IPL 2024: గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ | Sakshi
Sakshi News home page

IPL 2024: గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ

Published Wed, Apr 17 2024 7:17 PM

IPL 2024 GT VS DC Match Updates And Highlights - Sakshi

గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ
అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. 89 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.

మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
65 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. సందీప్‌ వారియర్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ పోరెల్‌ (15) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఢిల్లీ 90 బంతుల్లో 25 పరుగులు చేస్తే గెలుస్తుంది

రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
6 బంతుల్లో 7 పరుగులు చేసి పృథ్వీ షా ఔటయ్యాడు. సందీప్‌ వారియర్‌ బౌలింగ్‌లో స్పెన్సర్‌ జాన్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి షా పెవిలియన్‌ బాట పట్టాడు. 

టార్గెట్‌ 90.. తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
10 బంతుల్లో 20 పరుగులు చేసి ఫ్రేసర్‌ ఔటయ్యాడు. స్పెన్సర్‌ జాన్సన్‌ బౌలింగ్‌లో అభినవ్‌ మనోహర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఫ్రేసర్‌ పెవిలియన్‌కు చేరాడు. 

టార్గెట్‌ 90.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఢిల్లీ
90 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్‌ ఫ్రేసర్‌ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ పృథ్వీ షా 2 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు. 1.5 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 25/0గా ఉంది.

ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. 89 పరుగులకే కుప్పకూలిన గుజరాత్‌
అహ్మదా​బాద్‌ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్‌ బ్యాటింగ్‌ లైనప్‌పై ఎదురుదాడికి దిగింది.

ఇషాంత్‌ శర్మ (2-0-8-2), ముకేశ్‌ కుమార్‌ (2.3-0-14-3), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (1-0-11-2), అక్షర్‌ పటేల్‌ (4-0-17-1), ఖలీల్‌ అహ్మద్‌ (4-1-18-1) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది.

వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్‌ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో రషీద్‌ ఖాన్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్‌ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
66 పరుగుల వద్ద గుజరాత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో రాహుల్‌ తెవాటియా (10) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
48 పరుగుల వద్ద గుజరాత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ వేసిన 9వ ఓవర్‌లో అభినవ్‌ మనోహర్‌ (8), షారుక్‌ ఖాన్‌లను (0) రిషబ్‌ పంత్‌ స్టంపౌట్‌ చేశాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 61/6గా ఉంది. రషీద్‌ ఖాన్‌ (12), రాహుల్‌ తెవాటియా (8) క్రీజ్‌లో ఉన్నారు.

30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌
గుజరాత్‌ టైటాన్స్‌ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో ఓవర్‌ ఆఖరి బంతికి ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి డేవిడ్‌ మిల్లర్‌ (2) ఔటయ్యాడు. 

మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్‌
4.1వ ఓవర్‌: మూడు బంతుల వ్యవధిలో గుజరాత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్‌ ఐదో బంతికి ముకేశ్‌ కుమార్‌ సాహాను (2) క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. ఐదో ఓవర్‌ తొలి బంతికి సాయి సుదర్శన్‌ (12) రనౌటయ్యాడు. 4.5 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 30/3గా ఉంది. డేవిడ్‌ మిల్లర్‌ (2), అభినవ్‌ మనోహర్‌ క్రీజ్‌లో ఉన్నారు.  

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
1.5వ ఓవర్‌: 11 పరుగుల వద్ద గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (8) ఔటయ్యాడు. సాహా, సాయి సుదర్శన్‌ క్రీజ్‌లో ఉన్నారు.

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

గుజరాత్‌, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది. 

తుది జట్లు..

గుజరాత్‌: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), వృద్దిమాన్‌ సాహా (వికెట్‌కీపర్‌), సాయి సుదర్శన్, డేవిడ్‌ మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్‌ శర్మ, నూర్‌ అహ్మద్‌, సందీప్‌ వారియర్‌, స్పెన్సర్ జాన్సన్‌ 

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్‌ కుమార్‌, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ
 

Advertisement
Advertisement