
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య, నటి సనా జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత జట్టు అభిమానులే ఆమెను టీజ్ చేస్తూ అసహనం వెళ్లగక్కారు. కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నుంచి విడిపోయినట్లు ప్రకటించకముందే షోయబ్ మాలిక్.. సనాను పెళ్లాడిన ఫొటోలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సానియాతో విడిపోకముందే షోయబ్‌కు సనాతో రిలేషన్ ఉందంటూ పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరు చేసిన మోసం బయటపడంతో సానియానే స్వయంగా విడాకులకు పూనుకున్నట్లు వార్తలు వినిపించాయి.
ఇక షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి. అయితే, పెళ్లైన నాటి నుంచే ఈ జంటపై నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జీవిత భాగస్వాములకు ద్రోహం చేసి.. ఆ విషయం బయటపడగానే మళ్లీ నిఖా పేరిట తమ ‘బంధాన్ని’ పవిత్రం చేసుకునేందుకు పెద్ద నాటకమే ఆడారని మండిపడ్డారు.
ముఖ్యంగా సానియా మీర్జా షోయబ్ కోసం ఎన్నో అవాంతరాలు దాటుకుని పాకిస్తానీని పెళ్లి చేసుకుందని.. అయినా ఆమె పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జట్టు అభిమానులు సైతం షోయబ్ మాలిక్‌ను ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు.
తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సనా జావెద్‌కు నేరుగానే నిరసన సెగ తగిలింది. కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న తన భర్త షోయబ్ మాలిక్‌కు మద్దతుగా ఆమె ముల్తాన్ స్టేడియానికి వచ్చింది.
ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి సనా వెళ్తున్నపుడు కొంత మంది సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు. దీంతో వాళ్లవైపు చూసిన సనా.. తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
కాగా 42 ఏళ్ల షోయబ్ మాలిక్ తొలుత ఆయేషా సిద్దిఖి(2002)ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత 2010లో సానియా మీర్జాను వివాహమాడాడు. ఈ జంటకు కుమారుడు ఇజహాన్ ఉన్నాడు.
అయితే, షోయబ్‌తో విభేదాలు తలెత్తిన కారణంగా సానియానే ఖులా ద్వారా అతడికి విడాకులివ్వడం గమనార్హం. ఈ క్రమంలో తాను సనాను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
చదవండి: హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్.. మాలిక్ పోరాటం వృథా
Pakistan fans teasing Shoaib Malik's 3rd wife 'Sana Javed' by calling her "Sania Mirza"#PSL9 pic.twitter.com/EXr0OQywvQ
— Don Cricket 🏏 (@doncricket_) February 20, 2024