
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అఫ్గానిస్తాన్ సంచలనం సృష్టించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌ను 8 పరుగుల తేడాతో అఫ్గాన్ మట్టికర్పించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అఫ్గానిస్తాన్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. కాగా ఐసీసీ ఈవెంట్లలలో ఇంగ్లండ్‌ను అఫ్గానిస్తాన్ ఓడించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం.
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసిన అఫ్గానిస్తాన్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేసింది.ఈ మెగా టోర్నీలో తొలిసారి సెమీఫైన్‌ల్‌కు చేరేందుకు అఫ్గానిస్తాన్ అడుగుదూరంలో నిలిచింది. ఫిబ్రవరి 28న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో షాహిది బృందం తలపడనుంది.
ఒమర్జాయ్ సరికొత్త చరిత్ర..
కాగా అఫ్గాన్ చారిత్రత్మక విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో 41 పరుగులతో అదరగొట్టిన ఒమర్జాయ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలో ఒమర్జాయ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 40 ప్లస్ పరుగులతో పాటు 5 వికెట్ల తీసిన తొలి ఆటగాడిగా ఒమర్జాయ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేదు. అదేవిధంగా ఈ టోర్నమెంట్ చరిత్రలో రన్ ఛేజింగ్‌లో 5 వికెట్ల హాల్ సాధించిన ఐదో ప్లేయర్‌గా ఒమర్జాయ్ నిలిచాడు. ఈ జాబితాలో జాక్వెస్ కల్లిస్, మఖాయా ఏంటిని, జాకబ్ ఓరమ్, మెక్‌గ్రాత్ వంటి దిగ్గజాలు ఉన్నారు.
జద్రాన్ సూపర్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 146 బంతులు ఎదుర్కొన్న జద్రాన్.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 177 పరుగులు చేశాడు. అతడితో పాటు నబీ(40), షాహిదీ(40), అజ్మతుల్లా ఓమర్జాయ్(41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. 326 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది.
చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment