
‘ఫిఫా’ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు అర్జెంటీనా ప్రాబబుల్స్ ఎంపిక
బ్యూనస్‌ఎయిర్స్: దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో 13వ రౌండ్ మ్యాచ్‌ల కోసం 33 మంది ఆటగాళ్లతో అర్జెంటీనా ప్రాథమిక జాబితాను ప్రకటించింది. స్టార్ ప్లేయర్ లయనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా బరిలోకి దిగుతుంది.
ఈనెల 21న మాంటెవీడియోలో ఉరుగ్వే జట్టుతో... ఈనెల 25న బ్యూనస్ ఎయిర్స్‌లో బ్రెజిల్ జట్టుతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా తలపడుతుంది. 2026 ప్రపంచకప్ టోర్నికి కెనడా, మెక్సికో, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2026 జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే ఈ మెగా టోర్నిలో తొలిసారి 48 జట్లు పోటీపడుతున్నాయి. దక్షిణ అమెరికా జోన్‌లో 10 దేశాలు క్వాలిఫయింగ్‌లో బరిలో ఉన్నాయి.
ఇప్పటికే 12 రౌండ్‌లు ముగిశాయి. నిర్ణిత 18 రౌండ్‌ల తర్వాత టాప్–6లో నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం అర్జెంటీనా, ఉరుగ్వే, ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, పరాగ్వే జట్లు టాప్–6లో ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ఆడుతుంది. ఖతర్ ఆతిథ్యమిచ్చిన 2022 ప్రపంచకప్‌లో మెస్సీ కెపె్టన్సీలో అర్జెంటీనా జట్టు 1986 తర్వాత మళ్లీ జగజ్జేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment