goat
-
మటన్ డబ్బులు అడిగారని..
తిరుపతి రూరల్ : మటన్ తీసుకెళ్లి మూడు నెలలైనా డబ్బులు ఇవ్వకపోవడంతో అడిగేందుకు వెళ్లిన దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి మల్లంగుంటలో జరిగింది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు.. మల్లంగుంట పంచాయతీ వినాయకనగర్‌కు చెందిన కేశవులు, హేమలత దంపతులు మటన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన వినాయక అనే వ్యక్తి మటన్ తీసుకెళ్లి రూ.1200 అప్పు పెట్టాడు. ఈ క్రమంలో కేశవులు, హేమలత దంపతులు సోమవారం రాత్రి వినాయక ఇంటికి వెళ్లి డబ్బులు అడగడంతో ఆగ్రహించిన వినాయక కుమారులు ప్రదీప్, సందీప్, మరో వ్యక్తి కలిసి ఇనుపరాడ్‌తో దాడి చేశారు. హేమలత మెడలోని 32 గ్రాముల బంగారు చైన్ లాక్కున్నారు. రక్తగాయాలతో పడి ఉన్న బాధితులు స్థానికులు చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. మంగళవారం బాధితుడు కేశవులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సీక్రెట్స్ : మేక పెరుగు, నెయ్యి, జ్యూస్‌లు
ఆర్ట్ కలెక్టర్, దాత సోషల్ మీడియా సెన్సేషన్, రియాలిటీ టీవీ స్టార్ షాలిని పాసి 'ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' సిరీస్‌తో మరింత పాపులర్ అయిపోయింది. ఆమె అదిరిపోయే పంచ్ డైలాగులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు 49 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? శిల్పం లాంటి ఆకృతి, మెరిసే చర్మం కోసం, ఆమె ఏమి తింటుంది అనేది చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆహార నియమాలు, సౌందర్య రహస్యాలను బహిర్గతం చేసింది. షాలిని రోజువారీ ఆహారంలో ఎటువంటి ఘనమైన ఆహారం తీసుకోదట. సెలెరీ (ఆకుకూరలు)జ్యూస్, కూరగాయలతో చేసిన జ్యూస్‌లు, నెయ్యి, మేక పెరుగు ఖచ్చితంగా తీసుకుంటానని తాగా వెల్లడించింది. ప్రధానంగాకొంచెం వింతగా అనిపించినా తాను మేక పెరుగును ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. మేక పెరుగుతో ఎముకలు ,దంతాలు బలంగా ఉంటాయని వివరించింది. డైట్ మాత్రమే కాదు, రోజుకు రెండు గంటల వ్యాయామం తప్పకుండా చేస్తుందట.షానిలి డైట్ సీక్రెట్, ఆమె మాటల్లో ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటా.తర్వాత ఉసిరి అల్లం కలిపిన బీట్రూట్ రసం.డైట్లో హెర్బల్ లిక్విడ్లు, కూరగాయలజ్యూస్లు ఎక్కువ భాగం ఉంటాయి. రెండు గిన్నెల మొలకలను నమలడం కష్టం. అదే జ్యూస్ అయితే సులభంగా తాగవచ్చు. సెలెరీ జ్యూస్, రెడ్ జ్యూస్, స్ప్రౌట్ జ్యూస్, మిరియాలతో చేసే క్యాప్సికమ్ జ్యూస్ ఇలా చాలా ఉంటాయి.సాయంత్రం ఆహారంలో ప్రతిదీ సూప్ రూపంలో ఉంటుంది. వడకట్టకుండా, చిక్కగా ఉండే కూరగాయలను జ్యూస్‌లను తాగుతాను. ఇంకా బచ్చలికూర, బ్రోకలీ సూప్, టొమాటో, బెండ, తామర కాండం, బఠానీలు ఇలా ఏదైనా జ్యూస్ రూపంలోనే.సాయంత్రం 6 గంటల వరకు పచ్చి ఆహారం మాత్రమే .. రాత్రి 7 గంటలకు భోజనం. అదీ కూడా 'ఘర్ కా ఖానా (ఇంట్లో వండిన ఆహారం)'ఉండేలా చూసుకుంటా. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే సహజమైన వాటిని మాత్రమే తీసుకుంటాను.డిన్నర్లో అవకాడో, రాగి లేదా జొన్న పిండితో చేసిన దోసలు తింటానుఇక గుడికి వెళ్లని రోజుల్లో ప్రోటీన్ కోసం గుడ్డు, చేపలు లేదా చికెన్ తీసుకుంటా.సాయంత్రం 4 నుండి 6 వరకు నా వర్కౌట్ సమయం. కండరాలకు బలం చేకూర్చే పైలేట్స్ , డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. (ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!) -
రూ.51 కొట్టు.. మేకను పట్టు..!
చిట్యాల, మర్రిగూడ: దసరా పండగ సమీపిస్తుండటంతో గ్రామాల్లో సందండి నెలకొంటోంది. చిట్యాల, మర్రిగూడ తదితర మండలాల్లో దసరా పండుగ సందర్భంగా యువకులు సరికొత్త స్కీం ప్రారంభించారు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో కొందరు యువకులు “51 రూపాయలు కొట్టు.. మేకను పట్టు’ అని ప్రచారం చేస్తున్నారు. ఈ స్కీంలో 51 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే.. కూపన్ల నుంచి డ్రా తీస్తారు. మొదటి బహుమతిగా పన్నెండు కిలోల మేక, రెండో బహుమతిగా రెండు లిక్కర్ బాటిళ్లు, మూడో బహుమతిగా మరో రెండు లిక్కర్ బాటిళ్లు, నాలుగో బహుమతిగా రెండు కడక్‌నా«థ్ నాటు కోళ్లు, ఐదో బహుమతిగా కాటన్ బీర్లు ఇచ్చేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వంద రూపాయల స్కీంమర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో మరో తీరుగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంద రూపాయలు చెల్లించి కూపన్ తీసుకున్న వారిలో నుంచి డ్రా తీసి మొదటి బహుమతి 10కిలోల మేక, రెండవ బహుమతి రెండు మద్యం బాటిళ్లు(బ్లెండర్ స్ప్రైడ్), మూడవ బహుమతి కాటన్ బీర్లు, నాలుగవ బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదవ బహుమతి ఒక మద్యం బాటిల్ అందించనున్నామని, వచ్చే నెల 10న గ్రామంలో డ్రా తీయనున్నట్లు నిర్వాహకులు బ్యానర్ ఏర్పాటు చేశారు. కాగా, ఈ ప్రచారాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. -
తోడేళ్ల హైజంప్ వేట!
బహ్రాయిచ్: యూపీలోని బహ్రాయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఐదు తోడేళ్లను పట్టుకున్న అటవీశాఖ అధికారులు ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలివుందని, దానిని కూడా త్వరలోనే పట్టుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడి ప్రజల దృష్టి ఆ ఆరో తోడేలుపైనే నిలిచింది. తాజాగా తోడేళ్ల వేటకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసినవారంతా భయాందోళనకు గురవుతున్నారు.బహ్రాయిచ్ పరిధిలోని నాన్పరా ప్రాంతంలో రెండు తోడేళ్లు ఏడడుగుల గోడను దూకి, అక్కడ కట్టివున్న ఒక మేకను నోట కరుచుకుని తీసుకువెళుతున్న దృశ్యం ఆ సీసీటీవీలో రికార్డయ్యింది. జనసాంద్రత కలిగిన ఆ ప్రాంతంలో ఇలా జరగడంపై స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో రెండు తోడేళ్లు కనిపిస్తున్నాయి. ఒక తోడేలు ఆ మేక మెడను కొరికి పట్టుకోగా, మరొక తోడేలు ఆ మేక వెనుక భాగాన్ని పట్టుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామస్తులు ఆ మేక కోసం వెదుకగా సమీపంలోని ఒక మామిడి తోటలో ఆ మేక తల, కాలు కనిపించాయి.ఈ ఘటన గురించి ఆ మేక యజమాని మున్నా మాట్లాడుతూ తాము రాత్రి భోజనం చేశాక, అంతా పడుకున్నామని, ఇంటి బయట ఉన్న సిమెంటు స్తంభానికి మేకను తాడుతో కట్టివేశామన్నారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో మేక అరుపులు వినిపించి, తామంతా బయటకు వచ్చేసరికి మేకను పట్టుకుని రెండు తోడేళ్లు పరుగులు తీయడం కనిపించిందన్నారు. ఇంతలో చుట్టుపక్కల ఉన్నవారంతా సంఘటనా స్థలానికి వచ్చారన్నారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశామని, వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. ఇది కూడా చదవండి: మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం -
పవన్ కళ్యాణ్ సినిమా OG లో తమిళ్ హీరో విజయ్ ?
-
ఆయన తప్పకుండా సీఎం అవుతారు: ది గోట్ నటుడు కామెంట్స్
కోలీవుడ్ నటుడు ప్రేమ్గీ అమరేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ మూవీ ది గోట్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ తమిళనాడు సీఎం అవుతారని అమరేన్ జోస్యం చెప్పారు. నా ఓటు కూడా విజయ్‌కే వేస్తానని.. తప్పకుండా 2026లో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హామీ ఇస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా.. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రేమ్గీ స్నేహాకు సోదరుని పాత్రలో నటించినట్లు ఆయన తెలిపారు. తనకు తలైవా, సూపర్‌స్టార్ రజినీకాంత్ అంటే విపరీతమైన అభిమానం అని వెల్లడించారు. అజిత్, విజయ్లంటే అమితమైన ప్రేమ అని.. కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ స్టార్ మాత్రమేనన్నారు.కాగా.. 'గోట్' చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
విజయ్ 'ది గోట్' సరైన పాటలు లేవు..అయినా సూపర్ క్రేజ్
-
విజయ్ సినిమాలో ఎంఎస్ ధోని.. ఆ సీన్ చూశారా?
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'ది గోట్'(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజో ది గోట్ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం 4 గంటలకే చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు మొదలయ్యాయి. మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ వస్తోంది. దీంతో థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.అయితే ఈ మూవీలో ఓ సీన్లో భారత మాజీ కెప్టెన్ ధోని కనిపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా కేరింతలు కొడుతూ.. తలా అంటూ నానా హంగామా చేశారు. ఆ సీన్లో ఎంఎంస్ ధోని ఐపీఎల్ బ్యాటింగ్‌కు వెళ్తూ కనిపించగా.. విజయ్ బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. ఈ సీన్‌తో విజయ్, ధోని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఐపీఎల్లో చెన్నై టీమ్‌కు మహేంద్ర సింగ్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ధోనికి పెద్దఎత్తున వీరాభిమానులు ఉన్నారు.కాగా.. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. హీరో, విలన్ పాత్రల్లో ఆయన మెప్పించనున్నారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్.. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇదే చివరి చిత్రం కానుంది. #Dhoni cameo 🔥🔥#Kanguva FL 💪💪🔥🔥#Trisha cameo#ThalaAJITH cameo 💥💥#Sivakarthikeyan cameo 🥱#goat#GOATFDFS#TheGreatestOfAllTime#ThalapathyVijay pic.twitter.com/VmYr3UOhOX— pushparaj(🔥🔥 ) (@Pushparaaj_AA) September 5, 2024 -
ది గోట్‌ని ఎంజాయ్ చేస్తారు: దర్శకుడు వెంకట్ ప్రభు
‘‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ సినిమా చిత్రీకరణ ఏడాదిలోపే పూర్తయింది. హాలీవుడ్లో అయితే ఈ తరహా సినిమా తీయడానికి ఇంకాస్త ఎక్కువ సమయమే పట్టేది. ఇది పొలిటికల్ సినిమా కాదు... పొలిటికల్ డైలాగ్స్ లేవు. అలాంటి డైలాగ్స్ పెట్టమని విజయ్ అడగరు’’ అన్నారు దర్శకుడు వెంకట్ ప్రభు. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించగా, స్నేహా, ప్రశాంత్, లైలా, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు.వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ ను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిగ్ టికెట్‌ను మైత్రీ నిర్మాత రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిలకు అందించారు ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ అర్చనా. అనంతరం దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఏజీఎస్ సంస్థలో నా తొలి సినిమా ఇది. సపోర్ట్ చేసిన నిర్మాత అర్చనగారికి, ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీవారికి ధన్యవాదాలు. ఈ మూవీని ఆడియన్ ్స ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘గోట్’ రిలీజ్ కోసం ఏజీఎస్తో అసోసియేట్ అయిన మైత్రీ మూవీస్వారికి థ్యాంక్స్. మా ‘గోట్’ విజయ్‌గారు’’ అని వెల్లడించారు ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ అర్చనా కల్పాతి. ‘‘వెంకట్ ప్రభుగారు మంచి విజన్ ఉన్న దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా ‘ది గోట్’ రాబోతోంది’’ అని పేర్కొన్నారు ప్రశాంత్. మెత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి మాట్లాడుతూ– ‘‘విజయ్‌గారి ఫ్యాన్ ్స కోసం ఎర్లీ మార్నింగ్ షోలను ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు వైభవ్, ప్రేమ్ జీ, నటి లైలా, నిర్మాత అర్చనా కల్పాతి, ఈ సినిమా అసోసియేట్ ప్రోడ్యూసర్ ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ హీరో కోసం ఐటెం సాంగ్ త్రిష
-
విజయ్ సినిమాకు 6 వేల థియేటర్లు.. విడుదలకు ముందే లాభాలు
విజయ్ రాజకీయాలకు ది గెటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) చిత్రానికి ఎలాంటి సంబంధం ఉండదని ఆ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు పేర్కొన్నారు. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గోట్. నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరాం, అజ్మల్, అమీర్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాత్తి ఎస్ అఘోరం, కల్పాత్తి ఎస్ గణేష్, కల్పాత్తి ఎస్. సురేష్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ కథాచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, సిద్ధార్థ నూని ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6000కు పైగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాత అర్చన మాట్లాడుతూ ఇది ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన 25వ చిత్రం అని తెలిపారు. అదేవిధంగా విజయ్ హీరోగా ఇంతకు ముందు బిగిల్ చిత్రాన్ని చేసామని, తాజాగా గోట్ ఆయనతో చేసిన రెండవ చిత్రమని చెప్పారు. లేకపోతే వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందించిన తొలిచిత్రం. ఇది సాంకేతిక పరంగా చాలా బలమైన చిత్రమని పేర్కొన్నారు. గోట్ చిత్రం ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ నిచ్చిందని చెప్పారు. దర్శకుడు వెంకట ప్రభు మాట్లాడుతూ చిత్ర షూటింగ్‌ను ఇస్తాన్‌బుల్ లో నిర్వహించాలని వెళ్లామని అయితే అక్కడ షూటింగ్ సాధ్యం కాకపోవడంతో రష్యాలో కొంత భాగం చిత్రీకరించినట్లు చెప్పారు. అదేవిధంగా గోట్ చిత్ర షూటింగ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోనే ప్రారంభించినట్లు చెప్పారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. చిత్రంలోని వీఎఫ్ ఎక్స్ సన్నివేశాల కోసం ప్రపంచంలోనే పేరుగాంచిన లోలా సంస్థతో ఒప్పందం చేసుకుని రూపొందించినట్లు చెప్పారు. ఇది అన్ని వర్గాలను అందించే కమర్షియల్ అంశాలతో కూడిన పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిపారు. నటుడు విజయ్ రాజకీయాలకు గోట్ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో పతకాలు ఎలా ఉన్నా..ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, కదిలించే కన్నీటి గాథలు, అద్భుతాలు ఉన్నాయి. వాటి తోపాటు ఓ క్రీడాకారిణి ధరించిన లాకెట్టు నెట్టింట్ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి బరిలోకి దిగే క్రీడాకారులు ఫ్యాషన్ లాకెట్టులు అంతగా ధరించరు. మహా అయితే నెక్కు ఉండే తేలికపాటి గొలుసులు ధరస్తారంతే..కానీ ఈ అమెరికన్ జిమ్నాస్ట్ మాత్రం వెరీ స్పెషల్. ఎందుకుంటే తనను ఏ జంతువుతో హేళన చేశారో దాన్నే లాకెట్‌గా డిజైన్ చేయించుకుని మరీ ఫ్యాషన్‌కు సరికొత్త పాఠాలు నేర్పింది. 2013 నుంచి ఓటమి ఎరుగని ఆల్‌రౌండ్ ఛాంపియన్. జిమ్నాస్టిక్స్ సరిహద్దులను చెరిపేసిన క్రీడాకారిణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్. ఈ 27 ఏళ్ల జిమ్నాస్ట్ గురువారం స్వర్ణం గెలుచుకుని, తన కెరీర్లో 39వ పతకాన్ని సాధించింది. దీంతో ఆమె రెండోవ ఒలింపిక్స్ ఆల్ రౌండర్ టైటిల్‌ని, వరుసగా తొమ్మిదొవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది. ఈ పారిస్ 2024 ఒలింపిక్‌లో రెండో బంగారు పతాకాన్ని గెలుచుకున్న వెంటనే తాను ధరించిన మేక లాకెట్టుతో కెమెరాకు ఫోజులిచ్చింది. అంతేగాదు ఆమె ఈ గెలుపుతో మొత్తం ఆరు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా 120 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ సందర్భంగా తన లాకెట్టుని ప్రదర్శించింది. "ఇది చిన్న మేక లాకెట్టు కావొచ్చు. కానీ ఈ మేకును అందరూ ఇష్టపడుతారు. అందరూ నన్ను మేక అంటూ పిలిచి హేళన చేశారు. అసలు దాన్నే లాకెట్టుగా చేసుకుని ధరించి ప్రత్యేకంగా ఉండాలనిపించి. అంతేగాదు ద్వేషించేవారు ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్లు నన్ను అలా ఆ జంతువు పేరుతో పిలవడాన్ని ప్రత్యేకంగా భావించానే గానీ నెగిటివ్‌గా తీసుకోలేదు. అదీగాక తన వద్ద స్టఫ్డ్ మేక కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బహుశా వారు దాన్నే గుర్తు చేస్తున్నారని అనుకున్నా". అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా, కాలిఫోర్నియా జ్యువెలరీ కంపెనీ బైల్స్ అభ్యర్థన మేరకు ఈ మేక లాకెట్టుని తయారు చేసినట్లు తెలిపింది. దీన్ని దాదాపు 546 వజ్రాలతో అలంకరించినట్లు వెల్లడించింది. ఇది త్రిమితీయ కళాఖండం అని, జిమ్నాస్టిక్స్‌లో ఆమె అసామాన ప్రతిభ, ఖచ్చితత్వం, అంకితభావం, పట్టుదల తదితరాలను ఇది ప్రతిబింబిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో జ్యువెలరీ కంపెనీ పేర్కొంది. (చదవండి: రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!) -
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా. ఇది మన అందరికి తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా తనకు ఆహారంగా వచ్చిన మేకతో స్నేహం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఎక్స్‌లో సందడి చేస్తోంది.రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్‌లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారాన్ని ఇస్తారు. ఇందులో భాగంగానే సైబీరియన్ పులి అమూర్కు, తైమూర్ అనే మేకను రాత్రి భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయాయి.గతంలో ఇలా చాలాసార్లు పంపించిన మేకలను పులి చంపి తినేసింది ఈ సారి మాత్రం అలా చేయలేదు. తైమూర్, అముర్ విరోధులు కాస్త ఫాస్ట్ స్నేహితులుగా మారిపోవడం మాత్రమే కాదు. కలిసి దోబూచు లాడుకోవడం, కలిసి తినడం, ఆడుకోవడం, మంచులో ఒకర్నొకరు వెంబడించుకోవడం , సరదాగా తలలతో కొట్టుకోవడం లాంటివి చేస్తున్నాయని ఎన్‌క్లోజర్ కెమెరాల ఆధారంగా పార్క్ అధికారులు ప్రకటించారు.2015లో తైమూర్ , అముర్ విచిత్ర స్నేహం వెలుగు చూడగా ఇపుడు మళ్లీ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ ఖాతా ఈ ఫోటోను షేర్ చేయడంతో 11 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.Tiger refuses to eat goat who was given to him as live food, instead, they became friends. pic.twitter.com/u6PlxdaKXW— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 21, 2024 ఈ స్నేహం ఎలా జరిగింది?మేకను ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసినప్పుడు అది ఎటువంటి భయాన్ని చూపలేదు. బెదిరిపోలేదు. అది మృత్యు వేటగా భావించలేదు. అలా వ్యవహరించ లేదు. అసలు పులులకు భయపడాలని మేకకు ఎవరూ నేర్పించలేదు అంటూ జూ చీఫ్ డిమిత్రి మెజెంట్సేవ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇవి స్నేహితులుగా మారాయని, ఇది మిరాకిల్ అని పేర్కొన్నారు. -
ఆ చిన్న సిరామిక్ మేక బొమ్మ అన్ని లక్షలా..!
ప్రముఖులు, సెలబ్రెటీలు, ముఖ్యంగా రాజుల కాలం నాటి వస్తువులు వేలంలో అత్యంత ధర పలుకుతాయి. వాటికి చారిత్రక నేపథ్యం ఉండటంతో అంతలా కళ్లు చెదిరే రేంజ్లో ధర పలుకుతాయి. కొన్ని అరుదైన వజ్రాలు, నగలు, లేదా హస్త కళా నైపుణ్యానికి సంబంధించిన వస్తువులు అత్యంత ఖరీదు అమ్ముడుపోతాయి. కానీ మట్టితో తయారు చేసిన సాధారణ సిరామిక్ మట్టి బొమ్మ వేలంలో ఎంత పలికిందో వింటే కంగుతింటారు. 55 ఏళ్ల రేమండ్ పాటెన్ అనే వ్యక్తి వద్ద ఏళ్లుగా ఉన్న రాజవంశీకులకు సంబంధించిన సిరామిక్ మట్టి మేక బొమ్మ వేలంలో కనివినీ ఎరుగని రీతీలో రూ. 9 లక్షలకు పలిగింది. జస్ట్ మట్టి బొమ్మే కదా..!అన్ని లక్షలా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ బొమ్మను కింగ్ చార్లెస్ స్వహస్తాలతో తయారు చేసిన మట్టి మేక బొమ్మ అది. ఆ బొమ్మను 21వ పుట్టిన రోజున తన ఆంటీ ఇచ్చిందని చెప్పాడు రేమండ్.ఆమె ఈ బొమ్మను ప్రిన్స్ చార్లెస్ తయారు చేశారని చెప్పడంతో ఇప్పటి వరకు దాన్ని అత్యంత భద్రంగా కాపాడుకుంటూ వచ్చానని అన్నారు. 1960లలో ఆమె క్వీన్స్ కాలేజ్‌లో కుక్‌గా పనిచేస్తుండేదని, ఆ టైంలో ప్రిన్స్ తన కాలేజ్‌కి రావడం తన ఆంటీ ఎంతో గర్వంగా భావించేదని చెప్పకొచ్చాడు రేమాండ్. ఆమె ఆ కేంబ్రిడ్జ్‌లోని 37 నార్ఫోక్ టెర్రేస్‌లో నివశించేది. ఆమె తన తాతయ్య చెల్లెలని, జీవితాంతం పెళ్లే చేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆమె తన జీవితమంతా రాజకుటుంబ సభ్యలుకు సేవ చేస్తూ గడిపిందని, ముఖ్యంగా రాణిగారి తల్లికి వంటచేసేదని రేమాండ్ చెప్పారు. ఈ చారిత్రక ప్రాముఖ్యత కలిగన మేక విలువైన ప్రదేశంలో ఉండటం మంచిదని ఇలా వేలంలో ఉంచినట్లు అతను చెప్పుకొచ్చారు. ఇలానే గతేడాది హాన్సన్స్ వేలం పాటలో చార్లెస్ ఐదేళ్ల వయసులో గీసిన తన తల్లిదండ్రులు క్వీన్ ఎలిజబెత్II, ది డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్‌ల చిత్రాలు కూడా ఇలానే ఏకంగా రూ. 63 లక్షలు పలికడం విశేషం.(చదవండి: పోలాండ్లోని రహదారులకు, స్కూళ్లకు భారతీయ రాజు పేరు ఎందుకు పెట్టారో తెలుసా..!) -
భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
టాలీవుడ్లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్ కూడా దొర్లాయి.అయితే రవితేజ సరసన నటించిన ఢమాకా చిత్రం హిట్ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్‌లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్‌తో స్పెషల్ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది.విజయ్ ప్రస్తుతం గోట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.ఆ తరువాత కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్ యువ స్టార్ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్‌లో సింగిల్ సాంగ్‌తో ఎంట్రీ అయితే అది కెరీర్ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్ డెసిషన్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. -
స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్?
దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు. సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. గోట్ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్. దీని తరువాత తన 69వ చిత్రం చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ, మైక్ మోహన్ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోట్ చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్ అప్పీరియన్స్‌ను ఇవ్వడానికి టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ చిత్రం గోట్‌నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్‌స్టార్ అజిత్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్‌పై దండెత్తబోతున్నారన్నమాట. చూద్దాం ఇక్కడ ఈమె ప్యూచర్ ఎలా ఉండబోతోందో. -
The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను
సౌదీలో రెండేళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు. మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం ఇసుకే దాహం ఇసుక తప్ప మరేం కనిపించని ఒంటరితనం. బానిస బతుకు. కాని బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే ‘గోట్ లైఫ్’ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ సంఘర్షణ ఇది. కేరళలోని అలెప్పి దగ్గరి చిన్న ఊరికి చెందిన నజీబ్ కోరుకుంది ఒక్కటే. సౌదీకి వెళ్లి ఏదో ఒక పని చేసి కుటుంబానికి నాలుగు డబ్బులు పంపాలన్నదే. ఆ రోజుల్లో కేరళ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు చాలామంది పని కోసం వలస వెళ్లేవారు. నజీబ్ కూడా సౌదీకి వెళ్లాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి ఒక మాల్లో సేల్స్‌మ్యాన్‌గా పని ఉంటుందని పంపాడు. అలా నజీబ్ సౌదీలో అడుగు పెట్టాడు. అది 1993వ సంవత్సరం. రెండు రోజుల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగాక నజీబ్ రెండు రోజుల పాటు ప్రయాణిస్తూనే ఉన్నాడు... అప్పుడు గాని అర్థం కాలేదు తాను మోసపోయానని. ఎడారి లోపల అతణ్ణి అరబ్ షేక్‌కు అప్పజె΄్పారు. ఆ షేక్ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్‌కు 700 గొర్రెలను కాచే పని అప్పజె΄్పాడు. వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు. బతకడానికి మాత్రం ముతక రొట్టెలు పడేసేవాడు. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడు నజీబ్. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్‌కు కనిపించేవారు. వారి అరబిక్ భాష తప్ప మరో భాష వినలేదు. మరో మనిషిని చూడలేదు. ‘నేను ఏడ్చినప్పుడల్లా వారు కొట్టేవారు’ అంటాడు నజీబ్. భ్రాంతులు నజీబ్‌కు ఎడారిలో ఉండి భ్రాంతులు మొదలయ్యాయి. అతడు గొర్రెల మధ్య ఉండి ఉండి తాను కూడా ఒక గొర్రెనేమో అనుకునేవాడు. రెండేళ్ల పాటు ఇలాగే జరిగింది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ పెళ్లి ఉందని వెళ్లారు. ఆ అదను కోసమే చూస్తున్న నజీబ్ ఎడారిలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారి లేదు.. గమ్యమూ తెలియదు. పరిగెట్టడమే. ఒకటిన్నర రోజు తర్వాత మరో మలయాళి కనిపించి దారి చె΄్పాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్ చేరాడు. అక్కడి మలయాళీలు నజీబ్‌ను కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతే తగిన పత్రాలు లేనందున 10 రోజులు జైల్లో పెట్టి ఇండియా పంపారు. నవల సినిమాగా నజీబ్ తిరిగి వచ్చాక కోలుకొని బెహ్రయిన్ వెళ్లాడు ఈసారి పనికి. అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యమిన్‌కు నజీబ్‌తో పరిచయమైంది. నజీబ్ జీవితాన్ని బెన్యమిన్ నవలగా ‘ఆడు జీవితం’ (గొర్రె బతుకు) పేరుతో రాసి 2008లో వెలువరించాడు. అది సంచలనంగా మారింది. ఇప్పటికి వందకు పైగా ఎడిషన్స్ వచ్చాయి. 8 భాషల్లో అనువాదమైంది. ఆ నవల ్రపాశస్త్యం సినిమా రంగాన్ని ఆకర్షించింది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘ఆడు జీవితం’ పేరుతో నటించి మొన్న మార్చి 28న విడుదల చేశాడు. తెలుగులో గోట్‌లైఫ్ పేరుతో అనువాదమైంది. వాస్తవిక సినిమాగా ఇప్పటికే గోట్‌లైఫ్ ప్రశంసలు పొందుతోంది. -
ఆ హీరోతో నటించే ఛాన్స్ వస్తే అదృష్టవంతులే: మీనాక్షి చౌదరి
టాలీవుడ్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షిచౌదరి కోలీవుడ్‌లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలుగులో మహేష్‌బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుని మరింత పాపులర్ అయింది. పొంగల్ రేసులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మధ్య మొదట మిశ్రమ స్పందన తెచ్చుకున్నా తర్వాత పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రూ. 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళంలో ఈమె ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి విజయ్‌కు జంటగా నటిస్తున్నది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం. నటి స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరాం, యోగిబాబు, అజ్మల్, అమీర్, వైభవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో విజయ్ సరసన నటించే అవకాశం రావడం గురించి మీనాక్షి చౌదరి తన ఆనందాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విజయ్ సరసన నటిస్తున్నట్లు తెలియగానే ఆనందంతో తనగుండె ఆగిపోయేలా అనిపించిందన్నారు. విజయ్ జంటగా నటించే అవకాశం ఎవరికీ అంత సులభంగా రాదన్నారు. అలాంటి అవకాశం లభిస్తే వారు అదృష్టవంతులేనని పేర్కొన్నారు. అలాంటి అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. అయితే షూటింగ్ స్పాట్లో విజయ్ తనతో ప్రవర్తించిన విధానం మాటల్లో వర్ణించలేనన్నారు. తాను ఆయన వీరాభిమానిని అని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈ బ్యూటీ తమిళంలో ఆర్జే బాలాజి సరసన నటించిన సింగపూర్ సెలూన్ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. -
ఈ మేక ధర.. కేకో కేక
అంబాజీపేట: ఒళ్లంతా విపరీతంగా పెరిగిపోయిన ఊలుతో కనిపిస్తున్న దీనిని పొట్టేలు అనుకునేరు! ఇదో మేక.. అలాగని ఇది ఆషామాషీ మేక కాదు.. దీని రేటు వింటే కళ్లు తేలవేయడం ఖాయం. మామూలుగా మన దేశవాళీ మేక ఖరీదు మహా అయితే ఓ ఇరవై వేల రూపాయలుంటుంది. కానీ ఈ మేక రేటు ఏకంగా ఒకటిన్నర లక్షలు. ‘చిగు’ జాతికి చెందిన ఈ మేకలు హిమాలయ పర్వత ప్రదేశాల్లో ఉత్తర ప్రదేశ్‌కు ఉత్తరంగా, హిమాచల్ ప్రదేశ్‌కు ఈశాన్యంగా లభిస్తూంటాయి. ఎక్కువగా తెలుపు రంగులో, వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములు కలిగి, సుమారు 50 కేజీల బరువు ఉంటాయి. హిమాలయాల్లో చలి ఎక్కువగా ఉండటంతో వీటి శరీరంపై ఊలు చాలా పొడవుగా పెరుగుతుంది. దీనిని శాలువాల తయారీకి వినియోగిస్తారు. అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన అడబాల వెంకటేశ్వరరావుకు పశు పోషణ అంటే ఎంతో ఇష్టం. పుంగనూరు ఆవులు, గిత్తలు, విభిన్నంగా ఉండే మేకలు, చెవుల పిల్లుల వంటి వాటిని పెంచుతూ కొన్నాళ్ల తర్వాత లాభానికి విక్రయిస్తూంటారు. ఆయన ఈ మేకను నేపాల్‌లో రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. మాచవరంలో జరిగిన పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గాలి గోపురం, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెంకటేశ్వరరావు వద్ద ఉన్న పుంగనూరు ఆవు, దూడను తీసుకువచ్చారు. వీటితో పాటు ఆయన ఈ ‘చిగు’ జాతి మేకను కూడా అక్కడకు తీసుకువచ్చారు. వింతగా ఉన్న ఈ మేకను పలువురు ఆసక్తిగా తిలకించారు. -
పాకిస్తాన్ జాతీయ జంతువు ఏది? ఏ విషప్రాణులను మింగుతుంది?
మార్ఖోర్ అనేది అడవి మేక. ఇది హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా కథలు వినిపిస్తాయి. ఇది పాములకు తొలి శత్రువు అని చెబుతారు. పాములు ఎక్కడున్నాయో కనిపెట్టి, వాటిని చంపి, నమిలి మింగేస్తుందని చెబుతారు. పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ చిహ్నంలో మార్ఖోర్ కనిపిస్తుంది. మార్ఖోర్ పాకిస్తాన్ జాతీయ జంతువు. మార్ఖోర్ అనేది పర్షియన్ పదం. దీని అర్థం పాములను తినేది లేదా పాములను చంపేది. ఈ జంతువు తన వాడి అయిన కొమ్ములతో పాములను చంపి, వాటిని తినగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని స్థానిక జానపద కథలు చెబుతున్నాయి. పాముకాటు నుండి విషాన్ని తొలగించడంలోనూ మార్ఖోర్ సహాయపడుతుందని కూడా చెబుతారు. అయితే మార్ఖోర్.. పాములను తిన్నట్లు లేదా వాటి కొమ్ములతో పాములను చంపినట్లు ఆధారాలు ఎక్కడా కనిపించవు. అయితే పాకిస్తాన్ ప్రజలు మార్ఖోర్లు ఉండే చోట పాములు కనిపించవని నమ్ముతారు. ప్రస్తుతం మనకు సాధారణంగా మేక.. మార్ఖోర్ నుండి ఉద్భవించి ఉండవచ్చని చార్లెస్ డార్విన్ ఊహించాడు. మార్ఖోర్ చాలా శక్తివంతమైనది. 6 అడుగుల పొడవు, 240 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. దీనికి దవడ నుండి కడుపు దిగువ వరకు విస్తరించిన దట్టమైన గడ్డం ఉంటుంది. మార్ఖోర్లు ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి టర్కిస్తాన్ వరకు 2,000 నుండి 11,800 అడుగుల ఎత్తయిన పర్వతాలలో నివాసం ఉంటాయి. ఇవి ప్రధానంగా శాఖాహారులు. ఇవి సాధారణంగా గుంపులుగా జీవిస్తాయి. ఒక మందలోని మార్ఖోర్ల సగటు సంఖ్య దాదాపు 9గా ఉంటుంది. కాగా వేట కారణంగా మార్ఖోర్ల జనాభా తగ్గుతోంది. వాటి ప్రత్యేకమైన కొమ్ముల కోసం వేటగాళ్లు మార్ఖోర్లను వేటాడుతారు. ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం -
ఇదిగో సారూ... నా మేక టికెటు
గ్రామీణ ప్రాంతాల్లో పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రేమగా పిలుచుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మహిళ మేకను పెంచుకుంటుంది. ఒకరోజు ఆమె వేరే ఊరికి పోవాల్సి వచ్చింది. మేకను ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక తనతో పాటు తీసుకెళ్లింది. విశేషం ఏమిటంటే మేకకు కూడా ట్రైన్ టికెట్ తీసుకుంది. ఐఏఎస్ అధికారి అవినాష్ శరణ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. ‘తన మేకకు కూడా టికెట్ తీసుకున్న విషయాన్ని టీటీయితో ఎంత గర్వంగా చెబుతుందో చూడండి’ అని రాశారు అవినాష్. ఇక వీడియో క్లిప్ విషయానికి వస్తే... టికెట్ చూపించమని ఆమెను టీటీయి అడుగుతాడు. ‘ఇదిగో’ అంటూ చూపిస్తుంది. ‘నీ సంగతి సరే, మరి మేకకు టికెట్ తీసుకున్నావా?’ అని సరదాగా అడుగుతాడు టీటీయి. ‘అమ్మో...తీసుకోకుండా ఎలా ఉంటాను. ఇదిగో టిక్కెట్టు’ అని చూపిస్తుంది. ‘నేను తరచుగా రైల్లో ప్రయాణిస్తుంటాను. టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించి టీటీయికి దొరికి పోయేవారిని చాలామందిని చూస్తుంటాను. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈమె చాలా గొప్పగా అనిపిస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు. -
మందమర్రిలో దారుణం.. మేకను ఎత్తుకెళ్లారని ఇద్దరికి చిత్రహింసలు
మందమర్రి పట్టణం: మంచిర్యాల జిల్లా మందమర్రి లో దారుణం చోటు చేసుకుంది. మేకను దొంగతనం చేశారనే నెపంతో ఎస్సీ యువకుడితో పాటు పశువుల కాపరిని వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపింది. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగడి బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పట్టణ శివారులోని గంగ నీళ్ల పంపుల సమీపంలో మేకల షెడ్డులో మేకలను పెంచుతున్నారు. మేకల మండి లో నుండి రెండు మేకలను మాయం చేశారని నెపంతో మేకల కాపరితో పాటు అతని స్నేహితుడైన ఓ తాపి మేస్త్రీని విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో పశువుల కాపరి తేజ, ఎస్సీ యువకుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్‌పై అనుమానంతో ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు. కింద పొగ పెట్టి వారిద్దరిని షెడ్డులో తలక్రిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టి వదిలేశారు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తన తమ్ముణ్ణి కట్టేసి కొట్టిన విషయం తెలియడంతో బాధితుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మాస్ గోట్గా సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రం ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). దివ్య భారతి హీరోయిన్. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో ఒక చేత్తో క్రికెట్ బ్యాట్ పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ కాల్చుతూ మాస్ లుక్‌లో కనిపించారు సుధీర్. ‘‘మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. -
మూడు కాళ్ళ మేక
-
కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!
ప్రస్తుతం చాలా మంది చేతులు, తుంటి, వెన్నెముక, మోకాళ్లు, కీళ్లలో నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యల బారిన పడుతున్నారు. వ్యాయామాలు చేయడం కారణంగా ఈ నొప్పులు తీవ్ర తరమవుతున్నాయి. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో బాదం, వేరుశెనగ, వాల్నట్స్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో పుష్కలంగా లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఉ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. ఎక్కువగా వినియోగించడం వల్ల కీళ్లనొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. బెర్రీలు బ్లబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ప్రతిరోజు తినడం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెర్రీల వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కూరగాయలు సల్ఫోరాఫేన్ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు బ్రోకలీ, కాలీఫ్లవర్లను ఆహారంలో తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ కీళ్ల నొప్పులున్నవారు ఆలివ్ ఆయిల్‌ను వినియోగించి తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మార డంతోపాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. డార్క్ చాక్లెట్ ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. (చదవండి: దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..)