FIFA World Cup
-
మెస్సీ సారథ్యంలో...
బ్యూనస్ఎయిర్స్: దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో 13వ రౌండ్ మ్యాచ్‌ల కోసం 33 మంది ఆటగాళ్లతో అర్జెంటీనా ప్రాథమిక జాబితాను ప్రకటించింది. స్టార్ ప్లేయర్ లయనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా బరిలోకి దిగుతుంది. ఈనెల 21న మాంటెవీడియోలో ఉరుగ్వే జట్టుతో... ఈనెల 25న బ్యూనస్ ఎయిర్స్లో బ్రెజిల్ జట్టుతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా తలపడుతుంది. 2026 ప్రపంచకప్ టోర్నికి కెనడా, మెక్సికో, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2026 జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే ఈ మెగా టోర్నిలో తొలిసారి 48 జట్లు పోటీపడుతున్నాయి. దక్షిణ అమెరికా జోన్లో 10 దేశాలు క్వాలిఫయింగ్‌లో బరిలో ఉన్నాయి. ఇప్పటికే 12 రౌండ్లు ముగిశాయి. నిర్ణిత 18 రౌండ్ల తర్వాత టాప్–6లో నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం అర్జెంటీనా, ఉరుగ్వే, ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, పరాగ్వే జట్లు టాప్–6లో ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ఆడుతుంది. ఖతర్ ఆతిథ్యమిచ్చిన 2022 ప్రపంచకప్‌లో మెస్సీ కెపె్టన్సీలో అర్జెంటీనా జట్టు 1986 తర్వాత మళ్లీ జగజ్జేతగా నిలిచింది. -
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫిఫా పోస్టర్.. స్పందించిన యంగ్ టైగర్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ చిత్రంలో హీరోలుగా నటించారు. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీలోని నాటు నాటు అనే పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. దీంతో ఆస్కార్ వేదికగా నాటు నాటు సాంగ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.అయితే ఈ సాంగ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ చూసినా నాటు నాటు స్టెప్పులకు కాలు కదపకుండా ఉండరేమో అనేలా ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఈ పాటను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్(ఫిఫా) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ముగ్గురు ఫుట్ బాల్ దిగ్గజాల పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఆ పోస్టర్లో ఫుట్‌బాల్ దిగ్గజాలు నేయ్మార్, టెవెజ్, రొనాల్డో ఫోటోలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా క్రియేట్ చేసింది. వీరి పేర్లలోని తొలి అక్షరాలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా పోస్టర్‌ను రూపొందించారు. ఇందులో ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ స్టెప్పులు వేస్తున్నట్లు కనిపించారు. ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ముగ్గురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మన యంగ్ టైగర్. ఈ పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మాస్ టైగర్ ఎన్టీఆర్ అంటూ జూనియర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ చివరిసారిగా దేవర పార్ట్ -1 చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి వార్- 2 మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. View this post on Instagram A post shared by FIFA World Cup (@fifaworldcup) View this post on Instagram A post shared by FIFA World Cup (@fifaworldcup) -
30 లక్షల కుక్కల హతం!
2030 ఫిఫా వరల్డ్ కప్‌కు స్పెయిన్, పోర్చుగల్‌తో కలిసి ఆతిథ్యం ఇవ్వనున్న మొరాకో ఆ లోపు దేశంలో వీధికుక్కల బెడదను వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఏకంగా 30 లక్షల కుక్కలను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం! విషం పెట్టడం మొదలుకుని నానారకాలుగా వాటి ఉసురు తీస్తోంది. రక్తపు మడుగులో నిస్సహాయ స్థితిలో ఉన్న కుక్కలను ట్రక్కుల్లోకి విసిరేస్తున్న హృదయ విదారక దృశ్యాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. దీనిపై ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కోలిషన్ (ఐఏడబ్ల్యూపీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. ‘మొరాకోస్ అగ్లీ సీక్రెట్’ పేరుతో ప్రచారాన్నే ప్రారంభించింది. ఇంజక్షన్లు, ఆహారం ద్వారా విషమిచ్చి కుక్కలను అమానవీయంగా చంపుతున్నారని పేర్కొంది. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ ఫిఫాకు లేఖలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే ఫిఫా ప్రతిష్ట మసకబారుతుందని పర్యావరణ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. భయానకం... మొరాకో వీధుల్లో వీధి కుక్కలు నొప్పితో కేకలు వేస్తున్న వీడియోలు వైరలవుతున్నాయి. కుక్క పిల్లను తలకిందులుగా వేలాడదీసి, భయభ్రాంతులకు లోనై చూస్తున్న కుక్కల ట్రక్కులోకి విసిరేయడం కనిపించింది. మరో వీడియోలో రెండు కుక్కలు రక్తమోడుతూ నేలపై పడున్నాయి. ఇదంతా పిల్లల ముందే జరుగుతుండటంతో వారు తీవ్ర దిగ్భ్రాంకి లోనవుతున్నారని ఐఏడబ్ల్యూపీసీ తెలిపింది. దాంతో మొరాకోపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్‌కు ఉద్వాసన పలికారు. 2026 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో టీమిండియా మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోవడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్టిమాక్ సేవలకు మంగళం పాడింది. క్రొయేషియాకు చెందిన ఈ మాజీ ఫుట్‌బాలర్‌ను 2019లో కోచ్‌గా నియమించారు. ఆయన శిక్షణలో భారత జట్టు నాలుగు మేజర్ ట్రోఫీలను సాధించింది. ఇందులో రెండు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ టైటిళ్లు కాగా, ఇంటర్కాంటినెంటల్ కప్, ముక్కోణపు సిరీస్ ఉన్నాయి. దీంతో గత అక్టోబర్‌లో ఆయనకు 2026 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే సునీల్ ఛెత్రి (ప్రస్తుతం రిటైరయ్యాడు) నేతృత్వంలోని భారత్ క్వాలిఫయర్స్‌లో ఎప్పటిలాగే రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. దీంతో జట్టు ప్రదర్శన సరిగాలేని కారణంతో గడువుకు ముందే స్టిమాక్‌ను తొలగించారు. ఒప్పందం ప్రకారం ఇలా అర్ధంతరంగా సాగనంపితే స్టిమాక్‌కు 3,60,000 డాలర్లు (రూ. 3 కోట్లు) ఏఐఎఫ్ఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తం చెల్లించేందుకు సమాఖ్య సిద్ధమైంది. హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి థోలెం శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీతేజ ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో మూడో స్థానంలో నిలిచింది.శ్రీతేజ ఓవరాల్‌గా 4136 పాయింట్లు సాధించింది. రినీ ఖాతూన్ (పశి్చమ బెంగాల్; 4357 పాయింట్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. స్నేహిత్‌కు కాంస్యం సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ గేమ్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు. రష్యాలోని కజాన్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 9–11, 8–11, 6–11తో ఓటమి చవిచూశాడు. -
ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం: టాలీవుడ్ హీరో ఆగ్రహం
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇండియా ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రదర్శనకు ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గు పడాలని సిద్దార్థ్ విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చాలంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇండియన్ ఫుట్‌బాల్ కౌన్సిల్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నిఖిల్ తన ట్విట్లో రాస్తూ..'ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ని ఇప్పుడే చూశా. మన భారత జట్టు అత్యంత తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి ప్రదర్శన పట్ల ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నా. క్రీడల్లో మనం మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ హీరోకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తున్నారు. అంతే కాకుండా కార్తికేయ-3 కూడా ఉంటుందని నిఖిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. కాగా.. ఇటీవలే సిద్ధార్థ్‌కు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. Just watched the Most Frustrating Football Match of our Indian Team at the #FIFAWorldCupQualifiers The @IndianFootball association should be Ashamed for this embarrassing display. The Most Populous country in the World 🇮🇳 We deserve better.. CHANGE THE SYSTEM @ianuragthakur… pic.twitter.com/Lt9S1P2ltw — Nikhil Siddhartha (@actor_Nikhil) March 21, 2024 -
ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ మరో రికార్డు!
అయోధ్యలోని నూతన రామమందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ ఈ రికార్డులలో అగ్రస్థానంలో నిలిచింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు అందుకున్న యూట్యూబ్ ఛానల్‌గా నరేంద్ర మోదీ ఛానల్ నిలిచింది. రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుకను నరేంద్ర మోదీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా తొమ్మిది మిలియన్ల మంది అంటే 90 లక్షల మందికి పైగా జనం ప్రత్యక్షంగా వీక్షించారు. అన్ని యూట్యూబ్ ఛానళ్ల లైవ్ స్ట్రీమ్ వీక్షణలలో ఇదే అత్యధిక రికార్డ్‌గా నిలిచింది. నరేంద్ర మోదీ ఛానెల్లో రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక ‘PM Modi LIVE | Ayodhya Ram Mandir LIVE | Shri Ram Lalla Pran Pratishtha’ and ‘Shri Ram Lalla Pran Pratishtha LIVE’ టైటిల్స్‌తో ప్రత్యక్ష ప్రసారమైంది. నరేంద్రమోదీ ఛానెల్లోని ఈ లైవ్‌కి ఇప్పటివరకు మొత్తం ఒక కోటి వ్యూస్ వచ్చాయి. అంతకుముందు ఇదే ఛానల్లో ప్రసారమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని 80 లక్షల మందికి పైగా జనం వీక్షించారు. ఈ రికార్డులలో మూడవ స్థానంలో ఫిఫా వరల్డ్ కప్ 2023 మ్యాచ్, నాలుగవ స్థానంలో యాపిల్ లాంచ్ ఈవెంట్ నిలిచాయి. నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2.1 కోట్లు. ఇప్పటివరకూ ఈ ఛానల్లో మొత్తం 23,750 వీడియోలు అప్లోడ్ చేశారు. ఈ వీడియోల మొత్తం వీక్షణలు 472 కోట్లు. యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లను దక్కించుకున్న ప్రపంచంలోని మొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు. -
FIFA World Cup 2026 Qualifiers: ఐదుసార్లు విశ్వవిజేతకు షాక్.. తొలిసారి..!
రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టుకు పరాజయం ఎదురైంది. మెస్సీ సారథ్యంలోని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0 గోల్ తేడాతో బ్రెజిల్ జట్టును ఓడించింది. ఆట 63వ నిమిషంలో నికోలస్ ఒటామెండి హెడర్ షాట్‌తో గోల్ సాధించి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వదేశంలో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. -
ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రైజ్‌మనీతో పోలిస్తే క్రికెట్ వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఇంత తక్కువా..?
విశ్వవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్, క్రికెట్ రెండు సరిసమానంగా ఉంటాయి. ఇటీవలికాలంలో ఫుట్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్‌కు ప్రజాదరణ పెరిగిందనే చెప్పాలి. పాశ్యాత్య దేశాల్లో సైతం క్రికెట్‌కు విపరీతంగా క్రేజ్ పెరుగుతూ వస్తుంది. ప్రపంచంలో రెండు క్రీడలకు సరిసమానమైన క్రేజ్ ఉన్నా ఒక్క విషయంలో మాత్రం క్రికెట్‌కు అన్యాయమే జరుగుతుంది. ప్రైజ్‌మనీ విషయంలో జెంటిల్మెన్ గేమ్ బాగా వెనుకపడి ఉంది. ప్రపంచకప్ విషయానికొస్తే.. ఫుట్‌బాల్ ప్రైజ్‌మనీతో పోలిస్తే క్రికెట్ ప్రైజ్‌మనీ చాలా తక్కువగా ఉంది. 2022 ఫిఫా ప్రపంచకప్ విన్నర్ (అర్జెంటీనా) ప్రైజ్‌మనీ భారత కరెన్సీలో సుమారు 334 కోట్ల రూపాయలు (42 మిలియన్ యూఎస్ డాలర్లు) అయితే.. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ విజేతకు 33 కోట్ల రూపాయలు (4 మిలియన్ యూఎస్ డాలర్లు) మాత్రమే దక్కుతుంది. ప్రైజ్‌మనీ విషయంలో రెండు క్రీడల మధ్య ఇంత వ్యత్యాసం ఉండటంతో క్రికెట్ అభిమానులు బాగా ఫీలైపోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంత డబ్బు సంపాధిస్తున్నా క్రికెట్‌పై ఎందుకు ఇంత చిన్నచూపు అని వారు ప్రశ్నిస్తున్నారు. అనాదిగా క్రికెట్‌పై ఈ వివక్ష కొనసాగుతూనే ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధరణ విషయంలో ఫుట్బాలర్లతో పోలిస్తే క్రికెటర్లు ఏమాత్రం తీసిపోనప్పటికీ వారికందే పారితోషికం మాత్రం నామమాత్రంగా ఉందని అంటున్నారు. ఇకనైనా క్రికెటర్ల వ్యక్తిగత పారితోషికం, జట్టుకు అందే ప్రైజ్‌మనీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, వన్డే ప్రపంచకప్ 2023 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ మొత్తం 10 మిలియన్ యూఎస్ డాలర్లుగా నిర్ణయించబడింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు 83 కోట్లు (82 కోట్ల 93 లక్షల 57 వేల 500 రూపాయలు). ఈ మొత్తం ప్రైజ్‌మనీ విజేత, రన్నరప్, సెమీ ఫైనలిస్ట్‌లు, గ్రూప్ స్టేజ్‌లో నిష్క్రమించిన జట్ల మధ్య విభజించబడుతుంది. విజేతకు 40 లక్షల యూఎస్ డాలర్లు (33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) దక్కుతుంది. రన్నరప్‌కు 20 లక్షల యూఎస్ డాలర్లు (16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) అందుతుంది. సెమీ ఫైనలిస్ట్‌లకు 8 లక్షల యూఎస్ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు లక్ష యూఎస్ డాలరు (82 లక్షల 92 వేల 950 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు 40 వేల యూఎస్ డాలర్లు (33 లక్షల 17 వేల 668 రూపాయలు) ప్రైజ్‌మనీగా అందుతుంది. ఇదిలా ఉంటే, ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. -
ముద్దు వివాదం.. పదవికి రాజీనామా చేసిన ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్
ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో తమ దేశ స్టార్ ఫుట్‌బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను బలవంతంగా ముద్దు పెట్టుకుని వివాదాల్లో చిక్కుకున్న స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశాడు. కొద్ది రోజుల కిందట ఫిఫా రుబియాలెస్‌పై వేటు వేసింది. తాజాగా రుబియాలెసే స్వయంగా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు సమర్పించాడు. కాగా, స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్‌తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో రుబియాలెస్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఫిఫా మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్‌పై 1-0 గోల్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా అవతరించింది. -
FIFA: జట్టును జగజ్జేతగా నిలిపి.. తీవ్ర విషాదంలో మునిగిపోయి!
FIFA Women's World Cup Spain vs England- Olga Carmona: జట్టును విశ్వవిజేతగా నిలిపి స్పెయిన్‌లో సంబరాలకు కారణమైన మహిళా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ ఓల్గా కర్మోనా.. వ్యక్తిగతంగా తీరని శోకంలో మునిగిపోయింది. టైటిల్ సాధించామనే సంతోషంలో ఉండగానే తండ్రి ఇకలేడనే విషాదకర వార్త వినాల్సి వచ్చింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓల్గా తండ్రి శుక్రవారమే మరణించారు. నైతిక స్థైర్యానిచ్చి.. అయితే, ఓల్గా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ విషయాన్ని ఆమె వద్ద దాచారు. కెరీర్ పరంగా అత్యంత ముఖ్యమైన మ్యాచ్ ఆడాల్సి ఉన్న తరుణంలో తండ్రి చనిపోయాడన్న వార్తను ఆమెకు తెలియనీయలేదు. అంతేకాదు.. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు శనివారమే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆమెకు నైతిక స్థైర్యానిచ్చారు. ఒకే ఒక్క గోల్‌తో స్పెయిన్‌ను జగజ్జేతగా నిలిపిన ఓల్గా సంబరాలు చేసుకున్న తర్వాత.. ఈ విషాదకర వార్తను ఆమెకు తెలియజేశారు. నువ్వు గర్వపడతావని తెలుసు నాన్నా ఈ నేపథ్యంలో తండ్రిని తలచుకుంటూ ఓల్గా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘ఎవరూ సాధించలేనిది గెలిచి.. అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచేలా నాకు శక్తిని అందించావు. నువ్వు ఎక్కడున్నా నీ చల్లని చూపులు నా మీద ఉంటాయని తెలుసు. నన్ను చూసి నువ్వు గర్వపడతావని తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి నాన్నా’’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఉద్వేగపూరిత పోస్టు పెట్టింది. అంచనాలు లేకుండా బరిలో దిగి కాగా ఏమాత్రం అంచనాలు లేకుండా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు చివరకు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆట 29వ నిమిషంలో ఓల్గా కర్మోనా చేసిన గోల్‌తో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది. జగజ్జేతగా నిలిపి.. ఆట 68వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీ కిక్ రూపంలో రెండో గోల్ చేసే అవకాశం వచ్చింది. అయితే జెన్నీ హెర్మోసో కొట్టిన పెనాల్టీ షాట్‌ను ఇంగ్లండ్ గోల్‌కీపర్ మేరీ ఈర్ప్స్ ఎడమ వైపునకు డైవ్ చేస్తూ అడ్డుకుంది. మూడో ప్రయత్నంలో తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జట్టు స్కోరు సమం చేసేందుకు చివరి నిమిషం వరకు తీవ్రంగా శ్రమించింది. కానీ స్పెయిన్ డిఫెన్స్ పటిష్టంగా ఉండటంతో ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. నిర్ణీత 90 నిమిషాల తర్వాత ఇంజ్యూరీ టైమ్ రూపంలో మరో 15 నిమిషాలు అదనంగా ఆడించారు. ఈ ఉత్కంఠభరిత నిమిషాలను అధిగమిస్తూ స్పెయిన్ తమ ఆధిక్యాన్ని కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. రెండో ప్లేయర్‌గా.. స్వీడన్‌తో జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ తరఫున 89వ నిమిషంలో ఓల్గా కర్మోనా రెండో గోల్ చేసి తమ జట్టును ఫైనల్‌కు చేర్చింది. 2015లో కర్లీ లాయిడ్ (అమెరికా) తర్వాత ఒకే ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో, ఫైనల్లో గోల్ చేసిన ప్లేయర్‌గా ఓల్గా కర్మోనా గుర్తింపు పొందింది. చదవండి: జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో Y sin saberlo tenía mi Estrella antes de que empezase el partido. Sé que me has dado la fuerza para conseguir algo único. Sé que me has estado viendo esta noche y que estás orgulloso de mí. Descansa en paz, papá 🌟❤️🩹 pic.twitter.com/Uby0mteZQ3 — Olga Carmona (@7olgacarmona) August 20, 2023 -
Foot Ball World Cup: జగజ్జేతగా స్పెయిన్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం
ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2023 టోర్నీలో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 20) జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి, తొలిసారి జగజ్జేతగా నిలిచింది. మ్యాచ్ 29వ నిమిషంలో ఓల్గా క్యార్‌మోనా అద్భుతమైన గోల్ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ స్థాయి మేర రాణించలేక ఓటమిపాలైంది. ప్రపంచకప్ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించిన స్పెయిన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. మరోవైపు ఇంగ్లండ్‌కు కూడా ఇదే తొలి ఫైనల్ కావడం విశేషం. కెప్టెన్ ఓల్గా క్యార్‌మోనా సెమీఫైనల్లో, ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. సెమీఫైనల్లో చేసిన గోలే ఓల్గా క్యార్మోనాకు అంతర్జాతీయ కెరీర్లో తొలి గోల్ కావడం విశేషం. -
ఫిఫా ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా..
సిడ్నీ: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీల్లో మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కురాలిగా దక్షిణ కొరియా అమ్మాయి కేసీ పెయిర్ (16 ఏళ్ల 26 రోజులు) రికార్డు సృష్టించింది. కొలంబియాతో మంగళవారం జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లో కేసీ పెయిర్ కొరియా తరఫున 78వ నిమిషంలో బరిలోకి దిగింది. గతంలో ఈ రికార్డు ఐఫెనీ చిజ్నీ (నైజీరియా; 16 ఏళ్ల 34 రోజులు; 1999 ప్రపంచకప్‌లో) పేరిట ఉంది. చదవండి: MLC 2023: విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన క్లాసెన్.. ప్లే ఆఫ్స్‌కు ముంబై -
న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
ఆక్లాండ్: 2023 ఫిఫా మహిళల ఫుట్ బాల ప్రపంచకప్ కు వేదికైన ఆక్లాండ్ లో టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా పోలీసు అధికారులతో సహా మరో ఆరుగురు గాయాల పాలయ్యారని తెలిపారు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఉండే క్రేజే వేరు. అందులోనూ ఫిఫా ప్రపంచ కప్ అంటే అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంటుంది. తాజాగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు జంట ద్వీపదేశాల్లో వాలిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు నిర్వాహకులు. ఇదిలా ఉండగా ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ నార్వే మహిళల జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు కొద్ది గంటల ముందు ఆక్లాండ్ నగరంలో కాల్పులు బీభత్సాన్ని సృష్టించాయి. ఒక ఆగంతకుడు నిర్మాణంలో ఉన్న భవనంలోకి దూరి కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు అప్రమత్తమై వెంటనే కౌంటర్ అటాక్ చేయగా అగంతకుడి తోపాటు పోలీసుల్లో ఒకరు కూడా మృతి చెందినట్లు, మరో ఆరుగురు గాయపడియట్లు తెలిపారు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్. న్యూజిలాండ్ ప్రధాని తెలిపిన వివరాల ప్రకారం కాల్పులు జరిగినప్పుడు పోలీసులతోపాటు పౌరులు చూపిన తెగువ అసాధారణమని, మృత్యువుకి ఎదురెళ్లి వారు చేసిన సాహసం కొనియాడదగినదని అన్నారు. ఈ సందర్బంగా ఇది ఉగ్రవాద చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తవని మ్యాచ్‌లు యధాతధంగా జరుగుతాయని తెలిపారు. ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు.. -
చివరి చూపు కోసం...
సావోపాలో: బ్రెజిల్ ఆరాధ్య ఫుట్‌బాలర్ పీలేను కడసారి చూసేందుకు అభిమానులు సోమవారం ఉదయం నుంచే ఆయన పార్థివదేహం ఉంచిన విలా బెల్మిరా స్టేడియం ముందు క్యూ కట్టారు. 82 ఏళ్ల సాకర్ సూపర్‌స్టార్ గురువారం క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే! సావోపాలో శివారులో ఉన్న స్టేడియం సామర్థ్యం 16000 మాత్రమే! కానీ పెద్ద సంఖ్యలో అభిమానులు, సాంటోస్ క్లబ్ ఆటగాళ్లు, బ్రెజిల్ జాతీయ ఆటగాళ్లు తమ దిగ్గజానికి తుది నివాళులు అర్పించారు. ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినో, అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. మంగళవారం సాంటోస్ వీధుల గుండా అంతిమయాత్ర ముగించాక మెమోరియల్ నెక్రొపొలె ఎక్యుమెనికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనికి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో హాజరవుతారు. -
Pele: అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు!
ఆటే అతని లోకం... ఆటే అతని ప్రాణం... చురుకుదనంలో అతనో పాదరసం... గోల్ చేస్తే లోకమే దాసోహం... అతను డ్రిబ్లింగ్ చేస్తే బిత్తరపోవాల్సిందే... అటాకింగ్‌కు దిగితే చేతులెత్తేయాల్సిందే... ఫార్వర్డ్‌గా అతని విన్యాసాలకు సలాం కొట్టాల్సిందే... ఇంత గొప్ప ఆటగాడు ఫుట్‌బాల్‌లో ఉన్నందుకు ఆ క్రీడే మురిసింది. తమ జట్టులో ఆటగాడైనందుకు బ్రెజిల్ అదృష్టం చేసుకుంది. దీంతో ఈపాటికే అందరికి అర్థమై ఉంటుంది... అతనేవరో కాదు సాకర్ సమున్నత శిఖరం పీలే అని! నిజం... అతని ఆట అద్భుతం. అతని గోల్స్ అసాధారణం. అతని అంకితభావం నిరుపమానం. వరం పొందిన బ్రెజిల్‌కు... అంకితమైపోయిన ఫుట్‌బాల్‌కు... మెప్పించిన గోల్స్‌కు... అతనితో ఆడి అలసిన ప్రత్యర్థులకు... తమకిది భాగ్యమనుకున్న ప్రేక్షకులకు... కురిపించిన ఆదరాభిమానాలకు సెలవు చెప్పాడు పీలే! గతేడాది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడిన పీలే.. మహమ్మారి ముందు ఓడి.. 82 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. పది దేశాలు (శాశ్వత) ఆడే క్రికెట్లో విశిష్ట క్రికెటర్లు (ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్) ఎంతో మంది ఉన్నారు. కానీ రెండొందల దేశాలు ఆడే ఫుట్‌బాల్ లో మాత్రం అత్యుత్తమ ఆటగాళ్లు అతికొద్ది మందే! అదికూడా వేళ్లమీద లెక్కపెట్టేంత మందే సాకర్ సూపర్స్టార్లు ఉన్నారు. వారిలో పీలే మాత్రం కచ్చితంగా అగ్రగణ్యుడు అంటే ఆశ్చర్యం, అతిశయోక్తి లేనేలేదు. అందుకే అతన్ని ‘ద కింగ్’ అంటారు. బంతి మైదానంలో పారాడితే కాళ్లతో డ్రిబ్లింగ్... గాల్లో ఉంటే ఛాతీతో కంట్రోల్... గోల్‌పోస్ట్ వద్ద ఎగిరొస్తే హెడర్... కింది నుంచి పాస్ అయితే చక్కని కిక్ షాట్... ఇలా బంతి ఎటునుంచి వచ్చినా... తన చుట్టు అడుగడుగునా ప్రత్యర్థులు మాటువేసినా... డిఫెండర్లు గోడ కట్టినా... గోల్ కీపర్ కంచెలా నిలుచున్నా... పీలే కచ్చితమైన లక్షిత షాట్‌ను ఎవరూ అడ్డుకోలేదు. అంతటి మంత్రముగ్ధమైన ప్రదర్శనతో, ప్రత్యర్థి శిబిరాన్ని నిశ్చేష్టుల్ని చేసే ఆటతీరుతో గోల్స్ కొట్టే నైపుణ్యం పీలేకు మాత్రమే సాధ్యం. అచ్చుతప్పు పిలుపుతో... మినాస్ గెరయిస్ రాష్ట్రంలోని చిన్న గ్రామం ట్రెస్ కొరకోస్లో 1940 అక్టోబర్ 23న జన్మించిన పీలే అసలు పేరు అది కాదు. నిజానికి అది పేరులోంచి తెచ్చుకున్న పదం కూడా కాదు. పీలే పేరు... ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో! ఇతనికి ఫుట్‌బాల్ అంటే పిచ్చి. తండ్రి ఫుట్‌బాలర్ కావడంతో ఆ పిచ్చి కాస్త వయసుతో పాటే పెరిగింది. 11 ఏళ్ల ప్రాయంలో అతని నైపుణ్యాన్ని గుర్తించిన స్థానిక ప్రొఫెషనల్ ప్లేయర్ ఒకరు సాంటోస్ యూత్ క్లబ్లో చేర్పించాడు. అచిరకాలంలోనే సీనియర్ జట్టులోకి వచ్చేశాడు. స్కూల్లో చదివే రోజుల్లో వాస్కోడి సావో లౌరెంకో క్లబ్ గోల్ కీపర్ ‘బిలే’ పీలే ఫేవరెట్ ఆటగాడు. అతడిని ‘బీలే’గా కాకుండా పీలేగా తప్పుగా పిలిచేవారు. ఆ తర్వాత సహచర విద్యార్థులు ఈ పేరును పీలేకు పెట్టేశారు. ఆ పేరు ఇప్పుడు ఫుట్‌బాల్ చరిత్రలో చెరగని సంతకం చేసింది. అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! ఆతని ఆటన్న... అతనికి ఉన్న క్రేజన్న ఎంటో ఈ ఒక్క ఉదంతంతో తెలుస్తుంది. 1969లో నైజీరియా అంతటా అంతర్యుద్దంతో అట్టుడుకుతోంది. పీలే అప్పటికే విశ్వవ్యాప్త ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు. కానీ ఏమూలో అనుమానం... ఈ అగ్గితో సాంటోస్ క్లబ్, స్టేషనరీ స్పోర్ట్స్ క్లబ్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుందా? అని... అయితే ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ నైజీరియాలోని రెండు వర్గాలు పీలే ఆట కోసం విరామం ప్రకటించాయి. దీంతో కాసేపు అంతర్యుద్దం అటకెక్కగా ... ఆట మైదానంలో ఉరకలెత్తించింది. అట్లుంటది పీలేతోని! ఖాళీగా కూర్చోలేదు రిటైర్మెంట్ తర్వాత... ఇన్ని పేరు ప్రఖ్యాతలు, అవార్డులు, రివార్డులు సాధించాక ఇక ఆటపాట నాకెందుకని ప్రశాంతంగా కూర్చోలేదు. ఆటగాడిగా బిజీగా గడిపిన తర్వాత డాక్యుమెంటరీ నటుడిగాను మెప్పించాడు. ఆల్బమ్‌లను రూపొందించాడు. పలు ఆటోబయోగ్రఫీలను కూడా ప్రచురించాడు. వ్యాపారవేత్తగాను విజయవంతమయ్యాడు. అనంతరం ఈ విశిష్ట ఫుట్‌బాలర్‌ను 1994లో యునెస్కో గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. మరుసటి ఏడాది బ్రెజిల్ అధ్యక్షుడు... తమ దేశ క్రీడల మంత్రిగాను నియమించారు. 1997లో క్వీన్ ఎలిజబెత్ –2 చేతుల మీదుగా ‘నైట్‌హుడ్’ను కూడా అందుకున్నాడు. ఇంత చేసినా... ఇతనికి తప్పలేదు ఫుట్‌బాల్ ఆట ప్రభను పెంచి... బ్రెజిల్ సాకర్ సత్తాను చాటి... క్రీడకే నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన పీలేకు ‘నల్లజాతి’ అవమానాలు తప్పలేదు. అభిమానులు, సాకర్ లోకం అతన్ని వేనోళ్ల స్తుతిస్తే మతిలేని మంద, గిట్టని ప్రబుద్ధులు కొందరు అతని వర్ణం సాకుతో గేలిచేశారు. నల్ల కోతిలాంటి వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టేవారు. కానీ దీపం మండే కొద్దీ వెలుగును ప్రభవించినట్లే... ఆడే కొద్దీ తన ఆటతీరుతో పీలే ఫుట్‌బాల్ క్రీడకే వన్నె తెచ్చాడు తప్ప తలొగ్గే పని, తలదించుకునే పని ఏనాడూ చేయలేదు. మూడు వరల్డ్‌కప్ విజయాల్లో... బ్రెజిల్ జట్టులోకి రాగానే తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో పీలే కీలక ఆటగాడిగా మారాడు. దీంతో 16 ఏళ్లకే 1956లో బ్రెజిల్ జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. మైదానంలో మెరికలాంటి ఆటతో అందరికంటా పడ్డాడు. 1958 ప్రపంచకప్ కోసం స్వీడన్‌కు రిజర్వ్ ఆటగాడిగా వెళ్లిన పీలే కీలక ఆటగాడిగా స్వదేశానికి తిరిగొచ్చాడు. 17 ఏళ్ల టీనేజ్‌లో ప్రపంచకప్ లో అరంగేట్రం చేసిన పీలే బ్రెజిల్ చాంపియన్‌షిప్‌లో కీలకభూమిక పోషించాడు. మరో ప్రపంచకప్ (1962) నాటికి స్టార్ హోదాతో బరిలోకి దిగాడు. తన జట్టు టైటిల్ నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన పీలే తన కొచ్చిన ‘స్టార్ డమ్’కు న్యాయం చేశాడు. రెండో ప్రపంచకప్ విజయంలో భాగమయ్యాడు. 1966 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ అయిన బ్రెజిల్ గ్రూప్ దశలోనే వెనుదిరగడం, తదనంతర పరిస్థితులతో అదే తన చివరి ప్రపంచకప్ అని పీలే ప్రకటించాడు. తర్వాత మనసు మార్చుకున్న ఈ దిగ్గజం 1970 ప్రపంచకప్ ఆడి బ్రెజిల్ విజయానికి బాట వేశాడు. అలా 14 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 12 గోల్స్ చేశాడు. మూడు ప్రపంచకప్ విజేత జట్లలో భాగమైన ఏకైక ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. 3: పీలే గెలిచిన ప్రపంచకప్‌ల సంఖ్య. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ టైటిల్స్ నెగ్గడంలో పీలే కీలకపాత్ర పోషించాడు. మూడు ప్రపంచకప్‌లు సాధించిన ఒకే ఒక్క ఫుట్‌బాలర్‌గా పీలే రికార్డు నెలకొల్పాడు. 17: బ్రెజిల్ తొలిసారి 1958లో విశ్వవిజేతగా నిలిచినపుడు జట్టులో సభ్యుడిగా ఉన్న పీలే వయస్సు. ప్రపంచకప్‌లో పాల్గొన్న, ప్రపంచకప్‌ను సాధించిన పిన్న వయస్సు ప్లేయర్‌గా పీలే పేరిట ఉన్న రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కెరీర్ విశేషాలు 92: అధికారిక, అనధికారిక మ్యాచ్‌ల్లో కలిపి పీలే సాధించిన ‘హ్యాట్రిక్’ల సంఖ్య. 30: మ్యాచ్‌లో పీలే నాలుగు గోల్స్ చొప్పున 30 సార్లు సాధించాడు. 1283: పీలే 1954 నుంచి 1977 మధ్య కాలంలో అధికారిక, అనధికారిక, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కలిపి మొత్తం 1363 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 1283 గోల్స్ సాధించాడు. 6: మ్యాచ్‌లో పీలే కనీసం ఐదు గోల్స్ చొప్పున ఆరుసార్లు నమోదు చేశాడు. 77: బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున 92 మ్యాచ్‌లు ఆడి పీలే చేసిన గోల్స్. 12: ప్రపంచకప్ టోర్నీలలో పీలే సాధించిన గోల్స్. వ్యక్తిగత వివరాలు జన్మదినం: అక్టోబర్ 23, 1940 ఎక్కడ: ట్రెస్ కొరకోస్, బ్రెజిల్. అసలు పేరు: ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జొవో రామోస్ నాసిమియాంటో. పెళ్లిళ్లు 3: రోజ్మెరి (1966–78), అసిరియా (1994–2010), మార్సియా (2016 నుంచి) సంతానం: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (మృతి), ఫ్లావియా, జోషువా, సెలెస్టె. పీలేకు ప్రముఖుల నివాళులు ►ఆటను అందంగా తీర్చిదిద్దిన యోధుడు. ఫుట్‌బాల్‌ను కళాత్మకంగా మార్చిన లెజెండ్ పీలే. –నెమార్ జూనియర్ (బ్రెజిల్) ►ఆల్‌టైమ్ సాకర్ సూపర్ స్టార్ పీలే. మీరే మా అందరికీ స్ఫూర్తి. –మెస్సీ (అర్జెంటీనా) ►సాకర్ స్టార్, ఫుట్‌బాల్ కింగ్ పీలే ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత. నాపై మీరు కురిపించిన ప్రేమానురాగాలు నేనెప్పటికీ మరచిపోలేను. –క్రిస్టియానో రొనాల్డో ►(పోర్చుగల్) అతడిక లేడన్నది చేదు నిజం... కానీ అతని ఆట చిరస్మరణీయం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్ పీలే. –ఎంబాపే (ఫ్రాన్స్) ►స్పోర్టింగ్ లెజెండ్ పీలే. ఫుట్‌బాల్ కింగ్‌కు ఘనమైన నివాళి. – బోల్ట్ (దిగ్గజ స్ప్రింటర్) ►పీలే లేని లోటు పూడ్చలేనిది. తన ఆటతో, అద్భుత విన్యాసాలతో ఎల్లలెరుగని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అతని స్ఫూర్తిమంతమైన జీవితం భావి తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. –భారత ప్రధాని మోదీ చదవండి: Pak Vs NZ 1st Test: ఫలితం రాబట్టాలనుకున్నాం.. కానీ! పాక్ అలా బతికిపోయింది! Pele Old Goals Video: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే -
పీలే క్రేజ్‌కు ఉదాహరణ.. షూ లేస్ కట్టుకున్నందుకు రూ.కోటి
బ్రెజిల్‌కి మూడు ఫిఫా వరల్డ్ కప్స్ (1958, 1962, 1970) అందించిన పీలే... బ్రాండ్స్‌కి మార్కెటింగ్ చేయడంలోనూ తన మార్కు చూపించారు. రెండు ప్రపంచ కప్స్ గెలిచిన తర్వాత పీలే ఫిఫా వరల్డ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా వెలుగొంతున్న సమయంలో ఆయనతో బ్రాండ్ ప్రమోషన్ చేయించాలని కంపెనీలన్నీ క్యూ కట్టాయి. 1970లో స్పోర్ట్స్ షూస్ కంపెనీ పూమా, పీలేతో బ్రాండ్ ప్రమోషన్‌కి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సాధారణంగా ప్రమోట్ చేస్తే కుదురదని బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ వినూత్న ప్లాన్‌ను వాడింది పూమా. 1970 వరల్డ్ కప్ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పూమా, తన షూ లేస్‌ని కట్టుకోవడం మొదలెట్టాడు.. అంతే కంపెనీకి కోట్ల రూపాయాల్లో టర్నోవర్ వచ్చింది. కేవలం మ్యాచ్ ఆరంభానికి ముందు షూ లేస్ కట్టుకున్నందుకు 120000 డాలర్లు (దాదాపు కోటి రూపాయల వరకూ) పీలేకి ముట్టచెప్పింది పూమా కంపెనీ. మ్యాచ్ సమయంలో పీలే షూ లేస్ కట్టుకోవడం వల్ల పూమా కంపెనీకి కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అప్పట్లో పీలేకి ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే... తన సుదీర్ఘ కెరీర్లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన పీలే... 1363 మ్యాచులు ఆడి 1283 గోల్స్ సాధించాడు. బ్రెజిల్ తరుపున 77 అంతర్జాతీయ గోల్స్ సాధించిన పీలే.. 1959లో ఒకే ఏడాదిలో 127 గోల్స్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. చదవండి: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే 'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి? -
పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారారు. పీలే తన అటాకింగ్ స్కిల్స్‌తో ఫిఫా ప్రపంచాన్ని ఊపేశారు. తన డ్రిబ్లింగ్ ట్యాలెంట్‌తో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించేవాడు. గోల్ పోస్టునే టార్గెట్ చేస్తూ ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచుల్లో పీలే మొత్తం 12 గోల్స్ చేశాడు. పీలే కొట్టిన టాప్-10 అద్భుతమైన గోల్స్‌ను ఒకసారి చూసేయండి. ►17 ఏళ్ల వయసులో పీలే ఓ వండర్ చేశాడు. 1958లో బ్రెజిల్‌కు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించాడు. ఆ టైటిల్‌తో ఆగలేదతను. పీలేలో ఉన్న గోల్ స్కోరింగ్ సామర్థ్యం అందర్నీ స్టన్ చేసేది. ఆ ఏడాది ఫ్రాన్స్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. ► 1970వ సంవత్సరం పీలే కెరీర్లో ఓ మలుపురాయి లాంటింది. ఆ ఏడాది ఫిఫా వరల్డ్‌కప్‌ను కలర్లో టెలికాస్ట్ చేశారు. కొత్త టెక్నాలజీతో మ్యాచ్‌లను ప్రేక్షకులు వీక్షించారు. ఇక ఆ పీలే జోరును కూడా ప్రేక్షకులు కళ్లార్పకుండా చూశారు. యెల్లో జెర్సీలో పీలే చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ టోర్నీలో ఇటలీతో జరిగిన ఫైనల్లో బ్రెజిల్ 4-1 తేడాతో నెగ్గింది. ఆ విజయంలో పీలే కీలక పాత్ర పోషించాడు. ► 1982లో బ్రెజిల్ మళ్లీ టైటిల్‌ను గెలుచుకున్నది. ఆ జట్టులో పీలే ఉన్నాడు. కానీ ఆ టోర్నీలో అతను కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయం వల్ల టోర్నీలోని మిగితా మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. 1966 టోర్నీలో బ్రెజిల్ గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయ్యింది. One of the greatest to ever play the game 🇧🇷⚽️ Join us in wishing the legendary @Pele a very Happy Birthday 🥳 pic.twitter.com/hwuU3d1Ufh — FIFA World Cup (@FIFAWorldCup) October 23, 2022 చదవండి: అసమాన ఆటతీరుకు సలాం.. చెక్కుచెదరని రికార్డులకు గులాం 'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి? Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ -
Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ
అది 1950 ఫిఫా వరల్డ్‌కప్.. ఆతిథ్య దేశం బ్రెజిల్, ఉరుగ్వే మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్లో ఉరుగ్వే చేతిలో ఓడిన బ్రెజిల్ రన్నరప్‌గా నిలిచింది. బ్రెజిల్ ఓడిపోవడం చూసి ఒక వ్యక్తి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఆయన పక్కనే ఉన్న ఒక పదేళ్ల పిల్లాడు కూడా ఆ వ్యక్తి అలా ఏడ్వడం చూసి తట్టుకోలేకపోయాడు. ఆ పదేళ్ల పిల్లాడు మరెవరో కాదు.. ఫుట్‌బాల్ లెజెండరీ ఆటగాడు.. పీలే. బ్రెజిల్‌కు మూడుసార్లు ఫిఫా వరల్డ్‌కప్ అందించి హీరోగా నిలిచాడు. ఇక పీలే పక్కనున్న వ్యక్తి ఇంకెవరో కాదు స్వయానా ఆయన తండ్రి డోండిన్హో. తన పదేళ్ల వయసులో నాన్న గుక్కపట్టి ఏడ్వడం గమనించిన పీలే.. నాన్న ఏడ్వకు.. ఈరోజు నీకు మాట ఇస్తున్నా.. బ్రెజిల్‌కు కచ్చితంగా వరల్డ్‌కప్ అందించి తీరుతా అని పేర్కొన్నాడు. అప్పటికే పదేళ్ల వయసు మాత్రమే ఉన్న పీలే మాటలు తండ్రికి నమ్మశక్యంగా అనిపించలేదు. 1958 ఫిఫా ఫైనల్ గెలిచిన అనంతరం పీలే కట్‌చేస్తే.. ఎనిమిది సంవత్సరాల తర్వాత 1958 ఫిపా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది పీలేనే. తండ్రికిచ్చిన మాటను నిలబ్టెట్టుకోవాలని మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగాడు. ఆ వరల్డ్‌కప్‌లో పీలే మొత్తంగా ఆరు గోల్స్ చేశాడు. సెమీఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన పీలే ఫైనల్స్‌లోనే రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అప్పటికి పీలే వయస్సు కేవలం 17 ఏళ్లు మాత్రమే. 17 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్‌లో సంచలనాలు సృష్టించిన పీలే ఆ తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 1958 ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని తీసుకెళ్లి తండ్రికి అందించాడు. ఆ సమయంలో పీలే తండ్రి దోహిన్హో పీలేను హత్తుకొని కన్నీరు కార్చడం ప్రతీ ఒక్కరి గుండెలను కదిలించింది. తన పదేళ్ల వయసులో ఫిఫా వరల్డ్‌కప్ రాలేదని తండ్రి ఏడ్వడం చూసిన పీలే.. తన తండ్రి మరోసారి అలా ఏడ్వకూడదని నిశ్చయించుకున్నాడు. అందుకే కడు పేదరికంలో పెరిగినప్పటికి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గాలనే లక్ష్యంతోనే ఎన్ని కష్టాలొచ్చినా వాటిని బరిస్తూ ముందుకు కదిలాడు. ఆ తర్వాతి ఎనిమిదేళ్లలో ఫుట్‌బాల్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగి తండ్రి కోరికను సాకారం చేసి గొప్ప కొడుకు అనిపించుకున్నాడు. -
దివికేగిన దిగ్గజం.. బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే అరుదైన ఫోటోలు
-
ఫిఫా వరల్డ్‌కప్ స్క్రీనింగ్‌లో విషాదం.. ఐదో అంతస్తు నుంచి జారిపడి బాలుడి మృతి
సాక్షి, ముంబై: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ స్క్రీనింగ్ విషాదంగా మారింది. మూడేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ముంబై మెరీన్ డ్రైవ్‌లోని గర్వారే క్లబ్లో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెరీన్ డ్రైవ్‌పోలీసుల వివరాల ప్రకారం.. క్లబ్ ఉపాధ్యక్షుడు బీజేపీ నేత రాజ్‌పురోహిత్ ఆదివారం సాయంత్రం ఫ్రాన్స్ అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. క్లబ్లో సభ్యుడైన అవినాష్ రాథోడ్‌కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. ఆరో అంతస్తులో స్క్రీనింగ్ జరుగుతుండగా 400 మంది సభ్యులు చూస్తున్నారు. రాత్రి 10.40 గంటల సమయంలో చిన్నారి హృద్యాంశ్ రాథోడ్ బాత్రూమ్ కోసమని 11 ఏళ్ల వయసున్న ఓ బాబుతో కలిసి ఐదో అంతస్తుకు వచ్చాడు. అనంతరం ఆరో అంతస్తులోకి వస్తుండగా మెట్లమీద నుంచి జారి అదుపుతప్పి కిందపడిపోయాడు. మెట్ల రెయిలింగ్‌ను గాజుతో తయారు చేయగా.. అందులో ఒక గాజు రిపేర్‌కు వచ్చింది. ఆ గ్లాస్ భాగం నుంచే చిన్నారి పడిపోవడం గమనార్హం. ఒకేసారి పెద్ద చప్పుడు రావడంతో వెంటనే వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి చూడగా చిన్నారని రెయిలింగ్ ఖాళీ స్థలంలో కింద పడిపోయి ఉన్నాడు. 11 గంటలకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 2 గంటలకు చిన్నారి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (బెంగళూరులో విషాదం.. విగతజీవులుగా తల్లీ, కొడుకు, కూతురు) -
అర్జెంటీనా సారథి మెస్సీ అందమైన కుటుంబం (ఫొటోలు)
-
FIFA World Cup Qatar 2022 Second Semi-Final: ఫైనల్‌కు ‘ఫ్రెంచ్ కిక్’
ఎట్టకేలకు మొరాకో తన ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకుంది. మేటి జట్లకే కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఆఫ్రికా జట్టు చివరకు సెమీఫైనల్లో ఓడింది. సంచలనానికి ఛాన్స్ ఇవ్వని ఫ్రాన్స్ నిర్ణీత సమయంలోనే విజయం సాధించింది. ‘డిఫెండింగ్ చాంపియన్’ వరుసగా రెండో ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిజానికి మొరాకో ఆషామాషీగా తలొగ్గలేదు. గోల్ కోసం ఆఖరి ఇంజ్యూరీ టైమ్ దాకా శ్రమించింది. మైదానం మొత్తం మీద ఫ్రాన్స్ స్ట్రయికర్లకు దీటుగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై గురి పెట్టినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. మరోవైపు ఫ్రాన్స్... ఈ టోర్నీలోనే కొరకరాని కొయ్యను ఐదో నిమిషంలోనే దారికి తెచ్చుకుంది. ద్వితీయార్ధంలో ఎదురులేని విజయానికి స్కోరును రెట్టింపు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్‌కు వచ్చి తమ అద్భుత పోరాటపటిమతో తమకంటే ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టించిన మొరాకో ఇక మూడో స్థానం కోసం శనివారం గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తలపడుతుంది. దోహా: అర్జెంటీనా ఫైనల్ ప్రత్యర్థి ఎవరో తేలింది. ఇక ఆఖరి సమరమే మిగిలుంది. విజేత ఎవరో... రన్నరప్‌గా మిగిలేదెవరో ఆదివారం రాత్రి తెలుస్తుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ 2–0 గోల్స్ తేడాతో ఈ టోర్నీలో మింగుడు పడని ప్రత్యర్థి మొరాకోను ఓడించి ఫైనల్ చేరింది. మ్యాచ్ 5వ నిమిషంలో థియో హెర్నాండెజ్... 79వ నిమిషంలో ‘సబ్‌స్టిట్యూట్’ రాన్‌డల్ కొలొముని ఫ్రాన్స్ జట్టుకు చెరో గోల్ అందించారు. 78వ నిమిషంలోనే మైదానంలోకి వచ్చిన సబ్‌స్టిట్యూట్ రాన్‌డల్ 44 సెకన్లలోనే గోల్ చేయడం విశేషం. ఈ మెగా టోర్నీలోనే నిర్ణీత సమయంలో క్వార్టర్స్ దాకా ప్రత్యర్థులెవరికీ గోల్ ఇవ్వని మొరాకో సెమీస్‌లో రెండు గోల్స్ ఇవ్వడమే కాకుండా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మొరాకో గత మ్యాచ్‌లకి, తాజా సెమీఫైనల్స్‌కు ఇదొక్కటే తేడా! దీని వల్లే సంచలనం, టైటిల్ సమరం రెండు సాకారం కాలేకపోయాయి. ఆట మొదలైన కాసేపటికే ఫ్రాన్స్ పంజా విసరడం మొదలు పెట్టింది. గ్రీజ్మన్ ‘డి’ ఏరియాలో బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్ సమీపానికి తీసుకెళ్లాడు. కానీ క్రాస్ షాట్ కష్టం కావడంతో కిలియాన్ ఎంబాపెకు క్రాస్ చేశాడు. కానీ అతని షాట్ విఫలమైంది. అక్కడే గుమిగూడిన మొరాకో డిఫెండర్లు అడ్డుకున్నారు. అయితే బంతి మాత్రం అక్కడక్కడే దిశ మార్చుకుంది. గోల్‌పోస్ట్‌కు కుడివైపు వెళ్లగా అక్కడే ఉన్న థియో హెర్నాండెజ్ గాల్లోకి ఎగిరి ఎడమ కాలితో కిక్ సంధించాడు. దీన్ని ఆపేందుకు గోల్ కీపర్ యాసిన్ బోనో అతని ముందుకెళ్లగా... మొరాకో కెప్టెన్ రొమెయిన్ సైస్, అచ్రాఫ్ డారి గోల్‌పోస్ట్‌ను కాచుకున్నారు. అయినా సరే హెర్నాండెజ్ తన ఛాతీ ఎత్తున ఉన్న బంతిని ఎడమ కాలితో తన్ని లక్ష్యానికి చేర్చాడు. ఆఖరి క్షణంలో గోల్పోస్ట్లోనే ఉన్న అచ్రాఫ్ డారి దాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడు. కానీ అతని కుడి మొకాలికి వెంట్రుకవాసి దూరంలోనే బంతి గోల్ అయ్యింది. ఫ్రాన్స్ 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరో 5 నిమిషాల వ్యవధిలోనే... మొరాకోకు ఆట పదో నిమిషంలో సమం చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘డి’ ఏరియా వెలుపలి నుంచి అజెడైన్ వొవునహి ఫ్రాన్స్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా లాంగ్‌షాట్ కొట్టాడు. ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ ఎడమ చేతితో అడ్డుకున్నప్పటికీ బంతి రీబౌండ్ అయింది. కానీ సమీపంలో తిరిగి షాట్ కొట్టే మొరాకో స్ట్రయికర్లు ఎవరూ లేకపోవడంతో గోల్ అవకాశం త్రుటిలో చేజారింది. 17వ నిమిషంలో ఫ్రాన్స్ స్కోరు రెట్టింపయ్యే ఛాన్స్ కూడా మిస్సయ్యింది. ఒలివియర్ జిరూడ్ మెరుపు వేగంతో మొరాకో ‘డి’ ఏరియాలోకి దూసుకొచ్చి బలంగా కొట్టిన షాట్ ప్రత్యర్థి గోల్‌కీపర్ కూడా ఆపలేకపోయాడు. కానీ బంతి గోల్‌పోస్ట్ కుడివైపున బార్ అంచును తాకి బయటికి వెళ్లిపోయింది. మళ్లీ 36వ నిమిషంలోనూ ఫ్రాన్స్ ఆటగాడు జిరూడ్ గట్టిగానే ప్రయత్నించాడు. వాయువేగంతో కొట్టిన షాట్‌ను మొరాకో డిఫెండర్ జవాద్ ఎల్ యామిక్ కళ్లు చెదిరే కిక్‌తో అడ్డుకున్నాడు. లేదంటే బంతి బుల్లెట్ వేగంతో గోల్‌పోస్ట్‌లోకి వెళ్లేది! 44వ నిమిషంలో కార్నర్‌ను గోల్‌పోస్ట్ కుడివైపున ఉన్న జవాద్ ఎల్ యామిక్ చక్కగా తనను తాను నియంత్రించుకొని బైసైకిల్ కిక్ కొట్టాడు. దాదాపు గోల్ అయ్యే ఈ షాట్‌ను ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ కుడి వైపునకు డైవ్ చేసి చేతితో బయటికి పంపించాడు. ద్వితీయార్ధంలోనూ మొరాకో గోల్స్ కోసం అదేపనిగా చేసిన ప్రయత్నాల్ని ఫ్రాన్స్ ఆటగాళ్లు ఎక్కడికక్కడ కట్టడి చేసి అడ్డుకున్నారు. 78వ నిమిషంలో రాన్‌డల్ మైదానంలోకి వచ్చాడు. అప్పుడే సహచరులు మార్కస్ తురమ్, ఎంబాపెలు మొరాకో ‘డి’ ఏరియాలో పరస్పరం పాస్ చేసుకొని గోల్‌పై గురి పెట్టారు. కానీ డిఫెండర్లు చుట్టుముట్టడంతో గోల్‌పోస్ట్‌కు మరింత సమీపంలో ఉన్న రాన్డల్కు ఎంబాపె క్రాస్పాస్ చేశాడు. 79 నిమిషంలో రాన్‌డల్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సులువుగా గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో ఫ్రాన్స్ ఆధిక్యం రెట్టింపైంది. మొరాకో విజయంపై ఆశలు వదులుకుంది. 4: ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఫ్రాన్స్ నాలుగోసారి (1998, 2006, 2018, 2022) ఫైనల్ చేరింది. రెండుసార్లు (1998, 2018) విజేతగా నిలిచింది. 5: వరుసగా రెండు అంతకంటే ఎక్కువసార్లు ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన ఐదో జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962), నెదర్లాండ్స్ (1974, 1978), పశ్చిమ జర్మనీ (1982, 1986), బ్రెజిల్ (1994, 1998, 2002) ఈ ఘనత సాధించాయి. 4: తమ జట్టును వరుసగా రెండు ప్రపంచకప్ లలో ఫైనల్‌కు చేర్చిన నాలుగో కోచ్‌గా ఫ్రాన్స్‌కు చెందిన దిదీర్ డెషాంప్ గుర్తింపు పొందాడు. గతంలో విటోరియో పోజో (ఇటలీ; 1934, 1938), కార్లోస్ బిలార్డో (అర్జెంటీనా; 1986, 1990), బెకన్బాయెర్ (జర్మనీ; 1986, 1990) ఈ ఘనత సాధించారు. 1998లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో డెషాంప్ ప్లేయర్‌గా ఉన్నాడు. అనంతరం 2018లో విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు ఆయనే కోచ్‌గా ఉన్నారు. 3: ప్రపంచకప్ చరిత్రలో సబ్‌స్టిట్యూట్‌గా ఫాస్టెస్ట్ గోల్ చేసిన మూడో ప్లేయర్‌గా రాన్‌డల్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు. మొరాకోతో మ్యాచ్‌లో అతను సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన 44 సెకన్లకే గోల్ చేశాడు. ఈ జాబితాలో రిచర్డ్ మొరాలెస్ (ఉరుగ్వే; 2002లో సెనెగల్పై 16 సెకన్లలో), ఎబ్బీ సాండ్ (డెన్మార్క్; 1998లో నైజీరియాపై 26 సెకన్లలో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
FIFA World Cup Qatar 2022 Semi-Final: మెస్సీ మాయ...
అంతా తానై జట్టును ముందుడి నడిపిస్తున్న లయెనెల్ మెస్సీ తన ‘ప్రపంచకప్’ కలను నిజం చేసుకోవడానికి మరో విజయం దూరంలో నిలిచాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లో మెస్సీ కెప్టెన్సీలోనే అర్జెంటీనా 0–3తో క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. నాలుగేళ్ల తర్వాత మెస్సీ సారథ్యంలోనే క్రొయేషియాపై అర్జెంటీనా 3–0తో ప్రతీకార విజయం సాధించింది. ఆనాడు అంతగా ప్రభావం చూపని మెస్సీ ఈసారి మాత్రం విశ్వరూపమే ప్రదర్శించాడు. మైదానం మొత్తం పాదరసంలా కదులుతూ క్రొయేషియా డిఫెండర్లకు చుక్కలు చూపించాడు. ఒక గోల్ చేయడంతోపాటు తనను ఆరాధ్యంగా భావించే 22 ఏళ్ల జూలియన్ అల్వారెజ్‌కు రెండు గోల్స్ చేయడానికి సహకరించాడు. ఫలితంగా అర్జెంటీనా ఆరోసారి ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1986లో చివరిసారి విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా మళ్లీ జగజ్జేత కావడానికి గెలుపు దూరంలో ఉంది. దోహా: గతంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఐదుసార్లూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అర్జెంటీనా అదే ఆనవాయితీని కొనసాగించింది. ఆరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ ఆడిన మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా అద్భుత ఆటతీరుతో క్రొయేషియా అడ్డంకిని అధిగమించి దర్జాగా ఆరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 88,966 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన లుసైల్ స్టేడియంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా 3–0 గోల్స్ తేడాతో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (34వ ని.లో) ఒక గోల్ చేయగా... జూలియన్ అల్వారెజ్ (39వ, 69వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, మొరాకోజట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఈనెల 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనా తలపడుతుంది. అర్జెంటీనా 1978, 1986లలో ప్రపంచ చాంపియన్‌గా... 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. పక్కా ప్రణాళికతో... నాకౌట్ మ్యాచ్‌ల్లో రక్షణాత్మకంగా ఆడుతూ ప్రత్యర్థికి గోల్స్ ఇవ్వకుండా చివర్లో షూటౌట్లో విజయం సాధించడం క్రొయేషియా అలవాటుగా మార్చుకుంది. ఆరంభంలోనే గోల్స్ చేసి క్రొయేషియాను ఒత్తిడికి నెట్టాలనే వ్యూహంతో అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ వ్యూహం ఫలితాన్నిచ్చింది. ఆట 34వ నిమిషంలో ‘డి’ ఏరియాలో అల్వారెజ్ను క్రొయేషియా గోల్‌కీపర్ లివకోవిచ్ మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. మెస్సీ ఎడమ కాలితో కొట్టిన షాట్ బుల్లెట్ వేగంతో క్రొయేషియా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. అర్జెంటీనా 1–0తో ఆధిక్యం సంపాదించింది. ఐదు నిమిషాల తర్వాత అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ చేరింది. మధ్య భాగంలో ఉన్న మెస్సీ బంతిని అల్వారెజ్‌కు పాస్ ఇవ్వగా అతను వాయువేగంతో క్రొయేషియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ‘డి’ ఏరియాలోకి వచ్చాడు. అదే జోరులో గోల్కీపర్ను తప్పిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. విరామ సమయానికి అర్జెంటీనా 2–0తో ముందంజలో నిలిచింది. తక్కువ అంచనా వేయకుండా... నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 2–0తో ఆధిక్యంలో నిలిచినా చివర్లో తడబడి రెండు గోల్స్ సమర్పించుకొని చివరకు షూటౌట్లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. ప్రమాదకరమైన క్రొయేషియా జట్టుకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అర్జెంటీనా రెండో అర్ధభాగంలోనూ జాగ్రత్తగా ఆడింది. బంతి ఎక్కువ శాతం క్రొయేషియా ఆటగాళ్ల ఆధీనంలో ఉన్నప్పటికీ వారిని ‘డి’ ఏరియా వరకు రానివ్వకుండా చేయడంలో అర్జెంటీనా డిఫెండర్లు సఫలమయ్యారు. మ్యాచ్ మొత్తంలో క్రొయేషియా కేవలం రెండుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టడం గమనార్హం. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిచ్, పెరిసిచ్, బ్రోజోవిచ్, కొవాసిచ్లను అర్జెంటీనా డిఫెండర్లు సమర్థంగా నిలువరించారు. వారెవ్వా.. ఏమి గోల్..... ఆట 57వ నిమిషంలో అర్జెంటీనా ఖాతాలో మూడో గోల్ చేరేదే కానీ మెస్సీ కొట్టిన షాట్‌ను గోల్‌పోస్ట్ ముందు గోల్‌కీపర్ లివకోవిచ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత 69వ నిమిషంలో అద్భుతమే జరిగింది. తనదైన రోజున తానెంత ప్రమాదకర ప్లేయర్‌నో మెస్సీ నిరూపించాడు. కుడి వైపున బంతి అందుకున్న మెస్సీ పాదరసంలా కదులుతూ ముందుకు వెళ్లగా... అతని వెంబడే క్రొయేషియా డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ పరుగెత్తాడు. గ్వార్డియోల్ అన్ని రకాలుగా మెస్సీని నిలువరించాలని చూసినా... ఈ అర్జెంటీనా స్టార్ మాత్రం కనువిందులాంటి డ్రిబ్లింగ్‌తో అలరించాడు. చివరకు గోల్‌లైన్ అంచుల్లోంచి గ్వార్డియోల్ కాళ్ల సందులోంచి బంతిని మెస్సీ క్రాస్ పాస్ ఇవ్వగా... అక్కడే ఉన్న అల్వారెజ్ నేర్పుతో బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ గోల్‌ను కళ్లారా చూసిన వారందరూ మెస్సీ మ్యాజిక్కు ఫిదా అయిపోవడమే కాకుండా ఈ గోల్‌ను చిరకాలం గుర్తుంచుకుంటారు. అర్జెంటీనా ఆధిక్యం 3–0కు పెరగడంతో క్రొయేషియా విజయంపై ఆశలు వదులుకుంది. మరోవైపు అర్జెంటీనా చివరి వరకు దూకుడును కొనసాగిస్తూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో చివరిసారిగా... ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తనకు చివరి వరల్డ్‌కప్ అవుతుందని అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ అధికారికంగా ప్రకటించాడు. 2006 నుంచి వరుసగా ఐదు ప్రపంచకప్‌లు ఆడిన మెస్సీ, తన ఆఖరి పోరులో గెలిచి చరిత్రకెక్కాలని పట్టుదలగా ఉన్నాడు. ‘నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించబోతున్నాను. నా చివరి మ్యాచ్‌గా ఫైనల్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మరోసారి వరల్డ్‌కప్ అంటే చాలా దూరంలో ఉంది. నేను అప్పటి వరకు ఆడలేనని తెలుసు. వరల్డ్‌కప్‌లో వేర్వేరు రికార్డులు నా దరిచేరడం మంచిదే. కానీ అన్నింటికంటే ముఖ్యం జట్టుగా మా లక్ష్యం ఏమిటనేది. అది సాధిస్తేనే అంతా అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఎంతో కష్టపడి ఈ దశకు వచ్చాం. ట్రోఫీ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని 35 ఏళ్ల మెస్సీ వ్యాఖ్యానించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్ సాధించాడు. 1: ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్ ముల్లర్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 2: ప్రపంచకప్‌లో తొలి లీగ్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత ఫైనల్ చేరడం అర్జెంటీనాకిది రెండోసారి. 1990లోనూ అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో కామెరూన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 1982లో పశ్చిమ జర్మనీ... 1994లో ఇటలీ... 2010లో స్పెయిన్ కూడా ఈ ఘనత సాధించాయి. జర్మనీ, ఇటలీ రన్నరప్‌గా నిలువగా... స్పెయిన్ మాత్రం టైటిల్ సాధించింది. 2: జర్మనీ తర్వాత ప్రపంచకప్ సెమీఫైనల్లో రెండుసార్లు మూడు అంతకంటే ఎక్కువ గోల్స్ తేడాతో గెలిచిన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. 3: వరుసగా ఐదో ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ గత నాలుగు ప్రపంచకప్‌లలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేదు. ఈసారి మాత్రం ఏకంగా మూడు గోల్స్ చేశాడు. 5: ఒకే ప్రపంచకప్‌లో ఐదు గోల్స్ చేసిన పెద్ద వయస్కుడిగా మెస్సీ (35 ఏళ్లు) ఘనత సాధించాడు. 6: ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. జర్మనీ అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరింది. బ్రెజిల్, ఇటలీ (6 సార్లు చొప్పున) సరసన అర్జెంటీనా నిలిచింది. 16: ఈ ఏడాది అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్. తన కెరీర్లో జాతీయ జట్టుకు ఒకే సంవత్సరం ఇన్ని గోల్స్ అందించడం ఇదే ప్రథమం. 25: ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో మెస్సీ ఆడిన మ్యాచ్‌లు. లోథర్ మథియాస్ (జర్మనీ–25 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఫైనల్లోనూ మెస్సీ బరిలోకి దిగితే ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. -
FIFA WC 2022: మొరాకోతో సెమీ ఫైనల్.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు భారీ షాక్
ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా ఫ్రాన్స్-మొరాకో జట్ల మధ్య రేపు (అర్ధరాత్రి 12:30) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్టర్లు డయోట్ ఉపమెకనో, అడ్రెయిన్ రేబియట్ అనారోగ్యం కారణంగా ఇవాళ ప్రాక్టీస్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో వీరిద్దరు మొరాకోతో జరిగే సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానమేనని సమాచారం. పై పేర్కొన్న ఇద్దరిలో డయోట్ ఉపమెకనో సోమవారం కూడా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదని, అతను తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాడని తెలుస్తోంది. ఉపమెకనో, రేబియట్ సెమీఫైనల్‌కు అందుబాటులో ఉండకపోవడం ఫ్రాన్స్ విజయావకాశాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రేబియట్ ఒక గోల్ సాధించి, మరో గోల్ చేసేందుకు సహాయపడగా.. ఉపమెకనో ఖాతా తెరవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్.. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 గోల్స్ తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరగా, మొరాకో.. పటిష్టమైన పోర్చుగల్‌పై సంచలన విజయం (1-0) సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన మొరాకో.. బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ లాంటి హేమాహేమీ జట్లకు షాకిచ్చి సెమీస్ వరకు చేరింది. మరోవైపు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్.. స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ఫైనల్ ఫోర్కు చేరింది. కాగా, ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన తొలి సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనా.. క్రొయేషియాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్-మొరాకో మ్యాచ్‌లో విజేత డిసెంబర్ 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
FIFA WC: మెస్సీ మాయాజాలం.. ఫైనల్‌కు అర్జెంటీనా
FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022లో అర్జెంటీనా ఫైనల్లోకి దూసుకెళ్లింది. మెస్సి మాయాజాలంతో సెమీఫైనల్లో క్రొయేషియాపై అద్భుత విజయం సాధించి ఘనంగా ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం అర్ధరాతి 12.30 గంటలకు ప్రారంభమైన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాను మట్టికరిపించింది. ఈ క్రమంలో 2014 తర్వాత మరోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసింది మెస్సీ పెనాల్టీ కిక్ ద్వారా (34.14వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. ఆ తర్వాత అల్వారెజ్ రెండు గోల్స్(38.51వ నిమిషంలో) గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో అల్వారెజ్ మ(69వ నిమిషాల్లో) మరో గోల్ చేశాడు. దీంతో 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది అర్జెంటీనా. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Argentina storm through to the #FIFAWorldCup Final 🇦🇷 🔥 #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022 -
FIFA World Cup 2022: ఖతర్‌ను పొగుడుతూ ట్వీట్.. రిషి సునాక్‌పై విమర్శలు!
లండన్: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకుంటున్నాయి. ఏమాత్రం అంచనాలు లేని జట్టు బలమైన జట్లను ఓడించాయి. ఇదిలా ఉంటే..ఫిఫా ప్రపంచకప్‌పై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారి తీసింది. 16వ రౌండ్లో సెనెగల్‌తో ఇంగ్లాండ్ మ్యాచ్‌కు ముందు ఫిఫా ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్న ఖతర్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు రిషి సునాక్. ‘ఇప్పటివరకు అద్భుతమైన ప్రపంచకప్‌ను నిర్వహించినందుకు ఖతార్‌కు హ్యాట్సాఫ్. గ్రూప్ దశలు ఆల్ టైమ్ గ్రేట్స్‌లో ఒకటిగా గుర్తుండిపోతాయి. కమాన్ ఇంగ్లాండ్.. మన కలను సజీవంగా కొనసాగించండి.’ అంటూ ట్విట్టర్ వేదికగా ఖతార్‌పై ప్రశంసలు కురింపించారు. ఆయన ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ‘నిజంగానా? ఆల్ టైమ్ గ్రేట్స్? మీరు ఏం చూస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు.’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరోవైపు.. కొందరు ఇంగ్లాండ్, సెనెగల్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగినట్లు పేర్కొన్నారు. ‘ఎస్ రిషి సునాక్, ఖతర్ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొంత మందికి మాత్రం సమస్యగా ఉన్నా.. చూడదగ్గ ఈవెంట్.’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. మరోవైపు.. ఇంగ్లాండ్ గత మ్యాచ్‌లో విజయం సాధించటంపై ప్రశంసలు కురింపించారు. తాము గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్ ఆటను ఈ విధంగా చూడలేదని పేర్కొన్నారు. సెనెగల్పై విజయం సాధించిన ఇంగ్లాండ్.. డిసెంబర్ 11 డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్‌తో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. Hats off to Qatar for hosting an incredible World Cup so far. The group stages will be remembered as one of the all-time greats. Come on @England keep the dream alive 🦁🦁🦁#FIFAWorldCup #ENGSEN pic.twitter.com/YyLv9Y2VjZ — Rishi Sunak (@RishiSunak) December 4, 2022 ఇదీ చదవండి: FIFA World Cup 2022: మరో సంచలనం.. బెల్జియంను ఖంగుతినిపించిన మొరాకో -
Qatar FIFA World Cup 2022: క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్
అమెరికాకు తొలి నాకౌట్ దెబ్బ పడింది. నెదర్లాండ్స్ మొదటి క్వార్టర్స్ బెర్తు సాధించింది. ప్రపంచకప్‌లో లీగ్ దశ వెనువెంటనే మొదలైన నాకౌట్ పోరులో మూడుసార్లు రన్నరప్ నెదర్లాండ్స్ 3–1తో అమెరికాపై ఘనవిజయం సాధించింది. డచ్ డిఫెండర్లు ప్రత్యర్థి స్ట్రయికర్లను నిలువరించగా... ఫార్వర్డ్ ఆటగాళ్లు గోల్స్ చేయడంలో సఫలమయ్యారు. దోహా: ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో డచ్ టీమ్ 3–1 గోల్స్ తేడాతో అమెరికాపై జయభేరి మోగించింది. నెదర్లాండ్స్ ఆటగాడు డెంజెల్ డంఫ్రైస్ అసాధారణ ఆటతీరు కనబరిచాడు. డచ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. తొలి రెండు గోల్స్‌కు మెరుపు పాస్‌లు అందించిన డెంజెల్... ఆట ముగింపు దశలో స్వయంగా తనే గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యానికి ఎదురేలేకుండా పోయింది. డచ్ తరఫున మెంఫిస్ డిపే (10వ ని.), డెలీ బ్లైండ్ (ఇంజ్యూరి టైమ్ 45+1వ ని.), డంఫ్రైస్ (81వ ని.) గోల్ చేశారు. అమెరికా జట్టులో హజి రైట్ (76వ ని.) గోల్ సాధించాడు. ఆట ఆరంభంలో అమెరికా స్ట్రయికర్లే నెదర్లాండ్స్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. రెండో నిమిషం నుంచే అమెరికా గోల్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫినిషింగ్ లోపాలతో ఏ ఒక్కటి సఫలం కాలేదు. అయితే ఆట పదో నిమిషంలో కళ్లు చెదిరే గోల్‌కు డంఫ్రైస్ కారణమయ్యాడు. ప్రత్యర్థి డి ఏరియాకు సమీపంలో కుడివైపు నుంచి డంఫ్రైస్ దూసుకొస్తూ ఇచ్చిన క్రాస్పాస్ను మెంఫిస్ డిపే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే మెరుపువేగంతో గోల్‌కీపర్‌కు అవకాశం లేకుండా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. మళ్లీ తొలి అర్ధభాగం స్టాపేజ్ (ఇంజ్యూరి టైమ్)లో అదే రకమైన క్రాస్ పాస్‌ను డెలీ బ్లైండ్‌కు ఇవ్వగా అతను కూడా చాకచక్యంగా బంతిని లక్ష్యం చేర్చడంలో సఫలమయ్యాడు. ద్వితీయార్ధంలో అమెరికా బృందంలో 67వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ అయిన హజి రైట్ (76వ ని.) వచ్చిన 9 నిమిషాలకే అమెరికాకు గోల్ చేసి పెట్టాడు. డచ్ ఆధిక్యం 2–1కు తగ్గిన కాసేపటికే డంఫ్రైస్ మళ్లీ గర్జించాడు. ఈసారి తానే ఏకంగా గోల్‌పోస్ట్‌పై గురిపెట్టడంతో 81వ నిమిషంలో నెదర్లాండ్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది. మ్యాచ్‌లో డచ్‌ను నడిపించిన డెంజెల్ డంఫ్రైస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అర్జెంటీనా–ఆస్ట్రేలియా మ్యాచ్ విజేతతో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్లో తలపడుతుంది. ప్రపంచకప్‌లో నేడు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) ఫ్రాన్స్ X పోలాండ్ రాత్రి గం. 8:30 నుంచి ఇంగ్లండ్ X సెనెగల్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డంఫ్రైస్ -
FIFA World Cup Qatar 2022: నాకౌట్‌కు దక్షిణ కొరియా
దోహా: గత రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశకే పరిమితమైన దక్షిణ కొరియా ఈసారి సత్తా చాటింది. కీలకమైన చివరి లీగ్ మ్యాచ్‌లో చెలరేగి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పోర్చుగల్‌తో జరిగిన గ్రూప్ ‘హెచ్’ పోరులో కొరియా 2–1తో గెలిచింది. మ్యాచ్ 5వ నిమిషంలోనే హోర్టా గోల్ సాధించి పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే కొరియా తరఫున 27వ నిమిషంలో కిమ్ యంగ్ గ్వాన్ గోల్ చేసి స్కోరును సమం చేయగా...మ్యాచ్ చివర్లో వాంగ్ హీ చాన్ చేసిన అద్భుతమైన కౌంటర్ అటాక్ గోల్ (90+1వ నిమిషంలో)తో కొరియా దూసుకుపోయింది. గ్రూప్‌లో ఈ మ్యాచ్‌కు ముందే 2 విజయాలు సాధించి నాకౌట్ చేరిన పోర్చుగల్‌తో పాటు రెండో జట్టుగా కొరియా ముందంజ వేసింది. ఘనాతో మ్యాచ్ ముగిశాక రిఫరీతో వాగ్వాదం చేసినందుకు ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటుకు గురైన కొరియా కోచ్ పౌలో బెంటో ఈ మ్యాచ్‌ను ప్రేక్షకుల గ్యాలరీల్లో కూర్చోని చూశారు. చదవండి: Football: కుప్పకూలి.. యువ ఆటగాడు కన్నుమూత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ అజేయంగా...
ఐదున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న రెండో ప్రపంచకప్ టైటిల్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి దశను సాఫీగా అధిగమించింది. కనీసం ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం ఉన్నా... ఈ మాజీ చాంపియన్ మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో భారీ విజయం నమోదు చేసి గ్రూప్ దశను అజేయంగా ముగించి తమ గ్రూప్ ‘బి’లో ‘టాపర్’గా నిలిచింది. అల్ రయ్యాన్ (ఖతర్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 13వసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రూప్ ‘బి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో 1966 విశ్వవిజేత ఇంగ్లండ్ 3–0 గోల్స్ తేడాతో వేల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున మార్కస్ రాష్‌ఫోర్డ్ (50వ, 68వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ఫిల్ ఫోడెన్ (51వ ని.లో) ఒక గోల్ అందించాడు. 1958లో తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్ చేరిన వేల్స్ 64 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు రెండోసారి అర్హత సాధించినా ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటలేకపోయింది. వేల్స్‌తో కనీసం ‘డ్రా’ చేసుకున్నా తదుపరి దశకు అర్హత పొందే అవకాశమున్నా ఇంగ్లండ్ మాత్రం విజయమే లక్ష్యంగా ఆడింది. అయితే వేల్స్ డిఫెండర్లు గట్టిగా నిలబడటంతో తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఖాతా తెరువలేకపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చి ఫలితం పొందింది. 18 నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ సాధించి వేల్స్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా చేసింది. 50వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను రాష్‌ఫోర్డ్ నేరుగా వేల్స్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 2020 యూరో ఫైనల్లో ఇటలీపై పెనాల్టీ షూటౌట్లో తన షాట్‌ను గోల్‌గా మలచలేకపోయిన రాష్ఫోర్డ్కు గత రెండేళ్లుగా ఏదీ కలసి రావడంలేదు. నల్ల జాతీయుడు కావడంతో స్వదేశంలో అతనిపై జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వేల్స్‌పై రాష్‌ఫోర్డ్ రెండు గోల్స్‌తో రాణించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తొలి గోల్ అయ్యాక నిమిషం వ్యవధిలోనే ఇంగ్లండ్ ఖాతాలో రెండో గోల్ చేరింది. కెప్టెన్ హ్యారీ కేన్ క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఫిల్ ఫోడెన్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. అనంతరం 68వ నిమిషంలో రాష్‌ఫోర్డ్ గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యం 3–0కు పెరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన మూడో గోల్ ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు 100వ గోల్ కావడం విశేషం. 92 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో 100 గోల్స్ మైలురాయిని అందుకున్న ఏడో జట్టుగా ఇంగ్లండ్ గుర్తింపు పొందింది. ‘బి’ గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఇంగ్లండ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సెనెగల్ జట్టుతో ఆడుతుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: పోర్చుగల్ ముందుకు...
దోహా: అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఖతర్‌కు వచ్చిన క్రిస్టియానో రొనాల్డో బృందం తొలి అడ్డంకిని దాటింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్‌లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గతంలో రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఉరుగ్వే జట్టుపై గెలిచింది. పోర్చుగల్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను బ్రూనో ఫెర్నాండెజ్ (54వ ని.లో, 90+3వ ని.లో) సాధించాడు. వరుసగా రెండో విజయం సాధించిన పోర్చుగల్ జట్టు ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గత ప్రపంచకప్‌లో ఉరుగ్వే చేతిలో 1–2తో ఓడిపోయిన రొనాల్డో జట్టు ఈసారి ఈ మాజీ విజేత జట్టును తేలిగ్గా తీసుకోలేదు. ముఖ్యంగా రొనాల్డో ముందుండి జట్టును నడిపించాడు. పలుమార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ దిశగా వెళ్లి లక్ష్యంపై గురి పెట్టాడు. మరోవైపు ఉరుగ్వే కూడా దూకుడుగానే ఆడింది. కానీ ఆ జట్టును కూడా ఫినిషింగ్ లోపం వేధించింది. విరామ సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. ఎట్టకేలకు 54వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ సంధించిన క్రాస్ షాట్ నేరుగా ఉరుగ్వే గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రూనో కిక్‌ను గాల్లోకి ఎగిరి రొనాల్డో హెడర్ ద్వారా అందుకునే ప్రయత్నం చేసినా బంతి రొనాల్డో తలకు తగలకుండానే గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఉరుగ్వే తరఫున బెంటాన్కర్, గోమెజ్ కొట్టిన షాట్లు గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లాయి. స్టాపేజ్ సమయంలో ‘డి’ ఏరియాలో ఉరుగ్వే ప్లేయర్ జిమినెజ్ చేతికి బంతి తగలడంతో రిఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. బ్రూనో ఈ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. చివరి సెకన్లలో బ్రూనో కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లింది. లేదంటే అతని ఖాతాలో హ్యాట్రిక్ చేరేది. ప్రపంచకప్‌లో నేడు డెన్మార్క్ X ఆస్ట్రేలియా రాత్రి గం. 8:30 నుంచి ఫ్రాన్స్ X ట్యునీషియా రాత్రి గం. 8:30 నుంచి అర్జెంటీనా X పోలాండ్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి మెక్సికో X సౌదీ అరేబియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: 20 ఏళ్ల తర్వాత...
దోహా: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సెనెగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సెనెగల్ 2–1 గోల్స్ తేడాతో ఈక్వెడార్ జట్టును ఓడించింది. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందింది. సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సార్ (44వ ని.లో), కెప్టెన్ కలిదు కులిబాలి (70వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఈక్వెడార్‌కు మోజెస్ కైసెడో (67వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. మూడోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న సెనెగల్ తొలిసారి బరిలోకి దిగిన 2002లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్‌లకు అర్హత పొందలేకపోయింది. మళ్లీ 2018లో రెండో సారి ఈ మెగా ఈవెంట్లో ఆడిన సెనెగల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి సమష్టిగా రాణించి తొలి అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తప్పనిసరిగా గెలిస్తేనే నాకౌట్ దశకు చేరే అవకాశం ఉండటంతో సెనెగల్ ఆటగాళ్లు ఆద్యంతం దూకుడుగా ఆడారు. ‘డ్రా’ చేసుకున్నా నాకౌట్ దశకు చేరే చాన్స్ ఉండటంతో ఈక్వెడార్ కూడా వెనక్కి తగ్గలేదు. సాధ్యమైనంత ఎక్కువసేపు తమ ఆధీనంలో బంతి ఉండేలా ఈక్వెడార్ ఆటగాళ్లు ప్రయత్నించారు. సెనెగల్ ఆటగాళ్లను మొరటుగా అడ్డుకునేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో 44వ నిమిషంలో ‘డి’ ఏరియాలో సెనెగల్ ప్లేయర్ ఇస్మాయిల్ సార్‌ను ఈక్వెడార్ డిఫెండర్ హిన్కాపి తోసేశాడు. దాంతో రిఫరీ మరో ఆలోచన లేకుండా సెనెగల్‌కు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. పెనాల్టీని ఇస్మా యిల్ సార్ గోల్‌గా మలిచాడు. దాంతో విరామ సమయానికి సెనెగల్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఈక్వెడార్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. 67వ నిమిషంలో లభించిన కార్నర్‌ను ప్లాటా ‘డి’ ఏరియాలోకి కొట్టాడు. దానిని టోరెస్ హెడర్ షాట్‌తో ఒంటరిగా ఉన్న మోజెస్ కైసెడో వద్దకు పంపించగా అతను గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమం అయింది. అయితే ఈక్వెడార్‌కు ఈ ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 70వ నిమిషంలో సెనెగల్ జట్టుకు లభించిన కార్నర్‌ను గుయె ‘డి’ ఏరియాలోకి కొట్టగా ఈక్వెడార్ ప్లేయర్ టోరెస్‌కు తగిలి బంతి గాల్లో లేచింది. అక్కడే ఉన్న కెప్టెన్ కులిబాలి బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించి సెనెగల్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత సెనెగల్ చివరివరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంది. నెదర్లాండ్స్ 11వసారి... మరోవైపు ఆతిథ్య ఖతర్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచి ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచి 11వసారి ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ తరఫున కొడి గాప్కో (26వ ని.లో), ఫ్రాంకీ డి జాంగ్ (49వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ టోర్నీలో గాప్కోకిది మూడో గోల్ కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది!
దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలో జర్మనీది ఘనచరిత్రే! బ్రెజిల్ అంతటి మేటి జట్టు జర్మనీ. బ్రెజిల్ ఐదుసార్లు గెలిస్తే... జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్‌ను అందుకుంది. అంతేకాదు గెలిచినన్ని సార్లు రన్నరప్‌గా నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానంలో నిలిచింది. ఇలా పాల్గొన్న ప్రతీ మెగా ఈవెంట్లోనూ సత్తా చాటుకున్న మేటి జట్టు గత టోర్నీలో తొలి రౌండ్ దాటకపోవడమే పెద్ద షాక్ అనుకుంటే మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటుంది. స్పెయిన్‌తో జరిగిన లీగ్ పోరులో జర్మనీ 1–1తో డ్రాతో గట్టెక్కింది. స్పెయిన్ తరఫున సబ్‌స్టిట్యూట్ అల్వారో మొరాటా (62వ ని.లో), జర్మనీ జట్టులో సబ్‌స్టిట్యూట్ ఫుల్క్రుగ్ (83వ ని.లో) గోల్ చేశారు. ఇప్పుడు ఒక ఓటమి, ఒక డ్రాతో ఉన్న జర్మనీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోస్టారికాను ఓడిస్తేనే సరిపోదు. మిగతా జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఈ గ్రూపులో ఆఖరి లీగ్ పోటీల్లో కోస్టారికాతో జర్మనీ... జపాన్‌తో స్పెయిన్ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్‌లు గురువారమే జరుగనున్నాయి. దీంతో ఇంకో రెండు రోజుల్లో ఏ రెండు ముందుకో, ఏ రెండు ఇంటికో తేలిపోతుంది. -
FIFA World Cup Qatar 2022: ‘ఘన’మైన విజయం
దోహా: తొలి మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చినా... చివరకు పోర్చుగల్ ముందు తలొగ్గిన ఆఫ్రికా దేశం ఘనా తర్వాతి పోరులో సత్తా చాటింది. తమకంటే బలమైన, ర్యాంకింగ్స్‌లో ఎంతో మెరుగ్గా ఉన్న దక్షిణ కొరియాను చిత్తు చేసి గ్రూప్ ‘హెచ్’లో సమరాన్ని ఆసక్తికరంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో ఘనా 3–2 గోల్స్ తేడాతో కొరియాపై విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ కుడూస్ (34వ, 68వ ని.లో) రెండు గోల్స్‌తో చెలరేగగా, మొహమ్మద్ సలిసు (24వ ని.లో) మరో గోల్ చేశాడు. కొరియా ఆటగాడు చో గూసంగ్ (58వ, 61వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఘనా ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఆ జట్టు ఫార్వర్డ్లు దూసుకుపోవడంతో తొలి 24 నిమిషాల్లోనైతే బంతి పూర్తిగా కొరియా ఏరియాలోనే కనిపించింది. చివరకు ఘనా ఫలితం రాబట్టింది. జోర్డాన్ ఆయూ ఎడమ వైపు నుంచి కొట్టిన ఫ్రీ కిక్‌ను హెడర్‌తో కెప్టెన్ ఆండ్రూ ఆయూ నియంత్రణలోకి తెచ్చుకోగా, ఆ వెంటనే సలిసు గోల్‌గా మలిచాడు. మరో పది నిమిషాల్లోనే ఘనా ఆధిక్యం పెంచుకుంది. ఈసారి కూడా జోర్డాన్ ఆయూనే పాస్ అందించగా... కుడూస్ హెడర్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంతో విస్తుపోవడం కొరియా వంతైంది. తొలి అర్ధభాగంలో ఘనా ఆట చూస్తే కొరియా చిత్తుగా ఓడుతుందనిపించింది. అయితే విరామం తర్వాత కొరియా కోలుకుంది. 168 సెకన్ల వ్యవధిలో చో గూసంగ్ చేసిన రెండు హెడర్ గోల్స్ ఒక్కసారిగా మ్యాచ్ పరిస్థితిని మార్చేశాయి. లీ కాంగ్ ఇచ్చిన క్రాస్తో తొలి గోల్ చేసిన గూసంగ్, రెండో గోల్‌తో అద్భుతాన్ని ప్రదర్శించాడు. కిమ్ జిన్ కిక్ కొట్టగా, గోల్ పోస్ట్ ముందు గిడియాన్ మెన్సాను తప్పించి గాల్లోకి ఎగురుతూ గోల్ సాధించడం హైలైట్‌గా నిలిచింది. స్కోరు సమం కావడంతో మళ్లీ హోరాహోరీ మొదలైంది. అయితే కొరియా డిఫెన్స్ వైఫల్యాన్ని సొమ్ము చేసుకుంటూ కుడూస్ మళ్లీ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొరియా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. చివర్లో ఘనా గోల్‌కీపర్ లారెన్స్ అతీ జిగీ మెరుపు వేగంతో కదులుతూ గోల్స్‌ను అడ్డుకోవడం విశేషం. మ్యాచ్ తర్వాత పెనాల్టీ విషయంలో రిఫరీ ఆంథోనీ టేలర్‌తో వాదనకు దిగిన కొరియా కోచ్ బెంటో రెడ్‌కార్డుకు గురయ్యాడు. ప్రపంచకప్‌లో నేడు ఈక్వెడార్ X సెనెగల్ రాత్రి గం. 8:30 నుంచి నెదర్లాండ్స్ X ఖతర్ రాత్రి గం. 8:30 నుంచి ఇరాన్ X అమెరికా అర్ధరాత్రి గం. 12:30 నుంచి ఇంగ్లండ్ X వేల్స్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా నిలిచింది
తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి అర్జెంటీనా వెంటనే తేరుకుంది. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ లో నాకౌట్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ మాజీ చాంపియన్ జట్టు సమష్టి ప్రదర్శనతో రాణించింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల మెక్సికోను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఆడిన అర్జెంటీనా రెండు గోల్స్ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. పోలాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే సౌదీ అరేబియా–మెక్సికో మ్యాచ్ ఫలితంపై అర్జెంటీనా జట్టు నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. పోలాండ్ చేతిలో ఓడితే మాత్రం అర్జెంటీనా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది. దోహా: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్న అర్జెంటీనా రెండో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్టు ఆడింది. గ్రూప్ ‘సి’లో భాగంగా మెక్సికోతో భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఆట 64వ నిమిషంలో కెప్టెన్ లయనెల్ మెస్సీ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అర్జెంటీనా... 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాకౌట్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడింది. మరోవైపు మెక్సికో ఫార్వర్డ్ అలెక్సిక్ వెగా అవకాశం వచ్చినపుడల్లా అర్జెంటీనా రక్షణ శ్రేణి ఆటగాళ్లకు ఇబ్బంది పెట్టాడు. 45వ నిమిషంలో వెగా కొట్టిన షాట్‌ను అర్జెంటీనా గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు తమ దాడుల్లో పదును పెంచారు. చివరకు 64వ నిమిషంలో కుడివైపు నుంచి డిమారియా ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ 25 గజాల దూరం నుంచి షాట్ కొట్టగా మెక్సికో గోల్‌కీపర్ డైవ్ చేసినా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పోకుండా అడ్డుకోలేకపోయాడు. దాంతో అర్జెంటీనా బోణీ కొట్టింది. ఖాతా తెరిచిన ఉత్సాహంతో అర్జెంటీనా మరింత జోరు పెంచింది. మెస్సీ అందించిన పాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ అందుకొని షాట్ కొట్టగా బంతి మెక్సికో గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. దాంతో ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా చేతిలో మెక్సికోకు నాలుగో ఓటమి ఎదురైంది. ప్రపంచకప్‌లో నేడు కామెరూన్ X సెర్బియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి దక్షిణ కొరియా X ఘనా సాయంత్రం గం. 6:30 నుంచి బ్రెజిల్ X స్విట్జర్లాండ్ రాత్రి గం. 9:30 నుంచి పోర్చుగల్ X ఉరుగ్వే అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
FIFA World Cup Qatar 2022: ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్
దోహా: వరుసగా రెండో విజయం నమోదు చేసిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్‌లో నాకౌట్ బెర్త్‌ను (ప్రిక్వార్టర్ ఫైనల్) ఖరారు చేసుకుంది. డెన్మార్క్ జట్టుతో శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. స్టార్ ప్లేయర్ కిలియాన్ ఎంబాపె (61వ, 86వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. డెన్మార్క్ తరఫున క్రిస్టెన్సన్ (68వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. థియో హెర్నాండెజ్ అందించిన పాస్‌ను గోల్‌పోస్ట్‌లోనికి పంపించి తొలి గోల్ సాధించిన ఎంబాపె... గ్రీజ్మన్ క్రాస్ షాట్‌ను గాల్లోకి ఎగిరి లక్ష్యానికి చేర్చి రెండో గోల్ చేశాడు. ప్రపంచకప్‌లో నేడు జపాన్ X కోస్టారికా మధ్యాహ్నం గం. 3:30 నుంచి బెల్జియం X మొరాకో సాయంత్రం గం. 6:30 నుంచి క్రొయేషియా X కెనడా రాత్రి గం. 9:30 నుంచి జర్మనీ X స్పెయిన్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
FIFA World Cup Qatar 2022: నెదర్లాండ్స్, ఈక్వెడార్ మ్యాచ్ ‘డ్రా’
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నెదర్లాండ్స్, ఈక్వెడార్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయింది. ఈ మ్యాచ్ ఫలితంతో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆతిథ్య ఖతర్ జట్టు ప్రస్థానం గ్రూప్ దశలోనే ముగిసింది. ఆట ఆరో నిమిషంలో కోడి గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. విరామ సమయం వరకు ఆధిక్యంలో నిలిచిన ‘ఆరెంజ్ జట్టు’ రెండో అర్ధభాగంలో తడబడింది. ఆట 49వ నిమిషంలో ఈక్వెడార్ ప్లేయర్ ఎనెర్ వాలెన్సియా గోల్ సాధించి స్కోరును 1–1తో సమం చేశాడు. ఒక విజయం, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, ఈక్వెడార్ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లను ఈ రెండు జట్లు ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. -
సాకర్ వరల్డ్ కప్ లో క్రిస్టియన్ రోనాల్డ్ సరికొత్త రికార్డు
-
32 జట్లు పాల్గొంటోన్న భారీ క్రీడా సంబరం
-
క్రీడల చరిత్రలో క్రికెట్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లు ఆడిన ఆసీస్ ప్లేయర్ ఎవరో తెలుసా..?
ప్రపంచ క్రీడల చరిత్రలో అత్యంత అరుదైన ఘటన ఒకటి ఉంది. ఓ అంతర్జాతీయ ప్లేయర్.. క్రికెట్ వరల్డ్‌కప్‌తో పాటు ఫిఫా ప్రపంచకప్‌లో కూడా పాల్గొని, విశ్వంలో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ క్రీడల చరిత్రలో టార్చ్‌లైట్ వేసి వెతికినా ఇలాంటి ఓ ఘటన నమోదైన దాఖలాలు లేవు. ఆస్ట్రేలియాకు చెందిన 32 ఏళ్ల మహిళా క్రికెటర్ ఎల్లైస్ పెర్రీ 16 ఏళ్ల వయసులోనే (2007) అంతర్జాతీయ క్రికెట్ టీమ్‌తో పాటు ఫుట్‌బాల్ జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. అటు ఐసీసీ మహిళల వరల్డ్‌కప్ (2009)తో పాటు 2011 ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో కూడా పాల్గొంది. పెర్రీ.. ఓ పక్క క్రికెట్లో సంచనాలు నమోదు చేస్తూనే, ఫుట్‌బాల్‌లోనూ సత్తా చాటింది. ఆల్‌రౌండర్‌గా వరల్డ్‌కప్‌లో నేటికీ బద్ధలు కాని ఎన్నో రికార్డులు నమోదు చేసిన పెర్రీ.. ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండర్‌గా ఉంటూనే గోల్స్ సాధించింది. 2011 ఫిఫా ప్రపంచకప్‌లో స్వీడన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పెర్రీ.. మెరుపు వేగంతో సాధించిన గోల్‌ను ఆసీస్ ఫుట్‌బాల్ ప్రేమికులు ఎన్నటికీ మర్చిపోలేరు. అయితే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని క్లబ్‌లు క్రికెట్ కావాలో, ఫుట్‌బాల్ కావాలో తేల్చుకోమని చెప్పడంతో 2014లో ఫుట్‌బాల్‌కు స్వస్తి పలికి నేటికీ ఆసీస్ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది. క్లబ్ లెవెల్ ఫుట్‌బాల్‌లో ఎన్నో అద్భుతాలు చేసిన పెర్రీ.. అంతర్జాతీయ క్రికెట్లో అంతకుమించిన ఎన్నో చెరగని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. అటు క్రికెట్లోనూ.. ఇటు ఫుట్‌బాల్‌లోనూ సత్తా చాటిన పెర్రీ ఎందరో మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమెను దేశంలోని అన్ని అత్యుత్తమ పురస్కారాలతో సత్కరించింది. క్రికెట్లో ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో 10 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 75.20 సగటుతో 752 పరుగులు చేసింది. ఇందులో 2 శతకాలు 3 అర్ధశతకాలు ఉన్నాయి. ఆమె అత్యుత్తమ స్కోర్ 213 నాటౌట్‌గా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఆమె 37 వికెట్లు కూడా సాధించింది. 128 వన్డేలు ఆడిన పెర్రీ.. 50.28 సగటున 2 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీల సాయంతో 3369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టింది. ఇక, 126 టీ20లు ఆడిన పెర్రీ.. 4 హాఫ్ సెంచరీల సాయంతో 1253 చేసి 115 వికెట్లు పడగొట్టింది. ఇక ఫుట్‌బాల్ విషయానికొస్తే.. ఆసీస్ తరఫున 18 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 3 గోల్స్ సాధించింది. అలాగే క్లబ్ స్థాయిలో 50కి పైగా మ్యాచ్‌ల్లో పాల్గొంది. విండీస్ దిగ్గజం కూడా ఫిఫా వరల్డ్‌కప్, క్రికెట్ ప్రపంచకప్ ఆడాడు.. అయితే..! పురుషుల క్రికెట్లో విండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్ కూడా ఫిఫా వరల్డ్‌కప్, క్రికెట్ ప్రపంచకప్‌లలో ఆడాడు. 70, 80 దశకాలలో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రిచర్డ్స్.. 1975, (తొలి వన్డే ప్రపంచకప్), 1979, 1983 వన్డే ప్రపంచకప్‌లలో పాటు 1974 ఫిఫా వరల్డ్‌కప్‌లో కూడా పాల్గొన్నాడు. కరీబియన్ దీవుల్లోని అంటిగ్వా తరఫున ఫిఫా వరల్డ్‌కప్ బరిలోకి దిగిన సర్ రిచర్డ్స్.. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. నాటి పోటీల్లో ఆంటిగ్వా ఆశించిన స్థాయిలో రాణించలేక, వరల్డ్‌కప్ మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయింది. -
సాకర్ సంబరం: ఫిఫా వరల్డ్ కప్ లో ఈక్వెడార్ బోణి
-
ఫిఫా వరల్డ్ కప్ కు అంతా సిద్ధం..
-
Fifa World Cup Qatar 2022: ఎడారి దేశంలో.. సాకర్ తుఫాన్
రొనాల్డో... మెస్సీ... నెమార్... హ్యారీ కేన్... ఫుట్‌బాల్ ప్రపంచంలో ఇవేమీ కొత్త పేర్లు కాదు... కానీ ఇప్పుడు మళ్లీ అవన్నీ మన ముంగిట కొత్తగా వినిపిస్తాయి. సాధారణంగా ఎప్పుడు పిలవని, నోరు తిరగని నామ ధేయాలు కూడా ఇప్పుడు మన నోటిపై జపం చేస్తాయి. క్రీడాభిమానుల కళ్లన్నీ నెల రోజుల పాటు మిగతా ఆటలన్నీ గట్టున పెట్టేసి ఈ మ్యాచ్‌ల ఫలితం కోసం ఎదురు చూస్తాయి. ఇప్పుడు లెక్క సెంచరీల్లోనో, పరుగుల సంఖ్యలోనో కాదు... సింగిల్ డిజిట్‌లోనే సీన్లు మారిపోతాయి... అంతా గోల్స్ గోలనే ... ఒక్క అంకె ఒకవైపు ఆనందం నింపితే, మరోవైపు గుండెలు బద్దలు చేస్తుంది. 32 దేశాల మెరుపు వీరులు మైదానంలో పాదరసంలా దూసుకుపోతుంటే... ఉత్సాహం, ఉద్వేగానికి లోటు ఏముంటుంది... 64 మ్యాచ్‌లలో మన కళ్లన్నీ బంతి మీదే నిలిస్తే ఆఖరి రోజున జగజ్జేతగా మనమే నిలిచిన భావన అభిమానిది... అవును, ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అలరించేందుకు ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ మళ్లీ వచ్చేసింది. 29 రోజుల పాటు కళ్లార్పకుండా చూసేందుకు, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించేందుకు మీరంతా సిద్ధమైపోండి! మరి కొన్ని గంటల్లో... ప్రపంచం మొత్తం అబ్బురపడే అత్యద్భుత ఘట్టానికి తెర లేవనుంది... ఎడారి దేశం ఖతర్‌లో ఇసుక తుఫాన్లు సాధారణం. అయితే రాబోయే నెలరోజులు సాకర్ సంగ్రామం ఎడారి దేశాన్ని ఒక ఊపు ఊపనుంది. సుమారు 16 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌తో సిద్ధమైన మెగా క్రీడా సంబరానికి విజిల్ మోగనుంది. ఇప్పటి వరకు 21 ప్రపంచకప్‌లు జరిగాయి... కానీ 22వది మాత్రం అన్నింటికంటే భిన్నం! అమెరికా, యూరోప్ దేశాలను దాటి అరబ్ దేశంలో తొలిసారి నిర్వహిస్తున్న టోర్నీ కాగా... ఆతిథ్య దేశం ఆలోచనలకు అనుగుణంగా వచ్చిన నియమ నిబంధనలు ఈ మెగా టోర్నీని మరింత ప్రత్యేకంగా మార్చాయి... ఆతిథ్య హక్కులు కేటాయించిన నాటి నుంచి ఇప్పటి వరకు పలు వివాదాలు వెంట వచ్చినా, ఖర్చు అంచనాలను దాటి ఆకాశానికి చేరినా వెనక్కి తగ్గని ఖతర్ దేశం టోర్నమెంట్‌ను మెగా సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే పండగ ముందు ఏర్పాట్లలో ఎంత కష్టం ఉన్నా... ఒక్కసారి ఆట మొదలైతే అన్నీ వెనక్కి వెళ్లిపోతాయి.‘ఫిఫా’ కూడా సరిగ్గా ఇదే ఆశిస్తోంది. ఖతర్ దేశపు రాజధాని దోహా వేదికగా 22వ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్‌తో ఈక్వెడార్ తలపడుతుంది. ఖతర్ జాతీయ దినోత్సవం అయిన డిసెంబర్ 18న ఫైనల్ జరుగుతుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్‌లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావడం విశేషం. 2002లో జపాన్–దక్షిణ కొరియా సంయుక్తంగా పోటీలను నిర్వహించిన తర్వాత ఒక ఆసియా దేశంలో ‘ఫిఫా’ ప్రపంచ కప్ జరగడం ఇది రెండోసారి కాగా... ఒక మధ్యప్రాచ్య దేశం విశ్వ సంరంభానికి వేదిక కావడం ఇదే మొదటిసారి. 32 టీమ్‌లతో నిర్వహించనున్న ఆఖరి వరల్డ్ కప్ ఇదే కానుంది. వచ్చే ఈవెంట్ నుంచి 48 జట్లు బరిలోకి దిగుతాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రతీ ప్రపంచకప్ సాధారణంగా జూన్–జూలైలో నిర్వహిస్తారు. అయితే ఆ సమయంలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ఎడారి దేశంలో నిర్వహణ సాధ్యం కాదని ‘ఫిఫా’ మరో ప్రత్యామ్నాయాన్ని సూచించింది. పలు చర్చోపర్చలు, ఒప్పందాల్లో సవరణలు, వివిధ దేశాల్లో జరిగే ఫుట్‌బాల్ లీగ్‌ల షెడ్యూల్లో మార్పులు చేస్తూ చివరకు దానిని నవంబర్–డిసెంబర్‌కు మార్చారు. అయితే ఈ సమయంలో కూడా వేదికలను సాధ్యమైనంత చల్లగా ఉంచేందుకు నిర్వాహక కమిటీ పలు కొత్త సాంకేతికలను ఉపయోగించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ► మొత్తం 8 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. వరల్డ్ కప్ ట్రోఫీని, 8 వేదికలను గుర్తు చేయడంతో పాటు ఎప్పటికీ శాశ్వతం అన్నట్లుగా గణిత సంజ్ఞ ‘ఇన్ఫినిటీ’ని కలుపుతూ టోర్నీ లోగోను నిర్వాహకులు తయారు చేశారు. మహిళా రిఫరీలు... పురుషుల ప్రపంచకప్‌లో మహిళా రిఫరీలను నియమించడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. స్టెఫానీ ఫ్రాపర్ట్ (ఫ్రాన్స్), సలీమా ముకసంగా (రువాండా), యోషిమి యమషిత (జపాన్) ఆ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురు మహిళలకు అసిస్టెంట్ రిఫరీలుగా కూడా తొలిసారి అవకాశం దక్కింది. ‘ఖతర్’నాక్ నిబంధనలు! అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియాలతో పోటీ పడి 2010లో ఖతర్ నిర్వాహక హక్కులు దక్కించుకుంది. వైశాల్యంపరంగా చూస్తే ప్రపంచకప్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న అతి చిన్న దేశం ఇది. గతంలో ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌లో పాల్గొనకుండా నిర్వహణ హక్కులు తీసుకున్న రెండో దేశం ఖతర్ (జపాన్ 2002లో కోసం 1996లోనే హక్కులు కేటాయించారు. అయితే నిర్వహణకు ముందు ఆ జట్టు 1998 టోర్నీకి క్వాలిఫై అయింది). ఈ క్రమంలో పెద్ద ఎత్తున వివాదాలు కూడా వెంట వచ్చాయి. తగినన్ని అర్హత ప్రమాణాలు లేకపోయినా... ‘ఫిఫా’ అధికారులు విపరీతమైన అవినీతికి పాల్పడి హక్కులు కేటాయించినట్లుగా విమర్శలు వచ్చాయి. విచారణలో అది వాస్తవమని కూడా తేలి చాలా మంది నిషేధానికి కూడా గురయ్యారు కానీ అప్పటికే ఏర్పాట్లు జోరుగా ఉండటంతో వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. స్టేడియాల నిర్మాణంలో 6 వేలకు పైగా కార్మికులు మరణించారని, మానవ హక్కులకు తీవ్ర భంగం కలిగిందని కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. అయితే ఎన్ని జరిగినా... చివరకు ఆట మాత్రం ముందుకు వెళ్లింది. అయితే ఇప్పుడు సరిగ్గా మెగా ఈవెంట్ సమయంలో ఆ దేశపు నిబంధనలు అటు ‘ఫిఫా’ అధికారులను, ఇటు ప్రపంచవ్యాప్త అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశ న్యాయవ్యవస్థ మొత్తం ‘షరియా’ ఆధారంగా ఉండటంతో అందరికీ ఇది కొత్తగా అనిపిస్తోంది. కానీ నిబంధనలు మాత్రం కఠినంగా ఉండటంతో పాటు ఉల్లంఘిస్తే శిక్షలు కూడా కఠినమే. భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా ఇందులో ఉన్నాయి. ► ముందుగా ‘హయ్యా’ కార్డును తీసుకోవాలి. ఆ దశపు ‘వీసా’, మ్యాచ్ టికెట్ ఉన్నా సరే... హయ్యా కార్డు ఉంటేనే ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతిస్తారు. రవాణా సౌకర్యం వాడుకునేందుకు కూడా ఇది అవసరం. ► స్టేడియం పరిసరాల్లో ఆల్కహాల్ నిషేధం.. బీర్లకు కూడా అనుమతి లేదు. దీని వల్ల సుదీర్ఘకాలంగా తమకు స్పాన్సర్‌గా ఉన్న ప్రఖ్యాత కంపెనీ ‘బడ్వైజర్’తో ‘ఫిఫా’కు ఒప్పంద ఉల్లంఘన సమస్య వచ్చింది. దీనిని సరిదిద్దేందుకు వారికి తలప్రాణం తోకకు వచ్చింది. చివరగా స్టేడియాలకు కొద్ది దూరంలో ‘ఫ్యాన్ ఫెస్టివల్’ జోన్లు ఏర్పాటు చేసి అక్కడ తాగేందుకు అనుమతినిచ్చారు. అయితే ఎవరైనా తాగి గ్రౌండ్లోకి వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే మాత్రం దేశం నుంచి బయటకు పంపించేస్తారు. ► ఇష్టమున్నట్లుగా దుస్తులు ధరిస్తే కుదరదు. భుజాలు, మోకాళ్లు కనిపించేలా మహిళల దుస్తులు ఉండరాదు. పబ్లిక్ బీచ్‌లలో స్విమ్సూట్లు ధరించరాదు. అది హోటల్ స్విమ్మింగ్పూల్లకే పరిమితం. మైదానంలో ఉత్సాహంతో షర్ట్లు తొలగించడం కూడా కుదరదు. స్పెషల్ జూమ్ కెమెరాలతో వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటారు. ► భార్యాభర్తలైనా సరే, బహిరంగ ప్రదేశాల్లో రూపంలో కూడా తమ ప్రేమను ప్రదర్శించరాదు. హోమో సెక్సువల్స్కైతే అసలే కలిసి ఉండేందుకు అనుమతి లేదు. విజేత జట్టుకు రూ. 341 కోట్లు ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ 440 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,500 కోట్లు) కాగా... విజేతలకు 42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 341 కోట్లు), రన్నరప్‌కు 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 244 కోట్లు) లభిస్తాయి. ► వరల్డ్ కప్‌లో జట్లు ఒక్కో మ్యాచ్ నుంచి మరో మ్యాచ్ కోసం విమానాల్లో ప్రయాణించే అవసరం లేకుండా వెళ్లేలా వేదికలు ఉండటం 1930 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఎనిమిది స్టేడియాలు, ప్రాక్టీస్ మైదానాలన్నీ 10 కిలోమీటర్ల పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ప్రతీ జట్టు తమకు ప్రాక్టీస్ కోసం కేటాయించిన ఒకే బేస్ క్యాంప్‌లోనే టోర్నీ మొత్తం సాధన చేస్తుంది. –సాక్షి క్రీడా విభాగం -
భారతీయుల అభిమానానికి మెస్సీ ఫిదా..
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియాలోనూ మెస్సీకి వీరాభిమానులు చాలా మందే. కేవలం మెస్సీ ఆటను చూడడం కోసమే చాలా మంది భారత అభిమానులు ఖతార్ చేరుకున్నారు. మాములుగానే మెస్సీ ఎక్కడికైనా వస్తున్నాడంటే అక్కడ వాలిపోయే అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడి కోసం గంటల కొద్దీ నిరీక్షించడం చూస్తూనే ఉంటాం. మరి అలాంటిది ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ ఆడేందుకు జట్టుతో కలిసి ఖతార్‌కు వస్తున్నాడంటే ఇక ఆ నిరీక్షణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మెస్సీ బృందం ఖతార్‌లో అడుగుపెట్టింది. అయితే అక్కడ ఉన్న వందల మంది అభిమానుల్లో భారతీయులే ఎక్కువగా ఉండడం విశేషం. మెస్సీ బస్సు నుంచి దిగగానే ఇండియన్స్ పెద్ద ఎత్తున డ్రమ్స్ వాయించి అతనికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ఇది చూసిన మెస్సీ మొహం సంతోషంతో వెలిగిపోయింది. తనకోసం కొన్ని గంటల నుంచి నిరీక్షిస్తున్నారన్న సంగతి తెలుసుకున్నాకా వారిపై ప్రేమ మరింత పెరిగిన మెస్సీ ముద్దుల వర్షం కురిపించాడు. ఇక గురువారం తెల్లవారుజామునే అర్జెంటీనా జట్టు దుబాయ్ నుంచి ఖతార్‌కు చేరుకుంది. అంతకముందు బుధవారం రాత్రి యూఏఈతో జరిగిన చివరి వార్మప్ మ్యాచ్‌లో అర్జెంటీనా 5-0తో విజయాన్ని అందుకుంది. ఒక గోల్ చేసిన మెస్సీ తన 91వ అంతర్జాతీయ గోల్‌ను అందుకున్నాడు.ఇక గ్రూప్-సీలో ఉన్న అర్జెంటీనా తన తొలి మ్యాచ్‌ను వచ్చే మంగళవారం సౌదీ అరేబియాతో ఆడనుంది. కాగా ఇదే గ్రూప్‌లో అర్జెంటీనా, సౌదీ అరేబియాలతో పాటు మెక్సికో, పొలాండ్లు కూడా ఉన్నాయి. మెస్సీకి బహుశా ఇదే చివరి ఫిఫా వరల్డ్‌కప్ అయ్యే అవకాశం ఉంది. మెస్సీ వయస్సు ప్రస్తుతం 35 ఏళ్లు. మరో సాకర్ సమరం జరగడానికి నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకు మెస్సీ ఆడడం కష్టమే. అందుకే మెస్సీ ఈసారి ఎలాగైనా అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1986లో డీగో మారడోనా నేతృతంలో ఫుట్‌బాల్ ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచిన అర్జెంటీనా మరోసారి విజేత కాలేకపోయింది. Argentina fans in Qatar 🎉🤩#QatarWorldCup2022 pic.twitter.com/LNJlWHpK3j — shukran 👤 (@mury515) November 16, 2022 చదవండి: ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా?
ఫుట్‌బాల్‌లో సాకర్ సమరానికి ఉండే క్రేజ్ వేరు. ఫిఫా వరల్డ్‌కప్ కోసం ప్రపంచంలోని నలుమూలల నుంచి దేశాలు పోటీ పడుతుండడంతో ఎనలేని క్రేజ్ వచ్చింది. జరిగేది నాలుగేళ్లకోసారి అయినప్పటికి దానిని సొంతం చేసుకోవాలని ప్రతీ జట్టు ప్రయత్నిస్తుంటుంది. 32 జట్లు పాల్గొనే ఈ మెగా సమరంలో చివరికి ట్రోఫీ మాత్రం దక్కేది ఒక్కరికే. ఇప్పటివరకు ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో పర్యటించింది. దీనిని తయారు చేసే విధానం నుంచి దీని విలువ వరకూ అన్నీ ఆశ్చర్యం కలిగించేవే. మరి బంగారు వర్ణంలో దగదగ మెరిసిపోయే ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ వెనుక ఉన్న చరిత్రతో పాటు ఎవరు తయారు చేస్తారు.. ఎలా తయారు చేస్తారనేది తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇక ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీ ఖతార్ వేదికగా నవంబర్ 20న ప్రారంభమై.. డిసెంబర్ 18న ముగుస్తోంది. ఫిఫా వరల్డ్‌కప్ తయారు చేసేది ఇలా.. ఫిఫా వరల్డ్‌కప్‌ను 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. ఈ ట్రోఫీ ఎత్తు 37 సెంటీమీటర్లు. బరువు ఆరు కేజీలు. ఇద్దరు వ్యక్తులు భూగోళాన్ని మోస్తున్నట్లుగా ఈ ట్రోఫీని తీర్చిదిద్దారు. ఈ ట్రోఫీని తయారు చేసినప్పుడు దీని విలువ 50 వేల డాలర్లు. కానీ దీని ప్రస్తుత విలువ 2 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.160 కోట్లు కావడం విశేషం. ట్రోఫీ తయారు చేసేది ఆ కుటుంబమే 50 ఏళ్లకుపైగా ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని ఇటలీకి చెందిన ఒకే కుటుంబం తయారు చేస్తోంది. వరుసగా రెండోసారి కూడా ఇటలీ టీమ్ వరల్డ్‌కప్‌లో పాల్గొనకపోయినా.. ఈ ట్రోఫీ రూపంలో ఇటలీ ప్రాతినిధ్యం ఉండటం విశేషం. ప్రస్తుత ట్రోఫీని 1971లో ఇటలీలోని సిల్వియో గాజానిగా అనే ఆర్టిస్ట్ రూపొందించాడు. అంతకుముందు ట్రోఫీని బ్రెజిల్‌కు ఇచ్చేయడంతో ఈ కొత్త ట్రోఫీని రూపొందించాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు గెలిచే జట్టుకు అసలు ట్రోఫీ ఇక ఇప్పుడు కూడా ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని గాజానిగా కుటుంబమే తయారు చేస్తూ వస్తోంది. నిజానికి ప్రతిసారీ విజేతకు బంగారు ట్రోఫీని బహూకరించి తర్వాత తిరిగి తీసుకుంటారు. వాళ్లకు బంగారుపూత ఉన్న నకలును ఇస్తారు. అయితే ఏదైనా టీమ్ మూడుసార్లు ట్రోఫీని గెలిస్తే వాళ్లకు మాత్రం అసలు ట్రోఫీని ఇచ్చేసి మళ్లీ కొత్తగా మరొక ట్రోఫీని తయారు చేస్తారు. ఈ ట్రోఫీని జూలెస్ రిమెట్ ట్రోఫీగా పిలుస్తారు. ఫిఫా మూడో అధ్యక్షుడిగా ఉన్న రిమెట్ గౌరవార్థం ట్రోఫీకి ఆ పేరు పెట్టారు. ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ తయారు విధానాన్ని సిల్వియోగాజానిగా కుటుంబం అల్‌జజీరా చానెల్‌తో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ యూట్యూబ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. చదవండి: FIFA: ప్రపంచానికి తెలియని కొల్హాపూర్ ఫుట్‌బాల్ చరిత్ర FIFA WC 2022: బెల్జియంపై భారీ అంచనాలు.. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి..! -
FIFA Football WC 2022: బెల్జియంపై భారీ అంచనాలు.. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి..!
గత నాలుగు ప్రపంచకప్‌లలో యూరోప్ జట్లే విశ్వవిజేతగా నిలిచాయి. ఈసారీ యూరోప్ నుంచే మళ్లీ ప్రపంచ చాంపియన్ వచ్చే అవకాశాలున్నాయి. గత వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించి కీలకమైన సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన బెల్జియం మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా ఖతర్‌లో అడుగు పెట్టింది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి తడబడకుండా ఆడితే ఈసారి ఆ జట్టుకు గొప్ప ఫలితం లభిస్తుంది. –సాక్షి క్రీడా విభాగం బెల్జియం ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: మూడో స్థానం (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 2. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఇ’ విన్నర్. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లతో నిండిన బెల్జియం జట్టును కచ్చితంగా టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా పరిగణించాలి. 14వ సారి ప్రపంచకప్‌లో ఆడుతున్న బెల్జియం క్వాలిఫయింగ్ టోర్నీలో అజేయంగా నిలిచింది. ఆరు విజయాలు సాధించి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. సమకాలీన ఫుట్‌బాల్‌లో మేటి గోల్‌కీపర్‌గా పేరొందిన థిబాట్ కుర్టియస్, ఉత్తమ మిడ్‌ఫీల్డర్ కెవిన్ డి బ్రున్, స్టార్ ఫార్వర్డ్స్ లుకాకు, హెజార్డ్లతో బెల్జియం పటిష్టంగా కనిపిస్తోంది. తమ గ్రూప్‌లో క్రొయేషియాతో మ్యాచ్ మినహా మొరాకో, కెనడా జట్ల నుంచి బెల్జియంకు పెద్దగా ప్రతిఘటన ఉండకపోవచ్చు. మొరాకో ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (1986). ‘ఫిఫా’ ర్యాంక్: 22. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విన్నర్. ఆఫ్రికా క్వాలిఫయింగ్ టోర్నీలో అజేయంగా నిలిచిన మొరాకో ప్రపంచకప్ ప్రధాన టోర్నీలోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అయితే బెల్జియం, క్రొయేషియాలాంటి రెండు పటిష్ట జట్లను నిలువరించాలంటే మొరాకో అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. హకీమ్ జియచ్, హకీమీ కీలక ఆటగాళ్లు. కెనడా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ (1986). ‘ఫిఫా’ ర్యాంక్: 41. అర్హత ఎలా: ఉత్తర, మధ్య అమెరికా కరీబియన్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విన్నర్. మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌కు అర్హత పొందిన కెనడా జట్టులో అల్ఫోన్సో డేవిస్, డేవిడ్ల రూపంలో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రెండోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కెనడా 1986లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గ్రూప్‌లో బెల్జియం, క్రొయేషియా లాంటి పటిష్ట జట్లు ఉండటంతో కెనడా ఈసారైనా పాయింట్ల ఖాతా తెరుస్తుందో లేదో వేచి చూడాలి. క్రొయేషియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: రన్నరప్ (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 12. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘హెచ్’ విన్నర్. నాలుగేళ్ల క్రితం సంచలన ప్రదర్శనతో క్రొయేషియా తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత పలువురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ కావడంతో కొంత బలహీన పడ్డా యూరోపియన్ క్వాలిఫయింగ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించి తొలి అవకాశంలోనే ప్రపంచకప్ బెర్త్ సాధించింది. తాజా జట్టులో అనుభవంలేని యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో స్టార్ మిడ్ ఫీల్డర్లు లుకా మోడ్రిచ్, బ్రొజోవిచ్, కొవాచిచ్ల ఆటతీరుపైనే క్రొయేషియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు తదుపరి వరల్డ్‌కప్‌లోనూ ఫైనల్‌కు చేరడం చివరిసారి 2002లో జరిగింది. 1998 ప్రపంచకప్ రన్నరప్ బ్రెజిల్ 2002లో ఫైనల్ చేరడంతోపాటు విజేతగా నిలిచింది. -
'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు'
ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్ సమరానికి అంతా సిద్ధమైంది. ఇప్పటికే వరల్డ్‌కప్‌లో పాల్గొననున్న జట్లన్నీ ఖతార్‌కు చేరుకున్నాయి. ఈసారి ఎవరో విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా దేశం తరపున వరల్డ్‌కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే పియర్స్ మోర్గాన్ అనే బ్రిటిష్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో పాటు ఆ జట్టు మేనేజర్ నాకు ద్రోహం చేశారంటూ ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పియర్స్ మోర్గాన్ ఇంటర్య్వూ రెండో భాగం కూడా బయటికి వచ్చింది. ఇందులో రొనాల్డో చనిపోయిన తన కొడుకు గురించి తలచుకొని ఎమోషనల్ అయ్యాడు. విషయంలోకి వెళితే.. రొనాల్డో ప్రస్తుతం అర్జెంటీనాకు చెందిన మోడల్ జార్జినా రోడ్రిగ్జ్‌తో సహజీవనం చేస్తున్నాడు. వీరికి 2017లోనే ఒక కుమార్తె పుట్టింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంటకు కవలలు పుట్టారు. అయితే కవలల్లో అమ్మాయి బతకగా.. అబ్బాయి మాత్రం చనిపోయాడు. ఇది రొనాల్డోనూ చాలా బాధించింది. తనకు వారసుడు పుట్టాడనే ఆనందం అంతలోనే ఆవిరైందన్న బాధ రొనాల్డోలో స్పష్టంగా కనిపించింది. తాజాగా ఇదే విషయాన్ని రొనాల్డో పియర్స్ మోర్గాన్ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''మనకు పిల్లలు పుట్టబోతున్నారని తెలిస్తే అంతా నార్మల్‌గా జరగాలని కోరుకుంటాం. కానీ పుట్టిన సమయంలో సమస్య తలెత్తి పురిట్లోనే బిడ్డ చనిపోతే ఎలా ఉంటుంది. ఆ బాధను నేను దగ్గరి నుంచి అనుభవించాను. ఈ విషయంలో నాకంటే జార్జినా ఎక్కువగా బాధపడడం సహజం. ఎందుకంటే మాతృత్వం అనేది చాలా గొప్పది. ఆ క్షణంలో అలా జరిగిపోయేసరికి మాకు చాలా క్లిష్టంగా అనిపించింది. నిజంగా ఆ సమయంలో మా జీవితంలో ఏం జరిగిందో కూడా కొంతకాలం అర్థం కాలేదు. నిజంగా నా కొడుకుకు పురిట్లోనే పోగొట్టుకోవడం చాలా బాధించింది. మా నాన్న చనిపోయిన రోజున ఎంత బాధపడ్డానో అదే బాధను నా కొడుకు చనిపోయిన రోజున అనుభవించాను. మనల్ని ద్వేషించే వాడికి కూడా ఈ కష్టం రాకూడదని ఆరోజు కోరుకున్నా'' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ రెండు బాగాలుగా విడుదల చేశారు. ఈ బుధవారం, గురువారం రొనాల్డో ఫుల్ ఇంటర్య్వూ వీడియోను అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో వీక్షించొచ్చు "That moment was probably the most difficult moment that I have in my life." Cristiano Ronaldo opens up about the devastating death of his baby son, telling Piers Morgan: "We don't understand why it happened to us."@cristiano | @piersmorgan | @TalkTV | #PMU pic.twitter.com/tOba0WJpBf — Piers Morgan Uncensored (@PiersUncensored) November 15, 2022 చదవండి: Cristiano Ronaldo: 'ద్రోహం చేశారు'.. రొనాల్డో సంచలన వ్యాఖ్యలు -
FIFA: ప్రపంచానికి తెలియని కొల్హాపూర్ ఫుట్‌బాల్ చరిత్ర
భారత్‌లో ఫుట్‌బాల్ క్రీడకు అంతగా ప్రాధాన్యం లేదు. ఫుట్‌బాల్ కంటే క్రికెట్‌కే ఎక్కువ క్రేజ్ ఉన్న దేశంలో గోవా, బెంగాల్, కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఫుట్‌బాల్‌కే విపరీతమైన ఆదరణ ఉంటుంది. భారత ఫుట్‌బాల్ జట్టులో ఆడే ఆటగాళ్లలో కూడా ఈ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ. కానీ మనకు తెలియకుండానే మన దేశంలో ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉన్న ప్రాంతం మరొకటి ఉంది. అదే మహారాష్ట్రలోని కొల్హాపూర్ సిటీ. నవంబర్ 20 నుంచి ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎంత ఆదరణ ఉంది అని ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలు బయటపడ్డాయి. గత 30 ఏళ్లుగా కొల్హాపూర్ సిటీలో ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్.. అక్కడి ప్రజలు ఆ ఆటపై పెట్టుకున్న ప్రేమ ఎంతనేది బయటకొచ్చింది. కొల్హాపూర్ సిటీలో నివసించే ప్రజలు క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌నే ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకు సాక్ష్యం ఆ సిటీలో ఉన్న గోడలపై స్టార్ ఫుట్‌బాలర్స్ పెయింటింగ్స్. ప్రతీ వీధిలోనూ ఒక్కో ఫుట్‌బాలర్ మనకు కనిపిస్తాడు. మెస్సీ నుంచి రొనాల్డో వరకు.. మారడోనా నుంచి పీలే దాకా.. ఇలా మనకు కావాల్సిన ఆటగాళ్ల చిత్రాలన్ని పెయింటింగ్స్ రూపంలో ఉంటాయి. అయితే అర్జెంటీనా, బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఇక్కడ కాస్త ఎక్కువగా ఆదరిస్తారు. ఇటీవలే కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్‌ను అర్జెంటీనా చిత్తు చేసి విజేతగా నిలిచినప్పుడు కొల్హాపూర్‌లో పెద్ద జాతర జరిగింది. ఖాన్బోడా తలీమ్ అనే గ్రూప్ ఈ వేడుకల్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. బ్లూ, వైట్ ఫ్లాగ్స్గా విడిపోయి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సాహూ అనే ఫుట్‌బాల్ మైదానం ఉంటుంది. 30వేల సామర్థ్యంతో సీటింగ్ కెపాసిటీ ఉండడం విశేషం. ఇక గణేష్ నవరాత్రుల సందర్భంగా కొల్హాపూర్ ఫుట్‌బాల్ ఫెస్టివ్ సీజన్ మొదలై.. దాదాపు రెండు నెలలు అంటే దీపావళి వరకు ఈ టోర్నీ సాగుతుంది. టోర్నీలో విజేతగా నిలిచిన జట్టును గౌరవంగా చూస్తారు. ఆ సిటీలో తిరిగే ప్రతీ వ్యక్తి తమ వాహనాలపై పీటీఎమ్ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతారు. ఇలా ఫుట్‌బాల్‌పై తమకున్న పిచ్చి ప్రేమను చూపిస్తుంటారు. ఇదంతా పక్కనబెడితే.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా దగ్గర్లోని శివాజీ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌కు పట్టుమని వంద మంది కూడా రాలేదు. కానీ అదే రోజు పక్కనే ఉన్న ఫుట్‌బాల్ స్టేడియంలో ప్రాక్టీస్ క్లబ్, శివాజీ మండల్ మధ్య నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వేల సంఖ్యలో ప్రేక్షకులు హాజరవ్వడం విశేషం. అందుకే ఇకపై భారత్‌లో ఫుట్‌బాల్ అనగానే కేరళ, బెంగాల్, గోవా లాంటి రాష్ట్రాలే కాదు కొల్హాపూర్ సిటీ కూడా గుర్తుకురావాల్సిందే. చదవండి: '2009 తర్వాత మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారాయి' పూర్వ వైభవంపై జర్మనీ దృష్టి -
‘ఫ్రెంచ్ కిక్’ అదిరేనా!
తొమ్మిది దశాబ్దాల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ జట్టు టైటిల్ నిలబెట్టుకొని 60 ఏళ్లు గడిచాయి. చివరిసారి బ్రెజిల్ జట్టు ఈ ఘనత సాధించింది. బ్రెజిల్ వరుసగా 1958, 1962 ప్రపంచకప్‌లలో చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మరో విజేత జట్టు తదుపరి ప్రపంచకప్‌లో టైటిల్ సాధించలేకపోయింది. 1994 తర్వాత ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన యూరోప్ జట్టు తదుపరి వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ దాటడంలో విఫలమవుతోంది. చరిత్రపరంగా చూస్తే ప్రస్తుత విజేత ఫ్రాన్స్ జట్టుకు ప్రతికూలాంశాలు ఉన్నాయనుకోవాలి. కానీ ఎంతోమంది స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ఫ్రాన్స్ జట్టు ఖతర్‌లో చరిత్రను తిరగరాస్తుందా? 60 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలుస్తుందా వేచి చూడాలి. ఫ్రాన్స్ బలగాన్ని చూస్తే మాత్రం గ్రూప్ ‘డి’లో ఉన్న మిగతా జట్లు డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియాలను దాటుకొని నాకౌట్ దశకు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరో అవకాశం ఉండని నాకౌట్ దశ నుంచి ఆ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. ఫ్రాన్స్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: విజేత (1998, 2018). ‘ఫిఫా’ ర్యాంక్: 4. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘డి’ విన్నర్. ప్రపంచకప్‌లో 16వసారి బరిలోకి దిగుతున్న ఫ్రాన్స్ జట్టు క్వాలిఫయింగ్ పోటీల్లో అజేయంగా నిలిచింది. యూరో టోర్నీలో వైఫల్యం తర్వాత గత ఏడాది నేషన్స్ లీగ్ టైటిల్‌ను సాధించి ‘ది బ్లూస్’ జట్టు ఫామ్‌లోకి వచ్చింది. వ్యక్తిగత వివాదాల్లో ఇరుక్కొని 2018 ప్రపంచకప్‌నకు దూరమైన 34 ఏళ్ల స్టార్ స్ట్రయికర్ కరీమ్ బెంజెమా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఆడనుండటం శుభసూచకం. ఈ ఏడాది యూరోప్ ప్రొఫెషనల్ లీగ్స్ చాంపియన్స్ లీగ్, లా లీగాలో రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టుకు టైటిల్ దక్కడంలో కరీమ్ బెంజెమా కీలకపాత్ర పోషించాడు. కరీమ్ బెంజెమాతోపాటు ఇతర స్టార్ ఆటగాళ్లు కిలియాన్ ఎంబాపె, గ్రీజ్మన్, థియో హెర్నాండెజ్ రాణిస్తే మాత్రం ఫ్రాన్స్ జట్టు ఈసారీ ప్రపంచకప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్రూప్ దశలో ఒక్క డెన్మార్క్ తప్ప ఇతర జట్ల నుంచి ఫ్రాన్స్‌కు గట్టిపోటీ లభించే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. గ్రూప్ దశ దాటి నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత పొందాకే ఫ్రాన్స్ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. డెన్మార్క్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్స్ (1998). ‘ఫిఫా’ ర్యాంక్: 10. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎఫ్’ విన్నర్. ఆరోసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న డెన్మార్క్ క్వాలిఫయింగ్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆడిన పది మ్యాచ్‌ల్లో తొమ్మిదింట గెలిచి, కేవలం ఒక మ్యాచ్‌లో ఓడింది. 30 గోల్స్ సాధించి, కేవలం మూడు గోల్స్ ప్రత్యర్థి జట్లకు ఇచ్చింది. స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్పైనే అందరి దృష్టి ఉంది. ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా సమష్టిగా రాణించడం డెన్మార్క్ జట్టు ప్రత్యేకత. తమ గ్రూప్‌లో ఫ్రాన్స్ జట్టుతో మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్‌ల్లో డెన్మార్క్ జట్టుకు విజయాలు దక్కే అవకాశాలున్నాయి. తాము ఆడిన గత నాలుగు ప్రపంచకప్‌లలో డెన్మార్క్ గ్రూప్ దశను దాటి నాకౌట్ రౌండ్ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. ఈసారి ఆ జట్టు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగుస్తుందో ముందుకు సాగుతుందో చూడాలి. ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (2006). ‘ఫిఫా’ ర్యాంక్: 38. అర్హత ఎలా: ఆసియా–దక్షిణ అమెరికా మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ విజేత. ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా నాకౌట్ దశకు చేరాలంటే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ట్యునీషియాపై ఆ జట్టుకు గెలిచే అవకాశాలున్నా... ఫ్రాన్స్, డెన్మార్క్ జట్ల మ్యాచ్‌ల ఫలితాలే ఆ జట్టుకు కీలకం కానున్నాయి. యూరోపియన్ లీగ్స్‌లో పలు మేటి జట్లకు ఆడిన స్ట్రయికర్ అజ్దిన్ రుస్టిక్పై ఆసీస్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. గత రెండు ప్రపంచకప్‌లలో ఆసీస్ ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఈసారి తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఆడనున్న ఆస్ట్రేలియా కనీసం ‘డ్రా’తో గట్టెక్కినా అది విజయంతో సమానమే. ట్యునీషియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 30. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్ విన్నర్. ఆరోసారి ప్రపంచకప్ ఆడుతున్న ట్యునీషియా జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎక్కువగా రక్షణాత్మకంగా ఆడే అలవాటున్న ట్యునీషియా ఈ ఏడాది 12 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు గోల్స్ మాత్రమే తమ ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. వాబి ఖాజ్రి, యూసెఫ్ మసాక్ని, నయీమ్ జట్టులోని కీలక ఆటగాళ్లు. పటిష్ట జట్లయిన ఫ్రాన్స్, డెన్మార్క్‌లతో జరిగే మ్యాచ్‌లే ఈ మెగా ఈవెంట్లో ట్యునీషియా ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి. –సాక్షి క్రీడా విభాగం -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్... ఈసారైనా!
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ప్రతిసారీ భారీ అంచనాలతో అడుగు పెడుతుంది. ఈసారీ ఆ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా ఉంది. గ్రూప్ ‘బి’లో ఇరాన్, అమెరికా, వేల్స్ జట్లతో పోటీపడనున్న ఇంగ్లండ్ స్థాయికి తగ్గట్టు ఆడితే గ్రూప్ దశను సులువుగా దాటుతుంది. ఇంగ్లండ్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: విజేత (1966) ఇతర ఘనతలు: యూరో కప్ రన్నరప్ (2020) ‘ఫిఫా’ ర్యాంక్: 5 అర్హత: యూరోప్‌లో గ్రూప్–1 విజేత హోదాలో. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఇంగ్లండ్ అజేయంగా నిలిచింది. అదే జోరును ప్రధాన టోర్నీలోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉంది. 2018 రష్యాలో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సెమీఫైనల్లో ఓడి, ఆ తర్వాత ప్లే ఆఫ్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలోనూ ఓడి నాలుగో స్థానంలో నిలిచింది. కెప్టెన్ హ్యారీ కేన్‌తోపాటు జాక్ గ్రేలిష్, డెక్లాన్ రైస్, ట్రెంట్ అలెగ్జాండర్, జాన్ స్టోన్స్, కైల్ వాకర్‌లాంటి స్టార్ ఆటగాళ్లతో ఇంగ్లండ్ పటిష్టంగా ఉంది. ఓవరాల్‌గా 16వసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. . ఇరాన్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ ఇతర ఘనతలు: ఆసియా విజేత (1968, 72, 76) ‘ఫిఫా’ ర్యాంక్: 20 అర్హత: ఆసియా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ విన్నర్ ఓవరాల్‌గా ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇరాన్ ఏనాడూ గ్రూప్ దశలో తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. ఆసియా క్వాలిఫయింగ్‌లో ఆడిన 18 మ్యాచ్‌ల్లో 14 విజయాలు అందుకున్న ఇరాన్ ప్రధాన టోర్నీలో ఈసారైనా తొలి రౌండ్ దాటాలని పట్టుదలతో ఉంది. సర్దార్ అజ్మౌన్, అలీరెజా, మాజిద్ హుస్సేన్‌లాంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఇరాన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అమెరికా ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1930) ఇతర ఘనతలు: కాన్ఫడరేషన్స్ కప్ రన్నరప్ (2009) ‘ఫిఫా’ ర్యాంక్: 16 అర్హత: ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్లో మూడో స్థానం. నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన ప్రపంచకప్‌కు అర్హత పొందలేకపోయిన అమెరికా ఓవరాల్‌గా 11వసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. పులిసిక్, వెస్టన్ మెకెనీ, రేనాలాంటి కీలక ఆటగాళ్లు రాణిస్తే నాకౌట్ దశకు చేరుకునే అవకాశముంది. వేల్స్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1958) ఇతర ఘనతలు: యూరో టోర్నీలో మూడో స్థానం (2016) ‘ఫిఫా’ ర్యాంక్: 19 అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ విన్నర్. 1958 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన వేల్స్ జట్టు ఆశలన్నీ గ్యారెత్ బేల్, డానియల్ జేమ్స్, ఆరోన్ రామ్సెలాంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి. –సాక్షి క్రీడావిభాగం -
ఖతార్‌లో ‘సాకర్’.. తెలంగాణ మీద ఎఫెక్ట్!
ఊళ్లో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలెన్నో. అయినవారికి దూరంగా ఎడారి దేశాల్లో అవస్థలు పడుతున్న బాధితులెందరో. ఇన్నేళ్లు మనం చూసిన వారి గోసపై ఇప్పుడు ప్రపంచం దృష్టి పెట్టింది. గల్ఫ్ సమస్యలు, బాధితుల పరిస్థితులను యూరప్ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఫ్రాన్స్, పోలండ్, స్విట్జర్లాండ్ తదితర దేశాల మీడియా సంస్థలు కొన్ని వారాలుగా రాష్ట్రంపై ఫోకస్ పెట్టాయి. ఆయా సంస్థల జర్నలిస్టులు తెలంగాణ పల్లెల్లో పర్యటిస్తున్నారు. గల్ఫ్ కుటుంబాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి, బాధిత కుటుంబాల వ్యథను నేరుగా తెలుసుకుంటున్నారు.. దుబాయ్, ఖతార్, సౌదీ, కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు నిత్యం తెలంగాణ జిల్లాల నుంచి వెళ్తూనే ఉన్నారు. కార్మికులుగా వెళ్లి.. బాధితులుగా మారినవారూ మన రాష్ట్రం నుంచే ఎక్కువ. గ్రామీణ నేపథ్యం, నిరక్షరాస్యత, గల్ఫ్ చట్టాలపై అవగాహన లోపం, చేసే పనులకు సంబంధించి ముందస్తు శిక్షణ లేకపోవడం తదితర కారణాలతోపాటు ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలామంది బాధితులుగా మారుతున్నారు. కొందరు ప్రాణాలనూ కోల్పోతున్నారు. జగిత్యాల జిల్లా చిట్టాపూర్‌లో ఫ్రాన్స్ టీవీకి చెందిన జర్నలిస్టు జెర్మైన్బేస్లే.. ‘ఫుట్‌బాల్’ ఆడుకుంటున్నారు ఈనెల 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఖతార్‌లో ఫిఫా వరల్డ్‌కప్–2022 జరగనుంది. ఈ ఆట ఆ దేశంలో ఉంటున్న మన కార్మికుల జీవితాలతో ఆడుకుంటోంది. సాకర్ వరల్డ్‌కప్ నేపథ్యంలో కొన్ని నెలల ముందు నుంచే ఖతార్‌లో నిర్మాణరంగ పనులను నిలిపివేశారు. పలు రంగాలకు ఆంక్షలు విధించారు. రాష్ట్రం నుంచి వెళ్లినవారిలో చాలామంది నిర్మాణ రంగంలోనే ఉన్నారు. ప్రపంచకప్ నేపథ్యంలో ప్రాజెక్టులు లేకపోవడంతో చాలామందిని తిప్పి పంపిస్తున్నారు. మరికొందరికి పనివేళలు, పనిగంటలు, ప్రదేశాలనూ మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులు, గల్ఫ్ బాధితుల కుటుంబాల పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రపంచ మీడియా ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఓ జాతీయ ఇంగ్లిష్ దిన పత్రిక రాసిన కథనం కూడా ఇందుకు కారణమైంది. బాధిత కుటుంబంతో వీడియోకాల్ ద్వారా మాట్లాడుతున్న పోలాండ్ స్పోర్ట్స్ జర్నలిస్టు తెలంగాణ బాట... ప్రధానంగా యూరప్ దేశాల మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు తెలంగాణ బాట పట్టారు. ఫ్రాన్స్ 24 మీడియా సంస్థకు చెందిన ఇండియా, దక్షిణాసియా కరస్పాండెంట్ లీ డెల్ఫోలీ రెండురోజులపాటు నిర్మల్, ఆర్మూర్ ప్రాంతాల్లో పర్యటించారు. వెల్మల్, ఢీకంపల్లి, గగ్గుపల్లి గ్రామాల్లో బాధితులతో మాట్లాడారు. ఆర్మూర్లోనూ పలువురి నుంచి సమాచారం సేకరించారు. ఫ్రాన్స్ టీవీకి చెందిన జర్నలిస్టు జెర్మైన్ బేస్లే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్‌లో బాధిత కుటుంబాలను కలిశారు. స్విట్జర్లాండ్‌కు చెందిన వీడియో జర్నలిస్టు జోసెఫ్ జగిత్యాల జిల్లా సుద్దపల్లిలో పలు కుటుంబాలతో మాట్లాడారు. పోలండ్‌కు చెందిన డారియస్ ఫరోన్ అనే స్పోర్ట్స్ జర్నలిస్టు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన బాధిత కుటుంబాలతో వీడియోకాల్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విదేశాల నుంచి వస్తున్న జర్నలిస్టులకు, గల్ఫ్ కుటుంబాలకు ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలూ గుర్తించాలి ఖతర్‌లో ఫిఫా కప్ నేపథ్యంలో కార్మికులను ఇంటికి పంపిస్తున్నారు. కొన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలువులు ఇస్తున్నాయి. కొన్ని ఇవ్వడం లేదు. విదేశీ మీడియా ప్రతినిధులు బాధిత కుటుంబాల పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కార్మికులకు అండగా నిలవాలి. – స్వదేశ్ పరికిపండ్ల, అధ్యక్షుడు, ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ . -
నాకౌట్‌కు చేరే అవకాశాలు ఆ రెండు జట్లకే..!
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఖతర్‌తో పాటు నెదర్లాండ్స్, సెనెగల్, ఈక్వెడార్‌లు పోటీ పడుతున్నప్పటికీ నాకౌట్ అవకాశాలు డచ్, సెనెగల్ జట్లకే ఉన్నాయి. ఆసియా చాంపియన్ ఖతర్ ఆ రెండు జట్లను మించి నాకౌట్‌కు చేరడం అంత సులువేమీ కాదు. అయితే ఘనమైన ఆతిథ్యంతో పాటు టోర్నీలో చక్కని ప్రదర్శనతో ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ఖతర్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరి బలాబలాలేంటో పరిశీలిద్దాం ఖతర్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: ఇదే తొలిసారి ఇతర ఘనతలు: ఆసియా కప్ విజేత (2019) ఫిఫా ర్యాంకు: 50 అర్హత: ఆతిథ్య హక్కులతో నేరుగా సాకర్ వరల్డ్‌కప్ ఆతిథ్యం కోసం ఖతర్ ప్రభుత్వం, పాలకులు తెరముందు, తెరవెనుక ఎంతో చేశారు. అయితే ఖతర్ ఫుట్‌బాల్ జట్టు కోసం అహర్నిశలు కృషిచేసింది మాత్రం కోచ్ ఫెలిక్స్ సాంచెజ్ మాత్రమే! స్పానిష్కు చెందిన 46 ఏళ్ల కోచ్ కృషి వల్లే 2019లో ఖతర్ ఆసియా కప్ సాధించింది. 2006 నుంచి ఆయన జట్టును సానబెడుతూ వచ్చారు. ఈ జట్టులో అక్రమ్ అఫిఫ్ కీలక ఆటగాడు. నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. నెదర్లాండ్స్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: మూడు సార్లు రన్నరప్ (1974, 1978, 2010) ఇతర ఘనతలు: యూరోపియన్ చాంపియన్ (1988) ఫిఫా ర్యాంకు: 8 అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్‌లో తొలిస్థానం ఈ గ్రూపులో మేటి జట్టు నెదర్లాండ్స్. ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉంది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్–జిలో అగ్ర స్థానంతో మెగా ఈవెంట్‌కు అర్హత పొందింది. మిడ్‌ఫీల్డర్ ఫ్రెంకీ డి జాంగ్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. డిఫెండర్లలో డేలి బ్లిండ్, స్టీఫన్ డి రిజ్ ప్రత్యర్థి స్ట్రయికర్లను చక్కగా నిలువరిస్తున్నారు. దీంతో ఈ సారి ఫైనల్ చేరితే మాత్రం కప్‌ను చేజార్చుకునే ప్రసక్తే లేదనే లక్ష్యంతో ఉంది. సెనెగల్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్స్ (2002) ఇతర ఘనతలు: ఆఫ్రికన్ చాంపియన్స్ (2022) ఫిఫా ర్యాంకు: 18 అర్హత: ప్లే–ఆఫ్స్‌లో ఈజిప్టును ఓడించి ఈ గ్రూపు నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరే అర్హత ఉన్న రెండో జట్టు సెనెగల్. ఈ ఏడాది ఆఫ్రికన్ చాంపియన్‌గా నిలిచింది. స్టార్ డిఫెండర్ కలిడో కలిబేలి సారథ్యంలోని సెనెగల్ ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉంది. మిడ్ఫీల్డర్లలో ఇడ్రిసా గుయె, పేప్ గుయె, ఫార్వర్డ్‌లో బౌలయె డియా, హబిబ్ డైయలోలు కూడా స్థిరంగా రా>ణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రిక్వార్టర్స్ లక్ష్యంగా పెట్టుకున్న సెనెగల్ 20 ఏళ్ల క్రితంనాటి క్వార్టర్ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలనుకుంటుంది. ఈక్వెడార్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్స్ (2006); ఫిఫా ర్యాంకు: 44 ఇతర ఘనతలు: కోపా అమెరికా కప్‌లో నాలుగో స్థానం (1959, 1993) అర్హత: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్‌లో నాలుగో స్థానం నెదర్లాండ్స్, సెనెగల్‌లతో కనీసం డ్రాతో గట్టెక్కినా అది ఈక్వెడార్ గొప్ప ప్రదర్శనే అవుతుంది. సంచలనాలు నమోదైతే తప్ప నాకౌట్ చేరడం కష్టం. అర్జెంటీనాకు చెందిన కోచ్ గుస్తావో అల్ఫారోకు అక్కడి క్లబ్ జట్లను తీర్చిదిద్దిన అనుభవంతో 2020లో ఈక్వెడార్ కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్ ఎన్నెర్ వాలెన్సియా ఈక్వెడార్ తురుపుముక్క. మేజర్ ఈవెంట్లలో 35 గోల్స్‌తో ఈక్వెడార్ ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్లలో ఒకడిగా నిలిచాడు. –సాక్షి క్రీడావిభాగం -
FIFA World Cup: అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లెవరంటే?
మరో రెండు రోజుల్లో టి20 వరల్డ్‌కప్ ముగియనుంది. ఇప్పటివరకు ఫోర్లు, సిక్సర్లు కౌంట్ చేసిన నోటితోనే గోల్స్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. టి20 వరల్డ్‌కప్ ముగిసిన వారం రోజులకు మరో మెగా సమరం మొదలుకానుంది. క్రికెట్ కంటే కాస్త ఎక్కువే క్రేజ్ ఉన్న క్రీడ ఫుట్‌బాల్. మాములు ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతూనే అభిమానులకు పూనకాలు వస్తాయి. మరి అలాంటిది సాకర్ సమరానికి(ఫిఫా వరల్డ్‌కప్) సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకు మనకు తెలిసిన స్టార్స్‌ను ఉమ్మడిగా వేర్వేరు జట్లలో చూస్తుంటాం. కానీ ఫిఫా వరల్డ్‌కప్ అనగానే దేశం తరపున ఆడడానికి ఆటగాళ్లు సిద్ధమవుతారు. మరి అంత క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ గురించి మాట్లాడుకుంటే.. 1930 నుంచి ఇప్పటి వరకూ 21 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ టోర్నీలు జరిగాయి. మరి ఇప్పటి వరకూ ఈ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ ఎవరనేది ఒకసారి పరిశీలిద్దాం. మిరొస్లావ్ క్లోజ్ ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా జర్మనీ స్ట్రైకర్ మిరొస్లావ్ క్లోజ్ నిలుస్తాడు. అతడు ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌లలో 24 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 16 గోల్స్‌తో టాప్‌లో ఉన్నాడు. క్లోజ్ నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. ఈ 24 మ్యాచ్‌లలో 63సార్లు అతడు గోల్డ్పోస్ట్పై దాడి చేసి 16 గోల్స్ చేయడం విశేషం. అంటే ప్రతి నాలుగు షాట్లలో ఒకదానిని అతడు గోల్‌గా మలిచాడు. రొనాల్డో లూయిస్ నజారియో డె లిమా మిరొస్లావ్ క్లోజ్‌కు ముందు అత్యధిక గోల్డ్స్ రికార్డు బ్రెజిల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో పేరిట ఉండేది. రొనాల్డో చివరిసారి 2002లో వరల్డ్‌కప్ గెలిచిన బ్రెజిల్ టీమ్‌లో సభ్యుడు. అతడు మూడు టోర్నీల్లో 19 మ్యాచ్‌లలోనే 15 గోల్స్ చేయడం విశేషం. 1998లో తాను ఆడిన తొలి వరల్డ్‌కప్‌లో నాలుగు గోల్స్ చేశాడు. ఇక 2002లో అయితే ఏడు మ్యాచ్‌లలోనే 8 గోల్స్ చేసిన గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. అతని ప్రదర్శనతోనే 2002లో బ్రెజిల్ ఖాతాలో ఐదో టైటిల్ వచ్చి చేరింది. గెర్డ్ ముల్లర్ జర్మనీ లెజెండరీ ప్లేయర్ గెర్డ్ ముల్లర్ 14 వరల్డ్‌కప్ గోల్స్ చేశాడు. కేవలం రెండు వరల్డ్‌కప్‌లలో అతడు ఇన్ని గోల్స్ చేయడం విశేషం. 1970 వరల్డ్‌ప్‌లో 10 గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. 1970 తర్వాత ముల్లర్ చేసినన్ని గోల్స్ మరే ఇతర వరల్డ్‌కప్‌లో ఏ ఆటగాడు కూడా చేయలేదు. జస్ట్ ఫాంటెయిన్ ఫ్రాన్స్ స్ట్రైకర్ ఫాంటెయిన్కు ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఉంది. అతడు 1958 వరల్డ్‌కప్‌లో ఏకంగా 13 గోల్స్ చేశాడు. అతడు ఆడిన ఏకైక వరల్డ్‌కప్ ఇదే కావడం గమనార్హం. పీలే బ్రెజిల్ లెజెండరీ ప్లేయర్ పీలే వరల్డ్‌కప్‌లలో 12 గోల్స్ చేశాడు. అతడు నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. అతడు ఎప్పుడూ గోల్డెన్ బూట్ అవార్డు గెలవకపోయినా.. 1970లో బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ టోర్నీలో నాలుగు గోల్స్ చేయడంతోపాటు ఆరు గోల్స్ కావడంలో సాయపడ్డాడు. ఇప్పుడు ఖతార్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌లో అందరి కళ్లూ థామస్ ముల్లర్, క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ సురెజ్, లియోనెల్ మెస్సీ, కరీమా బెంజెమా లపైనే ఉన్నాయి. ముల్లర్ ఖాతాలో 10 గోల్స్ ఉండగా.. రొనాల్డో 7, మెస్సీ 6 గోల్స్ చేశారు. -
ఫిపా వరల్డ్‌కప్.. ఆసియా జట్ల ప్రదర్శన అంతంతే
ఖరీదైన క్రీడ కాకపోవడం... ప్రావీణ్యం ఉంటే ఎక్కడైనా ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు మెండుగా ఉండటం... ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్ లీగ్‌లు జరుగుతుండటం... వెరసి ఫుట్‌బాల్ ఆడేవారి సంఖ్యలో పెరుగుదలే కానీ తరుగుదల కనిపించదు. అన్ని ఖండాలకు చెందిన జట్లు భాగస్వామ్యంగా నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఎనిమిది దేశాలు విశ్వవిజేతగా నిలిచాయి. ఇందులో ఐదు జట్లు (జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్) యూరప్‌నకు చెందినవి కాగా మిగతా మూడు జట్లు (బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే) దక్షిణ అమెరికాకు చెందినవి. అయితే ఆసియా, ఆఫ్రికా దేశాలు మాత్రం ఈ మెగా ఈవెంట్లో అడపాదడపా మెరిపిస్తున్నా నిలకడైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. 1938లో ఆసియా నుంచి ఇండోనేసియా తొలిసారి ప్రపంచకప్‌లో ఆడింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942లో, 1946లో ప్రపంచపక్ జరగలేదు. 1950లో బ్రెజిల్లో ప్రపంచకప్ జరిగినా ఆసియా నుంచి ఒక్క దేశం కూడా పాల్గొనలేదు. 1954లో దక్షిణ కొరియా రూపంలో మళ్లీ ఆసియా నుంచి ప్రాతినిధ్యం మొదలైంది. ఆ తర్వాత జరిగిన ఐదు ప్రపంచకప్‌లలో రెండుసార్లు మాత్రమే ఆసియా నుంచి జట్లు పాల్గొన్నాయి. 1978 నుంచి మాత్రం ప్రతి ప్రపంచకప్‌లో ఆసియా జట్లు బరిలోకి దిగుతున్నాయి. క్రమక్రమంగా ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్య పెరగడంతో ఆసియా జోన్ నుంచి మరిన్ని జట్లకు అవకాశం లభించింది. ఇప్పటివరకు ఆసియా నుంచి 12 జట్లు ప్రపంచకప్‌లో ఒక్కసారైనా బరిలోకి దిగాయి. దక్షిణ కొరియా అత్యధికంగా 11 సార్లు ప్రపంచకప్‌లో పోటీపడింది. జపాన్ ఏడుసార్లు బరిలోకి దిగగా... ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా ఆరుసార్లు చొప్పున ఈ మెగా ఈవెంట్లో పోటీపడ్డాయి. 1966లో ఉత్తర కొరియా క్వార్టర్ ఫైనల్ చేరగా... 2002లో జపాన్‌తో కలిసి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన దక్షిణ కొరియా సెమీఫైనల్ చేరి ఈ ఘనత సాధించిన ఏకైక ఆసియా జట్టుగా నిలిచింది. అనంతరం నాలుగు ప్రపంచకప్‌లు జరిగినా మరో ఆసియా జట్టు సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. మరో పది రోజుల్లో ఖతర్‌లో ప్రారంభం కాబోతున్న ప్రపంచకప్‌లో ఆసియా నుంచి తొలిసారి అత్యధికంగా ఆరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆతిథ్య ఖతర్ జట్టుకు నేరుగా ఎంట్రీ లభించగా... క్వాలిఫయింగ్ ద్వారా కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా అర్హత పొందాయి. 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈసారైనా మరో ఆసియా జట్టు సెమీఫైనల్ చేరుకుంటుందో లేదో చూడాలి. -
తడబడితే తారుమారు
విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆట ఫుట్‌బాల్. ఇతర టీమ్ క్రీడల్లో మాదిరిగా ఈ ఆటలో రెండు దేశాల మధ్య ఏడాదికో రెండేళ్లకో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు. ఏడాదిలో ఎక్కువ భాగం స్టార్ ఆటగాళ్లందరూ ఆయా దేశాల్లో ప్రొఫెషనల్ లీగ్‌లలో క్లబ్ జట్లకు ఆడుతుంటారు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ లేదా యూరో టోర్నీ లేదా కోపా అమెరికా కప్ లేదా కాన్ఫడరేషన్స్ కప్‌లాంటి టోర్నీల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్యంలో అప్పుడప్పుడు ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతారు. దాదాపు మూడేళ్లపాటు కొనసాగే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలలో ఎంతటి గొప్ప జట్టయినా ఆద్యంతం నిలకడగా రాణిస్తేనే ముందంజ వేస్తాం. కేవలం ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తే భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభిస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని చిన్న చిన్న జట్లు కూడా వదులుకోవు. అందుకే ప్రత్యర్థి జట్టుకి ఎంత గొప్ప రికార్డు ఉన్నా ఈ చిన్న జట్లు కడదాకా సంచలనం కోసం పోరాడతాయి. ఈ క్రమంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద జట్లకు చుక్కెదురు తప్పదు. మరో పది రోజుల్లో ఖతర్ వేదికగా జరగనున్న 22వ ప్రపంచకప్‌లో కచ్చితంగా అర్హత సాధిస్తాయనుకున్న ఎనిమిది జట్లు (ఇటలీ, స్వీడన్, రష్యా, చిలీ, ఈజిప్ట్, నైజీరియా, కొలంబియా, అల్జీరియా) క్వాలిఫయింగ్‌లోనే నిష్క్రమించి ఆశ్చర్యపరిచాయి. ఈ జాబితాలో అతి ముఖ్యమైన జట్టు ఇటలీ. ప్రపంచకప్‌లో ఇటలీ జట్టుకు గొప్ప చరిత్రనే ఉంది. నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఇటలీ వరుసగా రెండోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందలేకపోయింది. 2018 రష్యాలో జరిగిన ప్రపంచకప్‌కు బెర్త్ దక్కించుకోలేకపోయిన ఇటలీ జట్టు ఈసారి ఖతర్ విమానం కూడా ఎక్కడంలేదు. యూరోప్ దేశాలకు మొత్తం 13 బెర్త్‌లు ఉండగా... గ్రూప్ దశలో పది గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన 10 జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. గ్రూప్ ‘సి’లో ఇటలీ జట్టు రెండో స్థానంలో నిలిచి నేరుగా కాకుండా రెండో రౌండ్ ద్వారా అర్హత పొందేందుకు రేసులో నిలిచింది. అయితే రెండో రౌండ్లో ఇటలీ 0–1తో నార్త్ మెసడోనియా చేతిలో ఓడిపోయి ప్రపంచకప్‌నకు అర్హత పొందే అవకాశాన్ని చేజార్చుకుంది. 2018 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వీడన్ ఈసారి క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా జట్టుపై వేటు వేశారు. దక్షిణ అమెరికా జోన్లో ఆరో స్థానంలో నిలిచి కొలంబియా ఈ మెగా టోర్నీకి దూరమైంది. 1962లో ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడంతోపాటు మూడో స్థానంలో నిలిచిన చిలీ వరుసగా రెండోసారి ప్రపంచకప్ బెర్త్ సాధించలేకపోయింది. ఆఫ్రికా జోన్ నుంచి చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓడి ఈజిప్ట్, నైజీరియా, అల్జీరియా మెగా టోర్నీకి అర్హత పొందలేకపోయాయి. 1938 నుంచి 2002 ప్రపంచకప్ వరకు ఆతిథ్య దేశంతోపాటు డిఫెండింగ్ చాంపియన్‌కు నేరుగా ఎంట్రీ లభించేది. కానీ 2006 ప్రపంచకప్ నుంచి కేవలం ఆతిథ్య జట్టుకే నేరుగా ఎంట్రీ ఇచ్చి డిఫెండింగ్ చాంపియన్ కూడా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా బెర్త్ సాధించాలని ‘ఫిఫా’ నిర్ణయించింది. –సాక్షి క్రీడావిభాగం -
ఆతిథ్య జట్టు అజేయంగా.. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో కలిసొస్తున్న తొలి మ్యాచ్
తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో 2006 నుంచి తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం ఉండేలా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య షెడ్యూల్ రూపొందిస్తోంది. గత నాలుగు ప్రపంచకప్‌లలోనే కాకుండా అంతకుముందు జరిగిన ప్రపంచ కప్‌లలోనూ ఆతిథ్య దేశం తాము ఆడిన తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. ప్రత్యర్థి ఎంతటి జట్టయినా ఆతిథ్య జట్టు గెలవడం లేదంటే ‘డ్రా’ చేయడం జరిగింది. గతంలో వరుసగా 11 సార్లు ఆసియా క్వాలిఫయింగ్ దశలోనే నిష్క్రమించిన ఖతర్ జట్టు ఆతిథ్య దేశం హోదాలో తొలిసారి ప్రపంచకప్ టోర్నమెంట్లో బరిలోకి దిగుతోంది. 12 ఏళ్ల క్రితం ఆతిథ్య హక్కులు పొందిన వెంటనే ఖతర్ జట్టు సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి ప్రధాన టోర్నీలో నేరుగా ఆడే అవకాశం రావడంతో మంచి ప్రదర్శనతో ఆకట్టుకోవాలని పట్టుదలతో ఉంది. ఈనెల 20న జరిగే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఈక్వెడార్‌తో ఖతర్ ఆడుతుంది. ఇప్పటివరకు ఆతిథ్య జట్లకు తాము ఆడిన తొలి మ్యాచ్‌లలో అనుకూల ఫలితాలే వచ్చాయి. ఈ సంప్రదాయాన్ని ఖతర్ కూడా కొనసాగిస్తూ విజయంతో బోణీ కొడుతుందో, లేదంటే ‘డ్రా’తో పాయింట్ల ఖాతా తెరుస్తుందో వేచి చూడాలి. 2018 ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశం రష్యా తొలి మ్యాచ్‌లో 5–0తో సౌదీ అరేబియాను ఓడించగా... 2014 మెగా ఈవెంట్లో బ్రెజిల్ 3–1తో క్రొయేషియాపై గెలిచింది. 2010 టోర్నీలో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌ను మెక్సికోతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 2006లో జర్మనీ 4–2తో కోస్టారికాను ఓడించి శుభారంభం చేసింది. 2002లో దక్షిణ కొరియా–జపాన్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా... తమ తొలి మ్యాచ్‌ల్లో కొరియా 2–0తో పోలాండ్‌పై గెలుపొందగా... బెల్జియంతో జరిగిన మ్యాచ్‌ను జపాన్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. 1998లో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో 3–0తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 1994లో ఆతిథ్య అమెరికా దేశం తొలి మ్యాచ్‌ను స్విట్జర్లాండ్‌తో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 1990లో ఇటలీ జట్టు తొలి మ్యాచ్‌లో 1–0తో ఆస్ట్రియాను ఓడించింది. 1986లో మెక్సికో జట్టు 2–1తో బెల్జియంపై గెలిచింది. 1982లో స్పెయిన్ తొలి మ్యాచ్‌ను హోండూరస్తో 1–1తో ‘డ్రా’గా ముగించింది. 1978లో ఆతిథ్య అర్జెంటీనా జట్టు 2–1తో హంగేరిపై గెలిచింది. 1974లో పశ్చిమ జర్మనీ 1–0తో చిలీపై నెగ్గగా, 1970లో మెక్సికో 0–0తో సోవియట్ యూనియన్‌తో... 1966లో ఇంగ్లండ్ 0–0తో ఉరుగ్వేతో ‘డ్రా’ చేసుకుంది. 1962లో చిలీ 3–1తో స్విట్జర్లాండ్‌పై... 1958లో స్వీడన్ 3–0తో మెక్సికోపై.. 1954లో స్విట్జర్లాండ్ 2–1తో ఇటలీపై... 1950లో బ్రెజిల్ 4–0తో మెక్సికోపై.. 1938లో ఫ్రాన్స్ 3–1తో బెల్జియంపై... 1934లో ఇటలీ 7–1తో అమెరికాపై... 1930లో ఉరుగ్వే 3–1తో పెరూపై విజయం సాధించాయి. –సాక్షి క్రీడావిభాగం -
Qatar 2022 FIFA World Cup: మరో ప్రపంచకప్ వచ్చేసింది!
ప్రపంచపటంలో దిగువన పసిఫిక్ మహా సముద్రం పక్కన ఒక విశ్వ క్రీడా వినోదం చివరి దశకు చేరుకుంది. అది ముగిసిన సరిగ్గా వారం రోజులకే పశ్చిమాసియాలో అరేబియన్ ద్వీపకల్పం వద్ద మరో భారీ క్రీడా సంబరానికి తెర లేవనుంది. 16 జట్ల క్రికెట్ పోరు ముగియగానే క్రీడాభిమానుల కోసం 32 జట్ల ఫుట్‌బాల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అభిమానులను ఉర్రూతలూగించే ‘ఫిఫా’ వరల్డ్ కప్ మళ్లీ వచ్చేసింది. గల్ఫ్ దేశం ఖతర్ తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదికగా మారింది. నవంబర్ 20న ఆతిథ్య జట్టు మ్యాచ్‌తోనే మొదలయ్యే మెగా టోర్నీ పోరు 29 రోజుల పాటు గోల్స్ గోలతో ఊపేయనుంది. ఈ నేపథ్యంలో 22వ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు సంబంధించిన కొన్ని విశేషాలు... తొలి మ్యాచ్: ఖతర్ VS ఈక్వెడార్ ఫార్మాట్: 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లో మిగిలిన మూడు జట్లతో ఆడతాయి. ప్రతీ గ్రూప్ నుంచి రెండేసి జట్లు చొప్పున 16 టీమ్‌లు నాకౌట్ దశకు (ప్రిక్వార్టర్ ఫైనల్) అర్హత సాధిస్తాయి. ప్రిక్వార్టర్ దశలో ఎనిమిది గ్రూప్‌ల విజేతలు ఎనిమిది గ్రూప్‌ల రన్నరప్నే ఎదుర్కొంటాయి. మొత్తం మ్యాచ్‌ల సంఖ్య: 64 (గ్రూప్ దశలో 48; నాకౌట్లో 16) ► 2022 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు 2010 డిసెంబర్ 2వ తేదీన ఖతర్‌కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రకటించింది. 2022 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం మొత్తం ఐదు దేశాలు (ఖతర్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా) పోటీపడ్డాయి. 22 మంది సభ్యులతో కూడిన ‘ఫిఫా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఓటింగ్ ద్వారా ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసింది. ఓటింగ్ రౌండ్–1లో ఆస్ట్రేలియా... రౌండ్–2లో జపాన్.. రౌండ్–3లో దక్షిణ కొరియా... ఓటింగ్ రౌండ్–4లో అమెరికా నిష్క్రమించాయి. ► 92 ఏళ్ల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఖతర్ జట్టు తొలిసారి ఆడుతోంది. గతంలో ఏనాడూ ఖతర్ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేదు. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్‌కు నేరుగా టోర్నీలో ఆడే అవకాశం లభించింది. ► ప్రపంచకప్‌లో పోటీపడుతున్న 32 జట్లలో ఖతర్ మినహా మిగతా 31 దేశాలు గతంలో కనీసం ఒక్కసారైనా ప్రపంచకప్ టోర్నీలో బరిలోకి దిగాయి. 2022 ప్రపంచకప్ కోసం 2019 జూన్ 6 నుంచి 2022 జూన్ 14 వరకు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరిగాయి. 2018 ప్రపంచకప్‌లో ఐస్లాండ్, పనామా అరంగేట్రం చేసినా ఈసారి మాత్రం కొత్త జట్లు అర్హత పొందలేకపోయాయి. ► ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లలో ఆడిన ఏకైక జట్టుగా బ్రెజిల్ నిలిచింది. జర్మనీ (18 సార్లు) రెండో స్థానంలో, అర్జెంటీనా (13 సార్లు) మూడో స్థానంలో ఉన్నాయి. -
144లో ఒక్కటి కూడా ఒరిజినల్ కాదు.. అందుకే సీజ్
ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఒక మెగా టోర్నీ జరుగుతుంటే దాని చుట్టూ అంచనాలు ఉండడం సహజం. సాకర్ సమరంలో పోటీ పడే ప్రతీ జట్టు అంతిమలక్ష్యం ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ను సాధించడమే. విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్‌లో వరల్డ్ చాంపియన్‌గా ఎవరు అవతరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఖతార్ లాంటి చిన్న దేశానికి ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఆ దేశానికి పెద్ద పండగ లాంటిదే అని చెప్పొచ్చు. అందుకే ఫిఫా వరల్డ్‌కప్ ఫేక్ ట్రోఫీలతో దోహాకు చెందిన ఒక వ్యక్తి వ్యాపారం మొదలెట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్‌ను పోలిన 144 ఫేక్ ట్రోఫీలను తయారు చేసి అమ్మాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఒక మెగా ఈవెంట్‌కు సంబంధించిన ట్రోఫీని ఇలా బహిరంగ మార్కెట్లో తయారు చేసి అమ్మాలంటే అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా తయారు చేసినందుకే సదరు వ్యక్తి నుంచి 144 ఫేక్ ట్రోఫీలను సీజ్ చేసినట్లు దేశ ఇంటీరియర్ మినిస్ట్రీ తన ట్విటర్లో ప్రకటించింది. ''మాకు పక్కా సమాచారం అందాకే ఫిఫా వరల్డ్‌కప్ ఫేక్ ట్రోఫీలను అమ్ముతున్న ముఠాను పట్టుకున్నాం. వారి వద్ద 144 ఫేక్ ట్రోఫీలు ఉన్నాయి. వాటిన్నింటిని సీజ్ చేశాం. అనుమతి లేకుండా ట్రోఫీలు తయారు చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.'' అంటూ తెలిపింది. ఇక నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న సాకర్ సమరంలో తొలి మ్యాచ్ ఆతిథ్య ఖతార్, ఈక్వేడార్ మధ్య జరగనుంది. మొత్తంగా 32 జట్లు పోటీ పడుతుండగా.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోనున్నాయి. ప్రతీ గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో ప్రతీ జట్టు రౌండ్ రాబిన్ పద్దతిలో మూడు సింగిల్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతీ గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన రెండు జట్లు మొత్తంగా 16 జట్లు రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఎనిమిది జట్లు క్వార్టర్స్‌కు, ఆపై సెమీస్‌లో నాలుగు జట్లు తలపడతాయి. ఇక సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు డిసెంబర్ 18న లుసైల్‌లోని లుసైల్ ఐకానిక్ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. The Economic and Cyber Crimes Combating Department, in cooperation with the Intellectual Property Protection Committee, seized 144 counterfeit cups similar to the FIFA World Cup Qatar 2022™, for violation of Law number 10/2021 on hosting FIFA World Cup Qatar 2022™. #MOIQatar pic.twitter.com/ysRXlhmo2S — Ministry of Interior (@MOI_QatarEn) November 2, 2022 చదవండి: నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్.. వీడియో వైరల్ -
నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్.. వీడియో వైరల్
నవంబర్ 20 నుంచి ఫిఫా వరల్డ్ కప్ మొదలుకానుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ మొదలైంది. కేరళలో కొందరు అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్స్ మీద తమ అభిమానాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు వెరైటీగా ఆలోచించారు. 30 అడుగుల ఎత్తైన లియొనెల్ మెస్సీ కటౌట్ ఏర్పాటు చేశారు. కోజికోడ్ జిల్లాలోని పుల్లవూర్కు చెందిన కొందరు యువకులు అర్జెంటీనా ఫ్యాన్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఫిఫా వరల్డ్ కప్‌లో తమ ఫేవరెట్ టీం, ఫేవరెట్ అటగాడికి మద్దతుగా వాళ్లు కురున్గట్టు కడవు నది మధ్యలో మెస్సీ కటవుట్ పెట్టారు. ‘త్వరలో ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ ఈవెంట్‌ని మరింత స్పెషల్‌గా మార్చాలనుకున్నాం. అందుకోసం మెస్సీ నిలువెత్తు కటౌట్ పెట్టాం’ అని పేర్కొన్నారు. రోడ్డు మీదుగా మెస్సీ కటౌట్‌ని తీసుకొస్తున్న ఫొటోలు, వీడియోల్ని రిజ్వాన్ అనే యూజర్ ట్విటర్లో పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/QYpJa7jqBK — LDF Supporters (@LDFSupporters) November 1, 2022 En Pullavoor, un pequeño pueblo de la India, pusieron una gigantografía de Messi en medio del río. pic.twitter.com/nwOZWjACxb — FOX Sports Argentina (@FOXSportsArg) October 31, 2022 చదవండి: పాక్‌కు మరోసారి టీమిండియానే దిక్కు -
FIFA World Cup: పాల్ పోగ్బా దూరం.. ఫ్రాన్స్ ఆశలు ఆవిరేనా!
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న సాకర్ సమరానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలిఉంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకూ జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ మెగా టోర్నీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2018లో అంచనాలకు భిన్నంగా ఫేవరెట్ టీమ్స్‌కు చెక్ పెడుతూ టైటిల్ చాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. గత ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ విజేతగా నిలవడంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు, మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బాది కీలకపాత్ర. అయితే ఈసారి మాత్రం ఫ్రాన్స్ ఆశలు ఆవిరయ్యేలాగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ ప్లేయర్ ఎన్గోలో కాంటే గాయంతో ఫిఫా వరల్డ్‌కప్‌కు దూరం కాగా.. తాజాగా పోల్ పోగ్బా కూడా సాకర్ సమరం నుంచి వైదొలిగాడు. సెప్టెంబర్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్న పోగ్బా ఇంకా పూర్తిగా కోలుకోలేదని అతని ఏజెంట్ రఫేలా పిమెంటా చెప్పింది. నిజానికి వరల్డ్‌కప్‌కు ముందే అతడు తన క్లబ్ టీమ్ జువెంటస్‌కు అందుబాటులో ఉంటాడని భావించారు. కానీ 29 ఏళ్ల పోగ్బా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. సోమ, మంగళవారాల్లో జరిపిన మెడికల్ రివ్యూలను బట్టి చూస్తే పోగ్బా తన మోకాలి సర్జరీ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తేలినట్లు చెప్పింది. పాల్ పోగ్బాకు రీహ్యాబిలిటేషన్ అవసరం ఉందని రఫేలా పేర్కొంది. 2022లోనూ టైటిల్‌పై కన్నేసిన ఫ్రాన్స్‌కు ఇది నిజంగా పెద్ద దెబ్బే. ఖతార్‌లో జరగనున్న ఈ వరల్డ్‌కప్‌కు పోగ్బా అందుబాటులో లేకపోవడం ఫ్రాన్స్ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. చదవండి: ఇంగ్లండ్ విజయాలను శాసిస్తున్న చివరి ఆరు ఓవర్లు -
FIFA 2022: భారత్‌లో అమ్మాయిల ‘కిక్’స్టార్ట్
భువనేశ్వర్: ‘ఫిఫా’ అమ్మాయిల అండర్–17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. 16 జట్ల మధ్య ఈనెల 30 వరకు జరిగే ఈ టోర్నీని భువనేశ్వర్, గోవా, నవీ ముంబైలలో నిర్వహిస్తారు. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్‌తో మొరాకో తలపడనుండగా, మరో మ్యాచ్‌లో 2008 రన్నరప్ అమెరికాతో భారత్ ఎదుర్కోనుంది. ఈ వయో విభాగంలో జరుగుతున్న ఏడో ప్రపంచకప్ లో భారత్ ఆడటం ఇదే మొదటిసారి. ఆతిథ్య హోదాతో బెర్త్ లభించగా మిగతా జట్లు ఆరు కాన్ఫెడరేషన్ల టోర్నీలతో అర్హత సాధించాయి. ఆసియా నుంచి భారత్‌తో పాటు చైనా, జపాన్... ఆఫ్రికా కాన్ఫెడరేషన్ నుంచి మొరాకో, నైజీరియా, టాంజానియా... సెంట్రల్, ఉత్తర అమెరికా, కరీబియన్ల నుంచి కెనడా, మెక్సికో, అమెరికా, దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఓసియానియా నుంచి న్యూజిలాండ్, యూరోప్ నుంచి ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్‌కు ప్రతీ మ్యాచ్ అగ్నిపరీక్షే! అమెరికా, బ్రెజిల్, మొరాకోలతో క్లిష్టమైన పోటీలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ దశ దాటడం అసాధ్యమే! అద్భుతాలకు ఏ మాత్రం చోటులేదు. ‘బి’ గ్రూపులో జర్మనీ, నైజీరియా, చిలీ, న్యూజిలాండ్.. ‘సి’లో స్పెయిన్, కొలంబియా, మెక్సికో, చైనా.. ‘డి’లో జపాన్, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్ ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఈ నెల 30న ఫైనల్ జరుగుతుంది. -
ఫిఫా వరల్డ్ కప్‌లో బాలీవుడ్ బ్యూటీ.. ఆ విషయంలో తొలి నటిగా..!
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఫిఫా వరల్డ్ కప్-2022లో ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఈవెంట్లో ప్రముఖులైన షకీరా, జెన్నీఫర్ లోపెజ్‌లతో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ వేదికపై ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించే ఏకైక నటిగా ఆమె నిలవనుంది. ఫిఫా వరల్డ్‌కప్ కోసం రూపొందించిన థీమ్ సాంగ్‌లో నోరా ఫతేహీ నటించింది. అక్టోబర్ 7న ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఆమె ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లోనూ ప్రదర్శన ఇవ్వనుంది. నోరా తన ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేస్తూ " ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాంగ్ "లైట్ ది స్కై" సేవ్ ది డేట్ 07/10/22..!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ ఖతార్‌లో జరగనుంది. డ్యాన్స్‌తో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దిల్బర్ దిల్బర్ సాంగ్‌తో ఫేమస్ అయింది. బాలీవుడ్లో భారత్, బాట్లా హౌస్, రోర్, సత్యమేవ జయతే చిత్రాల్లో కనిపించింది. ఆమె ప్రస్తుతం జడ్జిగా 'ఝలక్ దిఖ్ లా జా' ప్రోగ్రామ్‌కు వ్యవహరిస్తోంది. నోరాకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న థ్యాంక్ గాడ్ సినిమాలోని మాణికే సాంగ్‌లోనూ కనిపించింది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
మారడోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్'కు మరో అరుదైన గౌరవం
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్ జెర్సీకి మరో అరుదైన గౌరవం లభించింది. ఖతార్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌లో మారడోనా జెర్సీని ప్రత్యేక డిస్ప్లేలో ఉంచనున్నారు. అక్టోబర్ 2(ఆదివారం) నుంచి ఏప్రిల్ 1 వరకు ఖతార్‌లోని స్పోర్ట్స్ మ్యూజియంలో ఉంటుందని ఒక అధికారి పేర్కొన్నారు. ఇక నాలుగు నెలల క్రితమే మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్ జెర్సీని వేలం వేయగా కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. కాగా జెర్సీని కొన్న ఆ వ్యక్తి పేరును ఇప్పటివరకు బయటపెట్టలేదు. మారడోనాకు వీరాభిమాని అయిన ఆ అజ్ఞాతవ్యక్తి జెర్సీని 71లక్షల పౌండ్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ.67 కోట్ల 72 లక్షలకు) కొనుగోలు చేయడం విశేషం. 1986 సాకర్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మారడోనా ఈ జెర్సీనే ధరించాడు. ఈ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్ చేయగా.. అందులో ఒకటి హ్యాండ్ ఆఫ్ గోల్ కూడా ఉంది. ఈ గోల్ అప్పట్లో వివాదాస్పదమైనప్పటికి.. మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్ ప్లేయర్ స్టీవ్ హాడ్జ్‌కు అందజేశాడు.దానిని ఇంతకాలం దాచుకున్న హాడ్జ్ ఏప్రిల్ నెలలో ‘సోతీబై’ అనే ఆన్లైన్ వేలం సైట్లో అమ్మకానికి పెట్టాడు. -
భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత
భారత ఫుట్‌బాల్‌కు ఊరట లభించింది. భారత్‌పై విధించిన నిషే«ధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. నిషేధాన్ని తొలగించాలని ‘ఫిఫా’ కౌన్సిల్ బ్యూరో శుక్రవారం నిర్ణయించింది. భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేసి రోజూవారీ కార్యకలాపాలపై సమాఖ్య పరిపాలనా వర్గం పూర్తిగా పట్టు చేజిక్కించుకున్నట్లు తెలియడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఫిఫా’ ప్రకటించింది. భారత్‌లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటామని, ఎన్నికలను సరైన రీతిలో నిర్వహించేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్టోబర్ 11నుంచి భారత్‌లో జరగాల్సిన అండర్–17 మహిళల ప్రపంచ కప్‌ను యథావిధిగా నిర్వహించేందుకు అనుమతిచ్చింది. -
సంస్కరణలతోనే క్రీడలు వర్ధిల్లుతాయి
నిబంధనల ఉల్లంఘన కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ మీద ‘ఫీఫా’(ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్) నిషేధం విధించడంతో జాతీయ స్థాయిలో క్రీడల నిర్వహణకు సంబంధించిన చర్చ మొదలైంది. ఇది జీర్ణించుకోలేని విషయమే అయినా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. అయితే అక్టోబర్‌లో జరగనున్న ఫుట్‌బాల్ జూనియర్ ప్రపంచ కప్ నిర్వహణను వదులుకోలేని కేంద్ర ప్రభుత్వం దీన్ని స్నేహ పూర్వకంగా పరిష్కరించుకునేందుకు యత్నిస్తోంది. ఈ నిషేధ పరిణామాలు ఎలాగైనా ఉండనీ... మొత్తంగా దేశంలో క్రీడా రాజకీయాలకు సంబంధించి ఇదొక చెంపదెబ్బ కావాలి. దీని పాఠాల నుంచి నేర్చుకుని సంస్కరణలకు నడుం బిగించాలి. అప్పుడే దేశంలో నిజంగా క్రీడలు వర్ధిల్లుతాయి. ఈ దేశంలో క్రీడాసంస్థల పనితీరుపై ఎవ రైనా న్యాయస్థానంలో ప్రశ్నలు లేవనెత్తారను కోండి... నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) సమాధానం ఒక్కటే. తమకు స్వయం ప్రతిపత్తి ఉందీ అని. అదే సమయంలో న్యాయస్థానాలు తమ పరిధిని మించి వ్యవహరిస్తున్నాయని సణుగు తారు కూడా. లేదా న్యాయపరిధిని తగ్గించేందుకు అంతర్జాతీయ నిషేధాలను ఒక బూచిగా చూపే ప్రయత్నం చేస్తారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్ (ఫీఫా) విషయంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఫీఫా ఇటీవలే ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని చూపుతూ ఇండి యన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) ఆధీనంలోకి తీసుకొస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే తెచ్చుకునే ప్రయత్నమూ జరిగింది. దీంతోపాటే 2011 నాటి జాతీయ క్రీడా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నానికీ అడ్డు పడే ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటీ 2011 క్రీడా నిబంధనలు? అధికారమే తప్ప బాధ్యత లేదా? ఎన్ఎస్ఎఫ్ ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగానికి అదనంగా సిద్ధం చేసిన ఒక డాక్యుమెంట్ ఇది. క్రీడా సంస్థల సమర్థ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఈ నిబంధ నల కంటే ముందు ప్రభుత్వం లేదా యువజన వ్యవహారాలు, క్రీడా శాఖలు 1975, 1988, 1997, 2001లలో ఎన్ఎస్ఎఫ్కు మార్గదర్శ కాలు జారీ చేశాయి. అయితే ఈ మార్గదర్శకాలను ఎన్ఎస్ఎఫ్ పట్టించుకోలేదు. ప్రజలు చెల్లించిన పన్నులను వాడుకుంటూ... భారత జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ పోటీల్లో ప్రదర్శించే ఈ సంస్థల వ్యవహారం... అధికారం, డబ్బు అనుభవిస్తూ బాధ్యత, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించడం అంటే తప్పులేదు. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ రాజకీయ నేతలు, అధికారుల ప్రభా వానికి లోనవడం ఎప్పుడో మొదలైంది. ఈ సంస్థలకు ఎన్నికలు కానీ, క్రీడా కారుల ఎంపికలో పారదర్శకత కానీ అస్సలు కనిపించదు. కుంభకోణాలు, జరిగిన తప్పులు దిద్దుకునే చర్యలు లేకపోవడం వంటివి సర్వసాధారణమనే చెప్పాలి. దేశంలో జాతీయ క్రీడాభివృద్ధి చట్టం అమల్లోకి వచ్చే ముందు క్రీడాసంస్థల సమర్థ నిర్వహణకు ఉద్దేశించిన ప్రయత్నం 2011 నాటి క్రీడా నిబంధనల డాక్యుమెంట్. అయితే క్రీడాభివృద్ధి చట్టానికి సంబంధించిన బిల్లు ఇప్పుడు మరుగున పడిపోయింది. అన్ని రకాల రాజకీయ పార్టీలూ దీన్ని వ్యతిరేకించాయి. అయితే 2014లో ఢిల్లీ హైకోర్టు 2011 నాటి క్రీడా నిబంధనల డాక్యు మెంట్ సరైందేనని తేల్చి చెప్పింది. భారత క్రీడా సంస్థల నిర్వహణకు సంబంధించి ఇదో చారిత్రాత్మకమైన తీర్పు. క్రీడా సంస్థల్లో ఎన్నికలు, ఓటర్లు, అధికారుల అధికార పరిధి, వయసు వంటి అంశాలపై ఇప్పుడు వాడి, వేడి చర్చ నడుస్తోంది. ఫుట్‌బాల్, టీటీ, హాకీ, జూడో... ప్రతి కేసులోనూ నిబంధనల ఉల్లంఘన జరిగిందని చాలామంది కోర్టులను ఆశ్రయించారు. టేబుల్ టెన్నిస్ విషయంలో నిబంధనలను అతిక్రమించారని గుర్తించిన ఓ క్రీడాకారుడే కోర్టుకెక్కడం గమనార్హం. కోర్టు కాస్తా ఎన్ఎస్ఎఫ్ అక్రమ మైందని ప్రకటిస్తూ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్‌ను నియమించింది. ఎన్ఎస్ఎఫ్ 2011 నాటి క్రీడా నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూడటం ఈ సీఓఏ బాధ్యత. ఎన్నికల నిర్వహణ, పురాతన కాలం నాటి క్రీడా సంస్థల రాజ్యాంగాన్ని ఆధునికీకరించడం, మేనేజ్మెంట్ విధానాలను సమీక్షించడం వంటి వాటి ద్వారా సీఓఏ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. అయితే ఈ సీఓఏలోనూ మాజీ న్యాయ మూర్తులే ఉండటం, వారి పనితీరు నత్తనడకన సాగుతూండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. అయితే భారతీయ క్రీడా వ్యవస్థ లన్నింటిలోనూ జరిగే తప్పులు వీరికి తెలుసు. వీటిని ఉల్లంఘిస్తున్న వారిని కూడా గుర్తించగలరు. అందుకే ఎవరైనా క్రీడా వ్యవస్థ సమూల ప్రక్షాళణకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. కోర్టుల దాకా ఎందుకు? విషయం కోర్టులకు ఎక్కక ముందే ఎన్‌ఎస్‌ఎఫ్‌ను దారిన పెట్ట గల సత్తా, అధికారం రెండూ మంత్రిత్వ శాఖకు ఉన్నాయి. ఫెడరేష న్లను రద్దు చేయగలిగే, నిధుల మంజూరీని నిలిపివేసే అధికారం కూడా యువజన, క్రీడల మంత్రిత్వ శాఖకు ఉన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అయితే బాక్సింగ్, ఆర్చరీ వంటివాటిని మినహాయించి మిగిలిన చాలా సంస్థల విషయంలో మంత్రిత్వ శాఖ కూడా న్యాయ స్థానాలు స్పందించేంత వరకూ నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిం చింది. ఎందుకంటే, నేతలకూ క్రీడాసంస్థల్లో స్థానం ఉండటం. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహ ణకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్‌ను ఏర్పాటు చేసిన వెంటనే క్రీడల మంత్రిత్వ శాఖ తరఫున స్వయంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ కేసును చేపట్టి ఒలింపిక్ అసోసియేషన్‌కు అండగా నిలవడం గమనార్హం. ప్రభుత్వం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రెండింటి తరఫున కోర్టుకు హాజరైన తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలనీ, లేదంటే అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో భారత్‌ను నిషేధిస్తారనీ వాదించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు యథాతథ స్థితిని కొన సాగించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఈ సంద ర్భంగానే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు అనిల్ ఖన్నా... అసోసియేషన్ ఆఫీస్ బేరర్ల పదవీ కాలం పన్నెండేళ్లు కాకుండా, 20 ఏళ్లు ఉండాలని నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. సాధారణంగా జాతీయ స్థాయి క్రీడా సంస్థలు... క్రీడలు, క్రీడా కారుల కంటే అధికారుల అహానికి, రాజకీయ పలుకుబడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. భారతీయ క్రీడా వ్యవస్థలో ఉన్న ప్రాథమికమైన లోపం... క్రీడాకారులకు తగినన్ని పోటీలు, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఆడేందుకు తగినన్ని అవకాశాలు లేకపోవడమే. ఈ లోపాలే ఇప్పుడు ఫిర్యాదుల రూపంలో బయటపడుతున్నాయి. తమ స్థానాలను పదిల పరుచుకునేందుకు క్రీడా సంస్థల అధికార యంత్రాంగం తాపత్రయ పడుతూండటమే ఇప్పుడు అన్నిచోట్ల కనిపిస్తున్న అంశం. ఈ క్రమంలో అసలు విషయం కాస్తా మరుగున పడిపోతోంది. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. సమర్థతకే పట్టం కట్టాలి నేను నివసించే బెంగళూరులో బాస్కెట్ బాల్ అసోసియేషన్ జన వరిలో ఒక నోటీసు జారీ చేసింది. అసోసియేషన్ క్రీడాకారులు చిన్న 3 బై 3, 5 బై 5 పికప్ బాస్కెట్‌బాల్ కార్యక్రమాల్లో పాల్గొనడం అసోసియేషన్ నిబంధనలకు వ్యతిరేకమని. అలా పాల్గొన్న క్రీడా కారులను నిషేధిస్తామని ఈ నోటీస్ చెప్పడం గమనార్హం. 2019లో ప్రో వాలీబాల్ లీగ్ తొలి సీజన్లో విజయవంతమైంది. ఆ వెంటనే వాలీబాల్ అసోసియేషన్ ఈ లీగ్ నిర్వాహకులు బేస్‌లైన్ వెంచర్స్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్ట్ నిబం ధనలను ఫెడరేషన్ ఉల్లంఘించినట్లు కోర్టు నియమించిన మధ్య వర్తులు గుర్తించారు. ఫెడరేషన్ బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయ డంతోపాటు బేస్‌లైన్ వెంచర్స్‌కు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బేస్‌లైన్ వెంచర్స్... ప్రైమ్ వాలీబాల్ లీగ్ పేరుతో మళ్లీ ఫ్రాంచైజీ ఆధారిత టోర్నమెంటును ప్రారంభించింది. కానీ ఈ లీగ్‌లో పాల్గొన్న కొన్ని రాష్ట్రాల క్రీడాకారులను ఫెడరేషన్ పక్కన పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. క్రీడా సంస్థలకు స్వయం ప్రతిపత్తి కావాలని కోరుతున్న వారిలో కొందరు నిజానికి తాము అసమర్థ పరిపాలకులుగా కొన సాగేందుకు పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. క్రీడా సంస్థల మెరుగైన నిర్వహణ వీరి ఉద్దేశం కానే కాదు. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు భారీ షాక్.. సస్పెన్షన్ వేటు వేసిన ఫిఫా
FIFA Suspends All India Football Federation: ఊహించినట్టే జరిగింది. భారత ఫుట్‌బాల్‌కు కష్టకాలం వచ్చింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిషేధం విధించింది. ఏఐఎఫ్ఎఫ్లో తృతీయ పక్షం జోక్యం సహించబోమని కొంతకాలంగా పలుమార్లు ‘ఫిఫా’ హెచ్చరించింది. కానీ ఏఐఎఫ్ఎఫ్ పట్టించుకోలేదు. దాంతో చివరకు ‘ఫిఫా’ భారత ఫుట్‌బాల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ నిషేధం విధించిది. ఏఐఎఫ్ఎఫ్ పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేయాలి. అలాకాకుండా అడ్‌హక్ కమిటీ, కోర్టులు నియమించిన పరిపాలక కమిటీ (ఇవన్నీ థర్డ్ పార్టీలు–తృతీయ పక్షం)లతో నడిచే జాతీయ ఫుట్‌బాల్ సంఘాన్ని ‘ఫిఫా’ గుర్తించదు. ఈ కారణంతోనే ఏఐఎఫ్ఎఫ్ను సస్పెండ్ చేసింది. ‘ఫిఫా నియమావళికి విరుద్ధంగా నడుస్తున్న ఏఐఎఫ్ఎఫ్పై నిషేధం విధిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ‘ఫిఫా’ బ్యూరో కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. తక్షణం పరిపాలక కమిటీ తప్పుకోవాలి. ఏఐఎఫ్ఎఫ్ కొత్త కార్యవర్గం ఎన్నికై, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కావాలి. రోజువారీ కార్యకలాపాల్ని కొత్త కార్యవర్గం నిర్వహించినపుడే నిషేధాన్ని ఎత్తేసే చర్యలు చేపడతాం’ అని ‘ఫిఫా’ ఒక ప్రకటనలో తెలిపింది. నిషేధం నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారత్‌లో జరగాల్సిన మహిళల అండర్–17 ప్రపంచకప్ కూడా షెడ్యూల్ ప్రకారం జరగదని ‘ఫిఫా’ కౌన్సిల్ స్పష్టం చేసింది. 85 ఏళ్ల ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో ఇలా సస్పెన్షన్‌కు గురవడం ఇదే తొలిసారి. అసలేం జరిగింది... దీనికంతటికీ కారణం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అగ్రనేత ప్రఫుల్ పటేల్ పదవీ వ్యామోహమే! ఆయన ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. డిసెంబర్–2020తో ఆయన పదవీకాలం ముగిసినా కోర్టు కేసులు వేస్తూ కుర్చీని మాత్రం వీడలేదు. జాతీయ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం గరిష్టంగా 12 ఏళ్లకు మించి అధ్యక్ష పదవిలో ఎవరూ కొనసాగేందుకు వీలులేదు. దీంతో మోహన్ బగాన్ క్లబ్ జట్టు మాజీ గోల్‌కీపర్ కళ్యాణ్ చౌబే సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రఫుల్ పటేల్‌ను తప్పించి పరిపాలక కమిటీ (సీఓఏ)ని నియమించింది. ‘ఫిఫా’ నిధులు బంద్ ‘ఫిఫా’ తన సభ్య దేశాల్లో ఫుట్‌బాల్ క్రీడ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏటా రూ. కోట్లలో నిధులు ఇస్తుంది. సస్పెన్షన్‌తో ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోతాయి. దీని వల్ల ఏఐఎఫ్ఎఫ్ ఈ ఏడాది సుమారు రూ. 4 కోట్లు (5 లక్షల డాలర్లు) నష్టపోతుంది. మైదానాల నిర్మాణ, నాణ్యమైన ఫుట్‌బాల్ బంతులు, జెర్సీలు, సామాగ్రిల కోసం ‘ఫిఫా’ ఆ నిధుల్ని విడుదల చేస్తుంది. కేంద్రం జోక్యం ఏఐఎఫ్ఎఫ్పై విధించిన నిషేధాన్ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు పరిధిలోని కేసును సత్వరం విచారించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బోపన్నల బెంచ్‌ను కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. బుధవారం తొలి కేసుగా ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల అంశాన్నే విచారిస్తామని ద్విసభ్య ధర్మాసనం మెహతాకు తెలిపింది. పాత నియమావళి ప్రకారమే ఎన్నికలు ఏఐఎఫ్ఎఫ్కు పాత నియమావళి ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని పరిపాలక కమిటీ స్పష్టం చేసింది. సస్పెన్షన్‌కు గురైన వెంటనే ఎన్నికల ప్రక్రియలో చలనం వచ్చింది. ‘ఫిఫా’ నిర్దేశించినట్లుగానే అనుబంధ రాష్ట్రాల సంఘాల ప్రతినిధులే ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల్లో పాల్గొంటారని, మాజీ ఆటగాళ్లతో కూడిన ఓటర్లతో నిర్వహించబోమని తేల్చిచెప్పింది. ఏఐఎఫ్ఎఫ్ నియమావళిని కాదని సీఓఏ 36 సంఘాలను విస్మరించి ఈ స్థానంలో 36 మంది మాజీ ఫుట్బాలర్లతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. దీన్ని ‘ఫిఫా’ తోసిపుచ్చడంతో పాతపద్ధతిలోనే ప్రక్రియ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆటకు ఎదురుదెబ్బ నిషేధం ప్రభావం జాతీయ జట్టుకు, భారత క్లబ్ జట్లపై తీవ్రంగా ఉంటుంది. అంతర్జాతీయ, ఫ్రెండ్లీ మ్యాచ్‌లకు అవకాశమే ఉండదు. దీంతో వచ్చే నెల 24న వియత్నాంతో, 27న సింగపూర్‌తో సునీల్ ఛెత్రీ కెప్టెన్సీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు అటకెక్కినట్లే! ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఇంటర్–జోనల్ సెమీఫైనల్స్‌లో భాగంగా సెప్టెంబర్ 7న జరగాల్సిన మోహన్ బగాన్ మ్యాచ్ కూడా కష్టమే! ఉజ్బెకిస్తాన్‌లో ఉన్న ఇండియన్ మహిళల లీగ్ చాంపియన్ ‘గోకులం కేరళ’ జట్టు మ్యాచ్‌లకు కూడా దెబ్బపడింది. అక్కడ ఏఎఫ్సీ మహిళల క్లబ్ చాంపియన్‌షిప్‌లో సొగ్దియానా క్లబ్‌తో ఈ నెల 23న, 26న ఇరాన్లో బామ్ ఖటూన్ ఎఫ్‌సీతో జరగాల్సిన మ్యాచ్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇరాక్‌లో వచ్చేనెల 14 నుంచి జరగాల్సిన ఏఎఫ్సీ అండర్–20 క్వాలిఫయర్స్‌లో కూడా భారత జట్టుకు అవకాశం ఉండదు. ఆ టోర్నీలో భారత్ 14న ఇరాక్‌తో, 16న ఆస్ట్రేలియాతో, 18న కువైట్‌తో ఆడాల్సి ఉంది. చదవండి: భారత్‌పై ఫిఫా నిషేధం.. విషయం చేయి దాటిపోయిందన్న స్టార్ ఫుట్‌బాలర్ -
భారత్‌పై ఫిఫా నిషేధం.. విషయం చేయి దాటిపోయిందన్న స్టార్ ఫుట్‌బాలర్
FIFA Ban Threat To AIFF: భారత ఫుట్‌బాలర్లంతా ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇది మన చేతులు దాటిపోయిందని ఛెత్రి అన్నాడు. అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం (ఏఐఎఫ్ఎఫ్) చాన్నాళ్లుగా అడ్‌హక్ కమిటీతో నడుస్తోంది. పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో, సంబంధం లేని (థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యంతో భారత ఫుట్‌బాల్ కార్యకలాపాలు జరగడం ఇష్టపడని ‘ఫిఫా’ ఇటీవల నిషేధం విధిస్తామని హెచ్చరించింది. -
FIFA World Cup 2022: ఒక రోజు ముందుగానే... కారణమిదే!
FIFA World Cup 2022 Qatar- జెనీవా: ఫుట్‌బాల్ ప్రపంచకప్–2022 మెగా టోర్నీ షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసింది. ఈ ఏడాది నవంబర్ 21న టోర్నమెంట్ ప్రారంభం కావాల్సి ఉండగా దానిని ఒక రోజు ముందుకు జరిపారు. దాంతో నవంబర్ 20నే పోటీలు మొదలవుతాయి. పాత షెడ్యూల్ ప్రకారం సెనెగల్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్ మొదలు కావాల్సి ఉంది. అయితే సుదీర్ఘ కాలంగా ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ లేదా ఆతిథ్య జట్టు బరిలోకి దిగడం సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దానిని కొనసాగించాలని భావిస్తూ నవంబర్ 20 (ఆదివారం) ఆతిథ్య ఖతర్ జట్టు మ్యాచ్ ఉండేలా ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తేదీని సవరించింది. 60 వేల సామర్థ్యం గల అల్ బైత్ స్టేడియంలో జరిగే తొలి పోరులో ఈక్వెడార్‌తో ఖతర్ తలపడుతుంది. అదే రోజు మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. తొలి మ్యాచ్‌కు కేవలం 100 రోజుల ముందు ఈ అనూహ్య మార్పు జరపడం టోర్నీకి సంబంధం ఉన్న చాలా మందికి ఇబ్బందిగా మారుతుందని విమర్శలు వస్తున్నాయి. స్పాన్సర్లు, ఆతిథ్యం, ఫ్లయిట్ బుకింగ్‌లు తదితర అంశాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని మార్కెటింగ్ వర్గాలు చెబుతుండగా... తాము వాటిని పరిష్కరిస్తామని ‘ఫిఫా’ హామీ ఇస్తోంది. చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ సాధించిన ఈ 3 రికార్డులు బద్దలు కొట్టడం కోహ్లికి సాధ్యం కాకపోవచ్చు! Abhinav Bindra: 34 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్?.. మూడు ముక్కల్లో సమాధానం -
ఫిఫా వరల్డ్‌కప్ 2022కు అర్హత సాధించిన చివరి జట్టుగా కోస్టారికా
దోహా: అందివచ్చిన ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోస్టారికా జట్టు ఆరోసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. చివరి బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో కోస్టారికా 1–0తో గెలిచింది. ఆట మూడో నిమిషంలో జోయల్ క్యాంప్‌బెల్ గోల్ చేసి కోస్టారికాను ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న కోస్టారికా జట్టు విజయంతోపాటు బెర్త్‌ను ఖరారు చేసుకొని వరుసగా మూడోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. 50 లక్షల జనాభా కలిగిన కోస్టారికా ఇప్పటివరకు ఐదుసార్లు ప్రపంచకప్‌లో పాల్గొ ని 2014లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కోస్టారికా, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ దశ ముగిసింది. ఈ ఏడాది ఖతర్‌లో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో మొత్తం 32 జట్లు బరిలో ఉన్నాయి. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ జట్టుకు నేరుగా ఎంట్రీ లభించింది. -
ఫిఫా వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల
ఫిఫా అండర్ 17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022 షెడ్యూల్ ఇవాళ (జూన్ 15) అధికారికంగా విడుదలైంది. భారత్ రెండోసారి (2017, 2022) ఆతిధ్యమివ్వనున్న ఈ ప్రపంచ స్థాయి క్రీడా సంబురం అక్టోబర్ 11 నుంచి ప్రారంభంకానుంది. డబుల్ హెడర్ మ్యాచ్‌లతో అక్టోబర్ 30 వరకు సాగే ఈ క్రీడా వేడుకలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఒడిశా, గోవా, మహారాష్ట్ర వేదికలుగా మొత్తం 32 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లు (24 మ్యాచ్‌లు) అక్టోబర్ 18 వరకు, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు (4) అక్టోబర్ 21, 22 తేదీల్లో, సెమీస్ (2) అక్టోబర్ 26వ తేదీన (గోవా), ఫైనల్ మ్యాచ్(నవీ ముంబై) అక్టోబర్ 30న జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ ఆడబోయే మూడు మ్యాచ్‌లకు (11, 14, 17) భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. చదవండి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా -
World Cup 2022: 64 ఏళ్ల తర్వాత... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు వేల్స్ జట్టు అర్హత
కార్డిఫ్: ఎప్పుడో 1958లో... వేల్స్ ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో అప్పుడు 17 ఏళ్ల వయసు ఉన్న ఆల్‌టైమ్ గ్రేట్ పీలే (బ్రెజిల్) చేసిన ఏకైక గోల్‌తో వేల్స్ పరాజయం పాలైంది. ఆ తర్వాత మరో 15 ప్రపంచకప్‌లు జరిగినా... ఒక్కసారి కూడా వేల్స్ అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఆ టీమ్‌కు విశ్వవేదికపై తలపడే అవకాశం వచ్చింది. ఈ ఏడాది ఖతర్‌లో జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు వేల్స్ అర్హత పొందింది. క్వాలిఫయర్స్ పోరులో వేల్స్ 1–0 తేడాతో ఉక్రెయిన్‌పై విజయం సాధించింది. ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ యర్మొలెంకో 34వ నిమిషంలో చేసిన ‘సెల్ఫ్ గోల్’తో వేల్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. వేల్స్ స్టార్ ఆటగాడు, ఐదుసార్లు చాంపియన్స్ లీగ్ టైటిల్ విజయాల్లో భాగమైన గారెత్ బేల్ ఈ విజయాన్ని ‘తమ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఫలితం’గా అభివర్ణించాడు. బేల్ కొట్టిన ఫ్రీకిక్‌ను హెడర్‌తో దిశ మళ్లించే ప్రయత్నంలోనే విఫలమై యర్మొలెంకో బంతిని తమ గోల్‌పోస్ట్‌లోకే పంపించాడు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, అమెరికా, ఇరాన్ ఉన్న గ్రూప్ ‘బి’లో వేల్స్ పోటీ పడనుంది. -
షాకింగ్.. ఫిఫా వరల్డ్‌కప్‌ను దాటేసిన ఐపీఎల్
ప్రపంచవ్యప్తంగా ఎక్కువగా అభిమానించే క్రీడల్లో ఫుట్బాల్ది మొదటిస్థానం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ ఫిఫా వరల్డ్‌కప్‌కు ఉండే క్రేజ్ వేరు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగాసమరాన్ని కోట్ల మంది వీక్షిస్తుంటారు. అయితే అలాంటి ఫుట్‌బాల్‌ను మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక్క విషయంలో మాత్రం దాటేసి చరిత్రలో నిలిచింది. అదేంటో తెలుసా.. టికెట్ల విషయంలో. అవునండీ మన ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఫిఫా వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌ల టికెట్ల ధర కంటే ఎక్కువగా ఉన్నాయి. ఖతార్ వేదికగా నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు ఫిఫా వరల్డ్‌కప్ సమరం జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 28 వరకు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే చాలా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే టికెట్ రేట్ విషయం కాస్త షాక్ కలిగించింది. ఉదాహరణకు స్పెయిన్- జర్మనీ మ్యాచ్ తీసుకుంటే ఖతార్ కరెన్సీలో టికెట్ రేటు 250 ఖతార్ రియాల్‌గా ఉంది.(మన కరెన్సీలో దాదాపు రూ.5,211).. ఇది మన ఐపీఎల్ టికెట్ రేట్స్‌లో సగానికి సగం కావడం విశేషం. ఇక ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర రూ. 45,828.. మన ఐపీఎల్ టికెట్‌తో పోలిస్తే రూ.10వేల వ్యత్యాసం మాత్రమే ఉంది. మరి మన ఐపీఎల్ ఫైనల్ టికెట్ రేట్ ఎంతో మీ ఊహకే వదిలేస్తున్నాం. వాస్తవానికి దీనికి ఒక కారణం ఉంది. నాలుగేళ్లకోసారి మాత్రమే ఫిఫా వరల్డ్‌కప్ జరుగుతుంది.. కానీ ఐపీఎల్ ప్రతీఏడాది కచ్చితంగా నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లక్రితం ఉన్న రేట్లకు డబుల్ రేట్లు ఫిక్స్ చేసి ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ టికెట్ల రేట్లను నిర్ణయించారు. అందుకే మన ఐపీఎల్ టికెట్ రేట్లతో పోలిస్తే అవి తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకో ఆశ్చర్యకర విషయమేంటంటే.. భారత్‌లో ఎక్కువగా అభిమానించేది క్రికెట్.. కానీ ఈసారి ఖతార్ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల కోసం భారతీయులు కూడా ఎగబడ్డారు. అత్యధిక టికెట్స్ అప్లై చేసుకున్న టాప్-7 దేశాల జాబితాలో భారత్ కూడా ఉండడం విశేషం. చదవండి: CSK VS RCB: ఈ సీజన్ అత్యధిక వ్యూయర్షిప్ రికార్డైంది ఈ మ్యాచ్‌లోనే..! 𝗪𝗮𝘁𝗰𝗵 . 𝗦𝘁𝗿𝗲𝗮𝗺 . 𝗙𝗿𝗲𝗲 Introducing #FIFAPlus: your new home for football ✨ pic.twitter.com/xzhHLFD3cj — FIFA World Cup (@FIFAWorldCup) April 12, 2022 -
FIFA World Cup: ఆ జట్ల మధ్యే తొలి పోరు.. ఏయే గ్రూపులో ఏ జట్లు అంటే!
FIFA World Cup- దోహా: ఈ ఏడాది నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. ఆతిథ్య దేశం ఖతర్, ఈక్వెడార్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభంకానుంది. తొలి రోజు నాలుగు మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఇప్పటికి 29 జట్లు అర్హత పొందగా... మిగతా మూడు జట్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల ద్వారా ఖరారవుతాయి. ప్లే ఆఫ్స్‌లో పోటీపడనున్న జట్లకూ ‘డ్రా’లో చోటు కల్పించారు. గ్రూప్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, నెదర్లాండ్స్, సెనెగల్. గ్రూప్ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, స్కాట్లాండ్ /వేల్స్/ఉక్రెయిన్. గ్రూప్ ‘సి’: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్. గ్రూప్ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ట్యునిషియా, యూఏఈ/ఆస్ట్రేలియా/ పెరూ. గ్రూప్ ‘ఇ’: స్పెయిన్, జర్మనీ, జపాన్, కోస్టారికా/న్యూజిలాండ్. గ్రూప్ ‘ఎఫ్’: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా. గ్రూప్ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్. గ్రూప్ ‘హెచ్’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, కొరియా. చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం -
'బాస్ నేను మనిషినే'.. స్టార్ ఫుట్‌బాలర్‌కు వింత అనుభవం
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీకి ఒక అభిమాని నుంచి వింత అనుభవం ఎదురైంది. ఫిఫా వరల్డ్‌కప్ 2022 క్వాలిఫయింగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈక్వెడార్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ అభిమాని ఒకరు ''మెస్సీ.. మెస్సీ'' అని గట్టిగా అరుస్తూ గ్రౌండ్లోకి చొచ్చుకొచ్చాడు. ఇది గమనించకుండా వెళ్తున్న మెస్సీకి అడ్డుగా వెళ్లి.. అతని భుజంపై చేయి వేసి ఒక్క సెల్ఫీ అంటూ అడిగాడు. అయితే పొరపాటు ఆ అభిమాని తన చెయ్యిని మెస్సీ మెడకు చుట్టేయడంతో ఊపిరి ఆడడం కష్టంగా మారింది. దీంతో మెస్సీ కోపంతో.. ''బాస్ నేను మనిషినే.. సెల్ఫీ కోసం నన్ను ఇబ్బంది పెట్టకు'' అంటూ అతన్ని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెక్యురిటీ వచ్చి అతన్ని స్టేడియం నుంచి బయటకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 1-1తో డ్రా చేసుకుంది. కాగా అర్జెంటీనాకు క్వాలిఫయింగ్‌లో ఇదే చివరి మ్యాచ్. ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా 11 మ్యాచ్‌లు గెలిచి.. ఆరు డ్రా చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. కాగా అర్జెంటీనాతో పాటు బ్రెజిల్, ఉరుగ్వే, ఈక్వెడార్‌లు ఫిఫా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. చదవండి: Manchester United: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. ఎవరా ఆటగాడు? View this post on Instagram A post shared by @jossuegarzon -
FIFA World Cup: ప్రపంచ కప్ టోర్నీకి అమెరికా అర్హత
FIFA World Cup Qatar 2022- స్యాన్ జోస్: గత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన యూఎస్ఏ జట్టు ఈ సారి ఆ అడ్డంకిని అధిగమించింది. ఖతర్‌లో ఈ ఏడాది జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు అమెరికా క్వాలిఫై అయింది. తమ చివరి క్వాలిఫయర్ పోరులో అమెరికా 0–2తో కోస్టారికా చేతిలో ఓడినా ఆ జట్టు ముందంజ వేయడం విశేషం. గత వారం జరిగిన మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సొంతగడ్డపై 5–1 తేడాతో పనామాపై ఘన విజయం సాధించడం అమెరికాకు కలిసొచ్చింది. కనీసం ఆరు గోల్స్ తేడాతో ఓడితే గానీ ఇబ్బంది లేని స్థితిలో బరిలోకి దిగిన యూఎస్...చివరకు పరాజయంపాలైనా వరల్డ్ కప్ అవకాశం మాత్రం దక్కించుకోగలిగింది. నవంబర్ 21నుంచి డిసెంబర్ 18 వరకు ఖతర్‌లో 2022 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. చదవండి: సూపర్ టైమింగ్.. ఎవరికి సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు See you in November. 🇺🇸 🗣 @TimHowardGK pic.twitter.com/ZiX4E4JGir — USMNT: Qualified. (@USMNT) March 31, 2022 -
FIFA World Cup 2022: 36 ఏళ్ల తర్వాత...
టొరంటో: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కెనడా ఫుట్‌బాల్ జట్టు 36 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ దేశాల జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్‌లో కెనడా 4–0 గోల్స్ తేడాతో గెలిచింది. గతంలో కెనడా 1986 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఆడి లీగ్ దశలోనే నిష్క్రమించింది. చదవండి: IPL 2022: ఎవరీ ఆయుష్ బదోని.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు -
నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్.. అయినా మళ్లీ దూరం!
పాలెర్మో: నాలుగుసార్లు ఫుట్‌బాల్ ప్రపంచ చాంపియన్ ఇటలీ మళ్లీ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ప్లే–ఆఫ్ సెమీఫైనల్లో ఇటలీ 0–1తో నార్త్ మెసెడోనియా చేతిలో పరాజయం చవిచూసింది. ఇటలీ ఫుట్‌బాల్ ప్రియుల్ని అత్యంత నిరాశపరిచే ఫలితమిది. ‘యూరో చాంపియన్’ అయిన ఇటలీ వరుస ప్రపంచకప్‌లకు దూరమవడం అభిమానుల్ని నిర్ఘాంతపరుస్తోంది. 2018లోనూ ఈ మేటి జట్టు క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. నార్త్ మెసెడోనియాతో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ ఆటగాళ్ల ఆధిపత్యమే కొనసాగింది. అయితే మ్యాచ్ ముగిసే దశలో ఎమరుపాటుగా ఉన్న ఇటలీ డిఫెన్స్‌ని ఛేదించి ట్రాజ్కొవ్స్కీ ఇంజ్యూరీ టైమ్ (90+2వ ని.)లో చేసిన గోల్‌తో నార్త్ మెసెడోనియా విజయం సాధించింది. దీంతో ఇటలీ శిబిరం నిరాశలో కూరుకుపోయింది. ఈక్వెడార్, ఉరుగ్వేలకు బెర్త్ మరోవైపు అర్జెంటీనా, బ్రెజిల్ తర్వాత దక్షిణ అమెరికా జోన్ నుంచి తాజాగా ఈక్వెడార్, ఉరుగ్వే ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. పరాగ్వేతో మ్యాచ్‌లో ఈక్వెడార్ 1–3తో ఓడిపోగా... మరోమ్యాచ్‌లో ఉరుగ్వే 1–0తో పెరూపై విజయం సాధించింది. ఉరుగ్వే, ఈక్వెడార్ 25 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. చదవండి: IPL 2022:క్రికెట్ పండగొచ్చింది.. కోల్‌కతా, చెన్నై సమరానికి సిద్దం -
అంతర్జాతీయ వేదికపై బైజుస్..! ఫస్ట్ ఇండియన్ కంపెనీగా రికార్డు..!
అంతర్జాతీయ వేదికపై ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజుస్ తళుక్కున మెరవనుంది. క్రీడారంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఫిఫా వరల్డ్ కప్‌కు అధికారిక స్పాన్సర్‌గా ఎంపికైనట్లు బైజుస్ గురువారం ప్రకటించింది. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖతార్‌లో జరగనుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్‌ను స్పాన్సర్ చేస్తోన్న మొదటి ఎడ్టెక్ భారతీయ కంపెనీగా బైజుస్ అవతరించింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం బైజుస్ స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ వ్యూహంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని బైజుస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా భారత క్రికెట్ టీమ్‌కు కూడా అధికారిక స్పాన్సర్స్‌గా బైజుస్ వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ‘ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-స్పోర్ట్ ఈవెంట్ ఫిఫా వరల్డ్ కప్ -2022కి స్పాన్సర్ చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము.ఇటువంటి ప్రతిష్టాత్మకమైన వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం, విద్య , క్రీడల ఏకీకరణలో విజయం సాధించడం మాకు గర్వకారణమ’ని బైజుస్ వ్యవస్థాపకుడు అండ్ సీఈవో బైజు రవీంద్రన్ అన్నారు. బైజుస్‌తో జత కట్టినందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని ప్రపంచ సాకర్ గవర్నింగ్ బాడీ ఫిఫా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కే మదాతి పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంతో ప్రపంచంలోని యువతకు సాధికారితను కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని అభిప్రాయపడ్డారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18, 2022 వరకు ఫిఫా వరల్డ్ కప్ 2022 జరగనుంది. We are delighted to announce that BYJU’S would represent India at the biggest stage as an Official Sponsor of the FIFA World Cup Qatar 2022™️. This would make BYJU’S the first EdTech brand to sponsor this prestigious event globally. Stay tuned for more updates! #FIFAWorldCup pic.twitter.com/4M9cfHT5AN — BYJU'S (@BYJUS) March 24, 2022 చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..! -
రష్యాకు భారీ షాక్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి బహిష్కరణ
ఉక్రెయిన్ పై సైనిక దాడులు చేస్తున్న రష్యాకు దెబ్బ మీద దెబ్బ తగలుతుంది. ఇప్పటికే అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అదే విధంగా రష్యా దుశ్చర్యకు గురి అవుతున్న ఉక్రెయిన్‌కు క్రీడాలోకం కూడా మద్దతుగా నిలుస్తోంది. తాజాగా ఈ ఏడాది జరగనున్న ఫిఫా ప్రపంచకప్ నుంచి రష్యాపై ఫిఫా బహిష్కరణ వేటు వేసింది. ఫిఫా ప్రపంచకప్-2022తో పాటు అన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్ఏ సంయుక్త సమావేశంలో వెల్లడించాయి. ఈ ఏడాది చివర్లో ఖతార్‌లో జరిగే ప్రపంచ కప్ కోసం రష్యా పురుషుల జట్టు మార్చిలో క్వాలిఫైయింగ్ ప్లే-ఆఫ్‌లలో పోలాండ్‌తో ఆడాల్సి ఉంది. పోలాండ్ ఫుట్‌బాల్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఇంగ్లాండ్‌లో జూలైలో జరగనున్న యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో రష్యా మహిళల జట్టు ఆడనుంది. ఫుట్‌బాల్ జట్లపై ఫిఫా, యూఈఎఫ్ఏ నిషేధం విధించడం రష్యాకు పెద్ద ఎదరుదెబ్బ తగిలినట్లైంది. అదే విధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కూడా రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. చదవండి: రష్యా, బెలారస్లను వెలివేయండి: ఐఓసీ -
వలస కార్మికులకు ఖతర్‌లో సెలవులు రద్దు ! కారణమిదే ?
మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్‌లో పని చేస్తున్న విదేశీ వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం సెలవులను రద్దు చేసింది. వారం రోజుల నుంచి అమలవుతున్న సెలవుల రద్దును ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల ప్రారంభానికి ముందే ఎత్తివేయనున్నారు. ఖతర్‌లో 2022 నవంబర్‌లో ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలను తిలకించడానికి విదేశీయులు పెద్ద సంఖ్యలో ఖతర్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీ ఇబ్బందులను అధిగమించడానికి ఇప్పుడు రద్దు చేసిన సెలవులను అప్పుడు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఖతర్ ప్రభుత్వం సెలవులపై మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో కంపెనీలు పాటిస్తున్నాయి. అత్యవసరం ఉన్న కార్మికులనే సెలవులపై సొంతూర్లకు పంపిస్తున్నారు. మిగతావాళ్లు ఫుట్‌బాల్ పోటీల ప్రారంభానికి ముందు స్వదేశాలకు వెళ్లి 4 నెలల పాటు సెలవులపై ఉండిరావచ్చని కంపెనీలు సూచిస్తున్నాయి. చదవండి: కనీస వేతనం, విదేశీ భవన్.. ఇంకా మరెన్నో.. -
ఎనిమిదేళ్ల తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్..
రోటర్‌డామ్: ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు నెదర్లాండ్స్ జట్టు అర్హత పొందింది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నార్వే జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచింది. తద్వారా గ్రూప్ ‘జి’లో నెదర్లాండ్స్ 23 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి 2022 ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు మాజీ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా జోన్ నుంచి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 0–0తో ‘డ్రా’ చేసుకుంది. పది జట్లున్న గ్రూప్‌లో 29 పాయింట్లతో అర్జెంటీనా రెండో స్థానంలో నిలిచి మరో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చదవండి: IND Vs NZ: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్, రాహుల్ జోడి..