33 పరుగులతో గుజరాత్ ఓటమి
5 వికెట్లతో అదరగొట్టిన యశ్ ఠాకూర్
లక్నో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 17వ సీజన్‌లో ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో గెలిచింది. మొదట లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో 18 పరుగులకే 2 కీలక వికెట్టు కోల్పోయి కష్టాల్లో పడింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 33; 3 ఫోర్లు), స్టొయినిస్ (43 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆఖర్లో నికోలస్ పూరన్ (22 బంతుల్లో 32; 3 సిక్స్‌లు), ఆయూశ్ బదోని (11 బంతుల్లో 20; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. అనంతరం సులువైన లక్ష్యమే ఎదురైనా... గుజరాత్ బ్యాటర్ల నిర్లక్ష్యం జట్టును ముంచింది. చివరకు గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది.
మీడియం పేసర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశ్ ఠాకూర్ (5/30), స్పిన్నర్ కృనాల్ పాండ్యా (3/11) గుజరాత్‌ను దెబ్బ తీశారు. 54 పరుగుల వరకు వికెట్ కోల్పోని గుజరాత్ అనూహ్యంగా మరో 76 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు చేజార్చుకోవడం గమనార్హం. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (19; 2 ఫోర్లు)ను యశ్ ఠాకూర్ బౌల్డ్ చేయగా, రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్‌తో కేన్ విలియమ్సన్ (1) ని్రష్కమించాడు. కృనాల్ పాండ్యా కూడా స్పిన్‌తో తిప్పేయడంతో గుజరాత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది.
స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) నూర్ (బి) ఉమేశ్ 6; కేఎల్ రాహుల్ (సి) తెవాటియా (బి) దర్శన్ 33; పడిక్కల్ (సి) శంకర్ (బి) ఉమేశ్ 7; స్టొయినిస్ (సి) శరత్ (బి) దర్శన్ 58; పూరన్ (నాటౌట్) 32; బదోని (సి) ఉమేశ్ (బి) రషీద్ ఖాన్ 20; కృనాల్
పాండ్యా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163.
వికెట్ల పతనం: 1–6, 2–18, 3–91, 4–112, 5–143.
బౌలింగ్: ఉమేశ్ 3–0–22–2, జాన్సన్ 4–0–32–0, రషీద్ 4–0–28–1, మోహిత్ 3–0 –34–0, నూర్ 4–0–22–0, దర్శన్ 2–0–21–2.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) రవి బిష్ణోయ్ (బి) కృనాల్ 31; గిల్ (బి) యశ్ ఠాకూర్ 19; విలియమ్సన్ (సి అండ్ బి) రవి బిష్ణోయ్ 1; శరత్ (సి) బదోని (బి) కృనాల్ 2; విజయ్ శంకర్ (సి) రాహుల్ (బి) యశ్ 17; దర్శన్ (సి) యశ్ ఠాకూర్ (బి) కృనాల్ 12; తెవాటియా (సి) పూరన్ (బి) యశ్ 30; రషీద్ ఖాన్ (సి) సబ్–హుడా (బి) యశ్ ఠాకూర్ 0; ఉమేశ్ (సి) డికాక్ (బి) నవీనుల్ 2; జాన్సన్ (నాటౌట్) 0; నూర్ అహ్మద్ (సి) డికాక్ (బి) యశ్ ఠాకూర్ 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 130.
వికెట్ల పతనం: 1–54, 2–56, 3–58, 4–61, 5–80, 6–93, 7–93, 8–102, 9–126, 10–130.
బౌలింగ్: సిద్ధార్థ్ 4–0–29–0, నవీనుల్ 4–0–37–1, మయాంక్ 1–0–13–0, యశ్ ఠాకూర్ 3.5–1– 30–5, కృనాల్ 4–0–11–3, రవి బిష్ణోయ్ 2–0–8–1.
Comments
Please login to add a commentAdd a comment