శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగుల వరద పారించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ 75.00 సగటుతో 375 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు ఉన్నాయి. లంకతో సిరీస్‌ను 2-1తో ఇంగ్లండ్ సొంతం చేసుకోవడంలో జో కీలక పాత్ర పోషించాడు.
కాగా సిరీస్ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో రూట్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. రూట్‌కు ఇది టెస్టుల్లో 6వ ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు కావడం విశేషం. దీంతో పలు అరుదైన రికార్డులను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు.
రూట్ సాధించిన రికార్డులు ఇవే..
⇥టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ ఆటగాళ్లు గ్రాహం గూచ్, ఆండ్రూ స్ట్రాస్, జేమ్స్ ఆండర్సన్‌ల పేరిట ఉండేది. వీరిముగ్గురూ 5 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌లగా నిలిచారు. తాజా సిరీస్‌లో ఆరోసారి అవార్డు గెలుచుకున్న రూట్.. ఈ దిగ్గజ త్రయాన్ని అధిగమించాడు.
⇥ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్న జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను రూట్ అధగమించాడు. సచిన్ తన టెస్టు కెరీర్‌లో 5 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రూట్ దిగ్గజ క్రికెటర్లు మాల్కం మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్, స్టీవ్ వాలతో కలిసి సంయుక్తంగా ఆరో స్ధానంలో నిలిచాడు.
చదవండి: AUS vs ENG: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment