర్ల అనంతరం 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 12, బెన్ డకెట్ 38, జేమీ స్మిత్ 9, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేసి ఔట్ కాగా.. జో రూట్ (52), జోస్ బట్లర్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నబీ 2, ఒమర్జాయ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందాలంటే 23 ఓవర్లలో మరో 173 పరుగులు చేయాలి. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన జద్రాన్.. రికార్డు శతకం.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) రికార్డు శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో అలరించిన జద్రాన్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ (177) నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ పేరిట ఉండేది. డకెట్ ఇదే ఎడిషన్‌లో ఆస్ట్రేలియాపై 165 పరుగులు స్కోర్ చేశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..ఇబ్రహీం జద్రాన్-177బెన్ డకెట్-165నాథన్ ఆస్టల్-145 నాటౌట్ఆండీ ఫ్లవర్-145సౌరవ్ గంగూలీ-141 నాటౌట్సచిన్ టెండూల్కర్-141గ్రేమీ స్మిత్-141ఈ సెంచరీతో జద్రాన్ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు గతంలో కూడా జద్రాన్ పేరిటే ఉండేది. జద్రాన్ తన రికార్డును తనే సవరించుకున్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన వన్డేలో జద్రాన్ 162 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..ఇబ్రహీం జద్రాన్-177 వర్సెస్ ఇంగ్లండ్, 2025ఇబ్రహీం జద్రాన్-162 వర్సెస్ శ్రీలంక, 2022రహ్మానుల్లా గుర్భాజ్-151 వర్సెస్ పాకిస్తాన్, 2023అజ్మతుల్లా ఒమర్జాయ్-149 నాటౌట్ వర్సెస్ శ్రీలంక, 2024రహ్మానుల్లా గుర్భాజ్-145 వర్సెస్ బంగ్లాదేశ్, 2023ఈ సెంచరీతో జద్రాన్ రెండు ఐసీసీ వన్డే ఈవెంట్లలో సెంచరీలు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జద్రాన్.. వన్డే వరల్డ్‌కప్‌లో, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. జద్రాన్.. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో మెరిశాడు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో జద్రాన్ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఈ రికార్డులతో పాటు జద్రాన్ మరో ఘనత కూడా సాధించాడు. పాక్ గడ్డపై నాలుగో అత్యధిక వన్డే స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాక్ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన ఘనత గ్యారీ కిర్‌స్టన్‌కు దక్కుతుంది. 1996 వరల్డ్‌కప్‌లో కిర్‌స్టన్ యూఏఈపై 188 పరుగులు (నాటౌట్) చేశాడు.పాక్ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్లు..గ్యారీ కిర్‌స్టన్-188 నాటౌట్వివియన్ రిచర్డ్స్-181ఫకర్ జమాన్-180 నాటౌట్ఇబ్రహీం జద్రాన్-177బెన్ డకెట్-165ఆండ్రూ హడ్సన్-161జద్రాన్ అద్భుత పోరాటంటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్చర్.. 11 పరుగుల వద్ద గుర్భాజ్‌ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్‌ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్ షాను (4) ఔట్ చేశాడు. ఈ దశలో జద్రాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సెంచరీ వరకు ఆచితూచి ఆడిన జద్రాన్.. ఆతర్వాత శివాలెత్తిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాది ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. లివింగ్‌స్టోన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికి జద్రాన్ ఔటయ్యాడు. జద్రాన్ ఔట్ కాపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా భారీ స్కోర్ చేసేది. ఇదే ఓవర్లో నబీ కూడా ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో (Afghanistan) ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England) పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ప్రస్తుతానికి (6 ఓవర్లు) మూడు వికెట్లు తీసిన ఆర్చర్.. తొలి వికెట్‌తో ఓ భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 50 వికెట్ల మార్కును చేరుకునేందుకు ఆర్చర్‌కు కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డు జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ 31 వన్డేల్లో 50 వికెట్ల మార్కును తాకాడు. ఇంగ్లండ్ బౌలర్లు స్టీవ్ హార్మిసన్ 32, స్టీవ్ ఫిన్ 33 వన్డేల్లో 50 వికెట్లు తీశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక మాజీ స్పిన్నర్ అజంతా మెండిస్ పేరిట ఉంది. మెండిస్ కేవలం 19 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని తాకాడు. మెండిస్ తర్వాత నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ (22 మ్యాచ్‌ల్లో) అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని తాకాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..అజంత మెండిస్-19 మ్యాచ్లుసందీప్ లామిచ్చేన్-22అజిత్ అగార్కర్-23మెక్క్లెనగన్-23కుల్దీప్ యాదవ్-24మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జోఫ్రా ఆర్చర్ ధాటికి ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆర్చర్.. 11 పరుగుల వద్ద గుర్భాజ్‌ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్‌ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్ షాను (4) ఔట్ చేశాడు. అయితే ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. హష్మతుల్లా 40 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం జద్రాన్..అజ్మతుల్లా ఒమర్జాయ్ (29 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జద్రాన్‌కు ఇది వన్డేల్లో ఆరో సెంచరీ. జద్రాన్ 2023 వరల్డ్‌కప్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించాడు. జద్రాన్ సెంచరీ పూర్తయ్యాక అజ్మతుల్లా బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో సిక్సర్.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్లు సాధించాడు. ప్రస్తుతం అజ్మతుల్లా 24 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. 37.3 ఓవర్ల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 201/4గా ఉంది. -
ఇంగ్లండ్‌తో కీలక పోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా లహోర్ వేదికగా ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది.గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన బ్రాడైన్ కార్స్ స్ధానంలో తుది జట్టులోకి రెహన్ అహ్మద్ వచ్చాడు. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి ఇంటిముఖం పడుతోంది. కాగా రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూశాయి.తుది జట్లుఅఫ్గానిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్.చదవండి: పాకిస్తాన్ కోచ్‌గా వెళ్లేందుకు నేను సిద్దం: యువరాజ్ తండ్రి -
ఇంగ్లండ్‌కు ఊహించని షాక్.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తమ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ ఆల్ రౌండర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కార్స్ ఎడమ కాలికి గాయమైంది.అయితే గాయం కాస్త తీవ్రమైనది కావడంతో ఈసీబీ వైద్య బృందం అతడికి విశ్రాంతి అవసరమని సూచించినట్ల తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్ధానాన్ని లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌తో ఇంగ్లండ్ క్రికెట్ భర్తీ చేసింది. "బ్రైడన్ కార్స్ మెకాలి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.అతడి స్ధానంలో లీసెస్టర్‌షైర్, ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ రెహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నామని" ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రెహాన్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో పాటే ఉన్నాడు. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్‌బైగా ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇప్పుడు కార్స్ దూరం కావడంతో ప్రధాన జట్టులో అహ్మద్‌కు చోటు దక్కింది. కాగా అహ్మద్‌కు అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాడు. అతడిని జట్టులోకి తీసుకోవడం ఇంగ్లీష్ జట్టు స్పిన్ బలాన్ని పెంచుతుంది. ఇప్పటివరకు తీలయన్స్ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్ మాత్రమే ఉన్నాడు. అహ్మద్‌కు బ్యాట్‌తో రాణించే సత్తాకూడా ఉంది. రెహాన్ తన కెరీర్లో ఇప్పటివరకు 6 వన్డేలు ఆడి పది వికెట్లు పడగొట్టాడు.కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బట్లర్ సేన తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 26న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఇంగ్లండ్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే అఫ్గాన్‌పై తప్పక గెలవాల్సిందే.ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్‌కు భారీ షాక్.. టోర్నీ నుంచి ఔట్ -
WC 2023: వంద శాతం ఫిట్‌గా లేకున్నా సరే అతడిని తీసుకురండి.. లేదంటే!
ICC ODI WC 2023 Eng Vs Afg: వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ అనుకున్న రీతిలో రాణించలేకపోతోంది. ఆరంభ మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన బట్లర్ బృందం.. తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి గాడిలో పడ్డట్లు కనిపించింది. కానీ.. మూడో మ్యాచ్‌కు వచ్చేసరికి కథ తలకిందులైంది. తమ వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ ముందు తలవంచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా సమిష్టి వైఫల్యంతో 69 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సొంతగడ్డపై హాట్ ఫేవరెట్ టీమిండియా, గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న వేళ మాజీ చాంపియన్ ఇంగ్లండ్ ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు ఓడి పరాభవం మూటగట్టుకుంది. అతడు లేనిలోటు స్పష్టంగా కనిపించింది కాగా ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ 2019 వరల్డ్‌కప్ హీరో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంగ్లండ్ మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. వంద శాతం ఫిట్‌గా లేకున్నా సరే ‘‘బెన్ స్టోక్స్ 99 శాతం ఫిట్‌గా ఉన్నా సరే అతడిని తుదిజట్టులోకి తీసుకోండి. మీకు అతడి అవసరం ఎంతగానో ఉంది. తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే కదా వెనక్కి పిలిపించారు. ఒకవేళ ఇంగ్లండ్ గనుక తదుపరి మ్యాచ్ ఓడిపోతే.. తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. గతంలో జరిగినట్లే ప్రతిసారి జరుగుతుందని అనుకోవడం పొరపాటే అవుతుంది’’ అని పఠాన్ పేర్కొన్నాడు. ప్రతిసారీ అలాగే జరుగదు అదే విధంగా... ‘‘2019 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్.. శ్రీలంక, పాకిస్తాన్‌తో పాటు మరో జట్టుతో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. వరుస పరాజయాల నుంచి కోలుకుని ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. అయితే, ప్రతిసారి ఇలాగే జరగదు కదా!’’ అంటూ ఇంగ్లండ్ తమ లోపాలు సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను ఇర్ఫాన్ పఠాన్ నొక్కివక్కాణించాడు. కాగా ప్రపంచకప్-2023 టోర్నీ ఆడాలన్న మేనేజ్మెంట్ విజ్ఞప్తి మేరకు ఆల్‌రౌండర్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, గాయం కారణంగా అతడు తొలి మూడు మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండలేకపోయాడు. అనుభవజ్ఞుడైన ఆటగాడు ఇలా జట్టుకు దూరం కావడం ఇంగ్లండ్ ఫలితాలను ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. చదవండి: Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? View this post on Instagram A post shared by ICC (@icc) -
ముజీబ్‌ను హత్తుకుని ఏడ్చేసిన బుడ్డోడు.. మ్యాచ్ కోసం ఏకంగా! వైరల్
ICC ODI WC 2023: ఆటలో గెలుపోటములు సహజం.. అయితే, ఒక్కోసారి భావోద్వేగాలు ఇలాంటి సహజ అంశాలపై పైచేయి సాధిస్తాయి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన సందర్భాల్లో.. అది కూడా తమకు గతంలో సాధ్యం కాని ఘనత సాధిస్తే.. గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆదివారం అఫ్గనిస్తాన్ జట్టు ఇలాంటి అనుభూతిని ఆస్వాదించింది. ఇంగ్లండ్ ఆటగాడు మార్క్‌వుడ్‌ను తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌల్డ్ చేయగానే అఫ్గన్ సంబరాలు అంబరాన్నంటాయి. మొట్టమొదటిసారిగా.. అది కూడా వన్డే ప్రపంచకప్ వంటి ఐసీసీ టోర్నీ సందర్భంగా ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయం అందుకోవడంతో అఫ్గన్ ఆటగాళ్ల ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి. View this post on Instagram A post shared by ICC (@icc) సంతోషం పట్టలేక.. కన్నీటి పర్యంతం డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించామన్న విజయగర్వంతో వారి కళ్లు మెరిసిపోయాయి. ఈ దృశ్యాల్ని చూసిన అభిమానుల గుండెలు ఆనందంతో నిండిపోయాయి. అయితే, ఓ బుల్లి అభిమాని మాత్రం ఈ సంతోషాన్ని పట్టలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంగ్లండ్‌పై అఫ్గన్ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించిన ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చాడు. ఇదేమీ ఫైనల్ మ్యాచ్ కాకపోయినా.. అఫ్గనిస్తాన్‌కు ఈ గెలుపు ఎంతటి సంతోషాన్నిచ్చిందో తన చర్య ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. 1100 కిలోమీటర్లు ప్రయాణించి పదకొండు వందల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ రాజధాని ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం దాకా వచ్చినందుకు తనకు దక్కిన బహుమతికి మురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్యూటీ ఆఫ్ క్రికెట్ ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘క్రికెట్లో ఉన్న అందమే ఇది’’ అంటూ ఆ చిన్నోడిని చూసి ఆనందిస్తూ.. అఫ్గనిస్తాన్ ఆటగాళ్లకు అభినందనలు తెలిజయజేస్తున్నారు. కాగా ఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌పై అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ 69 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఈ మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ 16 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్(11), హ్యారీ బ్రూక్(66), క్రిస్ వోక్స్(9) వికెట్లు తీశాడు. తద్వారా అఫ్గనిస్తాన్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: CWC 2023: ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక విజయం వెనుక ఇంగ్లండ్ మాజీ ఆటగాడి హస్తం This is the way to celebrate the very beautiful game of cricket. An Afghanistan kid traveled 1100 KM & finally they upset England to win the WC match. This boy hugged Mujeeb in tears, they admire #Rashid & #Gurbaz to get little happiness from sports. What a game #ENGvsAFG.🔥 pic.twitter.com/T1D3Uvp4Zv — Amock (@Politics_2022_) October 15, 2023 -
WC 2023: వాళ్లు అద్భుతం.. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అవే.. కానీ: బట్లర్
వన్డే వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్ చేతిలో ఊహించని రీతిలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఓటమి చెంది విమర్శల పాలైంది. అఫ్గన్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న చోట.. ఇంగ్లండ్ ‘పటిష్ట’ బ్యాటింగ్ ఆర్డర్ తేలిపోయింది. మెరుగైన భాగస్వామ్యాలు కరువై ఓటమిని కొనితెచ్చుకుంది. ఫలితంగా తాజా ప్రపంచకప్ ఎడిషన్‌లో రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓవైపు టీమిండియా, న్యూజిలాండ్ ఓటమి అన్నదే లేక రేసులో దూసుకుపోతున్న వేళ ఇంగ్లండ్ మాత్రం రోజురోజుకీ వెనుబడిపోతోంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు అఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్. 57 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 80 పరుగులతో చెలరేగాడు. ఈ క్రమంలో తిరిగి పుంజుకున్న ఇంగ్లండ్ బౌలర్లు అఫ్గన్ మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, ఆరో స్థానంలో బరిలోకి దిగిన వికెట్ కీపర్ ఇక్రం అలిఖిల్ అర్ద శతకం(58)తో రాణించగా... రషీద్ ఖాన్ 23, ముజీబ్ ఉర్ రహ్మమాన్ 28 పరుగులతో అఫ్గన్ మంచి స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసి అఫ్గన్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. మలన్ 32 రన్స్ స్కోరు చేశాడు. జో రూట్(11) విఫలం కాగా.. హ్యారీ బ్రూక్(66) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహాయం కరువైంది. ఆఖర్లో ఆదిల్ రషీద్(20), మార్క్ వుడ్(18) బౌండరీలు బాది కాసేపు ఫ్యాన్స్‌ను సంతోషపెట్టగలిగారు గానీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc) అఫ్గన్ బౌలర్ల దెబ్బకు 40.3 ఓవర్లకే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. 215 పరుగులకే ఆలౌటై 69 పరుగుల తేడాతో ఓడి రన్‌రేటు పరంగానూ వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. ‘‘టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని.. మొదటి బంతి నుంచే పరుగులు ఇవ్వడం నిరాశ పరిచింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ అద్భుతంగా ఆడింది. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మేము బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమయ్యాం. వాళ్ల జట్టులో కొంతమంది అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. నిజానికి మేము ఊహించినట్లుగా పిచ్‌పై డ్యూ(తేమ) లేదు. మా బౌలర్లు విఫలమైన చోట వాళ్ల బౌలర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఓటమి కచ్చితంగా మమ్మల్ని బాధించేదే! కానీ.. అదే తలచుకుని బాధపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మా ఆటగాళ్లకు పట్టుదల ఎక్కువ.. జట్టు మరింత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తుంది. ఒత్తిడిని తట్టుకుని రాణించగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ఆట తీరును ప్రశంసిస్తూ.. ఓటమిని హుందాగా అంగీకరిస్తూనే.. తిరిగి పుంజుకుంటామని బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో.. పొదుపుగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టిన ముజీబ్ ఉర్ రహ్మాన్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అఫ్గన్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన అతడు.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేయడంతో పాటు 10 ఓవర్ల బౌలింగ్‌లో 51 పరుగులిచ్చి కీలక వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
‘భారీ విజయాలపై ఇంగ్లండ్ దృష్టి పెట్టాలి.. లేదంటే కష్టమే'
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మరో విజయంపై కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఇంగ్లండ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. "డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు ఆదివారం అఫ్గానిస్తాన్‌తో పెద్దగా సవాలైతే ఎదురుకాదు. ఢిల్లీలో అఫ్గాన్ స్పిన్నర్లకు పిచ్ నుంచి సానుకూలత లేకపోతే మ్యాచ్ ఏకపక్షమయ్యే ఫలితంలో ఏ మార్పు ఉండదు. ఈ నేపథ్యంలో నేడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పొచ్చు. అయితే గాయం నుంచి కోలుకున్న బెన్ స్టోక్స్ బరిలోకి దిగేందుకు, ఫామ్‌ను అందిపుచ్చుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్‌కు ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఫిట్నెస్ ఎంతో కీలకం. ఏడాది క్రితం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్ ఇంగ్లండ్ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్ లో పునరాగమనం చేశాడు. 50 ఓవర్ల మ్యాచ్‌లో అతను ఎప్పుడైనా ప్రమాదకర ఆటగాడని ఇదివరకు ఎన్నో సార్లు రుజువు చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఆ్రస్టేలియా చిత్తుగా ఓడటం ఇంగ్లండ్ సహా సెమీస్ బరిలో ఉంటామనుకున్న మిగతా జట్ల ఉత్సాహంపై నీళ్లుచల్లింది. ఎందుకంటే ఇంగ్లండ్ కూడా న్యూజిలాండ్ చేతిలో అలాంటి పరాజయాన్నే చవిచూసింది. ఇలాంటి అత్యల్ప స్కోర్ల మ్యాచ్‌లతో నాకౌట్ దశ చేరేందుకు చివరికొచ్చేసరికి రన్‌రేట్ కీలకమవుతుంది. కాబట్టి సెమీస్‌లో ఎవరూ ఖాయమని అనుకోవడానికి లేదు. అయితే ఇంగ్లండ్... అఫ్గాన్ తదితర జట్లపై భారీ విజయాలపై దృష్టి పెడితే మంచిది. ఢిల్లీ లాంటి పిచ్‌పై ఇంగ్లండ్ బ్యా టర్లు చెలరేగేందుకు చక్కని అవకాశం కలి్పస్తుంది. చదవండి: విలియమ్సన్కు గాయం: మూడు మ్యాచ్‌లకు దూరం -
T20 World Cup 2022 : స్యామ్ కరన్ 5/10
పెర్త్: టి20 వరల్డ్ కప్‌ను మాజీ చాంపియన్ ఇంగ్లండ్ విజయంతో మొదలు పెట్టింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కొంత తడబడినా, చివరకు లక్ష్యాన్ని చేరింది. శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన ‘సూపర్ 12’ గ్రూప్–1 లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీమ్ జద్రాన్ (32 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), ఉస్మాన్ ఘని (30 బంతుల్లో 30; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. పేసర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (5/10) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. టి20ల్లో ఇంగ్లండ్ తరఫున ఒక బౌలర్ 5 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. స్టోక్స్, మార్క్ వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసింది. బట్లర్ (18), హేల్స్ (19) ప్రభావం చూపలేకపోగా...ఆ తర్వాత తక్కువ వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కాస్త ఇబ్బందుల్లో పడింది. అయితే లివింగ్‌స్టోన్ (21 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి జట్టును ఒడ్డున పడేశాడు. -
క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే ఇదేనేమో.. బట్లర్, లివింగ్‌స్టోన్ కళ్లు చెదిరే క్యాచ్‌లు
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానాడు క్రికెట్ సర్కిల్స్‌లో చాలాకాలంగా వినపడుతూ ఉంది. అయితే ఈ నానాడు వంద శాతం కరెక్టేనని ఇవాళ (అక్టోబర్ 22) జరిగిన ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రుజువు చేసింది. టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-1 సూపర్-12 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ పక్షుల్లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను గెలిపించారు. క్యాచెస్ ఆఫ్ ద టోర్నమెంట్ బరిలో నిలిచే అర్హత కలిగిన ఈ క్యాచ్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముందుగా లివింగ్‌స్టోన్ పట్టిన క్యాచ్ విషయానికొస్తే.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఆఫ్ఘన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ కొట్టిన భారీ షాట్‌ను బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద లివింగ్‌స్టోన్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. చాలా సేపు గాల్లో ఉన్న బంతిని లివింగ్‌స్టోన్ ముందుకు పరిగెడుతూ సూపర్మ్యాన్లా గాల్లోకి ఎగురుతూ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక జోస్ బట్లర్ పట్టిన క్యాచ్ విషయానికొస్తే.. ఈ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబీ లెగ్ గ్లాన్స్ షాట్ ఆడాలని ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్‌కీపర్ బట్లర్‌ను క్రాస్ చేయబోయింది. ఇంతలో బట్లర్ పక్షిలా తన లెఫ్ట్ సైడ్‌కు డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ తప్పక క్యాచ్ ఆఫ్ టోర్నమెంట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. లివింగ్‌స్టోన్, బట్లర్ పట్టిన క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) ఇవే కాక.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళే జరిగిన మ్యాచ్‌లో కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం ఒళ్లు జలదరించే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచే ఈ రోజు మొత్తానికి హైలైట్ అనుకుంటే మరో రెండు క్యాచ్‌లు దీనికి పోటీగా వచ్చాయి. ఇదిలా ఉంటే, గ్రూప్-1లో ఇవాళ జరిగిన మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్.. ఆసీస్‌పై, ఇంగ్లండ్.. ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) -
ENG VS AFG: పొట్టి క్రికెట్లో ప్రపంచ రికార్డు.. చరిత్రలో రెండోసారి ఇలా..!
పొట్టి క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. టీ20 వరల్డ్‌కప్-2022 సూపర్-12 మ్యాచ్‌ల్లో భాగంగా ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 22) జరుగుతున్న మ్యాచ్ ఈ రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ సామ్ కర్రన్ (5/10) ధాటికి 19.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. కర్రన్‌కు జతగా బెన్ స్టోక్స్ (2/19), మార్క్ వుడ్ (2/23), క్రిస్ వోక్స్ (1/24) రాణించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఇబ్రహీం జద్రాన్ (32), ఉస్మాన్ ఘనీ (30) ఓ మోస్తరుగా రాణించారు. ప్రపంచ రికార్డు విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్ల రూపంలో పెవిలియన్‌కు చేరారు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇలా పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. ఇదే ఏడాది క్రెఫెల్డ్ వేదికగా ఆస్ట్రియా-జర్మనీ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో తొలిసారి పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌లో ఈ సీన్ రెండోసారి రిపీట్ అయ్యింది. ఇదిలా ఉంటే, 113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఫజల్ హాక్ ఫారూఖీ బౌలింగ్‌లో బట్లర్ (18) ఔట్ కాగా.. అలెక్స్ హేల్స్ (11), డేవిడ్ మలాన్ క్రీజ్‌లో ఉన్నారు. -
T20 WC: సూపర్-12 ఆరంభ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్!
ICC Mens T20 World Cup 2022 Eng Vs AFG: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్.. అఫ్గనిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. సూపర్-12 దశలో భాగంగా పెర్త్ వేదికగా అక్టోబరు 22న ఇరు జట్లు పోటీ పడనున్నాయి. కాగా అసలైన పోరు కంటే ముందు ఇంగ్లండ్ సోమవారం పాకిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బట్లర్ బృందం గెలుపొందింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లే గాయపడినట్లు సమాచారం. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో టోప్లే ఎడమ మడిమ మెలిపడటంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌తో మ్యాచ్‌కు ముందు టోప్లే గాయానికి సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని.. త్వరలోనే కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా 28 ఏళ్ల రీస్ టోప్లే ఈ ఏడాది టీమిండియాతో టీ20(3/22), వన్డే సిరీస్(6/24) సందర్భంగా ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఒకవేళ టోప్లే గనుక కోలుకోనట్లయితే.. డేవిడ్ విల్లే తుది జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. రిజర్వు ప్లేయర్ టైమల్ మిల్స్ ప్రధాన జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను కూడా కొట్టిపడేయలేం. చదవండి: ఆసియా కప్-2023 పాక్‌లో జరిగితే టీమిండియా ఆడదు.. స్పష్టం చేసిన జై షా T20 WC 2022: యూఏఈ స్పిన్నర్ సంచలనం.. కార్తీక్ మెయప్పన్ సరికొత్త రికార్డు BCCI- Key Decisions: గంగూలీకి గుడ్‌బై! జై షా కొనసాగింపు.. బీసీసీఐ కీలక నిర్ణయాలివే! Keeping everything crossed for Toppers 🤞 More here: https://t.co/snXGG4CTt1#T20WorldCup pic.twitter.com/HjUodUxRzo — England Cricket (@englandcricket) October 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Under 19 WC: అఫ్గన్‌పై ఉత్కంఠ విజయం.. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్లో
Under 19 World Cup 2021-2022: అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యువ ఇంగ్లండ్ జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్‌లోని అంటిగ్వా వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. తద్వారా వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరుకుని.. 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. టామ్ ప్రెస్ట్ సారథ్యంలోని జట్టు ఈ అద్భుతం చేసి అభిమానుల మనసులను పులకింపజేసింది. కాగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ థామస్ అర్ధ సెంచరీ(50 పరుగులు)తో ఆకట్టుకోగా... జార్జ్ బెల్ 56 పరుగులు, వికెట్‌కీపర్ అలెక్స్ హార్టన్ 53 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 15 పరుగుల తేడాతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. కాగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా డీఎల్ఎస్ మెథడ్ ప్రకారం 47 ఓవర్లకు కుదించారు. ఇంగ్లండ్ ఆటగాడు జార్జ్ బెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక బుధవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అస్సలు ఊహించలేదు..: ఇంగ్లండ్ కెప్టెన్ ఈ గెలుపును అస్సలు ఊహించలేదు. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పడం కలిసి వచ్చింది. 230 పరుగులు స్కోరు చేయడం గొప్ప విషయం. ఇంగ్లండ్ ఫైనల్ చేరడం.. అందుకు నేను సారథిగా ఉండటం.. నమ్మలేకపోతున్నా.. ఎంతో సంతోషంగా ఉంది- ఇంగ్లండ్ అండర్-19 కెప్టెన్ టామ్ ప్రెస్ట్. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా IPL 2022 Auction: ఈ క్రికెటర్లకు భారీ డిమాండ్, రికార్డు ధర ఖాయం.. అంబటి రాయుడు, హనుమ విహారి కనీస విలువ ఎంతంటే! -
ఆ రోజుల్ని మరచిపోతారు: రషీద్ ఖాన్
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త గణాంకాలు నమోదు చేయడంతో తనపై వస్తున్న విమర్శలకు అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ స్పందించాడు. ఎన్ని మంచి ప్రదర్శనలు చేసినా, ఏదో ఒక సందర్భంలో పేలవ ప్రదర్శన చేస్తే విమర్శలు రావడం సర్వ సాధారణమేనన్నాడు. తాను అద్భుతమైన ప్రదర్శన చేసిన రోజుల్ని మరచిపోయి మరీ ఇంతటి స్థాయిలో విమర్శించడాన్ని తనదైన శైలిలో చమత్కరించాడు రషీద్. ‘ నేను మంచి ప్రదర్శన చేసిన రోజులు ఇప్పుడు గతం. ఒక్క చెత్త ప్రదర్శన చేస్తే పది మంచి ప్రదర్శన చేసిన రోజులు గతించిపోతాయి. వాటిని ప్రజలు మరచిపోవడం సర్వసాధారణం. మనం పేలవ ప్రదర్శన చేస్తే ఉత్తమ ప్రదర్శన చేసిన రోజులు గుర్తుకురావు. దాన్ని గుర్తుకుతెచ్చుకోవానికి ఎవరూ ఇష్టపడరు. ఆ మ్యాచ్‌కు కోసం నేను కూడా పెద్దగా ఆలోచించడం లేదు. . నాపై వస్తున్న విమర్శల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ చేసిన తప్పిదాలు మరోసారి జరగకుండా చూసుకోవడమే నా ముందున్న లక్ష్యం’ అని రషీద్ తెలిపాడు. శనివారం భారత్‌తో మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో రషీద్ మీడియాతో మాట్లాడాడు. భారత్‌తో మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరచడానికి తనవంతు కృషి చేస్తానన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ 9 ఓవర్లు వేసి 110 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. ఒక ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ అయిన రషీద్ ఇలా ధారాళంగా పరుగులు ఇచ్చి చెత్త రికార్డును మూటగట్టుకోవడంపై విమర్శల వర్షం కురిసింది. -
గర్జించిన ఇంగ్లండ్..
మాంచెస్టర్ : ఆతిథ్య ఇంగ్లండ్ దెబ్బకి పసికూన అఫ్గానిస్తాన్ బెంబేలెత్తింది. ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరిగిన పోరులో 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ జయభేరి మోగించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలమైన ఇంగ్లండ్ జట్టు అఫ్గాన్‌ను చెడుగుడు ఆడుకుంది. తొలుత బ్యాటింగ్‌లో విశ్వరూపం చూపించి అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్ ఆటగాళ్లలో హష్మతుల్లా(74), రహ్మత్(46), అఫ్గాన్(44) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, రషీద్ తలో మూడు వికెట్లతో రాణించగా.. మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల విధ్వంసం సృష్టించాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ 71 బంతుల్లోనే 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు చేశాడు. అతనికి తోడు బెయిర్ స్టో (90: 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్ (88: 82 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్), మొయిన్ అలీ(31: 9 బంతుల్లో ఫోర్, 4సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో దవ్లత్ జద్రాన్(3/85), గుల్బదిన్ నైబ్(3/68) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బాదుడే బాదుడు... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు విన్స్(26), బెయిర్ స్టో తొలి వికెట్‌కు 44 పరుగులు మాత్రమే జోడించారు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వచ్చిన వాళ్లు వచ్చినట్లు బ్యాట్ ఝళిపించారు. తొలుత బెయిర్ స్టో, రూట్ జోడీ ఆచితూచి ఆడినా నిలదొక్కుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించింది. ఈ క్రమంలో సెంచరీకి పది పరుగుల దూరంలో బెయిర్‌స్టో అవుటయ్యాడు. అయితే, ఈ జోడీని విడదీశామనే ఆనందం ఆఫ్గాన్ బౌలర్లకు కాసేపట్లోనే ఆవిరైంది. ఇంగ్లండ్ సారథి మోర్గాన్ క్రీజులోకి వచ్చీ రాగానే బాదుడు మొదలుపెట్టాడు. బౌలర్ ఎవరేనేది చూడకుండా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తొలుత 36 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న మోర్గాన్ ఆ తర్వాత మరో 21 బంతుల్లోనే సెంచరీకి చేరుకున్నాడు. శతకం అనంతరం మరింత చెలరేగిన మోర్గాన్ ఒక దశలో డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే, 47వ ఓవర్లో ఆఫ్ఘన్ కెప్టెన్ నైబ్.. రూట్, మోర్గాన్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఆఖర్లో బెన్‌స్టోక్స్(2), బట్లర్(2)త్వరగానే వెనుదిరిగినా మొయిన్ అలీ సైతం బ్యాట్ ఝళిపించడంతో ఇంగ్లండ్ స్కోరు 400కు మూడు పరుగుల దూరంలో నిలిచింది. అఫ్గాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 9 ఓవర్లలో ఏకంగా 110 పరుగులు ఇవ్వడం గమనార్హం. -
మోర్గాన్ సిక్సర్ల మోత..
-
ఇంగ్లండ్ ఇరగదీసిన రికార్డులివే..
మాంచెస్టర్: ఇటీవల కాలంలో వన్డే ఫార్మాట్లో మూడొందలకుపైగా స్కోర్లను అవలీలగా సాధిస్తున్న జట్టు ఏదైనా ఉందంటే ఇంగ్లండ్ ముందు వరుసలో ఉంటుంది. ఆ జట్టు ఒక్కసారి కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్‌లు నెలకొల్పుతూ మ్యాచ్‌లు ఎగరేసుకుపోతోంది. ప్రస్తుతం సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సైతం ఇంగ్లండ్ హవానే కొనసాగుతోంది. తాజాగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ పలు రికార్డులను నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫలితంగా తమ వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక స్కోరును ఇంగ్లండ్ సాధించింది. అదే సమయంలో ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు మొత్తం సాధించిన సిక్సర్లు 25. దాంతో 2015లో వెస్టిండీస్ సాధించిన 19 సిక్సర్ల రికార్డు తెరమరుగైంది. ఈ జాబితాలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల తర్వాత దక్షిణాఫ్రికా(18 సిక్సర్లు-2007 వరల్డ్‌కప్‌లో), భారత్(18 సిక్సర్లు-2007 వరల్డ్‌కప్‌లో)లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ఇక వన్డే ఫార్మాట్లో కూడా అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది.మరొకవైపు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 57 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా వరల్ద్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఒబ్రియన్(50 బంతుల్లో ఇంగ్లండ్‌పై), మ్యాక్స్‌వెల్(51 బంతుల్లో శ్రీలంకపై), ఏబీ డివిలియర్స్(52 బంతుల్లో వెస్టిండీస్‌పై)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో మోర్గాన్ 17 సిక్సర్లు కొట్టాడు. దాంతో ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడి రికార్డు సృష్టించాడు. అదే సమయంలో వన్డే ఫార్మాట్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో కూడా మోర్గాన్ తొలి స్థానం ఆక్రమించాడు. ఇక్కడ రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్లు 16 సిక్సర్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మోర్గాన్ 148 పరుగుల అత్యధిక వ్యక్తిగ పరుగులు సాధించగా, జో రూట్‌తో కలిసి 189 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా నమోదైంది. -
వరల్డ్‌కప్ చరిత్రలోనే చెత్త రికార్డు
మాంచెస్టర్: ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో అఫ్గానిస్తాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ ఒకడు. అయితే ఎవ్వరూ ఉహించని చెత్త రికార్డును రషీద్ ఖాన్ మూటగట్టుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రషీద్ ఖాన్ చెత్త గణాంకాలు నమోదు చేశాడు. కనీసం వికెట్ కూడా తీయకుండా 9 ఓవర్లు వేసిన రషీద్ 110 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రషీద్ నిలిచాడు. మరొకవైపు వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అఫ్గాన్ బౌలర్ చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో అఫ్గాన్ తరఫున నైబ్ 101 పరుగులు ఇస్తే, దాన్ని రషీద్ బ్రేక్ చేశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ 11 సిక్సర్లు సాధించడం ఇక్కడ గమనార్హం.(ఇక్కడ చదవండి: మోర్గాన్ విధ్వంసం.. ఇంగ్లండ్ భారీ స్కోర్) ప్రధానంగా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 57 బంతుల్లో 11 సిక్సర్లు, 3 ఫోర్లతో శతకం బాదేశాడు. అయితే 71 బంతుల్లో 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు సాధించిన తర్వాత మోర్గాన్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. బెయిర్ స్టో రెండో వికెట్‌గా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మోర్గాన్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విజృంభించి ఆడాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్.. దాన్ని సెంచరీగా మలుచుకోవడానికి మరో 21 బంతుల్నే తీసుకున్నాడు.(ఇక్కడ చదవండి: మోర్గాన్ సిక్సర్ల రికార్డు) మోర్గాన్ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, సెంచరీనే కూడా సిక్స్‌తోనే సాధించడం ఇక్కడ విశేషం. ఇది నాల్గో ఫాస్టెస్ట్ వరల్డ్‌కప్ సెంచరీగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే ఒక వరల్డ్‌కప్ మ్యాచ్లోఅత్యధిక వ్యక్తిగత సిక్సర్ల కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో వరల్డ్‌కప్‌లో గేల్ 16 సిక్సర్లు కొట్టగా, దాన్ని మోర్గాన్ బ్రేక్ చేశాడు. మోర్గాన్ భారీ సెంచరీకి జతగా బెయిర్ స్టో(90), జోరూట్(88)లు హాఫ్ సెంచరీలు జత చేశారు. చివర్లో మొయిన్ అలీ(31 నాటౌట్; 9 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. -
మోర్గాన్ విధ్వంసం.. ఇంగ్లండ్ భారీ స్కోర్
మాంచెస్టర్ : ఇయాన్ మోర్గాన్ (148; 71 బంతుల్లో 4ఫోర్లు, 17 సిక్సర్లు) అఫ్గానిస్తాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ 398పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో మోర్గాన్‌కు తోడు బెయిర్ స్టో(90; 99 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లు), జోయ్ రూట్(88; 82 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్)లు రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో సారథి గుల్బదిన్, జద్రాన్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. బెయిర్ స్టో-రూట్ల భాగస్వామ్యం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించిన అనంతరం విన్స్(26)ను జద్రాన్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రూట్‌తో కలిసి బెయిర్ స్టో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. తొలుత నిదానంగా ఆడిన వీరిద్దరూ అనంతరం గేర్ మార్చి పరుగులు రాబట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం సెంచరీ చేస్తాడనుకున్న బెయిర్ స్టో 90 పరుగుల వద్ద అవుటై నిరాశపరిచాడు. మోర్గాన్ సిక్సర్ల వర్షం.. బెయిర్ స్టో ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ వస్తువస్తూనే అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మోర్గాన్ వచ్చిన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు నిదానంగా సాగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సారథి క్రీజులోకి వచ్చిన అనంతరం భీభత్సంగా మారింది. సిక్సర్‌తోనే అర్థ సెంచరీ, సెంచరీ సాధించి ఆశ్చర్యపరిచాడు. కేవలం 57 బంతుల్లోనే సెంచరీ సాధించిన మోర్గాన్.. ప్రపంచకప్‌లో నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మోర్గాన్ విధ్వంసంతో పాటు రూట్ నిలకడైన ఆటతో మూడో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక చివర్లో భారీ షాట్లు ఆడే క్రమంలో మోర్గాన్, రూట్, బట్లర్, స్టోక్స్‌లు వెంటవెంటనే ఔటయ్యారు. రషీద్ ఖాన్ ‘సెంచరీ’ ఐపీఎల్, అఫ్గాన్ స్ట్రార్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. అత్యంత చెత్త బౌలింగ్‌తో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లోనే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఏకంగా 11 సిక్సర్లు కొట్టడం గమనార్హం. రషీద్ బౌలింగ్‌ను చీల్చిచెండాడిన ఆతిథ్య బ్యాట్స్‌మెన్ సులువుగా పరుగుల రాబట్టారు. ఈ మ్యాచ్‌లో రషీద్ 9 ఓవర్లు వేయగా 110 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ప్రపంచకప్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన స్టార్ స్పిన్నర్‌గా రషీద్ రికార్డు నెలకొల్పాడు. -
మోర్గాన్ సిక్సర్ల వర్షం
మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ చెలరేగిపోయింది. ప్రధానంగా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 57 బంతుల్లో 11 సిక్సర్లు, 3 ఫోర్లతో శతకం బాదేశాడు. బెయిర్ స్టో రెండో వికెట్‌గా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మోర్గాన్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విజృంభించి ఆడాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్.. దాన్ని సెంచరీగా మలుచుకోవడానికి మరో 21 బంతుల్నే తీసుకున్నాడు. మోర్గాన్ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, సెంచరీనే కూడా సిక్స్‌తోనే సాధించడం ఇక్కడ విశేషం. ఇది నాల్గో ఫాస్టెస్ట్ వరల్డ్‌కప్ సెంచరీగా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను జేమ్స్ విన్సే-బెయిర్ స్టోలు ఆరంభించారు. కాగా, జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఉండగా విన్సే(26) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత బెయిర్ స్టోతో జో రూట్ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెయిర్ స్టో(90) ఔటయ్యాడు. ఇంగ్లండ్ స్కోరు 164 పరుగుల వద్ద ఉండగా బెయిర్ స్టో ఔట్ కాగా, ఆపై మోర్గాన్-జోరూట్‌లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఒకవైపు మోర్గాన్ పరుగుల దాహంతో చెలరేగి పోవడంతో మరొకవైపు జో రూట్ నెమ్మదించాడు. మోర్గాన్ విరుచుకుపడటంతో అఫ్గాన్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఓవరాల్ వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో వరల్డ్‌కప్‌లో గేల్ 16 సిక్సర్లు కొట్టగా, దాన్ని మోర్గాన్ బ్రేక్ చేశాడు. అయితే 71 బంతుల్లో 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు సాధించిన తర్వాత మోర్గాన్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. అంతకముందు జోరూట్(88) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ ఆరు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. -
అయ్యో బెయిర్ స్టో.. జస్ట్ మిస్!
మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్ స్టో తృటిలో సెంచరీ కోల్పోయాడు. 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసిన బెయిర్ స్టో రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆది నుంచి సమయోచితంగా ఆడిన బెయిర్ స్టో.. నైబ్ వేసిన 30 ఓవర్ ఐదో బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో బెయిర్ స్టో భారంగా పెవిలియన్ వీడాడు. బెయిర్ స్టో కొద్దిలో సెంచరీ కోల్పోవడంపై ఇంగ్లండ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను జేమ్స్ విన్సే-బెయిర్ స్టోలు ఆరంభించారు. కాగా, జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఉండగా విన్సే(26) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత బెయిర్ స్టోతో జో రూట్ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెయిర్ స్టో ఔటయ్యాడు. ఆ తర్వాత జోరూట్ హాఫ్ సెంచరీ సాధించాడు. 33 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు నష్టానికి 189 పరుగులు చేసింది. -
ఇంగ్లండ్‌ను ఆపతరమా?
మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్ జట్లలో ఒకటిగా దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మరో విజయంపై కన్నేసింది. ఇప్పటికే మూడు విజయాలను ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉన్న ఇంగ్లండ్..ఇంకా పాయింట్ల ఖాతా తెరకుండా చివరి స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్‌తో తలపడుతోంది. అయితే గాయాల బెడద ఇంగ్లండ్‌ను కలవర పెడుతుంది. ఇప్పటికే డాషింగ్ ఒపెనర్ జేసన్ రాయ్ తొడ కండరాల గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరం కావడం ఆందోళన కల్గిస్తోంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా రూట్ రెండు సెంచరీలు సాధించి జోరు మీదున్నాడు. రూట్‌కు తోడుగా బట్లర్, బెయిర్‌స్టో, స్టోక్స్ చెలరేగితే ఇంగ్లండ్ మరోసారి 300 మైలురాయిని దాటడం లాంఛనమే. బౌలింగ్‌లో వోక్స్, జోఫ్రా ఆర్చర్, వుడ్, ఆదిల్ రషీద్‌లతో పటిష్టంగా ఉంది.ఇక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన అఫ్గానిస్తాన్ అత్యద్భుత ప్రదర్శన చేస్తే తప్ప ఇంగ్లండ్‌ను నిలువరించడం కష్టం. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ విభాగంలోనూ వారు అంచనాలను అందుకోలేకపోవడం ఆ జట్టు వరుస ఓటముల్ని చవిచూసింది. ఈ తరుణంలో ఇంగ్లండ్‌ను అఫ్గానిస్తాన్ ఆపడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. తుది జట్లు ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెయిర్ స్టో, జో రూట్, జేమ్స్ విన్సే, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ మోరిస్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్ అఫ్గానిస్తాన్ గుల్బదిన్ నైబ్(కెప్టెన్), రహ్మత్ షా, నూర్ అలీ జద్రాన్, నజిబుల్లా జద్రాన్, హస్మతుల్లా షాహిది, అస్గార్ అఫ్గాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీ ఖిల్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, దవ్లాత్ జద్రాన్