breaking news
Russia
-
India Tour : పాలెం ఎయిర్ పోర్టులో పుతిన్ ల్యాండింగ్
-
భారత్‌కు చేరుకున్న పుతిన్.. మోదీ ఘన స్వాగతం
ఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ చేరుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ చేరుకున్న పుతిన్‌కు పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. గురువారం(డిసెంబర్ 4వ తేదీ) సాయంత్ర పుతిన్.. భారత్‌కు చేరుకున్నారు. భారత సాంప్రదాయ నృత్యాలతో పుతిన్‌కు స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కారులో పుతిన్, మోదీలు బయల్దేరి వెళ్లారు. పుతిన్ రెండు రోజుల భారత్‌లో పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. కేవలం దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహపడనుంది. ఈ అధికారిక చర్చలకు ముందు, ప్రధాని మోదీ తన నివాసంలో పుతిన్‌కు ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా పుతిన్ సమావేశం కానున్నారు. #WATCH | Russian President Vladimir Putin lands in Delhi; Prime Minister Narendra Modi receives him at the airportPresident Putin is on a two-day State visit to India. He will hold the 23rd India-Russia Annual Summit with PM Narendra Modi in Delhi on December 5(Source: DD) pic.twitter.com/wFcL9of7Eg— ANI (@ANI) December 4, 2025 TWITTER HAS UPDATED THE ❤️ LIKE BUTTONTO CELEBRATE PRESIDENT VLADIMIR PUTIN’S VISIT TO INDIA!Heartfelt thanks for the grand welcome of President Putin in India.#PutinInIndia #VladimirPutin #IndiaRussia #ModiPutinSummit 🇮🇳🇷🇺 pic.twitter.com/lVVkXTkDWI— LOKESH YOGI (@YKumar_Lokesh) December 4, 2025ఈ శిఖరాగ్ర సమావేశం అజెండా విభిన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పారిశ్రామిక సహకారం, వినూత్న సాంకేతికతల బదిలీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. శాంతియుత అంతరిక్ష అన్వేషణ, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ, కార్మిక వలస కార్యక్రమాలలో కొత్త 'ఆశాజనక ప్రాజెక్టులు' కూడా చర్చల జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ, ఈ పర్యటన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడనుంది.2021, డిసెంబర్ 6న భారతదేశాన్ని సందర్శించిన పుతిన్‌కు నాలుగేళ్ల తరువాత ఇదే ఆయనకు తొలి పర్యటన. -
స్మార్ట్‌ఫోన్ ముట్టని పుతిన్.. షాకిచ్చే కారణం
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకుల్లో ఒకరు. ఆయన ప్రతి కదలికలోనూ నిరంతర నిఘా ఉంటుంది. ఆయన చుట్టూ ఉండే ‘భద్రతా వలయం’ ఎప్పుడూ చర్చనీయాంశమే. డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారతదేశ పర్యటనకు రానున్న నేపథ్యంలో, ఆయన భద్రతా ఏర్పాట్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఇంతటి పటిష్టమైన భద్రత మధ్య, ఆధునిక సాంకేతికతకు దూరంగా ఉండే పుతిన్ నిజంగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తారా? అనే ప్రశ్న ఆసక్తి కలిగిస్తుంది.పుతిన్ స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉంటారని ఏఎఫ్‌పీ న్యూస్ నివేదించింది. 2018లో శాస్త్రవేత్తలతో జరిగిన ఒక సమావేశంలో అందరి జేబుల్లో స్మార్ట్ఫోన్లు ఉన్నాయని ఒక ప్రతినిధి ప్రస్తావించగా పుతిన్ వెంటనే స్పందిస్తూ, ‘నా దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదు’ అని స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడా ధృవీకరించారు. ‘స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం అనేది ఆ వ్యక్తి గోప్యత, భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. ఇది ముఖ్యంగా ఉన్నత స్థాయి నేతలకు గొప్ప ప్రమాదాన్ని కలిగిస్తుంది’ అని పెస్కోవ్ స్పష్టం చేశారు. పుతిన్ తన అధికారిక నివాసమైన క్రెమ్లిన్ లోపల మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారని కూడా చెబుతారు. ఆయన ఎవరితోనైనా సంభాషించాలంటే అధికారిక (సురక్షితమైన) ఫోన్ లైన్‌ను ఉపయోగిస్తారు.పుతిన్ ఆధునిక సాంకేతికతపై అనాసక్తిని చాలాసార్లు వ్యక్తం చేశారు. 2017లో పాఠశాల పిల్లలతో మాట్లాడినప్పుడు, తాను ఇంటర్నెట్ను చాలా అరుదుగా ఉపయోగిస్తానని తెలిపారు. అంతేకాదు ఆయన ఇంటర్నెట్ను విమర్శిస్తూ, అది ‘సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన ప్రత్యేక ప్రాజెక్ట్. అందులో సగం అశ్లీలత ఉంటుందని వ్యాఖ్యానించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇంటర్నెట్కు అనుసంధానించే ఎలాంటి పరికరాలను లేదా గాడ్జెట్లను పుతిన్ విశ్వసించరు. మొబైల్ ఫోన్లకు ఆయన దూరంగా ఉండటమే కాకుండా, ఎప్పుడైనా అలాంటి పరికరాలు తనదగ్గరకు తీసుకువస్తే వాటిని దూరం పెట్టాలని ఆదేశిస్తారు. ఈ చర్యలన్నీ ఆయన తన భద్రత, సమాచార గోప్యతకు ఇచ్చే అత్యున్నత ప్రాధాన్యతను స్పష్టం చేస్తాయి.పుతిన్ విదేశాలకు పర్యటించినప్పుడు, ఆయన భద్రతా బృందం తీసుకునే జాగ్రత్తలు మరింత పటిష్టంగా ఉంటాయి. ఆయన బస చేసే హోటల్, తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి ముందుగానే క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. విషప్రయోగం లేదా కలుషితం కాకుండా నిరోధించడానికి, ఆయనకు వడ్డించే ఆహారాన్ని ప్రత్యేకంగా పరీక్షిస్తారు. అంతేకాకుండా ఆయన బస చేసే ప్రాంతాలను కూడా భద్రతా సిబ్బంది పూర్తిగా శానిటైజ్ చేసి శుభ్రం చేస్తారు. ఈ అంశాలు సాంకేతికంగా వెనుకబాటును చూపుతున్నప్పటికీ, అత్యున్నత స్థాయి నేత భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో తెలియజేస్తున్నాయి.ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే! -
అస్థిర ప్రపంచంలో సుస్థిర బంధం
ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సు నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ రాక ఒక పాత సంగతిని గుర్తుకు తెస్తోంది. దాదాపు ఐదు న్నర దశాబ్దాల క్రితం భారతదేశంతో ‘స్నేహ ఒడంబడిక’ కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో చేతులు కలిపేందుకు అప్పటి సోవియట్ యూనియన్ నాయకులు ఇలాగే ఢిల్లీ వచ్చారు. తూర్పు పాకిస్తాన్లో మారణ హోమాన్ని అంత మొందించే ప్రత్యక్ష ప్రమేయానికి ముందు అది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచం రెండు అగ్ర రాజ్యాల మధ్యన చీలిపోయింది. కానీ, ఇపుడు అంతర్జాతీయ వ్యవస్థ ఏ దిశగా సాగుతోందో తెలియని ఒక కొత్త స్థితిలోకి జారు కుంది. అమెరికా శక్తిమంతమైనదిగానే కొనసాగుతోంది కానీ, దాన్ని అంతగా నమ్మడానికి లేదనే అభిప్రాయం పాదుకుంది. చైనా శిఖరా రోహణ ఇతర ప్రవర్ధమాన దేశాలలో ఆందోళనను పెంచుతోంది. ఐరోపా మరింత స్వయం ప్రతిపత్తిని చాటుకునేందుకు తారట్లాడు తోంది. గాలివాటుగా ఉన్న భారత–రష్యాలు అవసరార్థమే అయిన ప్పటికీ, వ్యూహాత్మక పొందికను పునరుద్ధరించుకుంటున్నాయి. ఒకరికొకరు నిలబడి...అమెరికా నిలకడలేనితనంతో దానిపై చాలా దేశాలకు నమ్మకం కొరవడింది. దానికి తోడు అది ఎక్కడెక్కడో సుదీర్ఘ కాలం యుద్ధా లను కొనసాగించి, చివరకు అక్కడ పరిస్థితులు కుదుటపడక పోయినా నిష్క్రమిస్తూ వచ్చింది. అమెరికా లోపల కూడా పరి స్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. తాజాగా, సుంకాల విష యంలో అది అనుసరిస్తున్న తలతిక్క ధోరణి అందుకు ఉదాహరణ. ఇదంతా ప్రపంచంలో ఒక అస్థిర వాతావర ణానికి దారితీసింది. చైనా తన వంతు ఆకర్షణలను, భయాలను రెండింటినీ సృష్టించు కుంది. క్రమేపీ అది దృఢ వైఖరిని చాటడం పెరగడంతో, దాని ప్రత్య ర్థులు, మిత్రులు కూడా దానిపై చిరకాల అభిప్రాయాలను పునరా లోచించుకోవడం ప్రారంభించాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టిన తర్వాత, చైనాతో రష్యా వ్యూహాత్మక ఏకీకరణ బలపడిందికానీ, సంబంధాలు అసమంగానే ఉన్నాయి. మాస్కో వ్యూహాత్మక ఆలోచనల ప్రకారం, దీర్ఘకాలంలో తనకు బెడదగా పరిణమించగల శక్తి అమెరికా కన్నా చైనాకే ఉంది. మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని కనబరచేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు, సైబీరియాకు సంబంధించి రష్యా పడుతున్న ఆందోళన, చైనాకు తాను జూనియర్ భాగస్వామిగా మారవలసి వస్తుందే మోననే భయం క్రెమ్లిన్‌ను మరోసారి భారతదేశానికి సన్నిహితం చేస్తున్నాయి. అయితే, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నిలుస్తుందని కాదు. చైనాపై తాను ఎక్కువ ఆధారపడకుండా భారత్ తనకొక రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని రష్యా ఆలోచన. స్నేహమే కాదు, వ్యూహాత్మకం కూడా!సోవియట్ యూనియన్ చీలికలు పీలికలైన తర్వాత కూడా భారత్‌తో రష్యా స్నేహ సంబంధాలు నిలదొక్కుకుంటూ వచ్చాయి. కశ్మీర్‌పై భారత్ ఇరకాటంలో పడకుండా ఐరాసలో రష్యా తన వీటో గొడుగు పడుతోంది. దానికి తగ్గట్లుగానే, ఉక్రెయిన్‌పై యుద్ధం పర్యవసానంగా రష్యాపై ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు పదేపదే కోరినా భారత్ తలొగ్గలేదు. ఈ విషయమై అమెరికా విధిస్తానన్న సుంకాల బెదిరింపును కూడా భారత్ ఖాతరు చేయలేదు. దీనికి రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకంతో కూడిన స్నేహ సంబంధం ఒక్కటే కారణం కాదు. ఈ బంధాన్ని నిలబెట్టుకునేందుకు రెండు దేశాలకు తమవైన వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి.దానికి తోడు, కొన్నేళ్ళుగా ఎన్నడూ చూడనంత అస్థిర పరిస్థి తులు ప్రపంచంలో తాండవిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ ఒక్క దేశమూ పరిస్థితులను శాసించగలిగిన స్థితిలో లేదు. అగ్ర రాజ్యంగా నిలవాలని కలలు కంటున్న దేశపు అడుగులకు మడుగు లొత్తడానికి ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో చాలా మధ్య స్థాయి దేశాలు సిద్ధంగా లేవు. తమ వ్యూహాత్మక స్వయం ప్రతి పత్తిని కాపాడుకోవాలని గాఢంగా కోరుకుంటున్న భారత – రష్యాలకు ఆ సెంటిమెంట్‌లో ఒక ఉమ్మడి ప్రయోజనం కనిపిస్తోంది. పరస్పర రక్షణభారత్–రష్యాల మధ్య స్నేహ సంబంధాలకు రక్షణ అంశమే ఇప్పటికీ వెన్నెముకగా ఉంది. లాజిస్టిక్స్ విషయంలో పరస్పర సహ కారానికి సంబంధించిన ఒప్పందం కుదరబోతోంది. అది కార్య రూపం ధరిస్తే ఇరు దేశాలు సైనిక స్థావరాలను, రేవులను, వైమానిక క్షేత్రాలను పరస్పరం వినియోగించుకోవచ్చు. దీంతో ఇండో–పసిఫిక్ నుంచి ఆర్కిటిక్ వరకు కార్యకలాపాలు నిర్వహించగలిగినదిగా భారత్ తయారవుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రష్యా భౌతికంగా కాలు మోపేందుకు వీలు చిక్కుతుంది. ప్రపంచంలో సగం వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ ప్రాంతమే జీవనాడి. భారత–రష్యా అధికారులు అత్యంత ఆశావహమైన సైనిక– సాంకేతిక ప్యాకేజీకి రూపుదిద్దుతున్నారు. దీనివల్ల ఎస్–400 గగన రక్షణ వ్యవస్థలను మరిన్ని చోట్ల ఏర్పాట్లు చేయవచ్చు. సు–30 ఎంకెఐ యుద్ధ విమానాలను భారత్ చాలా ఎక్కువగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మరింత దూరం వెళ్ళగలిగినవిగా బ్రహ్మోస్ క్షిపణు లను ఉన్నతీకరించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. సు–57ఇ స్టెల్త్ యుద్ధ విమాన టెక్నాలజీ బదిలీకి సంబంధించి తాత్కాలిక చర్చలైనా మొదలయ్యేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇక భారత్–రష్యా స్నేహంలో అణు సహకారం మరో అంశం. బృహత్తర వీవీఈఆర్–1200 రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలతో రోసాటమ్, భారత అణు శక్తి సంస్థలు ముందుకు ఉరకాలని చూస్తున్నాయి. అలాగే, కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్‌ల అన్వేషణ రెండు దేశాల మధ్య సంబంధాలను గుణాత్మకంగా మార్చివేయవచ్చు. వీటి అంత ర్జాతీయ సరఫరాలో చైనాదే పైచేయిగా ఉంది. ఖనిజాలు సుసంపన్నంగా ఉన్న రష్యా తూర్పు దూర ప్రాంతాలలో సంయుక్త రంగంలో పనులు సాగించాలని భారత్ ఎదురు చూస్తోంది. భారత వైజ్ఞానిక సంస్థలు, రష్యా పరిశోధన కేంద్రాల మధ్య భాగస్వామ్యాలు ఏర్పడితే దేశీయంగా రేర్–ఎర్త్ ప్రాసెసింగ్‌కు, పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీకి రంగం సిద్ధమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, అత్యున్నత ఎలక్ట్రానిక్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల వాల్యూ చైన్‌ను నియంత్రించగల పరిశ్రమలు రెండు దేశాలకు సొంతమవుతాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం సుమారు 65–66 బిలియన్ డాలర్లుంది. 2030 నాటికి దీన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో ఉన్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో వ్యక్తమయ్యేది కేవలం పొత్తు కాదు. స్నేహ సంబంధాలు ఏవీ దెబ్బతిని లేవు కనుక ఇండో–సోవియట్ మైత్రి పునరుద్ధరణ అనడానికి కూడా లేదు. ఇది మరింత ఆచితూచి వేస్తున్న అడుగు కాబోతోంది. మరింత ఆచరణాత్మక దృక్పథం కన పడబోతోంది. అధికార కేంద్రాలు మసకబారి, సమీకరణాలు అను క్షణం మారిపోతున్న వర్తమాన ప్రపంచంలో అంతకన్నా ఇంకేం కావాలి!జయంత రాయ్ చౌధురీవ్యాసకర్త పీటీఐ వార్తా సంస్థ తూర్పు ప్రాంత మాజీ అధిపతి -
పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు, ఐదు తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కల్పించే భద్రతా ఏర్పాట్లు ప్రపంచ స్థాయిలో అత్యంత ఉన్నతమైనవిగా ఉండనున్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన ప్రత్యేక భద్రతా సంస్థ అధికారులు భారత్‌కు చేరుకొని, అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షిస్తున్నారు. పుతిన్ ప్రపంచంలోనే అత్యంత భారీ భద్రత కలిగిన నేతలలో ఒకరిగా పేరొందారు. 2012లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దాడి తర్వాత పుతిన్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఆహారానికి ల్యాబ్‌లో పరీక్షలుపుతిన్ భద్రతా వలయంలో ‘అదృశ్య భద్రతా బృందం’ ఒక కీలకమైన అంశం. ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ ప్రత్యేక బృందం అధ్యక్షుడు పర్యటించే ప్రాంతానికి ఆయన కంటే ముందే చేరుకుంటుంది. స్థానికులతో ఎంతగా కలిసిపోతుందంటే, వారిని ఎవరూ గుర్తించలేరు. రష్యా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా, ఆయన భద్రతా బృందం ఒక పోర్టబుల్ ల్యాబ్‌ను తీసుకువెళ్తుంది. దీని ప్రధాన ఉద్దేశం.. ఆయన తీసుకునే ఆహారం, నీటిలో ఎలాంటి విషాలు లేదా హానికరమైన పదార్థాలు లేవని నిర్ధారించడం. ల్యాబ్ పరీక్ష లేకుండా ఆయనకు ఆహారం వడ్డించరు. పుతిన్ తాగే నీరు కూడా విదేశాల నుండి కాకుండా, రష్యా నుండే వస్తుంది.‘దాపరికానికి’ పోర్టబుల్ టాయిలెట్పుతిన్ ఆహారం విషయంలో అత్యంత కఠినమైన ప్రోటోకాల్‌లను అనుసరిస్తారు. ఆయన వ్యక్తిగత చెఫ్, వంట సిబ్బంది ఎల్లప్పుడూ ఆయనతో పాటు ప్రయాణిస్తారు. విదేశీ పర్యటనల్లో ఆయన హోటళ్లలో లేదా ఆతిథ్య దేశంలోని ఆహారాన్ని తీసుకోరు. ఆయన తన సొంత వంటగదిలో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటారు. అయినప్పటికీ భద్రతా తనిఖీలు తప్పనిసరి. మరింత గోప్యత కోసం పుతిన్ విదేశీ పర్యటనల సమయంలో తన వ్యక్తిగత పోర్టబుల్ టాయిలెట్‌ను కూడా వెంట తీసుకువెళ్లడం గమనార్హం. దీనికి కారణం ఏ దేశం లేదా ఏజెన్సీ తన ఆరోగ్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని (జీవసంబంధమైన నమూనాలు) పొందకుండా నిరోధించడమే.పటిష్టమైన కాన్వాయ్రష్యా అధ్యక్షుడి కాన్వాయ్ అభేద్యంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేక ఆర్మర్డ్ కారుతో పాటు, మెడికేర్ వ్యాన్, ఆహార పరీక్ష కోసం పోర్టబుల్ ల్యాబ్, కమాండ్ కంట్రోల్ వాహనం, స్నిపర్ బృందం, సైబర్ సెక్యూరిటీ యూనిట్, శాటిలైట్ కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. పుతిన్ భారత పర్యటన సందర్భంగా, దేశీయ ఎస్పీజీ, ఎన్ఎస్జీ దళాలు.. రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్ఓ)ఏజెన్సీతో కలిసి పనిచేస్తూ, అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తాయి.ఉమ్మడి భద్రతా వలయంపుతిన్ పర్యటన సందర్భంగా భారతదేశంలో భద్రతా ప్రోటోకాల్‌లు అత్యంత కట్టుదిట్టంగా ఉండనున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ హౌస్ చుట్టూ నో-ఫ్లై, నో-డ్రోన్ జోన్లుగా ప్రకటిస్తారు. అధ్యక్షుడి రాకపోకల కోసం ప్రత్యేక వీఐపీ భద్రతా కారిడార్, ట్రాఫిక్ లాక్డౌన్ జోన్ అమలు చేస్తారు. జామర్లు, యాంటీ-డ్రోన్లు, స్నిపర్ల ద్వారా నిరంతర తనిఖీలు చేపడతారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, రష్యన్ ఏజెన్సీల ఉమ్మడి భద్రతా వలయం ఈ పర్యటనను మరింత పటిష్టం చేయనుంది.భారత్‌కు సదవకాశంఈ పర్యటన భారతదేశానికి ఒక ప్రధాన అవకాశంగా మారనుంది. వ్యూహాత్మక, రక్షణ, ఆర్థిక సహకారంతో పాటు, కార్మిక, సామాజిక సహకారంపై గణనీయమైన చర్చలకు అవకాశం ఏర్పడనుంది. రష్యన్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో పెరుగుతున్న కార్మిక కొరతను తీర్చడానికి 2030 నాటికి సుమారు 31 లక్షల మంది కార్మికులు అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రష్యా కనీసం పది లక్షల మంది విదేశీ కార్మికులను నియమించుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో భారతదేశం ప్రధాన వనరుగా మారే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, భారత యువతకు రష్యాలో చట్టబద్ధమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారతదేశ విదేశీ మారకం పెరుగుతుంది, రెండు దేశాల మధ్య సామాజిక, ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.ఇది కూడా చదవండి: బిహార్ ఎఫెక్ట్: జార్ఖండ్‌లో సోరెన్-బీజేపీ కొత్త సర్కారు? -
ఈయూ కోరుకుంటే యుద్ధానికైనా సిద్ధం
మాస్కో: నాలుగేళ్ల యుద్ధానికి ఇకనైనా ముగిద్దామని భావిస్తుంటే యురోపియన్ యూనియన్ సభ్యదేశాలు అడ్డు తగులుతున్నాయని రష్యా( Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్, ఆ దేశ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ల ప్రతినిధి బృందం మంగళవారం రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్లో పుతిన్‌తో భేటీ అయింది. ఆ తర్వాత పుతిన్ మాట్లాడారు. ‘‘ శాంతి ఒప్పందం విషయంలో ట్రంప్‌కు, యురోపియన్ యూనియన్ దేశాలకు మధ్య సఖ్యత లేదనుకుంటా. నిజానికి ఉక్రెయిన్(Ukraine)లో శాంతి కపోతాలు ఎగరడం ఈయూ దేశాలకు ఇష్టం లేదనుకుంటా. శాంతి చర్చలకు ఈ దేశాలే విఘాతం కల్గిస్తున్నాయి. నిజానికి ఈయూ దేశాలతో యుద్ధానికి దిగడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. కానీ వాళ్లు యుద్ధానికే మొగ్గుచూపితే రణరంగంలోకి దూకేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఈయూ దేశాలకు స్పష్టమైన శాంతి అజెండా లేదు. చూస్తుంటే వాళ్లు యుద్ధానికే మొగ్గుచూపుతున్నట్లు కని్పస్తోంది. వాళ్లు చేసిన శాంతి ఒప్పంద ప్రతిపాదనలు రష్యాకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ ప్రతిపాదనలు మొత్తం శాంతి ప్రక్రియను స్తంభింపజేసేలా ఉన్నాయి. అదే వాళ్ల లక్ష్యం అనుకుంటా’’ అని పుతిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
Virat: మే డే.. మే డే.. సాయం కావాలి
రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ‘విరాట్’పై నల్లసముద్రంలో దాడి జరిగింది. అందులో ఉన్న సిబ్బంది అత్యవసర సందేశాలు పంపిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ అందులో సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించుకుంది.‘‘ఇది విరాట్. సాయం కావాలి! డ్రోన్ దాడి! మేడే!’’ అని సిబ్బంది అంటున్న ఆడియో రికార్డు అయింది. అంతకుముందు శుక్రవారం రాత్రి కూడా ఈ నౌకపై దాడులు జరిగాయి. అందులోని సిబ్బంది ‘డ్రోన్ దాడి’ అంటూ రేడియోలో అత్యవసర సందేశం పంపారు. ఇటు టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.‘విరాట్’కు స్వల్ప నష్టమే జరిగిందని సమాచారం. ఆ నౌక ప్రస్తుతం స్థిరంగానే ఉందని.. సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. నల్ల సముద్ర తీరం నుంచి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. రష్యా ‘షాడో ఫ్లీట్’Shadow Fleet ట్యాంకర్లపై జరిగిన ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ నౌకల వల్లే యుద్ధం చేయడానికి రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోందని ఆరోపించింది. అందుకే వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. సీ బేబీ (Sea Baby) డ్రోన్ల ద్వారా ఈ దాడులు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. విరాట్ అనేది రష్యా షాడో ఫ్లీట్ లో భాగమైన ఆయిల్ ట్యాంకర్. షాడో ఫ్లీట్ అనేవి పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకుని రష్యా చమురు రవాణా చేసే నౌకలు.అయితే వీటిపై దాడుల వల్ల నల్ల సముద్రంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఇక సీ బేబీ (Sea Baby) డ్రోన్లు అనేవి ఉక్రెయిన్ అభివృద్ధి చేసిన అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ (USVs). మనుషులు లేకుండా సముద్రంపై నడిచే చిన్న బోట్ల రూపంలో ఉండే డ్రోన్లు. ఇవి ప్రధానంగా కమికాజే దాడులు (తమను తాము పేల్చుకునే దాడులు) చేయడానికి ఉపయోగిస్తారు.Ukrainians attack two tankers of the Russian shadow fleet.According to sources, SBU Sea Baby naval drones attacked the two sanctioned oil tankers KAIRO and VIRAT in the Black Sea. It was a joint operation between the SBU's 13th Main Directorate for Military Counterintelligence… pic.twitter.com/U82scXaM5r— Jürgen Nauditt 🇩🇪🇺🇦 (@jurgen_nauditt) November 29, 2025 -
భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనుండడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలపై చర్చ జరుగుతోంది. సంప్రదాయంగా బలమైన మిత్ర దేశాలైన భారత్, రష్యాల మధ్య ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు.తగ్గిన చమురు కొనుగోళ్లు..రష్యా-ఉక్రెయిన్ వివాదం తరువాత అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా భారత్‌కు చౌకగా ముడి చమురును అందించింది. దీంతో భారత్ చమురు దిగుమతుల్లో రష్యా ప్రధాన సరఫరాదారుగా అవతరించింది. అయితే, ఇటీవల కాలంలో ధర పరిమితుల సమస్యలు, చెల్లింపుల విధానాల్లోని క్లిష్టత, దేశీయ అవసరాల సర్దుబాటు కారణంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొంతమేరకు తగ్గించుకుంది. దాంతోపాటు భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు కొనుగోళ్లు తగ్గాయి.భారత్-రష్యా స్నేహానికి ఆర్థిక మూలస్తంభంగా ఉన్న ఈ కొనుగోళ్ల తగ్గింపు రష్యాకు కొంత ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ సమయంలో పుతిన్ పర్యటన జరగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పర్యటన కేవలం రక్షణ లేదా ఎనర్జీ రంగాలకే పరిమితం కాకుండా రష్యాకు వివిధ మార్గాల్లో చేదోడుగా నిలిచే కొత్త ఆర్థిక, వ్యూహాత్మక ఒప్పందాలను అన్వేషించేందుకు ఉపయోగపడనుంది.కీలక ఒప్పందాలపై అంచనా..భారత్‌కు రష్యా అతిపెద్ద రక్షణ భాగస్వామి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఒప్పందాలు ఈ రంగంలోనే కుదిరే అవకాశం ఉంది. S-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీలు, దాని భవిష్యత్తు నిర్వహణపై డీల్స్ కుదిరే అవకాశం ఉంది. AK-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీకి సంబంధించిన వెంచర్లపై ఒప్పందం. అత్యాధునిక రక్షణ సాంకేతికత అభివృద్ధిలో సంయుక్త పరిశోధన, అభివృద్ధి డీల్స్ జరిగే అవకాశం ఉంది.చమురు, రక్షణ పరికరాల కొనుగోళ్ల విషయంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం ఇరు దేశాల లక్ష్యం. దీని కోసం దేశీయ కరెన్సీలైన రూపాయి, రూబుల్ ద్వారా చెల్లింపులు జరిపే సుస్థిర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇది రష్యాపై ఉన్న అంతర్జాతీయ చెల్లింపుల ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.అంతరిక్ష, అణు శక్తి సహకారంభారతదేశంలో రష్యన్ సాంకేతికతతో నిర్మిస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ తదుపరి యూనిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఒప్పందాలు. గగన్‌యాన్ వంటి భారత అంతరిక్ష కార్యక్రమాలకు రష్యా సహకారం, సంయుక్త ఉపగ్రహ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చలు జరిగే అవకాశం ఉంది.కొత్త డీల్స్చమురు కొనుగోళ్లు తగ్గిన నేపథ్యంలో రష్యా భారత్ నుంచి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ప్రయోజనం పొందేందుకు కొన్ని కొత్త రకాల డీల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆంక్షల ప్రభావం తక్కువగా ఉన్న రంగాలపై దృష్టి సారిస్తూ భారత్ నుంచి రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ (ముఖ్యంగా జెనరిక్ మందులు), ఐటీ సేవలను పెద్ద ఎత్తున ఎగుమతి చేసుకునేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. రష్యా ఈ రంగాల్లో భారత్‌ను సుస్థిర సరఫరాదారుగా గుర్తించడానికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.రవాణా కారిడార్లుఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌ఫోర్ట్ కారిడార్ కార్యకలాపాలను వేగవంతం చేయడంపై ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ముంబైని రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్తో కలుపుతూ ఇరాన్ మీదుగా సాగే ఈ కారిడార్ పశ్చిమ దేశాల ద్వారా కాకుండా, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని అందిస్తుంది. ఇది రష్యా తన వస్తువులను ఇతర దేశాలకు తరలించడానికి కీలక వ్యూహాత్మక ప్రత్యామ్నాయం అవుతుంది.సహజ వాయువుచమురు కొనుగోళ్లు తగ్గినప్పటికీ రష్యా తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) అమ్మకాలను భారత్‌లో పెంచేందుకు ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతంలోని ఇంధన ప్రాజెక్టుల్లో భారత పెట్టుబడులు పెంచేందుకు ఒప్పందాలు కుదరవచ్చు. ఈ డీల్స్ దీర్ఘకాలికంగా భారత్‌కు ఎనర్జీ సెక్యూరిటీను, రష్యాకు స్థిరమైన నిధులను అందిస్తాయి.ఇదీ చదవండి: వెండికి హాల్‌మార్కింగ్.. వజ్రాభరణాలపై ఫ్రేమ్‌వర్క్ -
పుతిన్-మోదీ దోస్తీ.. టెన్షన్లో ట్రంప్!
ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యాపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ చమురు విషయంలో భారత్‌పై సుంకాల యుద్ధమే చేశారు. రెండు దఫాలుగా 50 శాతం అన్యాయంగా పన్నులు విధించారు. అయితే ఏకపక్ష నిర్ణయాలకు తాము తలొగ్గబోమని.. జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని భారత్ కుండబద్ధలు కొట్టింది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన పలు ప్రకటనలనూ (పాక్-భారత్ ఉద్రిక్తతలను ఆపానంటూ చేసినవి కూడా) ఖండించింది కూడా. ఈలోపు.. షాంగై సదస్సులో పుతిన్-మోదీ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావడంలాంటివి ట్రంప్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆ రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని.. అవి ఎలా పోయినా తనకు సంబంధం లేదంటూ ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆయన స్వరం మారింది. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించబోతోందని.. ప్రధాని మోదీ మాట మీద తనకు నమ్మకం ఉందని.. భారత్‌తో అమెరికా అనుబంధం కొనసాగుతుందంటూ స్వరం మార్చారు. అఫ్కోర్స్ భారత్ వాటిని ఖండించింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు రానున్నారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాస్తవంగా ఈ ఇద్దరు శక్తివంతమైన నేతల భేటీపై గత ఆరు నెలలుగా ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వీళ్ల కలయిక అంటే ఏమాత్రం మిండుగు పడని ట్రంప్ ఎలా స్పందిస్తారో ? అనేదే అందుకు ప్రధాన కారణం. వాస్తవానికి రష్యా చమురును భారత్‌కు దూరం చేయాలని ట్రంప్ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే ఆ పాచికలేవీ పారలేదు. సరికదా ట్రంప్ నుంచి రష్యా చమురు సరఫరాదారులైన ఆంక్షల ప్రకటన వెలువడగానే భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ మాస్కోకు వెళ్లి పుతిన్‌తో సమావేశం అయ్యారు. అటుపై పుతిన్ సన్నిహితుడైన నికోలాయ్ పెత్రుషెవ్తో ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడేమో డిసెంబరు 4, 5 తేదీల్లో పుతిన్ భారత్‌లో పర్యటిస్తారనే ప్రకటన వెలువడింది. పుతిన్ ఢిల్లీలో జరగబోయే 23వ రష్యా-భారత్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొంటారు. అయితే భారత్‌తో భారీ ఎత్తున ఒప్పందాల ఎజెండాతోనే రష్యా అధ్యక్షుడు భారత్‌కు వస్తున్నారా?.. ఉక్రెయిన్ సంక్షోభం ముగించేందుకు మోదీ మధ్యవర్తిత్వాన్ని పుతిన్ కోరనున్నారా? రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ మాటల్ని పట్టించుకోకూడదని చెబుతారా? అసలు ఇవేవీ కావు.. సైనికపరమైన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నారా?.. పుతిన్ భారత్‌కు ఎందుకొస్తున్నారనే ప్రశ్నలపై చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో పాక్ క్షిపణులను తుక్కు చేసి ప్రపంచానికి సత్తా చాటిన భారత్ ఇప్పుడు రష్యా ఆయుధ సంపత్తిపై ఆసక్తి ప్రదర్శిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా మేక్ ఇన్ ఇండియానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితుల్లో అది కష్టతరమేనన్న అభిప్రాయమూ రక్షణ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే అమెరికా ఆంక్షలను లెక్కచేయని తరుణంలో పుతిన్ భారత్‌తో మరో కోణంలోనూ ఒప్పందాలు చేసుకునే అవకాశం లేకపోలేదు. అందులో.. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్తు ప్లాంట్‌లో కొత్త మాడ్యులర్ రియాక్టర్ల నిర్మాణంలో రష్యా భాగస్వామిగా మారే అవకాశం బలంగానే కనిపిస్తోంది. ఎస్సీవో శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సుదీర్ఘంగా భేటీ అయిన పుతిన్.. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు రావడం ట్రంప్‌ను ఒత్తిడికి గురిచేసే అంశమే. అందుకే వీళ్ల దోస్తీపై ఆయన పగబట్టారు. అదీగాక అమెరికా, యూరప్ దేశాలకు వ్యతిరేకంగా పుతిన్ ఆసియా దేశాలతో ఓ బలమైన కూటమిగా ఎదిగేతే గనుక.. అందులో భారత్ ప్రధాన భూమిక అవకాశాలను తోసిపుచ్చలేం. అందుకే భారత్‌తో మరింత దగ్గరైతే రష్యా మళ్లీ సూపర్ పవర్‌గా ఎదుగుతుందనే భయం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.:::వెబ్‌డెస్క్ స్పెషల్ -
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కొత్త బ్యాచ్
మాస్కో: ముగ్గురు సభ్యులతో కూడిన అమెరికా–రష్యా వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తమ ప్రయాణం మొదలెట్టి విజయవంతంగా పూర్తిచేసింది. షెడ్యూల్లో భాగంగా ఐఎస్ఎస్కు గురువారం నాసా వ్యోమగామి క్రిస్ విలియమ్స్, రష్యా క్రూమేట్స్ సెర్గీ మికాయెవ్, సెర్గీ కుద్స్వెర్చ్కోవ్ చేరుకున్నారు. అంతకుముందు కజక్‌స్థాన్‌లోని బైకనూర్ ప్రయోగకేంద్రం నుంచి వ్యోమగాములతో కూడిన సోయూజ్ ఎంఎస్–28 వ్యోమనౌకను సోయూజ్ బూస్టర్ రాకెట్ స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 2.27 గంటలకు నింగిలోకి పంపించింది. ఐఎస్ఎస్లో ఈ ముగ్గురు ఎనిమిది నెలలపాటు గడపనున్నారు. -
వింటర్ ఎగ్ @ 236 కోట్లు!
లండన్: రష్యా జార్ చక్రవర్తుల రాజరిక ఠీవీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే అత్యంత అరుదైన వింటర్ఎగ్ ఒకటి ఇప్పుడు వేలంపాటలో రికార్డ్ల మోత మోగించేందుకు సిద్ధమైంది. రష్యా జార్ చక్రవర్తి నికోలస్–2 తన తల్లి, రాజమాత మారియా ఫియోడోరోవ్నాకు వందేళ్ల క్రితం ఈస్టర్ కానుకగా బహూకరించిన విలువైన వింటర్ ఎగ్ గురించే ఇప్పుడా చర్చ అంతా. డిసెంబర్ రెండో తేదీన క్రిస్టీస్ వేలంపాట సంస్థ తమ లండన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే వేలంపాటలో ఈ స్ఫటిక ఫ్యాబెర్జీ వింటర్ ఎగ్ ఏకంగా రూ.236 కోట్లకుపైగా ధర పలకవచ్చన్న అంచనాలు ఎక్కువయ్యాయి. దీనిని ప్రఖ్యాత వజ్రాభరణాల సంస్థ ఫ్యాబెర్జీ తయారుచేసింది. 1913 సంవత్సరంలో రాజు నికోలస్ దీనిని తన తల్లికి బహూకరించారు. రష్యా ప్రభుత్వ అధీనంలోకాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఏడింటిలో ఇదీ ఒకటని వేలంసంస్థ పేర్కొంది.ఎన్నెన్నో ప్రత్యేకతలుదవళవర్ణంలో ధగధగా మెరిసేపోయే ఈ వింటర్ ఎగ్ ఎత్తు 10 సెంటీమీటర్లు. లీలగా చూస్తే పూర్తి గుడ్డులాగా కనిపించినా దానిని రెండుభాగాలుగా తెరవొచ్చు. చలికాలంలో ఆరుబయట పెడితే మంచుబిందువులు పడి ఘనీభవించినట్లు స్ఫురించేలా దీనిని డిజైన్‌చేశారు. ప్లాటినమ్ లోహపు బుల్లి బుట్టలో అనిమోనిస్ పుష్పాలను గుదిగుచ్చి చూడచక్కటి పుష్పగుచ్ఛా న్ని తయారుచేసి లోపల పెట్టారు. గుడ్డు అంతర్గ తంగా మొత్తంగా ఏకంగా 4,500 చిన్న చిన్న వజ్రా లను పొదిగారు. అనిమో నిస్ పుష్పాలను క్వార్జ్‌తో తయారుచేశారు. ఆకుల ను పచ్చలతో రూ పొందించారు. శీతాకాల చలిని చీల్చుకుంటూ వసంత రుతువులోకి కాలం అడుగుపెట్టేవేళ అనిమో నిస్ పుష్పాలు వికసిస్తా యి. కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతిగా ఇస్తారు. ఫ్యాబెర్జీ వజ్రాభరణాల సంస్థలోని ఏకైక కళాకృతి కళాకారిణి ఆల్మా పిహల్ దీనిని డిజైన్ చేశారు. స్వర్ణకారులైన ఆల్బర్ట్ హల్మ్స్ట్రోమ్, పిహల్ బంధువు దీనిని తయారు చేశారు. ‘‘అద్భుతమైన చేతి పనితనం, ఆకర్షణీ యమైన డిజైన్లకు ఈ వింటర్ ఎగ్ పెట్టింది పేరు. అలంకరణ కళల్లో ఈ ఎగ్ ఒకరకంగా మోనాలిసా పెయింటింగ్లాంటిది’’ అని క్రీస్టిస్ వేలంసంస్థలో రష్యా కళారూపాల విభాగ అధిపతి మార్గో ఒగానేసియన్ వ్యాఖ్యానించారు. పీటర్ కార్ల్ ఫ్యాబెర్జీ సారథ్యంలోని వజ్రా భరణాల సంస్థ 1885 నుంచి దాదాపు పాతికేళ్ల పాటు రష్యా రాజకుటుంబాల కోసం దాదాపు 50 స్మారక ఎగ్‌లను తయారు చేసి ఇచ్చింది. జార్ చక్రవర్తి అలెగ్జాండర్–3 తన సతీమణికి ప్రతి ఈస్టర్కు ఒక ఈస్టర్ ఎగ్ ను బహూకరించి ఇలా ఎగ్‌ల బహూకరణ పర్వానికి తెరలేపారు. దీనిని నికోలస్–2 కొనసా గించారు. -
జంక్‌ఫుడ్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఆ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్..
జంక్‌ఫుడ్ ప్రమాదకరమని నిపుణులు హెచ్చిరిస్తుంటే..పెడచెవిన పెట్టిన వాళ్లెందరో. అంతెందుకు చీట్‌మీల్ పేరుతో బర్గర్లు, పీజాలు లాగించేసేవాళ్లు కోకొల్లలు. అలాంటి వాళ్లందరికీ ఈ ఘటన ఓ కనువిప్పు. మారథాన్ ఛాలెంజ్‌లో భాగంగా తిన్న జంకఫుడ్ ఓ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలనే హరించేసింది. ఎవ్వరూ ఇలాంటి ఛాలెంజ్స్‌లో పాల్గొనేందుకు జంకేలా చేసింది కూడా.అసలేం జరిగిందంటే..రష్యన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ 30 ఏళ్ల డిమిత్రి నుయాన్జిన్, బరువు తగ్గించే కార్యక్రమాన్ని ప్రోత్సహించే నిమిత్తం ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఆయన సదుద్దేశ్యంతో చేస్తే..ఆ ప్రయోగం అతడి ప్రాణమే పోయింది. అదికూడా నిద్దురలోనే ప్రాణం పోవడం బాధకరం. అధిక బరువు ఎంత పెద్ద సమస్య అని అవగాహన కల్పించే నిమిత్తం డిమిత్రి 25 కిలోలు బరువు పెరగాలన్న లక్ష్యం పెట్టుకున్నాడు. ఈ మేరకు మారథాన్లొ భాగంగా అతిగా తినే ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. తన క్లయింట్లు తనలా బరువు తగ్గేలా ప్రేరణనివ్వాలని ఈ ఛాలెంజ్ పాల్గొన్నాడు. ఆ నేఫథ్యంలోనే రోజుకు దాదాపు 10 వేల కేలరీలకు పైగా జంక్‌ఫుడ్ తిన్నాడు. అనుకున్నట్లుగా బరువు పెరిగాడు..తన ఫాలోవర్స్‌కి కూడా తనలోని ఆ ఛేంజ్‌ని బహిర్గతం చేయడమే కాకుండా ఆ అధిక బరువుని తగ్గించుకునేలా కూడా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు కూడా. అయితే అనూహ్యంగా చనిపోవడానికి ఒక రోజు ముందు తను చేసే వర్కౌట్ల సెషన్‌ను రద్దు చేసుకున్నాడు కూడా. తాను ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యుడుని సంప్రదించాలను చూస్తున్నట్లు నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు కూడా. అయితే అదే చివరి మాట అవుతుందని అనుకోలేదు అతడి అభిమానులు, ఫాలోవర్లు. అతడి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అతడి గుండె నిద్దురలోనే ఆగిపోయిందని, అవే అతడి చివరి మాటలయ్యాయనని బాధగా చెబుతున్నారు. అంతేగాదు డిమిత్రి గత నవంబర్ 18న చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో లేస్ ప్యాక్ తినడం తోపాటు తాను 105 కిలోలు బరువు పెరిగినట్లు కూడా వెల్లడించాడు. అంతేగాదు నెలలో కనీసం 13 కిలోలు పెరిగినట్లు తెలిపాడు. నెటిజన్లు డిమిత్రి మృతికి స్పందిస్తూ..అతడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అలాగే ఇలాంటి ఈటింగ్ ఛాలెంజ్‌ల్లో పాల్గొనేవాళ్లకు ఈ సంఘటన ఓ గొప్ప పాఠం అంటూ పోస్టులు పెట్టారు. కాగా, డిమిత్రీ ఈ ఈటింగ్ ఛాలెంజ్‌లో భాగంగా రోజు వారీ ఆహారంలో పేస్ట్రీలు, కేక్‌లు, మయోన్నెస్‌లో ఉడికించిన డంపింగ్స్, రాత్రి భోజనంలో రెండు పిజ్జాలు తప్పనిసరిగా తిన్నట్లు తెలిపాడు. అధిక బరువుని తగ్గించడం ఎలా అనేదానిపై ప్రేరణ కలిగించేలా బరువు పెరగాలనుకుంటే..అది అతడి ఉసురే తీసేసింది. డిమిత్రీ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఓరెన్‌బర్గ్ ఒలింపిక్ రిజర్వ్ స్కూల్ అండ్ నేషనల్ ఫిట్నెస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, పైగా ఒక దశాబ్దం పాటు ఉన్నత రష్యన్లకు వ్యక్తిగత కోచ్ కూడా ఆయన. అలాంటి వ్యక్తి జంక్ ఫుడ్ ఎంత ప్రమాదకరం అనేది చూపిద్దామనుకుంటే అతడి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. నిజంగానే ఇంత ప్రమాదమా అంటే..జంక్‌ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు.ఎందుకంటే ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనకు అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనిని తరచుగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.(చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమైన స్టార్టప్ ఇంజనీర్ కానీ..) -
రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు
అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్ నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ముడి చమురు సరఫరాలను భారీగా పెంచాయి. దీని ఫలితంగా నవంబర్ 2025లో రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రోజుకు సగటున 1.9 మిలియన్ బ్యారెల్స్‌తో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.గ్లోబల్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లెర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 2025లో రష్యా అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా భారత్ నిలిచింది. ఈ నెలలో ఇప్పటివరకు కార్గోలు సగటున రోజుకు 1.886 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకున్నాయి.గణనీయ పెరుగుదలనవంబర్ 2025లో చమురు దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 2024లో ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం అధికమయ్యాయి. అలాగే 2023లో ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని కెప్లర్ డేటా వెల్లడించింది. నవంబర్ 21లోపు కొనుగోళ్లు పెరగడంతో భారతదేశానికి రష్యన్ క్రూడ్ దిగుమతి 5 నెలల గరిష్టానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, నవంబర్ 21 నుంచే రోస్నెఫ్ట్(Rosneft), లుకోయిల్ (Lukoil)పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకుముందే భారీగా క్రూడ్‌ను దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.తగ్గుముఖం పట్టే అవకాశంనవంబర్ 21 తర్వాత రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం.. -
Russia-Ukraine: యుద్ధం విధ్వంసం నెత్తురోడుతున్న ఉక్రెయిన్
-
భారత్‌కు రష్యా బంపరాఫర్..
న్యూఢిల్లీ: భారత్‌కు రష్యా బంపరాఫర్ ప్రకటించింది. రోస్నెఫ్ట్, లుకోయిల్ వంటి ప్రధాన రష్యన్ చమురు సంస్థలపై అమెరికా గత వారం ఆంక్షలు విధించడంతో, రష్యా తన ముడి చమురును రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు భారత్‌కు అందించేందుకు సిద్ధమైంది.భారత రిఫైనర్లకు యురల్స్ ధర డెలివరీ ప్రాతిపదికన డేటెడ్ బ్రెంట్‌తో పోలిస్తే బ్యారెల్‌పై ఏడుడాలర్ల వరకు తగ్గించింది. ఈ ఆఫర్ డిసెంబర్లో లోడ్ అయ్యే, జనవరిలో భారత్‌కు చేరే కార్గోలపై వర్తించనుంది.అమెరికా ఆంక్షలకు ముందు యురల్స్ బ్యారెల్‌కు మూడు డాలర్ల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. రోస్నెఫ్ట్, లుకోయిల్‌పై ఆంక్షలు అమలులోకి వచ్చిన తర్వాత భారత రిఫైనర్లు రష్యన్ చమురు ఆర్డర్లు తగ్గించాయి. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత భారత్ చౌకైన చమురును విస్తృతంగా దిగుమతి చేసుకుంది. కానీ ఆంక్షల కారణంగా దిగుమతి నిలిపివేసింది. రోస్నెఫ్ట్, లుకోయిల్‌తో పాటు గాజ్ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్‌నెఫ్టెగాస్‌పై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత రిఫైనర్లు మధ్యప్రాచ్యం సహా ఇతర ప్రాంతాల నుండి ఎక్కువ ముడి చమురును కొనుగోలు చేస్తున్నారు. రష్యా చమురు ధరలు తగ్గడం భారత్‌కు తాత్కాలిక లాభం కలిగించవచ్చు. కానీ ఆంక్షల కారణంగా సరఫరా స్థిరత్వం అనిశ్చితంగా మారింది. రిఫైనర్లు తక్కువ ధరల ఆకర్షణతో రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నా, దీర్ఘకాలంలో అమెరికా ఆంక్షలు వాణిజ్యాన్ని మరింత క్లిష్టం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
యూఎస్ శాంతి ప్రణాళికపై జెనీవాలో చర్చలు
జెనీవా: రష్యా దురాక్రమణకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో మొదటి దఫా చర్చలు ముగిశాయని ఉక్రెయిన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షభవనం చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యర్మాక్ ఎక్స్‌లో వెల్లడించారు. ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందం పొరుగుదేశంపై దురాక్రమణకు పాల్పడిన రష్యాకే అనుకూలంగా ఉండటంపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్ను అవి కోరుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ కూడా పాలుపంచుకున్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనే దిశగా అమెరికా బృందంతో నిర్మాణాత్మకంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని యర్మాక్ తెలిపారు. ఈ ఒప్పందంతో దేశ సార్వభౌమత్వమా? అమెరికా మద్దతును నిలుపుకోవడమా? తేలిపోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించడం తెల్సిందే. ఇప్పటికే కనీసం డజను సార్లు తిరస్కరించిన రష్యా డిమాండ్లనే ఈ ఒప్పందంతో ఆమోదించాల్సి రావడం జెలెన్స్కీకి మింగుడు పడటం లేదు. ఉక్రెయిన్ పారిశ్రామిక రంగానికి ఎంతో కీలకమైన డోన్బాస్ను రష్యాకు వదిలేయడం, సైన్యాన్ని పరిమితం చేసుకోవడం వంటివి ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇవి తుది ప్రతిపాదనలు కావని, ఎలాగైనా యుద్ధాన్ని ఆపడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. అయితే, గురువారం కల్లా ఒక స్పష్టతకు రావాలని ఆయన శనివారం ఉక్రెయిన్‌కు గడువు విధించారు. కాగా, నల్ల సముద్రంపై ఉక్రెయిన్ స్వేచ్ఛగా ధాన్యం రవాణా చేసేందుకు ఉద్దేశించిన గత ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం మాట్లాడుతానని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. -
ట్రంప్ హెచ్చరిక.. ఉక్రెయిన్‌కు టెన్షన్?
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు కొంత అనుకూలంగా ఉంటూ.. ఉక్రెయిన్‌కు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా జెలెన్స్కీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరు దేశాల మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అమెరికా 28 అంశాల ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా వైట్‌హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ విషయంలో ఇది తన తుది ప్రతిపాదన కాదన్నారు. ఒకవేళ జెలెన్స్కీ ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే, ఆయన చివరి వరకు పోరాటం కొనసాగించవచ్చు. శాంతి స్థాపనే తమ లక్ష్యమని, ఎలాగైనా దాన్ని సాధిస్తామని అన్నారు. తాను 2022లో అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధమే జరిగేది కాదని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో నవంబర్ 27లోగా అంగీకరించాలంటూ ఉక్రెయిన్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇక, ఈ ప్రణాళికలో చాలా మార్పులు అవసరమని ఉక్రెయిన్ మిత్రదేశాల కూటమి జెలెన్స్కీకి తేల్చిచెప్పింది.Reporter “Is this your final offer to Ukraine”Trump: “No”Even Donald Trump he knows he went to far, he knows his treachery was too obvious. Even the doubters can see he is a Russian asset now and he’s risked his own presidency with what he has done. pic.twitter.com/xIXmWpTy5e— Bricktop_NAFO (@Bricktop_NAFO) November 22, 2025ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రణాళికపై మరో తీవ్రమైన ఆరోపణ బయటకు వచ్చింది. 28 పాయింట్లు ఉన్న ఈ పత్రం వాస్తవానికి రష్యా నుంచి వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెనేటర్లకు చెప్పినట్లు రిపబ్లికన్ సెనేటర్ మైక్ రౌండ్స్ వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించలేదు. దీంతో, ఈ ప్రతిపాదనకు మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది.జెలెన్స్కీ ఆందోళన.. మరోవైపు.. ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒప్పందంలోని చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని కీవ్ భావిస్తోంది. అంగీకరిస్తే దేశ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఒప్పుకోకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. అమెరికాతో స్నేహాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంతో.. ఆ దేశ జెలెన్స్కీ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది. అదే సమయంలో రాజకీయంగా, సైనికపరంగా కూడా ఆయన తీవ్ర ఇబ్బందుల్నే ఎదుర్కొంటున్నారు.ట్రంప్ శాంతి ప్రణాళిక.. ఈ శాంతి ప్రణాళిక ప్రకారం.. ఉక్రెయిన్ తన సైన్యాన్ని ఆరు లక్షలకు కుదించుకోవాలి. నాటోలోకి ఉక్రెయిన్ ఎప్పటికీ చేరకూడదు. అన్నింటికంటే కీలకం.. క్రిమియా, డాన్బాస్, లుహాన్స్క్తో పాటు.. ఖేర్సన్లో, జపోరిజియాలలో కొన్ని భూభాగాలను రష్యాకు అప్పగించాలి. ఈ ప్రతిపాదనను జెలెన్స్కీ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అయినా ఒప్పందంలో భూభాగాల అప్పగింత ప్రతిపాదనను ట్రంప్ చేయడం గమనార్హం.యుద్ధంలోనూ ఎదురుదెబ్బలుయుద్ధక్షేత్రంలోనూ ఉక్రెయిన్‌కు పరిస్థితులు ఆశాజనకంగా లేవు. చాలా ప్రాంతాల్లో ఆ దేశ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రష్యా నెమ్మదిగా కీలక ప్రాంతాలను ఆక్రమిస్తోంది. దొనెట్స్క్, ఖేర్సన్ ప్రాంతాల్లో ముందుకు కదులుతోంది. ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భారీస్థాయిలో దాడులు చేస్తోంది. ఆయుధాల కొరత కూడా ఉక్రెయిన్ సైన్యాన్ని ఇబ్బంది పెడుతోంది. అమెరికా, ఇతర ఐరోపా దేశాల నుంచి సరఫరాలు అనుకున్నంత వేగంగా ఆ దేశానికి చేరడం లేదు. మానవ వనరుల కొరత కూడా వేధిస్తోంది. కొత్తగా సైన్యంలోకి ఎవరూ చేరడానికి ముందుకు రావడం లేదు. దీంతో సైన్యం నైతిక స్థైర్యమూ దెబ్బతింటోంది. -
ఆత్మ గౌరవమా.. కీలక మిత్రుడా..?: జెలెన్స్కీ టెన్షన్
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవమా లేక కీలకమైన మిత్రుడిని కోల్పోవడమా అనే ప్రశ్న ఇప్పుడు ఉక్రెయిన్ ముందుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇది అత్యంత కష్ట కాలమని ఆయన తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పుడు చాలా కష్టమైన ఎంపికను ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనివల్ల గౌరవాన్ని కోల్పోవడం లేదా కీలక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దురాక్రమణను ఆపాలంటే కీలకమైన పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్ను రష్యాకు వదిలివేయడం వంటి షరతులు ట్రంప్ ప్రతిపాదనల్లో ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో జెలెన్స్కీ ఈ ప్రసంగం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. మూడేళ్లకు పైగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ఇటీవల దానిని జెలెన్స్కీ ప్రభుత్వానికి అందించారు. ఆ ప్లాన్ ప్రకారం.. ఉక్రెయిన్ తూర్పు డాన్‌బాస్‌లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి. అలాగే ఆ దేశ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఎవరూ అందించకూడదు. -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై దాదాపు 500 శాతం సుంకాలు విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. రెండు దేశాల యుద్ధం ముగించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో భేటీ కూడా అయ్యారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యం కాకపోవడంతో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ పెద్దమొత్తంలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా దాదాపు విఫలం కావడంతో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని ట్రంప్ పేర్కొన్నారు.రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధిస్తానన్నారు. సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ దేశాల జాబితాలో భారత్, చైనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామన్నారు. భారత్, చైనాలే ఆ దేశం నుంచి 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడనుంది. BREAKING:US president Trump approves bill allowing tariffs up to 500% on countries trading with Russia. pic.twitter.com/Lko3wXVuLU— Recon & surveillance (@Recon_surv) November 17, 2025 -
మళ్లీ అణ్వాయుధ పోటీ?
అణ్వాయుధాల పరీక్షలను తక్షణం పున రుద్ధరించవలసిందిగా రక్షణ (ఇప్పుడు ‘యుద్ధ విభాగం’గా పిలుస్తున్నారు) శాఖను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 29న ప్రకటించారు. ఇది ప్రపంచ అణు సుస్థిరత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నియమావళులపై అక్షరాలా బాంబు వేయడమే! అమెరికా 1992 సెప్టెంబర్ తర్వాత, పూర్తి విస్ఫోటనాత్మక అణు పరీక్షను నిర్వహించలేదు. అయితే, 1998లో భారత్ అణు పరీక్షలను జరిపితే, ఆ వెంటనే పాకిస్తాన్ కూడా నిర్వహించింది. ఒక అణ్వాయుధాన్ని విస్ఫోటనం చెందించి చూడటం కడసారిగా 2017లో జరిగింది. భూగర్భంలో ఉత్తర కొరియా ఆ పరీక్షను నిర్వహించింది. అప్పటి నుంచి, అణు పాటవ పరీక్షలపై మారటోరియం అమలులో ఉంది. ఇప్పటివరకు అది ఉల్లంఘనకు గురి కాలేదు. ‘‘చాలా ఏళ్ళ క్రితం మేం దాన్ని నిలుపు చేశాం. కానీ, ఇతరులు పరీక్షలు చేస్తూండటంతో, మేం కూడా చేయడం సముచితమని నాకనిపించింది’’ అని ట్రంప్ అన్నారు. రష్యా పేరును ట్రంప్ ప్రస్తావించకపోయినా ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ మాటలన్నారన్నది స్పష్టం. రష్యా పుట్టిస్తున్న దడట్రంప్ ప్రకటనకు 10 రోజుల ముందు, మాస్కో అణ్వాయుధాలను మోసుకెళ్ళగల రెండు అధునాతన ప్రయోగ వ్యవస్థలను పరీ క్షించింది. బురైవెస్నిక్ (ఆకాశం నుంచి జారిపడే) క్రూజ్ క్షిపణిని... అక్టోబర్ 21న, అసాధారణ పొసైడాన్ జలగర్భ టార్పెడోను... అక్టో బర్ 28న పరీక్షించింది. అయితే, ఈ రెండూ అణ్వాయుధాలను మోసుకెళ్ళగల వాహకాలు మాత్రమే. వాటిని పరీక్షించడం అణు విస్ఫోట పరీక్షలతో సమానం కాదు. సాంకేతికంగా, అవి ప్రస్తుత ఆయుధ నియంత్రణ చట్రంలోకి రావు. ప్రయోగ వాహకాలను పరీ క్షించాంగానీ, అణ్వాయుధాలను కాదని రష్యా పునరుద్ఘాటించింది. కానీ అణ్వాయుధాలను కూడా పొదువుకుంటే, బురైవెస్నిక్, పొసైడాన్ ప్రాణాంతక ఆయుధాలుగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవి రష్యా వద్ద ఉన్నంతవరకూ దాని జోలికి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేరు. రాడార్ దృష్టిలో పడకుండా బురైవెస్నిక్ 15 గంటల్లో 14,000 కిలోమీటర్ల దూరం పయనించినట్లు అక్టోబర్ 21 పరీక్షలో తేలింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన చోట మాత్రమే అది భూవాతావరణంలోకి ప్రవేశించగలదు. ప్రస్తుతమున్న క్షిపణి రక్షణ వ్యవస్థలు దాన్ని పసిగట్టలేవు. అదే అమెరికా ఆందోళనకు కారణం. ఇక పొసైడాన్... మానవ రహిత జలాంతర్గత అణ్వాయుధ వాహకం. ఇది 10,000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. గరి ష్ఠంగా గంటకు 100 నాట్ల (185 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగ లదు. నీటిలో 1,000 మీటర్ల లోతు నుంచి సునాయాసంగా పని చేయగలదు. ఇది ఇప్పుడున్న జలాంతర్గామి నిరోధక రణతంత్ర సామర్థ్యాలకు అందనిది. అణ్వాయుధాన్ని కూడా తగిలించుకున్న పొసైడాన్ను యుద్ధంలో ప్రయోగిస్తే, అది భూగర్భ శిలా ఫలకాలను కదిలించే విధంగా అణుధార్మిక సునామీని రేకెత్తించగలదు. భూగోళానికి, మానవాళికి ఇది చూపించగల ప్రళయం మాటలకు అందనిది. ‘ఐరన్ డోమ్’తో మారిన పరిస్థితిప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 1972లో అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్లు బాలిస్టిక్ నిరోధక క్షిపణుల ఒడంబడిక (ఏబీఎం)కు వచ్చాయి. పరస్పరం ఆయుధాలను ప్రయోగించుకుంటే ఇద్దరమూ నాశనం కావడం ఖాయం అనే అవగాహన (మ్యాడ్)ను అది కల్పించింది. విధ్వంసాన్ని ఆధారం చేసుకున్న మనుగడ అనే ఆ సిద్ధాంతం అసంబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఏబీఎం ఆనాటి పరిస్థితులను బట్టి కుదుర్చుకున్న సంక్లిష్టమైన,సాంకేతిక–వ్యూహాత్మక ఒడంబడిక. పోగుపడుతున్న సామూహిక విధ్వంసక ఆయుధాల (డబ్లు్య.ఎం.డి.)తో రెండు అగ్ర రాజ్యాల మధ్య అభద్రత నెలకొన్న నేపథ్యంలో కుదుర్చుకున్నది. అయితే, 2001 సెప్టెంబర్ 11 (9/11) పరిణామాల నేపథ్యంలో, అమెరికా 2002 జూన్‌లో, ఏకపక్షంగా ఆ ఒడంబడిక నుంచి ఉపసంహరించుకుంది. వైశాల్యం కుంచించుకుపోయి, ఆత్మ విశ్వాసం సన్నగిల్లిన పరిస్థితిలోనున్న రష్యాలో అది అభద్రత బీజాలను నాటింది. పొసైడాన్ 2015లో పురుడు పోసుకోవడం పుతిన్ కన్నుల్లో కాంతి రేఖను నింపింది. కడచిన దశాబ్దంలో అది వైఫల్యాలను చూసింది. సైంటిస్టులు ప్రమాదాల్లో హతులయ్యారు. కానీ, కార్యక్రమం కొన సాగింది. అక్టోబర్ 21న విజయవంతమైంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చేసిన ప్రక టన బహుశా పుతిన్‌ను ఈ పరీక్షకు పురిగొల్పి ఉండవచ్చు. ‘అమె రికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు’ శీర్షికతోనున్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై 2025 జనవరి 27న ట్రంప్ సంతకం చేశారు. ఇప్పుడా డోమ్‌కు ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. అది అమెరికా ప్రధాన భూభాగానికి అంతటికీ గొడుగులా పనిచేస్తుందనీ, బహుశా 2045 నాటికి పూర్తి కాగల ఈ కార్యక్రమానికి దాదాపు 3.6 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయనీ అంచనా. ఇందుకు సంబంధించి ఎలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’కు మొదటి విడత చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ‘స్టార్ వార్స్’ కార్యక్రమాన్నీ, ప్రచ్ఛన్న యుద్ధం అంతాన్నీ గుర్తుకు తెస్తోంది. ఈ కార్యక్రమాలు దీర్ఘకాలంలో అమెరికా, రష్యా రెండింటినీ దివాళా తీయిస్తాయా? నిరాయుధీకరణే దారిపాకిస్తాన్తో సహా ఇతర దేశాలు రహస్యంగా అణు పాటవ పరీ క్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అధునాతన అణ్వా యుధాలు డోమ్‌లో భాగం కావాలంటున్నారు. దానికి కొనసాగింపుగా, అమెరికా అణు పరీక్షలను పునరుద్ధరిస్తుందని అన్నారు. ‘‘సంయమనం, చర్చలు అవసరమైన సమయంలో అణు పాటవ పరీక్షలను పునరుద్ధరించడం అస్థిరతకు ద్వారాలు తెరుస్తుంది. మూడు దశాబ్దాలుగా అణ్వాయుధ పోటీని నిరోధిస్తూ వస్తున్న అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని బీటలు వారుస్తుంది’’ అని ఆసియా –పసిఫిక్ లీడర్షిప్ నెట్వర్క్ (ఏపీఎల్ఎన్) అనే ప్రాంతీయ బృందం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఆ ప్రకటనపై సంతకం చేసిన వారిలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నారు. ట్రంప్ అణు సంయ మనాన్ని పాటిస్తారో, లేక పరీక్షల నిషేధ ‘రెడ్ లైన్’ను ఉల్లంఘిస్తారో చూడవలసి ఉంది. అంతర్జాతీయంగా అణు సంయమనం, నిరాయు ధీకరణకు ఎల్లప్పుడూ పోరాడే భారత్ తన గొంతును తప్పనిసరిగా వినిపించవలసి ఉంది. వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
వేదికపైనే కుప్ప కూలిన రోబో (వీడియో)
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలా దేశాల్లో ఇప్పటికే హ్యుమానాయిడ్ రోబోలు అందుబాటులో ఉన్నాయి. అయితే రష్యా ఇటీవల తన మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో నడిచే హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. కానీ ప్రారంభంలోనే విఘాతం అన్నట్టు.. రోబో కిందపడింది.రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.ఐడల్ రోబోట్ కిందికి పడగానే.. దానికి ఫిక్స్ చేసిన కొన్ని భాగాలు కూడా ఊడిపోయాయి. రష్యన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించిన ఈ ఐడల్ ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రజల సందర్శనార్థం దీనిని ప్రదర్శించాలనుకున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. కాగా ఇంజనీర్లు ఐడల్.. బ్యాలెన్స్ సిస్టమ్, కంట్రోల్ సాఫ్ట్వేర్ వంటి వాటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు.Russia unveils its first humanoid robot in Moscow. The AI-powered android took a few steps to ROCKY music, waved, and immediately faceplanted.The stage was quickly curtained, and the fallen “fighter” was carried backstage. @elonmusk knows how it feels. pic.twitter.com/EE57KR4T2d— Russian Market (@runews) November 11, 2025హ్యుమానాయిడ్ రోబోలుప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించే దిశలో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ రంగంలో చైనా అగ్రస్థానంలో ఉండగా.. జపాన్, సౌత్ కొరియా, అమెరికా, జర్మనీ దేశాలు సైతం తమదైన రీతిలో పరిశోధనలు చేస్తున్నాయి, రోబోలను ఆవిష్కరిస్తున్నాయి.మన దేశం కూడా హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ISRO తయారు చేసిన వ్యోమిత్రా (Vyommitra) హ్యూమనాయిడ్ రోబోట్, మానవ అనే 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రూపొందించిన మల్టీపర్పస్ హ్యూమనాయిడ్ రోబోట్ అల్ఫా1.0 వంటివి ఉన్నాయి. -
రష్యాకు 70 వేల మంది భారత కార్మికులు
మాస్కో: ఉక్రెయిన్‌తో నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అర్హత కలిగిన, నిపుణులైన కార్మికుల కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రష్యా భారత్ వైపు చూస్తోంది. తమ సమస్య పరిష్కారానికి త్వరలోనే భారత్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. కనీసం 70 వేల మంది భారతీ యులను ఈ ఏడాది చివరికల్లా రష్యాలోని వివిధ ప్రాంతాల్లోని నిర్మాణ, వస్త్ర, ఇంజనీరింగ్, ఎల క్ట్రానిక్స్ పరిశ్రమల్లో చేర్చుకోనుంది. వీరికి అవసరమైన ఏర్పాట్లను రష్యా కార్మిక శాఖ చేపట్టింది. డిసెంబర్ మొదటి వారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యట నకు రానున్నారు. ఆ సమయంలో ఇరు దేశాలు ఇందుకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందం ఫలితంగా భారతీయ కార్మికులు, సిబ్బందికి రష్యాలో చట్ట పరమైన రక్షణలు లభిస్తాయి. ఈ పరిణామాన్ని మాస్కోలోని ఇండియన్ బిజినెస్ అలయెన్(ఐబీఏ) స్వాగతించింది. భారత్– రష్యా సంబంధాల్లో ఇదో వ్యూహాత్మక మైలురాయిగా మారనుందని ఐబీఏ ప్రెసిడెంట్ సమ్మీ మనోజ్ కొత్వానీ అభివర్ణించారు. భారతీయ నిపుణులకు సురక్షితమైన, గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తూనే, రష్యా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవశక్తిని అందనుందన్నారు. భారతీయ సిబ్బందికి అవసరమైన రష్యన్ భాషా నైపుణ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వారి సంక్షేమానికి, భద్రతకు సంబంధించిన అంశాలపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉంటామన్నారు. -
మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..
ఒక వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అలాంటి క్షణం అత ఈజీగా మర్చిపోలేం కదూ..ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందింటే..శుభం గౌతమ్ అనే వ్యక్తి ఒక వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. "నా అమ్మ రష్యాలో సెలబ్రిటీ" అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో మరింత వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతడు తన తల్లితో రష్యా వీధుల్లోకి రాగానే.. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆ తల్లిని చూసి రష్యన్ ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు..ఒక్క సెల్ఫీ అంటూ ఎగబెట్టారు. ఏదో సెలబ్రిటీ మాదిరిగా అంతా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతుంటే..మా అమ్మకు ఒక్కసారిగా ఎంత క్రేజ్ పెరిగిపోయిందో అంటూ మురిసిపోయాడు ఆమె కుమారుడు. విదేశాల్లో మన సంప్రదాయ దుస్తులో గనుక మనం కనిపిస్తే కచ్చితంగా ప్రత్యేకంగా నిలబడటమే గాక, అందరి దృష్టిని ఆకర్షిస్తాం..అందుకు ఈ తల్లే నిదర్శనం. అంతేగాదు ఆమె కొడుకు నా తల్లి రష్యాకు ఇష్టమైన సెలబ్రిటీ అని వీడియోలో చెబుతుండటం స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె కూడా అక్కడి వాళ్ల రియాక్షన్‌కు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ వారితో సెల్ఫీలు దిగడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. భారతదేశం వెలుపల మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు దరిస్తే..అవి మనల్ని ప్రత్యేకంగా నిలబడేల చేయడమే గాక, రియల్ సెలబ్రిటీకి అర్థం చెప్పేలా మనల్ని నిలబెడతాయి కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడమే కాదు..ఆ తల్లి నిజంగా భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రేమగా పిలుస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Shubham Gautam (@samboyvlogs) (చదవండి: సాత్విక ఆహారంతో బరువు తగ్గగలమా..? నటి, గాయని షెహ్నాజ్ సైతం..) -
కళ్ళ ముందే కుప్పకూలిన రష్యన్ ఆర్మీ హెలికాప్టర్
-
రష్యాలో ఇండియా విద్యార్థి అదృశ్యం : విషాదాంతం
రష్యాలో గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన భారతీయ MBBS విద్యార్థి కథ విషాదాంతమైంది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 22 అజిత్ సింగ్ చౌదరి మృతదేహం ఆనకట్టలో లభ్యమైంది. దీంతో బాధిత విద్యార్థి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.రష్యాలో దాదాపు మూడు వారాలుగా తప్పిపోయిన వైద్య విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి మృతదేహాన్ని ఉఫా నగరంలోని ఆనకట్ట సమీపంలో గుర్తించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు , అల్వార్‌లోని స్థానిక ప్రతినిధులకు సమాచారం అందించింది.అజిత్ సింగ్ చౌదరి 2023 నుండి రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో M ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతున్నాడు. అక్టోబర్ 19న ఉదయం 11 గంటల ప్రాంతంలో తన హాస్టల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అజిత్ అదృశ్యమయ్యాడు. పాలు కొనుక్కుని అరగంటలోపు తిరిగి వస్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిన అతను ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.స్థానిక అధికారులు వైట్ నది సమీపంలో అతని బట్టలు, ఫోన్ ,బూట్లు కనుగొన్నారు. పంతొమ్మిది రోజుల తరువాత, అదే నదికి ఆనుకుని ఉన్న ఆనకట్ట వద్ద అజిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.తోటి విద్యార్థులు మృతదేహాన్ని గుర్తించారు పోస్ట్‌మార్టం అనంతరం అతని మృతదేహాన్ని ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాయబార కార్యాలయం, రష్యన్ అధికారుల మధ్య సమన్వయంతో స్వదేశానికి తిరిగి పంపే ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు తెలిపారు.చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం అజిత్ అనుమానాస్పద మరణంతో అజిత్ తల్లిదండ్రులు రూప్ సింగ్ ,సాంత్రా దేవి శోకానికి అంతులేకుండా పోయింది. వైద్యవిద్య కోసం మూడెకరాల భూమి అమ్మినట్టు బంధువులు తెలిపారు. ఎన్నో కలలతో అజిత్‌ను విదేశాలకు పంపించాం, కానీ మనిషినే కోల్పోతామని అనుకోలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు. ఎలా చనిపోయాడనే దానిపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు అజిత్ గ్రామస్తులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ అదృశ్యం పట్ల త్వరగా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని మృతదేహాన్ని త్వరగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమ్యూనిటీ సభ్యులు అల్వార్ జాట్ హాస్టల్లో సమావేశం నిర్వహించారు.దీనిపై కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర సింగ్ అల్వార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏదో అనుమానాస్పదంగా అనిపిస్తోందంటూ ట్వీట్ చేశారు. మృతదేహాన్ని తరలించేలా ఏర్పాటు చేయాలనీ, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కోరారు. ఇదీ చదవండి: Betting App Case: శిఖర్ ధావన్, రైనాపై సజ్జనార్ ఆగ్రహం -
రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు తగ్గుముఖం!
దేశీయ చమురు శుద్ధి కర్మాగారాలకు ప్రధాన ముడిచమురు సరఫరాదారుగా ఉన్న రష్యా నుంచి భారత్ దిగుమతులు ఇటీవలికాలంలో గణనీయంగా తగ్గాయి. సెప్టెంబర్ నెలలో రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు విలువ పరంగా 28.9 శాతం తగ్గి, 2024 సెప్టెంబర్లోని 4,675 మిలియన్ డాలర్ల నుంచి 3,322 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాల్యూమ్ పరంగా చూస్తే ఈ దిగుమతులు ఏకంగా 17 శాతం తగ్గి 6.6 మిలియన్ టన్నులకు చేరాయి.తగ్గుదలకు ప్రధాన కారణాలురష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా జులైలో ఇండియాపై 25 శాతం అదనపు టారిఫ్‌ను విధించింది. అంతకుముందు ఉన్న టారిఫ్‌లతో కలిపి ఇది మొత్తం సుమారు 50 శాతానికి చేరింది. ఈ అదనపు టారిఫ్‌ల వల్ల భారతీయ ఎగుమతులపై ముఖ్యంగా జౌళి (టెక్స్టైల్స్), ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అమెరికా మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులు ధరల పరంగా తమ పోటీతత్వాన్ని కోల్పోయాయి.దిగుమతులు తగ్గించుకుంటేనే..రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంటే ఈ టారిఫ్‌లను ఉపసంహరిస్తామని అమెరికా ప్రభుత్వం పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో భారతీయ చమురు సంస్థలు (రిఫైనరీలు) ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించక తప్పలేదు.రష్యా చమురు సంస్థలపై ఆంక్షలుఅమెరికా ప్రభుత్వం ఇటీవల రష్యాకు చెందిన ప్రధాన చమురు సంస్థలు అయిన రోస్నెఫ్ట్(Rosneft), లుకోయిల్ (Lukoil) వంటి వాటిపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు కేవలం టారిఫ్‌లు వంటి ధరల పెరుగుదలకు మాత్రమే పరిమితం కాకుండా ఈ సంస్థలతో ఆర్థిక లావాదేవీలు జరపడం, బీమా (ఇన్సూరెన్స్), రవాణా (షిప్పింగ్) వంటి అంశాలలో భారీ నియంత్రణ సమస్యలను సృష్టిస్తున్నాయి. పాశ్చాత్య ఆంక్షలకు లోబడి పనిచేయడం రిఫైనరీలకు సంక్లిష్టంగా మారడంతో భవిష్యత్తులో సరఫరా భద్రత దృష్ట్యా కొన్ని భారతీయ రిఫైనరీలు (రిలయన్స్ ఇండస్ట్రీస్, మాంగళూరు రిఫైనరీ వంటివి) రష్యా నుంచి కొత్త కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. దీన్ని కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.ఎనర్జీ సెక్యూరీటీ, జాతీయ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని వాదిస్తూ భారత్ రష్యా నుంచి చౌకగా లభించిన ముడిచమురును పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంది. అయినప్పటికీ అంతర్జాతీయ వాణిజ్యంపై అమెరికా విధించిన భారీ టారిఫ్‌లు, రష్యన్ సంస్థలపై ఆంక్షలు భారతీయ ఎగుమతి రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో దేశీయ రిఫైనరీలు తమ చమురు వనరుల కోసం ప్రత్యామ్నాయ దేశాలైన అమెరికా, మధ్య ఆసియా దేశాల వైపు మళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది.ఇదీ చదవండి: వొడాఫోన్-ఐడియా బకాయిలపై మదింపు చేయవచ్చు.. సుప్రీంకోర్టు -
మళ్లీ భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: రష్యా , ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్, చైనాలు కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరువైపులా అణ్వాయుధ ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నందున ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమని ‘సీబీఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగే తాను అమెరికా దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సమర్థించుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సీబీఎస్’కు 60 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 33 ఏళ్ల నిషేధం తర్వాత అమెరికన్ దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ తాను ఆదేశాలు జారీ చేశానన్నారు. చైనా, పాకిస్తాన్ ఇప్పటికే రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. అయితే ఆ దేశాలు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదని, తాము అందుకు భిన్నమని అన్నారు. ఉత్తర కొరియా, పాకిస్తాన్ పరీక్షలు చేస్తున్నాయనే సమాచారం తమవద్ద ఉందన్నారు. భారత్, పాక్‌లు గత మే నెలలో అణు యుద్ధం అంచునకు చేరాయని, అయితే తాను వాణిజ్యం, సుంకాలతో దానిని అడ్డుకున్నానని అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోకపోతే లక్షలాది మంది చనిపోయేవారని ట్రంప్ పేర్కొన్నారు.ఆ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు భూగర్భంలో పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలతో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అయితే కంపనం అనుభూతి మాత్రం కలుగుతుంది. గ్లోబల్ మానిటరింగ్ స్టేషన్లు భూగర్భ అణు పేలుళ్ల వల్ల కలిగే భూకంపం లాంటి కంపనాలను గుర్తిస్తాయి. అటువంటి పరీక్షలను రహస్యంగా నిర్వహించవచ్చని, వాటిని గుర్తించలేమని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ చైనా, పాకిస్తాన్‌లు అణ్వాయుధాలను పరీక్షిస్తుంటే, అది భారతదేశాన్ని మరింత అస్థిరంగా మారుస్తుందని ట్రంప్ పరోక్షంగా పేర్కొన్నారు. -
యుద్ధంలోకి అమెరికా?.. వణికిపోతున్న ప్రపంచం
చరిత్ర మళ్లీ తన రక్తపు పుటలను తిరగేస్తోంది. మరో యుద్ధం మన కళ్ల ముందు పుడుతోంది. ఈసారి ఇది చిన్న దేశాల మధ్య కాదు.. ఏకంగా అమెరికా యుద్ధరంగంలోకి అడుగుపెడుతోందన్న వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. వెనిజులా తీరప్రాంతాల్లో సముద్రం మంటల్లో కరిగిపోతున్న వేళ.. అమెరికా నౌకాదళం పేల్చిన బుల్లెట్లు ఆకాశాన్ని ఎర్రగా మార్చేశాయి. ఇది మాదకద్రవ్యాల నౌక అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. వెనిజులా మాత్రం ఇది తమ ప్రజల నౌక అని గట్టిగా చెబుతోంది. ఆ అగ్నిజ్వాలల మధ్య మానవ శరీరాలు ముక్కలై పోయాయి. ఇటు వెనిజులా డిక్టెటర్ నికోలాస్ మడూరో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాస్కో, బీజింగ్, టెహ్రాన్‌కి రహస్య పత్రాలు పంపించారు. ఆయుధాలు, క్షిపణులు పంపాలని రష్యా, చైనా, ఇరాన్ దేశాలను కోరారు. వెనిజులా కోసం రష్యా ఇప్పటికే రాడార్లను సిద్ధం చేస్తోందని సమాచారం.. ఇటు చైనా తన సాంకేతికతను పరిశీలిస్తుంటే.. అటు ఇరాన్ తన డ్రోన్లను గాల్లోకి ఎగరేస్తోంది. మరోవైపు ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఓ భారీ స్టేట్మెంట్ వదిలారు. మడూరో తన చివరి రోజులు లెక్కబెట్టుకుంటున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.యుద్ధ క్షేత్రంలా కరేబియన్ సముద్రంఇటు కరేబియన్ సముద్రం యుద్ధ క్షేత్రంలా మారిన సమయంలో.. అమెరికా నౌకలు వరుసగా కదులుతున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు తిప్పుకుంటున్నాయి. ఈ మొత్తం పరిణామాలను ప్రపంచం ఊపిరిబిగపట్టి చూస్తోంది. ఒకవైపు అమెరికా శక్తి.. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్ మిత్రబలగాలు...! ఏ క్షణానైనా మొదటి క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంది. ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు అంచనా ప్రపంచాన్ని మళ్లీ అగ్నిగుండంలోకి నెట్టేసే ఛాన్స్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మరోసారి యుద్ధపు నీడలోకి జారిపోతోంది. దశాబ్దాల క్రితమే..నిజానికి అమెరికా-వెనిజులా మధ్య ఘర్షణ ఈరోజు పుట్టిన గొడవ కాదు. దశాబ్దాల క్రితమే ఈ మంటలు మొదలయ్యాయి. 1999లో హ్యుగో చావెజ్ అధికారంలోకి వచ్చారు. ఆయన అమెరికా ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేశారు. వెనిజులా ఆయిల్ సంపదను ప్రజల కోసం ఉపయోగిస్తానని ప్రకటించడం.. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆ నాడు కుదిపేసింది. అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. చావెజ్ తర్వాత మడూరో బాధ్యతలు స్వీకరించగానే అమెరికా ఆంక్షల వర్షం కురిపించింది. ఇక 2019లో మడూరోను అధ్యక్షుడిగా అంగీకరించకుండా జువాన్‌ను వెనుజులా ప్రెసిడెంట్‌గా అమెరికా గుర్తించింది. అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు బలంగా నిలిచిన దేశం.. ఆ తర్వాత ఆకలితో విలవిల్లాడే స్థితికి చేరింది. ఆయిల్ నిల్వలు ఉన్నా వాటిని అమ్మే దేశాలు లేకుండాపోయాయి. కరెన్సీ విలువ నేలమట్టమైన సమయంలో... దేశం ఆర్థికంగా కూలిపోయింది. అయితే మడూరో వెనక్కి తగ్గకుండా.. రష్యా, చైనా, ఇరాన్ వైపు తిరిగారు.సరిహద్దు సముద్రంలో పేలుళ్లుఇక 2025లో అమెరికా వెనిజులా మధ్య సరిహద్దు సముద్రంలో పేలుళ్లు మొదలయ్యాయి. అమెరికా సైన్యం వెనిజులా నౌకలపై అనేకసార్లు దాడుల చేసింది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో వెనుజులా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత మడూరో ప్రజల ముందు వచ్చి అమెరికాను నేరుగా హెచ్చరించారు. అదే సమయంలో రష్యా, చైనా, ఇరాన్ నాయకులతో అత్యవసర చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి. వెనిజులాకు క్షిపణి వ్యవస్థలు అందించడానికి పుతిన్ సర్కార్ అంగీకరించింది. రాడార్ నెట్వర్క్ విస్తరణకు చైనా సహకరిస్తానని చెప్పగా.. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీని అందిస్తానని ప్రకటించింది. ఈ చర్యలతో అమెరికా మరింత కఠినంగా మారింది. ఈ మూడు దేశాల చర్యలను నార్కో టెరరిజంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అమెరికా నౌకాదళం.. కరేబియన్ సముద్రంలో తన సైనిక బలగాలను రెండింతలు పెంచింది. రహస్య గూఢచార వాహనాలు వెనిజులా గగనతలంలో ఇప్పటికే తిరుగుతున్నాయని సమాచారం.అమెరికా ఆధిపత్యానికి సవాలుఇక రష్యా, చైనా, ఇరాన్ ఈ ఘటనను అమెరికా ఆధిపత్యానికి సవాలుగా చూస్తున్నాయి. వెనిజులా తమకు వ్యూహాత్మక కేంద్రంగా మారుతుందని భావిస్తున్నాయి. రష్యా ఇప్పటికే నౌకాశ్రయ ఒప్పందం సిద్ధం చేసుకుంది. చైనా.. వెనిజులా ఆయిల్ బాకీలకు బదులుగా మిలిటరీ సదుపాయాలు కోరుతోంది. ఇరాన్.. వెనిజులాలోని గగనతల కేంద్రాలను డ్రోన్ నియంత్రణ స్థావరాలుగా మార్చే పనిలో ఉంది. ఇటు ఈ మొత్తం వ్యవహారంలో లాటిన్ అమెరికా అంతా ఆందోళనలో నిండిపోయింది. బ్రెజిల్, కొలంబియా, పెరూ దేశాలు భయంతో మౌనంగా ఉండిపోయాయి. ఇటు యూరప్‌తో పాటు యునైటెడ్ నేషన్స్ ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ..ట్రంప్ గారు వెనక్కి తగ్గేలా కనిపించడంలేదండి. ఇలా చూస్తే.. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త యుద్ధం అంచున నిలబడి ఉందనే చెప్పవచ్చు. ఒకవైపు అమెరికా ఆధిపత్యం, మరోవైపు రష్యా-చైనా-ఇరాన్ కూటమి. ఎవరు వెనక్కి తగ్గినా అది ఓటమే అవుతుంది.. ఎవరు ముందుకు కదిలినా అది యుద్ధానికి ప్రారంభమవుతుంది..! మరి చూడాలి ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ మాత్రం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: రోజుకు 15 మందిని చంపేస్తున్న అతివేగం -
రష్యా నుంచి అధునాతన అణుజలాంతర్గామి
మాస్కో: ఇటీవల అణు ఇంధనంతో పనిచేసే బురేవేస్ట్నిక్ క్షిపణిని ప్రయోగించి ప్రపంచదేశాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన రష్యా ఆదివారం మరో ఆధునిక అస్త్రంతో ముందుకొచ్చింది. తీర ప్రాంత దేశాలపై భీకరస్థాయిలో దాడులు చేయగల పోసెడాన్ అణ్వస్త్ర డ్రోన్‌ను ప్రయోగించే సామర్థ్యమున్న ‘ఖబరోవ్స్క్’ జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. అత్యంత వినాశనం సృష్టించగల డ్రోన్ కాబట్టే పోసెడాన్ డ్రోన్‌ను ప్రళయకాల(డూమ్స్‌డే) క్షిపణి అని కూడా పిలుస్తారు. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బలౌస్క్, నేవీ చీఫ్ అడ్మిరల్ అలెగ్జాండర్ మోసెయేవ్ సమక్షంలో ఈ కొత్త జలాంతర్గామిని సముద్రజలాల్లోకి ప్రవేశపెట్టారు. సెవెరోడ్విన్స్క్ నగరంలోని సేవ్మాష్ షిప్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భారీగా ఉండే ఖబరోవ్స్క్ జలాంతర్గామి జలాంతర ఆయుధాలు, రోబోటిక్ వ్యవస్థల మేలు కలయిగా చెప్పొచ్చు. శత్రుదేశాల నిఘా నుంచి సునాయసంగా తప్పించుకోగలదు. ఎంతో వేగంగా ప్రయాణించగలదు. జాడ తెలీకుండా మరింత లోతులకు వెళ్లి దాక్కోగలదు. శత్రువులపై వ్యూహాత్మకంగా దాడిచేస్తుంది. -
కొనడం కన్నా మానడం మేలు
రష్యాకు చెందిన ‘రోస్నెఫ్ట్’, ‘ల్యూక్ ఆయిల్’ కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ అక్టోబరు 22న అమెరికా తీసు కున్న నిర్ణయం రష్యానూ, రష్యా చమురు కొంటున్న దేశాలనూ ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. రష్యా ముడిచమురు ఆదాయంలో 57 శాతం ఈ రెండు దిగ్గజసంస్థల ద్వారానే సమకూరుతుంది. ఇతర చిన్నాచితకా కంపెనీల ద్వారా మిగిలిన 43 శాతం లభిస్తోంది. చిన్న కంపెనీల మీద ఎలాంటి ఆంక్షలు విధించనప్పటికీ, ఇండియా వంటి ప్రధాన చమురు దిగుమతి దేశాల మీద అమెరికా చర్య ప్రభావం గణనీయంగా ఉంటుంది. బ్లాక్ లిస్టెడ్ కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయ బోమని ఇండియా చమురు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు ఒకప్పుడు కేవలం1 శాతం ఉండేవి అలాంటిది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అవి 38 శాతం గరిష్ఠ స్థాయికి పెరిగాయి. ఇండియా ఇలా రష్యా ముడి చమురు కొంటూ పుతిన్ యద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. చౌకగా లభిస్తున్నందువల్లే దేశ ప్రయోజనాల దృష్టిలో తాము రష్యా చమురు కొంటున్నామని భారత ప్రభుత్వం ఈ ఆరోపణను కొట్టివేసింది. ఇండియా సందిగ్ధంఅమెరికా తాజా నిర్ణయంతో ఇండియా సందిగ్ధంలో పడింది. ఏదో ఒక విధంగా రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగించడమా, లేదంటే రష్యా చమురుకు పూర్తిగా దూరం కావటమా అన్నది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. నిజానికి రెండు సర్వసత్తాక దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం ఎలా జరగాలో శాసించే హక్కు అమెరికాకు లేదు. తమ కంపెనీలు రెండిటిని అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ, చమురు ఎగుమతులు నిలిపివేయాలని రష్యా భావించడం లేదు. కానీ బ్లాక్ లిస్టెడ్ కంపెనీలతో వ్యాపారం చేసే దేశాల మీద అమెరికా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున, అంత రిస్కు తీసుకుని రష్యా చమురు కొనాలా వద్దా అనేది ఇండియా, చైనా వంటి దిగుమతిదారులు తమకు తాముగా తీసు కోవలసిన నిర్ణయం. ఇప్పుడు ఇండియా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. అమె రికా ఆంక్షలు విధించినా సరే రష్యా చమురును ఇకమీదటా కొనడం వాటిలో ఒకటి. అమెరికా ఆంక్షలు వర్తించకుండా దళారుల ద్వారా సమకూర్చుకునే వీలుంది. రష్యా రహస్యంగా నడుపుతున్న రహస్య (షాడో) ట్యాంకర్ల ద్వారానూ తెప్పించుకోవచ్చు. ఏదో విధంగా చౌక ధరలకు రష్యా చమురు తెప్పించుకోవడం సాధ్యమే. అయితే ఈ చర్యలు ట్రంప్‌కు ఆగ్రహం కలిగిస్తాయి. చపల చిత్తుడైన ట్రంప్ఆంక్షలను ధిక్కరించడం తెలివైన పని అనిపించుకోదు. ట్రంప్‌తో ఢీకొనడం అంటే, తలను రాతి గోడకేసి కొట్టుకోవడమే. అమెరికాతో తలపడటంలో మన కంటే గట్టిదైన చైనా సైతం ఆ రెండు రష్యాకంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది.వాణిజ్య ఒప్పందమే ఆచరణీయంట్రంప్తో తల గోక్కోవడం కంటే, ఆచరణీయ వైఖరి అవలంబించాలి. విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలకు ముప్పు వాటిల్లని రీతిలో, దౌత్య ఇంధన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసేట్లు ఈ వైఖరి ఉండాలి. ఇది రెండో మార్గం. మన చేతిలో ఉన్న ముక్కలతోనే మనం ఆడాలి. సమకాలీన భౌగోళిక రాజకీయాల్లో ఆచరణవాదమే నడుస్తోంది. ఇండియా భిన్నంగా వ్యవహరించలేదు. అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్నామా అన్నది ముఖ్యం కాదు. దేశానికి గరిష్ఠ ప్రయోజనం దేనివల్ల సిద్ధిస్తుందో ఆ మార్గాన్ని ఎంచుకోవాలి.ఒకటి: ఆంక్షలకు గురికాని రష్యా ఇంధన కంపెనీల నుంచి కొను గోళ్లు చేసే అవకాశం ఇప్పటికీ ఉంది. రోస్నెఫ్ట్, ల్యూక్ఆయిల్ నుంచి కాకుండా మిగిలిన రష్యా కంపెనీల నుంచి కొంటే అమెరికా సెకండరీ ఆంక్షలు వర్తించవు. ఆంక్షలు ఆ రెండు కంపెనీల మీదే కానీ రష్యా ఆయిలు మీద కాదు. అయినా సరే ఇది అనుకున్నంత సులభం కాదు. రెండు: అమెరికా ఆంక్షలను ఇండియా తోసిరాజన గలదా, ఆ సాహసం ఫలితమిస్తుందా, అమెరికాతో ముడిపడి ఉండే విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మాత్రమే రష్యా చమురు కొనుగోళ్ల కొనసాగింపుపై ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.ఇండియా వస్తువుల మీద ట్రంప్ తొలుత విధించిన 25 శాతం సుంకాలను వీలైనంత తగ్గించేలా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసినట్లయితే, తరువాత మోపిన 25 శాతం అదనపు సుంకాలను కూడా తగ్గించడానికి లేదా రద్దు చేయడానికి వీలు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికాతో సానుకూల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోడానికి అనువుగా రష్యా చమురుకు స్వస్తి పలికే అంశాన్ని పరిశీలించాలి. ప్రతిష్ఠ స్థానే ప్రయోజనాలుట్రంప్ ఏకపక్ష ఆంక్షలను తోసిరాజన్నట్లయితే, దేశ గౌరవం ఇనుమడిస్తుంది. కానీ దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు పరిమిత మైనవి. వాటి కంటే మనం ఎదుర్కొనే రిస్కులు ఎక్కువ. కాబట్టి, అమెరికా విధానంలో మార్పు కోసం రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసే ఆలోచన చేయాలి. తద్వారా, దక్షిణాసియాలోఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ అవలంబిస్తున్న ప్రతికూల భౌగో ళిక రాజకీయ వైఖరికి తెరపడుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ బలాబలాల సమతౌల్యాన్ని సానుకూల రీతిలో పునురు ద్ధరించుకునేందుకు అమెరికా సహకారం తీసుకుని తీరాలి. ప్రాంతీ యంగా వారి వ్యూహాత్మక ప్రయోజనాలకూ ఢోకా ఉండదన్న భరోసా ఇవ్వాలి. స్పష్టంగా చెప్పాలంటే, రష్యా చమురు కంపెనీల మీద అమెరికా ఆంక్షలు ధిక్కరించడానికి ఇండియాకు ఉన్న అవకాశాలు పరి మితం. ఈ తప్పనిసరి పరిస్థితి నుంచి ఎంతో కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేయాలి. కీలకమైన తన వ్యూహాత్మక ప్రయోజనాలు పరిరక్షించేట్లయితే, రష్యాపై ఆంక్షల పట్ల అభ్యంతరం లేదనిఇండియా ప్రతిపాదించాలి. జాతి గౌరవం, దేశ ప్రతిష్ఠ అంటూ అతిశయాలకు పోతే ప్రయోజనం ఉండదు. -వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రేటజిక్ డిఫెన్స్ అండ్రిసెర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-హ్యాపీమాన్ జాకబ్ -
చమురు కొనుగోళ్లకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాం
న్యూఢిల్లీ: రష్యన్ చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్ తన ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు మరిన్ని కొత్త మార్గాలను అన్వేíషింంచనుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ గురువారం ప్రకటించారు. రష్యాలో ప్రభుత్వరంగ అతిపెద్ద చమురు సంస్థ రోస్నెఫ్ట్తోపాటు అక్కడి అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ లక్ఆయిల్లపై ఆంక్షల కొరడా ఝలిపించామని దక్షిణకొరియాలో ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే భారత్ స్పందించడం గమనార్హం. అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ ఈ సంస్థల నుంచి తక్కువ ధరకు చమురుకొనే బదులు ఇదే రేట్లకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయగల అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకుంటూ అమెరికా పెట్రోలియం ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోబోందన్న వార్తల నడుమ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ ఇంకా చర్చలు జరుపుతోందని గుర్తుచేశారు. అయితే గత నెలలతో పోలిస్తే తాజాగా రష్యన్ సంస్థల నుంచి భారత చమురు కొనుగోళ్లు తగ్గినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఛాబహార్ పోర్ట్ విషయంలో ఊరట ఇరాన్‌లోని కీలక ఛాబహార్ ఓడరేవు నుంచి అంతర్జాతీయ నౌకల రాకపోకలపై అమెరికా విధించిన ఆంక్షలను భారత్ కోసం కొద్దికాలం పక్కనబెట్టింది. ఆరు నెలలపాటు ఆంక్షల నుంచి భారత్‌ను మినహాయింపునిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మినహాయింపు అక్టోబర్ 29వ తేదీ నుంచి మొదలవుతుందని జైస్వాల్ చెప్పారు. అంతర్జాతీయంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో తనకు ప్రతికూలంగా మారొద్దనే అక్కసుతో అమెరికా ఈ ఓడరేవుపై సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఆంక్షలు విధించడం తెల్సిందే. అయితే భారత అభ్యర్థనతో ఆ ఆంక్షల అమలును నెలరోజులు వాయిదా వేశారు. తాజా చర్చలతో దానిని మరో ఆరునెలలు పొడిగించారు. ఛాబహర్ పోర్ట్‌ను అనుసంధానత, సత్సంబంధాలే లక్ష్యంగా భారత్, ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధిచేశాయి. -
ట్రంప్‌కి ఊహించని ఎదురుదెబ్బ!
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి..అంతర్జాతీయ సమాజంలో ఒంటరితనం.. వెరసి ఒత్తిడికి గురైన ఇరాన్-రష్యాలు.. ఇప్పుడు అమెరికా సైతం అడ్డుకోలేని మార్గాన్ని ఎంచుకున్నాయి అదే 162 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ప్రపంచ వాణిజ్యాన్ని శాశ్వతంగా మార్చివేయగల ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది.. ఇరాన్-రష్యాల మధ్య రష్ట్ నుంచి అస్తారా వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం ఇనుము, కాంక్రీటుతో కూడిన ఉత్త నిర్మాణం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC)లో అత్యంత కీలక భాగం. మొత్తం 7,200 కిలోమీటర్ల పరిధిలోని ఈ కారిడార్ వాణిజ్య ఖర్చులను ఈ రైల్వే లైన్ 30 శాతం తగ్గించడమే కాదు.. రవాణా సమయాన్ని కూడా 37 రోజుల నుండి 19 రోజులకు తగ్గించగలదు. పైగా సుయాజ్ కాలువ మార్గంతో పోలిస్తే సగం సమయం మాత్రమే!.ఇరాన్‌తో ఈ ఏడాది జనవరిలోనే రష్యా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కీలక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.6 బిలియన్ యూరోల(మన కరెన్సీలో 1,641 కోట్ల రూపాయలు) నిధులను ఒక్క రష్యానే ఈ ప్రాజెక్టు కోసం సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టు గనుక అందుబాటులోకి వస్తే.. ప్రతి ఏడాది 20 మిలియన్ టన్నుల సరుకులు(నూనె, గ్యాస్, ఉక్కు, ఆహారం, యంత్రాల వంటివి) రవాణా చేయొచ్చు. అయితే..రష్యా-ఇరాన్ ఈ రైలు ప్రాజెక్ట్ వ్యూహాత్మకమేనన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఏర్పడిన ఒంటరితనాన్ని అధిగమించి, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రధారులుగా మారాలని రష్యా, ఇరాన్‌లు భావిస్తున్నాయనేది స్పష్టం అవుతోంది. పైగా సూయాజ్ కాలువ, మలక్కా జలసంధి పాశ్చాత్య దేశాలు అడ్డుపడదగిన మార్గం కాదు కూడా.ఏయే దేశాలు చేతులు కలపొచ్చు?చైనా ఈ అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో(BRI) ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం నుండి బాల్టిక్ వరకు నిరంతర వాణిజ్య మార్గాన్ని పర్యవేక్షిస్తోంది. పాశ్చాత్య ఆంక్షలను తిరస్కరిస్తున్న ఈ బ్లాక్.. భవిష్యత్తులో INSTCతో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. 2024లో రష్యా అధికారికంగా గుర్తించిన తాలిబన్ పాలిత అఫ్గనిస్తాన్ కూడా ఈ కారిడార్‌లో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్‌ను పక్కనపెట్టి దక్షిణాసియాలోకి మార్గాన్ని విస్తరించనుంది. ఇదే సమయంలో భారత్ ప్రతిపాదించిన IMEC కారిడార్(అమెరికా, భారత్, ఇజ్రాయెల్, యూరప్ కలిసి ప్రతిపాదించిన మార్గం) ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. దీంతో.. భారత్ కూడా ఈ మార్గాన్ని పరిశీలించవచ్చనే అంచనాలున్నాయి. ప్రభావం..ఈ రైలు మార్గం (Rasht–Astara) పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా అమెరికా ప్రభావాన్ని తగ్గించడంలో కీలకమే చెప్పొచ్చు. పైగా ఈ కారిడార్ ద్వారా చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో రష్యా-ఇరాన్ సంబంధాలు బలపడతాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరచే దిశగా సాగుతుంది. బ్రిక్స్, SCO బలమైన మద్దతుతో.. పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అడ్డుకోగలరా?ఇంతటి వ్యూహాత్మకమైన రైలు మార్గాన్ని ట్రంప్ దీన్ని నేరుగా అడ్డుకోవడం చాలా కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. అయితే.. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రొత్సహించడమో(IMEC కారిడార్ త్వరగతిన పూర్తయ్యేలా చూడడం) లేదంటే ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లతో ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇదీ చదవండి: ప్రపంచానికి దారిదీపం భారతే! -
భారత్‌లో ఎస్జే–100 విమానం తయారీ
న్యూఢిల్లీ: భారత్–రష్యా ప్రభుత్వరంగ సంస్థలు కలిసి తొలిసారి భారత్‌లో ఒక ప్యాసింజర్ విమానాన్ని ఉత్పత్తి చేయనున్నాయి. రెండు ఇంజన్లు ఉండే చిన్న ప్యాసింజర్ విమానం ఎస్జే–100ను భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) తయా రు చేయనుంది. ఇందుకోసం రష్యాకు చెందిన పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (పీజేఎస్సీ–యూఏసీ)తో సోమవారం మాస్కోలో ఒప్పందంపై హాల్ సంతకం చేసింది. హాల్ చైర్మన్ డీకే సునీల్, పీజేఎస్సీ–యూఏసీ డైరెక్టర్ జనరల్ వదిమ్ బదెఖా సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి.‘దేశంలో తక్కువ దూరం విమాన ప్రయా ణాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ఉడాన్ పథకంలో ఎస్జే–100 విమానాలు గేమ్‌చేంజర్ కానున్నాయి. దేశీయ విమానయాన సంస్థల కోసం ఎస్జే–100 విమానాలను తయారు చేసేందుకు ఈ ఒప్పందం ద్వారా హాల్‌కు హక్కులు లభించాయి. ఈ విమానాల తయారీ దేశంలో విమానయాన పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. పౌర విమానయాన రంగ ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేస్తుంది. ఈ ఒప్పందం విమానయానంలో ప్రైవేటు రంగాన్ని ప్రో త్సహించి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలను సృష్టిస్తుంది’అని హాల్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
నీతులు చెప్పేవాళ్లే పాటించట్లేదు
కౌలాలంపూర్: అందరికీ నీతులు చెప్పే అమెరికా మాత్రం వాటిని పాటించట్లేదని భారత విదేశాంగ మంత్రి అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌలాలంపూర్‌లో సోమవారం 20వ ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా అమెరికా వైఖరిని జైశంకర్ పరోక్షంగా తూర్పారబట్టారు. ఇంధన వాణిజ్యంతోపాటు ఇతర మార్కెట్లకు విస్తరించకుండా అమెరికా అడ్డుతగులుతోందని జైశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ ఎత్తున రష్యన్ చమురును కొంటున్నందుకే భారత్‌పై అదనంగా 25 శాతం టారిఫ్ గుదిబండ పడేశామని ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన అంశాన్ని జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ భారత్ అంతర్జాతీ యంగా సరకు రవాణా గొలుసులను పెంచుకోవడానికి, కొత్త మార్కెట్లకు విస్తరించడానికి ప్రయత్నిస్తుంటే కొత్త అవరోధాలు ఎదురవుతు న్నాయి. సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న ఈ తరుణంలో ముడి చమురు వంటి సహజవనరులకు డిమాండ్ పెరుగు తోంది. ఈ సమయంలో ఇంధన వాణిజ్యానికి ఆటంకాలను సృష్టిస్తున్నారు. వాణిజ్య ప్రయోజనా లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. కొన్ని కఠిన నిబంధనలు, ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా రుద్దుతున్నారు. నీతులు చెప్ప కొన్ని దేశాలే వాటిని పాటించట్లేవు. ఎంతగా అడ్డుకున్నా మార్పు అనేది ఆగదు. సర్దుబాట్లు జరుగుతుంటాయి’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రితో భేటీభారత దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం అధిక సుంకాల భారం విధించిన నేపథ్యంలో భారత అనుకూల పరస్పర వాణిజ్య ఒప్పందాన్ని సాధించే లక్ష్యంతో జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చలు జరిపారు. ఇందుకు ఆగ్నేయాసియా కూటమి(ఆసియాన్) శిఖరాగ్ర సదస్సు వేదికైంది. ద్వైపాక్షిక భేటీలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ‘‘ ఉదయం కౌలాలంపూర్‌లో మార్కో రూబియోను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ద్వైపాక్షిక సంబందాలుసహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు ఫలప్రదంగా సాగాయి’’ అని తర్వాత తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో జైశంకర్ ఒక పోస్ట్‌పెట్టారు. వాణిజ్య ఒప్పందంపై ఇరువురు నేతలు ప్రత్యేకంగా చర్చించారు. -
ప్రధాని మోదీపై హత్యకు కుట్ర?.. పుతిన్ రక్షించాడా?
భారత ప్రధాని నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ భారీ హత్య కుట్రను భారత, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా అడ్డుకున్నాయని ఓ సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా అమెరికాకు చెందిన ఓ స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లు తెలుస్తోంది.మలయాళ మీడియా సంస్థ 'మాతృభూమి', రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) మౌత్ పీస్ ఆర్గనైజర్ కథనాల ప్రకారం, ఆగస్టు 31వ తేదీ రాత్రి ఢాకాలోని ఓ విలాసవంతమైన హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ మృతదేహం లభ్యమైంది. బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చానని అధికారికంగా చెప్పినప్పటికీ, అతని ప్రొఫైల్ నిఘా వర్గాలలో అనుమానాలు రేకెత్తించింది. అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లలో అనుభవమున్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అసాధారణం. అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి. దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు.Modi’s life was under threat during SCO summit.An american operative was in Bangladesh for the job.Putin invited him to travel in his car.That was the moment 😲Assassin@tion was planned on China's land to blame China. The Russian spy agency saved him. pic.twitter.com/u9TD7pjnZj— Defense Scope🔭 (@DefeScope) October 22, 2025పుతిన్ రక్షించాడా?ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీని తన అత్యంత భద్రత కలిగిన 'ఆరస్ లిమోసిన్' కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు. ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడలేవు. సంభాషణలను రికార్డ్ చేయడం గానీ, ట్రాక్ చేయడం గానీ అసాధ్యం. మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం.25th October 2025. CIA Links Surface After Putin Shielded Modi During SCO Meet.According to Defence News, President Putin saved Indian Prime Minister Modi, from possible assassination attempt at hands of Western Intelligence Agencies. Speculations revolve around direct… pic.twitter.com/yCaigh7heN— Sense and Sensibility (@UNIT_Diplomat) October 25, 2025భారత నిఘా సంస్థ 'రా' (RAW), రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ 'ఎస్విఆర్' (SVR) కొద్దిరోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి. పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఆగస్టు 30 రాత్రికే ముప్పును గుర్తించి, నిందితుల కదలికలపై నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందే నిర్వీర్యం చేశాయి. ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.మోదీ వ్యాఖ్యల అర్థమేంటి?చైనా పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ ‘సమీకాన్ ఇండియా’ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, “నేను చైనాకు వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా? లేక తిరిగొచ్చినందుకా?” అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తుచేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో, పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి."Mai gaya tha isliye Tali baja rahe ho YA Laut aaya hu isliye Tali baja rahe ho?"REPORTEDLY, it was planned to turn SCO Summit into Tashkent Summit, but President Putin saved PM Modi Ji from meeting Lal Bahadur Shastri Ji's fate.Ps- China didn't have any hand in it. Same old… pic.twitter.com/3sYLogtyi1— BhikuMhatre (@MumbaichaDon) October 11, 2025ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉండటం వంటివి అమెరికాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చడంలో అమెరికాకు చరిత్ర ఉందని, ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
రష్యా చమురుకు భారత్ రాం రాం!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా ఆపేయాలని భారత్‌పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే మాట మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా తగ్గిస్తోందని తెలిపారు. చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గిస్తోందని చెప్పారు. శనివారం తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మలేషియా వెళ్లూ మార్గమధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణకొరియాలో జరుగనున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (అపెక్) సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమై నప్పుడు రష్యా చమురు గురించి కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. భారత్–పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాపనని మరోసారి చెప్పుకున్నారు. ‘భారత్–పాక్ యుద్ధంతోపాటు మరికొన్ని యుద్ధాలను ఆపటం చాలా కష్టమని, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపటం చాలా తేలిక అని నేను భావించాను. కానీ, నా అంచనా తప్పింది. భారత్–పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు నేను చేయాల్సిందంతా చేశాను. రష్యా– ఉక్రెయిన్ విషయంలో కూడా అదే వ్యూహం అమలుచేశాం. కానీ, ఆ రెండు దేశాధినేతల మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ పరస్పరం తీవ్రంగా అసహ్యించుకుంటారు’అని ట్రంప్ తెలిపారు. -
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తోపాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా శుక్రవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో నలుగురు చనిపోగా, 20 మంది వరకు గాయపడ్డారు. కీవ్‌పై వేకువజామున జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఇద్దరు చనిపోగా, 13 మంది గాయపడ్డారు. దాడుల్లో ఒక భవనానికి నిప్పంటుకుంది. కూల్చిన క్షిపణి శకలాలు బహిరంగ ప్రదేశంలో పడిపోవడంతో సమీపంలోని వాహనాలు, భవనాల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.నీప్రోపెట్రోవిస్క్ ప్రాంతంపై జరిగిన మరో దాడిలో ఇద్దరు చనిపోగా ఏడుగురు క్షతగాత్రులయ్యారు. పలు అపార్టుమెంట్ భవనాలు, నివాస గృహాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన 9 క్షిపణులు, 63 డ్రోన్లకు గాను నాలుగు మిస్సైళ్లు, 50 డ్రోన్లను మధ్యలోనే కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.పేట్రియాట్లు కొంటాం: జెలెన్స్కీనిత్యం భయపెడుతున్న రష్యా దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు వెంటనే పేట్రియాట్ రక్షణ వ్యవస్థలను తమకు సమకూర్చాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా, యూరప్, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నగరాలకు రక్షణ కల్పించేందుకు అమెరికా నుంచి త్వరలోనే 25 పేట్రియాట్ వ్యవస్థల ను కొనుగోలు చేయనున్నామన్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అధ్యక్షతన లండన్‌లో జరుగుతున్న యూరప్ దేశాల నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక వేళ కాల్పుల విరమణ జర క్కుంటే రానున్న రోజుల్లో రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీకి వారు హామీ ఇచ్చారు. -
ట్రంప్ నోట మళ్లీ చమురు మాట
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ఇస్తున్న డబ్బులతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోందని ఆయన మండిపడుతున్నారు. ఈ కొనుగోళ్లను ఆపేయాల్సిందేనని అంటున్నారు. అదే విషయం మరోసారి స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆ దిగుమతులు దాదాపు సున్నాకు పడిపోతాయని పేర్కొన్నారు. అంటే కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనకుండా చైనాను ఒప్పించడానికి ప్రయతి్నస్తానని ట్రంప్ తెలిపారు. భారత్ బాటలో చైనా కూడా నడిస్తే బాగుంటుందని సూచించారు. ఆయన బుధవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్ననే ఫోన్లో మాట్లాడాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయడానికి భారత్ అంగీకరించింది. అయితే, హఠాత్తుగా ఆపేయలేరు కాబట్టి కొంత సమయం పడుతుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయి. భారత్ గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది’’అని ఉద్ఘాటించారు. రష్యా చమురు విషయంలో ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. భారత్, చైనాలు రష్యాకు ఇచ్చే డబ్బులు ఆగిపోతే ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగుతుందని ఆయన తరచుగా చెబుతున్నారు. ఈ యుద్ధానికి ఆ రెండు దేశాలే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయని మండిపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు బంద్ చేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని భారత్ ఖండించింది. మోదీ అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని తేల్చిచెప్పింది. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో మరో ఉద్దేశం లేదని వెల్లడించింది. తన మాట లెక్కచేయనందుకు భారతదేశ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. త్వరలో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశం కాబోతున్నానని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయనతో చర్చిస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అది చమురు గానీ, ఇంధనం గానీ, ఇంకేదైనా గానీ రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తన ప్రతిపాదనల పట్ల జిన్‌పింగ్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని వివరించారు. -
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్‌లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్‌తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్‌ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్‌ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది. -
రష్యా అణు విన్యాసాలు
మాస్కో: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరగాల్సిన భేటీ అనూహ్యంగా రద్దయ్యింది. ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు జరుగు తుందో లేదో కూడా తెలియడం లేదు. ట్రంప్‌ను కలుసుకోవడానికి పుతిన్ ఇష్టపడడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో పుతిన్ బుధవారం రష్యా వ్యూహాత్మక అణు దళాల విన్యాసాలను పర్యవేక్షించడం గమనార్హం. ఈ విషయాన్ని పుతిన్ టీవీలో ప్రకటించారు. అలాగే ఆయన రష్యా సైనికాధికారులను ఉద్దేశించి ఆన్లైన్లో మాట్లాడారు. న్యూక్లియర్ డ్రిల్స్‌లో భూఉపరితలం, సముద్రం, గగనతలానికి సంబంధించిన దళాలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ విన్యాసాల్లో భాగంగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైళ్లు, గగనతల క్రూయిజ్ మిస్సైళ్లను ప్రాక్టికల్‌గా ప్రయోగించినట్లు రష్యా అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. పుతిన్ స్వయంగా పర్య వేక్షించారని పేర్కొన్నాయి. వ్యూహాత్మక అణు జలాంతర్గామి బ్రియాన్స్క్, టీయూ 095 ఎంఎస్ వ్యూహాత్మక బాంబర్లు సైతం ఇందులో పాల్గొన్నట్లు తెలిపాయి. పుతిన్, ట్రంప్ భేటీపై ప్రస్తుతానికి తమ కు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పష్టంచేశారు. పుతిన్‌తో సమావేశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య జరగాల్సిన సమావేశం కూడా నిరవధికంగా వాయిదా పడడం గమనార్హం. -
రష్యా ముడి చమురుకు కత్తెర
వాషింగ్టన్: భారతీయులతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్, అమెరికాల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని మోదీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో మంగళవారం రాత్రి జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు. సంప్రదాయ చమురు దీపాన్ని స్వయంగా వెలిగించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం అధికంగా ముడిచమురు కొనుగోలు చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా చమురు విషయంలో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలును పూర్తిగా ఆపేస్తామంటూ భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పరిమితంగానే కొనుగోలు చేస్తుందంటూ తాజాగా వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీపావళి వేడుకల్లో ఆహా్వనితులను ఉద్దేశించి ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ట్రంప్ ఏం చెప్పారంటే... ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ ‘‘మీ ప్రధానమంత్రి మోదీతో ఇప్పుడే మాట్లాడాను. మా మధ్య చక్కటి సంభాషణ జరిగింది. వాణిజ్యం సహా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆ అంశంపై మోదీకి ఎక్కువ ఆసక్తి ఉంది. మోదీ నిజంగా గొప్ప వ్యక్తి. ఆయన నాకు చాలాఏళ్లుగా మంచి మిత్రుడు. మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉంటాం. భారత్–పాకిస్తాన్ సంబంధాలపైనా మోదీతో చర్చించాను. పాకిస్తాన్‌తో యుద్ధాలు వద్దన్న అభిప్రాయం మా సంభాషణలో వ్యక్తమైంది. భారత్, పాకిస్తాన్లతో అమెరికాకు ఎలాంటి యుద్ధాలు, విభేదాలు లేకపోవడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. కీలక ఒప్పందాలపై కలిసి పని చేస్తున్నాంవైట్హౌస్ వేడుకల అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారతీయులను ఎంతగానో అభిమానిస్తున్నానని చెప్పారు. మోదీతో ఫోన్లో మాట్లాడానని, ఆయనతో తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారత్ అధికంగా(టూ మచ్) ముడి చమురు కొనుగోలు చేయబోదని ఉద్ఘాటించారు. కొన్ని కీలక ఒప్పందాలపై భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని వివరించారు. తనలాగే మోదీ కూడా ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవడాన్ని కళ్లారా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్ భారీగా కత్తెర వేస్తుందని తాను భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చాలావరకు తగ్గిపోవడం తథ్యమని అన్నారు. ముడిచమురు దిగుమతుల తగ్గింపు ప్రక్రియ చాలాకాలం కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు ఎంతగానో తోడ్పాడు అందిస్తున్నాయని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలకు భారత్–అమెరికన్లు సారథ్యం వహిస్తున్నారని, వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అదే మనకు దారిదీపం వైట్‌హౌస్‌లో దీపావళి పండుగకు అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ్, మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మోహ్రోత్రా, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, అమెరికాలో భారత రాయబారి వినయ్‌మోహన్ క్వాత్రా, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ దీపావళి సందేశాన్ని విడుదల చేశారు. ‘‘చీకటిపై వెలుగు విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపం వెలిగిస్తున్నాం. దీపావళి సమయంలో ప్రాచీన గాథలను గుర్తుచేసుకోవాలి. శత్రువులు పరాజయం పాలైన, అవరోధాలు తొలగిపోయిన, సామాన్యులకు విముక్తి లభించిన గాథలను మనం తెలుసుకోవాలి. నిండుగా వెలుగులు విరజిమ్ముతున్న దీపం మనకు దారి చూపిస్తుంది. జ్ఞానమార్గంలో నడవాలని, శ్రద్ధతో పనిచేయాలని, మనకు లభించే ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేయాలని బోధిస్తుంది’’ అని ట్రంప్ వివరించారు. మోదీకి ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు ఫోన్ చేసి మాట్లాడి, దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలు కలిసికట్టుగా పనిచేయాలని, ప్రపంచాన్ని వెలిగిస్తూనే ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదంపై భారత్, అమెరికాలు ఉమ్మడిగా పోరాటం చేయాలన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్, మోదీ సంభాషణలో పాకిస్తాన్ ప్రస్తావన రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. -
రష్యా గ్యాస్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
కీవ్: కజఖ్‌స్తాన్ సరిహద్దుల్లో ఉన్న రష్యాకు చెందిన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై శనివారం రాత్రి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లు సంభవించడంతోపాటు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, ప్లాంట్‌ను మూసివేసినట్లు రష్యా, కజకిస్తాన్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాజ్ప్రోమ్ సంస్థకు చెందిన ఒరెన్‌బర్గ్ ప్లాంట్‌లో కజఖ్‌స్తాన్ నుంచి వచ్చే గ్యాస్‌ను ప్రాసెసింగ్ చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఒరెన్‌బర్గ్ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 45 బిలియన్ క్యూబిక్ మీటర్లు. డ్రోన్ దాడి కారణంగా ఈ ప్లాంట్‌లోని వర్క్‌షాప్ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ప్లాంట్‌లో తాత్కాలికంగా గ్యాస్ ప్రాసెసింగ్‌ను నిలిపివేశామన్నారు. రష్యా తమపై సాగిస్తున్న యుద్ధానికి ఇంధన వనరులే కీలకమని భావిస్తున్న ఉక్రెయిన్ తరచూ ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. మరో డ్రోన్ దాడితో ఒరెన్‌బర్గ్ సమీపంలో నొవొకుయి బషెవ్స్క్ ఆయిల్ రిఫైనరీ ప్రధాన శుద్ధి విభాగం దెబ్బతిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇలా ఉండగా, రష్యా ఆధునీకరించిన గ్లైడ్ బాంబును ఖర్కీవ్‌లోని లొజావా నగరంపై శనివారం మధ్యాహ్నం ప్రయోగించిందని వెల్లడించింది. యూఎంపీబీ–5 ఆర్ అని పిలిచే రాకెట్ అమర్చిన ఈ రకం బాంబులు 130 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించిన తర్వాత సంభవించే పేలుడుతో తీవ్ర విధ్వంసం సంభవిస్తుంది. -
తూచ్ అదంతా ఉత్తినే.. జెలెన్స్కీకి ట్రంప్ ఝలక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. రష్యాను బెదిరించినట్టే వార్నింగ్ ఇచ్చి.. వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఆపకపోతే జెలెన్స్కీకి అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను ఇస్తామని ప్రకటించిన ట్రంప్.. తాజాగా అలాంటిదేమీ లేదని చేతులెత్తేశారు. దీంతో, మరోసారి అందరి ముందూ నవ్వులపాలయ్యారు.ఇక, రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఇందు కోసం ఇప్పటికే పలు రకాల ప్లాన్స్ వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సైతం ట్రంప్ భేటీ అయ్యారు. కానీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మాత్రం ఆడగం లేదు. ఈ నేపథ్యంలో రష్యా బెదిరించేందుకు ట్రంప్ కొత్త ప్లాన్ చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకపోతే తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను జెలెన్స్కీకి ఇవ్వాల్సి వస్తుందని రష్యాను బెదిరించారు. ఇలా అయినా పుతిన్‌కు దారికి తెచ్చేందుకు పైకి గంభీరంగా ప్రకటన చేశారు.🇺🇸🇺🇦 US President Trump has rejected Ukrainian President Zelensky’s request for more tomahawk missiles in a “tense” White House meeting today. @europa pic.twitter.com/O5OVZFOjA7— EUROPA (@europa) October 18, 2025అయితే, తాజాగా ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్‌ను జెలెన్స్కీ కలిశారు. ఈ సందర్బంగా తోమహాక్ క్షిపణులపై చర్చించారు. తమకు క్షిపణులను ఇవ్వాలని అందుకు బదులుగా తాము డ్రోన్లను ఇస్తామని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. కానీ, ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఊహించని షాక్ ఇచ్చారు. తోమహక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని ట్రంప్ తెగేసి చెప్పేశారు. తాజా పరిస్థితుల్లో అమెరికా నిల్వలను తగ్గించలేనని.. వాటిని సరి చూసుకోవాలని తెలిపారు. దాని కన్నా ముఖ్యంగా తనకు యుద్ధం ముగించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు.Again, Zelensky had a bath with cold water. He expected to get the Tomahawk cruise missiles to counter attacks on Russia. But Kerlmin already made a deal with President Trump. Mr. Putin is trying to delay the peace process because he doesn’t want to lose his power.— Rudra Raya (@RudraRaya) October 18, 2025 ఈ సందర్బంగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు తాను క్షిపణులను ఇవ్వలేనని చేతులెత్తేశారు. అయితే.. తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకునేలా చేయవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. మరోవైపు, బుడాపెస్ట్‌లో సమావేశం తర్వాత క్షిపణుల గురించి ఆలోచిస్తానని ట్రంప్ దానికి బదులు చెప్పారని వైట్‌హౌస్ అధికారులు చెబుతున్నారు. కాగా, ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు క్షిపణులను ఇస్తే అమెరికా-రష్యా సంబంధాలకు హాని కలుగుతుందని, దాని వలన యుద్ధం మరింత సీరియస్ అవుతుందే తప్ప ఏం ఉపయోగం లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. -
రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది: ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పడం తెలిసిందే. అయితే భారత్ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఈ దరిమిలా ట్రంప్ మరోసారి అదే వ్యాఖ్య చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురు కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యల చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో వైట్‌హౌజ్‌లో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలును అతిత్వరలోనే భారత్ నిలిపివేయబోతోందని అన్నారాయన. తద్వారా మాస్కోపై ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలనే ఒత్తిడి పెరగబోతోందని ట్రంప్ తాజాగా చెప్పారు. ఇండియా రష్యా నుంచి 38 శాతం చమురు కొనుగోలు చేసేది. అయితే ఇక నుంచి ఆ పని చేయబోదు. ఆ దేశం ఇప్పటికే కొనుగోళ్లను తగ్గించేసింది. దాదాపుగా ఆపేసేదాకా వచ్చింది అని ట్రంప్ అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తనకు రష్యా చమురు కొనుగోలు నిలిపివేతపై స్పష్టమైన హామీ ఇచ్చారని, తమ మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీంతో.. ఇక్కడి ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు కూడా. అయితే.. భారత్ తమ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. ట్రంప్-మోదీల మధ్య అటువంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్వయంగా వెల్లడించారు కూడా. ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఏంటంటే.. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును బహిరంగ మార్కెట్లో తిరిగి విక్రయించి లాభాలు పొందుతోంది అని. ఇది రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తోందని. అలా ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ట్రంప్ భారత్‌పై 25% ప్రతీకార సుంకం(అంతకు ముందు విధించిన దాంతో కలిపి మొత్తంగా 50 శాతం) విధించినట్లు ప్రకటించారు కూడా. అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్న వేళ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురును ఆపేయబోతోందన్న వ్యాఖ్య చేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.ఇదీ చదవండి: ట్రంప్ అయోమయావస్థ! -
మోదీ మాటిచ్చారు..!
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడిచమురు కొనుగోలు చేస్తుండడం పట్ల చాలా రోజులుగా అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ తన మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలిపివేసే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అవుతుందని అన్నారు. చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా ఉక్రెయిన్‌పై దండయాత్ర ఆగిపోతుందని ఉద్ఘాటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండడం తమకు ఎంతమాత్రం సంతోషం కలిగించడం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆర్థికంగా మేలు జరుగుతోందని, అంతిమంగా ఆ సొమ్మంతా ఉక్రెయిన్‌పై యుద్ధానికే ఖర్చవుతోందని తెలిపారు. ఎవరైనా సరే రష్యాకు ఆర్థికంగా సాయం అందించడం మానుకోవడం మంచిదని హితవు పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న మతిలేని యుద్ధంలో లక్షల మంది బలైపోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేస్తామంటూ ఈరోజు తన మిత్రుడు మోదీ మాట ఇచ్చారని పేర్కొన్నారు. ఇక చైనా సైతం అదే దారిలో నడుస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలియజేశారు. చైనా ప్రభుత్వం రష్యా నుంచి చమురు దిగుమ తి చేసుకోవడం ఆపేస్తే మంచిదని సూచించారు. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ ప్రశంసించారు. తానంటే మోదీకి ఎంతో ప్రేమ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రేమ అనే పదాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. మోదీ రాజకీయ జీవితానికి ఇబ్బందులు సృష్టించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘భారత్‌ను చాలా ఏళ్లుగా గమనిస్తున్నా. అదొక నమ్మశక్యంకాని దేశం. ప్రతి సంవత్సరం ఒక కొత్త నాయకుడు అధికారంలోకి వస్తుంటారు. కొందరైతే కొన్ని నెలలపాటే ఉండొచ్చు కూడా. కానీ, నా స్నేహితుడు మోదీ చాలాఏళ్లుగా వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ ఆయన నాకు మాట ఇచ్చారు. నిజంగా నాకు తెలియదు గానీ అదొక బ్రేకింగ్ స్టోరీ కావొచ్చు! మోదీ వెంటనే ఆ పని చేయకపోవచ్చు. నా అంచనా ప్రకారం కొంత సమయం పట్టొచ్చు. కానీ, త్వరలోనే ఆ ప్ర క్రియ పూర్తవుతుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ముగిసిన తర్వాత రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్ పునరుద్ధరించుకోవచ్చు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాక్‌ను అనబోయి..భారత్‌లో ఏడాదికొక పాలకుడు అధికారంలోకి వస్తాడంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ పరిస్థితిని ట్రంప్ పొరపాటున భారత్‌కు అన్వయించి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగతోంది. ట్రంప్ మానసిక ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయని జనం పోస్టులు చేస్తున్నారు. నిజానికి భారత్‌లో ఏడాదికొక ప్రధానమంత్రి మారిపోయిన సందర్భాలు లేవు. పాకిస్తాన్‌లోనే అలాంటి పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.అంతా అబద్ధం‘మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరగలేదు’ రష్యా చమురు విషయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ గురువారం ఖండించింది. బుధవారం మోదీ, ట్రంప్ మధ్య ఫోన్లో ఎలాంటి సంభాషణ జరగలేదని తేల్చిచెప్పింది. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేసింది. దేశ అవసరాలు, ప్రయోజనాల కోణంలోనే రష్యా నుంచి ముడిచమురు కొంటున్నామని, ఇందులో మరో మాటకు తావులేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఇంధన విధాన నిర్ణయాలకు స్థిరమైన ధరలు, నిరంతరాయమైన సరఫరానే పతిప్రాదిక అని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన దిగుమతుల్లో మార్పులుచేర్పులు చేసుకుంటున్నామని ఉద్ఘాటించింది. ఇంధన వనరుల్లో వైవిధ్యం కొనసాగిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది. ట్రంప్‌ను చూస్తే మోదీకి భయం: రాహుల్ న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను మోదీ అమెరికాకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ పాలనలో విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందని మండిపడ్డారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ మిత్రుడు మోదీ మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించడంపై రాహుల్ గురువారం తీవ్రంగా స్పందించారు. రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకొని, ప్రకటనలు చేసే అధికారాన్ని ట్రంప్‌కు మోదీ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ వల్ల తరచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ అభినందన సందేశాలు పంపిస్తున్నారని ప్రధానమంత్రిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. భారత ఆర్థిక శాఖ మంత్రి అమెరికా పర్యటనను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించే విషయంలో ఈజిప్టులోని షెర్మ్ ఎల్–õÙక్లో జరిగిన భేటీకి ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందంటూ డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ గాంధీ నిలదీశారు. -
‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’
న్యూఢిల్లీ: భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసినట్లు, ఇక రష్యా చమురు కొనుగోలు చేయమని ట్రంప్‌కు మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ రూమర్లేనని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ‘నిన్న అసలు మోదీ-ట్రంప్‌ల మధ్య ఎటువంటి సంభాషణ జరగేలేదు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడలేదు. రష్యా చమురు నిలిపివేస్తామని ట్రంప్‌కు మోదీ హామీనూ ఇవ్వలేదు. వారి మధ్య ఎటువంటి టెలిఫోన్ సంభాషణ జరగనేలేదు. ఇదంతా అవాస్తవం’ అని విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇదీ విషయం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. @రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్‌తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పా’. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తున్న సమయంలో భారత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఇదీ చదవండి: మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు -
ట్రంప్ ప్రకటన.. రాహుల్ విమర్శలు.. స్పందించిన కేంద్రం
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందని, ఇందుకుగానూ భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంధన దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ నోట్ రూపేణా స్పందించింది. అస్థిర పరిస్థితుల నడుమ.. వినియోగదారుల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం ఉంటుందని అందులో కేంద్రం స్పష్టం చేసింది(India Reacts On Trump Russia Oil Comments).మీడియా ప్రశ్నలకు బదులుగా.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తాజా పరిణామాలపై ఒక నోట్ విడుదల చేశారు. చమురు సంబంధిత దిగుమతులు భారత్‌కు ఎంతో కీలకం. మార్కెట్ అస్థిరతల మధ్య ఇక్కడి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రధాన ధ్యేయం. అందుకే దిగుమతుల విధానాలు ఆ దిశగా రూపొందించబడ్డాయి.... స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో కూడిన సరఫరా.. ఇవే మా ద్వంద్వ లక్ష్యాలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఇంధన వనరుల విస్తరణ, వివిధ దేశాల నుంచి సరఫరా పొందడం జరుగుతోంది అని అందులో పేర్కొన్నారాయన. అలాగే..Our response to media queries on comments on India’s energy sourcing⬇️🔗 https://t.co/BTFl2HQUab pic.twitter.com/r76rjJuC7A— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2025అమెరికాతో సంబంధం గురించి మాట్లాడుతూ.. గత దశాబ్దంగా ఇంధన సహకారం పెరుగుతోంది. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సహకారం మరింతగా అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపుతోంది. చర్చలు కొనసాగుతున్నాయి అని జైస్వాల్ అందులో తెలిపారు. తద్వారా.. అంతర్జాతీయ ఒత్తిడులకు కాకుండా దేశ ప్రయోజనాల ఆధారంగా భారత్ ముందుకు వెళ్తుందని మరోసారి భారత్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) ముగింపు దిశగా కీలక అడుగు పడిందని, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయబోతోందని, మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. ట్రంప్ నుంచి సానుకూల స్పందన లేకపోయినా తరచూ అభినందన సందేశాలు ఎందుకంటూ మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ తరుణంలో కౌంటర్‌గా కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.ఇదీ చదవండి: మోదీ నన్ను ప్రేమిస్తారు.. అంటే మరోలా కాదు! -
మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు గుప్పించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని మోదీ తనకు మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ గొప్ప వ్యక్తి అంటూనే ట్రంప్ విచిత్రమైన వ్యాఖ్య ఒకటి చేశారు. మోదీ ఓ గొప్ప వ్యక్తి. భారత్‌ను ఎంతో కాలంగా నేను చూస్తున్నా. అది ఎంతో అద్భుతమైన దేశం. అలాంటి దేశానికి నా స్నేహితుడు అధినేతగా దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. ఆయన ట్రంప్‌ను ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడ ప్రేమంటే తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు అంటూ నవ్వుతూ అన్నారాయన. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని.. ఈ చర్యతో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ అర్ధిక సహకారం అందిస్తోందని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించారాయన. అయితే తాజాగా వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ ఇక మీదట చమురు కొనదని మోదీ హామీ ఇచ్చారని ప్రకటించారు. ఇప్పటికప్పుడే కాకపోయినా.. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేస్తామని మోదీ తనతో చెప్పారని ట్రంప్ అన్నారు. అలాగే.. భారత్ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు కీలక ముందడుగు అని అభివర్ణించారాయన. అలాగే తన తదుపరి లక్ష్యం చైనానే అని ప్రకటించారాయన. -
యుద్ధం ఆపకుంటే ఉక్రెయిన్‌కు తొమహాక్లు ఇస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో సుదీర్ఘకాలంగా చేస్తున్న యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపకుంటే తాము ఉక్రెయిన్‌కు అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణులైన తొమహాక్లు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్‌కు వెళ్తూ తన విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘ఈ యుద్ధానికి ముగింపు పలకకుంటే నేను వారికి (ఉక్రెయిన్) తొమహాక్లు అందజేస్తాను. తొమహాక్లు చాలా ప్రత్యేకమైనవి, శక్తిమంతమైనవి, ప్రభావవంతమైనవి. నిజంగా చెప్తున్నా ఉక్రెయిన్ చేతికి ఇలాంటి ఆయుధాలు అందటం రష్యాకు అస్సలు మంచిది కాదు. ఉక్రెయిన్‌కు తొమహాక్లు ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కానీ, యుద్ధాన్ని ముగించేందుకు అదే సరైన పని. ఇలాంటి పరిస్థితి రావాలని రష్యా కోరుకోదనే అనుకుంటున్నా. ఈ అంశంపై నేను రష్యాతోనూ మాట్లాడే అవకాశాలు లేకపోలేదు’అని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉక్రెయిన్‌కు తొమహాక్ క్షిపణులు అందజేసేందుకు సిద్ధమని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై కీలకమైన ఆయుధాలు వాడకుండా రష్యాపై కూడా తాను ఒత్తిడి తీసుకురాగలనని పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్‌కు తొమహాక్ క్షిపణులు అందిస్తే రష్యా– అమెరికా మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని పుతిన్ ఇటీవలే హెచ్చరించారు. ఏమిటి తొమహాక్ల ప్రత్యేకత? తొమహాక్ క్షిపణుల పూర్తిపేరు బీజీఎం–109 తొమహాక్ లాండ్ అటాక్ మిసైల్స్ (టీఎల్ఏఎం). ఇవి ఎలాంటి వాతావరణంలో అయినా లక్ష్యాన్ని అత్యంత కచి్చతత్వంతో ధ్వంసం చేయగలవు. జెట్ ఇంజన్ శక్తిగత ఈ సబ్‌సోనిక్ క్యూయిజ్ క్షిపణులను ప్రస్తుతం అమెరికా నేవీ, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీలు వాడుతున్నాయి. వీటిని యుద్ధనౌకలు, సబ్మెరైన్ల ద్వారా ప్రయోగిస్తారు. జాన్హాప్కిన్స్ యూనివర్సిటీలోని అప్లయిడ్ ఫిజిక్స్ లే»ొరేటరీ వీటిని అభివృద్ధి చేసింది. 1970 దశకంలో వీటిని జనరల్ డైనమిక్స్ మొదట ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత కాలానుగుణంగా వీటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. వీటితో బహుళ లక్ష్యాలను ఛేదించవచ్చు. యుద్ధనౌకలతోపాటు భూమిపై ఉండే లక్ష్యాలను కూడా ధ్వంసం చేయవచ్చు. ఒక్కో క్షిపణి ఖరీదు దాదాపు రూ.18 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో వివిధ రకాలున్నాయి. టీఎల్ఏఎం బ్లాక్ 2 క్షిపణి రేంజ్ 2,500 కిలోమీటర్లు. బ్లాక్ 3 రేంజ్ 1,300 కిలోమీటర్లు. సబ్‌మెరైన్స్ నుంచి ప్రయోగించే క్షిపణుల రేంజ్ వేరుగా ఉంటుంది. ఇవి శత్రు రాడార్లను ఏమార్చి దాడులు చేయగలవు. -
ఉక్రెయిన్ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్!
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా టోమాహాక్ క్షిపణులు పంపే యోచనపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం అన్ని వైపుల నుండి తీవ్ర రూపం దాల్చడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని రష్యా హెచ్చరించింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులు ఇవ్వడంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్షిపణులను పంపే ముందు, యుద్ధ తీవ్రత పెరగకుండా చూసుకుంటానని తెలిపారు. ఉక్రెయిన్ వాటిని ఎలా ఉపయోగించబోతుందో ముందుగా తెలుసుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. ఈ అంశంపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.‘టోమాహాక్ల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది’అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ ప్రభుత్వ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్ని వైపుల నుండి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే వాస్తవం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత ఘోరమైన ఉక్రెయిన్ యుద్ధం. 1962లో జరిగిన క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత, ఇప్పుడు రష్యా–పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం అత్యంత తీవ్రమైన ఘర్షణగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా.. పశ్చిమ దేశాలతో తీవ్రమైన రాజకీయ, దౌత్య వివాదంలో ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి రష్యా కామెంట్స్‌పై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల మాట్లాడుతూ, టోమాహాక్ క్షిపణులను అమెరికా సైనికుల ప్రత్యక్ష సహకారం లేకుండా ఉపయోగించడం అసాధ్యం అని అన్నారు. అందువల్ల, ఈ క్షిపణుల సరఫరా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దశకు తీసుకెళ్తుందని హెచ్చరించారు.టోమాహాక్ క్షిపణిటోమాహాక్ క్షిపణి 2,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే ఉక్రెయిన్ నుంచి వీటిని ప్రయోగిస్తే అవి మాస్కో, యూరోపియన్ రష్యాలోని చాలా ప్రాంతాలను సులభంగా చేరుకోగలవు. టోమాహాక్ అనేది అమెరికా నేవీ ఐకానిక్ సబ్సెనిక్ కూయిజ్ క్షిపణి. దీనిని 1970ల నుంచి అభివృద్ధి చేశారు. దీనిని ఓడలు, జలాంతర్గాములు, ల్యాండ్ లాంచర్ల నుంచి ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1,000 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కచ్చితంగా చేదించగలదు. వీటిలో బ్లాక్ ఐవీ (TACTOM) వెర్షన్ అత్యంత అధునాతనమైనది. ఈ సూపర్ వెపన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని విమానం నుంచి ప్రయోగించినప్పుడు ఒకసారి నిర్దేశించిన లక్ష్యాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడీ క్షిపణులను అమెరికా.. ఉక్రెయిన్‌కు ఇస్తుంటే రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటన వేళ ట్విస్ట్
మాస్కో: 2025 ఏడాదికిగానూ నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)ప్రకటన వెలువడే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న కృషిపై రష్యా ఎప్పటికప్పుడు ప్రశంసలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బహుమతి ప్రకటనకు చివరి గంటల్లో రష్యా అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషాకోవ్ పేరిట శుక్రవారం ఉదయం ఒక ప్రకటన వెలువడింది.మరోవైపు.. యుద్ధ విరామం జరిగితేనే తాము కూడా ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్ మద్దతు ఇవ్వనట్లే అని భావించాలి. ఇక..నోబెల్ శాంతి బహుమతి పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతులేని ఆశ పెట్టుకున్నారు. తనవల్లే ప్రపంచంలో పలు దేశాల మధ్య జరుగుతోన్న ఘర్షణలు ఆగాయని ఒకటే ప్రకటించుకుంటున్నారు. ఒకవేళ ఈ ఏడాది శాంతి బహుమతి రాకుంటే ట్రంప్ ఏం చేస్తారనే ఉత్కంఠ ప్రపంచం మొత్తం నెలకొంది. అదే సమయంలో ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాదిలో ఆయన నోబెల్ కల తీరవచ్చనే విశ్లేషణ ఒకటి నడుస్తోంది. మరికొద్ది సేపట్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడనుంది.ఇదీ చదవండి: అందుకే ట్రంప్‌కు నో నోబెల్! -
‘రష్యా.. పచ్చి అబద్ధం’: ఉక్రెయిన్ అదుపులో భారతీయుడు!?
ఉక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. రష్యా తరపున పోరాడుతున్న ఓ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతను భారతీయుడని తెలిపింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది(Is Indian Captured By Ukraine Army). ది కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. పట్టుబడిన యువకుడి పేరు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్(22). స్వస్థలం గుజరాత్ మోర్బీ. ఉన్నత విద్య కోసం రష్యాకు వెళ్లి.. ఇప్పుడు యుద్ధ సైనికుడిగా ఉక్రెయిన్‌కు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతని స్టేట్మెంట్తో సదరు మీడియా సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లిన మజోత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడట. ఏడేళ్ల శిక్ష పడడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడట. అయితే.. యుద్ధంలో పోరాడితే శిక్షా కాలం తగ్గిస్తామని, ఆర్థికంగా కూడా సాయం అందిస్తామని మజోత్కు రష్యా అధికారులు ఆఫర్ చేశారట. జైల్లో ఉండడం ఇష్టం లేక అందుకు అంగీకరించానని, అయితే ఆ ఒప్పందంపై సంతకం చేసింది అక్కడి నుంచి బయటపడేందుకేనని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు. రష్యాలో అంతా పచ్చి అబద్ధం. నాకు ఆర్థిక సాయం అందలేదు. తగ్గిస్తామని అధికారులు చెప్పడం, జైల్లో ఉండడం ఇష్టం లేకనే ఆ ఒప్పందం కుదుర్చుకుని రష్యా తరఫున స్పెషల్ మిలిటరీ ఆపరేషన్(Special Military Operation)లో పాల్గొన్నానంటూ అతను చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఉక్రెయిన్ స్థావరాన్ని చూడగానే తాను తన రైఫిల్‌ను పక్కన పెట్టి సాయం కోసం అర్థించానని చెప్పాడతను. తనకు రష్యాకు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని.. రష్యా జైల్లో మగిపోవడం కంటే ఇక్కడ ఉక్రెయిన్ జైల్లో శిక్ష అనుభవించడం ఎంతో నయంగా భావిస్తున్నట్లు చెప్పాడతను. Ukraine's military says they have captured an Indian national who was fighting alongside Russian forces.Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4— Sidhant Sibal (@sidhant) October 7, 2025మరోవైపు ఈ కథనం తమ దృష్టికీ వచ్చిందని, అయితే ఉక్రెయిన్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ చెబుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దురాక్రమణను మొదలుపెట్టింది. అయితే ఈ యుద్ధంలో ఇతర దేశాల యువకులకు గాలం వేసి రష్యా సైన్యం ఉపయోగించుకుంటోందని.. ఉత్తర కొరియా, భారత్.. ఇలా పలు దేశాలకు చెందిన యువకులకు ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఆఫర్ చేస్తుందనే విమర్శ తొలి నుంచి వినిపిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే 48 దేశాలకు చెందిన 1,500 మందికి పైగా విదేశీయులను పట్టుకున్నట్లు(Foreigners Caught in Ukraine War) నివేదికలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోవడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యాలో ఉన్న భారతీయుల్లో 126 మందిని ఉక్రెయిన్ యుద్ధంలో దించారని, అందులో 12 మంది మరణించగా.. మరో 16 మంది ఆచూకీ లేకుండా పోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఇదే విషయాన్ని మాస్కో వర్గాల దృష్టికి తీసుకెళ్లిన భారత్.. ఈ యుద్దంలో చిక్కుకున్న తన పౌరులకు విముక్తి కల్పించాలని కోరింది కూడా. ప్రధాని మోదీ సైతం జోక్యం చేసుకున్న నేపథ్యంలో 96 మందిని రష్యా విడుదల చేసింది. అయితే ఇలాంటి నియామకాలు ఆపేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ.. ఆ నియామకాలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ సుంకాలపై గీతా గోపినాథ్ షాకింగ్ రియాక్షన్ -
భారత్ కు మరిన్ని S400లు..! పాకు దబిడి దిబిడే
-
రష్యా నుంచి అదనంగా ఎస్–400 సిస్టమ్స్
న్యూఢిల్లీ: రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ కీలకపాత్ర పోషించాయి. వీటి పనితీరు అద్భుతంగా ఉన్నట్లు తేలింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనపు ఎస్–400 సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్‌ను సమకూర్చుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. రష్యా అధ్యక్షుడు ఈ ఏడాది డిసెంబర్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఎస్–400ల కొనుగోలు గురించి పుతిన్‌తో మోదీ చర్చించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదు ఎస్–400ల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం 2018 అక్టోబర్‌లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు. ఇందులో మూడు ఎస్–400లను భారత్‌కు రష్యా అప్పగించింది. మిగిలిన రెండు త్వరలో రానున్నాయి. ఇవి కాకుండా అదనపు వ్యవస్థల కొనుగోలుకు ప్రతిపాదన సిద్ధమైంది. -
భారత్‌తో వాణిజ్య సమతూకం!
మాస్కో: భారత్‌తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు. ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. #BREAKING: Russian President Putin at Valdai Club in Sochi on Trump Tariffs, says, “Indian people will look at what decisions are made by their political leadership. Indian people will never accept any humiliation. I know PM Modi, he will never take any steps of the kind.” pic.twitter.com/2GYqoVK1PO— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 2, 2025స్వప్రయోజనాలు దెబ్బతింటే భారత్ సహించదుభారతదేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్‌లు విధించడాన్ని పుతిన్ తప్పుపట్టారు. దేశ స్వప్రయోజనాలు, ప్రాధాన్యతల కోణంలోనే భారతీయులు నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారు సహించబోరని తేల్చిచెప్పారు. అమెరికా విధిస్తున్న టారిఫ్‌ల కారణంగా వాటిల్లుతున్న నష్టాన్ని రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ భర్తీ చేసుకుంటోందని అన్నారు. అదేసమయంలో ఒక సార్వ¿ౌమ దేశంగా ప్రతిష్టను కాపాడుకుంటోందని ప్రశంసించారు. భారత్ నుంచి దిగుమతులు పెంచుకుంటామని, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఔషధ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ అధికంగా కొనుగోలు చేస్తామని ఉద్ఘాటించారు. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. ఫైనాన్సింగ్, లాజిస్టిక్స్‌తోపాటు చెల్లింపుల్లో కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. భారత్, రష్యాలు ఏనాడూ ఘర్షణ పడలేదని, భవిష్యత్తులోనూ అలాంటిది తలెత్తే అవకాశమే లేదని పుతిన్ తేల్చిచెప్పారు. భారతీయ సినిమాలంటే ఇష్టం భారతీయ సినిమాలు వీక్షించడం తనకు ఎంతో ఇష్టమని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ సినిమాలకు రష్యాలో విశేషమైన ఆదరణ లభిస్తోందని చెప్పారు. భారతీయ సినిమాలను రోజంతా ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ చానల్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు దేశాల నడుమ రాజకీయ, దౌత్య సంబంధాలే కాకుండా సాంస్కృతిక, మానవీయ బంధాలు కూడా బలంగా ఉన్నాయని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి అంటే రష్యన్లకు ఎంతో అభిమానం అని వ్యాఖ్యానించారు. చాలామంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుకుంటున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: పాక్ పరువు.. మళ్లీ పాయే! -
మాది విశేషమైన బంధం
ఐక్యరాజ్యసమితి: భారతదేశ ప్రయోజనాలను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరించే స్వతంత్ర విదేశాంగ విధానాలను తాము సంపూర్తిగా గౌరవిస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. అమెరికాతో గానీ మరే ఇతర దేశంతోగానీ భారత్ సంబంధాలు, భారత్, రష్యాల మధ్య సంబంధాలకు ప్రామాణికం కావని స్పష్టం చేశారు. భారత్, రష్యాలు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ఈ మేరకు విస్పష్టంగా ప్రకటించారు. అమెరికా లేదా మరే ఇతర దేశంతో భారత్ సంబంధాల్లో ఏర్పడే ఉద్రిక్తతల ప్రభావం భారత్–రష్యాల మధ్య పడబోదని లావ్రోవ్ తెలిపారు. అంతకుముందు, ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా ఆయిల్ కొనరాదంటూ భారత్‌పై అమెరికా చేస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ‘అమెరికాతో సంబంధాలను గురించి భారతీయ మిత్రులను అడగను. ఇలాంటి విషయాలపై స్వయంగా తీసుకోగల సామర్థ్యం వారికి ఉంది’అని ఆయన అన్నారు. ‘అమెరికా ఒక వేళ మాకు చమురు విక్రయించాలనుకుంటే ఆ విషయంలో ఆ దేశంతో సంప్రదింపులకు మేం సిద్ధం. అంతేతప్ప, ఇతర దేశాల నుంచి మేం ఏం కొనాలి, రష్యాతో ఏం కొనాలి, ఏం కొనకూడదు అనేవి మా సొంత విషయం. దీనికి భారత్–అమెరికా అజెండాతో సంబంధం లేదు’అని అమెరికాకు బదులిచి్చనట్లు జై శంకర్ నాతో అన్నారు. ఆయనది చాలా సరైన సమాధానం, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే అంశం’అని లావ్రోవ్ వివరించారు. రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి సంబంధాలు సాధారణంగానే కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయంలో ఎటువంటి ఇబ్బందీ కలగలేదని తెలిపారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సమావేశాల సమయంలో తమ అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ సమావేశమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్లో భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయని లావ్రోవ్ వెల్లడించారు. వాణిజ్యం, సైనిక, సాంకేతిక సహకారం, ఆర్థిక, మానవీయ అంశాలు, ఆరోగ్యం, హైటెక్, కృత్రిమ మేధ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలతోపాటు, ఎస్సీవో, బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతోందన్నారు. ఐరాస సమావేశాలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తోనూ లావ్రోవ్ భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులతో భేటీ అయ్యారు. -
కీవ్‌పై రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లింది. కీవ్‌తోపాటు జపొరిఝియా ప్రాంతాల్లో జరిగిన విధ్వంసంతో 12 ఏళ్ల బాలిక సహా నలుగురు చనిపోగా, 42 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడిని పౌరులపై జరుగుతున్న యుద్ధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభివరి్ణంచారు. రష్యా గత నెలలో కీవ్‌పై చేపట్టిన భారీ దాడిలో కనీసం 21 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత జరిగిన మొదటి భారీ దాడి ఇది. తాజా దాడిలో రష్యా 595 డ్రోన్లు, 48 బాలిíస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. వీటిలో చాలా వరకు డ్రోన్లను, 43 క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నామంది. రాజధానిలోని సిటీ సెంటర్ సమీపంలో సంభవించిన భారీ పేలుడుతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్నంతా కమ్మేశాయి. పలు నివాస భవనాలు, మౌలిక వసతులు, మెడికల్ ఫెసిలిటీ, కిండర్‌గార్టన్ దెబ్బతిన్నాయి. డ్రోన్ల దాడిలో బహుళ అంతస్తుల నివాస భవనం ఒకటి తీవ్రంగా దెబ్బతింది. పై అంతస్తుల్లో మంటలు చెలరేగగా, కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపించాయి. ఫైర్ ఫైటర్లు, అత్యవసర సేవల సిబ్బంది ఎలక్ట్రిక్ రంపాలతో శిథిలాలను తొలగించారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో, జనం భయకంపితులయ్యారు. రాజధాని వ్యాప్తంగా 20కుపైగా ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. సైరన్ల మోతలతో జనం కీవ్‌లోని సెంట్రల్ రైల్వే స్టేషన్లోకి పరుగున చేరుకున్నారు. హెచ్చరికలు నిలిచాక బయటకు వచ్చారు. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆదివారం వేకువజామున పొరుగునున్న పోలండ్ తన సైన్యాన్ని అప్రమత్తం చేసి, యుద్ధ విమానాలను సరిహద్దుల్లో మోహరించి ఉంచింది. ముందు జాగ్రత్తగా ఈ మేరకు రక్షణ చర్యలు చేపట్టామని పోలండ్ మిలటరీ పేర్కొంది. కీవ్‌పై చేపట్టిన దాడుల గురించి రష్యా రక్షణ శాఖ స్పందించలేదు. కానీ, శనివారం రాత్రి నుంచి ఉక్రెయిన్ ఆర్మీ ప్రయోగించిన 41 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా తెలిపింది. అమెరికాతో భారీ ఆయుధ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులు జరపడం గమనార్హం. ఈ ప్యాకేజీలో అమెరికా నుంచి ఉక్రెయిన్ 90 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ తయారీ క్షిపణులను అమెరికా నేరుగా కొనుగోలు చేయడం ఉన్నాయి. -
అమెరికా ఆంక్షలపై ద్వంద్వ వైఖరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మితిమీరిన టారిఫ్‌లతో చెలరేగిపోతున్నారు. గతంలో పెంచిన 25 సుంకాలకు అదనంగా ఇటీవలే భారత్‌పై మరోసారి భారీగా 25 శాతం సుంకాలు పెంచారు. అందుకు రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోందనే సాకు చెప్పారు. భవిష్యత్తులో ఈ దిగుమతులను తగ్గించుకుంటే సుంకాల నిలిపివేతపై ఆలోచిస్తామని ఉద్ఘాటించారు. అయితే రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు, వాటి వ్యాపారంపై మాత్రం నోరు మెదపడంలేదు.ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే లక్ష్యంతో యూఎస్ అనేక ఆంక్షలను, వాణిజ్య పరిమితులను విధించింది. ఇందులో కొన్ని కీలకమైన రష్యా వస్తువులపై టారిఫ్‌లు పెంచినట్లు కూడా తెలిపింది. అయితే, రష్యా నుంచి ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాను పరిశీలిస్తే ఈ టారిఫ్‌ల ఎఫెక్ట్ ఎంతమేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు రష్యా నుంచి చేసే వస్తువుల నుంచి లబ్ధి చేకూరుతుందనే భావిస్తే ట్రంప్ శత్రువునైనా ముద్దాడేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. కానీ, భారత్ మాత్రం తనకు చమురు తక్కువ ధరకు ఇచ్చే రష్యా నుంచి కొనుగోలు చేస్తే యూఎస్‌కు కంటగింపుగా ఉంది.అమెరికా కొన్ని ఆంక్షలు, వాణిజ్య నిషేధాలు ఉన్నప్పటికీ కీలకమైన వస్తువులు ఇంకా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇటీవల కొన్ని సర్వేల ప్రకారం.. అత్యధిక విలువ కలిగిన ఎగుమతుల్లో కొన్ని కింది విధంగా ఉన్నాయి.ఎరువులు (Fertilizers): అత్యంత ముఖ్యమైన దిగుమతుల్లో ఒకటి. వ్యవసాయ రంగంలో కీలకమైన భాస్వరం (Phosphorus), పొటాషియం (Potassium) ఆధారిత ఎరువులు ఇందులో ప్రధానం.విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు (Precious Stones, Metals, Coins): వజ్రాలు, విలువైన లోహాలు వంటివి ఇందులో ఉన్నాయి.కర్బనేతర రసాయనాలు (Inorganic Chemicals): వివిధ పరిశ్రమలకు అవసరమైన ముఖ్యమైన రసాయనాలను దిగుమతి చేసుకుంటోంది.యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు (Machinery, Nuclear Reactors, Boilers): న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన విడి భాగాలు ఇందులో ఉన్నాయి.ప్రాథమిక లోహాలు (Other Base Metals): పల్లాడియం, అల్యూమినియం వంటి లోహాలు.అమెరికా అవసరాలపై ప్రభావంఎరువుల కొరత, ధరల పెరుగుదలరష్యా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల్లో ఎరువులు అత్యంత ముఖ్యమైనవి. వీటిపై టారిఫ్‌లు లేదా ఆంక్షలు పెంచితే, అమెరికాలోని రైతులు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. ఎరువుల ధరలు పెరిగితే, ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యయం పెరిగి, అంతిమంగా అమెరికన్ వినియోగదారులకు ద్రవ్యోల్బణం (Inflation) రూపంలో భారం పడుతుంది. రష్యాను దెబ్బతీయడానికి విధించిన టారిఫ్‌లు, అమెరికా ప్రజల జేబులకే చిల్లు పెట్టే అవకాశం ఉంది. ఇది గ్రహించి యూఎస్ చాకచక్యంగా వ్యవహరిస్తోంది.కీలక లోహాలు, రసాయనాలుపల్లాడియం వంటి కొన్ని లోహాలు, రసాయనాలు రష్యా నుంచే ప్రధానంగా యూఎస్‌కు దిగుమతి అవుతున్నాయి. వీటిని ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఇతర కీలక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. సరఫరా గొలుసు (Supply Chain)లో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయాలు దొరికే వరకు ఈ దిగుమతులను నిలిపివేయడం లేదా టారిఫ్‌లు పెంచడం కష్టమైన పని.ఎంపిక చేసిన టారిఫ్‌లు..ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు అమెరికాకు రష్యా ప్రధానంగా ఎగుమతి చేసిన వస్తువుల్లో ముడిచమురు, గ్యాస్ వంటి ఎనర్జీ ఉత్పత్తులు ప్రధానంగా ఉండేది. యుద్ధం నేపథ్యంలో మొదట్లోనే వాటిపై సంపూర్ణ నిషేధం విధించారు. కానీ, అమెరికా పరిశ్రమలకు నిత్యావసరంగా ఉన్న ఎరువులు, న్యూక్లియర్ ఇంధనం (యురేనియం) వంటి వాటిపై మాత్రం టారిఫ్‌లు, ఆంక్షల అమలులో కొంతమేరకు సడలింపు ఇచ్చారనే చెప్పాలి. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినని వ్యవస్థల్లో మాత్రమే కఠిన ఆంక్షలు విధించారనే వాదనకు తావిస్తోంది.ఇతర దేశాలపై సెకండరీ టారిఫ్‌ల బెదిరింపులురష్యా నుంచి చమురు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్న దేశాలపై ‘సెకండరీ టారిఫ్‌లు’ విధిస్తామని యూఎస్ బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది అంతర్జాతీయంగా విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలపై ఇటువంటి బెదిరింపులు వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో సంబంధం లేకుండా అమెరికన్ విదేశాంగ విధానాన్ని అడ్డంగా పెట్టుకుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే ప్రయత్నంగా కనిపిస్తోంది.చివరగా..రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగంగా టారిఫ్‌లను మరింత కఠినతరం చేస్తే అంతర్జాతీయ సరఫరా గొలుసులకు మరింత ఆటంకం ఏర్పడుతుందని యూఎస్ గుర్తెరుగాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగేందుకు దోహదం చేస్తుందని గ్రహించాలి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడానికి టారిఫ్‌లపై కాకుండా, మరింత పటిష్టమైన, ప్రపంచ భాగస్వామ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
ట్రంప్ ఎఫెక్ట్.. పుతిన్‌తో మోదీ చర్చలు: నాటో అధికారి కీలక వ్యాఖ్యలు
వాష్టింగన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) విధిస్తున్న టారిఫ్‌ల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్దం విషయమై పుతిన్‌తో భారత ప్రధాని మోదీ(Narendra Modi) చర్చలు జరిపారని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటె వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల ఎఫెక్ట్ వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు.న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ..‘భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహాన్ని వివరించాలని మోదీ కోరారు. రెండు దేశాల మధ్య యుద్ధం గురించి ఆరా తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై సుంకాల భారం పడటంతో పుతిన్‌తో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి అడిగి తెలుసుకున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే, ఆయన వ్యాఖ్యలపై భారత్ స్పందించలేదు. "Delhi is on phone with Vladimir Putin in Moscow, & Narendra Modi asking, hey I support you but could you explain to me the strategy bcz I have been hit with 50% tariffs. Prez Trump is implementing what he says"NATO Secretary-General Mark Ruttepic.twitter.com/63cEh4CxNZ— Sidhant Sibal (@sidhant) September 26, 2025ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు(Impose New Tariffs). బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాండెడ్ , పేటెంటెడ్ డ్రగ్స్‌పై(pharmaceutical products) ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అయితే.. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు. -
ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి: జెలెన్స్కీ
యునైటెడ్ నేషన్స్: ప్రపంచ దేశాలన్నీ మానవ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడనంతగా విధ్వంసకర ఆయుధాల రేసులో పరుగులు పెడుతున్నాయని ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ( Volodymyr Zelensky) విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎవరు బతికి బట్టకట్టాలన్నది ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధాన్ని యూరప్ ఖండం అంతటికీ విస్తరించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పుతిన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకం కావాలని పిలుపునిచ్చారు. యుద్ధాలు ఆపటంలో ఐరాస విఫలం ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను ఆపటంలో ఐక్యరాజ్య సమితితోపాటు అంతర్జాతీయ సంస్థలన్నీ విఫలమయ్యాయని జెలెన్స్కీ ఆరోపించారు.ఉక్రెయిన్, గాజా(Gaza), సూడాన్.. ఇలా ఏ ఒక్క యుద్ధాన్ని ఆపలేకపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాలు మనుగడ సాగించటానికి అంతర్జాతీయ చట్టాలు ఏమాత్రం ఉపయోగపడటం లేదని మండిపడ్డారు. ‘స్నేహితులు, ఆయుధాలు ఉన్నవారికి తప్ప. ఇతరుల భద్రతకు ఎలాంటి హామీ లేదు’అని పేర్కొన్నారు. కలసి ఉంటే ఎంతో మార్పు తీసుకురాగలమని అన్నారు. రష్యాతో దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో తమకు మద్దతుగా నిలిచిన అమెరికా, యూరప్ దేశాలకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూ వెళ్తన్న రష్యా తీరును ఐరాస సభ్యదేశాలన్నీ ఖండించాలని కోరారు.ఇది కూడా చదవండి: ఆ మూడు విధ్వంసాలపై దర్యాప్తు జరగాల్సిందే..‘రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపకపోతే.. మేము కూడా దీనిని మరింత విస్తరిస్తాం. మరింత విధ్వంసకరంగా మారుస్తాం. మొదట ఉక్రెయిన్‌పై దాడిచేసిన రష్యా.. ఇప్పుడు యూరప్ అంతటా తన డ్రోన్లను తిప్పుతోంది. రష్యా కార్యకలాపాలు ఎప్పుడు ఎల్లలు దాటాయి. జార్జియా, బెలారస్లాగా కాకుండా రష్యాకు జోక్యం నుంచి మాల్దోవా తనను తాను కాపాడుకుంటోంది. యూరప్ ఖండం మాల్దోవాను కూడా కోల్పోకూడదు. ఆ దేశానికి ఇప్పుడు కావాల్సింది రాజకీయపరమైన సానుభూతి కాదు. నిధులు, ఇంధన మద్దతు కావాలి’అని పేర్కొన్నారు. డ్రోన్లతోనే వేలమంది హత్య ప్రస్తుత యుద్ధాల్లో డ్రోన్లతోనే వేలమందిని ఎలా చంపాలో చూపిస్తున్నారని జెలెన్స్కీ అన్నారు. ‘ఇటీవల డ్రోన్ల కారణంగానే యూరప్‌లో విమానాశ్రయాలు మూసివేయాల్సి వచ్చింది. టాక్టికల్ డ్రోన్‌ను పరీక్షించినట్లు గత వారమే ఉత్తరకొరియా ప్రకటించింది. అతి తక్కువ వనరులు ఉన్న దేశాలు కూడా ప్రమాదకరమైన డ్రోన్లను తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం మనం మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల రేసు యుగంలో నివసిస్తున్నాం’అని పేర్కొన్నారు. -
జోక్యం చేసుకుంటే దీటుగా బదులిస్తాం.. ట్రంప్‌కు చైనా కౌంటర్
బీజింగ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలే నిధులు సమకూరుస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం చైనా విరుచుకుపడింది. తాము రష్యాతో జరుపుతున్న వాణిజ్యంపై అమెరికా జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలైనా చేపడితే దానికి దీటుగా బదులిస్తామని చైనా స్పష్టంచేసింది.చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. యూరోపియన్ యూనియన్‌తో పాటు సాక్షాత్తు అమెరికానే రష్యాతో వాణిజ్యం నెరుపుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించి శాంతిని నెలకొల్పేందుకు చైనా చర్చలను చురుకుగా ప్రోత్సహిస్తోందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చైనా, భారత్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలాన్నిస్తున్నాయని ట్రంప్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.‘అమెరికా, ఈయూ దేశాలతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి. చైనా, రష్యా కంపెనీలు డబ్ల్యూటీఓ నిబంధనలు, మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మేము ఏ థర్డ్ పార్టీని కూడా లక్ష్యంగా ఎంచుకోలేదు. ఎవ్వరి ప్రయోజనాలను కూడా దెబ్బతీయట్లేదు. మా న్యాయమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు ఏం చేయాలో అది మాత్రమే చేస్తాం’ అని గుయో జియాకున్ చెప్పారు. -
కోల్పోయిన భూభాగమంతా ఉక్రెయిన్‌కే
ఐక్యరాజ్యసమితి: రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధాన్ని ముగించాలంటే కొంత భూభాగాన్ని కోల్పోక తప్పదంటూ ఉక్రెయిన్‌పై ఆయన ఒత్తిళ్లు చేయడం తెల్సిందే. తాజాగా, ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. నాటో సాయంతో రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్నంతటినీ ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపిన అనంతరం మంగళవారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ విషయం ప్రకటించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. ‘యూరోపియన్ యూనియన్ సాయంతో ఉక్రెయిన్ పోరాడి కోల్పోయిన భూభాగాన్నంతటినీ తిరిగి గెలుచుకునే స్థాయిలో ఉందన్నది నా నమ్మకం. యూరప్, ముఖ్యంగా నాటో ఆర్థిక దన్నుతో ఈ యుద్ధం మొదలైనప్పుడు ఉన్న సరిహద్దులను తిరిగి ఉక్రెయిన్ సాధించుకోవడమే ఉత్తమమైన ఆప్షన్’అని అందులో పేర్కొన్నారు. ‘లక్ష్యమంటూ లేకుండా మూడున్నరేళ్లుగా రష్యా యుద్ధం సాగిస్తోంది. ఫలితంగా భారీ సైనిక శక్తి కలిగిన ఆ దేశం కనీసం గెలవలేని పరిస్థితికి చేరుకుంది. నేడున్నది ఘనమైన రష్యా కాదు. కేవలం కాగితం పులి మాత్రమే’అని వ్యాఖ్యానించారు. పుతిన్, రష్యా తీవ్ర ఆర్థిక సమస్యల్లో మునిగి ఉన్నందున ఉక్రెయిన్‌కు ఇదే సరైన అదను అని తెలిపారు. ట్రంప్ తన హామీకి కట్టుబడి ఉంటే మాత్రం యుద్ధాన్ని ముగించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తేవాలంటూ పదేపదే కోరుతూ వచ్చిన జెలెన్స్కీ తన ప్రయత్నాల్లో విజయం సాధించినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ట్రంప్ గేమ్ ఛేంజర్: జెలెన్స్కీట్రంప్ నిజంగా గేమ్ ఛేంజర్ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ట్రంప్ పిలుపు మేరకు యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతులను ఆపేయాలన్నారు. ఉక్రెయిన్ చేస్తున్న పోరాటాన్ని మనం గౌరవించా ల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించగా, యు ద్ధక్షేత్రం నుంచి మంచి వార్త అందిందంటూ జెలెన్స్కీ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించం: రష్యారష్యాకు కోల్పోయిన భూభాగాలను తిరిగి గెలుచుకునే సత్తా ఉక్రెయిన్‌కు ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యలను రష్యా తీవ్రంగా ఖండించింది. తమ దేశం యూరప్ భద్రతలో విడదీయరాని భాగమని రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం కారణాలు, పరిష్కారాలపై జెలెన్స్కీ చెప్పిన మాట లను విని, అవే నిజమని ట్రంప్ నమ్ముతు న్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు చెప్పిన ఏ ఒక్క అంశంతోనూ తాము ఏకీభవించడం లేద న్నారు. -
రష్యా, చైనాలతో భారత్‌కు పోలిక లేదు: ఫిన్లాండ్ అధ్యక్షుడు
హెల్సింకి: భారతదేశం.. రష్యా, చైనాల మాదిరి కాదని..అదొక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్ అని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను పరిష్కరించడంలో భారతదేశ భౌగోళిక, రాజకీయ పాత్రను, శాంతి చర్చలలో భాగస్వామ్యాన్ని ఆయన వివరించారు. సాంకేతిక, వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్- ఫిన్లాండ్ సంబంధాలను బలోపేతం చేయడానికి మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు.ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశ అభివృద్ధిని కొనియాడుతూ పాశ్చాత్య దేశాలు ఆ దేశంతో మరింత సన్నిహితంగా మెలగాలని కోరారు. బ్లూమ్‌బెర్గ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారతదేశం, రష్యా, చైనా మధ్య పెరుగుతున్న సమన్వయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశం అటు యూరోపియన్ యూనియన్‌కు, ఇటు యునైటెడ్ స్టేట్స్కు సన్నిహిత మిత్రదేశం. అందుకే రష్యా, చైనా దేశాల జాబితాలో భారత్‌ను చేర్చనన్నారు. భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్. అందుకే పశ్చిమ దేశాలు భారతదేశంతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని అన్నారు. 🚨 BIG STATEMENT🇫🇮 Finland Prez Stubb: “India is a very close ALLY of the EU & US.”“India is an emerging SUPERPOWER with demography & economy on its side.” 🔥“West must engage with India.” 🎯 pic.twitter.com/oVwfEA3ERW— Megh Updates 🚨™ (@MeghUpdates) September 24, 2025రష్యా- చైనా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయని భావిస్తున్నానని, 1990ల ప్రారంభంలో చైనా-రష్యా ఒకే పరిమాణంలో ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు చైనా 10 రెట్లు వృద్ధి సాధించింది. ఇప్పుడు రష్యా నుంచి చమురు,గ్యాస్ కొనుగోలు, సాంకేతిక మార్పిడితో పరస్పర సహకారం అందిస్తోంది. ఇది రష్యా యుద్ధ తంత్రానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే ఆ దేశాల మధ్య దగ్గరి సంబంధం ఉన్నదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు.భారతదేశంతో ఇతర దేశాల భాగస్వామ్యం కోసం ఫిన్లాండ్ పిలుపు నివ్వడం ఇది మొదటిసారి కాదని, అంతకుముందు, హెల్సింకి సెక్యూరిటీ ఫోరం 2025లో కోరామన్నారు. తాను ఇటీవల ప్రధాని మోదీతో ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడానని, తొలుత కాల్పుల విరమణ అవసరమని, ఆ తర్వాతనే శాంతి చర్చలను ప్రారంభించగలమని మోదీ పేర్కొన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు హాజరైన షాంఘై సహకార సంస్థ (ఎసీసీఓ)సమ్మిట్‌కు హాజరయ్యారని, ఆ సమయంలో వారి మధ్య స్నేహాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. -
జెలెన్స్కీ రివర్స్ గేర్ .. భారత్ సపోర్ట్‌పై కీలక వ్యాఖ్యలు
భారత్‌పై అమెరికా సుంకాల విధింపును సమర్థించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ(Volodymyr Zelenskyy).. యూటర్న్ తీసుకున్నారు. ఈ క్రమంలో.. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్ వనరులు అందిస్తోందన్న ట్రంప్ విమర్శలను ఆయన తప్పుబట్టారు. ఒకవైపు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ జెలెన్స్కీపై ప్రశంసలు గుప్పించిన వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. భారత్ రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి వనరులు అందిస్తోందని ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలపై ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఖండించారు. భారత్ మావైపే ఉంది అంటూ అంటూ కీలక వ్యాఖ్యలే చేశారాయన. ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ జెలెన్స్కీ.. ‘‘ఇంధన రంగంలో కొన్ని సమస్యలు ఉన్నా.. భారత్ ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తోంది. భారత్‌ను వదిలిపెట్టడం అంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. భారత్ ఎప్పటికీ పశ్చిమ దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండాలి’’ అని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అమెరికా, యూరప్ దేశాలకూ ఆయన ఓ కీలక సూచన చేశారు. ‘‘భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుచుకోవాలి. ఇంధన సంబంధాల విషయంలో భారత్‌కు సరైన పరిష్కారాలను అందించాలి’’ అని సూచించారు. ఇదిలా ఉంటే.. షాంగై సదస్సు సమయంలో ఇదే జెలెన్స్కీ భిన్నంగా స్పందించడం తెలిసిందే. భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించడం సరైందేనంటూ అన్నారాయన. ‘‘రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌తోసహా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధించడం సబబే. రష్యా ఇంధన వాణిజ్యమే పుతిన్‌కి ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తున్న ఆయుధం. అందుకే రష్యా నుంచి ఎగుమతులను అడ్డుకోవాల్సిందే’’ అని అన్నారు. పనిలో పనిగా.. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న తమ యూరోపియన్ మిత్రదేశాలపై కూడా జెలెన్స్కీ విమర్శలు గుప్పించారు. ‘‘యూరోపియన్ల పట్ల ట్రంప్ వైఖరి సరైనదిగా తాను భావిస్తున్నా. యుద్ధంలో పుతిన్‌పై అదనపు ఒత్తిడి అవసరం. ఈయూ భాగస్వామ్య పక్షాలలో కొన్ని రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు కొనసాగిస్తున్నాయి. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆ దేశాలు రష్యా నుంచి ఎటువంటి ఇంధనాన్ని కొనుగోలు చేయరాదు’’ అని అన్నారు. ఆ సమయంలో.. భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన కొన్నిగంటలకే జెలెన్స్కీ అలా మాట్లాడడం గమనార్హం. ఇక.. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్, చైనాలు రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని, భారత్‌పై 25% పెనాల్టీ సుంకాలు విధించడాన్ని సమర్థిస్తూ సరైన చర్య అని పేర్కొన్నారు. అదే సమయంలో రష్యాను కాగితం పులిగా అభివర్ణించిన ఆయన.. జెలెన్స్కీపై ప్రశంసలు గుప్పించారు. అలాగే రష్యా విమానాలు నిబంధలను ఉల్లంఘిస్తున్నాయని, నాటో దేశాలు వాటిని కూల్చేయాలంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు.ఇదీ చదవండి: హనుమంతుడిపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు -
పాక్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ మరో కీలక అడుగు
-
భారత్‌కు అల్టిమేటమా?.. ఏమాత్రం పనిచేయదు
టారిఫ్‌ల బెదిరింపులతో భారత్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందా?.. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదని.. అలాంటి అల్టిమేటంలు ఎన్ని ఇచ్చినా భారత్ తలవంచబోదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు ఉన్న దేశాలని, అలాంటి దేశాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, ఒత్తిడులు ఏమాత్రం పని చెయ్యబోవని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అంటున్నారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం ఆపాలని చేస్తున్న ఒత్తిళ్లు.. ఆ దేశాలను అమెరికాకు మరింత దూరం చేస్తాయే తప్ప ప్రయోజనం ఉండబోదని ‘ది గ్రేట్ గేమ్’ అనే టీవీ కార్యక్రమంలో లావ్రోవ్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాల కొనుగోలు ద్వారా.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారత్ పరోక్షంగా ఫండింగ్ చేస్తోందని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే 25 శాతం పెనాల్టీ సుంకాలను ట్రంప్ విధించారు(మొత్తం 50 శాతం). రష్యాతో వాణిజ్యం ఆపకపోతే మరిన్ని ఆంక్షలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. అయితే భారత్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. ఈ పరిణామాలపై సెర్గీ స్పందించారు. ‘‘నాకు నచ్చనిది వెంటనే ఆపండి. లేకుంటే మరిన్ని సుంకాలు విధిస్తా’’ అనే భాష ఆ దేశాలపై ప్రయోగించడం ఏమాత్రం సరికాదు. అలాంటి బెదిరింపులు ప్రాచీన నాగరికత ఉన్న ఆ దేశాలపై పని చేయవు కూడా అని అన్నారాయన. పైగా..ఈ తరహా విధానం ఆ దేశాల ఆర్థిక స్థితిని దెబ్బతీయడమే కాకుండా, వారికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొత్త మార్కెట్లు, కొత్త ఇంధన వనరులు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాక, ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది. అయితే, దీని కంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే—ఈ విధానానికి నైతికంగా, రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది అని పేర్కొన్నారాయన. ఇక రష్యాపై కొత్త ఆంక్షల విధింపు బెదిరింపులపైనా ఆయన స్పందించారు. ‘‘నిజం చెప్పాలంటే.. కొత్త ఆంక్షల వల్ల ఎలాంటి సమస్య కనిపించడం లేదు. ట్రంప్ మొదటి పదవీకాలంలోనే ఎన్నో ఆంక్షలు విధించబడ్డాయి. బైడెన్ పదవీకాలంలో ఆంక్షలకు బదులు దౌత్యపరమైన చర్చలు తెరమీదకు వచ్చాయి. కానీ, అమెరికాతో రాజీ కోసం ఎలాంటి ప్రయత్నం జరగలేదు’’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు, ఆయుధ కొనుగోళ్ల అంశంతో భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించారు. అయితే చైనా విషయంలో మాత్రం కేవలం బెదిరింపులకే పరిమితం అయ్యారు. అలాగే రష్యాపైనా కఠిన ఆంక్షలు ఉంటాయంటూ ప్రకటనలు చేస్తున్నా.. ఆచరణలోకి మాత్రం తీసుకురావడం లేదు. ఇదిలా ఉండగానే అమెరికా-భారత్ వాణిజ్య చర్చల్లో పురోగతి చోటు చేసుకోవడం.. సుంకాలపై అమెరికా వెనక్కి తగ్గవచ్చనే సంకేతాలను అందిస్తోంది. -
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌స్కేల్‌పై భూకంపం తీవ్రత 7.8గా నమోదు అయింది. దీంతో యూఎస్ జాతీయ ఆరోగ్య సర్వీస్ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్స్కీ రీజియన్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కేంద్రం 10 కి.మీ దూరంలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అనంతరం స్వల్ప వ్యవధిలో మరో ఐదుసార్లు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రష్యాలో తరచూ భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం—అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ (Pacific Ring of Fire) లో భాగంగా ఉండటం. ఇది భూమి మీద అత్యంత చురుకైన భూకంప, అగ్నిపర్వత ప్రాంతం. ప్రధానంగా కమ్చట్కా ద్వీపకల్పం ప్రాంతం పసిఫిక్ ప్లేట్-యూరేషియన్ ప్లేట్ మధ్య ఉంది. ఇవి ఒకదానిని మరొకటి గుద్దుతూ కదలడం వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఇదిలా ఉంటే.. ఇటు ఇండోనేషియాలోనూ 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లో శుక్రవారం వేకువ జాము సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 28 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని సమాచారం. -
అలెక్సీ నవాల్నీపై విష ప్రయోగం
మాస్కో: రష్యా అధినేత పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ మృతివెనుక ముమ్మాటికీ కుట్ర ఉందని ఆయన భార్య యూలియా నవాల్నీ ఆరోపించారు. తన భర్తపై విష ప్రయోగం జరిగినట్లు పరీక్షల్లో తేలిందని బుధవారం చెప్పారు. రెండు ల్యాబ్ రిపోర్టులు ఇదే విషయం నిర్ధారిస్తున్నాయ ని పేర్కొన్నారు. తన భర్త మృతదేహం నుంచి నమూనాలు సేకరించి, విదేశాలకు తరలించినట్లు చెప్పారు. అక్కడే పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 2024 ఫిబ్రవరిలో రష్యాలోని ఆర్కిటిక్ పెనాల్ కాలనీ జైలులో అలెక్సీ నవాల్నీ(47) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనారోగ్యంతో ఆయన చనిపోయినట్లు అప్పట్లో అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించాయి. పుతిన్ అవినీతిపై అలెక్సీ గళమెత్తారు. పుతిన్‌కు వ్యతిరేకంగా పలు ప్రదర్శనలు నిర్వహించారు. పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని పుతిన్ సర్కార్ ఆయనపై అభియోగాలు మోపింది. 19 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది. -
వెల్డన్ వైశాలి
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ఆద్యంతం నిలకడగా రాణించిన భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు అనుకున్న ఫలితం సాధించింది. సోమవారం ముగిసిన గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ మహిళల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. నిరీ్ణత 11 రౌండ్ల తర్వాత తమిళనాడు అమ్మాయి వైశాలి, కాటరీనా లాగ్నో (రష్యా) 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... 24 ఏళ్ల వైశాలికి టైటిల్ ఖాయమైంది. కాటరీనా లాగ్నో రన్నరప్‌గా నిలిచింది. వరుసగా రెండోసారి గ్రాండ్ స్విస్ టోరీ్నలో టైటిల్ నెగ్గిన వైశాలితోపాటు కాటరీనా లాగ్నో వచ్చే సంవత్సరం జరిగే క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత పొందారు. వైశాలికి 90 వేల డాలర్లు (రూ. 79 లక్షల 33 వేలు), కాటరీనా లాగ్నోకు 75 వేల డాలర్లు (రూ. 66 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. భారత్ నుంచి ముగ్గురు... ఎనిమిది మంది మధ్య జరిగే క్యాండిడేట్స్ టోరీ్నకి ఇప్పటికి ఏడుగురు అర్హత సాధించగా... అందులో ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లు (కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి) ఉండటం విశేషం. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) 2024–2025 మహిళా ఈవెంట్స్ విజేతకు చివరిదైన ఎనిమిదో బెర్త్ ఖరారు అవుతుంది. క్యాండిడేట్స్ టోర్నీ విజేత ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్ జు వెన్జున్తో 2026 వరల్డ్ టైటిల్ కోసం తలపడుతుంది. చివరి రౌండ్ గేమ్‌లు ‘డ్రా’ గ్రాండ్ స్విస్ టోర్నీ చివరిదైన 11వ రౌండ్లో వైశాలి, కాటరీనా తమ ప్రత్యర్థులతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ టాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌ను వైశాలి 43 ఎత్తుల్లో... ఉల్వియా (అజర్బైజాన్)తో గేమ్‌ను కాటరీనా లాగ్నో 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఈ టోరీ్నలో వైశాలి ఆరు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోగా... కాటరీనా లాగ్నో ఐదు గేముల్లో నెగ్గి, ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచింది. మరోవైపు గ్రాండ్ స్విస్ టోర్నీ ఓపెన్ విభాగంలో అనీశ్ గిరి (నెదర్లాండ్స్–8 పాయింట్లు) విజేతగా... మథియాస్ బ్లూబామ్ (జర్మనీ–7.5 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచి వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. చాంపియన్ అనీశ్ గిరికి 90 వేల డాలర్లు (రూ. 79 లక్షల 33 వేలు), రన్నరప్ మథియాస్‌కు 75 వేల డాలర్లు (రూ. 66 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
‘ఆ పప్పులు ఉడకవు.. శభాష్ భారత్’
రష్యా చమురు, ఆయుధ కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ట్రంప్ కోపం ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈయూ, జీ7, నాటో సహా పలు దేశాలపైనా ఆయన ఒత్తిడి చేస్తుండడం చూస్తున్నాం. అమెరికాలాగే ఆ దేశాలకు భారతీయ వస్తువులపై సుంకాల మోత మోగించాలంటూ సూచిస్తున్నారాయన. అయితే ఈ విషయంలో ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతోంది!. తాజాగా ఈ పరిణామంపై రష్యా స్పందించింది. భారత్‌తో తమ సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని.. ఇరు దేశాల సంబంధాలను దెబ్బ తీయాలనే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ఫలించబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమెరికాకు మెత్తగా మొట్టికాయలు వేసింది. ‘‘ఇండియా-రష్యా సంబంధాలు స్థిరంగా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ బంధాన్ని భంగం చేయాలనే ప్రయత్నాలు విఫలం కాక తప్పదు. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు ఇండియాను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్నా, ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం అని రష్యా విదేశాంగ శాఖ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. ఇండియా వైఖరి.. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇండియా-రష్యా స్నేహబంధం స్ఫూర్తి, సంప్రదాయాలపై ఆధారపడి ఉంది. ఇది అంతర్జాతీయ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వయం ఇండియా నిర్ణయాన్ని ప్రతిబింబిస్తోంది. ఇరు దేశాలు మిలిటరీ ఉత్పత్తులు, అంతరిక్ష మిషన్లు, అణు శక్తి, రష్యన్ చమురు పరిశోధనలో భారత పెట్టుబడులు వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. నూతన చెల్లింపు వ్యవస్థలు, జాతీయ కరెన్సీల వినియోగం, పరస్పర రవాణా మార్గాల అభివృద్ధి వంటి అంశాల్లో కూడా సహకారం కొనసాగుతోంది అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత ఉత్పత్తులపై తొలుత 25% ప్రతీకార సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అటుపై రష్యా చమురు, రక్షణ సామాగ్రి కొనుగోళ్ల నేపథ్యంతో పెనాల్టీ కింద మరో 25% శాతం విధించారు. ఈ టారిఫ్‌లను భారత్ అన్యాయంగా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం జాతీయ ప్రయోజనాల, మార్కెట్ అవసరాల ఆధారంగా జరుగుతోందని భారత్ స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో.. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రష్యా భారత్ ఆర్థిక వ్యవస్థలు డెడ్.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ సంచలన కామెంట్ చేశారు. అయినప్పటికీ.. అమెరికా ఒత్తిడికి తలవంచే ప్రసక్తే లేదని, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు తమ దేశానికి ఉందని భారత్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగానే ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా అలస్కాలో పుతిన్‌తో భేటీ తర్వాత ట్రంప్ స్వరం కాస్త తగ్గింది. ఉక్రెయిన్ డీల్ కుదిరితే భారత సుంకాల విషయంలో ఆలోచన చేయొచ్చని అన్నారాయన. అయితే.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరాలంటే.. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై రాయితీలు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టేసింది. ఈ క్రమంలో.. ఈ రంగాలను రెడ్ లైన్స్‌గా red linesగా అభివర్ణించింది. మరోవైపు.. ఎగుమతిదారులపై ప్రభావం తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఆర్థిక మద్దతు ప్యాకేజీలు ప్రకటించే అవకాశముందనే విశ్లేషణ నడిచింది. ఈలోపు ట్రంప్-మోదీల పరస్పర సోషల్ మీడియా సంభాషణతో ఈ చర్చలు ముందుకు సాగవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. -
టారిఫ్‌లతో సమస్య మరింత సంక్లిష్టం
బీజింగ్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించాలంటూ జీ7 దేశాలకు అమెరికా ప్రభుత్వం పిలుపు ఇవ్వడాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఖండించారు. టారిఫ్‌లు, ఆంక్షలు సమస్యను మరింత సంక్లిష్టంగా మారుస్తాయే తప్ప ఒరిగేదేమీ ఉండదని అన్నారు. ఎలాంటి యుద్ధాల్లో తాము పాల్గొనడం లేదన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా యుద్ధాలకు ముగింపు పలకాలన్నదే తమ విధానమని ఉద్ఘాటించారు. టారిఫ్‌లను పెంచాలన్న ఆలోచన ఎవరకీ మేలు చేయదని అన్నారు. అమెరికా ట్రెజరీ సెక్రెటరీ బెస్సెంట్ జీ7 దేశాల ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడుతూ.. భారత్, చైనాలో టారిఫ్‌లు పెంచాలని సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగిసిపోవాలని నిజంగా కోరుకుంటే తాము చెప్పినట్లు చేయాలని పేర్కొన్నారు. దీనిపై వాంగ్ యీ స్పందించారు. చైనా బాధ్యతయుతమైన అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. శాంతి, భద్రత వంటి అంశాల్లో చైనాకు మంచి రికార్డు ఉందన్నారు. -
అడకత్తెరలో ఇండియా
ఇండియా–యూఎస్ బాంధవ్యం ఎంత ఘోరంగా దెబ్బ తిన్నది! అటు చూస్తే వాషింగ్టన్ – బీజింగ్ సంబంధాలు మెరు గవుతున్నాయి. ఈ నూతన పరిణామం... అమెరికాతో ఇండియా బాంధవ్యాన్ని ఇంకెంతగా ప్రభావితం చేయబోతోంది? రష్యా చమురు కొనుగోలు ఆపేయకుంటే, ఇండియాపై అగ్రరాజ్యం రెండవ, మూడవ విడత అదనపు సుంకాలు విధిస్తుందా? ‘‘ఇండియా దౌత్యానికి నిజంగా ఇదో పరీక్షా సమయం. కొంతకాలం ముందు నుంచీ పరిస్థితులు ఏమంత బాగోలేవు. ఇప్పుడు అవి మరింత దుర్బలంగా మారాయి’’... మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ అభిప్రాయం ఇది. అధ్యక్షుడు ట్రంప్ ‘‘స్వతహాగానే కక్ష సాధింపు మనిషి. ఇండియా పట్ల ఇప్పు డాయన అదే వైఖరితో వ్యవహరిస్తున్నారు’’. కాబట్టి ఇండియా– యూఎస్ సంబంధాలు ‘‘తప్పనిసరిగా మరింత క్షీణిస్తాయి’’.‘క్వాడ్’ను సైతం వదులుకుంటారా?వాషింగ్టన్‌తో ఢిల్లీ బాంధవ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసే పరిణా మాల విషయానికి వద్దాం. మొదటిది – చైనాతో తనకున్న ఎంతో మంచి బాంధవ్యాన్ని గురించి, షీ జిన్‌పింగ్‌తో తన స్నేహాన్ని గురించి ట్రంప్ అదేపనిగా మాట్లాడుతున్నారు. బీజింగ్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన ఎంతో ఇదిగా ఉన్నారు. తాను చైనాలో పర్యటిస్తానని సైతం చెబుతున్నారు. ఆయన ఈ మొత్తం వ్యవహారంలో ఎంత దూరం వెళ్తారన్నదే ఇక్కడ ప్రశ్న.చైనాతో పెద్ద ఒప్పందం ఒకటి కుదుర్చుకోవడానికి ‘క్వాడ్’ను సైతం త్యాగం చేయబోతున్నారా? ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం, క్వాడ్ సదస్సు కోసం ఇండియాను సందర్శించే ఉద్దేశం ట్రంప్‌కు లేదు. దీనర్థం ఏమిటి? ఆయన ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఇండో–పసిఫిక్ వ్యూహం ఇంకెంతో కాలం కీలకం కాదు. ఈ పరిణామం ఇండియా–యూఎస్ సంబంధాలకు శరాఘాతం లాంటిది. చైనా పట్ల అమెరికా విధానంలో ఒకప్పుడు కేంద్రస్థానంలో ఉన్న మనల్ని... ఇది అంచుల దాకా నెట్టివేస్తుంది. మన ప్రాధాన్యం పూర్తిగా మసకబారుతుంది. శరణ్ దీన్ని చాలా సున్నితంగా ఇలా చెప్పారు: ‘‘యూఎస్, చైనాలతో ఇండియా సంబంధాలు... వాటి పరస్పర సంబంధాల కంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఇండియాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది’’. అయితే ఇప్పుడీ పరిస్థితి లేదు. వాషింగ్టన్–బీజింగ్ నడుమ ప్రస్తుత సంబంధాలు, కచ్చితంగా వాషింగ్టన్ – ఢిల్లీ నడుమ కంటే బాగున్నాయని చెప్పాలి. ఇదంతా చూస్తుంటే – అమెరికా, చైనా నడుమ జి–2 తరహా ఏర్పాటుకు అవకాశం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. సమాధానం అవును అనుకుంటే, ఆసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి ‘చట్ట బద్ధత’ కల్పించినట్లే! ఇండియాకు అది అంగీకారం కాదు.ఈ పరిస్థితుల్లో, ఇండియా, చైనా సంబంధాల్లో ఎంత పురోగతి సాధ్యమవుతుంది? మరోపక్క పాకిస్తాన్‌తో చైనా దృఢ సంబంధాలు సడలిపోయే అవకాశం లేదు. సరిహద్దు సమస్య అలా అపరిష్కృతంగానే మిగిలిపోతుంది. ఆసియాలో ప్రాబల్యం వహించాలని చైనా కోరుకుంటోంది. ఇండియా అందుకు ససేమిరా అంగీకరించదు. వాణిజ్యం విషయానికి వస్తే– అరుదైన ఖనిజాలు, ఎరువులు,సొరంగ తవ్వక యంత్రాల్లో చైనా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.అందుకే, తియాన్జిన్లో ఎన్ని చిరునవ్వులు చిందించినా, ఎంత గట్టి కరచాలనాలు చేసినా... ఇండియా–చైనా సంబంధాల్లో గణ నీయ పురోగతికి అవకాశాలు అతి తక్కువ.రష్యా కోసం మూల్యం చెల్లిస్తున్నామా?రష్యా చమురు విషయానికి వద్దాం. రష్యా మీద ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకే ఇండియా మీద 25 శాతం అదనపు సుంకం విధించామని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు. ఆ ఎత్తుగడ పారలేదు. దీంతో ట్రంప్ నిస్పృహ చెందారు. ఇప్పుడు ఆయన ఇండియా మీద అదనపు సుంకాలు విధిస్తారా?రష్యా చమురు గురించి జవాబు చెప్పుకోవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. రష్యా చమురుతో ఇండియా ఆదా చేస్తున్నది బారె ల్కు సుమారు 2 డాలర్లు మాత్రమే! ఈ చమురు కొనుగోళ్ల కారణంగా మనం అమెరికాకు ఏటా 48 బిలియన్ డాలర్ల ఎగుమతు లను కోల్పోతాం. రష్యా నుంచి చేసుకునే చమురు దిగుమతులతో మనకు సమకూరే ప్రయోజనం, మనం అమెరికాకు చేసే ఎగుమతులతో పోల్చితే చాలా తక్కువ. ఆర్థికంగా చూసినట్లయితే – రష్యా చమురు కొనుగోళ్లు నిలిపి వేయడం ఉత్తమం. అయితే వ్యూహాత్మక, రాజకీయ కోణాలు అందుకు అనుమతిస్తాయా? ఇప్పటి విధానం ప్రకారం చూస్తే, రష్యా చమురును ఇండియా కొంటూనే ఉంటుంది. దీనివల్ల రష్యాకు డబ్బు లభిస్తుంది. ఆంక్షల క్లిష్ట సమయంలో ఆర్థిక ప్రయోజనం పొందుతుంది. మరి ఇండియా? అమెరికాకు ఎగుమతులు చెయ్యలేకపోవడమే కాకుండా వాషింగ్టన్‌తో సంబంధాలు పూర్తిగా చెడతాయి. అలా రెండు రకాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ తెర వెనుక నడచిన ఒక అంశాన్ని ఇప్పుడు తెర పైకి తీసుకువచ్చి దీనికి ఒక ముగింపు ఇస్తాను. అమెరికాతో మన సంబంధాలు గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయికి దిగజారి పోయాయి. మనకు పాకిస్తాన్‌తో ఎన్నడూ బాంధవ్యం లేదు. చైనాతో సంబంధాలు మెరుగుపడుతున్నా, ఆ దేశంతో మనకు ఉన్న సమస్యలు చిన్నవేమీ కావు. రష్యాతో మన సంబంధాలు బలోపేతం అయ్యాయి. అయితే అందుకు మనం ఇప్ప టికే భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. మరోవంక చైనా, పాకిస్తాన్, రష్యాలతో అమెరికా సంబంధాలు బైడెన్ హయాంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయి. ఇది నిజంగా ఒక వైచిత్రి. తొమ్మిది నెలల్లోనే వీటి మధ్య సాన్నిహిత్యం మెరుగుపడింది. అదే సమయంలో అమెరికాతో మన సంబంధాలు కుప్ప కూలాయి. కాబట్టి ఇండియా దౌత్యానికి ఇది ‘బ్యాడ్ టైమ్’ అనుకోవాలా? దీనికి సమాధానం అవును అని తప్ప మరో విధంగా చెప్పలేను.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రష్యాతో దోస్తీపై చైనాకు ట్రంప్ హెచ్చరిక.. డ్రాగన్ కౌంటర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా విషయంలో దూకుడు పెంచుతూ నాటో దేశాలు, చైనాలను హెచ్చరించారు. చమురు కొనుగోలును వెంటనే నిలిపేయాలని.. లేదంటే చైనాపై 100 శాతం పన్నులు విధిస్తానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది.అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రి స్పందించారు. స్లోవేనియా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ..‘యుద్ధం సమస్యలను పరిష్కరించలేదు. ఇదే సమయంలో పలు దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ప్రస్తుతం చైనా ఎలాంటి యుద్దం చేయడం లేదు.. యుద్ధంలో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. అయితే, చైనాపై ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన చేసిన కొద్దిసేపటికే వాంగ్ యి ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం.అంతకుముందు ట్రంప్.. చైనాపై భారీ సంఖ్యలో సుంకాలు విధిస్తేనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100 శాతం కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పన్నులు విధిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. లేదంటే తన సమయంతోపాటు అమెరికా డబ్బునూ వృథా చేస్తున్నట్లేనని అన్నారు.China hits back at Trump's 100% tariff call.Chinese Foreign Minister Wang Yi said that war cannot solve problems and sanctions only complicate them— CivilBuzz (@NetiNeti24) September 14, 2025అంతటితో ఆగకుండా.. రష్యాపై బీజింగ్ పట్టు సాధించిందని.. సుంకాలు విధించడం ద్వారా దీన్ని బలహీనపరచవచ్చని అన్నారు. ఈ యుద్ధానికి బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలే కారణమని మరోసారి ఆరోపించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్‌లు విధించాలని ఈయూ, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. -
‘రష్యా చమురు కొంటే సుంకాలు’..‘జీ 7’పై అమెరికా ఒత్తిడి
న్యూఢిల్లీ: రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలను తప్పనిసరిగా విధించాలని యునైటెడ్ స్టేట్స్ తాజాగా గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) భాగస్వాములను కోరింది. భారత్, చైనాలు ఉక్రెయిన్‌లో.. మాస్కో యుద్ధ ప్రయత్నాలకు కీలక సహాయకులుగా అమెరికా ఆరోపించింది. శుక్రవారం జీ7 ఆర్థిక మంత్రులతో జరిగిన ఫోను సంభాషణలో యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్లు వాషింగ్టన్ సుంకాల నిర్ణయాలకు అనుగుణంగా మెలగాలని మిత్రదేశాలను ఒత్తిడి చేశారు. రష్యా ఇంధన ఆదాయాలను తగ్గించడమనే ఏకీకృత విధానం ద్వారా మాత్రమే యుద్ధానికి ముగింపు పలకగలమని వారు పేర్కొన్నారు.రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూర్చే ఆదాయాలను మూలం నుంచే తగ్గించే ఏకీకృత ప్రయత్నంలో భాగంగానే మేము ఆయా దేశాలపై ఆర్థిక ఒత్తిడిని తెస్తున్నామన్నారు. ఈ సందర్బంగా బెసెంట్, గ్రీర్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపైన్ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ చర్చలు.. ఉక్రెయిన్ రక్షణకు మద్దతుగా నిలుస్తూ, రష్యన్ ఆస్తులను దెబ్బతీసే అవకాశంపై దృష్టి సారించాయి. జీ 7లోని భాగస్వామ్యమైన ఉక్రెయిన్ దీర్ఘకాలిక ఆర్థిక పునరుద్ధరణను కాపాడుతూ, మాస్కోపై ఒత్తిడిని కఠినతరం చేయడంలో సభ్య దేశాలు ఐక్యంగా ఉండాలని వారు స్పష్టం చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత దిగుమతులపై సుంకాలను అదనంగా 25 శాతం మేరకు పెంచారు. మాస్కోతో న్యూఢిల్లీ చమురు వాణిజ్యాన్ని అణిచివేసే ప్రయత్నంలో భాగంగా శిక్షాత్మక సుంకాలను 50 శాతానికి తీసుకువచ్చారు. ఈ చర్య అమెరికా-భారత్ సంబంధాలను, సంక్లిష్టమైన వాణిజ్య చర్చలను దెబ్బతీసింది. అయితే బీజింగ్‌తో సున్నితమైన వాణిజ్య సంధిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ చైనా దిగుమతులపై కొత్తగా సుంకాలను విధించలేదు. -
రష్యాలో మళ్లీ భారీ భూకంపం
మాస్కో: రష్యాలో మరోసారి భూమి కంపించింది. కామ్చాట్కా ప్రాంతానికి తూర్పు తీరంలో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. ఈ క్రమంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నాడు భూమి కంపించిన సమయంలో స్వల్పంగా సునామీ వచ్చింది. తాజా భూకంపం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.BREAKING 🚨: Magnitude 7.7 earthquake just struck off the coast of Russia. This is the same location as the magnitude 8.8 earthquake that struck in July, triggering Pacific-wide tsunami warnings.Closely monitoring for tsunami potential. pic.twitter.com/pqlmJyWvYp— Colin McCarthy (@US_Stormwatch) September 13, 2025 -
భారత్‌పై సుంకాలు.. అతి పెద్ద సవాల్ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్‌పై సుంకాల విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై 50 శాతం సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదని చెప్పుకొచ్చారు. ఈ అతి పెద్ద చర్య కారణంగానే భారత్, అమెరికా మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ ప్రారంభమైంది. భారత్‌పై సుంకాలను తగ్గిస్తారా? అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యాకు భారత్ అతి పెద్ద చమురు వినియోగదారు. రెండు దేశాల మధ్య ఎంతో మిత్రుత్వం ఉంది. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్‌తో విభేదానికి మేము సిద్ధమయ్యాం. రష్యా నుంచి చమురు కొంటున్నారు అనే కారణంతోనే భారత్‌పై నేను భారత్‌పై 50 శాతం సుంకం విధించాను. అది చాలా పెద్ద చర్య. దీంతో భారత్‌తో విభేదాలు వచ్చాయి. అయినా నేనా చర్య తీసుకున్నాను. ఇలాంటి ఎన్నో పనులు చేశాను. కేవలం ఇది మాకు మాత్రమే సమస్య కాదు. యూరప్‌కు సైతం ఇదే ప్రధాన సమస్యే’ అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో పాత పాటే మళ్లీ పాడారు. తాను అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్-పాక్ ఘర్షణ సహా ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఏడు యుద్ధాలను తాను నివారించినట్టు ట్రంప్ తెలిపారు. కాంగో, రువాండా మధ్య గత 31ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని తానే పరిష్కరించానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పరిష్కరించలేని యుద్ధాలను నేను పరిష్కరిస్తాను ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
టారిఫ్‌ల వల్లే విభేదాలు: ట్రంప్
న్యూయార్క్: భారత్‌పై విధించిన టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధించాల్సి వచ్చిందని, ఇది సాధారణ విషయం కాదని అన్నారు. ఈ సుంకాల కారణంగా భారత్‌తో విభేదాలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శుక్రవారం ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. రష్యా చమురుకు భారత్ అతిపెద్ద కస్టమర్‌గా మారిందని ఆక్షేపించారు. దానికారణంగానే 50 శాతం టారిఫ్‌లు విధించక తప్పలేదని పునరుద్ఘాటించారు. నిజానికి అది చాలా పెద్ద నిర్ణయమని, దాన్ని మామూలు విషయంగా భావించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై మొండిగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యా అధినేత పుతిన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. రష్యా మిత్రదేశమైన భారత్‌పై భారీగా సుంకాలు విధించడం ద్వారా ఒకరకంగా చర్యలు తీసుకున్నట్లేనని వివరించారు. -
రష్యా డ్రోన్లను కూల్చిన పోలండ్
వార్సా: అనుమత లేకుండా తమ గగనతలంలోకి ప్రవేశించిన రష్యా డ్రోన్లను కూల్చివేసినట్లు పోలండ్ బుధవారం వెల్లడించింది. మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలో పెద్ద సంఖ్యలో రష్యా డ్రోన్లను నేలమట్టం చేశామని, ఇందుకు ‘నాటో’దేశాలు సైతం సహకరించాయని తెలియజేసింది. రష్యా తీరును దురాక్రమణ చర్యగానే పరిగణిస్తున్నట్లు స్పష్టంచేసింది. కొన్ని డ్రోన్లు రష్యా మిత్రదేశమైన బెలారస్ భూభాగం గుండా తమ గగనతలంలోకి వచ్చాయని పేర్కొంది. ‘‘గత రాత్రి రష్యా డ్రోన్లు మా గగనతలాన్ని ఉల్లంఘించాయి. మాకు ముప్పుగా మారిన ఆ డ్రోన్లను కూల్చివేశాం’’అని పోలండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. డ్రోన్లతో దాడులు జరగొచ్చన్న అంచనాతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం దాకా పోలండ్ సైన్యం అప్రమత్తంగా వ్యవహరించింది. పదికిపైగా డ్రోన్లు తమ గగనతలంలోకి ప్రవేశించినట్లు పోలండ్ రక్షణ శాఖ మంత్రి వ్లాదిస్లావ్ పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వార్సా ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలను కొన్ని గంటలపాటు నిలిపివేశారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలపై రష్యా సైన్యం డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. రష్యా–బెలారస్ ఉమ్మడిగా మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ దాకా ఇవి కొనసాగుతాయి. అయితే, సాంకేతిక సమస్యల వల్ల కొన్ని డ్రోన్లు పోలండ్ గగనతలంలోకి ప్రవేశించాయని బెలారస్ సైన్యం వెల్లడించింది. అలా దారితప్పి వెళ్లిన డ్రోన్లనే పోలండ్ కూల్చివేసినట్లు స్పష్టంచేసింది. పోలండ్‌ను టార్గెట్ చేయలేదు: రష్యా తమ డ్రోన్లను పోలాండ్ కూల్చడంపై రష్యా రక్షణ శాఖ స్పందించింది. తమ టార్గెట్ పోలండ్ కాదని బుధవారం వివరణ ఇచి్చంది. ఉక్రెయిన్ పశి్చమ ప్రాంతంలోని సైనిక–పారిశ్రామిక కాంప్లెక్స్‌పై దాడి చేయడానికి డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిపింది. పోలండ్ భూభాగంపై దాడి చేయాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదని వివరణ ఇచి్చంది. డ్రోన్ల అంశంపై ఆ దేశ రక్షణ శాఖతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. -
భారత్ పట్ల ట్రంప్ మరో ట్విస్ట్.. 100 శాతం సుంకాలు విధించాలని..
వాషింగ్టన్: భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోదీ తనకు మిత్రుడు.. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్‌పై 100 శాతం సుంకం విధించాలని ఈయూ దేశాలకు సూచించినట్లు తెలుస్తోంది.కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రష్యా నుంచి వాణిజ్యం చేస్తున్న పలు దేశాలను ట్రంప్ చేశారు. భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100 శాతం సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్‌లను కొనసాగించాలన్నారు. ‘మేము ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, యూరోపియన్ భాగస్వాములతో కలిసి ముందుకువస్తేనే దీన్ని అమలుచేద్దాం’ అని యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా సూచనలు అమలుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఈయూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో త్వరగా శాంతి నెలకొల్పాలని ఈయూ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు.మరోవైపు.. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్పదేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. -
పింఛనుదారుల క్యూలైన్‌పై రష్యా దాడి
కీవ్: పింఛనుదారుల క్యూలైన్‌పై రష్యా జరిపిన దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. స్లొవెయాన్స్క్ నగరానికి సమీపంలోని యరోవా గ్రామంలో మంగళవారం ఉదయం పింఛను తీసుకునేందుకు క్యూలైన్లో నిల్చున్న వృద్ధులపై రష్యా యుద్ధ విమానం గ్లైడ్ బాంబును జారవిడిచింది. ఘటనలో 24 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా రిటైర్డు ఉద్యోగులని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ దారుణాన్ని వరి్ణంచడానికి మాటలు చాలవన్నారు. ఇది రష్యా పాల్పడిన క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండరాదనీ, తమపై దురాక్రమణకు పాల్పడినందుకు ప్రతిగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించి, ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని పిలుపునిచ్చారు. ఘటనపై రష్యా రక్షణ శాఖ స్పందించలేదు. ఘటనాప్రాంతం దృశ్యాలు, దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న పోస్టల్ శాఖ వ్యాను ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. పోస్టల్ శాఖ ఉద్యోగి సైతం గాయపడ్డారు. -
క్యాన్సర్ కు టీకా వచ్చేస్తోంది !
-
‘పుతిన్ తలొగ్గేలా చేస్తాం’.. అమెరికా మరో వార్నింగ్
న్యూయార్క్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై వాషింగ్టన్, యూరోపియన్ యూనియన్లు మరిన్ని ద్వితీయ ఆంక్షలు విధించినట్లయితే రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఎన్సీబీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సమావేశం నిర్వహించారని, దీనిలో అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు రష్యాపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఏమి చేయవచ్చో చర్చించారని తెలిపారు.ట్రంప్ యంత్రాంగం గతంలో ప్రకటించిన 25 శాతం పరస్పర సుంకాలకు అదనంగా భారత్ రష్యా చమురు కొనుగోలుచేస్తున్నందుకు మరో 25 శాతం సుంకాన్ని విధించింది. భారత్‌పై విధించిన మొత్తం సుంకాలు ఆగస్టు 27 నుండి అమలులోకి వచ్చాయి. కాగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి అమెరికా సిద్ధంగా ఉందని, అయితే యూరోపియన్ భాగస్వాములు అందుకు సహకరించాలని స్కాట్ బెసెంట్ అన్నారు.తమ ఒత్తిడికి ఉక్రెయిన్ సైన్యం ఎంతకాలం నిలబడగలదు? రష్యన్ ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం నిలుస్తుంది? అనే దాని మధ్య పోటీ జరుగుతున్నదన్నారు.అమెరికా, ఈయూలు జోక్యం చేసుకుని రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని ఆంక్షలు, ద్వితీయ సుంకాలు విధించగలిగితే రష్యన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందని, అప్పుడైనా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు వస్తారని స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. కాగా అమెరికా విధించిన సుంకాలను భారత్ అన్యాయమైనవి, అసమంజసమైనవని పేర్కొంది. -
800డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద దాడి
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దళాలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని కేబినెట్ బిల్డింగ్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో చిన్నారి సహా ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ఉక్రెయిన్ దేశంపై రష్యా 805 డ్రోన్లతో దాడులు జరిపింది. వీటిలో పదుల సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లు ఉక్రెయిన్ కేబినెట్ బిల్డింగ్‌పై దాడి చేశాయి. బిల్డింగ్‌పై మొదట దట్టమైన పొగ కమ్ముకుంది. తేరుకునే లోపే కేబినెట్ బిల్డింగ్‌పై రష్యా ఆర్మీ.. డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. ఫలితంగా సగానికిపై కేబినెట్ బిల్డింగ్ ధ్వంసమైంది.అయితే,రష్యా దాడిని ఉక్రెయిన్ బలగాలు తిప్పికొట్టాయి. 747 డ్రోన్లు,నాలుగు మిస్సైళ్లను నిర్విర్యం చేశామని ఉక్రెయిన్ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ తైమూర్ టకాచెంకో తెలిపారు. ఇక, తొమ్మిది మిస్సైళ్లు, 56 డ్రోన్ దాడులు దేశవ్యాప్తంగా 37 ప్రాంతాల్లో దాడులు జరిపాయి. ఎనిమిది ప్రాంతాల్లో కూలిన డ్రోన్లు, మిస్సైళ్ల శకలాలు పడ్డాయి.రష్యా ప్రధాన చమురు కేంద్రంపై ఉక్రెయిన్ దాడిరష్యా భారీ ఎత్తున దాడులకు తెగబడటానికి ఉక్రెయిన్ కారణమని తెలుస్తోంది. హంగేరీ, స్లోవాకియా దేశాలకు రష్యా తన ప్రధాన చమురు కేంద్రమైన డ్రుఝ్బా (Druzhba) నుంచి చమురు సరఫరా చేస్తోంది. ఇటీవల, రష్యాలోని బ్రయాన్స్ ప్రాంతం ఉనేచా నగరంలో డ్రుఝ్బా (Druzhba) ఆయిల్ పైప్‌లైన్‌పై ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ దళాలు ‘కామికాజే డ్రోన్స్’ ఉపయోగించి డ్రుఝ్బా బూస్టర్ పంప్ స్టేషన్, ట్యాంక్ ఫార్మ్, ప్రధాన పంప్ విభాగాల్ని పేల్చివేసింది. రష్యా తమ దేశంపై కొనసాగిస్తున్న యుద్ధ ప్రయత్నాలు నిలువరించేందుకు ఉక్రెయిన్ ఈ దాడి చేసింది. ఉనేచా చమురు కేంద్రం నుంచి స్టేషన్ ద్వారా సంవత్సరానికి 60 మిలియన్ టన్నుల ముడి చమురు రవాణా జరుగుతుంది. -
భారత్‌కు ‘ఎలాన్ మస్క్’ మద్దతు.. నవారో అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్
వాష్టింగన్: ఇటీవలి కాలంలో భారత్‌ను టార్గెట్ చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు, యూఎస్‌కు చెందిన పలువురు నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాట్లాడుతున్న వారి లిస్టులో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదటి స్థానంలో ఉన్నారు. భారత్‌పై నవాలో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. నవారో ఆరోపణలు అబద్ధమని ‘ఎక్స్’ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. దీంతో, నవారోకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. కొద్దిరోజుల క్రితమ నవారో ట్విట్టర్(ఎక్స్) వేదికగా..‘భారత్ అత్యధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. లాభం కోసమే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌తో మాస్కో చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తోంది. యుద్ధంలో ఇరుదేశాల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా.. ‘రష్యాకు భారత్ లాండ్రోమ్యాట్‌లా పనిచేస్తోంది. మీకు తెలుసా.. ఓ వర్గం లబ్ధి పొందేందుకు భారత ప్రజలను పణంగా పెడుతోంది. మనం దానిని అడ్డుకోవాలి. అది ఉక్రెయిన్ వాసులను చంపుతోంది. మనం (అమెరికన్లు) చెల్లింపుదారులుగా ఏం చేయాలో అది చేయాలి’ అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.Trump aide Peter Navarro lashes out at India over Russian oil, accuses it of “profiteering” & fueling Moscow’s war machine. Musk’s X fact-checks him, calling out US double standards. Navarro fumes: “Elon is letting propaganda in.” https://t.co/0Bq0SIgPGm via @indiatoday pic.twitter.com/r4jCnATbBm— Ashok Upadhyay (@ashoupadhyay) September 7, 2025ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది ఇంధన భద్రత కోసమేనని పేర్కొంది. ఆ దేశం ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడంలేదని స్పష్టం చేసింది. అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్నీ ప్రస్తావించింది. నవారో వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని తేల్చింది. అనంతరం, ఈ ఫ్యాక్ట్ చెక్‌పై నవారో భగ్గుమన్నారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్తగా అభివర్ణించారు. భారత్ లాభపేక్ష కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ తన ఆరోపణలను సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని మాస్కో ఆక్రమించక ముందు.. ఈ కొనుగోళ్లు జరగలేదన్నారు.ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజలను చంపడం, అమెరికన్ల ఉద్యోగాలు తీసుకోవడం ఆపాలంటూ పిచ్చి ప్రేలాపణలు చేశారు. దీనిపై కూడా ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ సొంత నిర్ణయమని, అది ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్‌పై ఒత్తిడి తెస్తూనే.. అమెరికా రష్యా నుంచి యురేనియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. యూఎస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దంపడుతోందని మండిపడింది. ఇక, భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. -
డేంజరస్ చైనాతో.. దోస్తీయా?
చైనాకు రష్యా, భారత్ సన్నిహితం కావటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమంటున్నారు. దుష్ట చైనాతో చేతులు కలుపుతారా? అంటూ రుసరుసలాడుతున్నారు. చైనా అంధకారంలోకి మీరూ పడిపోతున్నారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోను సోషల్‌మీడియాలో షేర్చేస్తూ అక్కసు వెళ్లగక్కారు. మరోవైపు అమెరికాకు దీటుగా చైనా తన సైనిక, ఆయుధ శక్తిని ప్రదర్శిస్తుంటే.. ఉక్రెయిన్‌లోకి ఏ ఇతర దేశం బలగాలు వచ్చినా దాడి చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు.. ధీటుగా చైనా, రష్యా సవాళ్లతో ప్రపంచం ఉద్రిక్తంగా మారుతోంది. మధ్యేమార్గం అనేది మాయమై.. ప్రపంచం రెండు ముక్కలుగా చీలుతోంది. అమెరికా బెదిరింపులకు గురైనవారిని తాను కాపాడుతాను అన్నట్లుగా చైనా తన సైనిక బలాన్ని ప్రదర్శించటంతో రెండు ప్రపంచ మహాశక్తులు యుద్ధానికి ఎదురెదురుగా నిలబడినట్లయ్యింది.ఈ అసాధారణ పరిణామానికి ఈసారి భారత్ కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సమాఖ్య (ఎస్సీఓ) సమావేశంలో కనిపించిన ఒకే ఒక్క దృశ్యం ఇప్పుడు ప్రపంచ దృక్పథాన్ని మార్చివేస్తోంది. ట్రంప్ నిష్టూరాలు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను లొంగదీసుకునేందుకు భారత్‌ను వాడుకోవాలని భంగపడి.. సుంకాల పేరుతో బెదిరింపులకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎస్సీఓ సమావేశంపై భయపడుతూనే నిషూ్టరాలు ఆడారు. ఆ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోను తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో షేర్ చేస్తూ భారత్, రష్యాను తాము కోల్పోయామని రాసుకొచ్చారు.‘చూడబోతే మేము అంధకార అగాధమైన చైనాకు భారత్, రష్యాలను కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దుష్ట చైనాతో చేతులు కలిపితే అంధకారంలోకి వెళ్లినట్లేనని భావాత్మకంగా చెప్పారు. అదే సమయంలో తన దారికి తెచ్చుకోవాలనుకున్న రష్యా, భారత్‌లు తన ప్రత్యర్థి అయిన చైనా వైపు వెళ్లిపోయాయన్న భయం కూడా ఆయన మాటల్లో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్ధమా? శాంతా? ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి ముగింపు పలికే సుముహూర్తం ఇదేనని చైనా భావిస్తోంది. ఈ నెల 3న ఆ దేశం విక్టరీ పరేడ్‌లో చేసిన బలప్రదర్శన ప్రపంచానికి ఈ అంశంలో స్పష్టమైన సందేశం ఇచ్చింది. అమెరికా పేరు ప్రస్తావించకుండానే ‘శాంతియా? యుద్ధమా?’తేల్చుకోవాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టమైన హెచ్చరిక జారీచేశారు. ఆ సమావేశానికి అమెరికా ఆగర్భ శత్రువులైన ఉత్తరకొరియా, ఇరాన్ దేశాల అధినేతలు కూడా హాజరయ్యారు. అమెరికా బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, కాపాడేందుకు తాను ఉన్నానన్న భావన జిన్‌పింగ్ ప్రకటనలో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు.జిన్‌పింగ్ ప్రకటనకు కొనసాగింపు అన్నట్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఉక్రెయిన్‌తో ఏ దేశం తన బలగాలను మోహరించినా వాటిపై దాడులు చేస్తామని శుక్రవారం హెచ్చరిక జారీచేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం యూరోపియన్ దేశాధినేతలతో సమావేశమై సైనిక మద్దతు కోరిన నేపథ్యంలో పుతిన్ ప్రకటన సంచలనంగా మారింది.ఎందుకంటే అమెరికాతోపాటు దాదాపు యూరప్ దేశాలన్నీ నాటోలో భాగస్వాములుగా ఉన్నాయి. ఒకవేళ నాటో బలగాలు ఉక్రెయిన్‌లోని అడుగుపెడితే.. వాటితో ముఖాముఖి యుద్ధానికి సిద్ధమని పుతిన్ తేల్చి చెప్పారు. దీంతో ప్రాంతీయ ఘర్షణలన్నీ కలిసి నిర్ణయాత్మక ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారతే కీలకం దశాబ్దాలుగా మధ్యేవాద విధానంతో ప్రపంచ ప్రధాన శక్తులన్నింటితో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తున్న భారత్.. ప్రస్తుతం ఎటో ఒకవైపు మొగ్గాల్సిన సంకట స్థితిలో పడింది. తన ప్రమేయం లేకుండానే అమెరికా– చైనా శక్తుల మధ్య కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. భారత్ జోక్యం చేసుకుంటేనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే వాదిస్తున్నారు. అందుకు భారత్ స్పందించకపోవటంతో భారత వస్తువులపై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో అనివార్యంగానే మనదేశం.. చైనా, రష్యాకు మరింత దగ్గర కావాల్సి వస్తోందనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు అమెరికాను దెబ్బకొట్టాలంటే చైనా, రష్యాలకు కూడా భారతే కీలకంగా మారింది. ఎస్సీఓ సమావేశానికి 10 సభ్య దేశాధినేతలు, మరికొన్ని ఆహా్వనిత దేశాల నేతలు విచ్చేసినా.. అందరి దృష్టి భారత ప్రధాని నరేంద్రమోదీపైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై సొంత దేశంలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. భారత్‌ను అనవసరంగా దూరం చేసుకున్నామన్న బాధ ఆ విమర్శల్లో కనిపిస్తోంది.అయితే, చైనాతో భారత సంబంధాలు తక్షణం గొప్పస్థాయికి వెళ్తాయన్న నమ్మకం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యే భారత్–చైనా దైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాన అడ్డంకి అన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ జనరల్ అనిల్ చౌహాన్ మాటలను గుర్తుచేస్తున్నారు. -
అన్నీ మంచి శకునములే...
భారతదేశంపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు 50 శాతానికి పెంచిన ఐదు రోజులకు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశాల నుంచి దేశానికి అన్నీ మంచి శకునాలే లభించాయి. చైనా, రష్యాలతో సంబంధాలు మరింత బలో పేతమయ్యాయి. ఈ కొత్త స్థితి వెంటనే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారోలు,ఇండియాపై చేసిన అనుచితమైన వ్యాఖ్య లలో ప్రతిఫలించింది. ప్రధాని మోదీ తమపై కొంత అలిగినా తిరిగి వైఖరి మార్చుకోగలరని వారు చివరి వరకూ ఆశించారు. ఆయనకు తాము తప్ప గత్యంతరం లేదనుకున్నారు. కానీ, మోదీ వైఖరి మరింత దృఢంగా మారినట్లు తియాన్జిన్లో అడుగడుగునా కనిపించింది.అర్థాలు–అంతరార్థాలుఈ సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్న మాటలేమిటో యథాతథంగా చూడటం అవసరం. జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం మోదీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, రెండు దేశాలూ అభివృద్ధిలో భాగస్వా ములే తప్ప ప్రత్యర్థులు కాదనీ, భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారరాదనీ భావించినట్లు పేర్కొన్నది. పరస్పర గౌరవం, ఉభయుల ప్రయోజనాలు, ఇరువురి సున్నితమైన మనోభావాల గుర్తింపు అవసర మన్నది. ఇటువంటి అవగాహనలు 21వ శతాబ్దపు ధోరణులకు అను గుణంగా బహుళ ధ్రువ ప్రపంచంతోపాటు బహుళ ధ్రువ ఆసియా రూపు తీసుకునేందుకు ఆవశ్యకమని పేర్కొన్నది. చైనాతో సంబంధాల మెరుగుదల నిరుటి కజాన్–బ్రిక్స్ సమావేశాల నుంచే మొద లైందని పలుమార్లు గుర్తు చేస్తున్న మోదీ, ఇపుడు రెండు దేశాల మధ్య ‘శాంతి, సుస్థిరతల వాతావరణం ఏర్పడింద’న్నారు. జిన్‌పింగ్ మాటలను కూడా కొంత చెప్పుకొన్న తర్వాత ఇరువురి అభిప్రాయాల అర్థాలు, అంతరార్థాలు చూద్దాము: రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80 సంవత్సరాల తర్వాత కూడా ప్రచ్ఛన్న యుద్ధ కాలపు మనస్తత్వం, ఆధిపత్య ధోరణి, ప్రొటెక్షనిజం కొనసాగుతున్నాయి. కొద్ది దేశాల అంతర్గత విధానాలను ఇతరులపై రుద్దకూడదు. అంతర్జాతీయ నియమ నిబంధనలన్నవి పరీక్షాత్మక దశకు చేరుకున్నాయి. సమ్మిళితమైన ఆర్థిక ప్రపంచీకరణ అవసరం. భారతదేశం, చైనాలు పరస్పర విశ్వాసాన్ని బలపరచుకుని, పరస్పర అభివృద్ధికి అవకాశాలను పెంచుకోవాలి. వ్యూహాత్మకమైన, దీర్ఘ కాలిక దృక్కోణంతో వ్యవహరించాలి. నాయకులిద్దరూ చెప్పినవి ఇంకా ఉన్నాయిగానీ, అన్నీ ఈ ప్రధా నమైన మాటల చుట్టూ తిరిగేవే. సరిహద్దు వివాదాన్ని, పాకిస్తాన్ అంశాన్ని ప్రధానంగా ముందుకు తెచ్చుకుని అభివృద్ధి సహకార అవకాశాలను విస్మరించవద్దన్నది మొదటి అంతరార్థం. ఇరువురి సున్నిత మనోభావాలన్నది ఇందుకు సంబంధించినదే గాక, ఆసియాతో పాటు ప్రపంచంలోనూ ఒక శక్తిగా ఎదగజూస్తున్న ఇండి యాకు ఆటంకాలు కల్పించరాదనే అర్థం వస్తుంది. ఇక్కడ, బహుళ ధ్రువ ప్రపంచం అన్నమాటతో పాటు, బహుళ ధ్రువ ఆసియా అనే మాటను కొత్తగా ఉపయోగంలోకి తేవటం గమనించదగ్గది. అనగా, చైనాయేగాక ఇండియా కూడా ఒక ధ్రువమనేది గుర్తించటమన్న మాట. 21వ శతాబ్దపు ధోరణులలోకి అది కూడా వస్తుంది. సుంకాలకు ముందు నుంచే...చైనాతో సంబంధాల మెరుగుదల కజాన్ నుంచే మొదలైన మాట నిజమే అయినా ఆ విషయాన్ని మోదీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? కేవలం ట్రంప్ సుంకాలు అందుకు కారణమని అమెరికాలో, బయటా జరుగుతున్న ప్రచారం నిజం కాదనీ, భారత దేశం తన ప్రయోజనాల కోసం స్వతంత్ర నిర్ణయాలు గతం నుంచే తీసుకుంటున్నదనీ ప్రకటించేందుకు!చైనా అధ్యక్షుని ఉద్దేశం... రెండు దేశాల మధ్య సరిహద్దుల వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అందుకు పరిష్కార ప్రయ త్నాలు జరుగుతున్నందున, అందుకు బందీ కాకుండా, పరస్పర అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాలని! అందుకు అనుగుణంగా తాము భారతదేశంతో కలిసి పనిచేయగలమనటం! ఆయన ఉప యోగించిన డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయటమనే మాటలో ఈ అంతరార్థాలన్నీ కనిపిస్తాయి. మారుతున్న పరిస్థితులు, అందు వల్ల రెండు దేశాలకు కలుగుతున్న సమస్యలు, వాటి నుంచి బయట పడేందుకుగానీ, భవిష్యత్తులో అభివృద్ధి కోసం గానీ అవసరమైన వేమిటో రెండు దేశాల నాయకులకు స్పష్టమైన అవగాహన ఏర్పడి నట్లు కనిపిస్తున్నది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా నిలిచి పోయిన ఒప్పందాలు ఒక్కటొక్కటిగా ఇప్పటికే జరుగుతుండటం తెలిసిందే.స్పష్టమైన సందేశంరష్యా విషయానికి వస్తే, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షునితో జరిపిన సమావేశం, అనూహ్యంగా ఆయన కారులో ప్రయాణించటం, హోటల్‌కు చేరిన తర్వాత కూడా కారులోనే ఉండి ముప్పావు గంట సేపు చర్చించి ఆ ఫొటోను పోస్ట్ చేయటం, బయట కూడా పుతిన్‌తో కలిసి వెళ్లి జిన్‌పింగ్‌తో చేసిన సంభాషణల వంటివన్నీ ఇటు భారతీయులకు, ప్రపంచ దేశాలకు, అటు అమెరికా శిబిరానికి పంపవలసిన సందేశాలనే పంపాయి. దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగటమే గాక, ఉభయుల మధ్యగల చిరకాలపు సాన్నిహిత్యం ఇంకా బలపడగలదని, సుంకా లకు వెరవబోమనే సంకేతాలను భారత ప్రధాని అమెరికా శిబిరానికి 50 శాతం నాటి ముందుకన్నా బలంగా పంపటం విశేషం. ఇప్పటి కైనా వివేకం కలిగితే ఆ శిబిరం చేయవలసింది తమ తీరును అన్ని విధాలా మార్చుకుని, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవహరించటం!షాంఘై సంస్థ నిజానికి రక్షణ, తీవ్రవాదం అంశాలకు సంబంధించినది. కానీ, మొదటిసారిగా తియాన్జిన్లో ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వ్యూహాల గురించి చర్చించటం మారుతున్న పరిస్థితులకు, పాశ్చాత్య ప్రపంచానికి బయటి దేశాల ఆందోళనలు, అవసరాలకు అద్దం పడుతున్నది. ఈ విధంగా ‘బ్రిక్స్’కు అదనంగా మరొక సంస్థ క్రమంగా బలపడుతున్నది. కజాన్‌లో వలెనే తియాన్‌జిన్‌లోనూ పాశ్చాత్య ఆధిపత్య వ్యతిరేకత, బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం, డాలర్‌ను క్రమంగా బలహీనపరచటం, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలు, ప్రస్తుతం గల అంతర్జాతీయ వ్యవస్థలపై అమెరికా కూటమి నియంత్రణ స్థానే సంస్కరణలతో ప్రజాస్వామికీకరణ, వర్ధమాన దేశాల మధ్య అవగాహనలను, మైత్రీ సహకారాలను బలపరచుకోవటం ప్రధానాంశాలయ్యాయి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
‘భారత్‌తో రష్యాకు భారీ డ్యామేజ్.. అది చాలదా?’
రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంతోనే భారత్‌పై ద్వితీయశ్రేణి ఆంక్షలు విధించాల్సి(పెనాల్టీ సుంకాలు) వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నొక్కి చెప్పారు. అయితే ఇది ఇక్కడితోనే అయిపోలేదని అంటున్నారాయన. భారత్ వల్లే రష్యాకు భారీ డ్యామేజ్ కూడా జరిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బుధవారం పోలాండ్ అద్యక్షుడు కరోల్ నావ్రోకితో వైట్‌హౌజ్‌లోని తన ఓవల్ ఆఫీస్ ఆఫీస్‌లో జరిగిన జాయింట్ ప్రెస్మీట్లో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. రష్యాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఓ పోలాండ్‌కు చెందిన విలేకరి ప్రశ్నించారు. ఇండియాపై ద్వితీయ శ్రేణి సుంకాలు విధించాను. చైనా తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసే పెద్ద దేశం ఇండియానే. ఇది రష్యాకు వందల బిలియన్ల డాలర్ల నష్టం కలిగించింది. మీరు దీన్ని చర్య కాదు అంటారా?.. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 సుంకాలు మిగిలే ఉన్నాయి. మీరేమో చర్య లేదు అంటున్నారు. బహుశా.. మీకు కొత్త ఉద్యోగం అవసరం అంటూ రిపోర్టర్‌ను ఉద్దేశించి ట్రంప్ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇండియాకు పెద్ద సమస్యలు వస్తాయి అని రెండు వారాల క్రితమే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడు అదే జరిగిందని గుర్తు చేశారు. భారత్ తమకు మిత్రదేశమంటూ జులై 30వ తేదీన ట్రంప్ తొలుత 25 శాతం సుంకాలు(ప్రతీకార సుంకాలు) ప్రకటించారు. ఆ సమయంలో రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్రంగా ఆక్షేపించారు. ఇక ఆగస్టు 6వ తేదీన రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్‌పై పెనాల్టీగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా ఉక్రెయిన్ యుద్దానికి భారత్ ప్రత్యక్షంగా ఫండింగ్ చేస్తోందని ఆరోపించారాయన. దీంతో ఆగస్టు 27వ తేదీ నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్అదే సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన భారత్‌ను అత్యధిక సుంకాలు విధించే దేశంగా పేర్కొంటూ.. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్ అంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా వస్తువులపై ఆ దేశం అత్యధికంగా సుంకాలు విధిస్తోందని.. అందువల్లే అమెరికన్ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే.. ఇండియా ఇప్పుడు నో టారిఫ్ ఒప్పందానికి దిగి వచ్చిందన్న ఆయన.. అది ఆలస్యంగా జరిగిందంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇండియా రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. తన సుంకాల వల్లే భారత్ ఇప్పుడు టారిఫ్‌లు తగ్గించేందుకు సిద్ధమైంది అని అన్నారు.నిజంగానే చమురు ఆగిందా?ఇదిలా ఉంటే.. తన సుంకాల వల్లే భారత్ దిగొచ్చిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసిందంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తుండడం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. రష్యా ఈ విషయంపై అధికారికంగా ఏం స్పందించలేదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తామని, ఆర్థిక లాభదాయకత ఆధారంగా తమ వ్యూహాం ఉంటుందని ఇటు భారత్ చెబుతూ వస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ.. రైతులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలపై రాజీ పడం. ఒత్తిడి పెరిగినా తట్టుకుంటాం అని సుంకాలపై స్పందించారు. మరోవైపు.. చమురు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా ఆపలేదు. కానీ కొంతమేర తగ్గించిన సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన 50% సుంకాలు (25% రెసిప్రోకల్ టారిఫ్ + 25% పెనాల్టీ టారిఫ్) ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో రష్యా చమురు దిగుమతులు తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావం తక్షణమే పూర్తిగా కనిపించక పోవచ్చని.. ఎందుకంటే చమురు కొనుగోలు ఒప్పందాలు వారాల ముందే కుదురుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌తో అలా మాట్లాడాల్సింది కాదుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. చైనా పర్యటన ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇండియా, చైనాలాంటి దేశాలతో అలా వ్యవహారించడం సరికాదని అమెరికా వైఖరిని తప్పుబట్టారు. అమెరికా భారత్‌పై 50% సుంకాలు విధించడం.. ఆర్థిక శిక్షగా అభివర్ణిస్తూనే ఇది అంతర్జాతీయ సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నంగా పేర్కొన్నారు.ఇండియా, చైనా వంటి దేశాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఇండియా 1.5 బిలియన్ జనాభా కలిగిన దేశం. వీరి చరిత్ర, రాజకీయ వ్యవస్థలు గౌరవించాల్సినవి. వీటి నాయకత్వాన్ని బలహీనపరచాలనుకోవడం పొరపాటు. శిక్షించేందుకు ప్రయత్నించడం, సుంకాలు విధించడం అనేవి ఆర్థిక బలప్రయోగం. ఇది కాలనీల యుగం కాదు. భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని అమెరికా వైఖరిని పరోక్షంగా విమర్శించారు. -
పుతిన్‌తో కిమ్ భేటీ.. ఇలా కూడా చేస్తారా.. వీడియో వైరల్
బీజింగ్: రష్యా, ఉత్తర కొరియా అధినేతలు పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ చైనా రాజధాని బీజింగ్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బుధవారం విక్టరీ డే పరేడ్‌లో పాల్గొన్న అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్‌లో కలుసుకున్నారు. భేటీ ప్రారంభం కావడానికి ముందు మీడియా ప్రతినిధులతో పుతిన్ మాట్లాడారు. అయితే, అనంతరం చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..భేటీ అనంతరం పుతిన్-కిమ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే.. వారు కూర్చున్న ప్రదేశం వద్దకు వేగంగా ఇద్దరు వ్యక్తులు దూసుకొచ్చారు. అందులో ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని తెగ తుడిచేశారు. ఉత్తరకొరియా అధ్యక్షుడికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకుండా శుభ్రం చేశారు. ఆయన తాకిన ఫర్నీచర్‌ను క్లీన్ చేశారు. ఇంకొకరు ఆయన వాడిన గ్లాస్ అతి జాగ్రత్తగా ట్రేలో పెట్టుకొని తీసుకెళ్లిపోయారు. ఆయనకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఆ ప్రాంతంలో లేకుండా క్లీన్ చేసేశారు.అయితే, ఇలా వ్యవహరించాడాని కారణంగా ఉందని రష్యా జర్నలిస్ట్ ఒకరు వెల్లడించారు. ఆయన డీఎన్ఏ ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఇలా చేశారని చెప్పుకొచ్చారు. కాగా, దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు చిక్కకుండా ప్రపంచ నేతలు ఇలా జాగ్రత్తలు పాటిస్తుంటారు.The staff accompanying the North Korean leader meticulously erased all traces of Kim's presence. They took the glass he drank from, wiped down the chair's upholstery, and cleaned the parts of the furniture the Korean leader had touched. pic.twitter.com/JOXVxg04Ym— Russian Market (@runews) September 3, 2025పుతిన్ కూడా అంతే.. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఇటీవల అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి జాగ్రత్తే తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పుతిన్ మల వ్యర్థాలను తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఓ సూట్ కేసును ఆయన బాడీగార్డులు మోసుకెళ్లారట. ఆ పూప్ సూట్‌కేస్‌లో వాటిని సేకరిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా.. పుతిన్-కిమ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలిసింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా సైనికులతో కలిసి పోరాడుతున్న ఉత్తరకొరియా జవాన్లపై ప్రశంసల వర్షం కురిపించారు. రష్యా–ఉత్తర కొరియా మధ్య బంధం నానాటికీ బలపడుతోందని కిమ్ హర్షం వ్యక్తంచేశారు. గత ఏడాది జూన్‌లో ఇరుదేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారని తెలిపారు. అప్పటి నుంచి పరస్పరం సహకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. రష్యాకు, ఉత్తరకొరియా సహకరించడం సోదర దేశంగా తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. అవసరమైన సాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధం గురించి కిమ్ నేరుగా ప్రస్తావించలేదు. మీడియాతో మాట్లాడిన అనంతరం పుతిన్, కిమ్ ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో సహకరిస్తున్నందుకు కిమ్‌కు పుతిన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసినట్లు సమాచారం. రష్యాలో పర్యటించాలని కోరుతూ కిమ్‌ను పుతిన్ ఆహ్వానించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం ఉత్తర కొరియా సైన్యం రష్యాకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా ఇప్పటిదాకా 15,000 మంది సైనికులను పంపించింది. బాలిస్టిక్ మిస్సైళ్లు, ముందుగుండు సామగ్రి సహా పలు కీలక ఆయుధాలను సైతం సరఫరా చేస్తోంది. -
జిన్‌పింగ్ జీ.. 150 ఏళ్లు బతకొచ్చంటారా?: పుతిన్
బీజింగ్: ఇప్పటికే దశాబ్దాలుగా చైనా, రష్యాలను ఏకఛత్రాధిపత్యంతో ఏలేస్తున్న జిన్‌పింగ్, పుతిన్‌లకు ఇంకొన్ని దశాబ్దాలపాటు అధికార పీఠాన్ని అట్టిపెట్టుకోవాలనే ఆశ ఉన్నట్టుంది. బుధవారం బీజింగ్‌లో కట్టుదిట్టమైన మిలటరీ భద్రత మధ్య జరిగిన సైనిక, సాయుధ పరేడ్‌లో వీరిద్దరి అనూహ్య సంభాషణ ఈ విషయాన్ని రుజువుచేసింది. ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో జిన్‌పింగ్, పుతిన్‌ల గుసగుసలు దగ్గర్లోని మైక్రోఫోన్ ద్వారా బయటకు వినిపించడంతో వీరి మనసులోని మాట బయటపడింది.తియాన్మెన్ స్క్వేర్ గేట్ నుంచి పరేడ్ వీక్షణ వేదిక మీదకు వెళ్లే మార్గంలో నడుచుకుంటూ జిన్‌పింగ్, పుతిన్, కిమ్, ఇతర నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా 150 ఏళ్లదాకా మనిషి జీవించగలడు అనే అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌తో పుతిన్.. ‘జీవసాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ముసలివైపోతున్న, పాడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించవచ్చు. ఇలా నూతన అవయవాలతో యవ్వన ఛాయతో మెరుగైన జీవనం సాధ్యమే. బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువునూ జయించవచ్చు’ అని అన్నారు.దీనికి జిన్‌పింగ్ మాండరిన్ భాషలో బదులిచ్చారు. ‘గతంలో 70 ఏళ్లు బతకడం అంటే గగనం. ఇప్పుడు 70 ఏళ్లు వయసు వచ్చిన చిన్నపిల్లాడి కిందే లెక్క. కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అభివృద్ధిలోకి వస్తున్న వైద్యశాస్త్ర పరిశోధనా ఫలాలను అందిపుచ్చుకుంటే ఈ శతాబ్దిలోనే మనుషులు 150 ఏళ్లదాకా జీవించగలరు’’ అని అన్నారు. ఇదే సమయంలో జిన్‌పింగ్, పుతిన్‌లను చూసి కిమ్ కిసుక్కున నవ్వారు. వీళ్ల సంభాషణ విని నవ్వారో, ఊరకే యథాలాపంగా నవ్వారో తెలీదు. కానీ ఈ సంభాషణ మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాకు అమర్చిన మైక్రోఫోన్ ద్వారా ప్రత్యక్షప్రసారమైందని రాయిటర్స్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. పుతిన్, జిన్‌పింగ్ ఇద్దరి వయసూ 72 కావడం గమనార్హం. తదుపరి ఎన్నికల్లోనూ అధ్యక్ష పీఠంపై కూర్చునేలా జిన్‌పింగ్ ఇప్పటికే రాజ్యాంగంలో మార్పులుచేశారు. పుతిన్ సైతం ఇదే తరహాలో గతంలోనే రాజ్యాంగ సవరణ చేశారు. ఇద్దరికీ మరికొన్నాళ్లు పరిపాలించాలనే ఆసక్తి ఎక్కువగా ఉందని అందరికీ తెల్సిందే. -
భారత్-రష్యా బంధం.. పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
బీజింగ్: చైనా షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు అనంతరం భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్, రష్యా బంధంపై దాయాది దేశం పాకిస్తాన్ స్పందించింది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్‌తో రష్యాకు ఉన్న అనుబంధాన్ని తాము గౌరవిస్తామని అన్నారు. ఇదే సమయంలో ఇస్లామాబాద్తోనూ మాస్కో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.అయితే, చైనా పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాక్ ప్రధాని షరీఫ్ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం, షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ..‘గత కొన్నేళ్లలో పాక్-రష్యా సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. అనేక రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. పాక్ పట్ల రష్యా చూపిస్తున్న ఆసక్తి, నిబద్ధతకు ధన్యవాదాలు. ఇంధనం, వ్యవసాయం, రక్షణ, కృత్రిమ మేధ, విద్య వంటి రంగాల్లో మేం రష్యాతో అత్యంత బలమైన సంబంధాలను కోరుకుంటున్నాం. ప్రాంతీయ పురోగతికి అది మంచి చేస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ డైనమిక్ లీడర్. రష్యా-పాకిస్తాన్ సరైన దిశలో వెళ్తున్నాయి. ఇది పాకిస్తాన్‌కు ఎంతో ఉపయోగకరం’ అని కామెంట్స్ చేశారు.మరోవైపు.. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు ముగిసిన వెంటనే భారత్‌కు రష్యా బంపరాఫర్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్‌లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్‌కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. అయితే, ఎస్సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్‌కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం. మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
స్నేహబంధం బలోపేతం
బీజింగ్: అమెరికా విసిరిన టారిఫ్‌ల సవాళ్లతో ఇక్కట్లు ఎదురవుతున్న వేళ చైనా, రష్యా తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటు న్నాయి. చైనాలోని తియాంజిన్‌లో సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు జరిగిన మర్నాడే ఇరు దేశాలు మంగళవారం మరోసారి సమావేశమై ద్వైపాక్షిక చర్చలు చేపట్టాయి. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చర్చల కోసం రాజధాని బీజింగ్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సాదర స్వాగతం పలికారు.పుతిన్‌ను ‘చిరకాల మిత్రుని’గా అభివర్ణించారు. పుతిన్ సైతం తన ప్రసంగంలో జిన్‌పింగ్‌ను ప్రియ స్నేహితునిగా సంబోధించారు. ‘నాడు మేము కలిసే ఉన్నాం.. ఇప్పుడు కూడా కలిసే ఉంటాం’అని పుతిన్ చెప్పుకొచ్చారు. ఇరు దేశాధినేతల లాంఛన సమావేశం అనంతరం చైనా అధికార కేంద్ర స్థానమైన ఝోంగన్హాయ్లో ఇరుపక్షాల ఉన్నతాధికారుల మధ్య తేనీటి విందు భేటీ జరిగింది.రష్యా పర్యాటకులకు ఈ నెల నుంచి 30 రోజులపాటు వీసారహిత సదుపాయం కల్పించనున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే చైనాకు మరో సహజవాయు పైప్‌లైన్‌ను నిర్మించేందుకు ఆ దేశంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు రష్యా ప్రభుత్వరంగ చమురు సంస్థ గాజ్ప్రోం సీఈఓ అలెక్సీ మిల్లర్ తెలిపారు. ప్రస్తుత పైప్‌లైన్ మార్గాల ద్వారా సహజవాయు సరఫరాను మరింత పెంచేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. -
అసహనంలో అమెరికా.. భారత్‌కు రష్యా బంపరాఫర్!
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు అనంతరం, భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు రష్యా బంపరాఫ్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్‌లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్‌కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది.ఎస్సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్‌కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం.మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 50శాతం టారిఫ్ విధించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్..ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్ మద్దతిస్తుందని అక్కసు వెళ్లగక్కారు. అయితే,భారత్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను సమర్థిస్తోంది. చమురు ఎక్కడ తక్కవ దొరికితే అక్కడ నుంచి కొనుగోలు చేస్తామని కుండబద్దలు కొట్టి చెప్పింది. అమెరికా విధించిన టారిఫ్‌లను భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలు భారత్ అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాల్లో కీలక మలుపు తిరగనుంది. చమురు వ్యాపారం కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయంగా పలుదేశాల్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. Always a delight to meet President Putin! pic.twitter.com/XtDSyWEmtw— Narendra Modi (@narendramodi) September 1, 2025 -
రష్యాతో కాదు.. భారత్ ఉండాల్సింది మాతోనే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా సంబంధాలపై తాజాగా విమర్శలు గుప్పించారు. భారత్ ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తియాంజిన్ (Tianjin) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. పీటర్ నవారో తీవ్ర విమర్శలు చేశారు.వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ.. పుతిన్, షీ జిన్‌పింగ్‌లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కానేకాదు అని అన్నారు.అమెరికా విధించిన టారిఫ్‌లపై భారత్ స్పందించిన తీరు.. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్‌ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు. తాజాగా.. భారత్‌లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్‌కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.అయితే.. భారత్ మాత్రం తన చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. మిగతా దేశాల్లాగే జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని, దేశీయ మార్కెట్‌ను స్థిరంగా ఉంచేందుకు ఇది అవసరమని భారత్ అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా విధించిన 50 శాతం సుంకాలను అన్యాయమని భారత్ అభిప్రాయపడుతోంది. -
శుభ పరిణామం... త్రైపాక్షికం
ఏడేళ్ల అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో జరిపిన పర్యటన అనేక విధాల సత్ఫలితాలనిచ్చింది. ఇది అంతర్జాతీయ పెత్తందార్లకు తగిన సందేశం పంపింది. పెహల్గామ్ ఉగ్రవాద దాడిపై మూణ్ణెల్లు గడిచినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండి పోయిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)తో ఆ ఘటనను ఖండిస్తూ తీర్మానం చేయించింది. చైనా, రష్యాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రగతి సాధించింది. ఈ పరిణామాలన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు.అంతర్జాతీయ సంబంధాల్లో అమెరికా సృష్టించిన సరికొత్త గందరగోళం వల్ల ఏర్పడిన అయోమయ వాతావరణాన్ని ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు ఒక కుదుపు కుదిపింది. ప్రపంచవ్యాప్త మీడియా ఈ శిఖరాగ్ర సదస్సు కన్నా మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు చర్చించుకుంటున్న వీడియోకూ, ఛాయాచిత్రాలకూ అత్యధిక ప్రాధాన్యమివ్వటం మోదీ చైనా సందర్శనలోని అంతరార్థాన్నీ, దాని పరిణామాలనూ అవగాహన చేసుకోవటం వల్లే. అయితే కేవలం ఈ పర్యటన వల్లే అంతా మారిపోతుందనీ, చైనా మనతో సవ్యంగా ఉంటుందనీ, అమెరికా తన తెలివితక్కువ విధానాలను సవరించుకుంటుందనీ అనుకోనవసరం లేదు. ఇప్పటికైతే యూరేసియాలోని మూడు అగ్ర దేశాల కలయిక అవసరార్థ బంధమే. బలపడాలంటే చేయాల్సింది చాలా ఉంటుంది. రష్యాకిది వర్తించదు. ఆ దేశంతో మన మైత్రి చిరకాలమైనది. దాన్ని నీరుగార్చడానికి అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ అదేమంత తగ్గలేదు. కానీ పెరగాల్సినంత పెరగలేదు. ఈ మూడు దేశాల కలయికా ఈ దేశాల ప్రయోజనాలు నెరవేర్చుకోవటంతోపాటు ఈ ప్రాంత శాంతికీ, సుస్థిరతకూ, అభివృద్ధికీ దోహదపడుతుంది. దీని మూలాలు ప్రచ్ఛన్న యుద్ధానంతర పరిణామాల్లో ఉన్నాయి. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యాగా మిగిలిపోయిన 1990వ దశకంలో అప్పటి ఆ దేశ ప్రధాని యెవ్జెనీ ప్రైమకోవ్ ఈ భావనకు రూపుదిద్దారు. ఈ వ్యూహాత్మక కలయిక భవిష్యత్తులో అమెరికా ఆధిపత్యా నికి చెక్ పెట్టగలదని భావించారు. మంత్రుల స్థాయిలో, నిపుణుల స్థాయిలో పలు సమావేశాలు కూడా జరిగాయి. కానీ 2020లో గల్వాన్ ఉదంతం అనంతరం నిలిచిపోయాయి. చైనాతో మనకున్న సరిహద్దు తగాదాలూ, చేదు అనుభవాలూ తక్కువేం కాదు. నిజానికి మొన్నటికి మొన్న ఎస్సీవో మంత్రుల స్థాయి భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో పెహల్గామ్ ప్రస్తావన లేకపోవటాన్ని నిరసిస్తూ మన దేశం దానిపై సంతకం చేసేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఎస్సీవో తన తప్పు దిద్దుకోవటం శుభæపరిణామం.ఈ త్రైపాక్షిక కలయికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు గమనిస్తే ఆయనెంత కలవరపడుతున్నారో తెలుస్తుంది. ఇది ‘ఏకపక్ష విపత్తు’గా పరిణమిస్తుందట! ఆ దేశ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సరేసరి. రోజుకో రకంగా నోరు పారేసు కుంటున్నారు. మన దేశం సంయమనంతో అమెరికా 50 శాతం సుంకాలు ఎంత అర్థరహితమో చెప్తూ వస్తోంది. తాను తప్ప దిక్కులేదనే స్థితికి చేరిన అమెరికా కళ్లు తెరిపించటం ప్రస్తుతావసరం. దేశాల మధ్య పటిష్ఠమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న కాలంలో తనకు అనుకూలమైన నిబంధనలతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను అమల్లోకి తెచ్చింది అమెరికాయే. పర్యవనసానంగా ఎడాపెడా ఆర్జించి, స్వీయ తప్పిదాల కారణంగా సంక్షోభంలో పడిన ఆ దేశం అందుకు ఇతరులను నిందిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. భారత–చైనా సంబంధాలపై రెండు వైపుల నుంచీ వెలువడిన ప్రకటనలు ఒకే స్వరంతో ఉండటం గమనించదగ్గది. ఇరు దేశాలూ భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కారని ఆ ప్రకటనలు గుర్తుచేశాయి. చైనాతో మన సంబంధాలు బాగున్నప్పుడు పాకిస్తాన్ అణిగిమణిగి ఉండటం మొదటినుంచీ కనబడుతోంది. ఇకపై కూడా అదే జరిగితే మంచిదే. ఏదేమైనా పెత్తందారీ పోకడలు చెల్లబోవని చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. కాకపోతే భారత్–చైనా–రష్యా కలయిక వికసించాలంటే ఎంతో చిత్త శుద్ధితో, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది. అది జరగాలని ఈ మూడు దేశాలు మాత్రమే కాదు... ప్రపంచమే కోరుకుంటోంది. -
ముగ్గురు మొనగాళ్లు రెడీ.. ట్రంప్ కు మాస్టర్ స్కెచ్
-
పుతిన్ చర్చలకు రావాలి: ఈయూ చీఫ్
బ్రస్సెల్స్: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తక్షణమే నిలిపేయాలని, శాంతి చర్చలకు ముందుకు రావాలని యురోపియన్ యూనియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్‌డెర్ లేయన్ కోరారు. ఉక్రెయిన్ రక్షణ, భద్రత, శాశ్వత స్థిరత్వానికి యూరప్ నుంచి మద్దతను ఆమె పునరుద్ఘాటించారు. కీవ్‌పై రష్యా వైమానిక దాడుల్లో 21 మంది మరణించడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్ చర్చలకు రావాలి, సామాన్య పౌరులు, మౌలిక సదుపాయాలపై రష్యా నిరంతర దాడులను యూరప్ సహించబోదన్నారు. ఉక్రెయిన్‌కు విశ్వసనీయ భద్రతా హామీలతో పాటు న్యాయమైన, శాశ్వత శాంతి నెలకొల్పేందుకు తమ మద్దతు ఉంటుందని నొక్కి చెప్పారు. అందుకోసం ధైర్యవంతులైన ఉక్రేనియన్ సాయుధ దళాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తామన్నారు. దాడిని అంతకుముందు ఎక్స్‌లోనూ ఆమె ఖండించారు.‘రష్యా కనికరంలేని బాంబు దాడుల్లో మరో రాత్రి పీడకలలా మిగిలింది. అమాయకుల ప్రాణాలను బలిగొంది. ఇది కీవ్‌లోని మా ప్రతినిధి బృందాన్ని కూడా తాకింది. మా ప్రతినిధి బృందం సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. పౌర మౌలిక సదుపాయాలపై రష్యా తన విచక్షణారహిత దాడులను వెంటనే ఆపాలి. న్యాయమైన, శాశ్వత శాంతి కోసం చర్చలలో చేరాలి’ అని ఆమె ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ దాడులను బ్రిటన్ సైతం ఖండించింది. శాంతి చర్చలకు ఎదురుదెబ్బగా అభివర్ణించింది. -
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. ఎగసిపడుతున్న మంటలు
కైవ్: రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతం శనివారం తెల్లవారుజామున భీకర దాడికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. డ్నిప్రో, పావ్లోగ్రాడ్లలో కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు. ⚡#Russia 🇷🇺 #Ukraine 🇺🇦 #Dnipro in #Ukraine's #Dnipropetrovsk region is under heavy drone attack. There have been reports of massive fires after several #Russian drone attacks in the city. pic.twitter.com/rhyiDm1tVt— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) August 7, 2025‘ఈ ప్రాంతం భారీ దాడుల్లో చిక్కుకుంది. పేలుళ్లు శబ్ధాలు వినిపిస్తున్నాయి’అని గవర్నర్ సెర్గి లైసాక్ ‘టెలిగ్రామ్’లో పేర్కొన్నారు. రష్యాలోని క్రాస్నోడార్ క్రైలోని చమురు శుద్ధి కర్మాగారాన్ని ఉక్రేనియన్ డ్రోన్లు ఢీకొట్టిన అనంతరం రష్యా ఈ దాడులకు పాల్పడింది. 🇷🇺🇺🇦 As a result of a massive attack in the Dnipropetrovsk region, enterprises and infrastructure facilities were damaged. pic.twitter.com/EsqnMJWpZI— King Chelsea Ug 🇺🇬🇷🇺 (@ug_chelsea) August 7, 2025‘కైవ్ ఇండిపెండెంట్’ నివేదిక ప్రకారం, స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయని, డ్రోన్లు ఎగురుతున్నాయని స్థానికులు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. చమురు శుద్ధి కర్మాగారంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నట్లు ఆ వీడియోల్లో కనిపిస్తోంది. 🇷🇺 ⚡️🇺🇦 #BreakingNews: A massive drone attack is underway in Dnipro, Dnipropetrovsk region.Many drones have impacted within the city, and massive fires have been reported. pic.twitter.com/z1lG07RIGA— #Insider (@insider_der) August 6, 2025 -
ఏనుగును ఎలుక ఢీకొడుతున్నట్టుగా ఉంది
వాషింగ్టన్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌ను శిక్షించాలనే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ఆ దేశానికే ఎసరు తెస్తున్నాయి. భారత్ పట్ల అమెరికా వైఖరిపై ట్రంప్ ప్రభుత్వం సొంత ఆర్థిక వేత్తలనుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. భారత్‌పై అమెరికా సుంకాల చర్యలు ఏనుగును ఎలుక పిడికిలితో ఢీకొట్టినట్టుగా ఉందని అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వ్యక్తిలా అమెరికా వ్యవహరిస్తోందని, కానీ తనను తానే దహించుకుంటోందని విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు బ్రిక్స్ కూటమిని పోషిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. బ్రిక్స్‌ను విజయవంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా అమెరికా అభివృద్ధి చేస్తోందని గుర్తు చేశారు. కాగా, భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై రష్యా టుడేకు ఇచి్చన ఇంటర్వ్యూలో వోల్ఫ్ మాట్లాడారు. బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తోంది.. ‘భూమిపై అతిపెద్ద దేశం భారత్. సోవియట్ యూనియన్ కాలం నుంచే అమెరికాతో భారత్‌కు బలమైన సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ మర్చిపోతున్నారు. భారత్‌కు అమెరికా మార్కెట్ గేట్లు మూసేస్తే.. ఆ దేశం తన ఎగుమతులను విక్రయించడానికి ఇతర దేశాలను వెదుక్కుంటుంది. చమురును అమ్ముకునేందుకు రష్యా ఇతరత్రా మార్కెట్లను సిద్ధం చేసుకున్నట్లే.. భారత్ కూడా ఇతరత్రా మార్కెట్లను తయారు చేసుకోగలదు. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ కూటమిలోని చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాల వాటా 35 శాతం దాకా ఉంది. జీ7 దేశాల జీడీపీ వాటా 28 శాతమే. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలు బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తాయి. పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారుస్తాయి’అని వోల్ఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా దిగుమతిదారులకూ ప్రమాదం.. ‘ప్రస్తుతం భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో వస్తువులు, సేవలను చౌకగా పొందుతున్న కంపెనీలు అమెరికాకు తరలే అవకాశమే లేదు. అందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించవు. ఇప్పటికే అమెరికాలో కొత్త ఉద్యోగాలు లేవు. సుంకాల వల్ల అమెరికన్ ఎగుమతిదారులూ రిస్‌్కను ఎదుర్కొంటున్నారు. వాళ్లు విదేశీ మార్కెట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాకు ట్రిలియన్ డాలర్ల అప్పులున్నాయి. విదేశీ అప్పులపై అమెరికా ఇంకా ఎంతకాలం నిలువగలదనేది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా అప్పులపై వడ్డీల భారం పెరిగిపోతుంది. తద్వారా అమెరికా బలహీనపడుతుంది’అని వోల్ఫ్ విశ్లేషించారు. బ్రిక్స్ దేశాలకు బెదిరింపులు.. బ్రిక్స్ పది దేశాలతో కూడిన సమూహం. ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యుదేశాలుగా ఉన్నాయి. ఈ కూటమి పాశ్చాత్య ఆర్థిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. అయితే.. ట్రంప్ అనేక సందర్భాల్లో బ్రిక్స్‌ను వేగంగా అంతరించిపోతున్న ఒక చిన్న సమూహంగా తోసిపుచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరిలో ఏకంగా బ్రిక్స్ చచి్చపోయిందన్నారు. డాలర్‌ను కాదని ఉమ్మడి కరెన్సీని సృష్టించడానికి ప్రయతి్నస్తే.. సభ్య దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు. -
భారత్–రష్యా క్రూడ్ బంధం!
భారత్ పాలిట వరంలా మారిన రష్యా చమురు అంతర్జాతీయంగా సెగలు పుట్టిస్తోంది. రష్యా చమురుతో ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ సాకుతో మరో 25 శాతం అదనపు సుంకాలను కూడా వడ్డించింది. మరి నిజంగా ఈ చౌక క్రూడ్‌తో భారతీయ వినియోగదారులు లాభపడుతున్నారా? అంటే సమాధానం కాదనే వస్తోంది. ప్రైవేటు రిఫైనరీ కంపెనీలకు మాత్రం లాభాల పంట పండుతోంది. ఇదే అమెరికా, భారత్ మధ్య ఇప్పుడు ‘క్రూడ్’ యుద్ధానికి దారితీస్తోంది!! రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా దేశీయ ప్రవేటు రంగ రీఫైనలరీ దక్కించుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్‌తో సహా అనేక దేశాలు ఆంక్షలు, నిషేధం విధించడంతో రష్యా చమురుపై ’మాస్కో రాయితీ’ ప్రకటించింది. ఈ క్రమంలో చమురు దిగుమతి బిల్లు తగ్గించుకునేందుకు భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. 2002 వరకు కేవలం 1 శాతంగా ఉన్న రష్యా చమురు దిగుమతులు 2025 ఆగస్టు చివరి నాటికి గణనీయంగా 37 శాతానికి చేరుకుంది. గత నాలుగేళ్లుగా భారత్ సగటున రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంటోది. ఇందులో 40 శాతానికి పైగా ప్రయివేటు రంగ రిఫైనరీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయరా ఎనర్జీల సొంతం కావడం విశేషం! మిగులు లాభాలన్నీ ప్రయివేటు రిఫైనరీలకే.... రష్యా దిగుమతుల్లో అధిక వాటా పొందుతున్న ప్రయివేటు రిఫైనరీలు చమురు శుద్ధి చేసి ఉత్పత్తులను యూరప్, ఆసియా దేశాలకు భారీగా ఎగుమతి చేసి గణనీయంగా లాభాలు గడించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలో జీ7+ దేశాలు భారత్, టరీ్కలోని ఆరు రిఫైనరీలు నుంచి 18 బిలియన్ డాలర్లు (21 బిలియన్ డాలర్ల) విలువైన చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నాయని ఫిన్లాండ్కు చెందిన సీఆర్ఈఏ థింక్‌ట్యాంక్ నివేదిక తెలిపింది. ఇందులో దాదాపు 9 బిలియన్ యూరో ఉత్పత్తులు రష్యా ముడి చమురుతో శుద్ధి చేసినవేనని సీఆర్ఆఏ పేర్కొంది. ఈ ఆరు రిఫైనరీలలో రిలయన్స్ చెందిన జామ్‌నగర్ శుద్ధి కార్మాగారం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి జీ7+ దేశాలకు ఎగుమతి అయిన 12 బిలియన్ యూరోల్లో 4 బిలియన్ యూరోలకు పైగా రష్యా చమురుతోనే ఉత్పత్తి చేసినవని సీఆర్ఈఏ వివరించింది. ఈ జాబితాలో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ మంగళూరు రిఫైనరీ నాలుగో స్థానంలో, నయరా ఎనర్జీ వడినార్ రిఫైనరీ ఆరోస్థానంలో ఉన్నాయి. దీనికి తోడు ‘భారత్‌లో వ్యాపార కంపెనీలు రష్యా ఆయిల్‌ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను (దాదాపు రూ.1.35 లక్షల కోట్లు) పొందాయి’ అంటూ అమెరికా ఆరి్థక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ’రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా ప్రైవేటు కంపెనీలు దక్కించుకుంటున్నాయి’ అనే వాదనలను మరింత బలపరిచాయి. ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయంభారత్కు ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయం సమకూరుతోందని కస్టమ్స్ గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో 84.1 బిలియన్ డాలర్లు, 2024–25లో 63.3 బిలియన్ల డాలర్లు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. ఇదే ఆరి్థక సంవత్సరంలో 24 బిలియన్ డాలర్లు డిజిల్ ఎగుమతులు, 15 బిలియన్ డాలర్ల జెట్ ఫ్యూయల్ ఎగుమతులు జరిగాయి. రష్యా ఉరల్స్ క్రూడ్ నుంచి నాణ్యమైన డీజిల్, జెట్ ఫ్యూయెల్ వంటి రవాణా ఇంధనాలు ఎక్కువగా తయారవుతున్నాయి. 2024–25లో 15.5 బిలియన్ డాలర్ల గ్యాసోలిన్, ఇతర చమురు ఉత్పతుల ఎగుమతులు జరగడం గమనార్హం.ఎగుమతుల్లో రిలయన్స్ టాప్ ఈ ఏడాది భారత ఇంధన దిగుమతుల్లో వాల్యూమ్ పరంగా రిలయన్స్, నయారా ఎనర్జీలు రెండింటి వాటా 81 శాతంగా ఉన్నాయి. ఎగుమతుల్లో అధిక భాగం డిజిల్, జెట్ ఫ్యూయెల్ ఉన్నాయి. రోజుకు 9.14 లక్షల బ్యారెళ్ల ఎగుమతితో 71 శాతం వాటా రిలయన్స్‌దే. రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ జూన్‌లో రోజుకు 7.46 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంది. ఇక్కడి నుంచి తన మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 1.36 మిలియర్ల బీపీడీలో 67 శాతం ఎగుమతి చేసింది. మిగిలిన ఇంధన ఎగుమతుల్లో రోజుకు 1.18 లక్షల బ్యారెళ్లతో నయరా ఎనర్జీ, ఓఎన్జీసీకి చెందిన మంగళూరు రిఫైనరీ రోజుకు 1.14 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.పరోక్ష సబ్సీడీలతో పీఎస్‌యూల లాభాలకు గండి ప్రభుత్వరంగ రిఫైనరీ రష్యా చౌక చమురు మిగులు లాభాలకు కేంద్ర ప్రభుత్వ ‘స్థిర ఇంధన ధరల విధానం’ చిల్లుపెడుతోంది. రష్యా ఆయిల్ ఇప్పటికీ బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ కంటే 2–3 డాలర్లు, యూఈఏ బ్యారెల్ క్రూడాయిల్ కంటే 5–6 డాలర్ల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. సాధారణంగా ఇది రీఫైనరీ సంస్థలకు దండిగా లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే ప్రభుత్వ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు రష్యా చమురు కొనుగోలు మిగులు లాభాలను పెట్రోల్, డిజిల్, ఎల్పీజీ తదితర పరోక్ష సబ్సీడీలకు వినియోగిస్తున్నాయి. గల్ఫ్, అమెరికా క్రూడాయిల్ ధరలతో పోలిస్తే, 2022 జనవరి నుండి 2025 జూన్ వరకు రష్యా డిస్కౌంట్ ధరలతో ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ దాదాపు 15 బిలియన్ డాలర్లు ఆదా చేసిందని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2023లో రష్యా రికార్డు స్థాయి డిస్కౌంట్‌తో భారత్ దాదాపు 7 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేసింది. ఈ మొత్తంలో సింహభాగం రిలయన్స్, నయారా కంపెనీలకే దక్కింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సూసైడ్ బోట్ తో ఉక్రెయిన్ నిఘా నౌకను పేల్చేసిన రష్యా
-
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. అతిపెద్ద నౌక ధ్వంసం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా ఉక్రెయిన్ నావికా దళానికి చెందిన అతి పెద్ద నిఘా నౌక సింఫెరోపోల్‌ను రష్యా ధ్వంసం చేసింది. సముద్ర డ్రోన్ సాయంతో నౌకను రష్యా విజయవంతంగా కూల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ నావికాదళానికి చెందిన అతి పెద్ద నిఘా నౌక సింఫెరోపోల్ దశాబ్ద కాలంగా ఉక్రెయిన్ నేవీకి సేవలు అందిస్తోంది. ఇందులో ఉక్రెయిన్‌కు సంబంధించిన నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాగా, సింఫెరోపోల్‌ను టార్గెట్ చేసిన రష్యా నౌకను ధ్వంసం చేసింది. సముద్ర డ్రోన్ సాయంతో రష్యా దళాలు.. నౌకను ధ్వంసం చేశాయి. అయితే, సముద్ర డ్రోన్‌ను రష్యా విజయవంతంగా ఉపయోగించడం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.ఇక, నౌకపై దాడి కారణంగా అందులో ఉన్న రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ నిఘా విభాగానికి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు.. రష్యా దాడిని ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. ఈ దాడిలో ఒక సిబ్బంది మరణించగా, అనేక మంది గాయపడ్డారని ఉక్రేనియన్ నేవీ ప్రతినిధి చెప్పుకొచ్చారు. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్ దళాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇక, రష్యాడ్రోన్ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 🚨⚡️ BREAKING: Russia Unleashes Kamikaze Sea Drones.An unmanned suicide boat from the Black Sea Fleet has just sent the Ukrainian reconnaissance ship "Simferopol" to the bottom at the mouth of the Danube.A new era of naval warfare is here.. 🇷🇺🔥 pic.twitter.com/OnOiHR0LsJ— RussiaNews 🇷🇺 (@mog_russEN) August 28, 2025 -
కైవ్‌పై రష్యా క్షిపణి దాడి.. 21 మంది మృతి
కైవ్: వరుస దాడులతో ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై రష్యా జరిపిన దాడిలో 21 మంది మృతిచెందారు. ఈ దాడిలో పలు ఆయుధ కర్మాగారాలు దెబ్బతిన్నాయి. రాత్రివేళ డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి రష్యా ఈ దాడులకు తెగబడింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం క్షిపణుల దాడులతో కైవ్ నగరం దద్దరిల్లింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని యూరోపియన్ యూనియన్ మిషన్, బ్రిటిష్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంతో సహా కైవ్‌లోని మొత్తం 33 ప్రదేశాలలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఈ సైనిక ఆపరేషన్ పలు ఆయుధ కర్మాగారాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. కీవ్‌పై దాడులను మాస్కో ధృవీకరించింది. 🚨🇺🇦 KYIV – RUSSIAN ATTACK#BREAKING | Aug 28, 2025Russia launched a large-scale drone & missile attack on Kyiv overnight, killing more than a dozen people and wounding many, while damaging multiple buildings.📰 Source: Fox News#Ukraine #Russia #Kyiv #MissileStrike #Conflict pic.twitter.com/yMlq4oUgWY— NewsX - 24/7 (@NewsX_24_7) August 28, 2025కాగా ఉక్రెయిన్ సైన్యం ఇన్కమింగ్ డ్రోన్లను, క్షిపణులను అడ్డుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 13 ప్రదేశాలలో రష్యా విజయవంతంగా తన దాడులను కొనసాగించింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు దాడులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ దాడులలో ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ఉక్ర్‌స్పెక్‌సిస్టమ్స్ కార్యాలయం ధ్వంసమయ్యింది. 2014లో నెలకొల్పిన ఉక్ర్‌స్పెక్‌సిస్టమ్స్‌లో మానవరహిత వైమానిక వాహనాలను తయారు చేస్తుంటారు.కాగా టర్కిష్ రక్షణ సంస్థ బేరక్తర్ నిర్వహిస్తున్న కైవ్‌లోని ఒక ప్లాంట్‌ను కూడా రష్యా ధ్వంసం చేసింది. -
డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా
-
సుంకాలపై ‘సమష్టి’ పోరు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మన దేశంపై ఉన్న అదనపు సుంకాల భారాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాలకూ బుధ వారం నుంచి మరో 25 శాతం చేరింది. క్షణానికో రకంగా, రోజుకో విధంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడైన ట్రంప్ చివరికి ఏం చేస్తారోనన్న ఉత్కంఠ అందరిలో ఉండేది. మూర్ఖత్వం విచక్షణను ఎరుగదు. తన ఆదేశాలను ధిక్క రిస్తూ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయటం వల్లే ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా చెప్పుకొంటోంది. మనల్ని మించి ముడిచమురు కొంటున్న చైనాకు ఆ తర్కం ఎందుకు వర్తించదో ఇంతవరకూ అది సంజాయిషీ ఇవ్వలేకపోయింది. అసలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే తెరవెనకుండి యూరప్ దేశాల ద్వారా ఉక్రెయిన్ను రష్యాపై ఉసిగొల్పిందీ, ఆ యుద్ధానికి అంకు రార్పణ చేసిందీ తానే. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా... లేక ఇక వెనక్కు తగ్గాలని ఉక్రెయిన్ను కోరటం ద్వారా శాంతికి దోహదపడాల్సింది కూడా తానే. కానీ ఆ పని చేయకపోగా ఆ యుద్ధం కొనసాగటానికి మనమే బాధ్యులమంటూ దబాయిస్తోంది. దాన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణిస్తూ వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో నోరు పారేసుకున్నారు. మనం చమురు కొనటం వల్లే రష్యా యుద్ధం కొనసాగుతోందని తప్పుడు భాష్యానికి దిగారు. ఏ రకంగా చూసినా ప్రపంచంలో సకల అవలక్షణాలకూ బాధ్యత వహించక తప్పని అమెరికాయే రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి కూడా కర్త, కర్మ, క్రియ. ఏకకాలంలో భిన్న సూచనల్ని పంపి అవతలి పక్షాన్ని గందరగోళపరచటం అమెరికాకు అలవాటైన విద్య. ఈ దబాయింపులకు ముందురోజే ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ‘చివరకు రెండు దేశాలూ ఒక్కటవుతాయి’ అని మాట్లాడారు. అందరికన్నా ముందు ఏప్రిల్‌లోనే వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలెట్టిన భారత్... మే 1 లేదా జూన్ 1 కల్లా దానిపై సంతకాలు చేయాల్సిందని ఆయన చెబుతున్నారు. చర్చించు కుని ఒప్పందంపై సంతకాలు చేస్తారు తప్ప, తమకు నచ్చినట్టు రాసుకుని, ఒప్పందం పూర్తయినట్టేనని చెబితే అంగీకరించేదెవరు? ఇలాంటివి మాఫియా సామ్రాజ్యాల్లో చెల్లుబాటవుతాయి. నాగరిక ప్రపంచంలో సాధ్యపడదు. భారత్–అమెరికా సంబంధాలు ఆదినుంచీ సంక్లిష్టమైనవే. ఇందుకు అమెరికా తనను తానే నిందించుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాకిస్తాన్‌కు సాయపడుతూ, మనల్ని చీకాకు పరిచేందుకు నిరంతరం ప్రయత్నించేది. ఆ దశ దాటి ఇరు దేశాల మధ్యా స్నేహం చిగురించి, దృఢమైన బంధంగా మారి దశాబ్దాలు దాటుతోంది. కానీ పాకిస్తాన్‌ను దువ్వటం ఆపలేదు. ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడల్లా మన దేశం డిమాండ్ చేస్తే తాత్కాలికంగా ఆర్థిక సాయం ఆపటం లేదా ఆయుధ సామగ్రి ఎగుమతి నిలిపినట్టు కనబడటం, ఆ తర్వాత పునరుద్ధరించటం అమెరికా దురలవాటు. మొన్నటికి మొన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యపై ఒక్క మాట మాట్లాడటానికి నోరు పెగలని ట్రంప్, భారత్–పాక్ ఘర్షణల్ని ఆపానని స్వోత్కర్షకు పోవటం ఇప్పటికీ ఆపలేదు. సరిగదా పాక్ ఆర్మీ చీఫ్‌కు ఘన ంగా మర్యాదలు చేశారు. కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు నుంచి రావాలన్న ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించటం, తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులనూ అనుమతించాలన్న ఒత్తిడికి అంగీకరించకపోవటం ట్రంప్ కడుపుమంటకు కారణం. కానీ ముడిచమురు సాకు చెబుతున్నారు. భారత్‌లో 46 శాతం మంది సాగు రంగంపై ఆధారపడతారు. అమెరికాలో ఇది ఒక్క శాతమే. ఆ ఒక్కశాతం కోసం దేశ జనాభాలో సగంమంది ఆధారపడే రంగాన్ని ధ్వంసం చేయాలట! ఏమైతేనేం తాజా సుంకాల భారం మన దేశంనుంచి పోయే 66 శాతం ఎగుమతులపై తీవ్ర ప్రభావమే చూపగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఈ ఏడాది, వచ్చే ఏడాది మన వృద్ధిపై 0.8 శాతం కోత పడవచ్చంటున్నారు. రత్నాభర ణాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలు, స్టీల్, రొయ్యలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనీ, ఈ రంగాల్లో అనిశ్చితి ఏర్పడుతుందనీ అంచనా. లక్షలాదిమంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు కలగవచ్చు కూడా. ఈ ఎగుమతుల్ని వేరే దేశాలకు మళ్లించగలిగితే నష్టాన్ని తగ్గించుకోగలం. అదృష్టవశాత్తూ మనది ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు. అందుకే దేశ ప్రజానీకమంతా ఒక్కటై పట్టుదలగా ఇక్కడి ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తే ఈ గండాన్ని గట్టెక్కడం కష్టం కాదు. -
ఉక్రెయిన్ పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా
-
పుతిన్ కాదు.. ఇది ‘మోదీ యుద్ధం’.. భారత్‌పై అమెరికా అక్కసు
వాషింగ్టన్: భారత్‌ను టార్గెట్ చేసిన అమెరికా మరోసారి మన దేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ ప్రధాన కారణం అంటూ వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవారో సంచలన ఆరోపణలు గుప్పించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమెరికా సుంకాల నుంచి భారత్ తప్పించుకోవాలంటే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం వెంటనే ఆపేయాలని సూచనలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవారో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు భారత్ ప్రధాన కారణం. రష్యా నుంచి రాయితీపై భారత్ ముడిచమురు కొనుగోలు చేయడంతో యుద్ధంలో పుతిన్ దూకుడుగా వ్యవహరించారు. భారత్ అలా కొనుగోలు చేయకపోతే యుద్ధం ఇంత కాలం కొనసాగేది కాదు. ఇది మోదీ యుద్ధం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేయాలి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్యలకు భారత్ కూడా సహకరించాలి. మోదీ తీరు విచిత్రంగా ఉంది. రష్యా విషయంలో మోదీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. Trump Adviser Peter Navarro: Everyone in America loses because of India buys oil from Russia. US taxpayers have to send money for Modi’s war in UkraineAnchor (confused): You mean Putin’s war? Navarro: No I mean Modi’s war! pic.twitter.com/HVE8EO7W8g— Shashank Mattoo (@MattooShashank) August 28, 2025ఇరుదేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే.. భారత్ కూడా అందుకు సహకరించాల్సి ఉంటుంది. భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును నిలిపివేస్తే.. 25 శాతం సుంకాలను పునరుద్ధరిస్తారా? అని ప్రశ్నించగా.. భారత్ ఆ దిశగా చర్యలు తీసుకున్న తర్వాతి రోజు నుంచే 25శాతం సుంకాలు అమలుచేస్తామని స్పష్టంచేశారు.అంతకుముందు కూడా నవారో భారత్‌పై సంచలన కామెంట్స్ చేశారు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొంటూ భారత్ ‘లాభదాయకమైన పథకం’ నడుపుతోందని ఆరోపించారు. భారత్‌ను సుంకాల ‘మహారాజు’గా అభివర్ణించారు. భారత్‌తో అమెరికా వ్యాపారం వల్ల అమెరికన్లపై పడే నికర ప్రభావం ఏంటి?. అమెరికా వ్యాపారాన్ని, అమెరికన్ కార్మికులను ఇది దెబ్బతీస్తుంది. అమెరికా నుంచి పొందుతున్న డబ్బును రష్యన్ చమురు కొనుగోలుకు ఉపయోగిస్తున్నారు. ఆ డబ్బును రష్యా ఆయుధాల తయారీకి వాడి ఉక్రేనియన్లను చంపుతోంది. జరుగుతున్న రక్తపాతంలో తన పాత్రను గుర్తించడానికి భారత్ ఇష్టపడటం లేదు. ప్రస్తుతం భారత్ చేస్తున్నది శాంతిని కోరుకునేలా లేదని, యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. -
భారతీయులను రిక్రూట్ చేసుకోవడానికి రష్యా కంపెనీల ఆసక్తి
మాస్కో: రష్యాలోని కంపెనీలు, ముఖ్యంగా యంత్రాలు, ఎల్రక్టానిక్స్ రంగాలకు చెందిన కంపెనీలు భారతీయులను రిక్రూట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ అన్నారు. వచ్చిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ, వస్త్ర రంగాల్లో పనిచేస్తున్నారని, కానీ యంత్రాలు, ఎల్రక్టానిక్స్ విభాగాల్లో భారతీయులకు డిమాండ్ బాగా ఉందని వెల్లడించారు. ఆ దేశీయ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. రష్యాలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎక్కువ మంది భారతీయులు వస్తుండటంతో కాన్సులర్ సేవల పనిభారం పెరుగుతోందన్నారు. అమెరికా, కెనడా, యూకే సహా పాశ్చాత్య దేశాల్లో వలసలపై పెరుగుతున్న అణిచివేత మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రష్యాలో పెరుగుతున్న భారతీయ కార్మీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కాన్సులర్ సైతం తమ సేవలను విస్తరింపజేస్తోందన్నారు. రష్యాలో పెరుగుతున్న భారతీయుల సంఖ్యరష్యాలో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులు, వివిధ రంగాల్లోని నిపుణులు, కార్మీకులు గణనీయమైన కార్మిక లోటును పూడ్చుతున్నారు. భారత రాయబార కార్యాలయం ఇచ్చిన డేటా ప్రకారం ప్రస్తుతం రష్యాలోని భారతీయుల సంఖ్య 14,000 గా ఉంది. అదనంగా, భారత సంతతికి చెందిన దాదాపు 1,500 మంది ఆఫ్ఘన్ జాతీయులు ఉన్నారు. ఇక ఇటీవలి కాలంలో రష్యాలోని వైద్య, సాంకేతిక సంస్థల్లో సుమారు 4,500 మంది భారతీయ విద్యార్థులు చేరారని తెలుస్తోంది. వారిలో 90 శాతం మంది దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 20 విశ్వవిద్యాలయాలు/సంస్థలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మిగిలిన వారు ఇంజనీరింగ్, ఏరోనాటికల్ డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్, రవాణా సాంకేతికత, మేనేజ్మెంట్, వ్యవసాయం, బిజినెస్/ఫైనాన్స్ మేనేజ్మెంట్ వంటివి చదువుతున్నారు. -
ఉక్రెయిన్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యుద్ధ గాయాలను నయం చేస్తోంది
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దెబ్బతీసిన మానసిక వేదన నుంచి బయటపడేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ట్రామా రిలీఫ్, ధ్యానం,శ్వాసాభ్యాస కార్యక్రమాలు వేలాది మంది సైనికులు, స్థలచ్యుతులు, పిల్లలకు కొత్త ఆశను అందిస్తున్నాయి.సైనికులకు నిర్వహించిన మొదటి శిక్షణ శిబిరాలు హృదయాన్ని కలచివేశాయి. “వారి చేతులు, కాళ్లు గాయాలతో నిండిపోయాయి. కళ్లలో భయం, ఖాళీతనం స్పష్టంగా కన్పించాయి” అని ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయుడు తెలిపారు. అయితే శ్వాసాభ్యాసాలు నేర్చుకున్న తర్వాత సైనికులు “ప్రశాంతత, భద్రత, స్థిరత్వం”ను అనుభవించినట్లు చెప్పారు.ఉక్రెయిన్ సైనిక నాయకత్వం గురుదేవ్ పనిని అధికారికంగా గుర్తించింది. బెటాలియన్ కమాండర్ స్వయంగా గురుదేవ్‌కు గౌరవ పురస్కారం అందజేస్తూ, “బాంబులు పడితే మేము పోరాడాము, కానీ మాలోని ఖాళీతనం, కోపం, ద్వేషం గురించి ఎవరూ మాట్లాడలేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుల తర్వాత మా జీవితాలు మారాయి. గాయాలతో ఉన్నవారే ఇప్పుడు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తున్నారు” అని పేర్కొన్నారు.అంతేకాక, నాయకత్వ శిక్షణలు కూడా సైన్యానికి సహాయపడ్డాయి. “అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఈ శిక్షణ పెంచింది” అని సైన్యం అభినందించింది.2014 నుండి సైన్యంలో మోరల్ అండ్ సైకాలజికల్ సపోర్ట్ విభాగంలో పనిచేస్తున్న నటాలియా ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. చిన్న గుంతల్లో దాక్కున్న సైనికుల్లో ఒకరు భయంతో కదలలేకపోయిన పరిస్థితిని వివరించారు. “అప్పుడు అతనికి విజయ శ్వాస గుర్తొచ్చింది. అది అతని ప్రాణం మాత్రమే కాకుండా మరో నలుగురి ప్రాణాలను రక్షించింది” అని ఆమె తెలిపారు.2022 నుండి ఇప్పటి వరకు 8,000 మందికి పైగా సైనికులు, స్థలచ్యుతులు, ఆక్రమిత ప్రాంతాల పిల్లలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందారు. వాలంటీర్లు ప్రమాదాలను లెక్క చేయకుండా సేవ చేస్తున్నారు. “అత్యవసరంగా అవసరమైన వారికి తోడుగా ఉండటం మాకు గౌరవం” అని ఒక ఇన్స్ట్రక్టర్ చెప్పారు.యుద్ధం ఎన్నో ప్రాణాలు, కలలను తీసుకుపోయినా, గురుదేవ్ అందిస్తున్నది శాంతి, ఆశ, తిరిగి నిర్మించుకునే శక్తి. “శాంతి అంటే సంఘర్షణ లేకపోవడం కాదు, కరుణ ఉనికిలో ఉండడం” అని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో చీకటి నడుమ వెలుగుకి మార్గం చూపుతున్న ఆ కరుణ ఇప్పుడు వేలాది హృదయాలకు ఆధారమవుతోంది. -
భారతీయులకు రష్యా శుభవార్త
మాస్కో: భారతీయులకు రష్యా శుభవార్త చెప్పింది. పాశ్చాత్య దేశాలు వలస నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో.. రష్యా వీసా నిబంధనల్ని సడలించింది. భారతీయులకు ఊతం ఇచ్చేలా వీసా నిబంధనలు మార్చింది. తద్వారా రష్యాలోని పలు రంగాల్లో అనుభవజ్ఞులైన భారతీయులకు డిమాండ్ పెరిగింది. రష్యాలోని ప్రముఖ సంస్థల్లో ఎలక్ట్రానిక్స్,మెషినరీ విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇదే విషయాన్ని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ స్థానిక మీడియాకు వెల్లడించారు.రష్యాకు మ్యాన్‌పవర్.. భారతీయుల్లో నైపుణ్యం ఉంది.వాటికి అనుగుణంగా రష్యా వీసా నిబంధనలు మార్చింది. తద్వారా స్థానిక రష్యా కంపెనీలన్నీ భారతీయుల్ని నియమించుకుంటున్నాయి. ఇప్పటికే అధికమొత్తంలో రష్యాకు భారతీయులు వచ్చారు. వచ్చిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ, వస్త్ర రంగాలలో ఉన్నారు.వీటితో పాటు మెషినరీ, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో భారతీయుల డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు.రష్యాకు భారతీయల వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రాయబార కార్యాలయం తన సేవల్ని విస్తరించేందుకు మరింత ప్రయత్నిస్తుందని చెప్పారు. పాస్‌పోర్ట్‌లు అప్డేట్,అప్రూవల్ వంటి సేవలు వేగవంతం అవుతాయని తెలిపారు. -
ట్రంప్‌కు బిగ్ షాకిచ్చిన భారత్
మాస్కో: రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఎట్టకేలకు భారత్ తన వైఖరిని బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో భారత్ కౌంటరిచ్చింది. ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటామని స్పష్టం చేసింది. దేశీయ ప్రయోజనాలకే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని కుండబద్దలు కొట్టింది.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ తాజాగా రష్యా ప్రభుత్వం వార్తా సంస్థ టాస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటాం. ఎక్కడ చౌకగా దొరికితే ఇండియన్ కంపెనీలు అక్కడే కొనుగోలు చేస్తాయి. దేశీయ ప్రయోజనాలకే కాపాడుకోవడానికే ఢిల్లీ ప్రాధాన్యం ఇస్తుంది. భారత్‌లోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రత మా లక్ష్యం. ఇతర దేశాల మాదిరిగానే రష్యాతో సహకారంలో భాగంగా చమురు మార్కెట్, ప్రపంచ చమురు మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడింది.🚨 BIG STATEMENT Indian Envoy to Russia, Vinay Kumar, SLAMS US move to impose 25% tariffs on INDIA for buying Russian oil.— Calls it ‘Unfair, Unreasonable & Unjustified.’— Says Indian companies will KEEP buying oil from Wherever they get the best deal. pic.twitter.com/yyiHjhpkFA— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) August 25, 2025భారత్ విషయంలో వాషింగ్టన్ నిర్ణయం అన్యాయం, అసమంజసమైనది. భారత్ ప్రభుత్వం ఎల్లప్పుడు దేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. రష్యాతో అమెరికా సహా పలు యూరప్ దేశాలు వ్యాపారం చేస్తున్నాయి. వాటిపై మాత్రం ఎందుకు సుంకాలు విధించలేదు అని ప్రశ్నించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్.. రష్యా ముడి చమురు కొనుగోలుకు 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. భారత్.. రష్యా ముడి చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణను భారత్ తిరస్కరించింది. -
భారత్‌పై సుంకాలు.. ట్రంప్ టార్గెట్ అదే: జేడీ వాన్స్
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా సుంకాల విధింపుపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను అడ్డుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌పై ఒత్తిడి పెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదని వాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాన్స్ మాట్లాడుతూ..‘రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవడం ఈ చర్యల లక్ష్యం. అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం తర్వాత ఏర్పడిన అడ్డంకులు ఉన్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదు. రష్యాపై ట్రంప్ బలమైన ఆర్థిక ఒత్తిడిని తెచ్చారు.ఎలా అంటే.. భారత్‌పై అదనపు సుంకాలు విధించడం ద్వారా , చమురు నుంచి వచ్చే రష్యా ఆదాయాలు తగ్గిపోతాయి. రష్యా దాడులను ఆపివేస్తే, దానిని మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేర్చవచ్చని, కానీ దాడులు కొనసాగితే, అది ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే సందేశాన్ని ఇవ్వడానికి ట్రంప్ ప్రయత్నించారని అన్నారు. ఉక్రెయిన్‌పై బాంబు దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంభించారు. భారత్ ద్వితీయ సుంకాలను విధించడం కూడా ఇందులో భాగమని తెలిపారు.మరోవైపు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా విమర్శలు చేసింది. భారత వస్తువులపై ట్రంప్ సుంకాన్ని 50 శాతానికి రెట్టింపు చేయడం వల్ల భారత్-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదే సమయంలో రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేసే చైనాపై ట్రంప్ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో, ట్రంప్ తీరును పలు దేశాల నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
రష్యా అణు ప్లాంట్‌పై దాడి
మాస్కో: రష్యాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన కస్క్ అణు విద్యుత్కేంద్రంపై శనివారం రాత్రి డ్రోన్ దాడి జరిగింది. ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపించింది. దేశవ్యాప్తంగా పలు ఇంధన, విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి దాడులకు దిగిందని మండిపడింది. ‘‘కస్క్ అణు కేంద్రంపై దాడిలో ఒక ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింది. మంటలను వెంటనే ఆర్పేశాం. ఒక రియాక్టర్లో ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. అయితే అణు ధారి్మకత ముప్పేమీ లేదు’’ అని పేర్కొంది. ‘‘ఉస్త్–లుగాలోని ఇంధన ఎగుమతుల టెర్మినల్‌పై దాడితో మంటలు చెలరేగాయి. అక్కడ 10 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశాం. దేశవ్యాప్తంగా 95 డ్రోన్లు, మిసైళ్లను ధ్వంసం చేశాం. రష్యా ప్రయోగించిన 48 డ్రోన్లను అడ్డుకున్నాం. డొనెట్స్్కలో రెండు గ్రామాలను స్వా«దీనం చేసుకున్నాం. పశ్చిమ ఉక్రెయిన్‌లో భీకర పోరు కొనసాగుతోంది’’ అని పేర్కొంది. ఓడిపోబోం: జెలెన్స్కీ ‘‘ఉక్రెయిన్ బాధిత దేశం కాదు, పోరాటయోద్ధ. రష్యాతో పోరులో ఇంకా గెలవకున్నా, ఓడిపోయే ప్రసక్తి మాత్రం లేదు’’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. రాజధాని కీవ్‌లో ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఉక్రెయిన్ స్వాతంత్య్ర పరిరక్షణకు రాజీలేని పోరు కొనసాగిస్తామన్నారు. కెనడా ప్రధాని కార్నీ ఆదివారం కీవ్‌లో జెలెన్స్కీతో మంతనాలు జరిపారు.త్వరలో భారత్‌కు జెలెన్స్కీ!ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. శనివారం ఆయనతో ఫోన్ సంభాషణ సందర్భంగా ప్రధాని మోదీ ఈ మేరకు ఆహ్వానించారు. పర్యటన తేదీ త్వరలోనే ఖరారయ్యే అవకాశముందని ఉక్రెయిన్ పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ పర్యటన కీలక మైలురాయిగా మారనుందని అభిప్రాయపడింది. -
రష్యాకు రెండు వారాల గడువిస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు రెండు వారాల అల్టిమేటం ఇచ్చారు. అప్పటి వరకు తగు రీతిలో స్పందించకుంటే రష్యాపై ఆంక్షలు విధించాలా లేదా సుంకాలతో బాదాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌లోని అమెరికాకు చెందిన ఎల్రక్టానిక్ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి దాడి నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ఇటీవల అమెరికాలోని అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయంటూ ప్రకటించిన ట్రంప్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రష్యా దాడితో తాను సంతోషంగా లేనని, పరిస్థితిని మరోసారి సమీక్షిస్తానని ట్రంప్ అన్నారు. తదుపరి చర్యలను రెండు వారాల్లో ప్రకటిస్తానని పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య సంక్షోభం తెలివితక్కువైంది. వారానికి 7 వేల మంది, అంతకంటే ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పోరాటాన్ని ఆపాలనుకుంటున్నా, అయితే, ఇప్పుడది కష్టతరంగా మారింది’అని ట్రంప్ అన్నారు. -
పోర్టు నుంచి పర్వతారోహణకు
ఆయనో పోర్ట్ అధికారి.. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించాలనుకున్నాడు.. దీనిని సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ మిషన్ అని కూడా అంటారు.. ఇందులో తొలి మిషన్‌గా మౌంట్ ఎల్బ్రూస్ అధిరోహణను పరిగణిస్తారు.. ఈ నెల 7న ముంబై నుంచి ఈ సాహస యాత్రకు బయలుదేరాడు. ఆయనే నగరానికి చెందిన ప్రణయ్. దాదాపు పదేళ్లుగా ముంబై పోర్ట్ అథారిటీలో సీనియర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ 79 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో పాటు పోర్టు జెండాను అధికారికంగా ప్రణయ్‌కు అందించారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ముంబై పోర్టులో ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న హైదరాబాదీ బి.ప్రణయ్ రెడ్డి పోర్టు సెక్టార్లోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. రష్యాలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించి ఆ సెక్టార్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. రష్యన్ కాలమానం ప్రకారం ఈ నెల 16 ఉదయం 5.50 గంటలకు శిఖరాగ్రానికి (5,642 మీటర్లు) చేరుకున్న ఆయన 79వ స్వాతంత్ర దినోత్సవానికి గుర్తుగా తన బృందంతో కలిసి 79 మీటర్ల జాతీయ జెండాలను ఎగరేశారు. దీంతో పాటు దీన్‌దయాళ్ పోర్టు అథారిటీ జెండాను అక్కడ ఎగరేశారు. ఈ మేరకు ప్రణయ్ రెడ్డికి రష్యా ప్రభుత్వం గునిసెస్ ప్రపంచ రికార్డుకు అవసరమైన సర్టిఫికెట్ జారీ చేసింది. View this post on Instagram A post shared by Anand Bansode (@ianandbansode) వారి సహకారం కీలకం..‘దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ, ముంబై పోర్ట్ అథారిటీలతో పాటు నా తల్లిదండ్రులు బి.కృష్ణారెడ్డి, బి.నాగమణి, నా భార్య బి.అపర్ణ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. వారందరి సహకారం లేకుంటే ఈ విజయం సాధించలేకపోయే వాడిని.’ రష్యా– జార్జియా సరిహద్దు సమీపంలో కాకసస్ పర్వతాల్లోని ఎ్రల్బస్ సముద్ర మట్టానికి 18,510 అడుగుల (5,642 మీటర్లు) ఎత్తులో ఉంటుంది. ఇది రష్యాలోనే కాదు.. యూరప్‌లోనే ఎత్తైన అగ్నిపర్వతం. – ప్రణయ్ రెడ్డి∙ -
వారిద్దరినీ కలపడం చాలా కష్టమైన పని: ట్రంప్
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో పుతిన్-జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ముందుగా కలుస్తారో లేదో చూడాలనుకుంటున్నాను. పుతిన్-జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం.. నూనె వెనిగర్‌ను కలపడం లాంటి కష్టమైన ప్రక్రియ. వారిద్దరూ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఒకవేళ సమావేశం జరగకపోతే, ఎందుకు సమావేశం కాలేదో అందుకు గల కారణాలను తెలుసుకుంటానని అన్నారు. శాంతి చర్చలకు రష్యా ఒప్పుకోని క్రమంలో మాస్కో మరోసారి భారీ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు.Q: “How long will you give Putin?”Trump: “A couple of weeks. We’re going to figure this out. It takes two to tango… In the meantime, people continue to die.”Trump is NEVER going to hold Putin accountable. Ever.pic.twitter.com/TusMVxEIXk— Republicans against Trump (@RpsAgainstTrump) August 22, 2025అయితే ఇరు దేశాలూ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రజలను చంపుకుంటూనే ఉన్నారు. ఇది చాలా మూర్ఖత్వం. యుద్ధం వల్ల వారానికి 7,000 మంది చనిపోతున్నారు. నేను ముందు 5,000 అన్నాను కానీ ఇప్పుడు 7,000 మంది వారానికి చనిపోతున్నారు. అందులో ఎక్కువ మంది సైనికులే ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్‌లో ఒక అమెరికన్ కర్మాగారం దెబ్బతిన్నట్టు వచ్చిన వార్తపై స్పందిస్తూ ట్రంప్ స్పందించారు. రష్యా దాడుల విషయంలో తాను సంతోషంగా లేనని చెప్పారు. తాను ఏడు యుద్ధాలను పరిష్కరించానని చెప్పారు. మొత్తం 10 యుద్ధాలు ఆపిన తాను ఉక్రెయిన్- రష్యా యుద్ధం విషయంలో అస్సలు సంతోషంగా లేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్- పాక్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఇండియా–పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని తాను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. -
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
వాషింగ్టన్: భారత్ టార్గెట్‌గా అమెరికా మరోసారి సంచలన విమర్శలు చేసింది. సుంకాల్లో భారత్‌ను ‘మహారాజ్’ అని పేర్కొంటూ వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారత రిఫైనరీలు యుద్ధానికి ఆజ్యం పోస్తూ డబ్బు సంపాదిస్తున్నాయని అన్నారు.వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీటర్.. ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాలు విధించడంలో భారత్.. ‘మహారాజ్’గా ఉంది. భారత్ సుంకాలు ఎక్కువగా ఉంటాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్‌కు చెందిన రిఫైనరీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. రష్యా ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది.White House Trade Adviser Peter Navarro on India: "Nonsense that India needs Russian Oil""Profiteering by Indian refiners""India has Maharaja tariffs""Road to peace runs thru New Delhi" pic.twitter.com/w64a9nRg2P— Sidhant Sibal (@sidhant) August 21, 2025భారత్‌కు రష్యన్ చమురు అవసరం అనేది అర్ధం లేనిది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ తన పాత్రను గుర్తించాలని కోరుకోవడం లేదు. భారత్ మనకు వస్తువులను అమ్మి.. వారు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి మన నుండి వచ్చే డబ్బును ఉపయోగిస్తున్నారు. రష్యన్లు ఆ డబ్బును మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేయడానికి, ఉక్రెయిన్ ప్రజలపై దాడులు చేయడానికి అది వాడుకుంటున్నారు అని ఆరోపించారు. భారత నాయకత్వాన్ని నేను విమర్శించాలని నేను అనుకోవడం లేదు. మోదీ గొప్ప నాయకుడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర ఏంటో చూడండి.. మీరు ప్రస్తుతం చేస్తున్నది శాంతిని పునరుద్ధరించడానికి కాదు.. అది యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రష్యా పట్ల భారత్ తన వైఖరి మార్చుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఆగని రష్యా, ఉక్రెయిన్ దాడులు
-
కాస్త తగ్గిన పుతిన్? ట్రంప్, జెలెన్స్కీ ‘నో’ కామెంట్స్
నాలుగేళ్ల తర్వాత అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు భేటీ అయ్యారు. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగానే ఈ సమావేశం జరిగిందన్నది తెలిసిందే. అయితే ఆ మీటింగ్ సారాంశమేమీ ఇప్పటిదాకా బయటకు రాలేదు.ఆగస్టు 15వ తేదీన మూడు గంటలపాటు రహస్య మంతనాలు చేసిన ఈ ఇరుదేశాల నేతలు.. సంయుక్త మీడియా సమావేశంలో తాము చెప్పాలనున్నది చెప్పి తలోదారి వెళ్లిపోయారు. దీంతో భేటీ సంతృప్తికరంగా జరగలేదనే విశ్లేషణలు నడిచాయి. అయితే తాజాగా ఆ భేటీలో ఉక్రెయిన్‌కు పుతిన్ చేస్తున్న(అలస్కాలో చేసిన) డిమాండ్లు ఏంటో ప్రస్తావిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్ష కార్యాలయం ‘క్రెమ్లిన్’ వర్గాలు వెల్లడించిన ఆ డిమాండ్లను పరిశీలిస్తే..డోన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా అప్పగించడంనాటోలో చేరాలనే ఆలోచనను పక్కనపెట్టేయడంపశ్చిమ బలగాల మోహరింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదుఉక్రెయిన్పై ఒత్తిడి తగ్గించిన పుతిన్?వాస్తవానికి ఈ మూడు పాత డిమాండ్లే! మరి కొత్తగా పుతిన్ ఏం చెబుతున్నారంటే.. 2024 జూన్‌లో ఉక్రెయిన్‌కు పెట్టిన కఠినమైన భూభాగాల డిమాండ్లను కొంత మేర తగ్గించినట్టు రష్యా వర్గాలు అంటున్నాయి. పాత డిమాండ్లను పరిశీలిస్తే.. డోనెత్స్క్(Donetsk), లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను పూర్తిగా రష్యాకు అప్పగించాలి. నాటో సభ్యత్వాన్ని త్యజించాలి. పశ్చిమ దేశాల బలగాలు ఉక్రెయిన్‌లో మోహరించకూడదు.కొత్త ప్రతిపాదనల్లో.. ఉక్రెయిన్ డోన్బాస్లో తన నియంత్రణలో ఉన్న భాగాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గాలి. రష్యా జపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాల్లో ప్రస్తుత యుద్ధ రేఖలను నిలిపివేస్తుంది. ఖార్కివ్, సుమీ, డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతాల్లో రష్యా ఆక్రమించిన చిన్న భాగాలను తిరిగి అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం.. డోన్బాస్లో 88%, జపోరిజ్జియా, ఖెర్సన్‌లో 73% రష్యా నియంత్రణలో ఉంది.అయితే.. నాటో విస్తరణపై నిషేధం, ఉక్రెయిన్ సైన్యంపై పరిమితులు, పశ్చిమ శాంతి బలగాల మోహరింపు నిషేధం వంటి పాత డిమాండ్లు మాత్రం కొనసాగుతున్నాయి. అదే సమయంలో.. 2022 ఇస్తాంబుల్ ఒప్పందాలను పునరుద్ధరించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. ఇందులో ఐరాస భద్రతా మండలి నుంచి ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు పొందే ప్రతిపాదన ఉంది.ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. గతంలో ఈ డిమాండ్లను "సరెండర్" (లొంగిపోవడం)గా అభివర్ణించిన తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, రష్యా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వెనక్కి తగ్గే ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు.డోనెత్స్క్, లుహాన్స్క్(Donetsk) కలిపిన డోన్బాస్ ప్రాంతం ఉక్రెయిన్‌కు రక్షణ కోటగా పనిచేస్తుందని జెలెన్స్కీ మొదటి నుంచి చెబుతున్నారు. ‘‘తూర్పు ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గడం అంటే దేశం ఉనికి కోల్పోవడం’’ అని అంటున్నారాయాన. ‘‘ఇది మా శక్తివంతమైన రక్షణ రేఖల అంశం’’ అని కుండబద్దలు కొట్టారు. ఇక.. నాటో సభ్యత్వం.. రాజ్యాంగబద్ధ లక్ష్యమని చెప్పారు. పైగా దీనిని ఉక్రెయిన్‌కు భద్రతా హామీగా భావిస్తున్నారు. నాటో సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు రష్యాకు లేదు అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్, నాటో రష్యా కొత్త ప్రతిపాదనలపై ఇప్పటివరకైతే స్పందించలేదు.అలాస్కాలోని అంకరేజ్ నగరంలో జరిగిన అమెరికా-రష్యా అధ్యక్షులు భేటీ తర్వాత శాంతికి ఉత్తమ అవకాశాలు ఏర్పడినట్టు క్రెమ్లిన్ వర్గాలు అంటున్నాయి. అయితే.. డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం రాజకీయంగా, వ్యూహపరంగా అసాధ్యమైన విషయని పరిశీలకులు అంటున్నారు. రెండు పక్షాలకు అంగీకారయోగ్యంగా లేని షరతులతో శాంతి ప్రతిపాదనలు చేయడం.. ట్రంప్‌కు షో మాత్రమే కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.అస్పష్టతలు & అడ్డంకులుఉక్రెయిన్ డోన్బాస్ను అప్పగించేందుకు సిద్ధంగా ఉందా? అనే అంశంపై రష్యాకు స్పష్టత లేదు.అమెరికా రష్యా ఆక్రమించిన భూభాగాలను గుర్తిస్తుందా? అనే ప్రశ్న కూడా ఇంకా పరిష్కారమవ్వలేదు.జెలెన్స్కీ అధికార బాధ్యతపై పుతిన్ సందేహాలు వ్యక్తం చేశారు, కానీ కీవ్ ఆయనను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా పేర్కొంటోంది.ట్రంప్ పాత్రఉక్రెయిన్ యుద్ధం ముగించి.. తానొక శాంతి కాముకుడిననే విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పుతిన్, జెలెన్స్కీలతో విడిగా భేటీ అయిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్-అమెరికా త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. -
డ్రోన్లు, క్షిపణులతో రెచ్చిపోయిన రష్యా
కీవ్: రష్యా మరోసారి భీకర గగనతల దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బుధవారం రాత్రి ఏకంగా 574 డ్రోన్లు, మరో 40 వరకు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. మూడేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య పరమైన ప్రయత్నాలు ఊపందుకున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలోని పశ్చిమ ప్రాంతాలు లక్ష్యంగా రష్యా చేపట్టిన ఈ దాడుల్లో ఎక్కువగా జనావాసాలకు నష్టం జరిగిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. ఈ ఏడాదిలో రష్యా జరిపిన మూడో అతిపెద్ద డ్రోన్ దాడి, 8వ క్షిపణి దాడి ఇదని వివరించింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు చనిపోగా 15 మంది గాయపడ్డారంది. పశి్చమ దేశాలు అందించిన ఆయుధ సామగ్రి గోదాములు, ఉక్రెయిన్ సైనిక పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. కొన్ని క్షిపణులు హంగరీ సరిహద్దులకు సమీపంలో పడ్డాయని, అమెరికా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ఒకటి ధ్వంసమైందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఫ్లెక్స్ ఫ్యాక్టరీలో 600 మంది పనిచేస్తున్నారన్నారు. వీరిలో దాడి కారణంగా ఆరుగురికి గాయాలైనట్లు వెల్లడించారు. లీవ్ నగరంపై జరిగిన దాడిలో 26 నివాస భవనాలు దెబ్బతిన్నాయన్నారు. -
భారత ఉత్పత్తులకు స్వాగతం.. ఆందోళన అనవసరం
అమెరికా టారిఫ్ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఉత్పత్తులను యూఎస్ దిగుమతి చేసుకోకపోతే రష్యా అండగా ఉంటుందని ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయానికి చెందిన చార్గే డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. భారత వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, రష్యా భారత దిగుమతులను సాధ్యమైనంత వరకు స్వాగతిస్తుందని, దాని గురించి ఆందోళన చెందకండంటూ భరోసానిచ్చారు. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విస్తరణకు ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు.రష్యాతో భారత ఎగుమతులు, దిగుమతుల్లో వ్యాత్యాసం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత 59 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రష్యా మరిన్ని భారతీయ వస్తువులను దిగుమతి చేసుకోవాలనే సంకేతాలను హైలైట్ చేస్తుంది. బాబుష్కిన్ చేసిన ప్రకటన ప్రత్యామ్నాయ మార్కెట్లను కోరుకునే భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.పెరుగుతున్న వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలుభారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన సానుకూలంగా సాగిందని, ఆచరణాత్మక సహకారానికి భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ) కీలక వేదికగా పనిచేస్తుందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఇరుదేశాల నేతలు ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. అధికారికంగా తేదీని ధ్రువీకరించనప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం గురించి ఊహాగానాలు పెరుగుతున్నాయి.చమురు సరఫరాకు అంతరాయం లేదుభారత్తో చమురు వాణిజ్యానికి సంబంధించి అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా ముడి చమురు ఎగుమతులను కొనసాగిస్తుందని బాబుష్కిన్ పునరుద్ఘాటించారు. భారత్ రష్యా చమురుకు అతిపెద్ద వినియోగదారని, రష్యా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారని చెప్పారు. ఏకపక్ష చర్యలు సరఫరా గొలుసులకు విఘాతం కలిగిస్తాయని, ప్రపంచ మార్కెట్లను అస్థిరపరుస్తాయన్నారు.ఆంక్షలు ఉన్నప్పటికీ..రష్యాపై పాశ్చాత్య దేశాలు ఏళ్ల తరబడి ఆంక్షలు విధించినప్పటికీ భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విపరీతంగా పెరిగిందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇరు దేశాల వాణిజ్యం ఏడు రెట్లు అయిందన్నారు. పరస్పర చర్చల ద్వారా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు. భారత్-రష్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే టాప్ 10 చమురు కంపెనీలు -
రష్యాతో వాణిజ్యం.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం
ముడిచమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య అసమతుల్యత పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. వాణిజ్యం, ఆర్థికం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ-టీఈసీ)లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఆర్థిక పరిస్థితులను తక్షణమే పునసమీక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గత నాలుగేళ్లలో వస్తువులపరంగా ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందన్నారు. 2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 నాటికి 68 బిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు. ఏదేమైనా, ఈ వృద్ధి గణనీయమైన వాణిజ్య అసమతుల్యతతో పాటు 6.6 బిలియన్ డాలర్ల నుంచి 58.9 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇది తొమ్మిది రెట్లు పెరిగిందని, దీన్ని అత్యవసరంగా పునసమీక్షించాలని కోరారు.ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంభారత్-రష్యాల మధ్య ప్రత్యేకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ వాణిజ్య అంతరాన్ని పరిష్కరించడమే కాకుండా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు జైశంకర్ రోడ్ మ్యాప్‌ను రూపొందించారు. టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించడం, నిరంతర లాజిస్టిక్స్ అడ్డంకులను పరిష్కరించడం, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్ఎస్టీసీ), ఉత్తర సముద్ర మార్గం, చెన్నై-వ్లాదివోస్తోక్ సముద్ర కారిడార్ వంటి వ్యూహాత్మక వాణిజ్య మార్గాల ద్వారా కనెక్టివిటీని పెంచడం వంటి కీలక ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.చెల్లింపు యంత్రాంగాలను క్రమబద్ధీకరించాలని, భారత్-యురేషియన్ ఎకనమిక్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ)పై చర్చలను వేగవంతం చేయాలని జైశంకర్ సూచించారు. ఆయన ప్రస్తుత పర్యటనలో ఈ ఎఫ్టీఏకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం గమనార్హం. ఈ ప్రయత్నాలు అసమతుల్య వాణిజ్యాన్ని పెంచడానికి సహాయపడటమే కాకుండా 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల సవరించిన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించడానికి చేరువ చేస్తుందని నమ్ముతున్నారు.రష్యా కంపెనీలకు ‘మేక్ ఇన్ ఇండియా’ మార్గాలుశరవేగంగా మారుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని జైశంకర్ రష్యన్ పరిశ్రమలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో పాటు పట్టణీకరణ, భారతీయ వినియోగదారుల పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త వాణిజ్య మార్గాలను తెరతీయాలని చెప్పారు. రష్యన్ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్‌లో చేర్చాలి -
ట్రంప్ ఓవరాక్షన్.. భారత్‌కు రష్యా బంపరాఫర్
మాస్కో: భారత్–రష్యా సంబంధాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా నానాటికీ బలపడుతున్నాయని రష్యా సీనియర్ దౌత్యవేత్త, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బాబుష్కిన్ చెప్పారు. భారత ఉత్పత్తులకు తమ మార్కెట్ ద్వారాలు తెరిచి ఉన్నట్లు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.రొమన్ బాబుష్కిన్ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత హిందీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘ఇక ప్రారంభిద్దాం.. శ్రీగణేషుడే ప్రారంభిస్తున్నాడు’ అని విలేకరులను ఉద్దేశించి చెప్పారు. భారత్–రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసమే మూలస్తంభమని పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికాతోపాటు పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి రష్యా–ఇండియా–చైనా(ఆర్ఐసీ) మధ్య చర్చలు, పరస్పర సహకారాన్ని పునరుద్ధరించుకొనే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.‘మిత్రులను’ అవమానించేందుకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే తప్పేమిటి? దీనిపై పశ్చిమ దేశాలే సమాధానం చెప్పాలి. భారత్ మాకు చాలా ముఖ్యమైన దేశం. భారత్‌కు చమురు సరఫరాను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదు’ అని బాబుష్కిన్ తేల్చి చెప్పారు. దీంతో, అమెరికాకు రష్యా గట్టి సమాధానం చెప్పినట్టు అయ్యింది.భారత్‌కు 5 శాతం రహస్య తగ్గింపుమరోవైపు.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి భారత్ పరోక్షంగా అండగా నిలుస్తోందని ట్రంప్ కన్నెర్ర చేస్తున్న వేళ ముడి చమురు కొనుగోలుపై భారత్‌కు ఐదు శాతం రహస్య తగ్గింపు(డిస్కౌంట్) ఆఫర్ చేస్తున్నట్లు భారత్‌లోని రష్యా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి ఎవ్‌గెనీ గ్రీవా బుధవారం వెల్లడించారు. ఇది వాణిజ్య సీక్రెట్ అని చెప్పడం గమనార్హం. ఈ ఐదు శాతం డిస్కౌంట్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు ఉంటాయన్నారు. రష్యా నుంచి చమురు కొనే భారత వ్యాపారవేత్తలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. చమురు విషయంలో షిప్పింగ్, బీమా సంబంధిత అంశాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగం ఉన్నట్లు తెలిపారు. ఇండియా చమురు అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యానే తీరుస్తోందని ఎవ్‌గెనీ గ్రీవా వివరించారు. బ్యారెల్‌కు 5 శాతం చొప్పున డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇండియా ప్రతిఏటా 250 మిలియన్ టన్నుల ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని, ఇందులో 40 శాతం రష్యా చమురే ఉంటోందని స్పష్టంచేశారు. -
రష్యా చమురుతో భారత సంపన్న కుటుంబాలే లాభపడుతున్నాయి
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా మరోసారి స్పందించింది. ఈ క్రమంలో భారతీయ బిలియనీర్లపై అక్కసు వెల్లగక్కింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఎన్బీసీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఏకంగా ఓ పత్రికలో వ్యాసం రాశారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల్లో భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యాతో కొనసాగుతున్న చమురు వాణిజ్యం.. ఈ కుటుంబాలకే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంక్షలనూ లాభార్జనగా మార్చుకున్నారు అని ఆరోపించారాయన.2022 కంటే ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం కంటే ముందు రష్యా నుంచి భారత్ 1 శాతం కంటే తక్కువ చమురును కొనుగోలు చేసేది. ఇప్పుడది 42 శాతానికి చేరి ఉండొచ్చు. భారత దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు రష్యా ఆయిల్‌ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను(ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు) పొందుతున్నాయి. అందుకే భారత్‌పై సుంకాలను పెంచే ప్రణాళిక రూపొందించాం. ఇవి సెకండరీ టారిఫ్‌లుగా ఉండొచ్చు అని బెసెంట్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో గతవారం ఓ ప్రముఖ పత్రిక కాలమ్‌లో భారతదేశంలోని చమురు వ్యాపారులపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు భారతదేశపు ‘‘బిగ్ ఆయిల్’’ లాబీ లాభాపేక్ష వల్ల జరిగాయని.. దేశీయ అవసరాల కోసం కాదని అందులో పేర్కొన్నారు. ఆ కథనంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించారు. ఇందులో సగం శిక్ష రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించబడనుంది. భారత్ మాత్రం తక్కువ ధర ఉన్న చోట నుంచి చమురు కొనుగోలు చేయడం తమ హక్కు అని పేర్కొంటూ, ఈ అదనపు టారిఫ్‌లను అసమంజసమైనవిగా చెబుతోంది. కానీ.. చరిత్రపరంగా చూస్తే.. భారత్ రష్యా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకోలేదు. ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడేది. కానీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై $60-పెర బ్యారెల్ ధర పరిమితి విధించడంతో.. భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. ఇది అమెరికాకూ తెలుసు. ..ఇక చైనాపై సెకండరీ టారిఫ్‌లు విధించకపోవడానికి ఓ కారణం ఉంది. అది భారత్ కంటే ఎక్కువగా రష్యా చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే 2022 ముందు 13% ఉండగా, ఇప్పుడు 16%కి పెరిగింది. పైగా చైనా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడమే కాకుండా.. విక్రయిస్తోంది కూడా. అందుకే అమెరికా చైనాపై అదనపు టారిఫ్‌లు విధించలేదు అని అన్నారాయన. -
భారత్‌పై సుంకాలు అందుకే.. కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్‌పై సుంకాల విషయమై అమెరికా మరోసారి స్పందించింది. ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహంలో భాగంగానే భారత్‌పై సుంకాల విధించినట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చారు. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలా చేసినట్టు తెలిపారు.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల నేతలతో ట్రంప్ చర్చల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై దాడులు నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్ దృష్టి సారించారు. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకొని ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహం. ఇందులో భాగంగా భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారని అన్నారు. ఇదే సమయంలో భారత్ ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమే అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్- పాక్‌ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని పాత పాటే పాడారు.మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్‌తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చలే తొలి అడుగు అని పేర్కొన్నారు. త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. Breaking:President Trump has put 'sanctions' on India to put 'this war (in Ukraine) to a close' & he 'wants to see this war end' says White House Spokesperson Karoline Leavitt pic.twitter.com/rLLq6aiznT— Sidhant Sibal (@sidhant) August 19, 2025 -
రష్యా వెళ్లిన జై శంకర్
న్యూఢిల్లీ: రష్యాలో మూడు రోజుల పర్యటనకు గాను మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం మాస్కోకు బయలుదేరారు. రష్యాతో కొనసాగుతున్న చిరకాల మైత్రిని మరింత దృఢతరం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని విదేశాంగ శాఖ తెలిపింది. రష్యా నుంచి ముడి చమురు కొంటుందనే సాకుతో భారత్ ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్‌లను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్న నేపథ్యంలో జై శంకర్ చేపట్టిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం జరిగే వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకార రష్యా–చైనా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ 26వ సెషన్‌కు ఆయన సహాధ్యక్షత వహిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రి డెనిస్ మంతురోవ్ సహాధ్యక్షత వహిస్తారంది. వీరిద్దరూ ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేపట్టే భారత పర్యటనకు అవసరమైన కార్యాచరణను రూపొందిస్తారని చెప్పారు. జై శంకర్ అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తోనూ భేటీ అవుతారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం, అందుకు సంబంధించి ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరుపుతారు. ఇతర ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలనూ చర్చిస్తారు. ఇంధన రంగంలో రెండు దేశాల సంబంధాలు కూడా ప్రస్తావనకు వస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది. -
జెలెన్స్కీతో మాట్లాడతా
వాషింగ్టన్: ఉక్రెయిన్ యుద్ధానికి ఆఖరి గడియలు దగ్గర పడిన సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై ఆక్రమణాగ్రహంతో రగిలిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు కాస్తంత మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ పుతిన్ స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపేందుకు అంగీకరించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం ప్రకటించారు. మంగళవారం అమెరికాలో ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థకు ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో ఈ విషయం వెల్లడించారు.‘‘జెలెన్స్కీతో భేటీకి తాను ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నట్లు స్వయంగా పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్లో చెప్పారు. ఖచి్చతంగా జెలెన్స్కీని కలుస్తానని ట్రంప్‌కు పుతిన్ మాటిచ్చారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జెలెన్స్కీతో పుతిన్ భేటీకి సమ్మతి తెలపడం శాంతిస్థాపన బాటలో కీలక ముందడుగు. అయితే జెలెన్స్కీ, పుతిన్ భేటీ అయ్యాక వెంటనే ఇద్దరు మంచి మిత్రులుగా మారతారని నేను అనుకోవట్లేదు. భేటీ జరిగిందంటే ఏకంగా శాంతి ఒప్పందం కుదిరిందని ఇప్పుడే భావించడం తొందరపాటే అవుతుంది. ఎన్నో అంశాలపై స్పష్టతరావాల్సి ఉంది.మరెన్నో అంశాలపై విస్తృతస్థాయి చర్చ జరగాల్సి ఉంది. గత మూడున్నరేళ్ల యుద్దకాలంలో రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు సంయమనంతో మాట్లాడుకున్నదే లేదు. ఈ ధోరణే ఇన్నాళ్లూ రణరంగంలో మరింత రక్తంచిందేలా చేసింది. మరణాలు, మారణహోమాలకు యుద్ధం చిరునామాగా మారింది. కానీ ఇప్పుడు కాస్తంత సుహృద్భావ వాతావరణంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు మాటలు కలిపారు. తొలుత పుతిన్, జెలెన్స్కీ ముఖాముఖి భేటీ ఉంటుంది. ఇది సత్ఫలితాలనిస్తే ఆ తర్వాత ఇరునేతలకు ట్రంప్ జతకూడుతారు. అప్పుడు త్రైపాక్షిక సమావేశం సాకారమవుతుంది’’అని రూబియో అన్నారు. ఇరుపక్షాలకు అనువైన చోటే భేటీ: ట్రంప్ జెలెన్స్కీ, పుతిన్‌లకు అనువైన ప్రదేశంలోనే త్రైపాక్షిక సమావేశం నిర్వహిస్తామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఒక పోస్ట్ పెట్టారు.‘‘సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధానికి విచ్చేసిన విశిష్ట అతిథులతో చక్కని సమావేశం జరిగింది. ఐరోపా సమాఖ్య సభ్యదేశాల అగ్రనేతలతో సంయుక్త భేటీలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం. త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న మా ఉమ్మడి నిర్ణయాన్ని వెంటనే పుతిన్‌కు ఫోన్‌చేసి చెప్పా. ఆయన అందుకు సమ్మతించారు.త్వరలోనే ఈ భేటీ ఉంటుంది. జెలెన్స్కీ, పుతిన్‌కు అనువైన నగరంలోనే తొలుత వాళ్లిద్దరూ సమావేశమవుతారు. ఇది చక్కటి ఫలితాన్నిచ్చాకే నేను వాళ్లతో కలిసి త్రైపాక్షి సమావేశాన్ని నిర్వహిస్తా. ఈ భేటీకి సాకారం చేసేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి రూబియో, నా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ చెమటోడుస్తున్నారు’’అని ట్రంప్ అన్నారు. -
సంధి సాధ్యమేనా?!
పరస్పరం కలహించుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ల మధ్య సంధి కుదర్చటానికీ, సామరస్యం సాధించటానికీ అలాస్కా శిఖరాగ్ర సమావేశానికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అనధికార అధికార ప్రతినిధిగా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోతే కఠినాతికఠినంగా వ్యవహరిస్తామని అలాస్కా సమావేశానికి ముందు హెచ్చరించిన ఆయన... కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని, శాంతి ఒప్పందం కోసం చర్చలు జరగాలని చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం వైట్‌హౌస్‌లో తనను కలిసినప్పుడు సైతం ఇలాంటి సలహాయే ఇచ్చారు. దీన్ని ఏదో మేరకు సరిదిద్ది, ఉక్రెయిన్‌కు కనీస భద్రత గ్యారెంటీనైనా సాధించాలన్న ధ్యేయంతో ఆరుగురు యూరొప్ దేశాల నేతలు ట్రంప్‌తో భేటీ అయ్యారు. అమెరికాతో పాటు రష్యా, ఉక్రెయిన్లు పాల్గొనే త్రైపాక్షిక చర్చలకు సుముఖంగా ఉన్నామని ట్రంప్ చెప్పటం ఉన్నంతలో ఊరటనిచ్చే అంశం. కానీ ట్రంప్ దానికైనా కట్టుబడతారా లేదా... పుతిన్‌ను ఒప్పించగలరా లేదా అన్నది చెప్పలేం. జెలెన్స్కీకి మొన్న ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ఎదురైన చేదు అనుభవాలను నివారించి, ఆయన వెనక యూరప్ దేశాలన్నీ ఉన్నాయని చెప్పటానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడెరిక్ షుల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తదితరులు కలిశారు. కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్నార్థకం. ఉక్రెయిన్‌కు ‘నాటో తరహా’ భద్రత కల్పించటానికి ట్రంప్ అనుకూలమే గానీ అదంతా యూరప్ దేశాలే చూసుకోవాలట. తమ వంతుగా గగనతల రక్షణ విషయంలో సాయంగా నిలుస్తారట! అసలు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఏం చేస్తారనే ఆదుర్దా కన్నా ఆయన నాటో పక్షాన ఉంటారా ఉండరా అనే బెంగ ఎక్కువైంది. జెలెన్స్కీతో మళ్లీ ఆయన లడాయికి దిగితే అటుతర్వాత తాము సైతం మాట్లాడే స్థితి ఉండకపోవచ్చన్న భయంతోనే యూరప్ అధినేతలు వైట్‌హౌస్‌కు వెళ్ళినట్టు కనిపిస్తోంది. కోల్పోయిన భూభాగాల గురించీ, నాటో సభ్యత్వం గురించీ మరిచిపోవాలని తొలుత తనను కలిసిన జెలెన్స్కీకి చెప్పటంతో పాటు యూరప్ దేశాధినేతల ముందు కూడా ట్రంప్ ఆ మాటే అనటం గమనించదగ్గది. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన నాటి నుంచీ పుతిన్ చెప్పిన మాటల్నే ట్రంప్ ఇప్పుడు వల్లిస్తున్నారు. చాలా అంశాల్లో పుతిన్‌కూ, తనకూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన ఇప్పటికే ప్రకటించారు. పుతిన్ దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆక్రమించిన క్రిమియాలో పలు పట్టణాలు, నదులూ, పర్వతశ్రేణులూ ఉన్నాయి. విలువైన పంటభూములున్నాయి. ఇవిగాక మూడున్నరేళ్లకు పైగా సాగుతున్న దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలున్నాయి. వీటిని వదులుకోవటమంటే జెలెన్స్కీకి ఆత్మహత్యా సదృశం. అయినా తమ కోసం ట్రంప్ ఎంతో చేస్తున్నారని ప్రశంసించి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సి వచ్చింది. జెలెన్స్కీకి అంతకన్నా గత్యంతరం లేదు. ఉక్రెయిన్‌కి ప్రస్తుతం అందుతున్న సాయంలో 47 శాతం వాటా అమెరికాదే. జర్మనీ 9, బ్రిటన్ 8, జపాన్ 6 శాతాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కెనడా, నెదర్లాండ్స్, స్వీడన్, ఫ్రాన్స్ వంటివి ఒకటి, రెండు శాతాలకు మించి ఇవ్వడం లేదు. అందుకే జెలెన్స్కీ నోరెత్తలేకపోతున్నారు.అమెరికా గత పాలకుల ప్రాపకంతో ఉక్రెయిన్ను రెచ్చగొట్టి, రష్యాతో గిల్లికజ్జాలకు దిగేలా చేసిన యూరప్ దేశాలకు ఇప్పుడు ఏం చేయాలో పాలుబోని దుఃస్థితి. నెలక్రితం ట్రంప్‌తో మాట్లాడాక అంతా సామరస్యంగా పరిష్కారమైందని, ఉక్రెయిన్ విషయంలో తమను సంప్రదించకుండా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోబోరని యూరప్ దేశాధినేతలు నమ్మారు. అలాస్కా శిఖరాగ్రానికి వారం రోజుల ముందు కూడా వారంతా ట్రంప్‌ను కలిశారు. ఆ భేటీకి జెలెన్స్కీని కూడా తీసుకెళ్లారు. ముందు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాలనీ, ఆ తర్వాతే ద్వైపాక్షికమో, త్రైపాక్షికమో చర్చలుండాలనీ ఆ భేటీలో అందరూ అభిప్రాయపడ్డారు. తాజాగా ట్రంప్ త్రైపాక్షిక చర్చల గురించి మాట్లాడుతున్నా పుతిన్ అందుకు సుముఖంగా ఉంటారా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది. ఆ మాటెలా ఉన్నా అలాస్కా శిఖరాగ్రం భారత్‌కు ఎంతో కొంత మేలు చేసిందని చెప్పాలి. రష్యాపై ఆగ్రహంతో మనపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఆ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు చెబుతున్న మాటకు కట్టుబడి సాధ్యమైనంత త్వరలో త్రైపాక్షిక చర్చలకు ట్రంప్ చొరవ తీసుకుంటే... పుతిన్‌ను ఒప్పిస్తే అది శాంతికి దోహదపడుతుంది. -
ఉక్రెయిన్ను ఇరుకున పెట్టిన పుతిన్.. జెలెన్స్కీతో ట్రంప్ కీలక భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం(అమెరికా కాలమానం ప్రకారం) జెలెన్స్కీతో వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు. పుతిన్‌తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్స్కీ సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలో యుద్ధం ఎలా మొదలైందో ఓసారి గుర్తు తెచ్చుకోవాలని జెలెన్స్కీకి ట్రంప్ సూచించినట్టు సమాచారం. ఇక, శాంతి ఒప్పందానికి పుతిన్.. ట్విస్ట్ ఇస్తూ కీలక ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.డోన్బాస్ ఇచ్చేయండి..డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారవచ్చ అనేది జెలెన్స్కీ ఆందోళనగా కనిపిస్తోంది.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పంపేందుకు ఐరోపా నేతలు భయపడుతున్నారు. ఫిబ్రవరిలో ట్రంప్‌ను కలిసేందుకు అమెరికా వెళ్లిన జెలెన్స్కీకి వైట్‌హౌస్‌లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా చేయొద్దంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఆ భేటీలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి జెలెన్స్కీకి తోడుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తదితరులు పాల్గొంటారు. ఇక, ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య రెండున్నర గంటలకు పైగా జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధానికి తెర!
న్యూయార్క్: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు అమెరికా, ఐరోపా సమాఖ్య చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం స్వీయ సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘రష్యా విషయంలో భారీ పురోగతి సాధించాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఉక్రెయిన్ విషయమై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారని అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ప్రకటించారు. ‘‘ఉక్రెయిన్‌కు నాటో కూటమి తరహాలో అమెరికా, ఈయూ ‘రక్షణ హామీ’ ఇచ్చినా అభ్యంతరం లేదని పుతిన్ చెప్పారు. మొత్తం ప్రక్రియలో ఇదొక కీలక మలుపు. ఇకపై ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించబోమని హామీ ఇచ్చారు. రష్యాతో విజయవంతంగా ఒప్పందం కుదుర్చుకోనున్నాం. నాటో కూటమికి గుండెకాయ అయిన క్లాజ్–5 తరహాలో ఉక్రెయిన్‌కు రక్షణ ఆఫర్ ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. ఈ ప్రయోజనం కోసమే ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు ప్రయతి్నస్తోంది. ఇకపై ఆ అవసరం ఉండదు. ఉక్రెయిన్ నాటోలో చేరొద్దనేదే పుతిన్ ప్రధాన అభ్యంతరం. కనుక ట్రంప్ ఆఫర్ సమస్య పరిష్కారం చూపుతుంది. ప్రక్రియ సజావుగా సాగడానికి సమయం పట్టొచ్చేమో గానీ కచి్చతంగా శాంతి నెలకొంటుంది. మూడున్నరేళ్ల యుద్ధానికి తెర పడుతుంది’’ అన్నారు. 5వ క్లాజ్ ప్రకారం 32 నాటో దేశాల్లో దేనిపై శత్రువు దాడి చేసినా అన్ని దేశాలపై ఉమ్మడి దాడిగా పరిగణించి ప్రతి దాడికి దిగుతాయి.నేడు ట్రంప్–జెలెన్స్కీ భేటీ ట్రంప్ సోమవారం జెలెన్స్కీతో వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు. పుతిన్‌తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్స్కీ సమావేశం అవుతారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫిన్లండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు పాల్గొంటారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ చెప్పారు.డోన్బాస్ ఇచ్చేయండి డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారొచ్చన్నది జెలెన్స్కీ ఆందోళనగా కనిపిస్తోంది. -
మనమంటే మొహం మొత్తిందా?
ఇండియాపై ట్రంప్‌కు మొహం మొత్తిందా? ఆయన తన చేతల ద్వారా అదే విషయాన్ని తెగేసి చెబుతున్నారా? ఆయన మనపై 50% సుంకాలు విధించారు. సుంకాలపై వివాదం పరిష్కారమ య్యేంత వరకూ వాణిజ్య చర్చలను సుప్తావస్థలో పెడుతున్నట్లు ఆయన తెలి పారు. భారతదేశ మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను లెక్క చేయబోనని కరాఖండీగా చెప్పేశారు. రష్యా చమురును కొంటూ, అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు తెస్తోందని ట్రంప్‌కు వాణిజ్య సలహాదారైన పీటర్ నవారో ప్రకటించారు. పుతిన్‌తో ట్రంప్ చర్చలు విఫలమైతే భారత్‌పై సెకండరీ సుంకాలు పెరగ వచ్చని ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ వెల్లడించారు. యూరప్ కూడా భారత్‌పై సెకండరీ సుంకాలు విధించాలని ఆయన కోరారు. అమె రికా స్నేహహస్తం నుంచి భారత్ చేజారిందని ఇవన్నీ సూచిస్తున్నాయా? చైనా, రష్యాలను హెచ్చరించేందుకు భారత్‌ను ట్రంప్ వాడు కుంటున్నారనే అభిప్రాయమూ ఉంది. అది కూడా సంతోషపడదగ్గ అంశం కాదు. మనం ఆనుషంగిక నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మనం ఏమైపోయినా నిజంగానే, ఆయనకు పట్టదు.మరోపక్క, ట్రంప్ పాకిస్తాన్‌తో ప్రేమలో పడినట్లు కనిపిస్తోంది. అదీ మనల్ని సంకటంలో పడేసే సంగతే. ఆయన పాక్‌పై 19% సుంకాలే విధించారు. ఆయన ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను ఉగ్రవాదంపై పోరాటంలో ‘అసాధారణ భాగస్వామి’గా పరిగణి స్తోంది. ‘ఉగ్రవాద సంస్థలను అరికట్టడంలో విజయాలను కొనసా గిస్తున్నందుకు’ అది ఇటీవల పాకిస్తాన్‌ను కొనియాడింది. ట్రంప్... పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్‌ను విందుకు ఆహ్వానించి, చమురును వెలికితీయడంలో పాక్‌కు సాయపడతామని చెప్పారు. నిజం చెప్పా లంటే, ఏదో ఒక రోజున పాక్ నుంచి భారత్ కూడా చమురును కొనుగోలు చేసే రోజు రావచ్చని, ఆయన మనల్ని కవ్వించారు.అంటే, ఆయనకు పాకిస్తాన్ కొత్త ముద్దుగుమ్మగా మారినట్లా? రష్యన్ చమురు ఢిల్లీని చీకాకుపరచే అంశంగా మారడమేకాదు, అది పరిష్కారమయ్యేంత వరకూ భారత్‌తో వాణిజ్య చర్చలు జరి పేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు కనుక మొదట దానిపై దృష్టి కేంద్రీకరిద్దాం. పైగా, జరిమానా కింద మరిన్ని సుంకాలు విధిస్తా మని బిసెంట్ హెచ్చరించారు. సత్యం ఏమంటే, రష్యన్ చమురు కొనేటట్లుగా ఇండియాను బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ‘వాస్తవానికి, ధరపై పరిమితి ఉన్న రేటు వద్ద రష్యన్ చమురు కొనుగోలు చేయాల్సిందిగా మేము (అమెరికా) కోరబట్టే వారు (ఇండియా) కొనుగోలు చేశారు...ఎందుకంటే, చమురు ధరలు పెరగడం మాకిష్టం లేదు. వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు’ అని ఢిల్లీలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి 2024 మే నెలలో చెప్పారు. ట్రంప్ ఈరోజు, తనకు ముందున్న ప్రభుత్వ విధానాన్ని కావాలని ఉపేక్షిస్తూ, ఇండియాను నిందిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ ఆత్మవంచన తేటతెల్లమవుతోంది. రష్యా నుంచి అమెరికా పాలాడియం, యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే, గడచిన ఆరు నెలల్లో ఈ దిగుమతుల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది. రష్యా నుంచి అమెరికా స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నప్పుడు లేని అభ్యంతరం, ఇండియా పట్లనే ఎందుకు? ఇక మూడవ అంశం – ట్రంప్ అసలు ఉద్దేశాలను బయట పెడుతోంది. ఆయన ద్వంద్వ ప్రమాణాలకు ఇది మరో నిదర్శనం. రష్యా చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్న, మూడవ పెద్ద దిగుమతిదారులుగా ఉన్న చైనా, తుర్కియేలను ట్రంప్ హెచ్చరించ లేదు. రష్యన్ చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ, స్లొవేకియా – రెండూ యూరప్ దేశాలు, ‘నాటో’లో సభ్యత్వం ఉన్నవీనూ! కానీ ట్రంప్ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి జపాన్ కూడా దిగుమతి చేసుకుంటున్న సంగతిని ఆయన సమయానుకూలంగా విస్మరిస్తున్నారు. చైనాపై సుంకాల విధింపులో ఇచ్చిన విరామాన్ని ఆయన ఇటీవల మరో 90 రోజులు పొడిగించారు. ఆయన ఢిల్లీపైన మాత్రమే మూడవ కన్ను తెరిచారని స్పష్టమవుతోంది. ఈ సమస్యకు సంబంధించి మరో పార్శ్వం కూడా అంతే కలవరపరుస్తోంది. ‘క్వాడ్’ (ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమె రికా)లోని మిగిలిన మూడు దేశాలతో తనకు అవసరం తీరిపోయిందని ట్రంప్ భావిస్తున్నారని... ఆయన వైఖరి, నడతను బట్టి అర్థం చేసుకోవచ్చా? అదే నిజమైతే, ఇండో–పసిఫిక్ వ్యూహం విషయంలో అమెరికా వైఖరి ఏమిటి? చైనాతో మనకున్న సమస్యల దృష్ట్యా ‘క్వాడ్’ కూటమి మనకు ఊరటనిచ్చిన మాట నిజం. ‘క్వాడ్’ పట్ల ట్రంప్ నిబద్ధత చూపకపోతే, అది మనకు మరిన్ని చిక్కులు సృష్టించవచ్చు.చైనాతో ట్రంప్ ఆర్థిక ఒప్పందానికి వస్తారా? ఊహించడం కష్టం. కానీ, షీ జిన్ పింగ్‌తో శిఖరాగ్ర సమావేశమై ఆయన ఇప్పటికే మాట్లాడుతున్నారు కనుక, అటువంటి దానికి అవకాశం ఉందని పిస్తోంది. చైనాను రాజకీయంగా మరింత మెరుగ్గా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందా అనేది ప్రశ్న. బీజింగ్ ప్రాంతీయ ఆకాంక్షలకు అమెరికా మరింత వెసులుబాటు కల్పిస్తుందా? ఒకవేళ అదే కార్యరూపం ధరిస్తే, చైనాతో సరిహద్దు వివాదంపై అమెరికా మద్దతు మనకు కొనసాగుతుందా? ఈ విషయమై మనం ఎటువంటి వైఖరిని అనుసరించాలన్నది పెద్ద ప్రశ్న? జవాబు కోసం మనం గాభరా పడాల్సిన అవసరం లేదు. మన నుంచి దిగుమతి చేసుకోకపోతే బతకలేమన్నంతగా, అమెరికా మొహం వాచి చూస్తున్నవాటిని మనం ఏమీ అమెరికాకు ఎగుమతి చేయడం లేదు. చైనా వద్ద రేర్ ఎర్త్ ఖనిజాలు, లోహాలు ఉన్నాయి. మనకి లేవు! కనుక, బేరసారాలకి మనకున్న అవకాశం తక్కువ. మనకున్న ఆశ ఒక్కటే! ఉక్రెయిన్‌పై పుతిన్–ట్రంప్ ఒక ఒప్పందానికి రాగలిగితే, అది మనపై విధించిన సెకండరీ ఆంక్షలను ఎత్తివేయడానికి తోడ్పడవచ్చు. అమెరికా దృష్టిలో భారత్ ఇప్పటికీ ఉందని స్కాట్ బిసెంట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అనుకున్నట్లు జరగకపోతే ట్రంప్ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు మనం గురికావాల్సిందే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత్‌కు మరో షాకిచ్చిన అమెరికా.. ట్రంప్ ప్లాన్ అదేనా?
ఢిల్లీ: భారత్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య చర్చల కోసం భారత్‌కు రావాల్సిన అమెరికా బృందం ట్విస్ట్ ఇస్తూ.. తమ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, వారి తదుపరి పర్యటనపై సస్పెన్స్ నెలకొంది.వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంతో భారత్‌పై అమెరికా భారీగా సుంకాల భారాన్ని మోపింది. ట్రంప్ ఇటీవల భారత్‌పై 50శాతం సుంకాలు విధించారు. పాత 25శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదనపు 25% టారిఫ్‌లు ఈ నెల 27ను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సుంకాలు అమలులోకి రాకముందే.. అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపి మధ్యంతర ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.🚨 US trade team CALLS OFF Aug 25–29 Delhi visit for trade talks. pic.twitter.com/TOVBv10nwZ— Beats in Brief 🗞️ (@beatsinbrief) August 16, 2025ఈ క్రమంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఐదు దఫాలు చర్చలు జరిగాయి. ఆరో దఫా చర్చలకు అమెరికా ప్రతినిధులు ఈ నెల 25-29 మధ్య భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ దఫా చర్చల్లో భాగంగా.. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు సంబంధించిన చిక్కుముడులు వీడే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, తాజాగా వారు ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. చర్చలకు సంబంధించిన తదుపరి తేదీలను కూడా వారు వెల్లడించలేదు. దీంతో, మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు ఉంటాయా? లేదా? అనే సందిగ్థత నెలకొంది. ఒకవేళ చర్చలు విఫలమైతే.. భారత్‌పై టారీఫ్‌ల భారం పడే అవకాశం ఉంది. కాగా, భారత్‌పై సుంకాలు విధించాలనే ఆలోచనతోనే ట్రంప్ ఇలా ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా, భారత్‌ను టార్గెట్ చేసి ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ దేశ ప్రజలకు సూచనలు చేశారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ట్రంప్‌తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య చర్చలు సఫలం అవుతాయా? అని అందరూ ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు. -
ట్రంప్-పుతిన్‌ల భేటీపై భారత్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య అలస్కాలో జరిగిన సమ్మిట్‌ను భారత్ స్వాగతించింది. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సుదీర్ఘంగా సాగిన సమావేశాన్ని భారత్ అభినందించింది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న దీర్ఘ కాలిక యుద్ధానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎక్కడైనా శాంతికి తొలి అడుగు పడాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.‘అమెరికా-రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం పురోగతిని భారత్ అభినందిస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు వెళ్లడం మంచి పరిణామం. ఉక్రెయిన్ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) అర్థరాత్రి గం. 12.30 ని.లు దాటాకా ఇరువురి అధ్యక్షుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిపోయింది వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు.కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.మరొకవైపు ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తానని ట్రంప్ తెలిపారు. కానీ ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు ట్రంప్. -
రష్యా చమురుకి భారత్ దూరమైంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్ దూరమైందని ప్రకటించారు. అదే సమయంలో.. భవిష్యత్తులో భారత్‌పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు.అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చలపై భేటీ జరిపిన సంగతి తెలిసిందే. అయితే భేటీకి ముందు విమాన ప్రయాణంలో ది ఫాక్స్‌న్యూస్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అతను(రష్యా అధినేత పుతిన్‌ను ఉద్దేశించి) ఇప్పటికే ఓ క్లయింట్‌ను కోల్పోయారు. అది 40 శాతం కొనుగోళ్లు జరిపే భారత దేశం. చైనా గురించి కూడా తెలిసిందే. ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోంది. ఒకవేళ.. పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు గనుక విధించాల్సి వస్తే.. అది ఆ దేశాల దృష్టిలో చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అందుకే అవసరం అయితే చేస్తాను. అవసరం లేకపోతే ఉండదు’’ అని అన్నారాయన.Trump says he may not impose 25% tariffs on India (to kick in from 27 August) for buying Russian oil..Trump: "They lost oil client India which was doing about 40% of the oil & China's doing a lot, if I did a secondary tariff it would be devastating, if I have to I will, may be… pic.twitter.com/dhyC7RpHNh— Dhairya Maheshwari (@dhairyam14) August 16, 2025అదే సమయంలో.. అలస్కా భేటీ తర్వాత కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాలు గురించి మళ్లీ ఆలోచిస్తానని, రెండు-మూడు వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్ తాజా ప్రకటనపై ఢిల్లీ వర్గాలు స్పందించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో భారత్‌పై ట్రంప్ జులై 30వ తేదీన 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ మిత్రదేశమైనప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని.. పైగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చమురు, ఆయుధాల కొనుగోళ్ల ద్వారా పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో.. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే తాను చెప్పినా కూడా భారత్ రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపలేదంటూ ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం పెనాల్టీ సుంకం విధించారు. దీంతో భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరింది. పెరిగిన ఈ 25 శాతం ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్ 50 శాతం సుంకాలను భారత్ అన్యాయమని పేర్కొంది. సుంకాలను తాము పట్టించుకోబోమని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఎనర్జీ భద్రత, ధరల లాభం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే.. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వెనక్కి తగ్గలేదు. ఆయిల్ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అమెరికా టారిఫ్‌లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ‘‘‘మాకు రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనొద్దనీ కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అలాగే రష్యా చమురు దిగుమతులను పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మేం ప్రయత్నాలు కూడా చేయడం లేదు’’ అని అన్నారాయన. రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు యథాతథంగానే కొనసాగిస్తున్నాయని, జులైలో ఇది రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లుగా ఉంటే.. ఆగస్టులో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లకు పెరిగిందని ఓ నివేదిక వెలువడింది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ట్రంప్ 50 శాతం టారిఫ్‌ల ప్రభావంతో తాత్కాలికంగా కొంత తగ్గినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం.. తదితర సంస్థలు రష్యన్ ఆయిల్‌ను స్పాట్ మార్కెట్ నుంచి కొనడం ఆపేశాయని, రిలయన్స్, నారాయణ ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం దీర్ఘకాలిక ఒప్పందాలకు అనుగుణంగా కొనుగోళ్లను యధాతథంగా జరుపుతున్నాయన్నది ఆ కథనాల సారాంశం. -
అదే జరిగితే భారత్‌కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా
భారత్ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్‌కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్‌పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్‌పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం బ్లూమరాంగ్‌టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్‌పై సెకండరీ టారిఫ్‌లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్ స్పష్టం చేశారు.భారత్ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్‌పై అగ్రరాజ్యం టారిఫ్‌లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్‌న్యూస్‌తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్‌కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్‌ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్‌తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. -
భారత్ వైపు ప్రపంచం చూపు!
ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామం ఈ నెల 6వ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలను మరొక 25 శాతం పెంచి, మొత్తం 50 శాతానికి చేర్చారు. దానితో మోదీ ప్రభుత్వం ఒత్తిడికి గురై రష్యన్ చమురు కొనుగోళ్ళను ఆపటంతో పాటు, వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలో తమ ప్రతిపాదనలకు అంగీకరించగలదన్నది ట్రంప్ ఎత్తుగడ. అనూహ్యమైన రీతిలో ప్రధాని మోదీ అదేరోజు రాత్రి ఎదురుదాడి ప్రారంభించారు.ప్రపంచం కోసం నిలబడగలమా?ట్రంప్ చర్యలను చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా వంటివి మొదటి నుంచి పూర్తిగానో, పాక్షికంగానో వ్యతిరేకిస్తుండటంలో విశేషం లేదు. వీటన్నింటికి భిన్నంగా పెద్ద దేశాలలో ఇండియా ఒక్కటే మొదటి నుంచి అమెరికాతో మెత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఒక పెద్ద వర్ధమాన దేశం అయి ఉండి, ‘బ్రిక్స్’లో ప్రధాన పాత్ర వహిస్తూ, ట్రంప్ చర్యల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా, ప్రతిఘటించకపోవటంపై అంతటా విమర్శలు వినిపించాయి. అటువంటి స్థితిలో మోదీ చేసిన ప్రసంగం, అందులోని భాష, తనలో కనిపించిన దృఢమైన వైఖరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడిక ఆయన భారతదేశం కోసమే గాక, తక్కిన ప్రపంచంతో కూడా కలిసి నిలబడవచ్చుననే ఆశాభావాలు వినవస్తున్నాయి.అదే సమయంలో, ఇల్లలకగానే పండుగ కాదనే పెద్దల హెచ్చరికను గుర్తుంచుకోవలసి ఉంటుంది. వీటికి స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రభావాలు అనేకం ఉంటాయి. అవి వాస్తవంగా భూకంపానికి దారితీయగలవు. స్లో మోషన్లో ఆర్థిక ప్రపంచ యుద్ధాన్ని సృష్టించగలవు. మన ప్రపంచం నిజమైన అర్థంలో రాజకీయంగా, ఆర్థికంగా, ప్రజాస్వామికంగా మారాలంటే, చిరకాలపు అధిపత్య శక్తుల భూమి కింద అటువంటి భూకంపం రావటం అవసరం.కొండ చరియలలో కింది వైపున కేవలం ఒక రాయి కదలికలో మొత్తం చరియలే కూలినట్లు, చరిత్రలో ఒకోసారి చిన్న ఘటనలు పెనుమార్పులకు దారి తీస్తుంటాయి. క్రమంగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక ఆధిపత్యాన్ని తిరిగి శక్తిమంతం చేయదలచిన ట్రంప్, అమెరికన్ కొండచరియలో ఒకొక్క రాయినే తనకు తెలియకుండానే తోసివేస్తున్నారు. ఇప్పుడు ఇండియా రూపంలో ఒక ముఖ్యమైన రాయి తొలగిపోతున్నదనుకోవాలా?ఇండియా దృఢ వైఖరినిజంగానా, లేక ఇది తొందరపాటు మాటా అన్నది ప్రశ్న. ఒకవైపు అమెరికా నాయకత్వాన ఒక శక్తిమంతమైన కూటమి ఉంది. అది బలహీన పడుతున్న మాట నిజమేగాని అవసాన దశకేమీ చేరలేదు. మరొకవైపు భారత్‌తో కూడిన ‘బ్రిక్స్’ దేశాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇది తమ ఆధిపత్యానికి ఎంత ప్రమాదకరం కాగలదో అర్థమైనందువల్లనే ట్రంప్ ‘బ్రిక్స్’పై కత్తిగట్టారు. ఆయన వేర్వేరు దేశాలపై వేర్వేరుగా ప్రకటిస్తున్న ట్యారిఫ్లను, వేర్వేరు పద్ధతులలో సాగిస్తున్న చర్చలను గమనిస్తే, ‘బ్రిక్స్’ దేశాల పట్ల ‘విభజించి పాలించే’ వ్యూహాన్ని అనుసరిస్తున్నటు స్పష్టమవుతుంది.చర్చలోకి వెళితే, మోదీ నాయకత్వాన భారతదేశానికి అమెరికాతో అవసరాలున్నాయి, పేచీలు కూడా ఉన్నాయి. గతకాలపు చిన్నచిన్న పేచీలను అటుంచి ఇప్పుడు ట్యారిఫ్‌లతో, వాణిజ్య ఒప్పందంలోని ప్రతిపాదనలతో పెద్ద పేచీ తలెత్తింది. ఒకవైపు భారతదేశం స్వతంత్ర శక్తిగా గతం కన్నా బలపడుతూ తన భవిష్యత్తు పట్ల దృష్టి మారుతుండటం, మరొకవైపు అమెరికా క్రమంగా బలహీనపడుతూ ఏకధ్రువ ప్రపంచ స్థితి మారుతుండటం గమనించవలసిన కొత్త పరిణామాలు.ఇటువంటిది ఏర్పడినపుడు, వ్యూహాత్మకంగా అగ్రరాజ్యం ఎంతో వివేకంగా, చతురతతో వ్యవహరించాలి. ట్రంప్ నాయకత్వాన అమెరికా అవివేకపు వ్యూహాన్ని అనుసరిస్తున్నందున, ఇండియా వంటి మిత్రదేశంతోనూ సంబంధాలు చెదిరిపోతున్నాయి. అట్లా జరగకుండా ఉండేందుకు మోదీ మొదట గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, ఏమి చేసైనా సరే తన ‘మాగా’ లక్ష్యాలను సాధించాలనే ఒత్తిడుల మధ్య అమెరికా అధ్యక్షుడు– యూరప్, కెనడా, జపాన్, మెక్సికో వంటి ఇతర మిత్ర దేశాలకు వలెనే ఇండియాను కూడా దారికి తెచ్చుకోగలనని నమ్మారు. వాటికీ,భారత్‌కూ మధ్యగల వ్యత్యాసాలను గ్రహించలేకపోయారు. దానితో, ఇంధనం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి... దేశ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం నిలబడక తప్పలేదు. వాస్తవానికి వ్యవసాయ రంగం విషయమై, గాట్ – డబ్ల్యూటీవో చర్చల దశలో ఇండియా ఇతర వర్ధమాన దేశాలతో కలిసి గట్టిగానే నిలబడింది. అదే ఇపుడు కూడా జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోనిది అమెరికా కూటమే!ఆర్థిక భూకంపం రానుందా?ఇంతవరకు బాగున్నది. రాగల కాలపు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. ట్రంప్ తన ధోరణిని మార్చుకుని అంతా సుఖాంతం కావచ్చునా? భారతదేశంతో తగినంత రాజీ పడవచ్చునా? ట్రంప్ స్వభావమేమిటో ఈ సరికి బోధపడింది గనుక ఆయనను నమ్మలేమని ప్రధాని మోదీ తన స్వతంత్ర వైఖరిని కొనసాగించగలరా? మొన్నటి 6వ తేదీ తర్వాత వడివడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో సంప్రతింపులు జరిపి, పుతిన్‌ను ఆహ్వానించి, చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశాలకు వెళ్ళనున్నట్లు ప్రకటించి, అక్కడ జిన్‌పింగ్‌తో సమావేశం జరగవచ్చుననే సంకేతాలు పంపినందున, ఇవన్నీ మునుముందు బ్రిక్స్ వేదికగా కొత్త మార్గాన్ని మరింత దృఢంగా అనుసరించగలమనే సూచనలు కావచ్చునా? అటువంటిది గనుక అయితే, ఆగస్టు 6 నాటి భూ ప్రకంపనలు రాగల కాలపు భూకంపానికి నాంది అవుతాయి. అట్లా జరగాలన్నదే వర్ధమాన ప్రపంచపు కోరిక కావచ్చు కూడా! కానీ అది తేలిక కాదు. ట్రంప్ ప్రతీకారాన్ని తట్టుకునేందుకు సైతం సిద్ధపడవలసి ఉంటుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
భారత్‌పై అమెరికా సుంకాలు.. ఆగమవుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థ: ట్రంప్
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యే వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత్ వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. ఇరు దేశాలవి డెడ్ ఎకానమీ అంటూ గతంలో వ్యాఖ్యానించింది తెలిసిందే. తాజాగా.. భారత్‌పై అమెరికా విధించిన భారీ సుంకాలు రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బలాంటిదని అభిప్రాయపడ్డారు.వైట్‌హౌజ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రష్యా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, అదే సమయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లలతో ఆగమాగమవుతోంది. అదొక విశాలమైన దేశం. అపారమైన సామర్థ్యమూ ఉంది. కాబట్టి తిరిగి తమ దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి’’ అని సూచించారు. ఈ సమయంలో భారత్ ప్రస్తావన తీసుకొచ్చారాయన..‘‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశానికి.. 'మీరు రష్యా నుంచి చమురు కొంటే 50% టారిఫ్ వేస్తాం' అని హెచ్చరించాం. చెప్పినట్లే చేశాం కూడా. ఇది ముమ్మాటికీ రష్యాకు పెద్ద దెబ్బనే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ చేసిన ఈ ఎకానమీ వ్యాఖ్యలపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఇదిలా ఉంటే.. భారత్ అమెరికాకు మిత్రదేశమేనని, వాణిజ్యం మాత్రం సక్రమంగా లేదని చెబుతూ ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలను విధించారు. ఆ సమయంలో రష్యా నుంచి భారత్ చమురు కోనుగోళ్ల నేపథ్యంపైనా ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భారత్ వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో ఇరు దేశాల తమ డెడ్ ఎకానమీలను మరింత దిగజారచుకుంటున్నాయని.. ఆ అంశాన్ని అమెరికా పట్టించుకునే స్థితిలో లేవని అన్నారు. అటుపై భారత్‌పై మరో 25 శాతం పెనాల్టీ టారిఫ్ విధించడంతో ఆ సుంకాలు 50 శాతానికి చేరాయి. అయితే భారత్ ఈ సుంకాలను అన్యాయంగా పేర్కొంది. అదే సమయంలో.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే తాము ముందుకు సాగుతామని స్పష్టం చేసింది.మరో పక్క.. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తానే ఆపుతానంటూ చెబుతూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ కానున్నారు. అయితే తమను చర్చల్లో భాగం చేయకుంటే ఆ చర్చలకు అర్థం ఉండదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ క్రమంలో అలస్కా భేటీలో జెలెన్స్కీకి చోటు ఉంటుందా? లేదంటే ట్రంప్‌తో విడిగా భేటీ అవుతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. #WATCH | Washington, DC | On Russia-Ukraine war and meeting with Russian President Vladimir Putin, US President Donald Trump says, "This could have been a third world war... I thought it was very respectful that the president of Russia is coming to our country, as opposed to us… pic.twitter.com/rrOyuRkFTG— ANI (@ANI) August 11, 2025 -
మోదీకి జెలెన్స్కీ ఫోన్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమ వారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని నగరాలు, గ్రామాలపై జరుగుతున్న రష్యా సైన్యం దాడుల గురించి వివరించారు. కాల్పుల విరమణకు రష్యా సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతికి చొరవ చూపాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశం సందర్భంగా వ్యక్తిగతం భేటీ కావాలని జెలెన్స్కీ, మోదీ నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోదీతో సంభాషణ అనంతరం జెలెన్స్కీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, ఉక్రెయిన్ మధ్య ద్వైపాకిక్ష సహకా రంతోపాటు దౌత్య సంబంధాల్లో పురోగతిపై చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఘర్షణకు తెరప డాలని, సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అందుకు భారత్ సహకారం అవసరమని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌కు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నందుకు ప్రధాని మోదీకి జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొ ద్దంటూ భారత్‌కు అమెరికా చేసిన హెచ్చరికల అంశం కూడా జెలెన్స్కీ, మోదీ మధ్య చర్చకు వచ్చింది. భారత్ చెల్లిస్తున్న డబ్బులతో రష్యా సైన్యం తమపై దాడులు చేస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోదీ సైతం ‘ఎక్స్’లో ప్రతిస్పందించారు. ఉక్రెయిన్– రష్యా మధ్య శాంతికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. -
తొలి అంతరిక్ష వివాహం: భూమ్మీద వధువు..అంతరిక్షంలో వరుడు..
22 ఏళ్ల క్రితం ఇంచుమించు ఇదే రోజున అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సందర్భం ఎదురైంది. ఒక కొత్త పోకడకు నాంది పలికింది. అంతరిక్షంలో వివాహం అన్న ఊహే వింతగా ఉన్నా..దాన్ని నిజం చేసుకుంది ఓ జంట. సరిగ్గా ఆగస్టు 10ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని అసాధారణమైన మైలురాయిని నమోదు చేసుకుంది ఆ జంట. ఆ దంపతులు ఎవరంటే..వారే రష్యన్ వ్యోమగామి యూరి మాలెన్‌చెంకో(Yuri Malenchenko), ఎకటెరినా డిమిత్రివ్(Ekaterina Dmitriev) దంపతులు. వ్యోమగామి యూరి మాలెన్ చెంకో అమెరికా టెక్సాస్‌లో ఉండే తన గర్ల్‌ఫ్రెండ్‌ని డిమిత్రివ్ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని సరికొత్త మైలురాయిని సృష్టించాడు. డిమిత్రివ్ హుస్టన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా అంతరిక్ష నియంత్రణ మధ్య ఉపగ్ర హుక్ అప్ ద్వారా తన ప్రియుడు వ్యోమగామి మాలెన్చెంకోని వివాహమాడింది. సరిగ్గా ఆగస్టు 10, 2003న ఈ జంట వివాహం జరిగింది. మాలెన్ చెంకో తన అధికారిక అంతరిక్ష సూట్ బో టైను ధరించగా, హుస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో డిమిత్రివ్ సంప్రదాయ వివాహ దుస్తుల్లో వేచి చూస్తోంది. యూరి దూరంగా ఉన్నందునా ఆమె అక్కడ అతడి కటౌట్ బోర్డుతో దర్శనమిచ్చింది. వారిద్దరిని దగ్గర చేసేది వీడియో కాల్ కమ్యూనికేషన్. నిజానికి భూమ్మీద 200 మంది అతిధుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. అయితే మాలెన్‌చెంకో అంరిక్షకేంద్రంలో గడిపే సమయం పొడిగించడంతో..వారు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి మరొక మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు. డిమిత్రివ్ మాలెన్‌చెంకో కార్డ్‌బోర్డు కటౌట్‌తో ఫోటోలకు ఫోజులిస్తూ..డేవిడ్ బోవి పాటకు స్టెప్పులేసింది. ఇక మాలెన్ చెంక్తో పాటు ఉన్న మరో వ్యోమగామి కీ బోర్డుపై వివాహ మార్చ్‌ను ప్లే చేశాడు. అంతేగాదు వీడియో కాల్ సాయంతో తన కాబోయే భర్తకు ముద్దుపెట్టి మరి ప్రపోజ్ చేసింది. ఈ సుదూర వివాహం కంటే ముందు నుంచే ఈ జంట సుదూరంగానే రిలేషన్లో ఉండటానికి అలవాటుపడ్డారు. నిజం చెప్పాలంటే ఇలా అంతరిక్షంలో పెళ్లి చేసుకునే అదృష్టం ఈ జంటకే లభించిందని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ జంటలా మరేవ్వరూ అంతరిక్షంలో వివాహం చేసుకోకుండా నిషేధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టులో వివాహం అనంతరం కొన్ని నెలలకు మాలెన్‌చెంకో భార్యని కలిసేందుకు ఇంటికి తిరిగి వచ్చాడు.(చదవండి: పది కిలోలు బరువు తగ్గిన భారత్‌పే సహ వ్యవస్థాపకుడు..ఆ రెండు సూత్రాలే కీలకం..!) -
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేస్తే పెనుభారమే!
భారత్ తన చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశంలో ఉపయోగిస్తున్న చమురులో ఏకంగా 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఇందులో ప్రధాన వాటా రష్యాదే. రష్యా నుంచి చౌకగా ముడిచమురు లభిస్తోంది. ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేయడానికి, 50 శాతం సుంకాలు విధించడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడమే కారణం. ఒకవేళ రష్యా నుంచి ముడిచమురు కొనడం ఆపేస్తే భారత్‌పై మోయలేని భారం పడడం ఖాయం. అది దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రతికూలంగా మార్చేయగలదు. రష్యా చమురును వద్దనుకుంటే ఇండియా ఆయిల్ దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుందని ఎస్బీఐ ఒక నివేదికలో తేల్చిచెప్పింది. 2026లో 9 బిలియన్ డాలర్లకు, 2027లో 12 బిలియన్ డాలర్లకు చేరుతుందని వెల్లడించింది. చమురు కోసం పూర్తిగా అరబ్ దేశాలపైనే ఆధారపడితే విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అంతిమంగా ఆ భారం మోయాల్సింది ప్రజలేనన్న సంగతి తెలిసిందే. 1.7 శాతం నుంచి 35.1 శాతానికి.. భారత్ 2022 నుంచి రష్యా నుంచి ముడిచమురును చౌక ధరకే కొంటోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా చమురు ధరపై పరిమితిని నిర్దేశించాయి. దాంతో రష్యా తన చమురును ఇండియాకు విక్రయిస్తోంది. దీనివల్ల ఇండియాకు ఎనలేని మేలు జరుగుతోంది. చమురు బిల్లుల భారం చాలావరకు తగ్గిపోయింది. మన దేశానికి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో తొలి స్థానం రష్యాదే. 2020లో ఇండియా చమురు అవసరాల్లో రష్యా వాటా కేవలం 1.7 శాతం ఉండేది. ప్రస్తుతం అది ఏకంగా 35.1 శాతానికి చేరడం గమనార్హం. 2025లో 245 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు దిగుమతి చేసుకోగా, ఇందులో రష్యా వాటా 88 మిలియన్ మెట్రిక్ టన్నులు. ధరలు 10 శాతం పెరిగే అవకాశం అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా ఆయిల్‌ను ఇండియాతోపాటు ఇతర దేశాలు కొనడం ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచమంతటా ఉపయోగిస్తున్న ఆయిల్లో 10 శాతం రష్యా నుంచే వస్తోంది. ఈ ఆయిల్ సరఫరాను హఠాత్తుగా నిలిపివేస్తే.. కొరత వల్ల చమురుకు డిమాండ్ పెరిగి ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయి. ఇండియాతోపాటు అన్ని దేశాలపైనా భారం పడుతుంది. ఇండియాకు ఉన్న సానుకూలత ఏమిటంటే.. రష్యా నుంచే కాకుండా మరో 40 దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి సరఫరా ఆగిపోయినా ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు. ధరల భారం మాత్రం తప్పదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎట్టకేలకు అమెరికా–రష్యా భేటీ
ఎటుచూసినా యుద్ధాలూ, ఊచకోతలూ, దురాక్రమణలూ కనబడుతున్న వర్తమానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య శిఖరాగ్ర చర్చలు జరగబోతున్నాయన్న కబురు కాస్తంత ఉపశమనం కలిగిస్తుంది. అయితే అలవికాని డిమాండ్లు పెట్టడంలో, మొండి పట్టుదలకు పోవటంలో ఇద్దరికిద్దరే గనుక ఈ చర్చల వల్ల ఒరిగేదేమైనా ఉంటుందా అన్నది సందేహమే. చర్చల ఫలితం మాట అటుంచి, వాటి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ట్రంప్ ‘త్యాగం’ చేశారా అనే అనుమానాలు అందరిలో తలెత్తాయి. చర్చల తేదీలు ఖరారు కాకపోయినా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వచ్చేవారం అధినేతలిద్దరూ సమావేశమవుతారని రెండు దేశాల అధికార వర్గాలూ ప్రకటించాయి. ఉక్రె యిన్‌తో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యాకు ట్రంప్ పెట్టిన గడువు శుక్రవారంతో ముగిసింది. చర్చలపై స్పష్టత వచ్చింది గనుక ఈ గడువు విషయంలో ట్రంప్ ఏం చేస్తారన్నది చూడాలి. మూడున్నరేళ్లుగా సాగిస్తున్న యుద్ధాన్ని విరమించమని అధికారంలోకొచ్చింది మొదలు తన సొంత సామాజిక మాధ్యమం ద్వారా రష్యాను బెదిరించటం తప్ప, ట్రంప్ నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టింది లేదు. ఆయన దూత స్టీవ్ విట్కాఫ్ రష్యా ఉన్నతాధికార బృందంతో నాలుగు దఫాలు చర్చించిన మాట వాస్తవమే అయినా ఒరిగిందేమీ లేదు. ట్వీట్ల ద్వారా ప్రపంచ సమస్యలు పరిష్కారం కావని ఆర్నెల్ల తర్వాత ట్రంప్‌కు అర్థమైనట్టుంది. అమెరికా విజ్ఞప్తి మేరకు చర్చలు జరుగుతున్నాయని రష్యా ప్రతినిధి చెప్పటం గమనించదగింది. మొన్న ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో మీడియా సాక్షిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇష్టానుసారం మాట్లాడారు. అటు తర్వాత జెలెన్స్కీ ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను అమెరికాకు దఖలుపరచటానికి అంగీకరించారు. ఆ తర్వాత నుంచి పుతిన్‌పై అమెరికా ఒత్తిళ్లు తీసుకురావటం మొదలెట్టింది. ట్రంప్‌లో అసహనం పెరుగుతున్నదని తెలిసినా రష్యా వెనక్కి తగ్గలేదు. పుతిన్ లక్ష్యాలు వేరు. ఉక్రెయిన్ను నాటో కూటమికి దూరంగా ఉంచటం, భవిష్యత్తులో నాటో విస్తరణ ఉండబోదన్న హామీ తీసుకోవటం వాటిల్లో ప్రధానమైనవి. రష్యా ఆగ్నేయభాగంలో పాక్షికంగా ఉక్రెయిన్ ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి వైదొలగాలని, దాంతోపాటు ఉక్రెయిన్ నుంచి తమ దళాలు చేజిక్కించుకున్న డొనెట్స్క్తో పాటు మరో నాలుగు ప్రాంతాలూ, 2014లో తాము ఆక్రమించిన దక్షిణ క్రిమియా ద్వీపకల్పం రష్యాకే చెందుతాయని గుర్తించాలని పుతిన్ కోరుకుంటున్నారు. మొత్తంగా ఉక్రెయిన్‌కి చెందిన 1,719 చదరపు కిలోమీటర్ల భూభాగం రష్యా ఆక్రమణలో ఉంది. పుతిన్‌తో సమావేశానికి ట్రంప్ ఎంత తహతహలాడుతున్నారో తాజా పరిణామాలు తెలియజెబుతున్నాయి. అమెరికా, రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కాకుండా, జెలెన్స్కీని కూడా కలుపుకొని త్రైపాక్షిక చర్చలైతేనే సమస్య పరిష్కారం తేలికవుతుందని అమెరికా ప్రతిపాదిస్తూ వచ్చింది. అయితే ఇందుకు రష్యా సుముఖంగా లేదు. ముందు అమెరికా, రష్యాల మధ్య చర్చలు జరిగి, అవి సత్ఫలితాన్నిచ్చాకే త్రైపాక్షిక సమావేశం సంగతి చూడొచ్చని అది చెబుతోంది. కానీ ఇందుకు జెలెన్స్కీ మొదటి నుంచీ వ్యతిరేకం. రష్యా దాడుల పర్యవసానంగా నష్టపోయేది తామైతే... చర్చల్లో తమ ప్రమేయం లేకపోవడమేమిటన్నది ఆయన ప్రశ్న. కానీ నెలలు గడిచాక ఆయన వైఖరి మారింది. శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతిస్తూ తాజాగా జెలెన్స్కీ ట్వీట్ చేశారు. ఆయనకు అంతకన్నా గత్యంతరం లేదు.అమెరికా, రష్యాల మధ్య చివరిగా జో బైడెన్ హయాంలో 2021లో శిఖరాగ్రం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకే పుతిన్ దండయాత్ర మొదలైంది. ఆర్నెల్లుగా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించని నేపథ్యంలో ఇప్పుడెలా సాధ్యమైందన్న ప్రశ్నకు రెండు పక్షాల నుంచీ జవాబు లేదు.ఈ శిఖరాగ్ర సమావేశం తర్వాత ఉక్రెయిన్ను కూడా కలుపుకొని త్రైపాక్షిక చర్చలు సాగిస్తామనిఅంటున్నా అందువల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఘర్షణలకు మూలకారణం నాటో కూటమి, దాన్ని ప్రోత్సహించిన అమెరికా. ఉక్రెయిన్‌లో 2014లో ప్రజామద్దతుతో ఎన్నికైన అధ్యక్షుడు విక్టర్ యెనుకోవిచ్ రష్యాతో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని అమెరికా, నాటోలు... అక్కడ అల్లర్లు రెచ్చగొట్టి ప్రజావిప్లవం సాకుతో ఆయన దేశం విడిచిపోయేలా చేశాయి. అటు తర్వాత జెలెన్స్కీ దేశాధ్యక్షుడయ్యారు. నాటో ప్రాపకంతో రష్యాతో గిల్లికజ్జాలకు దిగింది జెలెన్స్కీయే. కనుక నాటో కూటమి, దాని ద్వారా కథ నడిపించిన అమెరికా తమ వైఖరులు మార్చుకోక తప్పదు. అధినేతగా దేశ ప్రయోజనాల కోసం పాటుబడాలి తప్ప అగ్రరాజ్యాల చేతుల్లో పావుగా మారకూడదని తాజా పరిణామాల తర్వాతైనా జెలెన్స్కీ గ్రహించాల్సి ఉంది. -
ట్రంప్‌కు మరోషాక్.. పుతిన్‌కు మోదీ ఆహ్వానం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాకిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా-భారత్‌ల మధ్య నెలకొన్న టారిఫ్‌ల వివాదంతో రష్యాతో వాణిజ్య సంబంధాలకే మోదీ జై కొట్టారు. ఈరోజ(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) రష్యా అధ్యక్షడు పుతిన్క స్వయంగా ఫోన్ చేసిన మోదీ.. ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే భారత్‌కు రావాలని మోదీ ఆహ్వానించారు. 23వ భారత-రష్యా వార్షిక సదస్సుకు హాజరుకావాలని మోదీ ఆహ్వానం పలికారు. మరొకవైపు ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితులను మోదీకి వివరించారు పుతిన్. ఉక్రెయిన్‌తో సంబంధాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్‌కు విన్నవించారు మోదీ. అమెరికా ఆయుధాల కొనుగోలుకు భారత్ విముఖతఅగ్రరాజ్యం నుంచి కొత్త ఆయుధాలను, వైమానిక విమానాలను కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ట్రంప్ భారత్‌పై విధించిన భారీ సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయిభారత్ మిత్రదేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని.. పైగా రష్యాతో చమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ ట్రంప్ గతంలో 25 శాతం టారిఫ్ విధించారు. ఆపై అగష్టు 6వ తేదీన.. తాను చెప్పినా వినలేదంటూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించారు.అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాల్లో భారత్‌పై విధించిన సుంకమే హయ్యెస్ట్. దీంతో.. ట్రంప్ నిర్ణయాన్ని భారత్ అన్యాయంగా పేర్కొంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ దేశాలకు అనుగుణంగా రష్యాతో వాణిజ్యం చేస్తుండడాన్ని ప్రముఖంగా లేవనెత్తింది కూడా. అయితే భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్ వార్‌పై తాము కూడా తగ్గేదే లేదని భారత్ సంకేతాలిచ్చింది.రష్యాతో చమురు ఒప్పందాలు ఆగేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో.. రాజీ పడేది లేదని, సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. అమెరికా సుంకాలపై అటు రష్యా, ఇటు అనూహ్యంగా చైనా భారత్‌కు మద్ధతుగా నిలిచాయి. ఈ క్రమంలో.. భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రత్యేకంగా పుతిన్‌కు ఫోన్ చేసి మోదీ ఆహ్వానించి ట్రంప్‌కు ఊహించని షాకిచ్చారు మోదీ. అమెరికా సుంకాలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్! -
ఆ రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరో మలుపు
అమెరికా-ఉక్రెయిన్ మధ్య రక్షణ సహకారం మరో మలుపు తిరిగింది. ఉక్రెయిన్‌కు పంపాల్సిన ఆయుధాలను తిరిగి అమెరికా డిఫెన్స్‌కు మళ్లించే ప్రక్రియ షురూ అయ్యింది. పెంటగాన్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో జరగబోయే భేటీ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తిని రేపుతోంది. గత నెలలో వాషింగ్టన్‌లోని రక్షణ శాఖలో వెలువడిన ఓ రహస్య మెమో బయటకు వచ్చింది. ఉక్రెయిన్‌కు వెళ్ళాల్సిన కొన్ని రకాల ఆయుధాలను తిరిగి అమెరికా రక్షణ నిల్వల్లోకి మళ్లించే నిర్ణయం తీసుకున్నట్లు ఈ మెమో వెల్లడించింది. ఎల్బ్రిడ్జ్ కొల్బీ, అమెరికా రక్షణ విధానాల ప్రధాన అధికారి ఈ మెమో పై సంతకం చేశారు.ఈ నిర్ణయం అమలైతే… ఉక్రెయిన్ కోసం కేటాయించిన బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు అమెరికాలో డిఫెన్స్ నిల్వలను నింపడానికి ఉపయోగపడతాయి. ఉక్రెయిన్‌కు అధికంగా సాయం చేస్తే, అమెరికా వద్ద తక్షణ రక్షణ అవసరాల కోసం కీలకమైన సామగ్రి కొరత ఏర్పడుతుందన్నది పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొంది. వాటిలో ముఖ్యంగా ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలు, ఆర్టిలరీ గోళాలు ఉన్నాయి. గత నెలలో రక్షణ మంత్రి పీటె హేగ్సెత్, ఉక్రెయిన్‌కి పంపాల్సిన పెద్ద ఆయుధాల ప్యాకేజీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది కొల్బీ మెమో ప్రకారం తీసుకున్న నిర్ణయమే. కొల్బీ ఎప్పటినుంచో ఉక్రెయిన్‌కు అధిక ఆయుధ సహాయం ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.అయితే, ఈ నిర్ణయం బయటకు రాగానే అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకున్నారు. రష్యా దాడులు రోజువారీగా జరుగుతున్న వేళ, ఉక్రెయిన్‌కి రక్షణాత్మక ఆయుధాలను నిరంతరం అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అదే కాకుండా, నాటోతో కొత్త ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్‌కి అవసరమైన ఆయుధాలను అమెరికా తయారు చేస్తుంది. వాటి ఖర్చు యూరోపియన్ మిత్రదేశాలు భరిస్తాయి. ఈ ప్రణాళిక విలువ బిలియన్ల డాలర్లు దాటే అవకాశం ఉండటంతో ఈ ఒప్పందం ఎలా అమలవుతుందనే దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. -
వచ్చే వారంలో ట్రంప్‌తో పుతిన్ భేటీ.. వేదిక అక్కడే?
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బహుశా యూఏఈలో శిఖరాగ్రం జరిగే అవకాశముందన్నారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్తో క్రెమ్లిన్‌లో జరిగిన భేటీ అనంతరం పుతిన్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదన తమదే అయినా, ఇరు దేశాలు ఈ భేటీపై ఆసక్తితో ఉన్నాయన్నారు. చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్.. ఇందుకు తాను వ్యతిరేకం కాదని గతంలోనూ అనేక పర్యాయాలు చెప్పానన్నారు. అయితే, ఇందుకు కొన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. అంతకుముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. శిఖరాగ్రం వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇందుకు వేదికపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. తేదీలింకా ఖరారు కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ భేటీలో పాల్గొనే ఛాన్సుందన్న వార్తలను ఉషకోవ్ కొట్టిపారేశారు. పుతిన్, ట్రంప్ భేటీ విజయవంతం, ఫలవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు గతంలో జెలెన్స్కీ భేటీ ప్రతిపాదన తెచ్చినా పుతిన్ పట్టించుకోలేదు. తాజాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించలేదు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల గడువు శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్–పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసేందుకు ఒక అవకాశమని రష్యా బుధవారం వ్యాఖ్యానించింది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైనా చర్చలు జరపవచ్చని తెలిపింది.యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రేనియన్లు2022తో పోలిస్తే రష్యాతో జరిగే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఎక్కువమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైన కొత్తలో చేపట్టిన ఓ సర్వేలో విజయం సాధించేదాకా పోరాడాల్సిందేనంటూ మూడొంతుల మంది గట్టిగా కోరుకున్నారు. తాజాగా ఇటీవల చేపట్టిన సర్వేలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. యుద్ధానికి కొనసాగించాలనుకునే వారి సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందానికి రావాలని మూడొంతుల మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. రష్యా ఆధీనంలోని భాగాలు మినహా మిగతా ప్రాంతాల్లోని 15 ఏళ్లు పైబడిన వెయ్యి మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
మూడు దేశాలు ఒక్కటైతే..!
అగ్రరాజ్యమన్న దురహంకారం, ఆధిపత్యధోరణితో ట్రంప్ టారిఫ్‌ల బాంబులు విసిరితే బాధిత దేశాలు జట్టుకట్టి పోరుసల్పే ప్రయత్నాలు మొదలెట్టాయా? అంటే తాజా అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వినిమయ ప్రపంచంగా పేరొందిన అమెరికాకు అన్ని దేశాల వస్తూత్పత్తులు పోటెత్తుతాయి. చాలా దేశాల ఖజానా నిండటానికి అమెరికా కొనుగోళ్లే కారణం. దీనిని అలుసుగా తీసుకుని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి తమతో వాణిజ్యంచేసే దేశాలపై ట్రంప్ టారిఫ్‌ల గుదిబండలు పడేస్తుండటంతో ఆయా దేశాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. భారత్, చైనా వంటి దేశాలు అంతటితో ఆగకుండా రష్యాతో జట్టుకట్టి అగ్రరాజ్య దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో గురువారం ఎన్ఎస్ఏ ధోవల్ సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపానని ధోవల్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి ట్రంప్‌ను ఎలా నిలువరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని అంశంపై చర్చించేందుకు త్వరలో భారతవిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల ముష్టిఘాతం, ఘర్షణలు, 20కిపైగా భారత జవాన్ల వీరమరణంతో ఎగసిపడిన కోపాన్ని సైతం కాసేపు పక్కనబెట్టి ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. చైనాకు బద్దశత్రువైన అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి. మారుతున్న భారత్ వ్యూహం చైనాతో మైత్రీ విషయంలో ఇన్నాళ్లూ సమదూరం పాటించిన భారత్ ఇకపై అమెరికా కారణంగా స్నేహబంధాన్ని బలపర్చుకునే అవకాశముంది. చైనా, భారత్, రష్యా కూటమిలో తానూ చేరతానని ఇప్పటికే బ్రెజిల్ సూచనప్రాయంగా తెలిపింది. వ్యవసాయం, డైయిరీ రంగంలో అమెరికన్ కంపెనీల రాకను భారత్ అడ్డుకుంటుండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో అటు సుంకాలతో, ఇటు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూల షరతులతో భారత్ మెడలు వంచాలని ట్రంప్ చూస్తున్నారు. ఇందుకు భారత్ ససేమిరా అనడంతో ఆగ్రహంతో ట్రంప్ మోపిన టారిఫ్ ఇప్పుడు భారత్‌ను చైనాకు దగ్గరచేస్తోందని తెలుస్తోంది. ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన ఖరారుకావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు ఇన్నాళ్లూ భారత్‌ను మచి్చకచేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫలయత్నాలను ట్రంప్ ఒక్క టారిఫ్ దెబ్బతో నాశనంచేస్తున్నారు. 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చనరోజు మాస్కోలో దోవల్ పర్యటించడం యాదృచి్ఛకం కాదని తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్ పంపిన దూత, అమెరికా ఉన్నతాధికారి స్టీవ్ విట్కాఫ్.. వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన కొద్దిగంటల తేడాతోనే ధోవల్ సైతం మాస్కోలో కీలక చర్చలు జరపడం గమనార్హం. షాంఘై శిఖరాగ్ర సదస్సు వేదికగా.. త్వరలో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి ట్రంప్ ప్రభుత్వ వ్యతిరేక వ్యూహాలను రచించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవలికాలంలో చైనా, భారత్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. రష్యా ముడిచమురును చైనా, భారత్‌లు అత్యధికంగా కొనుగోలుచేస్తున్నాయి. ట్రంప్ బెదిరింపులను భారత్, చైనా రెండూ చవిచూశాయి. దేశ స్వప్రయోజనాలు, జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని చైనా, భారత్ ఒకే తరహాలో తమ వాణిని గట్టిగా వినిపించాయి. యురేనియం, ఎరువులు, ఇతర కీలక మిశ్రమ ధాతువులను రష్యా నుంచి కొంటూ మాకు సుద్దులు నేర్పుతావా? అని రెండు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న సూత్రాన్ని భారత్, చైనాలు తూ.చ. తప్పకుండా పాటిస్తాయని తెలుస్తోంది. కలిసి నడుస్తానన్న బ్రెజిల్ తమపై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడంపై అమెరికాపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా గుర్రుగా ఉన్నారు. ‘‘ ఇంతటి భారం మోపిన ట్రంప్‌కు అస్సలు ఫోన్ చేయను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీకి ఫోన్చేస్తా. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ టారిఫ్‌లపై తేల్చుకుంటాం. ఈ దేశాలతో కలిసి నడుస్తా’’ అని డసిల్వా అన్నారు. రష్యా, ఇండియా, చైనా త్రయం మళ్లీ క్రియాశీలకం కావాల్సిన తరుణం వచి్చందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విచక్షణ మరిచిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన మాట వినని దేశాలపై తోచిన మోతాదులో సుంకాలు వేయటం నిత్యకృత్యమైంది. ఈ క్రమంలో న్యాయం, ధర్మం, విచక్షణ, హేతుబద్ధత వగైరాలు లేవు. రెండోసారి దేశాధ్యక్షుడైనా తమ దేశం ఎవరెవరితో ఏ స్థాయి వాణిజ్యం నెరపుతున్నదో తెలియని ట్రంప్... వేరే దేశాలు ఎవరితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకోవాలో, వద్దో నిర్ణయించటానికి తగుదునమ్మా అంటూ తయారయ్యారు. ఈనెల 1 నుంచి మన దేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు లోగడ ప్రకటించిన ట్రంప్, వారం తిరగకుండానే మరో 25 శాతం మేర సుంకాలుంటాయని తాజాగా నిర్ణయించారు. ఇవిగాక పరోక్ష సుంకాలు మొదలవు తాయట. ఇవన్నీ 250 శాతం దాటినా దాటొచ్చని లోగడే ఆయన సెలవిచ్చారు. తన మాట నెగ్గటానికి కనిపించిందల్లా విసిరికొట్టే అల్లరిపిల్లల మొండిధోరణికీ, ట్రంప్ చేష్టలకూ తేడా ఉందా? తనకు రష్యా నచ్చలేదు గనుక ఆ దేశం నుంచి ముడి చమురు కొనరాదని ఆయన శాసిస్తున్నారు. ఉక్రెయిన్‌తో జగడం ఆపేయాలని పదే పదే కోరుతున్నా వినని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అక్కసుతో ఇవన్నీ చేస్తున్నట్టు అందరికీ కనబడుతోంది. కానీ అసలు కారణాలు వేరు. నిజానికి రష్యా చమురు కొని ప్రపంచమార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడమని గతంలో చెప్పింది అమెరికాయే!ప్రేమాభిమానాలను అపాత్రదానం చేయకూడదు. ట్రంప్ వ్యవహారశైలి చూచాయగా తెలుస్తున్నా, తొలి దఫాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు సానుకూలత అవసరమే. కానీ దానికి కూడా అవధులుంటాయి. 2019 సెప్టెంబర్‌లో అమెరికాలోని టెక్సాస్‌లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమమైనా,ఆ మరుసటేడాది ట్రంప్ భారత్ సందర్శించినప్పుడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అయినా దౌత్య పరిమితులు దాటాయన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం సంగతి సరే... పౌరులు కూడా ఆ మాదిరే ఉన్నారు. అమెరికాలోని కొందరు ఎన్నారైలు ఆయన దేశాధ్యక్షుడు కావాలని యజ్ఞయాగాదులు చేశారు. అంతేకాదు... ప్యూ రీసెర్చ్ సంస్థ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రపంచ వ్యవహారాల్లో ట్రంప్ వ్యవహారశైలిపై 24 దేశాల్లో 28,333 మందిని సర్వే చేస్తే సగం మంది భారతీయులు ఆయనపై విశ్వాసం వ్యక్తపరిచారట. ఆ సంగతి అప్పట్లో ఆ సంస్థ ప్రకటించింది. టర్కీ, జర్మనీ, మెక్సికో లాంటి దేశాల్లో మాత్రం అత్యధికులు (80 శాతం పైగా) ట్రంప్‌పై నమ్మకం లేదని తెలిపారు. ఈ ఫలితాల్లో మనం హంగేరి, ఇజ్రాయెల్, నైజీరియా, కెన్యాల సరసన చేరాం.అయితే ట్రంప్ వికృత విన్యాసాలు గమనించాక మోదీ ఆయన విషయంలో దృఢవైఖరి ప్రదర్శిస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అన్నదాతల, మత్స్యకారుల ప్రయోజనాలను విస్మరించే ప్రశ్నే లేదని గురువారం ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇందుకు వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధమేనన్నారు. మోదీ, ట్రంప్‌ల మైత్రి గురించి ఉన్న అభిప్రాయంతో సుంకాల ఒప్పందంలో అమెరికాదే పైచేయి అవుతుందనుకున్న మన విపక్షాలకు ఇది నిరాశ కలిగించే పరిణామమే. దేశంలో 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడి బతికే రంగాలను విదేశాలకు గంపగుత్తగా అప్పగించే దుస్సాహసం ఎవరైనా చేయగలుగుతారా? పైగా అవి జన్యుమార్పిడి చేసినవి. ఆ చెత్త మన మార్కెట్లను ముంచెత్తితే కలిగే దుష్పరిణామాల గురించి చాన్నాళ్లుగా పర్యావరణవాదులు చెబుతూ వచ్చారు. తమ సాగు, పాడి ఉత్పత్తులపై అసలు సుంకాలే విధించరాదన్నది ట్రంప్ ఆంతర్యం. ఆశపడటం సహజం... కానీ అది దురాశగా మార రాదని ఆయన గారికి చెప్పేదెవరు? ‘జీరో’ సుంకాల సంగతి బహిరంగంగా చెబితే నలుగురూ నోళ్లు నొక్కుకుంటారని ట్రంప్ భయపడి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ, రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలన్న రాగం అందుకున్నారు. ఏ సరుకు ధరైనా మార్కెట్ శక్తులు నిర్ణయించే వర్తమానంలో రష్యా నుంచి చవగ్గా కొనరాదని, దాన్ని హెచ్చు ధరకు అమ్మ రాదని ఆంక్షలు విధించాలని చూడటం ట్రంప్ తెలివితక్కువతనం. అమెరికా ఇన్నాళ్లూ ప్రవచించిన ప్రపంచీకరణకు వ్యతిరేకం. పైగా చైనాతో పోలిస్తే మన ముడిచమురు కొనుగోళ్లు తక్కువ. అయినా ఆ దేశంపై ట్రంప్ సానుకూలంగా ఉన్నారు.ట్రంప్ పాత, కొత్త సుంకాలు అమలైతే భారత్ జీడీపీపై 0.6 శాతం ప్రభావం పడుతుందని ప్రముఖ మదుపు సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ ప్రకటించింది. ఇదిగాక వాణిజ్య అనిశ్చితి వల్ల పరోక్ష ప్రభావం ఉండొచ్చని ఆ సంస్థ చెబుతోంది. మొత్తానికి ట్రంప్ ఇదే మంకుపట్టుతో ఉంటే మనకు ఏదోమేర సమస్యలుండక తప్పదు. ఈ వైరం మనం కోరుకున్నది కాదు. అయినా వచ్చి పడింది. కనుక కలిసికట్టుగా ఉండి ఎదుర్కొనటమే ఏకైక మార్గం. -
ఈ అణు దూకుడుతో మళ్లీ అనర్థం
హిరోషిమా, నాగసాకీలపై అణ్వస్త్ర ప్రయోగాలు జరిగిన 80 సంవత్సరాలకు తిరిగి అణ్వస్త్రాల ప్రస్తావనలు వస్తుండటం ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నది. కాకతాళీయంగా ఈసారి కూడా ఆ ప్రస్తావనలు చేస్తున్న అమెరికా... రష్యా సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలా లలోకి రెండు అణ్వస్త్ర జలాంతర్గాములను తరలించింది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం స్వయంగా ప్రకటించారు. అక్కడి నుంచి దక్షిణాన అవే సముద్ర జలాలలో జపాన్ ఎంతో దూరంలో లేదు. ట్రంప్ చర్యలకు ప్రతిగా రష్యన్లు తమవద్ద గల ‘డెడ్ హ్యాండ్’ అణ్వస్త్ర వ్యవస్థ గురించి గుర్తు చేశారు. 1987 నుంచి గల అణ్వాయుధ క్షిపణుల నిరోధక ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది ఈ 5వ తేదీ నాటి పరిణామం. ఇవన్నీ వెంటవెంటనే వారం రోజులలోపే జరిగిపోయాయి.ఏమిటీ ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ?అమెరికా, రష్యాల మధ్య అణు యుద్ధం రాగల అవకాశం సాధారణ దృష్టికైతే కనిపించటం లేదు. ట్రంప్ ఒకవైపు అణు జలాంతర్గాముల మోహరింపునకు ఆదేశాలిస్తూనే, ‘డెడ్ హ్యాండ్’ ప్రస్తావ నలు చేస్తున్న రష్యా అటువంటి చర్యలకు పాల్పడగలదని భావించటం లేదనీ, అయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ అన్నారు. మరొకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈ తరహాలో అణు ప్రస్తావనలు ఎవరికీ మంచిది కాదన్నారు. ఆ విధంగా చూసినపుడు ఎవరికి వారు ఎంతో కొంత జాగ్రత్తలలోనే ఉన్నట్లు భావించాలి. అసలు విషయం ఇంత దూరం ఎందుకు వచ్చింది?చర్చను ఒక తక్షణ విషయంతో ఆరంభిద్దాము. రష్యా తన ఉక్రెయిన్ యుద్ధాన్ని 10 రోజులలో ఆపివేసి శాంతి ఒప్పందంపై సంతకాలు చేసి తీరాలని అమెరికా అధ్యక్షుడు తనంతట తానే ఒక గడువు విధించారు. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఇలాగే 50 రోజుల గడువు ప్రకటించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అన్నట్లు ప్రపంచానికి అన్ని విధాలా ఒక చక్రవర్తి వలె వ్యవహరిస్తున్న ట్రంప్, అందరికీ ఆదేశాలు, హెచ్చరికలను ఎడాపెడా జారీ చేస్తున్న తీరును చూస్తూనే ఉన్నాము. ట్రంప్ నుంచి ఇటువంటి ధోరణిని సహించలేని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మెద్వెదేవ్ ఆయనకు తమ అణ్వస్త్ర శక్తిని, ‘డెడ్ హ్యాండ్’ పేరుతో గల అణు వ్యవస్థను గుర్తు చేశారు. సాధారణ ప్రచారంలో లేని ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ ఏమంటే, ఒకవేళ అమెరికా మొదటగా అణ్వస్త్రాలు ప్రయో గించి రష్యా రాజకీయ నాయకత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా తుడిచి పెట్టినట్లయితే, తదనంతర చర్యలకు వారి నుంచి ఆదేశాలు అందని స్థితిలో, మొదటినుంచే మోహరించి ఉన్న అణ్వ స్త్రాలు అన్నీ వెంటనే తమంతట తాము అమెరికా, యూరప్‌లలోని తమ లక్ష్యాల వైపు క్షణాలలో దూసుకుపోతాయి. నాయకత్వాల నుంచి ఆదేశాలు ఆగిపోయాయనే సంగతి అల్ట్రా లో ఫ్రీకెన్సీ రేడియో తరంగాల ద్వారా తెలుస్తుంది. ఆ తరంగాలను అమెరికా సహా ఎవరూ పసిగట్టలేరు, విశ్లేషించలేరు, హైజాక్ చేయలేరు, నిరోధించ లేరు. ట్రంప్‌కు మెద్వెదేవ్ ఇచ్చిన సందేశమది. అంతిమార్థం ఏమంటే, ట్రంప్ చర్యలు వినాశనానికి దారితీయవచ్చునని.ప్రపంచం మొత్తానికీ యుద్ధమే!అణుయుద్ధం అమెరికా, రష్యాల మధ్య అయితే తక్కిన ప్రపంచానికి సమస్య ఏమిటనే సందేహం కలగవచ్చు. 1945కూ, ఇప్పటికీ తేడాలున్నాయి. అపుడు అమెరికా ఏకైక అణుశక్తి. తర్వాత నాలు గేళ్లకు 1949లో రష్యా అణుశక్తి పరీక్షతో పరిస్థితులు మారసాగాయి. అమెరికా, రష్యాలు పరస్పరం పోటీపడి అణ్వస్త్రాల సంఖ్యను వేలకు వేలుగా పెంచటంతో పాటు అందులో కొత్త రకాలపై పరిశోధనలు నేటికీ జరుపుతున్నాయి. అందులో, మొదటి విడత విధ్వంసం, దానిని తట్టుకుని రెండవ విడత విధ్వంసం, పరస్పర విధ్వంస శక్తి, యుద్ధ విమానాలు, సముద్ర జలాల నుంచి ప్రయోగాలు (ట్రయాడ్ వ్యవస్థ) అంటూ రెచ్చి పోయారు. ఈమధ్యలో మరొక అర డజన్ అణ్వస్త్ర దేశాలు తయారయ్యాయి. అటువంటి ఆయుధాలు అర డజను ఉన్నా చాలు విధ్వంసానికి అనే వివేకం కలగటంతో అణ్వస్త్ర పరిమితి ఒప్పందాలు, వాటి మోహరింపుల పరిమితిపై ఒప్పందాలు దశలు దశలుగా జరిగాయి.వాటిలోని లోపాలను అట్లుంచితే, ప్రపంచం కొన్ని దశాబ్దా లుగా ఇతర యుద్ధాలు ఎట్లున్నా అణ్వస్త్ర ప్రయోగాలు లేక ప్రశాంతంగా ఉంది. అందుకు కారణం పరస్పర విధ్వంస శక్తి (మ్యూచు వల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, లేదా మ్యాడ్) అని, ఆ విధంగా ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ అనే స్థితి ఏర్పడిందని అంతా భావించారు. ఆ పరిస్థితు లలోనూ గమనించదగ్గవి కొన్ని జరిగాయి. ఎవరిపైనా అణ్వస్త్ర ప్రయోగపు ఆలోచనలు రష్యా చేయలేదు గానీ, వియత్నాం, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్‌లు కొరకరాని కొయ్యలుగా మారటంతో అమె రికా అందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి మళ్లీ వెనుకకు తగ్గింది.అప్రమత్తత కలిగేనా?ఇటువంటి చరిత్ర ఉన్నందువల్లనే ఇపుడు తిరిగి అమెరికా,అందులోనూ ట్రంప్ వంటి అనాలోచితుడు, చంచలచిత్తుడు, విపరీ తమైన అహంభావి ఆదేశాలతో అణుజలాంతర్గాములను ఇప్పటికే రష్యా సమీపానికి తరలించిందంటే, ప్రపంచవ్యాప్తంగా భయాందో ళనలు కలగటం సహజం. అణుయుద్ధం జరిగితే అది అమెరికా, రష్యాలకు పరిమితం కాదు. అమెరికా మిత్ర దేశాలను, రష్యా మిత్ర దేశాలను అనివార్యంగా అందులోకి లాగుతాయి. భయంకరమైన స్థాయిలో వెలువడే అణుధార్మిక శక్తి ఇండియా సహా అన్ని దేశాలకూ వ్యాపిస్తుంది. దాని ప్రభావం అన్ని సముద్ర జలాలతో పాటు మొత్తం వాతావరణాన్ని ఎంతకాలంపాటు కలుషితం చేస్తుందో బహుశా నిపుణులు కూడా అంచనా వేయలేరు. 80 ఏళ్ల క్రితం నాటి హిరో షిమా ప్రభావాలు జపాన్‌లో నేటికీ ఉన్నాయి.ఈ ప్రమాదకర పరిస్థితికి మూల కారణం, అమెరికా నాయ కత్వాన ‘నాటో’ దేశాలు ప్రత్యక్షంగా రష్యాను, పరోక్షంగా చైనాను లొంగదీసుకోవాలని భావించటంలో ఉంది. అందుకోసం చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో భాగంగా ఉక్రెయిన్ను ఒక పావుగా ఉప యోగించుకుంటున్నారు. అది ఒక తప్పు కాగా, ఆ యుద్ధ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించలేకపోవటం ఒక వైఫల్యం. రష్యాను ఎన్ని ఆంక్షలు విధించినా బలహీనపరచలేకపోవటం ఇంకొక వైఫల్యం అవుతుండగా, ట్యారిఫ్ల పేరిట రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వగైరాలను బెదిరించజూడటం అసమర్థ దుర్జనత్వమవుతున్నది. చివరకు అంతిమ ఆయుధంగా 50 రోజులు, 10 రోజుల గడువులు, అణు జలాంతర్గాముల స్థాయికి పతన మవుతూ యావత్ ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారు.విచారకరం ఏమంటే, మన దేశంలో ఒకప్పుడు ఉన్నత స్థాయిలో ఉండిన ఈ అప్రమత్తత ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతున్నది. వారు మళ్లీ అప్రమత్తులు కావటం 80 ఏళ్ల హిరోషిమా విషాదానికి తగిన నివాళి అవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్‌బాక్స్ రిటన్ గిఫ్ట్స్
ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. కానీ 2016లోనే జరిగిన ఒక వెడ్డింగ్ వివాహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైందిగా రికార్డ్ దక్కించుకుంది. అదేంటో తెలుసా? పదండి తెలుసుకుందాం.భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దాని విలాసవంతమైన వివాహ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. కానీ రష్యన్ బిలియనీర్ మిఖాయిల్ గుట్సేరీవ్ తన కొడుకు పెళ్లి కోసం పెట్టిన ఖర్చు ఏకంగా ఒక బిలియన్ డాలర్లు (ప్రస్తుత ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 876.94 కోట్లు). 2016లో అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డు క్రియేట్ చేసింది.మరిన్ని విశేషాలుమిఖాయిల్ గుట్సేరీవ్ కుమారుడు, 29 ఏళ్ల సయీద్ గుట్సేరీవ్, ఇరవై ఏళ్ల ఖాదీజా ఉజాఖోవ్స్ను వివాహం చేసుకున్నాడు. మాస్కోలోని ఒక విలాసవంతమైన రెస్టారెంట్లో ఈ జంట వివాహం చేసుకున్నారు. అతిరథమహారథులు హాజరయ్యే ఈ వివాహానికి భద్రత రీత్యా ఈ వేదికను ఎంచుకున్నారు.వధువు 11.5 కిలోల ఎలీ సాబ్ గౌను ధరించింది. పెళ్లి నాటి తన దుస్తులు, తరాల బడి గుర్తుండిపోయేలా, ప్రత్యేకంగా ఉండాలని భావించిందట. అందుకే ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ ఎలీ సాబ్ చేత ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది. ఈ దుస్తులను పారిస్ నుండి దిగుమతి చేసుకున్నారు.ఈ వెడ్డింగ్ గౌను బరువు దాదాపు 11.5 కిలోలు. పెద్ద ఫ్లేర్ ,అంతే పొడవైన వీల్‌తో దీన్ని రూపొందించారు. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, ఆ గౌను విలువ రూ. 2.28 కోట్లు.అత్యంత విలువైన వజ్రాభరణాలతో రాయల్ లుక్‌లో మెరిసిపోయింది వధువు. వజ్రాలు పొదిగిన తలపాగా, భారీ వజ్రాల చెవిపోగులు, మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. రెండు చేతులకు బ్రాస్లెట్లతో యువరాణిలా కనిపించింది.తొమ్మిది అంచెల వివాహ కేక్సాయిద్ గుట్సేరీవ్- ఖాదీజా ఉజాఖోవ్ వివాహ కేక్ మరో ప్రత్యేకత. అద్భుతమైన తొమ్మిది అంచెల ఐస్డ్ వెడ్డింగ్ కేక్ మరీ ముఖ్యంగా, నూతన వధూవరుల కంటే రెండు రెట్లు ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారట. దీనిని వైట్ క్రీమ్‌లో తయారు చేశారు.దానిపై పింక్ ఫ్రాస్టింగ్‌తో చేశారు.గిఫ్ట్‌లుగా గోల్డ్ బాక్స్‌లు: లగ్జరీ పెళ్లితోనే కాదు, అతిథులను కూడా ఆశ్చర్య పరిచాడు. ఈ వేడుకకు హాజరైన వారికి తీపి జ్ఞాపకంలా ఉండేలా గోల్డ్ బాక్స్ గిఫ్ట్‌గా అందించారు. ఇందులో జంట పేరు, వివాహ తేదీ చెక్కబడి ఉన్నాయి. వివాహ వేడుకలో జెన్నిఫర్ లోపెజ్, స్టింగ్, ఎన్రిక్ ఇగ్లేసియాస్ ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు.ఎవరీ గుట్సెరీవ్ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం సఫ్మార్ గ్రూప్ వ్యవస్థాపకుడు, రష్యన్ బిలియనీర్ గుట్సెరీవ్ చమురు, బొగ్గు, రియల్ ఎస్టేట్ , రిటైల్ రంగాలలో వ్యాపారాలున్నాయి 2024 నాటికి ఆ కుటుంబ నికర విలువ రూ. 31,574.41 కోట్లు.కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం కోసం ముఖేష్ అంబానీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంచనా. ఇది అంబానీ కుటుంబం నికర విలువలో 0.5శాతం మాత్రమేనని అంచనా. అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ పెళ్లి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. -
భారత్ సుంకాల మోతపై పునరాలోచన! ట్రంప్ ఏమన్నారంటే..
భారత్‌పై పెనాల్టీగా మరో 25 శాతం టారిఫ్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాతో చమురు వాణిజ్యం కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతుండగా.. ఇదే పని చేస్తున్న ఈయూ, చైనాలాంటి దేశాల విషయంలో ట్రంప్ ఉదాసీనతపై భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో.. భారత్‌పై అదనపు సుంకాల నిర్ణయంపై ట్రంప్ వెనక్కి తగ్గుతారా?.. ఆయన ఏమన్నారంటే.. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున) వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంలో రష్యాతో చమురు వాణిజ్యం ఇంకా కొనసాగితే భారత్‌పై ద్వితీయ శ్రేణి ఆంక్షలు (Secondary Sanctions) తప్పవంటూ హెచ్చరించారు. అయితే.. రష్యా నుంచి చైనా కూడా చమురును కొనుగోలు చేస్తోంది కదా.. కేవలం భారత్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నారు? అని కొందరు మీడియా ప్రతినిధులు ట్రంప్‌నుప్రశ్నించారు. ‘‘ఇప్పటికి 8 గంటలకేగా గడిచింది. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ సమాధానం ఇచ్చారాయన. మరిన్ని సుంకాలను మీరు చూడబోతున్నారు’’ అంటూ బదులిచ్చారు.ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంతో.. అమెరికా రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యాతో చమురు కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా secondary sanctions విధించే అవకాశాలు ఉన్నాయి. తాను వద్దన్నా కూడా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే.. రెండు విడతలుగా భారత్‌పై 50 టారిఫ్ విధించారు. ఇప్పుడు ఆంక్షల హెచ్చరికలూ జారీ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఉల్టా చోర్.. అమెరికా సహా పెద్ద దేశాల దొంగ నాటకంఅయితే ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లో భాగంగా అతిత్వరలో ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీలను కలవనున్నట్లు వైట్‌హౌజ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఉద్రిక్తతలు చల్లారితే భారత్‌పై అదనపు సుంకాల నిర్ణయాన్ని తొలగిస్తారా? అనే ప్రశ్న ట్రంప్‌కు ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ఆ అంశాన్ని తర్వాత పరిశీలిస్తాం అని పేర్కొన్నారు. ఇక రష్యాతో ఆయిల్ కొనుగోలు జరుపుతున్న చైనాపైనా సుంకాల మోత తప్పదా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘ఇప్పుడే ఏం చెప్పలేను.. బహుశా అది జరగొచ్చు. భారత్ విషయంలో అది జరిగింది. అలాగే మరికొన్ని దేశాలకూ అది తప్పకపోవచ్చు. అందులో చైనా కూడా ఉండొచ్చు’’ అని అన్నారాయన. ఉక్రెయిన్ దురాక్రమణకు ప్రయత్నిస్తున్న రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసే దేశాలను ఉపేక్షించబోనంటూ ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌పై తొలుత 25 శాతం, తాజాగా మరో 25 శాతం టారిఫ్‌లను ప్రకటించారు. దీంతో.. భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
రష్యా–అమెరికా నిర్మాణాత్మక చర్చలు
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించే దిశగా రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా రష్యా అధినేత పుతిన్‌తో చర్చల కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా స్టీవ్ విట్కాఫ్ను పంపించారు. విట్కాఫ్ బుధవారం ఉదయం మాస్కోలో పుతిన్‌తో దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. ట్రంప్ సందేశాన్ని విట్కాఫ్ ఈ సందర్భంగా పుతిన్‌కు చేరవేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సన్నద్ధం కావాలని, కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు. పుతిన్, విట్కాఫ్ మధ్య సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని రష్యా విదేశాంగ ప్రతినిధి యూరి ఉషకోవ్ తెలిపారు. ఇరుపక్షాలు సానుకూల సంకేతాలు పంపించుకున్నాయని వివరించారు. వ్యూహాత్మక సహకారంపై చర్చించుకున్నాయని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, పుతిన్‌తో చర్చల అనంతరం విట్కాఫ్ బుధవారం మధ్యాహ్నం స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారని రష్యన్ మీడియా తెలియజేసింది. అయితే, పుతిన్, విట్కాఫ్ తాజా చర్చలపై అమెరికా, ఉక్రెయిన్ ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టకపోతే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాను ట్రంప్ తీవ్రంగ హెచ్చరించిన సంగతి తెలిసిందే.


