‘ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌ కాల్‌.. అంతా ఉత్తిదే’ | India Denies Reports Of Modi Promising To Halt Russian Oil Purchases, Clarifies No Call Between Modi And Trump | Sakshi
Sakshi News home page

‘ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌ కాల్‌.. అంతా ఉత్తిదే’

Oct 16 2025 9:25 PM | Updated on Oct 17 2025 11:56 AM

No Phone Call Between PM, Trump Yesterday India

న్యూఢిల్లీ:  భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేసినట్లు, ఇక రష్యా చమురు కొనుగోలు చేయమని ట్రంప్‌కు మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.  ఆ వార్తలన్నీ రూమర్లేనని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. 

‘నిన్న అసలు మోదీ-ట్రంప్‌ల మధ్య ఎటువంటి సంభాషణ జరగేలేదు. మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడలేదు. రష్యా చమురు నిలిపివేస్తామని ట్రంప్‌కు మోదీ హామీనూ ఇవ్వలేదు. వారి మధ్య ఎటువంటి టెలిఫోన్‌ సంభాషణ జరగనేలేదు. ఇదంతా అవాస్తవం’ అని  విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ స్పష్టం చేశారు. 

ఇదీ విషయం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. @రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్‌తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. 

ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్‌ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పా’. 

ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్‌ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తున్న సమయంలో భారత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.

ఇదీ చదవండి: 
మోదీ గొప్పోడే.. : ‍ట్రంప్‌ చిత్రమైన వ్యాఖ్యలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement