joe root
-
ICC టెస్టు జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురు.. కెప్టెన్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 2024 ఏడాదికిగానూ పురుషుల అత్యుత్తమ టెస్టు(ICC Men’s Test Team of the Year 2024) జట్టును శుక్రవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి స్థానం దక్కింది. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఎంపికయ్యాడు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2024లో ఓపెనర్లుగా టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ చోటు దక్కించుకోగా.. వన్డే బ్యాటర్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) స్థానం సంపాదించాడు.లంక నుంచి అతడుఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ సారథి, టెస్టు క్రికెట్ వీరుడు జో రూట్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐదో స్థానంలో ఇంగ్లండ్ నూతన వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. ఆరో స్థానంలో శ్రీలంక శతకాల ధీరుడు కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ ఎంపిక కాగా.. ఆల్‌రౌండర్‌గా టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఇక ఈ జట్టులో ఏకంగా ముగ్గురు పేసర్లకు ఐసీసీ చోటిచ్చింది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు.. న్యూజిలాండ్ రైటార్మ్ బౌలర్ మ్యాట్ హెన్రీ.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లి- రోహిత్‌లకు దక్కని చోటుఇటీవలి కాలంలో వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లి- రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, రోహిత్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ మాత్రం గతేడాది అత్యుత్తమంగా రాణించాడు.జైసూ, బుమ్రా హిట్ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో భారీ శతకం(161) బాదడం అతడి ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి 2024లో జైసూ 1771 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా సైతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.మరోవైపు.. జడేజా సైతం స్థాయికి తగ్గట్లుగా రాణించి.. ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే... ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2024ను కూడా శుక్రవారం ప్రకటించారు. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరికి కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులో శ్రీలంక క్రికెటర్లు హవా చూపించారు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024: చరిత్ అసలంక (శ్రీలంక- కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గనిస్తాన్), పాతుమ్ నిసాంక(శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక- వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్(వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది(పాకిస్తాన్), హరీస్ రౌఫ్(పాకిస్తాన్), అల్లా ఘజన్ఫర్(అఫ్గనిస్తాన్).చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే!.. టీమిండియా నుంచి ఎవరంటే?
క్రికెట్ ప్రపంచంలో ‘ఫ్యాబ్ ఫోర్’గా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు పేరుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ నలుగురు బ్యాటర్లు తమదైన ముద్ర వేశారు. టీమిండియా ముఖ చిత్రమైన కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు.. శతకాల విషయంలో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.సెంచరీల మెషీన్వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన రన్‌మెషీన్.. ఇప్పటికే సచిన్ టెండుల్కర్(49) రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధికసార్లు వంద పరుగులు అందుకున్న క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఒక శతకం సాధించాడు కోహ్లి. కెప్టెన్‌గా భారత్‌కు టెస్టు ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అద్భుతమైన గణాంకాలుమరోవైపు.. ఆస్ట్రేలియా సారథిగా పనిచేసిన స్టీవ్ స్మిత్.. బ్యాటర్‌గా అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. 114 టెస్టుల్లో 34 సెంచరీల సాయంతో 9999, 165 వన్డేల్లో పన్నెండుసార్లు శతక్కొట్టి 5662, 67 టీ20లలో 1094 పరుగులు సాధించాడు.టెస్టుల్లో తనకు తానే సాటి ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తనకు తానే సాటి అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 152 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రూట్.. 36 సెంచరీల సాయంతో 12972 పరుగులు సాధించాడు. అదే విధంగా 171 వన్డేల్లో 16 శతకాలు నమోదు చేసి 6522 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 32 అంతర్జాతీయ టీ20లలో 893 రన్స్ చేశాడు.తొలిసారి ఆ ఐసీసీ ట్రోఫీ అందుకున్న నాయకుడుఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌కు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత కేన్ విలియమ్సన్‌కే దక్కుతుంది. అతడి కెప్టెన్సీలో 2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్‌ను కివీస్ జట్టు సొంతం చేసుకుంది. ఇక కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటిదాకా 105 టెస్టుల్లో 33 శతకాలు బాది 9276 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 165 వన్డేల్లో 13 సెంచరీలు చేసి 6811 పరుగులు సాధించాడు. 93 టీ20లు ఆడి 2575 రన్స్ చేశాడు.నవతరం ఫ్యాబ్ ఫోర్ వీరేఇలా ఈ నలుగురు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని 2013లోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవే ఊహించాడు. అందుకే పుష్కరకాలం క్రితమే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు ‘ఫ్యాబ్ ఫోర్’(ఫ్యాబ్యులస్ ఫోర్)గా నామకరణం చేశాడు. క్రోవే ఉపయోగించిన ఈ పదం తర్వాతి కాలంలో బాగా పాపులర్ అయింది.తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైకేల్ ఆర్థర్టన్ నవతరం ‘ఫ్యాబ్ ఫోర్’గా ఓ నలుగురు యువ క్రికెటర్ల పేర్లను చెప్పారు. అయితే, ఇందులో ఇద్దరి విషయంలో మాత్రమే నాసిర్ హుసేన్, ఆర్థర్టన్ ఏకాభిప్రాయానికి వచ్చారు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌తో పాటు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌లకు ఈ ఇద్దరూ ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చారు.నా దృష్టిలో ఆ నలుగురే..యశస్వి జైస్వాల్‌తో పాటు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్, పాకిస్తాన్ యువ తరంగం సయీమ్ ఆయుబ్ ఉంటాడని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. అయితే, ఆర్థర్టన్ మాత్రం యశస్వి, హ్యారీ బ్రూక్‌లతో పాటు శ్రీలంక సంచలన క్రికెటర్ కమిందు మెండిస్, న్యూజిలాండ్ యంగ్ స్టార్ రచిన్ రవీంద్రలకు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చాడు.సూపర్ ఫామ్‌లో ఆ ఆరుగురుకాగా ఈ గతేడాది యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1771 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హ్యారీ బ్రూక్ 2024లో ఐదు సెంచరీలు, ఆరు ఫిఫ్టీల సాయంతో 1575 పరుగలు చేశాడు.ఇక కమిందు మెండిస్ 1458 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. ట్రవిస్ హెడ్ 1399, సయీమ్ ఆయుబ్ 1254 పరుగులు సాధించారు. ఇక రచిన్ రవీంద్ర రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1079 పరుగులు చేశాడు. టీమిండియాను న్యూజిలాండ్ టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీస్ చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. -
జో రూట్ విధ్వంసం.. శివాలెత్తిపోయిన రికెల్టన్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 18) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్, పార్ల్ రాయల్స్ తలపడగా.. రెండో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ అమీతుమీ తేల్చుకున్నాయి.రూట్ విధ్వంసంప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ స్మీడ్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ వెర్రిన్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్యాపిటల్స్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్, దయ్యన్ గేలిమ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఎహసాన్ మలింగ ఓ వికెట్ దక్కించుకున్నాడు.213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్ డకౌట్ కాగా.. జో రూట్ (60 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్ హెర్మన్ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమ జట్టును గెలిపించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్, జేమ్స్ నీషమ్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో పార్ల్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో క్యాపిటల్స్ నాలుగో స్థానంలో ఉంది.శివాలెత్తిపోయిన రికెల్టన్రెండో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. ఎంఐ కేప్‌టౌన్ బౌలర్లలో రీజా హెండ్రిక్స్ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, కార్బిన్ బాష్, జార్జ్ లిండే తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌తో డుప్లెసిస్ టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్‌టౌన్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. ఈ మ్యాచ్‌లో రికెల్టన్ కోవిడ్‌తో బాధపడుతూ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్, మతీశ పతిరణలకు తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ఎంఐ కేప్‌టౌన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. సూపర్ కింగ్స్ మూడో స్థానంలో నిలిచింది. -
2024లో అత్యుత్తమ ప్రదర్శనలు వీరివే..!
2024లో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనల వివరాలను ఈ అర్టికల్‌లో చూద్దాం.టెస్ట్‌ల్లో..అత్యధిక పరుగులు-జో రూట్ (1556)అత్యధిక సెంచరీలు-జో రూట్ (6)అత్యధిక అర్ద సెంచరీలు-యశస్వి జైస్వాల్ (9)అత్యధిక సగటు-కమిందు మెండిస్ (74.92)అత్యధిక స్కోర్-హ్యారీ బ్రూక్ (317)అత్యధిక సిక్సర్లు-యశస్వి జైస్వాల్ (36)అత్యధిక వికెట్లు-జస్ప్రీత్ బుమ్రా (71)అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు-జస్ప్రీత్ బుమ్రా (5)అత్యధిక సగటు-జస్ప్రీత్ బుమ్రాఅత్యుత్తమ ఎకానమీ-జస్ప్రీత్ బుమ్రా (2.96)అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (ఇన్నింగ్స్‌లో)-నౌమన్ అలీ (8/46)వన్డేల్లో..అత్యధిక పరుగులు-కమిందు మెండిస్ (742)అత్యధిక శతకాలు-సైమ్ అయూబ్ (3)అత్యధిక సగటు-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (106.25)అత్యధిక స్ట్రయిక్‌రేట్-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (120.05)అత్యధిక స్కోర్-పథుమ్ నిస్సంక (210 నాటౌట్)అత్యధిక సిక్సర్లు-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (23)అత్యధిక వికెట్లు- హసరంగ, హేలిగర్ (26)అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు-అల్లా ఘజన్ఫర్ (2)అత్యుత్తమ సగటు-ఎస్ అహ్మద్ (10.94)అత్యుత్తమ ఎకానమీ-బెర్నాల్డ్ స్కోల్జ్ (3.46)అత్యధిక స్ట్రయిక్‌రేట్-వనిందు హసరంగ (17.4)అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన-వనిందు హసరంగ (7/19)టీ20ల్లో..అత్యధిక పరుగులు-బాబర్ ఆజమ్ (738)అత్యధిక సెంచరీలు-సంజూ శాంసన్ (3)అత్యధిక సగటు-తిలక్ వర్మ (102)అత్యధిక అర్ద సెంచరీలు-బాబర్ ఆజమ్ (6)అత్యధిక స్కోర్-ఫిన్ అలెన్ (137)అత్యధిక సిక్సర్లు-నికోలస్ పూరన్ (39)అత్యధిక వికెట్లు-వనిందు హసరంగ (38)అత్యుత్తమ బౌలింగ్ సగటు-లోకీ ఫెర్గూసన్ (9.25)అత్యుత్తమ ఎకానమీ-రషీద్ ఖాన్ (5.60)అత్యధిక స్ట్రయిక్‌రేట్-రషీద్ ఖాన్ (10.2)అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన-ముస్తాఫిజుర్ రెహ్మాన్ (6/10) -
IND Vs AUS: టీమిండియా అంటే చాలు, రెచ్చిపోతాడు.. స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సెంచరీతో మెరిశాడు. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు భారత్‌పై ఇది 11వ సెంచరీ (43 ఇన్నింగ్స్‌ల్లో). ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు భారత్‌పై ఇన్ని టెస్ట్ సెంచరీలు చేయలేదు. స్టీవ్ తర్వాత ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ (10) భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేశాడు.SMUDGE 🔥pic.twitter.com/NavtFc0nFN— CricTracker (@Cricketracker) December 27, 2024టెస్ట్‌ల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లుస్టీవ్ స్మిత్ 11జో రూట్ 10గ్యారీ ఫీల్డ్ సోబర్స్ 8వివ్ రిచర్డ్స్ 8రికీ పాంటింగ్ 8వరుసగా రెండో సెంచరీస్టీవ్కు ఇది కెరీర్లో 34వ టెస్ట్ సెంచరీ. మెల్బోర్న్లో ఐదవది. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు వరుసగా ఇది రెండో సెంచరీ. గబ్బా వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లోనూ స్టీవ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ తన సెంచరీ మార్కును 167 బంతుల్లో చేరుకున్నాడు. ఇందులో రెండు సిక్స్‌లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి.రెండో రోజు లంచ్ విరామం సమయానికి స్టీవ్ 139 పరుగలతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా స్టార్క్ (15) క్రీజ్‌లో ఉన్నాడు. 113 ఓవర్లలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 454/7గా ఉంది. రెండో రోజు తొలి సెషన్లో ఆసీస్ పాట్ కమిన్స్ (49) వికెట్ కోల్పోయింది.309/6 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఆసీస్ బ్యాటర్లలో కాన్స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా 2, ఆకాష్ దీప్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.విరాట్ రికార్డును అధిగమించిన స్టీవ్టెస్ట్ల్లో స్టీవ్ విరాట్ పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో స్టీవ్ ఖాతాలో 10 సెంచరీలు (41 ఇన్నింగ్స్‌లు) ఉండగా.. విరాట్ 9 (47 ఇన్నింగ్స్‌లు), సచిన్ 9 (65 ఇన్నింగ్స్‌లు), పాంటింగ్ 8 (51 ఇన్నింగ్స్‌లు), మైఖేల్ క్లార్క్ 7 సెంచరీలు (40 ఇన్నింగ్స్‌లు) కలిగి ఉన్నారు.గవాస్కర్, లారా సరసన స్టీవ్టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ 11వ స్థానానికి చేరాడు. స్టీవ్.. దిగ్గజాలు బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్దనే సరసన చేరాడు. స్టీవ్‌తో పాటు వీరంతా 34 టెస్ట్ సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది. -
కోహ్లితో పోలికా?.. నవ్వకుండా ఉండలేను: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్, క్రికెట్ రారాజు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునికతరం ఆటగాళ్లలో కోహ్లికి సాటి వచ్చే క్రికెటర్ మరొకరు లేడన్నాడు. మూడు ఫార్మాట్లలో ఈ రన్‌మెషీన్ అరుదైన ఘనతలు సాధించాడని పేర్కొన్నాడు.81 సెంచరీలుఅలాంటి గొప్ప ఆటగాడితో వేరే వాళ్లను పోలిస్తే తాను నవ్వకుండా ఉండలేనని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ తర్వాత వంద శతకాలకు చేరువైన ఏకైక ఆటగాడిగా కోహ్లి వెలుగొందుతున్నాడు. వన్డేల్లో 50 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. టెస్టుల్లో 30, అంతర్జాతీయ టీ20లలో ఒక శతకం బాదాడు.మొత్తంగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 81 సెంచరీలు చేసిన కోహ్లి ఖాతాలో మరెన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కోహ్లి సాధించిన పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో చాలా మంది పాక్ మాజీ ఆటగాళ్లు బాబర్‌ను కోహ్లితో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమేఈ విషయంపై స్పందించిన మహ్మద్ ఆమిర్.. కోహ్లికి మరెవరూ సాటిరారని.. ఇలాంటి పోలికలు హాస్యాస్పదంగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘‘నవతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యంత గొప్ప ఆటగాడు. అతడిని బాబర్ ఆజం.. లేదంటే స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పోలిస్తే నాకు నవ్వు వస్తుంది.కోహ్లిని ఎవరితో పోల్చలేము. అతడికి మరెవరూ సాటిరారు. ఎందుకంటే.. ఒంటిచేత్తో అతడు టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించాడు. అది కూడా కేవలం ఏ ఒక్క ఫార్మాట్లోనూ కాదు.. మూడు ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు.మిగతా ప్లేయర్లలో ఇలాంటి ఘనత వేరెవరికీ సాధ్యం కాదు. ఈ జనరేషన్లో గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమే’’ అని మహ్మద్ ఆమిర్ కోహ్లి నైపుణ్యాలను కొనియాడాడు. కోహ్లికి కఠిన పరిస్థితుల ఎలా బయటపడాలో బాగా తెలుసునని.. ప్రత్యర్థి జట్ల పట్ల అతడొక సింహస్వప్నం అని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రెడిక్టా షోలో ఆమిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగాకాగా విరాట్ కోహ్లి ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో శతకం బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో మాత్రం తేలిపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. మహ్మద్ ఆమిర్ మాత్రం కఠిన దశ నుంచి వేగంగా కోలుకోవడం కోహ్లికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న కోహ్లి.. ఆ తర్వాత పదేళ్ల పాటు రాణించిన తీరే ఇందుకు నిదర్శనం అని తెలిపాడు.చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
రూట్ పునరాగమనం
లండన్: చివరిసారి భారత్ వేదికగా 2023లో జరిగిన ప్రపంచకప్‌లో ఆడిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ క్రికెటర్ జో రూట్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో... ఆ తర్వాత పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును ఆదివారం ప్రకటించారు. భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పోటీపడే ఇంగ్లండ్ జట్టును కూడా ఎంపిక చేశారు. ఈ రెండు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు వికెట్ కీపర్ జోస్ బట్లర్ నాయకత్వం వహిస్తాడు. టెస్టు ఫార్మాట్లో ఈ ఏడాదిని వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్న రూట్ చివరి వన్డే 2023 ప్రపంచకప్‌లో ఆడాడు. 33 ఏళ్ల రూట్ ఇప్పటి వరకు 171 వన్డేలు ఆడి 6522 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్ వేసే రూట్ వన్డేల్లో 27 వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెపె్టన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరిగే సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా స్టోక్స్‌కు తొడ కండరాల గాయం తిరగబెట్టింది. ప్రస్తుతం స్టోక్స్ ఈ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫలితంగా అతని పేరును సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్. ఇంగ్లండ్ టి20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్–ఇంగ్లండ్ టి20 సిరీస్ షెడ్యూల్ జనవరి 22: తొలి టి20 (కోల్‌కతాలో) జనవరి 25: రెండో టి20 (చెన్నైలో) జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్‌లో) జనవరి 31: నాలుగో టి20 (పుణేలో) ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబైలో) భారత్–ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్‌లో) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్‌లో) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్‌లో) -
మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించిన రూట్.. నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. రూట్.. తన సహచరుడు హ్యారీ బ్రూక్‌ను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో బ్రూక్ నంబర్ వన్ స్థానంలో నిలువగా.. వారం తిరిగే లోపే రూట్ మళ్లీ అగ్రపీఠమెక్కాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 895 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్.. బ్రూక్ కంటే 19 రేటింగ్ పాయింట్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన మూడో టెస్ట్‌లో రూట్ 32, 54 (రెండు ఇన్నింగ్స్‌ల్లో) పరుగులు చేయగా.. బ్రూక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు (0,1). ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 423 పరుగుల తేడాతో ఓడినప్పటికీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా విలియమ్సన్ ర్యాంకింగ్ మెరుగుపడనప్పటికీ, గణనీయంగా రేటింగ్ పాయింట్లు పెంచుకున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కేన్ మూడో స్థానంలో ఉన్నాడు. కేన్‌కు రూట్‌కు మధ్య కేవలం 28 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?తాజా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో అద్భుత గణాంకాలు (4-1-13-2) నమోదు చేయడంతో అకీల్ టాప్ ప్లేస్‌కు చేరాడు. అకీల్ మూడు స్థానాలు ఎగబాకి చాలాకాలంగా టాప్ ప్లేస్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌కు కిందకు దించాడు. -
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అతడేనంటూ బ్రూక్‌ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ (898 రేటింగ్ పాయింట్లు)గా నిలిచాడు.ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బ్రూక్ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్‌వన్‌గా ఉన్న మరో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏకంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్ ప్లేయర్. బ్రూక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్‌ను కొనియాడాడు.ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్ పేరిట ఒక సెంచరీ ఉంది.మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.మనోళ్ల పరిస్థితి ఏంటి?ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (4వ స్థానం), రిషభ్ పంత్ (9వ స్థానం) ఉండగా...శుబ్‌మన్ గిల్ 17వ, విరాట్ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (890) తన నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్‌వుడ్ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ ర్యాంక్ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి. చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
అగ్రపీఠాన్ని అధిరోహించిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. బ్రూక్.. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ జో రూట్‌ను రెండో స్థానానికి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో బ్రూక్ సెంచరీ (123), హాఫ్ సెంచరీ (55) చేశాడు. ఈ ప్రదర్శనల ఆధారంగానే బ్రూక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం బ్రూక్ ఖాతాలో 898 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్ రేటింగ్ పాయింట్స్‌కు (897) బ్రూక్ రేటింగ్ పాయింట్లకు మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క పాయింట్ మాత్రమే.తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా సత్తా చాటారు. అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌పై సూపర్ సెంచరీ చేసిన హెడ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు, సెంచరీ చేసిన బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.20వ స్థానానికి పడిపోయిన కోహ్లిఆసీస్తో రెండో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లి ఆరు స్థానాలు కిందకు దిగజారి 20వ స్థానానికి పడిపోయాడు. అదే టెస్ట్‌లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయిన రిషబ్ పంత్ సైతం మూడు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. యశస్వి జైస్వాల్ తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కేన్ విలియమ్సన్ మూడులో, కమిందు మెండిస్ ఆరో స్థానంలో, డారిల్ మిచెల్ ఎనిమిదో ప్లేస్‌లో సౌద్ షకీల్ పదో స్థానంలో ఉన్నారు.టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, హాజిల్‌వుడ్ టాప్-3లో కొనసాగుతుండగా.. కమిన్స్ ఓ స్థానం మెరుగపర్చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గత వారం నాలుగో స్థానంలో ఉన్న అశ్విన్ ఓ స్థానం కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు. రవీంద్ర జడేజా, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, మ్యాట్ హెన్రీ నౌమన్ అలీ ఆరు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌పై అద్భుత ప్రదర్శన చేసిన మిచెల్ స్టార్క్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి ఎగబాకాడు. -
జో రూట్ సూపర్ సెంచరీ.. ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా విఫలమైన జో రూట్.. రెండో టెస్టులో మాత్రం తన మార్క్‌ను చూపించాడు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన సెకెండ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.130 బంతులు ఎదుర్కొన్న రూట్.. 11 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. రూట్‌కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును ఈ ఇంగ్లండ్ లెజెండ్ సమం చేశాడు. ద్రవిడ్ తన అంతర్జాతీయ టెస్టు కెరీర్లో 36 సెంచరీలు చేశాడు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు. కాగా రూట్ 2021 నుంచి ఇప్పటి వరకు రూట్ అత్యధికంగా 19 టెస్టు సెంచరీలు చేయడం విశేషం.ఇక టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. జాక్వెస్ కలిస్(45), రికీ పాంటింగ్(41), కుమార సంగక్కర(38), ద్రవిడ్(36), రూట్(36) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.కాగా రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.చదవండి: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే? -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. నాలుగో ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 1625 పరుగులు చేయగా.. ప్రస్తుతం రూట్ ఖాతాలో 1630 పరుగులు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా రూట్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో రూట్ 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే..!ఫోర్త్ ఇన్నింగ్స్‌లో రూట్ సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 1630 పరుగులు చేశాడు. రూట్‌కు ఈ మైలురాయి చేరుకునేందుకు 49 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో 1625 పరుగులు చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5 స్థానాల్లో వీరు ఉన్నారు.రూట్- 1630 పరుగులు (49 ఇన్నింగ్స్‌లు)సచిన్- 1625 (60 ఇన్నింగ్స్‌లు)అలిస్టర్ కుక్- 1611 (53 ఇన్నింగ్స్‌లు)గ్రేమ్ స్మిత్- 1611 (41 ఇన్నింగ్స్‌లు)శివ్‌నరైన్ చంద్రపాల్- 1580 (49 ఇన్నింగ్స్‌లు)కేన్ సచిన్ రికార్డును తన 150వ టెస్ట్‌లో బద్దలు కొట్టడం విశేషం. రూట్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో 12777 పరుగులు చేసి సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), కల్లిస్ (13289), ద్రవిడ్ (13288) రూట్ కంటే ముందున్నారు.కాగా, క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యరీ బ్రూక్ (171) భారీ సెంచరీతో కదంతొక్కగా.. బ్రైడన్ కార్స్ 10 వికెట్లతో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రూట్ రెండో ఇన్నింగ్స్‌లో జేకబ్ బేతెల్తో (50 నాటౌట్) కలిసి అజేయమైన 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. -
Pak vs Eng: చెలరేగిన పాక్ స్పిన్నర్లు.. ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం
Pakistan vs England, 3rd Test Day 3: పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టులో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కనబరిచింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2021లో అబుదాబి వేదికగా 72 పరుగులకే కుప్పకూలింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందగా.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఆతిథ్య పాక్ రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది.ఆరు వికెట్లతో చెలరేగిన నొమన్ అలీమూడో టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 267 పరుగులకే కట్టడి చేసిన షాన్ మసూద్ బృందం.. రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ చేసింది. పాక్ స్పిన్నర్లు నొమన్ అలీ, సాజిద్ ఖాన్ ధాటికి తట్టుకోలేక ఇంగ్లిష్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.నొమన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హ్యారీ బ్రూక్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ బెన్‌స్టోక్స్ 12 పరుగులకే వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధించిన 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించిన పాకిస్తాన్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రెండో రోజు ఆట ఇలా సాగిందిబ్యాటర్ల పట్టుదలకు, బౌలర్ల సహకారం తోడవడంతో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో పాకిస్తాన్ మెరుగైన స్థితిలో నిలిచింది. సిరీస్ నిర్ణయాత్మక పోరులో పాకిస్తాన్ ప్లేయర్లు సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 73/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 96.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ప్లేయర్ సౌద్ షకీల్ (223 బంతుల్లో 134; 5 ఫోర్లు) వీరోచిత సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొన్న షకీల్ బౌండరీల జోలికి పోకుండా ఒకటి, రెండు పరుగులు చేస్తూ ముందుకు సాగాడు. ఆఖర్లో స్పిన్ ద్వయం నోమాన్ అలీ (45; 2 ఫోర్లు, ఒక సిక్సర్), సాజిద్ ఖాన్ (48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాకిస్తాన్‌కు 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెప్టెన్ షాన్ మసూద్ (26), వికెట్ కీపర్ రిజ్వాన్ (25) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. సల్మాన్ ఆఘా (1) విఫలమయ్యాడు. సహనానికి పరీక్షగా మారిన స్లో పిచ్‌పై దాదాపు ఐదు గంటలకు పైగా క్రీజులో నిలిచిన షకీల్... నోమాన్ అలీ, సాజిద్ తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రేహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: Ind vs NZ: రోహిత్ శర్మ మరోసారి ఫెయిల్.. నీకేమైంది ’హిట్‌మ్యాన్’?! -
PAK VS ENG 3rd Test: పరుగుల యంత్రానికి బ్రేక్
ఇటీవలికాలంలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న జో రూట్.. పాకిస్తాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటయ్యాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. గత 17 ఇన్నింగ్స్‌ల్లో రూట్‌కు ఇది తొలి సింగిల్ డిజిట్ స్కోర్. ఈ మ్యాచ్‌లో రూట్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. పాక్ రెండు వైపుల నుంచి స్పిన్నర్లతోనే అటాక్ చేస్తుండటంతో ఇంగ్లండ్ ఒత్తిడిలో పడిపోయింది.pic.twitter.com/O668Qz1FRs— ViratKingdom (@kingdom_virat1) October 24, 2024ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి పాకిస్తాన్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. లంచ్ విరామం వరకు పాక్ కేవలం ఇద్దరు బౌలర్లను మాత్రమే ప్రయోగించింది. వారిద్దరు కూడా స్పిన్నర్లే. ఈ మ్యాచ్‌లో పాక్ కేవలం ఒకే ఒక పేసర్‌తో (ఆమెర్ జమాల్) బరిలోకి దిగింది. పాక్ స్పిన్నర్లు నౌమన్ అలీ (15-0-53-2), సాజిద్ ఖాన్ (15-3-55-3) ఇంగ్లండ్ బ్యాటర్లను ఉక్కిబిక్కిరి చేస్తున్నారు. వీరి ధాటికి ఇంగ్లండ్ 110 పరుగులకే (30 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (52) ఒక్కడు అర్ద సెంచరీతో రాణించాడు. జాక్ క్రాలే 29, ఓలీ పోప్ 3, జో రూట్ 5, హ్యారీ బ్రూక్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బెన్ స్టోక్స్ (6), జేమీ స్మిత్ (5) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇంగ్లండ్, రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచాయి. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్‌లో గెలవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ ప్రత్యేకమైన స్పిన్ ట్రాక్‌ను తయారు చేయించుకుంది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), గస్ అట్కిన్సన్, రెహాన్ అహ్మద్, జాక్ లీచ్, షోయబ్ బషీర్పాకిస్తాన్: సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, మొహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఆమెర్ జమాల్, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, జహీద్ మెహమూద్చదవండి: రఫ్ఫాడించిన రబాడ.. సౌతాఫ్రికా ఘన విజయం -
రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా కొనసాగింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ తాజా ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇటీవల పాకిస్తాన్‌తో ముగిసిన తొలి టెస్ట్‌లో హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనలతో రూట్ కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు (932) సాధించి టాప్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకున్నాడు. బ్రూక్ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి కేన్ విలియమ్సన్తో సహా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. రూట్, బ్రూక్ దెబ్బకు భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చెరో స్థానం కోల్పోయి నాలుగు, ఏడు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన పాక్ ఆటగాళ్లు అఘా సల్మాన్, షాన్ మసూద్ 11, 12 స్థానాలు మెరుగపర్చుకుని 22, 51వ స్థానాలకు ఎగబాకారు.టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. బుమ్రా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా ఆరు, కుల్దీప్ 16 స్థానాల్లో ఉన్నారు. పాక్‌తో టెస్ట్ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన జాక్ లీచ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానానికి ఎగబాకాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. జో రూట్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. చదవండి: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు -
పాక్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ 823
ముల్తాన్: టెస్టు ఫార్మాట్లో వన్డే తరహా ఆటతీరుతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ... హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో చెలరేగారు. ఫలితంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకున్న ఇంగ్లండ్ జట్టు... పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 492/3తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు... నాలుగో రోజు 49 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 331 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో రూట్, బ్రూక్ నాలుగో వికెట్‌కు 454 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. మొదట రూట్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే బ్రూక్ ద్విశతకం ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన బ్రూక్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోగా... బ్రూక్ 310 బంతుల్లో టెస్టు కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. గ్రాహం గూచ్ తర్వాత (1990లో; భారత్‌పై) ట్రిపుల్ సెంచరీ బాదిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా బ్రూక్ నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో ఇది 20వ అత్యధిక వ్యక్తిగత స్కోరు. పాకిస్తాన్ బౌలర్లలో ఆరుగురు 100 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. నసీమ్ షా, ఆయూబ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ గురువారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సల్మాన్ (49 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... షఫీఖ్ (0), షాన్ మసూద్ (11), బాబర్ ఆజమ్ (5), రిజ్వాన్ (10), ఆయూబ్ (25), షకీల్ (29) విఫలమయ్యారు. నేడు ఆటకు ఆఖరి రోజు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 115 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్‌తో పాటు ఆమేర్ జమాల్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇవీ రికార్డులు4 టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది (823/7 డిక్లేర్డ్) నాలుగో అత్యధిక టీమ్ స్కోరు. గతంలో శ్రీలంక (1997లో భారత్‌పై 952/6 డిక్లేర్డ్), ఇంగ్లండ్ (1938లో ఆ్రస్టేలియాపై 903/7 డిక్లేర్డ్; 1930లో వెస్టిండీస్‌పై 849) ఎనిమిది వందల పైచిలుకు పరుగులు చేశాయి. 1 పాకిస్తాన్‌పై ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే (823/7 డిక్లేర్డ్). 1958లో వెస్టిండీస్ చేసిన 790/3 డిక్లేర్డ్ రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ గడ్డపై నమోదైన అత్యధిక స్కోరు కూడా ఇదే.454 టెస్టు క్రికెట్లో నాలుగో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం. 449 పరుగులతో ఆడమ్ వోజెస్, షాన్ మార్‡్ష (ఆస్ట్రేలియా; 2015లో వెస్టిండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును రూట్, బ్రూక్ బద్దలు కొట్టారు.2 టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రూక్‌ది రెండో వేగ వంతమైన ట్రిపుల్ సెంచరీ. 2008లో దక్షిణాఫ్రికాపై వీరేంద్ర సెహా్వగ్ 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదగా... ఇప్పుడు బ్రూక్ 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ నమోదైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. టెస్ట్‌ల్లో రెండు, మూడు అత్యధిక స్కోర్లు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉండటం విశేషం. ఇంగ్లీష్ జట్టు 1938లో ఆస్ట్రేలియాపై, 1930లో వెస్టిండీస్‌పై వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసింది.ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగో రోజు చివరి సెషన్లో పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే మరో 130 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మరో రోజు ఆట మిగిలి ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 823/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ శరవేగంగా వికెట్లు కోల్పోతుంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (36), అమెర్ జమాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
PAK vs ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జోసఫ్ ఎడ్వర్డ్ రూట్ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారీ డబుల్ సెంచరీ (262) చేసిన రూట్.. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 20000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 13వ ఆటగాడిగా రికార్డుపుటల్లోకెక్కాడు. రూట్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 350 మ్యాచ్‌లు ఆడి 20079 పరుగులు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి తర్వాత 20000 పరుగులు పూర్తి చేసింది రూట్ ఒక్కడే. విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 535 మ్యాచ్‌లు ఆడి 27041 పరుగులు చేశాడు.కాగా, పాక్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రూట్ డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. సహచురుడు హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడ్డాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్ -
పాక్ గడ్డపై ఇంగ్లండ్ వీరుల విధ్వంసం(ఫోటోలు)
-
ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో రూట్ చెలరేగాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామం మారిన ముల్తాన్ పిచ్‌పై రూట్ దుమ్ములేపుతున్నాడు. 305 బంతుల్లో 14 ఫోర్లతో రూట్ తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రూట్‌కు ఇది ఆరో టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుతం 203 పరుగులతో రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో హ్యారీ బ్రూక్(174) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.సచిన్ రికార్డు సమం..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో మెరిసిన ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన జాబితాలో ఏడో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి కేన్ విలియమ్సన్, ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, యూనిస్ ఖాన్ సరసన రూట్ నిలిచాడు.ఈ దిగ్గజాలు కూడా టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్(12) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధాన్లాలో కుమార సంగర్కర(11), లారా(9) కొనసాగుతున్నారు. -
హ్యారీ బ్రూక్ సెంచరీ.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్ 118 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో బ్రూక్‌కు ఇది ఆరో సెంచరీ. పాక్‌పై కేవలం ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగవది. బ్రూక్‌తో పాటు మరో ఎండ్‌లో జో రూట్ కూడా సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరు సెంచరీల మోత మోగించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ధీటుగా జవాబిస్తుంది. 85.2 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 427/3గా ఉంది. రూట్ 146, బ్రూక్ 108 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరిశారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా -
కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్ గత మూడేళ్ల కాలంలో 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. 2021 నుంచి టెస్ట్‌ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా చెప్పుకునే కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్ సైతం రూట్ చేసినన్ని సెంచరీలు కాని, పరుగులు కాని చేయలేకపోయారు. రూట్ తాజాగా పాక్‌పై సెంచరీ చేసి తన సెంచరీల సంఖ్యను 35కు పెంచుకున్నాడు.ఈ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర గణాంకం చక్కర్లు కొడుతుంది. 2021 ఆరంభంలో రూట్ కేవలం 17 సెంచరీలు మాత్రమే చేస్తే.. అప్పుడు కోహ్లి సెంచరీల సంఖ్య 27గా ఉండింది. అదే ఇప్పుడు (2024లో) టెస్ట్‌ల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 29గా ఉంటే.. రూట్ సెంచరీల సంఖ్య ఏకంగా 35కు చేరుకుంది.ఈ ఫిగర్స్‌ను సగటు టీమిండియా అభిమాని జీర్ణించుకోలేనప్పటికీ ఇది నిజం. ఈ గణాంకాలను బట్టి చూస్తే రూట్ ఏ రేంజ్లో సెంచరీల మోత మోగిస్తున్నాడో ఇట్టే అర్దమవుతుంది. రూట్ ఈ మధ్యకాలంలో కోహ్లి ఒక్కడికే కాదు ఫాబ్లో మిగతా ఇద్దరికి (విలియమ్సన్, స్టీవ్ స్మిత్) కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.2021లో స్టీవ్ సెంచరీల సంఖ్య 26గా ఉంటే ప్రస్తుతం అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. 2021లో విలియమ్సన్ సెంచరీల సంఖ్య 24గా ఉంటే ఇప్పుడు అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. కోహ్లితో పోలిస్తే సెంచరీల విషయంలో విలియమ్సన్, స్టీవ్ స్మిత్ కాస్త మెగ్గానే కనిపిస్తున్నా, రూట్ ఈ ఇద్దరికి కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు.2021లో రూట్ సెంచరీలు-172024లో రూట్ సెంచరీలు-352021లో విలియమ్సన్ సెంచరీలు-242024లో విలియమ్సన్ సెంచరీలు-322021లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-262024లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-322021లో కోహ్లి సెంచరీలు-272024లో కోహ్లి సెంచరీలు-29చదవండి: PAK VS ENG 1st Test: అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్.. మరో సెంచరీ -
అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్.. టెస్ట్‌ల్లో 35వ సెంచరీ
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్ట్ క్రికెట్లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. రూట్ గత మూడేళ్లుగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్లో రూట్ 2021 నుంచి 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. ఈ మధ్యకాలంలో టెస్ట్‌ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.JOE ROOT, YOU FREAKING LEGEND. 🙇♂️- 35th Test century going past Gavaskar, Younis, Lara and Jayawardene and became England's leading run scorer as well in Tests. The GOAT!! 🐐 pic.twitter.com/uG9pkzpmOf— Mufaddal Vohra (@mufaddal_vohra) October 9, 2024రూట్ ఖాతాలో 35వ సెంచరీతాజాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ మరో సెంచరీతో మెరిశాడు. రూట్‌కు టెస్ట్‌ల్లో ఇది 35వ సెంచరీ. ఈ సెంచరీతో రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ రికార్డును చేరుకునే క్రమంలో రూట్ సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, మహేళ జయవర్దనే, యూనిస్ ఖాన్ లాంటి దిగ్గజాలను అధిగమించాడు. పైన పేర్కొన్న వారంతా టెస్ట్‌ల్లో తలో 34 సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు..సచిన్-51కల్లిస్-45పాంటింగ్-41సంగక్కర-38ద్రవిడ్-36రూట్-35*ఈ ఏడాది ఐదో సెంచరీరూట్ టెస్ట్‌ల్లో తన రెడ్ హాట్ ఫామ్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు. తాజా సెంచరీతో కలుపుకుని రూట్ ఈ ఏడాది ఐదు సెంచరీలు పూర్తి చేశాడు. ఈ ఏడాది టెస్ట్‌ల్లో రూట్, కమిందు మెండిస్ మాత్రమే ఐదు సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ వేదికగా మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ధీటుగా జవాబిస్తుంది. మూడో రోజు రెండో సెషన్ సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. రూట్ (104), హ్యారీ బ్రూక్ (59) క్రీజ్‌లో ఉన్నారు. జాక్ క్రాలే (78), ఓలీ పోప్ (0), బెన్ డకెట్ (84) ఔటయ్యారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా -
జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా
టెస్టు క్రికెట్లో ఇంగ్లంగ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగులు వరదపారిస్తున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.ముల్తాన్ వేదికగా పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ అదరగొడుతున్నాడు. 82 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న రూట్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.కుక్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు..టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ ఘనత సాధించాడు. రూట్ ఇప్పటివరకు 147 టెస్టులు ఆడి 12473* పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుక్ ఆల్‌టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15921) అగ్రస్ధానంలో ఉండగా, రెండో స్ధానంలో రికీ పాంటింగ్(13378) పరుగులు చేశాడు.చదవండి: CT 2025: పాక్‌కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే? -
PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్న రూట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ఆడిన రూట్ 51.59 సగటుతో 5005 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 అర్ద శతకాలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మార్నస్ లబూషేన్ ఉన్నాడు. లబూషేన్ ఇప్పటివరకు 3904 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత కూడా రూట్‌కే దక్కుతుంది.డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు..రూట్-5005లబూషేన్-3904స్టీవ్ స్మిత్-3486బెన్ స్టోక్స్-3101బాబర్ ఆజమ్-2755ఎడిషన్ల వారీగా రూట్ చేసిన పరుగులు..2019-21లో 1660 పరుగులు2021-23లో 1915 పరుగులు2023-25లో 1490 పరుగులురూట్ ఖాతాలో మరో రికార్డు..తాజా ఇన్నింగ్స్‌తో రూట్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఐదోసారి క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సచిన్ అత్యధికంగా ఆరు సార్లు ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగలు పూర్తి చేశాడు. రూట్.. బ్రియాన్ లారాతో (5) కలిసి ఐదు సార్లు ఈ ఘనతను సాధించాడు. రూట్ ఈ ఏడాది 1018 పరుగులు (21 ఇన్నింగ్స్‌ల్లో) చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్‌ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్ జమాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 96/1గా ఉంది. జాక్ క్రాలే (64), జో రూట్ (32) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్