
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. శుక్రవారం(ఏప్రిల్ 11) లహోర్ వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్, లహోర్ ఖలందర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. ఈ క్రమంలో కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది.
తమ జట్టు వైస్ కెప్టెన్‌గా పాక్ స్పీడ్ స్టార్ హసన్ అలీని కరాచీ కింగ్స్ ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కరాచీ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. "కరాచీ కింగ్స్ జట్టు వైస్ కెప్టెన్‌గా హసన్ అలీ బాధ్యతలు స్వీకరించాడు. రాబోయే సీజన్ కోసం సిద్దంగా ఉండండి" అంటూ కరాచీ యాజమాన్యం ఎక్స్‌లో రాసుకొచ్చింది.
ఈ క్రమంలో గురువారం జరిగిన పీఎస్ఎల్ కెప్టెన్ల మీట్‌కు డేవిడ్ వార్నర్ స్ధానంలో హసన్ అలీ హాజరయ్యాడు. కాగా ఇటీవలే కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంపికైన సంగతి తెలిసిందే. కరాచీ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన హసన్ అలీ పాక్ జట్టుకు మాత్రం దూరంగా ఉంటున్నాడు.
అలీ చివరగా పాక్ జట్టు తరపున గతేడాది మేలో ఐర్లాండ్‌పై ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కాగా కరాచీ జట్టులో కేన్ విలియమ్సన్, ఆడమ్ మిల్నే, జేమ్స్ విన్స్ వంటి విదేశీ స్టార్లు ఉన్నారు.
కరాచీ కింగ్స్ జట్టు
అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, డేవిడ్ వార్నర్, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, టిమ్ సీఫెర్ట్, జాహిద్ మహమూద్, లిట్టన్ దాస్, మీర్ హమ్జా, కేన్ విలియమ్సన్, ఇమ్మాద్ మమ్‌జామ్, ఎమ్బియామ్‌సన్ యూసుఫ్, ఫవాద్ అలీ, రియాజుల్లా.