ధోని 'గోట్' అట! | MS Dhoni Is GOAT, Says This Pakistani Cricketer | Sakshi
Sakshi News home page

ధోని 'గోట్' అట!

Published Sat, Sep 16 2017 11:16 AM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

ధోని 'గోట్' అట!

ధోని 'గోట్' అట!

ఈ శీర్షిక చూస్తే మన క్రికెట్ అభిమానులకు కోపం రావొచ్చు.

కరాచీ: ఈ శీర్షిక చూస్తే మన క్రికెట్ అభిమానులకు కోపం రావొచ్చు. ప్రధానంగా మహేంద్ర సింగ్ ధోని అభిమానుల్లో అసహనం కట్టలు తెంచుకోవచ్చు. అయితే ఇది విమర్శకాదు.. తీవ్ర వ్యాఖ్య అంతకన్నా కాదు. టీమిండియా మాజీ సారథి ధోనిపై ఉన్న ప్రేమతో పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చేసిన వ్యాఖ్య. ఇక్కడ గోట్ (GOAT) అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని క్లుప్తీకరించాడు మాలిక్. ట్విట్టర్ లో క్రికెట్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన మాలిక్.. ధోని గురించి ఒక భారత అభిమాని అడిగిన ప్రశ్నకు 'గోట్'అంటూ సమాధానమిచ్చారు. దాన్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా విశదీకరిస్తూ ధోనిని లెజెండ్ క్రికెటర్ గా మాలిక్ పోల్చాడు.

వరల్డ్ ఎలెవన్ తో స్వదేశంలో జరిగిన మూడు ట్వంటీ 20ల సిరీస్ ను పాకిస్తాన్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టులో మాలిక్ సభ్యుడిగా ఉన్నాడు.  సుదీర్ఘకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మాలిక్.. భారత క్రికెటర్లతో అనుబంధం ఎక్కువే. ధోని, యువరాజ్ సింగ్, రైనాలతో మాలిక్  స్నేహంగా ఉంటాడు. ఈ క్రమంలోనే తాను చూసిన సమకాలీన క్రికెటర్లలో ధోని ఒక గొప్ప క్రికెటర్ గా మాలిక్ అభివర్ణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement