
రాక్షస రూపంలో మేకపిల్ల జననం.. పరుగులు
వికృత రూపంలో మేకపిల్ల జన్మించడంతో అది చూసిన జనాలు బెంబేలెత్తి భయంతోపరుగులు తీశారు. దీంతో మేక యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన మధ్య అర్జెంటీనాలోని శాన్‌లూయిస్‌లో చోటు చేసుకుంది. మేకపిల్ల రెండు కళ్లు అసాధారణంగా లోపలకు కుచించుకుపోయి ఉండటంతో రాక్షస రూపంలా కనిపిస్తోంది. అంతేకాకుండా మేకపిల్ల ముఖంలో కూడా మార్పులు ఉన్నాయి.
అక్కడిచేరుకున్న పోలీసులు భయభ్రాంతులకు గురవుతున్న వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మేకపిల్ల ముఖ భాగం మినహా మిగిలిన శరీరం మొత్తం బాగానే ఉందని చెప్పారు. పెద్ద ఎత్తున మేకల స్ధావరం దగ్గరకు చేరుకున్న వారిలో ఓ వ్యక్తి మేకపిల్ల ఫోటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.