Hattrick
-
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్ రెండో విజయం సాధించింది. మలేసియాతో ఇవాళ (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియాను భారత బౌలర్లు 31 పరుగులకే (14.3 ఓవర్లలో) కుప్పకూల్చారు. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో (4-1-5-5) చెలరేగింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా (3.3-1-8-3) మూడు వికెట్లు తీసింది. వీజే జోషిత్ (2-1-5-1) ఓ వికెట్ పడగొట్టింది. HISTORY IN U-19 WORLD CUP 📢Vaishnavi Sharma becomes the first Indian bowler to take the Hat-trick in Women's U-19 WC history. pic.twitter.com/s9ziyvZjpm— Johns. (@CricCrazyJohns) January 21, 2025మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన 11 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధికం. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు 5 పరుగులు, ఇద్దరు 3 పరుగులు, ఒకరు 2, ఇద్దరు ఒక్క పరుగు చేశారు.అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 17 బంతుల్లోనే ఆట ముగించేసింది. ఓపెనర్లు గొంగడి త్రిష, జి కమలిని కళ్లు మూసి తెరిచే లోగా ఖేల్ ఖతం చేశారు. త్రిష పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి 12 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసింది. కమలిని 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో తిరుగులేని రన్‌రేట్‌తో (+9.148) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో భారత్ సహా శ్రీలంక (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో రెండో స్థానం), వెస్టిండీస్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో మూడో స్థానం), మలేసియా (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో నాలుగో స్థానం) జట్లు ఉన్నాయి.కాగా, భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు చెలరేగి వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలనే ఛేదించింది. గొంగడి త్రిష 4 పరుగులకే ఔటైనా.. కమలిని (16 నాటౌట్), సనికా ఛల్కే (18 నాటౌట్) భారత్‌ను గెలుపు తీరాలు దాటించారు. అంతకుముందు భారత బౌలర్లు పరుణిక సిసోడియా (2.2-0-7-3), ఆయూషి శుక్లా (4-1-6-2), వీజే జోషిత్ (2-0-5-2) విజృంభించడంతో వెస్టిండీస్ 44 పరుగులకే ఆలౌటైంది. -
ఇంగ్లండ్ హ్యాట్రిక్.. ముగ్గురూ క్లీన్ బౌల్డ్
ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 59; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఊచకోత కోయడంతో 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (41), జోష్ ఇంగ్లిస్ (37) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ 3, జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహమూద్ తలో 2, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. సీన్ అబాట్ 3, హాజిల్‌వుడ్, జంపా చెరో 2, బార్ట్లెట్, గ్రీన్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్ (37), ఫిలిప్ సాల్ట్ (20), సామ్ కర్రన్(18), జోర్డన్ కాక్స్ (17), జేమీ ఓవర్టన్ (15), సాకిబ్ మహమూద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 13న జరుగుతుంది.A terrific video by England on team's hat-trick against Australia last night. 👌pic.twitter.com/tZzlLT8vbS— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024ఇంగ్లండ్ హ్యాట్రిక్ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది. ఆసీస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి రెండు బంతులకు.. 19వ తొలి బంతికి ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీశారు. 18వ ఓవర్లో సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్లను జోఫ్రా ఆర్చర్.. 19వ ఓవర్ తొలి బంతికి కెమరూన్ గ్రీన్‌ను సాకిబ్ మహమూద్ ఔట్ చేశారు. ఈ ముగ్గురూ క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడినప్పటికీ ఇదొక్కటే చెప్పుకోదగ్గ ప్రదర్శన.4,4,6,6,6,4 by Travis Head against Sam Curran in a single over. - The ruthless version of Head is scary! 🤯pic.twitter.com/QfFQCwgHN9— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024ట్రవిస్ హెడ్ ఊచకోతఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ తన సహజ సిద్దమైన హిట్టింగ్తో ఇంగ్లండ్ బౌలర్లను భయపెట్టారు. హెడ్.. సామ్ కర్రన్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. హెడ్.. ఆసీస్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హెడ్ కంటే ముందు పాంటింగ్, డేనియల్ క్రిస్టియన్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్ ఒకే ఓవర్లో 30 పరుగులు బాదారు.చదవండి: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
సామ్ కర్రన్ ఆల్‌రౌండ్ షో.. మెరుపు హాఫ్ సెంచరీ.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు
మెన్స్ హండ్రెడ్ లీగ్ 2024లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు సామ్ కర్రన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. లండన్ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో (22 బంతుల్లో 51 నాటౌట్; 6 సిక్సర్లు) పాటు హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన (20-11-16-5) నమోదు చేశాడు. సామ్ కర్రన్ వీర లెవెల్లో విజృంభించడంతో ఇన్విన్సిబుల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హండ్రెడ్ లీగ్‌లో సామ్ కర్రన్ నమోదు చేసిన హ్యాట్రిక్ మూడవది. సామ్‌కు ముందు టైమాల్ మిల్స్, ఇమ్రాన్ తాహిర్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సామ్ కర్రన్‌తో పాటు డేవిడ్ మలాన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. విల్ జాక్స్ (2), జోర్డన్ కాక్స్ (14), డొనోవన్ ఫెరియెరా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సామ్ బిల్లింగ్స్ 17 పరుగుల వద్ద రిటైర్డ్ అయ్యాడు. లండన్ బౌలర్లు ఓలీ స్టోన్, లియామ్ డాసన్, నాథన్ ఇల్లిస్, క్రిచ్లీ తలో వికెట్ పడగొట్టారు.148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ స్పిరిట్.. 95 బంతుల్లో 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. సామ్ కర్రన్ హ్యాట్రిక్ వికెట్లు సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. ఆడమ్ జంపా 3, విల్ జాక్స్, నాథన్ సౌటర్ తలో వికెట్ పడగొట్టారు. లండన్ ఇన్నింగ్స్‌లో కైల్ పెప్పర్ (20), డానియల్ లారెన్స్ (27), హెట్‌మైర్ (20) మాత్రమే 20 అంతకంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేశారు.నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై నార్త్ర్నన్ సూపర్ ఛార్జర్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఒరిజినల్స్ 100 బంతుల్లో 153 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. మాథ్యూ హర్స్ట్ (78) ఒరిజినల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
IPL 2024 LSG Vs GT: లక్నో ‘హ్యాట్రిక్’ విక్టరీ
లక్నో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 17వ సీజన్లో ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో గెలిచింది. మొదట లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో 18 పరుగులకే 2 కీలక వికెట్టు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 33; 3 ఫోర్లు), స్టొయినిస్ (43 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆఖర్లో నికోలస్ పూరన్ (22 బంతుల్లో 32; 3 సిక్స్‌లు), ఆయూశ్ బదోని (11 బంతుల్లో 20; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. అనంతరం సులువైన లక్ష్యమే ఎదురైనా... గుజరాత్ బ్యాటర్ల నిర్లక్ష్యం జట్టును ముంచింది. చివరకు గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. మీడియం పేసర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశ్ ఠాకూర్ (5/30), స్పిన్నర్ కృనాల్ పాండ్యా (3/11) గుజరాత్‌ను దెబ్బ తీశారు. 54 పరుగుల వరకు వికెట్ కోల్పోని గుజరాత్ అనూహ్యంగా మరో 76 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు చేజార్చుకోవడం గమనార్హం. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (19; 2 ఫోర్లు)ను యశ్ ఠాకూర్ బౌల్డ్ చేయగా, రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్‌తో కేన్ విలియమ్సన్ (1) ని్రష్కమించాడు. కృనాల్ పాండ్యా కూడా స్పిన్‌తో తిప్పేయడంతో గుజరాత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) నూర్ (బి) ఉమేశ్ 6; కేఎల్ రాహుల్ (సి) తెవాటియా (బి) దర్శన్ 33; పడిక్కల్ (సి) శంకర్ (బి) ఉమేశ్ 7; స్టొయినిస్ (సి) శరత్ (బి) దర్శన్ 58; పూరన్ (నాటౌట్) 32; బదోని (సి) ఉమేశ్ (బి) రషీద్ ఖాన్ 20; కృనాల్ పాండ్యా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–91, 4–112, 5–143. బౌలింగ్: ఉమేశ్ 3–0–22–2, జాన్సన్ 4–0–32–0, రషీద్ 4–0–28–1, మోహిత్ 3–0 –34–0, నూర్ 4–0–22–0, దర్శన్ 2–0–21–2. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) రవి బిష్ణోయ్ (బి) కృనాల్ 31; గిల్ (బి) యశ్ ఠాకూర్ 19; విలియమ్సన్ (సి అండ్ బి) రవి బిష్ణోయ్ 1; శరత్ (సి) బదోని (బి) కృనాల్ 2; విజయ్ శంకర్ (సి) రాహుల్ (బి) యశ్ 17; దర్శన్ (సి) యశ్ ఠాకూర్ (బి) కృనాల్ 12; తెవాటియా (సి) పూరన్ (బి) యశ్ 30; రషీద్ ఖాన్ (సి) సబ్–హుడా (బి) యశ్ ఠాకూర్ 0; ఉమేశ్ (సి) డికాక్ (బి) నవీనుల్ 2; జాన్సన్ (నాటౌట్) 0; నూర్ అహ్మద్ (సి) డికాక్ (బి) యశ్ ఠాకూర్ 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 130. వికెట్ల పతనం: 1–54, 2–56, 3–58, 4–61, 5–80, 6–93, 7–93, 8–102, 9–126, 10–130. బౌలింగ్: సిద్ధార్థ్ 4–0–29–0, నవీనుల్ 4–0–37–1, మయాంక్ 1–0–13–0, యశ్ ఠాకూర్ 3.5–1– 30–5, కృనాల్ 4–0–11–3, రవి బిష్ణోయ్ 2–0–8–1. -
చరిత్రపుటల్లోకెక్కిన మధ్యప్రదేశ్ బౌలర్
మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా చరిత్రపుట్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ ఆఖరి రోజు 95వ ఓవర్ వేసిన కుల్వంత్.. రెండు, మూడు, నాలుగు, ఐదు బంతులకు వికెట్లు తీసి, రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కుల్వంత్‌కు ముందు ఢిల్లీ బౌలర్ శంకర్ సైనీ (1988), జమ్మూ కశ్మీర్ బౌలర్ మొహమ్మద్ ముదాసిర్ (2018) మాత్రమే రంజీల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. కుల్వంత్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో విరుచుకుపడటంతో (5/34) మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో బరోడాపై ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో ఢిల్లీ, కేకేఆర్ జట్ల తరఫున ఆడిన కుల్వంత్.. మధ్యప్రదేశ్ తరఫున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా, రంజీ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 80వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నాలుగో బంతుల్లో నాలుగు వికెట్ల ఘనతను అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎక్కువ మంది సాధించలేదు. ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. లసిత్ మలింగ, ఆండ్రీ రసెల్, షాహీన్ అఫ్రిది, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు మంత్రి (111) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. అనుభవ్ అగర్వాల్, సరాన్ష్ జైన్ బరోడా పతనాన్ని శాశించారు. కుల్వంత్ 2 వికెట్లు తీశాడు. ఆతర్వాత ఫాలో ఆన్ ఆడిన బరోడా.. కుల్వంత్ ధాటికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు చాపచుట్టేసి ఇన్నింగ్స్ పరాజయాన్ని ఎదుర్కొంది. రావత్ (105) సెంచరీ చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. -
కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. అయితే మాయమాటలతో రైతులను గోల్మాల్ చేసి రాష్ట్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈనె గాచి నక్కల పాలు చేసినట్లు కాంగ్రెస్ లాంటి ముదనష్టపు పార్టీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దని హితవు పలికారు. మంగళ వారం మంత్రుల నివాస సముదాయంలో జన గామ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పక డ్బందీ ప్రణాళికతో, పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్ల బాధ్యత మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయా కర్రావుకు అప్పగించినట్లు తెలిపారు. కాగా ప్రతి ఊరూవాడ నుంచి జన సమీకరణ చేయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. పార్టీ ఇచ్చిన అవ కాశంతో జనగామలో 2014లో 34 వేలు, 2018 లో 30 వేల ఓట్ల మెజారిటీతో పీసీసీ అధ్యక్షుడిని ఓడించి కేసీఆర్‌కు కానుకగా ఇచ్చానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యరి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 70 వేల నుంచి లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజల ముందు పెడతారని పల్లా తెలిపారు. పల్లా ప్రచారానికి లైన్ క్లియర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 16న జనగామ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే జన గామ టికెట్ దక్కని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నడుమ రాజీ కోసమే ఈ సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. కాగా ఈ భేటీ ద్వారా పల్లా అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ చేయడంతో పాటు ప్రచారానికి కూడా కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జనగామ నియోజకవర్గంలో బహిరంగ కార్యక్రమాలకు పల్లా శ్రీకారం చుట్టనున్నారు. త్వరలో ‘నర్సాపూర్’పై సయోధ్య! నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీ ఆర్.. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం లేదనే అంశంపై స్పష్టత ఇచ్చారు. అయితే వారం రోజుల వ్యవధి లో నాలుగైదు పర్యాయాలు మదన్‌రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్యేగా కొన్ని పెండింగ్ పనులు, ఫైళ్ల కోసమే ఆయన వెళ్తున్నారని చెబుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటికే అంతర్గతంగా నియో జకవర్గంలో పార్టీ నేతలను కలిసి మద్దతు కోరు తున్నారు. కాగా జనగామ తరహాలో ఒకటీ రెండురోజుల్లో సునీతా లక్ష్మారెడ్డి, మద న్‌రెడ్డి మధ్య కూడా రాజీ కుదిర్చి ఒకే వేదికపై ప్రకటన ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. జనగా మ, నర్సాపూర్, మల్కాజిగిరి, నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప ల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజి గిరి), నందకిషోర్ వ్యాస్ (గోషామహల్), ఆనంద్ గౌడ్ (నాంపల్లి)కి ఈ నెల 15న తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందజేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడంలో ఉమ్మడి కరీంనగరే కీలకం..
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయడంలో ఉమ్మ డి కరీంనగర్ జిల్లా కీలకపాత్ర పోషిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. 2001లో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తిరుగులేని ఆధిక్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, ఈసారి కూడా అది పునరావృతం అవుతుందని చెప్పారు. సోమవారం మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్‌తో కేసీఆర్‌కు, తెలంగాణ ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. 2001 నుంచి నేటి వరకూ జిల్లా ప్రజలతో మమేకమై, తీసుకున్న ప్రతీ కార్యక్రమం విజయవంతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా పనిచేస్తుందన్నారు. తాజా సర్వేల్లోనూ, అన్ని నివేదికల్లోనూ ఈసారి ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు ఎదురులేదని స్పష్టమైందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ ల డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా రాబోయే మూడునెలలు పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులు మొదలు కార్యకర్త వరకూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేలా యాక్షన్‌ప్లాన్ రూపకల్పన చేయాలని ఆదేశించారు. చదవండి: కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడంలో ఉమ్మడి కరీంనగరే కీలకం.. బీఆర్ఎస్ కంచుకోటగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రౌండ్క్లియర్ ఉందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి జైత్రయాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పారు. కనీస పోటీనిచ్చే పరిస్థితిలో ప్రతిపక్షాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి, రమేశ్‌బాబు, సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్‌రెడ్డి, సంజయ్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఎల్.రమణ, పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. -
భారత అమ్మాయిల ‘హ్యాట్రిక్’
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 75 నాటౌట్; 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. దీంతో భారత అమ్మాయిల జట్టు 104 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ టోర్నీలో మహిళల జట్టుకిది వరుసగా మూడో విజయం. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (10), రిచా ఘోష్ (0), దయాళన్ హేమలత (2) నిరాశపరచడంతో భారత్ 20 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దీప్తి, ఐదో వరుస బ్యాటర్ జెమీమా ధాటిగా ఆడారు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. తదుపరి మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు 7న పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
'నాకు అతనితో పోలికేంటి'.. దెబ్బకు దెబ్బ తీశాడు
Lionel Messi Emotional.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ హ్యట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. ఫిపా(ఫుట్‌బాల్ వరల్డ్‌కప్) క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా బొలివియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో బొలివియాను చిత్తు చేయగా.. ఆ మూడు గోల్స్ మెస్సీనే చేయడం విశేషం. ఈ నేపథ్యంలో మెస్సీ మరో రికార్డును అందుకున్నాడు. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే 77 అంతర్జాతీయ గోల్స్ రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ఆట 14వ నిమిషంలో తొలి గోల్ కొట్టిన మెస్సీ పీలే రికార్డును సమం చేశాడు. ఆ తర్వాత ఆట 64 వ, 87 వ నిమిషంలో మరో రెండు గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించడమే గాక పీలే రికార్డును బద్దలు కొట్టాడు. చదవండి: ఊహించని ట్విస్ట్.. గ్రౌండ్లోకి పోలీసుల రంగప్రవేశం, భయంతో ప్లేయర్స్.. అయితే ఇదే పీలే గతంలో మెస్సీని విమర్శిస్తూ అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు. నాతో మెస్సీని పోల్చవద్దని.. అతను ఏ విషయంలో పోటీ పడలేడని తెలిపాడు. మెస్సీలో కేవలం ఒక్క నైపుణ్యం మాత్రమే దాగుందని.. తలతో(హెడర్ గోల్) కానీ.. మరో కాలుతో కానీ గోల్ కొట్టలేడని.. కేవలం ఒక కాలుతో మాత్రమే గోల్ కొట్టగలడని విమర్శించాడు. అలాంటి మెస్సీతో నాకు పోలికేంటి అంటూ చురకలంటించాడు. కానీ తాజాగా మెస్సీ పీలే గోల్స్ రికార్డును అధిగమించి మాటలతో కాకుండా ఆటతో దెబ్బకు దెబ్బ తీశాడు. ఆ తర్వాత ఆట 64 వ, 87 వ నిమిషంలో మరో రెండు గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించడమే గాక పీలే రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో మెస్సీ ఆరో స్థానంలో ఉన్నాడు. మెస్సీ ఇప్పటివరకు అర్జెంటీనా తరపున 153 మ్యాచ్‌ల్లో 79 గోల్స్ కొట్టాడు. కాగా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో 180 మ్యాచ్‌ల్లో 111 గోల్స్‌తో చాలా ముందున్నాడు. ఇక బ్రెజిల్ ఫుట్‌బాలర్ నైమర్ 112 మ్యాచ్‌ల్లో 68 గోల్స్‌తో రొనాల్డో, మెస్సీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. చదవండి: కోచ్ కాదు కామాంధుడు.. మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులు మ్యాచ్ విజయం అనంతరం మెస్సీ ఇంటర్య్వూలో భాగోద్వేగానికి గురయ్యాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన మెస్సీ ఆ సంతోషంలో ఏడ్చేశాడు. అనంతరం కోపా అమెరికా కప్‌తో తన జట్టు సభ్యులతో సెలబ్రేషన్ చేసుకున్నాడు. నేను ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాధిస్తున్నా. ఈరోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నా. అని పేర్కొన్నాడు. Messi lifting the Copa America trophy in front of Argentina fans 😍🇦🇷pic.twitter.com/AzjbmYUBNx — Messi Media (@LeoMessiMedia) September 10, 2021 -
ధోని ‘హ్యాట్రిక్’!
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి వన్డేలో 51 పరుగులు చేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్.. రెండో వన్డేలో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో అర్థ సెంచరీ సాధించి హ్యాట్రిక్ సాధించాడు. శిఖర్ ధావన్ వికెట్ అనంతరం అనూహ్యంగా నాలుగోస్థానంలో బ్యాటింగ్ వచ్చిన ధోని.. తొలి బంతినే మ్యాక్స్‌వెల్‌కు సునాయస క్యాచ్ ఇచ్చాడు. కానీ మ్యాక్సీ జారవిడచడంతో లభించిన ఈ అవకాశాన్ని ధోని అందిపుచ్చుకున్నాడు. 74 బంతుల్లో 3 ఫోర్లతో కెరీర్లో 70వ అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఎప్పటిలానే ఎలాంటి సంబరాలు లేకుండా మరుసటి బంతికి ధోని సిద్దమయ్యాడు. ఇక ధోనికి జతగా కేదార్ జాదవ్ రాణిస్తుండటంతో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇంకా విజయానికి 48 బంతుల్లో 58 పరుగులు అవసరం. ఈ సిరీస్ ముందు నిలకడలేమి ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోని.. ఇలా మూడు అర్ధసెంచరీలతో చెలరేగడంతో అతని అభిమానుల పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నారు. -
న్యూజిలాండ్‌పై భారత్ హ్యాట్రిక్
బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత పురుషుల జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 4–0తో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (8వ ని.లో), సురేందర్ కుమార్ (15వ ని.లో), మన్దీప్ సింగ్ (44వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (60వ ని.లో) ఒక్కోగోల్ చేశారు. తొలి క్వార్టర్లో వచ్చిన రెండో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రూపిందర్ భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించాడు. ఈ సిరీస్‌లో రూపిందర్‌కు ఇది నాలుగో గోల్ కావడం విశేషం. అనంతరం రూపిందర్ ఇచ్చిన పాస్‌ను ప్రత్యర్థి గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ సురేందర్ గోల్ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. మూడో క్వార్టర్లో వెటరన్ ప్లేయర్ సర్దార్ సింగ్ ఇచ్చిన చక్కటి పాస్‌ను మన్దీప్ గోల్‌గా మలిచాడు. మరి కొద్ది క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ఆకాశ్‌దీప్ మరో గోల్‌తో భారత్‌కు విజయాన్నందించాడు. -
ఉప్పల్ లో ఉనద్కత్ హ్యాట్రిక్
హైదరాబాద్: సన్ రైజర్స్ తో ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రైజింగ్ పుణే పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ హ్యాట్రిక్ దాటికి సన్ రైజర్స్ సొంత మైదానంలో పరాజయం పొందింది. ఈ మ్యాచ్ లో ఉనద్కత్ 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో రైజింగ్ పుణే 12 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పై విజయం సాధించింది. ఇక చివరి ఓవర్లో హైదరాబాద్ విజయానికి 13 పరుగులు కావల్సి ఉండగా ఉనద్కత్ చక్కటి బంతులతో ముగ్గురు హైదరాబాద్ బ్యాట్స్ మెన్ లు పెవిలియన్ దారి పట్టించాడు. బిపుల్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ లు వరుసగా అవుట్ కావడంతో ఈ సీజన్ లో హ్యాట్రిక్ వికెట్ తీసిన మూడో బౌలర్ గా ఉనద్కత్ రికార్డు నమోదు చేశాడు. అంతకు ముందు శ్యామ్యుల్ బద్రీ ముంబై ఇండియన్స్ పై , ఆండ్రూ టై రైజింగ్ పుణే లపై ఈ సీజన్ లో ఒకే రోజు హ్యాట్రిక్ సాధించారు. ఒకే ఇలా ముగ్గురు బౌలర్లు హ్యాట్రిక్ సాధించడం ఐపీఎల్ చరిత్రలో రెండో సారి. తొలి సీజన్ లో ఎన్తిని, లక్ష్మీపతి బాలజీ, అమిత్ మిశ్రాలు సాధించగా, మళ్లీ పదో సీజన్ లో ముగ్గురు బౌలర్లు సాధించడం విశేషం. -
హ్యాట్రిక్
వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాలమూరు చివరి లీగ్‌లో 72పరుగల తేడాతో ఆదిలాబాద్‌పై ఘనవిజయం రాణించిన రహీం, ఖయ్యుం, గణేష్ రేపు సెమీస్‌లో మెదక్‌తో ఢీ మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్–19 టోర్నీలో జిల్లా జట్టు దూసుకెళ్తోంది. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ సాధించి, గ్రూప్–ఏలో టాపర్‌గా నిలిచింది. గురువారం జిల్లాస్టేడియంలో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో పాలమూరు 72పరుగుల తేడాతో ఆదిలాబాద్‌ను చిత్తు చేసింది. టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాలమూరు జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. టాపార్డర్, మిడిల్డార్ విఫలమైంది. మంజునాథ్ (31), హర్షవర్ధన్ (27)లు మాత్రమే మోస్తారుగా రాణించారు. 153 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు ఆల్‌రౌండర్ అబ్దుల్ రహీం (42, 46 బంతుల్లో 2 ఫోర్లు), అర్జున్ (21, 25 బంతుల్లో 2 ఫోర్లు) ఏడు వికెట్‌కు 55పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆదిలాబాద్ బౌలర్లు సైఫ్ అలీ నాలుగు, ప్రదీప్ రెండు వికెట్లు తీసుకున్నారు. 216పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలాబాద్ ప్రారంభంలోనే ఓపెనర్ జగదీశ్‌రెడ్డి (4) వికెట్‌ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ ప్రదీప్ (52), సైఫ్ అలీఖాన్(29) రెండో వికెట్‌కు 44పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత జిల్లా బౌలర్లు ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో ఆ జట్టు 37.5 ఓవర్లలో 143పరుగులకే కుప్పకూలింది. జిల్లా బౌలర్లలో ఖయ్యుం, గణేశ్‌లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలి రాష్ట్ర క్రికెట్ క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని టూటౌన్ సీఐ డీవీపీ రాజు ఆకాంక్షించారు. ఉదయం ఆయన మహబూబ్‌నగర్–ఆదిలాబాద్ మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ క్రీడలు ఆడటంతో పాటు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. క్రమశిక్షణ, ఏకాగ్రతతో ఆడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఈసీ సభ్యుడు కృష్ణమూర్తి, కోచ్‌లు అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్ తదితరులు పాల్గొన్నారు. రేపు సెమీస్.. టోర్నీలో గ్రూప్–ఏ నుంచి మహబూబ్‌నగర్, నిజామాబాద్, గ్రూప్–బీ నుంచి మెదక్, వరంగల్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. శుక్రవారం విశ్రాంతి దినం. శనివారం తొలి సెమీఫైనల్లో మహబూబ్‌నగర్ జట్టు మెదక్‌తో జిల్లాస్టేడియంలో తలపడనుంది. జడ్చర్లలో జరిగే రెండో సెమీస్‌లో వరంగల్‌తో నిజామాబాద్ ఢీకొంటుంది. ఉత్కంఠ పోరులో నెగ్గిన నిజామాబాద్ జడ్చర్ల టౌన్: రెండు విజయాలతో నిజామాబాద్ జట్టు సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గురువారం జడ్చర్ల ఎర్రసత్యం స్మారక క్రీడామైదానంలో ఉత్కంఠగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నిజామాబాద్ ఒక వికెట్ తేడాతో కరీంనగర్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ జట్టు 39.4ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయింది. నిజామాబాద్ బౌలర్లలో శ్రావణ్, నిఖిల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. 130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నిజామాబాద్ జట్టు 31.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. జట్టులో కమలేష్ (27) ఒక్కడే రాణించాడు. కరీంనగర్ బౌలర్లలో ఆకాష్‌రావు ఐదు, రాహుల్ 3 వికెట్లు తీసుకున్నారు. -
ఈ విజయాలను ఎప్పటికీ మర్చిపోలేను : నిఖిల్
వరుస విజయాలతో నిఖిల్ మంచి జోష్ మీద ఉన్నారు. ఈ విజయాలకు కొనసాగింపుగా నిలిచే చిత్రాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఈ మూడు చిత్రాల విజయంతో హ్యాట్రిక్ సాధించిన నిఖిల్ ఆ ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. నిఖిల్ మాట్లాడుతూ -‘‘భవిష్యత్తులో నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ వరుస విజయాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ‘హ్యాపీడేస్’తో ప్రారంభమైన నా కెరీర్ ‘స్వామి రారా’తో మంచి మలుపు తీసుకుంది. ఈ చిత్రం హీరోగా మంచి కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. భవిష్యత్తులో నేను చేసే చిత్రాలు కూడా జనరంజకంగా ఉండాలనుకుంటున్నాను. కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నా’’ అన్నారు. నిఖిల్ నిర్మాతల హీరో అనీ, ‘సూర్య వర్సెస్ సూర్య’ విడుదలై 25 రోజులై, ఇంకా మంచి వసూళ్లు రాబడుతోందని ఆ చిత్రనిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు. నిఖిల్ హ్యాట్రిక్ సాధించడం ఆనందంగా ఉందని ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్‌వర్మ అన్నారు. నిఖిల్ ఒప్పుకుంటే ‘కార్తికేయ’కు సీక్వెల్ తీస్తానని ఆ చిత్రదర్శకుడు చందు మొండేటి పేర్కొన్నారు. ఈ సమావేశంలో చైతన్యకృష్ణ, చక్రి చిగురుపాటి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రాజా రవీంద్ర, వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు. -
నిఖిల్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్
-
హ్యాట్రిక్ రేసులో ఐదుగురు వీరులు
సాక్షి డెస్క్, నిజామాబాద్ : ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలవడం అరుదు. ఇలా గెలిస్తే హ్యాట్రిక్ సాధించారంటాం. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నవారిలో పలువురు అభ్యర్థులు ఈ అరుదైన ఘనత సాధించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. నిజామాబాద్ అర్బన్‌నుంచి రెండుసార్లు గెలిచిన యెండల లక్ష్మీనారాయణ సైతం హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి పోటీ చేస్తున్నాయి. అయితే ఈసారి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంనుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సైతం ఈ ఘనత సాధించడానికి ఒక్క విజయం దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నాలుగో విజయం కోసం మరోసారి బోధన్నుంచే బరిలో నిలిచారు. ఈయన 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.