
Lionel Messi Emotional.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ హ్యట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. ఫిపా(ఫుట్‌బాల్ వరల్డ్‌కప్) క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా బొలివియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో బొలివియాను చిత్తు చేయగా.. ఆ మూడు గోల్స్ మెస్సీనే చేయడం విశేషం. ఈ నేపథ్యంలో మెస్సీ మరో రికార్డును అందుకున్నాడు. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే 77 అంతర్జాతీయ గోల్స్ రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ఆట 14వ నిమిషంలో తొలి గోల్ కొట్టిన మెస్సీ పీలే రికార్డును సమం చేశాడు. ఆ తర్వాత ఆట 64 వ, 87 వ నిమిషంలో మరో రెండు గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించడమే గాక పీలే రికార్డును బద్దలు కొట్టాడు.
చదవండి: ఊహించని ట్విస్ట్.. గ్రౌండ్‌లోకి పోలీసుల రంగప్రవేశం, భయంతో ప్లేయర్స్..
అయితే ఇదే పీలే గతంలో మెస్సీని విమర్శిస్తూ అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు. నాతో మెస్సీని పోల్చవద్దని.. అతను ఏ విషయంలో పోటీ పడలేడని తెలిపాడు. మెస్సీలో కేవలం ఒక్క నైపుణ్యం మాత్రమే దాగుందని.. తలతో(హెడర్ గోల్) కానీ.. మరో కాలుతో కానీ గోల్ కొట్టలేడని.. కేవలం ఒక కాలుతో మాత్రమే గోల్ కొట్టగలడని విమర్శించాడు. అలాంటి మెస్సీతో నాకు పోలికేంటి అంటూ చురకలంటించాడు. కానీ తాజాగా మెస్సీ పీలే గోల్స్ రికార్డును అధిగమించి మాటలతో కాకుండా ఆటతో దెబ్బకు దెబ్బ తీశాడు.
ఆ తర్వాత ఆట 64 వ, 87 వ నిమిషంలో మరో రెండు గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించడమే గాక పీలే రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో మెస్సీ ఆరో స్థానంలో ఉన్నాడు. మెస్సీ ఇప్పటివరకు అర్జెంటీనా తరపున 153 మ్యాచ్‌ల్లో 79 గోల్స్ కొట్టాడు. కాగా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో 180 మ్యాచ్‌ల్లో 111 గోల్స్‌తో చాలా ముందున్నాడు. ఇక బ్రెజిల్ ఫుట్‌బాలర్ నైమర్ 112 మ్యాచ్‌ల్లో 68 గోల్స్‌తో రొనాల్డో, మెస్సీ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
చదవండి: కోచ్ కాదు కామాంధుడు.. మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులు
మ్యాచ్ విజయం అనంతరం మెస్సీ ఇంటర్య్వూలో భాగోద్వేగానికి గురయ్యాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన మెస్సీ ఆ సంతోషంలో ఏడ్చేశాడు. అనంతరం కోపా అమెరికా కప్‌తో తన జట్టు సభ్యులతో సెలబ్రేషన్ చేసుకున్నాడు. నేను ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాధిస్తున్నా. ఈరోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నా. అని పేర్కొన్నాడు.
Messi lifting the Copa America trophy in front of Argentina fans 😍🇦🇷pic.twitter.com/AzjbmYUBNx
— Messi Media (@LeoMessiMedia) September 10, 2021