![Russian missile strike hits pizza restaurant in Ukraine - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/29/pizza.gif.webp?itok=o2mUKMgi)
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లో పాపులర్ పిజ్జా రెస్టారెంట్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 11 మంది మరణించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో మరో 61 మందికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఇదే పెద్దది.
అయితే ఈ క్షిపణి రెస్టారెంట్ వైపు వెళ్లేలా ప్రయోగించడానికి ఉక్రెయిన్‌కు చెందిన ఒక వ్యక్తి రష్యా మిలటరీకి సాయం చేశాడన్న ఆరోపణలపై ఉక్రెయిన్ అధికారులు ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. రష్యాలో ప్రైవేటు సైన్యం వాగ్నర్ సంస్థ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు తర్వాత రాజకీయంగా, మిలటరీ పరంగా అంతర్గత సంక్షోభం ఉన్నప్పటికీ ఆ దేశం ఉక్రెయిన్‌పై ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment