Russian Invasion Ukraine Third Day: Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

Russia-Ukraine Live Updates: లక్షమంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోకి చొరబాటు

Published Sat, Feb 26 2022 10:09 AM | Last Updated on Sat, Feb 26 2022 8:26 PM

Russian Invasion Ukraine Third Day: Live Updates In Telugu - Sakshi

LIVE UPDATES:

ముంబై చేరుకున్న 219 మంది భారతీయుల తొలి విమానం
రష్యా- ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో రుమేనియా నుంచి బయల్దేరిన ఎయిరిండియా తొలి విమానం ముంబై చేరుకుంది. ఈ విమానంలో 219 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 

ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం ​​​​​
మూడు రోజులుగా రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై సైనిక దాడులను కోనసాగిస్తోంది. రష్యా దాడులను ఉక్రెయిన్‌ ప్రటిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెరికా.. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా 350 మిలియన్‌ డాలర్లను అందిస్తున్నట్లు ఆమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.  

న్యూఢిల్లీ: భారత్‌ సాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఫోన్‌ చేశారు. రష్యా దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని మోదీని కోరారు. ఐరాసలో రష్యాకు వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని జెలెన్‌స్కీ​ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే లక్ష మంది రష్యా చొరబాటుదారులు ఉక్రెయిన్‌లోకి వచ్చారని తెలిపారు.   

తమ దేశంలో సైనిక దాడులు ఆపాలని పుతిన్‌పై ఒత్తిడి చేయాలంటూ.. రష్యా ప్రజలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు.

► ఉక్రెయిన్‌ 14 మిలటరీ ఎయిర్‌ఫీల్డ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ను దెబ్బ తీశామని తెలిపింది. ఉక్రెయిన్‌లో 48 రాడార్‌ స్టేషన్లను పడగొట్టామని రష్యా ప్రకటించింది.

► రష్యాపై యూరప్‌ దేశాలు ఆంక్షలు విధించాయి. స్విఫ్ట్‌ పద్ధతిలో నగదు బదిలీపై రష్యాపై ఆంక్షలు విధించాయి.

► ఉక్రెయిన్‌కు సైనికులను పంపలేమని  కానీ, ఆయుధాలు, వాహనాలు, మందుగుండు, మోర్టార్లు అందిస్తామని ఉక్రెయిన్‌తో ఫ్రాన్స్‌ తెలిపింది.

► ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులను పోలాండ్‌ దేశం తీవ్రంగా తప్పుపట్టింది. రష్యాతో ప్రపంచకప్‌ సాకర్‌ క్వాలిఫై మ్యాచ్‌ను పోలండ్‌ రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశ సరిహద్దులు దాటుకొని ఇప్పటివరకు సుమారు లక్ష మంది పౌరులు పోలండ్‌ దేశానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్‌ ప్రజలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. 

► ఉక్రెయిన్‌ రాజధాని నగరం  కీవ్‌ తమ ఆధీనంలోకి వచ్చిందని ప్రకటించిన రష్యా. రష్యా ప్రకటనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఖండించారు. ఇంకా రాజధాని నగరం కీవ్‌పై తాము పట్టు కోల్పోలేదని స్పష్టం చేశారు.

రష్యా దాడుల్లో 198 మంది మృతి: ఉక్రెయిన్‌ ఆరోగ్యశాఖ మంత్రి
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకు 198 మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్‌  ఆరోగ్య శాఖ మంత్రి విక్టర్ లియాష్కో వెల్లడించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారని, సుమారు వెయ్యి మంది గాయాలాపాలు అయ్యారని తెలిపారు.

అయితే మృతి చెందిన వారిలో సైనికులు, పౌరులు కలిపి ఉన్నారా? లేదా? అని స్పష్టత ఇవ్వలేదు.  మరోవైపు రష్యా దాడుల్లో.. 33 మంది పిల్లలతో సహా 1,115 మంది మృతి చెందినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా కార్కీవ్‌ నగరంలో 100 రష్యా ట్యాంకర్లను దెబ్బతీశామని ఉక్రెయిన్‌  ప్రకటించింది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడోరోజూ కూడా కొనసాగుతున్నాయి. కీవ్‌ నగరంపై రష్యా సేనలు క్షిపణి దాడులు చేస్తున్నాయి. ఆర్మీ బేస్‌ విక్టరీ అవెన్యూపైన రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. రష్యా దళాలను ఉక్రెయిన్‌ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. మెలిటోపోల్‌ నగరం తమ వశమైనట్లు రష్యా ప్రకటించింది.  

► భారతీయ పౌరులు, విద్యార్థులు తరలింపు ప్రారంభమైంది. రుమేనియా నుంచి తొలి ఎయిర్‌ ఇండియా విమానం బయల్దేరింది. విమానంలో మొత్తం 219 మంది భారతీయులు ఉన్నారు. ఈ రోజు( శనివారం) రాత్రి 8.45 గంటలకు ఎయిర్‌ ఇండియా విమానం ముంబైకి చేరుకోనుంది.

► దేశం విడిచి వెళ్లనని స్పష్టం చేసిన జెలెన్‌స్కీ
కీవ్‌ వీధుల్లో తిరుగుతూ  వీడయో పోస్ట్‌ చేసిన  జెలెన్‌స్కీ
అమెరికాకు రావాలన్న బైడెన్‌ ఆఫర్‌ను తిరస్కరించిన ఉక్రెయిన్‌ ప్రెసెడెంట్‌
ఉక్రెయిన్‌ను వదిలి రాలేను, నా కుటుంబంతో పాటు కీవ్‌లోనే ఉంటానని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో అమెరికా యుద్ధ విమానాలు
ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో 2 అమెరికా యుద్ధ విమానాలు సంచరిస్తున్నట్లు గుర్తించామన్న రష్యా
జెలెన్‌స్కీని తరలించేందుకు విమానాలు వచ్చాయని ప్రచారం
అమెరికా విమానాలపై ఆరా తీస్తున్న రష్యా 
ఏ క్షణమైనా కీవ్‌ అధ్యక్ష భవనాన్ని రష్యా ఆక్రమించుకునే అవకాశం 


ఉక్రెయిన్‌లో నిలిచిపోయిన ఇంటర్నెట్‌ సేవలు
రాజధాని కీవ్‌ సహా పలు నగరాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. దీంతో తమ పిల్లలతో ఉన్న కమ్యూనికేషన్‌ కూడా లేకపోవడంతో వారు ఎలా ఉన్నారోనని కుటుంబసభ్యుల ఆందోళన చెందుతున్నారు.

బుకారెస్ట్ చేరుకున్న ఎయిరిండియా విమానం
రష్యా మొదలు పెట్టిన మిలటరీ చర్యతో ఉక్రెయిన్‌ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. కొం‍దరు నానాకష్టాలు పడుతూ సరిహద్దు దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఆ దేశంలో భారతీయులు చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ ఉన్న భారత పౌరులను తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం AI-1943 పంపారు. ప్రస్తుతం ఆ విమానం
రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది.


స్వీడెన్‌, ఫిన్‌లాండ్‌కు పుతిన్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
నాటో విషయంలో తాము చెప్పినట్టు వినకపోతే ఉక్రెయిన్‌ పరిణామాలే ‍స్వీడన్‌, ఫిన్‌లాండ్‌ దేశాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. నాటో కూటమిలో చేరే ప్రయత్నం చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.


కొనసాగుతున్న దాడులు.. ఉక్రెయిన్‌లో గందరగోళం..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి మూడు రోజులైనా దాడులు కొనసాగుతూనే ఉంది.|

దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని ప్రజలను అక్కడి పరిస్థితులు అయోమయంలో నెట్టాయి. దాడి తర్వాత, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఉక్రెయిన్ ప్రజలు పోలాండ్ సరిహద్దులో పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కిలోమీటరు పొడవునా జనం, సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరినట్లుగా స్థానిక మీడియా తెలిపింది.

►ఉక్రెయిన్‌పై దాడి ఆపకపోవడంతో నాటో దేశాలు రష్యాపై సైబర్‌ ఎటాక్స్‌ ప్రారంభించాయి.

►కీవ్‌ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రష్యన్‌ బలగాలకు పుతిన్‌ పిలుపునివ్వడంతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై బాంబులు వర్షం కురుస్తూనే ఉంది.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులకు కీలక సూచన
ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయులకు కైవల్‌లోని భారత ఎంబసీ కీలక సూచనలు చేసింది.

భారత అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తన పౌరులకు సూచించింది. ఈ మేరకు ట్వీటర్‌లో తెలిపింది.

ఉక్రెయిన్‌కు సమీపంలో రష్యా బలగాలు శాటిలైట్ చిత్రం



►రష్యా దళాలు ఉక్రెయిన్‌పై జరిపిన దాడిలో దాదాపు 2,800 మంది సైనికులు, 80 ట్యాంకులను కోల్పోయాయని డిప్యూటీ డిఫెన్స్ మంత్రి హన్నా మాల్యార్ శుక్రవారం తెలిపారు. వీటితో పాటు రష్యన్ దళాలు దాదాపు 516 సాయుధ పోరాట వాహనాలు, 10 విమానాలు, ఏడు హెలికాప్టర్‌లను కోల్పోయాయని ఆమె తన ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది.

కీవ్‌లో తోలుబొమ్మ పాలన అణచివేతకే సైనిక చర్య
అణిచివేత నుంచి ఉక్రెయిన్ల విముక్తి పొందాలని అందుకే ఈ సైనిక చర్యని రష్యన్‌ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌లో సైనిక చర్య కొనసాగించాలనుకోవడం లేదని, మిలటరీ ఆపరేషన్‌ తర్వాత దళాలను విరమించుకుంటామన్నారు.

ఉక్రెయిన్‌ భూభాగం రష్యాకు అవసరం లేదని, ఆక్రమించుకునే ఉద్దేశ్యం కూడా తమకు లేదని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఉక్రెయిన్‌లో కొత్త ప్రభుత్వం రావాలిని తెలిపారు.

యూకే గగనతలం నుంచి రష్యన్ ప్రైవేట్ జెట్‌లను నిషేదిస్తున్నాం
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడికి ప్రతిస్పందనగా యూకే గగనతలం నుంచి రష్యన్ ప్రైవేట్ జెట్‌లను తక్షణమే నిషేధిస్తున్నట్లు బ్రిటిష్ రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ శుక్రవారం ప్రకటించారు. యూకేలో మా నిషేధాన్ని పటిష్టం అమలు చేస్తాము, ఈ నిర్ణయం కూడా వెంటనే అమలులోకి వస్తుందని షాప్స్ ట్వీట్ చేశారు. పుతిన్ చర్యలు చట్టవిరుద్ధం, అంతేకాకుండా ఉక్రెయిన్‌లో రష్యా దూకుడు నుంచి ప్రయోజనం పొందేవారికి కూడా ఇటువంటే పరిణామాలనే ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement