ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. నాలుగో ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 1625 పరుగులు చేయగా.. ప్రస్తుతం రూట్ ఖాతాలో 1630 పరుగులు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా రూట్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో రూట్ 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే..!
ఫోర్త్ ఇన్నింగ్స్‌లో రూట్ సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 1630 పరుగులు చేశాడు. రూట్‌కు ఈ మైలురాయి చేరుకునేందుకు 49 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో 1625 పరుగులు చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5 స్థానాల్లో వీరు ఉన్నారు.
రూట్- 1630 పరుగులు (49 ఇన్నింగ్స్‌లు)
సచిన్- 1625 (60 ఇన్నింగ్స్‌లు)
అలిస్టర్ కుక్- 1611 (53 ఇన్నింగ్స్‌లు)
గ్రేమ్ స్మిత్- 1611 (41 ఇన్నింగ్స్‌లు)
శివ్‌నరైన్ చంద్రపాల్- 1580 (49 ఇన్నింగ్స్‌లు)
కేన్ సచిన్ రికార్డును తన 150వ టెస్ట్‌లో బద్దలు కొట్టడం విశేషం. రూట్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో 12777 పరుగులు చేసి సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), కల్లిస్ (13289), ద్రవిడ్ (13288) రూట్ కంటే ముందున్నారు.
కాగా, క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యరీ బ్రూక్ (171) భారీ సెంచరీతో కదంతొక్కగా.. బ్రైడన్ కార్స్ 10 వికెట్లతో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రూట్ రెండో ఇన్నింగ్స్‌లో జేకబ్ బేతెల్‌తో (50 నాటౌట్) కలిసి అజేయమైన 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment