![Sankranthiki Vastunnam Movie fame Bulli Raju Aka Revanth Father Request](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/rajua.jpg.webp?itok=S01bqUfz)
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam Movie). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో చిత్ర యూనిట్ ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు.
అయితే ఈ సినిమా ఎంత హిట్టయిందో.. అదే రేంజ్‌లో ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ మూవీ వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నాడు. తెరపై బుల్లిరాజుగా సినీ ప్రియులను మెప్పించారు. తన మాటలు, డైలాగ్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్ మీట్‌లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.
బుల్లిరాజు తండ్రి విజ్ఞప్తి..
అయితే బుల్లి రాజు ఫేమ్‌ను కొందరు సోషల్ మీడియా వేదికగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రేవంత్ భీమాల పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆ బాలుడి తండ్రి బి శ్రీనివాసరావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా మా అబ్బాయి పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ ప్రమోషన్స్ కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. రేవంత్ పేరిట కేవలం ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని తెలిపారు. ఏదైనా అధికారిక ప్రకటన ఆ అకౌంట్ నుంచే తెలియజేస్తామన్నారు. అంతేకాదు రేవంత్ పేరిట ఎలాంటి ఫేస్‌బుక్, ఎక్స్, అకౌంట్స్, యూట్యూబ్ ఛానెల్స్ లేవని తెలిపారు. దయచేసి మా అబ్బాయిని వివాదాల్లోకి లాగొద్దని కోరారు. అంతేకాకుండా రాజకీయాలతో ముడిపెట్టవద్దని శ్రీనివాసరావు ఇన్‌స్టా వేదికగా విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment