
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాకిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా-భారత్‌ల మధ్య నెలకొన్న టారిఫ్‌ల వివాదంతో రష్యాతో వాణిజ్య సంబంధాలకే మోదీ జై కొట్టారు. ఈరోజ(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) రష్యా అధ్యక్షడు పుతిన్‌క స్వయంగా ఫోన్ చేసిన మోదీ.. ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడారు.
ఈ క్రమంలోనే భారత్‌కు రావాలని మోదీ ఆహ్వానించారు. 23వ భారత-రష్యా వార్షిక సదస్సుకు హాజరుకావాలని మోదీ ఆహ్వానం పలికారు. మరొకవైపు ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితులను మోదీకి వివరించారు పుతిన్. ఉక్రెయిన్‌తో సంబంధాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్‌కు విన్నవించారు మోదీ.
అమెరికా ఆయుధాల కొనుగోలుకు భారత్ విముఖత
అగ్రరాజ్యం నుంచి కొత్త ఆయుధాలను, వైమానిక విమానాలను కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు.
ట్రంప్ భారత్‌పై విధించిన భారీ సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయిభారత్ మిత్రదేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని.. పైగా రష్యాతో చమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ ట్రంప్ గతంలో 25 శాతం టారిఫ్ విధించారు. ఆపై అగష్టు 6వ తేదీన.. తాను చెప్పినా వినలేదంటూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించారు.
అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాల్లో భారత్‌పై విధించిన సుంకమే హయ్యెస్ట్. దీంతో.. ట్రంప్ నిర్ణయాన్ని భారత్ అన్యాయంగా పేర్కొంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ దేశాలకు అనుగుణంగా రష్యాతో వాణిజ్యం చేస్తుండడాన్ని ప్రముఖంగా లేవనెత్తింది కూడా. అయితే భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్ వార్‌పై తాము కూడా తగ్గేదే లేదని భారత్ సంకేతాలిచ్చింది.
రష్యాతో చమురు ఒప్పందాలు ఆగేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో.. రాజీ పడేది లేదని, సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. అమెరికా సుంకాలపై అటు రష్యా, ఇటు అనూహ్యంగా చైనా భారత్‌కు మద్ధతుగా నిలిచాయి. ఈ క్రమంలో.. భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రత్యేకంగా పుతిన్‌కు ఫోన్ చేసి మోదీ ఆహ్వానించి ట్రంప్‌కు ఊహించని షాకిచ్చారు మోదీ.
అమెరికా సుంకాలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!