Ukraine Russia War
-
త్వరలో ట్రంప్-పుతిన్ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం?
వాషింగ్టన్ డీసీ: రష్యా- ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వారంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.తాజాగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రాయబారి స్టీవ్ విట్కాఫ్ మీడియాతో మాట్లాడుతూ రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి నిబంధనల దిశగా అమెరికా అధక్షుడు ట్రంప్ యోచిస్తున్నారన్నారు. గత వారం పుతిన్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, యుద్ద నియంత్రణకు పరిష్కారాలు లభించాయని అన్నారు. కాగా పుతిన్ డిమాండ్లలో కుర్స్క్లో ఉక్రేనియన్ దళాల లొంగిపోవడం కూడా ఉందా అని ఆయనను మీడియా అడిగినప్పుడు..దానిని ధృవీకరించేందుకు ఆయన నిరాకరించారు.వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. అయితే శాంతి ఒప్పందం కుదిరే ముందు పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉందన్నారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్.. అమెరికా నుండి ఎటువంటి భద్రతా హామీని పొందబోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఘోర అవమానం -
రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ అటాక్
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి దిగిన కొన్ని గంటల వ్యవధిలోనే దానికి ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్. 337 డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన ముగ్గురు మృతిచెందగా 18 మంది తీవ్రంగా గాయపడినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ దాడితో రష్యా అప్రమత్తమైంది. 337 డ్రోన్లలో 91 డ్రోన్లను కూల్చేసింది. ఒకవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూనే రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది. రష్యా సైన్యం భీకర దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ తెలిపారు. తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులుశాంతి చర్చలు(జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచింది. రెండు రోజుల కిందట ఖర్కీవ్ రీజియన్‌లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు. -
జెలెన్స్కీ నుంచి ముఖ్యసందేశం వచ్చింది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికన్ కాంగ్రెస్ తొలిసారి ప్రసంగించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. మరో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పంపిన ముఖ్యమైన సందేశాన్ని ప్రస్తావించారు. ఉక్రెయిన్ శాశ్వత శాంతిని కోరుకుంటోందని, చర్చలకు సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేసినట్లు ట్రంప్ ఆ లేఖను చదివి వినిపించారు.అమెరికా కల పునరుద్ధరణ పేరిట మంగళవారం అమెరికా కాంగ్రెస్(US Congress)లో ఉభయ సభలను ఉద్దేశించి అధ్యక్షుడి హోదాలో ట్రంప్ తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా మెక్సికో, కెనడాలపై విధించిన 25 శాతం టారిఫ్ అంశంతో పాటు ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేతపైనా స్పందించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelenskyy)తో వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్ ఆఫీస్లోట్రంప్ జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance)లు జెలెన్స్కీ తీరుపై కెమెరాల సాక్షిగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేయకుండానే జెలెన్స్కీ వెనుదిగారు. ఆ వెంటనే తన తీరును సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ క్రమంలో.. ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచాయి. ఆ వెంటనే ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం ఆపేస్తున్నట్లు ప్రకటించారాయన.దీంతో కొన్ని గంటల్లోనే జెలెన్స్కీ దిగివచ్చారు. ట్రంప్‌తో చర్చలు జరిగిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. తమ దేశ ఖనిజాలను అమెరికా తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్ధమేనన్నారు. ట్రంప్ బలమైన నాయకత్వంలో ముందుకు వెళ్లి రష్యాతో యుద్ధానికి ముగింపు పలికేందుకు వీలైనంత వేగంగా పనిచేస్తామని ప్రకటించారు. -
Zelensky: నా దారి రహదారి.. ఎక్కడా తగ్గేదేలే..!
వాషింగ్టన్: అమెరికా(USA) అధ్యక్షుడితో భేటీ అంటే హంగామా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అగ్రదేశాధ్యక్షుడు ముందు మిగతా దేశాధ్యక్షులు చాలా నెమ్మదిగా వ్యవరిస్తారనే భావన మనలో చాలామందికే ఉంటుంది. . మరి అందరి దేశాధినేతలు వలే ఉంటే చెప్పుకోవడానికి ఏముంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్స్కీ(Zelensky) స్టైలే సెపరేటు.‘నలుగురు వెళ్లే దారిలో నేను వెళ్లను.. నా దారి రహదారి’ అనే ముక్కుసూటితనం జెలెన్స్కీలో కనిపిస్తూ ఉంటుంది. రష్యాతో యుద్ధం మొదలుకొని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తో నిన్నటి చర్చల వరకూ జెలెన్స్కీ ప్రత్యేక పంథాలోనే వెళుతున్నారు. ఎక్కడా తగ్గేదే లే.. నా రూటే సెపరేట్ అన్న శైలి ఆయనలో కనిపిస్తోంది. ట్రంప్ తో భేటి అయ్యే క్రమంలో కూడా జెలెన్స్కీ సాధారణంగానే వచ్చారు. ఎక్కడ హంగు, ఆర్భాటం లేకుండా వైట్ వైస్ లో దర్శనమిచ్చారు. అయితే జెలెన్స్కీ కనీసం సూట్ కూడా ధరించకుండా ట్రంప్ తో భేటీ కావడంపై అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ లో ఆసక్తిని పెంచింది. ఉండబట్టలేక అడిగేశాడు.సూట్ ధరించకపోతే నీకేమైనా నష్టమా?అయితే దీనికి కూడా జెలెన్స్కీ తనదైన స్టైల్ లోనే సమాధానమిచ్చారు. ‘సూట్ ధరించకపోతే నీకేమైనా సమస్యా.. లేక ఏమైనా నష్టమా? అంటూ జెలెన్స్కీ అనడంతో సదరు రిపోర్టర్ కాస్త కంగుతిన్నాడు. దాన్ని సరిచేసుకునే క్రమంలోనే ఆ రిపోర్టర్.. కాదు కాదు.. చాలా మంది అమెరికన్లలో ఒక భావన ఉంది. వైట్ హౌస్ ఆఫీస్ కి హాజరయ్యే క్రమంలో డ్రెస్ కోడ్ కు విలువ ఇవ్వరనే అమెరికన్లు అనుకుంటూ ఉంటారు అంటూ సర్దుకునే యత్నం చేశాడు రిపోర్టర్..ఆ రోజు వచ్చినప్పుడే సూట్ ధరిస్తా..దీనికి ప్రతిగా జెలెన్స్కీ స్పందిస్తూ.. ‘ నేను కచ్చితంగా సూట్ ధరిస్తా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన క్షణమే నేను సూట్ ధరిస్తా. ఆ రోజు వచ్చినప్పుడు నేను సూట్ ను కచ్చితంగా వేసుకుంటాను. డ్రెస్ కోడ్ ను బట్టి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయొద్దు.. మీలాగ. థాంక్యూ’ అంటూ సమాధానమిచ్చారు.జెలెన్స్కీ మద్దతుగా నెటిజన్లు..జెలెన్స్కీ ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలు డ్రెస్ కోడ్ ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఏంటని అంటున్నారు. అలా అయితే ట్రంప్ తొలి క్యాబినెట్ సమావేశానికి ఎలన్ మస్క్ సూట్ తో ఎందుకు రాలేదు.. కేవలం టీ షర్ట్ మాత్రమే ఎందుక ధరించారు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా, అసలు మిమ్ముల్ని ఆ క్వశ్చన్ అడిగిన రిపోర్టర్ సూట్ ఎందుకు ధరించలేదో అడగండి’ అంటూ మరొకరు నిలదీశారు. ఇలా జెలెన్స్కీపై ఏ రకంగా చూసినా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అమెరికాతో పెట్టుకున్నప్పుడు భవిష్యత్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని కొందరు ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రస్తుతానికి జెలెన్స్కీకి మద్దతు మాత్రం పెద్ద ఎత్తులోనే లభిస్తూ ఉండటం విశేషం. Q: "Why don't you wear a suit?"Ukrainian President Zelenskyy: "I will wear costume after this war will finish." pic.twitter.com/FzJqjIAQHa— CSPAN (@cspan) February 28, 2025 WHY doesn’t THIS guy wear a suit? pic.twitter.com/ZAQHWYjIob— The Resistor Sister®️♥️🇺🇸 (@the_resistor) February 28, 2025 ట్రంప్ Vs జెలెన్స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీ.. అధ్యక్షుల వాగ్వాదం జరిగిందిలా! -
ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్స్కీ కీలక ట్వీట్
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య వైట్ హౌస్ వేదికగా జరిగిన చర్చలు పూర్తిగా విఫలం కావడమే కాదు.. ఆ చర్చ కాస్తా ‘ మూడో ప్రపంచ యుద్ధం’ అని ట్రంప్ నోట వచ్చే వరకూ వెళ్లింది. అంటే రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమంటూనే ట్రంప్ చెప్పిన ప్రతీ దానికి తలాడించలేదు జెలెన్ స్కీ. పూర్తిగా తమ భూభాగంపై ఎటువంటి కాల్పులు, బాంబుల మోత లేకుండా చూస్తామని అమెరికా తరఫున మీరు(ట్రంప్) మాటిస్తేనే మీతో వాణిజ్య ఖనిజాల ఒప్పందంపై సంతకం చేస్తామని కరాఖండీగా చెప్పేశారు జెలెన్ స్కీ.తమ భూ భాగంలో నివసిస్తే వేరే వాళ్ల పెత్తనం ఏమిటని జెలెన్ స్కీ కాస్త గట్టిగానే స్వరం వినిపించారు. ఇది ట్రంప్ కు నషాళానికి ఎక్కినట్లుంది. రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోకపోతే మూడో ప్రపంచం యుద్ధం వచ్చినా రావొచ్చు అని ట్రంప్ హెచ్చరించారు. దాంతో వారి మధ్య చర్చ సంగతి పక్కన పెడితే, వాగ్వాదమే ఎక్కువ కనిపించింది.ఇలా వాదోపవాదాల నడుమనే ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయకుండా వైట్ హౌస్ వీడారు జెలెన్ స్కీ. అయితే జెలెన్ స్కీ వైఖరి కచ్చితంగానే ఉందనే అభిప్రాయమో, ట్రంప్ పై కోపమో తెలీదు కానీ కొన్ని దేశాలు మాత్రం ఉక్రెయిన్ కు మద్దతు తెలిపాయి. కెనడా, బ్రిటన్ తో సహా పలు కీలక దేశాలు జెలెన్ స్కీకి జై కొట్టాయి.మీ సపోర్ట్ ఎప్పుడూ కీలకమే.. కానీ మాకు స్వేచ్ఛ కూడా అవసరంఅయితే ఇలా ట్రంప్ తో వాదించి వెళ్లిన జెలెన్ స్కీ గురించి ప్రపంచం అంతా చర్చించుకునే తరుణం ఇది. అగ్రదేశం, ఆ దేశ అధ్యక్షుడ్ని ఎదిరించి వాదించిన సిసలైన నాయకుడు అని, ‘వీడు మగడ్రా బుజ్జి’ అని సోషల్ మీడియా వరల్డ్ అనుకుంటున్న తరుణం.. అయితే ట్రంప్ తో వాగ్వాదం తర్వాత జెలెన్స్కీ.. తమకు యూఎస్ సపోర్ట్ అనేది కీలకమని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ సపోర్ట్ చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ వేదికగా జెలెన్ స్కీ ట్వీట్ చేశారు. ‘ మీ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఇప్పటివరకూ రష్యాతో వార్ లో మాకు అందించిన ప్రతీ సహకారం మరువలేనింది. ఉక్రెయిన్ ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడే ఉంటారు.ఇప్పుడు ట్రంప్ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఆయన యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. యుద్ధాన్ని ముగించడానికి మా కంటే ఎక్కువ కోరుకునే వారు ఎవరూ ఉండరు. కానీ మేము యుద్ధంతోనే జీవనం సాగిస్తున్నాం. మా స్వాతంత్య్యం కోసం మేము చేస్తున్నా పోరాటం.. మా ప్రతీ ఒక్కరి ఆశయం, ఆశ కూడా మాకు స్వేచ్ఛగా మనుగడ సాగించడమే’ అని రాశారు. America’s help has been vital in helping us survive, and I want to acknowledge that. Despite the tough dialogue, we remain strategic partners. But we need to be honest and direct with each other to truly understand our shared goals.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025 It’s crucial for us to have President Trump’s support. He wants to end the war, but no one wants peace more than we do. We are the ones living this war in Ukraine. It’s a fight for our freedom, for our very survival.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025 -
అగ్ర రాజ్యాల స్నేహగీతం
రియాద్: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టగానే అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా అన్నిరకాలుగానూ మూడేళ్లుగా దాదాపుగా వెలి వేసిన రష్యాతో ఏకంగా ఉన్నతస్థాయి చర్చలకు అమెరికా తెర తీసింది. దాని మిత్ర దేశం సౌదీ అరేబియా వేదికగా మంగళవారం జరిగిన ఈ చర్చలకు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ స్వయంగా సారథ్యం వహించడం విశేషం. సౌదీ విదేశాంగ మంత్రి యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, అమెరికా, సౌదీ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదార్లు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ద్వైపాక్షిక బంధాలను మెరుగు పరుచుకోవడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడం ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. కానీ ఈ కీలక చర్చల్లో ఉక్రెయిన్‌కే ప్రాతినిధ్యం కల్పించకపోవడం విశేషం. దీనిపై ఆ దేశం తీవ్ర అసంతృప్తి వెలిగక్కింది. తమ భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఎలాంటి నిర్ణయాలనూ అంగీకరించబోయేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కుండబద్దలు కొట్టారు.ఉక్రెయిన్‌పై జరుపుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టడం ఏమేరకు సబబంటూ పలు యూరప్ దేశాలు కూడా నొసలు విరుస్తున్నాయి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో భావి కార్యాచరణపై యూరప్ దేశాలన్నీ సోమవారం కీలక సమావేశం జరపడం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయంగా సరికొత్త సమీకరణాలకు, పునరేకీకరణలకు దారితీసేలా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో ట్రంప్, పుతిన్ భేటీ ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించడం, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిని చేయడం తెలిసిందే. అలా మూడేళ్లుగా అట్టడుగుకు దిగజారిన అమెరికా, రష్యా సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా రూబియో, లవ్రోవ్ భేటీలో పలు నిర్ణయాలు జరిగాయి. వాషింగ్టన్, మాస్కో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు రూబియో మీడియాకు తెలిపారు.‘‘అలాగే ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వీలైనంత త్వరగా భేటీ కానున్నారు. తేదీ తదితరాలు ఖరారు కావాల్సి ఉంది’’ అని వివరించారు. అధినేతలిద్దరూ గత వారం సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించుకోవడం తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆ వెంటనే రష్యాపై యుద్ధంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తూ వస్తున్న సహాయ సహకారాలకు చాలావరకు తెర దించుతూ ట్రంప్ వరుస నిర్ణయాలు తీసుకున్నారు.ఈయూలో ఉక్రెయిన్ చేరికకు... అభ్యంతరం లేదు: రష్యాశాంతి చర్చలకు రష్యా ఎప్పుడూ సిద్ధమేనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి ద్మిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా అవసరమైతే జెలెన్స్కీతో చర్చలకు కూడా పుతిన్ సిద్ధమేనన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షునిగా జెలెన్స్కీ చట్టబద్ధతపైనే తమకు అభ్యంతరాలున్నాయంటూ మెలిక పెట్టారు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో చేరడంపై తమకు అభ్యంతరాలు లేవన్నారు. ‘‘ఇలాంటివి ఒక దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన నిర్ణయాలు. వాటిలో వేలు పెట్టే ఉద్దేశం మాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు. కానీ రష్యా భద్రత తదితరాల దృష్ట్యా ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. -
చర్చలకు రాకపోతే ఆంక్షలే : పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా అధినేత పుతిన్‌ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. సైనికులతోపాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం, నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారుతుండడం బాధాకరమని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల కంటే ఉక్రెయిన్‌లో మృతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. వాస్తవాలు చెప్పడం లేదని మీడియాపై మండిపడ్డారు. ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని స్పష్టంచేశారు. సమర్థుడైన పాలకుడు అధికారంలో ఉంటే యుద్ధాలకు ఆస్కారం ఉండదని అన్నారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ గత అధ్యక్షుడు జో బైడెన్‌ను, రష్యా ప్రజలను పుతిన్ అగౌరవపర్చారని ఆక్షేపించారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తాను పదవిలో ఉంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తేది కాదని పునరుద్ఘాటించారు. 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేశాం ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నామని, త్వరలో పుతిన్‌తోనూ మాట్లాడుతామని చెప్పారు. ‘‘ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి యూరోపియన్ యూనియన్ కంటే అమెరికా 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేసింది. మాతో సమానంగా యూరోపియన్ యూనియన్ భారం భరించాల్సిందే. మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే నిజంగా మూర్ఖులమే. అందులో సందేహం లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తనతో చెప్పారని వివరించారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. పుతిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ట్రంప్ తేలి్చచెప్పారు. యుద్ధంలో మరణాలు ఇక ఆగిపోవాలని అన్నారు. కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా నుంచి ఫెంటానైల్ అనే ప్రమాదకరమైన మాదకద్రవ్యం రాకుండా అడ్డుకోనున్నట్లు చెప్పారు. చైనా నుంచి మెక్సికో, కెనడా వంటి దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు ఫెంటానైల్ చేరుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌తోపాటు అక్రమ వలసదార్లను అమెరికాలోకి పంపిస్తున్న దేశాల ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనకు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక కొత్త కంపెనీ ద్వారా నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఈ కంపెనీని స్థాపిస్తామన్నారు. స్టార్గేట్గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. -
‘పట్టుబడితే.. ఆ నరకం కన్నా చావడమే నయం!’
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి.. పాశ్చాత్య దేశాలకు మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాకు చేరువయ్యారు ఆయన. అయితే.. మిత్ర దేశం రష్యా కోసం ఇప్పుడు ఆయన ఎంతకైనా తెగించడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తన సైన్యాన్ని బలి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు(North Korea Soliders) ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నారు. అయితే.. ఇటు ఉకక్రెయిన్గానీ, అటు రష్యా గానీ ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యానికి పట్టుబడడం ఇష్టంలేక తమను తాము పేల్చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారు ఉత్తర కొరియా సైనికులు!. తాజాగా..గత వారం రోజులుగా ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో కుర్సుక్ రీజియన్‌లో దాడులు జరిపి ప్రత్యర్థి బలగాలను మట్టుబెట్టింది. ఆపై ఉక్రెయిన్ సైన్యం కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే అందులో ఓ సైనికుడు సజీవంగానే ఉండగా.. ఉక్రెయిన్ సైనికులను చూసి గ్రెనేడ్‌తో తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే ఈ పేలుడులో ఉక్రెయిన్ సైనికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.Watch how Ukraine’s SOF repel North Korean troops assault in russia’s Kursk region.The special forces eliminated 17 DPRK soldiers. One North Korean soldier had set an unsuccessful trap for the rangers of the 6th Regiment and blew himself up with a grenade. pic.twitter.com/nObBOMnusI— SPECIAL OPERATIONS FORCES OF UKRAINE (@SOF_UKR) January 13, 2025మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో.. ఉత్తర కొరియా మాస్కోకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సైనికులు తీవ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు కీవ్ వర్గాలు ఇప్పుడు ఆధారాలతో సహా చెబుతున్నాయి.యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్‌కు పట్టుబడితే.. యుద్ధ ఖైదీగా ఉండిపోవాలి. అంతేకాదు.. యుద్ధ నేరాల్లో ప్యాంగ్యాంగ్ పాత్ర కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అందుకే పట్టుబడి ఉక్రెయిన్‌లో యుద్ధ ఖైదీలుగా ఉండడం కన్నా.. ఆత్మాహుతికి పాల్పడడం మేలు అని వాళ్లు భావిస్తున్నారు అని కీవ్ వర్గాలు భావిస్తున్నాయి.‘‘పట్టబడకుండా ప్రాణం తీసుకోవడం.. ఇదే నార్త్ కొరియా నేర్పేది’’ అని ఉత్తర కొరియా మాజీ సైనికుడు కిమ్(32) చెబుతున్నాడు. రష్యాలో నిర్మాణ ప్రాజెక్టులకు కాపలాగా ఉత్తర కొరియా సైన్యం తరఫు నుంచి వెళ్లి కిమ్ ఏడేళ్లపాటు పని చేశాడు. ఆపై 2022లో దక్షిణ కొరియాకు పారిపోయి తన ప్రాణం రక్షించుకున్నాడతను.‘‘ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే.. ముందుగా అన్ని బంధాలను తెంచుకోవాలి. ఇళ్లు, భార్యాపిల్లలు అన్నింటిని వదిలేసుకోవాలి. సైన్యంలో వాళ్లకు బ్రెయిన్‌వాష్ చేస్తారు. కిమ్ జోంగ్ ఉన్(Kim Jong-Un) కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదులుకోవాల్సి ఉంటుంది’’ అని కిమ్ రాయిటర్స్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పట్టుబడి తిరిగి ప్యాంగ్యాంగ్కు వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెబుతున్నాడతను. ఉత్తర కొరియా దృష్టిలో యుద్ధంలో పట్టుబడడం అంటే రాజద్రోహానికి పాల్పడినట్లే. ఆఖరి తూటా దాకా అతని శరీరంలో దిగాల్సిందే.. ఇదే అక్కడి సైన్యంలో అంతా చర్చించుకునేది అని కిమ్ తెలిపాడు.రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైనికులు రంగంలోకి దిగారని ఉక్రెయిన్ ఆరోపిస్తూ వస్తోంది. సుమారు 11,000 వేల మంది సైనికులను ఉత్తర కొరియా మోహరింపజేసిందనేది కీవ్ ఆరోపణ. ఇందులో 3 వేల మంది ఇప్పటికే మరణించినట్లు ప్రకటించింది. అందులో వారి పేర్లు, వివరాలను మార్చేసి రష్యాకు చెందిన వారిగా తప్పుడు పత్రాలను గుర్తించినట్లు తెలిపింది. ‘‘వారు తప్పుడు గుర్తింపు కార్డులతో రష్యా సైనికుల తరహా దుస్తుల్ని ధరించి పనిచేస్తున్నారు. చూడడానికి మాస్కో దళాల మాదిరిగానే కనిపిస్తున్నారు. వాళ్ల సంభాషణల్ని రహస్యంగా విన్నప్పుడు వారు ఉత్తర కొరియా భాషలో మాట్లాడుతున్నట్లు బయటపడింది’’ అని కీవ్‌కు చెందిన ఓ సైన్యాధికారి తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ప్యాంగ్యాంగ్ వర్గాలు కొట్టిపారేశాయి. మాస్కో మాత్రం ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు.రష్యానే కాల్చిపారేస్తోందా?ఉత్తరకొరియా సైనికులను సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఉత్తర కొరియా పాత్ర బయటపడకూడదనే ఉద్దేశంతో గాయపడిన ఆ దేశ సైనికులు తమకు చిక్కకుండా ఉండేందుకు వారిని రష్యా కాల్చి చంపేస్తోందని ఆరోపించారాయన. ఈ పట్టుబడిన సైనికుల గురించి ఉక్రెయిన్ భద్రతా సర్వీస్.. ఎస్‌బీయూ మరిన్ని వివరాలను వెల్లడించింది. ఒక సైనికుడు దగ్గర ఎలాంటి ధ్రువపత్రం లేదని, మరో సైనికుడి దగ్గర రష్యా మిలిటరీ కార్డు ఉందని తెలిపింది. Communication between captured North Korean soldiers and Ukrainian investigators continues. We are establishing the facts. We are verifying all the details. The world will learn the full truth about how Russia is exploiting such guys, who grew up in a complete information vacuum,… pic.twitter.com/CWcssQjr94— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 14, 2025‘‘బందీలకు ఉక్రేనియన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలు రావు. దక్షిణ కొరియా అనువాదకుల సాయంతో వారితో మాట్లాడుతున్నాం’’అని పేర్కొంది. మరోవైపు.. రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే.. ఉత్తర కొరియా సైనికులను వారి అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అప్పగిస్తామని జెలెన్స్కీ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.ప్రపంచంలోనే తనది అత్యంత శక్తివంతమైన సైన్యంగా కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఆ మధ్య ప్రకటించుకున్నారు. 1950-53 కొరియన్ వార్ తర్వాత నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాలో మోహరించడం ఇదే. అలాగే.. వియత్నాం యుద్ధం, సిరియా అంతర్యుద్ధంలోనూ ఉత్తర కొరియా సైన్యం పాలు పంచుకుంది. -
ట్రంప్‌తో చర్చలకు సిద్ధం
మాస్కో: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ట్రంప్‌తో మాట్లాడలేదని ఆయన చెప్పారు. ట్రంప్ హయాంలో అమెరికా విధానాల్లో భారీగా మార్పులు రావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఉక్రెయి న్లో విజయం సాధించబోతున్నామని, సిరియాలో ఆశించిన లక్ష్యం నెరవేరిందని చెప్పుకొచ్చారు. గురు వారం దాదాపు నాలు గున్నర గంటలపాటు జరి గిన వార్షిక మీడియా సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు కూడా పుతిన్ స్పందించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు రావొచ్చునంటూ వార్తలు వస్తున్న వేళ పుతిన్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.నాలుగేళ్లుగా మేం మాట్లాడుకో లేదుడొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం ఎప్పుడుంటుందన్న ఎన్బీసీ ప్రతినిధి కెయిర్ సిమ్మన్స్ ప్రశ్నకు..‘మా సమావేశం ఎప్పుడు ఉండొచ్చో నాకు తెలియదు. ట్రంప్ కూడా ఈ విషయం ఎన్నడూ చెప్పలేదు. దాదాపు నాలుగేళ్లుగా మేం మాట్లాడుకున్నదీ లేదు. ట్రంప్ సానుకూలంగా ఉంటే చర్చలకు ఎప్పుడైనా నేను సిద్ధమే’అని అన్నారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం, సిరియా నుంచి రష్యా బలగాలు వైదొలగాల్సి రావడం వంటి పరిణామాలతో మీరు బలహీనపడినట్లుగా భావిస్తున్నారా అన్న ప్రశ్నకు..,గత రెండు, మూడేళ్లలో రష్యా మరింతగా బలం పుంజుకుంది. ఎందుకంటే మేం మరింత స్వతంత్రంగా మారాం. ఎవరిపైనా ఆధారపడకుండా ముందుకు సాగుతున్నాం’అన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు అనూహ్యంగా మారి పోయాయి. యుద్ధక్షేత్రంలో రోజురోజుకూ చదరపు కిలోమీటర్ల కొద్దీ భూభా గాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగు తున్నాం’అన్నారు. అయితే, సరిహద్దుల్లో కస్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాల నుంచి తిరిగి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధాన మివ్వలేదు. ‘స్వాధీనం చేసుకుని తీరుతాం. ఫలానా సమయం కల్లా అది పూర్తవుతుందని మాత్రం చెప్పలేను’అని పేర్కొనడం గమనార్హం. తాజాగా ఆర్మీ అణు విభాగం చీఫ్ కిరిల్లోవ్ హత్యను ఆయన ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు అసద్ మాస్కోలోనే ఉన్నట్లు పుతిన్ ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకు ఆయనతో సమావేశం జరగలేదని, కచ్చితంగా మాట్లాడతానని చెప్పారు. -
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్ సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా శుక్రవారం 93 క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడికి తెగబడింది. ఏకంగా 200 డ్రోన్లతో దాడి చేసింది. గత మూడేళ్లలో రష్యా ఒకే రోజులో చేసిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా నుంచి దూసుకొచ్చిన వాటిల్లో 11క్రూయిజ్ క్షిపణులుసహా 81 మిస్సైళ్లను పశి్చమదేశాలు అందించిన ఎఫ్–16 యద్ధవిమానాల సాయంతో నేలమట్టంచేశామని ఆయన చెప్పారు. ‘‘ పెనుదాడులతో ఉక్రేనియన్లను భయపెడుతున్న రష్యాకు, పుతిన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. పెద్ద ప్రతిఘటన, భారీ ఎదురుదాడితో రష్యా ఉగ్రచర్యలను అడ్డుకుందాం’’ అని జెలెన్స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా చెప్పారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామికవాడల్లో ఇంధన, శక్తి వనరులు, మౌలిక వసతులను ధ్వంసంచేయడమే లక్ష్యంగా తమ సైన్యం దాడులు చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ బొగ్గు విద్యుత్ ఉత్పత్తికేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటెక్ తెలిపింది. ఉక్రెయిన్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీని నిలువరించడమే లక్ష్యంగా ఇంధన వ్యవస్థలపైనే రష్యా తరచూ దాడులుచేస్తుండటం తెల్సిందే. నవంబర్ 28న చేసిన ఇలాంటి దాడిలో 200 మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. నాటి నష్టం కారణంగా 10 లక్షల కుటుంబాలు అంధకారంలో ఉండిపోయాయి. -
ఉక్రెయిన్‌పైకి ఖండాంతర క్షిపణి ప్రయోగించిన రష్యా
కీవ్: అమెరికా తొలిసారిగా అందించిన శక్తివంత దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా మీదకు ప్రయోగించిన ఉక్రెయిన్ ఊహించని దాడిని ఎదుర్కొంది. యుద్ధంలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్ భూతలం మీదకు రష్యా ప్రయోగించింది. అభివృద్ధిచేశాక పరీక్ష కోసం పలుదేశాలు ఎన్నోసార్లు ఈ రకం క్షిపణులను ప్రయోగించినా యుద్ధంలో వినియోగించడం మాత్రం ఇదే తొలిసారికావడం గమనార్హం. మధ్యతూర్పు ఉక్రెయిన్‌లోని డినిప్రో నగరంపైకి బుధవారం రాత్రి ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) వచ్చి పడిందని ఉక్రెయిన్ టెలిగ్రామ్ మెసెంజింగ్ యాప్‌లో ప్రకటించింది. వేయి కిలోమీటర్ల దూరంలో రష్యాలో కాస్పియన్ సముద్రతీర ఆస్ట్రాఖన్ ప్రాంతం నుంచి అది దూసుకొచ్చిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. అయితే ఆ క్షిపణి సృష్టించిన విధ్వంసం, జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలను ఉక్రెయిన్ వెల్లడించలేదు. ‘‘ ఐసీబీఎంతోపాటు కింజార్ హైపర్సోనిక్ క్షిపణి, ఏడు కేహెచ్–101 క్రూజ్ క్షిపణులు వచ్చిపడ్డాయి. వీటిలో ఆరింటిని గాల్లోనే ధ్వంసంచేశాం. ఈ దాడిలో ఇద్దరు ఉక్రేనియన్లు గాయపడ్డారు. ఒక కర్మాగారం దెబ్బతింది. వికలాంగుల కోసం ఏర్పాటుచేసిన పునరావాసన శిబిరం నాశనమైంది’ అని స్థానిక యంత్రాంగం పేర్కొంది. అయితే ఆర్ఎస్–26 రూబెజ్ రకం ఐసీబీఎంను రష్యా ప్రయోగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్–26 క్షిపణి ఏకంగా 800 కేజీల మందుగుండును మోసుకెళ్లగలదు. 5,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ క్షిపణితోపాటు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ–ఎంట్రీ వెహికల్స్(ఎంఐఆర్వీ) సాంకేతికతనూ రష్యా వాడినట్లు తెలుస్తోంది. యుద్ధంలో ఎంఐఆర్వీ టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి.క్షిపణితో హెచ్చరించారా?సాధారణంగా ఐసీబీఎంలను అణ్వస్త్రాల వంటి భారీ బాంబులను ప్రయోగించడానికి వినియోగిస్తారు. సాధారణ మందుగుండుతో రష్యా గురువారం ఐసీబీఎంను ప్రయోగించడం వెనుక వేరే ఉద్దేశ్యం ఉందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి అందుకున్న అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణుల అండ చూసుకుని విచక్షణారహితంగా తమపై దాడులకు తెగబడితే అణ్వాయుధం ప్రయోగించేందుకైనా వెనుకాడబోమని హెచ్చరించేందుకే రష్యా ఇలా ఐసీబీఎంను ప్రయోగించి ఉంటుందని భావిస్తున్నారు. అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన దస్త్రంపై సంతకం చేసిన రెండు రోజులకే రష్యా ఉక్రెయిన్‌పైకి తొలిసారిగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. ‘‘ ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన రెండు బ్రిటన్ తయారీ స్టార్మ్ షాడో క్షిపణులు, ఆరు హిమార్స్ రాకెట్లు, 67 డ్రోన్లను నేలకూల్చాం’’ అని గురువారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టార్మ్షాడో క్షిపణులను తమ గగనతలరక్షణ వ్యవస్థలు కూల్చేశాయని రష్యా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే గురువారం ఉక్రెయిన్‌పై ఏ రకం ఖండాంతర క్షిపణిని ప్రయోగించారో, అసలు ప్రయోగించారో లేదో అన్న విషయాన్ని రష్యా వెల్లడించలేదు. ఇతర వివరాలు తెలిపేందుకు రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా సాధారణ పత్రికా సమావేశంలో మాట్లాడుతుండగా ఆమెకు ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘ మనం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి గురించి పశ్చిమదేశాలు అప్పుడే మాట్లాడటం మొదలెట్టాయి. ఐసీబీఎంను వాడిన విషయాన్ని ప్రెస్మీట్లో ప్రస్తావించొద్దు’’ అని సంబంధిత ఉన్నతాధికారులు ఆమెకు ఫోన్లో చెప్పారు. సంబంధిత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఏమిటీ ఖండాంతర క్షిపణి?సుదూరంలోనే శత్రుస్థావరాలను తుదముట్టించేందుకు ఖండాంత క్షిపణి ఉపయోగపడుతుంది. 5, 500 కిలోమీటర్లకు మించి ప్రయా ణించగలవు. అణు, రసాయన, జీవాయుధాలను మోసుకెళ్లగలవు. సంప్రదాయక వార్‌హెడ్‌నూ మోస్తాయి. రష్యా వాడినట్లుగా చెబుతున్న ఆర్ఎస్26 రూబెజ్ క్షిపణి ఎంఐఆర్వీ టెక్నాలజీతో పనిచేసే ఘన ఇంధన మిస్సైల్. 2011 దీనిని అభివృద్ధిచేసి 2012లో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు. అది ఆనాడు 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. ద్రవ ఇంధనంతో పోలిస్తే ఘన ఇంధన క్షిపణులను వాడటం చాలా తేలిక. నేలమాళిగ, మొబైల్ లాంఛర్ నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. ఇందులోని ఇంధనం, ఆక్సిడైజర్లను రబ్బర్‌లాంటి దానితో కలిపి మిశ్రమంగా తయారుచేసి ఒక గట్టి పెట్టెలో అమర్చుతారు. ప్రొపెలంట్ మండగానే ఇంధన ప్రజ్వలన రెప్పపాటులో భారీగా జరిగి క్షిపణి శరవేగంగా దూసుకుపోతుంది. ఇంధ్రధనస్సులాగా అర్ధచంద్రాకృతిలో ప్రయాణిస్తుంది. దాదాపు 4,000 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వేగంగా కిందకు పడపోవడం మొదలవుతుంది. ఈ దశలో ఇది ఏకంగా ధ్వని వేగానికి పది రెట్లు వేగంగా దూసుకొస్తుంది. ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒకే క్షిపణిలో వేర్వేరు వార్హెడ్లను ఒకేసారి ప్రయోగించవచ్చు. ఇవి వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలవు. వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు. ఒకేసారి ప్రయోగించిన రెండు వార్హెడ్ల మధ్య దూరం 1,500 కిలోమీటర్ల దూరం ఉన్నాసరే వాటిని క్షిపణి ఖచ్చిత దిశలో జారవిడచగలదు. తొలుత కనిపెట్టిన అమెరికాఎంఐఆర్వీ టెక్నాలజీని తొలుత అమెరికా అభివృద్ధిచేసింది. 1970లో ఐసీబీఎంను పరీక్షించింది. 1971లో జలాంతర్గామి వెర్షన్లో ఎస్సీబీఎంను పరీక్షించింది. ఈ సాంకేతికతను 1970 చివర్లో నాటి సోవియట్ రష్యా అభివృద్ధిచేసింది. దీని సాయంతో ఐసీబీఎం, జలాంతర్గామి వెర్షన్ ఎస్ఎల్బీఎంను రూపొందించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగంగా అమెరికా, రష్యాలు స్వల్ప, దీర్ఘ, ఖండాంతర క్షిపణులను ధ్వంసంచేశాయి. 1991 జూన్ ఒకటోతేదీలోపు మొత్తంగా 2,692 క్షిపణులను నాశనంచేశాయి. అయితే ఈ ఒప్పందం నుంచి 2019లో అమెరికా వైదొలగింది. -
ఉక్రెయిన్‌పై ఏం చేద్దాం?
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. యుద్ధానికి తెర దించే మార్గాలపై లోతుగా చర్చించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి ప్రధాని అమెరికా చేరుకున్నారు. అనంతరం నేరుగా డెలావెర్‌లో విల్లింగ్టన్ లోని బైడెన్ నివాసానికి వెళ్లారు. మోదీకి అధ్యక్షుడు ఘనస్వాగతం పలికారు. వారిద్దరూ ఆతీ్మయంగా కౌగిలించుకున్నారు. అనంతరం మోదీ చేయి పట్టుకుని బైడెన్ లోనికి తీసుకెళ్లారు. పలు అంశాలపై నేతలిద్దరూ చాలాసేపు చర్చలు జరిపారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ఈ భేటీలో పరిష్కార మార్గం లభించవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్–గాజా ఘర్షణతో పాటు అమెరికా–భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు. వారితో ఆయన కరచాలనం చేస్తూ అటోగ్రాఫ్‌లు ఇస్తూ సందడి చేశారు.అమెరికాతో బంధం బలోపేతం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతికి కృషి చేయడానికి భావసారూప్య దేశాలకు ‘క్వాడ్’ అత్యంత కీలకమైన వేదిక అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా బయల్దేరే ముందు ప్రకటన విడుదల చేశారు. ‘‘బైడెన్, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అమెరికాలోని ప్రవాస భారతీయులను కలుసుకోబోతుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. మోదీ అమెరికాలో కీలక సదస్సులు, సమావేశాల్లో పాల్గొంటారు. బైడెన్‌తో పాటు పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విల్మింగ్టన్లో క్వాడ్ సదస్సులో, న్యూయార్క్‌లో ఐరాస సాధారణ సభలో ‘సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్’లో ప్రసంగిస్తారు. లాంగ్ ఐలండ్‌లో ప్రవాస భారతీయుల భేటీలో పాల్గొంటారు. ప్రఖ్యాత అమెరికా కంపెనీల సీఈఓలతో సమావేశమై ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ వంటి అధునాతన సాంకేతికతపై చర్చిస్తారు. -
నా మంచి స్నేహితుడు మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నా: పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాం. ఆయనకు నా శుభాకాంక్షలు’అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్లు పేర్కొంది.బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్లో పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో దోవల్ కరచాలనం చేశారు. ఆ ఫొటోల్ని భారత్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.🇷🇺🤝🇮🇳 On September 12, #Russia's President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of #India, at the Konstantinovsky Palace in #StPetersburg. 👉🏻 https://t.co/vFQ64S4vMq#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/KxcD9aciDG— Russia in India 🇷🇺 (@RusEmbIndia) September 12, 2024 గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని అజిత్ దోవాల్ పుతిన్‌కు వివరించారు. మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ దోవాల్ పుతిన్‌కు వివరించారు. ఈ చర్చల్లో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు మోదీ వస్తే, ఆయనతో విడిగా భేటీ కావాలనుకుంటున్నట్లు దోవల్‌కు పుతిన్ చెప్పారు.ఇదే అంశాన్ని రష్యా మీడియా సైతం ప్రస్తావించింది.ఇదీ చదవండి : బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసరు..రంగంలోకి సంపన్న మహిళరష్యన్ ఎంబసీ సైతం మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ - రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించి వచ్చిన ఫలితాలు,సమీప భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు అని టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో రష్యన్ ఎంబసీ తెలిపింది.కాగా, ఉక్రెయిన్ పర్యటనలో ఆదేశ అధ్యక్షుడు వ్లాదమీర్ జెలెన్ స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్-రష్యాలు చర్చలు జరుపుకోవాలని, ఈ రెండు దేశాల్లో శాంతిని పునరుద్ధరించడానికి భారత్ క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. -
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ సేనలు రష్యాపై దాడులతో విరుచుకుపడుతున్నాయి. రష్యాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటమే లక్ష్యంగా బాంబు, డ్రోన్ దాడులు చేస్తోంది. తాజాగా శనివారం అర్ధరాత్రి రష్యా రాజధాని మాస్కో, ఇతర ప్రాంతాలే టార్గెట్‌గా ఉక్రెయిన్ ఆర్మీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు రష్యా అధికారులు ఆదివారం వెల్లడించారు. మాస్కో వైపు దూసుకువచ్చిన డ్రోన్‌ను రష్యా ధ్వంసం చేసిందని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.🚨BREAKING/ALERT: Ukraine has launched a massive drone attack on Russia. Over 100+ drones are airborne & flights are being prevented from landing due to the attack. pic.twitter.com/OqWRnH6uh4— The Enforcer (@ItsTheEnforcer) August 31, 2024అదేవిధంగా రష్యా నైరుతి ప్రాంతంలోని బ్రయాన్స్క్ సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన కనీసం 12 డ్రోన్లు కూడా ధ్వంసం చేసినట్లు ఆ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బోగోమాజ్ పేర్కొన్నారు. మానవరహిత దాడిలో కుర్స్క్ ప్రాంతంపై రెండు వాహనాలను కూడా కూల్చివేశామని తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సైన్యం పాక్షికంగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ డ్రోన్ దాడుల వల్ల ఎలాంటి గాయాలు, నష్టం జరగలేదని రష్యా అధికారులు తెలిపారు. అదేవిధంగా.. గత కొన్ని రోజులుగా దాడుల్లో వేగం పెంచిన ఉక్రెయన్ రష్యా భూభాగాలను స్వాధీనం చేసుకోవటమే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది. -
100 క్షిపణులు.. 100డ్రోన్లు..!
కీవ్: రష్యా మరోసారి పేట్రేగిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఏకంగా 100 వందకు పైగా వివిధ రకాల క్షిపణులు, మరో 100 షహీద్ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ‘రష్యా మా కీలకమైన పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గపూరితంగా దాడు లకు తెగబడింది. ఖార్కివ్, కీవ్ మొద లుకొని ఒడెసా, పశ్చిమ ప్రాంతాల వరకు జరిగిన దాడుల్లో భారీగా నష్టం వాటిల్లింది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 13 మంది పౌరులు గాయప డ్డారని చెప్పారు. తమ భూభాగంపై రష్యా పాల్పడిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, క్రూయి జ్ మిస్సైళ్లు, హైపర్సోనిక్ బాలిస్టిక్ కింజాల్ క్షిపణులు మొత్తం 15 రీజియన్లలో..అంటే దాదాపు దేశంలోని సగం ప్రాంతాల్లో బీభ త్సం సృష్టించినట్లు ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ రంగ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్.. ఉక్రెనెర్గో.. దెబ్బతిన్న మౌలిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అత్యవసర విద్యుత్ కోతలను ప్రకటించింది. ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటీఈకే కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపింది. రాజధాని లోని విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కీవ్ మేయర్ తెలిపారు. కీవ్‌పైకి దూసు కొచ్చిన 15 క్షిపణులు, మరో 15 డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయన్నారు. కాగా, ఉక్రెయిన్ సైనిక–పారిశ్రామిక సముదాల నిర్వహణకు ఎంతో కీలకమైన విద్యుత్ వ్యవస్థలను తమ దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లు ఛిన్నాభిన్నం చేశాయని, లక్ష్యాలను అవి గురి తప్పకుండా ఛేదించాయని రష్యా ఆర్మీ ప్రకటించింది.22 డ్రోన్లను కూల్చివేశాం: రష్యాసరటోవ్, యరోస్లావ్ల్ ప్రాంతాలపైకి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ఉక్రెయిన్ ప్రయోగించిన 22 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనల్లో పలు నివాస భవనాలు దెబ్బతినగా, నలుగురు గాయపడ్డారని తెలిపింది. కస్క్ రీజియన్‌లో ఉక్రెయిన్ బలగాలు మరింతగా ముందుకు సాగకుండా అడ్డుకున్నట్లు తెలిపింది. అదేవిధంగా, ఉక్రెయిన్ బలగాలు, ఆయుధ సామగ్రి రవాణాకు కేంద్రంగా ఉన్న పొక్రొవ్స్క్కు అతి సమీపంలోకి రష్యా బలగాలు చేరుకుంటున్నట్లు సమాచారం. Currently, across the country, efforts are underway to eliminate the consequences of the Russian strike. This was one of the largest attacks – a combined strike, involving over a hundred missiles of various types and around a hundred “Shaheds.” Like most Russian strikes before,… pic.twitter.com/0qNTGR98rR— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 26, 2024 -
తటస్థం కాదు, భారత్ ఎప్పుడూ శాంతి వైపే: జెలెన్స్కీతో మోదీ
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చర్చలు, సంభాషణలు ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్ సమర్ధిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో కలిసి మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో మోదీ భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో చర్చలకు కూర్చోవాలని జెలెన్స్కీని మోదీ కోరారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి స్నేహితుడిగా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.స్నేహితుడిగా సాయం చేసేందుకు సిద్దం: మోదీ‘చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే యుద్దానికి పరిష్కారానికి మార్గం కనుగొనవచ్చు. మనం సమయాన్ని వృధా చేయకుండా ఆ దిశలో పయనించాలి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఇరుపక్షాలు కలిసి కూర్చోని చర్చించాలి. శాంతిని నెలకొల్పేదిశగా జరిగే ఎలాంటి ప్రయత్నాల్లోనైనా క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో ఒక స్నేహితుడిగా నేను మీకు ఏం చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉన్నాననే భరోసా ఇవ్వాలనుకుంటున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.జెలెన్స్కీ భుజంపై చేతులు వేసిఅంతకముందు రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. అక్కడికి వెళ్లే సమయంలో జెలెన్స్కీ భుజంపై చేతులు వేసిన మోదీ ఆత్మియంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు..గాంధీ విగ్రహానికి నివాళికీవ్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన.. కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. -
NATO: విధ్వంసకారి చైనా
వాషింగ్టన్/బీజింగ్: చైనా–రష్యా దేశాల మధ్య బంధం నానాటికీ బలపడుతుండడం పట్ల నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం పేరిట ఉక్రెయిన్‌లో విధ్వంసానికి రష్యాకు చైనా అండదండలు అందిస్తోందని మండిపడ్డాయి. డ్రాగన్ దేశం నిర్ణయాత్మక విధ్వంసకారిగా మారిందని ఆరోపించాయి. రష్యాతో భాగస్వామ్యానికి ఎలాంటి పరిమితులు లేవంటూ చైనా నాయకత్వం చేసిన ప్రకటనలను నాటో దేశాలు ప్రస్తావించాయి. రష్యా రక్షణ పారిశ్రామిక రంగానికి చైనా పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తోందని, దీనివల్ల రష్యా పొరుగు దేశాలతోపాటు యూరో–అట్లాంటిక్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో నాటోలోని 32 సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. కూటమి 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కూటమిలో 32వ సభ్యదేశంగా చేరిన స్వీడన్‌కు సాదర స్వాగతం పలికారు. భేటీ అనంతరం ‘వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్’ పేరిట ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా దుందుడుకు విధానాలు, చర్యలు తమ ప్రయోజనాలకు, భద్రతకు, విలువలకు సవాలు విసిరేలా ఉంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు మద్దతిస్తే చైనాకే నష్టం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా బాధ్యతాయుతంగా మసలుకోవాలని నాటో సభ్యదేశాల ప్రతినిధులు హితవు పలికారు. ఉక్రెయిన్‌లో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు సహకరించుకోవడం తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత చైనాపై ఉందని పునరుద్ఘాటించారు. రష్యాకు ఆయుధపరంగా, రాజకీయంగా ఎలాంటి సహకారం అందించవద్దని స్పష్టం చేశారు. రష్యాను గుడ్డిగా వెనుకేసుకొస్తే చైనాయే నష్టపోతుందని, ప్రపంచంలో ఏకాకిగా మారుతుందని తేలి్చచెప్పారు. రష్యా–చైనా–ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొత్త చివుళ్లు తొడుగుతున్న నేపథ్యంలో దానికి ప్రతిచర్యగా ఇండో–పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకుంటామని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. అలజడి యత్నాలు మానుకోండి: చైనా ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో చైనా విధ్వంసకారిగా మారిందంటూ నాటో కూటమి నేతలు చేసిన విమర్శలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ గురువారం ఖండించారు. సొంత భద్రత కోసం ఇతర దేశాల ప్రయోజనాలను బలిపెట్టడం నాటో దేశాలకు అలవాటేనని విమర్శించారు. ఆసియాలో అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు.నాటో సభ్య దేశాలు ఇవి...1.అమెరికా, 2.యునైటెడ్ కింగ్డమ్, 3.అల్బేనియా, 4.బెల్జియం, 5.బల్గేరియా, 6.కెనడా, 7.క్రొయేíÙయా, 8.చెక్‌రిపబ్లిక్, 9.డెన్మార్క్, 10.ఎస్తోనియా, 11.ఫిన్లాండ్, 12.ఫ్రాన్స్, 13.జర్మనీ, 14.గ్రీస్, 15.హంగేరీ, 16.ఐస్లాండ్, 17.ఇటలీ, 18.లాతి్వయా, 19.లిథువేనియా, 20.లక్సెంబర్గ్, 21.మాంటెనిగ్రో, 22.నెదర్లాండ్స్, 23.నార్త్ మాసిడోనియా, 24.నార్వే, 25.పోలాండ్, 26.పోర్చుగల్, 27.రొమేనియా, 28.స్లొవాకియా, 29.స్లొవేనియా, 30.స్పెయిన్, 31.స్వీడన్, 32.తుర్కియే -
ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యాకు పరాభవం తప్పదని తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, గగనతలంలో శత్రువును మట్టికరిపించే ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తామని ప్రకటించారు. తాజాగా ‘నాటో’ 75వ సదస్సులో బైడెన్ ప్రసంగించారు. అమెరికాతోపాటు జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ దేశాలు ఉక్రెయిన్‌కు అదనంగా ఐదు వ్యూహాత్మక ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను అందజేయబోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పదుల సంఖ్యలో టాక్టికల్ ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తాము అందజేసే క్రిటికల్ ఎయిర్–డిఫెన్స్ ఇంటర్సెప్టర్లతో రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తుందని స్పష్టం చేశారు. రష్యా క్షిపణుల దాడులు, వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాలతోపాటు ఉక్రెయిన్ సైన్యాన్ని కాపాడే ఇంటర్సెప్టర్లను వందల సంఖ్యలో అందిస్తామని పేర్కొన్నారు. యుద్ధంలో 3.50 లక్షల మందికిపైగా రష్యా సైనికులు మరణించడమో, గాయపడడమో జరిగిందని చెప్పారు. ఉక్రెయిన్ స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రదేశంగా కొనసాగుతుందని ఉద్ఘాటించారు. ఎన్నికల దాకా ఎదురు చూడాలా?: జెలెన్స్కీ ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే రష్యా అధినేత పుతిన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా ప్రపంచం ఎదురు చూడొద్దని చెప్పారు. ఉక్రెయిన్‌కు ఎఫ్–16 ఫైటర్ జెట్లు ఇస్తాం: నార్వే ఉక్రెయిన్‌కు ఆరు ఎఫ్16 ఫైటర్ జెట్లు అందజేస్తామని నాటో సభ్యదేశమైన నార్వే ప్రధాని జోనాస్ ప్రకటించారు. అయితే, ఎప్పటి నుంచి ఈ యుద్ధ విమానాలు ఉక్రెయిన్‌కు అందజేస్తారన్నది ఆయన వెల్లడించలేదు. -
Switzerland Peace Summit: ఉక్రెయిన్‌లో శాంతికి ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక
బెర్న్: ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఎలాంటి శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక అవుతుందని 80 దేశాలు తేలి్చచెప్పాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తున్నామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం స్విట్జర్లాండ్‌లో రెండు రోజులపాటు జరిగిన సదస్సు ఆదివారం ముగిసింది. దాదాపు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం 80 దేశాల ప్రతినిధులు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ సహా కొన్ని దేశాలు ఈ ప్రకటనలో పాలుపంచుకోలేదు. తుది డాక్యుమెంట్‌పై సంతకం చేయలేదు. యుద్ధం మొదలైన తర్వాత స్వా«దీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలని పలుదేశాలు రష్యాకు సూచించాయి. స్విట్జర్లాండ్ సదస్సు పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో శాంతికి ఇదొక తొలి అడుగు అని అభివరి్ణంచారు. అయితే, ఈ సదస్సుకు రష్యా మిత్రదేశం చైనా హాజరుకాలేదు. రష్యాను ఆహ్వా నించలేదు. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి(పశి్చమ) పవన్ కపూర్ హాజరయ్యారు. -
జీ-7 మద్దతు: ఉక్రెయిన్-రష్యా యుద్ధం! మళ్లీ బీభత్సమేనా!
ఇటలీలోని అపులియాలో నిర్వహించిన జీ-7 దేశాల సమ్మిట్ రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం జీ-7 సమ్మిట్‌లో పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పశ్చాత్య దేశాల మద్దతు కారణంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఫ్రాన్స్ బలగాలు ఉక్రెయిన్ యుద్ధం భూమిలో దిగనున్నాయి. యూకే 300 కిలోమీటర్ల రేంజ్ ఉండే స్టార్మ్ షాడో క్షిపణులు అందజేయనుంది. రష్యాను టార్గెట్ చేయడానికి పలు అధునాత రాకెట్లు, మిసైల్స్‌ను అమెరికా ఉక్రెయిన్‌కు సరఫరా చేయనుంది. జీ-7 దేశాల సమ్మిట్ ద్వారా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ పాశ్చాత్య దేశాల మద్దతు మరింత కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా భారీ ఆర్థిక, సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని స్థావరాలపై ఉక్రెయిన్ టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.జీ-7 దేశాల సమ్మిట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి జెలెన్స్కీ మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్‌కు సహకరించాడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించిన విషయం తెలిసిందే. అదే విధంగా రష్యా సార్వభౌమత్వానికి ముప్పు వస్తే.. అణ్వాయుధాలు వినియోగించడాకి కూడా వెనకడబోమని గతంలోనే ఆయన హెచ్చరించారు. చదవండి: జీ-7లో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. ఏంటంటే? -
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
బోర్గో ఎగ్నాజియా(ఇటలీ): సరిగ్గా జీ7 శిఖరాగ్ర భేటీ మొదలైన రోజే షరతులు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ తక్షణం అమలుచేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను ప్రచార ఎత్తుగడగా అని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ అభివరి్ణంచారు. ఇటలీ సారథ్యంలో ఈ ఏడాది జీ7 భేటీ జరిగాక శనివారం విలేకరుల సమావేశంలో మెలోనీ మాట్లాడారు. ‘‘ కుదిరితే జపాన్, లేదంటే అమెరికా, బ్రిటన్, కెనడాలు సంయుక్తంగా ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లమేర రుణాలు ఈ ఏడాది చివరికల్లా అందిస్తాయి. యూరప్‌లో స్తంభింపజేసిన రష్యా ఆస్తులను వాడుకుని తద్వారా ఈ రుణాలను చెల్లిస్తాయి. యురోపియన్ యూనియన్ సభ్య దేశాలకు ఈ రుణాలతో ఎలాంటి సంబంధం లేదు. అమెరికా, బ్రిటన్ వంటి జీ7 దేశాలే ఈ రుణ అంశాలను చూసుకుంటాయి’ అని స్పష్టంచేశారు. గాజా స్ట్రిప్‌పై భీకర దాడులతో వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్‌ను జీ7 దేశాలు ఎందుకు శిఖరాగ్ర సదస్సులో తీవ్రంగా మందలించలేదు? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు అనేది మీరొకసారి గుర్తుచేసుకోండి. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారు. హమాస్ పన్నిన ఉచ్చులో ఇజ్రాయెల్ పడింది’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. ‘‘ అక్రమ వలసలకు వ్యతిరేకంగా జీ7 కూటమి స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆఫ్రికా దేశాలకు నిధుల మంజూరు, పెట్టుబడులు పెంచడం ద్వారా ఆయా దేశాల నుంచి ఐరోపాకు వలసలను తగ్గించవచ్చు’ అని చెప్పారు. ఐరోపా దేశాలకు వలస వస్తున్న ఆఫ్రికా పేదలకు ఇటలీ ముఖద్వారంగా ఉన్న విషయం విదితమే. -
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
రోమ్: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచి్చంది? అమెరికాతోపాటు పశి్చమ దేశాలు డ్రాగన్ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచి్చపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్‌పై దాడుల తర్వాత రష్యాపై పశి్చమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. టిబెట్, షిన్‌జియాంగ్‌తోపాటు హాంకాంగ్‌లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశి్చమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి. -
Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
న్యూఢిల్లీ/బిష్కెక్: స్థానికులు, విదేశీయులకు మధ్య ఘర్షణలతో కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కెక్ అట్టుడికిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కొందరు స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి మెడికల్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరి మూకలు దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యలో బిష్కెక్లోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం శనివారం సూచించింది. గొడవలు సద్దుమణిగేదాకా ఎవరూ బయటకు రావొద్దని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టం చేసింది. భారతీయ విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామని కిర్గిజ్స్తాన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. బిష్కెక్ లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, అయినప్పటికీ విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టంచేసింది. ఏదైనా సహాయం కావాలంటే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని బిషె్కక్లోని భారతీయ విద్యార్థులకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన విద్యార్థుల భద్రత గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కిర్గిజ్స్తాన్లో ప్రస్తుతం దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎంత మంది బిష్కెక్లో ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే, బిషె్కక్లో ప్రశాంతమైన వాతావరణ ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం, పౌరుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కిర్గిజ్స్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఎందుకీ ఘర్షణలు? కిర్గిజ్స్తాన్లో అలజడికి మూలాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఉన్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన కిర్గిజ్స్తాన్ 1991లో స్వతంత్ర దేశంగా మారింది. ఇక్కడి అధికారిక భాష రష్యన్. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా హఠాత్తుగా దాడి చేయడంతో కిర్గిజ్స్తాన్కు ఒక్కసారిగా కష్టాలు వచి్చపడ్డాయి. రష్యా నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి. రష్యాలోని కిర్గిజ్స్తాన్ కారి్మకులకు వేతనాలు రాక సొంత దేశానికి డబ్బులు పంపడం లేదు. దీనికితోడు కిర్గిజ్‌స్తాన్‌పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. మరోవైపు రష్యా నుంచి లక్షలాది మంది కిర్గిజ్స్తాన్కు వలస వస్తున్నారు. కుటుంబాలతో సహా ఇక్కడే స్థిరపడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 2022 సెపె్టంబర్ నుంచి ఇప్పటిదాకా 1,84,000 రష్యన్లు కిర్గిజ్స్తాన్కు తరలివచ్చారు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పరిశ్రమలు, దుకాణాలు మూతపడుతున్నాయి. స్థానికులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. దాంతో వారిలో అసంతృప్తి, అసహనం పెరిగిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ప్రధానంగా రాజధాని బిషె్కక్లోని వైద్య విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు సహా ఇతర దేశాల విద్యార్థులపై వారి కన్నుపడింది. విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లు, ఇళ్లల్లోకి గుంపులు గుంపులుగా చొరబడిమరీ దాడి చేస్తున్నారు. ఇదే అదనుగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు సైతం ప్రతిఘటిస్తుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడుల్లో ఇప్పటికే పలువురు గాయపడ్డారు. ముగ్గురు పాకిస్తాన్ విద్యార్థులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. -
Russia-Ukraine war: జపొరిజియా అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
కీవ్: రష్యా ఆక్రమిత జపొరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌పై డ్రోన్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ప్లాంట్‌లోని ఆరో యూనిట్ డోమ్ సహా పలు చోట్ల ఉక్రెయిన్ మిలటరీ డ్రోన్లు ఆదివారం దాడి చేశాయన్నారు. అయితే ఎటువంటి నష్టం వాటిల్లలేదని, ఎవరూ చనిపోలేదని అన్నారు. ప్లాంట్‌లో అణుధారి్మకత స్థాయిలు కూడా సాధారణంగానే ఉన్నట్లు వివరించారు. దాడి సమాచారం తమకు అందిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. ఇటువంటి దాడులతో భద్రతాపరమైన ప్రమాదాలున్నాయని హెచ్చరించింది. యూరప్‌లోనే అతి పెద్దదైన జపొరిజియా అణు విద్యుత్కేంద్రం 2022 నుంచి రష్యా ఆ«దీనంలోనే ఉంది. ఇందులోని ఆరు యూనిట్లు కొద్ది నెలలుగా మూతబడి ఉన్నాయి. -
Russia-Ukraine war: రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. రష్యా 32 ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్ మిస్సైళ్లను కూలి్చవేశామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తాజా దాడులపై రష్యా మిలటరీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
Russia-Ukraine war: రష్యాపై డ్రోన్లతో దాడి
కీవ్: రష్యా భూభాగంపై ప్రతి దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది. శుక్రవారం సరిహద్దుల్లోని రష్యాకు చెందిన రోస్టోవ్ ప్రాంతంపైకి ఉక్రెయిన్ పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మొరొజొవ్‌స్కీ ఎయిర్ ఫీల్డ్‌లోని ఆరు సైనిక విమానాలు ధ్వంసం కాగా, మరో ఎనిమిదింటికి నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ తెలిపింది. 20 మంది సిబ్బంది చనిపోయినట్లు ప్రకటించుకుంది. మొరొజొవ్‌స్కీ ప్రాంతంపైకి వచ్చిన 44 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరంపై దాడి, యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై రష్యా స్పందించలేదు. దాడుల్లో ఒక విద్యుత్ ఉపకేంద్రం మాత్రం ధ్వంసమైందని పేర్కొంది. సరటోవ్, కుర్స్క్, బెల్గొరోడ్, క్రాస్నోడార్లపైకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా ఆర్మీ తెలిపింది. -
మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
వ్లాదిమిర్ పుతిన్ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే దేశం రష్యా. చాలా సంవత్సరాలుగా పుతిన్ ఏలుబడిలో ఉన్న రష్యాలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు కీలకంగా మారనుంది. అందుకు కారణం.. ఆ దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం. గతంలో ఒక్కరోజులో పోలింగ్ పూర్తయ్యేది. అయితే.. దేశ చరిత్రలో తొలిసారిగా వరసగా మూడు రోజులపాటు అంటే 15, 16, 17 తేదీల్లో పోలింగ్‌కు రష్యా సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ ప్రారంభమైందక్కడ.. ప్రస్తుత పదవీకాలంతో కలిపి పుతిన్ ఇప్పటికే నాలుగు సార్లు(2000, 2004, 2012, 2018)లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో ప్రధానిగానూ సేవలందించారు. మానవహక్కుల గొంతుక, విపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెల మారుమూల కారాగారంలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఈసారి పుతిన్ వ్యతిరేక ఓటింగ్ పెరుగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. ఉక్రెయిన్‌పై దురాక్రమణతో ప్రస్తుతం తన అధీనంలో ఉన్న నాలుగు ఉక్రెయిన్ రీజియన్లలోనూ ఈ ఎన్నిక క్రతువు కొనసాగనుంది. పుతిన్ హవా.. అధ్యక్ష రేసులో పుతిన్ విజయబావుటా ఎగరేస్తారని ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అయినా సరే పౌర హక్కులను కాలరాస్తూ, నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతినబూనారు. ఎన్నికల రణరంగంలో పుతిన్‌ను ఓడిస్తామంటూ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా(ఎల్‌డీపీఆర్) తరఫున అభ్యరి్థగా లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ అభ్యరి్థగా వ్లాదిస్లేవ్ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యరి్థగా నికోలే ఖరిటోనోవ్‌లు ఎన్నికల బరిలో నిలిచారు. దేశ ఓటర్లలో పుతిన్‌కు 75 శాతం మద్దతు ఉందని, ఈ ముగ్గురు తలో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్ అంచనాలు విశ్లేíÙస్తున్నాయి. పోలింగ్ ఎక్కడెక్కడ? పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురువారం కంటే ముందే మొదలుపెట్టారు. శుక్రవారం సాధారణ ఓటింగ్ మొదలైంది. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై పుతిన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. రష్యా భూభాగంలో ఎలాగూ మెజారిటీ సాధిస్తానని పుతిన్ బలంగా నమ్ముతున్నారు. ఉక్రెయిన్ ప్రాంతాల్లో గెలిచి తమది అధర్మ యుద్ధం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని పుతిన్ యోచిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు, రెఫరెండమ్‌లు ఇప్పటికే నిర్వహించారు. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని ప్రపంచదేశాలు మొత్తుకున్నా పుతిన్ పట్టించుకోవట్లేదు. ఈసారి 11.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా సరే ఓటేయొచ్చు. మార్చి 19 కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడి కావచ్చు. తుది ఫలితాలు తెలియాలంటే మార్చి 29వ తేదీకా ఆగాల్సిందే. 2018 గత అధ్యక్ష ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకెన్నాళ్లు పుతిన్ పాలిస్తారు? మరో రెండు పర్యాయాలు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనువుగా చట్టం చేసి 2021లో పుతిన్ దానిపై సంతకం చేశారు. ఈసారి గెలిచి, 2030లోనూ గెలిస్తే 2036దాకా పుతిన్ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు. రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యంత ఎక్కువకాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ పేరు ఇప్పటికే చరిత్రకెక్కింది. కుంభస్థలిని కొట్టగలరా ? పోటీలో ఏ అభ్యర్థి నిలబడాలి అనేది దాదాపు దేశ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) నిర్ణయిస్తుంది. ఎల్‌డీపీఆర్ నేత లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ నేత వ్లాదిస్లేవ్ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్‌లు ఈసారి బరిలో దిగారు. పుతిన్‌ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీరు వ్యతిరేకించలేదు. యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక విపక్ష నేత బోరిస్ నదేహ్‌దిన్‌ను పోటీకి నిలబడకుండా సీఈసీ అడ్డుకుంది. అభ్యరి్ధత్వానికి సరిపడా సంతకాలను సేకరించలేకపోయారని ఆయన అభ్యరి్ధత్వాన్ని తిరస్కించింది. మరో అభ్యర్ధి యెకటేరియా డుంట్సోవానూ సీఈసీ ఇలాగే పక్కకునెట్టింది. పుతిన్‌ను ప్రధానంగా విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. స్లట్స్కీ, దవాన్‌కోవ్, ఖరిటోనోవ్‌లు దేశ సమైక్యత విషయానికొచ్చేసరికి పుతిన్‌కు పరోక్షంగా మద్దతు పలుకుతారు. ఈ లెక్కన దేశ సమైక్యత జెండా పట్టిన పుతిన్‌కే ఎక్కువ ఓట్లు పడతాయి. దీంతో వీళ్లు పుతిన్‌ను ఓడించడం అనేది అసంభవం. పుతిన్‌కు నిజంగా అంతటి ఫాలోయింగ్ ఉందా? రష్యా పౌరులు ఆంక్షల చట్రం, నిఘా నీడలో జీవిస్తారని పశి్చమదేశాలు తరచూ ఆరోపిస్తుంటాయి. దీంతో పుతిన్‌ను ఇష్టపడే ఎన్నుకుంటున్నారా లేదంటే మరో ప్రత్యామ్నాయం లేక పుతిన్‌కు జై కొడుతున్నారా అనేది ఇతమిద్ధంగా ఎవరికీ తెలీదు. పుతిన్ పాపులారిటీ 80 శాతాన్ని దాటేసిందని అక్కడి ప్రభుత్వేతర ఎన్నికల మేథో సంస్థ ‘ది లెవడా సెంటర్’ ఇటీవల ప్రకటించింది. అయితే 2023 చివరి నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరవరలు ఎగిసిన నేపథ్యంలో పుతిన్ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగాయని సంస్థ విశ్లేషించడం గమనార్హం. తనను వ్యతిరేకించే వాళ్లను పుతిన్ అస్సలు సహించలేడని పుతిన్‌కు గతంలో ప్రసంగాలు రాసి ఇచ్చిన అబ్బాస్ గలియమోవ్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్–రష్యా యుద్ధం: హైదరాబాద్ యువకుడు మృతి
సాక్షి, సిటీబ్యూరో/ నాంపల్లి: ఉపాధి, అధిక వేతనం ఆశ.. ఏజెంట్ల మోసం కారణంగా పాతబస్తీకి చెందిన ఓ యువకుడు రష్యాలో మృత్యువాతపడ్డాడు. బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్ అఫ్సాన్ ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లగా.. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యాలోని పుతిన్ ప్రైవేట్ సైన్యంలో చేరాల్సి వచ్చింది. ఇతను ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొని అక్కడే అసువులు బాశాడు. ఈమేరకు రష్యాలోని భారతీయ రాయబారి కార్యాలయానికి సమాచారం అందింది. వారు బుధవారం అఫ్సాన్ సోదరుడు ఇమ్రాన్‌కు ఫోన్ చేసి ఈ విషయం తెలిపారు. దీంతో బజార్‌ఘాట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా అఫ్సాన్ దీన స్థితిని వివరించి కాపాడాలని ఇక్కడి ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే తన సోదరుడు చనిపోయాడని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. నారాయణ్‌పేట్‌కు చెందిన మహ్మద్ సుఫియాన్ అనే మరో యువకుడు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయాడని, కనీసం అతడినైనా కాపాడాలని ఇమ్రాన్ విజ్ఞప్తి చేశాడు. ఆయన ఇక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ తన సోదరుడిని బాబా బ్లాక్స్ కంపెనీ ఉద్యోగంలోకి తీసుకుందని, ఆ సంస్థ దుబాయ్, ఢిల్లీ, ముంబైలో కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత్ నుంచి వెళ్లిన వారికి ఆర్మీ హెల్పర్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పారని, చివరికి వారిని సైన్యంలోకి చేర్చి ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించినట్లు వివరించారు. కాగా అఫ్సాన్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలిసి వీరు కన్నీరుమున్నీరయ్యారు. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై.. రెండు సంవత్సరాలు అవుతోంది. తొలుత ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేసి రష్యా ఆధిపత్యం చెలాయించగా.. ఆ తర్వాత ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల సహకారంతో ఎదురుదాడుల్ని పెంచింది. మొదట్లో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల్ని ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. దీంతో రష్యా తన దాడుల్ని మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌ని బలహీనపరిచేందుకు ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసుకొని, డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఇటు ఉక్రెయిన్ సైతం ఈ దాడుల్ని తిప్పికొడుతోంది. తాజాగా రష్కా- ఉక్రెయిన్ పోరులో హైదరాబాద్ వాసి మృతి చెందాడు.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ నగరానికి చెందిన మహ్మద్ అఫ్సాన్(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే ఉద్యోగం విషయంలో మోసపోవడంతో ఆఫ్సాన్ రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు సమాచారం. కాగా రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 20 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది. మరోవైపు మహ్మద్ అస్ఫాన్‌ను రష్యా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం కోసం అతడి కుటుంబుం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని సంప్రదించింది. ఈ క్రమంలో ఎంఐఎం మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. అస్ఫాన్ మరణించినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మృతిడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. అంతలోనే -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్‌లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine war: మరింత జోక్యంతో అణు యుద్ధమే
మాస్కో: ఉక్రెయిన్‌లోని లక్ష్యాలను సాధించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌కు అండగా సైన్యాలను పంపించడం ద్వారా మరింత లోతుగా జోక్యం చేసుకోవాలని చూస్తే అణు యుద్ధం తప్పదని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు. వచ్చే నెల్లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో పుతిన్ విజయం ఇప్పటికే ఖరారైంది. ఎన్నికలను పురస్కరించుకుని గురువారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యుద్ధంలో పుతిన్ విజయం యూరప్‌లో తీవ్ర విపరిణామాలకు దారి తీస్తుందని, దీనిని నివారించేందుకు నాటో దేశాలు ఉక్రెయిన్‌లోకి ప్రత్యక్షంగా బలగాలను పంపించే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఫ్రాన్సు అధ్యక్షుడు మాక్రాన్ ఇటీవల చేసిన హెచ్చరికలపై ఆయన పైవిధంగా స్పందించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ‘గతంలో మన దేశంలోకి సైన్యాన్ని పంపించిన వారికి ఎలాంటి గతి పట్టిందో మనకు తెలుసు. మళ్లీ అటువంటిదే జరిగితే ఈసారి పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. మన వద్ద కూడా పశ్చిమదేశాల్లోని లక్ష్యాలను చేరగల ఆయుధాలున్న సంగతిని వాళ్లు గుర్తుంచుకోవాలి. ఆ దేశాలు చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని భయపెడు తున్నట్లుగా అగుపిస్తోంది. ఇవన్నీ నిజమైన అణు సంఘర్షణ ముప్పును మరింతగా పెంచుతున్నాయి. దానర్థం మానవ నాగరికత విధ్వంసం. యుద్ధంతో ఎదురయ్యే పెను సవాళ్లు, అణు యుద్ధం తాలూకూ పరిణామాలు వాళ్లకు అర్థం కావా?’అని పుతిన్ ప్రశ్నించారు. ‘దేశం పూర్తిస్థాయి అణు యుద్ధ సన్నద్ధతతో ఉంది. ఎంతో శక్తివంతమైన నూతన ఆయుధాలను సైన్యం మోహరించింది. వాటిలో కొన్నిటిని ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో ప్రయోగించి చూసింది’ అని చెబుతూ ఆయన శక్తివంతమైన బురెవెస్ట్నిక్ అణు క్రూయిజ్ క్షిపణి వంటి వాటిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాటో దేశాలపై రష్యా దాడి చేసే ప్రమాదముందంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రకటనలను భ్రమలుగా అధ్యక్షుడు పుతిన్ కొట్టిపారేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పైకి భారీగా సైన్యాన్ని పంపించినప్పటి నుంచి పుతిన్ అణు ముప్పుపై పశ్చిమ దేశాలను పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. -
Russia: ఉక్రెయిన్ దాడుల్లో భారత యువకుడి మృతి
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించాడు. రష్యా ఆర్మీ వద్దసెక్యూరిటీ హెల్పర్‌గా పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్(23) ఈ నెల 21న ఉక్రెయిన్ జరిపిన వైమానిక దాడుల్లో మృతి చెందాడు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెస్క్ ప్రాంతంలో హేమిల్ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్ దాడులు జరిగాయని భారత్‌కు చెందిన మరో సెక్యూరిటీ హెల్పర్ సమీర్ అహ్మద్ తెలిపారు. అయితే హేమిల్ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత విదేశీ వ్యవహరాల శాఖ స్పష్టం చేసింది. సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారత యువకులను ఉక్రెయిన్‌తో యుద్ధంలో చురుగ్గా పాల్గొనాలని రష్యా బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే హేమిల్ ఉక్రెయిన్ దాడుల్లో మరణించాడు. గతేడాది రష్యా ఆర్మీ 100 మంది భారతీయులను సెక్యూరిటీ హెల్పర్లుగా నియమించింది. అయితే వీరందరూ యుద్ధం నుంచి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అడ్వైజరీ కూడా చేసింది. ఏజెంట్ల మోసం వల్లే భారత యువకులు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేయాల్సి వస్తోందని ఇటీవల ఎంఐఎం చీఫ్, అసదుద్దీనన్ ఒవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే. వీరి విషయంలో భారత విదేశాంగ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. . ఇదీ చదవండి.. అమెరికా నౌకపై హౌతీల మిసైల్ దాడి -
USA: రష్యాపై భారీ ఆంక్షలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డ రష్యా మీద అమెరికా, యూరోపియన్ యూనియన్ శుక్రవారం మరిన్ని ఆంక్షలకు తెర తీశాయి. ఈసారి కూడా ప్రధానంగా ఆ దేశ ఆర్థిక, రక్షణ, పారిశ్రామిక నెట్వర్కులను లక్ష్యం చేసుకున్నాయి. రష్యా, దాని సన్నిహితులపై ఏకంగా 500పై చిలుకు ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు! మతిలేని హత్యాకాండకు, వినాశనానికి పుతిన్ మూల్యం చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు భారీ ఆయుధాల తయారీ తదితరాలకు ఉపయోగపడే నిషేధిత వస్తువులను రష్యాకు ఎగుమతి చేసిన ఆరోపణలపై పలు విదేశీ కంపెనీలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ఈయూ సమాఖ్య ప్రకటించింది. నవాల్నీ కుటుంబంతో బైడెన్ భేటీ: అంతకుముందు రష్యా విపక్ష నేత దివంగత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా, కూతురు దషాతో బైడెన్ భేటీ అయ్యారు. నవాల్నీ మృతి పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘నవాల్నీ సాటిలేని ధైర్యశాలి. ఆయన పోరాటాన్ని యూలియా, దషా ముందుకు తీసుకెళ్తారని పూర్తి విశ్వాసముంది’’ అన్నారు. నవాల్నీ మృతదేహానికి గోప్యంగా తక్షణ అంత్యక్రియలు జరిపేందుకు అంగీకరించేలా జైలు అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తల్లి లుడ్మిలా ఆరోపించారు. ఆలస్యమైతే శవం కుళ్లిపోతుందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గురువారం కుమారుని మృతదేహాన్ని చూసిన అనంతరం ఆమె ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Russia-Ukraine War: యుద్ధం X రెండేళ్లు
సైనికంగా సూపర్ పవరైన రష్యా చోటా దేశమైన ఉక్రెయిన్‌పై ఉన్నట్టుండి విరుచుకుపడి నేటికి రెండేళ్లు. ఉక్రెయిన్ ‘సంపూర్ణంగా నిస్సైనికీకరణే’ లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన ఈ దుందుడుకు చర్య ప్రపంచ దేశాలన్నింటినీ నిత్యం ఏదోలా ప్రభావితం చేస్తూనే వస్తోంది. రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం రెండేళ్లు దాటినా కొనసాగుతూనే ఉందంటే ఉక్రెయిన్ కనబరచిన తిరుగులేని తెగువే ప్రధాన కారణం. కానీ కొన్నాళ్లుగా ఉక్రెయిన్ క్రమంగా చతికిలపడుతుండగా రష్యా దూకుడు పెంచుతోంది. అయినా లొంగేందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. పైగా ఆక్రమిత భూభాగాల నుంచి వైదొలగి, తమకు కలగజేసిన అపార నష్టానికి రష్యా భారీగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పట్లో ముగిసే సూచనలు కని్పంచడం లేదు... యుద్ధం తొలినాళ్లలో రష్యా దూకుడు ప్రదర్శించింది. రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపం దాకా దూసుకెళ్లాయి. యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని ఆక్రమించడంతో యావత్ యూరప్ ఖండం భద్రతాపరమైన ఆందోళనలతో ఉలిక్కిపడింది. కానీ ఆ జోరుకు నెల రోజుల్లోనే బ్రేకులు పడ్డాయి. ఉక్రెయిన్ దళాలు ముప్పేట దాడులతో రష్యా సైన్యాన్ని దిగ్బంధించాయి. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల దన్నుతో పైచేయి సాధిస్తూ వచ్చాయి. వాటి తీవ్ర ఆంక్షలతో రష్యా అతలాకుతలమైంది. కానీ సెప్టెంబర్ నాటికి జపోరిజియాతో పాటు కీలకమైన డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్ ప్రాంతాలను స్వా«దీనం చేసుకున్నట్టు ప్రకటించింది. రష్యాకు చెందిన భారీ యుద్ధ నౌకలతో పాటు క్రిమియాతో రష్యాను కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేయడం వంటి చర్యలతో ఉక్రెయిన్ అప్పుడప్పుడూ పైచేయి సాధిస్తూ వచి్చంది. 2023 మేలో ఏకంగా మాస్కోలో పుతిన్ అధికార నివాసమైన క్రెమ్లిన్‌పై రెండు ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకెళ్లి కలవరం రేపాయి. తర్వాత నుంచీ ఉక్రెయిన్ దూకుడు నెమ్మదించసాగింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి దెబ్బకు తొలుత అపార నష్టం చవిచూసిన రష్యా సైన్యం తానూ అదే బాట పట్టింది. కొంతకాలంగా ఇరు బలగాలూ డ్రోన్లపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి! విదేశాల నుంచి భారీగా అందుతున్న వాటికి అదనంగా 2023లోనే ఉక్రెయిన్ ఏకంగా 3 లక్షల డ్రోన్లను తయారు చేసుకుంది! వాటిని 2024లో 10 లక్షలకు పెంచజూస్తోంది. వీటికి చిన్న తరహా మిసైళ్లు తోడవుతున్నాయి. ఇప్పుడేంటి...! రష్యా తాజాగా ఉక్రెయిన్‌లోని అది్వవ్కా నగరాన్ని ఆక్రమించింది. ఆ క్రమంలో అతి భారీగా ఆయుధ సామగ్రిని కోల్పోయింది. కాకపోతే కొన్నాళ్లుగా విపరీతంగా వచి్చపడుతున్న చమురు అమ్మకాల లాభాలతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. పైగా లక్షలాదిగా అదనపు సైనికులను సిద్ధం చేసుకుంటోంది. ఇవన్నీ ఉక్రెయిన్‌కు భారీ హెచ్చరిక సంకేతాలే. స్వీయ సాయుధ సామగ్రి నిండుకుంటుండటమే గాక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అమెరికా, పాశ్చాత్య దేశాల నుంచి సాయమూ బాగా తగ్గింది. ఏదేమైనా రష్యా గెలిచేదాకానో, పుతిన్ అధికారంలో ఉన్నంత వరకో యుద్ధం కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పోరులో ఉక్రెయిన్ మాత్రం ఇప్పటికే బహుశా ఇంకెప్పటికీ కోలుకోలేనంతగా దెబ్బ తిన్నది. అపార నష్టం... ► యుద్ధంలో మరణించిన, క్షతగాత్రులైన రష్యా, ఉక్రెయిన్ సైనికుల సంఖ్య ఏకంగా 5 లక్షలు దాటినట్టు అంచనా. ► 12,000 మందికి పైగా అమాయక ఉక్రేనియ న్లు యుద్ధానికి బలయ్యారు. 20,000 పై చిలుకు మంది క్షతగాత్రులయ్యారు. ► కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిర్వాసితులయ్యారు. వీరిలో 60 లక్షలకు పైగా విదేశాలకు వలసబాట పట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద వలసగా నిలిచింది. ► అమెరికా, పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు ఇప్పటికే బిలియన్ల కొద్దీ ఆర్థిక సాయం, అంతకు మించి అత్యాధునిక ఆయుధ సాయం చేస్తూ వస్తున్నాయి. ► ఐఎంఎఫ్ కూడా 15.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేసింది. యుద్ధంలో ఉన్న ఓ దేశానికి ఆర్థిక సాయం ఐఎంఎఫ్ చరిత్రలోనే తొలిసారి. ► రెండేళ్ల యుద్ధంలో 20 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని మాత్రమే రష్యా ఆక్రమించగలిగింది. అందులోనూ సగం తిరిగి తమ వశమైనట్టు ఉక్రెయిన్ చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాకు ఎదురుదెబ్బ
కీవ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్‌కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్‌లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్‌కు లక్ష మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్‌లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది. -
Russia-Ukraine war: చేజారిన తోడే.. బొడ్డుతాడై...
ఉక్రెయిన్. ఒకప్పటి అందాల దేశం. ఇప్పుడు రష్యా రక్త దాహానికి బలైన శిథిల చిత్రం. యుద్ధం మిగిల్చే బీభత్సానికి సాక్షి. పోరులో ప్రాణాలొదిలిన వేలాది మంది ఉక్రెయిన్ యువ సైనికుల జీవిత భాగస్వాములది మాటలకందని దైన్యం. వారిలోనూ అసలు సంతానమే లేనివారిదైతే చెప్పనలవి కాని వ్యథ. ఎవరి కోసం బతకాలో తెలియని నైరాశ్యం. అయితే తమ జీవిత భాగస్వాములు ముందుజాగ్రత్తగా భద్రపరిచి వెళ్లిన వీర్యం/అండాలు వారిలో కొత్త ఆశలు నింపుతున్నాయి. వాటి సాయంతో బిడ్డలను కంటున్నారు. తమను శాశ్వతంగా వీడి వెళ్లిన తోడు తాలూకు నీడను వారిలో చూసుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు... ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై రెండేళ్లవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై రష్యా సైన్యం హఠాత్తుగా విరుచుకుపడింది. రోజుల్లో తల వంచుతుందనుకున్న ఉక్రెయిన్ దీటుగా పోరాడుతోంది. దాంతో రెండేళ్లయినా పోరు కొనసాగుతూనే ఉంది. యుద్ధమంటేనే ప్రాణనష్టం! ఇప్పటిదాకా ఏకంగా 70,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించినట్లు అంచనా. మరో లక్షన్నర మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. యుద్ధంలో జవాను వీరమరణం పొందితే అతడి/ఆమె వంశం అంతమైపోవాల్సిందేనా? బతికుండగానే అండాలు, వీర్యం భద్రపర్చుకొని, తాము లేకపోయినా జీవిత భాగస్వామి ద్వారా సంతానం పొందే వెసులుబాటును ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇలాంటి ప్రశ్నలు ఉక్రెయిన్ సైన్యం నుంచి గట్టిగా వినిపించాయి. దీనిపై ప్రభుత్వమూ సానుకూలంగా స్పందించింది. పార్లమెంటులో ఇటీవలే ఒక బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ సంతకం చేస్తే చట్టంగా మారనుంది. ఇదొక విప్లవాత్మక చట్టం కానుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. యుద్ధంలో మరణించినవారి వీర్యం/అండాలతో సంతానం పొందే అవకాశం ఇప్పటిదాకా ఉక్రెయిన్‌లో చట్టపరంగా లేదు. ఇక ఈ పరిస్థితి మారనుంది... ► ఉక్రెయిన్ పార్లమెంట్లో ఆమోదించిన బిల్లు ప్రకారం జవాన్లు తమ వీర్యం, అండాలు భద్రపర్చుకోవచ్చు. వారు యుద్ధంలో అమరులైతే వాటి సాయంతో జీవిత భాగస్వాములు సంతానం పొందవచ్చు. ► ఈ కొత్త చట్టాన్ని అంతా స్వాగతిస్తున్నారు. దీని ద్వారా అమర సైనికుల కుటుంబ వారసత్వం కొనసాగుతుందంటున్నారు. ► జవాన్ల వీర్యం/అండాలు ఉచితంగా భద్రపరుస్తామని ఉక్రెయిన్‌లో పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. యుద్ధం మొదలైనప్ప టి నుంచే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి. ► ఇందుకు వీలుగా యుద్ధంలో మృతి చెందిన జవాన్ల వీర్యం/అండాలను మూడేళ్ల పాటు భద్రపరుస్తారు. ఇందుకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది. ► వీర్యం/అండాలు భద్రపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న సైనికుల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ప్రభుత్వం అనుమతితో పాటు ఆర్థిక సాయమూ అందిస్తుందని స్పష్టత రావడమే కారణమని తెలుస్తోంది. ► యుద్ధంలో క్షతగాత్రులై, ఆరోగ్యం దెబ్బతిని సంతానోత్పత్తికి, బిడ్డలకు జన్మనిచ్చే సామర్థ్యానికి దూరమైన సైనికులు కూడా వీర్యం/అండాలను భద్రపర్చుకుని సంతానం పొందవచ్చు. ► యుద్ధంలో గాయపడిన పలువురు జవాన్లు ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ► ఇలా భద్రపర్చిన వీర్యం/అండాలతో పుట్టే పిల్లలకు చట్టబద్ధంగా అన్ని హక్కులూ ఉంటాయి. అమర వీరులైన తల్లి/తండ్రి పేరును వారి బర్త్ సరి్టఫికెట్లో ముద్రిస్తారు! ► ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నవారు కూడా మరో బిడ్డను కనడానికి ముందుకొస్తున్నారు. ఇలా భద్రపర్చుకుంటున్న జవాన్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. మన పాప నవ్వుల సాక్షిగా... నువ్వెప్పటికీ నాతోనే... మనసుతో చూడగలిగితే లక్ష భావాలను, కోటి ఊసులను కళ్లకు కట్టే ఫొటో ఇది. ఇందులో నేపథ్యంలోని పోస్టర్లో కనిపిస్తున్నది రష్యాతో పోరులో మరణించిన ఉక్రెయిన్ సైనికుడు విటాలీ. బుల్లి పాపాయిని ఎత్తుకున్నది అతని భార్య విటాలినా. భర్త మరణానంతరం ఆయన వీర్యంతో గర్భం దాల్చి ఈ పండంటి పాపాయికి జన్మనిచి్చందామె. కూతురిని భర్త ఫొటోకు చూపిస్తూ ఇలా భావోద్వేగానికి గురైంది. రష్యాతో యుద్ధం మొదలయ్యే కొద్ది నెలల ముందే విటాలీ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ యుద్ధం మొదలైన తొలి నాళ్లలోనే మరణించాడు. అప్పటికే విటాలినా 13 వారాల గర్భవతి. కానీ ఆ గర్భం నిలవలేదు. భర్త క్షేమం తాలూకు ఆందోళనే అందుకు ప్రధాన కారణమని ఇప్పటికీ కన్నీళ్లపర్యంతం అవుతుంటుంది విటాలినా. ‘‘అటు జీవితాంతం తోడుండాల్సిన భర్తను, ఇటు ఇంకా లోకమే చూడని మా కలల పంటను కొద్ది రోజుల తేడాతో శాశ్వతంగా కోల్పోయా. బతుకంతా ఒక్కసారిగా శూన్యంగా తోచింది’’ అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుందామె. ‘‘ఇలాంటి పరిస్థితిని ఊహించే నా భర్త వీర్యాన్ని భద్రపరిచి వెళ్లాడు. దాని సాయంతో తల్లిని కావాలని నిర్ణయించుకున్నా. అలా ఈ చిట్టి తల్లి ఈ లోకంలోకి అడుగు పెట్టింది. తన రాకతో నాకు నిజంగా సాంత్వన చేకూరింది. పాప వాళ్ల నాన్న పోలికలనే గాక హావభావాలను కూడా ముమ్మూర్తులా పుణికి పుచ్చుకుంది. దైవ కృప అంటే బహుశా ఇదేనేమో. నిజానికి గంపెడు సంతానాన్ని కనాలని, మాది పెద్ద కుటుంబం కావాలని పెళ్లికి ముందు నుంచీ ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ విధి రాత మరోలా ఉంది. అయినా తను ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఈ చిట్టితల్లి రూపంలో ఇలా ఫలించింది’’ అంటుంటే విని చెమర్చని కళ్లు లేవు. కాస్త అటూ ఇటుగా ఉక్రెయిన్ సైనిక వితంతువులందరి గాథ ఇది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
గగనతల రారాజు ‘జిర్కాన్’.. ఎన్నో ప్రత్యేకతలు
రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరేలాగా తాజా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రష్యా అత్యాధునిక అస్త్రాన్ని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఈ విషయాన్ని మాస్కో బహిర్గతం చేయకపోయినా కీవ్ ఫోరెన్సిక్ పరిశోధనా సంస్థ బృందం గుర్తించింది. ఇటీవల కీవ్‌పై జరిగిన ఒక దాడిలో రష్యా జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని వాడినట్లు ఆ బృందం వెల్లడించింది. జిర్కాన్ ప్రత్యేకతలు.. ఒక్కసారి జిర్కాన్ క్షిపణి గాల్లోకి ఎగరడం మొదలుపెడితే దాన్ని ప్రపంచంలోని ఏ అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేదు. అమెరికాకు చెందిన మిసైల్ డిఫెన్స్ అడ్వొకసి అలయన్స్ అంచనా ప్రకారం ఈ క్షిపణి గంటకు 9,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకవేళ ఇలా వస్తున్న వార్తలు నిజమైతే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి జిర్కాన్. దాన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఈ క్షిపణి ప్రయాణించే సమయంలో దాని చుట్టూ ప్లాస్మా మేఘంతో వలయం ఏర్పడుతుంది. గగనతల రక్షణ వ్యవస్థల నుంచి వచ్చే రాడార్ సంకేతాలను అది తనలో కలిపేసుకుంటుంది. దీంతో ఈ క్షిపణిని గుర్తించడానికి వీలుండదు. అమెరికాకు చెందిన ‘ఏజిస్ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు శత్రు అస్త్రాలను నేలకూల్చడానికి 8-10 సెకన్ల సమయం అవసరం. ఇంత స్వల్ప వ్యవధిలో జిర్కాన్ 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందువల్ల ఏజిస్ క్షిపణికి కూడా అది అందదని రష్యా నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. -
Russia-Ukraine war: ఆక్రమిత ఉక్రెయిన్‌పై దాడి.. 28 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత లిసిచాన్స్క్ నగరంలోని ఓ బేకరీపై జరిగిన దాడిలో 28 మంది మృతి చెందారు. రష్యా నియమించిన స్థానిక అధికారి ఈ విషయం వెల్లడించారు. బేకరీ కుప్పకూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన మరో 10 మందిని కాపాడినట్లు చెప్పారు. ఘటనపై ఉక్రెయిన్ అధికారులు స్పందించలేదు. ఈ శీతాకాలంలో సుమారు 930 మైళ్ల మేర విస్తరించి ఉన్న యుద్ధ క్షేత్రంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. రష్యా, ఉక్రెయిన్ సైన్యాలు ఎక్కువగా దీర్ఘ శ్రేణి దాడులపైనే ఆధారపడ్డాయి. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో రష్యా బలగాలు పలు ప్రాంతాల్లో తమ సేనలపైకి పదేపదే దాడులతో ఒత్తిడి తీవ్రతరం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. -
Farmers movement: యూరప్‌లోనూ రోడ్డెక్కిన రైతు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్‌లో కాదు, యూరప్‌లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి... రైతుల సమస్యలు ఇవీ... ► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి. ► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి. ► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది. ► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది. ► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది. ► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు. ► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇవీ డిమాండ్లు... ► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి. ► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి. ► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి. ► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. ► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి. ► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి. ► పెట్రోల్, డీజిల్‌పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. ఆందోళనలు ఏయే దేశాల్లో... జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో దాడులు.. 25 మంది దుర్మరణం
కీవ్: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో ఆదివారం ఒక మార్కెట్‌పై జరిగిన దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ సేనలే ఈ దాడులకు తెగబడినట్లు రష్యా ఆరోపిస్తోంది. దీనిపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. డోనెట్స్క్ నగరం సమీపంలోని టెక్స్టిల్చిక్ ప్రాంత మార్కెట్‌పై జరిగిన ఈ దాడిలో 20 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఆదివారమే రష్యాలోని కింగ్‌సెప్ జిల్లాలోని ఉస్ట్–లూగా పోర్ట్ రసాయన రవాణా టెరి్మనల్ వద్ద రెండు భారీ పేలుళ్లు, తర్వాత భారీ అగి్నప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనలను రష్యా, ఉక్రెయిన్ల పరస్పర దాడులుగా అంతర్జాతీయ మీడియా అభివరి్ణస్తోంది. నాలుగు ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడం వల్లే రసాయన రవాణా టెర్మినల్ వద్ద గ్యాస్ ట్యాంక్ పేలిందని రష్యా స్థానిక మీడియా ఆరోపిస్తోంది. -
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నూతన సంవత్సరాని స్వాగతం పలికే కొన్ని గంటల మందు రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులకు తెగపడింది. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు రష్యా 90 డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ సోమవారం తెలిపంది. Shahed drone attack on Odessa has been underway in New Year's Eve for more than two hours. Debris of kamikaze drones caused several fires in residential buildings so far. At least one person was killed. pic.twitter.com/kX1lxLijvj — Olga Klymenko (@OlgaK2013) January 1, 2024 ఈ డ్రోన్ దాడుల్లో 15 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు ఉక్రెయిన సైన్యం పేర్కొంది. డ్రోన్ దాడుల్లో సమారు ఏడుగురు తీవ్రంగా గాపడినట్లు తెలిపింది. రష్యా చేసిన షాహెద్ డ్రోన్ దాడులతో ఒడెస్సాలోని పలు భవనాల్లో భారీగా మంటల్లో కాలిపోయాయి. అయితే ఉక్రెయిన్ సైతం తమపై దాడులు చేస్తోందని రష్యా ప్రకటించింది. చదవండి: జపాన్‌లో సునామీ హెచ్చరికలు -
పుతిన్‌ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్ను సర్వనాశనం చేసేందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంకణం కట్టుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దుయ్యబట్టారు. ‘‘ఆయన యుద్ధోన్మాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాల్సిందే. ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా క్షిపణుల వర్షం కురిపించిన వైనం ఈ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది’’ అన్నారు. తమ దేశంపైకి రష్యా ఏకంగా 110 క్షిపణులను ప్రయోగించిందని, ఈ డాడిలో 31 మంది అమాయకులు బలవగా వందలాది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం తెలిసిందే. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి పెద్ద దాడి అని ఉక్రెయిన్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ను అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిద్దామని అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు బైడెన్ పిలుపునిచ్చారు. -
ఉక్రెయిన్‌పై మళ్లీ నిప్పుల వర్షం
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మరోసారి భీకర స్థాయిలో విరుచుకుపడింది. చాలారోజుల తర్వాత అతిపెద్ద దాడికి పాల్పడింది. గురువారం రాత్రి నుంచి ఉక్రెయిన్‌లోని కీలకమైన లక్ష్యాలపై ఏకంగా 122 క్షిపణులు, 36 డ్రోన్లు ప్రయోగించింది. 18 గంటలపాటు జరిగిన ఈ దాడుల్లో 24 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, దాదాపు 130 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌పై ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని పేర్కొన్నాయి. రష్యా సైన్యం ప్రయోగించిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, షాహెద్ డ్రోన్లను చాలావరకు కూలి్చవేశామని ఉక్రెయిన్ సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్–రష్యా నడుమ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
USA: ఉక్రెయిన్ను $250 మిలియన్ల మిలిటరీ సాయం
రష్యా-ఉక్రెయిన్ మధ్య 673 రోజుల నుంచి యుద్ధ వాతావరణం కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో మరోసారి అగ్రరాజ్యం అమెరికా తన భాగస్వామ్య దేశమైన ఉక్రెయిన్‌కు $250 మిలియన్ డాలర్ల మిలిటరీ ఆర్థిక సాయం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు, పలు రక్షణ పరికరాలు ఈ ప్యాకేజీ ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఏడాది ఉక్రెయిన్‌కు ఆమెరికా అందించే చివరి మిలటరీ సాయమని వైట్‌హౌజ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘తమ భాగస్వామ్య దేశమైన ఉక్రెయిన్ స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం రష్యాతో పోరాడుతోంది. ఈ సమయంలో తాము ఉక్రెయిన్‌కు సాయం అందిస్తున్నాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ దేశ భద్రతలో భాగంగా ఉక్రెయిన్ దేశ భావిష్యత్తును దృష్టితో పెట్టుకొని మిలటరీ ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. 2022 ఫిబ్రవరి ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటీ నుంచి ఉక్రెయిన్‌కు ఆమెరికా సుమారు $44.3 బిలియన్ డాలర్ల మిలిటరీ ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. చదవండి: Russia-Ukraine Conflict: పుతిన్ పిలిచారు.. ఉక్రెయిన్ సంక్షోభానికి తెర పడ్డట్లేనా? -
Russia-Ukraine War: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వాన
కీవ్: ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రాంతం లక్ష్యంగా రష్యా మిలటరీ బుధవారం రాత్రి ఎస్–300 దీర్ఘ శ్రేణి క్షిపణులతో విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోని పొక్రోవ్స్్క, నోవోహ్రోడివ్కా, మిర్నోహ్రాడ్ నగరాలపై జరిగిన దాడుల్లో ఒకరు చనిపోగా పదుల కొద్దీ భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల్లో కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలలుగా భీకర పోరాటం కొనసాగుతున్న అవ్డివ్కా నగరానికి సమీపంలోనే పై మూడు నగరాలున్నాయి. బఖ్ముత్ చుట్టుపక్కల ప్రాంతం, కీలకమైన అవ్డివ్కాలపై పట్టుసాధించేందుకు రష్యా బలగాలు వరుస దాడులకు పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. -
Russia-Ukraine War: మాస్కోపై డ్రోన్ల దాడి
మాస్కో: మాస్కో లక్ష్యంగా డజన్ల కొద్దీ డ్రోన్లతో ఉక్రెయిన్ ఆదివారం దాడికి యత్నించినట్లు రష్యా ఆరోపించింది. శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైకి రష్యా 60కి పైగా డ్రోన్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆదివారం మాస్కో పరిసర ప్రాంతాలపైకి దూసుకొచి్చన 24 వరకు ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా తెలిపింది. మాస్కోలోని మూడు వేర్వేరు చోట్ల జరిగిన డ్రోన్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని గవర్నర్ ఆండ్రీ ఒవొబియెవ్ తెలిపారు. మాస్కోకు దక్షిణాన ఉన్న తుల నగరంలోని 12 అంతస్తుల అపార్టుమెంట్‌ను ఒక డ్రోన్ ఢీకొట్టగా ఒకరు గాయపడినట్లు సమాచారం. -
కీవ్‌పై భారీగా డ్రోన్ల దాడి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైకి రష్యా భారీ స్థాయిలో డ్రోన్ల దాడికి పాల్పడింది. 2022లో తమపై దురాక్రమణ మొదలయ్యాక రష్యా పాల్పడిన అతిపెద్ద డ్రోన్ దాడిగా ఉక్రెయిన్ మిలటరీ పేర్కొంది. శనివారం ఉదయం రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలపైకి రష్యా ప్రయోగించిన 75 ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లలో 66 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. వేకువజామున 4 గంటలకు మొదలై దాదాపు ఆరు గంటలపాటు కొనసాగిన ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసం కాగా 11 ఏళ్ల బాలుడు సహా అయిదుగురు పౌరులు గాయపడ్డారు. -
Russia-Ukraine war: యుద్ధ వ్యతిరేక లేబుళ్లు అంటించినందుకు.. రష్యా కళాకారిణికి ఏడేళ్ల జైలు
మాస్కో: సూపర్మార్కెట్లోని వస్తువులపై ఉండే ధరల లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో యుద్ధ వ్యతిరేక నినాదాలున్న లేబుళ్లు అంటించిన నేరంపై ఓ కళాకారిణికి రష్యా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక.. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన సాషా స్కోచిలెంకో(33) అనే కళాకారిణి స్థానిక ఫెమినిస్టు బృందం పిలుపు మేరకు స్థానిక సూపర్మార్కెట్లోని వస్తువుల ధర లేబుళ్లను తీసేసి..‘రష్యా ఆర్మీ మరియుపోల్‌లోని స్కూల్‌పై బాంబు వేసింది’... ‘రష్యా ఫాసిస్ట్ రాజ్యంగా మారి ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మా ముత్తాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడలేదు’ అంటూ రాసి ఉన్న కొన్ని లేబుళ్లను అంటించింది. ఈ నేరానికి అధికారులు గత ఏడాది ఏప్రిల్ అదుపులోకి తీసుకున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా కఠిన శిక్షలకు అవకాశం కల్పిస్తూ పుతిన్ ప్రభుత్వం చట్టాలు తీసుకువచి్చంది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి అరెస్ట్ ఇది. దీంతో, విచారణ సుదీర్ఘంగా సాగింది. తనపై వచి్చన ఆరోపణలను సాషా అంగీకరించింది కూడా. తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాషా జైలులోనే చనిపోయే ప్రమాదముందని ఆమె తరఫు లాయర్లు తెలిపారు. అయినప్పటికీ జడ్జి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచి్చనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రభుత్వ టీవీలో లైవ్‌లో వ్యతిరేకించారన్న ఆరోపణలపై కోర్టు ఒకటి మరినా అనే జర్నలిస్టుకు ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. యుద్ధాన్ని నిరసించిన వ్లాదిమిర్ కారా ముర్జా అనే ప్రతిపక్ష నేతకు ఏప్రిల్‌లో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి
కీవ్: ఉక్రెయిన్‌లో సైనిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించింది. ఈ ఘటనలో 19 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రష్యా క్షిపణి దాడిలో 19 మంది తమ జవాన్లు మరణించినట్లు ఉక్రెయిన్ సోమవారం ధ్రువీకరించింది. వీరంతా 128వ మౌంటెయిన్–అసాల్ట్ బ్రిగేడ్‌కు చెందినవారు. రష్యా క్షిపణి దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. -
ఉక్రెయిన్‌కు మరో రూ.2,695 కోట్ల సాయం
వాషింగ్టన్: రష్యా సైనిక చర్య వల్ల ఎంతగానో నష్టపోయిన ఉక్రెయిన్‌కు ఇప్పటికే వివిధ రూపాల్లో సాయం అందించిన అగ్రరాజ్యం అమెరికా మరో భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భద్రతా సాయం కింద ఉక్రెయిన్‌కు 325 మిలియన్ డాలర్లు (రూ.2,695 కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఆయన తాజాగా వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యాతోయుద్ధంపై వారు చర్చించుకున్నారు. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వాన్ని కాపాడడమే తమ కర్తవ్యమని బైడెన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రజలు అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు సహా ఉక్రెయిన్‌కు రూ.2,695 కోట్ల సాయం అందజేయబోతున్నామని తెలిపారు. అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులను వచ్చేవారం ఉక్రెయిన్‌కు ఇస్తామని వివరించారు. -
గాయపడిన సైనికులకు జెలెన్స్కీ పరామర్శ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించడానికి న్యూయార్క్ వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ యుద్ధంలో గాయపడి న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉక్రెయిన్ సైనికులను పరామర్శించారు. ఈ సందర్బంగా సైనికులతో మాట్లాడిన అయన వారిని ధైర్యంగా ఉండమై చెబుతూనే రష్యా నాయకులను తీవ్రవాదులుగా సంబోధించారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎందరో ఉక్రెయిన్ సైనికులు చనిపోగా మరెందరో సైనికులు గాయపడ్డారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక గత నెల ప్రచురించిన కథనంలో ప్రకారం ఉక్రెయిన్ సైనికుల్లో చనిపోయిన వారు గాయపడిన వారు మొత్తం కలిపి ఐదు లక్షలకు పైగా ఉంటారని తెలిపింది. యూఎన్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించేందుకు, యుద్ధంలో తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి మరింత అమెరికా సాయ కోరడానికి ఇక్కడికి విచ్చేసిన జెలెన్స్కీ నేరుగా యుద్ధంలో గాయపడిన సైనికులు చికిత్స పొందుతున్న స్టాటిన్ ఐలాండ్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చేరుకున్నారు. ఆయన వచ్చేసరికి కృత్రిమ కాళ్లు అమర్చిన సైనికులు నడక ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. మిగిలిన సైనికుల్లో అత్యధికులు వీల్ ఛైర్లలో ఉండగా కొంతమంది కృత్రిమ చేతులు అమర్చి ఉన్నారు. ఈ సందర్బంగా సైనికులతో మాట్లాడుతూ.. తొందరగా ఇంటికి చేరుకోవాలన్న దృఢ సంకల్పం ఉన్న సైనికులను నేనెప్పుడూ చూడలేదు. మీకోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. మీ అవసరం మాకు చాలా ఉంది. మీ సంకల్పం చాలా గొప్పది. మీరంతా తొందరగా కోలుకుని తిరిగి ఉక్రెయిన్ రావాలని మన శత్రువుపై గెలుపులో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా అన్నారు. చివరిగా సైనికులకు ధైర్యంగా ఉండమని చెప్పారు. అనంతరం సైనికులతోపాటు అక్కడ హాస్పిటల్ స్టాఫ్ కు ఉక్రెయిన్ గౌరవ అవార్డులిచ్చి సత్కరించి వారితో ఫోటోలు కూడా తీసుకున్నారు. LIVE: Ukraine President Volodymyr Zelenskiy visits a New York hospital Nur 96 Zuschauer bei Reuters?https://t.co/FAvszjzZvE via @YouTube — Alexander Prinz (@prinzartair) September 18, 2023 ఇది కూడా చదవండి: భారత్‌పై సంచలన ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని -
ఇప్పుడు పుతిన్‌కు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అండ!
