
ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు
కీవ్: అగ్రరాజ్యం అమెరికా ప్రోద్బలంతో కాల్పుల విరమణకు దాదాపు తలూపిన రష్యా చిట్టచివర్లో తల ఎగరేసింది. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే సమరనినాదం చేసింది.
మంగళవారం రాత్రి నుంచి నిరాటంకంగా రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్‌లో సంభాషించిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం.
దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. ముఖ్యంగా డోనెట్సక్ ప్రాంతంలోని నగరాలపై 150 డ్రోన్ల దాడులు జరిగాయి. వీటితోపాటు కీవ్, ఝిటోమిర్, చెరి్నహీవ్, పోల్టావా, ఖర్కీవ్, కిరోవోహార్డ్, డినిప్రోపెట్రోవ్సŠక్, చెర్కసే ప్రాంతాలపైనా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. అయితే ప్రాణనష్టం వివరాలు వెల్లడికాలేదు.
ఉక్రెయిన్ సైతం డ్రోన్లకు పనిచెప్పింది. రష్యా ప్రాంతాలపై డ్రోన్ దాడులుచేసింది. 57 డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేస్తోందని ఆరోపించింది. ‘‘కాల్పుల విరమణ చర్చల వేళ ఇలా దాడులతో ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో చర్చలు రైలు పట్టాలు తప్పే ప్రమాదమొచ్చింది’’ అని రష్యా రక్షణ శాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment