Shoaib Malik
-
క్రికెటర్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి.. మ్యారేజ్ డే పిక్స్ షేర్ చేసిన నటి సనా జావెద్ (ఫోటోలు)
-
PCB: మెంటార్లుగా ఆ ఐదుగురు.. షోయబ్ మాలిక్ సహా..
దేశవాళీ చాంపియన్స్ కప్ టోర్నీలో ఐదుగురు మాజీ క్రికెటర్లకు మెంటార్లుగా అవకాశం ఇచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మిస్బా ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో ఇందుకు గానూ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే ఎవరు ఏ జట్టుకు మార్గనిర్దేశకుడిగా ఉంటారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.నవతరం ఆణిముత్యాలను గుర్తించేందుకుతొలుత వీరు చాంపియన్స్ వన్డే కప్ ద్వారా ఆయా జట్లకు మెంటార్లుగా తమ ప్రయాణం మొదలుపెడతారని తెలిపింది. ఈ విషయం గురించి పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్కప్ టీమ్స్ మెంటార్లుగా ఐదుగురు చాంపియన్లను నియమించడం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం గడించి.. ఆట పట్ల అంకితభావం కలిగి ఉన్న వీరు.. నవతరం ఆణిముత్యాలను గుర్తించడంలో.. వారిని మెరికల్లా తీర్చిదిద్దడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ప్రక్షాళనలో భాగంగా కొత్తగా మూడు టోర్నీలుఅంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు మధ్య వారధులుగా పనిచేస్తారని.. యువ క్రికెటర్ల నైపుణ్యాలకు సానపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారని నక్వీ వెల్లడించారు. ఆట పరంగానే వ్యక్తిగతంగానూ యువ ఆటగాళ్లకు వీరు దిక్సూచిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. కాగా నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్‌బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు పాకిస్తాన్లో ఉన్నాయి.వీటికి అదనంగా మూడు కొత్త టోర్నమెంట్లను పీసీబీ ఇటీవల ప్రవేశపెట్టింది. పురుషుల క్రికెట్లో చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా మొదట సెప్టెంబరు 12- 29 వరకు చాంపియన్స్ వన్డే కప్ నిర్వహించనుంది. ఇందులో టాప్ దేశవాళీ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా పాల్గొనున్నట్లు పీసీబీ తెలిపింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసి.. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్ది అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీసీబీ ఈ టోర్నమెంట్లను ప్రవేశపెట్టింది.ఐదుగురు అనుభవజ్ఞులుపాక్ మాజీ బ్యాటర్, 52 ఏళ్ల వకార్ యూనిస్ ఇటీవల పీసీబీ సలహాదారుగా పనిచేశాడు. మరో మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ పాక్ జాతీయ హెడ్‌కోచ్‌గా గతంలో సేవలు అందించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్, మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన పాక్ జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇకపై మెంటార్లుగా వీరు కొత్త అవతారం ఎత్తనున్నారు. చదవండి: రోహిత్ కోసం మేమూ పోటీలో ఉంటాం: పంజాబ్ కింగ్స్ అధికారి -
రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటా.. మళ్లీ పాక్ తరపున ఆడుతా: మాలిక్
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓడి గ్రూపు స్టేజిలోనే పాక్ నిష్కమ్రించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట మాత్రమే విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచినప్పటకి అవి చెప్పుకోదగ్గ విజయాలు కావు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో గ్రూపు స్టేజి నుంచి పాక్ నిష్క్రమించడం ఇదే మొదటి సారి. అంతకుముందు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌ది ఇదే పరిస్థితి.దారుణ ప్రదర్శన కనబరిచి వన్డే ప్రపంచకప్‌లో సైతం గ్రూపు స్టేజిలోనే నిష్క్రమించింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు వరల్డ్‌కప్ జట్టులో చోటివ్వడాన్ని తప్పుబడుతున్నారు. వారి స్ధానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది మాజీలు అభిప్రాయపడుతున్నారు.ఇక వరుసగా రెండు వరల్డ్‌కప్‌లలో నిరాశపరిచిన పాకిస్తాన్.. వచ్చే ఏడాది తమ స్వదేశంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనైనా సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్‌కు ప్రాతినిథ్యం వహించాలన్న తన కోరికను మాలిక్ వ్యక్తం చేశాడు. కాగా మాలిక్ 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఆ తర్వాత టీ20ల్లో మాత్రమే 42 ఏళ్ల మాలిక్ కొనసాగాడు. టీ20ల్లో కూడా పెద్దగా పాక్ తరపున ఆడే అవకాశం రాలేదు. పాకిస్తాన్ తరపున మాలిక్ చివరగా 2021లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న మాలిక్.. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో మాత్రమే కొనసాగుతున్నాడు."నేను మళ్లీ పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను.రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాను. ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాను. నాలో ఇంకా ఫిట్నెస్ లెవల్స్ ఏ మాత్రం తగ్గలేదు. నా దేశం కోసం ఏమి చేయడానికైనా సిద్దంగా ఉన్నాను.పాకిస్తాన్‌కు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందించేందుకు నా వంతు కృషి చేయాలని భావిస్తున్నానని" పీఎన్ఎన్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నాడు. -
‘ప్లీజ్.. కెప్టెన్సీ వదిలెయ్.. మంచే జరుగుతుంది’
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. సారథిగా, బ్యాటర్‌గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శల పాలవుతున్నాడు.అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పాక్ జట్టు ఇంత వరకు బోణీ కొట్టకపోవడంతో సూపర్-8 అవకాశాలు కూడా సంక్లిషంగా మారిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అనూహ్య రీతిలో ఆతిథ్య యూఎస్ఏ చేతిలో ఓటమి పాలైంది పాకిస్తాన్.ఆ తర్వాతి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్‌లోనూ బాబర్ బృందానికి మరోసారి పరాభవం తప్పలేదు. న్యూయార్క్‌లో ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.యూఎస్ఏతో పోటీపడాల్సిన దుస్థితిసూపర్-8 దశకు అర్హత సాధించాలంటే పసికూన యూఎస్ఏతో పోటీపడాల్సిన స్థితిలో నిలిచింది. ఇక బాబర్ ఆజం వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. ప్రపంచంలోని మేటి బ్యాటర్లలో ఒకడిగా పేరొందిన ఈ రైట్‌హ్యాండర్ ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు.యూఎస్ఏతో మ్యాచ్‌లో 44 పరుగులు చేయగా.. భారత్‌పై కేవలం 13 పరుగులకే బాబర్ పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ, బ్యాటింగ్ తీరుపై మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.ఈ క్రమంలో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ బాబర్ ఆజంను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి చేశాడు.ప్లీజ్ బాబర్.. కెప్టెన్సీ వదిలేసెయ్!‘‘చాలా కాలం నుంచి నేను ఇదే మాట చెప్తున్నా. ప్లీజ్ బాబర్.. కెప్టెన్సీ వదిలేసెయ్! నువ్వొక క్లాస్ ప్లేయర్‌వి. నీలోని క్లాస్ మాత్రమే చూపించు.అదనపు బాధ్యతలు, భారం నెత్తిన పెట్టుకోనట్లయితే ఇంకా ఎంతో బాగా ఆడగలవు. ఒకవేళ బాబర్ గనుక కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లయితే కచ్చితంగా అతడికి మంచే జరుగుతుంది’’ అని మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ బాబర్‌కు సూచించాడు.బ్యాటింగ్, కెప్టెన్సీ మధ్య ఊగిసలాడవద్దని.. ఆటగాడిగా ఉండేందుకే మొగ్గుచూపాలని అతడికి విజ్ఞప్తి చేశాడు షోయబ్ మాలిక్. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఇటీవలే కెప్టెన్‌గా మరోసారి బాధ్యతలుభారత్ వేదికగా ఎదురైన ఈ పరాభవానికి బాధ్యత వహిస్తూ ఈ మెగా టోర్నీ అనంతరం బాబర్ ఆజం కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. అయితే, అనేక పరిణామాల అనంతరం తిరిగి పాక్ వన్డే, టీ20 జట్ల సారథిగా ఇటీవలే పునర్నియమితుడయ్యాడు. ఇక కొత్తగా బాబర్ నాయకత్వంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 2-0తో ఓటమిపాలైన పాకిస్తాన్.. ప్రపంచకప్-2024 ఈవెంట్లోనూ తన పరాజయాలు కొనసాగిస్తోంది.చదవండి: నువ్వేమీ గిల్‌క్రిస్ట్ కాదు.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్‌వి: సెహ్వాగ్ -
ప్రేమించే వ్యక్తి కావాలి కదా: సానియా మీర్జా వ్యాఖ్యలు వైరల్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం ప్రేమించే వ్యక్తిని వెతుక్కోవాల్సిన స్థితిలో ఉన్నానని పేర్కొన్నారు. కాగా సానియా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైన విషయం తెలిసిందే.ఎంతగానో ప్రేమించి.. ఆటంకాలను ఎదురించి పెళ్లాడిన పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆమెను మోసం చేశాడనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు తలెత్తాయని విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది.అయితే, వీరిద్దరూ ఈ విషయంపై నేరుగా నోరు విప్పలేదు. కానీ.. షోయబ్ మాలిక్ ఏకంగా నటి సనా జావెద్‌ను పెళ్లాడి.. ఫొటోలతో షాకిచ్చాడు. దీంతో సానియా- షోయబ్‌ల బంధం ముక్కలైందని అందరికీ తెలిసిపోయింది.ఈ క్రమంలో సానియా మీర్జా కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. సానియా తనంతట తానుగా షోయబ్ నుంచి విడాకులు తీసుకుందని స్పష్టం చేసింది. ఏదేమైనా అతడి జీవితం బాగుండాలని సానియా ఆశిస్తున్నట్లు తెలిపింది.ఇదిలా ఉంటే.. విడాకుల తర్వాత సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్‌తో కలిసి దుబాయ్‌లో ఎక్కువగా గడుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గతంలో ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘సానియా బయోపిక్ తీసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అన్నీ కుదిరితే నేనే ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే తనకు జంట(ప్రియుడి)గా కూడా నటిస్తాను’’ అని పేర్కొన్నాడు.ఈ క్రమంలో వ్యాఖ్యాత కపిల్ తాజాగా షారుక్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇందుకు బదులుగా.. ‘‘ముందుగా నేను నా ప్రేమను కనుగొనాలి(ప్రేమించే వ్యక్తి) కదా’’ అని సానియా మీర్జా సమాధానమిచ్చారు.ఈ నేపథ్యంలో సానియా జీవితంతో రెండో అవకాశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని.. అదే నిజమైతే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రతి ఒక్క స్త్రీకి తన జీవితాన్ని అందంగా మలచుకునే అవకాశం ఉందని.. మోసగాళ్ల కోసం తమ లైఫ్‌ను పణంగా పెట్టాల్సిన పనిలేదని కామెంట్లు చేస్తున్నారు. -
Shoaib Malik-Sana Celebrate Eid:భార్య సనా జావెద్‌తో షోయబ్ మాలిక్ రంజాన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు.. ఎవరీ అందాల తార? (ఫోటోలు)
-
ఇటీవలే మూడో పెళ్లి.. అప్పుడే మరో నటిపై కన్నేసిన స్టార్ క్రికెటర్!
పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా మాజీ భర్త ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నారు. పాక్ నటి సనా జావెద్‌ను ఈ ఏడాది జనవరిలో పెళ్లాడారు. 2010లో సానియా మీర్జాను రెండో పెళ్లి చేసుకున్న షోయబ్ గతేడాది ఆమెతో విడిపోయారు. ఇటీవలే సనా జావెద్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే అంతలోనే షోయబ్ మరో నటి వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. పాక్‌కే చెందిన స్టార్ నటి నవల్ సయీద్ ఇటివలే లైఫ్ గ్రీన్ హై అనే ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తనకు పాకిస్థానీ క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపింది. పెళ్లయిన క్రికెటర్ల నుంచి కూడా మేసేజేస్ వస్తున్నాయని చెప్పడంతో పరోక్షంగా షోయబ్ మాలిక్ గురించి ఆమె ప్రస్తావించినట్లు నెటిజన్స్ భావిస్తున్నారు. మీరు షోయబ్ మాలిక్ గురించే మాట్లాడుతున్నారా అని హోస్ట్ ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ అతని పేరు మరచిపోయినట్లు చెప్పడం గమనార్హం. దీంతో ఆ పెళ్లయిన క్రికెటర్లలో షోయబ్ మాలిక్ కూడా ఉన్నట్లు అభిమానులు ఫిక్సయిపోయారు. అలా చేయడం కరెక్ట్ కాదు.. మరి ఆ క్రికెటర్లు ఎలాంటి మెసేజ్‌లు పంపిస్తున్నారు అని అడగ్గా..' తాను వాటి గురించి చెప్పదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే క్రికెటర్లు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. యాక్టర్స్ కంటే ఎక్కువగా క్రికెటర్లు, క్రీడాకారులనే చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారని" నవల్ సయీద్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sana Shoaib Malik (@sanajaved.official) -
షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య, నటి సనా జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత జట్టు అభిమానులే ఆమెను టీజ్ చేస్తూ అసహనం వెళ్లగక్కారు. కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నుంచి విడిపోయినట్లు ప్రకటించకముందే షోయబ్ మాలిక్.. సనాను పెళ్లాడిన ఫొటోలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియాతో విడిపోకముందే షోయబ్‌కు సనాతో రిలేషన్ ఉందంటూ పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరు చేసిన మోసం బయటపడంతో సానియానే స్వయంగా విడాకులకు పూనుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి. అయితే, పెళ్లైన నాటి నుంచే ఈ జంటపై నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జీవిత భాగస్వాములకు ద్రోహం చేసి.. ఆ విషయం బయటపడగానే మళ్లీ నిఖా పేరిట తమ ‘బంధాన్ని’ పవిత్రం చేసుకునేందుకు పెద్ద నాటకమే ఆడారని మండిపడ్డారు. ముఖ్యంగా సానియా మీర్జా షోయబ్ కోసం ఎన్నో అవాంతరాలు దాటుకుని పాకిస్తానీని పెళ్లి చేసుకుందని.. అయినా ఆమె పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జట్టు అభిమానులు సైతం షోయబ్ మాలిక్‌ను ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సనా జావెద్‌కు నేరుగానే నిరసన సెగ తగిలింది. కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న తన భర్త షోయబ్ మాలిక్‌కు మద్దతుగా ఆమె ముల్తాన్ స్టేడియానికి వచ్చింది. ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి సనా వెళ్తున్నపుడు కొంత మంది సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు. దీంతో వాళ్లవైపు చూసిన సనా.. తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా 42 ఏళ్ల షోయబ్ మాలిక్ తొలుత ఆయేషా సిద్దిఖి(2002)ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత 2010లో సానియా మీర్జాను వివాహమాడాడు. ఈ జంటకు కుమారుడు ఇజహాన్ ఉన్నాడు. అయితే, షోయబ్‌తో విభేదాలు తలెత్తిన కారణంగా సానియానే ఖులా ద్వారా అతడికి విడాకులివ్వడం గమనార్హం. ఈ క్రమంలో తాను సనాను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్.. మాలిక్ పోరాటం వృథా Pakistan fans teasing Shoaib Malik's 3rd wife 'Sana Javed' by calling her "Sania Mirza"#PSL9 pic.twitter.com/EXr0OQywvQ — Don Cricket 🏏 (@doncricket_) February 20, 2024 -
PSL 2024 తొలిసారిగా అలా షోయబ్ మాలిక్ జంట: సనాపై నెటిజన్ల ట్రోలింగ్
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో భార్య నటి సనా జావేద్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న మాలిక్, సనా జావేద్ జంటగా కలిసి తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. ముల్తాన్ విమానాశ్రయం హోటల్‌కు వెళుతున్న దృశ్యాలు హల్చల్ చేశాయి. దీనిపై కొంతమంది ఫ్యాన్స్ సానుకూలంగా స్పందించినప్పటికీ, మరికొందమంది మాత్రం నెగిటివ్‌గా కమెంట్స్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) తొమ్మిదో ఎడిషన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్ మ్యాచ్‌కు ఆమె హాజరైంది. ఈ సందర్బంగా కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాలిక్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ, ఉత్సాహంగా కనిపించింది. భర్త షోయబ్‌ను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు వైరల్ గా మారాయి. మాజీ జీవిత భాగస్వాములను మోసం చేసిన ఈ జంటకు సిగ్గూ, శరం లేదంటూ కమెంట్ చేశారు. కొంచెం కూడా పశ్చాత్తాపం లేదంటూ విమర్శలకు దిగారు. అంతేకాదు షోయబ్ త్వరలో తన నాల్గవ భార్యను ఇంటికి తీసుకువస్తాడు, నిన్ను కూడా వదిలివేస్తాడంటూ విరుచుకుపడ్డారు. కాగా భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు విడాకులిచ్చిన షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను పెళ్లాడి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. అలాగే 'ఖులా' ద్వారా విడిపోయారని సానియా మీర్జా తండ్రి స్వయంగా వెల్లడించారు. సనాకు ఇది రెండో పెళ్లికాగా, మాలిక్‌కు మూడో పెళ్లి. కాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన కరాచీ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ 52 పరుగులు చేయగా, రీజా హెండ్రిక్స్ 54 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో కరాచీ వరుసగా వికెట్లు కోల్పోయింది.అయితే నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన మాలిక్ 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. కానీ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది.మరోవైపు షోయబ్ మాలిక్ స్వార్థపరుడంటూ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఆరోపించడం గమనార్హం.. -
ఆ అవకాశం మనం ఇవ్వకూడదు: సానియా మీర్జా
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. తన ఫొటోషూట్లకు సంబంధించిన ఫొటోలతో పాటు.. కుమారుడు ఇజహాన్‌తో ఉన్న ఫొటోలను ఇటీవల ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా భర్త షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన తర్వాత.. అతడి పేరును ప్రస్తావించకుండానే తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న తీరును వివరించే క్యాప్షన్లతో కొటేషన్లు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా.. సానియా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు సోకాల్డ్ కఠిన పరిస్థితులకు మనం అవకాశం ఇవ్వకూడదు’’ అన్న అర్థంలో సానియా మీర్జా తన అందమైన ఫొటోలకు ఇలా మరింత అందమైన క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో ఆమె మల్టీకలర్ మ్యాచింగ్సెట్ ధరించి.. సింపుల్ మేకప్.. స్లీక్ హెయిర్‌తో తన సౌందర్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసేలా కనిపించారు. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘మీరు చెప్పింది నిజం. ప్రతి ఒక్కరు ముందుగా తమను తాము ప్రేమించుకోవడం.. తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం అలవాటు చేసుకోవాలి. మన తర్వాతే మనకు ఎవరైనా..! అన్న సందేశాన్ని ఎంత చక్కగా చెప్పారో’’ అంటూ సానియాను ప్రశంసిస్తున్నారు. కాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి.. 2010లో పెళ్లాడారు సానియా మీర్జా. వీరికి 2018లో కుమారుడు ఇజహాన్‌కు జన్నించాడు. ఇక దుబాయ్‌లో కాపురం పెట్టిన ఈ క్రీడాకారుల జంట మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో సానియా తన భర్తకు విడాకులిచ్చారు. షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాల వల్లే సానియా మీర్జా ఈ నిర్ణయం తీసుకున్నారని పాకిస్తాన్ మీడియా వెల్లడించడం విశేషం. అయితే, షోయబ్ తన మూడో పెళ్లి(నటి సనా జావెద్)కి సంబంధించిన ఫొటోలు విడుదల చేసిన తర్వాతే.. వీరి విడాకుల వ్యవహారం బయటపడటం గమనార్హం. ఇదిలా ఉంటే.. షోయబ్ మాలిక్ ప్రవర్తన అతడి కుమారుడు ఇజహాన్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందంటూ పాక్ జర్నలిస్టు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సామా టీవీకి చెందిన నయీమ్ హనీఫ్ మాట్లాడుతూ.. షోయబ్ వల్ల స్కూళ్లో ఇజహాన్ అవమానాలకు గురికావాల్సి వస్తోందని పేర్కొన్నారు. అయితే, సానియా మాత్రం ఈ పరిణామాలపై ఇప్పటికీ నేరుగా స్పందించలేదు. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
ఆమె పట్ల ఎందుకింత ద్వేషం.. ఇంతకు దిగజారుతారా?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు సంబంధించిన పాత వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైవాహిక బంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ అభిమానులు సానియాకు మద్దతుగా నిలుస్తున్నారు. పనిలో పనిగా సానియా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి దిమ్మతిరిగేలా కౌంటర్లు ఇస్తున్నారు. కాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరగగా.. అప్పటికి ఇద్దరూ కెరీర్లో మంచి స్థాయిలో ఉన్నారు. దుబాయ్‌లో కాపురం పెట్టిన ఈ జంటకు 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు. అన్యోన్య దంపతులుగా పేరొందిన సానియా- షోయబ్ విడిబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు రాగా.. వాటిని నిజం చేస్తూ షోయబ్ మాలిక్ తన కొత్త భార్యను పరిచయం చేశాడు. నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. సానియా తనకు తానుగా షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సానియా మీర్జాకు షోయబ్ వివాహేతర సంబంధాల గురించి తెలిసిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడి ప్రవర్తన నచ్చక అతడి నుంచి విడిపోయిందని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక షోయబ్ పెళ్లి తర్వాత సానియా మీర్జా వరుస ఫొటోషూట్లు, ప్రొఫెషన్‌కు సంబంధించిన పనులతో బిజీ అయింది. అయితే, కొంతమంది ఆకతాయిలు మాత్రం.. సానియా రెండో పెళ్లి అంటూ తప్పుడు కథనాలు అల్లుతున్నారు. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ తాను పెళ్లి కొడుకు అవతారంలో ఉన్న ఫొటోను షేర్ చేయగా.. వక్రభాష్యాలు చెబుతూ ఈ టెన్నిస్స్టార్ను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సానియా అభిమానులు.. ‘‘సోషల్ మీడియాలో హైలైట్ కావడానికి ఇంతకు దిగజారుతారా? ఓ మహిళ గురించి ఇంత నీచంగా అబద్దాలు వ్యాప్తి చేస్తారా? ఆమె పట్ల ఎందుకింత ద్వేషం’’ అంటూ మండిపడుతున్నారు. వైవాహిక బంధం గురించి సానియా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. షోయబ్ లాంటి వ్యక్తిని విడిచిపెట్టి ఆమె మంచి పనిచేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. పాత వీడియోలో ఏముంది? కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తులకు మీరిచ్చే సలహా ఏమిటని గతంలో ఓ మహిళ సానియా మీర్జాను ప్రశ్నించింది. ఇందుకు బదులిస్తూ.. ‘‘పెళ్లికి ముందు మీరెలా ఉన్నారో అలాగే ఉండండి. జీవిత భాగస్వామి చెప్పారని మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మీలో ఉన్న ఆ ప్రత్యేక లక్షణాన్ని చూసే కదా వాళ్లు మీతో ప్రేమలో పడతారు’’ అని సానియా పేర్కొంది. Advice of Sania Mirza for Shoaib Malik ❤️#ShoaibMalik | #SanaJaved #SaniaMirza | #ShoaibMalikMarriage pic.twitter.com/9NxodlKidd — Sehrish Javed (@sehrish_javed18) January 21, 2024 -
సంచలన ఆరోపణలు: షోయబ్ స్పందన.. ముందుగా అనుకున్నట్లే చేశాం
తనపై వస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ స్పందించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ఫార్చ్యూన్ బరిషల్‌తో తన బంధం ముగిసిపోలేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే తాను బంగ్లాదేశ్ వీడి దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. ఏకంగా మూడు నోబాల్స్ కాగా బీపీఎల్-2024 సీజన్లో బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఖుల్నా టైగర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఒకే ఓవర్లో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఏకంగా మూడు నోబాల్స్ వేయడం ఇందుకు కారణం. షోయబ్ మాలిక్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బరిషల్ యాజమాన్యం షోయబ్ మాలిక్ కాంట్రాక్టును రద్దు చేసిందని వార్తలు వినిపించాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన షోయబ్ మాలిక్.. ‘‘ఫార్చ్యూన్ బరిషల్‌తో నా బంధం గురించి ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నా. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేను దుబాయ్‌లో ఓ మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అందుకే మా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో చర్చించిన తర్వాతే బంగ్లాదేశ్‌ను వీడాను. ఫార్చ్యూన్ బరిషల్ రానున్న మ్యాచ్‌లలో మరింత గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా. ఒకవేళ నా సేవలు అవసరమైతే తప్పకుండా మళ్లీ వాళ్లకు మద్దతుగా బరిలోకి దిగుతాను. క్రికెట్ ఆడటం అంటే నాకు ఇష్టం. ఆటను కొనసాగిస్తూనే ఉంటా’’ అని షోయబ్ మాలిక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. అతడు మాకోసం ఎంతో చేశాడు అదే విధంగా.. ఫార్చ్యూన్ బరిషల్ యజమాని మిజానుర్ రహ్మాన్ సైతం ఈ విషయంపై స్పందించాడు. షోయబ్ మాలిక్‌పై వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలను అతడు కొట్టిపడేశాడు. ‘‘షోయబ్ మాలిక్ గొప్ప క్రికెటర్. అతడి గురించి వస్తున్న వదంతుల పట్ల నేను చింతిస్తున్నాను. మాకోసం తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అలాంటిది అతడి గురించి మేము ఇలాంటి చెత్త ప్రచారాలు ఎలా చేస్తామనుకున్నారు’’ అని మిజానుర్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. చదవండి: Shoaib Malik: ‘ఆమెతో మూడేళ్లుగా రిలేషన్లో షోయబ్.. భర్తకు తెలియకుండా..’ Official statement ; I would like to address and dismiss the recent rumors circulating about my playing position with Fortune Barishal. I had a thorough discussion with our captain, Tamim Iqbal, and we mutually planned the way forward. I had to leave Bangladesh for a… pic.twitter.com/kmPqPt1nxv — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 26, 2024 -
‘మూడేళ్లుగా ఆమెతో రిలేషన్లో షోయబ్.. భర్తకు తెలియకుండా అలా’
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. విడాకులు- మూడో పెళ్లి- అద్భుత టీ20 రికార్డు- మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా వరుస ఘటనలతో అతడి పేరు పాక్ మీడియాలో మారుమ్రోగి పోతోంది. తాజాగా ఈ ఆల్‌రౌండర్ గురించి స్థానిక టీవీ చానెల్ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ సంగతేంటి??... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010లో షోయబ్ మాలిక్‌తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షోయబ్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియా అప్పటికే డివోర్సీ అయిన షోయబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హైదరాబాదీ 2018లో కుమారుడు ఇజహాన్‌కు జన్మనిచ్చింది. ఈ జంట దుబాయ్‌లో నివాసం ఉండేది. ఇక గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కుటుంబానికే సమయం కేటాయించిందట సానియా. ఈ క్రమంలో తన భర్త గురించి కొన్ని చేదు నిజాలు ఆమెకు తెలిశాయని.. అందుకే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపించాయి. వాటినే నిజం చేస్తూ ఇటీవలే తాను మూడో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు షోయబ్ మాలిక్. తానే విడాకులు ఇచ్చింది పాక్ నటి, మోడల్ సనా జావేద్‌ను వివాహమాడిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. తమ కూతురు ఏకపక్షంగా భర్తకు విడాకులిచ్చిందని ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత సానియా కూడా ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో.. ‘‘తనపై వస్తున్న విమర్శలను లెక్కచేయక షోయబ్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియాకు అతడు ద్రోహం చేసినా.. ఆమె ఎవరిపైనా నిందలు వేయకుండా హుందాగా ప్రవర్తిస్తున్నారు’’ అంటూ పాక్ మీడియా సానియా మీర్జాకు మద్దతుగా నిలవడం విశేషం. భర్తకు తెలియకుండా మూడేళ్లుగా ఈ క్రమంలో సామా టీవీ షోయబ్ మాలిక్- సనా జావేద్ బంధంపై సంచలన ఆరోపణలు చేస్తూ పాడ్‌కాస్ట్ రిలీజ్ చేసింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘‘గత మూడేళ్లుగా వాళ్లిద్దరు సంబంధం కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల బంధంలో ఎలా ఉంటారో అలాగే ఉంటున్నారు. కానీ ఈ విషయాలు ఉమైర్(సనా మొదటిభర్త)కు తెలియదు. అయితే, సానియా.. ఆమె కుటుంబానికి గతేడాదే షోయబ్- సనాల గురించి తెలిసింది. మాలిక్ ఫ్యామిలీకి కూడా విషయం తెలిసింది. అంతా కలిసి పరిస్థితిని చక్కదిద్ది షోయబ్- సానియాల బంధాన్ని నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ.. షోయబ్ ఎవరి మాటా వినేందుకు ఇష్టపడలేదు’’ అంటూ సామా టీవీ పేర్కొంది. అదే విధంగా.. తనను ఏ టీవీ షోకు ఆహ్వానించినా.. సనాను కూడా పిలవాలని షోయబ్ మాలిక్ కండిషన్లు పెట్టేవాడని ఆరోపించింది. కాగా సనా జావెద్‌కు గతంలో సింగర్ ఉమైర్తో పెళ్లైంది. అతడితో విడాకులు తీసుకున్న మూడు నెలల్లోపే ఆమె షోయబ్‌ను రెండో వివాహం చేసుకోవడం గమనార్హం. వరుస సంఘటనలు ఇక వ్యక్తిగతంగా షోయబ్ పరిస్థితి ఇలా ఉంటే.. కెరీర్ పరంగా ఇటీవలే అతడు అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆసియా తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్-2024 లీగ్‌లో ఫార్చ్యూన్ బరిషల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఈ ఘనత సాధించాడు. అయితే, ఆ మైల్‌స్టోన్‌ను ఎంజాయ్ చేసేలోపే షోయబ్ మాలిక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే, వీటిని షోయబ్ మాలిక్ ఖండించాడు. చదవండి: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? సానియా హృదయం ముక్కలు -
షోయబ్ మాలిక్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. జట్టు నుంచి ఔట్!?
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌కు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ప్రీమీయర్ లీగ్ ఫ్రాంచైజీ ఫార్చూన్ బరిషల్ "ఫిక్సింగ్" అనుమానంతో షోయబ్ మాలిక్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. కాగా ఇప్పటికే మాలిక్ వ్యక్తిగత కారణాలతో బీపీఎల్-2024 నుంచి స్వదేశానికి వచ్చేశాడు. అంతలోనే మాలిక్‌కు ఫార్చూన్ బరిషల్ ఈ షాకిచ్చింది. ఈ లీగ్‌లో కేవలం 3 మ్యాచ్‌ల మాత్రమే ఆడాడు. అసలేం జరిగిందంటే? జనవరి 22న షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఫార్చ్యూన్ బరిషల్,ఖుల్నా రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన మాలిక్ ఓకే ఓవర్లో ఏకంగా మూడు నో బాల్స్ వేశాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. సాధరణంగా స్నిన్నర్లు నో బాల్స్ చాలా అరుదుగా వేస్తుంటారు. అటువంటిది మాలిక్ ఏకంగా మూడు నో బాల్స్ వేయడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ మాలిక్‌పై వేటు వేసింది. కాగా ఇటీవలే మాలిక్ మూడో పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులిచ్చి పాక్ నటి సనా జావేద్ ను మాలిక్ వివాహమాడాడు. చదవండి: IND vs ENG: ఆట మర్చిపోయావా గిల్.. జట్టు నుంచి తీసిపడేయండి! అతడిని తీసుకోండి? -
షోయబ్ మాలిక్‌తో ఎఫైర్? ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన పాక్ నటి
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. రీసెంట్ టైంలో సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే గతకొన్నాళ్ల నుంచి షోయబ్-సానియా విడాకులపై వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన పెళ్లితో అది నిజమేనని తేలిపోయింది. షోయబ్.. పాక్ నటి సనా జావేద్‌ని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల ముందు మరో పాక్ నటి.. ఈ ఆటగాడితో ఎఫైర్ నడిపిందని రూమర్స్ వచ్చాయి. ఆ బ్యూటీ సదరు పుకార్లపై ఇన్నాళ్లు ఓ క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో తను ఎంతగా బాధపడ్డాననేది బయటపెట్టింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. చాలా ఏళ్ల నుంచి జట్టులో ఉన్నాడు. 2002లో ఆయేషా సిద్ధిఖీని, 2010లో సానియా మీర్జాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే 2024లో పాక్ నటి సనా జావేద్‌తో ఒక్కటయ్యాడు. అయితే కొన్నాళ్లముందు ఆయేషా ఒమర్ అనే నటితో షోయబ్.. ఓ మ్యాగజైన కవర్ పేజీ కోసం ఫొటో షూట్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ వేరే లెవల్ కెమిస్ట్రీ పండించారు. సరిగ్గా అదే టైంలో సానియా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ బయటకొచ్చింది. దీంతో ఆయేషా బలైపోయింది. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) షోయబ్.. సానియాకు విడాకులు ఇచ్చేశాడని, దానికి ఆయేషా ఒమర్ కారణమని తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర ఊరికే మాట్లాడుకున్నారు. పాక్ మీడియాలో అయితే ఇష్టమొచ్చినట్లు రాసిపడేశారు. అయితే ఆ సమయంలో తను చాలా ఆందోళనకు గురయ్యానని ఆయేషా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎఫైర్ రూమర్స్ వల్ల తాను ఎంతలా మానసిక వేదన అనుభవించాననేది బయటపెట్టింది. 'ఆ దశ మొత్తం నాకు ఓ పీడకల లాంటిది. షోయబ్‌తో నాకు ఎఫైర్ సృష్టించడంతో పాటు పెళ్లి కూడా చేసేశారు. ఇంకా చెప్పాలంటే నాకు అతడితో సీక్రెట్‌గా పెళ్లయిపోయిందని నా బంధువులే చాలామంది నమ్మేంతలా పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే నాకు ఈ పుకార్లు చదివినప్పుడు.. అలానే నా గురించి జనాలు మాట్లాడుకునేప్పుడు చాలా అంటే చాలా భయమేసేది. తెగ ఆందోళనపడేదాన్ని' అని ఆయేషా ఒమర్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Sana Shoaib Malik (@sanajaved.official) -
'షోయబ్‌తో విడాకులు తీసుకుని కొన్ని నెలలైంది.. కానీ ఇప్పుడు తప్పట్లేదు'
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు సానియా మీర్జాతో విడాకులపై వదంతులు ప్రచారం అవుతుండగానే.. నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చాడు. ఎప్పటినుంచో వినిపిస్తున్న రూమర్స్‌ను షోయబ్ నిజం చేశాడు. సనా జావెద్‌ను వివాహమాడిన ఫోటోలను మాలికే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇదే విషయం ఇరు దేశాల క్రీడా వర్గాల్లో చర్చానీయంశమైంది. ఇక ఈ విషయంపై సానియా కుటుంబం తాజాగా స్పందించింది. కొన్ని నెలల క్రితమే సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. "సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె స్పందించక తప్పట్లేదు. షోయబ్, ఆమె విడాకులు తీసుకొని కొన్ని నెలలు అవుతోంది. షోయబ్‌కు తన న్యూ జర్నీ కోసం ఆమె శుభాకాంక్షలు తెలిపింది. ఇక అనవసర చర్చలు ఆపేయండి. ఆమె తన జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుంది. ఇటువంటి సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులందరూ ఆమెకు అండగా నిలవాలి. తన గోప్యతకు ఎటువంటి భంగం కలిగించకుండా గౌరవించాలని" ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2010లో తన మొదటి భార్య ఆయేషాతో విడాకులు తీసుకున్న షోయబ్ మాలిక్.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ 2018లో ఇజహాన్ పుట్టాడు. చదవండి: #ShoaibMalikSaniamirza: ఎల్లలు లేని ప్రేమ: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? View this post on Instagram A post shared by Imran Mirza (@imranmirza58) -
చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 13,000 పరుగులు మైల రాయిని అందుకున్న తొలి ఏషియన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో మాలిక్ రెండో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(14562) ఉన్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2024లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్‌తో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఈ లీగ్‌లో రంగాపూర్ రైడర్స్‌కు మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడోసారి ఓ ఇంటివాడయ్యాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- మాలిక్ మాలిక్‌ల 14 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. ఈ విషయాన్ని సానియా- మాలిక్ ఇద్దరూ దృవీకరించారు. కాగా వీరిద్దరికి 2010లో వివాహం జరిగింది. చదవండి: U19 World Cup 2024: వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన టీమిండియా.. 84 పరుగులతో బంగ్లా చిత్తు -
విడిపోయిన సానియా–షోయబ్
కరాచీ/న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ల 14 ఏళ్ల వివాహ బంధానికి విడాకుల కార్డు పడింది. ఇది జరిగి చాన్నాళ్లే అయినా... సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్నా... ఇరు వర్గాల నుంచి అధికారికంగా ‘అవును... కాదు’ అనే మాట రాలేదు! ఎలాంటి స్పష్టత లేదు. కానీ షోయబ్ ముచ్చటగా మూడోసారి ఓ ఇంటివాడు కావడంతోనే ఇద్దరి వైవాహిక బంధం ముక్కలైనట్లు అధికారికంగా... ఆలస్యంగా తెలిసింది. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న షోయబ్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో ఫొటోల్ని పంచుకున్నాడు. 41 ఏళ్ల ఈ పాక్ క్రికెటర్‌కు ఇది మూడో పెళ్లి. హైదరాబాదీ అమ్మాయి అయేషా సిద్ధిఖికు తలాక్ ఇచ్చాకే సానియా మీర్జాను 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్ వేదికగా షోయబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్నాడు. నటి సనా జావేద్కేమో ఇది రెండో పెళ్లి. ఆమె 2020లో పాకిస్తాన్ సినీ గాయకుడు, రచయిత ఉమైర్ జైస్వాల్‌ను వివాహమాడింది. అయితే వీరిద్దరి బంధం 2023లో ముగిసింది. తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’లో షోయబ్ మాలిక్–సనా జావేద్‌ల పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతోనే బయటి ప్రపంచానికి సానియా–షోయబ్‌ల పెళ్లి పెటాకులైనట్లు తెలిసింది. అంతవరకు గుసగుసలే వినిపించేవి! ఇక ఈ విషయాన్ని టెన్నిస్ స్టార్ కుటుంబ వర్గాలు ధ్రువీకరించక తప్పలేదు. ‘అవును... వాళ్లిద్దరు విడిపోయారు. ఇది ‘తలాక్’ కాదు... ‘ఖులా’ ప్రకారం వారి బంధం రద్దయింది. ఇంతకుమించి చెప్పడానికి మా దగ్గరేమీ లేదు’ అని కుటుంబ వర్గాలు తెలిపాయి. గత ఏడాది అక్టోబర్‌లో తనయుడు ఇజ్హన్ ఐదో పుట్టిన రోజు వేడుకలకు షోయబ్ హాజరయ్యాడు. అయితే ఈ వేడుకల ఫొటోలను షోయబ్, సానియా వేర్వేరుగా తమ సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నారు. అప్పుడు నిశ్చి తార్థం... ఇప్పుడు వివాహం! 37 ఏళ్ల సానియాకు తన ప్రొఫెషనల్ కెరీర్లో ఒడిదొడుకులు ఎదురైనట్లే వ్యక్తిగత జీవితంలోనూ ఎదురయ్యాయి. ముందుగా కుటుంబ మిత్రులైన సొహ్రాబ్తో సానియాకు నిశ్చి తార్థం కూడా ఘనంగానే జరిగింది. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే పెళ్లిదాకా రాకుండానే ఆ బంధం ముగిసింది. అనంతరం పాకిస్తానీ మాజీ కెపె్టన్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఇజ్హాన్ ఉన్నాడు. ప్రస్తుతం తల్లి సానియా దగ్గరే ఇజ్హాన్ పెరుగుతున్నాడు. తన 20 ఏళ్ల అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్లో సానియా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లు సాధించింది. ఇందులో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇది తలాక్ కాదు... ఖులా! సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2010 ఏప్రిల్ 12న టెన్నిస్ స్టార్ సానియా, పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ వివాహం అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో జరిగింది. ఈ బంధం 12 ఏళ్ల పాటు 2022 వరకు సజావుగానే సాగింది. ఇరువురు తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే దుబాయ్‌లో కాపురం పెట్టారు. అన్యోన్యంగా సాగిన వీరి కాపురం రెండేళ్ల క్రితం బీటలు వారింది. కెరీర్‌కు రిటైర్మెంట్ పలికి వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్న సమయంలో పొరపొచ్చలు రావడంతో సానియా మీర్జా నుంచే విడాకుల ప్రతిపాదన వచ్చింది. ఇస్లాం చట్ట ప్రకారం దీన్ని ‘ఖులా’ అంటారు. వివాహ బంధం నుంచి భార్య ఏకపక్షంగా విడిపోవాలనుకుంటే ‘ఖులా’తో రద్దు చేసుకోవచ్చు. దీనికి భర్త నుంచి భరణం, ఇతరత్రా లాంఛనాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. తలాక్ అనేది భర్త రద్దు చేసుకునే విడాకుల ప్రక్రియ. కొంతకాలంగా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండటంతో 2022లోనే వివాహరద్దు తంతు వివాదాస్పదం కాకుండా జరిగిపోయిందని సమాచారం. -
Shoaib Malik-Sana Javed Wedding: షోయబ్ మాలిక్‌తో పెళ్లి.. పాకిస్తాన్ బ్యూటీకి సైతం ఇది రెండో పెళ్లే (ఫొటోలు)
-
క్రికెటర్‌తో పెళ్లి.. వెంటనే పేరు మార్చేసుకున్న నటి
ప్రేమ, పెళ్లి, విడాకులు.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదాలు. అయితే సెలబ్రిటీల సినిమాలు, ఈవెంట్లు.. లేదంటే వారి ప్రేమ ముచ్చట్లు, పెళ్లి విశేషాలు, విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తూ, కనిపిస్తూ ఉంటాయి. అలా ఈరోజు పాకిస్తాన్ నటి పెళ్లి చర్చనీయాంశంగా మారింది. క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను రెండో పెళ్లి చేసుకుంది పాక్ నటి సనా జావెద్. గతకొంతకాలంగా షోయబ్‌తో సన్నిహితంగా మెదులుతున్నా ఇలా సడన్‌గా నిఖా చేసుకుని షాకిస్తారని ఎవరూ ఊహించలేదు. సానియాకు విడాకులు..! ఎందుకంటే షోయబ్ తన భార్య సానియా మీర్జాకు విడాకులిచ్చినట్లు ఎక్కడా వెల్లడించలేదు. ఏదో చిన్న సమస్యలు అనుకున్నారే తప్ప నిజంగానే విడిపోయి ఇంత త్వరగా మరో అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభిస్తాడని ఎవరూ అనుకోలేదు. చివరకు శనివారం (జనవరి 20)నాడు షోయబ్- సనా జావెద్ షాదీ చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా తన పేరును కూడా మార్చేసుకుంది సనా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ నటి తన పేరును సనా షోయబ్ మాలిక్‌గా మార్చుకుంది. ఎవరీ సనా జావెద్? కాగా సనా జావెద్.. సుఖూన్, షేర్ ఇ జాత్, ఇంతేజార్ వంటి సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది. ఈమె గతంలో పాకిస్తానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను పెళ్లాడింది. 2020లో నిఖా చేసుకున్న వీరు మొదట్లో బాగానే ఉన్నారు. కానీ తర్వాత ఇద్దరి మధ్య పొరపచ్చాలు మొదలయ్యాయి. గతేడాది ఇద్దరూ తమ పెళ్లి ఫోటోలను తొలగించడంతో విడాకులు తీసుకున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడదే నిజమని నిరూపిస్తూ క్రికెటర్‌ను పెళ్లాడింది. View this post on Instagram A post shared by Shoaib Malik (@realshoaibmalik) -
Shoaib Malik-Sana Javed: మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. సానియాతో బంధానికి స్వస్తి (ఫొటోలు)
-
షోయబ్ మాలిక్‌తో విడాకులు: స్పందించిన సానియా తండ్రి
Sania Mirza Takes 'Khula' From Shoaib Malik What It Means: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకులు ఇరు దేశాల క్రీడావర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య చిచ్చు రేపిందెవరంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాను పాకిస్తానీ నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లు తెలుపుతూ షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో ప్రకటించడమే ఇందుకు కారణం. సానియా- షోయబ్ విడిపోనున్నానరంటూ గత కొన్నాళ్లుగా వదంతులు వ్యాపించాయి. అవే నిజాలు ఈ క్రమంలో తాజాగా షోయబ్.. సనాతో తన పెళ్లిని ధ్రువీకరిస్తూ అవి రూమర్లుకావు నిజాలని తేల్చాడు. ఈ నేపథ్యంలో సానియాకు విడాకులు ఇచ్చిన తర్వాత.. ఈ వివాహం చేసుకున్నాడా? లేదంటే.. సానియానే షోయబ్‌తో బంధం తెంచుకుందా? అనే చర్చ మొదలైంది. - Alhamdullilah ♥️ "And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024 నా కూతురే స్వయంగా ఈ నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఈ కూతురి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. ఖులా పద్ధతి ప్రకారం సానియా షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని స్పష్టం చేశారు. కాగా 2010లో సానియా- షోయబ్‌ల వివాహం జరుగగా.. 2018లో ఈ జంటకు కుమారుడు ఇజహాన్ జన్మించాడు. ఖులా అంటే.. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం.. వివాహిత తన భర్త నుంచి విడిపోవాలనుకుంటే ఖులా పద్ధతి పాటించవచ్చు. ఇందులో ఏకపక్షంగానే స్త్రీ తనంతట తాను నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. వివాహ సమయంలో భర్త తనకు ఇచ్చిన కానుకను తిరిగి పంపడం ద్వారా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేయవచ్చు. -
రెండో పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్
-
స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు?..
ప్రేమకు ఎల్లలు ఉండవు.. మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని ఇష్టపడితే తనతో కలిసి బతికేందుకు సరిహద్దులు కూడా దాటడంలో తప్పు లేదంటుంది మనసు! భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా- పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయంటారు వాళ్ల సన్నిహితులు. పాకిస్తానీ అయిన షోయబ్‌ను పెళ్లాడేందుకు హైదరాబాదీ సానియా ఎన్ని అవాంతరాలు ఎదుర్కొందో అందరికీ తెలిసిన విషయమే! ఏది ఏమైనా.. కాబోయే భర్త గురించి వినకూడని మాటలు వినిపించినా లెక్క చేయక అతడిని ధైర్యంగా పెళ్లాడింది సానియా. అయితే.. టెన్నిస్‌లో సానియా విఫలమైనా.. క్రికెట్ మ్యాచ్‌లో షోయబ్ ఫెయిలైనా.. రెండు వైపుల నుంచి విమర్శల బాణాలు దూసుకొచ్చేది సానియా మీదకే! టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరిగినా ట్రోలింగ్ బాధితురాలు తనే! అయినా.. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరనీయక సానియా కెరీర్ పరంగా.. వ్యక్తిగతంగా ముందుకు సాగింది. పెళ్లైన ఎనిమిదేళ్లకు మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తూ షోయబ్‌తో కలిసి తమ కలల పంట ఇజహాన్‌కు జన్మనిచ్చింది. తల్లైన తర్వాత మళ్లీ ఫిట్నెస్ సాధించి కొడుకుతో పాటు టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టింది. కెరీర్లో ఉన్నత శిఖరాలకు నిజానికి.. ఐదేళ్ల వయసులోనే రాకెట్ సానియా.. ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో గొప్ప ఘనతలు సాధించింది. డబుల్స్‌లో నంబర్ వన్ స్థాయికి ఎదిగిన ఆమె కెరీర్లో మూడు డబుల్స్ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచింది. మొత్తంగా తన కెరీర్లో 43 డబుల్స్ ట్రోఫీలు గులిచింది. 91 వారాలు నంబర్ వన్‌గా కొనసాగిన ఘనత తన ఖాతాలో వేసుకుంది. కెరీర్లో ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలోనే భర్తతో సానియాకు విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చాయి. షోయబ్ మాలిక్ ప్రవర్తన నచ్చక ఆమె అతడికి దూరంగా ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ నటితోనూ సాన్నిహిత్యం నటి అయేషా ఒమర్‌తో షోయబ్ సన్నిహితంగా మెలగడం వల్లే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. అందుకు తగ్గట్లుగానే సానియా గురించి ఎదురైన ప్రశ్నలకు షోయబ్ సమాధానాలు దాటవేయటం.. సానియా సైతం హృదయం ముక్కలైదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ వదంతులకు బలం చేకూరింది. వీటిని నిజం చేసే విధంగా.. ‘‘వివాహ బంధం.. విడాకులు రెండూ క్లిష్టమైనవే’’ అంటూ సానియా మీర్జా ఇటీవల మరో పోస్టు షేర్ చేయడంతో అనధికారికంగా విడాకుల విషయాన్ని ధ్రువీకరించినట్లయింది. తాజాగా.. నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లుగా షోయబ్ మాలిక్ ఫొటోలు షేర్ చేసి అధికారికంగా సానియాతో బంధం తెంచుకున్నట్లు పరోక్షంగా ప్రకటన చేశాడు. అప్పుడు అలా.. నిజానికి సానియా కంటే ముందే షోయబ్ మాలిక్ హైదరాబాద్‌కు చెందిన అయేషా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడన్న వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే సానియాతో పెళ్లికి సిద్ధపడగా.. మధ్యవర్తుల జోక్యంతో వివాదం సద్దుమణిగినట్లు కథనాలు వెలువడ్డాయి. అయేషాతో విడాకుల నేపథ్యంలో షోయబ్ ఆమెకు రూ. 15 కోట్ల భరణం కూడా ఇచ్చినట్లు సమాచారం. అంగరంగ వైభవంగా పెళ్లి ఈ క్రమంలో ఏప్రిల్ 12, 2010లో షోయబ్ మాలిక్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని తాజ్ క్రిష్ణ హోటళ్లో సంప్రదాయ పద్ధతిలో వీరి నిఖా జరిగింది. భారత్- పాకిస్తాన్ దేశాలకు చెందిన ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారుల పెళ్లి ఇరు దేశాల్లోనూ పెద్ద వార్తగా మారిపోయింది. ఇక పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత సానియా- షోయబ్‌లకు కుమారుడు ఇజహాన్ జన్మించాడు. అయితే, గత కొన్నేళ్లుగా నటి సనా జావెద్‌తో షోయబ్ సన్నిహితంగా మెలుగుతున్నాడన్న కారణంగా సానియా అతడికి దూరంగా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ పెళ్లి ఫొటోలతో షోయబ్ మాలిక్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక షోయబ్‌కు ఇది మూడో పెళ్లి కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి!! స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? ఈ నేపథ్యంలో సానియా- షోయబ్ జోడీ అభిమానులు.. ‘‘ప్రేమకు ఎల్లలు ఉండవని సానియా నిరూపించింది. అందరిని ఎదిరించి షోయబ్‌ను పెళ్లాడింది. కానీ చివరకు ఏం మిగిలింది. సానియా- షోయబ్‌ల స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? షోయబ్ మాలిక్ పోస్ట్ మా హృదయాలను ముక్కలు చేసింది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ జంటను ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: IND A Vs Eng Lions: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన