
'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) సినిమాని మీలో చాలామంది చూసే ఉంటారు. అందులో బుల్లిరాజు (Bulliraju) పాత్ర కాస్త ఎక్కువగానే ఫేమస్ అయింది. ఇంతకు ముందు ఏ సినిమాల్లో నటించనప్పటికీ.. సూపర్ కామెడీ టైమింగ్ తో ఈ పిల్లాడు అదరగొట్టేశాడు. తాజాగా ఇతడి రెమ్యునరేషన్ కి సంబంధించిన రూమర్స్ కొన్ని వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. ఫోటోలు వైరల్)
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. 5వ తరగతి చదువుతున్నాడు. ఓ వీడియో వల్ల వైరల్ అయిన ఇతడిని చూసిన అనిల్ రావిపూడి సినిమాలోకి తీసుకున్నాడు. సినిమా రిలీజ్ తర్వాత బుల్లిరాజుగా హీరో వెంకటేశ్ కంటే ఎక్కువ వైరల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్టు డిమాండ్ మామూలుగా లేదు.
'సంక్రాంతి వస్తున్నాం' రిలీజైన దగ్గర నుంచి చాలా కథలు వింటున్నాడట. అదే టైంలో రోజుకి రూ.లక్ష రూపాయల రెమ్యునరేషన్(Remuneration) కూడా డిమాండ్ చేస్తున్నాడట. ఇంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఓకే అంటున్నారని సమాచారం. మరోవైపు అనిల్ రావిపూడి.. త్వరలో చిరంజీవితో తీయబోయే మూవీలోనూ బుల్లిరాజ్ అలియాస్ రేవంత్ ఉంటాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?
(ఇదీ చదవండి: స్కూటర్ కి దెయ్యం పడితే.. ఫన్నీగా 'టుక్ టుక్' ట్రైలర్)
Comments
Please login to add a commentAdd a comment