
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ మరో సెంచరీ చేశాడు. రూట్.. వన్డేల్లో దాదాపు ఆరేళ్ల తర్వాత శతక్కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ సెంచరీతో మెరిశాడు. భారీ లక్ష్య ఛేదనలో రూట్ అద్భుతమైన శతకాన్ని సాధించాడు. ఈ మ్యాచ్‌లో రూట్ 98 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.
రూట్‌కు వన్డేల్లో ఇది 17వ సెంచరీ. ఓవరాల్‌గా (టెస్ట్‌ల్లో, వన్డేల్లో కలిపి) 53వది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్.. విరాట్ కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 82 సెంచరీలు చేయగా.. రూట్ 53, రోహిత్ శర్మ 49, స్టీవ్ స్మిత్ 48, కేన్ విలియమ్సన్ 47 అంతర్జాతీయ సెంచరీలు చేశారు.
రూట్ సెంచరీతో ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీల సంఖ్య 11కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఏ ఎడిషన్‌లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. రూట్ వన్డేల్లో చివరిగా 2019లో సెంచరీ చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. రూట్ సెంచరీతో మెరిసినా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పేలా లేదు. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 326 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతుంది. ప్రస్తుతం ఆ జట్టు 44 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 36 బంతుల్లో 58 పరుగులు చేయాలి. చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. రూట్ 107, జేమీ ఓవర్టన్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ సాల్ట్ 12, బెన్ డకెట్ 38, జేమీ స్మిత్ 9, హ్యారీ బ్రూక్ 38, జోస్ బట్లర్ 38, లివింగ్‌స్టోన్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఒమర్‌జాయ్, నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, గుల్బదిన్ నైబ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment