
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు సంబంధించిన పాత వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైవాహిక బంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ అభిమానులు సానియాకు మద్దతుగా నిలుస్తున్నారు. పనిలో పనిగా సానియా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి దిమ్మతిరిగేలా కౌంటర్లు ఇస్తున్నారు.
కాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరగగా.. అప్పటికి ఇద్దరూ కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్నారు. దుబాయ్‌లో కాపురం పెట్టిన ఈ జంటకు 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు.
అన్యోన్య దంపతులుగా పేరొందిన సానియా- షోయబ్ విడిబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు రాగా.. వాటిని నిజం చేస్తూ షోయబ్ మాలిక్ తన కొత్త భార్యను పరిచయం చేశాడు. నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశాడు.
ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. సానియా తనకు తానుగా షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సానియా మీర్జాకు షోయబ్ వివాహేతర సంబంధాల గురించి తెలిసిందని సమాచారం.
ఈ నేపథ్యంలోనే అతడి ప్రవర్తన నచ్చక అతడి నుంచి విడిపోయిందని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక షోయబ్ పెళ్లి తర్వాత సానియా మీర్జా వరుస ఫొటోషూట్లు, ప్రొఫెషన్‌కు సంబంధించిన పనులతో బిజీ అయింది.
అయితే, కొంతమంది ఆకతాయిలు మాత్రం.. సానియా రెండో పెళ్లి అంటూ తప్పుడు కథనాలు అల్లుతున్నారు. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ తాను పెళ్లి కొడుకు అవతారంలో ఉన్న ఫొటోను షేర్ చేయగా.. వక్రభాష్యాలు చెబుతూ ఈ టెన్నిస్‌స్టార్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సానియా అభిమానులు.. ‘‘సోషల్ మీడియాలో హైలైట్ కావడానికి ఇంతకు దిగజారుతారా? ఓ మహిళ గురించి ఇంత నీచంగా అబద్దాలు వ్యాప్తి చేస్తారా? ఆమె పట్ల ఎందుకింత ద్వేషం’’ అంటూ మండిపడుతున్నారు. వైవాహిక బంధం గురించి సానియా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. షోయబ్ లాంటి వ్యక్తిని విడిచిపెట్టి ఆమె మంచి పనిచేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
పాత వీడియోలో ఏముంది?
కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తులకు మీరిచ్చే సలహా ఏమిటని గతంలో ఓ మహిళ సానియా మీర్జాను ప్రశ్నించింది. ఇందుకు బదులిస్తూ.. ‘‘పెళ్లికి ముందు మీరెలా ఉన్నారో అలాగే ఉండండి. జీవిత భాగస్వామి చెప్పారని మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మీలో ఉన్న ఆ ప్రత్యేక లక్షణాన్ని చూసే కదా వాళ్లు మీతో ప్రేమలో పడతారు’’ అని సానియా పేర్కొంది.
Advice of Sania Mirza for Shoaib Malik ❤️#ShoaibMalik | #SanaJaved #SaniaMirza | #ShoaibMalikMarriage pic.twitter.com/9NxodlKidd
— Sehrish Javed (@sehrish_javed18) January 21, 2024
Comments
Please login to add a commentAdd a comment