updates
-
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
India Vs Bangladesh Match Live Updates And Highlights:భారత్ ఘన విజయం..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో అందుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. గిల్ సెంచరీ..శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత్ విజయానికి ఇంకా 7 పరుగులు కావాలి.విజయానికి చేరువలో భారత్..44 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(88), కేఎల్ రాహుల్(33) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.34 ఓవర్లకు భారత్ స్కోర్: 158/434 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(65), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్..144 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్..134 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్‌మన్ గిల్(56), అక్షర్ పటేల్(3) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి ఔట్..టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 24 ఓవర్లకు భారత్ స్కోర్: 118/2ఆచితూచి ఆడుతున్న గిల్-కోహ్లిరోహిత్ శర్మ ఔటయ్యాక భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి(13), శుబ్‌మన్ గిల్(41) ఆచితూచి ఆడుతున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.టీమిండియా తొలి వికెట్ డౌన్..69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 69/1దూకుడుగా ఆడుతున్న రోహిత్, గిల్..229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), శుబ్‌మన్ గిల్(13) ఉన్నారు.ఐదేసిన షమీ.. బంగ్లాదేశ్ 228 ఆలౌట్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. భారత బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైన సాధించిందంటే అది తౌహిద్ హృదోయ్ (100), జాకిర్ అలీ (68) చలువే. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవరూ రాణించలేదు. ఈ మ్యాచ్‌లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. రోహిత్ శర్మ సునాయాసమైన క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఐదు వికెట్లు తీసిన షమీతౌహిద్ హృదోయ్ సూపర్ సెంచరీజట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన తౌహిద్ హృదోయ్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీ చేశాడు. కండరాల సమస్యతో బాధపడుతూనే హృదోయ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. నాలుగో వికెట్ తీసిన షమీఈ మ్యాచ్‌లో షమీ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. షమీ.. తంజిమ్ హసన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 47 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 221/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (96) , తస్కిన్ అహ్మద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సూపర్‌గా బ్యాటింగ్ చేస్తున్న హృదోయ్ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రిషద్ హొసేన్ (18) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్హృదోయ్, జాకిర్ అలీ మధ్య భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. జాకిర్ అలీని (68) షమీ ఔట్ చేశాడు. 189 పరుగుల వద్ద (42.4 ఓవర్లు) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదోయ్ (84), రిషద్ హొసేన్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న జాకిర్ అలీ, హృదోయ్బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. ప్రస్తుతం జాకిర్ అలీ 54, హృదోయ్ 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 37.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 150/5గా ఉంది. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5తౌహిద్ హృదోయ్ (37), జాకిర్ అలీ (41) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాదేశ్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 78 పరుగులు జోడించారు. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5గా ఉంది.25 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 92/535 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది.25 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 92/5గా ఉంది. తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ తలో 29 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. హ్యాట్రిక్ మిస్అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో ఓవర్లో వరుసగా 2, 3 బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. నాలుగో బంతికి కూడా వికెట్ తీయాల్సింది. జాకిర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌కు రోహిత్ శర్మ మిస్ కావడంతో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5గా ఉంది. తౌహిద్ హృదోయ్ (4), జాకిర్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు.వరుస బంతుల్లో వికెట్లు తీసిన అక్షర్.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో (2, 3) వికెట్లు తీశాడు. తొలుత తంజిద్‌కు పెవిలియన్‌కు పంపిన అక్షర్.. ఆతర్వాతి బంతికే ముష్ఫికర్‌కు ఔట్ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (25) పెవిలియన్ బాట పట్టాడు. మళ్లీ వికెట్ తీసిన షమీ.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో షమీ తన రెండో వికెట్ తీశాడు. స్లిప్స్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మెహిది హసన్ మిరాజ్ (5) పెవిలియన్‌కు చేరాడు. 6.2 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 26/3గా ఉంది. తంజిద్ హసన్ (20) ధాటిగా ఆడుతున్నాడు. తౌహిద్ హృదోయ్ కొత్తగా క్రీజ్‌లోకి వచ్చాడు.రెండో ఓవర్లో మరో వికెట్బంగ్లాదేశ్ జట్టు రెండో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నజ్ముల్ హసన్ షాంటో డకౌటయ్యాడు. బంగ్లా ఖాతాలో ప్రస్తుతం 2 పరుగులకే ఉన్నాయి. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ డకౌటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 20) భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) బరిలోకి దిగుతుంది. అర్షదీప్ స్థానంలో షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీకి జతగా హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నాడు. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. మిస్టరీ స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ సైతం ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 58,165 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 63,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 01 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం.ఇక.. నిన్న(ఆదివారం) 67,284 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా లెక్క తేలింది.ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దు...డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసంధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దుడిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురాళ్లు పఠనంజనవరి 15న తిరిగి సుప్రభాతం ప్రారంభం. -
IND VS AUS: నిప్పులు చెరిగిన బౌలర్లు.. తొలి రోజు టీమిండియాదే
IND VS AUS 1st Test Day 1 Live Updates:ముగిసిన తొలి రోజు ఆట..పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆతిథ్య జట్టుపై టీమిండియా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(19), మిచెల్ స్టార్క్(6) పరుగులతో ఉన్నారు.ఇక భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటికి బౌలర్లు మాత్రం నిప్పులు చెరిగారు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో కంగారులను దెబ్బతీయగా.. సిరాజ్ రెండు, హర్షిత్ రానా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు టీమిండియా కేవలం 150 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి(41) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడితో వికెట్ కీపర్ రిషబ్ పంత్(37) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్కెప్టెన్ కమిన్స్ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి కమిన్స్(3) పెవిలియన్ చేరాడు. స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 59/7 (24.4). ఆరో వికెట్ డౌన్..భారత బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన లబుషేన్.. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 23 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 48-6ఆసీస్ ఐదో వికెట్ డౌన్..38 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు. 18 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 39-5నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.కష్టాల్లో ఆసీస్.. 19 పరుగులకే 3 వికెట్లు డౌన్19 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా వరుస బంతుల్లో ఉస్మాన్ ఖ్వాజా (8), స్టీవ్ స్మిత్‌ను (0) ఔట్ చేశాడు. 7 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా స్కోర్ 19/3గా ఉంది. ట్రవిస్ హెడ్, లబూషేన్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియానాథన్ మెక్స్వినీ రూపంలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 13 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేయగలిగాడు. బుమ్రా బౌలింగ్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఖవాజా , లబుషేన్ క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 19-1.150 పరుగులకు ఆలౌటైన టీమిండియా150 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నితీశ్ కుమార్ రెడ్డి (41) చివరి వికెట్‌గా వెనురిగాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి నితీశ్ ఔటయ్యాడు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియాబుమ్రా రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి బుమ్రా ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. సిరాజ్ క్రీజులోకి రాగా.. నితీశ్ రెడ్డి 35 పరుగులతో ఆడుతున్నాడు. భారత్‌స్కోరు: 144-9(49)ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా128 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో లబూషేన్ క్యాచ్ పట్టడంతో హర్షిత్ రాణా (7) ఔటయ్యాడు. నితీశ్ కుమార్‌కు (27) జతగా బుమ్రా క్రీజ్‌లోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పంత్ ఔట్121 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (37) ఔటయ్యాడు. నితీశ్‌కుమార్ రెడ్డికి (27) జతగా హర్షిత్ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా73 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మిచ్ మార్ష్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (4) పెవిలియన్ బాట పట్టాడు. రిషబ్ పంత్‌కు (17) జతగా నితీశ్ కుమార్ రెడ్డి క్రీజ్‌లోకి వచ్చాడు. 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది టీమిండియా. 59 పరుగుల వద్ద మిచ్ మార్ష్ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి జురెల్ (11) ఔటయ్యాడు. రిషబ్ పంత్‌కు (10) జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు. కష్టాల్లో టీమిండియాలంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25)పంత్ పది, జురెల్ నాలుగు పరుగులతోక్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా47 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (26) ఔటయ్యాడు. రిషబ్ పంత్‌కు (10) జతగా ధృవ్ జురెల్ క్రీజ్‌లోకి వచ్చాడు.32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా32 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (5) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా14 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి దేవ్‌దత్ పడిక్కల్ డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు జతగా విరాట్ కోహ్లి క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 5 పరుగుల టీమ్ స్కోర్ వద్ద యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నాథన్ మెక్‌స్వీనికి క్యాచ్‌ని జైస్వాల్ పెవిలియన్ బాట పట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్పెర్త్లోని అప్టస్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నారు. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని డెబ్యూ చేయనున్నాడు. తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(శనివారం) 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,602 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టోకెన్ లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 56,711 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,775 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.64 కోట్లుగా లెక్క తేలింది.నేడు తిరుమలలో గరుడసేవ...కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడవాహనం పై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.రాత్రి 7 గంటలకు గరుడవాహనం పై తిరు వీధుల్లో ఊరేగింపు.ఈ నెల 17 న తిరుమలలో కార్తీక వనభోజనం.18 టిటిడి పాలకమండలి సమావేశం -
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 61,446 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,374 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లుగా లెక్క తేలింది.ఉగ్ర శ్రీనివాసమూర్తి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహించాము. శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించిన టీటీడీ. చిరుజల్లుల మద్య ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.– టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(ఆదివారం) 82,233 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా లెక్క తేలింది. -
వోయేజర్–1 పునరుత్థానం! 43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం
వోయేజర్–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్మిట్టర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్మిట్టర్కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్‌లో అనన్య పాండే : ఆయన కోసమే! -
USA Presidential Elections 2024: నువ్వా నేనా!?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. కమలా హారిస్ రూపంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ పీఠమెక్కుతారా, లేక పాత కాపు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విజయఢంకా మోగిస్తారా అన్నది ఆసక్తకరంగా మారింది. రెండు వారాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వారి విజయావకాశాలపై అమెరికా అంతటా జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి సర్వేలు ఏం చెబుతున్నాయనే అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఓటర్లు తలమునకలుగా ఉన్నారు. జాతీయ పోలింగ్ సగటులో హారిస్ ముందంజ జాతీయ పోలింగ్ సగటులో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హారిసే ముందంజలో ఉన్నారు. ఏబీసీ న్యూస్, వెబ్సైట్ 538 గణాంకాల ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు దేశవ్యాప్తంగా 46 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. హారిస్‌కు కాస్త ఎక్కువగా 48 శాతం మంది మద్దతుండటం విశేషం. అధ్యక్షుడు జో బైడెన్‌ను కాదని హారిస్‌ను డెమొక్రటిక్ పార్టీ బరిలో దింపడం తెలిసిందే. అనంతరం ఆమెకు ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగింది. సెపె్టంబర్ నుంచి హారిస్ ఆధిక్యత స్థిరంగా కొనసాగుతోంది. 7 కోట్ల మంది వీక్షించిన సెపె్టంబర్ పది నాటి హారిస్–ట్రంప్ బిగ్ డిబేట్ తర్వాత కూడా ఇందులో మార్పేమీ లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి కాకుండా ఎక్కువ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను సాధించిన వారే విజేతగా నిలుస్తారు. ప్రతి రాష్ట్రానికీ జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు కేటాయిస్తారు. ఇలా మొత్తంగా అమెరికాలో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. గెలుపు కోసం కనీసం 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెల్చుకోవాల్సి ఉంటుంది. స్వింగ్ రాష్ట్రాల్లోనూ హారిసే అమెరికా ఓటర్లు చాలావరకు తాము ఏ పార్టీని అభిమానిస్తామో, ఏ పారీ్టకి మద్దతు పలుకుతామో బహిరంగంగానే చెబుతారు. అంతమాత్రాన వారు పారీ్టకి ఓటేస్తారన్న గ్యారెంటీ లేదు. ఏ పారీ్టకీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లుంటారు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. వీళ్ల మద్దతు దక్కిన అభ్యర్థే గెలవడం పరిపాటి. ఈసారి అందరి కళ్లూ ఏడు స్వింగ్ రాష్ట్రాలపైనే ఉన్నాయి! స్వింగ్ స్టేట్స్లో అత్యధికంగా 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాతో పాటు , 10 ఓట్లున్న విస్కాన్సిన్లో ట్రంప్, హారిస్ సమవుజ్జీలుగా నిలవడం విశేషం! 15 ఓట్లున్న మిషిగన్, ఆరు ఓట్లున్న నెవడాల్లో హారిస్‌కు స్వల్ప మొగ్గుంది. 16 ఓట్ల చొప్పున ఉన్న నార్త్ కరోలినా, జార్జియాల్లో, 11 ఓట్లున్న అరిజోనాలో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. అయితే స్వింగ్ రాష్ట్రాలన్నింటిలో కలిపి చూస్తే హారిసే సగటున 5 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు గణాంకాలు చాటుతున్నాయి. సగటు ఎలా లెక్కిస్తారు? రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో వేర్వేరు సంస్థలు చేసిన పోల్ సర్వేలను మదించి అభ్యర్థుల ఆదరణ తాలూకు సగటును లెక్కిస్తారు. అమెరికాలో ఏబీసీ న్యూస్‌లో భాగమైన పోలింగ్ విశ్లేషణ సంస్థ వెబ్సైట్ 538 దీన్ని లెక్కిస్తోంది. సర్వేలోఎంతమంది పాల్గొన్నారు, ఏ రోజున పోల్ చేపట్టారు, ఫోన్, టెక్సŠస్ట్ మెసేజ్, ఆన్లైన్... వీటిలో ఓటర్ల నుంచి ఎలా సమాచారం రాబట్టారు వంటి అంశాలను పారదర్శకంగా, నిజాయతీగా బేరీజు వేసి డేటాను సేకరిస్తారు. ఆ మీదట సగటును లెక్కిస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
IND vs BAN: నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియాదే పైచేయి
IND VS BAN 2nd Test Day 4 Updates: నాలుగో రోజు ముగిసిన ఆటటీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్‌లో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. సోమవారం నాటి ఆట పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. మొమినుల్ హక్ సున్నా, షాద్మన్ ఇస్లాం ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు.కాగా సోమవారం 107/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. 289/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్అశూ బౌలింగ్‌లో హసన్ మహమూద్(4) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్స్కోరు- 26/2 (9.4). షాద్మన్ ఏడు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌కు అశ్విన్ ఆదిలోనే షాకిచ్చాడు. అశూ బౌలింగ్‌లో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్(10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ స్కోరు: 18/1 (7.1). షాద్మన్ ఇస్లాం 3 పరుగులతో ఆడుతున్నాడు. హసన్ మహమూద్ క్రీజులోకి వచ్చాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్.. స్కోర్ ఎంతంటే?టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 285/9 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 52 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. బంగ్లాను సెకెండ్ ఇన్నింగ్స్ ఆడించాలన్న ఆలోచనతో టీమిండియా దూకుడుగా ఆడింది. వచ్చినవారు వచ్చినట్లగా తమ వంతు పాత్ర పోషించి పెవిలయన్‌కు వెళ్లిపోయారు. భారత బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్(68), కోహ్లి(47), గిల్(39) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, షకీబ్ అల్ హసన్ తలా నాలుగు వికెట్లు పడగొట్టారు.34.1: రాహుల్ అవుట్మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. బుమ్రా క్రీజులోకి వచ్చాడు. టీమిండియాస్కోరు: 284/8 (34.1). తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా కంటే 51 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.33.3: ఏడో వికెట్ డౌన్రవిచంద్రన్ అశ్విన్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. షకీబ్ బౌలింగ్‌లో అశూ(1) బౌల్డ్ అయ్యాడు. ఆకాశ్ దీప్ క్రీజులోకి వచ్చాడు.32.2: జడ్డూ అవుట్మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో జడేజా(8) షాంటోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. కోహ్లి అవుట్.. హాఫ్ సెంచరీ మిస్29.1: విరాట్ కో హ్లి రూపంలో టీమిండియా ఐదో వికెట్ ల్పోయింది. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో 47 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. జడేజాక్రీజులోకి వచ్చాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్ 33 బంతుల్లోనే హా ఫ్ సెంచరీ మార్కు దాటేశాడు. స్కోరు: 249/5 (30)26 ఓవర్లలో టీమిండియాస్కోరు: 219-4కోహ్లి 41, రాహుల్ 30 పరుగులతో ఆడుతున్నారు.నాలుగో వికెట్ డౌన్..రిషబ్ పంత్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన పంత్.. షకీబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 20 ఓవర్లకు భారత్ స్కోర్: 162-4భారత మూడో వికెట్ డౌన్.. శుబ్‌మన్ గిల్ ఔట్టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన గిల్.. భారీ షాట్‌కు ప్రయత్నించి షకీబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో విరాట్ కోహ్లి వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 144-3రెండో వికెట్ డౌన్.. జైశ్వాల్ ఔట్యశస్వీ జైశ్వాల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 72 పరుగుల చేసిన జైశ్వాల్‌ను బంగ్లా పేసర్ హసన్ మహమూద్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 15 ఓవర్లకు భారత్ స్కోర్: 130/2జైశ్వాల్ ఫిప్టీ..కాన్పూర్ టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 72 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో శుబ్‌మన్ గిల్(30) క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది.3.6: కాన్పూర్లోబ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(23) మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 30 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియాస్కోరు: 55-1(4)233 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్74.2వ ఓవర్: 233 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. జడేజా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఖలీద్ అహ్మద్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు సిరాజ్ హసన్ మహమూద్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు మొత్తం ఏడు వికెట్లు తీశారు. బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అశ్విన్, ఆకాశ్‌దీప్ తలో 2, జడేజా ఓ వికెట్ దక్కించుకున్నారు. మొమినుల్ హక్ 107 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.బుమ్రా ఖాతాలో మరో వికెట్71.1వ ఓవర్: 230 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో తైజుల్ ఇస్లాం (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రాకు ఇది మూడో వికెట్. మొమినుల్‌కు జతగా హసన్ మహమూద్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్69.4వ ఓవర్: 226 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శుభ్‌మన్‌కు క్యాచ్ ఇచ్చి మెహిది హసన్ మిరాజ్ (20) ఔటయ్యాడు. 70 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 225/7గా ఉంది. మొమినుల్ (106), తైజుల్ ఇస్లాం క్రీజ్‌లో ఉన్నారు. మొమినుల్ హక్ సెంచరీ.. బంగ్లాదేశ్ 205/6లంచ్ విరామానికి ముందు మొమినుల్ హక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హక్ 172 బంతుల్లో సెంచరీ మార్కును తాకాడు. హక్ సెంచరీలో 16 బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. 66 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 205/6గా ఉంది. హక్‌తో పాటు మెహిది హసన్ మిరాజ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 55.6వ ఓవర్: 170 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో సిరాజ్ సూపర్ క్యాచ్ పట్టడంతో షకీబ్ (9) పెవిలియన్ బాట పట్టాడు. 56 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 170/6గా ఉంది. మొమినుల్ హక్ (75), మెహిది హసన్ క్రీజ్‌లో ఉన్నారు.WHAT A BLINDER BY CAPTAIN ROHIT SHARMA. 🔥- Captain Rohit leads by example for India...!!!! 🙌 pic.twitter.com/XqJORqHvF6— Tanuj Singh (@ImTanujSingh) September 30, 2024ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 49.4వ ఓవర్: 148 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో లిట్టన్ దాస్ (13) ఔటయ్యాడు. మొమినుల్ హక్కు (62) జతగా షకీబ్ అల్ హసన్ క్రీజ్‌లోకి వచ్చాడు.JASPRIT JASBIR SINGH BUMRAH.- The master at the work...!!!! 🐐 pic.twitter.com/nE9hUNHAeJ— Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2024నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్రెండు రోజుల విరామానంతరం ఎట్టకేలకు ఆట మొదలైంది. నాలుగో రోజు ఆట ప్రారంభంలో బంగ్లా బ్యాటర్లు నిదానంగా ఆడారు. ఇన్నింగ్స్ 41వ ఓవర్ రెండో బంతికి బుమ్రా ముష్ఫికర్ రహీంను (11) క్లీన్ బౌల్డ్ చేశాడు. 45 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 133/4గా ఉంది. మొమినుల్ హక్ (48), లిట్టన్ దాస్ (12) క్రీజ్‌లో ఉన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు వర్షం ఆటంకం కలిగించే సమయానికి బంగ్లాదేశ్ స్కోర్ 107/3గా ఉంది. మొమినుల్ హక్ 40, ముష్ఫికర్ రహీం 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వర్షం, వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌లో రెండు, మూడు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ 0, షద్మాన్ ఇస్లాం 24, నజ్ముల్ హసన్ షాంటో 31 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. -
Tirumala: సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 61,142 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 6 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో నిండి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 63,936 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 18,697 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.55 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో గోకులాష్టమి వేడుకలు...శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం28న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ.అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు04/10/2024 - సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024 - ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం08/10/2024 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం. -
తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 63,202 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,057 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4437 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో గోకులాష్టమి వేడుకలు..శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం28న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ.అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు..04/10/2024 - సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024 - ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం08/10/2024 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం.బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, విఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ. -
కోల్‌కతా డాక్టర్ కేసు: ‘ప్రతి 2 గంటలకు నివేదిక ఇవ్వండి’
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై సీబీఐకు దర్యాప్తు కొసాగిస్తోంది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 76,695 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,395 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.96 కోట్లుగా లెక్క తేలింది.19న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదలఆగష్టు 19న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదల.. ఆగష్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక.. ఆగష్టు 22న వర్చువల్ సేవల కోటా విడుదల.మరోవైపు.. ఆగష్టు 23న అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల. 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల చేయనున్నారు. 24న తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల. ఆగష్టు 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. ఆగష్టు 27న శ్రీవారి సేవ కోటా విడుదల.. https://ttdevasthanams.ap.gov.in సైట్ ద్వారా టికెట్ల బుక్ చేస్కోవాలని టీటీడీ సూచన -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(బుధవారం) 72,967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,421 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.26 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(ఆదివారం) 86,604 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,536 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా లెక్క తేలింది. -
మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా138 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో వాండర్సేకు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (30) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా101 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో శివమ్ దూబే (9) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్100 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో రియాన్ పరాగ్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.శివమ్ దూబే (9), వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లో ఉన్నారు.86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా249 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. దునిత్ వెల్లలగే 4 వికెట్లు తీసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. రోహిత్ 35, గిల్ 6, విరాట్ 20, రిషబ్ పంత్ 6, శ్రేయస్ అయ్యర్ 8, అక్షర్ పటేల్ 2 ఔట్ కాగా.. రియాన్ పరాగ్ 10, శివమ్ దూబే 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అషిత ఫెర్నాండో, తీక్షణ తలో వికెట్ పడగొట్టారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్‌లో రోహిత్ (13 బంతుల్లో 31; 5 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడుతున్నాడు. రాణించిన రియాన్ పరాగ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంకకొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్‌కే (248/7) పరిమితమైంది. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. రియాన్ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబూ నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్కటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.రాణించిన కుసాల్ మెండిస్అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కుసాల్ మెండిస్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుసాల్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్ (23 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు.ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక235 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి కుసాల్ మెండిస్ (59) ఔటయ్యాడు. మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంకశ్రీలంక మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 196 పరుగుల వద్ద లియనాగేను (8) వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. 199 పరుగుల వద్ద వెల్లలగేను (2) రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 45 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 207/6గా ఉంది. కుసాల్ మెండిస్ (41), కమిందు మెండిస్ (3) క్రీజ్‌లో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్సధీర సమరవిక్రమ సిరాజ్ బౌలింగ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. 39 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 184/4గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక183 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్.. అసలంకను (10) ఎల్బీడబ్ల్యూ చేశాడు.తృటిలో సెంచరీని చేజార్చుకున్న అవిష్కలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 96 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 36 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 173/2గా ఉంది. కుసాల్ మెండిస్ (28), అసలంక (2) క్రీజ్‌లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక89 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (45) ఔటయ్యాడు. అవిష్క ఫెర్నాండో (43), కుసాల్ మెండిస్ క్రీజ్‌లో ఉన్నారు.14 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 65/0ఇన్నింగ్స్ ఆరంభంలో నత్త నడకలా సాగిన శ్రీలంక బ్యాటింగ్ ప్రస్తుతం మెరుగుపడింది. ఆ జట్టు 14 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో 26, నిస్సంక 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. నత్త నడకన సాగుతున్న శ్రీలంక బ్యాటింగ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిదానంగా ఆడుతుంది. వారి ఇన్నింగ్స్ నత్త నడకు తలపిస్తుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 28/0గా ఉంది. నిస్సంక 19, అవిష్క ఫెర్నాండో 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకొలొంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా ఓటమి
IND VS SL 2nd ODI Updates And Highlights: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ను లంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే (10-0-33-6) దారుణంగా దెబ్బతీశాడు. వాండర్సేకు అసలంక (6.2-2-20-3) కూడా తోడవ్వడంతో టీమిండియా 208 పరుగులకు (42.2 ఓవర్లలో) ఆలౌటైంది. ఛేదనలో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ.. భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విరాట్ (14), శివమ్ దూబే (0), శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) దారుణంగా విఫలమయ్యారు.ఓటమి దిశగా టీమిండియా190 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ (15) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియాఅసలంక అద్భుతమైన క్యాచ్ పట్టి అక్షర్ పటేల్‌ను (44) పెవిలియన్‌కు పంపాడు. వాండర్సే మాయాజాలంజెఫ్రీ వాండర్సే తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో టీమిండియాను ఇరుకున పడేశాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టిన అతను.. స్వల్ప వ్యవధిలో మరో రెండు వికెట్లు కూల్చాడు. శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) 14 పరుగుల వ్యవధిలో పెవిలియన్ బాట పట్టారు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 155/6గా ఉంది. అక్షర్ పటేల్ (27), వాషింగ్టన్ సుందర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే మరో 86 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్123 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (7), శ్రేయస్ (7) క్రీజ్‌లో ఉన్నారు. వాండర్సేకు ఇది నాలుగో వికెట్. 116 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన భారత్116 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (35), శివమ్ దూబేను (0) వాండర్సే ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది.A six over extra cover to bring up his fifty. 🔥- Rohit Sharma in a crazy touch! pic.twitter.com/hI57R7T7Ik— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా97 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో నిస్సంక సూపర్ క్యాచ్ పట్టడంతో రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) వెనుదిరిగాడు. 14 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 102/1గా ఉంది. శుభ్‌మన్ గిల్ (31), విరాట్ కోహ్లి (5) క్రీజ్‌లో ఉన్నారు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్241 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్‌లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 76/0గా ఉంది. రోహిత్‌కు (51) జతగా శుభ్‌మన్ గిల్ (23) క్రీజ్‌లో ఉన్నాడు.టీమిండియా టార్గెట్ 241కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి (టాస్ గెలిచి) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక208 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెల్లలగే (39) ఔటయ్యాడు.208 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెల్లలగే (39) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక136 పరుగుల వద్ద శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అసలంక (25) ఔటయ్యాడు.136 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంకశ్రీలంక 136 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి జనిత్ లియనాగే (12) ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక111 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి సమరవిక్రమ (14) ఔటయ్యాడు.వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసిన సుందర్వాషింగ్టన్ తన స్పెల్ రెండో ఓవర్ చివరి బంతికి, మూడో ఓవర్ తొలి బంతికి వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి ఆవిష్క ఫెర్నాండో (40).. 19వ ఓవర్ తొలి బంతికి కుశాల్ మెండిస్ (30) ఔటయ్యారు. 19 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 80/3గా ఉంది. చరిత్ అసలంక (1), సమరవిక్రమ (0) క్రీజ్‌లో ఉన్నారు.తొలి బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంకతొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పథుమ్ నిస్సంక ఔటయ్యాడు. WICKET ON THE FIRST BALL BY MOHAMMAD SIRAJ. 🔥- Siraj, a beast against Sri Lanka!pic.twitter.com/7i7IeWcsGr— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకొలొంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సేభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 75,054 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.72 కోట్లుగా లెక్క తేలింది. -
ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది. మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే59 పరుగుల వద్ద జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమణి (27) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 61/3గా ఉంది. మైర్స్ (18), సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు.టార్గెట్ 168.. రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే15 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి బెన్నిట్ (10) ఔటయ్యాడు. టార్గెట్ 168.. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో మధెవెరె (0) క్లీన్ బౌల్డ్ ఆయ్యాడు. రాణించిన జింబాబ్వే బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియాఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు రాణించడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (167/6) పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (58) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్‌మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శాంసన్ ఔట్135 పరుగుల వద్ద (17.3వ ఓవర్) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో మరుమణి క్యాచ్ పట్టడంతో శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబే (10), రింకూ సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. 105 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా105 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో నగరవకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (22) ఔటయ్యాడు.40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాతొలి ఓవర్లలో దూకుడుగా ఆడిన టీమిండియా ఆతర్వాత ఢీలా పడిపోయింది. జింబాబ్వే బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి (12), శుభమన్ గిల్ (13), అభిషేక్ శర్మ (14) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (16), రియాన్ పరాగ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. 8.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/3గా ఉంది.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాసికందర్ రజా వేసిన తొలి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి జైస్వాల్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియాహరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
IND VS ZIM: మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్‌లో ఆధిక్యం
మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్‌లో ఆధిక్యంఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆరో వికెట్ కోల్పోయిన జింబాబ్వే16.3వ ఓవర్: 116 పరుగుల వద్ద జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి మదండే (37) ఔటయ్యాడు. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన జింబాబ్వే7.6వ ఓవర్: 183 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 39 పరుగుల వద్ద సుందర్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి జోనాథన్ క్యాంప్‌బెల్ (1) ఔటయ్యాడు. 37 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వే6.2వ ఓవర్: 37 పరుగుల వద్ద జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి సికందర్ రజా (15) ఔటయ్యాడు. 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే3.1వ ఓవర్: 19 పరుగుల వద్ద జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయింది. 2.4వ ఓవర్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి మరుమణి (13) ఔట్ కాగా.. 3.1వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి బ్రియాన్ బెన్నెట్ (4) పెవిలియన్‌కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే1.1వ ఓవర్: 9 పరుగుల వద్ద జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి మెదెవెరె (1) ఔటయ్యాడు.జింబాబ్వే టార్గెట్ 183టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 36, శుభ్‌మన్ గిల్ 66, అభిషేక్ శర్మ 10, రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగులు చేసి ఔట్ కాగా.. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) నాటౌట్‌గా మిగిలారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా19.4వ ఓవర్: 177 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో మధెవెరెకు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ (49) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా17.5వ ఓవర్: 153 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (66) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా10.3వ ఓవర్: 81 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సికందర్ రజా బౌలింగ్‌లో మరుమణికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (10) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా8.1వ ఓవర్: 67 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సికందర్ రజా బౌలింగ్‌లో బ్రియాన్ బెన్నెట్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (36) ఔటయ్యాడు.హరారే వేదికగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లోని సభ్యులు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చారు. ముకేశ్ కుమార్ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు జింబాబ్వే ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. ఇన్నోసెంట్ కాలా స్థానంలో మారుమణి.. లూక్ జాంగ్వే స్థానంలో నగరవ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
రష్యాలో ఘోర రైలు ప్రమాదం... 70 మందికి తీవ్రగాయాలు
రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రష్యా మీడియా కథనాల ప్రకారం గాయపడివారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదు.ఈ ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు. ఇటీవల కురిసిన భారీ వర్షాలే రైలు ఇలా పట్టాలు తప్పడానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 14 కోచ్‌లు ఉన్నాయని, 232 మంది ప్రయాణికులు ఉన్నారని రైలు ఆపరేటర్ తెలిపారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.12 గంటల ప్రాంతంలో ఇంటా సిటీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అత్యవసర సేవల విభాగానికి చెందిన అధికారులు, సహాయక బృందాలు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే అధికారులు బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. Passenger train derails in Komi Region, Russia pic.twitter.com/Ywh4s6NEaH— RT (@RT_com) June 26, 2024 -
T20 1st Semis: చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికా
చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికాటీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు (వికెట్ కోల్పోయి) చేరింది.టార్గెట్ 57.. 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా57 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఫజల్ హక్ బౌలింగ్‌లో డికాక్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 11.5 ఓవర్లలో 56 పరుగులకు అప్ఘనిస్తాన్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 57 పరుగులు50 పరుగులకే తొమ్మిది వికెట్లు డౌన్ఆఫ్ఘనిస్తాన్ ఒకే స్కోర్ వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. 50 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో రషీద్ ఖాన్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్ జట్టు 50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఘోర పతనం దిశగా సాగుతుంది. షంషి బౌలింగ్‌లో నూర్ అహ్మద్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 50/8గా ఉంది. రషీద్ ఖాన్ (8), నవీన్ ఉల్ హక్ (0) క్రీజ్‌లో ఉన్నారు.50 పరుగుల వద్ద ఏడో వికెట్ డౌన్50 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. తబ్రేజ్ షంషి బౌలింగ్‌లో కరీమ్ జనత్ (8) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 28 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్ 28 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఒమర్జాయ్ (10) ఔటయ్యాడు. కరీమ్ జనత్ (4), రషీద్ ఖాన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. 9 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 45/6గా ఉందిట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు టాస్ గెలిచిమాన్న సంతోషం ఎంతో సేపు నిలబడలేదు. సఫారీ పేసర్లు రెచ్చిపోవడంతో ఆఫ్ఘన్లు 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. గుర్బాజ్ (0), ఇబ్రహీం జద్రాన్ (2), గుల్బదిన్ నైబ్ (9), మొహమ్మద్ నబీ (0), ఖరోటే (2) దారుణంగా విఫలమయ్యారు. జన్సెన్ (3-0-16-3) ఆఫ్ఘన్లను దెబ్బకొట్టాడు. రబాడ (2-1-5-2) మరో చేయి వేశాడు.తుది జట్లు..దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్), నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫారూఖీ -
అరుణాచల్‌లో భారీ వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం
అరుణాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. రాజధాని ఈటానగర్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ,పరిపాలన అధికారులు తెలిపారు.అరుణాచల్‌లోని హైవే-415పై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. ఇటానగర్తో పాటు పరిసర ప్రాంతాల్లోని అనేక చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. ఏడు చోట్ల సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రజలు నదీ తీరాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులను సమాయత్తం చేస్తూ హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వరదల కారణంగా 37 మంది మృతిచెందగా, 10 జిల్లాల్లో 1.17 లక్షల మందికి పైగా జనం వరదల బారిన పడ్డారు. అధికారులు 134 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 17,661 మంది ఆశ్రయం పొందుతున్నారు. బరాక్‌లోని కరీంగంజ్‌లోని కుషియారా నది ప్రస్తుతం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోందని తెలుస్తోంది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 62,756 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం. నేటితో జ్యేష్ఠాభిషేకం ముగింపు. నేడు ఉత్సవమూర్తులకు బంగారం కవచాలు అలంకరణ చెయ్యనున్న అర్చకులు. -
Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 61,499 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.04 కోట్లుగా లెక్క తేలింది. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ చార్జీల్లో మార్పులు
కోటక్ మహీంద్రా బ్యాంక్ శాలరీ అకౌంట్, పొదుపు ఖాతాలపై కొన్ని సేవలకు ఛార్జీలను సవరించింది. మే 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. యావరేజ్ బ్యాలెన్స్, నగదు, ఏటీఎం లావాదేవీలకు పరిమితులు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజు, ఉచిత చెక్‌బుక్‌ల పరిమితికి సంబంధించిన ప్రమాణాలను బ్యాంక్ అప్డేట్ చేసింది.కీలక మార్పులు ఇవే..⇒ సగటు బ్యాలెన్స్ ప్రమాణాలుసంకల్ప్ సేవింగ్స్ అకౌంట్: సెమీ అర్బన్ అండ్ రూరల్‌లో రూ.2,500.రోజువారీ పొదుపు ఖాతా: మెట్రో అండ్ అర్బన్‌లో రూ.15,000, సెమీ అర్బన్‌లో రూ.5,000, రూరల్‌లో రూ.2,500.⇒ ఉచిత నగదు లావాదేవీ పరిమితులుడైలీ సేవింగ్స్/శాలరీ అకౌంట్, ప్రో సేవింగ్స్, క్లాసిక్ సేవింగ్స్ అకౌంట్లలో ఇప్పుడు నెలకు 5 ఉచిత లావాదేవీలు లేదా గరిష్టంగా రూ .2 లక్షలకు పరిమితం చేసింది.ప్రివీ నియాన్/మాక్సిమా ఖాతాలకు సంబంధించి ఇప్పుడు నెలకు 7 ఉచిత లావాదేవీలు లేదా రూ.5 లక్షలకు పరిమితం చేసింది. అలాగే సోలో సేవింగ్స్ ఖాతాకు నెలకు ఒక ఉచిత లావాదేవీ లేదా రూ.10,000 కు తగ్గించింది.⇒ ఏటీఎం లావాదేవీ పరిమితులుఎవ్రీడే సేవింగ్స్, క్లాసిక్ సేవింగ్స్, ప్రో సేవింగ్స్, ఏస్ సేవింగ్స్, ప్రివీ ఖాతాదారులకు కోటక్ ఏటీఎంలలో నెలకు 7 ఉచిత ట్రాన్సాక్షన్లు, ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే నెలకు 7 ఉచిత లావాదేవీలు ఉంటాయి.కోటక్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో కలిపి నెలకు గరిష్టంగా 30 ఉచిత లావాదేవీలు ఉంటాయి.ఇక ఎవ్రీడే శాలరీ, ఎడ్జ్ శాలరీ అకౌంట్లకు కోటక్ ఏటీఎంలలో నెలకు 10 ఉచిత ట్రాన్సాక్షన్స్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎలాంటి మార్పు లేదు. అపరిమిత ఉచిత లావాదేవీలు ఉంటాయి.⇒ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజుసేవింగ్స్, శాలరీ అకౌంట్లన్నింటికీ రూ.200 చొప్పున కొత్త రుసుము విధించనున్నారు. గతంలో ఎలాంటి చార్జీలు ఉండేవి కావు.⇒ చెక్ బుక్ లిమిట్సోలో సేవింగ్స్ అకౌంట్: ఏడాదికి 25 ఉచిత చెక్ లీవ్స్ నుంచి 5 ఉచిత చెక్ లీఫ్లకు తగ్గించారు.⇒ లావాదేవీ వైఫల్య రుసుముడెబిట్ కార్డు/ఏటీఎం వినియోగ రుసుము: సరిపడా నిధులు లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే ఒక్కో లావాదేవీకి రూ.25 చార్జీ ఉంటుంది. చెక్ జారీ చేసినప్పుడు, రిటర్న్ చేసినప్పుడు తీసుకునే ఫీజు రూ.250కి పెరిగింది. -
Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,416 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(మంగళవారం) 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 35,726 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(శుక్రవారం) 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 43,199 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేడు ఆగష్టు కోటా టికెట్లుతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల.సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.మే 17 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల.మే 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల.మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ టికడట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల.మే 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలమే 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన. -
తిరుమలకు భారీగా పెరిగిన రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(గురువారం) 76,369 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 41,927 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలునేటి నుండి మూడు రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలునారాయణ గిరి ఉద్యాన వనంలో పరిణయోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు.మొదటి రోజు మలయప్ప స్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై దర్శనంమే 17 నుండి 19వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు.1992వ సంవత్సరం పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తున్న టీటీడీ. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 70,815 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.16 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శనివారం) 76,945 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,844 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.67 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శుక్రవారం) 60,545 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,527 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.53 కోట్లుగా లెక్క తేలింది. -
May 10 Tirumala: తిరుమలలో నేటి రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,508 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.97 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 26 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,313 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 28,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.54 కోట్లుగా లెక్క తేలింది. -
IPL 2024: గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ
గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 89 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 65 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. సందీప్ వారియర్ బౌలింగ్‌లో అభిషేక్ పోరెల్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఢిల్లీ 90 బంతుల్లో 25 పరుగులు చేస్తే గెలుస్తుంది రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 6 బంతుల్లో 7 పరుగులు చేసి పృథ్వీ షా ఔటయ్యాడు. సందీప్ వారియర్ బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్‌కు క్యాచ్ ఇచ్చి షా పెవిలియన్ బాట పట్టాడు. టార్గెట్ 90.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 10 బంతుల్లో 20 పరుగులు చేసి ఫ్రేసర్ ఔటయ్యాడు. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి ఫ్రేసర్ పెవిలియన్‌కు చేరాడు. టార్గెట్ 90.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 90 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్ ఫ్రేసర్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 2 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు. 1.5 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 25/0గా ఉంది. ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. 89 పరుగులకే కుప్పకూలిన గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్ 66 పరుగుల వద్ద గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా (10) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ 48 పరుగుల వద్ద గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 9వ ఓవర్లో అభినవ్ మనోహర్ (8), షారుక్ ఖాన్‌లను (0) రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 61/6గా ఉంది. రషీద్ ఖాన్ (12), రాహుల్ తెవాటియా (8) క్రీజ్‌లో ఉన్నారు. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్ గుజరాత్ టైటాన్స్ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (2) ఔటయ్యాడు. మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ 4.1వ ఓవర్: మూడు బంతుల వ్యవధిలో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ ఐదో బంతికి ముకేశ్ కుమార్ సాహాను (2) క్లీన్ బౌల్డ్ చేయగా.. ఐదో ఓవర్ తొలి బంతికి సాయి సుదర్శన్ (12) రనౌటయ్యాడు. 4.5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 30/3గా ఉంది. డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 1.5వ ఓవర్: 11 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (8) ఔటయ్యాడు. సాహా, సాయి సుదర్శన్ క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది. తుది జట్లు.. గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, స్పెన్సర్ జాన్సన్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ -
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్‌లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్‌హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్‌మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
IPL 2024, DC VS KKR: ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్
ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్ ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పంత్ ఔట్ మెరుపు అర్దశతకం బాదిన అనంతరం పంత్ (55) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చితక్కొడుతున్న పంత్.. 23 బంతుల్లో ఫిఫ్టి వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో పంత్ చెలరేగిపోయాడు. నాలుగు ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు పిండుకున్నాడు. పంత్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని కేవలం 23 బంతుల్లోనే పూర్తి చేశాడు. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 125/4గా ఉంది. పోరాడుతున్న పంత్, స్టబ్స్ 273 పరుగల లక్ష్య ఛేదనలో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీని రిషబ్ పంత్ (11 బంతుల్లో 23; 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 9 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్ 83/4గా ఉంది. పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలుతుంది. 33 పరుగులకే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అనంతరం వార్నర్ (18) ఔటయ్యాడు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 40/4గా ఉంది. రిషబ్ పంత్ (6), ట్రిస్టన్ స్టబ్స్ (1) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 27 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పోరెల్ (0) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 26 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ స్టార్క్ (0) ఔటయ్యాడు.డేవిడ్ వార్నర్‌కు (11) జతగా అభిషేక్ పోరెల్ (0) క్రీజ్‌లోకి వచ్చాడు. 273 పరుగుల లక్ష్యం.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగుల వద్ద వైభవ్ అరోరా బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పృథ్వీ షా (10) ఔటయ్యాడు. వార్నర్‌తో (10), మిచెల్ మార్ష్ జత కలిశాడు. వీరంగం సృష్టించిన కేకేఆర్ బ్యాటర్లు.. ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. టాపార్డర్ బ్యాటర్లు పోటాపోటీపడి విధ్వంసం సృష్టించారు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్ నమోదైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన 277 స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రఘువంశీ ఔట్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి అనంతరం రఘువంశీ ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ క్యాచ్ పట్టాడు. 14 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 181/3గా ఉంది. రసెల్ (9), శ్రేయస్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రఘువంశీ కేకేఆర్ యువ ఆటగాడు రఘువంశీ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 171/3గా ఉంది. రఘువంశీకి జతగా రసెల్ (5) క్రీజ్‌లో ఉన్నాడు. చితకబాది ఔటైన నరైన్.. కేకేఆర్ స్కోర్ 164/2 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసిన సునీల్ నరైన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతికి మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 164/2గా ఉంది. రఘువంశీకి (49) జతగా రసెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసిన కేకేఆర్ సునీల్ నరైన్ (32 బంతుల్లో 74; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) , రఘువంశీ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) ధాటికి కేకేఆర్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన నరైన్ కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కేకేఆర్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ 4.3వ ఓవర్: 60 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ (18) ఔటయ్యాడు. విధ్వంసం సృష్టిస్తున్న సునీల్ నరైన్ కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. ఇషాంత్ వేసిన మూడో ఓవర్లో నరైన్ మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు బాదాడు. ఫలితంగా ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 58/0గా ఉంది. నరైన్‌తో పాటు ఫిలిప్ సాల్ట్ (16) క్రీజ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 3) ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది. తుది జట్లు.. కోల్‌కతా నైట్‌రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ -
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,992 భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా లెక్క తేలింది. నిఘా వేశాం.. ఆందోళన వద్దు తిరుమలలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేగుతున్న వేళ అటవీశాఖ అధికారులు స్పందించారు. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. "మార్చి 4 నుండి ఇప్పటి వరకు 5 సార్లు చిరుత సంచారం గుర్తించాము. 250 అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసాం. 4g నెట్ వర్క్ కెమెరాల ద్వారా జంతువుల సంచారం వెంటనే అలర్ట్ చేస్తుంది. క్రూర మృగాల సంచారం, చిరుతలు సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది అలెర్ట్ చేస్తాం. టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, వైల్డ్ లైఫ్ సిబ్బంది నడకదారిలో భద్రత చర్యలు చేపడుతాము.. ఏడవ మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తులను గుంపులుగా పంపుతాము భయపడాల్సిన అవసలేదు అన్నారు. అలాగే.. ప్రభుత్వం నియమించిన జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు మార్లు తిరుమలలో పర్యటించారు. ఏప్రిల్ మొదటి వారంలో జాతీయస్థాయి వైల్డ్ లైఫ్ కమిటీ సమావేశం అవుతుంది. నడకదారిలో తీసుకోవల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనున్నారు.. భక్తులు అటవీ ప్రాంతంలో వెళ్ల రాదు, శేషాచల కొండల్లో నీటికి కొరత లేదు, ఏనుగులు ప్రతి సంవత్సరం ఒకచోట నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయి. అధునాతన థర్మల్ డ్రోన్ కెమరా రాత్రి సమయంలో కూడా జంతువుల సంచారం పై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు". -
IPL 2024: సన్‌రైజర్స్ చేతిలో చిత్తైన ముంబై ఇండియన్స్
IPL 2024 SRH VS MI Match Highlights And Updates: బ్యాటర్ల ఊచకోత.. ముంబైను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ 31 పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేయడంతో పాటు లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 12 ఓవర్ల వరకు సన్‌రైజర్స్ ధీటుగా బదులిచ్చింది. అయితే ఆ తర్వాత స్కోర్ నెమ్మదించడంతో ముంబై ఓటమి ఖరారైంది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్), రొమారియో షెపర్డ్ (6 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సన్‌రైజర్స్ శిబిరంలో కలకలం సృష్టించారు. ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ముంబై గెలుపుకు 30 బంతుల్లో 93 పరుగులు అవసరం ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 30 బంతుల్లో 93 పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా (20), టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉన్నారు. 15 ఓవర్ తొలి బంతికే కమిన్స్ తిలక్ వర్మ (64) ఔట్ చేశాడు. 15 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 185/గా ఉంది. రఫ్ఫాడిస్తున్న తిలక్.. 10 ఓవర్లలో ముంబై స్కోర్ 141/2 తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో తిలక్ 3 సిక్సర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. తిలక్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/2గా ఉంది. తిలక్‌తో (52) పాటు నమన్ ధిర్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. 7.3 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌కు ధీటుగా ముంబై ఇండియన్స్ బదులిస్తుంది. ముంబై 7.3 ఓవర్లలనే 100 పరుగుల మార్కును తాకింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (16), తిలక్ వర్మ (19) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 102/గా ఉంది. టార్గెట్ 278.. ధీటుగా బదులిస్తున్న ముంబై 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధీటుగా బదులిస్తుంది. ఆ జట్టు 5 ఓవర్ల అనంతరం 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (2), తిలక్ వర్మ (1) క్రీజ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్ల వీరంగం.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు ముంబై ఇండియన్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు సుడిగాలి అర్దశతకాలు బాదారు. ట్రవిస్ హెడ్ 24 బంతుల్లో 62, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 80 పరుగులు (నాటౌట్) చేశారు. మార్క్రమ్ సైతం తానేమీ తక్కువ కాదని 28 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్లాసెన్ హెన్రిచ్ క్లాసెన్ కేవలం 23 బంతుల్లో బౌండరీ, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 243/3గా ఉంది. క్లాసెన్‌తో పాటు మార్క్రమ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. 14.4 ఓవర్లలోనే 200 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ కేవలం 14.4 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును తాకింది. మార్క్రమ్ (31), క్లాసెన్ (26) క్రీజ్‌లో ఉన్నారు. 12 ఓవర్లలోనే 173 పరుగులు చేసిన సన్‌రైజర్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔటయ్యాడు. పియూశ్ చావ్లా బౌలింగ్‌లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 173/3గా ఉంది. మార్క్రమ్ (21), క్లాసెన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అభిషేక్ (54), మార్క్రమ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన హెడ్.. పెను విధ్వంసం సృష్టించిన అనంతరం హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కొయెట్జీ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 117/2గా ఉంది. అభిషేక్ (32), మార్క్రమ్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. పవర్ ప్లేలో (81/1) సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక స్కోర్. 7 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ ఆటగాళ్లు శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. హెడ్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో అభిషేక్ శర్మ సైతం చెలరేగిపోయాడు. పియూశ్ చావ్లా వేసిన ఆ ఓవర్లో అభిషేక్ మూడు సిక్సర్లు బాదాడు. తొలి బంతికే వికెట్ తీసిన హార్దిక్ 4.1 ఓవర్: హార్దిక్ పాండ్యా తన స్పెల్ తొలి బంతికే వికెట్ తీశాడు. టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (11) ఔటయ్యాడు. వీరంగం సృష్టిస్తున్న ట్రవిస్ హెడ్ సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ వీరంగం సృష్టిస్తున్నాడు. కేవలం 10 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. యువ పేసర్ మపాకా వేసిన మూడో ఓవర్లోనే హెడ్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో హెడ్ వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. 4 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. హెడ్ (32),మయాంక్ అగర్వాల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 27) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30య గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలై బోణీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపాలైంది. తొలి మ్యాచ్‌లో దెబ్బతిన్న ఇరు జట్లు బలాబలాల విషయంలో సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మకు ఆ జట్టు తరఫున 200వ మ్యాచ్ కావడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేన మపాకా ముంబై ఇండియన్స్ సబ్స్: డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా సన్‌రైజర్స్ హైదరాబాద్ సబ్‌లు: నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఉపేంద్ర యాదవ్ -
RR VS LSG Updates: బోణీ కొట్టిన రాజస్తాన్.. లక్నోపై ఘన విజయం
IPL 2024 RR VS LSG Jaipur Live Updates And Highlights బోణీ కొట్టిన రాజస్తాన్.. లక్నోపై ఘన విజయం ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో పూరన్ (64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(58) పరుగులతో పర్వాలేదన్పించాడు. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. కేఎల్ రాహుల్ ఫిప్టీ.. 14 ఓవర్లకు లక్నో స్కోర్: 129/4 14 ఓవర్లు ముగిసే సరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(53), పూరన్(35) పరుగులతో ఉన్నారు. లక్నో విజయానికి 36 బంతుల్లో 65 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. హుడా ఔట్ దీపక్ హుడా రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన హుడా.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు. 6 ఓవర్లకు లక్నో స్కోర్ 47/2 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో దీపక్ హుడా(18), కేఎల్ రాహల్(15) ఉన్నారు. రెండో వికెట్ డౌన్ 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పడిక్కల్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 ఓవర్లకు లక్నో స్కోర్ 12/2 తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. డికాక్ ఔట్ 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పడిక్కల్ వచ్చాడు. సంజూ శాంసన్ విధ్వంసం.. రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో బట్లర్ (11), హెట్‌మైర్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (43), యశస్వి జైస్వాల్ (24), ద్రువ్ జురెల్ (20 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2, మొహిసిన్ ఖాన్, రవి భిఫ్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ 150 పరుగుల వద్ద (16.3 ఓవర్) రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి హెట్‌మైర్ (5) ఔటయ్యాడు.శాంసన్‌కు (62) జతగా ద్రువ్ జురెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. దూకుడుగా ఆడుతున్న రియాన్ పరాగ్ ఔట్ 14.5వ ఓవర్లో 142 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రియాన్ పరాగ్ (29 బంతుల్లో 43; ఫోర్, 3 సిక్సర్లు) నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సంజూ శాంసన్ (59) క్రీజ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్ సంజూ శాంసన్ తన కెరీర్లో 21వ ఐపీఎల్ ఫిఫ్టిని పూర్తి చేసుకున్నాడు. సంజూ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 14 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 128/2గా ఉంది. సంజూ (58), రియాన్ పరాగ్ (32) క్రీజ్‌లో ఉన్నారు. వరుస సిక్సర్లతో విరుచుకుపడిన సంజూ శాంసన్ 9.0 ఓవర్: యశ్ ఠాకూర్ వేసిన 9వ ఓవర్లో సంజూ శాంసన్ శివాలెత్తిపోయాడు. ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అంకుమందు ఇదే ఓవర్లో రియన్ పరాగ్ కూడా ఓ సిక్సర్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 9 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 84/2. సంజూ (33), పరాగ్ (15) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత 63/2 8.0 ఓవర్: స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయానికి రాజస్థాన్ స్కోర్ 63/2గా ఉంది. సంజూ శాంసన్ (21), రియాన్ పరాగ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. డేంజర్ యశస్వి ఔట్ 5.6 ఓవర్: మొహిసిన్ ఖాన్ వేసిన ఐదో ఓవర్లో బౌండరీ, సిక్సర్ బాది జోష్ మీదుండిన యశస్వి జైస్వాల్ (12 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్).. అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కృనాల్ చేతికి క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 49/2. సంజూ శాంసన్ (13), రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు. WHAT A CATCH BY CAPTAIN RAHUL 🔥🤯 pic.twitter.com/FU2Utxvp2z — Johns. (@CricCrazyJohns) March 24, 2024 అద్బుతమైన క్యాచ్ పట్టిన రాహుల్.. బట్లర్ ఔట్ 1.6 ఓవర్: నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జోస్ బట్లర్ (11) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 13/1. యశస్వి (1), సంజూ శాంసన్ క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 24) రాజస్థాన్ రాయల్స్.. లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్ -
పపువా న్యూగినియాలో భూకంపం.. 6.9 తీవ్రత నమోదు!
పపువా న్యూ గినియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం చోటుచేసుకుందని, కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్జీఎస్ హెచ్చరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం భూమి కింద 35 కిలోమీటర్ల లోతున ఉంది. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్జెడ్) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 65 కిలోమీటర్ల లోతున ఉంది. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఈ విపత్తులో ఎంత ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పపువా న్యూ గినియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గత ఏడాది ఏప్రిల్‌లో ఇదే ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. అప్పుడు ఏడుగురు మృతి చెందారు. -
IND VS ENG 3rd Test Day 4: రాజ్‌కోట్ టెస్టులో భారత్ ఘన విజయం..
IND VS ENG 3rd Test Day 4 Updates And Highlights: రాజ్‌కోట్ టెస్టులో భారత్ ఘన విజయం.. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల దాటికి.. కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. ఒక్క వికెట్ దూరంలో.. రాజ్‌కోట్ టెస్టులో విజయానికి భారత్ కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. వరుస క్రమంలో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఫోక్స్ ఔట్ కాగా.. అశ్విన్ బౌలింగ్‌లో హార్ట్లీ పెవిలియన్‌కు చేరాడు. ఓటమి దిశగా ఇంగ్లండ్.. ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. రెహాన్ అహ్మద్ రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 53/7 విజయం దిశగా భారత్.. రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ విజయానికి కేవలం 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఐదో వికెట్ డౌన్.. జో రూట్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్‌లో రూట్ ఎల్బీగా వెనుదిరిగాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 50/5. క్రీజులో బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జడేజా బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో.. నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 519 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. 20 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఓలీ పోప్.. జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 24/3 రెండో వికెట్ డౌన్.. జాక్ క్రాలే రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన క్రాలే.. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ బెన్ డకెట్(4) రనౌటయ్యాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు.7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 18/1 ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను 430/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా.. ఇంగ్లండ్‌కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ 214, సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు. మరో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్.. మూడో టెస్ట్‌లో మరో డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ డబుల్‌ను యశస్వి 231 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 411/3గా ఉంది. లీడ్ 537 పరుగులుగా ఉంది. మరో హాఫ్ సెంచరీ చేసిన సర్పరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల వద్ద పొరపాటున రనౌటైన సర్ఫరాజ్ ఖాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 66 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్.. 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో డబుల్ దిశగా దూసుకుపోతున్న యశస్వి భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీ దిశగా దూసకుపోతున్నాడు. నిన్న రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి.. ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం యశస్వి 182 పరుగుల వద్ద ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్ ఖాన్ (33) క్రీజ్‌లో ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 359/4గా ఉంది. 440 పరుగుల ఆధిక్యంలో టీమిండియా నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఆధిక్యం 440 పరగులుగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 258 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ (115), సర్ఫరాజ్ ఖాన్ క్రీజ్‌లో ఉన్నారు. 91 పరుగుల వద్ద ఔటైన శుభ్‌మన్ గిల్ శుభ్‌మన్ గిల్ సెంచరీకి చేరువలో (91) రనౌటాయ్యడు. కుల్దీప్ తప్పిదం కారణంగా గిల్ ఔటయ్యాడు. నిన్న రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి (107) క్రీజ్‌లోకి వచ్చాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 192/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (65), కుల్దీప్ యాదవ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 322 పరుగుల లీడ్‌లో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ అద్బుతమైన సెంచరీతో (107) ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ (19), రజత్ పాటిదార్ (0) నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం 86,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,849 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లుగా లెక్క తేలింది. ఇక ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహద్వారం ముందు ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కూడా పాల్గొన్నారు. -
చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం
South Africa Vs India 2nd Test 2024 Day 2 Updates- కేప్‌టౌన్: చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్ 75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో కోహ్లి (12) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా నాలుగు పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 57 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (10) ఔటయ్యాడు. భారత్ గెలుపుకు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. జైస్వాల్ ఔట్ 44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బర్గర్ బౌలింగ్‌లో జైస్వాల్ (28) ఔటయ్యాడు.భారత్.. దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక గెలుపుకు ఇంకా 35 పరుగుల దూరంలో ఉంది. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్.. లక్ష్యంగా దిశగా దూసుకుపోతున్న టీమిండియా 79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడుతుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ టీ20 తరహాలో విరుచుకుపడుతున్నాడు. అతను కేవలం 21 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. రోహిత్ 6 పరుగులతో అతని జతగా క్రీజ్‌లో ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 35/0గా ఉంది. 176 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఆఖరి వికెట్ (ఎంగిడి (8)) కూడా బుమ్రాకే దక్కింది. దీంతో బుమ్రా ఖాతాలో ఆరు వికెట్లు చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, ఈ ఇన్నింగ్స్‌లో ఆరు కలుపుకుని బుమ్రా ఖాతాలో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడ్డాయి. బుమ్రాతో పాటు ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. మ్యాచ్‌కు లంచ్ విరామం ప్రకటించారు. భారత పేసర్ల విజృంభణ.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 32.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన రబడ(2) ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 31.4: సిరాజ్ బౌలింగ్‌లో సెంచరీ హీరో మార్క్రమ్ అవుట్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్.. 60 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా ఓపెనర్‌గా బరిలోకి దిగిన మార్క్రమ్ అత్యంత కఠినమైన పిచ్‌పై అద్బుత సెంచరీతో (99 బంతుల్లో 102 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున ఇది ఆరో వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం. ఐదేసిన బుమ్రా.. పట్టుబిగించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగుల స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. బుమ్రా ధాటికి తొలి సెషన్లోనే మరో 4 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా బుమ్రా ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో (5/59) చెలరేగడంతో సౌతాఫ్రికా 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 60 పరుగుల ఆధిక్యంలో ఉంది. మార్క్రమ్ (102 నాటౌట్) అద్భుత శతకంతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా రబాడ (2) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
IND VS SA 2nd Test: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా రెండో టెస్ట్‌లో తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆలౌటయ్యాక, సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 36 పరుగులు వెనుకపడి ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 45 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (1) ఔటయ్యాడు. ఇదే రోజు తొలి ఇన్నింగ్స్‌లో కూడా బుమ్రానే స్టబ్స్‌ను ఔట్ చేశాడు. 16 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 49/3గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా రెండో టెస్ట్ తొలి రోజు ఇరు జట్ల పేసర్లు అత్యద్భుతాలు చేస్తున్నారు. ఇరు జట్ల పేసర్ల ధాటికి ఇప్పటికే 22 వికెట్లు నేలకూలాయి. తాజాగా సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో జార్జీ (1) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 56 పరుగులు వెనుకపడి ఉంది. మార్క్రమ్ (25), ట్రిస్టన్ స్టబ్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 37 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఎల్గర్ (12) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌కు విరుద్దంగా ఆడుతున్న సౌతాఫ్రికా 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత టీమిండియాను 153 పరుగులకు ఆలౌట్ చేసి తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అయితే సఫారీలు తమ సెకెండ్ను తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్లు ఆడట్లేదు. ఆ జట్టు ఓపెనర్లు చాలా జాగ్రత్తగా వికెట్లు పడకుండా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 37/0గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఇంకా 61 పరుగులు వెనకపడి ఉంది. ఒకే స్కోర్ వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 153 పరుగుల వద్ద టీమిండియా ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయి, అదే స్కోర్ వద్ద ఆలౌటైంది. 34వ ఓవర్లో ఎంగిడి పరుగులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆ మరుసటి ఓవర్లోనే రబాడ.. కోహ్లి (46), ప్రసిద్ద్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో, అదే స్కోర్ వద్ద (153) సిరాజ్ (0) కూడా రనౌటయ్యాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన ఎంగిడి.. టీమిండియా 153/7 లుంగి ఎంగిడి ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఎంగిడి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. రాహుల్ (8), జడేజా (0), బుమ్రా (0) ఐదు బంతుల వ్యవధిలో ఔటయ్యారు. కోహ్లి (46), సిరాజ్ క్రీజ్‌లో ఉన్నారు. టీ విరామం.. టీమిండియా స్కోర్ 111/4 తొలి రోజు టీ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 111/4గా ఉంది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 110 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (0) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 105 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (36) ఔటయ్యాడు. విరాట్ కోహ్లి (16), శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత శర్మ ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (24), విరాట్ కోహ్లి (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా 10: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య జట్టును 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తొలి పది ఓవర్లలోనే లీడ్ సంపాదించింది. ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 58 పరుగులు సాధించిన టీమిండియా మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 38 పరుగులు సాధించి జోరు మీదున్నాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ ఆరు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్ యశస్వి జైస్వాల్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 20/1గా ఉంది. ఎంగిడి వేసిన రెండో ఓవర్లో మూడు బౌండరీలు బాది రోహిత్ శర్మ జోరుమీదున్నాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి
జపాన్‌లో భారీ భూకంపం అప్డేట్స్: ► జపాన్‌లో సునామి హెచ్చరికలు, సలహాలను అధికారులు ఎత్తివేశారు. అయితే సముద్రపు అలల్లో మార్పులు రావడానికి ఇంకా అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు భూకంప బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Officials Lift Tsunami Warnings After Powerful Quake Off Chilean Coast - https://t.co/NuaBIIWbA6 pic.twitter.com/TtEX1f2w2Z — Alaska Native News (@AKNativeNews) December 26, 2016 ► జపాన్‌లో భీభత్సం సృష్టించిన భూకంపంలో 30 మంది మృత్యువాత పడ్డారని స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ మృతు సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతి చెందిన 30 మందిలో సగం మంది వాజిమా నగరంలో చనిపోయినట్టు తెలుస్తోంది. #UPDATE The death toll from a powerful earthquake in central Japan rose to 30 on Tuesday, local authorities say, with 14 others seriously injured. Half the deaths were recorded in the city of Wajima, where a huge blaze tore through homes, the Ishikawa prefectural government says pic.twitter.com/BS1lEa0vJ5 — AFP News Agency (@AFP) January 2, 2024 ► సముద్రపు అలలు 5 అడుగులపైకి దూసుకురావటంతో అధికారులు సునామి హెచ్చరికలు జారీ చేశారు. భూకంపంతో సమారు 33 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. #Japan | Roads Split Open and Swallow Cars. #JapanEarthquake #JapanTsunami (AP) pic.twitter.com/G81rGMr4Xh — Mansi Bhagat (@mansibhagat1009) January 2, 2024 ► జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగొచ్చని, ఇప్పటి వరకు 20 మంది మృత్యువాత పడ్డారని జపాన్ స్థానిక మీడియా వెల్లడించింది. After earthquake cars roads and building being wash away by tsunami flood. #Japan pic.twitter.com/sLsuVXvJaN — Agha Akakhel (@AghaAkakhel) January 1, 2024 ► జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో సహాయ చర్యలపై ప్రధానమంత్రి పుమియో కిషిడా సమీక్ష నిర్వహించారు. ‘భూకంపంతో తీవ్రమైన నష్టం జరిగింది. ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుంది. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. భూకంపంతో కొన్ని చోట్ల అగ్ని ప్రమాదం జరిగింది’ అని తెలిపారు. భూకంపంతో ఇబ్బందులు పడుతున్న వారికి సహయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పలు కూలీపోయిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడానకి రెస్య్కూ టీం సాయం అందిస్తోందని పేర్కొన్నారు. ► జపాన్ భారీ భూకంపంతో సోమవారం నుంచి 155 సార్లు భూమి కంపించింది. భారీ భూకంపంతో పలు భవనాలు కూలిపోయాయి. పలు రోడ్లపై పగుళ్లు వచ్చాయి. భూకంప తీవ్రతకు తెలిపే CCTV ఫుటేజీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో రోడ్ల పగుళ్లు, రైల్వే స్టేషన్లో బోర్డులు ఊగిపోవటం కనిపిస్తున్నాయి. Some of the Footage coming out of Japan following the 7.6 Magnitude Earthquake which Struck the Country earlier this morning is Insane and truly shows the Power of Geological Forces on this Planet. pic.twitter.com/iwCRB3jmCv — OSINTdefender (@sentdefender) January 1, 2024 ► భారీ భూకంపం జపాన్ను కుదిపేసింది. సోమవారం రిక్కార్ స్కేల్‌పై 7.6 తీవ్రతో భూకంపం నమోదైనట్లు జపాన్ వాతారణ సంస్థ పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. అయితే ఇప్పటివరకు ఎనిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. We must stand with the people of Japan , during this tough time in which they are experiencing a Tsunami and earthquake. May God protect the children mothers & people of Japan from the Tsunami #Japan #earthquake #Tsunami#JapanEarthquake #JapanTsunamipic.twitter.com/dSfvKBZu7M — Kohlified 🗿 (@ShreeGZunjarrao) January 1, 2024 అదేవిధంగా జపాన్‌లో చోటుచేసుకున్న భూకంపం కారణంగా ఇషికావా నగరంలో భారీగా మంటలు చెలరేగాయి. పలు భవనాలు మంటల్లో కాలిపోయాయి. 30,000 కంటే ఎక్కువ గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. THE SITUATION IS GETTING MORE COMPLICATED: A fire broke out at one of the Japanese nuclear plants A fire broke out at the Shiga nuclear power plant in Japan after the devastating earthquakes that hit the country today, Japanese media reported. pic.twitter.com/3ZSrBqY8ph — Vlado Gorski (@VGorski011) January 1, 2024 ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. ఇషిగావాలోని నోటో ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ అలలు విస్తరించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ సెంచరీతో (108) చెలరేగడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగగా.. సుందర్, ఆవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 177 పరుగుల వద్ద (33.2వ ఓవర్) సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ముల్దర్ (1) ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 174 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (21) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (29.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో జార్జీ (81) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 141 పరుగుల వద్ద (25.5వ ఓవర్) సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో మార్క్రమ్ (36) ఔటయ్యాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2 ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడిన సౌతాఫ్రికా ఆ తర్వాత నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగుతుంది. జార్జీ (64) అర్ధసెంచరీ చేసి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. జార్జీకు జతగా మార్క్రమ్ (19) క్రీజ్‌లో ఉన్నాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 76 పరుగుల వద్ద (14.4 ఓవర్లో) సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ బౌలింగ్‌లో డస్సెన్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టార్గెట్ 297.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 59 పరుగుల వద్ద (8.2వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 297.. ధాటిగా ఆడుతున్న సౌతాఫ్రికా ఓపెనర్లు 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 46/0గా ఉంది. జార్జీ (29), రీజా హెండ్రిక్స్ (11) క్రీజ్‌లో ఉన్నారు. సంజూ శతకం.. ఆఖర్లో మెరిసిన రింకూ.. సౌతాఫ్రికా టార్గెట్ 297 నిర్ణయాత్మక మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) తన కెరీర్లో తొలి శతకంతో టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేయడానికి పునాది వేయగా.. ఆఖర్లో రింకూ సింగ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (52) సైతం బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్ ఔట్ కేవలం ఒక్క పరుగు చేసి అక్షర్ పటేల్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్‌లో అక్షర్ వెనుదిరిగాడు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 259/6గా ఉంది. రింకూ (24), సుందర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ శాంసన్ ఔటయ్యాడు. విలియమ్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సంజూ పెవిలియన్‌కు చేరాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 249/5గా ఉంది. రింకూ (18), అక్షర్ పటేల్ (1) క్రీజ్‌లో ఉన్నారు. శతక్కొట్టిన సంజూ టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అంతర్జాతీయ కెరీర్లో ఎట్టకేలకు మూడంకెల స్కోర్‌ను సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సంజూ 110 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంజూకు ఇది తొలి సెంచరీ. సంజూ శతకంలో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కఠినమైన పిచ్‌పై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సంజూ అత్యంత కీలకమై ఇన్నింగ్స్ ఆడాడు. 44 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 235/4గా ఉంది. సంజూకు జతగా రింకూ (14) క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా తిలక్ వర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే ఔటయ్యాడు. ఆది కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డ తిలక్ ఆఖరికి తిలక్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాక అతని బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. 41.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 217/4గా ఉంది. సంజూ (96) జతగా రింకూ సింగ్ బరిలోకి దిగాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ ఆరంభంలో చాలా నిదానంగా ఆడిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొనసాగే కొద్ది వేగం పెంచాడు. తిలక్ వన్డేల్లో తన తొలి హాఫ్ సెంచరీని 75 బంతుల్లో పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్ (95) శతకానికి చేరువయ్యాడు. 41 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 216/3గా ఉంది. 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3గా ఉంది. సంజూ శాంసన్ (71), తిలక్ వర్మ (39) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్ అంతర్జాతీయ వన్డేల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 66 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో ఈ ఫీట్‌ను సాధించాడు. సంజూకు జతగా తిలక్ వర్మ (8) క్రీజ్‌లో ఉన్నాడు. 28 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 121/3గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 101 పరుగుల వద్ద (18.5వ ఓవర్) టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ముల్దర్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ (21) ఔటయ్యాడు. శాంసన్ (38), తిలక్ క్రీజ్‌లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న శాంసన్, రాహుల్ 49 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్ (33), కేఎల్ రాహుల్ (20) ఆచితూచి ఆడుతున్నారు. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 95/2గా ఉంది. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2గా ఉంది. సంజూ శాంసన్ (19), కేఎల్ రాహుల్ (7) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 49 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్‌లో సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 50/2గా ఉంది. సంజూ శాంసన్ (9), కేఎల్ రాహుల్ (1) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్ ఐదవ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన అనంతరం నండ్రే బర్గర్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 34/1గా ఉంది. సాయి సుదర్శన్ (9), సంజూ శాంసన్ క్రీజ్‌లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0 తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్ల సాయి సుదర్శన్ (5), రజత్ పాటిదార్ (12) నెమ్మదిగా ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0గా ఉంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా పార్ల్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టునే కొనసాగిస్తుండగా.. టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా.. కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. తుది జట్లు: భారత్: సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ -
Parlament Updates: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
అప్డేట్స్.. ► విపక్షాల నిరసనలు, ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తిరిగి ఉభయ సభలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ► పార్లమెంట్ భద్రత వైఫల్యానికి నిరసనగా విపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. పార్లమెంట్లో ప్రశ్నిస్తున్న ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంపై పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ధర్నాకు దిగారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Suspended MPs stage a protest in front of the Gandhi statue on Parliament premises, in Delhi A total of 14 MPs - 13 from Lok Sabha and 1 from Rajya Sabha - were suspended yesterday for the remainder of the winter session pic.twitter.com/kVEPhgt9Aq — ANI (@ANI) December 15, 2023 ► ఇండియా కూటమి ఎంపీలంతా ఒక్కటైనట్లు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తెలిపారు. తామంతా రాజ్యాంగేతర విధానంతో సస్పెన్షన్‌కు గురైనట్లు ఆరోపించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్న ఆయన.. ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు. #WATCH | Delhi: On his suspension from the Lok Sabha, Congress MP Manickam Tagore says, "All the MPs of the INDIA alliance are united and we were all undemocratically suspended yesterday. We are having a silent protest in front of the Gandhi statue and we will continue the… pic.twitter.com/4naP7Oanh4 — ANI (@ANI) December 15, 2023 ►సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. వారిని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ కలిశారు. పార్లమెంట్ అలజడి అంశంలో మొత్తంగా 14 మంది ఎంపీలు సభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi meets the suspended MPs who are protesting at the Makara Dwar in Parliament A total of 14 MPs - 13 from Lok Sabha and 1 from Rajya Sabha - were suspended yesterday for the remainder of the winter session pic.twitter.com/9QtSZsUXTE — ANI (@ANI) December 15, 2023 ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో మధ్యాహ్నం 2 వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. Lok Sabha adjourned till 2pm amid sloganeering by Opposition MPs over the security breach incident. pic.twitter.com/4K6i635k3H — ANI (@ANI) December 15, 2023 ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. స్పీకర్ ఇచ్చిన భద్రతా నియమాలనే ప్రభుత్వం పాటించింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది. ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. #WATCH | On the Parliamentary security breach incident, Parliamentary Affairs Minister Pralhad Joshi says, "Whatever directions the Speaker has given, the government is following them in letter and spirit. The matter is also in the court, high-level investigation is going on.… pic.twitter.com/3mEso77Z65 — ANI (@ANI) December 15, 2023 ►కాంగ్రెస్ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పార్లమెంట్‌కు హాజరయ్యారు. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament #WinterSession pic.twitter.com/dhooCFYaex — ANI (@ANI) December 15, 2023 ►ఇండియా కూటమికి చెందిన రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. సభలో నేడు అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. #WATCH | Delhi: A meeting of Floor leaders of the INDIA alliance parties is underway at LoP in Rajya Sabha Mallikarjun Kharge's office in Parliament House to chalk out the strategy for the Floor of the House.#WinterSession pic.twitter.com/Jde3yVbY2G — ANI (@ANI) December 15, 2023 పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై గురువారం ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ప్రతిపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం జరిగిన అవాంఛనీయ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో తీవ్ర అలజడి సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అరుపులు, కేకలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. తీవ్ర గందరగోళం నెలకొంది. ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోక్‌సభ నుంచి 13 మంది విపక్ష ఎంపీలపై, రాజ్యసభలో ఒక ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం వారు సభకు హాజరు కాకూడదని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు. లోక్‌సభ గురువారం ఉద యం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రా రంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న ఐదుగురు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశాయి. ఈ రోజు మిగతా కార్యకలాపాలను పక్కనపెట్టి, కేవలం భద్రతా వైఫల్యంపైనే సభలో చర్చ చేపట్టాలని పలువురు ఎంపీలు గురువారం ఉదయం 28 నోటీసులు ఇచ్చారు. వీటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. ఇదీ చదవండి: Parliament Attack: జాతికి జవాబు కావాలి! -
Live: తెలంగాణ రిజల్ట్స్...నాన్ స్టాప్ లైవ్ కవరేజ్
-
గాజాపై మళ్లీ పంజా.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ (ఫొటోలు)
-
IND Vs AUS: బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం
బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో భిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి అంచుల్లో ఆసీస్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాడినప్పటికీ, ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆ జట్టు 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.అర్షదీప్ బౌలింగ్‌లో ఆడమ్ జంపా (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిప్పులు చెరుగుతున్న ప్రసిద్ద్ కృష్ణ టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్ పడగొట్టాడు. 152 పరుగుల వద్ద నాథన్ ఇల్లిస్ (1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓటమి దిశగా ఆసీస్.. సీన్ అబాట్ క్లీన్ బౌల్డ్ ఆసీస్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 149 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో సీన్ అబాట్ (1) క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 148 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. గుర్తింపు పొందిన ఆఖరి బ్యాటర్ స్టోయినిస్ (45) ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి స్టోయినిస్ పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 139 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ (37) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 142/5గా ఉంది. స్టోయినిస్ (43), వేడ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 236.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్ 236 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆసీస్.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది.12 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. స్టోయినిస్ (40), టిమ్ డేవిడ్ (31) చెలరేగి ఆడుతున్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 53 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (12) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 53/3గా ఉంది. స్టోయినిస్, స్టీవ్ స్మిత్ (17) క్రీజ్‌లో ఉన్నారు టార్గెట్ 236.. రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 236 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రవి భిష్ణోయ్.. జోస్ ఇంగ్లిస్ (2), మాథ్యూ షార్ట్‌ను (19) పెవిలియన్‌కు పంపాడు. టీమిండియా బ్యాటర్ల మహోగ్రరూపం.. సిక్సర్ల సునామీ ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. టాప్-3 బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) , తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇషాన్ ఔట్ 52 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో ఇల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన స్కై తొలి బంతికే సిక్సర్ బాదాడు. దంచికొడుతున్న ఇషాన్ యశస్వి జైస్వాల్ ఔటయ్యాక కూడా భారత బ్యాటర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఇషాన్ కిషన్ (52) విధ్వంసం ఓ రేంజ్లో కొనసాగుతుండగా.. రుతురాజ్ (47) ఆచితూచి ఆడుతున్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 164/1గా ఉంది. 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన భారత్ టీమిండియా 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. యశస్వి ధాటిగా ఆడి ఔటైనా రుతురాజ్ (29), ఇషాన్ కిషన్ (10) కూడా ఓ మోస్తరు షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/1గా ఉంది. విధ్వంసం సృష్టించి ఔటైన యశస్వి యశస్వి జైస్వాల్ క్రీజ్‌లో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. అయితే ఐదో ఓవర్ ఆఖరి బంతికి అతనికి అడ్డుకట్ట పడింది. ఇల్లిస్ బౌలింగ్ యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 5.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 77/1గా ఉంది. రుతురాజ్ (15), ఇషాన్ క్రీజ్‌లో ఉన్నారు. యశస్వి ఊచకోత.. 24 బంతుల్లోనే..! యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం దాల్చాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదేస్తున్నాడు. కేవలం 24 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం దాల్చాడు. వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికే ఫోర్ బాదిన రుతురాజ్ తొలి టీ20లో బంతిని ఎదుర్కోకుండానే డైమండ్ రనౌట్‌గా వెనుదిరిగిన రుతురాజ్ ఈ మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదాడు. తొలి ఓవర్ తర్వాత టీమిండియా స్కోర్ 10/0గా ఉంది. రుతురాజ్ (5), యశస్వి జైస్వాల్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా ఆసీస్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ -
గతంలో మొక్కుబడిగా పథకాల అమలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయగలుగుతున్నాం. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి, వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో సాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం. పేద వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులు అందరినీ ప్రతి సందర్భంలో నా..నా..నా అంటూ వారి మీద ఓనర్ షిప్ తీసుకుంటూ, ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్లు అంటూ భరోసా ఇస్తూ, చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. ఈరోజు ఈ పథకం ద్వారా జూలై నుంచి సెప్టెంబర్ దాకా జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి 10,511 మంది జంటలకు 81.64 లక్షల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఈ పథకంలో ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించాం. 2022 అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఇవాళ్టికి ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేదని బేరీజు వేసుకుంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. గత ప్రభుత్వం ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో పథకాలు తీసుకురావాలని, పేదవాళ్లకు మంచి జరగాలని అడుగులు పడలేదు. ఆ ఉద్దేశం, సంకల్పం మంచిదైతే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడు. పరిస్థితులు అన్ని రకాలుగా కలిసి వస్తాయి. అటువంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ పథకం. ఈ పథకం ప్రకటించేటప్పుడు ఎందుకు పదో తరగతి సర్టిఫికెట్, 18 సంవత్సరాలు తప్పని సరి అని నాతో చాలా మంది అన్నారు. అందరికీ ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయన్నారు. నేను ఒకటే అన్నాను. ఓట్లు అన్నది, ఎన్నికలన్నవి సెకండరీ. లీడర్లుగా ఉన్నప్పుడు సంకల్పం, విజన్ మోస్ట్ ఇంపార్టెంట్. 10వ తరగతి సర్టిఫికెట్, 18 ఏళ్లు వధువుకు, 21 ఏళ్లు వరుడికి ఉండాలని చెబుతామో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గేలా అడుగులు వేశాం. రెండోది 10వ తరగతి సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం వల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ఊతం ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ బడుల రూపురేఖలు మారుతున్నాయి. ఇంగ్లీషు మీడియం చదువులు వచ్చాయి. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీల బోధన, 3వ తరగతి నుంచి సబ్జెట్ టీచర్, 8వ తరగతి వాళ్లకు ట్యాబ్స్, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ తో పిల్లలు బాగా ఎదగాలని అడుగులు వేస్తున్నాం. తల్లులను మోటివేట్ చేస్తూ అమ్మ ఒడి తెచ్చాం. తమ పిల్లలను బడులకు పంపేలా మోటివేట్ అవుతున్నారు. 10వ తరగతి సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం వల్ల కచ్చితంగా పదో తరగతి వరకు చదువుతారు. 18 సంవత్సరాల వరకు ఆగాలి కాబట్టి, ఇంటర్ దాకా అమ్మ ఒడి వర్తిస్తుంది కాబట్టి ఇంటర్ చదివిస్తారు. తల్లిదండ్రులకు నష్టం లేదు. అమ్మ ఒడి ద్వారా ఆదాయం వస్తుంది. ఇంటర్ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అందుబాటులో ఉన్నాయన్నది మెదడుకు తడుతుంది. పూర్తి ఫీజు అందుతుందని, పిల్లలను చదివించగలమని తడుతుంది. వసతి దీవెన కింద రూ.20 వేల వరకు సంవత్సరానికి వస్తుందన్నది తడుతుంది. పిల్లల్ని గ్రాడ్యుయేషన్ వరకు చదివించేందుకు మోటివేట్ అవుతారు. చదువులన్నది గ్రాడ్యుయేట్స్ అయ్యే దాకా పిల్లల దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. ఇలా చదివించగలగడం వల్ల జనరేషన్ చేంజ్ వస్తుంది. చదువు అనే అస్త్రంతో పిల్లల తలరాతలు మార్చే గొప్ప వ్యవస్థ పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ పథకం తెచ్చాం. గత ప్రభుత్వంలో పదో తరగతి ఇన్సిస్ట్ చేసే పరిస్థితి లేదు. 2018కి పథకమే పక్కన పడేశారు. ఇంత మందికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎప్పుడిస్తారో తెలియదు. ఎక్కడా మోటివేషన్, చిత్తశుద్ధి లేదు. ఈ రోజు మనం చిత్తశుద్ధి, మోటివేషన్, ట్రాన్స్ పరెంట్గా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్, మరుసటి నెల కల్యాణమస్తు, షాదీ తోఫా తల్లుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి తెచ్చాం. గతంలో మైనార్టీలకు రూ.50 వేలు మాత్రమే.. కొంత మందికే ఇచ్చారు. అది కూడా ఎప్పుడిస్తారో తెలియదు. మనం మైనార్టీలకు ఏకంగా లక్ష రూపాయలు ఇస్తున్నాం. అది కూడా పదో తరగతి పాస్ అయ్యుండాలని చెబుతున్నాం. ఇలా చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులంతా పిల్లల్ని చదివించే దిశగా అడుగులు వేయించేలా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి పోయే కొద్దీ చాలా మందికి మోటివేషన్ దిశగా అడుగులు వేయించాలని తపన, తాపత్రయం పడుతూ అడుగులు వేస్తున్నాం. దేవుడు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇప్పుడు 10,511 జంటలకు ఇస్తున్న వారిలో 8042 మందికి అమ్మ ఒడి లేదా జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయన్న విషయం చాలా సంతోషం కలిగిస్తోంది. గొప్ప మార్పుకు చిహ్నం. రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాల్లో 100 శాతం కింద రిజిస్టర్ కావాలని తపన, తాపత్రయ పడుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. -
క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అవసరం: ద్రౌపది ముర్ము
Updates.. ►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అవసరం, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక చింతనతో సమాజసేవ చేయాలి. సత్యసాయి బాబా సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం. విద్య, వైద్యం, తాగునీరు, ఆధ్యాత్మికత విస్తరణకు బాబా బాగా కృషి చేశారు అని అన్నారు. ►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ►పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ►పుట్టపర్తి సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ ►బాబా మహాసమాధికి నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ ►సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి, గవర్నర్. ►పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ►రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ►సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి వచ్చిన రాష్ట్రపతి, గవర్నర్ ►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ►రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ►భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అరుణ్‌బాబు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 1.05 గంటలకు ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 3.05 గంటలకు సాయికుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 3.35 గంటలకు స్నాతకోత్సవంలో భాగంగా 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. -
CWC 2023: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన భారత్.. వరుసగా తొమ్మిదో విజయం
నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన భారత్.. వరుసగా తొమ్మిదో విజయం వన్డే వరల్డ్‌కప్ 2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో రోహిత్ సేన వరుసగా తొమ్మిదో మ్యాచ్‌లో విజయం సాధించింది. నెదర్లాండ్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్, విరాట్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా బౌలింగ్ చేశాడు. ఈ విజయంతో భారత్ లీగ్ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఆరో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 172 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. మొహమ్మద్ సిరాజ్ సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ (45)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐదో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 144 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. బాస్ డి లీడ్‌ను (12) బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. తొమ్మిదేళ్ల తర్వాత విరాట్‌కు వికెట్.. వన్డేల్లో విరాట్ తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీశాడు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను స్టాట్ ఎడ్వర్డ్స్ (17) వికెట్ పడగొట్టాడు. మూడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 72 పరుగుల వద్ద నెదర్లాండ్స్ మూడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మ్యాక్స్ ఓడౌడ్ (30) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 66 పరుగుల వద్ద నెదర్లాండ్స్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అకెర్మన్ (35) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి బరెస్సీ (4) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ స్కోర్ 5/1. రాహుల్, శ్రేయస్ మెరుపు శతకాలు.. టీమిండియా భారీ స్కోర్ కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. వీరిద్దరితో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) కూడా హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. శతక్కొట్టిన రాహుల్ కేఎల్ రాహుల్ 62 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. బాస్ డి లీడ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది రాహుల్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపిస్తున్న శ్రేయస్ 84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 346/3గా ఉంది. శ్రేయస్‌తో పాటు కేఎల్ (70) క్రీజ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో రాహుల్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై తృటిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయిన రాహుల్ .. ఆతర్వాతి ఇన్నింగ్స్‌ల్లో మంచి ఆరంభాలే లభించినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాప్-5 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. 43 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 312/3గా ఉంది. శ్రేయస్ (86), రాహుల్ (51) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్.. హ్యాట్రిక్ శ్రేయస్ అయ్యర్ 48 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఎడిషన్‌లో శ్రేయస్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా (77), శ్రీలంకతో (82) జరిగిన మ్యాచ్‌ల్లోనూ శ్రేయస్ హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతకుముందు పాక్‌పై (53) కూడా ఫిఫ్టి కొట్టాడు. 35 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 244/3. శ్రేయస్ (56), కేఎల్ రాహుల్ (16) క్రీజ్‌లో ఉన్నారు. కోహ్లి ఔట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే విరాట్ కోహ్లి (51) ఔటయ్యాడు. వాన్ డర్ మెర్వ్ బౌలింగ్‌లో కోహ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 28.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 200/3. శ్రేయస్‌కు (30) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి విరాట్ కోహ్లి 53 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో తన వన్డే కెరీర్లో 71వ హాఫ్ సెంచరీని, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఐదో ఫిఫ్టిని పూర్తి చేసుకున్నాడు. విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో పాటు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా (9 మ్యాచ్‌ల్లో 592 పరుగులు) అవతరించాడు. 28 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 198/2. విరాట్ (50), శ్రేయస్ (30) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. హిట్‌మ్యాన్ ఔట్ 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. బాస్ డి లీడ్ బౌలింగ్‌లో బరెస్సీకి క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ వెనుదిరిగాడు. 17.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 129/2. కోహ్లి (12)కి జతగా శ్రేయస్ క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్ ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో భీకరఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ మరో హాఫ్ సెంచరీ తన సాధించాడు. మీకెరెన్ బౌలింగ్ ఫోర్ కొట్టి హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 44 బంతుల్లో రోహిత్ ఈ ఫీట్‌ను సాధించాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 109/1గా ఉంది. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి (3) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 100 పరుగుల వద్ద భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. 11.5 ఓవర్ల వద్ద ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. అప్పటికే హాఫ్ సెంచరీ (51) పూర్తి చేసిన గిల్.. మీకెరెన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 11 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ అర్ధ శతకాలకు చేరువయ్యారు. వన్డే ప్రపంచకప్-2023లో చివరి లీగ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తమ జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నెదర్లాండ్స్: వెస్లీ బరేసి, మాక్స్ ఓ డౌడ్, కోలిన్ అకెర్మాన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ -
మైనార్టీలను గత టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసింది. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్ రిజర్వేషన్లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్ చెప్పారు. ‘‘మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేశాం. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం. సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చాం. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఇంద్రధనస్సులా అందరం కలిసే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఒక్క జగన్‌దే కాదు.. మనందరిది. ప్రతి అడుగులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుని వెళ్తున్నాం. వివిధ పథకాల ద్వారా రూ. 2.5 లక్షల కోట్లకు పైగా నగదు అందజేశాం. చంద్రబాబు హయాంలో మైనార్టీల సంక్షేమానికి రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తే.. మన ప్రభుత్వంలో రూ.23 వేల కోట్లు ఖర్చు చేశాం. విజయవాడ నుంచి హజ్‌యాత్రకు వెళ్తే అవకాశం కల్పించాం. అదనపు భారం పడకుండా రూ.14 కోట్లు మన ప్రభుత్వం చెల్లించింది. ఇమాం, మౌజంలకు గౌరవ వేతనం అందిస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా.. -
Nepal Earthquake: నేపాల్‌లో భూకంప విధ్వంసం.. శిథిలమైన భవనాలు (ఫొటోలు)
-
ఇది శుభపరిణామం: సీఎం జగన్
Updates: 10:55 AM నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది: షెకావత్ ►ఇరిగేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాం ►ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోంది ►వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం ►మోదీ నేతృత్వంలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం ►రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం ►భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం ►నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్ తరాలను ఉపయోగం ►వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నాం ►తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నాం ►2019లో మోదీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించాం ►జలశక్తి అభియాన్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి ►నదుల అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది ►ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నాం ►డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ల ద్వారా డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది ►అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్‌లను పరిరక్షిస్తున్నాం ►ప్రపంచబ్యాంకు సహకారంతో డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది 10:45 AM నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం: సీఎం జగన్ ►సదస్సులో పాల్గొన్న దేశ,విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు ►ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ►ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది ►ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం ►రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది ►వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి ►సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం 10:05 AM ►రాడిసన్ బ్లూ హోటల్లో ప్రారంభమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ ►కేంద్రమంత్రి షెకావత్‌తో కలిసి ప్రారంభించిన సీఎం జగన్ ►ర్యాడిసన్ బ్లూ రిసార్ట్స్ వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు ►సుమారు 90 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ►నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే సదస్సు అజెండా ►కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు సత్కారం చేసి జ్ఞాపికలను బహూకరించిన నిర్వాహకులు ►విశాఖ చేరుకున్న సీఎం జగన్ ►రుషికొండ ఐటీ హిల్స్‌కు చేరుకున్న సీఎం జగన్ ►విశాఖపట్నం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►మరికొద్ది సేపట్లో ఐసీఐడీ సదస్సుకు హాజరుకానున్న సీఎం సాక్షి, విశాఖపట్నం: మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖ సిద్ధమైంది. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీకి వేదికవుతోంది. 74 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రతినిధులకు అతిథ్యమిస్తోంది. ఇప్పటికే జీఐఎస్, జీ 20 సదస్సులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విశాఖలో గురువారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు జరగనుంది. 57 ఏళ్ల తరువాత భారత్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు విశాఖ వేదికవడం విశేషం. సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాడిసన్ బ్లూ హోటల్లో జరగనున్న ఈ సదస్సును గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ‘వ్యవసాయం నీటి కొరతను అధిగమించడం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఐసీఐడీ అధ్యక్షుడు డాక్టర్ రాగబ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు భారత్ నుంచి 300 మంది హాజరుకానున్నారు. అలాగే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, జపాన్, కొరియా, మలేషియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం ఇలా 74 దేశాల నుంచి 900 మందికి పైగా ప్రతినిధులు రానున్నారు. ఇదే వేదికపై 74వ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఐఈసీ) సదస్సు కూడా జరగనుంది. తొలిరోజు ప్రముఖుల కీలక ఉపన్యాసాలు ఉండగా.. 3, 4, 5, అలాగే 9వ తేదీన విశాఖ పర్యాటక ప్రాంతాలైన అరకు వ్యాలీ, బొర్రా గుహలు, తాటిపూడి రిజర్వాయర్ వంటి ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు విజయవంతంగా పూర్తయ్యేందుకు పోలీసులు 1100 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market Updates: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 48 పాయింట్ల నష్టంతో 63,826 పాయింట్ల వద్ద, నఫ్టీ 4 పాయింట్ల క్షీణతతో 19,075 వద్ద కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, బజాబ్ ఆటో, హీరో మోటర్ కార్ప్, ఓఎన్జీసీ, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్ర, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. యూఎస్ ఫెడ్ నిర్ణయమే కీలకం మార్కెట్ ప్రస్తుతం యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం కోసం వేచి ఉంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటును బుధవారం రాత్రి ప్రకటించనుంది. మరోవైపు టాటా స్టీల్, సన్ ఫార్మా, బ్రిటానియా, హీరోమోటోకార్ప్ ఈరోజు తమ ఆదాయాలను నివేదించనున్నాయి. భారతి ఎయిర్టెల్, ఎల్అండ్టీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జేఎస్పీఎల్ ఫలితాలపై కూడా మార్కెట్ ప్రతిస్పందన ఉండనుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
అష్టదిగ్బంధనంలో గాజా.. భూతల దాడులకు సర్వం సిద్ధం!
గాజాపై భూతల దాడులు చేయడానికి ట్రయల్స్ పూర్తయ్యాయి. గాజాకు బయటి నుంచి ఎటువంటి సరఫరాలు జరక్కుండా చేసిన అష్టదిగ్బంధనం ఉచ్చు మరింత బిగిసింది. మానవతాసాయం ఎట్టిపరిస్థితుల్లో అందాలన్న ఐక్యరాజ్యసమితి చేతులెత్తేసింది. శాంతిస్థాపన తీర్మానం అంటూ.. మానవతాసాయానికి పరిమితమై సమావేశాన్ని ముగించింది యూరోపియన్ యూనియన్. హమాస్‌ను అంతం చేస్తానన్న ఇజ్రాయెల్ యుద్ధ గర్జన కంటిన్యూ అవుతోంది. తీవ్ర మానవతా సంక్షో భంలో కొట్టుమిట్టాడుతున్న గాజా వాసులకు ఊరట దక్కే సూచనలు కనుచూపు మేరలో కనబడ్డం లేదు. 22 రోజులుగా డే అండ్ నైట్.. ట్వంటీఫోర్ ఇన్‌టూ సెవెన్ ప్రాతిపదికన ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు పాలస్తీనీయులు భీతిల్లిపోతున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి రాకెట్లు, బాంబులు వచ్చి మీదపడతాయో తెలియక మృత్యువుకు సన్నిహితంగా మెలుగుతున్నారు. నిత్యావసర-అత్యవసర సరుకు సరంజామా నిల్వలు అడుగంటిపోయాయి. ఇజ్రాయెల్ దిగ్బంధించిన కారణంగా.. బయటి ప్రపంచం నుంచి సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఇక గాజావాసులు ఆకలిదప్పులతో అలమటించే పరిస్థితులు దాపురిస్తున్నాయి. תיעוד מפעילות כוחות קרקעיים של צה״ל ברצועת עזה: pic.twitter.com/9dqUzXP7in — צבא ההגנה לישראל (@idfonline) October 28, 2023 గాజాకు మానవీయ సాయం అందకుండా ఇజ్రాయెల్ తన కాళ్ళూ చేతులూ కట్టిపడేసిందని ఐక్యరాజ్యసమితి వాపోయింది. హమాస్ చర్య ఊహించనిదో, మొదటిసారి చేసిందో కాదంటూ UN సెక్రెటరీ జెనరల్ ఆంటోనియో గుటెరస్ చేసిన వ్యాఖ్యలతో ఇజ్రాయెల్‌కు పుండుమీద కారంలా మారింది. హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించడంతో పాటు.. హమాస్‌ను పూర్తిగా తుదముట్టించేవరకు యుద్ధం ఆగదంటూ తెగేసి చెప్పింది ఇజ్రాయెల్. భూతల దాడులు చేస్తానని హెచ్చరించింది. అందుకు తగ్గట్టే..ఎంపిక చేసుకున్న టార్గెట్లపై లక్షిత దాడులతో విరుచుకుపడుతోంది. ఇంకోపక్క బ్రస్సెల్స్‌లో సమావేశమైన యూరోపియన్ యూనియన్ నేతలు కూడా కాల్పుల విరమణ తీర్మానంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాల్పుల విరమణ స్థానే గాజాకు అడపాదడపా మానవతాసాయం అందజేయడానికి ఇజ్రాయెల్ సహకరించాలని కోరుతూ తీర్మానం చేసేసి చేతులు దులుపుకున్నారు.ఇప్పటికే.. కాల్పుల విరమణ,. మానవతా సాయం అందజేతపై తీర్మానం చేయడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పలుమార్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. Overnight, IDF fighter jets struck Asem Abu Rakaba, the Head of Hamas' Aerial Array. Abu Rakaba was responsible for Hamas' UAVs, drones, paragliders, aerial detection and defense. He took part in planning the October 7 massacre and commanded the terrorists who infiltrated… — Israel Defense Forces (@IDF) October 28, 2023 ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో.. ఎటూపోయేందుకు దారీతెన్నూలేక ఒకవైపు.. నిత్యావసరాలు దొరక్క మరోవైపు. . 20లక్షల మందికి పైగా పాలస్తీనీయులు గాజాస్ట్రిప్‌లో అలమటిస్తున్నారు. ఇంకో రోజు గడిస్తే.. ఇప్పుడు చేస్తున్న పరిమిత సాయం కూడా అందించలేనని పెదవి విరిచింది గాజాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం. తక్షణం జనరేటర్లకు అవసరమైన ఇంధనం అందకుంటే మరో ఇరవై నాలుగ్గంటల్లో ఆఫీస్ షట్‌డౌన్ చేయక తప్పదని ప్రకటించింది. ఇది కూడా చదవండి: 200 హెలికాప్టర్లతో ఇరాన్ యుద్ధ విన్యాసాలు! -
WC 2023: కాన్వే, రచిన్ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
కాన్వే, రచిన్ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్ గత వరల్డ్‌కప్ (2019) ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన అపజయానికి న్యూజిలాండ్ టీమ్ ప్రతీకారం తీర్చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ జరిగిన వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో కివీస్ టీమ్.. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల భారీ తేడాతో చిత్తు చేసి, మెగా టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. శతక్కొట్టిన రచిన్ రవీంద్ర.. గెలుపుకు చేరువైన కివీస్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రచిన్ రవీంద్ర అద్భుతమైన సెంచరీతో కదంతొక్కాడు. రచిన్ 82 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. రచిన్‌కు కెరీర్లో ఇది తొలి శతకం. మరో ఎండ్‌లో కాన్వే (111) సెంచరీ పూర్తయ్యాక కూడా నిలకడగా ఆడుతున్నారు. 30.4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 214/1గా ఉంది. న్యూజిలాండ్ గెలుపుకు కేవలం 69 పరుగుల దూరంలో ఉంది. డెవాన్ కాన్వే మెరుపు శతకం.. గెలుపుకు చేరువైన కివీస్ న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 83 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో ఐదో శతకాన్ని పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర (90) కూడా శతకానికి చేరువయ్యాడు. ఈ ఇద్దరి మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో కివీస్ ఆడుతూపాడుతూ విజయం దిశగా సాగుతుంది. 26.1 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 193/1గా ఉంది. శతకాల దిశగా పరుగులు పెడుతున్న కాన్వే, రచిన్ న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (71), డెవాన్ కాన్వే (82) శతకాల దిశగా దూసుకుపోతున్నారు. వీరిద్దరి ధాటికి స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. 20 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 154/1గా ఉంది. న్యూజిలాండ్ గెలవాలంటే 30 ఓవర్లలో 129 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న కాన్వే, రచిన్ న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (62 నాటౌట్), రచిన్ రవీంద్ర (58 నాటౌట్) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 15 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 121/1గా ఉంది. న్యూజిలాండ్ గెలవాలంటే 35 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. లక్ష్యం దిశగా దూసుకుపోతున్న న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు ఏడో బంతికే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ.. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్ర (47), డెవాన్ కాన్వే (44) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 11 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 92/1గా ఉంది. టార్గెట్ 283.. రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏడో బంతికే వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి విల్ యంగ్ డకౌటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 19/1గా ఉంది. డెవాన్ కాన్వే (11), రచిన్ రవీంద్ర (8) క్రీజ్‌లో ఉన్నారు. పడి లేచిన ఇంగ్లండ్.. గౌరవప్రదమైన స్కోర్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ రూట్ (77), బట్లర్ (43) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గట్టెక్కించారు. ఆఖర్లో టెయింలెండర్లు మేము సైతం అని ఓ చేయి వేయడంతో ఇంగ్లండ్ ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు చేయగలిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మార్క్ వుడ్ (13), ఆదిల్ రషీద్ (15) అజేయంగా నిలువగా.. బెయిర్‌స్టో (33), మలాన్ (14), బ్రూక్ (25), మొయిన్ అలీ (11), బట్లర్ (43), రూట్ (77), లివింగ్‌స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 252 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి సామ్ కర్రన్ (14) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 250 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి క్రిస్ వోక్స్ (11) ఔటయ్యాడు. జో రూట్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ రివర్స్ స్వీప్ జో రూట్ (77) కొంపముంచింది. ఈ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా ఈ షాట్లు ఆడి సక్సెస్ సాధించిన రూట్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ మరోసారి ఆ ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటివరకు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రూట్ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్, క్రిస్ వోక్స్ క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 221 పరుగుల వద్ద (38.5 ఓవర్లు) ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన స్లో బాల్‌కు లివింగ్‌స్టోన్ (20) ఔటయ్యాడు. జో రూట్ (72), సామ్ కర్రన్ క్రీజ్‌లో ఉన్నారు. కష్టాల్లో ఇంగ్లండ్.. ఐదో వికెట్ డౌన్ ఇంగ్లండ్ టీమ్ కష్టాల్లో పడింది. 188 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు (33.2 ఓవర్లలో)బౌలింగ్‌లో వికెట్‌కీపర్ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (43) ఔటయ్యాడు. జో రూట్ (59) క్రీజ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రూట్ జో రూట్ 57 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 166/4గా ఉంది. రూట్‌తో పాటు జోస్ బట్లర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. మొయిన్ అలీ క్లీన్ బౌల్డ్ 118 పరుగల వద్ద (21.2 ఓవర్లు) ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో మొయిన్ అలీ (11) క్లీన్ బౌల్డయ్యాడు. జో రూట్ (32) క్రీజ్‌లో ఉన్నాడు. 94 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ వరుసగా 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాది జోష్ మీదుండిన హ్యారీ బ్రూక్ (25) అనవసరమైన షాట్ ఆడి వికెట్ పరేసుకున్నాడు. 17 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 94/3. జో రూట్ (20), మొయిన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. జానీ బెయిర్‌స్టో ఔట్.. ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్ 64 పరుగుల వద్ద (12.5 ఓవర్లు) ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి జానీ బెయిర్‌స్టో (33) ఔటయ్యాడు. జో రూట్ (15), హ్యారీ బ్రూక్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 40 పరుగుల వద్ద (7.4 ఓవర్లు) ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న డేవిడ్ మలాన్ 14 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జానీ బెయిర్‌స్టో (24) క్రీజ్‌లో ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్‌స్టో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 35/0గా ఉంది. బెయిర్‌స్టో (21), మలాన్ (13) క్రీజ్‌లో ఉన్నారు. తొలి బంతికే సిక్సర్ బాదిన బెయిర్‌స్టో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఊహించని ఆరంభం లభించింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో తొలి బంతికే బెయిర్‌స్టో సిక్సర్ బాదాడు. ఆతర్వాత ఐదో బంతికి బౌండరీ కొట్టాడు. ఫలితంగా ఇంగ్లండ్ తొలి ఓవర్లో 12 పరుగులు రాబట్టింది. బెయిర్‌స్టో (11), డేవిడ్ మలాన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ (అక్టోబర్ 5) డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ బెన్ స్టోక్స్ లేకుండా బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సేవలను కోల్పోయింది. విలియమ్సన్తో పాటు ఫెర్గూసన్, టిమ్ సౌథీ, ఐష్ సోధి ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. -
New York City Photos: అమెరికాను ముంచెత్తిన వరదలు...ప్రభుత్వం ఎమర్జెన్సీ (ఫోటోలు)
-
ఇది మీ అందరి ప్రభుత్వం: సీఎం జగన్
►వైఎస్సార్ వాహన మిత్ర ఐదో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. విద్యాధరపురం స్టేడియంకు చేరుకున్న సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై బటన్ నొక్కి వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ►ఆటోడ్రైవర్లు అందించిన ఖాకీ చొక్కా ధరించిన సీఎం జగన్.. ప్రసంగం ప్రారంభించారు ►బతుకు బండి లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ పథకం: సీఎం జగన్ ►వాహనం ఇన్యూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వైఎస్సార్ వాహన మిత్ర ►ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు అండగా నిలిచేందుకే ఈ పథకం ►ఇవాళ రూ.276 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం ►వైఎస్సార్ వాహన మిత్రతో ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ది జరుగుతోంది ►వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నా ►ఇది జగనన్న ప్రభుత్వం కాదు.. ఇది మీ అందరి ప్రభుత్వం: సీఎం జగన్ ►మీ వాహనాలకు ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉంచుకోండి: సీఎం జగన్ ►ఎంతోమంది ప్రయాణికులకు మీరు సేవలందిస్తున్నారు ►జగనన్న సురక్ష ద్వారా అవసరమైన సర్టిఫికేట్లు ఇంటికే అందిస్తున్నాం ►పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం ►అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నాం ►వలంటీర్ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశాం ►అర్‌బీకేలతో రైతులకు అండగా నిలిచాం ►పాదయాత్రలో మీ అందరి కష్టాలు చూశా ►మీ సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ►రైతన్నకు రూ.30,985 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా సాయం ►మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచాం ►వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం ►చిరు వ్యాపారులకు రూ.2,956 కోట్లు సాయం అందించాం: సీఎం జగన్ ►పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది ►వైఎస్సార్ కాపునేస్తంతో రూ.2,029 కోట్లు సాయం అందించాం ►వైఎస్సార్ ఈబీసీ నేస్తంతో రూ.1257 సాయం అందించాం ►గత పాలకులకు మనసు లేదు ►నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికీ.. నిరుపేదలను వంచించిన గత ప్రభుత్వానికీ మధ్య యుద్ధం ►మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేశాం ►ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ►త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది: సీఎం జగన్ ►లంచం, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశాం ►ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, అమరావతి పేరుతో స్కాములు చేసిన గత ప్రభుత్వంతో యుద్ధం ►గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కడే ►గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? ►దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలి ►దోచుకున్నది పంచుకునేందుకే వాళ్లకు అధికారం కావాలి ►వాళ్లకు మాదిగా నాకు గజ దొంగల ముఠా తోడుగా లేదు ►దోచుకుని పంచుకుని తినుకోవడం నా విధానం కాదు ►వైఎస్సార్ వాహన మిత్రతో మాకెంతో మేలు జరిగింది: లబ్ధిదారులు ►గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదు ►ఆటో ఇన్య్సూరెన్స్ కోసం గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం ►సీఎం జగన్ ఇచ్చిన భరోసాతో గౌరవంగా బతుకుతున్నాం ►నేను విన్నాను.. నేను ఉన్నానంటూ జగన్ ఆదుకున్నారు ►పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారు ►వలంటీర్ వ్యవస్థతో ప్రతీ కుటుంబానికి మేలు జరిగింది ►కరోనా క్లిష్ట సమయంలోనూ వలంటీర్లు మాకు సేవలందించారు ►అభివృద్దికి సీఎం జగన్ ట్రేడ్‌మార్క్: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ►గత ప్రభుత్వం ఏ వర్గాన్నీ పట్టించుకోలేదు ►ప్రజలకు ఏం కావాలో అదే సీఎం జగన్ అమలు చేస్తున్నారు ►విజయవాడ అభివృద్ధికి సీఎం జగన్ అనేక నిధులు ఇచ్చారు ►సీఎం జగన్ ఆధ్వర్యంలోనే విజయవాడ అభివృద్ధి ►భారీగా హాజరైన వాహనమిత్ర లబ్ధిదారులు ►వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం జగన్ ►సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►విజయవాడ చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో వైఎస్సార్ వాహన మిత్ర నిధులు విడుదల చేయనున్న సీఎం ►విజయవాడ బయలేర్దిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో వైఎస్సార్ వాహన మిత్ర నిధులు విడుదల చేయనున్న సీఎం ►కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి విద్యాధరపురం స్టేడియంకు చేరుకొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై బటన్ నొక్కి వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ►సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. ►దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ►ఇప్పటివరకు నాలుగు విడతల సాయాన్ని అందించిన సీఎం వైఎస్ జగన్.. వరుసగా ఐదో విడత ఆర్థిక సాయాన్ని శుక్రవారం అందించనున్నారు. ►విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు. 2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ►దీనితో కలిపి వైఎస్సార్ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుంది. -
మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
భారత్ అలౌట్ 286 పరుగుల వద్ద (49.4 ఓవర్లు) టీమిండియా ఆఖరి వికెట్ కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 286 పరుగుల వద్ద (48.3 ఓవర్లు) టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సంగా బౌలింగ్‌లో జడేజా(35) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 270 పరుగుల వద్ద (45.3 ఓవర్లు) టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి బుమ్రా (5) ఔటయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న టీమిండియా టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. 257 పరుగుల వద్ద (41.5 ఓవర్లు) భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (2) క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 249 పరుగుల వద్ద (38.3 ఓవర్లు) టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (48) క్లీన్ బౌలయ్యాడు. రవీంద్ర జడేజా (9), కుల్దీప్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 233 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (8) ఔటయ్యాడు. భారత్ గెలవాలంటే 76 బంతుల్లో 120 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 223 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (26) ఔటయ్యాడు. 35.5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 223/4గా ఉంది. భారత గెలుపుకు 85 బంతుల్లో 130 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. కోహ్లి ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ విరాట్ కోహ్లి 56 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 26.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/3గా ఉంది. శ్రేయస్ (14), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి విరాట్ కోహ్లి 55 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 168/2గా ఉంది. విరాట్ (54), శ్రేయస్ (13) క్రీజ్‌లో ఉన్నారు.భారత్ లక్ష్యానికి మరో 185 పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 144 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ 81 పరుగులు చేసి ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 153/2గా ఉంది. విరాట్ కోహ్లి (46), శ్రేయస్ అయ్యర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ లక్ష్యానికి మరో 200 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (18) ఔటయ్యాడు. రోహిత్ శర్మ (55), విరాట్ కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 353.. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న రోహిత్ శర్మ 353 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో సుందర్ నిదానంగా ఆడుతున్నాడు. సుందర్ 18 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 56/0గా ఉంది. రెచ్చిపోయిన ఆసీస్ బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ లక్ష్యం టాపార్డర్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్ బుమ్రా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (72) ఔటయ్యాడు. 49 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 345/7. ఆరో వికెట్ కోల్పోయిన అసీస్ 299 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి గ్రీన్ (9) ఔటయ్యాడు. లబూషేన్ (42), కమిన్స్ క్రీజ్‌లో ఉన్నారు. మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (5) క్లీన్ బౌల్డయ్యాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 281/5. లబూషేన్ (33), గ్రీన్ క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 267 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అలెక్స్ క్యారీ (11) ఔటయ్యాడు. లబూషేన్ (26), మ్యాక్స్‌వెల్ క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 242 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసి స్మిత్ (74) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో స్మిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 32 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 242/3గా ఉంది. లబూషేన్ (13), అలెక్స్ క్యారీ (0) క్రీజ్‌లో ఉన్నారు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న మార్ష్ మిచెల్ మార్ష్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 215/2. స్మిత్ (61), లబూషేన్ క్రీజ్‌లో ఉన్నారు. స్మిత్ హాఫ్ సెంచరీ.. సెంచరీ దిశగా మార్ష్ 26.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 200 పరుగుల మార్కును అందుకుంది. మార్ష్ (89) సెంచరీ దిశగా పరుగులు పెడుతుండగా.. స్మిత్ (55) అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 202/1. 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ ఎంతంటే..? 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 120/1గా ఉంది. మిచెల్ మార్ష్ (43), స్టీవ్ స్మిత్ (21) క్రీజ్‌లో ఉన్నారు. విధ్వంసకర హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన వార్నర్ డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 84/1. మిచెల్ మార్ష్ (22), స్టీవ్ స్మిత్ (6) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్ విధ్వంసకర హాఫ్ సెంచరీ చాలా రోజుల తర్వాత వార్నర్ మునుపటి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో అతను 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి వార్నర్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ధాటిగా ఆడుతున్న వార్నర్.. 7 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్ (27 బంతుల్లో 43), మిచెల్ మార్ష్ (15 బంతుల్లో 22) శుభారంభాన్ని అందించారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 65/0గా ఉంది. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్. -
ఆసీస్ ఆలౌట్.. భారత్ ఘన విజయం
ఆసీస్ ఆలౌట్.. భారత్ ఘన విజయం 217 పరుగుల వద్ద ఆసీస్ ఆఖరి రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 140 పరుగుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జాంపా (5) క్లీన్ బౌల్డయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 135 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. గ్రీన్ (19)రనౌటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 128 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ (14) క్లీన్ బౌల్డయ్యాడు. 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్.. అశ్విన్‌కు 3 వికెట్లు 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అశ్విన్‌కు ఒకే ఓవర్లో (15వ ఓవర్) 2 వికెట్లు సహా మొత్తం 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. 15వ ఓవర్ తొలి బంతికి వార్నర్‌ను (53) ఎల్బీడబ్ల్యూ చేసిన యాష్.. ఐదో బంతికి ఇంగ్లిస్‌ను (6) పెవిలియన్‌కు పంపాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 89 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అశ్విన్.. లబూషేన్ (27)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వార్నర్ (48), ఇంగ్లిస్ క్రీజ్‌లో ఉన్నారు. తగ్గిన వర్షం.. మొదలైన ఆట.. 33 ఓవర్లకు మ్యాచ్ కుదింపు వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. వర్షం కారణంగా సమయం వృధా కావడంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించి, డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని 317 పరుగులుగా నిర్ధేశించారు. 10 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 63/2గా ఉంది. వార్నర్ (31), లబూషేన్ (18) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్ ఆసీస్ ఇన్నింగ్స్ 9 ఓవర్ల తర్వాత వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అంతకుమందు భారత ఇన్నింగ్స్ సందర్భంగా కూడా వరుణుడు అడ్డుతగిలాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 56/2గా ఉంది. మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0)లను ప్రసిద్ద్ కృష్ణ వరుస బంతుల్లో ఔట్ చేయగా.. డేవిడ్ వార్నర్ (26), లబూషేన్ (17) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 400.. రెండో ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 2.3 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 10/2గా ఉంది. లబూషేన్, వార్నర్ క్రీజ్‌లో ఉన్నారు. గిల్, అయ్యర్ శతకాలు.. స్కై విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన సూర్యకుమార్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో సూర్యకుమార్ చెలరేగిపోయాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 355/5గా ఉంది. 46వ ఓవర్ ఆఖరి బంతికి గ్రీన్ బౌలింగ్‌లో రాహుల్ (52) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 302 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 41 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 306/4గా ఉంది. రాహుల్ (45), సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. గిల్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ 104 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. గ్రీన్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ బాట పట్టాడు. 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 249/3గా ఉంది. కేఎల్ రాహుల్ (18), ఇషాన్ కిషన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. శుభ్‌మన్ గిల్ సెంచరీ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డే కెరీర్లో ఆరో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 33 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 230/2గా ఉంది. గిల్ (100), కేఎల్ రాహుల్ (9) క్రీజ్‌లో ఉన్నారు. సెంచరీ తర్వాత ఔటైన అయ్యర్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేసిన వెంటనే ఔటయ్యాడు. 105 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సీన్ అబాట్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ క్యాచ్ పట్టడంతో అయ్యర్ పెవిలియన్ బాట పట్టాడు. 30.5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 216/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (95), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్ ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించాడు. అయ్యర్ 86 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో కెరీర్లో మూడో సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ (94) సైతం సెంచరీ దిశగా సాగుతున్నాడు. 29.5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 210/1గా ఉంది. సెంచరీల దిశగా దూసుకుపోతున్న గిల్, శ్రేయస్ శుభ్‌మన్ గిల్ (90), శ్రేయస్ అయ్యర్లు (92) సెంచరీల దిశగా దూసుకుపోతున్నారు. 28 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 198/1గా ఉంది. శ్రేయస్ హాఫ్ సెంచరీ గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయ్యర్ కూడా గిల్ లాగే సిక్సర్‌తో ఫిఫ్టిని కంప్లీట్ చేశాడు. అయ్యర్ 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 131/1గా ఉంది. గిల్ 61, శ్రేయస్ 54 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సిక్సర్‌తో ఫిఫ్టి పూర్తి చేసుకున్న గిల్ శుభ్‌మన్ గిల్ కెరీర్లో తన 10వ హాఫ్ సెంచరీని సిక్సర్‌తో పూర్తి చేశాడు. కేవలం 37 బంతుల్లోనే గిల్ ఫిఫ్టిని కంప్లీట్ చేశాడు. గిల్ తన హాఫ్ సెంచరీలో 2 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 111/1గా ఉంది. గిల్ 53, శ్రేయస్ 44 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మొదలైన ఆట.. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 80/1 వర్షం అంతరాయం అనంతరం ఆట మళ్లీ మొదలైంది. ఓవర్ల కుదింపు ఏమీ జరగలేదు. మ్యాచ్ యధావిధిగా 50 ఓవర్ల పాటు సాగనుంది. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 80/1గా ఉంది. గిల్ (33), శ్రేయస్ అయ్యర్ (34) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా నిలిచిపోయిన ఆట వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. 9.5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 79/1గా ఉంది. రుతరాజ్ (8) ఔట్ కాగా.. శుభ్‌మన్ గిల్ (32), శ్రేయస్ అయ్యర్ (34) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 16 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ (8) వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకు క్యాచ్ ఇచ్చి రుతు ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 26/1. శుభ్‌మన్ గిల్ (3), శ్రేయస్ అయ్యర్ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి, ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ స్థానాల్లో అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్‌వుడ్ ఇండియా : శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ -
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
Australia tour of India, 2023- India vs Australia, 1st ODI: భారత్ ఘన విజయం మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 277 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. కేఎల్ రాహుల్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లక్ష్యం దిశగా భారత్ టీమిండియా లక్ష్యం దిశగా సాగుతుంది. 45 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 253/4గా ఉంది. మరో 24 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. కేఎల్ రాహుల్ (44), సూర్యకుమార్ యాదవ్ (40) క్రీజ్‌లో ఉన్నారు. లక్ష్యానికి 54 పరుగుల దూరంలో ఉన్న భారత్ 40 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 223/4గా ఉంది. భారత్ లక్ష్యానికి మరో 54 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ (25), కేఎల్ రాహుల్ (29) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. ఇషాన్ ఔట్ 185 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (18) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా 92 పరుగుల దూరంలో ఉంది. మరో 17.3 ఓవర్లు మిగిలి ఉన్నాయి. రాహుల్ (16), సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. 25.3: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఆడం జంపా బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ బౌల్డ్(74). స్కోరు: 155/3 (25.5). రాహుల్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ రనౌట్ 148 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి శ్రేయస్ అయ్యర్ (3) రనౌటయ్యాడు. 23.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 148/2గా ఉంది. గిల్ (72), రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 142 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్‌లో రుతురాజ్ (71) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 147/1. గిల్ (71), శ్రేయస్ అయ్యర్ (3) క్రీజ్‌లో ఉన్నారు. కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వన్డే కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో రుతు ఈ మైలురాయిని చేరుకున్నాడు. 17.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 112/0. గిల్ (59), రుతురాజ్ (51) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ మాథ్యూ షార్ట్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్ కొట్టి శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో గిల్ ఈ మార్కును చేరుకున్నాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/0. గిల్ (53), రుతురాజ్ (40) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/0 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆచితూచి ఆడుతుంది. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 43/0గా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ (17), శుభ్‌మన్ గిల్ (25) క్రీజ్‌లో ఉన్నారు. ఐదేసిన షమీ.. ఆసీస్ 276 ఆలౌట్ టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమీ (5/51) ఐదు వికెట్లతో రెచ్చిపోవడంతో తొలి వన్డేలో ఆసీస్ 276 పరుగులకు ఆలౌటైంది. షమీకి ఇవి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (4), వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబూషేన్ (39), కెమరూన్ గ్రీన్ (31), ఇంగ్లిస్ (45), స్టోయినిస్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో కమిన్స్ (21 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజాలకు తలో వికెట్ దక్కాయి. ఐదేసిన షమీ ఈ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ (0) క్లీన్ బౌల్డయ్యాడు. షమీకి నాలుగో వికెట్ ఈ మ్యాచ్‌లో షమీ నాలుగో వికెట్ తీసుకున్నాడు. షమీ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో షార్ట్ (2) పెవిలియన్‌కు చేరాడు. 48.2 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 254/8. ఆసీస్ ఏడో వికెట్ డౌన్ 250 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఇంగ్లిస్ (45) ఔటయ్యాడు. షార్ట్ (1), కమిన్స్ క్రీజ్‌లో ఉన్నారు. మరో వికెట్ తీసిన షమీ.. డేంజరెస్ స్టోయినిస్ క్లీన్ బౌల్డ్ షమీ ఈ మ్యాచ్‌లో తన మూడో వికెట్‌ను పడగొట్టాడు. స్టోయినిస్‌ను (29) షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 46.4 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 248/6. ఇంగ్లిస్ (44), షార్ట్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. గ్రీన్ రనౌట్ 186 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. గ్రీన్ (31) రనౌటయ్యాడు. బుమ్రా,సూర్యకుమార్ యాదవ్‌లు కలిసి గ్రీన్‌ను ఔట్ చేశారు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 187/5. ఇంగ్లిస్ (14), స్టోయినిస్ క్రీజ్‌లో ఉన్నారు. వర్షం ముప్పు.. ఆటకు విరామం వర్షం కురిసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆకాశం మేఘావృతం కావడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్.. అశ్విన్‌కు వికెట్ 157 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన స్టంపింగ్ చేసి లబూషేన్ (39)ను ఔట్ చేశాడు. 32.4 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 157/4. గ్రీన్ (15), ఇంగ్లిస్ క్రీజ్‌లో ఉన్నారు. Mitchell Marsh ✅ Steven Smith ✅ Mohammed Shami is on fire against the Aussies! 🔥#INDvsAUS #CricketTwitter #SteveSmith pic.twitter.com/bsw6hwJuCe — OneCricket (@OneCricketApp) September 22, 2023 స్టీవ్ స్మిత్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ మహ్మద్ షమీ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ (60 బంతుల్లో 41; 3 ఫోర్లు, సిక్స్) క్లీన్ బౌల్డయ్యాడు. 22 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 114/3. లబూషేన్ (11), కెమరూన్ గ్రీన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 🫣🫣🫣 pic.twitter.com/mW4EH4c7O3 — Sitaraman (@Sitaraman112971) September 22, 2023 రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. వార్నర్ (52) ఔట్ 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వార్నర్ ఔటయ్యాడు. జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. వార్నర్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 20 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 107/2. స్టీవ్ స్మిత్ (39), లబూషేన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ ఎంతంటే..? 15 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 78/1గా ఉంది. వార్నర్ (48), స్టీవ్ స్మిత్ (21) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్ ధాటిగా ఆడుతున్నాడు. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోరు 42/1 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 42/1గా ఉంది. డేవిడ్ వార్నర్ (17), స్టీవ్ స్మిత్ (17) క్రీజ్‌లో ఉన్నారు. The sensational Shami for India! pic.twitter.com/2TzPgB7UjW — Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2023 తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ 0.4: మిచెల్ మార్ష్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి మార్ష్(4) అవుటయ్యాడు. స్మిత్, వార్నర్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 4-1 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా టాస్ గెలిచి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా. -
Asia Cup Final: శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం 2023 ఆసియా కప్ టైటిల్‌ను భారత్ ఎగరేసుకుపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. తద్వారా ఎనిమిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలక చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టార్గెట్ 51.. 3 ఓవర్లలో భారత్ స్కోర్ 32/0 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ వేగంగా లక్ష్యం దిశగా సాగుతుంది. 3 ఓవర్లలో భారత్ వికెట్లు నష్టపోకుండా 32 పరుగులు చేసింది. గిల్ (18), ఇషాన్ (13) క్రీజ్‌లో ఉన్నారు. నిప్పులు చెరిగిన సిరాజ్.. 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ (7-1-21-6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) తనవంతుగా రాణించడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా (5-1-23-1) కూడా ఓ వికెట్ పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 40 పరుగుల వద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో వెల్లలగే (8) ఔటయ్యాడు. సిరాజ్ ఆన్ ఫైర్.. 6 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. కుశాల్ మెండిస్‌ను (17) క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ఈ ఇన్నింగ్స్‌లో తన ఆరో వికెట్‌ను పడగొట్టాడు. సిరాజ్ 5.2 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. సిరాజ్‌కు ఐదు వికెట్లు శ్రీలంక జట్టు 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మహ్మద్ సిరాజ్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంక నడ్డి విరిచాడు. ఐదో ఓవర్ నాలుగో బంతికి సిరాజ్.. షనక (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. నిప్పులు చెరిగిన సిరాజ్.. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికి నిస్సంకను (2) ఔట్ చేసిన సిరాజ్.. మూడు, నాలుగు, ఆరు బంతులకు సమరవిక్రమ (0), అసలంక (0), ధనంజయ డిసిల్వ (4)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన సిరాజ్ సిరాజ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి శ్రీలంకను భారీ దెబ్బకొట్టాడు. తొలి బంతికి నిస్సంకను ఔట్ చేసిన సిరాజ్.. మూడు, నాలుగు బంతులకు సమరవిక్రమ (0), అసలంక (0)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంకను భారీ దెబ్బకొట్టాడు. తొలి బంతికి నిస్సంకను ఔట్ చేసిన సిరాజ్.. మూడో బంతికి సమరవిక్రమను (0) ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక 8 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో జడేజా క్యాచ్ అందుకోవడంతో నిస్సంక (2) ఔటయ్యాడు. కుశాల్ మెండిస్ (5), సమరవిక్రమ క్రీజ్‌లో ఉన్నారు. మొదలైన మ్యాచ్.. తొలి ఓవర్లోనే వికెట్ వర్షం కారణంగా భారత్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్ 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే శ్రీలంక వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో బంతికే కేఎల్ రాహుల్ వికెట్ల వెనుక అద్భుతమైన క్యాచ్ పట్టి కుశాల్ పెరీరాను (0) పెవిలియన్‌కు సాగనంపాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్-2023 ఫైనల్ మ్యాచ్ కొలొంబో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక, భారత్ జట్లు చెరో మార్పు చేశాయి. శ్రీలంకకు సంబంధించి తీక్షణ స్థానంలో దుషన్ హేమంత జట్టులోకి రాగా.. భారత జట్టులో అక్షర్ పటేల్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్ భర్తీ చేశాడు. కాగా, మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్ ఆలస్యమైంది. తుది జట్లు.. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ శ్రీలంక: కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
చంద్రబాబు పూర్తి భద్రతలో ఉన్నారని ఏఏజీ వెల్లడి
-
IND VS PAK Updates: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం
Asia Cup, 2023 - Pakistan vs India, Super Fours Updates: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. 357 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఘోర పరాజయం పాలైంది. పాకిస్తాన్ 32 ఓవర్లలోనే 128 పరుగులకు ఆలౌటైంది. పాక్‌పై 228 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పాక్ పాకిస్తాన్ జట్టు 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో ఆఘా సల్మాన్ (23) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 24 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 96/5గా ఉంది. పాక్ నాలుగో వికెట్ డౌన్ పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఫకర్ జమాన్ (27) క్లీన్ బౌల్డయ్యాడు. 20 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 79/4గా ఉంది. అఘా సల్మాన్ (13), ఇఫ్తికార్ అహ్మద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన పాక్ వర్షం తగ్గాక శార్దూల్ ఠాకూర్ వేసిన నాలుగో బంతికే పాక్ మూడో వికెట్ కోల్పోయింది. శార్దూల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మహ్మద్ రిజ్వాన్ (2) ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 47/3. ఫకర్ జమాన్ (15), అఘా సల్మాన్ క్రీజ్‌లో ఉన్నారు. తగ్గిన వర్షం.. కాసేపట్లో తిరిగి మొదలుకానున్న ఆట వరుణుడు శాంతించాడు. 9:20 గంటలకు ఆట తిరిగి ప్రారంభంకానుంది. ఓవర్ల కోత లేకుండా ఈ మ్యాచ్ 50 ఓవర్ల పాటు కొనసాగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం మళ్లీ అంతరాయం కలిగిస్తే అప్పుడు డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం రివైజ్డ్ టార్గెట్స్ ఇలా ఉంటాయి.. 20 ఓవర్లలో 200 పరుగులు 22 ఓవర్లలో 216 24 ఓవర్లలో 230 26 ఓవర్లలో 244 ఈ మ్యాచ్‌లో ఫలితం రావాలంటే పాక్ కనీసం 20 ఓవర్లయినా ఆడాలి. పాక్‌కు షాక్.. కెప్టెన్ క్లీన్ బౌల్డ్ భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను హార్దిక పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. 11 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 44/2గా ఉంది. మహ్మద్ రిజ్వాన్ (1), ఫకర్ జమాన్ (14) క్రీజ్‌లో ఉన్నారు. WHAT A BALL FROM HARDIK...!!! He cleans up world number 1 ODI batter. pic.twitter.com/cLNfRlv3Sr — Johns. (@CricCrazyJohns) September 11, 2023 టార్గెట్ 357.. తొలి వికెట్ కోల్పోయిన పాక్ 357 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాక్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఇమామ్ ఉల్ హాక్ (9) ఔటయ్యాడు. 4.2 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 17/1గా ఉంది. ఫకర్ జమాన్, బాబర్ ఆజమ్ క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్, కోహ్లి శతకాల మోత.. టీమిండియా భారీ స్కోర్ కేఎల్ రాహుల్ (111 నాటౌట్), విరాట్ కోహ్లి (122 నాటౌట్) శతకాలతో విరుచుకుపడటంతో టీమిండియా పాక్‌పై భారీ స్కోర్ చేసింది. వీరిద్దరితో పాటు రోహిత్ (56), శుభ్‌మన్ గిల్ (58) కూడా హాఫ్ సెంచరీలు చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ రాహుల్ శతక్కొట్టిన మరుసటి ఓవర్లోనే విరాట్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. 47.3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 322/2. రీఎంట్రీలో శతక్కొట్టిన కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని దాదాపు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ వచ్చీరాగానే సెంచరీతో సత్తా చాటాడు. పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ 100 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో వన్డే కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కోహ్లి సైతం సెంచరీకి దగ్గర పడ్డాడు. అతను ప్రస్తుతం 81 బంతుల్లో 97 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. సెంచరీల దిశగా దూసుకెళ్తున్న రాహుల్, విరాట్ అర్ధసెంచరీలు పూర్తి చేసుకునేంతవరకు ఆచితూచి ఆడిన రాహుల్, విరాట్లు ఆతర్వాత గేర్ మార్చారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడం మొదలుపెట్టారు. రాహుల్‌తో పోలిస్తే విరాట్ వేగం మరింత పెంచాడు. 44 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 286/2గా ఉంది. కోహ్లి (71 బంతుల్లో 80), రాహుల్ (92 బంతుల్లో 84) క్రీజ్‌లో ఉన్నారు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి ఆచితూచి ఆడుతున్న విరాట్ కోహ్లి 55 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 243/2గా ఉంది. రాహుల్ (71), కోహ్లి (50) క్రీజ్‌లో ఉన్నారు. 35 ఓవర్లలో టీమిండియా స్కోరు: 225/2. రాహుల్ 63, కోహ్లి 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ 33.1: పహీహ్ అష్రఫ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి రాహుల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. జోరు పెంచిన రాహుల్.. బాధ్యతగా ఆడుతున్న కోహ్లి ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య ఆట మొదలైంది. ఆదివారం వర్షం కారణంగా 24.2 ఓవర్ల దగ్గర ఆగిపోయిన ఆటను సోమవారం(రిజర్వ్ డే) ఆట ప్రారంభించిన (147/2) టీమిండియా తొలుత కాస్త నిదానంగా ఆడింది. అయితే, ఆతర్వాత జోరుపెంచి వేగంగా పరుగులు రాబడుతోంది. ముఖ్యంగా రాహుల్ (42) గేర్ మార్చి బ్యాటింగ్ చేస్తుండగా, కోహ్లి (22) బాధ్యతగా ఆడుతున్నాడు. 31 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 186/2గా ఉంది. వర్షం కారణంగా నిన్న రద్దైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన ఇవాళ ఎట్టకేలకు ప్రారంభమైంది. వరుణుడు శాంతించడంతో ఈ మ్యాచ్ పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌గా సాగనుంది. నిన్న టీమిండియా ఎక్కడైతే ఇన్నింగ్స్‌ను ముగించిందో అక్కడి నుంచే ఇవాళ ప్రారంభిస్తుంది. నిన్న వర్షం అంతరాయం కలిగించే సమయానికి భారత్ స్కోర్ 24.1 ఓవర్లలో 147/2గా ఉండింది. రోహిత్ (56), గిల్ (58) ఔట్ కాగా.. కోహ్లి (8), రాహుల్ (17) క్రీజ్‌లో ఉన్నారు. -
ముగిసిన జీ20 సమావేశాలు
Udates.. ► నవంబర్‌లో మరోసారి జీ20 దేశాలు వర్చువల్ సెషన్లో భేటీ కానున్నాయి. అప్పటి వరకు అధికారికంగా భారత్ అధ్యక్ష దేశంగా ఉండనుంది. ► జీ20 సమ్మిట్ ముగిసిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్ ఫలవంతం అవుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. ► జీ 20 సమావేశాలు ముగిశాయి. తదుపరి జీ 20 బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించింది భారత్. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు బాధ్యతలను అందించారు. #WATCH | G 20 in India | Prime Minister Narendra Modi hands over the gavel of G 20 presidency to the President of Brazil Luiz Inácio Lula da Silva. pic.twitter.com/ihEmXN9lty — ANI (@ANI) September 10, 2023 ►జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ దిగ్విజయంగా నిర్వహించిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు . గ్లోబల్ సౌత్‌కు మంచి ప్రాతనిధ్యం లభించిందని చెప్పారు. #WATCH | G 20 in India: "I think it (craft exhibition) is wonderful...I think the presidency has done a very good job of being a voice of the global south & the fact that they managed to get a consensus is a testament to the leadership of G 20...," says Stephane Dujarric,… pic.twitter.com/ooYqTqGfKy — ANI (@ANI) September 10, 2023 ►వసుధైక కుటుంబం విజయవంతమైందని త్రిపుర సీఎం మాణిక్ సాహా అన్నారు. జీ20 నిర్వహణలో భారత్ విజయం సాధించిందని చెప్పారు. #WATCH | G 20 in India | Delhi: Tripura CM Manik Saha says, "We have seen in the reports, that it (G20 Summit) has been extremely successful... We got to know what we can provide for other countries and what they can give us...Our idea of 'Vasudhaiva Kutumbakam' has… pic.twitter.com/EZN8k7Pz1v — ANI (@ANI) September 10, 2023 ► బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గ్రీన్ క్లైమేట్ ఫండ్‌గా 2 బిలియన్ల డాలర్లను ప్రకటించారు. G20: UK PM Rishi Sunak announces USD 2bn Green Climate Fund Read @ANI Story | https://t.co/rl0Xq1ZjZF#G20SummitDelhi #G20India2023 #G20SummitIndia #RishiSunak #GreenClimateFund pic.twitter.com/XrQNGSmZ2q — ANI Digital (@ani_digital) September 10, 2023 ► రెండోరోజు జీ20 సమావేశంలో వివిధ నేతల మధ్య దౌపాక్షిక సంబంధాలపై చర్చలతో పాటు కీలక అంశాల గురించి మాట్లాడుతారు. ఈ రోజు లంచ్ బ్రేక్ సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ► జీ20 సమావేశం ముగిసిన అనంతరం జో బైడెన్ భారత్ నుంచి వెనుదిరిగారు. ఢిల్లీ నుంచి వియత్నాం వెళ్లనున్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో తన విమానం ఎక్కారు. G 20 in India | US President Joe Biden departs from Delhi to Vietnam, after concluding the G20 Summit. (Source: Reuters) pic.twitter.com/ng4zJvRDz0 — ANI (@ANI) September 10, 2023 ► రాజ్‌ఘాట్ వద్ద జీ20 నేతలు మహాత్మాాగాంధీకి నివాళులు అర్పించారు. G 20 in India | "At the iconic Rajghat, the G20 family paid homage to Mahatma Gandhi - the beacon of peace, service, compassion and non-violence. As diverse nations converge, Gandhi Ji’s timeless ideals guide our collective vision for a harmonious, inclusive and prosperous global… pic.twitter.com/turd4bexWV — ANI (@ANI) September 10, 2023 ► రాజ్‌ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, కెనడా ప్రధాని జస్టిన్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీకి చిత్రపటానికి నివాళులర్పించారు. #WATCH | G 20 in India: Prime Minister Narendra Modi, US President Joe Biden, UK PM Rishi Sunak, Australian PM Anthony Albanese, Canadian PM Justin Trudeau, Russian Foreign Minister Sergey Lavrov and other Heads of state and government and Heads of international organizations at… pic.twitter.com/HP6iGlNq3h — ANI (@ANI) September 10, 2023 ► ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మగాంధీకి నివాళులు అర్పించే కార్యక్రమం వద్ద ఏర్పాటు దృశ్యాలు G 20 in India | Visuals from Rajghat where G 20 leaders & other Heads of international organizations will pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/GThS3YEKtJ — ANI (@ANI) September 10, 2023 ► సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీ వారికి స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. #WATCH | G 20 in India | Singapore Prime Minister Lee Hsien Loong arrives at Delhi's Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/RmPgDManH4 — ANI (@ANI) September 10, 2023 ► మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. #WATCH | G 20 in India | Prime Minister of Mauritius Pravind Kumar Jugnauth arrives at Delhi's Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/3fbdIXXKQo — ANI (@ANI) September 10, 2023 ► బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించనున్నారు. VIDEO | G20 Summit: PM Modi welcomes his Bangladeshi counterpart Sheikh Hasina at Rajghat, New Delhi.#G20India2023 #G20SummitDelhi pic.twitter.com/DIOjDXmKNY — Press Trust of India (@PTI_News) September 10, 2023 ► ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. VIDEO | G20 Summit: PM Modi welcomes Egypt President Abdel Fattah El-Sisi at Rajghat, New Delhi.#G20India2023 #G20SummitDelhi pic.twitter.com/rCfZ3LPDpP — Press Trust of India (@PTI_News) September 10, 2023 ► జీ20 ప్రతినిధులు రాజ్‌ఘాట్‌కు వచ్చారు. వారిని ప్రధాని నరేంద్ర మోదీ ఖాదీతో స్వాగతం పలికారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా, IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, ఇతర నాయకులు, ప్రతినిధులు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారు. #WATCH | G 20 in India: President of Asian Development Bank Masatsugu Asakawa, Kristalina Georgieva, Managing Director of IMF and other leaders and delegates arrive at Delhi's Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/ufLtJIlNEf — ANI (@ANI) September 10, 2023 ► జీ20 ప్రతినిధులు రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్న క్రమంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. VIDEO | G20 Summit: Security tightened near Mahatma Gandhi Road in Delhi ahead of world leaders' visit to Rajghat.#G20India2023 #G20SummitDelhi pic.twitter.com/n4m2Q7hos0 — Press Trust of India (@PTI_News) September 10, 2023 ► జీ20 రెండో రోజులో భాగంగా దేశ విదేశీ ప్రతినిధులు రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్నారు. మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ► ఢిల్లీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. జీ20 రెండో రోజు కార్యక్రమాలకు వర్షం అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే.. -
దీపావళికి తిరిగొస్తున్న టైగర్..