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సంబంధించి రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. అంతేకాదు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు తమ దేశం ఎల్లప్పుడూ రష్యాకు మద్దతుగా నిలబడుతుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాదాపు ఏడాదిన్నర కింద రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాలు, అమెరికా ఆయుధాలు సాయం చేయడంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సమర్థవంతంగా రష్యాకు ఎదురొడ్డి నిలిచింది. ఇన్నాళ్లుగా నిరంతర దాడులతో రష్యాకు ఆయుధాల కొరత తలెత్తింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తూర్పు కొసన సైబీరియా ప్రాంతంలో ఉన్న వోస్తోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం పుతిన్‌తో కిమ్ భేటీ అయ్యారు. ఆయుధాలు, ఆర్థిక అంశాలపై.. రష్యా, ఉత్తరకొరియా మీడియా సంస్థల కథనాల ప్రకారం.. సోవియట్ కాలం నుంచీ ఉత్తరకొరియాకు అండగా ఉన్న విషయాన్ని పుతిన్ తమ భేటీలో గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశాన్ని కిమ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘సామ్రాజ్యవాద శక్తుల నుంచి తన సార్వ¿ౌమ హక్కులను, భద్రతను పరిరక్షించుకునేందుకు రష్యా ‘పవిత్ర పోరాటం’ చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా) ఎల్లప్పుడూ బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు వచి్చన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం..’’ అని కిమ్ ప్రకటించారు. శాటిలైట్ల కోసమేగా వచ్చింది! పుతిన్ రష్యా స్వయం సమృద్ధ దేశమని, అయితే కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని.. వాటిపై కిమ్‌తో చర్చించానని పుతిన్ వెల్లడించారు. కిమ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియా ఉపగ్రహాలు అభివృద్ధి చేసేందుకు రష్యా సహకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అందుకేగా మేం ఇక్కడికి (భేటీ కోసం) వచ్చింది. రాకెట్ టెక్నాలజీపై ఉత్తర కొరియా నేత చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాల కొనుగోలు, మిలటరీ సాయం, ఆంక్షల విషయంలో మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది..’’ అని పేర్కొన్నారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య రవాణా, వ్యవసాయం వంటి పరస్పర ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పొరుగు దేశమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తున్నామన్నారు. రష్యాలోని మరో రెండు నగరాల్లో కిమ్ పర్యటిస్తారని, యుద్ధ విమానాల ప్లాంట్‌ను, రష్యా పసిఫిక్ నౌకాదళ కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. ఆంక్షలతో కలిసిన ఇద్దరు ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు కొనుగోళ్లు, ఇతర లావాదేవీల విషయంలో సమస్యలతో రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మరోవైపు అణ్వస్త్ర క్షిపణుల అభివృద్ధి, ఇటీవల వరుసగా ప్రయోగాలు జరపడం నేపథ్యంలో ఉత్తర కొరియాపై భారీగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలా పాశ్చాత్య ప్రపంచం దూరం పెట్టిన ఇరుదేశాల నేతలు పరస్పర సహకారం కోసం కలవడం గమనార్హం. అయితే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనడంగానీ, ఆ దేశానికి రాకెట్, శాటిలైట్ టెక్నాలజీని ఇవ్వడంగానీ దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ ఆయుధాలు ఇవ్వండి సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1950–53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. పెద్ద ఎత్తున ఆయుధాలను అందించడం ద్వారా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆక్రమణకు సహకరించింది. ఆ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అండగా నిలవడంతో.. చాలా కాలం యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా, సహకారం కొనసాగింది. ఈ క్రమంలో నాటి ట్యాంక్ షెల్స్, లాంఛర్లు, మినీ రాకెట్లు లక్షల సంఖ్యలో ఉత్తర కొరియా వద్ద పోగుపడ్డాయి. సోవియట్ డిజైన్ ఆయుధాలే కాబట్టి రష్యా వాటిని నేరుగా వినియోగించుకోగలదు. ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాడేందుకు ఆ ఆయుధాలు ఇవ్వాలని ఉత్తర కొరియాను పుతిన్ కోరారు. మాకు గూఢచర్య ఉపగ్రహ టెక్నాలజీ కిమ్ షరతు రష్యా, చైనా తదితర దేశాల సాయంతో ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వస్త్ర సాంకేతికతల విషయంలో ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించినా.. ఉపగ్రహాల టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉంది. అణు సామర్థ్యమున్న క్షిపణుల ప్రయోగం, ఇతర సైనిక అవసరాల కోసం మిలటరీ/గూఢచర్య ఉపగ్రహాలు తప్పనిసరి. ఈ దిశగా ఉత్తర కొరియా పలుమార్లు ప్రయోగాలు జరిపినా విఫలమైంది. తాజాగా రష్యా ఆయుధాలు అడుగుతున్న నేపథ్యంలో.. మిలటరీ గూఢచర్య ఉపగ్రహాల అభివృద్ధి, సాంకేతికత విషయంలో సాయం చేయాలని కిమ్ షరతు పెట్టినట్టు సమాచారం. ప్రత్యేక రైల్లో.. లిమోజిన్తో సహా.. ఉత్తర కొరియా నుంచి కిమ్ ఏకంగా ఓ ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. క్షిపణి దాడులు జరిగినా కూడా తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన బోగీలు, వెంటనే ఎదురుదాడి చేయడానికి వీలుగా భారీ స్థాయిలో సిద్ధంగా అమర్చిపెట్టిన ఆయుధాలు ఈ రైలు సొంతం. దీనితోపాటు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే ప్రత్యేకమైన వాహనాన్ని (లిమోజిన్) కూడా వెంట తీసుకెళ్లారు. వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం సమీపంలోకి రైలు చేరుకున్నాక.. కిమ్ తన లిమోజిన్‌లో భేటీ అయ్యే స్థలానికి చేరుకోవడం గమనార్హం. కిమ్‌కు పుతిన్ ఎదురెళ్లి స్వాగతం పలికారని, ఇద్దరూ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించుకున్నారని.. భేటీ అనంతరం కిమ్‌కు పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారని రష్యా మీడియా వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా రష్యా అంతరిక్ష కేంద్రంలో కిమ్ కలియదిరిగారని, అక్కడి ప్రత్యేకతలను తెలుసుకున్నారని వివరించింది. -
అపనమ్మకాన్ని తొలగిద్దాం
న్యూఢిల్లీ: కోవిడ్ మహా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధంతో విశ్వవ్యాప్తంగా దేశాల మధ్య వేళ్లూనుకుపోయిన అపనమ్మకాలు, భయాలను పారద్రోలాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీ20 సదస్సులో తొలి రోజు అగ్రరాజ్యాధినేతలతో శిఖరాగ్ర చర్చల సందర్భంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను మోదీ ప్రస్తావించారు. ‘కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లో కొత్త భయాలు, అపనమ్మకాలు గూడుకట్టుకున్నాయి. వెనువెంటనే వచి్చపడిన ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఆ అగాథాలను మరింత పెంచాయి. ఇప్పుడు అపనమ్మకాలను పోగొట్టాల్సిన సమయం వచ్చింది. విశ్వాసం దిశగా ప్రపంచదేశాలు కలిసి నడవాలి. అవిశ్వాసంపై మనం విజయం సాధించాలి. విశ్వ శ్రేయస్సు కోసం కలసి ముందడుగేద్దాం’ అని పిలుపునిచ్చారు. ప్రసంగం ప్రారంభంలోనే మొరాకోను పెను భూకంపం కుదిపేసిన దుర్ఘటనను ప్రస్తావించి వందలాది మంది మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా సహా జీ20 అధినాయకగణం సమక్షంలో మోదీ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లోనే.. ఏటా 100 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందే పెను వాతావరణ మార్పులు సంభవించకుండా ముందస్తు నివారణ చర్యలకు సమాయత్తమవుదాం. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వ్యవస్థల వైపు మారాలంటే ట్రిలియన్ల కొద్దీ భూరి నిధులు అత్యావశ్యకం. ఈ సమూల మార్పు ప్రక్రియలో అభివృద్ధి చెందిన దేశాలు అత్యంత కీలకమైన పాత్ర పోషించాలి. 2009లో కోపెన్‌హాగెన్‌లో ఐక్యరాజ్యసమితి ‘వాతావరణ’ చర్చల సందర్భంగా 2020 నాటికల్లా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల నిధులు ఇస్తామన్న వాగ్దానాలను సంపన్న దేశాలు నిలబెట్టుకోవాల్సిందే. 55 దేశాల ఆఫ్రికన్ కూటమిని జీ20లోకి ఆహ్వానించడం నాకు గర్వకారణం. కోవిడ్ తెచి్చన మహా విషాదం దేశాల మధ్య విశ్వాసం తగ్గించేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతి, ఉత్తరార్థ గోళ దేశాలు, దక్షిణార్ధ గోళ దేశాల మధ్య లోపించిన సఖ్యత, ఆహారం, ఇంధనం, ఎరువులు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, ఇంధనం, నీటి భద్రత అంశాల్లో పరిష్కారాలు వెతికి ప్రపంచ సుస్థిరాభివృద్ధికి సమష్టిగా పాటుపడదాం. ‘ఒకే కుటుంబం’ స్ఫూర్తితో సుస్థిరాభివృద్ధి ‘ఒకే కుటుంబం’ స్ఫూర్తితో అభివృద్ధిని సుస్థిరం చేసుకుందాం. దీనిని సాంకేతికత వారధి తోడుగా నిలవనుంది. ప్రతి వర్గం, ప్రతి ప్రాంతాన్ని అనుసంధానిస్తూ సహాయ వ్యవస్థను నిర్మించుకుందాం. అప్పుడే గణనీయమైన మార్పు మహిళల సారథ్యంలో జరిగే అభివృద్ధితోనే 21వ శతాబ్దంలో గణనీయమైన మార్పును చూడగలం. ఇప్పుడు భారత్‌లో సైన్స్, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్ విభాగాల్లో పట్టభద్రులైన వారిలో 45 శాతం మంది అమ్మాయిలే. సైన్స్, టెక్నాలజీలో ప్రతిభ చూపిన వారికి అంతర్జాతీయ అవకాశాలు కలి్పంచేందుకు ‘జీ20 టాలెంట్ వీసా’ అనే ప్రత్యేక కేటగిరీని త్వరలో ప్రారంభిస్తాం. గ్లోబల్ బయో–బ్యాంక్‌లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ బయో–బ్యాంక్‌ల ఏర్పాటు సంతోషదాయకం. హృద్రోగాలు, సికెల్ సెల్ అనీమియా, రొమ్ము క్యాన్సర్లపై దృష్టిసారించేందుకు మరింత అవకాశం చిక్కుతుంది. దేశాలను, మనుషులను కేవలం మార్కెట్ల కోణంలో చూడొద్దు. మనకు సహానుభూతి, దీర్ఘకాలిక లక్ష్యాలు తప్పనిసరి. 47 ఏళ్లు కాదు ఆరేళ్లలో సాధించాం ఆర్థిక సమ్మిళితకు 47 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. కానీ దానిని భారత్ కేవలం ఆరేళ్లలోనే సాధించింది. గత పదేళ్లలో ఏకంగా 360 బిలియన్ డాలర్ల మొత్తాలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమచేసింది. 33 బిలియన్ డాలర్ల నిధులు పక్కదారి పట్టకుండా నివారించింది. ఇది స్థూల దేశీయోత్పత్తిలో 1.25 శాతానికి సమానం. మహిళా సాధికారత ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు జీ20 ఎంతగానో కృషిచేస్తోంది. అంతర్జాతీయ సరకు రవాణా గొలుసులో విశ్వాసం, పారదర్శకత పెరగాలి. -
G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌లో గొప్పేముంది?
క్యివ్: భారత దేశం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. ఇందులో ప్రస్తావించిన ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశాన్ని కూడా జీ20 దేశాలు ఆమోదించాయి. కానీ ఢిల్లీ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్ నికోలెంకో తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా డిక్లరేషన్‌పై స్పందిస్తూ భారత్ ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్‌లో ఎక్కడా రష్యా పేరును ప్రస్తావించకుండా డాక్యుమెంటేషన్ చేసి ఆమోదం పొందడంలో గొప్పేముందని ప్రశ్నించారు. పదాల అమరిక విషయంలో నేర్పును కనబరచి సమావేశాల్లో మా ప్రస్తావన తీసుకొచ్చినందుకు జీ20 భాగస్వామ్య దేశాలకు కృతజ్ఞతలు చెబుతూ మాకు కూడా సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించి ఉంటే ఇక్కడి పరిస్థితులను కళ్ళకు కట్టేవాళ్లమని అన్నారు. ఢిల్లీ డిక్లరేషన్‌లో పదాలను ఈ విధంగా వాడి ఉంటే మరింత అర్ధవంతంగానూ వాస్తవానికి దగ్గరగానూ ఉండేదని చెబుతూ డిక్లరేషన్‌ను సవరించి మరీ చూపించారు. G20 adopted a final declaration. We are grateful to the partners who tried to include strong wording in the text. However, in terms of Russia's aggression against Ukraine, G20 has nothing to be proud of. This is how the main elements of the text could look to be closer to reality pic.twitter.com/qZqYluVKKS — Oleg Nikolenko (@OlegNikolenko_) September 9, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించిన భారత్ -
G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించిన భారత్
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్‌కి సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని జీ20 నిర్వాహక బృందం ప్రతినిధి అమితాబ్ కాంత్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. డిక్లరేషన్‌లో భాగంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై కొంత మేర భేదాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరకు సభ్యులు ఏకాభిప్రాయం తెలిపి డిక్లరేషన్ని స్వాగతించారు. ప్రధాని ప్రకటన.. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో ప్రెసిడెన్సీ హోదాలో భారత్ అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. సదస్సులో ప్రధాని చేసిన కీలక ప్రకటనకు సభ్య దేశాలు ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రకటిస్తూ.. అందరికీ ఒక శుభవార్త, నిర్వాహక బృందం సమిష్టి కృషి ఫలితంగా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సందర్బంగా ఈ డిక్లరేషన్ని ఆమోదం పొందినట్లు ప్రకటిస్తున్నాను. దీని కోసం విశేష కృషి చేసిన నిర్వాహక అధికారులకు, మంత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9 — ANI (@ANI) September 9, 2023 ప్రధాని మార్కు డిక్లరేషన్.. జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఈ డిక్లరేషన్‌లో ప్రధానంగా నాలుగు 'P'ల గురించి ప్రస్తావించారని అవి Planet(భూమి), People(ప్రజలు), Peace(శాంతి), Prosperity(శ్రేయస్సు) కాగా ఐదవ 'P'గా ప్రధాని మార్కు ఉందని నరేంద్ర మోదీని కొనియాడారు. ఢిల్లీ డిక్లరేషన్‌లో భాగంగా ముఖ్యంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. 1.బలమైన,స్థిరమైన,సమతుల్యమైన సమగ్రాభివృద్ధి 2.సుస్థిరమైన అభివృద్ధి 3.సుస్థిర భవిష్యత్ కోసం హరిత అభివృద్ధి ఒప్పందం 4.21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు 5.బహుపాక్షికతను పునరుద్దరించడం India got 100 per cent consensus on New Delhi Declaration: G20 Sherpa Amitabh Kant Read @ANI Story | https://t.co/Ow4wFIwXcx#AmitabhKant #NewDelhi #India #G20India2023 #G20SummitDelhi pic.twitter.com/pP8YR3an4P — ANI Digital (@ani_digital) September 9, 2023 ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన డిక్లరేషన్.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం ఈ సమావేశాల్లో భారత్ సాధించిన అపూర్వ విజయం. ప్రధాని ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్ డ్రాఫ్టులో ఎక్కడా 'రష్యా' పేరును ప్రస్తావించకుండా ఉక్రెయిన్ పరిస్థితిని కళ్ళకు కడుతూ అక్కడి ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని సభ్యదేశాలను కోరింది. జీ20 సదస్సు భౌగోళిక రాజకీయ భద్రతా వ్యవహారాలను పరిష్కరించే వేదిక కాదని ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మాత్రమే ఇది వేదికని తెలిపింది. #G20 New Delhi Leaders' Declaration adopted with the bang of the gavel! Read the full text 📃: https://t.co/DGID0ArdOR#G20India pic.twitter.com/u6lpZZ0ET0 — G20 India (@g20org) September 9, 2023 సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలు, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన సిద్ధాంతాలను అన్ని దేశాలు గౌరవించాలని, ఒక దేశ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని కోరింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఈ 37 పేజీల డాక్యుమెంట్ 100 శాతం ఏకాభిప్రాయం సాధించినట్లు అమితాబ్ కాంత్ తెలిపారు. యుద్ధంలో బాధిత దేశాలకు ఆర్ధికచేయూతే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించడం కూడా ఆమోదయోగ్యం కాదని డిక్లరేషన్‌లో తెలిపింది. ఇది కూడా చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే.. -
‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’
ప్రపంచకుబేరుడు, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌పై ఉక్రెయిన్ మండిపడుతోంది. గత ఏడాది రష్యా యుద్ధనౌకలపై డ్రోన్ దాడిని నిరోధించేందుకు తన స్టార్‌లింక్ శాటిలైట్ నెట్వర్క్ని ఉపయోగించడానికి అనుమతిని ఎలా నిరాకరించారనే వివరాలు కొత్త జీవిత చరిత్రలో వెల్లడైన నేపథ్యంలో ఉక్రేనియన్ సీనియర్ అధికారి ఎక్స(ట్విటర్)లో స్పందించారు. మస్క్ చాలా పాపానికి పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రేనియన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ మస్క్ జోక్యం తీరని నష్టానికి, అనేకమంది పౌరుల మరణాలకు దారితీసిందని ఆరోపించారు. ఒకోసారి పొరపాటు తీవ్ర తప్పిదంగా మారుతుంది. ఇది అజ్ఞానం, అహం కలయిక ఫలితం. స్టార్‌లింక్ జోక్యం ద్వారా రష్యన్ నౌకాదళంలో కొంత భాగాన్ని నాశనం చేయడానికి ఉక్రేనియన్ డ్రోన్లను అనుమతించి, రష్యా నౌకాదళాన్ని ఉక్రేనియన్ నగరాలపై కాలిబర్ క్షిపణుల దాడికి అనుమతించింది. ఫలితంగా, అనేకమంది పిల్లలు, పౌరులను పొట్టన పెట్టుకుంటోందంటూ ట్వీట్ చేశారు. (వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు) అసలు కొంతమంది యుద్ధ నేరస్థులను, హత్య చేయాలనే వారి కోరికను ఎందుకు రక్షించాలనుకుంటున్నారు. తద్వారా వారు పాపానికి ఒడిగడుతున్నారని , దాన్ని ప్రోత్సహిస్తున్నారని ఇప్పటికైనా గ్రహించారా? అని ప్రశ్నించారు. టెక్ బిలియనీర్ మస్క్ జీవిత చరిత్రలోని దీనికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మైఖైలో పోడోల్యాక్ ప్రకటన వచ్చింది. కాగా బయోగ్రఫీ రైటర్‌గా పాపులర్ అయిన వాల్టర్ ఐజాక్సన్ మస్క్ బయోగ్రఫీ సీఎన్ఎన్ ప్రచురించిన పుస్తకంలో సాయుధ జలాంతర్గామి డ్రోన్లు "కనెక్టివిటీని కోల్పోయినప్పుడు , ప్రమాదకరం లేకుండా ఒడ్డుకు కొట్టుకుపోయినప్పుడు" క్రిమియా తీరానికి సమీపంలో ఉన్న రష్యన్ నౌకాదళాన్ని ఎలా సమీపిస్తున్నాయో వివరించింది.రష్యా ఆక్రమిత క్రిమియాపై ఉక్రేనియన్ దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలతో ప్రతిస్పందిస్తాడనే ఆందోళన కారణంగా దాడి జరిగిన ప్రాంతంలో సేవలను నిలిపి వేయమని మస్క్ స్టార్‌లింక్ ఇంజనీర్లను ఆదేశించారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. మరోవైపు స్టార్‌లింక్ నెట్‌వర్క్‌ను ఆపివేసినట్లు వచ్చిన ఆరోపణలను మస్క్ ఖండించారు. రష్యా -ఉక్రెయిన్ వార్కి మరింత ఆజ్యం పోయకూడదనే ఉద్దేశంతోనే నో చెప్పా నన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ నుండి క్రిమియన్ నౌకాశ్రయ నగరమైన సెవాస్టోపోల్ వరకు సక్రియం చేయమని చేసిన అభ్యర్థనకు తాను అంగీకరించ లేదని వివరణ ఇచ్చాడు. తన స్పేస్ఎక్స్ కంపెనీ "యుద్ధం-సంఘర్షణ తీవ్రతరం చేసే చర్యలకు సహకరించడం" తనకు ఇష్టం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. అటు రచయిత ఐజాక్సన్ కూడా దీనిపై స్పందించి స్పష్టత ఇచ్చారు. To clarify on the Starlink issue: the Ukrainians THOUGHT coverage was enabled all the way to Crimea, but it was not. They asked Musk to enable it for their drone sub attack on the Russian fleet. Musk did not enable it, because he thought, probably correctly, that would cause a… — Walter Isaacson (@WalterIsaacson) September 9, 2023 Sometimes a mistake is much more than just a mistake. By not allowing Ukrainian drones to destroy part of the Russian military (!) fleet via #Starlink interference, @elonmusk allowed this fleet to fire Kalibr missiles at Ukrainian cities. As a result, civilians, children are… — Михайло Подоляк (@Podolyak_M) September 7, 2023 -
కేంద్రం వైఖరిని సమర్థిస్తున్నాం
లండన్: రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని పూర్తిగా సమర్థిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. విశాలమైన దేశం అయినందున ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్‌కు సహజంగానే ఉంటుందని చెప్పారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న వైఖరికి రష్యా నుంచి చమురు సరఫరాయే కారణమా అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ‘రష్యాతో మాకు సంబంధాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షం వైఖరి భిన్నంగా ఉంటుందని నేను భావించడం లేదు’అని వివరించారు. రష్యా నుంచి దూరంగా తమవైపు భారత్‌ను లాక్కునేందుకు పశ్చిమ దేశాల నేతలు ప్రయత్నించారా అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ.. ‘‘వాస్తవానికి భారత్‌కు రష్యాతో సత్సంబంధాలున్నాయి. అదేవిధంగా అమెరికాతోనూ సంబంధాలు న్నాయి. భారత్ విశాల దేశం. పెద్ద దేశం కావడం వల్ల అనేక ఇతర దేశాలతో వివిధ స్థాయిల్లో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎవ్వరితోనైనా సంబంధాలు కొనసాగించే హక్కు భారత్‌కు ఉంది’అని రాహుల్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు విషయంలో ప్రతిపక్షం వైఖరిపై ఆయన..కశ్మీర్ అభివృద్ధిని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. అక్కడ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది’అని రాహుల్ వివరించారు. కశ్మీర్ అంశం పరిష్కారానికి అంతర్జాతీయ దౌత్యం అవసరమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు రాహుల్ సూటిగా సమాధానమిచ్చారు. వాస్తవానికి కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. కశ్మీర్ మా సొంత విషయం. అందులో భారత్‌కు తప్ప మరెవ్వరి జోక్యం అవసరం లేదు’అని కుండబద్దలు కొట్టారు. -
G20 Summit: డిక్లరేషన్‌పై తొలగని ప్రతిష్టంభన
జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమై అగ్రరా జ్యాధినేతలు విచ్చేసి భేటీకి సిద్ధమవుతున్న వేళ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఇంకా ప్రతిష్టంభన తొలగలేదు. శిఖరాగ్ర సదస్సులో దేశాధినేతల మధ్య విస్తృత స్థాయి చర్చలు పూర్తయ్యాక చివరి రోజున ఉమ్మడి తీర్మానం(ఢిల్లీ డిక్లరేషన్) విడుదల చేస్తారు. ఆ తీర్మానంలో ఏఏ అంశాలపై ఉమ్మడి నిర్ణయాలు ప్రకటించాలనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఇప్పటికే ఆయా దేశాధినేతల తరఫున అధికారిక ప్రతినిధు(షెర్పా) లు పలుమార్లు కలిసికట్టుగా అంతర్గత చర్చలు జరిపారు. ఈ మంతనాల్లో ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి ఉమ్మడి నిర్ణయాలు తీసుకో లేదు. శిఖరాగ్ర సదస్సులో అధినేతలు ఏమేం అంశాలు చర్చించాలనేది ముందే నిర్ణయం అయిపో తుంది. సదస్సు అత్యంత సాఫీగా సాగేందుకు వీలుగా ఆయా అంశాలపై అధినేతల నుంచి ఉమ్మ డి నిర్ణయాలు వెలువడేందుకుగాను ముందే షెర్పా లు భారీ కసరత్తు చేస్తారు. సభ్య దేశాల అధినేతల అధికారిక ప్రతినిధులైన ఈ షెర్పాలు దౌత్యమార్గంలో అంతర్గతంగా ముందే అందరూ చర్చించుకుంటారు. దీంతో శిఖరాగ్ర సదస్సులో అధినేతలు నేరుగా కలిసి మాట్లాడేటపుడు ఆయా అంశాల లోతుల్లోకి వెళ్లరు. సూత్రప్రాయ అంగీకారం మాత్రమే తెలుపుతారు. మిగిలిన పని అంతా ముందే ఏర్పాటు చేసిపెడతారు కాబట్టి ఆతర్వాతి ప్రక్రియ సులువు అవుతుంది. అయితే, తాజాగా షెర్పాల మధ్య జరిగిన చివరి రౌండ్ చర్చల్లోనూ కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరనే లేదు. వాటిల్లో పర్యావరణ మార్పు, ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని పేర్కొంటూ ఒక పేరాగ్రాఫ్‌లో భారత్ చేసిన ప్రతిపాదనలపై షెర్పాల చిక్కుముడి పడింది. ఉక్రెయిన్‌లో రష్యా ఆగడాలను అడ్డుకునేలా చర్యలు ఆ పేరాగ్రాఫ్‌లో లేవని అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్లు వేలెత్తిచూపాయి. ఢిల్లీ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై ఏకాభిప్రాయం తెలపాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు పట్టుబడుతున్నాయి. దీంతో ఈ అంశంపై సమ్మతి సాధ్యపడలేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ముందుగానే జకార్తాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లు చర్చలు జరిపి డిక్లరేషన్ సంబంధ అంశాలపై చర్చించినా ఫలితం లేకపోయింది. భారత నాయకత్వ ప్రతిష్టకు సవాల్ తొలిసారిగా జీ20 కూటమి సారథ్య బాధ్యతలు తీసుకున్న భారత్ ఈ సదస్సు తర్వాత ఎలాగైనా సరే ఉమ్మడి తీర్మానం ప్రకటించాలని చూస్తోంది. అయితే అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు ఎవరి మంకుపట్టు వారు పట్టడంతో ఉ మ్మడి తీర్మానం సాధ్యమయ్యేలా లేదు. అదే జరిగి తే అంతర్జాతీయంగా భారత ప్రతిష్టకు భంగం వా టిల్లే ప్రమాదం ఉంది. సంయుక్త ప్రకటన సాధ్యంకాని పక్షంలో జీ20 అధ్యక్ష హోదాలో మోదీ కేవలం సారాంశ ప్రకటన విడుదల చేస్తారు. వాతావరణ మార్పు: ఇదే అసలైన అవరోధం చర్చల్లో ఏకాభిప్రాయానికి ప్రధాన అవరోధంగా వాతావరణ మార్పు విధానం నిలుస్తోంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంథనాల వైపు మళ్లడం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవడం వంటి అంశాల్లో జీ20 సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది షెర్పాల భేటీలో స్పష్టంగా కనిపించింది. 2030 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను క్రమంగా పెంచుకోవాలని, 2035 ఏడాదికల్లా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాల స్థాయిని తగ్గించుకోవాలని పశ్చిమ దేశాలు చేసిన ప్రతిపాదనలను భారత్, రష్యా, చైనా, సౌదీ అరేబియాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శిలాజ ఇంధన ఆధారిత ఆర్థికవ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా అయితే ఈ ప్రతిపాదలను ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది. జ్ఞానాధారిత రంగాలు, ఇతర సెక్టార్ల వైపు మళ్లేందుకు తమకు దశాబ్దాల కాలం పడుతుందని వాదిస్తోంది. వెలువడుతున్న కర్భన ఉద్గారాలు, ప్రకృతిలోకి శోషించబడుతున్న కర్భన ఉద్గారాల నిష్పత్తి సమంగా ఉండేలా అంటే కార్బన్ నెట్ జీరో(కర్భన స్థిరత్వం) సాధించేందుకు జీ7 దేశాలు తొందర పెడుతున్నాయి. శిలాజ ఇంధనాల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాటి ద్వారా వచ్చే విద్యుత్ సాయంతోనే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధిస్తామని ధీమాగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఈ జీ7 దేశాల ప్రతిపా దనలను తప్పుబడుతున్నాయి. ‘దశాబ్దాలుగా శిలా జ ఇంధనాలను విపరీతంగా వాడేసి పారిశ్రా మిక విప్లవంతో పశ్చిమ దేశాలు సంపన్న దేశాలుగా అవ తరించాయి. ఇప్పుడు మాకు ఆ అవకాశం ఇవ్వండి. వాతావరణ మార్పుల మాటున అభివృద్ధిని అడ్డుకో కండి’ అని భారత్‌సహా దేశాలు వాదిస్తు న్నాయి. 2020కల్లా వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పేద దేశాలకు ఏటా 100 బిలి యన్ డాలర్ల నిధులను ఇస్తామన్న సంపన్న దేశాలు ఆ వాగ్దానాన్ని నెరవేర్చనేలేదు. ఎప్ప టికల్లా సాయం చేస్తాయనేదీ స్పష్టంచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్లైమేట్ పాలసీపై ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టమే. ఇలాంటి తరుణంలో మొదలవు తున్న జీ20 సదస్సు క్లిష్టమైన కూడలిలో నిల్చుంద నే చెప్పాలి. దేశ ప్రయోజనా లను పక్కనబెట్టి మానవాళి శ్రేయస్సు కోసం అగ్రనేతలు ఏ మేరకు ఉమ్మడి వాగ్దానాలు చేస్తారనేది బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. జీ20లో ఏకాభిప్రాయం కుదరక పోతే త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిరే ట్స్‌లో జరగ బోయే కాప్28 సదస్సులోనూ మేలైన ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుంది. –సాక్షి నేషనల్‌డెస్క్ -
రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
క్యివ్: రష్యాతో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యివ్ రక్షణ శాఖ మంత్రి బాధ్యతల నుండి ఒలెక్సి రెజ్నికోవ్ను తప్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆయన స్థానంలో రుస్తెం ఉమెరోవ్‌ను నూతన రక్షణశాఖ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించి ఇది రక్షణశాఖలో సరికొత్త విధానాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అధ్యక్షుడి నిర్ణయం ప్రకటించిన తర్వాత రెజ్నికోవ్ తన రాజీనామాను పార్లమెంటుకు సమర్పించారు. యధాప్రకారం సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో వ్లాదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఒలెక్సి రెజ్నికోవ్ రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుండి దాదాపు 550 రోజులు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కానీ ప్రస్తుతం రక్షణశాఖలో సరికొత్త విధానాన్ని అనుసరించాల్సిన అవసరముందని అందుకే క్రిమియా రాష్ట్ర సంపద నిధుల సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న ఉమెరోవ్‌కు రక్షణశాఖ బాధ్యతలు అప్పచెబుతున్నామని అన్నారు. పార్లమెంట్ ఉమేరోవ్ అభ్యర్ధిత్వాన్ని ఆమోదిస్తుందని భావిస్తున్నామన్నారు. Zelenskyi's evening speech in which he talks about the replacement of Minister of Defense Oleksii Reznikov. He is replaced by Rustem Umerov. -- "Oleksii Reznikov went through these more than 550 days of full-scale war. I believe that the Ministry needs new approaches and other… pic.twitter.com/o7NCvszWoi — NOELREPORTS 🇪🇺 🇺🇦 (@NOELreports) September 3, 2023 ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం ఉక్రెయిన్ రక్షణశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2022లో రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుండి ఒలేక్సి రెజ్నికోవ్ పాశ్చాత్య దేశాల నుండి బిలియన్ డాలర్ల సహాయాన్ని పొందడంలో కీలక పాత్ర పోషించారు. కానీ రక్షణశాఖలో అంతర్గత ఆరోపణలు పెచ్చుమీరడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. కానీ రెజ్నికోవ్ను ఉన్నట్టుండి బాధ్యతల నుండి తప్పించడాన్నే మీడియా హైలైట్ చేస్తూ రెజ్నికోవ్కు వేరే బాధ్యతలు ఏమైనా అప్పగిస్తున్నారా అన్నది అధ్యక్షుడే తెలపాల్సి ఉంటుంది. రక్షణశాఖలో భారీగా జరుగుతున్న అవినీతి నేపధ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు చేసే వారు కూడా లేకపోలేదు. అంతర్జాతీయ అవినీతి దేశాల జాబితాలో ఉక్రెయిన్ 180 దేశాల్లో 116 వ స్థానంలో ఉంది. అవినీతి విషయంలో ఒకప్పటితో పోలిస్తే ఉక్రెయిన్ ఇప్పుడు చాల మెరుగయ్యిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. I have submitted my letter of resignation to Ruslan Stefanchuk @r_stefanchuk, Chairman of the Parliament of Ukraine @verkhovna_rada It was an honor to serve the Ukrainian people and work for the #UAarmy for the last 22 months, the toughest period of Ukraine’s modern history. 🇺🇦 pic.twitter.com/x4rXXcrr7i — Oleksii Reznikov (@oleksiireznikov) September 4, 2023 ఇది కూడా చదవండి: జీ20 సదస్సుకు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ -
రష్యా డ్రోన్లను కూల్చేసిన ఉక్రెయిన్
క్యివ్: దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతమైన ఒడెస్సాపై రష్యా శనివారం మొత్తం 25 డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిలో 22 డ్రోన్లను సమర్ధవంతంగా కూల్చేసినట్లు తెలిపింది ఉక్రేయి రక్షణ శాఖ. ఈ దాడుల్లో ఒడెస్సాలో దానుబే నది వద్దనున్న రెనీ పోర్టులో కొద్దిపాటి విధ్వంసం చోటు చేసుకుంది. యుద్ధ ప్రారంభ రోజులతో పోలిస్తే ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్థవంతంగానే తిప్పి కొడుతోంది. ఒక పక్క రష్యా దాడులను అడ్డుకుంటూనే మరోపక్క వారిపై ఎదురుదాడి చేస్తోంది. ఇప్పటికే రష్యా చెరలో నుండి అనేక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ తాజాగా పోర్టు ప్రాంతంలో రష్యా ప్రయోగించిన ఇరాన్ షాహెద్ డ్రోన్లను చిత్తు చేసింది. మొత్తం 25 డ్రోన్లలో 22 డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపింది ఉక్రెయిన్ రక్షణ శాఖ. ఈ దాడుల్లో ఇద్దరు గాయపడగా అక్కడక్కడా ఇఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ తిన్నట్లు వెల్లడించింది ఉక్రెయిన్ సైన్యం. పోర్టు ప్రాంతమైన ఒడెస్సా పోర్టు నుంచి ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతి చేసేది. నౌకాశ్రయంలో జరిగిన నష్టం ఎంతనేది ఇప్పుడే చెప్పలేమంది సైన్యం. ఈ పోర్టు ధ్వంసం చేసి ధాన్యం రవాణాను దెబ్బతీయాలన్నది రష్యా ఉద్దేశ్యమై ఉంటుందని తెలిపింది. ఇది కూడా చదవండి: సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు -
సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు
ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా ఉపయోగించే నౌక. దీని పేరు ‘కొసాత్కా’– అంటే ‘కిల్లర్ వేల్’ జాతి తిమింగలం అని అర్థం. పుతిన్ దాదాపుగా మూడేళ్ల కిందటే ఈ భారీ నౌకను సొంతం చేసుకున్నా, ఇటీవలే దీనికి కళ్లుచెదిరే ఖర్చుతో అదనపు హంగులు సమకూర్చడంతో తాజాగా వార్తల్లోకెక్కింది. ఈ నౌకలోని అదనపు హంగుల కోసం 100 మిలియన్ పౌండ్లు (రూ.1.05 లక్షల కోట్లు) ఖర్చు చేయడం విశేషం. ఒకవైపు యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో దాదాపు మూడు లక్షల మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఏమీ పట్టకుండా పుతిన్ తన నౌకను రాజసంగా తీర్చిదిద్దుకోవడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఈ నౌక అసలు పేరు ‘ది గ్రేస్‌ఫుల్’. జర్మనీ రేవు నుంచి పుతిన్ దీనిని 750 మిలియన్ పౌండ్లకు (రూ.7.92 లక్షల కోట్లు) సొంతం చేసుకున్నాక, దీని పేరును ‘కొసాత్కా’గా మార్చుకున్నాడు. యుక్రెయిన్‌పై సైనిక దాడిని ప్రకటించడానికి కొద్దిరోజుల ముందే ఈ నౌకను రష్యాకు పంపాల్సిందిగా, నౌకా సంస్థను ఆదేశించాడు. ఈ నౌక రష్యా తీరానికి చేరుకున్న 23 రోజుల్లోనే యుద్ధం మొదలైంది. ఒకవైపు యుద్ధం కొనసాగుతుంటే, పుతిన్ మాత్రం ఈ నౌకను తాను కోరుకున్న రీతిలో తీర్చిదిద్దుకునే పనిలోనే నిమగ్నమయ్యాడు. ఇందులో ఖరీదైన క్రిస్టల్ షాండ్లియర్లు, కార్పెట్లు, సోఫాలు, కాఫీ టేబుళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా డ్రాయింగ్ రూమ్‌లలో బంగారు తాపడం చేయించాడు. ఖరీదైన కళాఖండాలను ఏర్పాటు చేయించుకున్నాడు. ఇన్ని హంగులు చేయించుకున్న ఈ నౌక పొడవు దాదాపు అరకిలోమీటరు ఉంటుంది. ఇందులో స్విమింగ్ పూల్స్, పైకప్పు మీద హెలిపాడ్, బంగారు ఫ్రేముల అద్దాలు, బంగారు తాపడం చేయించిన సింక్ పైపులు వంటి ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. రష్యన్ అధికార వ్యతిరేక సంస్థ అయిన ‘అలెక్సీ నవాల్నీ’ ఈ నౌక లోపలి హంగుల ఫొటోలను, వాటి ఏర్పాట్లకు అయిన ఖర్చుల వివరాలను ఇటీవల వెలుగులోకి తెచ్చింది. (చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు! పొద్దుగూకినా ప్రాబ్లం లేదు!) -
వినాశకర సాటన్-ll మిసైల్‌ను బయటకు తీసిన రష్యా.. ఏమీ మిగలదు!
మాస్కో: రష్యా అత్యంత వినాశకరమైన అణుక్షిపణి (సర్మాత్)సాటన్-ll ను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ క్షిపణి విజయవంతమైనప్పుడు దీని గురించి చెబుతూ.. ఇకపై మాతో కయ్యానికి కాలు దువ్వే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని ప్రత్యర్థులను హెచ్చరించారు. తాజాగా ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఈ క్షిపణిని బయటకు తీయడం చర్చనీయాంశమైంది. శుక్రవారం సాటన్-llగా పిలవబడే ఈ సర్మాత్ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్‌ను రష్యా సైన్యం బయటకు తీసినట్లు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కాస్మోస్ ప్రకటించింది. ఈ మేరకు రోస్కాస్మోస్ జనరల్ డైరెక్టర్ యూరి బోరిసోవ్ సాటన్-ll విధినిర్వహణకు సిద్ధమైందని ప్రకటించారు. అసలేంటి సాటన్-ll ప్రత్యేకత.. సాటన్-ll మిసైల్ పొడవు 116 మీటర్ల. 220 టన్నులు బరువుండే ఈ మిసైల్ 10-15 వార్హెడ్లను అమర్చే వీలుంటుంది. అందుకే ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను సులువుగా ఛేదిస్తుంది. శత్రువుల రాడార్లు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు ఈ మిసైల్‌ను గుర్తించే లోపే ఇది లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సాటన్-ll గంటకు 10 వేల నుంచి 18 వేల కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఐరోపాలోని ఏ ప్రాంతానికైనా ఇది కేవలం 3 నిమిషాల్లోపే చేరుకోగలదు. ఇక అగ్రరాజ్యం అమెరికా చేరుకోవడానికి ఈ క్షిపణికి కేవలం 14 నిముషాలు మాత్రమే పడుతుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలై ఏడాదిన్నర పైబడిండి. ఇప్పటికీ యుద్ధం ఒక కొలిక్కి రాకపోగా ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్ధవంతనగానే తిప్పికొట్టింది. ఇక ఇప్పుడైతే అమెరికా అండదండలతో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తూ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యుద్ధప్రారంభంరోజుల్లో రష్యా స్వాధీనం చేసుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి తన వశం చేసుకుంటోంది. ఇప్పటికే డిఫెన్స్‌లో పడిన రష్యా సేనలు ఈ నేపథ్యంలోనే ఈ భయానక మిసైళ్లను బయటకు తీసిందని చెప్పేవారు లేకపోలేదు. మరోపక్క రష్యా ఈ క్షిపణిని నాటో సంస్థ మూలస్థంభాలైన అమెరికా, యూకెలపై మాత్రమే ప్రయోగించడానికి సిద్ధం చేసిందనే వారూ ఉన్నారు. ఏదైతేనేం ప్రస్తుతానికైతే రష్యా తన అమ్ములపొదిలోని అత్యంత భయంకరమైన మిసైళ్లను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతీయ టీవీ ఛానల్లో ప్రసంగిస్తూ.. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి మాకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని అన్నారు. అందులో భాగంగానే ఈ చర్యకు ఉపక్రమించారని మాత్రం అర్ధమవుతోంది. BREAKING: Putin has put the ‘Satan-2’ nuclear weapon on combat duty for the first time Putin unveiled the RS-28 Sarmat rocket system along with five other weapons in this video at a conference in March 2018 Putin claimed the Sarmat can fly a trajectory over the South Pole and… pic.twitter.com/otKqUi6uIw — Liam McCollum (@MLiamMcCollum) September 1, 2023 ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక! -
విదేశీ పర్యటనకు పుతిన్.. అరెస్ట్ వారెంట్ తర్వాత తొలిసారి..
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎట్టకేలకు దేశం దాటి కాలు బయటపెట్టనున్నారు. అక్టోబర్‌లో పుతిన్ చైనాలో పర్యటించనున్నట్లు సమాచారం. కాగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధ నేరాలకుగానూ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆయన చేయనున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. వచ్చే అక్టోబరులో జరిగే బెల్ట్ అండ్ రోడ్ సదస్సుకు హాజరుకావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పుతిన్‌ను ఆహ్వానించగా.. ఇందుకు రష్యా అధ్యక్షుడు అంగీకరించినట్లు బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే పుతిన్ చైనా పర్యటన కోసం క్రెమ్లిన్ షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐసీసీ అరెస్ట్ వారెంట్ భయంతో ఆయన అన్ని విదేశీ పర్యటనలనూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. చదవండి: ఆకాశంలో అద్భుతం.. నేటి సాయంత్రం సూపర్ బ్లూ మూన్ దర్శనం అరెస్ట్ వారెంట్ కాగా గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య ఏడాదిన్నరగా సైనిక చర్య కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలపై మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం పుతిన్ ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో అడుగు పెడితే ఆయన్ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఆయన రష్యా అంతర్జాతీయ సరిహద్దులు దాటలేదు. ఇక అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సుమారు 120 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వారెంట్‌ను అమలు చేసే పరిస్థితి మాత్రం అంతర్జాతీయ దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఇక పుతిన్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పొరుగున్న ఉన్న సోవియట్ యూనియన్ దేశాలు, ఇరాన్లో మాత్రమే పర్యటించారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు అరెస్ట్ వారెంట్‌పై సౌత్ ఆఫ్రికా కూడా ఐసీసీకి సంతకం చేసింది. అంతేగాక సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా జరగబోయే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ పుతిన్ పాల్గొనడం లేదు. ఈ మేరకు సోమవారం పుతిన్ మోదీకి ఫోన్ చేసి సమావేశానికి రాకపోవడంపై వివరించారు. ఆయనకు బదులు రష్యా తరపున విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పేర్కొన్నారు. ఇక చివరిసారి 2022లో చైనాలో పర్యటించారు. మరోవైపు జీ జిన్‌పింగ్ ఈ ఏడాది మార్చిలో మాస్కోను సందర్శించారు. మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే ఆయన తొలి విదేశీ పర్యటన. చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’ -
వీడియో చెప్పిన కథ : రష్యాను భయపెడుతోన్న ఉక్రెయిన్ డ్రోన్లు
క్యివ్: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. చిన్న పాపను అడ్డం పెట్టుకుని ఇద్దరు రష్యా సైనికులు పారిపోతున్న దృశ్యాలే అందుకు సాక్ష్యం. ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అమెరికా అండతో ఇటీవల డ్రోన్ దాడులను ముమ్మరం చేసిన ఉక్రెయిన్ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న రష్యా సైనికులు ఎప్పుడు ఎటునుంచి ఏ డ్రోన్ దాడి చేస్తుందో అర్ధంకాక భయంతో బిక్కుబిక్కుమంటూ మాస్కోకు తిరుగుముఖం పడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో రికార్డయిన కొన్ని దృశ్యాల్లో రష్యా సైనికుల ప్రాణభీతి తేటతెల్లమైంది. ఇద్దరు రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని టోక్మాక్ నగరం నుండి మరో చోటకి వెళ్తుండగా వారి వాహనం దారిమధ్యలో పాడైంది. దీంతో వారిద్దరూ ఏం జరిగిందో చూసేందుకు వాహనం నుండి కిందకు దిగారు. కానీ ఉక్రెయిన్ బలగాలు ఎక్కడ డ్రోన్లతో దాడి చేస్తారోనని భయంతో చిన్న పాపను అడ్డుపెట్టుకున్నారు. వీడియోలో వాహనానికి ఒక పక్కన ఆయుధాన్ని మరో పక్కన నిల్చుని ఉన్న ఒక చిన్న పాపను స్పష్టంగా చూడవచ్చు. వాహనం మరమ్మతు చేస్తున్నంత సేపు పాపను తమ పక్కనే పెట్టుకున్నారు రష్యా సైనికులు. పాప అక్కడున్నంత వరకు డ్రోన్లు తమపై దాడి చేయవన్నది వారి నమ్మకం. అంతలో అటుగా మరొక వాహనం రావడంతో వారిని సాయమడిగిన రష్యా సైనికులు పాపను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. పాపం వారి ప్రాణాలు కాపాడిన చిన్నారి మాత్రం అక్కడే నిల్చుండిపోయింది. Ukrainian drone footage captures Russian soldiers fleeing near Tokmak. They are in such a hurry that they leave behind a small child and a rifle. pic.twitter.com/yUgML9jJ8J — Visegrád 24 (@visegrad24) August 27, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తోంది. ఇరుపక్షాలు శాంతించే దాఖలాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. . యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో సామాన్యులు, సైనికులు మృతిచెందారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలియని పరిస్థితి. యుద్ధాల గురించి చరిత్ర చెప్పేది ఒక్కటే. యుద్ధం ముగిసిన తర్వాతే అసలు యుద్ధం మొదలవుతుందని.. భావితరాల బ్రతుకులు ఆకలికేకలతో మొదలై వారి చావుకేకలతో కథ ముందుకు సాగుతుంటుందని. ఈ యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుందో మరి. ఇది కూడా చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం -
ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు!
వాషింగ్టన్: రష్యాలోని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ సహా పదిమంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, విమానం కూలిన తీరుతో పాటు ఇతరత్రా అంశాలను విశ్లేషించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ పాట్ రైడర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చేశారని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ తన శత్రువులను తుదముట్టించే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, కూల్చేశారని వివరించారు. అయితే, పేలుడుకు కారణమేమిటనే విషయం కానీ, తన పేరును కానీ వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. మరోవైపు, తన సెక్యూరిటీతో పాటు తన అనుచరుల భద్రత విషయంలో తమ చీఫ్ ప్రిగోజిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వాగ్నర్ గ్రూపుకు చెందిన సైనికులు చెబుతున్నారు. అలాంటిది కీలక అనుచరులను వెంటబెట్టుకుని ఒకే విమానంలో ఎందుకు ప్రయాణించారో తెలియడం లేదంటున్నారు. వాగ్నర్ గ్రూపులోని కీలక వ్యక్తులంతా సెయింట్ పీటర్స్బర్గ్కు ఎందుకు వెళుతున్నారో కూడా తెలియదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా ప్రిగోజిన్ ఆఫ్రికా దేశంలో ఉన్నారని అక్కడ తమ సైన్యంలో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చని ఆయన తెలుపుతున్నట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం చూస్తే తిరుగుబాటు నాయకుడిని ఆఫ్రికాలోనే హత్య చేసి దాన్ని విమాన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రిగోజిన్ చనిపోయాడన్న వార్తపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఇందులో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ అయితే.. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై హేతుబద్దమైన అనుమానాలున్నాయని అన్నారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి ప్రిగోజిన్ ఉదంతాన్ని ఉదహరిస్తూ ప్రపంచ నేతలు స్పందించడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్‌పింగ్ -
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్‌పోర్టులు మూసివేత
మాస్కో: మాస్కో శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయగా వాటిని కూల్చేశామని తెలిపింది పుతిన్ సైన్యం. దీంతో అప్రమత్తమై నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపింది రష్యా రక్షణ శాఖ. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది. మాస్కో సరిహద్దుల్లోని బ్రియాన్స్క్ ప్రాంతంలో క్రాస్నోగోర్స్క్ పట్టణంలో నాలుగు డ్రోన్లు ప్రవేశించడంతో వాటిని రష్యా సైన్యం కూల్చివేసింది. గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడటంతో అప్రమత్తమై ముందు జాగ్రత్తగా వ్నుకోవో, షెరెమెట్యెవో, డొమోడెడెవో, జుకోవ్స్కీ ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేశారు రష్యా అధికారులు. రష్యా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడులను ముమ్మరం చేసిందని గత ఆదివారం కూడా జరిగిన దాడుల్లో డ్రోన్లు రైల్వే స్టేషన్ పైకప్పు భాగంలోకి దూసుకుపోగా ఐదుగురు ప్రాణాలు కోలోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది ఉండగా మరణించిన ఐదుగురిలో ఇద్దరు ఆసుపత్రికి తరలించడానికి నిరాకరించారని మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో మరణించారని తెలిపారు. అంతకుముందు ఇదే కుర్స్క్ ప్రాంతానికి చెందిన వొల్ఫినోలో కూడా ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇటీవలి కాలంలో మరింత బలాన్ని వెనకేసుకున్న ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో కోల్పోయిన ఒక్కో ప్రాంతాన్ని మెల్లగా తిరిగి చేజిక్కించుకుంటోంది. ఇది కూడా చదవండి: కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్ -
ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎఫ్–16లు
కీవ్/ఇనెడోవిన్: రష్యాను దీటుగా ఎదుర్కోలేక డీలాపడిన ఉక్రెయిన్‌లో ఉత్సాహాన్ని నింపే పరిణామం. ఆ దేశానికి అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాలను అందజేయాలనే నిర్ణయానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దీంతో నెదర్లాండ్స్, డెన్మార్క్‌లు అమెరికా తయారీ ఎఫ్–16లను ఉక్రెయిన్‌కు అందజేసేందుకు ముందుకు వచ్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా డెన్మార్క్, నెదర్లాండ్స్‌ల్లో పర్యటించారు. ఆదివారం ఆయన నెదర్లాండ్స్‌లోని ఎయిండ్ హోవెన్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మార్క్ రుట్‌తో సమావేశమయ్యారు. అక్కడున్న రెండు ఎఫ్–16 విమానాలను పరిశీలించారు. అనంతరం మార్క్రుట్ మీడియాతో మాట్లాడుతూ.. తమ షరతులకు ఉక్రెయిన్ అంగీకరించిన తర్వాతే ఎఫ్–16ల సరఫరా మొదలవుతుందని స్పష్టం చేశారు. ఆ షరతులు ఏమిటన్నది వెల్లడించలేదు. తమ వద్ద ప్రస్తుతం 42 ఎఫ్–16 విమానాలున్నాయని, వీటిలో కొన్నిటిని ఉక్రెయిన్‌కు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌కు తాము 19 ఎఫ్–16లను అందజేస్తామని డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ ప్రకటించారు. ఎఫ్–16 యుద్ధ విమానాల పైలెట్లకు 6 నుంచి 8 నెలల శిక్షణ అవసరముంటుందని అధికారులు చెబుతున్నారు. నెదర్లాండ్స్, డెన్మార్క్‌ల నిర్ణయం చారిత్రకమని జెలెన్స్కీ కొనియాడారు. రష్యా దాడుల్లో ఏడుగురు మృతి ఉక్రెయిన్‌లోని చెరి్నహివ్ నగరంపై శనివారం రష్యా జరిపిన భీకర క్షిపణి దాడుల్లో సోఫియా అనే ఆరేళ్ల చిన్నారి సహా ఏడుగురు చనిపోగా మరో 150 మంది క్షతగాత్రులయ్యారు. రష్యాలోని కుర్స్క్ ప్రాంత రాజధాని కుర్స్క్ రైల్వే స్టేషన్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపింది. రైల్వే స్టేషన్ పైకప్పునకు మంటలు అంటుకుని అయిదుగురు గాయపడ్డారు. కాగా, ఉక్రెయిన్ డ్రోన్ దాడితో మాస్కోలోని రెండు ఎయిర్‌పోర్టుల్ని కొద్ది గంటలపాటు మూసివేశారు. -
రష్యాలో సోషల్ మీడియా సంస్థ రెడిట్‌కు భారీ షాక్!
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక ప్రచారానికి సంబంధించిన "నకిలీ" సమాచారం ఉందనీ, సంబంధిత "నిషేధించిన కంటెంట్"ను తొలగించ నందుకు రష్యా భారీ జరిమానా విధించింది. రెడిట్‌కు బారీ పెనాల్టీ విధించిందని మాస్కో కోర్టును ఉటంకిస్తూ ఆర్టీఏ మంగళవారం నివేదించింది. కోర్టు రెడ్డిట్‌కి 2 మిలియన్ రూబిళ్లు (20,365 డాలర్లు ) జరిమానా విధించింది. అయితే దీనిపై రెడిట్ ఇంకా స్పందించలేదు. వికీమీడియా, స్ట్రీమింగ్ సర్వీస్ ట్విచ్ గూగుల్‌తో సహా మాస్కో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తీసివేయడంలో విఫలమైనందుకు రష్యాలో పరిశీలనలో ఉన్న సైట్ల జాబితాలో రెడిట్ చేరింది. గత సంవత్సరం ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి, రష్యా మీడియా , బ్లాగర్ల ద్వారా సంఘర్షణ కవరేజీపై నియంత్రణలను కఠినతరం చేసింది, దాని సాయుధ దళాల చర్యలను అవహేళన చేసినా, లేదా వాటి గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచురించినా కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
క్రిమియాలో 20 డ్రోన్లు కూల్చివేశాం: రష్యా
కీవ్: ఆక్రమిత క్రిమియాపై డ్రోన్ల దాడిని తిప్పికొట్టినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ ప్రయోగించిన సుమారు 20 డ్రోన్లను కూల్చివేసినట్లు శనివారం రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇందులో 14 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేయగా మరో ఆరింటిని జామర్లు నిర్వీర్యం చేశాయని వెల్లడించింది. ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ స్పందించలేదు. వరుసగా మూడు రోజులుగా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడులు జరగడంతో రష్యా అప్రమత్తమైంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతానికి చెందిన ఉరోజ్హయిన్ అనే గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రష్యా శనివారం ప్రకటించుకుంది. ఖర్కీవ్, జపొరిజియా ప్రాంతాలతోపాటు, అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత పట్టణం క్రివ్విరిహ్ల్లో జరిగిన రష్యా బాంబు దాడుల్లో ఇద్దరు చనిపోగా మరో 16 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ యంత్రాంగం తెలిపింది. -
భారత్‌లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్
వాషింగ్టన్: సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ-20 సదస్సులో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన చర్చే ప్రధానం కానుందని చెబుతున్నాయి వైట్ హౌస్ వర్గాలు. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటన చేశారు. ఈ దఫా జీ-20 సదస్సు భారత్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ ప్రథమార్ధంలో న్యూఢిల్లీ వేదికగా అజరిగే ఈ సదస్సుకు అతిరధ మహారధులంతా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొనబోయే ఈ సమావేశంలో మిగతా అంశాలతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన చర్చ కూడా జరగనుందని సమావేశానికి హాజరుకానున్న అన్ని దేశాలు ఇదే అంశానికి పెద్ద పీట వేసినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్. నాటో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ ప్రయత్నం చేయడంతో యుద్ధానికి బీజం పడింది. 2022, ఫిబ్రవరి 24న రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మొదలైన యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై ఇటీవల జరిగిన సమావేశాల్లో భాగస్వామి దేశాలు సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. రష్యాతో జరుగుతున్న యుద్ధం సమసిపోతే గానీ ఉక్రెయిన్ సభ్యత్వం గురించి ఎటూ తేల్చలేమని తేల్చేశాయి. ఇటీవల సౌదీ రాజు అధ్యక్షతన ఆ దేశంలో జరిగిన సమావేశంలోనూ ప్రధానంగా ఉక్రెయిన్ గురించిన చర్చ జరిగింది. వచ్చే నెల జీ-20 సదస్సులో కూడా అదే హాట్ టాపిక్ కానుంది. ఎక్కడ సమావేశాలు జరిగినా రష్యా ఉక్రేయి యుద్ధం ప్రస్తావన వస్తూనే ఉంది. సుదీర్ఘన్గా కొనసాగుతున్న యుద్ధం తదనంతర పరిణామాల దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఎలాగైనా యుద్ధాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండడం మంచి పరిణామమే. ఇది కూడా చదవండి: 24 ఏళ్లయ్యింది.. ఇకనైనా తొలగించండి ప్లీజ్.. మళ్లీ -
అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్
జెదాహ్: ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సౌదీ అరేబియాలో జరుగుతున్న రెండ్రోజుల సమావేశాల్లో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ యుద్ధ సమసిపోతే అంతకంటే సంతోషం మరొకటి ఉండదని అన్నారు. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించగా మొత్తం 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించేందుకే వీరంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించకపోవడం విశేషం. భారత దేశం తరఫున అధికార ప్రతినిధిగా హాజరైన అజిత్ దోవల్ రెండు దేశాల మధ్య సంధిని కుదిర్చే విషయంలో తామెల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు. అజిత్ దోవల్ మాట్లాడుతూ.. భారతదేశం తరపున మేము తరచుగా రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తూ.. దౌత్యాన్ని కుదర్చడానికి తమవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటికే యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు తమకు తోచిన ప్రతిపాదనలు తెరపైకి తీసుకు రాగా వాటిలో కొన్ని మాత్రమే రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని అన్నారు. అలా కాకుండా రెండు దేశాలకూ సమ్మతమైన, శాశ్వతమైన, సమగ్ర పరిష్కారం కోసం భారతదేశం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన అంతర్జాతీయ చట్టాల్లోని నియమ నిబంధనలను భారత్ గౌరవిస్తుందని దాని ప్రకారమే రెండు దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయాత్నం చేస్తామని.. అదే జరిగితే తమకంటే ఎక్కువగా సంతోషించేవారు ఎవ్వరూ ఉండరని అన్నారు. అంతకుముందు జపాన్‌లో జరిగిన జీ7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జిలెన్‌స్కీని కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ఆయనకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం -
రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..
మాస్కో: నోవోరోసిస్క్ లోని రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడికి పాల్పడిండి. ఈ దాడిలో రష్యా యుద్ధనౌక దారుణంగా దెబ్బతింది. దీంతో నౌకాశ్రయంలోని కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపింది కాస్పియన్ పైప్‌లైన్ కన్సార్టియం. ఈ దాడికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇంటర్నెట్లో వైరలయ్యాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాను చావుదెబ్బ తీసింది. ప్రపంచ దేశాలకు చమురు తోపాటు ధాన్యాన్ని సరఫరా చేసే రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడి చేసింది. దాడిలో ఒలెనెగోర్స్కీ గోర్న్యాక్ అనే యుద్ధ నౌక తీవ్రస్థాయిలో దెబ్బతింది. డ్రోన్ల ద్వారా సుమారు 450 కిలోల టీఎన్టీని మోసుకెళ్లి ఓడను ఢీకొట్టినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలుప్రకటించాయి. దాడి సమయంలో యుద్ధనౌకపై సుమారు 100 మంది రష్యా సాయుధులు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. రాత్రిపూట జరిగినా కూడా డ్రోన్ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియాను ఉక్రెయిన్ బలగాలు మీడియాకు చేరవేశాయి. దాడి అనంతరం రష్యా బలగాలు రెండు సీ డ్రోన్ల సాయంతో బేస్ వెలుపల ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దాడిలో జరిగిన నష్టం గురించి మాత్రం వారు ప్రస్తావించలేదు. ఉక్రెయిన్ రిటైర్డ్ నావికా దళాధిపతి ఆండ్రియ్ రైజంకో మాట్లాడుతూ ఈ దాడుల కోసం ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు దాదాపు 760 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటాయని. ఉక్రెయిన్ డ్రోన్లు అంత దూరం ప్రయాణించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. POV: you ram into a Russian landing warship as a little simple drone pic.twitter.com/u79u5A4Shb — Illia Ponomarenko 🇺🇦 (@IAPonomarenko) August 4, 2023 ఇది కూడా చదవండి: పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా? -
యుద్ధ మృతులు 10 వేలు.. ఓ రక్తపిపాసీ... నీకిదే జలాభిషేకం...!
కీవ్: రష్యా దురాక్రమణ తమ దేశంపై మొదలయ్యాక 499 మంది చిన్నారులు సహా 10,749 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఉన్నతాధికారి యూరి బియెలౌసోవ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేసిన తర్వాతే వాస్తవ సంఖ్య తేలుతుందని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 500 మంది చిన్నారులు సహా 9 వేల మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు జూలై 7న ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక తెలిపింది. కాగా, రష్యా కాల్పుల్లో ఖెర్సన్ నగరంలోని 18వ శతాబ్దానికి చెందిన చారిత్రక సెంట్ కేథరిన్ కేథడ్రల్ చర్చి దెబ్బతింది. మంటలను ఆర్పుతుండగా మరోసారి దాడి జరిగింది. ► యుద్ధ ట్యాంకర్‌పై కూర్చున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ నిలువెత్తు రక్త ప్రతిమపై వాటర్ గన్‌తో నీళ్లు పిచికారీ చేస్తున్న ఓ బాలిక. ఇటలీ రాజధాని రోమ్‌లో జేమ్స్ కొలోమినా అనే కళాకారుడు ఈ ప్రతిమను ప్రతిష్టించారు. -
ఉక్రెయిన్ బందీలపై రష్యా బలగాల అకృత్యాలు
క్యివ్: రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో బందీలుగా చెరపట్టబడిన వారిని రష్యా సాయుధ బృందాలు అత్యంత క్రూరంగా హింసిస్తున్నట్లు చెబుతున్నారు ఉక్రెయిన్ అధికారులు. అంతర్జాతీయ మానవతా న్యాయ సంస్థ గ్లోబల్ రైట్స్ కంప్లయన్స్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 18 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో మొత్తం 97,000 నేరాలు నమోదుకాగా వాటిలో 220 కేసులలో ఇప్పటికే తీర్పులిచ్చాయి స్థానిక న్యాయస్థానాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కూడా అరెస్టు చేయాలని కొన్ని న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. కానీ క్రెమ్లిన్ వర్గాలు ఈ తీర్పులకు స్పందిస్తూ అవి దేశరక్షణలో భాగంగా జరిగిన స్పెషల్ మిలటరీ ఆపరేషన్ అంటూ చెప్పుకొచ్చాయి. ఇదిలా ఉండగా బ్రిటీష్, ఐరోపా సంయుక్త దేశాలు, అమెరికా సహకారంతో నడిచే మొబైల్ జస్టిస్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఖేర్సన్ పరిసర ప్రాంతంలోని 35 చోట్ల 320 యుద్ధ నేరాలు ఆరోపించబడ్డాయని తెలిపింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ల తాజా విచారణలో ప్రకారం రష్యా రాజకీయ నాయకుడితో ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు చేతులు కలిపి ఖేర్సన్ నుండి ఎందరో అనాధలను ఖైదీలుగా తరలించారు. వారినందరినీ చిత్రహింసలకు గురిచేస్తూ రష్యా సైన్యం లైంగిక దాడులకు కూడా పాల్పడుతోందన్నారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు ప్రాసిక్యూట్ చేసిన 36 మంది మాత్రం కరెంటు షాక్ ఇవ్వడం, చావబాదడం తోపాటు అత్యాచారానికి పాల్పడతామంటూ బెదిరించినట్టు తెలిపారు. గ్లోబల్ రైట్స్ కంప్లయన్స్ న్యాయ సలహాదారు మాత్రం ఖైదీలపై రష్యా ఆకృత్యాలపై పూర్తి స్థాయి నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు. ఇది కూడా చదవండి: సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే.. -
జెలెన్స్కీ సొంత నగరంపై క్షిపణి దాడులు
కీవ్: రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రివి్వ్యరిహ్పై రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో పదేళ్ల బాలిక సహా ఆరుగురు చనిపోయారు. ఈ దాడుల్లో ఓ అపార్టుమెంట్, నాలుగంతస్తుల యూనివర్సిటీ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పదేళ్ల బాలిక, ఆమె తల్లి సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 64 మంది గాయాలపాలయ్యారని నీప్రో గవర్నర్ సెర్హీ లిసాక్ తెలిపారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెప్పారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. రష్యా పాక్షికంగా ఆక్రమించిన డొనెట్స్క్ ప్రావిన్స్‌లో జరిగిన దాడిలో ఇద్దరు చనిపోగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడికి కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. కాగా, మాస్కోపైకి ఆదివారం డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్ సోమవారం రష్యాలోని బ్రియాన్స్క్పై డ్రోన్ దాడి జరిపింది. ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదని స్థానిక గవర్నర్ చెప్పారు. ఖరీ్కవ్, ఖెర్సన్, డొనెట్స్్కలపై రష్యా శతఘ్ని కాల్పుల్లో ముగ్గురు చనిపోగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. -
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. మాస్కో విమానాశ్రయం మూసివేత
మాస్కో: ఆదివారం ఉదయం మాస్కో నగరంలో మొత్తం మూడు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి పాల్పడగా ఒకదాన్ని నగరం శివార్లలోనే కూల్చేశాయి రష్యా బాలగాలు. రెండిటిని మాత్రం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దెబ్బతీశాయి. ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు తగల్లేదని తెలిపింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ. దీంతో కొద్దిసేపు మాస్కో విమానాశ్రయాన్ని మూసివేశారు ఎయిర్‌పోర్టు అధికారులు. ఉక్రెయిన్ సరిహద్దు నుండి సుమారు 500 కి.మీ(310 మైళ్ళు) మేర ఆ దేశం అప్పుడప్పుడు దాడులకు పాల్పడింది. కానీ ఈసారి మాత్రం ఉక్రెయిన్ క్రెమ్లిన్, సరిహద్దులోని రష్యా పట్టణాల మీద దాడి చేసింది. మాస్కో నగర మేయర్ సెర్గీ సొబ్యానిన్ దాడులపై స్పందిస్తూ.. ఈ దాడుల్లో రెండు సిటీ ఆఫీస్ టవర్లు కొంత వరకు దెబ్బతిన్నాయని.. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఆదివారం జరిగిన డ్రోన్ల దాడుల్లో ఒకదాన్ని మాస్కో ఒడింట్సోవ్ జిల్లాలోని రక్షణ బలగాలు మట్టుబెట్టాయని మరో రెండు డ్రోన్లను తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ధ్వంసం చేసిందని.. వాటి శకలాలు నిర్మానుష్య ప్రాంతంలో నేలకూలాయని అన్నారు. ఈ కారణంగానే కొద్దిసేపు వ్నుకోవో విమానాశ్రయానికి రాకపోకలను నిలిపివేసినట్లు చెబుతూ దీన్ని మేము తీవ్రవాదుల చర్యగానే పరిగణిస్తున్నామని తెలిపింది రష్యా రక్షణ శాఖ. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా సాగించిన దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. డొనెట్స్క్లోని నియు–యోర్క్‌పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. చెరి్నహివ్పై రష్యా క్రూయిజ్ మిస్సైళ్లు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇలా ఉండగా, నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా ఉక్రెయిన్ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని, 120 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా తెలిపింది. ఈ పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ చేసి మాట్లాడతానని, వచ్చే నెలలో తుర్కియేలో ఆయనతో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్ పేలింది. క్రాస్నోవార్డిస్క్‌లోని ఆయిల్ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందారు. -
బెలారస్ లో వాగ్నర్ సైన్యం.. అంతా ప్లాన్ ప్రకారమే..?
మాస్కో: రష్యా బలగాలపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం బెలారస్ లో ఉన్నట్లుగా చూపిస్తూ ఇటీవల ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ బెలారస్ లో ఉంటేనే పోలాండ్, లిథువానా సమీపంలోని నాటో ఆస్తులపై చేసేందుకు అనువుగా ఉంటుందంటున్నాయి రష్యా వర్గాలు. లొకేషన్ చేంజ్.. రష్యాపై ఉన్నట్టుండి తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్తోనూ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశంకో మధ్యవర్తిత్వం నడిపి సంధి కుదిర్చిన విషయం తెలిసిందే. సంధి జరిగిన నాటి నుండి ఇంతవరకు వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ ఎక్కడా బయట కనిపించలేదు. దీనిపై చాలా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఇటీవల విడుదలైన కొన్ని వీడియోల ఆధారంగా ఆయన బెలారస్ లో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. రష్యాకే బెనిఫిట్.. బెలారస్ లో యెవ్జెనీ ప్రిగోజిన్ అక్కడి సైన్యానికి శిక్షణ ఇస్తోన్న కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్యా మాజీ సైన్యాధికారి ఆండ్రీ కర్తపోలోవ్ కొంత స్పష్టత ఇచ్చారు. వాగ్నర్ సైన్యం ప్రస్తుతం బెలారస్ లో ఉండడమే కరెక్టని, అక్కడ ఉంటేనే బెలారస్ సరిహద్దు ప్రదేశాలు పోలాండ్, లిథువానాలతోపాటు ఉక్రెయిన్ లోని నాటో ఆస్తులపై దాడి చేసే వీలుంటుందని, అది రష్యాకు కలిసొచ్చే అంశమేనని తెలిపారు. మరోపక్క ఇదంతా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రణాళికలో భాగమని, దాని అనుసారంగానే తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యెవ్జెనీ ప్రిగోజిన్‌ను దేశం దాటించి అతని స్థానంలో మరొకరిని వాగ్నర్ బృందానికి నాయకుడిగా నియమించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది కూడా చదవండి: రిషి సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. -
Russia-Ukraine War: క్రిమియా బ్రిడ్జిపై భారీ పేలుడు.. ఇద్దరి మృతి
క్యివ్: గతేడాది అక్టోబర్ నెలల్లో ట్రక్కు బాంబు పేలిన అదే బ్రిడ్జి మీద మరోసారి పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక జంట మృతి చెందగా వారి బిడ్డ మమ్మీ, డాడీ అంటూ రోదిస్తూ హృదయాలను ద్రవింపజేసింది. క్రిమియా నుండి రష్యాకు కనెక్టివిటీగా ఉన్న ఈ బ్రిడ్జి రష్యా యుద్ధం చేయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. 12 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు కమ్ రైలు వంతెన రష్యా దళాలు వస్తూ పోతూ ఉండడానికి బాగా ఉపయోగపడింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఇదే బ్రిడ్జిపై ట్రక్కు బాంబు పేలిన విషయం తెలిసిందే. దీన్ని మరమ్మతులు చేసి పునరుద్ధరించడానికి నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు రవాణా యధాతధంగా సాగుతున్న ఈ బ్రిడ్జి మీద మళ్ళీ పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో ఒక జంట మృతి చెందారని వారి చిన్నారి మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడిందని తెలిపారు పశ్చిమ రష్యాలోని బెల్గోరోడ్ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్. బెల్గోరోడ్ నెంబర్ ప్లేటు ఉన్న వాహనం ఒకటి ఈ పేలుడుకు ప్రధాన కారణమని అన్నారు. రష్యా రవాణా మంత్రిత్వ శాఖ ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ చర్యేనని ఆరోపిస్తూ పేలుడుకి గల కారణాలను విచారిస్తున్నట్లు తెలిపింది. క్రిమియా గవర్నర్ సెర్జీ ఆక్సియోనోవ్ ఈ విషయాన్ని టెలిగ్రామ్ ద్వారా ధృవీకరించి రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. బ్రిడ్జి 145 పిల్లర్ వద్ద పేలుడు సంభవించిందని, బ్రిడ్జి రహదారిపై విపత్తు నిర్వహణ సంస్థల వారు రక్షణ చర్యలు చేపట్టారని. వీలైనంత తొందరగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: పసిఫిక్ సముద్రంలో చిక్కుకుని.. 60 రోజుల పాటు ఒక్కడే.. -
మా దగ్గరా బోలెడు క్లస్టర్ బాంబులు
కీవ్: ఉక్రెయిన్‌కు అమెరికా విధ్వంసకర క్లస్టర్ బాంబులను సరఫరా చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమ వద్ద కూడా క్లస్టర్ బాంబుల నిల్వలు దండిగా ఉన్నాయని ప్రకటించారు. ఈ వివాదాస్పద ఆయుధాలను ఉక్రెయిన్ వాడిన పక్షంలో తగు రీతిలో స్పందించే హక్కు తమకుందని హెచ్చరించారు. ‘మా వద్ద క్లస్టర్ బాంబులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు వాటిని వాడలేదు. అటువంటి అవసరం కూడా మాకు రాలేదు’ అని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ ఇప్పటికే క్లస్టర్ బాంబులను వాడినట్లుగా పలు ఆధారాలను అసోసియేటెడ్ ప్రెస్, అంతర్జాతీయ మానవతావాద సంస్థలు చూపుతున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో, యుద్ధక్షేత్రంలో రష్యా ఆర్మీపై ఉక్రెయిన్ పైచేయి సాధించాలంటే విధ్వంసకర క్లస్టర్ బాంబులే మార్గమని అమెరికా అంచనా వేస్తోంది. క్లస్టర్ బాంబుల సరఫరాపై నెలలపాటు అమెరికా మల్లగుల్లాలు పడింది. ఉక్రెయిన్‌కు వీటిని అందజేయాలన్న నిర్ణయానికే అధ్యక్షుడు బైడెన్ చివరికి మొగ్గు చూపారు. ప్రమాదకరమైనవిగా భావించే క్లస్టర్ బాంబులను చివరిసారిగా అమెరికా 2003లో ఇరాక్ యుద్ధంలో వాడినట్లు చెబుతోంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 30 లక్షల క్టస్టర్ ఆయుధ నిల్వలున్నాయి. డొనెట్స్క్, ఖెర్సన్ ప్రాంతాలే లక్ష్యంగా గత 24 గంటల్లో రష్యా రెండు షహీద్ డ్రోన్లను, రెండు క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైళ్లతోపాటు 40 వైమానిక దాడులు, 46 రాకెట్ దాడులు జరిపిందని ఉక్రెయిన్ తెలిపింది. -
వాగ్నర్ అనుభవంతో బెలారస్ బలోపేతం!
మిన్స్క్ (బెలారస్): ఉక్రెయిన్‌లో రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అనుభవాన్ని వాడుకోవాలని బెలారస్ భావిస్తోంది. వాగ్నర్ సేన శనివారం ఆ దేశంలో బెలారస్లో అడుగుపెట్టింది. ఇరు సైన్యాల మధ్య సమన్వయం కోసం సంయుక్త సైనిక విన్యాసాలు తదితరాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెరుపువేగంతో షూటింగ్, ప్రథమ చికిత్సలో బెలారస్ సైనికులకు వాగ్నర్ గ్రూప్ బలగాలు తరీ్ఫదునిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. -
ఉక్రెయిన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు
కీవ్: రష్యా దురాక్రమణకు లోనైన తమ భూభాగాలను తిరిగి దక్కించుకునేందుకు సర్వం ఒడ్డుతున్న ఉక్రెయిన్‌కు మద్దతు పలుకుతున్న దేశాల సంఖ్య పెరుగుతుంది. శనివారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ ఉక్రెయిన్‌లో పర్యటించారు. నాటో భేటీ కోసం లిథువేనియాకు వచి్చన యూన్ సతీసమేతంగా ఉక్రెయిన్ వెళ్లారు. ఉక్రెయిన్ సేనల తీవ్ర ప్రతిఘటనలతో వెనుతిరుగుతూ రష్యా మూకలు సృష్టించిన నరమేథానికి సాక్షిగా నిలిచిన బుచా, ఇరి్పన్ నగరాల్లోని ఘటనాస్థలాలను యూన్ సందర్శించి మృతులకు నివాళులరి్పంచారు. యుద్ధంలో తలమునకలైన ఉక్రెయిన్‌కు మానవీయ, ఆర్థికసాయం అందిస్తూ ద.కొరియా తనవంతు చేయూతనందిస్తోంది. కానీ ఆయుధసాయం మాత్రం చేయట్లేదు. యుద్ధంలో మునిగిన దేశాలకు ఆయుధాలు అందించకూడదనే తన దీర్ఘకాలిక విధానాన్ని ద.కొరియా ఇంకా కొనసాగిస్తోంది. అయితే మందుపాతరలను గుర్తించి నిరీ్వర్యంచేసే ఉపకరణాలు, అంబులెన్సులు, సైనికయేతర వస్తువులను మాత్రం అందించేందుకు తమ సమ్మతి తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ యూన్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. యుద్ధ తీవ్రంకాకుండా ఆపగలిగే పరిష్కార మార్గాలను అన్వేíÙంచాలని నిర్ణయించారు. -
Ukraine-Russia war: నాటో నాటో.. ఎప్పుడో ఎప్పుడో!
ఎస్.రాజమహేంద్రారెడ్డి: నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సమావేశం ఉక్రెయిన్ ఆశలపై నీళ్లు చల్లింది. నాటో.. నాటో అంటూ కలవరించిన ఉక్రెయిన్ ఇప్పుడు నాటు.. నాటు అనక తప్పడం లేదు. గతేడాది మాడ్రిడ్‌లో జరిగిన సమావేశం అనంతరం స్వీడన్, ఫిన్లండ్లను కూటమిలో చేర్చుకుంటున్నట్టు నాటో ప్రకటించింది. ఆ రెండు దేశాలు జూలై 11, 12 తేదీల్లో లిథువేనియాలో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యాయి. ఇదే బాటలో నాటో కూటమి తమను కూడా అక్కున చేర్చుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశించారు. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి! ఉక్రెయిన్ భవిష్యత్తు తమతోనే ముడిపడి ఉంటుందని సమావేశం చివరి రోజు నాటో పేరుకు ఒక ప్రకటన చేసినా, ఆ భవిష్యత్తు ఎప్పుడు ఆరంభమవుతుందో మాత్రం స్పష్టం చేయలేదు. దాదాపు 500 రోజులకు పైగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు పశి్చమ దేశాలు ఆయుధ సామగ్రితో పాటు యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లను సమకూరుస్తూ అండగా ఉన్నప్పటికీ, ఆ సాయం వెనక ఆయా దేశాల ఊగిసలాట ధోరణి జెలెన్స్కీని కలవరపరుస్తూనే వస్తోంది. ప్రతిదానికీ చేతులు జోడించి ఎదురు చూడాల్సి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. నాటో కూటమిలోకి ప్రవేశం దక్కితే ఈ అవస్థ ఉండదన్నది జెలెన్స్కీ ఆలోచన. నిజానికి నాటోలో చేరితే ఉక్రెయిన్ రక్షణ బాధ్యతను కూటమి దేశాలన్నీ సంయుక్తంగా మోయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ భవితవ్యాన్ని, రష్యాతో జరుగుతున్న యుద్ధ గమనాన్ని శాసించే నాటో సభ్యత్వ వ్యవహారంలో నిజానికి ఏం జరిగింది? ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చేందుకు ఎందుకు నాటో పచ్చజెండా ఊపలేదు? అసలు జెలెన్స్కీ ఆశించిందేమిటి? వివరాల్లోకి వెళ్దాం... అనుకున్నదొక్కటి... జెలెన్స్కీ ఏం ఆశిస్తున్నదీ సుస్పష్టం. గత సెపె్టంబరుకు ముందు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కావాలన్న తన అభ్యర్థనను 2023 జూలైలో లిథువేనియాలో జరిగే కూటమి సమావేశంలో వ్యక్తం చేస్తానని అన్నారు. కానీ ఈ వ్యాఖ్యల్లో మొక్కుబడితనమే తప్ప గాఢమైన కోరికేమీ ధ్వనించలేదు. ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్స్్క, డొనెట్స్్క, ఖెర్సన్, జపోరిజియాలను తమ భూభాగాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత సెపె్టంబరులో ప్రకటించగానే జెలెన్స్కీ స్వరం మారిపోయింది. నాటోలో తమకు పూర్తి సభ్యత్వమిచ్చే అంశాన్ని ఆగమేఘాల మీద పరిశీలించాల్సిందిగా జెలెన్స్కీ అభ్యరి్థంచడం మొదలెట్టారు. అంటే నాటో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ సీరియస్‌గా ఆశిస్తున్నది కేవలం ఏడాది క్రితం నుంచేనని సుస్పష్టం. నాటో మార్గదర్శకాల ప్రకారం యూరప్‌లోని ఏ దేశమైనా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పన్నెండు దేశాల కూటమిగా మొదలైన నాటో సభ్య దేశాల సంఖ్య ఇప్పుడు 32కు పెరిగింది. లిథువేనియాలోని విలి్నయస్లో జరిగిన నాటో భేటీకి హాజరైన జెలెన్స్కీ పనిలో పనిగా లుకిస్కస్ స్క్వేర్‌లో జరిగిన ఓ సభలో తమ అభీష్టాన్ని అక్కడి జనాలతో పంచుకున్నారు. సభా వేదికపై ‘ఉక్రెయిన్–నాటో 33’ నినాదాన్ని కూడా ప్రదర్శించడం విశేషం. నాటో నేతలకే ఇష్టం లేదు...! లుకిస్కస్ స్క్వేర్ సభా వేదికపై ప్రదర్శితమైన ‘ఉక్రెయిన్–నాటో 33’ బ్యానర్ అక్కడివారి మది దోచినా, ఉక్రెయిన్ మెడలో ఇప్పటికిప్పుడే ‘నాటో–33’ గుర్తింపు కార్డు పడటం మాత్రం నాటో నేతల్లోనే చాలామందికి అసలు ఇష్టం లేదు. అందుకే ‘అప్పుడే కాదం’టూ ఉక్రెయిన్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ఉక్రెయిన్‌కు సభ్యత్వాన్ని మంజూరు చేస్తే నాటో దేశాలన్నీ రష్యాపై ప్రత్యక్షంగా యుద్ధ బరిలోకి దిగాల్సి వస్తుంది. నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్య దేశంపై దాడి జరిగినా కూటమిలోని దేశాలన్నీ సంయుక్తంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. నాటో నిబంధనల్లోని ఆరి్టకల్–5 ఈ విషయాన్ని స్పష్టంగా నిర్దేశించింది. నాటో చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి, అమెరికాపై 9/11 ఉగ్ర దాడులు జరిగినప్పుడు ఈ నిబంధన అమలైంది. ఒకవేళ ఇప్పుడు గనక ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తే కూటమిలోని మిగతా 32 దేశాలూ రష్యాపై యుద్ధానికి దిగాల్సి వస్తుంది. ‘నాటో దేశాల భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. ఇప్పుడు యుద్ధం నడిమధ్యలో ఉంటే తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు మేమంతా రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాటో కూటమి తమ సభ్య దేశాల పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటుందో బైడెన్ ఈ వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటారు. అయితే బైడెన్ వ్యాఖ్య వెనక అసలు ఉద్దేశాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జెన్ వాలెస్ కుండబద్దలు కొట్టారు. ‘ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్న దేశాన్ని ఇప్పటికిప్పుడు కూటమిలోకి ఆహా్వనించలేం. అలా చేయడం మొత్తం కూటమినీ యుద్ధభూమిలోకి లాగడమే అవుతుంది’’ అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పారు. యుద్ధం ముగిశాక గెలుపోటములతో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సభ్యత్వానికి నాటో ఇలా సూత్రప్రాయంగా అంగీకరించినా అధికార ముద్ర ఎప్పుడు పడుతుందో చెప్పలేం. యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్‌కు నాటో మోక్షం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నా, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది మాత్రం అస్పష్టం! జెలెన్స్కీకీ ముందే తెలుసు...! యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం రావడం కల్లేనని జెలెన్స్కీకీ తెలుసు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆయన పదేపదే నాటో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం మాటే ఉండదు. మాకది ఇష్టం లేక కాదు, కానీ అసాధ్యం’ అని జెలెన్స్కీ ఐదారు నెలల క్రితం కీవ్‌లో తన మనసులో మాటను సుస్పష్టంగా చెప్పారు. అయితే యుద్ధం ముగిసిన వెంటనే నాటో సభ్యత్వం లభించేలా ఓ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసుకోవడానికే పదేపదే ఇలా సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సభ్యత్వంపై ఎటూ తేల్చని నాటో కనీసం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించకపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడిని నిరాశకు గురి చేసింది. ఇది ఒకరకంగా ఉక్రెయిన్ను ఆగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టిందనే భావించాలి. ఉక్రెయిన్ ఉక్రెయిన్‌గా నిలవాలంటే యుద్ధాన్ని గెలవాలి, లేదా రష్యాతో సంధి కుదుర్చుకోవాలి. ఈ రెండు పరిస్థితుల్లోనే ఉక్రెయిన్ నాటోలో చేరగలుగుతుంది. ఓడిపోతే ఉక్రెయిన్ రష్యాలో అంతర్భాగంగా మారిపోతుంది. అప్పుడిక దానికి నాటో ప్రస్తావన అవసరమే లేకుండా పోతుంది. గెలుపోటములను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటిదాకా ‘అయితే గియితే’లో ఉన్న నాటో సభ్యత్వ అంశం ‘ఆ సుదినం ఎప్పుడు’ అనేదాకా అయితే వచి్చంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌కు ఊరటనిచ్చే విషయం ఇదొక్కటే. యుద్ధం త్వరలో ఓ కొలిక్కి వచ్చి ఉక్రెయిన్‌కు నాటో తలుపులు తెరుకోవాలని కోరుకుందాం! తెరుచుకుంటాయనే ఆశిద్దాం!! -
నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
విల్నియస్ : లిథువానా రాజధాని విల్నియస్ వేదికగా జరుగుతున్న నాటో దేశాల సమావేశాల నేపథ్యంలో ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వంపైనా ఆ దేశానికి ఆయా సభ్య దేశాల మద్దతు ఎలా ఉంటుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉండగా సమావేశం అనంతరం భోజనానికి ముందు అతిధులందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రం ఒంటరిగా కనిపించారు. అదే సమయంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఒంటరిగా ఉన్న ఈ ఫోటోపై కామెంట్లు కూడా అంతే సెటైరికల్ గా ఉన్నాయి. నాటో కూటమి ఒక అస్థిరమైన కూటమి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు నాటో దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి అందుకే ఆయనను ఒంటరిగా వదిలేశారని ఒకరు రాయగా.. నాటో సమావేశాల్లో ఇదీ ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి.. అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. అసలు విషయమేమిటంటే అప్పటివరకు పక్కనే ఉన్న వ్లాదిమిర్ జెలెన్స్కీ భార్య ఓలెనా జెలెన్స్కీ మరో అతిధిని పలకరించేందుకు ఒక అడుగు పక్కకు జరిగింది. దీంతో ఒక్కరే ఉన్న ఫోటో బయటకు రావడంతో రకరకాల కథనాలను పుట్టించారు నెటిజన్లు. ఇదిలా ఉండగా నాటో సమావేశాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు సందేశమిస్తున్న సమయంలో అతని భార్య ఓలెనా జెలెన్స్కీ ఆయన పక్కనే ఉన్నారు. సమావేశంలో ఆయా దేశాలు రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ కు తమ సహకారం ఉంటుందని ప్రకటించాయి. ఎటొచ్చి నాటో సభ్యత్వంపైనే స్పష్టత లేని హామీలనిచ్చాయి. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్..? -
అమెరికా అధ్యక్షుడి చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్..?
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ దర్శనమిచ్చింది. ఆయన ఎక్కడికెళ్తే అక్కడకు ఆయనతో పాటు ఈ బ్లాక్ లెదర్ సూట్ కేసును వెంట తీసుకెళ్లడం రష్యాకు కీడు శంకిస్తోందని చెబుతున్నాయి స్థానిక మీడియా వర్గాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సమయంలో వైట్ హౌస్ దాటి ఎక్కడికైనా బయటకు వెళ్ళినపుడు ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును అయన తన వెంట తీసుకెళ్లడం చేస్తుంటారు. కానీ లండన్ పర్యటనకు ఈ బ్రీఫ్ కేసును తీసుకెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటే.. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అణుబాంబుల ప్రయోగానికి ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసు నుంచి ఆదేశించవచ్చు. 20 కిలలో బరువుండే ఈ బ్యాగ్‌లో న్యూక్లియర్ లాంచ్ కు సంబంధించిన కోడ్ పొందుపరచి ఉంటుంది. దీన్నే అటామిక్ బాంబు గానూ ప్రెసిడెంట్ అత్యవసర హ్యాండ్ బ్యాగ్ గానూ చెబుతూ ఉంటారు. సాయుధ దళానికి చెందిన సైనికుడు అధ్యక్షుడి వెంట దీన్ని తీసుకెళ్తూ ఉంటారు. రష్యా గురించేనా..? రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలోనే జో బైడెన్ ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును తనవెంట తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు. ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబులు ప్రయోగానికి సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కు ఆదేశాలిచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు తన చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేసు తీసుకెళ్లారని వారంటున్నారు. నాటో సమావేశానికి ముందు సన్నాహకంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో భేటీ అయిన బైడెన్ ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ఆయనతో చర్చించినట్టు సమాచారం. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాతే ఉక్రెయిన్ సభ్యత్వం గురించి పరిగణిస్తామని ఇదివరకే చెప్పిన బైడెన్ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇది కూడా చదవండి: ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..? -
నాటోలో సభ్యత్వం: స్వీడన్‌కు సై.. ఉక్రెయిన్‌కు నై.. కారణమిదే!
విల్నియస్: స్వీడన్‌ను తమ కూటమిలో 32వ సభ్యదేశంగా చేర్చుకునేందుకు నాటో అంగీకరించింది. లిథువేనియా దేశంలోని విలి్నయస్ నగరంలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. అయితే ఉక్రెయిన్‌కు సభ్యత్వంపై 31 సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం దక్కకపోవచ్చు. యుద్ధంలో నిమగ్నమైన దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదన్న నిబంధన కారణంగా ఇప్పుడే కూటమిలో చేర్చుకోలేమని, యుద్ధం ముగిశాక వెంటనే సభ్యత్వం ఇచ్చేలా పాత రెండంచెల పద్ధతిని సరళతరం చేశామని నాటో ప్రధాన కార్యదర్శి జీన్స్ స్టోల్టెన్బెర్గ్ మీడియాతో చెప్పారు. కాగా, తమ పట్ల నాటో వైఖరిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. -
యుద్ధం విధ్వంసమే కాదు.. వ్యాధుల్ని కూడా కలగజేస్తుందా!
రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి ఏడాదికి పైగా కావొస్తోంది. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్షలాదిమందిని పొట్టనపెట్టుకుంది. వేలాదిమందికి పైగా నిరాశ్రయులయ్యారు. మరోవైపు యుద్ధం బీభత్సానికి బీతిల్లి లక్షలాదిమంది వలసలు వెళ్లిపోయారు. ఆయా దేశాల్లో శరణార్థులుగా ఉన్నవారందర్నీ ఆ భయం వెన్నాడుతూనే ఉంది. వాళ్లు ఇంకా ఆ సంఘటనల తాలుకా ఆందోళన, ఒత్తిడి కారణంగా చెపుకోలేని మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ శరణార్థులంతా 'సర్వైవర్ సిండ్రోమ్' అనే మానసిక రుగ్మతతో అల్లాడుతున్నారు. ఇంతకీ 'సర్వైవర్ సిండ్రోమ్' అంటే ఏమిటంటే..? సర్వైవర్ సిండ్రోమ్ అంటే.. ఇతరులు మరణించిన లేదా హాని కలిగించే పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత అపరాధం చేసిన భావనలో ఉండటం. విపత్కర పరిస్థితుల్లోంచి తన వాళ్ల కంటే భిన్నంగా బయటపడిన తర్వాత నుంచి వారిని వేధించే ఒక రకమైన మానసిక ఆవేదన. ఏ తప్పు చేయకపోయినా తమ కారణంగానే వారు దూరమయ్యారని కుంగిపోతుంటారు. ఇందులోంచి వారు బయటపడకపోతే గనుక ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత స్థితికి చేరుకునే ప్రమాదం లేకపోలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన వెంటనే లిసెట్స్కా అనే మహిళ తన ఏడేళ్ల కొడుకుతో పొరుగున ఉన్న మోల్డోవాకు పారిపోయింది. ఐతే ఆ సమయంలో ఆమె తన భర్తను, స్నేహితులను వదిలి రోమేనియా సరిహద్దుకు సమీపంలోని నిస్పోరేని వద్ద ఉన్న మోల్డోవన్ శరణార్థి కేంద్రం వద్దకు చేరుకుంది. తన కొడుకుని సురక్షితంగా ఉంచేందుకు ఆమె ఈ ధైర్యం చేయక తప్పలేదు. కానీ ఆ తర్వాత నుంచి తన మాతృభూమికి ద్రోహం చేశానని, తన వాళ్లను మోసం చేశానేమో అనే ఆవేదనతో కుంగిపోవడం ప్రారంబించింది. శరీర స్ప్రుహ లేకుండా తిండి తిప్పలు లేకుండా జీవచ్ఛవంలా మారిపోయింది. ఇలా అక్కడ ఉంటున్న దాదాపు లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులంతా ఇలాంటి మానసిక రుగ్మతతోనే బాధపడుతున్నారు. తెలియని ఆందోళన, మానసిక ఒత్తిడి గురవ్వుతున్నారు. ఆయా శరణార్థులకు డాక్టర్స్ ఆఫ్ ది వరల్డ్‌తో సహా దాదాపు 40 ప్రధాన మానవతా సంస్థలు వారికి చికిత్స అందించేందుకు ముందుకు వచ్చాయి. వారందరికీ ఆర్ట థెరఫీ ఇచ్చి ఆ మానసిక రుగ్మత నుంచి బయటపడేలా చేయడమే గాక వారికి మేమున్నాం అనే భరోసా ఇస్తున్నారు. తాము ఒంటరి అనే భావనను తుడిచిపెట్టి ఇక్కడ ఉన్నవారంతా ఓ కుటుంబంలా.. ఓ కొత్త జీవితానికి నాంది పలకాలంటూ ప్రోత్సహించడంతో ఇప్పుడిప్పుడే వారిలో నెమ్మది నెమ్మదిగా మార్పు రావడం ప్రారంభమైంది. ఆయా శరణార్థుల నైపుణ్యాలను బట్టి వారికి తగిన ఉద్యోగాలివ్వడం, కొందరి చేత పేయింటింగ్ వంటి పనులతో నిమగ్నమయ్యేలా చేశారు. దీంతో వారు ఫేస్ చేస్తున్న మానసిక సమస్యను అధిగమించేలా చేస్తున్నాయి సదరు మానవతా సంస్థలు. ఈ మేరకు ఆయా మానవతా సంస్థల జనరల్ కోఆర్డినేటర్ లిజ్ డివైన్ మాట్లాడుతూ..మోల్డోవాలోని ఉక్రేనియన్ శరణార్థులలో 86 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు. వారి భర్తలు, కుమారులు, సోదరుడు ఉక్రెయిన్‌లో పోరాడటానికి లేదా ఇతర సహాయ నిమిత్తం అక్కడే ఉన్నారు. దీంతో వారిలో సహజంగా 'ఒంటరి' అనే భావన కలుగుతుంది. ఆ తర్వాత తెలయకుండానే ఆందోళనతో కూడిన ఒత్తిడికి గురై ఈ సర్వైవర్ సిండ్రోమ్కి గురవ్వుతారు. అందుకే వారిని ఏదో ఒక పనిలో బిజీ చేసి చుట్టు ఉన్నవాళ్లే తమ వాళ్లుగా స్వీకరించేలా సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు లిజ్ డివైన్. (చదవండి: వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు! ) -
తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ తో పుతిన్ భేటీ..?
మాస్కో: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం 500 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత వారం రోజులుగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల పుతిన్ సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్గేనీ ప్రిగోజిన్ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. గత వారం రోజుల్లో ఉక్రెయిన్ కు అమెరికా క్లస్టర్ బాంబులు సాయం చేయడం, టర్కీ దేశం తమవద్ద ఖైదీలుగా ఉన్న ఉక్రెయిన్ కమాండర్ లను విడుదల చేయడం వంటి హఠాత్పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కూడా కొన్ని కీలక పావులు కదిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వాగ్నర్ గ్రూపుతోపాటు మరికొన్ని గ్రూపులను కలిపి మొత్తం 35 మందిని అధ్యక్షుడు పుతిన్ తో సమావేశానికి ఆహ్వానించింది క్రెమ్లిన్. ఈ సమావేశానికి కమాండర్లు కూడా హాజరవ్వగా సమావేశం మూడు గంటల పాటు సాగిందని తెలిపాయి క్రెమ్లిన్ వర్గాలు. ఈ సందర్బంగా క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సమావేశం ఫలప్రదంగా సాగిందని.. వాగ్నర్ గ్రూపు తాము పుతిన్ సైనికులమని ఆయన ఆదేశిస్తే యుద్ధరంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రష్యా సైన్యానికి ఎదురు తిరిగిన వాగ్నర్ గ్రూపు రోస్తోవ్ లోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని మాస్కో వస్తున్నాం కాసుకోమని పుతిన్ కే సవాలు విసిరిన విషయం తెలిసిందే. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశంకో చొరవతో సంధి కుదిరి ప్రిగోజిన్ దళాలు తిరుగుముఖం పట్టాయి. ఒప్పందం ప్రకారం ప్రిగోజిన్ బెలారస్ వెళ్లాల్సి ఉండగా వెళ్లకుండా రష్యాలోని ఉన్నారు. ఈ సందర్బంగా యెవ్గేనీ ప్రిగోజిన్ మాట్లాడుతూ మేము చేసింది ప్రభుత్వంపై తిరుగుబాటు కాదని సైనిక బృందాలకు, నాయకులకు న్యాయం చేయమని ప్రభుత్వానికి తెలియజేసాం అంతేనని వివరణ ఇచ్చారు. ఇది కూడా చదవండి: బుద్ధి మారలేదు.. జైలు తప్పలేదు.. -
యుద్ధంలో కీలక పరిణామం..ఉక్రెయిన్ కమాండర్లు విడుదల..
క్యీవ్: శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టర్కీలో ఉన్న వారి తమ కమాండర్లు ఐదుగురిని విడిపించి తిరిగి సొంత దేశానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో టర్కీ ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని క్రెమ్లిన్ వర్గాలు మండిపడుతున్నాయి. మారియోపోల్ వీరులు.. వీరంతా రష్యా ఆక్రమించుకున్న అతిపెద్ద ప్రాంతం మారియోపోల్ రక్షణ శాఖకు నాయకత్వం వహించారు. అక్కడ రష్యాతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడినా కూడా ఫలితం లేకపోయింది. హోరాహోరీగా సాగిన యుద్ధంలో రష్యా పైచేయి సాధించి మారియోపోల్ ను ఆక్రమించుకుంది. ఒప్పందంపై టర్కీకి.. దీంతో అనేకమంది ఉక్రెయిన్ సైనికులు అజోవ్ త్సవ్ స్టీల్ ప్లాంటు కింద సొరంగంలో దాక్కున్నారు. గతేడాది మేలో ఉక్రెయిన్ వీరిని లొంగిపొమ్మని ఆదేశించడంతో వీరంతా రష్యా దళాలకు లొంగిపోయి బందీలుగా వెళ్లారు. సెప్టెంబరులో వీరిని అంకారాకు బదిలీ చేస్తూ యుద్ధం ముగిసే వరకు విడిచి పెట్టవద్దని ఖైదీల మార్పిడి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టర్కీ అధ్యక్షుడితో చర్చలు జరిపి అనంతరం సింహాలుగా పిలవబడే ఈ ఐదుగురు కమాండర్లను ఉక్రెయిన్‌కు తిరిగి రప్పించారు. అనంతరం జెలెన్స్కీ టర్కీ అధ్యక్షుడికి కృతఙ్ఞతలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని ఉల్లంఘించి వీరిని విడిచిపెట్టడం అనైతికమని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ టర్కీపై త్రీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. 🇺🇦🤝🇺🇦🇹🇷 — On Today, July 8, 2023, in a surprise announcement, #Ukrainian President Volodomyr #Zelenskyy stated that following his visit to the #Turkish Republic, where he met with Turkish President #Erdogan, all leaders of the Ukraine's #Azov Regiment whom fought during the… pic.twitter.com/i3bJuDSXJd — 🔥🗞The Informant (@theinformantofc) July 8, 2023 ఇది కూడా చదవండి: మా నిర్ణయంలో తప్పులేదు.. ఉక్రెయిన్‌కు సాయంపై బైడెన్ -
స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామం
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 500వ రోజుకు చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం స్నేక్ ఐల్యాండ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్నేక్ ఐల్యాండ్ విముక్తికి పోరాడిన ఉక్రెయిన్ సైనికులను సన్మానించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామమన్నారు. ఆక్రమణకు గురైన ప్రతి అంగుళాన్ని తిరిగి స్వా«దీనం చేసుకుంటామనేందుకు ఈ ఘటనే ప్రబల తార్కాణమని వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఏరోజు రికార్డయిందో తెలియలేదు. జెలెన్స్కీ శనివారం తుర్కియేలో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా బలగాలు ఈ ఐల్యాండ్‌ను ఆక్రమించుకోగా ఉక్రెయిన్ జూన్ 30న తిరిగి స్వా«దీనం చేసుకుంది. కాగా, లీమాన్ పట్టణంలో శనివారం రష్యా రాకెట్ దాడిలో ఎనిమిది మంది మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. -
మాస్కోపై డ్రోన్ల దాడి యత్నం భగ్నం.. ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా
మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం డ్రోన్లను ప్రయోగించిందా? నిజమేనని చెబుతోంది రష్యా వైమానిక దళం. ఉక్రెయిన్ ప్రయత్నాన్ని భగ్నం చేశామని వెల్లడించింది. ఉక్రెయిన్ సైన్యం మంగళవారం ఐదు డ్రోన్లు ప్రయోగించిందని, వెంటనే ఈ విషయం గుర్తించి మాస్కోలో ఒక విమానాశ్రయాన్ని మూసివేశామని రష్యా ఆర్మీ తెలియజేసింది. మరికొన్ని విమానాలను దారి మళ్లించామని పేర్కొంది. మాస్కోలో గతంలోనూ పలుమార్లు డ్రోన్ దాడులు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. రష్యా కిరాయి సైన్యమైన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు యత్నం విఫలమైన తర్వాత డ్రోన్‌తో దాడి చేసేందుకు ఉక్రెయిన్ ప్రయతి్నంచడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ సైన్యం ఐదు డ్రోన్లను ప్రయోగించగా, వాటిలో నాలుగింటిని కూల్చివేశామని, మరో డ్రోన్‌ను సురక్షితంగా కిందికి దింపామని రష్యా రక్షణ శాఖ తెలియజేసింది. ఈ దాడులతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని మాస్కో మేయర్ సెర్గీ సొబ్యానిన్ చెప్పారు. అయితే, ఈ వ్యవహారంపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. -
..మాటి మాటికి మా పాత్రలేదు అంటుంటేనే అనుమానం వస్తుంది సార్!
..మాటి మాటికి మా పాత్రలేదు అంటుంటేనే అనుమానం వస్తుంది సార్! -
ఉక్రెయిన్ రెస్టారెంట్‌పై రష్యా క్షిపణి దాడి
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లో పాపులర్ పిజ్జా రెస్టారెంట్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 11 మంది మరణించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో మరో 61 మందికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఇదే పెద్దది. అయితే ఈ క్షిపణి రెస్టారెంట్ వైపు వెళ్లేలా ప్రయోగించడానికి ఉక్రెయిన్‌కు చెందిన ఒక వ్యక్తి రష్యా మిలటరీకి సాయం చేశాడన్న ఆరోపణలపై ఉక్రెయిన్ అధికారులు ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. రష్యాలో ప్రైవేటు సైన్యం వాగ్నర్ సంస్థ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు తర్వాత రాజకీయంగా, మిలటరీ పరంగా అంతర్గత సంక్షోభం ఉన్నప్పటికీ ఆ దేశం ఉక్రెయిన్‌పై ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. -
‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు
వాషింగ్టన్: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ప్రైవేట్ సైన్యం ‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ అధిపతి డేవిడ్ పేట్రాయస్ హెచ్చరించారు. తెరిచి ఉన్న కిటికీల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రిగోజిన్‌కు సూచించారు. గతంలో పుతిన్ ప్రత్యర్థులు చాలామంది ఇలా తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడి మరణించారని పేట్రాయస్ పరోక్షంగా తెలియజేశారు. తిరుగుబాటు చర్య నుంచి వెనక్కి తగ్గడం ద్వారా ప్రిగోజిన్ ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడుకున్నాడని, కానీ వాగ్నర్ గ్రూప్‌ను పోగొట్టుకున్నాడని అభిప్రాయపడ్డారు. రష్యా అధికార పీఠం పెత్తనాన్ని ప్రశ్నించినవారు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. సోవియట్ కూటమిలోనూ, ఆ తర్వాత రష్యాలోనూ ఇలాంటి మరణాలు సంభవించాయి. కిటికీల నుంచి కింద పడిపోయి చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. తనపై తిరుగుబాటు చేసిన వారిని పుతిన్ అంత సులభంగా వదిలిపెట్టబోరని ఆయన గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. ప్రిగోజిన్ ప్రస్తుతం బెలారస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అక్కడ సురక్షితంగా ఉంటారా? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. -
ప్రవాసంలోకి ప్రిగోజిన్
మాస్కో: రష్యాలో ప్రైవేటు సైన్యం తిరుగుబాటు ముగిసింది. సైనిక నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసి కొద్ది గంటల సేపు అల్లకల్లోలం సృష్టించిన ప్రైవేటు సైన్యం సంస్థ వాగ్నర్ చీఫ్ యెవెగినీ ప్రిగోజిన్ వెనక్కి తిరిగారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉన్న బెలారస్‌కు ప్రవాసం వెళ్లాలని ప్రయాణమయ్యారు. అయితే ఆయన బెలారస్ చేరుకున్నారో లేదో అన్న దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సైనికులంతా ఎక్కడివారు అక్కడికే ఉక్రెయిన్ శిబిరాల్లోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. బెలారస్ అధ్యక్షుడు మధ్యవర్తిత్వంతో ఈ సంక్షోభం టీ కప్పులో తుపానులా సమసిపోయింది. ఒప్పందం ప్రకారం ప్రిగోజిన్‌పై పెట్టిన కేసులన్నింటినీ వెనక్కి తీసుకున్నట్టు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ప్రిగోజిన్‌తో పాటు తిరుగుబాటులో పాల్గొన్న వాగ్నర్ సైనికులపై ఎలాంటి విచారణ జరపబోమని స్పష్టం చేసింది. వాగ్నర్ సైనికుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో సైన్యంలోకి తీసుకుంటామని రష్యా రక్షణ శాఖ ఆఫర్ ఇచి్చంది. రక్తపాతం వద్దు అనే.. ప్రిగోజిన్‌ను దేశద్రోహి, వెన్నుపోటుదారుడు అని అభివరి్ణంచిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనూహ్యంగా ప్రిగోజిన్, అతని సైన్యాన్ని వదిలేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకవైపు ఉక్రెయిన్‌తో పూర్తి స్థాయి లో తలబడలేక అంతర్జాతీయంగా ఉన్న పరువును పోగొట్టుకున్న పుతిన్ ఇప్పుడు అంతర్గత సంక్షోభాలను తట్టుకునే స్థితిలో లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘దేశంలో రక్తపాతం జరగకుండా చూడాలని, అంతర్గత పోరు కొనసాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న ఆందోళన కూడా ఆయనల ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ ఎంత బలహీనంగా మారిపోయారంటే ఎలాంటి రిస్క్ చేయలేకపోతున్నారు’’అనే విశ్లేషణలు వినబడుతున్నాయి. మరోవైపు తిరుగుబాటు జరిగిన మర్నాడే రష్యా విదేశాంగ శాఖ ఉప మంత్రి ఆండ్రూ చైనా పర్యటనకు వెళ్లారు. చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌తో తాజా పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు చైనా మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. రష్యా రక్షణ వ్యవస్థపై నీలినీడలు ప్రిగోజిన్ తిరుగుబాటుతో రష్యా రక్షణ వ్యవస్థలో ఉన్న డొల్లతనం బయటపడింది. వాగ్నర్ గ్రూప్ సైనికులు రాత్రికి రాత్రి కొన్ని గంటల వ్యవధిలో రోస్తావో నగరంలోకి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశించారు. ప్రభుత్వ సైనికులతో ఘర్షణలు చెలరేగాయి. ఈ సమయంలో వాగ్నర్ సైనికులు చేసిన దాడుల్లో 39 మంది పైలెట్లు మరణించినట్లు తెలుస్తోంది. అమెరికాకి ముందే తెలుసు రష్యాపై ప్రిగోజిన్ తిరుగుబాటు చేస్తారని అమెరికా నిఘా సంస్థలు ముందే పసిగట్టాయని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలు ప్రచురించాయి. జూన్ మధ్యలో ప్రిగోజిన్ రష్యాపై తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా నిఘా సంస్థలకు సమాచారం అందింది. వారం క్రితం నిర్ధారణగా తెలిసింది. తిరుగుబాటుకు ఒక్క రోజు ముందే రష్యాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని అమెరికా ప్రభుత్వానికి నిఘా సంస్థలు నివేదిక ఇచ్చాయి. పుతిన్‌కు ఒకరోజు ముందే తిరుగుబాటు విషయం తెలుసని అమెరికా మీడియా అంటోంది. రష్యాలో పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అధినేతలతో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. తమ మద్దతు ఎప్పటికీ ఉక్రెయిన్‌కే ఉంటుందని పునరుద్ఘాటించారు. రష్యాలో తిరుగుబాటు జరిగినంత మాత్రాన తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. -
గర్జించిన చెఫ్
ఉక్రెయిన్ సహా వివిధ దేశాల మిలటరీ ఆపరేషన్లలో రష్యా అధినేత పుతిన్‌కు అండదండగా ఉన్న ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ హఠాత్తుగా రష్యన్ సైన్యంపై తిరుగుబాటు చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రలోవాగ్నర్ సంస్థకి తగిన గుర్తింపు రాలేదు. గుర్తింపు అంతా రక్షణ మంత్రి షొయిగు కొట్టేస్తున్నారని రగిలిపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉక్రెయిన్‌లో డొనెట్స్క్ ప్రాంతంలో సొలెడార్‌ను ఆక్రమించడంలో వాగ్నర్ సైనికులు ప్రాణాలు పణంగా పెడితే రష్యా రక్షణ శాఖ దానిని తమ ప్రతిభగా ప్రచారం చేసుకోవడం ప్రిగోజిన్ సహించలేకపోయారు. ఉక్రెయిన్‌లో ఇతర నగరాలు స్వా«దీనం చేసుకోవడానికి తాను సైన్యాన్ని సిద్ధం చేసినప్పటికీ రష్యా టాప్ జనరల్ వలెరి గెరసిమోవ్ మారణాయుధాల్ని సరఫరా చేయడంలో విఫలం కావడం కూడా ఆయనని అసహనానికి లోను చేసింది. రక్షణ మంత్రి షొయిగు ఆదేశాల మేరకు వాగ్నర్ సంస్థ సైనిక శిబిరాలపై జరిగిన దాడుల్లో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తిరుగుబాటుకు సిద్ధమయ్యానని ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల్లో ఆగ్రహంతో ఊగిపోతూ చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా సమరి్థంచుకునే స్థితిలో లేదని అందుకే మిలటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వారి్నంగ్ ఇచ్చారు. ‘యుద్ధం అవసరం ఉంది. అందుకే సెర్గీ మార్షల్ అయ్యారు. ఆయన రెండో హీరోగా పతకాలు అందుకోవచ్చు. కానీ ఉక్రెయిన్ నిస్సైనీకరణ కు యుద్ధం అవసరం లేదు’అని ప్రిగోజిన్ చెబుతున్నారు. తాను చేస్తున్నది సైనిక తిరుగుబాటు కాదు, న్యాయ పోరాటమన్నది ప్రిగోజిన్ వాదనగా ఉంది. ఎవరీ ప్రిగోజిన్? ఒకప్పుడు అధ్యక్షుడు పుతిన్ దగ్గర చెఫ్. విదేశీ ప్రముఖులు ఎవరైనా వస్తే స్వయంగా గరిటె పట్టి వండి వడ్డించేవారు. ఇప్పుడు తుపాకీ పట్టుకొని ఎదురు తిరుగుతున్నారు. ఒక రెస్టారెంట్‌తో మొదలైన ఆయన ప్రయాణం ఒక దేశంపైనే తిరుగుబాటు చేసే స్థాయికి ఎదిగింది. ► 1961 జూన్ 1న లెనిన్గ్రాడ్ (ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్)లో జని్మంచారు. ► టీనేజీలోనే దొంగతనాలు, దోపిడీలు చేసి 13 ఏళ్లపాటు జైల్లో ఉండి 1990లో బయటకు వచ్చాడు. ► జైలు నుంచి బయటకి వచ్చాక ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు. ధనికులు ఉండే ప్రాంతంలో ఒక రెస్టారెంట్ ప్రారంభించారు. ► సంపన్నులతో పరిచయాలు పెంచుకొని వ్యాపారంలో ఎదిగారు. ► ప్రిగోజిన్‌కు చెందిన ఒక రెస్టారెంట్‌కు పుతిన్ వస్తూ ఉండడంతో ఆయనతో పరిచయమైంది. ఆ తర్వాత ప్రొగోజిన్ జీవితమే మారిపోయింది. ► అప్పట్లో రష్యా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పుతిన్ ద్వారా రష్యా ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందుల్ని ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ లభించింది. ► 2001లో పుతిన్ అధ్యక్షుడయ్యాక ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాలల్లో ఫుడ్ కాంట్రాక్ట్‌లు కూడా ప్రిగోజిన్కే దక్కాయి. అధికారంలో ఉన్న వారితో ఎలా మెలగాలో ప్రిగోజిన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ► 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ రష్యాలో పర్యటించి విందుని ఆస్వాదించాక ప్రిగోజిన్‌ను ‘పుతిన్ చెఫ్’అని పిలిచారు. అప్పట్నుంచి అదే పేరు స్థిరపడింది. ► రష్యా సందర్శనకు విదేశీ ప్రముఖులు ఎవరు వచి్చనా పుతిన్‌తో వారు దిగిన ఫొటోల్లో ప్రొగోజిన్ తప్పనిసరిగా కనిపించేవారు. ఆతిథ్య రంగంలో కోట్లాది రూపాయల కాంట్రాక్ట్‌లు అతని సొంతమయ్యాయి. ► 2012లో ప్రభుత్వ స్కూళ్లకు కేటరింగ్ నడపడం కోసమే 105 కోట్ల రూబుల్స్ కాంట్రాక్ట్ దక్కింది. ► అలా వచి్చన డబ్బులతో ప్రిగోజిన్ వాగ్నర్ అనే కిరాయి సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ► మొదట్లో వాగ్నర్ సంస్థ తనదేనని ఆయన బాహాటంగా చెప్పుకోలేదు. చిట్టచివరికి 2021లో వాగ్నర్ సంస్థ తనదేనని అంగీకరించారు. ► 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించింది ప్రొగోజిన్ అనే అనుమానాలున్నాయి. అప్పట్నుంచి అమెరికా అతనిపై నిషేధం విధించింది. వాగ్నర్ సంస్థ ఏం చేస్తుందంటే..? ► 2014లో క్రిమియాని ఆక్రమించాలని పుతిన్ ప్రణాళికలు సిద్ధం చేసినప్పుడు యెవ్గెనీ ప్రిగోజిన్‌తో తానే ఈ సంస్థను ఏర్పాటు చేయించారన్న ప్రచారమైతే ఉంది. ► క్రిమియా ఆక్రమణలో తమ చేతికి మట్టి అంటకుండా ఉండడానికే ఈ ప్రైవేటు సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దింపారన్న ప్రచారం ఉంది. ► రష్యాలో ప్రైవేటు సైన్యం చట్ట విరుద్ధం. అయినప్పటికీ రష్యా రక్షణ శాఖ కిరాయి సైన్యాన్ని చూసి చూడనట్టుగా వదిలేసేది. ► క్రిమియా తర్వాత తూర్పు ఉక్రెయిన్‌లో దాన్బాస్లో రష్యా అనుకూల వర్గానికి మద్దతుగా పని చేసి ఆ ఆపరేషన్‌లో విజయం సాధించింది.అలా వాగ్నర్ కార్యకలాపాలు విస్తరించాయి. ► సిరియాలో రష్యా అనుకూల బషర్ అల్ అసాద్ ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలకంగా వ్యవహరించింది. ► లిబియా, మొజాంబిక్, మాలి, సూడాన్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వెనెజులా ఇలా ఎక్కడ ఘర్షణలు అట్టుడికినా రష్యా జోక్యం ఉంటే అక్కడ తప్పకుండా వాగ్నర్ గ్రూప్ ప్రత్యక్షమయ్యేది. ► ఓ రకంగా వాగ్నర్ పుతిన్‌కు చెందిన కిరాయి సైన్య#గామారింది. ► ఈ గ్రూపులో మాజీ సైనికులే సభ్యులుగా ఉంటారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ లెక్కల ప్రకారం ఈ గ్రూపులో 60 వేల మంది సైనికులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకం ఏడాదిన్నర క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టినప్పట్నుంచి వార్నర్ సైనికులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రెండు వారాల్లో నెగ్గేస్తామన్న పుతిన్ భ్రమలు తొలగిపోవడంతో వాగ్నర్ సైనికులు మరింత దూకుడుగా ముందుకెళ్లారు. ప్రొగోజిన్ వారు తన సైనికులేనంటూ బహిరంగంగా అంగీకరించడమే కాకుండా యుద్ధాన్ని ముమ్మరం చేశారు. ౖ ఖైదీలను సైనికులుగా చేర్చుకున్నారు. ఈ యుద్ధంలో సంస్థకు చెందిన 50 వేల మంది పాల్గొన్నారు. కీలక నగరాల స్వా«దీనంలో వీరే ముందున్నారు. బఖ్ముత్æ కోసం జరిగిన పోరులో 20 వేల మంది మరణించారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
సంక్షోభంలో రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌పై ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్న రష్యా అనూహ్య పరిణామాలతో అంతర్గత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ప్రైవేటు సైనిక సంస్థ వాగ్నర్ శుక్రవారం రాత్రికి రాత్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలి్చవేస్తామని వాగ్నర్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ గర్జించారు. తమ సంస్థకు చెందిన బలగాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులకు దిగుతోందని అందుకే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని ప్రధాన నగరమైన రోస్తోవ్ దాన్ తమ అధీనంలోనే ఉందని ఆయన ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగును లక్ష్యంగా చేసుకుంటూ పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తమ సంస్థపై సెర్గీ దాడులు చేయిస్తున్నారని ఆయనను విడిచిపెట్టబోమంటూ ఆగ్రహావేశాలతో వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత అంతరంగికుడైన ప్రిగోజిన్ ఈ తిరుగుబాటుకు పాల్పడడాన్ని ప్రభుత్వంలో ఎవరూ జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలతో రష్యాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రిగోజిన్‌ను నిలువరించడానికి తన సొంత దేశంలోనే రష్యన్ మిలటరీ దాడులకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కల్లోల పరిస్థితుల మధ్య ఏది వాస్తవమో , ఏది కాదో అన్న గందరగోళం కూడా ఏర్పడింది. ఒకానొక దశలో రష్యా అద్యక్షుడు పుతిన్ మాస్కో విడిచి పరారయ్యారన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే అందులో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రిగోజిన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు పుతిన్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ తిరుగుబాటుపై జాతినుద్దేశించిన ప్రసంగించిన పుతిన్ ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని, వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తిరుగుబాటు చేసిన వారందరినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో బలగాలను, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని, ఎలా ముందుకు వెళ్లాలో ఆదేశాలిచ్చామని చెప్పారు. రష్యా ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సరీ్వస్ ప్రిగోజిన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. పుతిన్ తప్పు చేశారు : ప్రిగోజిన్ పుతిన్ ప్రసంగం అనంతరం ప్రిగోజిన్ మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తమను దేశద్రోహులమని పేర్కొని పుతిన్ అతి పెద్ద తప్పు చేశారన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పోరాటం చేసిన తామే అసలు సిసలు దేశభక్తులమని అన్నారు. తాము ప్రభుత్వానికి లొంగి పోయే స్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 25వేల మంది సైన్యంతో తిరుగుబాటు ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఉన్న వాగ్నర్ సైనికుల్ని వెనక్కి రప్పించిన ప్రిగోజిన్ రోస్తోవ్ దాన్ నగరంలోసైనిక ప్రధాన కార్యాలయం, ఇతర సైనిక స్థావరాలను తమ అ«దీనంలోకి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. నగరంలో మిలటరీ వాహనాలు, ట్యాంకుల్ని మోహరించిన వీడియోలు కూడా విడుదల చేశారు. ఒక్క తుపాకీ తూటా పేలకుండానే తాము మిలటరీ కార్యాలయాన్ని స్వా«దీనం చేసుకున్నామని ప్రిగోజిన్ చెప్పారు. రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, మిలటరీ జనరల్ గెరాసిమోవ్ రోస్తోవ్లోని మిలటరీ కార్యాలయంలో తనతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే రాజధాని మాస్కోని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాగ్నర్ సంస్థకు చెందిన దాదాపుగా 25 వేల మంది సైనికులు మాస్కోదిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది. మాస్కోకి దక్షిణంఆ 360 కి.మీ. దూరంలోని లిపె్టక్ ప్రావిన్స్‌లో వాగ్నర్ బలగాలు, ఇతర ఆయుధాల్ని మోహరించినట్టుగా ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని లిపె్టక్ ప్రావిన్స్ గవర్నర్ ఇగోర్ అర్టమోనోవ్ కూడా ధ్రువీకరించారు. వాగ్నర్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ సేనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజల భద్రతకు ఎలాంటి ప్రమాదమూ లేదని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున జనం గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు మాస్కో ప్రాంత గవర్నర్ తెలిపారు. విద్యా సంస్థలను జులై ఒకటి దాకా మూసివేసినట్లు తెలుస్తోంది. తాత్కాలిక విరమణ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో మధ్యవర్తిత్వంతో శనివారం రాత్రికల్లా ఇరువర్గాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. మాస్కో దిశగా వెళుతున్న వాగ్నర్ గ్రూపు సైనికులను ఆగిపోవాల్సిందిగా యెవ్గెనీ ప్రిగోజిన్ ఆదేశాలు ఇచ్చారు. రష్యన్ల రక్తం చిందకూడదనే ఉద్దేశంతోనే మాస్కో దిశగా ముందంజ వేయడాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లోని తమ స్థావరాలకు మళ్లాల్సిందిగా తమ బలగాలకు ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. వాగ్నర్ గ్రూపు సైనికుల రక్షణకు పుతిన్ నుంచి హామీ లభించిందని మధ్యవర్తిత్వం వహించిన లుకశెంకో ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి బలహీనంగా రష్యా : జెలెన్స్కీ రష్యాలో అంతర్గత సంక్షోభంతో ఆ దేశం పూర్తి స్థాయిలో బలహీనపడిపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. చెడు మార్గాన్ని అనుసరించే వారందరూ తమను తామే నాశనం చేసుకుంటారన్నారు. ‘‘చాలా కాలంగా రష్యా తన బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న వారి మూర్ఖత్వాన్ని దాచిపెడుతూ వస్తోంది. ఇక ఏదీ దాచి ఉంచలేరు. అబద్ధాలు చెప్పలేరు. రష్యా తమ సైన్యాన్ని దళాలు, కిరాయి సైన్యం ఉక్రెయిన్‌లో ఎంత కాలం ఉంచుతుందో అంత ఎక్కువ బాధను ఆ దేశం కూడా ఎదుర్కొంటుంది’’ అని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
రష్యాకు భారత్, చైనా ఆశాకిరణాలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక ఆంక్షలకు గురైన రష్యాకి, మిత్ర దేశాలైన భారత్, చైనా చేదోడుగా నిలుస్తున్నాయి. మే నెలలో రష్యా ఎగుమతి చేసిన చమురులో 80 శాతం ఈ రెండు దేశాలే కొనుగోలు చేసినట్టు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ప్రకటించింది. ‘‘మార్కెట్ కంటే తక్కువకు వచ్చే రష్యా చమురు కొనుగోలుకు ఆసియాలో కొత్త కొనుగోలుదారులు లభించారు. భారత్ రోజువారీ కొనుగోళ్లు 2 మిలియన్ బ్యారెళ్లకు మించింది. చైనా రోజువారీ కొనుగోళ్లను 0.5 మిలియన్ బ్యారెళ్ల నుంచి 2.2 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది’’అని ఐఈఏ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. మే నెలలో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా 45 శాతం సమకూర్చగా, చైనాలో ఇది 20 శాతంగా ఉన్నట్టు వివరించింది. రష్యా సముద్రపు ముడి చమురులో 90 శాతం ఆసియాకు వెళ్లిందని, యుద్ధానికి ముందు ఇది 34 శాతంగా ఉండేదని వివరించింది. ‘‘ఏప్రిల్ నెలతో పోలిస్తే భారత్ మే నెలలో 14 శాతం అధికంగా చమురుని రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. మే నెల మొదటి మూడు వారాల్లో సగటు రష్యా చమురు బ్యారెల్ 26 డాలర్లుగా ఉంది’’ అని వివరించింది. భారత్ జీడీపీ 4.8 శాతం భారత్ జీడీపీ 2023 సంవత్సరంలో 4.8 శాతం వృద్ధి సాధిస్తుందని ఐఈఏ అంచనా వేసింది. 2024లో ఇది 6.3 శాతానికి చేరుతుందని, తదుపరి 2025 నుంచి 2028 మధ్య 7 శాతంగా ఉంటుందని పేర్కొంది. జనాభా పెరుగుదుల, మధ్య తరగతి విస్తరణ సానుకూలమని భావించింది. ప్రపంచ చమురు వినియోగ డిమాండ్‌లో చైనాను భారత్ 2027లో వెనక్కి నెట్టేస్తుందని అంచనా వేసింది. -
Russia-Ukraine war: ఒడెసాపై ఆగని రష్యా క్రూయిజ్ దాడులు
కీవ్: రణనినాదంతో రంకెలేస్తూ ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దూకిన రష్యా సైన్యం ఒడెసా నగరంపై క్రూయిజ్ క్షిపణి దాడులతో దండెత్తింది. డజన్ల కొద్దీ భవనాలను ధ్వంసం చేసింది. వీటిలో పలు క్షిపణులను ఉక్రెయిన్ దళాలు విజయవంతంగా అడ్డుకుని నేలకూల్చాయి. కానీ రష్యా దాడిలో ఒడెసాలో గిడ్డంగి కూలడంతో అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ఇళ్లు, దుకాణాలు, కేఫ్‌లు ధ్వంసమయ్యాయి. 13 మందికి గాయాలయ్యాయి. కుప్పకూలిన గిడ్డంగి శిథిలాల కింద ఎవరైనా బతికిఉంటారనే ఆశతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రమటోర్క్, కోస్టియాన్టినీవ్కా సిటీలపైనా రష్యా దాడులు చేసింది. క్రమటోర్క్లో ఇద్దరు పౌరులు చనిపోగా 29 ఇళ్లు కూలిపోయాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కోస్టియాన్టినీవ్కాలో ఒకరు చనిపోయారు. 57 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 16 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా మళ్లీ వైమానిక దాడులను పెంచిందని ఉక్రెయిన్ సైన్యం అధికార ప్రతినిధి బుధవారం చెప్పారు. -
రష్యా ఆక్రమణ నుంచి 4 గ్రామాలకు విముక్తి
కీవ్: రష్యా ఆక్రమణలోని మరో గ్రామాన్ని తిరిగి తాము స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. డొనెట్స్క్ ప్రాంతంలోని మూడు గ్రామాలు స్వాధీనమైనట్లు ఆదివారం ప్రకటించింది. సోమవారం సొరొఝొవ్ అనే గ్రామంపై ఉక్రెయిన్ పతాకం మళ్లీ ఎగిరిందని రక్షణ శాఖ పేర్కొంది. ఇవన్నీ కుగ్రామాలేనని సమాచారం. అయితే, ఉక్రెయిన్ బలగాలు ఆక్రమిత ప్రాంతాల్లోకి మరింత ముందుకు చొచ్చుకుపోయేందుకు ఈ స్వల్ప విజయాలే అవకాశం కల్పిస్తాయని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామంపై రష్యా స్పందించలేదు. రష్యా మిలటరీ బ్లాగర్లు మాత్రం.. ఉక్రెయిన్ పేర్కొంటున్న నాలుగు గ్రామాల నుంచి రష్యా బలగాలు ఉపసంహరించుకున్నాయని ప్రకటించారు. జెపొరిజియా తదితర ప్రాంతాల్లో ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగుతోందని చెబుతున్నారు. ఇన్నాళ్ల యుద్ధంలో ఉక్రెయిన్‌లోని ఐదో వంతు భాగం రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. -
కొనసాగుతున్న భీకర పోరు
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఖేర్సన్ దక్షిణ ప్రాంతం, జపోరిజియా పరిధిలో రష్యా సేనలు స్వీయ రక్షణలో పడ్డాయని ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. ఇరాన్ తయారీ షాహీద్ డ్రోన్లు, క్షిపణులు, శతఘ్ని, మోర్టార్ దాడులు పెరిగాయని ఉక్రెయిన్ తెలిపింది. పలు చోట్ల జరిగిన దాడుల్లో శనివారం నలుగురు మరణించారని వెల్లడించింది. ఒడెసాలోని నౌకాశ్రయం వద్ద జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. 24 మంది గాయపడ్డారు. 20కిపైగా షాహీద్ డ్రోన్లు, ఎనిమిది క్షిపణులను కూల్చేశామని ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్కేంద్రం జపోరిజియా న్యూక్లియర్పవర్ ప్లాంట్‌లో చివరి రియాక్టర్‌ను అధికారులు షట్‌డౌన్ చేశారు. ప్లాంట్ సమీపంలో బాంబుదాడుల బెడద ఎక్కువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్రెయిన్ అణుఇంథన సంస్థ ఎనర్జియాటమ్ తెలిపింది. కేంద్రక విచ్ఛిత్తి చర్య, అత్యధిక ఉష్ణోద్భవం, పీడనాలను ఆపేందుకు ఆరింటిలో చిట్టచివరిదైన ఐదో రియాక్టర్లో కూలింగ్ రాడ్లను కోర్లోకి దింపేశామని తెలిపింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థకు సరఫరా చేసే విద్యుత్ లైన్లు దాడుల కారణంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్లాంట్ నుంచి బయటకు విద్యుత్ సరఫరా అసాధ్యం. రియాక్టర్ షట్డౌన్కు ఇదీ ఒక కారణమేనని ఎనర్జియాటమ్ వివరించింది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించాక ప్లాంట్ నిర్వహణ బాధ్యత రష్యా చేతికొచ్చింది. మరోవైపు కఖోవ్కా డ్యామ్ పేల్చివేతతో వరదమయమైన ఖేర్సన్లో ఇంకా నీరు 4.5 మీటర్ల ఎత్తులో నిలిచే ఉంది. ఈ వారంలో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముంపు ప్రజలకు సహాయక చర్యలకు విఘాతం కలగొచ్చని ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ హెచ్చరించారు. దాదాపు 7 లక్షల మంది తాగునీటి కోసం అల్లాడుతున్నారని ఐక్యరాజ్యసమితి సహాయక విభాగం అధిపతి మార్టిన్ ఆందోళన వ్యక్తంచేశారు. -
Russia-Ukraine war: ఆగని కన్నీటి వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): నీపర్ నదిపై కఖోవ్కా డ్యామ్ పేలుడుతో కొత్త మలుపు తీసుకున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో జనం కష్టాలు మరింత పెరిగాయి. ఇన్నాళ్లూ బాంబుల మోతతో బంకర్లతో, భూగర్భ గృహాల్లో తలదాచుకున్న జనం ఇప్పుడు అవన్నీ జలమయం కావడంతో పొట్టచేతపట్టుకుని ప్రాణభయంతో పరుగుపెడుతున్నారు. యుద్ధంలో శత్రుదేశ సైన్యం సంహారం కోసం జనావాసాలకు దూరంగా పూడ్చిపెట్టిన మందుపాతరలు వరదప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి. ఆ వరదనీరు జనావాసాలను ముంచెత్తడంతో అవి ఇప్పుడు జనావాసాల్లో ఎక్కడికి కొట్టుకొచ్చి ఆగాయో, ఎప్పుడు పేలుతాయోనన్న భయం జనాలను వెంటాడుతోంది. నీటితో నిండిన నోవా కఖోవ్కా నగరంలో కొంతభాగం రష్యా అధీనంలో మరికొంత భాగం ఉక్రెయిన్ అధీనంలో ఉంది. తమ అధీన నగర ప్రాంతంలో ఐదుగురు చనిపోయారని రష్యా నియమిత మేయర్ వ్లాదిమిర్ గురువారం చెప్పారు. మరికొందరి జాడ గల్లంతైంది. స్థానికుల తరలింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. తాగునీరు కరువై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్, మొబైల్ ఫోన్ నెట్వర్క్ పూర్తిగా పోయిందని అధికారులు చెప్పారు. నష్టపరిహారం ఇవ్వండి: జెలెన్స్కీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ‘రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతవాసులకు వరద నష్టపరిహారం చెల్లించాలి. ఆస్తులు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సాయం అందించాలి’ అని తర్వాత ఆయన కార్యాలయం ఆన్లైన్లో ఒక డిమాండ్ పంపింది. ‘600 చదరపు కిలోమీటర్ల భూభాగం నీటమునిగింది. ఇక్కడ ఏకంగా 18 అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. 14,000కుపైగా భవనాలు నీటమునిగాయి. 4,000కుపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు పంపాం’ అని రష్యా నియమిత ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ చెప్పారు. నీపర్ నది తూర్పు పరివాహక ప్రాంతంలో మూడింట రెండొంతుల భూభాగం ర్రష్యా ఆక్రమణలో ఉంది. ఇది విధ్వంసకర దాడే: మేక్రాన్ ‘డ్యామ్‌ను కూల్చేయడం ముమ్మాటికీ విధ్వంసకర దాడే. అరాచక చర్య ఇది’ అని ఏ దేశాన్నీ ప్రస్తావించకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్వీట్‌చేశారు. వాటర్ ప్యూరిఫయర్లు, 5,00,000 ప్యూరిఫికేషన్ టాబ్లెట్లు, శుభ్రతా కిట్లు పంపిస్తున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. ‘డ్యామ్ కూలడానికి మూడు రోజుల ముందు 200 సైనిక వాహనాలు, 2,000 మంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్ ఆ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు డ్యామ్‌ను ఉక్రెయినే కూల్చింది’ అని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆరోపించారు. -
ఉక్రెయిన్ను ముంచెత్తిన వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా దురాక్రమణకు దిగాక ఇన్నాళ్లూ బాంబుదాడులకు భయపడి ప్రాణాలు అరచేత పట్టుకుని వలసపోయిన జనం ఇప్పుడు వరదరూపంలో వచ్చిన జలఖడ్గం దాటికి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీపర్ నదీ ప్రవాహంపై నిర్మించిన కఖోవ్కా ఆనకట్ట, జలవిద్యుత్ ప్లాంట్‌పై బాంబుల వర్షం నేపథ్యంలో డ్యామ్ బద్దలై వరదనీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలు జలమయమయ్యాయి. కొందరు ఇళ్లపైకి ఎక్కి అక్కడే గడిపారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ మొదలుపెట్టి స్థానిక పాలనా యంత్రాంగాలు పౌరులను వేరే చోట్లకు హుటాహుటిన తరలిస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ఆవిష్కతమయ్యాయి. దొరికింది తీసుకెళ్తూ ఏదో ఒకదాంట్లో వలసపోతూ.. చేతికందినంత నిత్యావసర వస్తువులు తీసుకుని మిలటరీ ట్రక్కులు, రాఫ్ట్‌లపై ఎక్కి జనం ఓవైపు వలసపోతుంటే శతఘ్ని పేలుళ్ల చప్పుళ్లతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఇంకొందరు బస్సుల్లో, రైళ్లలో వెళ్లిపోయారు. డ్యామ్ కుప్పకూలి 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దాడికి కారకులు ఎవరో తెలియరాలేదు. మీరంటే మీరని ఉక్రెయిన్, రష్యాలు పరస్పర దూషణలు మాత్రం ఆపట్లేవు. కొంతకాలంగా రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న ఈ డ్యామ్ పరిసరాల్లో తరచూ బాంబు దాడులు జరుగుతున్నాయి. రణక్షేత్రంగా మారిన ఈ ప్రాంతంపై ఇరుపక్షాల్లో ఒకరు పొరపాటున భారీ దాడి చేసిఉంటారని, నిర్లక్ష్యం కూడా అయి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగకుండా వస్తున్న వరదనీటితో దిగువ ప్రాంతాల్లో వచ్చే 20 గంటల్లో మరో మూడు అడుగులమేర నీరు నిలుస్తుందని అధికారుల ఆందోళన వ్యక్తంచేశారు. విస్తారమైన ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రిజర్వాయర్లలో కఖోవ్కా డ్యామ్ కూడా ఒకటి. గత ఏడాది రష్యా ఆక్రమించిన ఖేర్సన్ ప్రాంతంలోనే ఈ డ్యామ్ ఉంది. ఖేర్సన్ సిటీకి కేవలం 44 మైళ్లదూరంలో ఈ డ్యామ్ ఉండటంతో ఇప్పటికే వరదనీరు సిటీలోకి ప్రవేశించింది. వరదనీటి మట్టం పెరిగితే ఖేర్సన్కు కష్టాలు పెరుగుతాయి. డ్యామ్ పూర్తిగా పాడవలేదని, ఇంకా చాలా నీరు నిల్వ ఉందని, కొద్దిరోజుల్లో మొత్తం డ్యామ్ నేలమట్టమైతే మరో దఫా వరద ఖాయమని బ్రిటన్ రక్షణ శాఖ తన తాజా అప్డేట్లో పేర్కొంది. ఈ శాఖ తరచూ యుద్ధసమాచారాన్ని అందరితో పంచుకుంటోంది. తాగేందుకు నీరే లేదు: జెలెన్స్కీ ‘కుట్ర పన్ని రష్యా ఈ డ్యామ్‌ను నేలమట్టం చేసింది. వేలాది మంది ప్రజలకు కనీసం తాగు నీరు లేకుండా పోయింది’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టెలిగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ఇది రష్యా పనే: అమెరికా మేథో సంస్థ ‘నీపర్ దిగువ ప్రాంతాలను వరదమయం చేస్తే రష్యాకే మేలు. ఉక్రెయిన్ సేనలు మళ్లీ ఆప్రాంతాలను చేజిక్కించుకోకుండా ఆలస్యం చేయడం రష్యా ఎత్తుగడ. అందుకే తమకు కొంచెం నష్టం జరుగుతుందని తెల్సికూడా ఇలా డ్యామ్‌ను పేల్చేసింది’ అని రక్షణ, విదేశీవ్యవహారాల విశ్లేషణ మేథోసంస్థ, అమెరికాకు చెందిన లాభాపేక్షలేని ‘స్టడీ ఆఫ్ వార్’ వ్యాఖ్యానించింది. పొంచి ఉన్న ధరాఘాతం గోధుమలు, బార్లీ, పొద్దుతిరుగుడు నూనె, ఇతర ఆహార ఉత్పత్తుల్ని భారీ స్థాయిలో పండిస్తూ ప్రపంచ ఆహార అవసరాలు తీర్చడంలో ఉక్రెయిన్ కీలక భూమిక పోషిస్తోంది. డ్యామ్ వరదనీటితో పంట నష్టం వాటిల్లి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు తగ్గి డిమాండ్ పెరిగి ధరలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంది. డ్యామ్ కూలిన ఈ కొద్ది గంటల్లోనే గోధుమ ధరలు 3 శాతం ఎగబాకాయి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలోని కొన్ని దేశాలు ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తులపై ఆధారపడు తున్నాయి. డ్యామ్ కూల్చివేత కారణంగా కలిగే నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని రష్యా, ఉక్రెయిన్, ఐక్యరాజ్యసమితి అధికారులు చెబుతున్నారు. డ్యామ్‌ను బాగుచేసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలంటే ఈ యుద్ధతరుణంలో ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. -
చరిత్ర క్షమించని మహా నేరం
కొన్ని సంఘటనలు సమకాలీన చరిత్రను మలుపు తిప్పుతాయి. అనూహ్య పరిణామాలకు ఆరంభమవుతాయి. ఉక్రెయిన్‌లో సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో మంగళవారం నాటి ఘటన అలాంటిది. దక్షిణ ఉక్రెయిన్‌లో నిప్రో నదిపై ఉన్న కీలకమైన నోవా కఖోవ్కా ఆనకట్ట పాక్షికంగా పేల్చివేతకు గురై, ఆ పక్కనే ఉన్న అణువిద్యుత్కేంద్రం ముప్పులో పడ్డ ఘటనతో ప్రపంచం ఉలిక్కిపడింది. రష్యా సాగించిన జీవావరణ తీవ్రవాద చర్య ఇది అని ఉక్రెయిన్ నిందిస్తుంటే, ఇది పూర్తిగా ఉక్రెయిన్ విద్రోహచర్య అని రష్యా ఆరోపిస్తోంది. ఈ నిందారోపణల్లో నిజానిజాలు ఏమైనా, ప్రపంచంలోనే అత్యధిక జలసామర్థ్యం ఉన్న డ్యామ్‌లలో ఒకటైన ఈ ఆనకట్టపై పడ్డ దెబ్బతో నీళ్ళు ఊళ్ళను ముంచెత్తి, వేల మంది ఇల్లూవాకిలి పోగొట్టుకున్నారు. లక్షలాది గొడ్డూగోదా సహా జనం తాగేందుకు గుక్కెడు నీరైనా లేక ఇక్కట్లలో పడ్డారు. అన్నిటికన్నా మించి ఉక్రెయిన్ ఇప్పుడు అణుప్రమాదం అంచున ఉందనే ఆందోళన కలుగుతోంది. ఈ డ్యామ్ పరిసర ప్రాంతాలు రష్యా నియంత్రణలోనే ఉన్నాయి. కానీ, డ్యామ్ ధ్వంసంలో తన పాత్ర లేదనేది రష్యా మాట. అది అంత తేలిగ్గా నమ్మలేం. ఇటీవల సరిహద్దు ఆవల నుంచి రష్యా భూభాగంపై దాడులు చేస్తూ, డ్రోన్లతో దెబ్బ తీస్తూ ఉక్రెయిన్ వేడి పెంచింది. ప్రతిగా రష్యా ఇప్పుడు శత్రుదేశం దృష్టిని మరల్చి, సుస్థిరతను దెబ్బతీసే ఎత్తుగడ వేసిందని ఓ వాదన. ఉక్రెయిన్‌కూ, ఆ ప్రాంతంలో వ్యవసాయానికీ కీలకమైన 5 అతి పెద్ద ఆనకట్టల్లో ఒకదానికి భారీ గండి పడేలా చేయడం అందులో భాగమే కావచ్చు. వ్యవసాయ, తాగునీటి అవసరాలకు కీలకమైన ఆనకట్టను ధ్వంసం చేసుకోవడం వల్ల ఉక్రెయిన్‌కు వచ్చే లాభమేమీ లేదు. నిజానికి, మునుపటి దాడుల్లో ఆనకట్ట నిర్మాణం బలహీనపడి ఉండవచ్చు. ఆ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న రష్యా ఆక్రమణదారులు రిజర్వాయర్‌లో నీళ్ళు అసాధారణ స్థాయికి చేరినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఉండవచ్చు. ఆ నిర్లక్ష్యం ఫలితమే ఇప్పుడీ డ్యామ్ విధ్వంసమనేది ఒక కథనం. ఉక్రెయిన్ దళాలు దాడులు పెంచిన మర్నాడే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. శత్రువును వరదలతో ముంచెత్తడమూ తమ ఆయుధమేనంటూ గతంలో మాస్కో తన ఆలోచనను బయట పెట్టిన సంగతీ మర్చిపోలేం. దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా, ఉక్రెయిన్ సేనలను విడదీస్తున్న నిప్రో నదిపై ఈ ఆనకట్ట ఉంది. ఆహార ధాన్యాలు అధికంగా పండించే దక్షిణ మధ్య ఉక్రెయిన్‌లోని మెట్ట భూములకు సాగునీరు, రష్యా ఆక్రమిత క్రిమియా సహా అనేక భారీ నగరాలకు తాగునీరు ఈ రిజర్వాయరే అందిస్తుంది. నది దాటి ఇవతలకు వచ్చేందుకు యుద్ధంలో వ్యూహాత్మకంగానూ ఇది కీలకమైనదే. అందుకే, ఈ విధ్వంసం మానసిక పోరుకు మించినది. రిజర్వాయర్‌లో నీళ్ళన్నీ ఖాళీ అయితే పక్కనే జపొరీషియా అణువిద్యుత్కేంద్రానికి తగినంత నీటి సరఫరా జరగదు. ఇప్పటికే అందులో ఆరు రియాక్టర్లను మూసివేశారు కాబట్టి, చల్లబరిచేందుకు పొరుగునే ఉన్న కొలను నీరు సరిపోవచ్చు. అయినా సరే, ఆ అణువిద్యుత్కేంద్రాన్ని యుద్ధంలో అస్త్రంగా వాడరని చెప్పలేం. మరమ్మతులకు కనీసం అయిదేళ్ళు పట్టే ఈ ఆనకట్ట విధ్వంసం వల్ల దీర్ఘకాలిక మానవ, పర్యావరణ సంక్షోభం, సైనిక పర్యవసానాలూ తప్పవు. నదీగర్భంలో మిగిలిన చెర్నోబిల్ ప్రమాదం నాటి అణు వ్యర్థాలు వరదలతో మళ్ళీ పైకొచ్చే ప్రమాదమూ పొంచి ఉంది. నిజానికి, ఈ డ్యామ్‌పై దాడికి దిగకుండా రష్యాను హెచ్చరించాలనీ, దాడి జరిగితే అది అతి పెద్ద విపత్తుగా పరిణమిస్తుందనీ గత అక్టోబర్‌లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు. డ్యామ్‌లో రష్యా సేనలు పేలుడు పదార్థాలు ఉంచాయని అప్పట్లో ఆయన అనుమానించారు. ఇప్పుడు డ్యామ్ విధ్వంసంతో ఏడాది పైచిలుకుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం మరింత సంక్లిష్టం కానుందని తేలిపోయింది. అలాగని ఉక్రెయిన్ సైతం తక్కువ తినలేదు. రష్యా నుంచి జర్మనీకి వెళ్ళే కీలకమైన నార్డ్ స్ట్రీమ్ సహజవాయు పైప్లైన్లపై నీటిలో పేలుళ్ళ ద్వారా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ బృందం దాడులు చేసింది. ఆ సంగతి అంతకు మూడు నెలల ముందే అమెరికా గూఢచర్య సంస్థకు తెలుసని తాజాగా బయటపడింది. అప్పట్లో సహజవాయు పైప్లైన్లు, ఇప్పుడు భారీ ఆనకట్ట... పరస్పర విధ్వంసంలో పైచేయి కోసం తపిస్తున్న రష్యా, ఉక్రెయిన్లు ఇలా ఎంత దాకా వెళతాయో! యుద్ధం ఎవరిదైనా, అందులో ఎవరి చేయి పైనా కిందా అయినా – చివరకు నష్టపోయేది ప్రజలే. యుద్ధం సాకుతో సాధారణ పౌరుల పైన, కీలకమైన ప్రాథమిక వసతి సౌకర్యాల పైన దాడులు ఏ రకంగానూ సమర్థనీయం కావు. అంతర్జాతీయ మానవతావాద చట్ట ఉల్లంఘనలుగా ఇవన్నీ యుద్ధ నేరాల కిందకే వస్తాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి అభ్యర్థించినట్టు ఇలాంటి దాడులు ఆగాలి. అంతర్జాతీయ చట్టాన్ని అంతా గౌరవించాలి. ఇప్పటికైనా రష్యా, ఉక్రెయిన్లు రెండూ ఈ నియమాలు పాటించడం అవసరం. ఇక, ఆనకట్ట విధ్వంసంతో డ్యామ్ నుంచి కనీసం 150 మెట్రిక్ టన్నుల చమురు లీకైందని పర్యావరణ మంత్రి మాట. పర్యావరణ రీత్యా ఆ ప్రాంతం కోలు కోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని నిపుణుల విశ్లేషణ. గత కొన్ని దశాబ్దాల్లో ఐరోపాలో అతి పెద్ద మానవ కల్పిత పర్యావరణ విపత్తు ఇదేనంటున్నది అందుకే! విషాదం ఏమిటంటే, 1986లో చెర్నోబిల్ అణుప్రమాదం బారిన పడ్డ గడ్డపైనే మళ్ళీ ఇలాంటి మహా విపత్తు సంభవించడం! అదీ మానవత మరిచిన యుద్ధంలో మనిషి చేజేతులా చేసింది కావడం! ఇది చరిత్ర క్షమించని మహా యుద్ధనేరం. మానవాళికి మరో శాపం. -
కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సైన్యం మరోసారి విరుచుకుపడింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. రష్యా సైన్యం ప్రయోగించిన 11 బాలిస్టక్, క్రూయిజ్ క్షిపణులను తాము కూల్చివేశామని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రకటించారు. వాటి శకలాలు నగరంలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిపోయాయని, దట్టమైన పొగ కమ్ముకుందని చెప్పారు. రష్యా దాడుల్లో కీవ్‌లో ఒకరు గాయపడినట్లు సమాచారం. రష్యా సేనలు తొలుత ఆదివారం రాత్రి దాడులు ప్రారంభించాయి. జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో తలదాచుకున్నారు. కొంత విరామం తర్వాత సోమవారం ఉదయం మళ్లీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రష్యా క్షిపణి దాడుల నేపథ్యంలో చిన్నారులు భయాందోళనలతో బాంబు షెల్టర్ వైపు పరుగులు తీస్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని లాంగ్–రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్ పోస్టులు, రాడార్లు, ఆయుధాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. కీవ్‌లో క్షిపణుల దాడి భయంతో మెట్రో స్టేషన్లో దాక్కున్న స్థానికులు -
ఉక్రెయిన్ క్లినిక్‌పై క్షిపణి దాడి..
ఉక్రెయిన్‌లోని క్లినిక్‌లపై శుక్రవారం రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, సుమారు 30కి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ జెనీవా ఒప్పందాల ప్రకారం.. ఈ దాడిని తీవ్రమైన యుద్ధ నేరంగా పేర్కొంది. యుద్ధంలో సైనికులు, పౌరుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది రష్యా అనేదానికి ఇది చక్కని ఉదాహరణ. అందుకు సంబంధించి వీడియో ఫుటేజ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ధ్వంసమైన భవనం నుంచి పొగలు వస్తున్నట్లు కనిపించాయి. మూడంతస్థుల సదరు భవనం పైఅంతస్థుల పూర్తిగా దెబ్బతింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్విట్టర్ వేదికగా దుష్ట దేశం మాత్రమే ఇలా క్లినిక్‌లపై దాడి చేస్తుంది. ఇందులో సైనిక ప్రయోజనం ఉండదు. ఇది నిజంగా రష్యన్ టెర్రర్. మానవత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధ నేరం అని జెలెన్స్కీ మండిపడ్డారు. ఇదిలా ఉండగా క్షిపణి దాడికి ముందు ఈ క్లినిక్‌లో ఇద్దరు పిల్లల తోసహా 30 మంది ఈ భవనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే సరిగ్గా అదే సమయంలో 69 ఏళ్ల వ్యక్తి ఈ క్లినిక్‌ని దాటుతుండగా హత్యకు గురయ్యాడని, శిథిలాల నుంచి మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసినట్లు ప్రాంతీయ గవర్నర్ సెర్హి లైసాక్ పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్ మందుగుండు సామాగ్రి డిపోలపై రాత్రిపూట దాడి చేసినట్లు రష్యా మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. అంతేగాదు దక్షిణ రష్యాలో ఉక్రెయిన్ రాకెట్, డ్రోన్లతో దాడి చేసిందని పేర్కొంది. అందువల్లే తాము క్షిపణి దాడి చేసినట్లు రష్యా పేర్కొంది. పైగా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలను కూడా తోసిపుచ్చుతోంది రష్య. కానీ ఉక్రెయిన్ మాత్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్ తూర్పు ప్రాంతంలో రష్యా సుమారు 10 క్షిపణులు, 20కి పైగా డ్రోన్లు కూల్చివేసినట్లు పేర్కొనడం గమనార్హం. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: ఏం చేయాలో మా బలగాలకు తెలుసు! ఉక్రెయిన్ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్) -
ఏం చేయాలో మా బలగాలకు తెలుసు! ఉక్రెయిన్ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్
ఉక్రెయిన్‌లో హత్యల జాబితాలో రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ నంబర్ వన్ అని, అతను కిల్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడంటూ ఉక్రెయిన్ మిలటరీ ఇంటిలిజెన్స్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు రష్యా ఘాటుగా స్పందించింది. మా భద్రత బలగాలకు ఏం చేయాలో తెలుసని వారి పనేంటో కూడా వారికి తెలుసు అంటూ కౌంటరిచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ హెడ్ వాడిమ్ స్కిబిట్క్సీ, ఓ పత్రిక ఇంటర్యూలో ఉక్రెయిన్.. పుతిన్‌ని చంపేయాలనుకుంటుదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసని, ఉక్రెయిన్ హత్యల జాబితాలో తాను అగ్రస్థానంలో ఉన్నానని పుతిన్‌కి కూడా తెలుసని అన్నారు. అతను చేస్తున్న చర్యలకు ఏదోఒక రోజు సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు. తాము అతన్ని సమీపిస్తున్నామని, తన సొంత వ్యక్తులచే చంపబడతాడనే భయం కూడా పుతిన్‌లో ఉందని స్కిబిట్స్కీ వ్యాఖ్యలు చేశాడు. అంతేగాదు తాము ఇతర రష్యన్లు లక్ష్యగా పెట్టుకున్నామని అందులో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, కిరాయి బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్, మిలిటరీ కమాండర్ సెర్గీ సురోవికిన్ తదితరులు ఉన్నారని చెప్పుకొచ్చాడు. పుతిన్ తన లక్ష్యం చేరుకోవడం అసాధ్యమని, చాలా సమయం తమ దళాలు రష్యాని నిలువరించాయిని స్కిబిట్స్కీ ధీమాగా చెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ విషయమై రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ని ఆరా తీసింది సదరు మీడియా. పుతిన్‌ను రక్షించే చర్యల ముమమ్మరం చేయనున్నారా అని పెస్కోవ్‌ని ప్రశ్నించింది. మమ్మల్ని నమ్మండి, మా భద్రత సేవలకు తాము ఏం చేయాలో తెలుసు, వారి పనేంటో కూడా తెలుసని సీరియస్ అయ్యారు. సరిగ్గా 15 నెలల క్రితం ఉక్రెయిన్‌లో రష్యా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రారంభించిన ఈ యుద్ధం సరైనదని స్కిబిట్స్కీ ఇంటర్యూ చెప్పకనే చెప్పిందని విమర్శించారు. ఒకరకంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ని సమర్థించబడటమే గాక అవసరమైన దానికంటే ఎక్కువ లక్ష్యాలను సాధించడం ద్వారా దాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు పెస్కోవ్. కాగా, ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు మాత్రం దీన్ని ఆక్రమణ యుద్ధంగా అభివర్ణిస్తున్నాయి. అంతేగాదు రష్యాపై జరిపిన డ్రోన్ దాడిని కూడా పుతిన్ చంపేందుకు ఉక్రెయిన్ పన్నిట కుట్రగా అభివర్ణించగా, కీవ్ మాత్రం ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం గమనార్హం. (చదవండి: రాకెన్ రోల్ క్వీన్ ఇకలేరు) -
20 వేలమందిని బఖ్‌ముత్‌లో కోల్పోయాం
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని బఖ్ముత్ నగరంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రైవేట్ సైన్యమైన ‘వాగ్నర్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ సేనలతో జరిగిన పోరాటంలో 20,000 మందికిపైగా సైనికులను కోల్పోయామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా ప్రభుత్వం ఖైదీలకు, వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నవారికి కొంత శిక్షణ ఇచ్చి, ప్రైవేట్ సైన్యంగా మార్చి, ఉక్రెయిన్‌లో యుద్ధ రంగానికి పంపిస్తున్న సంగతి తెలిసిందే. బఖ్‌ముత్‌లో గత తొమ్మిది నెలలుగా సాగుతున్న హోరాహోరీ యుద్ధంలో ఉక్రెయిన్ జవాన్లు ఎంతమంది మరణించారన్నది తెలియరాలేదు. దీనిపై ఉక్రెయిన్ సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పది వేల మందికిపైగానే ఉక్రెయిన్ సైనికులు మరణించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రష్యాకు శిక్ష తప్పదు.. ఆ దేశంపై ఇక మరిన్ని ఆంక్షలు
హిరోషిమా/న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో మారణకాండ సాగిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు శిక్ష తప్పదని జి–7 దేశాల అధినేతలు హెచ్చరించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జి–7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కూటమి దేశాల అధినేతలు శుక్రవారం జపాన్‌లోని హిరోషిమాకు చేరుకున్నారు. అనంతరం సమాశమై, తాజా అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా చట్ట విరుద్ధమైన, న్యాయ విరుద్ధమైన యుద్ధం సాగిస్తోందని మండిపడ్డారు. రష్యాకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని జి–7 దేశాల నేతలు ప్రతిన బూనారు. రష్యా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని రష్యానే ముగించాలని అన్నారు. హిరోషిమాలోని శాంతి పార్కును వారు సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబు దాడిలో దెబ్బతిన్న డోమ్ వద్ద గ్రూప్ ఫొటోలు దిగారు. అక్కడ పుష్పగుచ్ఛాలు ఉంచి, అమర వీరులకు నివాళులర్పించారు. జి–7 శిఖరాగ్ర సదస్సుకు గుర్తుగా చెర్రీ మొక్కను నాటారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో రాజీలేదు: మోదీ సార్వభౌమత్వం, గౌరవాన్ని కాపాడుకొనే విషయంలో భారతదేశం పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉందని, ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో భారత్–చైనా సంబంధాలు మెరుగుపడడం అనేది కేవలం ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పారు. శుక్రవారం జపాన్ వార్తా సంస్థ ‘నిక్కీ ఆసియా’ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. పొరుగు దేశాలతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగడం తప్పనిసరి అని చెప్పారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకోవడానికి, చట్టబద్ద పాలనకు, వివాదాలకు శాంతియుత పరిష్కారం కనుగొనడానికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకుంటే ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతోందని వివరించారు. 2014లో ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. పాకిస్తాన్‌తో సాధారణ, ఇరుగుపొరుగు సంబంధాలను నరేంద్ర మోదీ కోరుకుంటున్నట్లు నిక్కీ ఆసియా వెల్లడించింది. చదవండి: ఎలిజబెత్ అంత్యక్రియలకు రూ.1,655 కోట్లు హిరోషిలో మోదీ జి–7, క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొనడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్‌లోని హిరోషిమా నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు జపాన్ సీనియర్ అధికారులు, భారత రాయబార కార్యాలయం అధికారులు స్వాగతం పలికారు. హిరోషిమాలో ల్యాండ్ అయ్యానంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఈ నెల 21 దాకా హిరోషిమాలో పర్యటిస్తారు. జి–7 సదస్సుతోపాటు వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. జపాన్ పర్యటనకు బయలుదేరేముందు ఢిల్లీలో మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘జి–20 కూటమికి ఈ ఏడాది భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో హిరోషిమాలో జి–7 దేశాల అధినేతలతో సమావేశమై, చర్చించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ప్రపంచ సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించబోతున్నాం’’ అన్నారు. సదస్సులో పాల్గొననున్న జెలెన్స్కీ జి–7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం పాల్గొనబోతున్నారు. ఆయన ఆదివారం సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ ఒలెక్సీ డానిలోవ్ నిర్ధారించారు. తమ దేశంలో నెలకొన్న అస్థిరతను పరిష్కరించడానికి తమ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారని, ఎవరినైనా కలుస్తారని చెప్పారు. -
ఉక్రెయిన్‌కు జర్మనీ భారీ సాయం
బెర్లిన్: ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంసక వ్యవస్థలు, మందుగుండు సామగ్రి సహా సుమారు రూ.24 వేల కోట్ల విలువైన అదనపు సైనిక సాయం అందించాలని జర్మనీ నిర్ణయించింది. ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో తాము నిజాయితీతో ఉన్నామని రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ తెలిపారు. రష్యాతో యుద్ధం మొదలయ్యాక మొట్ట మొదటిసారిగా జెలెన్స్కీ ఆదివారం జర్మనీకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. రష్యా ఇంధనంపై ఆధారపడిన జర్మనీని ఉక్రెయిన్ మొదటి నుంచి అనుమానిస్తోంది. అయితే, ఎంజెలా మెర్కెల్ స్థానంలో ఒలాఫ్ షోల్జ్ చాన్సెలర్‌గా బాధ్యతలు చేపట్టాక ఉక్రెయిన్–జర్మనీల మధ్య సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. -
సంక్షోభం నేర్పుతున్న సన్నద్ధ పాఠం
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగడం భారత్‌కు సంకటంగా మారుతోంది. బ్రిక్స్, షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) వంటి ఏర్పాట్ల ద్వారా చైనా, రష్యా రెండింటితో సంబంధం కలిగి ఉండటం ఒక కారణం. క్వాడ్, మలబార్ గ్రూపింగ్ ద్వారా ఇంకోపక్క భారత్ అమెరికా తోనూ జట్టుకట్టింది. భారత్ ఏకకాలంలో అటు ఎస్సీఓ, ఇటు జీ20లకు అధ్యక్ష స్థానాన్ని నిభాయిస్తూండటం చెప్పుకోవాల్సిన అంశం. వ్యూహాత్మకంగా స్వతంత్రంగా ఉంటూనే ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలంటే భారత్ చాలా దార్శనికతతో వ్యవహరించాలి. వాణిజ్యం, వ్యాపారం, దౌత్యం అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సమన్వయం ద్వారా మిలిటరీ టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రకంపనలు ప్రపంచం నలుమూలలా వినిపిస్తున్నాయి. యుద్ధం తాలూకూ దుష్ప్రభావం కేవలం రాజకీయాలకు, ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితం కాలేదు. అన్నిచోట్లా సామన్యుడిని సైతం ఇబ్బందిపెట్టే స్థాయికి ఈ యుద్ధం చేరుకుంది. గోధుమలు,వంటనూనెలు, ఎరువుల విషయంలో ఉక్రెయిన్ తిరుగులేని స్థానంలో ఉంది. ముడిచమురు, సహజవాయువుల్లో రష్యా పెత్తనం గురించి చెప్పనక్కర్లేదు. వీటన్నింటికీ ఏర్పడ్డ కొరత స్టాక్‌మార్కెట్లను కూల్చే స్తూంటే... పెరిగిపోతున్న ధరలు, ప్రజల్లోని అసంతృప్త రాజకీయ ఉద్యమాలను ప్రేరేపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అణ్వాయుధ ప్రయోగం గురించి మాట్లాడటం ద్వారా ప్రపంచాన్ని మూడో ప్రపంచయుద్ధం ముంగిట్లో నిలబెట్టారు. తన నిర్లక్ష్య ధోరణితో విపరీతమైన ఆస్తి నష్టానికీ కారణమయ్యారు. రష్యాపై విధించిన ఆంక్షలు ప్రపంచీకరణ ప్రక్రియను నిలిపేశాయని అనలేము. కానీ ఆహారం, ఇంధనం, సరు కులు, ఆయుధాల కోసం దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టడంతో కూటముల పునరేకీకరణ, భిన్న ధ్రువాల ఏర్పాటు మొదలైందని చెప్పాలి. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి దారితీసిన కారణాలపై చర్చలు అంతులేనంతగా సాగవచ్చు. దీనికి ముఖ్యంగా రెండు ముఖా లైతే కనిపిస్తున్నాయి. మొదటగా చెప్పుకొనే పుతిన్ వాదన గురించి చూద్దాం. ఉక్రెయిన్ అనే దేశం అసలు అస్తిత్వంలోనే లేదంటాడు పుతిన్ . ఎందుకయ్యా అంటే, ‘‘అది రష్యా చరిత్ర, సంస్కృతి, ఆధ్యా త్మికతల్లో అవిభాజ్యమైన భాగం’’ అన్న సమాధానం వినిపిస్తోంది. ఇలాంటి వాదనలు ఇతరులపై తమ పెత్తనమే చెల్లాలని కోరుకునే చోట్ల వినిపిస్తూంటాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా చెప్పు కొనే ‘నైన్ డాష్ లైన్ ’ మాదిరిగా! లేదా చైనా అక్సాయ్‌చిన్ ఆక్రమణ, అరుణాచల్‌ప్రదేశ్ తమదని నిస్సిగ్గుగా చెప్పుకోవడం ఉదాహరణ లుగా పేర్కొనవచ్చు. ఇంకో పక్క అమెరికా, యూరప్ విశ్వాసరహితంగా వ్యవహరి స్తున్నాయని పుతిన్ ఆరోపిస్తున్నారు. నాటో దళాలు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలవని గతంలో యూఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు గోర్బచేవ్‌కు ఇచ్చిన మాటను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ మాట ఇచ్చిన పదేళ్లలోనే నాటో వార్సా ఒప్పందంలో భాగమైన పది దేశాలకు సభ్యత్వం ఇచ్చి మాట తప్పిన ఆరోపణలున్నాయి. తాజాగా ఫిన్లాండ్కూ చోటు దక్కడంతో 31 దేశాలతో నాటో బలంగా తయారైనట్లు కనిపిస్తోంది. దీంతో తాను బలహీనమవుతున్న భావన రష్యాకు కలుగుతోంది. ఈ విషయాలెలా ఉన్నా, ఓ సార్వభౌమ దేశంపై ఏకపక్ష దాడిని రష్యా ఏ రకంగానూ సమర్థించుకోలేదు. అదే సమయంలో పాశ్చాత్య దేశాలూ ఉక్రెయిన్ కు నిత్యం ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధం ఇంత సాగేలా చేయడం కూడా ఆక్షేపించదగ్గదే. భారత్‌కు సంకటం... ఉక్రెయిన్‌పై దాడి వ్యూహం బెడిసికొడుతున్న నేపథ్యంలో రష్యాకు ఇప్పుడు అత్యవసరంగా స్నేహితుల అవసరం ఏర్పడుతోంది. ఈ అవసరాన్ని కాస్తా చైనా తీర్చింది. షీ జిన్ పింగ్ ఇప్పుడు పక్కాగా రష్యా వైపు నిలబడ్డారని చెప్పవచ్చు. ఫలితంగా ఇకపై చైనాకు రష్యా నుంచి ఆటంకాలు ఎదురుకాకపోవచ్చు. అయితే ఈ క్రమంలో రష్యా కాస్తా చైనా గుప్పిట్లో చిక్కుకునే అవకాశం ఉందా! అదే జరిగితే రష్యా ఇప్పటివరకూ పలు దేశాలతో, మరీ ముఖ్యంగా భారత్‌తో స్వతంత్రంగా నడుపుతున్న సంబంధాలపై చైనా ప్రభావం పడుతుంది. మిలిటరీ అవసరాలను తీర్చే సామర్థ్యం తగ్గిపోయిన నేపథ్యంలో భారత విధాన రూపకర్తలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఇది. ఇటీవల పూంఛ్‌లో మిలిటరీ దళాలపై జరిగిన దాడి... పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ఇప్పటికీ ఉగ్రవాదానికి కలిసికట్టుగా ఊతమిస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. స్థిర నిర్ణయానికి సమయం ఇదే... రెండువైపుల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ ఒక స్థిర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. విధానా లతోపాటు ప్రాథమ్యాల పునః సమీక్ష అవసరం. దౌత్య సంబంధాల అజెండాలో టెక్నాలజీ సముపార్జనను కూడా భాగం చేయడం తక్షణ కర్తవ్యం. జపాన్ , ఆస్ట్రేలియాలతో కూడిన ‘క్వాడ్ అండ్ మలబార్ గ్రూపింగ్’ అనేది అమెరికా, భారత్ వ్యూహాత్మక అవసరాలు కలి యడం ఫలితంగా పుట్టుకొచ్చింది. మిలిటరీ, దౌత్య అవసరాలను తీర్చేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తున్నా ప్రభావం చాలా ఎక్కువే. చైనా తరచూ క్వాడ్‌ను ఉద్దేశించి బెదిరింపులకు దిగడం ఈ గ్రూపింగ్‌ను తన ఆధిపత్య ప్రణాళికలకు గండి కొట్టేదిగా చూడటమే కారణం. అయితే చైనా బెదిరింపులకు కౌంటర్ ఇచ్చే విషయంలో అమెరికా మినహాయించి మిగిలిన దేశాలు తట పటాయించాయి. తమ గ్రూపింగ్ వల్ల భద్రతాపరమైన ప్రభావాలేవీ ఉండవనీ, తమది ‘ఆసియా నాటో’ కూటమి కాదనీ చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ పరిస్థితిని మార్చి, పదును పెరిగేలా భారత్ చొరవ తీసుకోవాలి. ఈ విషయంలో అమెరికా చేపట్టిన రెండు పనుల గురించి ప్రస్తావించాలి. 2021 సెప్టెంబరులో ఆస్ట్రేలియా, యూకే, అమెరికా కలిసి త్రైపాక్షిక భద్రత ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం అమెరికా, బ్రిటన్ రెండూ ఆస్ట్రేలియాతో అత్యాధునిక టెక్నాలజీలను పంచుకుంటాయి. అణ్వస్త్ర సామర్థ్యమున్న జలాంతర్గామిని పొందే విషయంలో కూడా సాయం అందిస్తాయి. యూకే, అమెరికా అణు జలాంతర్గాములను ఆస్ట్రేలియాలో మోహరించడంతోపాటు అణ్వా యుధాల విషయంలో ఆస్ట్రేలియా సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకూ ఏర్పాట్లు జరిగాయి. ఆశ్చర్యకరంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ అణు జలాంతర్గాముల విషయంలో భారత్‌కు అమెరికా ఇలాంటి సౌకర్యాలేవీ కల్పించడం లేదు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, చారిత్రాత్మక పౌర అణు ఒప్పందం వంటివేవీ అక్కరకు రాలేదు. అయితే అమెరికా 2022 మే నెలలో ‘క్రిటికల్ ఇంజినీరింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది మనకు అనుకూలమైన ఫలితా లేమైనా సాధిస్తుందా అన్నది వేచి చూడాలి. మనది అణ్వాయుధాలు కలిగిన దేశం. అంతరిక్ష రంగంలోనూ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మిలటరీ వ్యవస్థను కలిగి ఉంది. అయినా... మిలిటరీ విషయంలో మన ప్రయత్నాలు పూర్తిస్థాయిలో లేవనే చెప్పాలి. దిగుమతులపై ఆధారపడే దేశంగానే మిగిలిపోయాం. ఆత్మ నిర్భరత సాధించడం అనేది చాలా ఉదాత్తమైన లక్ష్యమే కానీ, ఒక్క టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నా చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. 1960లు మొదలుకొని ఇప్పటివరకూ ఆ దేశం ఏకైక లక్ష్యంతో పనిచేస్తోంది. రివర్స్ ఇంజి నీరింగ్, బెదిరింపులు, కొన్నిసార్లు దొంగతనాలకూ వెనుకాడకుండా యూఎస్ఎస్ఆర్, పాశ్చాత్య దేశాల నుంచి టెక్నాలజీలను సము పార్జించుకునే ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో ఒక్క మాట సుస్పష్టం. ఇకనైనా భారత్ వాణిజ్యం, వ్యాపారం, దౌత్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని సమీ కృత పద్ధతిలో ఇతర దేశాలతో వ్యవహరించడం అలవాటు చేసు కోవాలి. ఈ సమన్వయం ద్వారా మిలిటరీ టెక్నాలజీలను అందిపుచ్చు కునేందుకు ప్రయత్నించాలి. తద్వారా మాత్రమే భారత్ పూర్తిస్థాయిలో ఆత్మనిర్భరత సాధించగలదు. అరుణ్ ప్రకాశ్ వ్యాసకర్త భారత నావికాదళ విశ్రాంత ప్రధానాధికారి -
రష్యాపైనే యుద్ధం జరుగుతోంది.. పుతిన్ షాకింగ్ వ్యాఖ్యలు, అయినా తగ్గేదెలే!
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా తప్పక విజయం సాధిస్తుందని, తమ భవిష్యత్తు అంతా సైనికుల భుజస్కందాలపైనే ఆధారపడి ఉందని వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పుతిన్ మంగళవారం మాస్కోలోని రెడ్ స్క్వేర్ విక్టర్ డే పరేడ్‌లో మాట్లాడుతూ.. నేడు నాగరికత మళ్లీ నిర్ణయాత్మక మలుపులో ఉందని, తమ మాతృభూమిపైనే యుద్ధం జరుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. అనుభవజ్ఞులైన తన సాయుధ దళాలను ఉద్దేశించి.. రష్యా విజయం సాధించాలని పిలుపు నిచ్చారు. ప్రస్తుతం మీ పోరాట ప్రయత్నానికి మించినది ఏదీ లేదన్నారు. మొత్తం దేశం మీ వెంట ఉందని సైనికులకు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పుతిన్ పాశ్చాత్య గ్లోబలిస్ట్ ఎలైట్స్పై కూడా మండిపడ్డారు. వారంతా ప్రపంచ వ్యాప్తంగా విభేదాలు, తిరుగబాటులకు అంకురార్పణం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రష్యా దీనిని కచ్చితంగా అధిగమించగలదని, అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఐతే తాము అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టామని, తూర్పుఉక్రెయిన్ (డోన్బాస్) ప్రజలను రక్షించడమే గాక వారి భద్రత కూడా కల్పిస్తామన్నారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగి 15 నెలలు పూర్తి కావస్తున్న తరుణంలో నాజీలపై మాస్కో సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే సాంప్రదాయ సోవియట్ శైలి కార్యక్రమం తొలిసారిగా భద్రతా భయాల నడుమ జరిగింది. (చదవండి: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్) -
పిస్టల్ వాడటం తెలుసు!..అలా జరిగితే మృత్వువుతో పోరాడే వాడిని: జెలెన్స్కీ
ఉక్రెయిన్ కూడా రష్యాకు ధీటుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అదీగాక సైనికపరంగా, ఆయుధ సంపత్తి పరంగా అతి పెద్ద దేశమైన రష్యా చిన్న దేశమైన ఉక్రెయిన్‌ని నిలువరించలేకపోయింది. పైగా రష్యా దాడులను తనదైన శైలిలో తిప్పుకొడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది ఉక్రెయిన్. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీని ఓ మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. రాజధానీ కీవ్ ప్రధాన కార్యాలయంలపై రష్యన్లు దాడి చేసి ఉంటే మృత్యువుతో పోరాడే వాడినన్నారు. అయినా తనకు ఎలా కాల్చాలో తెలుసనని చెప్పారు. రష్యన్లు మిమ్మల్ని బందీగా తీసుకువెళ్తారేమోనని ఊహించగలరా? అని ప్రశ్నించగా..దాన్ని అవమానకరంగా భావిస్తానని అన్నారు. ఫిబ్రవరి 24, 2022న యుద్ధం ప్రారంభమైన తొలి రోజునే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రవేశించడానికి యత్నించాయని చెప్పారు. ఐతే వారు అధ్యక్ష కార్యాలయాలు ఉన్న సెంటర్లోని బంకోవా స్ట్రీట్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. ఒకవేళ వారు పరిపాలన విభాగాల్లోకి వచ్చి ఉంటే తాము అక్కడ ఉండలేకపోయే వాళ్లమన్నారు. పైగా బాంకోవా స్ట్రీట్‌ని చాలా కట్టుదిట్టమైన భ్రదతతో ఉంచామని ఖైదీలా బంధింపబడే అవకాశమే లేదని ధీమాగా చెప్పారు. మీరు పిస్టల్ని వాడటం ప్రాక్టీస్ చేస్తున్నారా? లేక బంధిపబడకుండా ఉండేలా మిమ్మిల్ని మీరు కాల్చుకోవడం కోసం ప్రాక్టీసు చేస్తున్నారా? అని మీడియా అడగగా..ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తనని కాల్చుకోవడానికి కాదని కాల్పులు జరపడానికేనని సమాధానమిచ్చారు జెలెన్స్కీ. (చదవండి: మహిళా సమాధులకు తాళలు..రీజన్ తెలిస్తే సిగ్గుతో తలదించుకోక తప్పదు..) -
క్రిమియా చమురు నిల్వకేంద్రంపై దాడులు
కీవ్: తొమ్మిదేళ్ల క్రితం రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ద్వీపకల్ప ప్రాంతం క్రిమియాపై శనివారం ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దీంతో క్రిమియాలోని తీరప్రాంత నగరం సెవస్తపోల్‌లోని చమురు నిల్వ కేంద్రానికి నిప్పు అంటుకుని అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ‘ఈ దాడి ఉక్రెయిన్ డ్రోన్ల పనే. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రస్తుతానికి ఒక్కచోట మాత్రమే మంటలు ఆర్పగలిగాం’ అని నగర గవర్నర్ మిఖాయిల్ రజవోజయేవ్ చెప్పారు. మరణాల వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రతిదాడి చేసి క్రిమియాను మళ్లీ ప్రధాన భూభాగంలో కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తామని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం, శుక్రవారమే 20 క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసి రష్యా 23 మంది పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయిల్ డిపోలో 10 ట్యాంకుల్లో అగ్గిరాజుకోవడం దేవుడు వేసిన శిక్ష అంటూ ఉక్రెయిన్ సైనిక నిఘా అధికార ప్రతినిధి ఆండ్రీ యుసోవ్ వ్యాఖ్యానించారు. కాగా, రష్యా అక్రమంగా విలీనం చేసుకున్న ఖేర్సన్ ప్రావిన్స్‌లోని నోవా కఖోవ్కా సిటీపైకి ఉక్రెయిన్ సేనలు భారీ స్థాయిలో కాల్పుల మోత మోగించాయి. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు: 22 మంది దుర్మరణం
కీవ్: రష్యా దాడుల్లో శుక్రవారం 22 మంది ఉక్రేనియన్లు దుర్మరణం పాలయ్యారు. ఉమాన్‌లో 9 అంతస్తుల నివాస భవనంపై క్షిపణి దాడిలో ముగ్గురు చిన్నారులతో పాటు 20 మంది చనిపోయారు. ఇప్పటిదాకా యుద్ధ చాయలు కనిపించని ఈ నగరంపై రష్యా తొలిసారి లాంగ్రేంజ్ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు 2 నెలల తర్వాత రాజధాని కీవ్‌లోని ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిగింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన 21 క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. నీప్రో నగరంలోని నివాస ప్రాంతాలపై రష్యా బలగాల దాడిలో రెండేళ్ల చిన్నారి, ఆమె తల్లి చనిపోగా మరో నలుగురు గాయపడినట్లు గవర్నర్ చెప్పారు. ఈ దాడులతో ఉద్దేశపూర్వకంగా బెదిరించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అంటుండగా తమ దీర్ఘ శ్రేణి క్షిపణులు లక్ష్యాలను ఛేదించినట్లు రష్యా చెబుతోంది. రష్యా ఆక్రమిత డొనెట్స్క్పై ఉక్రెయిన్ బలగాల రాకెట్ దాడిలో ఏడుగురు పౌరులు దుర్మరణం చెందినట్లు నగర మేయర్ చెప్పారు. -
ఉక్రెయిన్‌కు నాటో భారీ ఆయుధ సాయం
కీవ్: రష్యాపై ఎదురుదాడి ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు నాటో భారీ సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్‌కు 1,550 పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్‌కు ఇచ్చిన హామీల్లో 98% వరకు నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ–జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు చెందిన 30 వేల బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్ పైచేయిగా నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా ఉండగా, బుధ, గురువారాల్లో రష్యా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్ల దాడిలో ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.. కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల భవనాలు, 12 ప్రైవేట్ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి. -
రష్యాపై ఎందుకీ తటస్థ వైఖరి?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నాలు నిలిచిపోయాయి. ఒకప్పుడు ఉక్రెయిన్ అనుకూల వైఖరిని తీసుకున్న దేశాలు కూడా రష్యాకు అనుకూలంగానో, తటస్థంగానో మారిపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని అలీనోద్యమం నుంచి ప్రస్తుత జాగరూకత, తటస్థ వైఖరి ప్రభావితమయ్యాయి. తమ నిబంధనల మేరకు వ్యవహరించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ అలీనోద్యమం ఒక మార్గం కల్పించింది. నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ ప్రోత్సాహకాలు కూడా ఇందులో ప్రభావం చూపుతున్నాయి. అయితే, అలీన దేశాలకు మానవతా సాయం అందించాలన్న పాశ్చాత్య దేశాల నిబంధనల వెలుగులో ఈ తటస్థత అనేది ఒక ‘గమ్మత్తయిన సంతులన చర్య’గా మారుతోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది దాటిన తర్వాత, రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నాలు నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. చాలాదేశాలు తటస్థతను ఎంచుకోవడమే దీనికి కారణం. కొన్ని ఆధారాల ప్రకారం, రష్యాను ఖండిస్తున్న దేశాల సంఖ్య కూడా ప్రస్తుతం తగ్గిపోయింది. ఉక్రెయిన్ అనుకూల వైఖరి నుండి బోట్స్ వానా రష్యా పైవు మళ్లింది. దక్షిణాఫ్రికా, తటస్థత నుంచి రష్యా అనుకూల వైఖరి చూపుతోంది. రష్యా చర్యను ఖండించిన కొలంబియా ఇప్పుడు తటస్థ వైఖరి అవలంబిస్తోంది. అదే సమయంలో, చాలా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి అయిష్టత చూపుతున్నాయి. ఆఫ్రికాను తీసుకుందాం. మాస్కో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని ఆఫ్రికన్ యూనియన్ పిలుపునిస్తున్నప్పటికీ, అనేక ఆఫ్రికా ఖండ దేశాలు తటస్థంగానే ఉంటున్నాయి. ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి వామపక్ష అనుకూల ప్రభుత్వాల సంప్రదాయ ఫలితమేనని కొందరు పరిశీలకులు వాదిస్తు న్నారు. ఆఫ్రికా దేశాల అయిష్టతకు మూలం తమ అంతర్గత వ్యవహారాల్లో కొన్నిసార్లు రహస్యంగా, కొన్నిసార్లు బహిరంగంగా పాశ్చాత్య దేశాలు పాటించిన జోక్యందారీ చరిత్రలో ఉందని మరికొందరు చెబుతున్నారు. రష్యాను ఖండించడానికి అయిష్టత చూపడం అనేది ఆఫ్రికాను దాటిపోయింది. రష్యా బేషరతుగా, తక్షణం ఉక్రెయిన్ నుంచి వెళ్లి పోవాలంటూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని 2023 ఫిబ్రవరిలో లాటిన్ అమెరికన్ దేశాల్లో చాలావరకు బలపర్చాయి. ఉక్రెయిన్‌కి అనుకూలంగా ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలను బ్రెజిల్ బలపర్చినప్పటికీ, అది రష్యాను నిర్ద్వంద్వంగా ఖండించలేదు. ఐక్యరాజ్య సమితిలో బొలీవియా, క్యూబా, ఎల్ సాల్వడార్, వెనిజులా దేశాల వైఖరిని చూద్దాం. పాశ్చాత్య దేశాల ఆంక్షలను రష్యా తిప్పి కొట్టాలని అవి సూచించాయి. పైగా, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ దేశాలు ఉక్రెయిన్ కు సైనిక సహాయం చేయాలన్న పిలుపును తిరస్కరించాయి. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించాలని జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని మెక్సికో ప్రశ్నించింది. ఆసియాలోనూ ఇదే రకమైన విభజనలు కనిపిస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియా బహిరంగంగానే రష్యాను ఖండించాయి. కానీ ఆగ్నే యాసియా దేశాల కూటమి సామూహికంగా ఈ ఖండన చేయలేదు. ఇక చైనా విషయానికొస్తే – రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నెరుపుతూనే, ఐక్యరాజ్యసమితిలో పెరుగుతున్న తన ప్రాభవం ద్వారా సమతుల్యత సాధించేలా వ్యవహరిస్తోంది. భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశంగా ఉన్నప్పుడు, ఉక్రెయిన్ ఘర్షణపై జరిగిన ఓటింగుకు గైర్హాజరైంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని అలీనోద్యమం నుంచి ప్రస్తుత జాగరూకత, తటస్థ వైఖరి ప్రభావితమయ్యాయి. తమ నిబంధనల మేరకు ఘర్షణతో పోరాడటానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అలీనోద్యమం ఒక మార్గం కల్పించింది. అందువల్ల సోవియట్ యూనియన్, పాశ్చాత్య దేశాల ప్రభావ పరిధికి వెలుపల విదేశీ విధానంలో స్వయంప్రతిపత్తిని ఈ దేశాలు పొందగలిగాయి. యూరోపియన్ యూనియన్ వైఖరిని బలపర్చడంలో ఇతర దేశాల అయిష్టత అనేది విదేశీ విధాన స్వతంత్ర కాక్షకూ, పొరుగు దేశంతో విరోధం పెట్టుకోవడానికి అయిష్టతకూ సంబంధించినదిగా ఉంటోందని యూరోపియన్ యూనియన్ ఆంక్షల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమ దేశాలకూ, రష్యాకూ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లో చిక్కుకుపోకుండా ఉండటానికి అలీన విధానం ఆయా దేశాలకు ఉపకరిస్తోంది. ఈ కారణం వల్లే, అనేక ప్రజాస్వామిక దేశాలు తటస్థ వైఖరికి ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసా ‘ఇరుపక్షాలతో మాట్లాడండి’ అనడంలో దీన్నే మనం చూడవచ్చు. రష్యాను ఖండించ డానికి వ్యతిరేకంగా ఉండాలని దేశాలు నిర్ణయించుకోవడంలో నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ ప్రోత్సాహకాలు ప్రభావం చూపుతున్నాయి. ఇండియాకు పెరిగిన రష్యా చమురు ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో రష్యా, భారత్ ఒకే విధమైన వ్యూహాత్మక, రాజకీయ అభిప్రాయాలను పంచుకోవడం కొనసాగించాయని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. 2000 సంవత్సరంలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో బహుళ ధ్రువ గ్లోబల్ వ్యవస్థను నిర్మించాలన్నది రష్యా ఉద్దేశంగా ఉండింది. అమెరికాను భాగస్వామిగా చేసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండాలని భారతదేశాన్ని రష్యా అభ్యర్థించేది. అలాగే భారతీయ అణ్వాయుధ కార్యక్రమానికి రష్యా మద్దతునిచ్చింది, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా మారడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను రష్యా బలపరుస్తూ వచ్చింది. భారత్ ఆయుధ వాణిజ్యంలో రష్యా కీలక భాగస్వామిగా ఉండ టాన్ని రష్యా కొనసాగించింది. 1992 నుంచి 2021 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 65 శాతం వరకు రష్యా సరఫరా చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి, భారత్‌కు చౌక ధరకు చమురు అందించే కీలకమైన సరఫరాదారుగా రష్యా మారి పోయింది. 2021లో రష్యా నుంచి రోజుకు 50 వేల బ్యారెల్స్‌ను భారత్ కొనుగోలు చేయగా, 2022 జూన్ నాటికి అది రోజుకు పది లక్షల బ్యారెల్స్‌కు పెరిగింది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రయోజనాలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారుల్లో ఒక్కటిగా ఉన్న బ్రెజిల్ అత్యధిక ఎరువుల వినియోగదారు కూడా. 2021లో రష్యా నుంచి బ్రెజిల్ దిగుమతి చేసుకున్న దిగుమతుల విలువ 5.58 బిలియన్ డాలర్లు కాగా, వాటిలో 64 శాతం వాటా ఎరు వులదే. తమ రెండు దేశాల మధ్య ఇంధన సంబంధాలను విస్తరించుకోవడంలో భాగంగా రష్యా గ్యాస్ సంస్థ గాజ్ప్రోమ్ బ్రెజిల్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెడుతుందని 2023 ఫిబ్రవరిలో బ్రెజిల్ ప్రక టించింది. 2023 మార్చి నాటికి బ్రెజిల్‌కు రష్యా డీజిల్ ఎగుమతులు కొత్త రికార్డులను చేరుకున్నాయి. అదే సమయంలో రష్యన్ చమురు ఉత్పత్తులపై ఈయూ ఆంక్షలు కూడా పతాక స్థాయిని చేరుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సంద ర్భంలో– రష్యా, చైనాలతో కలిసి దక్షిణాఫ్రికా సంయుక్త నౌకా విన్యా సాలను చేపట్టింది. నౌకాదళ నిధుల లేమితో ఉన్న దక్షిణాఫ్రికా ఈ విన్యాసాల నుంచి ప్రయోజనం పొందుతుంది. ఆఫ్రికా ఖండానికి అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా రష్యా నిలుస్తోంది. అణుశక్తిని కూడా రష్యా సరఫరా చేస్తోంది. ఆఫ్రికా ఖండానికి 30 శాతం వరకు గోధుమ వంటి ధాన్యాలను కూడా రష్యా సరఫరా చేస్తోంది. రష్యా ఉత్పత్తుల్లో 70 శాతం వరకు ఆఫ్రికా ఖండానికి చేరుతున్నాయి. మరొక ప్రజాస్వామిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు మద్దతుగా నిలబడాలని అభ్యర్థనలు చేస్తున్నప్పటికీ, అలీన విధానం ఇప్పటికీ పాపులర్ ఎంపికగా కొనసాగుతోందని ఉక్రెయిన్ యుద్ధం ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ముఖ్యమైన రాజకీయ ఉనికిగా అలీన విధానం చాలాకాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇతర ఉదంతాలను చూస్తే, అధ్యక్షుడు జైర్ బొల్సొనారో హయాంలో ఇది మారినప్పటికీ, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే బ్రెజిల్ వంటి దేశాల సంప్రదాయ విధానంగా కొనసాగుతోంది. ప్రత్యేకించి అలీన దేశాల్లో చాలావాటికి ప్రత్యక్ష మదుపులు, అభివృద్ధి, మానవతా సహాయాన్ని అందించడం అనే పాశ్చాత్య నిబంధనల వెలుగులో చూస్తే ఇది విరుద్ధ ప్రయోజనాల ఘర్షణకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో తటస్థత అనేది ఒక ‘గమ్మత్తయిన సంతులన చర్య’గా మారుతోంది. జోస్ కబల్లెరో వ్యాసకర్త సీనియర్ ఆర్థికవేత్త (‘ద కాన్వర్సేషన్’ సౌజన్యంతో) -
మరోసారి ఆక్రమిత ఉక్రెయిన్‌లోకి పుతిన్
కీవ్: యుద్ధం మొదలై దాదాపు 13 నెలలు పూర్తవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించి తమ సైన్యం సన్నద్ధతను సమీక్షించారు. మొదట ఖేర్సన్ ప్రావిన్స్‌కు చేరుకున్న పుతిన్ అక్కడి రష్యా సేనల కమాండ్ పోస్ట్‌కు వెళ్లారు. తర్వాత లుహాన్సŠక్లోని రష్యన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఖేర్సన్, లుహాన్సŠక్లో సైనిక ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రష్యా అధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాల్లో పుతిన్ పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితమే ఆక్రమించాక ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, లుహాన్సŠక్, డోనెట్స్కŠ, జపోరిజియా ప్రావిన్స్‌లను స్థానిక ‘రెఫరెండమ్’ల ద్వారా గత సెప్టెంబర్‌లో రష్యా తనలో కలిపేసుకున్న విషయం తెల్సిందే. -
రష్యా రాక్షసకాండను సహించబోం.. శిక్ష తప్పదు.. జీ7 దేశాల హెచ్చరిక
టోక్యో: తైవాన్‌పై చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై జీ7 దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘తీరు మార్చుకుని అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు’’అని ఆ దేశాలను హెచ్చరించాయి. జీ7 దేశాలైన జపాన్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ విదేశాంగ మంత్రులు, అత్యున్నత ప్రతినిధుల మూడు రోజుల సదస్సు జపాన్‌లోని కరూయిజవాలో మంగళవారం ముగిసింది. చైనా, రష్యా, ఉత్తర కొరియాల కట్టడికి కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం మంత్రులు ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. రష్యాను దారికి తీసుకురావడమే లక్ష్యంగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించబోతున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాకు శిక్ష తప్పదన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా రాక్షసకాండను సహించబోమన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగుతుందన్నారు. చైనా, తైవాన్ మధ్య శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. జీ7 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మే లో జపాన్‌లోని హిరోషిమాలో జరగనుంది. చైనాపై జీ7 కూటమి కుట్రలు పన్నుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. -
రష్యా జర్నలిస్టుకు పాతికేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పుబట్టినందుకు వ్లాదిమిర్ కారా–ముర్జా జూనియర్(41) అనే జర్నలిస్టు, రాజకీయ కార్యకర్త జైలు పాలయ్యాడు. దేశద్రోహం నేరకింద రష్యా కోర్టు ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సైనిక చర్యను బహిరంగంగా విమర్శిస్తున్న ఆయనపై ఇప్పటికే రెండుసార్లు విషప్రయోగం జరిగింది. జైలుశిక్షను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. -
ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం: చైనా
బీజింగ్: ఏడాదికి పైగా యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రకటించింది. చైనా మిత్ర దేశమైన రష్యా యుద్ధం కారణంగా సాయుధ సంపత్తిని భారీగా కోల్పోవడం తెలిసిందే. దాంతో రష్యాకు చైనా భారీగా ఆయుధాలు సరఫరా చేయవచ్చని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. అలాంటి ఉద్దేశమేమీ తమకు లేదని చైనా విదేశాంగ మంత్రి క్విన్ కాంగ్ శుక్రవారం ప్రకటన చేశారు. పౌర, సైనిక వాడకం రెండింటికీ పనికొచ్చే వస్తువులను రష్యాకు ఎగుమతి చేయడంపైనా నియంత్రణ విధిస్తామన్నారు. యుద్ధంలో తమది తటస్థ పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే యుద్ధం మొదలైనప్పటి నుంచీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా రష్యాకు చైనా మద్దతుగానే నిలుస్తూ వస్తోంది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో చైనా దన్ను రష్యాకు ఎంతగానో ఆసరా అయింది. అదే క్రమంలో రష్యాకు ఆయుధాలు కూడా సమకూర్చేందుకు చైనా సన్నద్ధమవుతున్నట్టు తమకు నిఘా సమాచారముందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల పేర్కొనడం తెలిసిందే. చదవండి: పదేళ్లలో మరో మహమ్మారి!.. ఆ నివేదికలో భయంకర విషయాలు -
రాస్నెఫ్ట్తో ఐవోసీ ఒప్పందం
న్యూఢిల్లీ: రష్యాకి చెందిన రాస్నెఫ్ట్తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఓ ఒప్పందంపై సంతకం చేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో మరింత చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకోవాలన్నది ఐవోసీ ప్రయత్నం. చమురు దిగుమతులు గణనీయంగా పెంచుకునేందుకు తాజా ఒప్పందం ఉపకరిస్తుందని ఐవోసీ ప్రకటించింది. రాస్‌నెఫ్ట్ సీఈవో ఇగోర్ సెచిన్ భారత్ పర్యటనలో భాగంగా ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. -
భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు
భారత్‌తో సంబంధాల కోసం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) తలుపులు తెరిచే ఉంచింది అని నాటోలోని యూఎస్ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌తో సాన్నిహిత్యంగా ఉండటం తమకు చాలా సంతోషంగా అనిపిస్తుందన్నారు. అంతేగాదు భారత్ కోరుకుంటే ఏ సమయంలోనైనా దీని గురించి చర్చిండానికి నాటో సిద్ధంగా ఉందని కూడా స్మిత్ చెప్పారు. దీంతో ఒకరకంగా నాటోలో భారత్ చేరేలా యూఎస్ ప్రత్యక్ష సంకేతాలిస్తునట్లుగా ఉంది. ఈ మేరకు భారత్, యూఎస్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు గురించి మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య భాగస్వామ్యం అత్యంత దృఢంగా ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాలు ప్రజాస్వామ్యం, నియమాల ఆధారిత క్రమం, వాతావరణ మార్పు, హైబ్రిడ్ బెదిరింపులు, సైబర్ భద్రత, సాంకేతికత, విఘాతం కలిగించడం తదితర అంశాలపై కలిసి పనిచేయడంపై నిమగ్నమయ్యాయని అన్నారు. సోవియట్ యూనియన్ కోసం ఏర్పడ్డ నాటో తొలిసారిగా ఇండో పసిఫిక్‌తో తన విస్తరణను పెంచుకుందని తెలిపారు. అలాగే చైనాను నాటో వ్యవస్థాగత సవాలుగా గుర్తించిందని చెప్పారు. అయితే ఆయా ప్రాంతాలలోని భాగస్వామ్యుల వ్యూహాత్మక విధానాల తోపాటు ముఖ్యంగా చైనా దూకుడు విధానానికి సంబంధించి వ్యూహాల గురించి తెలుసుకునేందుకు నాటో ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నాలుగు ఇడో పసిఫిక్ దేశాలు జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లిథువేనియాలో జరగనున్న అత్యున్నత స్థాయి నాటో సమావేశానికి ఆహ్వానం అందినట్లు ఆమె తెలిపారు. ఈ దేశాలతో తమ భాగస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం మీద నాటో ఏ ఇండో పసిఫిక్ దేశంతోనూ పొత్తుల పెట్టుకునే యోచన చేయడం లేదని, పైగా విస్తృత కూటమిగా విస్తరించే ఆలోచన కూడా లేదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కేవలం ఒక్క రోజులో యుద్ధాన్ని ముగించగలరని అన్నారు. పశ్చిమ దేశాలు కేవలం ఉక్రెయిన్‌కు అవసరమైన వాటిని అందించడమే కాకుండా భవిష్యత్తులో రష్యన్లు చేసిన పనిని ఇతర దేశాలు చేసే ప్రమాదం ఉందని స్మిత్ హెచ్చరించారు. అలాగే ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కి భారత్ అందించిన మానవతా సాయాన్ని నాటో ప్రశంసించింది. యుద్ధాన్ని ముగించాలని పిలుపునివ్వడమే గాక ఇతర దేశాల యూఎన్ నిబంధనలకు కట్టుబడి ఉందన్నారు. ఏదీఏమైనా ఈ ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని స్మిత్ అన్నారు. ఈ యుద్ధంలో రష్యా గనుక అణ్వాయుధాలను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. దీని గురించి నాటో నిఘా ఉంచినట్లు కూడా యూఎస్ నాటో ప్రతినిధి స్మిత్ వెల్లడించారు. (చదవండి: పంజాబ్ సీఎం కూతురు సహా.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు ఖలీస్తానీ గ్రూపుల బెదిరింపులు) -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేవాణ్ని: ట్రంప్
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా–ఉక్రెయిన్ల యుద్ధం జరిగి ఉండేదే కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకున్న మంచి సంబంధాల దృష్ట్యా, అసలు ఈ యుద్ధం మొదలయ్యేదే కాదన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి 24 గంటల్లోనే ముగింపు పలికి ఉండేవాడినని చెప్పుకున్నారు. ‘‘2024 దాకా యుద్ధం కొనసాగితే, నేను మళ్లీ అధ్యక్షుడినైతే ఒక్క రోజులోనే శాంతి ఒప్పందం కుదురుస్తా. నాకు, పుతిన్‌కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు చాలా ఈజీ వ్యవహారం. సంక్షోభం ఇలాగే కొనసాగితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి మూడో ప్రపంచయుద్దానికి దారితీసి, అణుయుద్ధంగా మారే ప్రమాదముంది. రెండు ప్రపంచ యుద్ధాలు మూర్ఖుల కారణంగా స్వల్ప కారణాలతోనే జరిగాయి’’ అన్నారు. -
ఉక్రెయిన్‌పై మళ్లీ నిప్పుల వాన
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మళ్లీ విరుచుకుపడింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో సాధారణ నివాస ప్రాంతాలపై దాడికి దిగింది. ఉక్రెయిన్ నుంచి జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా, రష్యా నుంచి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వెళ్లిపోయిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. జపొరిజాజియా నగరంలో తొమ్మిది అంతస్తుల అపార్టుమెంట్‌పై రష్యా మిస్సైల్ దాడి వీడియో దృశ్యాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజధాని కీవ్ సమీపంలో విద్యార్థుల వసతి గృహంపై రష్యా సైన్యం దాడి చేయడంతో నలుగురు మృతిచెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు. కీవ్‌కు దక్షిణాన ఉన్న రిజీసిచివ్ సిటీలో ఓ ఉన్నత పాఠశాల, రెండు డార్మిటరీలు సైతం పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఓ డార్మిటరీ ఐదో అంతస్తు నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. మొత్తం ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. రష్యా 21 డ్రోన్లను ప్రయోగించగా, అందులో తాము 16 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. రష్యా ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు భీకర దాడులకు ఆదేశాలకు జారీ చేస్తోందని జెలెన్స్కీ మండిపడ్డారు. పౌరుల నివసాలపై రష్యా క్షిపణి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం స్వదేశానికి తిరిగివచ్చారు. జపాన్ ప్రధాని కిషిదా ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు చేరుకున్నారు. -
అది స్నేహం, సహకారం, శాంతి యాత్ర: చైనా
బీజింగ్: రష్యాలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ పర్యటన బుధవారం ముగిసింది. ఈ పర్యటనను స్నేహం, సహకారం, శాంతి యాత్రగా చైనా అభివర్ణించింది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తుండడాన్ని డ్రాగన్ దేశం తప్పుపట్టింది. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలను ఇంకా రెచ్చగొట్టడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాము తటస్థంగానే వ్యవహరిస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో తమకు ఎలాంటి స్వార్థపూరిత ప్రయోజనాలు లేవన్నారు. ఈ యుద్ధాన్ని లాభం కోసం వాడుకోవాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ రష్యా పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా పూర్తి సానుకూల స్పందన వ్యక్తమైందని వెన్బిన్ హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా దేశాల నడుమ శాంతి చర్చల కోసం తాము చొరవ చూపుతున్నామని వివరించారు. ఇదిలా ఉండగా, జిన్‌పింగ్ రష్యా పర్యటన వల్ల తక్షణ ఫలితమేమీ కనిపించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానని జిన్‌పింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా పర్యటన.. ఇద్దరు మిత్రులు సాధించిందేమిటి?
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం తన వంతు సహకారం అందిస్తానన్న ప్రకటనతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటన ప్రారంభించారు. శాంతి ప్రణాళికతో వచ్చానని చెప్పారు. తన బృందంతో కలిసి మూడు రోజులపాటు రష్యా రాజధాని మాస్కోలో మకాం వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో, ఆయన బృందంతో సుదీర్ఘంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం చైనా–రష్యా పదికిపైగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అండగా ఉంటానని పుతిన్‌కు జిన్‌పింగ్ అభయ హస్తం ఇచ్చారు. ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండయాత్రకు దిగిన రష్యా పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ప్రపంచంలో దాదాపు ఏకాకిగా మారింది. మరోవైపు ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్ట్ వారెంటు జారీ చేసింది. రష్యా నుంచి బయటకు రాగానే పుతిన్‌ను అరెస్టు చేయడం తథ్యమని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యాలో పర్యటించారు. పుతిన్‌కు స్నేహహస్తం అందించారు. జిన్‌పింగ్ రష్యాలో ఉన్న సమయంలోనే అమెరికా మిత్రుడైన జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం గమనార్హం. చైనా, రష్యా మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు ప్రపంచ దేశాలపై అమెరికా, దాని మిత్రదేశాల పెత్తనం ఇకపై చెల్లదన్న సంకేతాలు ఇవ్వడమే జిన్‌పింగ్, పుతిన్ భేటీ వెనుక ఉన్న అసలు ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐదు కీలక అంశాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో చూద్దాం.. ఉక్రెయిన్‌పై చొరవ సున్నా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో జిన్‌పింగ్ ఏమీ సాధించలేకపోయారు. యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచలేదు. కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్‌లో హింస, అమాయక ప్రజల మరణాలపై మాటమాత్రంగానైనా స్పందించలేదు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలంటూ జిన్‌పింగ్, పుతిన్ సంయక్తంగా పశ్చిమ దేశాలకు హితబోధ చేశారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రయోజనాలను గౌరవించాలని సూచించారు. శాంతికి చొరవ చూపుతానన్న జిన్‌పింగ్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పుతిన్‌తో భేటీలో ఆ ఊసే ఎత్తలేదు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికిప్పుడు తమ సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రతిపాదన ఏదీ లేదని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు పశ్చిమ దేశాల రెచ్చగొట్టే చర్యలే కారణమని చైనా, రష్యా చాలా రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సైనిక సహకారం, రక్షణ సంబంధాలు నాటో దేశాలతోపాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా(ఏయూకేయూఎస్) భద్రతా చట్టం వంటి వాటితో తమకు ముప్పు పొంచి ఉందని చైనా, రష్యా చెబుతున్నాయి. అందుకే పరస్పరం సైనిక సహకారం మరింత పెంపొందించుకోవాలని, రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకోవాలని జిన్‌పింగ్, పుతిన్ నిర్ణయించుకున్నారు. ఆసియా ఖండంలో స్థానికంగా ఎదురవుతున్న చిక్కులను పరిష్కరించుకోవడంతోపాటు పశ్చిమ దేశాలకు చెక్ పెట్టడానికి ఇది తప్పనిసరి అని భావిస్తున్నారు. పలు ఆసియా–పసిఫిక్ దేశాలతో అమెరికా సైనిక–రక్షణ సంబంధాలు మెరుగుపడుతుండడం పట్ల ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా శాంతికి, స్థిరత్వానికి విఘాతం కలిగించే బాహ్య సైనిక శక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఇకపై ఉమ్మడి సైనిక విన్యాసాలు తరచుగా చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. తద్వారా తాము ఇరువురం ఒక్కటేనని, తమ జోలికి రావొద్దంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక కూటమి అమెరికాకు వ్యతిరేకంగా తామే ఒక కొత్త కూటమిగా ఏర్పాటు కావడంతోపాటు నూతన వరల్డ్ ఆర్డర్ నెలకొల్పాలన్నదే చైనా, రష్యా ఆలోచనగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరల్డ్ ఆర్డర్ తమ సొంత అజెండాలకు అనుగుణంగా, ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. దీనిపై జిన్‌పింగ్, పుతిన్ మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. బహుళ ధ్రువ ప్రపంచం కోసం కృషి చేద్దామని ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. అమెరికా పెత్తనం కింద ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందన్నదే వారే వాదన. జిన్‌పింగ్ చైనాకు బయలుదేరే ముందు పుతిన్‌తో కరచాలనం చేశారు. కలిసి పనిచేద్దామని, అనుకున్న మార్పులు తీసుకొద్దామని చెప్పారు. మన ఆలోచనలను ముందుకు తీసుకెళ్దామని అన్నారు. పశ్చిమ దేశాల శకం ముగిసిందని, ఇకపై చైనా ప్రాబల్యం మొదలుకాబోతోందని జిన్‌పింగ్ పరోక్షంగా వెల్లడించారు. వ్యాపార, వాణిజ్యాలకు అండ యుద్ధం మొదలైన తర్వాత తమ దేశం నుంచి వెళ్లిపోయిన పశ్చిమ దేశాల వ్యాపార సంస్థల స్థానంలో చైనా వ్యాపారాల సంస్థలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. నాటో దేశాల ఆంక్షల తర్వాత ఎగుమతులు, దిగుమతుల విషయంలో చైనాపై రష్యా ఆధారపడడం పెరుగుతోంది. ఇరు దేశాల నడుమ ఇంధన వాణిజ్యం అభివృద్ధి చెందుతోంది. చమురు, గ్యాస్, బొగ్గు, విద్యుత్, అణు శక్తి వంటి రంగాల్లో ఇరుదేశాల సంస్థలు కలిసికట్టుగా పనిచేసేలా మద్దతు ఇస్తామని జిన్‌పింగ్, పుతిన్ తెలిపారు. కొత్తగా చైనా–మంగోలియా–రష్యా నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు చేపడతామని పుతిన్ వెల్లడించారు. రష్యాకే మొదటి ప్రాధాన్యం ► ఇతర దేశాలతో సంబంధాలను పణంగా పెట్టయినా సరే రష్యాతో బంధాన్ని కాపాడుకోవాలని చైనా పట్టుదలతో ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ► అమెరికా వ్యతిరేకతే ఏకైక అజెండాగా రెండు దేశాలు ఒక్కటయ్యాయని అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ► ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్దం మొదలయ్యాక జిన్‌పింగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ► యుద్ధాన్ని ఏనాడూ ఖండించలేదు. ► రష్యాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తన వైఖరి ద్వారా తేల్చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జిన్‌పింగ్‌కి వంగి నమస్కరిస్తూ చేతిని ముద్దాడిన పుతిన్!ఇది నిజమేనా?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడు రోజుల రష్యా పర్యటన కోసం సోమవారమే మాస్కో చేరకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్కడికి చేరుకున్న జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమై.. ఉక్రెయిన్ యుద్ధ శాంతి ప్రణాళిక చర్చలతో సహా పలు విషయాలను చర్చించనున్నారు. వాస్తవానికి ఈ యుద్ధంలో పాల్గొన్న ఇరు పక్షాలు తమ ఆందోళనలను విరమించి యుద్ధానికి ముగింపు పలికేలా చేయడమే ఈ పర్యటన లక్ష్యం. ఐతే ఉన్నతస్థాయి దౌత్య చర్చల మధ్య పుతిన్ జిన్‌పింగ్‌కి వంగి వంగి నమస్కరిస్తూ.. చేతిని ముద్దాడుతున్న పోటో ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి సమయంలో ఈ ఫోటో మరిన్ని విభేదాలకు తావిచ్చేలా ఉడటంతో ఇది అసలు నిజమా? లేక ఫేక్ ఫోటోనా అని తనిఖీ చేయడం ప్రాంభించారు నిపుణులు. ఆ తర్వాత ఇది నకిలీదని తేలింది. ఆర్టిఫషియల్ టెక్నాలజీతో రూపొందించిన ఫోటో అని నిర్థారించారు. దీనిపై క్షణ్ణంగా విచారణ జరిపిన అమండా ఫ్లోరియన్ అనే అమెరికన్ జర్నలిస్ట్ ఇలాంటి ఫోటోలు హాంకాంగ్, పోలాండ్, ఉక్రెయిన్ మూలాలకు సంబంధించన సైట్లో దాదాపు 239 ఫోటోలను చూశానని, ఇది నకిలీదని తేల్చి చెప్పారు. ఇది నకిలీ ఫోటోనే అని ఫ్రెంచ్ టెక్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇమేజ్ డిటెక్టర్ సాయంతో నిర్థారించిందని తెలిపారు. ఆ ఫోటోను నిశితంగ పరిశీలిస్తే మనకు స్పష్టంగా అవగతమవుతుందని అన్నారు. ఉక్రెయిన్ వివాదా పరిష్కారం కోసం, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు జరగుతున్న భేటీని కాస్త దెబ్బతీసేలా ఈ ఫోటో ఉందన్నారు. ఈ ఫోటో కారణంగా ఇరు దేశాల మధ్య విభేదాలు సృష్టించి, సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందన్నారు. ఈ మేరకు సదరు జర్నలిస్ట్ మాట్లాడుతూ..ఇలాంటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పుడూ..నెటిజన్లకు ఏది నకిలీ ఏది రియల్ అనేది తెలుసుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. లేదంటే తప్పుడూ సమాచారం వ్యాప్తి చెందడమే గాక ఇరు దేశాల మద్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే పరిస్థితికి దారితీసుందని హెచ్చరించారు. అదీగాక సరిగ్గా చైనా అధ్యక్షుడు పర్యటనలో ఉండగా ..ఇలాంటి ఫోటోలు మరింత వివాదాలకు తెరితీసే ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కాబట్టి అలాంటి వాటికి చెక్‌పెట్టేలా జాగ్రత్తగా ఉండటమేగాక, పూర్తిగా తెలుసుకున్నాకే ఇలాంటి ఫోటోలను షేర్ చేయమని సదరు జర్నలిస్ట్ నెటిజన్లను కోరారు. Wait a minute.... WTF is this? 👀 pic.twitter.com/FekVlBfZ63 — MAKS 22🇺🇦 (@Maks_NAFO_FELLA) March 20, 2023 (చదవండి: హాట్ టబ్‌లో సేద తీరుతున్న జంటపై సడెన్‌గా మౌంటైన్ లయన్ దాడి..ఆ తర్వాత..) -
పుతిన్ అరెస్ట్ అవుతారా?.. బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాదికి పైగా ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్నారు. బాంబులు, ఫిరంగులు, క్షిపణులతో దారుణ కాండ సాగిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా, పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అన్న ధోరణిలో పోతున్నారు. అలాంటి సమయంలో ఐసీసీ ఆయనపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ వారెంట్లతో పుతిన్‌ను అరెస్ట్ చేయొచ్చా ? మాస్కో చెబుతున్నట్టుగా అ వారెంట్లు చిత్తు కాగితాలతో సమానమా? ► పుతిన్‌పైనున్న ఆరోపణలేంటి? ఉక్రెయిన్‌లో ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లల్ని చట్టవిరుద్ధంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి రష్యాకి దాదాపుగా 16,221 మంది తరలివెళ్లారని ఐక్యరాజ్య సమితి విచారణలో తేలింది. ఈ పిల్లల్ని తాత్కాలికంగా తరలిస్తున్నట్టు బయటకి చెబుతున్నారు. కానీ ఆ చిన్నారుల్ని రష్యాలో పెంపుడు కుటుంబాలకు ఇచ్చేసి వారిని శాశ్వతంగా రష్యా పౌరుల్ని చేస్తున్నారు. దీంతో ఉక్రెయిన్‌లో మిగిలిపోయిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది. ఇలా పిల్లల్ని తరలించడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం యుద్ధ నేరం కిందకే వస్తుంది. పిల్లల్ని తరలిస్తున్న సైనికుల్ని, ఇతర అధికారుల్ని నియంత్రించలేకపోయిన పుతిన్ యుద్ధ నేరస్తుడేనని ఐసీసీ చెబుతోంది. పుతిన్‌తో పాటుగా రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా లోవా బెలోవా కూడా సహనిందితురాలుగా ఉంది. ► పుతిన్ అరెస్ట్ అవుతారా? పుతిన్ సొంత దేశంలో అపరిమితమైన అధికారాలను అనుభవిస్తున్నారు. రష్యాలో ఉన్నంత కాలం ఆయన సేఫ్. ఐసీసీకి సొంత పోలీసు బలగం లేదు. ఏ పని చెయ్యాలన్నా సభ్యదేశాలపైనే ఆధారపడుతుంది. రష్యాను వీడి పుతిన్ వేరే దేశానికి వెళితే ఐసీసీ అరెస్ట్ చేయొచ్చు. ఈ అరెస్ట్ వారెంట్ల జారీతో ఆయన విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఏర్పడ్డాయి. అయితే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించడం తెలిసిందే. ఐసీసీ నోటీసులతో అంతర్జాతీయ సమాజం కూడా ఇక పుతిన్ కదలికలను నిశితంగా గమనిస్తుంది కాబట్టి ఆయన వేరే దేశం వెళితే మాత్రం అరెస్ట్ కాక తప్పకపోవచ్చు. ► విచారణ ఎదుర్కొంటారా? పుతిన్ విచారణకు కొన్ని అడ్డంకులున్నాయి. ఐసీసీని రష్యా గుర్తించడంలేదు. అమెరికా, రష్యా వంటి దేశాలు ఇందులో సభ్యులు కావు. ఐసీసీ విచారణ పరిధిని అగ్రరాజ్యం అమెరికా కూడా ఆమోదించడం లేదు. మరో అడ్డంకి ఏమిటంటే ఐసీసీ వాద, ప్రతివాదులిద్దరూ హాజరైతే తప్ప విచారణ కొనసాగించదు. ఎవరైనా విచారణకు గైర్హాజరైతే విచారణ ముందుకు సాగదు. పుతిన్‌ను విచారించాలంటే ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన దేశాల్లో విచారణ చేయొచ్చు. పుతిన్‌ను అలా వేరే దేశానికి తీసుకురావడం అసాధ్యం. ► ఉక్రెయిన్ యుద్ధంపై ప్రభావం ఎంత? ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న అరాచకాలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని మరోసారి పుతిన్‌కు స్పష్టంగా తెలిసేలా, అంతర్జాతీయ సమాజం దీనిపై ఆగ్రహంగా ఉందని సంకేతాలు ఇచ్చేలా ఈ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. అయితే రష్యా ఈ వారెంట్లను లెక్క చేయలేదు. తాము ఐసీసీని గుర్తించడం లేదు కాబట్టి ఆ వారెంట్లు చిత్తు కాగితంతో సమానమని మాస్కో పెద్దలు వ్యాఖ్యానించారు. పుతిన్ అధికార ప్రతినిధి ఒకరు ఈ వారెంట్లు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఐసీసీని ఏ మాత్రం పట్టించుకోని పుతిన్ ఈ వారెంట్లకి భయపడి ఉక్రెయిన్ అంశంలో వెనకడుగు వేస్తారని అనుకుంటే పొరపాటేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా ఏ దేశాల నేతలను శిక్షించారు? ► అరాచకాలు సృష్టించిన జర్మనీ నాజీ నాయకుల్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూరెంబర్గ్, టోక్యో ట్రైబ్యునళ్లలో విచారించి శిక్షించారు. నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు కుడిభుజంగా చెప్పుకునే రుడాల్ఫ్ హెస్కి జీవిత ఖైదు పడింది. ► బోస్నియా, రువాండా, కాంబోడియా దేశాల నాయకుల్ని కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లలో విచారించారు ► 1990లో యుగోస్లోవియా ముక్కలైనప్పుడు అక్కడ హింసాకాండను ప్రేరేపించిన ఆ దేశాధ్యక్షుడు స్లొబోదాన్ మిలోసెవిచ్‌ను ఐక్యరాజ్యసమితి హేగ్‌లో విచారించింది. తీర్పు వచ్చేలోపే ఆయన జైల్లో గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో ఏకంగా 90 మందికి శిక్ష పడింది. ► అత్యాచారాలను ప్రేరేపించిన లైబీరియా మాజీ అధ్యక్షుడు చార్లెస్ టేలర్‌కు 50 ఏళ్ల కారాగార శిక్ష విధించారు ► చాడ్ దేశం మాజీ నియంత హిస్సేని హాబ్రేకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ► ఐసీసీ ఏర్పాటయ్యాక 40 మందిపై నేరారోపణలు రుజువయ్యాయి. వీరంతా ఆఫ్రికా దేశాలకు చెందినవారు. ఏమిటీ ఐసీసీ? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) 1998లో ‘‘రోమ్ స్టాచ్యూట్’’ ఒప్పందం కింద ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది. అంతర్జాతీయ సమాజంపైనా, మానవత్వంపైన జరిగే తీవ్రమైన నేరాలు, మారణహోమాలు, యుద్ధనేరాలను విచారించి శిక్షలు విధిస్తుంది.రెండో ప్రపంచ యుద్ధం సమయంలో న్యూరెంబర్గ్ విచారణ తరహాలోనే ఐసీసీ ఏర్పాటైంది. ప్రస్తుతం బ్రిటన్, జపాన్, అఫ్గానిస్తాన్, జర్మనీ సహా 123 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నా యి. రష్యా, అమెరికా దీనిని గుర్తించలేదు. అదే విధంగా భారత్, చైనా కూడా సభ్యత్వాన్ని తీసుకోలేదు. తీవ్రమైన నేరాల విషయాల్లో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలు విచారణలో విఫలమైతే ఐసీసీ జోక్యం చేసుకుంటుంది. -
యుద్ధంలో రష్యా ఓడితే! జరిగేది ఇదే..
చిన్న దేశం.. పైగా పెద్దగా సైనిక బలగం కూడా లేదు. మూడురోజులు.. కుదరకుంటే వారంలోపే ఆక్రమించేసుకోవచ్చు. ఉక్రెయిన్ దురాక్రమణకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేసిన అంచనా ఇది. కానీ, ఆ అంచనా తప్పింది. ఏడాది పూర్తైనా యుద్ధం ఇరువైపులా నష్టం కలగజేస్తూ ముందుకు సాగుతోంది. పైగా చర్చలనే ఊసు కూడా కనిపించడం లేదు. ఈ తరుణంలో.. ఒకవేళ రష్యా గనుక యుద్ధంలో ఓడిపోతే పరిస్థితి ఏంటి?.. మరీ ముఖ్యంగా పుతిన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై.. రష్యా మాజీ దౌత్యవేత్త ఒకరు స్పందించారు. యుద్దంలో గనుక పుతిన్ ఓడిపోతే.. వెంటనే అధ్యక్ష పదవి నుంచి దిగిపోతాడు. ఆయనేం సూపర్ హీరో కాదు.. ఎలాంటి సూపర్‌పవర్స్ లేవు. ఆయనొక సాధారణ నియంత మాత్రమే. కాబట్టి, దిగిపోక తప్పదు అని బోరిస్ బోండరెవ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బోండరెవ్.. జెనెవాలో రష్యా దౌత్యపరమైన కార్యకలాపాలకు సంబంధించి ఆయుధాల నియంత్రణ నిపుణుడిగా బాధ్యతలు నిర్వహించేవారు. అయితే.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ ఈయన తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండిస్తూ.. బహిరంగంగా రాజీనామా చేసిన తొలి దౌత్యవేత్త, అదీ రష్యా పౌరుడు కావడం ఇక్కడ గమనార్హం. ‘‘చరిత్రను గనుక ఓసారి తిరగేస్తే.. నియంతలు ఎక్కడా శాశ్వతంగా కనిపించరు. వాళ్లు పూర్తిస్థాయిలో అధికారం కొనసాగించిన దాఖలాలు లేవు. యుద్ధంలో ఓడితే గనుక.. మద్దతుదారుల అవసరాలను తీర్చలేక వాళ్లంతట వాళ్లే పక్కకు తప్పుకుంటారు. పుతిన్ కూడా ఒక సాధారణ నియంతే. రష్యా యుద్ధంలో గనుక ఓడిపోతే.. పుతిన్ తన దేశానికి ఏమీ ఇవ్వలేడు. ప్రజల్లోనిరాశ, అసమ్మతి పేరుకుపోతుంది. రష్యా ప్రజలు ఇకపై పుతిన్ అవసరం తమకు లేదని అనుకోవచ్చు. అప్పుడు ఆయనకు వీడ్కోలు పలికేందుకే మొగ్గు చూపిస్తారు కదా అని అభిప్రాయపడ్డారు బోండరెవ్. అయితే.. ప్రజలను భయపెట్టడం లేదంటే అణచివేత ద్వారా మాత్రమే పుతిన్ ఆ పరిస్థితిని మార్చేసే అవకాశం మాత్రం ఉంటుంది అని తెలిపారాయన. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు?
(ఎస్.రాజమహేంద్రారెడ్డి) : సరిగ్గా ఏడాది క్రితం యముని మహిషపు లోహపు గంటల గణగణలు విని ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గణగణలు దిక్కులు పిక్కటిల్లేలా భూగోళమంతా మారుమోగుతాయేమోనని ఆందోళన పడింది. రష్యా సమరనాదం ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి అనివార్యంగా ప్రపంచ దేశాలను రెండుగా చీల్చడం ఖాయమని పరిశీలకులూ భయంభయంగానే అంచనా వేశారు. మిత్ర దేశం బెలారస్ భుజం మీద ట్యాంకులను మోహరించి ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. చిరుగాలికే వొణికిపోయే చిగురుటాకులా ఉక్రెయిన్ తలవంచడం ఖాయమనే అనుకున్నారంతా! యుద్ధమంటేనే చావులు కదా. మృతదేహాల ఎర్రటి తివాచీ మీద నుంచే విజయం నడిచో, పరుగెత్తో వస్తుంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ, ప్రపంచం దృష్టంతా రణక్షేత్రంపైనే నిలిచింది. అయ్యో అన్నవాళ్లున్నారు, రెండు కన్నీటి చుక్కలతో జాలి పడ్డవారూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైరి పక్షాల వైపు నిలిచిన దేశాలు మాట సాయమో, మూట సాయమో, ఆయుధ సాయమో చేసి తమ వంతు పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. తటస్థంగా ఉన్నవాళ్లూ ఉన్నారు. చమురు కోసమో, తిండిగింజల కోసమో రష్యాపై ఆధారపడ్డ దేశాలు ఇప్పుడెలా అని తల పట్టుకుని ఆలోచనలో పడ్డాయి. ఒకవైపు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తూ మరోవైపు దిగుమతులను స్వాగతించడం ఎలాగన్నదే వాటిముందు నిలిచిన మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండియాకు ఇవేమీ పట్టలేదు. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకు రావడాన్నే యుద్ధం తొలినాళ్లలో లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే భారత్ తటస్థ ధోరణికే కట్టుబడింది. నెలలు గడిచి యేడాది పూర్తయ్యేసరికి రెండు దేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. మిగతా దేశాలు తమ సమస్యలను తమదైన రీతిలో, రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం లేనంతగా పరిష్కరించుకున్నాయి. ఇప్పుడు యుద్ధం హాలీవుడ్ వార్ సినిమాయే.. ప్రాణ నష్టం గణాంకాలే! యుద్ధం కూడా రోజువారీ దినచర్యలా రొటీన్‌గా మారిపోయినప్పుడు ఒక్క కన్నీటి బొట్టయినా రాలుతుందా? అయినా ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు? తండ్రినో, భర్తనో, కొడుకునో కోల్పోయిన అభాగ్యులు తప్ప! పక్కింటి గొడవ స్థాయికి... యుద్ధం తొలినాళ్లలో ఇకపై చమురెలా అన్నదే యూరప్‌ను వేధించిన ప్రశ్న. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు తమ చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం రష్యాపైనే ఆధారపడేవి. సహాయ నిరాకరణలో భాగంగా ఆ దిగుమతులను నిలిపివేయక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో జర్మనీ నుంచి ఇటలీ దాకా, పోలండ్ దాకా తమ దిగుమతుల పాలసీని మార్చుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. అధిక ధరకు చము రును ఇతర దేశాల నుంచి కొనాల్సి వచ్చినా, పొదుపు మంత్రంవేసి కుదుటపడ్డాయి. ప్రత్యామ్నా య మార్గం దొరికే వరకు యుద్ధం తమ గుమ్మం ముందే కరాళ నృత్యం చేస్తోందన్నంతగా హడలిపోయి ఉక్రెయిన్ పట్ల కాస్త సానుభూతిని, కాసిన్ని కన్నీటి బొట్లను రాల్చిన ఈ దేశాలన్నీ ఒక్కసారిగా కుదుటపడి ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు యుద్ధం ఈ దేశాలకు పక్కింటి గొడవే..! ఇక భారత్ విషయానికొస్తే నాటో దేశాల సహాయ నిరాకర ణతో లాభపడిందనే చెప్పాలి. బ్యారెళ్లలో మూలుగుతున్న చమురును ఏదో ఒక ధరకు అమ్మేయాలన్న వ్యాపార సూత్రాన్ని అనుసరించి రష్యా భారత్‌కు డిస్కౌంట్ ఇస్తానని ప్రతిపాదించింది. ఫలితంగా గత ఏడాది మార్చి 31 దాకా రష్యా చమురు ఎగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న భారత్ వాటా ఈ ఏడాది ఏకంగా 22 శాతానికి చేరింది! యుద్ధమంటే బాంబుల మోత, నేలకొరిగిన సైనికులు, ఉసురు కోల్పోయిన సామాన్య పౌరులు మాత్రమే కాదు, కొందరికి వ్యాపారం కూడా! భారత్‌కు చమురు లాభమైతే ఆయుధ తయారీ దేశాలకు వ్యాపార లాభం. యుద్ధమంటే ఆయుధ నష్టం కూడా. జర్మనీ, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, పోలండ్ లాంటి దేశాలు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఆయుధ ఉత్పత్తిని పెంచి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఏడాది తిరిగేసరికి యుద్ధం చుట్టూ పరిస్థితులు ఇంతలా మారితే కదనరంగంలో పిట్టల్లా రాలుతున్న వారి గురించి ఎవరాలోచిస్తారు? ప్రాథమ్యాల జాబితాలో యుద్ధం ఇప్పుడు చిట్టచివరి స్థానానికి నెట్టివేతకు గురైంది. రణక్షేత్రంలోని వైరి పక్షాలకు తప్ప మిగతా దేశాలకు ఇప్పుడది కేవలం ఒక వార్త మాత్రమే! బావుకున్నదేమీ లేదు మిత్ర దేశాలు, శత్రు దేశాలు, తటస్థ దేశాలను, వాటి వైఖరులను పక్కన పెడితే వైరి పక్షాలైన రష్యా, ఉక్రెయిన్ కూడా బావుకున్నదేమీ లేదు. ప్రాణనష్టం, ఆయుధ నష్టాల్లో హెచ్చుతగ్గులే తప్ప రెండు దేశాలూ తమ పురోగతిని ఓ నలభై, యాభై ఏళ్ల వెనక్కు నెట్టేసుకున్నట్టే! శ్మశాన వాటికలా మొండి గోడలతో నిలిచిన ఉక్రెయిన్ మునుపటి స్థితికి చేరుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో యుద్ధం ముగిస్తే తప్ప అంచనా వేయలేం. యుద్ధం వల్ల పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలను, కోల్పోయిన వీర సైనికులను రష్యా వెనక్కు తెచ్చుకోగలదా? ఏడాదైనా ఉక్రెయిన్‌పై పట్టు బిగించడంలో ఘోరంగా విఫలమైన రష్యా సైనిక శక్తి ప్రపంచం దృష్టిలో ప్రశ్నార్థకం కాలేదా? నియంత పోకడలతో రష్యాను జీవితాంతం ఏలాలన్న అధ్యక్షుడు పుతిన్ పేరు ప్రతిష్టలు యుద్ధంతో పాతాళానికి దిగజారలేదా? ఆయన తన రాజ్యకాంక్షను, తన అహాన్ని మాత్రమే తృప్తి పరచుకోగలిగారే తప్ప... ప్రపంచాన్ని కాదు, తన ప్రజలను కానే కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి కూడా పుతిన్‌కు భిన్నంగా ఏమీ లేదు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్టు జెలెన్స్కీ హాస్య నటుడి నుంచి హీరో అయ్యారు. రష్యా క్షిపణి దాడుల్లో దేశం వల్లకాడులా మారుతున్నా జెలెన్స్కీపై మాత్రం పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా రాచ మర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు. సాహసివంటూ పొగుడుతున్నారు. దేశం నాశనమవుతోందని బాధ పడాలో, ఎగురుతున్న తన కీర్తిబావుటాను చూసి సంతోషించాలో జెలెన్స్కీకి అర్థం కావడం లేదు. బహుశా ఆయన త్రిశంకుస్వర్గంలో ఉండి ఉంటారు. కొసమెరుపు కదనరంగంలో గెలుపోటములు ఇప్పుడప్పుడే తేలే అవకాశమే లేదు. ఎవరిది పైచేయి అంటే చెప్పడం కూడా కష్టమే. స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో 54 శాతాన్ని ఉక్రెయిన్ మళ్లీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అన్ని రోజులూ ఒక్కరివి కాదంటారు కదా! ఒకరోజు రష్యాదైతే మరో రోజు ఉక్రెయిన్‌ది..అంతే! ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచానిది ఎంతమాత్రం కాదు, రష్యా–ఉక్రెయిన్లది మాత్రమే. కొనసాగించడంతో పాటు ముగించడం కూడా ఆ రెండు దేశాల చేతుల్లోనే ఉంది. అయినా ఈ యుద్ధాన్ని ఎవరు పట్టించుకుంటున్నారిప్పుడు? -
రష్యా క్షిపణుల వాన
కీవ్: ఉక్రెయిన్‌పైకి గురువారం రష్యా మరోసారి క్షిపణుల వాన కురిపించింది. దీంతో ఉదయం నుంచి 7 గంటలపాటు దేశమంతటా ముందు జాగ్రత్తగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. దేశంలోని 10 ప్రాంతాల్లోని నివాస భవనాలపై రష్యా జరిపిన దాడుల్లో కనీసం ఆరుగురు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. గత మూడు వారాల్లో రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనన్నారు. ‘ఆక్రమణదారులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మాత్రమే వాళ్లు చేయగలరు’అని ఆయన ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
'మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి
ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధమే ప్రధాన అంశంగా ఢిల్లీలో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉక్రెయిన్ యుద్ధం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు లావ్రోవ్ మాట్లాడుతూ.."రష్యా దురాక్రమణదారు కాదు. మాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించారు. మేము ఆ యుద్ధాన్ని ఆపేందుకే యత్నించాం. ఉక్రెనియన్ ప్రజలను ఉపయోగించి మాకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిలే చేశారు. వాస్తవానికి రష్యా తనను తాను రక్షించుకునేందుకే యుద్ధం చేస్తోంది. పశ్చిమ దేశాలకు రెండు రకలుగా ప్రవర్తిస్తాయి. జీ20 సమావేశంలో ఉక్రెయిన్ గురించి లెనెత్తినప్పుడూ లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, యుగోస్లేవియా తదితర దేశాల పరిస్థితి గురించి చర్చించరే. ఆర్థిక నిర్వహణ, సూక్ష్మ ఆర్థిక విధానాల కోసం ఏర్పడిన జీ20 సదస్సు తన రక్షణ కోసం పోరాడుతున్న రష్యా గురించి ఎవ్వరూ మాట్లాడరు గానీ కేవలం ఉక్రెయిన్ మాత్రమే జీ20కి కనిపిస్తుంది. అలాగే అమెరికా చేస్తున్న రష్యా డబులస్టాండర్డ్ వ్యాఖ్యలు గురించి మాట్లాడుతూ..సెర్బియాపై ఎప్పుడూ దాడి జరిగిందో అమెరికాకు తెలియదు, కానీ ఆ సమయంలో అమెరికా సెనెటర్‌గా ఉన్న బైడెన్ దీన్ని తానే ప్రోత్సహించానని గొప్పలు చెప్పుకుంటాడు. అలాగే ఇరాన్ దేశం నాశనమైనప్పుడూ టోని బ్లెయిర్ అది పొరపాటుగా చెప్పుకున్నాడు. అమెరికా దేశం ముప్పు అని ప్రకటించగానే మిగతా దేశాలు వంత పాడతాయే గానీ ఇలాంటి వాటి గురించి ప్రశ్నించదు." అని అన్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరపడమనేది నేరపూరిత నేరం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ డిక్రీ పై సంతంకం చేసినప్పుడూ..యుద్ధాన్ని ముగించేందుకు ఎలా చర్చలు జరుగుతాయన్నారు. రష్యాను యుద్ధ రంగంలో ఓడించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నాటో సెక్రటరీ జనరల్ జెనసర్ స్టోల్టెన్‌బర్గ్ బహిరంగంగా ప్రకటించారని లావ్రోవ్ అన్నారు. అంతేగాదు ఐరోపాలో దేశాలు ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న దాడివల్ల ప్రభావితం కాలేదని, రష్యా చర్యలన్నింటికి పశ్చిమ దేశాలే కారణమని లావ్రోవ్ ఆరోపించారు. (చదవండి: ఆ ప్రాంతంలో ఈ పిల్లి ఫేమస్.. చూసేందుకు ఎగబడుతున్న పర్యాటకులు!) -
ఏడాదిలోగా రష్యా ఖజానా ఖాళీ.. పుతిన్‌కు షాకిచ్చిన వ్యాపారవేత్త!
మాస్కో: రష్యా ఖజానా ఏడాదిలోగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు ఆ దేశానికి చెందిన దిగ్గజ వ్యాపారవేత్త ఒలెగ్ డెరిపాక్స. సిబేరియాలో గురువారం జరిగిన ఆర్థిక సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు గతేడాది కఠిన ఆంక్షలు విధించినా రష్యా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించిన తర్వాత ఒలెగ్ అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం. ఉక్రయిన్తో యుద్ధం చేస్తున్న కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధించి ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల రష్యా ప్రభుత్వ ఖజనా ఖాళీ అవుతోందని, ఏడాదిలోగా ఏమీ మిగలని పరిస్థితి వస్తుందని ఒలెగ్ పేర్కొన్నారు. విదెశీ పెట్టుబడిదారుల అవసరం ఇప్పుడు రష్యాకు అత్యంత ముఖ్యం అని చెప్పారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తొలినాళ్లలోనే దీన్ని ఆపేయాలని ఒలెగ్ బహిరంగంగా ప్రకటించారు. పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు ఇప్పుడు మిత్రదేశాలు ఆపన్నహస్తం అందించి కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఒలెగ్ అభిప్రాయపడ్డారు.అయితే విదేశీ ఇన్వెస్టర్లకు రష్యా అనువైన పరిస్థితులు కల్పించి మార్కెట్లను ఆకర్షణీయంగా చేస్తేనే పెట్టుబడిదారులు ముందుక వస్తారని వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా గతేడాది ఫిబ్రవరిలో దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమ దేశాలు ఆ దేశంపై 11,300కు పైగా ఆంక్షలు విధించాయి. 300 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను ఫ్రీజ్ చేశాయి. యుద్ధాన్ని వెంటనే ఆపాలని హెచ్చరించాయి. కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గకుండా ఏడాదిగా దండయాత్ర కొనసాగిస్తోంది. ఒక్క చైనా మాత్రమే రష్యాకు బాసటగా నిలిచింది. ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేసింది. మెషీనరీ, బేస్ మెటల్స్ వంటి ఉత్పత్తులు సరఫారా చేసి పశ్చాత్య దేశాల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించింది. కానీ అది ఏమాత్రము రష్యా కోలుకునేందుకు సాయపడలేదు. చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో కలిసి పని చేస్తాం -
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో కలిసి పని చేస్తాం
వాషింగ్టన్: జీ20 సదస్సు ఆతిథ్య దేశంగా భారత్ ప్రత్యేకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో తనకున్న చిరకాల సత్సంబంధాలను భారత్ వినియోగించుకోవాలని చెప్పింది. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. జీ20 విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ఉక్రెయిన్ యుద్ధంపై ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో మాట్లాడుతూ జీ20 సదస్సు ప్రారంభమయ్యే లోపు ఉక్రెయిన్ యుద్ధంపై ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. ఇందుకోసం విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ ఒక దారి చూపించిందని ఈ ఏడాది కాలంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు. -
తెగించేసిన పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘోర అకృత్యానికి సిద్ధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధంలో పలు నష్టాలను చవిచూస్తున్నాయి. ఓ పక్క ఆయుధాల కొరత, మరో వైపు నైపుణ్యవంతులైన బలగాల కొరతతో పోరాడలేక తీవ్రంగా సతమతమవుతోంది. దీంతో ఉక్రెయిన్‌పై గెలుపు కోసం సాముహిక ఆత్మాహుతి దాడులకు రష్యా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఏ క్షణమైనా పుతిన్ దీన్ని అదేశించే అవకాశం ఉందని కూడా నివేదిక వెల్లడించింది. ఈ ఉత్తర్వు రాబోయే మూడు నెలల్లోనే అమలయ్యే అవకాశం లేకపోలేదని నివేదిక స్పష్టం చేసింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదంటున్నారు. అవి.. రష్యా చర్యల కారణంగా పొరుగున ఉన్న దేశాలు దాడికి దిగే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల ఆయుధాల సాయంతో యుద్ధంలో పురోగతి సాధించడం. పుతిన్ యుద్ధంపై విశ్వాసం కోల్పోయి.. మిలటరీ స్దబత ఏర్పడి రష్యా యుద్ధం వీగిపోవచ్చు అని చెబుతున్నారు. అదీగాక ఈ యుద్ధం ప్రారంభమైన ఒక ఏడాది తరువాత నుంచి రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను, యుద్ధ విమానాలను కోల్పోయి పలు నష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పటి వరకు రష్యా దళాలు సంయుక్త దాడిని సమర్థవంతంగా సమన్వయం చేయలేకపోయాయి. గత కొన్ని వారాలుగా ప్రభావంతంగా రష్యన్లు సాముహిక దాడి కొన సాగించలేకపోయారు. పైగా భారీ ఫిరంగి దళాలకు తగిన శిక్షణ లేకపోవండంతో వారికి మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సాముహిక ఆత్మాహుతి పదాతి దళ వ్యూహం. ఇది నిస్సందేహంగా వాయు రక్షణ క్షిపణుల కంటే ప్రాణాంతంకం. (చదవండి: మంటల్లో చిక్కుకున్న 42 అంతస్తుల భవనం..ఒక్కసారిగా వీధుల్లో..) -
Ukraine War: రష్యాకి చైనా మద్దతు బంద్ చేసేలా..అమెరికా రంగం సిద్ధం!
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు సాయాన్ని అందిస్తే చైనాపై ఆంక్షలు విధించడానికి అమెరికా రెడీ అవుతోంది. ఈ విషయమై ముఖ్యంగా జీ7 సముహంలోని దేశాల మద్దతు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అమెరికా ఏవిధమైన ఆంక్షలు విధించాలనుకుంటదనేది స్పష్టం కాలేదు. వాస్తవానికి ఇటీవలే వాషింగ్టన్ దాని మిత్ర దేశాలు రష్యాకు ఆయుధాలు అందించడానికి చైనా యత్నిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. అలాగే ఈవిషయమై అమెరికా ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశం తోపాటు యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్, చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ ఈ మధ్య జరిగిన వ్యక్తిగత సమావేశంలో కూడా వారు చైనాను నేరుగానే హెచ్చరించారు. రష్యాకు చైనా మద్దతును కట్టడి చేసేలా బైడెన్ పరిపాలన యంత్రాంగం ట్రెజరీ డిపార్ట్మెంట్ తోసహా, దౌత్య స్థాయిలో చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేసింది. దీన్ని ఏడాది క్రితమై అమలు చేసిందని, రష్యాపై ఆంక్షలకు మద్దతు ఇచ్చిన దేశాల సముహంతో బీజింగ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. నిఘా వర్గాల ప్రకారం.. రష్యాకు సాధ్యమైన సైనిక సహాయాన్ని అందించడం గురించి పరిగణలోకి తీసుకుంటే చైనా గురించి వస్తున్న వాదనలను తక్కువ దేశాలే సమర్థిస్తున్నాయి. యూఎస్ మిత్ర దేశాలకు సంబంధించినంత వరుకు చైనా కచ్చితంగా సాయం చేసే అవకాశం ఉందంటూ పలు కారణాలను చెబుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడికి కొద్ది క్షణాల ముందు రష్యాతో పరిమితులు లేని భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనే చైనాపై పలు అనుమానాలు వ్యక్తమయ్యేందుకు దారితీసింది. అదీగాక జీ7 ఫ్రంట్‌లో ఈ విషయమే చర్చించి చైనాపై వివరణాత్మక చర్యలు తీసుకునేలా దృష్టి సారించాలని చూస్తోంది యూఎస్. ఇదిలా ఉండగా, గత వారం చైనా సమగ్ర కాల్పుల విరమణ కోసం 12 పాయింట్ల పత్రాన్న సైతం విడుదల చేయడం గమనార్హం. చైనాని కట్టడి చేయడం సాధ్యమేనా! రష్యాకి యుద్ధ సామాగ్రి తక్కువగా ఉండటంతో చైనా నుంచి ఆయుధ సరఫరా రష్యాకి అనుకూలంగా మారతుందని ఉక్రెయిన్ మద్ధతుదారులు భయాపడుతున్నారు. ఐతే ఫిబ్రవరి 24 జీ7 ప్రకటనలో ఉక్రెయిన్‌పై దాడి జరిగి ఏడారి పూర్తి అయిన సందర్భంగా.. రష్యా యుద్ధానికి అవసరమైన వస్తుపరమైన సాయాన్ని అందించకూడదు లేదంటే దీనికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పిలుపునిచ్చింది వాషింగ్టన్. అంతేగాదు చైనా పేరుని ప్రస్తావించకుండానే రష్యా ఆంక్షల నుంచి తప్పించుకునేలా సహాయపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కంపెనీలపై యూఎస్ జరిమానాలు విధించింది. చైనాపై ఆంక్షలు విధించడంలో అమెరికాకు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన ఐరోపా, ఆసియాలనే ఏకతాటిపై తీసుకురావడం పెను సవాలుగా ఉంది. ఎందుకంటే.. జర్మనీ నుంచి దక్షిణ కొరియా వరుకు ఉన్న అమెరికా మిత్ర దేశాలు చైనాను దూరం పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నాయి. (చదవండి: అందుకేనా! రష్యా భారత్ చమురు మార్కెట్ వైపే మొగ్గు చూపుతోంది) -
రష్యాపై డ్రోన్ల వర్షం.. మాస్కోకు సమీపంలో విధ్వంసం
కీవ్: డ్రోన్ దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం దాకా ఎడతెరిపి లేకుండా జరిగిన దాడుల్లో దేశంలో పలుచోట్ల మౌలిక సదుపాయాలకు స్వల్ప నష్టం వాటిల్లింది. ఇంతకాలం ఉక్రెయిన్ సరిహద్దుల సమీపానికే పరిమితమైన దాడులు ఏకంగా రాజధాని మాస్కో సమీపం దాకా చొచ్చుకొచ్చాయి. ఒక డ్రోన్ మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో విధ్వంసం సృష్టించింది! పలు డ్రోన్లను రష్యా పేల్చేసింది. మరోవైపు హాకింగ్ దెబ్బకు రష్యా టీవీ, రేడియో ప్రసారాలకు చాలాసేపు అంతరాయం కలిగింది. డ్రోన్ల కలకలంతో సెయింట్ పీటర్స్బర్గ్ విమానాశ్రయాన్ని గంటలపాటు మూసేయాల్సి వచ్చింది! ఈ దాడులన్నీ ఉక్రెయిన్ పనేనంటూ రష్యా మండిపడింది. తమపై రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి దిగిన నేపథ్యంలో ఎలాంటి దాడులకైనా పాల్పడే హక్కు తమకుందంటూ ఉక్రెయిన్ నర్మగర్భ వ్యాఖ్యలతో సరిపెట్టింది. రష్యా మిత్రదేశమైన బెలారస్లో ఓ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో రూ.2,737 కోట్ల విలువైన రష్యా నిఘా విమానంతో పాటు మరో సైనిక రవాణా విమానం, పలు వాహనాలు దెబ్బ తిన్నట్టు చెబుతున్నారు. ఇది స్థానిక ఉక్రెయిన్ మద్దుతుదారుల పనేనని అనుమానిస్తున్నారు. -
Russia-Ukraine War: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి చొరబడింది. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్‌పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికిరాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్ ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు. ఇంతకీ పుతిన్ ఊహించినదేమిటి? ఆయనకు ఎదురైందేమిటి...? ఎస్ రాజమహేంద్రారెడ్డి: పూర్వపు సోవియట్ యూనియన్ రిపబ్లిక్కులన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది తన లక్ష్యమని పుతిన్ చెప్పుకుంటారు. పొరుగు దేశాలైన ఉక్రెయిన్, బెలారస్ కూడా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని అంటారాయన. రెండేళ్ల క్రితం ఆయన రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు. బెలారస్‌తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు ఆదినుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా తొలుత ఉక్రెయిన్‌లో చొరబడేందుకు తన భూభాగాన్ని అనుమతించింది కూడా. ఎటొచ్చీ పుతిన్‌కు పేచీ అల్లా ఉక్రెయిన్‌తోనే! ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్ ఒకే దేశమన్నదే పుతిన్ గట్టి నమ్మకం. లోగుట్టు వేరే నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్‌లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు. మూడేళ్ల క్రితం ఆయన ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్ కీర్తనలు, గుణగానాలతో హోరెత్తేది. ‘కల్లోల సాగరంలాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్ పుతిన్’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్ దృష్టిలో పుతిన్ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ విన్యాసాల్లో పుతిన్ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్. రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో క్రెమ్లిన్ ఎంచుకున్న మార్గమిది. అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్ లక్ష్యం. పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్ను ఓ దారికి తెస్తే బాహుబలి పుతిన్ సత్తా ఏమిటో తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్ థింక్‌టాంక్ అంచనా. అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం... తర్వాత ఉక్రెయిన్ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి. అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్‌పై దాడిని తప్పుగా పుతిన్ అంగీకరించడం లేదు. రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని సెలవిచ్చారు! దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏకంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలో అడుగుపెట్టారు! ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియాముఖంగా ప్రకటించేశారు. బహుశా పుతిన్ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు! ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆపద్ధర్మ పాత్రతో మొదలై... 1999లో బోరిస్ యెల్సిన్ ఆకస్మిక రాజీనామాతో ఆపద్ధర్మ అధ్యక్షునిగా తొలిసారి గద్దెనెక్కిన పుతిన్ 2000–2004, 2004–08ల్లో రెండు దఫాలుగా అధ్యక్షునిగా కొనసాగారు. అప్పట్లో రష్యా అధ్యక్ష పదవీకాలం నాలుగేళ్లే. తర్వాత 2008 నుంచి 2012 దాకా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఈ దశలో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. తర్వాత 2012 నుంచి 2018 దాకా, 2018 నుంచి ఇప్పటిదాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2024 మార్చితో పదవీకాలం ముగుస్తుంది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షునిగా ఉండరాదన్న నిబంధనను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు. ఫలితంగా 2024తో పాటు 2030 ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం పుతిన్‌కు సంక్రమించింది. ఈ రెండుసార్లూ గెలిస్తే 2036 దాకా ఆయనే రష్యా అధినేతగా చక్రం తిప్పుతారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే యుద్ధంతో అటు రాజ్యకాంక్షను, ఇటు పదవీకాంక్షనూ నెరవేర్చుకోవాలని పుతిన్ పట్టుదలగా ఉన్నారు. అందుకే యుద్ధానికి ఇప్పుడప్పట్లో ముగింపు పలికేందుకు ససేమిరా అంటున్నారు. యుద్ధంలో వెనకబడుతున్నట్టు అన్పించినప్పుడల్లా అణ్వాయుధ బూచితో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా మద్దతుతో లొంగేది లేదంటూ దీటుగా తలపడుతున్నారు. చివరికి గెలుపెవరిదైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం వైరి వర్గాలు రెండింటినీ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్ర చెక్కిలిపై యుద్ధం ఎప్పుడూ ఓ కన్నీటి బిందువే! చెరిగిపోని మచ్చే!! కొసమెరుపు ఏడాది యుద్ధం బాహుబలిగా వ్లాదిమిర్ పుతిన్‌కున్న పేరుప్రతిష్టలను బలి తీసుకుంటే, పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్ పాత్రలు పోషించిన వొలోదిమిర్ జెలెన్స్కీని మాత్రం నిజజీవితంలో హీరోను చేసింది! -
యుద్ధం ఇక చాలు: చైనా
ఉక్రెయిన్ యుద్ధ విరమణకు శుక్రవారం చైనా పిలుపునిచ్చింది. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి(ఫిబ్రవరి 24) ఏడాది పూర్తైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ యుద్ధం విరమించేలా 12 పాయింట్ల సమగ్ర నివేదిక ఇచ్చింది చైనా. యుద్ధం ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసిందని.. వేల మంది మరణించారని, మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారని చైనా సదరు నివేదిక ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేసింది. పనిలో పనిగా.. అగ్రరాజ్యంపైనా చైనా ఆగ్రహం వెల్లగక్కింది. యుద్ధం తీవ్రత పెరిగేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా కారణమయ్యాయని నివేదికలో చైనా విమర్శలు గుప్పించింది. అయితే తాము మాత్రం ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చకుండా అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు చైనా తెలిపింది. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని నొక్కి చెప్పింది చైనా. అంతేగాదు ఆ 12 పాయింట్ పొజిషన్ పేపర్లో(సమగ్ర నివేదికలో)..‘‘అణ్వాయుధాలను ఉపయోగించకూడదు, అలాగే అణుయుద్ధాలను చేయకూడదు, బెదిరింపులకు పాల్పడకూడదు. చివరిగా . ఏ దేశమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయన, జీవ ఆయుధాల పరిశోధన, అభివృద్ధి, వినియోగాన్ని వ్యతిరేకించాలి’’ అని చైనా తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. చైనా నివేదికపై ఉక్రెయిన్హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనాలోని ఉక్రెయిన్ రాయబారి ఇదొక శుభపరిణామంటూ పేర్కొన్నారు. అలాగే.. రష్యాపై చైనా ఒత్తిడి తెస్తుందని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: కీలక ఓటింగ్‌కు భారత్, చైనా దూరం) -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: కీలక ఓటింగ్‌కు భారత్, చైనా దూరం
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ యుద్ధాన్ని రష్యా తక్షణమే ముగించాలని, బలగాలను వెనక్కిమళ్లించాలని సభ్య దేశాలు తీర్మానించాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొలపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాయి. ఐరాస జనరల్ అసెంబ్లీలో మొత్తం 193 సభ్య దేశాలున్నాయి. అయితే రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదం కోసం జరిగిన ఓటింగ్‌లో 141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 7 దేశాలు మాత్రం వ్యతిరేకించాయి. భారత్, చైనా సహా 32 దేశాలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఐరాస జనరల్ అసెంబ్లీలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాలు జరిగిన ప్రతిసారి భారత్ ఓటింగ్‌కు దూరంగానే ఉంటోంది. ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, శాంతి స్థాపనకు కృషి చేయాలని సూచిస్తోంది. అటు చైనా కూడా రష్యాకు అనుకూలం కాబట్టి ప్రతిసారి ఆ దేశానికి సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 24న మొదలై.. ఐరోపా దేశాల కూటమి నాటోలో చేరాలనుకున్న ఉక్రెయిన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా.. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై దండయాత్రకు దిగింది. లక్షల మంది సైన్యం, క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. యుద్ధాన్ని మూడు రోజుల్లోనే ముగిస్తామని అతివిశ్వాసం ప్రదర్శించింది. అయితే ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటించడంతో రష్యాకు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఉక్రెయిన్‌కు ఇతర దేశాలు మద్దతుగా నిలిచి ఆయుధాలు సమకూర్చడంతో రష్యాకు కూడా యుద్ధంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడాదిగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన 42,295 మంది ప్రాణాలు కోల్పోయారు. 56,576 మంది తీవ్రంగా గాయపడ్డారు. 15,000 మంది గల్లంతయ్యారు. 1.4కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. 1,40,000 భవనాలు ధ్వంసం అయ్యాయి. లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అయినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. చదవండి: సూపర్మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే! -
సూపర్మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే!
లండన్: బ్రిటన్‌లోని ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థలు కొన్ని పండ్లు, కూరగాయల కొనుగోళ్లపై పరిమితులు విధించాయి. అననుకూల వాతావరణ పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా కొరత తలెత్తింది. నెల రోజుల వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయంటూ ప్రభుత్వం హెచ్చరించడంతో సూపర్ మార్కెట్ యాజమాన్యాలు ఈ చర్యను ప్రకటించాయి. టమాటాలు, క్యాప్సికం, దోసకాయలు, బ్రకోలి, క్యాలిఫ్లవర్ తదితరాల సరఫరా తక్కువగా ఉండటంతో వీటిని ఒక్కో వినియోగదారుకు మూడు వరకే విక్రయిస్తామని టెస్కో, అస్డా, మోరిసన్స్, ఆల్డి సంస్థలు తెలిపాయి. ఆఫ్రికా, యూరప్‌ల్లో ప్రతికూల వాతావరణం, ఇంధన ధరలు పెరగడం, బ్రిటన్, నెదర్లాండ్స్‌లో గ్రీన్హౌస్ వ్యవసాయంపై ఆంక్షలు కారణంగా పండ్లు, కూరగాయల దిగుబడి, రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను -
ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు?
పొరుగునున్న బలహీన దేశం ఉక్రెయిన్ను లొంగదీసుకునేందుకు రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం ఏడాదయ్యేసరికి మరింత జటిలంగా మారింది. నిరుడు ఫిబ్రవరి 24న రెండు లక్షలమంది సైన్యాన్ని ఉక్రెయిన్ వైపు నడిపించిన రష్యా ఇప్పుడు ఆ సంఖ్యను అయిదు లక్షలకు పెంచింది. ఏడాదైన సందర్భంగా ఉక్రెయిన్ నైతిక స్థైర్యాన్ని పెంచడానికంటూ ఆ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రసంగం, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడిన తీరు చూస్తే ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నిజానికి ఇప్పటికే వైరి వర్గాల మోహరింపు మొదలైంది. ఏడాది క్రితం యుద్ధంలో ప్రధాన పాత్రధారులు రష్యా– ఉక్రెయిన్లే. ప్రస్తుతం అమెరికా మద్దతుతో యూరోప్ దేశాలు అందులో పీకల్లోతు కూరుకుపోయాయి. రష్యాకు మారణాయుధాలిస్తే ఖబడ్దార్ అంటూ అమెరికా చేసిన హెచ్చరికకు జవాబన్నట్టు చైనా కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ విధాన నిపుణుడు వాంగ్ యీ బుధవారం మాస్కో సందర్శించి రష్యాతో తమ బంధం మరింత దృఢమవుతుందని ప్రకటించారు. పేరుకు చిన్న దేశమే అయినా అమెరికా పుణ్యమా అని ప్రస్తుతం ఉక్రెయిన్ దగ్గర మారణాయుధాలు, యుద్ధ ట్యాంకులు, గురిచూసి లక్ష్యాన్ని ఛేదించే బాంబులు, అత్యాధునిక యుద్ధ సామగ్రి, కోట్లాది డాలర్ల నిధులు పుష్కలంగా ఉన్నాయి. దేశం మరుభూమిగా మారినా రష్యాను చావుదెబ్బ తీయటంలో అవన్నీ ఉక్రెయిన్‌కు తోడ్పడుతున్నాయి. నిజానికి అమెరికా మొదట్లో చాలానే ఆశించింది. రష్యాపై ప్రపంచవ్యాప్తంగా ఏహ్యభావం వస్తుందని, అది ఏకాకవుతుందని భావించింది. కానీ అలాంటి ఛాయలు కనబడటం లేదు. తమ దేశంపై 2001లో వేలాదిమంది మరణానికి కారణమైన సెప్టెంబర్ 11 ఉగ్రదాడి అనంతరం ‘వాళ్లెందుకు మమ్మల్ని ద్వేషిస్తున్నార’ంటూ అల్‌ఖైదా ఉగ్రవాదుల గురించి ప్రశ్నించిన అమెరికా ఇప్పుడు ఆ ప్రశ్నను కాస్త తిరగేసి అడుగుతోంది. ‘వాళ్లనెందుకు ద్వేషించటం లేద’న్నది ఆ ప్రశ్న సారాంశం. ఇక్కడ ‘వాళ్లు’ అంటే రష్యన్లు. నిజమే, అమెరికా ఒత్తిడికి తలొగ్గి అయిష్టంగానైనా ఉక్రెయిన్‌కు మారణాయుధాలు అందజేస్తున్న యూరోప్ దేశాలు రష్యా నుంచి దిగుమతులు మాత్రం ఆపలేదు. తనకు సాగిలపడలేదన్న కక్షతో ఇరాన్‌పై గతంలో తీవ్ర ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఆర్థిక దిగ్బంధం చేసిన అమెరికా ఇప్పుడు రష్యాపై ఆ స్థాయిలో విరుచుకుపడటం లేదు. రష్యా చమురు, సహజ వాయువుల ఎగుమతిలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉండటం మాత్రమే కాదు... నికెల్, అల్యూమినియం, టైటానియం వంటి లోహాలూ, రసాయన వాయువులూ, సెమీ కండక్టర్లూ, గోధు మలూ, ఎరువుల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉంది. కఠిన ఆంక్షలతో ఇవన్నీ ఆగిపోతాయన్న భయాందోళనలు అమెరికా, యూరోప్ దేశాల్లో ఉన్నాయి. ఇక ముడి చమురును రష్యా చాలా చవగ్గా మనకూ, చైనాకూ విక్రయిస్తోంది. మన దేశం అక్కడినుంచి రోజూ 12 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇది 33 రెట్లు ఎక్కువ. ఇలా అనేకానేక కారణాలవల్ల రష్యాపై ప్రపంచ దేశాల్లో ఏహ్యభావం లేదు. పైపెచ్చు ఉక్రెయిన్‌కు అత్యుత్సాహంతో అమెరికా, యూరోప్ దేశాలు మారణాయుధాలు అందిస్తున్న తీరువెనక వారికి వేరే ప్రయోజనాలున్నాయని ప్రపంచం విశ్వసిస్తోంది. అది పాశ్చాత్య దేశాల చేతిలో కీలుబొమ్మ అని రష్యా చేస్తున్న ప్రచారం నిజం కావొచ్చన్న అభిప్రాయం కలుగుతోంది. ఒక సర్వే ప్రకారం భారత్, చైనా, తుర్కియే దేశాల్లో అత్యధికులు రష్యాకు అనుకూలంగానే ఉన్నారని వెల్లడైంది. సోవియెట్ యూనియన్ ఉనికిలో ఉన్నప్పుడు దాన్ని అగ్రరాజ్యంగా, ప్రమాదకరమైన శక్తిగా భావించేవారు. ఇప్పుడు రష్యాపై ఆ ముద్ర లేదు. ప్రచ్ఛన్న యుద్ధ దశ ముగిశాక అమెరికా, రష్యాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన పర్యవసానంగా 2010లో అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం(స్టార్ట్) కుదిరింది. దాని కాలపరిమితి 2026 ఫిబ్రవరిలో ముగియబోతోంది. కొత్త ఒప్పందంపై మొదలైన చర్చలను నిలిపేస్తున్నట్టు ప్రకటించి పుతిన్ అందరినీ ఆందోళనలో పడేశారు. ఏ పక్షమూ మొదటగా అణ్వాయుధాలు ఉపయోగించకుండా నియంత్రించే ఆ ఒప్పందం ఒక్కటే రెండు దేశాల మధ్యా మిగిలింది. దాన్ని కాస్తా పున రుద్ధరించటానికి చర్యలు తీసుకోకపోతే ప్రపంచ మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇక రెండు దేశాలూ తమ అణ్వాయుధాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థేమీ మిగలదు. పుతిన్ మరో మాట కూడా అన్నారు. అమెరికా గనుక అణు పరీక్షలు మొదలుపెడితే తాము కూడా సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. యుద్ధం ఆగనంతకాలమూ ఇలా సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితి నానాటికీ దిగజారుతుంది. యూరోప్ భద్రత ప్రమాదంలో పడుతుంది. యుద్ధాన్ని విరమించి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోమని మన దేశం ఇరుపక్షాలకూ చెబుతోంది. కానీ మున్ముందు ఇలా మధ్యవర్తిత్వం వహించే అవకాశాలు కూడా ఉండవు. ఇప్పటికే 80 లక్షలమంది ఉక్రెయిన్ పౌరులు కొంపా గోడూ వదిలి వలసపోయారు. వేలాదిమంది మరణించారు. అనేకులు వికలాంగులయ్యారు. అటు రష్యా సైతం భారీగా నష్టపోయింది. బలహీన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఈ యుద్ధంతో సంక్షోభంలో పడ్డాయి. అందుకే మతిమాలిన ఈ యుద్ధాన్ని విరమించేలా రష్యాపై ప్రపంచం ఒత్తిడి తేవాలి. ఉక్రెయిన్‌కు సాయం పేరిట పరిస్థితి మరింత విషమించే చర్యలకు స్వస్తి పలకాలని అమెరికాను కోరాలి. యుద్ధంతో అంతిమంగా మిగిలేది విషాదమేనని గుర్తించాలి. -
మూడు రోజులు అనుకుంటే.. 365 రోజులయ్యింది!
లండన్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ.. ఈ ఫిబ్రవరి 24వ తేదీకి ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ ఏడాది కాలంలో ఎన్నో ప్రాణాలను బలిగొంది ఈ యుద్ధం. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గబోడని.. అవసరమైతే మరో ఏడాదిపాటు కొనసాగిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ ప్రజల జీవితాల పట్ల మాత్రమే కాకుండా.. తన సొంత సైనికుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపిందని ఆయన ఆరోపించారు. మేం ఇక్కడి పరిస్థితులను ఏడాది కాలంగా చూస్తున్నాం. లక్షా 88 వేలమంది రష్యా సైనికులు మరణించారు, గాయపడ్డారు. దీనికి పుతిన్ దూకుడు కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యాకు సంబంధించి 97 శాతం ఉక్రెయిన్ యుద్ధంలోనే ఏడాదికాలంపాటు లీనమైందని, యుద్ధ ట్యాంకర్లలో మూడింట రెండోవంతు పూర్తిగా నాశనం అయిపోయాయని, అయినా కూడా ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడంలో పుతిన్ ఘోరంగా విఫలమయ్యాడని తెలిపారు బెన్ వాలెస్. అయినా పుతిన్ దురాక్రమణపై వెనక్కి తగ్గబోడని అంచనా వేశాడాయన. నరమేధం కొనసాగినా.. అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పుతిన్ తన వైఖరి మార్చుకోకపోవచ్చనే అంటున్నారాయన. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దురాక్రమణకు పుతిన్ రష్యా బలగాలను ముందుకు పంపాడు. ఆ సమయంలో పుతిన్ లక్ష్యం ఒక్కటే. మూడు వారాల్లో ఉక్రెయిన్‌లో ఉన్న అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించేసుకోవాలని. పైగా మూడే రోజుల్లో రాజధాని కీవ్ నగరాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. తద్వారా యుద్ధం ముగుస్తుందని భావించాడు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. యుద్ధం 365 రోజులు సాగింది. తాను అనుకున్నవాటిల్లో ఒక్కటి కూడా సాధించలేకపోయాడని వాలెస్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నివేదిక ప్రకారం.. ఈ ఏడాది కాలంలో ఎనిమిది వేల మంది సాధారణ పౌరులు మరణించినట్లు, 14 వేలమంది దాకా గాయపడినట్లు నివేదిక వెల్లడించింది. మేం గెలుస్తాం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ఏడాది పూర్తవుతున్న సందర్భంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఉక్రెయిన్ విజయం తధ్యమని మరోసారి ధీమా వ్యక్తం చేశాడాయన. మేము విచ్ఛిన్నం కాలేదు. అనేక పరీక్షలను అధిగమించాము. మేం గెలిచి తీరతాం అని అన్నారాయన. యుద్ధమనే చెడును మా దేశానికి తెచ్చిన వాళ్లను నిలువరించిన తీరతామని ధీమా వ్యక్తం చేశాడాయన. -
ఒక్క ఉక్రెయినే ఎందుకు! ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అదే కారణం!
ఒక్క ఉక్రెయినే ఎందుకు! ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అదే కారణం! -
Russia-Ukraine war: ఒక దురాక్రమణకు, తలవంచని తెగువకు..ఏడాది
ఏడాది క్రితం.. 2022 ఫిబ్రవరి 24... ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన రోజు. రష్యా అపార సాయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్ నిలవలేదని, దాని ఓటమితో రోజుల వ్యవధిలోనే యుద్ధం ముగుస్తుందని అంతా భావించారు. దాదాపు ఏడాది గడిచాక... పసికూనగా భావించిన ఉక్రెయిన్ పట్టువీడకుండా తెగించి పోరాడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాల సాయుధ, ఆర్థిక సాయం దన్నుతో రష్యాను దీటుగా ఎదిరిస్తోంది. పలు ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా సేనలను తరిమికొడుతూ మరిచిపోలేని పరాభవాలను పుతిన్‌కు రుచి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు ఏమాత్రం కన్పించడం లేదు. ఎంతకాలమైనా ఉక్రెయిన్‌కు మద్దతిస్తూనే ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంత దూరమైనా వెళ్తామంటూ పుతిన్ చేసుకున్న తాజా హెచ్చరికలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యాలనే గాక ప్రపంచ దేశాలన్నింటినీ యుద్ధం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఘర్షణ కూడా ఇదే. తొలిసారేమీ కాదు.. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు ఇదే తొలిసారేమీ కాదు. వెయ్యేళ్ల చరిత్ర, 4.4 కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్(యూఎస్ఎస్ఆర్)లో అంతర్భాగమే. సోవియట్ పతనానంతరం 1990ల్లో స్వతంత్ర దేశంగా అవతరించింది. పశ్చిమ దేశాల కుట్రల వల్లే ఉక్రెయిన్ తమకు దూరమైందని రష్యా ద్వేషం పెంచుకుంది. పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్ కీలుబొమ్మ అని పుతిన్ తరచుగా విమర్శిస్తుంటారు. ఉక్రెయిన్ కృత్రిమంగా ఏర్పడ్డ దేశమని, నిజానికి అది, రష్యా ఒకే తల్లి బిడ్డలని ఆయన వాదిస్తుంటారు. రెండు దేశాలను ఎలాగైనా ఒక్కటి చేయాలన్నదే పుతిన్ ఆశయం. అందులో భాగంగానే 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. ఆ ఘర్షణలో ఇరువైపులా వేలాది మంది మరణించారు. మరోవైపు ఉక్రెయిన్‌లో గణనీయంగా ఉన్న రష్యన్ మాట్లాడే ప్రజలు రష్యాకు మద్దతుగా తిరుగుబాటుకు దిగారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడం, రష్యా నుంచి ముప్పు పెరుగుతుండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాల సాయం కోరారు. రష్యా బారినుంచి కాపాడేందుకు తమను తక్షణం నాటో కూటమిలో చేర్చుకోవాలన్న ఆయన విజ్ఞప్తికి సానుకూలత వ్యక్తమైంది. అదే జరిగితే నాటో సేనలు ఏకంగా రష్యా సరిహద్దుల్లో తిష్టవేసే ఆస్కారముండటం అధ్యక్షుడు పుతిన్‌కు ఆగ్రహం కలిగించింది. వెంటనే రంగంలోకి దిగి 2021 నవంబర్ నాటికే ఉక్రెయిన్ సరిహద్దులకు భారీగా సైన్యాన్ని తరలించారు. 2022 ఫిబ్రవరికల్లా దాన్ని లక్షకు పెంచి తీవ్ర ఉద్రిక్తతలకు తెర తీశారు. ఉక్రెయిన్‌పై దాడి తప్పదన్న వార్తల నడుమ, తీవ్ర పరిణామాలు, కఠిన ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించింది. తమకలాంటి ఉద్దేశం లేనే లేదంటూనే ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పుతిన్ సైన్యం మూడువైపుల నుంచీ విరుచుకుపడింది. శిథిల చిత్రంగా ఉక్రెయిన్ రష్యా దాడుల ధాటికి ఉక్రెయిన్ సర్వం కోల్పోయి శిథిలచిత్రంగా మిగిలింది. ఎక్కడ చూసినా కూలిన భవనాలు, మృతదేహాలతో మరుభూమిని తలపించింది. ఐక్యరాజ్యసమితికి శరణార్థుల హై కమిషనర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే 2023 జనవరి 15 నాటికి రష్యా దాడుల్లో 7,000కు పైగా ఉక్రెయిన్ పౌరులు మరణించారు. 11 వేలకు పైగా క్షతగాత్రులయ్యారు. వాస్తవానికి కనీసం 50 వేల మందికి పైగా అమాయక పౌరులు యుద్ధానికి బలయ్యారని, లక్షలాది మంది గాయపడ్డారని అంచనా. 80 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ పౌరులు శరణార్థులుగా ఇతర దేశాలకు వలసవెళ్లారు. వారంతా కట్టుబట్టలతో ఇల్లూ వాకిలీ వదిలి తరలిపోతున్న దృశ్యాలు మానవతకే తీరని మచ్చగా మిగిలాయి. మరో 60 లక్షల మంది స్వదేశంలోనే నిరాశ్రయులయ్యారు. రష్యా అతలాకుతలం రష్యా కూడా ఉక్రెయిన్ చేతిలో అవమానకర ఎదురుదెబ్బలు మినహా ఇప్పటిదాకా ఇప్పటిదాకా బావుకున్నదేమీ లేదు. పైపెచ్చు యుద్ధం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంతగా దిగజారింది. అమెరికా, పాశ్చాత్య దేశాల తీవ్ర ఆర్థిక ఆంక్షలతో పూర్తిగా స్తంభించి కుదేలైంది. ఆర్థిక వృద్ధి నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ సంస్థలన్నీ దేశం వీడాయి. చమురు మినహా ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా పడకేశాయి. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు చుక్కలనంటి సామాన్యుల బతుకు దుర్భరంగా మారింది. దాంతో యుద్ధంపై రష్యాలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎన్నడూ లేని రీతిలో పౌరులు బాహాటంగానే ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. వేలాదిగా అరెస్టులు జరిగినా వెరవకుండా ఆందోళనలు చేశారు. దేశాల్లో ఆకలి కేకలు గోధుమలు, మొక్కజొన్న ఎగుమతిలో అగ్రస్థానాన ఉన్న రష్యా, ఉక్రెయిన్ నుంచి యుద్ధం కారణంగా తిండి గింజల సరఫరా పూర్తిగా నిలిచిపోయి 50కి పై చిలుకు దేశాలు తీవ్ర ఆహార కొరత బారిన పడి అల్లాడుతున్నాయి. అంతేగాక అటు సంపన్న, ఇటు భారత్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు యుద్ధం వల్ల ఎంతగానో దెబ్బ తిన్నాయి. సాహసి... జెలెన్స్కీ రష్యాకు ఎదురొడ్డి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొక్కవోని ధైర్య సాహసాలు ప్రదర్శించారు. తనను హతమార్చేందుకు జరిగిన ప్రయత్నాలను కాచుకున్నారు. సురక్షితంగా తప్పిస్తామంటూ అమెరికా ముందుకొచ్చినా కాదన్నారు. సైన్యంతో కలివిడిగా తిరుగుతూ వారిలో స్థైర్యం నింపారు. ప్రపంచ దేశాలను సాయం కోరుతూ ప్రతి అంతర్జాతీయ వేదిక మీదా రష్యాను దునుమాడుతూ సాగారు. పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్‌గా చేసినా నిజ జీవితంలో మాత్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తిరుగులేని నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి హీరో అనిపించుకున్నారు. ఎవరికెంత నష్టం? యుద్ధంలో విజేతలు ఎవరో ఇప్పటిదాకా తేలకపోయినా ఇరు దేశాలు మాత్రం కనీవినీ ఎరుగని స్థాయిలో నష్టాన్ని చవి చూశాయి. లక్షల సంఖ్యలో సైనికులను, వేల సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, నౌకలను కోల్పోయాయి. ఏ దేశం ఎవరి వైపు... అమెరికా బ్రిటన్ సహా 30 నాటో సభ్య దేశాలు యుద్ధంలో ఉక్రెయిన్‌కు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. భారీగా ఆయుధ, ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నాయి. వీటితో పాటు మరెన్నో దేశాలు రష్యా దాడిని ఖండించి ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు ప్రకటించాయి. ఇక రష్యాకు ప్రధానంగా పొరుగు దేశమైన బెలారస్ తొలినుంచీ గట్టి మద్దతుదారుగా ఉంది. చైనాతో పాటు ఉత్తర కొరియా, క్యూబా, వెనెజువెలా, ఇరాన్, సిరియా, కిర్గిస్తాన్ కూడా రష్యాకు మద్దతు ప్రకటించాయి. యూఏఈ, సౌదీ అరేబియా తటస్థంగా నిలిచినా రష్యా దాడిని ఖండించేందుకు తిరస్కరించాయి. యుద్ధానికి తక్షణం ముగింపు పలికి చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నది తొలినుంచీ భారత్ వైఖరిగా ఉంది. యుద్ధంలో కీలక మలుపులు ఫిబ్రవరి: 24న యుద్ధం ప్రారంభం. ఉక్రెయిన్ నిస్సైనికీకరణకు సైనిక చర్య ముసుగులో తూర్పు, ఉత్తర, దక్షిణాల నుంచి రష్యా ముప్పేట దాడి. మార్చి: ఖెర్సన్ నగరం స్వాధీనమైందన్న రష్యా. యూరప్‌లోకెల్లా పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం ఆక్రమణ. కీవ్ శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో అపార నష్టం ధాటికి రష్యా సేనల పలాయనం. రష్యాపై అమెరికా, యూరప్ దేశాల భారీ ఆర్థిక, తదితర ఆంక్షలు. ఏప్రిల్: కీవ్, బుచాల్లో వందలాది పౌరులను రష్యా సైన్యం చిత్రహింసల పాలు చేసి చంపినట్టు వెల్లడి. రష్యాపై యుద్ధ నేరాల అభియోగాలు మోపాలంటూ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు. ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడి. రష్యా యుద్ధ నౌక మాస్క్వాను క్షిపణి దాడితో నల్లసముద్రంలో ముంచి సంబరాలు చేసుకున్న ఉక్రెయిన్. మే: మారియుపోల్‌ను పూర్తిగా ఆక్రమించుకున్న రష్యా. రష్యా దూకుడు పట్ల ఆందోళనతో నాటోలో చేరుతామంటూ దరఖాస్తు చేసుకుని పుతిన్‌కు షాకిచ్చిన ఫిన్లండ్, స్వీడన్. జూన్: ఉక్రెయిన్ దాడుల దెబ్బకు యుద్ధం మొదట్లో నల్లసముద్రంలో ఆక్రమించిన స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలిగిన రష్యా సేనలు. జూలై: ప్రపంచ ఆహార భద్రత దృష్ట్యా ఉక్రెయిన్ రేవు పట్టణాల నుంచి ఆహార ధాన్యాల సరఫరా. ఆగస్టు: క్రిమియాపై ఉక్రెయిన్ దాడుల్లో తీవ్రంగా దెబ్బ తిన్న రష్యా వైమానిక స్థావరాలు, ఆయుధాగారాలు. సెప్టెంబర్: ఖర్కీవ్‌లో ఆకస్మిక దాడులతో రష్యా దళాలను తరిమికొట్టిన ఉక్రెయిన్ సైన్యం. రిఫరెండం ముసుగులో డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్టు పుతిన్ ప్రకటన. అక్టోబర్: క్రిమియాను రష్యాతో కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్. నవంబర్: రష్యాకు పరాభవం. దాడులకు తాళలేక ఖెర్సన్ నగరం నుంచి పుతిన్ సేనల పలాయనం. డిసెంబర్: రష్యాలోని సరిహద్దు ప్రాంతాలు, పట్టణాలు, నగరాలపై దాడులు, భారీ నష్టం. 2023 జనవరి: మకీవ్కాలో క్షిపణి దాడులతో వందలాది మంది రష్యా సైనికులను మట్టుబెట్టామన్న ఉక్రెయిన్. 89 మంది మరణించారన్న రష్యా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుతిన్ షాకింగ్ నిర్ణయం! యూఎస్‌కి ఊహించని ఝలక్
ఉక్రెయిన్‌పై దాడికి దిగి ఏడాది కావోస్తున్న సందర్భంగా పుతిన్ పార్లమెంట్లో రష్యాను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ ప్రసంగం ముగిసే సమయంలో చట్ట సభ్యులతో ఒక షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు. రష్యా ప్రమాదకర వ్యూహాత్మక ప్రమాదకర ఆయుధాల ఒప్పందంలో యూఎస్‌తో తన భాగస్వామ్యాన్ని నిలిపేస్తేన్నట్లు ప్రకటించారు. ఇరుపక్షాల వ్యూహాత్మక అణ్వాయుధాలను పరిమితం చేసే న్యూ స్టార్ట్ ట్రిటీ(New START treaty) ఒప్పందంలో రష్యా తన భాగస్వామ్యన్ని నిలిపేస్తుందని పుతిన్ వెల్లడించారు. వాస్తవానికి ఈ న్యూ స్టార్ట్ ట్రిటీ ఒప్పందంపై 2010లో ఇరు దేశాలు సంతకం చేశాయి. ఆ తర్వాత ఏడాదే ఇది అమల్లులోకి వచ్చింది. మళ్లీ 2021లో జో బైడెన్ పదవీ భాద్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఒప్పందం మరో ఐదేళ్ల పాటు పొడిగించడం జరిగింది. ఇది అమెరికా రష్యా వ్యూహాత్మక అణు వార్హెడ్లను సంఖ్యను పరిమితం చేసేలా, భూమి, జలాంతర్గామీ ఆధారిత క్షిపణులు, బాంబులను మరింతగా విస్తరింప చేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..రష్యా వద్ద దాదాపు 6 వేల వార్హెడ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధాల నిల్వ ఉన్నట్లు సమాచారం. అంతేగాదు రష్యా, అమెరికాలే వద్ద ప్రపంచంలోని 90% అణు వార్హెడ్లను కలిగి ఉన్నాయని, ఇవి ఒక గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయగలవని చెబుతున్నారు. (చదవండి: యుద్ధాన్ని ప్రారంభించింది పశ్చిమ దేశాలే: పుతిన్ సంచలన వ్యాఖ్యలు) -
ఆయుధాలు పంపినంత కాలం యుద్ధం ఆపే ప్రసక్తే లేదు: పుతిన్
తమ దేశ పార్లమెంట్లో రష్యాను ఉద్దేశించి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. ఈ మేరకు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి ఏడాది కావొస్తున్న సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు పుతిన్. వాస్తవానికి తాము ఈ సమస్యను శాంతియుతం పరిష్కరించడానికి సాధ్యమైనంత మేర ప్రయత్నించామన్నారు. అంతేగాదు ఈ వివాదం నుంచి బయటపడేలా కూడా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కానీ దీని వెనుక ఒక విభిన్నమైన కుట్ర దాగి ఉందని ఆరోపణలు గుప్పించారు పుతిన్. ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాలే యుద్ధాన్ని ప్రారంభించాయని, దాన్ని ఆపడానికి రష్యా శాయశక్తులా ప్రయత్నం చేస్తోందన్నారు. అంతేగాదు పశ్చిమ దేశాలతో భద్రతా పరంగా దౌత్య మార్గాన్ని అనుసరించి సమస్యను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ ఆ విషయంలో ఎటువంటి పారదర్శకత లేని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆయా దేశాలు నాటో విస్తరణ కోసమే చూస్తున్నాయనే తప్ప.. శాంతియుత మార్గం కోసం ప్రయత్నం జరగడం లేదని విమర్శించారు. ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు, పశ్చిమ దేశాలు, నాటో దేశాలు సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. అలాగే గతేడాది నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సాయం చేస్తున్న దేశం పేరు చెప్పకుండానే అమెరికాను పరోక్షంగా పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు ఎంత ఎక్కువగా ఆయుధాల పంపితే అంత ఎక్కువ కాలం రష్యా దాడి చేస్తుందని హెచ్చరించారు. అంతేగాదు ఉక్రెయిన్‌లో ప్రజలు పాశ్చాత్య యజమానులకు బందీలుగా మారారని, వారికంటూ వ్యక్తిగతం లేదని విమర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ పాలన వారికి జాతీయ ప్రయోజనాలను అందించడం లేదన్నారు. రష్యాకు వ్యతిరేక చర్యలు చేపట్టేందుకు ఉక్రెయిన్ వివిధ మార్గాలను అన్వేషిస్తుందని, ముఖ్యంగా నాజీలు, ఉగ్రవాదులను సైతం ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్ దళాల్లో నాజీ యూనిట్లు కూడా ఉన్నాయని చెప్పారు. రష్యా ప్రజలను రక్షించాలని, వారి ఇళ్లను రక్షించాలని కోరుకుంటోందన్నారు. కానీ పాశ్చాత్య నాయకులు వివాదాన్ని మరింత ముదిరిలే చేసేందుకు ఆర్థిక, సైనిక సాయాన్ని చేస్తున్నాయంటూ పుతిన్ మండిపడ్డారు. తాము దశలవారిగా లక్ష్యాలను చేధించుకుంటూ ఒక క్రమపద్ధతిలో ఉక్రెయిన్‌పై దాడి చేస్తూ.. ఈ సమస్యను పరిష్కారిస్తామని ధీమాగా చెప్పారు పుతిన్. We were doing everything possible to solve this problem peacefully, negotiating a peaceful way out of this difficult conflict, but behind our backs, a very different scenario was being prepared: Russian President Vladimir Putin pic.twitter.com/ZY8p1nEf84— ANI (@ANI) February 21, 2023 (చదవండి: తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం) -
అగ్రరాజ్యంపై చైనా సీరియస్..వేలు పెట్టొద్దంటూ చురకలు
నిఘా బెలూన్ల వ్యవహారంతో అమెరికా-చైనా దేశాల మధ్య వివాదం నానాటికీ తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్.. చైనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఆయుధాలు ఇచ్చే యోచన చేస్తోందంటూ.. చైనాపై ఆరోపణలు చేశారు బ్లింకెన్. దీంతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ శాంతి నామం జపిస్తూ.. యుద్ధ భూమికి ఆయుధాలను పంపిస్తోంది అమెరికానే గానీ చైనా కాదంటూ విరుచుకుపడ్డారు. తన చర్యలను కప్పిపుచ్చుకుంటూ ఇతరులపై నిందలు మోపేందుకు తెగబడటమే గాక తప్పుడూ సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలను మానుకోవాలంటూ గట్టి కౌంటరిచ్చారు వాంగ్. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్రే పోషిస్తోందని, చర్చలతో సామరస్యం పూర్వకంగా పరిష్కిరించుకునే వైపే మొగ్గుచూపిందని వాంగ్ చెప్పుకొచ్చారు. అలాగే రష్యా చైనా సంబంధాల విషయంలో అమెరికా వేలు పెట్టేందుకు యత్నించవద్దని, దీన్ని తాము అంగీకరించమని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ సమస్యపై చైనా సదా శాంతినే కోరింది, చర్చలనే ప్రోత్సహించిందని వాంగ్ వెన్బిన్ స్పష్టం చేశారు. (చదవండి: మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. మరింత దిగజారుతున్న పాక్ పరిస్థితి..) -
రష్యాకు సహకరిస్తే ఆంక్షలు తప్పవు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యాకు చైనా ఆయుధపరమైన సాయం అందించడం, అమెరికా భూభాగంపైకి నిఘా బెలూన్ను పంపించడంపై అమెరికా తీవ్ర నిరసన తెలిపింది. రష్యాకు సాయమందిస్తే ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా ఉన్నతస్థాయి దౌత్యవేత్త వాంగ్ యీతో శనివారం భేటీ అయ్యారు. ‘మా గగనతలంలోకి నిఘా బెలూన్ను పంపించడం అంతర్జాతీయ చట్టాలకు, మా సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే. ఇలాంటి బాధ్యతారాహిత్య ఘటన పునరావృతం కారాదు’ అని బ్లింకెన్ స్పష్టం చేశారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధ, ఇతరత్రా సాయం అందజేస్తే తీవ్ర ఆంక్షలు విధిస్తామని కూడా బ్లింకెన్ చెప్పారు. అయితే ఇలాంటి చర్యలతో అమెరికా తన బలం చూపాలనుకుంటే విరుద్ధ ఫలితాలే వస్తాయని వాంగ్ యీ బదులిచ్చారు.