-
ఇండియా కూటమి భేటీ.. ఈ అంశాలే ప్రధానంగా..
ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు 28 పార్టీలు ముంబయి వేదికగా జరుగుతున్న డిన్నర్ భేటీలో పాల్గొననున్నాయి. కూటమికి ఓ లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. దేశంలో బీజేపీకి ధీటుగా ఐక్యంగా పోరాడుతామని ప్రతిపక్ష పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమి భేటీకి ముంబయికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను పార్టీ శ్రేణులు గణంగా ఆహ్వానిస్తున్నాయి. ఈ మేరకు బ్యాండ్ బాజాలతో సోనియా గాంధీని, రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. #WATCH | Congress supporters gathered outside Mumbai airport to welcome party leaders Sonia Gandhi and Rahul Gandhi They will attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA) here. pic.twitter.com/VAAdjcUP6d — ANI (@ANI) August 31, 2023 కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ముంబయికి చేరుకున్నారు. #WATCH | Maharashtra | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi arrive at a hotel in Mumbai. Rahul Gandhi will hold a press conference shortly. pic.twitter.com/NXsA0IkdUD — ANI (@ANI) August 31, 2023 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ముంబయికి చేరుకున్నారు. మరికాసేపట్ల భేటీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. #WATCH | Maharashtra | Congress national president Mallikarjun Kharge arrives in Mumbai for the meeting of the INDIA alliance. pic.twitter.com/FVNd2UTWGF — ANI (@ANI) August 31, 2023 ఇండియా కూటమి మూడో భేటీకి హాజరవడానికి జమ్మూ కశ్మీర్ పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముంబయి చేరుకున్నారు. కూటమి వర్థిల్లాలని నినదించారు. #WATCH | PDP Chief Mehbooba Mufti arrives in Mumbai to attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA) "Judega Bharat, Jeetega INDIA," says Mehbooba Mufti pic.twitter.com/qPA4sp0r5v — ANI (@ANI) August 31, 2023 ముంబయిలో జరగనున్న సమావేశానికి హాజరవడానికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. #WATCH | Delhi | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi leave from Delhi airport to attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA), in Mumbai. pic.twitter.com/StAcj1OOKX — ANI (@ANI) August 31, 2023 ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి 28 పార్టీల తరుపున 63 మంది నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో భేటీ కానున్నారు. కూటమికి ఓ జెండాను ఎంపిక చేయనున్నారు. పార్టీల మధ్య సమన్వయం చేయడానికి ఓ కమిటీని కూడా నియమించనున్నారు. పాట్నా, బెంగళూరు సమావేశాల తర్వాత ముంబయి వేదికగా మూడోసారి జరుగుతున్న నేటి భేటీ చివరిది కావడం గమనార్హం. అందుకే ఈ సమావేశంలోనే కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు ఇప్పటికే ముంబయి చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నితీష్ కుమార్, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ రోజు ముంబయికి చేరనున్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో నేటి డిన్నర్ భేటీ జరగనుంది. దేశంలో ప్రస్తుతం ఏర్పడుతున్న ఇండియా కూటమి రాజకీయ ప్రత్యామ్నాయంగా మారనుందని ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ తెలిపారు. సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చలు ఉండవని పేర్కొన్నారు. ఇండియా కూటమి భేటీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర బీజేపీ కూడా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో లోక్‌సభ సీట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇదీ చదవండి: Jammu Kashmir: జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం -
జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జమ్ముకు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్దరిస్తుందనే అంశంపై ఇవాళ సుప్రీంకు కేంద్రం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో వాదనలు వినిస్తున కేంద్రం.. అక్కడ ఎన్నికల నిర్వహణకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని ధర్మాసనానికి తెలిపారు. పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాలని చెప్పారు. అలాగే.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశానికి కాల వ్యవధిని నిర్ణయించలేమని తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేస్తూనే.. కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికమేనని పేర్కొన్నారు. పూర్తి రాష్ట్రంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ని గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చేసినట్లు సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కొత్త ప్రాజెక్టులు భారీ స్థాయిలో వస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాద చర్యలు 42.5 తగ్గాయని వెల్లడించారు. చొరబాటు ఘటనలు 90.20 శాతం తగ్గాయని తెలిపారు. 2023లోనే ఏకంగా కోటి మంది పర్యటకులు కశ్మీర్ లోయను సందర్శించారని పేర్కొన్నారు. Petitions challenging the abrogation of Article 370 in SC | Solicitor General Tushar Mehta, appearing for Centre, tells Supreme Court that it is ready for elections in Jammu and Kashmir at any time now. pic.twitter.com/mhiqqWPBbf — ANI (@ANI) August 31, 2023 జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంలో కేంద్రం నేడు కీలక ప్రకటన చేయనుంది. నాలుగేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించనున్నారనే సమాచారాన్ని నేడు సుప్రీంకోర్టుకు నివేదించనుంది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం పిటీషనర్ల వాదనలు విన్న తర్వాత సీజేఐ చంద్రచూడ్.. జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎప్పటివరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారో కూడా తెలపాలని ప్రశ్నించారు. #BREAKING Supreme Court asks when the Statehood of Jammu and Kashmir will be restored. Asks when elections will be allowed. Asks SG to get instructions on a definition timeline.#JammuKashmir #Article370 https://t.co/SK9wl5B5Ia — Live Law (@LiveLawIndia) August 29, 2023 ఈ క్రమంలో వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సానుకూల అంశాన్ని గురువారం తెలుపుతామని ధర్మాసనానికి విన్నవించారు. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికంగానే ఉంచనున్నామని, లఢక్ మాత్రం యూనియన్ టెరిటరీగానే ఉంటుందని కోర్టుకు ఆయన స్పష్టం చేశారు. Justice Kaul: suppose you carve out portion of assam into a union territory and also make assam into a UT.. SG: Too extreme an example..... but one state cannot be declared a UT under article 3... but there needs to be separation... CJI: creation of UTs post independence..… — Bar & Bench (@barandbench) August 29, 2023 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు -
మెగా హీరోస్ కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ..!
-
TSRTC Bandh Protests Photos: టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా.. ప్రయాణికుల ఇక్కట్లు (ఫొటోలు)
-
సాక్షి మనీ మంత్రా: తేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ.. లాభాలతో ముగింపు
Today stockmarket closing: దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 347 పాయింట్ల లాభంతో 66,508 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 94 పాయింట్ల లాభంతో 19,740 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్ర, టాటా స్టీల్, టీసీఎస్ సంస్థల షేర్లు లాభాలను అందుకోగా కోటక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలివర్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే..
బెంగళూరు: బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు నేడు రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. భేటీలో కీలక అంశాలు ఇవే.. ► 'ఎన్డీయే, బీజేపీ.. మా 'ఇండియా' కూటమిని ఛాలెంజ్ చేస్తారా..?' అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. 'మాతృభూమిని ప్రేమిస్తాం.. దేశాన్ని ప్రేమిస్తున్న నిజమైన దేశభక్తులం మేము. హిందువులు, దళితులు, మైనారిటీలు, రైతులు, బెంగాల్, మణిపూర్‌కు బీజేపీతో ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వాలను కొనడం.. అమ్మడమే వారి పని' అని బీజేపీని మమతా బెనర్జీ విమర్శించారు. ► విపక్షాల భేటీ మరో సమావేశం ముంబయిలో నిర్వహించనున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ► కూటమికి నాయకుడు ఎవరనే అంశంపై ఖర్గే పెదవి విప్పారు. కన్వినర్‌గా పనిచేస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్ ముంబయి సమావేశంలో ఈ విషయాన్ని తెల్చుతారని చెప్పారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్షాల భేటీ అనంతరం ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. ► బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ఐఎన్‌డిఐఏ ఉద్దేశం ఐక్యంగా పోరాడటమే అని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ► ప్రతిపక్ష భేటీలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాకూటమి విజయం సాధించాక పీఎం పదవికి తమకు ఆసక్తి లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ► బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ప్రతిపక్షాల భేటీలో మొదటి రోజు నిన్న ముగిసింది. అయితే.. ఈ మహాకూటమి తరపున ప్రధాన మంత్రి పేరును యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కన్వినర్ నితీష్ కుమార్ సూచించనున్నట్లు సమాచారం. ► భేటీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా ప్రముఖులు రెండో రోజు పాల్గొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా నేడు సమావేశంలో పాల్గొననున్నారు. ► నిన్న సమావేశంలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ పక్క పక్కనే కూర్చున్నారు. దేశ రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించుకున్నారు.బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడినట్లు పేర్కొన్నారు. ► ప్రతిపక్షాల రెండో సమావేశాన్ని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. కర్ణాటకలో తిరుగులేని విజయం సాధించాక, అదే స్థలంలో దేశ రాజకీయాల్లోనూ విజయాన్ని కాంక్షిస్తూ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: ప్రతిపక్ష భేటీ: బీజేపీకి పోటీగా మహాకూటమి పేరు ఇదే..! -
రూ.6 వేల కోట్లతో నూతన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
► ఇతర రాష్ట్రాలతో తెలంగాణకు కనెక్టివిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. కాగా.. 3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. రూ. 2,147 కోట్ల వ్యయాన్ని జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారికి కేటాయించనున్నారు.రూ. 521 కోట్లను కాజీపేట రైల్వే వ్యాగన్‌కు వినియోగించనున్నారు. కొత్త రహదారులతో పర్యటకానికి ప్రోత్సాహం చేకూరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. 9 ఏళ్లలో తెలంగాణలో 2 వేల కిలోమీటర్ల జాతీయ రహదాలును విస్తరించగా.. 5 వేల కిలోమీటర్ల విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ► తెలంగాణ ఆర్థిక కేంద్రంగా మారబోతోందని ప్రధాని మోదీ అన్నారు. కాజీపేట రైల్యే వ్యాగన్ యూనిట్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాగ్‌పూర్- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌తో తెలంగాణ ప్రజలకు ఉపయోగం కలుగుతుందని స్పష్టం చేశారు. ► విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర గొప్పదని ప్రధాని మోదీ అన్నారు. 6 వేల కోట్లతో కొత్త జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 176 కిలోమీటర్ల జాతీయ రహదారులకు పునాది రాయి వేశారు మోదీ. ► వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గవర్నర్ తమిళి సై, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వేదికపై కూర్చున్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. ► వరంగల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గం ద్వారా భద్రకాళీ ఆలయాన్ని చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని మోదీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకోనున్నారు. ► ఓరుగల్లు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వరంగల్‌కు చేరుకున్నారు. మామునూరు ఎయిర్‌పోర్టులో దిగారు. కాసేపట్లో భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకోనున్నారు. ► వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానశ్రయంలో దిగారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో వరంగల్ చేరుకోనున్నారు. అనంతరం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. 3,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచే వరంగల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి వరంగల్‌కు బయలుదేరినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. రూ.6100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. Leaving for Warangal to attend a programme where we will inaugurate or lay the foundation stone for development works worth over Rs. 6100 crores. These works cover different sectors ranging from highways to railways. They will benefit the people of Telangana. — Narendra Modi (@narendramodi) July 8, 2023 ఇదీ చదవండి: పొలిటికల్ ట్రాక్‌పైనే.. పోరుగల్లు వ్యాగన్స్! అధికారిక సమాచారం మేరకు ప్రధాని మోదీ పర్యటన వివరాలిలా ఉన్నాయి.. ♦ శనివారం ఉదయం 7–35 గంటలకు వారణాసి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ♦ 9–25 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ♦ 9–30 గంటలకు ఎంఐ–17 హెలికాప్టర్లో హకీంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి వరంగల్‌కు బయలుదేరతారు. ♦10–15 గంటలకు మామ్నూర్లోని హెలిపాడ్‌కు చేరుకుని, రోడ్డుమార్గాన భద్రకాళి ఆలయానికి బయలుదేరతారు. ♦ 10–30 గంటల నుంచి 10–50 గంటల వరకు ఆలయంలో పూజల అనంతరం హనుమకొండలోనిఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు బయలుదేరతారు. ♦ 11–00 గంటలకు అక్కడికి చేరుకుని 11–35 గంటల వరకు వివిధ అభివృధ్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ♦ 11–40 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లోని బహిరంగ సభ వేదికకు బయలుదేరి 11–45 గంటలకు అక్కడికి చేరుకుంటారు. ♦ 11–45 నుంచి 12–20 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ♦ 12–20 నుంచి 12–30 గంటల వరకు విశ్రాంతి. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 12–50 గంటలకు హెలిపాడ్‌కు చేరుకుంటారు. ♦ 12–55 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1–40 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ♦ 1–45 గంటలకు ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌లోని బికనీర్‌కు వెళతారు. ఇదీ చదవండి: వరంగల్ పర్యటన: మోదీ సభా వేదికపై ఎనిమిది మందే.. ఎవరెవరంటే? -
తెలుగు రాష్ట్రాల్లో మరో 10 రోజులపాటు ఉష్ణతాపం
-
సీఎం జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి
-
బ్యాంక్ లాకర్ డెడ్‌లైన్: ఖాతాదారులకు బ్యాంకుల అలర్ట్..
Bank Locker Deadline: విలువైన వస్తువులు, ఆభరణాలు, పత్రాలను భద్రపరచడానికి అత్యంత సురక్షితమైన సాధనం బ్యాంక్ లాకర్ అని మనందరికీ తెలుసు. ఈ బ్యాంక్ లాకర్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి లాకర్ పరిమాణాన్ని బట్టి ఖాతాదారుల నుంచి బ్యాంకులు రుసుములు వసూలు చేస్తాయి. ఈ లాకర్లకు సంబంధించి ప్రతి బ్యాంకుకు సొంత నిబంధనలు ఉంటాయి. తాజగా బ్యాంక్ లాకర్ల వినియోగదారులకు ఎస్బీఐతో సహా అనేక బ్యాంకులు ముఖ్యమైన అలర్ట్ అందించాయి. సవరించిన లాకర్ ఒప్పందంపై జూన్ 30 లోపు సంతకం చేయడం తప్పనిసరి అని సూచించాయి. ఆర్బీఐ మార్గదర్శకాలేంటి? జనవరి 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకు లాకర్ ఒప్పంద ప్రక్రియను 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అయితే జూన్ 30 నాటికి 50 శాతం లాకర్ ఒప్పందాల పునరుద్ధరణ పూర్తవ్వాలి. ఆ తర్వాత సెప్టెంబరు 30 నాటికి 75 శాతం, డిసెంబర్ 31 నాటికి 100 శాతం పూర్తవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ సహా అనేక బ్యాంకులు లాకర్ ఒప్పందాలు పూర్తి చేయాలని కస్టమర్లకు అలర్ట్‌లు పంపిస్తున్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా 2021 ఫిబ్రవరిలో ఆర్బీఐ ఈ ఆదేశాలను జారీ చేసింది. తర్వాత 2021 ఆగస్టులో లాకర్ ఒప్పంద నియమాలను సవరించింది. ఎటువంటి చార్జ్ లేకుండా.. బ్యాంకుల్లో కొత్త లాకర్లను పొందే కస్టమర్ల కోసం ఒప్పంద నియమాలు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే లాకర్లు కలిగిన కస్టమర్లు ఒప్పంద ప్రక్రియను 2023 జనవరి 1 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా చాలా మంది కస్టమర్లు సవరించిన ఒప్పందాలను పూర్తి చేయలేదు. దీంతో ఆర్బీఐ గడువును 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి ఎటువంటి చార్జ్‌లు వసూలు చేయకుండా స్టాంప్ పేపర్‌పై ఒప్పందాలను పూర్తి చేయాలి. లాకర్ నిబంధనలు ఇవే.. బ్యాంక్ లాకర్లు వివిధ నియమ నిబంధనలకు లోబడి ఉంటాయి. వర్షాలు, వరదలు, భూకంపం, పిడుగులు పడటం వంటి విపత్తులు, అల్లర్లు, తీవ్రవాద దాడుల వంటి ఘటనల కారణంగా లాకర్‌కు కలిగే నష్టానికి బ్యాంకులు బాధ్యత వహించవు. అయితే లాకర్ భద్రతను నిర్ధారించడం బ్యాంక్ బాధ్యత. అగ్నిప్రమాదం, దొంగతనం, చోరీలు, దోపిడీలు, భవనం కూలడం, బ్యాంకు నిర్లక్ష్యం, బ్యాంకు ఉద్యోగులు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన సందర్భాల్లో మాత్రం బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన -
నయనతారకు చెక్ పెడుతున్న త్రీష
-
ఫాస్ట్ లుక్ పోస్టర్ల పై దారుణమైన ట్వీట్స్
-
IPL 2023: సన్‌రైజర్స్‌పై లక్నో ఘన విజయం
సన్‌రైజర్స్‌పై లక్నో ఘన విజయం ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ కథ ముగిసింది. లక్నోతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో నాలుగు బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 16 ఓవర్ల వరకు తమ వైపే ఉన్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్ బౌలర్ అభిషేక్ శర్మ పువ్వుల్లో పెట్టి ప్రత్యర్ధికి అప్పజెప్పాడు. ఆ ఓవర్లో అభిషేక్ 31 పరుగులు (స్టోయినిస్ 2 సిక్సర్లు, పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు) సమర్పించుకోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి, లక్నో వైపు మలుపు తిరిగింది. పూరన్ (13 బంతుల్లో 4 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (45 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లలో వరుసగా 14, 10, 10, 6 పరుగులు రాబట్టి లక్నోను విజయతీరాలకు చేర్చారు. లక్నో గెలుపులో స్టోయినిస్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం తన వంతు పాత్ర పోషించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో అభిషేక్ శర్మ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన అనంతరం స్టోయినిస్ (40) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. డికాక్ ఔట్ మయాంక్ మార్కండే బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి డికాక్ (29) ఔటయ్యాడు. 8.2 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 54/2. ప్రేరక్ మన్కడ్ (21) క్రీజ్‌లో ఉన్నాడు. టార్గెట్ 183.. ఆచితూచి ఆడుతున్న లక్నో ప్లేయర్లు 183 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో ఓవర్లోనే కైల్ మేయర్స్ (14 బంతుల్లో 2) వికెట్ పోగొట్టుకున్న లక్నో.. మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది. 8 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 50/1గా ఉంది. డికాక్ (25), ప్రేరక్ మన్కడ్ (21) క్రీజ్‌లో ఉన్నారు. లక్నోతో మ్యాచ్.. సన్‌రైజర్స్ స్కోర్ ఎంతంటే..? టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్లాసెన్ (29 బంతుల్లో 47) ఔటయ్యాడు. 19 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 173/6. అబ్దుల్ సమద్ (30), భువనేశ్వర్ క్రీజ్‌లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. కృనాల్ వేసిన 13వ ఓవర్ తొలి రెండు బంతులకు మార్క్రమ్, ఫిలిప్స్ ఔటయ్యారు. 13 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 117/5. నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ కృనాల్ బౌలింగ్‌లో మార్క్రమ్ (28) స్టంపౌటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ 82 పరుగుల వద్ద సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36)ను అమిత్ మిశ్రా కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. 11 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 101/3. మార్క్రమ్ (27), క్లాసెన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ ధాటిగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి (13 బంతుల్లో 20; 4 ఫోర్లు) యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 56/2. మార్క్రమ్, అన్మోల్ప్రీత్ సింగ్ (25) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ మూడో ఓవర్ తొలి బంతికి వికెట్ కోల్పోయింది. యద్ధ్వీర్ సింగ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (7) ఔటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ ఐపీఎల్ 2023లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (మే 13) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. తుది జట్లు: సన్‌రైజర్స్: ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్ హక్ ఫారూఖీ, టి నటరాజన్ లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, యశ్ ఠాకూర్, యుద్ధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ -
వీడియో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు లైవ్
-
DC VS CSK: ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే విజయం
ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే విజయం ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే రెండు పరాజయాల తర్వాత మళ్లీ విజయాల బాట పట్టింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 140 పరుగులు సాధారణ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. డెవన్ కాన్వే 44 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేసి ఔటవ్వగా.. ఆఖర్లో శివమ్ దూబే 18 బంతుల్లో 26 నాటౌట్ సీఎస్కేను గెలిపించాడు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. ట్రిస్టన్ స్టబ్స్, ఆకాశ్ మద్వాల్లు చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే గెలుపు వాకిట సీఎస్కే వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే (44) ఔటయ్యాడు. సీఎస్కే గెలుపుకు 20 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే అంబటి రాయుడు (*2) మరో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో రాఘవ్ గోయల్‌కు క్యాచ్ ఇచ్చి రాయుడు ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 119/3. కాన్వే (38), శివమ్ దూబే (13) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్‌లో రహానే (21) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 11 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 88/2. కాన్వే (29), రాయుడు (3) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 140.. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే ధాటిగా ఆడుతున్న రుతురాజ్.. 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐదో ఓవర్ తొలి బంతికి పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 50/1. కాన్వే (15), రహానే (3) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 140.. రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత 140 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సీఎస్కే ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. కాన్వే (10) ఆచితూచి ఆడుతుంటే.. రుతురాజ్ గైక్వాడ్ (30) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫలితంగా సీఎస్కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై.. చెన్నై టార్గెట్ ఎంతంటే..? టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. సీఎస్కే బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. మతీష పతిరణ 3 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. దీపక్ చాహర్, తుషార్ తలో 2 వికెట్లు, జడేజా ఓ వికెట్ పడగొట్టారు. నేహల్ వధేరా (64) హాఫ్ సెంచరీతో రాణించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్‌తో పాటు సూర్యకుమార్ (26), ట్రిస్టన్ స్టబ్స్ (20) రెండంకెల స్కోర్‌తో రాణించారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ముంబై 137 పరుగుల వద్ద ముంబై ఎనిమిదో వికెట్ కోల్పోయింది. పతిరణ బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (20) ఔటయ్యాడు. అంతకుముందు ఇదే ఓవర్లో అర్షద్ ఖాన్ (1) ఔటయ్యాడు. ముంబై నాలుగో వికెట్ డౌన్ 69 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (26) క్లీన్ బౌల్డయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్, నేహల్ (27) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ మరోసారి డకౌట్.. ముంబై స్కోర్ 16/3 ఐపీఎల్లో రోహిత్ శర్మ రికార్డు స్థాయిలో 16వ సారి డకౌటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 16/3. సూర్యకుమార్, నేహల్ వధేరా క్రీజ్‌లో ఉన్నారు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ (7) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. గ్రీన్ ఔట్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో గ్రీన్ (6) క్లీన్‌బౌల్డయ్యాడు. 2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 13/1. రోహిత్, ఇషాన్ కిషన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (మే 6) మధ్యాహ్నం 3: 30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. సీఎస్కే: ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మతీష పతిరణ, తుషార్ దేశ్‌పాండే. ముంబై: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, సూర్యకుమార్ యాదవ్, కెమారూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, ఆర్షద్ ఖాన్ -
రెచ్చిపోయిన రషీద్ ఖాన్.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం
రెచ్చిపోయిన రషీద్ ఖాన్.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 13.5 ఓవర్లలో గిల్ వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (41 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (36) రాణించగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్ధిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్ వికెట్ చహల్‌కు దక్కింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లతో రెచ్చిపోగా, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. రాజస్ణాన్ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 71 పరగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో గిల్ (36) స్టంపౌటయ్యాడు. లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న గుజరాత్ 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నారు. గిల్ (27), సాహా (27) నిలకడగా ఆడుతుండటంతో ఆ జట్టు 7 ఓవర్లలో 57 పరుగులు చేసింది. టార్గెట్ 119.. నిలకడగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లు 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. సాహా (23) కాస్త వేగంగా ఆడుతుంటే గిల్ (13) ఆచితూచి ఆడుతున్నాడు. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 39/0. తిప్పేసిన స్పిన్నర్లు.. 118 పరుగులకే కుప్పకూలిన రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. రాజస్ణాన్ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో హెట్‌మైర్ (7) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో రాజస్థాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఏడో వికెట్ డౌన్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో దృవ్ జురెల్ (9) ఔట్ కావడంతో రాజస్థాన్ ఏడో వికెట్ కోల్పోయింది. ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో పడిక్కల్ (12) క్లీన్ బౌల్డ్ కావడంతో రాజస్థాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 82/6. హెట్‌మైర్ (4), దృవ్ జురెల్ (5) క్రీజ్‌లో ఉన్నారు. 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాజస్థాన్ 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్ (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పడిక్కల్ (10), హైట్‌మైర్ క్రీజ్‌లో ఉన్నారు. కష్టాల్లో రాజస్థాన్.. 63 పరుగులకే 4 వికెట్లు డౌన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ కకష్టాల్లో చిక్కుకుంది. ఆ జట్టు 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. జాషువ లిటిల్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (30) ఔట్ కాగా, ఆ మరుసటి ఓవర్లోనే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అశ్విన్ (2) క్లీన్ బౌల్డయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 63/4. పడిక్కల్ (7)రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. యశస్వి ఔట్ రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (14) రనౌటయ్యాడు. 5.3 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 48/2. సంజూ శాంసన్ (24), పడిక్కల్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి బట్లర్ (8) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత రాజస్తాన్ స్కోర్ 12/1. యశస్వి (1), సంజూ శాంసన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఐపీఎల్-2023లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (మే 5) రాజస్థాన్ రాయల్స్- గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్, షిమ్రోన్ హెట్‌మైర్, దృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, ఆడమ్ జంపా, చహల్ గుజరాత్ టైటాన్స్: హార్ధిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, జాషువ లిటిల్, మోహిత్ శర్మ -
లక్నోపై ఆర్సీబీ సంచలన విజయం.. 127 పరుగులను ఛేదించలేక..!
లక్నోపై ఆర్సీబీ సంచలన విజయం.. 127 పరుగులను ఛేదించలేక..! ఐపీఎల్ 2023 సీజన్లో మరో సంచలనం నమోదైంది. ఈ సీజన్లో అసాధ్యమనుకున్న టార్గెట్లను కొన్ని జట్లు ఛేదించి, అద్భుత విజయాలు సాధించగా.. ఇవాళ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అతి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని సంచలన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కోహ్లి (31), డుప్లెసిస్ (44), దినేశ్ కార్తీక్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ 3, బిష్ణోయ్, అమిత్ మిశ్రా తలో 2, కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యఛేదనలో ఆది నుంచే తడబడుతూ వచ్చిన లక్నో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి 108 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యాన్ని సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్ చేసుకున్న ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో ఇన్నింగ్స్‌లో కృష్ణప్ప గౌతమ్ (23) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ, హాజిల్‌వుడ్ తలో 2 వికెట్లు, సిరాజ్, మ్యాక్స్‌వెల్, హసరంగ, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఇద్దరు రనౌటయ్యారు. ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ కూడా లక్నోను గెలిపించలేకపోయాడు. ఓటమి దిశగా లక్నో స్వల్ప లక్ష్య ఛేదనలో చతికిలపడిన లక్నో ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. బిష్ణోయ్ (5) రనౌటయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన లక్నో 66 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. భారీ షాట్లు ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్ (23)రనౌటయ్యాడు. 65 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన లక్నో 65 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో సుయాశ్‌కు క్యాచ్ ఇచ్చి డేంజరెస్ స్టోయినిస్ (13) ఔటయ్యాడు. 11 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 65/6. కృష్ణప్ప గౌతమ్ (22), బిష్ణోయ్ క్రీజ్‌లో ఉన్నారు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన లక్నో స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కర్ణ శర్మ బౌలింగ్‌లో లోమ్రార్‌కు క్యాచ్ ఇచ్చి పూరన్ (9) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 53/5. స్టోయినిస్ (10), కృష్ణప్ప గౌతమ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 127.. లక్నో 27/4 127 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హసరంగ బౌలింగ్‌లో హుడా (1) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. దినేశ్ కార్తీక్ అద్భుతమైన స్టంపింగ్ చేసి హుడాను పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత లక్నో స్కొర్ 34/4. స్టోయినిస్ (6), పూరన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 127.. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లక్నో 127 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో సైతం వడివడిగా వికెట్లు కోల్పోతుంది. 5 బంతుల వ్యవధిలో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత కృనాల్ పాండ్యా (14) ఆతర్వాత ఆయుష్ బదోని (4) పెవిలియన్‌కు చేరారు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కృనాల్.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో బదోని ఔటయ్యారు. టార్గెట్ 127.. రెండో బంతికే వికెట్ కోల్పోయిన లక్నో 127 పరుగుల స్వల్ప లక్ష్య ఛేనదలో లక్నో రెండో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్ డకౌటయ్యాడు. ఆర్సీబీ చెత్త ఆటతీరు.. లక్నో టార్గెట్ 127 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ చెత్త ఆటతీరు ప్రదర్శించింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోహ్లి (31), డుప్లెసిస్ (44), దినేశ్ కార్తీక్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ 3, బిష్ణోయ్, అమిత్ మిశ్రా తలో 2, కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు. 7 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. ఆర్సీబీ 7 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. నవీన్ ఉల్ హాక్ బౌలింగ్‌లో లోమ్రార్ (3), దినేశ్ కార్తీక్ (16) రనౌట్, నవీన్ ఉల్ హాక్ బౌలింగ్‌లో వరస బంతుల్లో కర్ణ శర్మ (2), సిరాజ్ (0) ఔటయ్యారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్ ఔట్ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో డుప్లెసిస్ (44) ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకుని డెప్లెసిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 110/5. క్రీజ్‌లో కార్తీక్ (13), లోమ్రార్ (1) ఉన్నారు. వర్షం అంతరాయం 15.2 ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. డుప్లెసిస్ (40), కార్తీక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. జట్టు స్కోర్ 93/4. పెవిలియన్‌కు క్యూ కడుతున్న ఆర్సీబీ ఆటగాళ్లు.. నాలుగో వికెట్ డౌన్ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టడంతో సుయాశ్ ప్రభుదేశాయ్ (6) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 92/4. డుప్లెసిస్ (39), దినేశ్ కార్తీక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. కష్టాల్లో ఆర్సీబీ.. మూడో వికెట్ డౌన్ 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కష్టాల్లో చిక్కుకుంది. బిష్ణోయ్ మరోసారి మాయ చేశాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయన మ్యాక్సీ (4) అది మిస్ కావడంతో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 82/3. డుప్లెసిస్ (35), సుయాశ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. రావత్ ఔట్ కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో అనుజ్ రావత్ (9) ఔటయ్యాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రావత్.. కైల్మేయర్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 78/2. డుప్లెసిస్ (33), మ్యాక్స్‌వెల్ (3) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ రవి బిష్ణోయ్ పన్నిన ఉచ్చులో విరాట్ కోహ్లి (31) చిక్కాడు. కింగ్ భారీ షాట్ ఆడేందుకు ముందుకు వస్తున్నాడని ముందే పసిగట్టిన బిష్ణోయ్ తెలివిగా ఔట్ ఆఫ్ ద హాఫ్ స్టంప్ బంతిని సంధించాడు. కోహ్లి బంతిని కనెక్ట్ చేసుకోలేకపోగా, వికెట్ కీపర్ పూరన్ అలర్ట్‌గా ఉండి స్టంపింగ్ చేశాడు. దీంతో కోహ్లి పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 62/1. డుప్లెసిస్ (29), అనుజ్ రావత్ క్రీజ్‌లో ఉన్నారు. నిదానంగా ఆడుతున్న కోహ్లి, డుప్లెసిస్.. 6 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లి (21), డుప్లెసిస్ (21) నిదానంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ఆర్సీబీ 3 ఫోర్లు, ఓ సిక్సర్ మాత్రమే కొట్టింది. కృనాల్ పాండ్యా (3-0-14-0) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో వేదికగా ఇవాళ (మే 1) లక్నో సూపర్ జెయింట్స్-ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. ఆర్సీబీ: విరాట్ కోహ్లి, డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్‌రావత్, మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్ లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హాక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్ -
RCB VS RR: ఉత్కంఠపోరు.. రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం
ఉత్కంఠపోరు.. రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా. యశస్వి జైశ్వాల్ 47, ద్రువ్ జురేల్ 34 నాటౌట్ చివరి వరకు నిలిచినప్పటికి రాజస్తాన్‌ను గెలిపించలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్‌లు చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (22) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ 108 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లి క్యాచ్ అందుకోవడంతో యశస్వి జైస్వాల్ (47) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 108/3. సంజూ శాంసన్ (7), హెట్‌మైర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. పడిక్కల్ (52) ఔట్ విల్లే బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి పడిక్కల్ ఔటయ్యాడు. బాధ్యతగా ఆడుతున్న జైస్వాల్, పడిక్కల్ ఒక్క పరుగు వద్దే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. ఆ తర్వాత వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. యశస్వి జైస్వాల్ (42), దేవ్‌దత్ పడిక్కల్ (39) బాధ్యతగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. 9 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 81/1గా ఉంది. సిరాజ్ సింహ గర్జన.. బట్లర్ క్లీన్ బౌల్డ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అదరగొడుతున్న సిరాజ్ ఇవాల్టి మ్యాచ్‌లోనూ చెలరేగాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే సిరాజ్ బట్లర్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాక్సీ, డుప్లెసిస్ మెరుపులు.. అయినా భారీ స్కోర్ చేయలేకపోయిన ఆర్సీబీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ మరోసారి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. డుప్లెసిస్ (39 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన పార్ట్నర్షిప్ తర్వాత కూడా ఆ జట్టు భారీ స్కోర్ చేయలేక చతికిలపడింది. ఆ జట్టు 45 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి దారుణంగా నిరాశపర్చింది. కోహ్లి (0), షాబాజ్ అహ్మద్ (2), లోమ్రార్ (8), దినేశ్ కార్తీక్ (16), ప్రభుదేశాయ్ (0), హసరంగ (6) విజయ్‌కుమార్ వైశాఖ్ (0) గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ అత్యంత దారుణంగా ఆడటమే కాకుండా ఇద్దరు రనౌట్ కావడంతో కీలకపాత్ర పోషించాడు. పెవిలియన్‌కు క్యూ కడుతున్న ఆర్సీబీ బ్యాటర్లు 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి పటిష్టంగా ఉండిన ఆర్సీబీ.. ఆతర్వాత పేకమేడలా కూలిపోతుంది. డుప్లెసిస్ (62) రనౌట్‌తో ఆర్సీబీ పతనం మొదలైంది. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (77), చహల్ బౌలింగ్‌లో లోమ్రార్ (8) పెవిలియన్ బాట పట్టారు. అదే ఓవర్లో (17) ప్రభుదేశాయ్ (0) కూడా రనౌటయ్యాడు. 24 పరుగుల వ్యవధిలో ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయింది. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 164/6గా ఉంది. దినేశ్ కార్తీక్ (3), హసరంగ (1) క్రీజ్‌లో ఉన్నారు. చితక్కొడుతున్న మ్యాక్సీ, డుప్లెసిస్ మ్యాక్స్‌వెల్ (35 బంతుల్లో 64), డుప్లెసిస్ (34 బంతుల్లో 56) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 128/2గా ఉంది. ధాటిగా ఆడుతున్న మ్యాక్సీ, డుప్లెసిస్ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆర్సీబీని మ్యాక్స్‌వెల్ (19 బంతుల్లో 40), డుప్లెసిస్ (18 బంతుల్లో 30) ఆదుకుంది. వీరిద్దరు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. 7 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 72/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 12 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో జైస్వాల్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి షాబాజ్ అహ్మద్ (2) ఔటయ్యాడు. తొలి బంతికే కోహ్లి ఔట్.. గోల్డెన్ డక్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి తొలి బంతికే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కోహ్లి తొలి బంతికే బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 23) మధ్యాహ్నం 3: 30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. ఆర్సీబీ: విరాట్ కోహ్లి (కెప్టెన్), డుప్లెసిస్, మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైశాఖ్ రాజస్థాన్: సంజూ శాంసన్ (కెప్టెన్), బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్‌మైర్, దృవ్ జురెల్, అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చహల్ -
LSG VS GT: గుజరాత్ సంచలన విజయం
లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏడు పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయి చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన దశలో మోహిత్ శర్మ సూపర్ బౌలింగ్ వేశాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా.. ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగా.. ఇందులో మోహిత్ రెండు వికెట్లు తీయగా.. మిగతా రెండు రనౌట్ల రూపంలో వచ్చాయి. కేఎల్ రాహుల్ 68 పరుగులు చేసినప్పటికి జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్, మోహిత్ శర్మలు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో గుజరాత్, లక్నో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఒక్క పరుగు మాత్రమే చేసిన పూరన్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం లక్నో విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు కావాలి. కృనాల్ పాండ్యా ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన లక్నో 23 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రాహుల్ 60, పూరన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. లక్నో విజయానికి 24 బంతుల్లో 27 పరుగులు కావాలి. విజయానికి దగ్గరలో లక్నో సూపర్‌జెయింట్స్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ విజయానికి దగ్గరైంది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ప్రస్తుతం వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 56, కృనాల్ పాండ్యా 23 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. మేయర్స్ (24) ఔట్ 136 పరుగుల లక్ష్య ఛేదనలో 55 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్ (24 ) ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 55/1గా ఉంది. టార్గెట్ 136.. 5 ఓవర్లలో 46/0 136 పరుగుల అతి సాధారణ లక్ష్య ఛేదనలో లక్నో ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు వికెట్ నష్టాపోకుండా 46 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (25), కైల్ మేయర్స్ (21) బ్యాట్‌ను ఝులిపిస్తున్నారు. రాణించిన లక్నో బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన గుజరాత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. వృద్ధిమాన్ సాహా (47), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (66) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ (4-0-19-1), కృనాల్ పాండ్యా (4-0-16-2) స్టోయినిస్ (3-0-20-2), అమిత్ మిశ్రా (2-0-9-1) సత్తా చాటారు. హార్ధిక్ ఔట్ స్టోయినిస్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ పట్టడంతో హర్ధిక్ పాండ్యా (66) ఔటయ్యాడు. విజయ్ శంకర్ క్లీన్ బౌల్డ్.. నాలుగో వికెట్ డౌన్ నవీన్ ఉల్ హాక్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ (10) క్లీన్ బౌల్డయ్యాడు. నవీన్ ఉల్ హాక్కు ఇది ఐపీఎల్లో తొలి వికెట్. 15 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 92/4గా ఉంది. హార్ధిక్ (32), మిల్లర్ క్రీజ్‌లో ఉన్నారు. సూపర్ క్యాచ్.. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో నవీన్ ఉల్ హాక్ సూపర్ క్యాచ్ పట్టడంతో అభినవ్ మనోహర్ (3) ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 78/2. హార్ధిక్ (27), విజయ్ శంకర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సాహా ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన సాహా.. దీపక్ హుడాకు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 75/2గా ఉంది. హార్ధిక్ (26), అభినవ్ మనోహర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. నత్తనడకన సాగుతున్న గుజరాత్ బ్యాటింగ్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయిన గుజరాత్.. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతుంది. హార్దిక్ (10 బంతుల్లో 6) నిదానంగా ఆడుతూ బోర్ కొట్టిస్తుండగా.. సాహా (24 బంతుల్లో 34) కాస్త ధాటిగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 40/1. గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే షాక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కృనాల్ పాండ్యా వేసిన రెండో ఓవర్లోనే శుభ్‌మన్ గిల్ (0) ఔటయ్యాడు.3 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 13/1. సాహా (9), హార్ధిక్ (4) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 22 మధ్యాహ్నం 3:30 గంటలకు) లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, నవీన్ ఉల్ హాక్, రవి బిష్ణోయ్ -
ఇద్దరు ఇద్దరే.. అదిరిపోయే ప్లానింగ్ తో దూసుకుపోతున్న రామ్, తారక్
-
వాట్సాప్ లో మరో అదిరిపోయే అప్డేట్..
-
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 46, జితేశ్ శర్మ 41 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హసరంగా రెండు వికెట్లు, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్‌లు చెరొక వికెట్ తీశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్ 147 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న పంజాబ్.. ఏడో వికెట్ డౌన్ 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఓటమి దిశగా పయనిస్తుంది. హసరంగ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ (7) స్టంపౌటయ్యాడు. 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్ పంజాబ్ రనౌట్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది. హసరంగ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో సామ్ కర్రన్ (10) ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. సిరాజ్ సూపర్ త్రో.. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి జోరుమీదున్న సిరాజ్, మరో అద్భుతమైన డైరెక్ట్ త్రోతో హర్‌ప్రీత్ సింగ్ (13) పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 49/4. సామ్ కర్రన్, ప్రభ్‌సిమ్రన్ (21) క్రీజ్‌లో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్నాడు. తన స్పెల్‌లో వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. తొలుత రివ్యూవి వెళ్లే అథర్వ వికెట్ (ఎల్బీ)ను దక్కించుకున్న సిరాజ్.. ఆతర్వాత 4వ ఓవర్లో కూడా రివ్యూకి వెళ్లి లివింగ్‌స్టోన్‌ను ఔట్ (ఎల్బీ) చేశాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ మూడో ఓవర్ తొలి బంతికి రెండో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (8) క్లీన్ బౌల్డయ్యాడు. టార్గెట్ 175.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో అథర్వ టైడే (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాణించిన డుప్లెసిస్, కోహ్లి.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..? టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. వరుస బంతుల్లో కోహ్లి (59), మ్యాక్స్‌వెల్ (0) ఔట్ కావడం.. స్కోర్ వేగం పెంచే క్రమంలో డుప్లెసిస్ (84) కూడా పెవిలియన్‌కు చేరడం.. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ (7 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చెత్తగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్‌కే పరిమితమైంది. హర్‌ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. డుప్లెసిస్ (84) ఔట్ ఇల్లిస్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన మరుసటి బంతికే డుప్లెసిస్ (84) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 154/3. లోమ్రార్, కార్తీక్ (3) క్రీజ్‌లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ ఔట్ ఆర్సీబీకి వరుస షాక్‌లు తగిలాయి. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో విరాట్ కోహ్లి (59), మ్యాక్స్‌వెల్ (0) ఔటయ్యారు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 145/2. డుప్లెసిస్ (78), దినేశ్ కార్తీక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. కోహ్లి హాఫ్ సెంచరీ.. 14 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? 40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 118/0. కోహ్లికు జతగా డుప్లెసిస్ (65) క్రీజ్‌లో ఉన్నాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన డుప్లెసిస్ ఆర్సీబీ ఓపెనర్ డుప్లెసిస్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్లో డుప్లెసిస్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఓవరాల్‌గా 29వ ఐపీఎల్ ఫిఫ్టి. 11 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 98/0. డుప్లెసిస్‌కు జతగా కోహ్లి (39) క్రీజ్‌లో ఉన్నాడు. ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్, కోహ్లి ఆర్సీబీ ఓపెనర్లు డుప్లెసిస్ (27), విరాట్ కోహ్లి (29) ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి ఆర్సీబీ 5.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు దాటింది. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 59/0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. పంజాబ్ కింగ్స్: అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఇల్లీస్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్, విరాట్ కోహ్లి (కెప్టెన్), మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, సుయాష్ ప్రభుదేశాయ్, సిరాజ్ -
MI VS KKR: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 58, సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 43, తిలక్ వర్మ 25 బంతుల్లో 30 పరుగులు, టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 23 పరుగులు నాటౌట్ సమిష్టిగా రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. కేకేఆర్ బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, లోకీ ఫెర్గూసన్‌లు తలా ఒక వికెట్ తీశారు. సీజన్లో ముంబైకిది వరుసగా రెండో విజయం కాగా.. కేకేఆర్‌కు వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. విజయం దిశగా ముంబై ఇండియన్స్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై విజయానికి దగ్గరైంది. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో ఉంది. తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్.. మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో తిలక్ వర్మ (30) క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 148/3. సూర్యకుమార్ యాదవ్ (30), టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉన్నారు. ఇషాన్ కిషన్ (58) క్లీన్ బౌల్డ్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 58 పరుగులు చేసిన అనంతరం ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఇషాన్ క్లీన్ బౌల్డయ్యాడు. ఉమేశ్ సూపర్ క్యాచ్.. హిట్‌మ్యాన్ ఔట్ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో మిడ్ ఆఫ్‌లో ఉమేశ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (43) జతగా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 65/1. టార్గెట్ 186.. ధాటిగా ఆడుతున్న రోహిత్, ఇషాన్ 186 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 57 పరుగులు రాబట్టింది. ఇషాన్ కిషన్ (15 బంతుల్లో 42; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతనికి జతగా రోహిత్ శర్మ (9 బంతుల్లో 13; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ.. ముంబై టార్గెట్ ఎంతంటే..? ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16 మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కేఆర్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5), శార్దూల్ ఠాకూర్ (13), రింకూ సింగ్ (18) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఆఖర్లో రసెల్ (21 నాటౌట్) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గ్రీన్, పియూష్ చావ్లా, జన్సెన్. మెరిడిత్ తలో వికెట్ దక్కించుకున్నారు. రింకూ సింగ్ ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్ జన్సెన్ బౌలింగ్‌లో నేహల్‌కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ (18) ఔటయ్యాడు. అయ్యర్ ఔటయ్యాక స్కోర్ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. శతక్కొట్టి ఔటైన వెంకటేశ్ అయ్యర్ సెంచరీ తర్వాత కేవలం ఒకే ఒక ఫోర్ కొట్టిన అయ్యర్.. 104 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. మెరిడిత్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. వెంకటేశ్ అయ్యర్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా కలిపి కేవలం 2 ఫోర్లు కొడితే, ఒక్క వెంకటేశ్ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం. తిలక్ వర్మ సూపర్ క్యాచ్.. శార్దూల్ ఠాకూర్ ఔట్ తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో శార్దూల్ ఠాకూర్ (13) పెవిలియన్ బాట పట్టాడు. తద్వారా 123 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ (86) దుమ్మురేపుతున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్ హార్ఢ్ హిట్టర్ వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం స్పీడ్ పెంచిన అయ్యర్.. ఇంకా ధాటిగా ఆడుతున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. 11 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 104/3. అయ్యర్, శార్దూల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. నితీశ్ రాణా ఔట్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీశ్ రాణా (5) హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8.1 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 73/3. వెంకటేశ్ అయ్యర్ (49) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 57 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి గుర్భాజ్ (8) ఔటయ్యాడు. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ (39) ధాటిగా ఆడుతున్నాడు. నితీశ్ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 57/2. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. జగదీశన్ ఔట్ రెండో ఓవర్లోనే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. గ్రీన్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్ క్యాచ్ పట్టడంతో ఎన్ జగదీశన్ (0) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 12/1. రహ్మానుల్లా గుర్బాజ్ (5), వెంకటేశ్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. రోహిత్ ఔట్, అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) జరుగనున్న డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కడుపు నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కాగా, అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే ఈ మ్యాచ్ ద్వారా సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జన్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. తుది జట్లు.. ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, కెమారూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పియుశ్ చావ్లా, డ్యుయాన్ జన్సెన్, రిలే మెరిడిత్ కేకేఆర్: రహ్మానుల్లా గుర్భాజ్, వెంకటేశ్ అయ్యర్, ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి -
దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
-
పూరన్ ఊచకోత.. ఆఖర్లో హైడ్రామా.. చివరి బంతికి లక్నో థ్రిల్లింగ్ విక్టరీ
పూరన్ ఊచకోత.. ఆఖర్లో హైడ్రామా.. చివరి బంతికి లక్నో థ్రిల్లింగ్ విక్టరీ గుజరాత్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ సృష్టించిన విధ్వంసాన్ని మరువకముందే మరో రెండు బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌లు నమోదయ్యాయి. ఆర్సీబీతో మ్యాచ్‌లో 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నోను తొలుత స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత పూరన్ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్‌లు ఆ జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. వీరిద్దరి సిక్సర్ల సునామీ ధాటికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్ద అయ్యింది. ఆఖర్లో పూరన్ ఔటయ్యాక లక్నో శిబిరంలో కాస్త అలజడి మొదలైనప్పటికీ బదోని (30) అద్భుతమైన షాట్లు ఆడి తన జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే ఇక్కడే హైడ్రామా చోటు చేసుకుంది. 19వ ఓవర్ నాలుగో బంతికి పార్నెల్ బౌలింగ్‌లో బదోని సిక్సర్ బాది, హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లక్నో గెలుస్తుందా లేదా అన్న సందేహం మొదలైంది. అయితే చివరి బంతికి బై రావడంతో లక్నో గెలిచింది. ఫలితంగా ఆ జట్టు వికెట్ తేడాతో విజయం సాధించింది. దడ పుట్టిస్తున్న పూరన్.. 15 బంతుల్లోనే ఫిఫ్టి 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకున్న లక్నోకు పూరన్ జీవం పోస్తున్నాడు. ఈ విండీస్ బ్యాటర్ కేవలం 15 బంతుల్లోనే 51 పరుగులు చేసి విధ్వంసం కొనసాగిస్తున్నాడు. 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన లక్నో భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో 105 పరుగులకే సగం వికెట్లు (11.1 ఓవర్లలో) కోల్పోయింది. నాలుగు బంతుల వ్యవధిలో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత సిరాజ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (18) ఔటయ్యారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన లక్నో.. దీపక్ హుడా, పాండ్యా ఔట్ వేన్ పార్నెల్ వేసిన 4వ ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్లు కోల్పోయింది. దీపక్ హుడా (9), కృనాల్ పాండ్యా (0) ఔటయ్యారు. 4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 23/3. కేఎల్ రాహుల్ (8), స్టోయినిస్ క్రీజ్‌లో ఉన్నారు. మూడో బంతికే వికెట్ తీసిన సిరాజ్ 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో మూడో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్ తర్వాత లక్నో స్కోర్ 5/1గా ఉంది. కేఎల్ రాహుల్ (0), దీపక్ హుడా (0) క్రీజ్‌లో ఉన్నారు. కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోర్ తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. అమిత్ మిశ్రా, మార్క్ వుడ్‌కు తలో వికెట్ దక్కింది. 19 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 203/1 డుప్లెసిస్ (45 బంతుల్లో 78 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా ఆర్సీబీ విరాట్ కోహ్లి ఔటయ్యాక కూడా ఆర్సీబీ ఏమాత్రం తగ్గట్లేదు. డుప్లెసిస్ (34 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు ), మ్యాక్స్‌వెల్ (12 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టిస్తున్నారు. బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో ఈ ఇద్దరు 3 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ 15 ఓవర్ల తర్వాత 137/1గా ఉంది. విరాట్ కోహ్లి (61) ఔట్ 96 పరుగుల స్కోర్ వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డుప్లెసిస్ (31), మ్యాక్స్‌వెల్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లి 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఆచితూచి ఆడుతున్న డుప్లెసిస్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 8.4 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 71/0. వీర బాదుడు బాదుతున్న విరాట్ కోహ్లి ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. కింగ్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 56/0. కోహ్లికి జతగా డుప్లెసిస్ (12) క్రీజ్‌లో ఉన్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో ఐపీఎల్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు పలు మార్పులు చేశాయి. ఎల్ఎస్జీ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలువగా.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ పరాజయంతో ఏడో ప్లేస్‌లో ఉంది. తుది జట్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, అనూజ్ రావత్, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్ లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్, ఆవేశ్ ఖాన్ -
ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. కేకేఆర్ సంచలన విజయం
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ సంచలన విజయం సాధించింది. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరమయ్యాయి. యష్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతిని ఉమేశ్ యాదవ్ సింగిల్ తీసి రింకూ సింగ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఇక్కడి నుంచే రింకూ సింగ్ విధ్వంసం మొదలైంది. చివరి ఐదు బంతులను ఐదు సిక్సర్లుగా మలిచి కేకేఆర్‌కు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో రింకూ సింగ్ 21 బంతుల్లోనే 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకముందు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 40 బంతుల్లో 80 పరుగులు చేసి కేకేఆర్ విజయానికి బాటలు వేశాడు. అయితే ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ నమోదు చేసి మ్యాచ్‌ను గుజరాత్ వైపు టర్న్ చేశాడు. అయితే యశ్ దయాల్ ఆఖరి ఓవర్లో చెత్తగా బౌలింగ్ చేసి మ్యాచ్ ఓటమికి కారణమయ్యాడు. 5 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయిన కేకేఆర్, రషీద్ ఖాన్ హ్యాట్రిక్ నిమిషాల వ్యవధిలో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. గెలుపు దిశగా సాగుతున్న కేకేఆర్ 5 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకునేలా ఉంది. రషీద్ ఖాన్ వరుస బంతుల్లో రసెల్, నరైన్, శార్దూల్ వికెట్లు పడగొట్టి, ఈ సీజన్ తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ఔట్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం (83) సృష్టించిన వెంకటేశ్ అయ్యర్.. అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో గిల్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 155/4. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. కెప్టెన్ ఔట్ ధాటిగా ఆడుతున్న కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి రాణా పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 132/3. ధాటిగా ఆడుతున్న అయ్యర్, రాణా 205 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే 2 వికెట్లు కోల్నోయిన కేకేఆర్... వికెట్లు పడ్డా ఏమాత్రం తగ్గకుండా ధాటిగా బ్యాటింగ్ చేస్తుంది. వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ నితీశ్‌రాణా (24 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 12 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 116/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 28 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. జాషువ లిటిల్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి జగదీశన్ (6) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 28/2. యశ్ దయాల్ సెన్సేషనల్ క్యాచ్.. కేకేఆర్ తొలి వికెట్ డౌన్ యశ్ దయాల్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో దయాల్ షార్ట్ ఫైన్ లెగ్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో గుర్భాజ్ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 26/1గా ఉంది. జగదీశన్(5), వెంకటేశ్ అయ్యర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విధ్వంసం సృష్టించిన త్రీడీ ప్లేయర్.. గుజరాత్ భారీ స్కోర్ కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. విజయ్ శంకర్ (24 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించగా, శుభ్‌మన్ గిల్ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్‌కు 3, సుయాశ్ శర్మకు ఓ వికెట్ దక్కింది. నరైన్‌కు మరో వికెట్.. సాయి సుదర్శన్ ఔట్ 158 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్ సాయి సుదర్శన్ (53) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో నరైన్‌కు ఇది మూడో వికెట్. సుయాశ్ సూపర్ డెలివరీ.. అభినవ్ మనోహర్ క్లీన్ బౌల్డ్ కేకేఆర్ యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ సూపర్ డెలివరీతో అభినవ్ మనోహర్‌ను (14) బోల్తా కొట్టించి క్లీన్ బౌల్డ్ చేశాడు. 15 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 132/3. సాయి సుదర్శన్ (46), విజయ్ శంకర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. శుభ్‌మన్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ 100 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శుభ్‌మన్ గిల్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. 12 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 101/2. సాయి సుదర్శన్ (31), అభినవ్ మనోహర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న గిల్, సుదర్శన్ సాహా వికెట్ పడ్డాక కూడా గిల్ (27), సుదర్శన్ నిలకడగా ఆడుతున్నారు. 8 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో గిల్ ఐపీఎల్లో 2000 పరుగుల మైలురాయిని దాటాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. జగదీశన్ సూపర్ క్యాచ్ 5వ ఓవర్ రెండో బంతికి గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో జగదీశన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సాహా 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 38/1. గిల్ (10), సాయి సుదర్శన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్వల్ప అస్వస్థత కారణంగా ఇవాల్టి మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా దూరం కాగా అతని స్థానంలో రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హార్ధిక్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. టిమ్ సౌథీ స్థానంలో ఫెర్గూసన్, మన్దీప్ సింగ్ ప్లేస్‌లో జగదీశన్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు.. గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ షమీ, అల్జరీ జోసఫ్, యశ్ దయాల్ కోల్‌కతా నైట్‌రైడర్స్: రహ్మానుల్లా గుర్భాజ్ (వికెట్‌కీపర్), ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. లుక్ మొత్తం మారనుందా?
ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న మోస్ట్ పాపులర్ మేసేజింగ్ యాప్‌లో బెస్ట్ ఏదంటే అందరూ చెప్పే సమాధానం 'వాట్సాప్' (WhatsApp). ఎంతో మంది నిత్యజీవితంలో భాగమైపోయిన ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. అయితే త్వరలో ‘వాట్సాప్’ లుక్ మారే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం ఆండ్రాయిడ్ యాప్‌కు కొత్త 'యూజర్ ఇంటర్ఫేస్' ను వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఇది మునుపటికంటే చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా ఫీచర్లను యూజర్లు సులభంగా ఉపయోగించుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం, ఆండ్రాయిడ్ యాప్ యూఐను పూర్తిగా మార్చేందుకు వాట్సాప్ సన్నదవుతోంది. ఇందులో భాగంగానే యాప్ బాటమ్‌లో నేవిగేషన్ బార్‌ను యాడ్ చేస్తోంది. బాటమ్ బార్లో చాట్స్, కమ్యూనిటీస్, స్టేటస్, కాల్స్ ట్యాబ్స్ ఉంటాయని దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా విడుదల చేసింది. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ధరించిన వాచ్ స్పెషలేంటో తెలుసా? ఎన్ని కోట్లు ఉంటుందంటే..?) త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్స్ అన్నీ దాదాపు వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌ని ఐఓఎస్ యాప్‌లాగా మార్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బీటా అప్డేట్ 2.23.8.4 ఆండ్రాయిడ్ వెర్షన్లో వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. ఇప్పటికీ కొంత మంది వాట్సాప్ బీటా యూజర్లకు కొత్త ఇంటర్ఫేస్తో కూడిన అప్డేట్ వచ్చేసింది. ఒకవేళ సాధారణ యూజర్ అయితే ఈ అప్డేట్ కోసం మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది. బీటా యూజర్లు టెస్ట్ చేసిన తరువాత అందులో బగ్స్ ఏవీ లేవని నిర్దారించుకున్న తరువాత అప్డేట్ను వాట్సాప్ అందుబాటులోకి తెస్తుంది. (ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో నయా కారు విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు) అంతే కాకుండా వాట్సాప్ ఎడిట్ ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. ఇది మెసేజ్ సెండ్ చేసిన తరువాత కూడా ఎడిట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫీచర్స్ ప్రకారం మనం పంపించే మెసేజ్‌లో తప్పు ఉంటే దానిని డిలీట్ చేయడమే తప్పా వేరే మార్గం లేదు. వాట్సాప్ ఎడిట్ ఫీచర్ అందుబాటులో వచ్చిన తరువాత ఈ ఇబ్బందికి చెక్ పెట్టేయొచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఖచ్చితంగా తెలియదు. -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. డైరెక్టర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. కానీ ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఆదిపురుష్ రిలీజ్‌కు ముందు అప్ డేట్స్ ఇస్తే ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి దాదాపు ఏడాదికి పూర్తవుతున్న అప్ డేట్స్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఉగాదికి కూడా ఆదిపురుష్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. పలువురు అగ్రహీరోల సినిమాల నుంచి అప్ డేట్స్ వచ్చినా కూడా ఆదిపురుష్ వెనకపడిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. రామాయణం ఇతిహాసం కావడంతో ఈనెల 30న శ్రీరామనవమి సందర్భంగానైనా అప్డేట్ ఇస్తారా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ విషయంలో డైరెక్టర్ ఓం రౌత్ సీరియస్‌గా లేరని మరికొందరు ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరి అభిమానులను దృష్టిలో ఉంచుకొని త్వరలో ఏమైనా అప్ డేట్ ఇస్తారా? లేక ఎప్పటిలాగే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతారా అన్నది వేచి చూడాల్సిందే. -
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేదించింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(36 బంతుల్లో 66 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 51 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ బౌలర్లు నిప్పులు చేరగడంతో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు. విజయానికి చేరువలో ఆసీస్.. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్(54) హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఇప్పటి వరకు 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు హెడ్(32) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 118 పరుగుల టార్గెట్.. దూకుడుగా ఆడుతున్న ఆసీస్ 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. 3 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (10), ట్రవిస్ హెడ్ (10) క్రీజ్‌లో ఉన్నారు. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 117 పరుగులకే కుప్పకూలిన భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఇల్లీస్ (2/13) నిప్పులు చెరగడంతో భారత్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 103 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 103 పరుగుల వద్ద టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ (4), షమీ (0)లను అబాట్ పెవిలియన్‌కు పంపాడు. క్రీజులో అక్షర్ పటేల్, సిరాజ్ ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. జడ్డూ (16) ఔట్ 91 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్... కోహ్లి ఔట్ 71 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (31) ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. స్మిత్ సెన్సేషనల్ క్యాచ్.. 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్ ఫస్ట్ స్లిప్‌లో స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టక తప్పలేదు. దీంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (22), జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్, 4 వికెట్లు స్టార్క్ ఖాతాలోకే మిచెల్ స్టార్క్ టీమిండియాను దారుణంగా దెబ్బకొడుతున్నాడు. ఇప్పటికే 3 వికెట్లు పడగొట్టిన స్టార్క్.. కేఎల్ రాహుల్ (9)ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 49/4. కోహ్లి (22), హార్ధిక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన భారత్.. స్కై మరో డకౌట్ టీమిండియా కష్టాల్లో పడింది. స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్‌లకు ఔట్‌చేసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. 4.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 32/3గా ఉంది. విరాట్ కోహ్లి (15), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు 29/1 మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. కోహ్లి 14, రోహిత్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. గిల్ డకౌట్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే టీమిండియాకు షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గిల్ డకౌట్ అయ్యాడు. లబుషేన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్ విశాఖ వేదికగా ఇవాళ (మార్చి 19) జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. వరుణుడు శాంతించి, ఎండ కాయడంతో జరుగదనుకున్న మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుండగా.. టీమిండియా ఒక్క మార్పు చేసింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో నాథన్ ఇల్లీస్, జోస్ ఇంగ్లిస్ ప్లేస్‌లో అలెక్స్ క్యారీ బరిలోకి దిగనుండగా.. భారత్ నుంచి శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయనున్నాడు. తుది జట్లు.. భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, నాథన్ ఇల్లీస్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్
హైదరాబాద్: బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ లైన్‌కు అప్డేట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.1.35 లక్షలు.., రూ.1.47 లక్షలుగా ఉన్నాయి. మంచి హ్యాండ్లింగ్ కోసం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్‌లు, మెరుగైన భద్రతకు డ్యూయల్ చానల్ ఏబీఎస్ను అమర్చారు. ఇన్ఫినిటీ డిస్ప్లే కొత్త పల్సర్లలో ప్రత్యేకం. డిస్ప్లే కన్సోల్‌లో ఇప్పుడు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. ఎన్ఎస్ 200 మోడల్ 18.75 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఎన్ఎస్ 160 మోడల్ 14.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బజాజ్ పల్సర్ పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200లు మెటాలిక్ పెరల్ వైట్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, శాటిన్ రెడ్ , ప్యూటర్ గ్రే రంగులలో లభ్యం. -
CM YS Jagan: ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు(గురువారం) సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి పయనమయ్యారు సీఎం జగన్. తొలుత తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. రాత్రి 7.30 గంటల సమయలో సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి 1 జన్‌పథ్ నివాసంలో బస చేస్తారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ కానున్నట్టు సమాచారం. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. -
AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
06:00PM ►అనంతపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఆధిక్యత ►పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ముందంజ ►చిత్తూరు: తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఫలితాలు ►రెండో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి ముందంజ 03:30PM ►అనంతపురం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఆధిక్యత ►తొలి రౌండ్లో ముందంజలో ఉన్న రామచంద్రారెడ్డి ►చిత్తూరు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి ఆధిక్యత ►మొదటిరౌండ్లో ముందంజలో ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి 9:50 AM స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. బలం లేకపోయినా పోటీలో నిలిచి టీడీపీ భంగపడింది. ► పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం. వైఎస్సార్సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపొందారు. కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. ► కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌రావు విజయం సాధించారు. ► శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. 9:40 AM ఏలూరులో ముందంజ ► ఏలూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయపథంలో దూసుకుపోతోంది. ఇతర స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 9:15 AM శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ విజయం.. ► శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ 632 ఓట్లు రాగా.. ఇండిపెండెంట్‌కి 108 ఓట్లే వచ్చాయి. 8:45 AM ► ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 8 లెక్కింపు కేంద్రాల్లో అధికారులు ఓట్లు లెక్కిస్తున్నారు. 8:00 AM ► ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మూడు గ్రాడ్యుయేట్ , రెండు టీచర్, నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మొదలైంది. 9 స్థానాలకు మొత్తం 139 అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాక్షి, అమరావతి/ సాక్షి, తిరుపతి: మార్చి13న ఎన్నికలు జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు పోటీ పడుతున్న 139 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభానికి అరగంట ముందు స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. 8 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించే విధంగా పోటీ చేసిన అభ్యర్థులు, ఓటర్ల సంఖ్యనుబట్టి టేబుల్స్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం–విజయనగరం–విశాఖ పట్టభద్రుల స్థానానికి 28 టేబుల్స్, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల స్థానానికి 40 టేబుల్స్, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు కౌంటింగ్‌కు 25 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గానికి 14, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గానికి 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు పశి్చమ గోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు 5, శ్రీకాకుళానికి 4, కర్నూలుకు 2 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇది సుదీర్ఘ ప్రక్రియని, ఫలితాల ప్రకటనకు రెండు మూడు రోజులు కూడా పట్టే అవకాశం ఉందని మీనా తెలిపారు. సాయంత్రానికి స్థానిక సంస్థల ఫలితాలను, రాత్రికి టీచర్ల నియోజకవర్గ ఫలితాలు వెలువడవచ్చని అంచనా. పట్టభద్రుల నియోజకవర్గాల ఫలితాలకు ప్రకటనకు 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉందంటున్నారు. తొలి ఫలితం కర్నూలు స్థానిక సంస్థలది, చివరగా ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్స్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు నిలిపివేయలేం: హైకోర్టు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఫలితాలు మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయంది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరుతూ కోడి శ్రీనివాస్ బుధవారం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. -
AP Budget 2023-24: రూ.2,79,279 కోట్లతో జన రంజక వార్షిక బడ్జెట్
Live Updates రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79 వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. ►రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు ►మూలధన వ్యయం రూ.31,061 కోట్లు ►రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు ►ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు ►జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం ►ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం 2023 బడ్జెట్ కేటాయింపులు.. ►వైఎస్సార్ పెన్షన్ కానుక- రూ.21,434.72 కోట్లు ►వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు ►జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు ►జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు ►వైఎస్సార్- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు ►డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు ►రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు ►వైఎస్సార్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు ►జగనన్న చేదోడు-రూ.350 కోట్లు ►వైఎస్సార్ వాహనమిత్ర-రూ.275 కోట్లు ►వైఎస్సార్ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు ►వైఎస్సార్ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు ►మత్స్యకారులకు డీజీల్ సబ్సీడీ-రూ.50 కోట్లు ►రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు ►లా నేస్తం-రూ.17 కోట్లు ►జగనన్న తోడు- రూ.35 కోట్లు ►ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు ►వైఎస్సార్ కల్యాణమస్తు-రూ.200 కోట్లు ►వైఎస్సార్ ఆసరా-రూ.6700 కోట్లు ►వైఎస్సార్ చేయూత-రూ.5000 కోట్లు ►అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు ►మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు ►ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు ►వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు ►మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు ►జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు ►పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు ►పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు ►స్కిల్ డెవలప్మెంట్ రూ. 1,166 కోట్లు ►యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు ►షెడ్యూల్ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు ►షెడ్యూల్ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు ►వెనుకబడిన తరగతుల సంక్షేమం- రూ. 38,605 కోట్లు ►కాపు సంక్షేమం- రూ.4,887 కోట్లు ►మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు ►పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు ►పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు ►రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు ►నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్)- రూ.11,908 కోట్లు ►పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు ►ఎనర్జీ- రూ.6,456 కోట్లు ►గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు ►గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు ♦ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి ప్రయోజనం: మంత్రి బుగ్గన ♦సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరుగుదల ♦దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే రేషన్ కార్డుల జారీ ♦ఇప్పటి వరకు 48.75 లక్షల దరఖాస్తుల పరిష్కారం ♦రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ♦ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే అంగన్వాడీ కేంద్రాలు ♦విద్యార్థులకు మెరుగైన భోజనం కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు ♦మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమానికి రూ. 3,951 కోట్లు ♦సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన ఇవే ప్రభుత్వ లక్ష్యాలు ♦వైఎస్సార్ ఆసరా కింద రూ.6,700 కోట్లు కేటాయింపు ♦17 జిల్లాల్లో 2.50 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు. ♦లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు ధర లభిస్తుంది ♦వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయింపు: మంత్రి బుగ్గన ♦వైఎస్సార్ చేయూత కింద రూ.5వేల కోట్లు కేటాయింపు ♦విద్యకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం ♦టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నాం ♦నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి ♦స్థూలవృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ♦ఆంధ్రప్రదేశ్ వృద్ధి 11.43 శాతం ♦సుస్థిర అభివృద్ధిలో నవరత్నాలు ప్రతిబింబిస్తున్నాయి ♦2022-23 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం స్థూల ఉత్పత్తి రూ.13,17,728 కోట్లు ♦2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.14,49,501 కోట్లతో 10 శాతం వృద్ధిగా అంచనా ♦రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు ♦రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం మాది ♦పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఏపీ ♦16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నాం ♦గతేడాది 18.39 కోట్ల పనిదినాలు కల్పించాం ♦వైఎస్సార్ జలకళ కింద 17,047 బోరు బావులు తవ్వాం ♦కుళాయి కనెక్షన్ల ద్వారా 65 లక్షల ఇళ్లకు మంచినీరు ♦మౌలిక వసతులు, సేవలు మెరుగుపరిచే మోడల్ పట్టణాలుగా మంగళగిరి, తాడేపల్లి ♦విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ♦175 నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు ♦ఐటీఐలో నైపుణ్యాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి ♦చురుగ్గా 67 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణ పనులు ♦పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్లతో ఒప్పందాలు ♦విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం ♦125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన ♦జీఐఎస్ ద్వారా 13.42 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి బుగ్గన ♦సమ్మిట్ ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ♦378 ఎంవోయూలు కుదుర్చుకున్నాం అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. ఇష్టం లేకుంటే సభ నుంచి వాకౌట్ చేయాలని స్పీకర్ సూచించారు. బడ్జెట్‌కు పదేపదే అడ్డు తగలడంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్సెండ్ చేశారు. Time: 10: 11 AM ►బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట ప్రజలంతా చూస్తున్నారు: సీఎం జగన్ ►బడ్జెట్ ప్రసంగానికి టీడీపీ అడ్డుపడటం సరికాదు: సీఎం జగన్ Time: 10:07 AM ► బడ్జెట్లో పోతన భగవత పద్యాన్ని చదివిన మంత్రి బుగ్గన ► రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఉదహరించిన మంత్రి రాజేంద్రనాథ్ Time: 10:04 AM ► అసెంబ్లీలో 2023-24 ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. Time: 9:05 AM ►మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశముంది. ►ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. 2023-24 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం. ►ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన. ►రూ. 2. 79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం. ►నవరత్నాలకు నిధుల కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం. ►మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్ ►మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు. ►వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ, పేదల ఇళ్లకు పెద్దపీట ►వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ►మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం అంజాద్ భాషా Time: 8:26 AM బడ్జెట్లో పేదలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం: మంత్రి బుగ్గన పేదలు, బలహీన వర్గాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పరిపాలనాపరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు చేశామన్నారు. Time: 8:11 AM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయానికి బయల్దేరారు. కాసేపట్లో క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు. Time: 07:41 AM బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు బడ్జెట్ కాపీతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సచివాలయానికి చేరుకున్నారు. బడ్జెట్ ప్రతులకు మంత్రి, అధికారులు పూజలు చేశారు. Time: 07:33 AM బడ్జెట్ కాపీతో సచివాలయానికి బయలేర్దిన మంత్రి బుగ్గన బడ్జెట్ కాపీతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సచివాలయానికి బయలేర్దారు. బడ్జెట్ ప్రతులకు పుజలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో బుగ్గన, మండలిలో అంజాద్ బాషా.. ►వరుసగా ఐదో దఫా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నవరత్నాల పథకాలు అమలు కొనసాగిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం 2023–24 వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జెండర్ బేస్డ్ బడ్జెట్ సిద్ధం చేసింది. ►రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో వచ్చే నిధులను వాస్తవ రూపంలో బేరీజు వేస్తూ వార్షిక బడ్జెట్ రూపొందించారు. కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రూ.41,388 కోట్లు రానున్నాయి. మొత్తం మీద 2023 – 24 వార్షిక బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లుగా ఉండనుందని అంచనా. నేటి ఉదయం మంత్రిమండలి ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఐదో బడ్జెట్ జనరంజకంగా ఉండనుంది. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు. ►శాసన మండలిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా బడ్జెట్‌ను చదవనున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదవనున్నారు. నవరత్నభరితంగా బడ్జెట్.. ►నవరత్నాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తావు లేకుండా అందరి సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు. ►గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం సబ్సిడీకి తగినన్ని నిధులు కేటాయించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం వారియర్జ్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. యస్తిక భాటియా (42), నాట్ సీవర్ బ్రంట్ (45 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (53 నాటౌట్) మెరుపుల సహకారంతో 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. యస్తికా భాటియా మెరుపులు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. యస్తికా భాటియా 19 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. హేలీ మాథ్యూస్ 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసింది. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 40/0గా ఉంది. మెత్తంగా యూపీ వారియర్స్‌పై 8 వికెట్లు తేడా, 162 పరుగులతో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. రాణించిన హీలీ, మెక్‌గ్రాత్.. తిప్పేసిన ఇషాఖీ, కెర్ అలైసా హీలీ (58), తహీల మెక్‌గ్రాత్ (50) హాఫ్‌సెంచరీలతో రాణించడంతో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హీలీ, మెక్‌గ్రాత్ మినహా వారియర్జ్ ఇన్నింగ్స్‌లో అందరూ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాఖీ 3, అమేలియా కెర్ 2, హేలీ మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు. నిలకడగా ఆడుతున్న అలైసా హీలీ మెక్‌గ్రాత్ 58 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన యూపీ వారియర్జ్‌ను కెప్టెన్ అలైసా హీలీ (39), తహీల మెక్‌గ్రాత్ (38) ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత వారియర్జ్ స్కోర్ 113/2గా ఉంది, దేవిక (6)ను సైకా ఇషాఖీ.. కిరణ్ నవగరే (17)ను అమేలియా కెర్ ఔట్ చేశారు. హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ ముంబై బౌలర్ సైకా ఇషాఖీ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో యూపీ వారియర్జ్ సారధి అలైసా హీలీ హ్యాట్రిక్ ఫోర్లు సహా మొత్తం 4 బౌండరీలు బాదింది. ఫలితంగా వారియర్జ్ స్కోర్ 5 ఓవర్ల తర్వాత 39/1గా ఉంది. హీలీ (23), కిరణ్ నవగిరే (6) క్రీజ్‌ల ఉన్నారు. అంతకుముందు రెండో ఓవర్ ఆఖరి బంతికి సైకా ఇషాఖీ.. దేవిక వైద్య (6) ఎల్బీడబ్ల్యూ చేసింది. మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ జట్లు ఇవాళ (మార్చి 12) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. యూపీ వారియర్జ్ టీమ్‌లో హ్యారిస్ స్థానంలో ఇస్మాయిల్ బరిలోకి దిగనుండగా.. ముంబై జట్టు పూజా స్థానంలో ధారాను బరిలోకి దించుతుంది. పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలుపొందిన ముంబై టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), యూపీ వారియర్జ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), గుజరాత్ జెయింట్స్ (4 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఆర్సీబీ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుస స్థానాల్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా (వికెట్‌కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, హర్మన్ప్రీతి కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా ఖాజీ, జింటిమని కలిత, సైకా ఇషాఖీ యూపీ వారియర్జ్: దేవిక వైద్య, అలైసా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవగిరే, తహీలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలీ శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్ -
IND VS AUS 4th Test: సెంచరీతో చెలరేగిన ఖవాజా.. తొలి రోజు ఆసీస్‌దే
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మొదటి రోజు ఆటముగిసింది. తొలి రోజు ఆటలో టీమిండియాపై ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా(104 నాటౌట్) అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నాయి. ఇక భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, అశ్విన్ తలా వికెట్ సాధించారు. 170 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన హ్యాండ్స్కాంబ్.. మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు, మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ టీమిండియా ఎట్టకేలకు మూడో వికెట్ సాధించింది. 38 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి హ్యాండ్స్ కాంబ్ వచ్చాడు. 64 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు: 152/3 టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు: 149/2 (62) 60 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 145-2 హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఖ్వాజా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడిన ఉస్మాన్ ఖ్వాజా 146 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. షమీ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ మార్కును అందుకున్నాడు. 49 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 128/2గా ఉంది. ఖ్వాజా (56)తో పాటు స్టీవ్ స్మిత్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. 100 దాటిన ఆసీస్ స్కోర్.. లంచ్ తర్వాత టీమిండియాకు లభించని ఫలితం లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ఈ క్రమంలో ఆ జట్టు 42వ ఓవర్లో 100 పరుగుల మార్కు దాటింది. ఉస్మాన్ ఖ్వాజా (47) హాఫ్ సెంచరీ దిశగా సాగుతుండగా, స్టీవ్ స్మిత్ 12 పరుగుల బ్యాటింగ్ కొనసాగిస్తుతున్నాడు. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 105/2గా ఉంది. లంచ్ సమయానికి ఆసీస్ స్కోర్ 75/2, అశ్విన్, షమీకి తలో వికెట్ తొలి రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ట్రివిస్ హెడ్ (32), లబూషేన్ (3) ఔట్ కాగా, ఉస్మాన్ ఖ్వాజా (27), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. హెడ్‌ను అశ్విన్, లబూషేన్‌ను షమీ ఔట్ చేశారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. లబూషేన్ (3) ఔట్ జట్టు స్కోర్ 72 పరుగుల వద్ద ఉండగా ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో లబూషేన్ (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా (26), స్టీవ్ స్మిత్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. హెడ్ (32) ఔట్ 16వ ఓవర్ మూడో బంతికి ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ట్రవిస్ హెడ్ (32) ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 62/1. ఉస్మాన్ ఖ్వాజా (18), లబూషేన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 24/0, శ్రీకర్ భరత్ చెత్త వికెట్‌కీపింగ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 24/0గా ఉంది. శ్రీకర్ భరత్ చెత్త వికెట్‌కీపింగ్ కారణంగా ట్రవిస్ హెడ్‌కు లైఫ్ లభించింది. ఉమేశ్ బౌలింగ్‌లో హెడ్ అందించిన సునాయాసమైన క్యాచ్‌ను భరత్ నేలపాలు చేశాడు. అంతకుముందు ఆ తర్వాత కూడా భరత్ వికెట్ వెనకాల చాలా తప్పిదాలు చేసి అనసవర పరుగులిచ్చాడు. ఇషాన్ కిషన్‌ను కాదని భరత్‌ను వరుసగా నాలుగో టెస్ట్‌లో కూడా కొనసాగించిన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఇవాల్టి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక్క మార్పు చేయగా.. ఆసీస్ మూడో టెస్ట్‌లో బరిలోకి దిగిన జట్టునే కొనసాగించింది. సిరాజ్ స్థానంలో షమీ జట్టులో చేరాడు. 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. 75 ఏళ్ల భారత్-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంకు విచ్చేశారు. ఇరువురు దేశ ప్రధానులు ప్రత్యేక వాహనంలో స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. మ్యాచ్‌కు ముందు మోదీ, అల్బనీస్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శించారు. అనంతరం మోదీ, అల్బనీస్ కలిసి కాసేపు కామెంట్రీ చెప్పే అవకాశం ఉంది. -
IND VS AUS: ముగిసిన రెండో రోజు ఆట.. 163 పరుగులకు టీమిండియా ఆలౌట్
Ind Vs Aus 3rd Test Indore 2nd Day Updates: ముగిసిన రెండో రోజు ఆట 163 పరుగుల వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఆస్ట్రేలియా కంటే కేవలం 75 పరుగుల ఆధిక్యం మాత్రమే సంపాదించగలిగింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అత్యధికంగా 8 వికెట్లు తీయగా.. మరో స్పిన్నర్ మథ్యూ కుహ్నెమన్‌కు ఒకటి, పేసర్ స్టార్క్‌కు ఒక వికెట్ దక్కాయి. టీమిండియా బ్యాటర్లలో ఛతేశ్వర్ పుజారా 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 57: టీమిండియా స్కోరు: 155-9. కేవలం 67 పరుగుల ఆధిక్యం 56.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా లియోన్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. డకౌట్‌గా వెనుదిరిగాడు. 56.3: ఎనిమిదో వికెట్ డౌన్ లియోన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా (59) అవుట్. 54: టీమిండియా స్కోరు: 145/7 48.1: అశ్విన్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా నాథన్ లియోన్ బౌలింగ్‌లో అశ్విన్(16) బౌల్డ్ అయ్యాడు. 40.1: ఆరో వికెట్ కోల్పోయిన భారత్ నాథన్ లియోన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్ బౌల్డ్ అయ్యాడు. మూడు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది.స్కోరు- 118/6 (40.1). పుజారా (46), అశ్విన్ (0) క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 37.2: శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి అయ్యర్ అవుటయ్యాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడాడు. పుజారా, శ్రీకర్ భరత్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 115-5(38) జడేజా ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. ఆస్ట్రేలియా స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు తడబడుతున్నారు. క్రీజులో కుదురుకున్నట్లే కన్పించిన ఆల్‌రౌండర్ జడేజా.. లయోన్ బౌలింగ్‌లో ఎల్బీబ్ల్యూగా వెనుదిరిగాడు. 36 బంతులో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ 78 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, పుజారా 36(76) ఉన్నారు. విరాట్ కోహ్లి ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. క్రీజ్‌లో కుదురుకుని టీమిండియాను గట్టెక్కిస్తాడని ఆశించిన విరాట్ కోహ్లి మరోసారి విఫలమై పెవిలియన్‌కు చేరాడు. కుహ్నేమన్ మరోసారి కోహ్లిని (13) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కోహ్లి ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 54/3గా ఉంది. పుజారా (20), జడేజా (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 34 పరుగులు వెనుకపడి ఉంది. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ ఔట్ 32 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. లయోన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (12) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు టీమిండియా ఇంకా 56 పరుగులు వెనుకపడే ఉంది. పుజారా (11), కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ క్లీన్ బౌల్డ్ లంచ్ విరామం తర్వాత లయోన్ వేసిన తొలి ఓవర్లోనే భారత్ వికెట్ కోల్పోయింది, లయోన్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్ ఆడే క్రమంలో గిల్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లంచ్ సమయానికి భారత్ స్కోర్ 13/0 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 75 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 197 పరుగులకే ఆలౌటైన ఆసీస్ 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. ఈ రోజు ఆసీస్ కోల్పోయిన 6 వికెట్లలో అశ్విన్, ఉమేశ్ చెరి సగం పంచుకున్నారు. వీరిద్దరు ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగి వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాకు 88 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఉమేశ్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. ఇవాళ ఆసీస్ కోల్పోయిన 5 వికెట్లలో ఉమేశ్ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టాడు. మర్ఫీని ఉమేశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 196 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 8వ వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వారెవ్వా ఉమేశ్.. స్పిన్ పిచ్‌పై ప్రతాపం చూపిస్తున్నావు..! డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా 3 వికెట్లు కోల్పోయింది. హ్యాండ్స్‌కోంబ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపగా.. గ్రీన్, స్టార్క్‌లను ఉమేశ్ ఔట్ చేశాడు. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఉమేశ్ నిప్పులు చెరుగుతూ వికెట్లు పడగొడుతున్నాడు. గ్రీన్‌ను ఎల్బీడబ్ల్యూ చేసిన ఉమేశ్.. స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 74 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 196/7. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన ఆసీస్ రెండో రోజు చాలా సమయం వరకు నిలకడగా ఆడిన ఆసీస్.. డ్రింక్స్ బ్రేక్ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. తొలు హ్యాండ్స్‌కోంబ్‌ను యాష్ బోల్తా కొట్టించగా.. మరుసటి ఓవర్లో ఉమేశ్ యాదవ్.. గ్రీన్ (21)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 72 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 188/6గా ఉంది. అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట మొదలయ్యాక చాలా సేపు నిలకడగా ఆడిన హ్యాండ్స్‌కోంబ్‌ను (19) ఎట్టకేలకు అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. 71వ ఓవర్లో షార్ట్ లెగ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి హ్యాండ్స్కోంబ్ వెనుదిరిగాడు. 71 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 186/5గా ఉంది. గ్రీన్ (19), అలెక్స్ క్యారీ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న గ్రీన్, హ్యాండ్స్కోంబ్ ఓవర్‌నైట్ స్కోర్ 156/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతుంది. హ్యాండ్స్కోంబ్ (16), గ్రీన్ (17) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. క్రీజ్‌లో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు. 66 ఓవర్లు ముగిసే ఆసీస్ స్కోర్ 177/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 68 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో రోజు ఆట ప్రారంభం.. రవీంద్రుడి మాయాజాలం కొనసాగేనా..? ఓవర్‌నైట్ స్కోర్ 156/4 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, పీటర్ హ్యాండ్స్కోంబ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ , నాథన్ లియోన్, మార్క్ కుహ్నేమన్ -
పాక్‌ను మట్టికరిపించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ విక్టరీ
పాక్‌ను మట్టికరిపించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ విక్టరీ మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ విక్టరీ నమోదు చేసింది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్.. తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కెప్టెన్ మారూఫ్ (68 నాటౌట్), అయేషా నసీం (43 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్.. షెఫాలీ వర్మ (33), జెమీమా రోడ్రిగెస్ (53 నాటౌట్), రిచా ఘోష్ (31 నాటౌట్) చెలరేగడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మూడో వికెట్ కోల్పోయిన భారత్ 93 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. సంధూ బౌలింగ్‌లో మారూఫ్‌కు క్యాచ్ ఇచ్చి హర్మన్ కౌర్ (16) ఔటైంది. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/3. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 65 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సంధూ బౌలింగ్‌లో అమీన్‌కు క్యాచ్ ఇచ్చి షెఫాలీ వర్మ (33) ఔటైంది. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 67/2. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 150 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్.. 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో ఫాతిమా సనాకు క్యాచ్ ఇచ్చి యస్తికా భాటియా (17) ఔటైంది. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/1. విజృంభించిన అయేషా నసీం.. సత్తా చాటిన బిస్మా మారూఫ్ కెప్టెన్ బిస్మా మారూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), మిడిలార్డర్ బ్యాటర్ అయేషా నసీం (23 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. తిప్పేసిన రాధా యాదవ్.. నాలుగో వికెట్ కోల్పోయిన పాక్ లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ రాధా యాదవ్ మాయాజాలం ధాటికి పాకిస్తాన్ 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 12.1వ ఓవర్లో రాధా బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి అమీన్ (11) ఔటైంది. 15 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 91/4గా ఉంది. ఫైర్ మీదున్న టీమిండియా బౌలర్లు, 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్ టీమిండియా బౌలర్లు ఫైర్ మీదున్నారు. దీప్తి శర్మ, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీయడంతో పాక్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. వస్త్రాకర్ బౌలింగ్‌లో రిచాకు క్యాచ్ ఇచ్చి నిదా దార్ (0) డకౌటైంది. 8 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 46/3. రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. రిచా ఘోష్ సూపర్ స్టంపింగ్ 42 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. రాధా యాదవ్ బౌలింగ్‌లో రిచా ఘోష్ సూపర్ స్టంపింగ్ చేయడంతో మునీబా అలీ (12) పెవిలియన్ బాట పట్టింది. 7 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 42/2గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో హర్మన్‌కు క్యాచ్ ఇచ్చి జవేరియా ఖాన్ (8) ఔటైంది. 4.4 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 31/1గా ఉంది. బిస్మా మారూఫ్ (18), మునీబా అలీ (5) క్రీజ్‌లో ఉన్నారు. ICC Womens T20 WC 2023 IND VS PAK: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్మృతి చేతి వేలికి గాయమైంది. స్మృతి స్థానంలో హర్లీన్ డియోల్ తుది జట్టులోకి వచ్చిందని, ఈ మ్యాచ్‌కు శిఖా పాండే దూరంగా ఉందని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ అనంతరం వెల్లడించారు. పాక్ జట్టులో సైతం ఓ కీలక ప్లేయర్ మ్యాచ్‌కు దూరమైంది. డయానా బేగ్ ఇవాల్టి మ్యాచ్ ఆడటం లేదని పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్ తెలిపింది. తుది జట్లు: భారత్: షెఫాలీ వర్మ, యస్తిక భాటియా, జెమీమా రోడ్రిగెస్, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ పాకిస్తాన్: జవేరియా ఖాన్, మునీబా అలీ (వికెట్‌కీపర్), బిస్మా మారూఫ్ (కెప్టెన్), నిదా దార్, సిద్రా అమీన్, అలీయా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఎయిమన్ అన్వర్, సష్రా సంధూ, సాదియా ఇక్బాల్ -
వాట్సాప్‌లో డిఫరెంట్ రింగ్టోన్స్ కోసం..
అందరి స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ కామన్‌గా ఉంటుంది. వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్లు లేవంటే అతిశయోక్తి కాదేమో. యూజర్ల అవసరాలకు తగినట్టుగా వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్స్ తెస్తుంటుంది. ఇన్స్టంట్ మెసేజింగ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో (ఆండ్రాయిడ్) డిఫరెంట్ యూజర్లకు, డిఫరెంట్ రింగ్టోన్ల కోసం... 1. కన్వర్సేషన్ ట్యాబ్–సెలెక్ట్ 2. కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేసుకున్న తరువాత కస్టమ్ రింగ్‌టోన్ సెట్ చేసుకోవాలి. 3. పేజీ స్క్రోల్ డౌన్ చేసి–కస్టమ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. 4. ‘యూజర్ కస్టమ్ నోటిఫికేషన్’ బాక్స్ టిక్ చేయాలి. 5. కాల్ నోటిఫికేషన్ కింద ఉన్న రింగ్‌టోన్ ట్యాప్ చేసి ఇష్టమైన రింగ్‌టోన్ సెలెక్ట్ చేసుకోవాలి. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ వాయిదా
-
పంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదలచేసిన బీసీసీఐ
-
సినిమాలకు వెంకీ మామ బ్రేక్ ..?
-
నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు
-
త్రివిక్రమ్ కి ఏమైంది ..?
-
వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్స్: 5 ఫీచర్లు కమింగ్ సూన్
సాక్షి, ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకోసం త్వరలోనే మరో అయిదు కీలక ఫీచర్లను లాంచ్ చేయనుంది. ఎప్పటికపుడు కాలానుగుణంగా అప్డేట్స్తో వినియోగదారులకు ఆకట్టుకునే వాట్సాప్ తాజా అప్డేట్స్పై ఓ లుక్కేద్దాం. మెసేజ్ ఎడిట్: వాట్సాప్ ద్వారా యూజర్లు పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది. అయితే ఎడిట్ చేసుకునేందుకు మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాల వరకు మాత్రమే సమయం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉంది. గ్రూపు మెంబర్స్ సంఖ్య: వాట్సాప్ గ్రూపులో గరిష్టంగా 512 మంది మరిమితమైన సంఖ్యను త్వరలోనే రెట్టింపు చేయనుంది. దీంతో ఒక గ్రూపులో 1024 మంది సభ్యులుగా చేరే అవకాశం కలుగుతుంది. షేర్ డాక్యుమెంట్ విత్ క్యాప్షన్: ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వాట్సాప్ ద్వారా ఒకరికొకరు క్యాప్షన్లతో డాక్యుమెంట్లను సెండ్ చేసుకోవచ్చు. వీడియోలు, ఫోటోలుమాదిరిగానే ఇకమీదట డాక్యుమెంట్లకూ క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. స్క్రీన్ షాట్ బ్లాక్ : వాట్సాప్ ద్వారా వచ్చే మెసేజ్‌లకు, లేదా ఫోటోలను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశాన్ని రద్దు చేయనుంది. యూజర్ల గోప్యత పరిరక్షణలో భాగంగా వాట్సాప్ దీనికి త్వరలోనే చెక్ పెట్టనుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉండాలంటే, యూజర్లు వ్యూ వన్స్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం సబ్ స్క్రిప్షన్: బిజినెస్ వాట్సప్ ఖాతాల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్‌ను ప్రారంభించింది. ధర ఇంకా వెల్లడించిపోయినప్పటికీ, వ్యాపార సేవల కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్‌పై మాత్రమే సేవలను వాట్సాప్ అందించనుంది. వాట్సాప్ బిజినెస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
అన్నవరానికి ఆధ్యాత్మిక శోభ ...
-
వెస్ట్మిన్స్టర్ హాల్లోనే రాణి శవపేటిక ఎందుకంటే..
వెస్ట్మిన్స్టర్ హాల్ తలుపులు మూసుకుపోయాయి. భారత కాలమానం ప్రకారం.. వేకువఝామున నాలుగు గంటల సమయంలో క్యూ లైన్లను అనుమతించడం ఆపేశారు. అంటే.. సుదీర్ఘకాలం యునైటెడ్ కింగ్డమ్ను పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 అంతిమయాత్రలో కీలక ఘట్టం ముగిసిందన్నమాట. ఇక మిగిలింది అంత్యక్రియలే.. బ్రిటన్ సార్వభౌమాధికారులకు, గత.. ప్రస్తుత రాణి కాన్సోర్ట్‌లకు ఇచ్చే గౌరవం ఇదంతా. వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. పార్లమెంటరీ ఎస్టేట్‌లో అత్యంత పురాతనమైన బిల్డింగ్ ఇది. ► అత్యంత సువిశాలమైన భవనం మాత్రమే కాదు.. మిరుమిట్లు గొలిపే డిజైన్లతో గోడలు, అద్దాలు, పైకప్పు.. ఆకర్షనీయంగా ఉంటుంది. ► గతంలో కోర్టులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను సైతం ఇందులో నిర్వహించేవాళ్లు. ► 1910లో కింగ్ ఎడ్వర్డ్-7 మరణాంతరం ఆయన భౌతికాయాన్ని వెస్ట్మిన్స్టర్ హాల్లో ప్రజాసందర్శనార్థం ఉంచారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ► ఇంతకు ముందు.. 2002, మార్చి 30వ తేదీన క్వీన్ ఎలిజబెత్(క్వీన్ ఎలిజబెత్-2 తల్లి) మరణించగా.. అంత్యక్రియలకు పదిరోజుల ముందు నుంచి వెస్ట్మిన్స్టర్ హాల్లో ఉంచారు. ► ఇప్పుడు.. గత బుధవారం నుంచి క్వీన్ ఎలిజబెత్-2 మృతదేహాన్ని ప్రజా సందర్శనార్థం ఉంచారు. ► థేమ్స్ నది ఒడ్డున్న కిలోమీటర్ల మేర బారులు తీరి నిల్చున్నారు ఆమె అభిమానులు. రాణి గౌరవార్థం ప్రముఖులు సైతం ఒపికగా క్యూలో వచ్చారు. ► రాణి అంత్యక్రియల కార్యక్రమాన్ని బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న 125 సినిమా థియేటర్లు ప్రసారం చేయనున్నాయి. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఆమెకు నివాళులర్పించారు. ► క్వీన్ ఎలిజబెత్-2 మృతదేహాంతో ఉన్న శవపేటికను వెస్ట్మిన్స్టర్ అబేను తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► అక్కడ 2000 మంది అతిథులు(అందులో 500 మంది ప్రపంచ నేతలు) ఉంటారు. ► అబే నుంచి సెయింట్ జార్జిస్ చాపెల్ వద్ద క్రతువు కోసం రాణి శవపేటికను తరలిస్తారు. అక్కడ 800 మంది అతిథులకు స్థానం ఉంటుంది. ► కింగ్ జార్జి- మెమోరియల్ చాపెల్ వద్ద.. రాణి శవపేటికను ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ సమాధి చెంతకు బ్రిటన్ రాజవంశానికి చెందిన కుటుంబ సభ్యుల సమక్షంలో చేరుస్తారు. ► చివర్లో శవపేటిక వెంట రాజు, రాణి, రాజవంశీయులు మాత్రమే ఉంటారు. సాయంత్రం శవపేటికను.. రాయల్ వాల్ట్‌లోకి దించుతారు. అక్కడ విండ్సర్ డీన్ కీర్తన ఉంటుంది. కాంటెర్బరీ ఆర్చిబిషప్ దీవెనలు, జాతీయ గీతాలాపతో అంత్యక్రియల కార్యక్రమం లాంఛనంగా(ప్రభుత్వ) ముగుస్తుంది. అయితే.. ఆపై విండ్సర్ డీన్ ఆధ్వర్యంలో రాజవంశీయులకు మాత్రమే పరిమితమైన తుది అంత్యక్రియల ప్రక్రియతో మొత్తం కార్యక్రమం ముగుస్తుంది. రాజవంశంలో రాజు/రాణిలకు దాదాపుగా ఇదే తరహాలో అంత్యక్రియలు జరుగుతుంటాయి. -
మంధాన విధ్వంసం.. పాక్‌ను మట్టికరిపించిన భారత్
మంధాన విధ్వంసం.. పాక్‌ను మట్టికరిపించిన భారత్ కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పాక్‌తో జరిగిన కీలక సమరంలో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్ మెరుపు వేగంతో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి భారత్ మరో 38 బంతులుండగానే (11.4 ఓవర్లలోనే) లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. పాక్: 99 ఆలౌట్ భారత్: 102/2 (11.4 ఓవర్లు) మంధాన సుడిగాలి హాఫ్ సెంచరీ భారత ఓపెనర్ స్మృతి మంధాన సుడిగాలి హాఫ్ సెంచరీ బాదింది. స్వల్ప లక్ష్య ఛేదనలో మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. 31 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఫిఫ్టి పూర్తి చేసింది. మంధాన వీర బాదుడు ధాటికి టీమిండియా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 100 పరుగుల స్వల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. ఓపెనర్లు షఫాలీ వర్మ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్), మంధాన (26 బంతుల్లో 44; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా మంధాన పాక్ బౌలర్లను చీల్చి చెండాడుతుంది. ఈ దశలో షఫాలీ వర్మ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైంది. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 61/1. కుప్పకూలిన పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్.. భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి పాక్ నడ్డి విరిచారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో (18వ ఓవర్లో) పాక్ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. రాధా యాదవ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రేణుకా సింగ్, మేఘన సింగ్, షఫాలి వర్మ తలో వికెట్ సాధించారు. ముగ్గురు బ్యాటర్లు రనౌటయ్యారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మునీబా అలీ (32) టాప్ స్కోరర్‌గా నిలిచింది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 66/4 ఇన్నింగ్స్ ఆరంభంలో నత్తనడకలా సాగిన పాక్ స్కోర్ బోర్డు 12 ఓవర్లు ముగిసాక కూడా అదే తీరులో సాగుతోంది. 8వ ఓవర్లో 14 పరుగులు సాధించిన ఆ జట్టు.. ఆ తర్వాత స్నేహ్ రాణా వేసిన 9వ ఓవర్లో మహరూఫ్ (17), మునీబా అలీ (32) వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత రేణుకా సింగ్ వేసిన 12వ ఓవర్లో పాక్ మరో వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ బౌలింగ్‌లో రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి అయేషా నసీమ్ (10) పెవిలియన్ బాట పట్టింది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 66/4గా ఉంది. ఆలియా రియాజ్(1), ఒమైమా సొహైల్ (5) క్రీజ్‌లో ఉన్నారు. నత్తనడకన సాగుతున్న పాక్ బ్యాటింగ్.. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన పాక్ ఇన్నింగ్స్ నత్తనడకను తలపిస్తుంది. సున్నా పరుగులకే రెండో ఓవర్లో వికెట్ కోల్పోయిన ఆ జట్టు 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి కేవలం 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. బిస్మా మహరూఫ్ (16), మునీబా అలీ (18) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పాక్ టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్‌కు రెండో ఓవర్లోనే వికెట్ దక్కింది. మేఘన సింగ్ బౌలింగ్‌లో యస్తిక క్యాచ్ పట్టడంతో ఇరామ్ జావీద్ డకౌట్‌గా వెనుదిరిగింది. అంతకుముందు తొలి ఓవర్‌ను రేణుకా సింగ్ మెయిడిన్ చేసింది. 2 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 7/1. క్రీజ్‌లో బిస్మా మహరూఫ్ (5), మునీబా అలీ (1) ఉన్నారు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదింపు మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే వరుణుడు ఆటంకం కలిగించడంతో టాస్ గంటకు పైగా ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ టీమిండియాతో హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండింది. అయితే మ్యాచ్ వేదిక అయిన ఎడ్జ్‌బాస్టన్‌లో జల్లులు కురుస్తుండటంతో కనీసం టాస్ కూడా సాధ్యపడలేదు. వరుణుడు శాంతించి మ్యాచ్ సజావుగా సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు సంబంధించి ఇవాళ (జులై 31) హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాక్‌లు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రీడల్లో గ్రూప్-ఏలో పోటీపడుతన్న ఇరు జట్లు.. తమతమ మొదటి మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధుల చేతుల్లో పరాజయం పాలయ్యారు. భారత్.. ఆరంభ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలవ్వగా.. పాక్‌కు పసికూన బార్బడోస్ (15 పరుగుల తేడాతో ఓటమి) షాకిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతుంది. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు నాలుగు పతకాలు సాధించి మాంచి జోరు మీద ఉంది. భారత్ సాధించిన నాలుగు పతాకలు వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించగా, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతాకలు సాధించారు. -
ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం ఐర్లాండ్‌తో జరగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో భువీ, పాండ్యా, అవేశ్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. ఇక 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో దీపక్ హుడా(47), ఇషాన్ కిషన్(26), హార్ధిక్ పాండ్యా(24) పరుగులతో రాణించారు. మ్యాచ్ ప్రారంభానికి వరుణుడి ఆటంకం టాస్ తర్వాత వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గాక మ్యాచ్ ప్రారంభంకానుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు ఇవాళ (జూన్ 26) ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడనుంది. డబ్లిన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), చహల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ ఐర్లాండ్: ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), హ్యారీ టెక్టార్, గ్యారీ డెలానీ, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్, మార్క్ అడైర్, జాషువా లిటిల్, జార్జ్ డాక్రెల్, ఆండీ మెక్‌బ్రైన్, కానర్ ఆల్ఫర్ట్, క్రెయిగ్ యంగ్ -
ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్: దేశంలో కరోనా డేంజర్ బెల్స్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,313 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 38 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. ఇదే సమయంలో కరోనా నుంచి 10,972 మంది కోలుకున్నారు. ఇక, దేశవ్యాప్తంగా 84వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో సైతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 400లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. #COVID19 | India reports 13,313 fresh cases, 10,972 recoveries and 38 deaths in the last 24 hours. Active cases 83,990 Daily positivity rate 2.03% pic.twitter.com/u8Q2WhlI3w — ANI (@ANI) June 23, 2022 ఇది కూడా చదవండి: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఎన్నంటే..? -
అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సీఎం ఉద్దవ్ ఠాక్రే
Maharashtra Political Crisis Updates: ►సీఎంగా దిగిపోవడానికి తాను సిద్ధమని ప్రకటించిన ఉద్దవ్ ఠాక్రే బుధవారం రాత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. సీఎంగా దిగిపోవడానికి సిద్ధం: ఉద్దవ్ ఠాక్రే ►మహారాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రసంగించారు. సొంత పార్టీ నేతలే నన్ను వ్యతిరేకించడంతో షాక్ అయ్యానని తెలిపారు. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటానని పేర్కొన్నారు. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉందన్న సీఎం.. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గవర్నర్‌కు కూడా తెలియజేశానని చెప్పారు. తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందన్నారు. ► ‘శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలి. సీఎం నివాస గృహం వర్షను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చర్చలకు రావాలని రెబల్ ఎమ్మెల్యేలను, ఏక్నాథ్ షిండేను ఆహ్వానిస్తున్నా. నేను నమ్మకద్రోహానికి గురయ్యాను. నాతో ఏక్నాథ్ షిండే నేరుగా మాట్లాడాలి. శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను.’ అని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. కిడ్నాప్ చేశారు ►రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండేతో కలిసి సూరత్ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ అక్కడి నుంచి తిరిగి మహారాష్ణ చేరుకున్నారు. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను కిడ్నాప్ చేసి సూరత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు. బలవంతంగా ఆసుపత్రిలో చేర్పించి తనకు గుండెపోటు రానప్పటికీ ఇంజెక్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. సూరత్ నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డానని అన్నారు. తను శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేకు మద్దతుగా ఉన్నానని స్పష్టం చేశారు. శివసేన అల్టిమేటంపై తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాత్ షిండే స్పందించారు. శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు లెటర్ చెల్లదని ఏక్నాథ్ అన్నారు. శివసేన చీఫ్ విప్‌ను ఏక్నాథ్ షిండే మార్చారు. చీఫ్‌విప్‌గా భరత్ గోగ్వాలేనునియమించారు. ఈ తీర్మాణంపై 34 మంది ఎమ్మెల్యే సంతకాలు చేశారు. ►ఉద్దవ్ వర్గానికి విప్ జారీ చేసే అధికారం లేదని ఏక్నాథ్ షిండే అన్నారు. ఉద్దవ్ నివాసంలో జరిగే ఎమ్మెల్యేల భేటీ రాజ్యంగ విరుద్దమన్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. శివసేన అల్టీమేటం ►రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన అల్టీమేటం జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు ఎమ్మెల్యేలు సమావేశానికి రావాలని విప్ జారీ చేసింది. రాకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని శివసేన వార్నింగ్ ఇచ్చింది ఉద్దవ్ ఠాక్రేకు కరోనా ►మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఉద్దవ్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఉద్దవ్‌కు కరోనా కారణంగా కలవలేకపోయానని కమల్‌నాథ్ తెలిపారు. ఇప్పటికే కరోనాతో మహారాష్ట్ర గవర్నర్ ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో గోవా గవర్నర్ శ్రీధరన్ పిల్లైకు మహారాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర కేబినెట్ భేటీ ► మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర కేబినెట్ వర్చువల్‌గా భేటీ అయ్యింది. కేబినెట్ సమావేశానికి 8 మంది మంత్రులు హాజరు కాలేదు. కేబినెట్‌కు గైర్హాజరైన మంత్రులు.. 1. ఏక్నాథ్ షిండే. 2. గులాబ్దావ్ పాటిల్ 3. దాదాభూషే 4. సందీపన్ బుమ్రే 5. అబ్దుల్ సత్తార్ 6. శంభూరాజ్ దేశామ్ 7. బచ్చు కాడు 8. రాజేంద్ర యడ్రావ్కర్ ► మహారాష్ట్ర రాజకీయాల్లో గంట గంటలో మలుపు చోటు చేసుకుంటోంది. అస్సాం గౌహతి హోటల్లో తన మద్దతుదారులతో మకాం వేసిన శివ సేన రెబల్ గ్రూప్ సారధి ఏక్నాథ్ షిండేకు ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌కు కరోనా ►బుధవారం మధ్యాహ్నం ముంబైకి వెళ్లి.. మహారాష్ట్ర గవర్నర్‌తో భేటీ కావాలని షిండే వర్గం అనుకుంది. ఈలోపే ఆయన కరోనాతో ఆస్పత్రి పాలవ్వడం గమనార్హం. ఎనభై ఏళ్ల కొష్యారి.. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో బుధవారం చేరారు.నిరంతరం మాస్క్‌లోనే కనిపించే ఆయన వైరస్ బారిన పడడం, అదీ షిండే భేటీ నేపథ్యానికి కంటే కాస్త ముందే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ► మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగనుంది. ► మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ► సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు.. ఆదిత్య థాక్రే తన ట్విట్టర్ ఖాతాలో మంత్రి హోదాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ► శివ సేన ఎమ్మెల్యేల నుంచి మరో ఇద్దరు ఏక్నాథ్ షిండే గ్రూప్‌లోకి జంప్ కొట్టారు. దీంతో షిండే వర్గీయుల సంఖ్య 46కు చేరింది. ► మహారాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఛార్టెర్డ్ ఫ్లైట్‌లో బుధవారం ఉదయం సూరత్(గుజరాత్) నుంచి గౌహతి(అసోం) చేరుకున్న శివ సేన రెబల్స్ ఓ హోటల్లో దిగారు. అయితే శివ సేన నేత ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో వీళ్లంతా తిరిగి ముంబైకి వెళ్లనున్నట్లు సమాచారం. ► తన మద్దతుదారులతో(దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు!) ప్రత్యేక ఫ్లైట్‌లో ముంబైకి చేరనున్న ఏక్నాథ్ షిండే.. మధ్యాహ్నం తర్వాత మహారాష్ట్ర గవర్నర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక షిండేతో నేరుగా ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు సీఎం ఉద్దవ్ థాక్రే. ► ఎన్సీపీ, కాంగ్రెస్ జట్టు వీడి.. తిరిగి బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏక్నాథ్ షిండ్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కూటమిలోని ఇరు పార్టీలు ఈ సంక్షోభాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. -
ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్: భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్
దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతోంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేవంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,216 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 23 మంది మృతిచెందారు. దీంతో, దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,32,70,577 కు చేరుకుంది. ఇక మరణించిన వారి సంఖ్య 5,24,840కి చేరింది. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి.పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,148 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,90, 845కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 00,42,768 మందికి కరోనా వ్యాక్సిన్లను అందించినట్టు కేంద్రం తెలిపింది. మరోవైపు.. తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న(శుక్రవారం) తెలంగాణలో 27,841 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 172 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఇక, మేడ్చల్‌లో 20, రంగారెడ్డిలో 62, కరీంనగర్లో 4 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో ప్రస్తుతం 1,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. #COVID19 | India reports 13,216 new cases, 8,148 recoveries and 23 deaths in the last 24 hours. Active cases 68,108 Daily positivity rate (2.73%) pic.twitter.com/2RM2vtVa4e — ANI (@ANI) June 18, 2022 -
చెలరేగిన హర్షల్, చహల్.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం
సత్తా చాటిన భారత బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం భారత బౌలర్లు హర్షల్ పటేల్ (4/25), చహల్ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు ఇషాన్ కిషన్ (54), రుతురాజ్ గైక్వాడ్ (57) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీలు భారత బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెస్ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఓటమి దిశగా పయనిస్తున్న దక్షిణాఫ్రికా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్న దక్షిణాఫ్రికా ఓటమి దిశగా పయనిస్తుంది. 9 వికెట్ కోల్పోయే సమయానికి జట్టు 7 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా భారత బౌలర్లు వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. 9వ ఓవర్లో చహల్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ప్రిటోరియస్ (20) ఔట్ కాగా.. 11వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి మిల్లర్ (3) వెనుదిరిగాడు. 11 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 71/5. క్రీజ్‌లో క్లాసెన్, పార్నెల్ ఉన్నారు. డస్సెన్ ఔట్ వరుస ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి డస్సెన్ (1) ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 40/3. క్రీజ్‌లో ప్రిటోరియస్, క్లాసెన్ ఉన్నారు. రెండో వికెట్ డౌన్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్ ఇచ్చి హెండ్రిక్స్ (23) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 38/2. క్రీజ్‌లో ప్రిటోరియస్, డస్సెన్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు ఇన్నింగ్స్ 4వ ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి బవుమా(8) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 23/1. క్రీజ్‌లో హెండ్రిక్స్, ప్రిటోరియస్ ఉన్నారు. సౌతాఫ్రికా టార్గెట్ 180 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్ కిషన్‌లు అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (21 బంతుల్లో 31 నాటౌట్) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోర్ సాధించగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ 2, రబాడ, షంషి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్ రబాడ వేసిన 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ ఔటయ్యాడు. 8 బంతుల్లో 6 పరుగులు చేసిన డీకే పార్నెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 167/4. క్రీజ్‌లో హార్ధిక్ (20), అక్షర్ ఉన్నారు. పంత్ ఔట్ ప్రస్తుత సిరీస్‌లో రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతుంది. తొలి రెండు టీ20ల్లో నిరాశపరిచిన పంత్ ఈ మ్యాచ్‌లోనూ విఫలయ్యాడు. 8 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసిన పంత్ ప్రిటోరియస్ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 148/4. క్రీజ్‌లో హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 3 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 128 పరుగుల వద్ద శ్రేయస్ వికెట్ కోల్పోయిన భారత్ 131 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54) వికెట్‌ను చేజార్చుకుంది. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 133/3. క్రీజ్‌లో పంత్, హార్ధిక్ పాండ్యా ఉన్నారు. మరోసారి నిరాశపరిచిన శ్రేయస్ వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి నిరాశపరిచాడు. 11 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసిన అతను.. షంషి బౌలింగ్‌లో నోర్జేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 128/2. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (53), పంత్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ధాటిగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రుతురాజ్ కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 97/1. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (36), శేయస్ అయ్యర్ ఉన్నారు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన రుతురాజ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడుతున్న రుతురాజ్.. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ధనాధన్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రుతురాజ్.. కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 89/0గా ఉంది. రుతురాజ్ (54), ఇషాన్ కిషన్ (35) క్రీజ్‌లో ఉన్నారు. ధాటిగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రుతురాజ్ (16), ఇషాన్ కిషన్ (6) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఫలితంగా టీమిండియా 3 ఓవర్లలో వికెట్ నష్టాపోకుండా 22 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన దక్షిణాఫ్రికా సైతం ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆతృతగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులేకుండా బరిలోకి దిగుతున్నాయి. భారత్ తుదిజట్టు: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా తుదిజట్టు: టెంబా బావుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే -
భారత్‌లో మళ్లీ పెరిగిన కేసులు.. కేంద్రం అలర్ట్
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ టెన్షన్ పెడుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే 5 రాష్ట్రాలకు(తెలంగాణ కూడా) లేఖ రాసిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,270 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 15 మంది చనిపోయారు. అదే సమయంలో 2,619 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 24,052 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. కేరళలో శనివారం ఒక్కరోజే 1,544 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 4,31,76,817 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. 5,24,692 మంది వైరస్ కారణంగా చనిపోయారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రను మరోసారి కరోనా కలవరపాటుకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో మాస్క్ తప్పనిసరిని చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైళ్లు, బస్సులు, సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్, ఆఫీసులు, ఆస్పత్రులు, కాలేజీలు, స్కూల్స్.. ఇలా క్లోజ్డ్గా ఉండే పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ తప్పనిసరి అని ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. #COVID19 | India reports 4,270 fresh cases, 2,619 recoveries, and 15 deaths in the last 24 hours. Total active cases are 24,052. pic.twitter.com/dnj8s4yznF — ANI (@ANI) June 5, 2022 ఇది కూడా చదవండి: నేడు ప్రపంచ పర్యావరణ దినం: ఒక్కటే భూమి..ఒక్కటై కాపాడుకుందాం -
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. నిర్ణయాలు ఇవే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మీటింగ్ అనంతరం జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యవసాయానికి, ప్రాజెక్టులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘‘రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సాగునీరు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. గతేడాది కంటే ముందుగా వ్యవసాయ సీజన్ ప్రారంభించాలని, సాగుకు సరిపడా నీటిని నిల్వచేయాలని నిర్ణయం. ధవళేశ్వరం వద్ద డెడ్ స్టోరేజీని వినియోగించుకోవాలి. జూన్ 10 నుంచి కృష్ణా డెల్లా, పులిచింతల నీటి వినియోగం. జూన్ 30 నుంచి రాయలసీమ ప్రాజెక్టుల నీరు వినియోగం. నీటి వినియోగానికి సంబంధించి రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు’’ అని తెలిపారు. ఈ క్రమంలో రైతులు ఖరీఫ్‌కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అంబటి సూచించారు. ఖరీఫ్ సీజన్‌ను ముందే ప్రారంభిస్తే.. పంట కూడా ముందుగానే చేతికి వస్తుందని ఆయన తెలిపారు. నవంబర్‌లో తుఫానులు వచ్చే నాటికే పంట చేతికి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన రైతులు కూడా మూడు పంటలు వేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో ప్రాజెక్టులు నిండాక ఆగస్టులో నీరు విడుదల చేసేవారని, తాము మాత్రం ముందుగానే నీటిని విడుదల చేయనున్నామని అంబటి స్పష్టం చేశారు. -
India Vs South Africa: ఉత్కంఠ భరిత పోరులో భారత్ ఓటమి.. వరల్డ్‌కప్ నుంచి ఔట్
-
మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం: సీఎం జగన్
-
వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం: సీఎం జగన్
-
మహిళలకు మంచి చేసే మనసు చంద్రబాబుకు లేదు: సీఎం జగన్
-
పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతాం: సీఎం జగన్
-
పెగాసస్ స్పైవేర్ వ్యవహారం.. విచారణకు హౌస్ కమిటీ
-
పేదలను ఇంటి యజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
-
Live Blog: ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
-
మణిపూర్ చివరి దశలో 76% ఓటింగ్
Live Updates: మణిపూర్ చివరి దశలో 76% ఓటింగ్ ఇంఫాల్: మణిపూర్ శాసనసభ చివరి దశ ఎన్నికలు శనివారం జరిగాయి. 6 జిల్లాల్లోని 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1,247 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సేనాపతి జిల్లాలోని కారోంగ్ అసెంబ్లీ స్థానం పరిధిలోని నగాంజ్మూ పోలింగ్‌స్టేషన్ వద్ద ఇద్దరిపై కాల్పులు జరిగినట్లు పోలీసులు చెప్పారు. దీంతో ఇక్కడ కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. చివరి దశలో 76.04% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా సేనాపతి జిల్లాలో 82.02% శాతం, థౌబాల్ జిల్లాలో 78% ఓటింగ్ రికార్డయినట్లు వెల్లడించింది. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఓ,.ఇబోబి సింగ్ థౌబాల్ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► మణిపూర్‌లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. తౌబాల్ జిల్లాలోని పోలింగ్ కేంద్రం ఓట్లు వేయడానికి ప్రజలు క్యూకట్టారు. ‘నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని, తాము ఉద్యోగ అవకాశాల కోసం ఓటు వేస్తున్నాము’ అని ఓటు వేసిన యువతీయువకులు మీడియాతో పేర్కొన్నారు. ►మణిపూర్ రెండో విడత పోలింగ్: ఉదయం 11 గంటల వరకు 28.19% ఓటింగ్ నమోదు మణిపూర్ రెండో విడత పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు 28.19 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లాల వారీగా ఓటింగ్ శాతం: 1 తౌబల్ 29.55% 2 చందేల్ 28.24% 3 ఉఖ్రుల్ 30.66% 4 సేనాపతి 27.86% 5 తమెంగ్లాంగ్ 20.41% 6 జిరిబామ్ 32.68% ►మణిపూర్‌లో పోలింగ్ సంబంధిత హింసలో ఇద్దరు మృతి మణిపూర్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా వేర్వేరుగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. స్థానిక మీడియా ప్రకారం.. మొదటి సంఘటన తౌబాల్ జిల్లాలో జరగగా, రెండవది సేనాపతి జిల్లాలో జరిగినట్లు సమాచారం. 41/52 Paorolon poll started on time taking due covid safety measures.#ECI #ElectionCommissionOfIndia #CEOManipur #SVEEP #ManipurVotes2022 #CovidSafeElections #ManipurElection2022 pic.twitter.com/l0cFuPZBZp — The CEO Manipur (@CeoManipur) March 5, 2022 ►మణిపూర్‌లోని బీజేపీ నేత నివాసం వెలుపల పేలుడు మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో బీజేపీ బహిష్కరణకు గురైన ఛ బిజోయ్ నివాసం వద్ద గుర్తుతెలియని కొందరు దుండగులు బాంబును పేల్చినట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ►రెండో విడత ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 11.40% ఓటింగ్ నమోదైంది ►హీరోక్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాధేశ్యామ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అయన మాట్లాడుతూ.. కనీసం 5000 ఓట్ల తేడాతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మణిపూర్ ఎన్నికలు..ప్రధాని ట్వీట్: ►నేడు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల ప్రజలందరూ అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. Today is the second phase of the Manipur Assembly elections. Calling upon all those whose constituencies are polling today to vote in large numbers and mark the festival of democracy. — Narendra Modi (@narendramodi) March 5, 2022 ►మణిపూర్ మాజీ సిఎం & కాంగ్రెస్ నాయకుడు ఓక్రమ్ ఇబోబి సింగ్ సాంకేతిక లోపం కారణంగా పోలింగ్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఆలస్యంగా ఓటు వేశారు. ►మొదటి విడతలో ఫిబ్రవరి 28న పోలింగ్ జరిగిన 5 నియోజకవర్గాల్లోని 12 పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ►ఎలాంటి విరామం లేకుండా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నట్లు సమాచారం. ►ప్రారంభమైన మణిపూర్ రెండో విడత ఎన్నికలు.. శనివారం 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంఫాల్: మణిపూర్ అసెంబ్లీ చివరి, రెండో విడత పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో ఆరు జిల్లాలకు చెందిన 22 నియోజకవర్గాల్లోని 8.38 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 1,247 పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎలక్టోరల్ అధికారి రాజేష్ అగర్వాల్ చెప్పారు. -
మెరిసిన శ్రేయస్.. మరో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
-
IND VS SL 2nd T20: బ్యాటర్ల విశ్వరూపం.. భారీ టార్గెట్‌ను ఊదేసిన రోహిత్ సేన
-
మూడో రోజుకు చేరిన యుద్ధం
-
Live Updates: ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం
LIVE UPDATES: ముంబై చేరుకున్న 219 మంది భారతీయుల తొలి విమానం రష్యా- ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రుమేనియా నుంచి బయల్దేరిన ఎయిరిండియా తొలి విమానం ముంబై చేరుకుంది. ఈ విమానంలో 219 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం మూడు రోజులుగా రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై సైనిక దాడులను కోనసాగిస్తోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ ప్రటిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెరికా.. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా 350 మిలియన్ డాలర్లను అందిస్తున్నట్లు ఆమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ ట్విటర్లో పేర్కొన్నారు. న్యూఢిల్లీ: భారత్ సాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఫోన్ చేశారు. రష్యా దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని మోదీని కోరారు. ఐరాసలో రష్యాకు వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే లక్ష మంది రష్యా చొరబాటుదారులు ఉక్రెయిన్‌లోకి వచ్చారని తెలిపారు. ►తమ దేశంలో సైనిక దాడులు ఆపాలని పుతిన్‌పై ఒత్తిడి చేయాలంటూ.. రష్యా ప్రజలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ► ఉక్రెయిన్ 14 మిలటరీ ఎయిర్‌ఫీల్డ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్‌ను దెబ్బ తీశామని తెలిపింది. ఉక్రెయిన్‌లో 48 రాడార్ స్టేషన్లను పడగొట్టామని రష్యా ప్రకటించింది. ► రష్యాపై యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. స్విఫ్ట్ పద్ధతిలో నగదు బదిలీపై రష్యాపై ఆంక్షలు విధించాయి. ► ఉక్రెయిన్‌కు సైనికులను పంపలేమని కానీ, ఆయుధాలు, వాహనాలు, మందుగుండు, మోర్టార్లు అందిస్తామని ఉక్రెయిన్‌తో ఫ్రాన్స్ తెలిపింది. ► ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులను పోలాండ్ దేశం తీవ్రంగా తప్పుపట్టింది. రష్యాతో ప్రపంచకప్ సాకర్ క్వాలిఫై మ్యాచ్‌ను పోలండ్ రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ► ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ దేశ సరిహద్దులు దాటుకొని ఇప్పటివరకు సుమారు లక్ష మంది పౌరులు పోలండ్ దేశానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్ ప్రజలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ► ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ తమ ఆధీనంలోకి వచ్చిందని ప్రకటించిన రష్యా. రష్యా ప్రకటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఖండించారు. ఇంకా రాజధాని నగరం కీవ్‌పై తాము పట్టు కోల్పోలేదని స్పష్టం చేశారు. రష్యా దాడుల్లో 198 మంది మృతి: ఉక్రెయిన్ ఆరోగ్యశాఖ మంత్రి ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకు 198 మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి విక్టర్ లియాష్కో వెల్లడించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారని, సుమారు వెయ్యి మంది గాయాలాపాలు అయ్యారని తెలిపారు. అయితే మృతి చెందిన వారిలో సైనికులు, పౌరులు కలిపి ఉన్నారా? లేదా? అని స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు రష్యా దాడుల్లో.. 33 మంది పిల్లలతో సహా 1,115 మంది మృతి చెందినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా కార్కీవ్ నగరంలో 100 రష్యా ట్యాంకర్లను దెబ్బతీశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ► ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడోరోజూ కూడా కొనసాగుతున్నాయి. కీవ్ నగరంపై రష్యా సేనలు క్షిపణి దాడులు చేస్తున్నాయి. ఆర్మీ బేస్ విక్టరీ అవెన్యూపైన రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. రష్యా దళాలను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. మెలిటోపోల్ నగరం తమ వశమైనట్లు రష్యా ప్రకటించింది. ► భారతీయ పౌరులు, విద్యార్థులు తరలింపు ప్రారంభమైంది. రుమేనియా నుంచి తొలి ఎయిర్ ఇండియా విమానం బయల్దేరింది. విమానంలో మొత్తం 219 మంది భారతీయులు ఉన్నారు. ఈ రోజు( శనివారం) రాత్రి 8.45 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ముంబైకి చేరుకోనుంది. ► దేశం విడిచి వెళ్లనని స్పష్టం చేసిన జెలెన్స్కీ కీవ్ వీధుల్లో తిరుగుతూ వీడయో పోస్ట్ చేసిన జెలెన్స్కీ అమెరికాకు రావాలన్న బైడెన్ ఆఫర్‌ను తిరస్కరించిన ఉక్రెయిన్ ప్రెసెడెంట్ ఉక్రెయిన్ను వదిలి రాలేను, నా కుటుంబంతో పాటు కీవ్‌లోనే ఉంటానని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ►ఉక్రెయిన్ సరిహద్దుల్లో అమెరికా యుద్ధ విమానాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో 2 అమెరికా యుద్ధ విమానాలు సంచరిస్తున్నట్లు గుర్తించామన్న రష్యా జెలెన్స్కీని తరలించేందుకు విమానాలు వచ్చాయని ప్రచారం అమెరికా విమానాలపై ఆరా తీస్తున్న రష్యా ఏ క్షణమైనా కీవ్ అధ్యక్ష భవనాన్ని రష్యా ఆక్రమించుకునే అవకాశం ►ఉక్రెయిన్‌లో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో తమ పిల్లలతో ఉన్న కమ్యూనికేషన్ కూడా లేకపోవడంతో వారు ఎలా ఉన్నారోనని కుటుంబసభ్యుల ఆందోళన చెందుతున్నారు. ►బుకారెస్ట్ చేరుకున్న ఎయిరిండియా విమానం రష్యా మొదలు పెట్టిన మిలటరీ చర్యతో ఉక్రెయిన్ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. కొందరు నానాకష్టాలు పడుతూ సరిహద్దు దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దేశంలో భారతీయులు చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ ఉన్న భారత పౌరులను తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం AI-1943 పంపారు. ప్రస్తుతం ఆ విమానం రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది. A special flight of Air India AI-1943 lands at Bucharest in Romania for the evacuation of stranded Indians. pic.twitter.com/YGYoVGMcQS — ANI (@ANI) February 26, 2022 ►స్వీడెన్, ఫిన్లాండ్కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ నాటో విషయంలో తాము చెప్పినట్టు వినకపోతే ఉక్రెయిన్ పరిణామాలే స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. నాటో కూటమిలో చేరే ప్రయత్నం చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ►కొనసాగుతున్న దాడులు.. ఉక్రెయిన్‌లో గందరగోళం.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి మూడు రోజులైనా దాడులు కొనసాగుతూనే ఉంది.| దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని ప్రజలను అక్కడి పరిస్థితులు అయోమయంలో నెట్టాయి. దాడి తర్వాత, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఉక్రెయిన్ ప్రజలు పోలాండ్ సరిహద్దులో పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కిలోమీటరు పొడవునా జనం, సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. ►ఉక్రెయిన్‌పై దాడి ఆపకపోవడంతో నాటో దేశాలు రష్యాపై సైబర్ ఎటాక్స్ ప్రారంభించాయి. ►కీవ్ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రష్యన్ బలగాలకు పుతిన్ పిలుపునివ్వడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాంబులు వర్షం కురుస్తూనే ఉంది. ►ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులకు కీలక సూచన ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయులకు కైవల్‌లోని భారత ఎంబసీ కీలక సూచనలు చేసింది. భారత అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తన పౌరులకు సూచించింది. ఈ మేరకు ట్వీటర్లో తెలిపింది. Advisory to all Indian Nationals/Students in Ukraine as on 26 February 2022.@MEAIndia @PIB_India @PIBHindi @DDNewslive @DDNewsHindi @DDNational @IndianDiplomacy pic.twitter.com/yN6PT2Yi8c — India in Ukraine (@IndiainUkraine) February 26, 2022 ఉక్రెయిన్‌కు సమీపంలో రష్యా బలగాలు శాటిలైట్ చిత్రం ►రష్యా దళాలు ఉక్రెయిన్‌పై జరిపిన దాడిలో దాదాపు 2,800 మంది సైనికులు, 80 ట్యాంకులను కోల్పోయాయని డిప్యూటీ డిఫెన్స్ మంత్రి హన్నా మాల్యార్ శుక్రవారం తెలిపారు. వీటితో పాటు రష్యన్ దళాలు దాదాపు 516 సాయుధ పోరాట వాహనాలు, 10 విమానాలు, ఏడు హెలికాప్టర్లను కోల్పోయాయని ఆమె తన ఫేస్బుక్ ద్వారా తెలిపింది. కీవ్‌లో తోలుబొమ్మ పాలన అణచివేతకే సైనిక చర్య అణిచివేత నుంచి ఉక్రెయిన్ల విముక్తి పొందాలని అందుకే ఈ సైనిక చర్యని రష్యన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌లో సైనిక చర్య కొనసాగించాలనుకోవడం లేదని, మిలటరీ ఆపరేషన్ తర్వాత దళాలను విరమించుకుంటామన్నారు. ఉక్రెయిన్ భూభాగం రష్యాకు అవసరం లేదని, ఆక్రమించుకునే ఉద్దేశ్యం కూడా తమకు లేదని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఉక్రెయిన్‌లో కొత్త ప్రభుత్వం రావాలిని తెలిపారు. యూకే గగనతలం నుంచి రష్యన్ ప్రైవేట్ జెట్లను నిషేదిస్తున్నాం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడికి ప్రతిస్పందనగా యూకే గగనతలం నుంచి రష్యన్ ప్రైవేట్ జెట్లను తక్షణమే నిషేధిస్తున్నట్లు బ్రిటిష్ రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ శుక్రవారం ప్రకటించారు. యూకేలో మా నిషేధాన్ని పటిష్టం అమలు చేస్తాము, ఈ నిర్ణయం కూడా వెంటనే అమలులోకి వస్తుందని షాప్స్ ట్వీట్ చేశారు. పుతిన్ చర్యలు చట్టవిరుద్ధం, అంతేకాకుండా ఉక్రెయిన్‌లో రష్యా దూకుడు నుంచి ప్రయోజనం పొందేవారికి కూడా ఇటువంటే పరిణామాలనే ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. -
ఇషాన్, శ్రేయస్‌ల విధ్వంసం.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం
-
పీరియాడికల్ లవ్‌స్టోరీ చిత్రంతో రాబోతోన్న తేజ
తన పుట్టిన రోజు (ఫిబ్రవరి 22) సందర్భంగా తాజా చిత్రాల అప్డేట్స్ ఇచ్చారు దర్శకుడు తేజ. 1836వ సంవత్సరంలో సాగే పీరియాడికల్ లవ్‌స్టోరీతో ‘విక్రమాదిత్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2022 ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాలకు ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు తేజ. కాగా తేజ కెరీర్లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘జయం’ సినిమా షూటింగ్ సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే ముహూర్తాన మొదలైంది. ఇక ‘విక్రమాదిత్య’ సినిమా విషయానికివస్తే.. 1836వ సంవత్సరంలో సర్ ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగింది. కాబట్టి ‘విక్రమాదిత్య’ సినిమా కథకు, ఈ వంతెనకు సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. -
ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ చాంపియన్స్‌గా భారత్
-
U-19 ప్రపంచకప్ సెమీఫైనల్ లైవ్ అప్డేట్స్: భారత్ వర్సస్ ఆసీస్
-
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. వివరించిన మంత్రి
Lata Mangeshkar Health Is Improving Says Maharashtra Health Minister: ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 92 ఏళ్ల లతా స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ముబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చారు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. లతా మంగేష్కర్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం జల్నాలో విలేకర్లతో సమావేశమై ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. 'లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులతో చర్చించాను. అలాగే ఆసుపత్రి అధికార ప్రతినిధి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్ యాజామాన్యాన్ని కోరాను.' అని మంత్రి రాజేశ్ టోపే తెలిపారు. ఇదీ చదవండి: లతాజీ గొంతు బావుండదు.. -
పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ !.. ఆ సినిమా నుంచి
Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Crazy Update: పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ మూవీ వాయిదా పడింది. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25కి పోస్ట్‌పోన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే నిరాశలో ఉన్న పవన్ అభిమానులను ఉత్తేజపరిచేందుకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం. పవన్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. ఈ సినిమాలో ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేశానని దేవీశ్రీ తెలిపాడట. సినిమాలోని ఈ సాంగ్స్ ఎనర్జిటిక్, మెలోడియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. టాలీవుడ్లో సూపర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ సినిమా గబ్బర్ సింగ్. ఈ చిత్రం తర్వాత మళ్లీ హరీశ్ శంకర్‌తో పవర్ స్టార్ కాంబో రిపీట్ కానుంది. దీంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ 28వ చిత్రంగా వస్తోన్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాకు ఇది కేవలం వినోదం మాత్రమే కాదు అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తిరేకెత్తిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇదీ చదవండి: మారిపోయిన రష్మిక పేరు.. మందన్నా కాదట